జొహాన్నెస్‌బర్గ్, డిసెంబర్ 3: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ రిటైరైన తర్వాత తొలిసారి ఓ విదేశీ టూర్‌కు వచ్చిన టీమిండియా సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. దక్షిణాఫ్రికా జట్టును దక్షిణాఫ్రికాలోనే ఢీకొని, అద్భుత ఫలితాలను నమోదు చేయడం అనుకున్నంత సులభం కాదన్నది వాస్తవం. అయితే, సవాళ్లకు సరైన సమాధానం ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది. తొలుత మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ ఆడనున్న భారత్ ఆతర్వాత రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాల్గొంటుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లపై వనే్డల్లో అద్భుత విజయాలను నమోదు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టులో పలువురు సమర్థులు ఉన్నారు. బౌలింగ్ కొంత బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ, బ్యాటింగ్‌లో మాత్రం తిరుగులేని శక్తిగా ఎదిగింది. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేష్ రైనా వంటి యువ బ్యాట్స్‌మెన్ దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కోనే ఘడియ కోసం ఎదురుచూస్తున్నారు. కెప్టెన్ ధోనీ అందరిలోకి అనుభవజ్ఞుడుకావడంతో, జట్టును విజయాల బాటలో నడిపించడంతోపాటు, యువ ఆటగాళ్లకు మార్గదర్శకం చేయాల్సిన బాధ్యత కూడా అతనిపైనే ఉంది. దక్షిణాఫ్రికా పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయన్నది వాస్తవం. డేల్ స్టెయిన్ వంటి ప్రపంచ అత్యుత్తమ బౌలర్ దక్షిణాఫ్రికా జట్టులో ఉన్నాడు. అతనికి వెర్నన్ ఫిలాండర్ తోడైతే భారత బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు తప్పవు. బ్యాట్, బాల్ మధ్య జరిగే సంకుల సమరంలో జయాపజయాలు ఎలావున్నా, అభిమానులకు గొప్ప పోరాటాన్ని చూసిన సంతృప్తి మిగలడం ఖాయం.
భారత క్రికెట్ జట్టు ఇక్కడి సాండ్‌టన్ హోటల్‌లో బస చేసింది. మంగళవారం నెట్ ప్రాక్టీస్‌కు హాజరైంది. ప్రస్తుత జట్టులో ఆరుగురు ఇటీవలే దక్షిణాఫ్రికాలో మ్యాచ్‌లు ఆడడం గమనార్హం. ఈఏడాది ఆగస్టులో ఫస్ట్‌క్లాస్, లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న వీరంతా ఇక్కడి వాతావరణానికి సులభంగానే అలవాటు పడతారు. ఆ టూర్‌లో భాగంగా జరిగిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో శిఖర్ ధావన్ ఏకంగా 248 పరుగులు సాధించి సత్తా చాటాడు. దక్షిణాఫ్రికా పిచ్‌లు తన ఆటకు అనువైనవని పలు సందర్భాల్లో పేర్కొన్న ధావన్ మరోసారి ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. మొత్తం మీద భారత బ్యాటింగ్‌కు, దక్షిణాఫ్రికా బౌలింగ్‌కు మధ్య రసవత్తర పోరు తప్పదు. కాగా, బ్యాట్‌పైకి బంతి దూసుకురావడాన్ని కోరుకుంటే, అలాంటి అద్భుత సన్నివేశాలను ఈ సిరీస్‌లో చూడవచ్చని విలేఖరులతో మాట్లాడుతూ ధోనీ వ్యాఖ్యానించాడు. క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సిఎస్‌ఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరూన్ లార్గత్‌తో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధికారులు విభేదిస్తున్న విషయాన్ని విలేఖరులు ప్రశ్నించినప్పుడు అది తమకు సంబంధించిన అంశం కాదంటూ నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేశాడు. దక్షిణాఫ్రికా, భారత్ క్రికెట్ జట్ల మధ్య చక్కటి అవగాహన ఉందని పేర్కొన్నాడు. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సాదర ఆహ్వానం లభిస్తుందని అన్నాడు. ఇటీవల కాలంలో జరిగిన మ్యాచ్‌ల్లో జట్టు ఆటగాళ్లంతా రాణించారని, వారిలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని చెప్పాడు. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం భారత జట్టు మూడు టెస్టులు, ఏడు వనే్డలు, మరో రెండు టి-20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే, నవంబర్‌లో జరగాల్సిన టూర్ వాయిదా పడగా, వెస్టిండీస్‌తో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడిన విషయం తెలిసిందే. అనంతరం టూర్‌కు అంగీకరించిన బిసిసిఐ మ్యాచ్‌ల సంఖ్యను కుదించింది. మూడు వనే్డలు, రెండు టెస్టులకు టూర్‌ను పరిమితం చేసింది. టి-20లను తప్పించింది. ఈ మార్పు దక్షిణాఫ్రికా అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. మ్యాచ్‌లు జరిగే సమయంలో వారు వాటిల్ బాటిళ్లు లేదా ఇతర వస్తువులను మైదానంలోకి విసిరే ప్రమాదం ఉందని విలేఖరులు చెప్పినప్పుడు ధోనీ తేలిగ్గా తీసుకున్నాడు. వారు విసిరే వస్తువులను అందుకొని తిరిగి అప్పగిస్తామంటూ చమత్కరించాడు. మ్యాచ్‌ల సంఖ్య ప్రధానం కాదని, పోరు ఎంత ఉత్కంఠ భరితంగా సాగిందనే అంశానికే తాను ప్రాధాన్యం ఇస్తానని చెప్పాడు. కాగా, దక్షిణాఫ్రికాను తక్కు వ అంచనా వేయడం లేదని భారత జట్టు కోచ్ డంకన్ ఫ్లెర్ స్పష్టం చేశాడు. జట్టు సమతూకం గా ఉందని అన్నాడు. ఇటీవల అద్భుత విజయా లు సాధించినప్పటికీ, ప్రతి మ్యాచ్‌నీ ఒక సవా లుగా స్వీకరిస్తామని అన్నాడు. ఆటగాళ్లంతా ఆ త్మవిశ్వాసంతో ఉన్నారని చెప్పాడు. ప్రత్యేకమైన వ్యూహాలు ఏమీ ఉండవని, సందర్భానుసారం గా నిర్ణయాలు తీసుకుంటామని అన్నాడు. దక్షి ణాఫ్రికా పటిష్టమైన జట్లలో ఒకటని, కాబట్టి ఎప్పటికప్పుడు వ్యూహం మారుతుందని పేర్కొ న్నాడు. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటున్నా మన్న విషయం జట్టులోని ప్రతి ఒక్కరికీ తెలు సునని ఫ్లెచర్ అన్నాడు. ఈ సిరీస్‌లో విజయం సాధించడానికి ప్రతి ఒక్కరూ శ్రమిస్తారని అత ను ఆశాభావం వ్యక్తం చేశాడు. (చిత్రం) కోచ్ డంకన్ ఫ్లెచర్‌తో కలిసి విలేఖరుల సమావేశంలో పాల్గొన్న భారత కెప్టెన్ ధోనీ
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ రిటైరైన తర్వాత తొలిసారి
english title:
team india ready to face challenges
Date:
Wednesday, December 4, 2013