Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పాత కథకే కొత్త హంగులు -- మీ వ్యూస్

$
0
0

పాత కథకే కొత్త హంగులు చేర్చారని ‘క్రిష్-3’ చూడనక్కరలేదని కొన్ని పత్రికలు సూచించగా కొందరు ప్రేక్షకులు కూడా అలాగే స్పందించారు. అయితే, అనూహ్యంగా ఆ చిత్రం మూడువారాల్లోనే 200 కోట్లు ఆర్జించి చెన్నయ్ ఎక్స్‌ప్రెస్ రికార్డుని అధిగమించిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నిర్మాత 500 కోట్లు ఆర్జించిందని చెబుతున్నారు. ఎన్ని కోట్లు అన్నది పక్కనపెడితే ‘క్రిష్-3’ సూపర్‌హిట్ అయిందని ఒప్పుకుంటున్నారు. ఇలాంటి అంచనాలు అనవసరం. ‘క్రిష్ 3’ని అధిగమించే చిత్రాలూ వస్తాయి అంటున్నాడు హీరో హృతిక్. విమర్శకులు, ప్రేక్షకులూ విభేదించడం కొత్తకాదు. అలనాటి సూపర్ హిట్ ‘షోలే’కి సింగిల్ స్టార్ ఇచ్చి చూడనక్కర లేదని చెప్పిన పత్రికలూ ఉన్నాయి!
- శాండి, కాకినాడ
పైరసీ పాపాత్ములు!
‘పైరసీ కోరల్లో రూ.300 కోట్లు’ నిర్మాతల వెతలను విశదంగా వివరించారు రచయత. సమాజ నిర్మాణానికి, అభివృద్ధికి, అధిక కాలం, డబ్బు ఖర్చవకుండా ఉండటానికి వృద్ధిచెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కుటిల బుద్ధితో పైరసీలకు, అసాంఘీక కార్యకలాపాలకు కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. కోట్ల వ్యయంతో శ్రమజీవికి వినోదం పంచడంకోసం తీసే సినిమాలను డబ్బు కక్కుర్తిపడి పైరసీ సీడీలను తయారుచేసి నిర్మాతలను నిండాముంచుతున్నారు. ఈ పరిశ్రమమీద ఆధారపడి జీవిస్తున్న వారిని నిరుద్యోగులను చేస్తున్నారు. ఇందులో ఇంటి దొంగల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రకం మోసం నిష్కృతి లేని ఘోర పాపంతో సమానం. సైబర్ లా అమలులోకొచ్చినా, చట్టమంటే భయం లేకపోవడంవల్ల సైబర్ నేరాలు నిరాఘాటంగా జరుగుతున్నాయి. కఠినాతి కఠినంగా శిక్షలు పడ్డప్పుడే పైరసీదారులు దారికొచ్చేది. లేకుంటే సినీ పరిశ్రమ మూసుకోవాల్సి వస్తుంది.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
మనసును కలచివేసింది
కళల నిలయం తెనాలిలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి జర్నలిస్టు నుంచి స్టేజి, సినీ ఆర్టిస్టువరకూ ఎదిగి వందల సినిమాల్లో హాస్య నటునిగా ప్రేక్షకుల హృదయాల్లో ముద్రవేసుకున్న ఎ.వి.ఎస్. అకాల మృతి మనసును కలచివేసింది. బాపు, రమణలు తీర్చిదిద్దిన నటుడాయన. ‘‘తుత్తి’’ డైలాగ్ (మిష్టర్ పెళ్ళాం) నంది అవార్డును తెచ్చిపెట్టింది. కాలేయం వ్యాధి ఆయన ఆయువును తీసి సినీ పరిశ్రమకు, ప్రేక్షకులకు, అభిమానులకు తీరని అన్యాయం చేసింది.
- ఎన్.పద్మావతి, సికిందరాబాద్
సంగీత సవ్యసాచి
అలనాటి ‘మురిపించే మువ్వలు’ చిత్రంలో ‘నీ లీల పాడెద దేవా..’ పాటను ఎస్.జానకిగారు ఆలపించగా ప్రముఖ నాదస్వర వాయిద్య విద్వాంసుడు అరుణాచలంగారు సంగీత సారథ్య నైపుణ్యంతో సన్నాయి ప్రతి పదాన్ని నాదస్వరముతో పలికించి ప్రేక్షకులను ముగ్ధులను చేసిన సంగీత సవ్యసాచి! ఆ పాట నేటికి చిరస్థాయిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది!
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు
స్వర్ణమై మెరిసింది...
సంజయ్‌లాల్ బన్సాలీ రోమియో జూలియట్ ప్రేమ దృశ్యాలను గుజరాతీ నేపధ్యంలో రణబీర్‌సింగ్- దీపికా పడుకొనేలతో ‘రామ్‌లీల’ చిత్రం తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ చిత్రంలో లీల పాత్రవేసిన దీపికాపడుకొనే ప్రేమ సన్నివేశాల్లో బాగా నటించడమే కాకుండా రామ్ పాత్రధారి అయిన రణబీర్‌సింగ్‌తో సహజంగా నటించింది అన్పించేలా లీనమైంది. గుజరాత్ నేపధ్యంలోని దృశ్యాలు చిత్రానికి నిండుదనం తెచ్చింది. ఆఖరి సన్నివేశాల్లో ప్రేమకోసం కలిసి చనిపోవడానికే రామ్‌లీలలు ఒకరినొకరు చంపుకొని మరణించే దృశ్యాలు గుండెను పిండేశాయి. సంజయ్‌లీలా బన్సాలీను ప్రియపాఠక్‌తో వేయించిన మాఫియాడాన్ పాత్రలో అదరగొట్టింది.
- కొల్లిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి
ప్చ్... వేణుమాధవ్!
నవ రసాలలో హాస్యరసాన్ని పండించడం చాలా కష్టం. హాస్యాన్ని అపహాస్యంపాలుకాకుండా రక్తికట్టించడం కత్తిమీద సాములాంటిది. అటువంటి హాస్యాన్ని ప్రేక్షకులకు అందించడంలో దిట్ట. కాస్త పొట్టి అయినా నటనలో గట్టివాడైన వేణుమాధవ్ ఈమధ్యన కనబడకపోవడం చాలా బాధగావుంది. నిర్మాతగామారి తన అభిరుచిని చాటుకున్న ఘనుడు. తన ప్రత్యేకమైన డైలాగులతో అందరినీ ఆకట్టుకున్న ఘనాపాటి. హీరోలతో సమానంగా పాటలలో డ్యాన్స్‌చేయగల ఘటికుడు. అటువంటి మా వేణుమాధవ్‌కు గ్రహణం పట్టిందా అని అభిమానులందరికీ చాలా బాధగా ఉన్నది.
- మహమ్మద్ లతీఫ్, హైదరాబాద్
నిరాశపరచింది
‘మసాలా’ చిత్రం గురించి ప్రేక్షకులు ఎదురుచూసి నిరాశ పాలయ్యారు. లేడీస్ ఫాలోయింగ్ ఉన్న వెంకటేష్ యూత్ ఫాలోయింగ్‌తో ఉన్న రామ్ చిత్రం ‘మసాలా’ పేరుతో రాగానే చూసేవారికి అన్నిరకాల మసాలాలతో దట్టించిన రుచి, పచి లేకుండా అయింది. మమ్మల్ని ఎంతగానో నిరాశపరచింది. ఎంతోకొంత బాగుండదా అని ప్రేక్షకులు వెళ్ళేసరికి మసాలా ఘాటుకి కళ్ళుకోపంతో ఎరుపెక్కాయి. 10% కూడా నచ్చలేదు, పాటలు బాగాలేవు, కథ లోపం బాగా ఉంది. హీరోయిన్స్ ముఖంలో పవర్ లేదు. ఎందుకు సినిమాకు వచ్చామురా.. అనిపిస్తుంది.
- నాగేశ్వరరావు అందవరపు, పలాస
టైటిట్ బాగుంది
‘ఎంత అందంగా ఉన్నావె’ టైటిట్ బాగుంది. అజయ్, జియానా జంటగా నటించిన ఈ సినిమాలో ఒకే ఇంట్లో ఉండే రెండు కుటుంబాలు ఆ కుటుంబాల మధ్య ఎటువంటి బంధుత్వం లేదు. వీరిద్దరి తల్లిదండ్రులకు అసలు పడదు. అయినా వీరిద్దరిమధ్య ప్రేమ పుట్టింది. ఇది ఓ సాదాసీదా కథ. ఈ లోబడ్జెట్ సినిమాలంటూ యూత్‌ఫుల్ సినిమాలంటూ కొందరు దర్శక నిర్మాతలు సాదాసీదా ప్రేమకథ చిత్రాలను విడుదల చేస్తున్నారు. ఫ్యామిలీతో హ్యాపీగా చూసే చిత్రాలు తీయడం మేలు!
- కాళహస్తి వెంకట శేషగిరిరావు, నెల్లూరు
చౌకబారు డైలాగులు
‘అహనాపెళ్ళంట‘, ‘పూలరంగడు’ చిత్రాలతో కామెడీ డైరెక్టర్‌గా పేరుపొందిన వీరభద్రం దర్శకత్వంలో నాగార్జున నటించిన ‘్భయ్’ చిత్రం బాగోలేదు. పేలవమైన (బలహీనమైన) డైలాగ్స్ ‘్భయ్ ఎంటరైతే, ఎట్మాస్పియర్ ఎలర్ట్ అవుతుంది’, ‘హైద్రాబాద్‌లో రెండే ఫేమస్.. ఒకటి భాయ్, రెండోది ఛాయ్’వంటి చౌకబారు డైలాగులతో ప్రేక్షకులకు, అభిమానులకు జండూబామ్ అవసరమయ్యేలా చేశారు నాగార్జున, వీరభద్రమ్. హీరోయిన్‌గా రిచాగంగోపాధ్యాయ మైనస్. పాటలు ఎప్పుడు ఎందుకు వచ్చాయో హీరో, దర్శకులకే తెలియాలి. చిత్రంలో ప్రేక్షకులు భాయ్ పాత్రకన్నా, బ్రదర్స్, సిస్టర్ సెంటిమెంట్ సీన్లకే లీనవౌతున్నారు. బ్రహ్మానందం, ఎమ్మెస్‌నారాయణ వినోదం సూపర్బ్‌గా నడిచి చూస్తున్నంతసేపు కాస్త రిలీఫ్ కల్గిస్తుంది. నాగార్జున హీరోగా మానేసి, అన్నయ్య పాత్రలో లేదా తమ వారసుల చిత్రాల్లో తండ్రి పాత్రలో వేసుకుంటే బెటర్.
- బి.కృష్ణమాచారి, హైదరాబాద్
దారుణమైన వ్యాఖ్యలు
22.11.2013 శుక్రవారం వెన్నెల మీ వ్యూస్‌లో ప్రతాప్, విశాఖపట్నం పాఠకుడు ‘క్రిష్-3’ సినిమా గురించి దారుణమైన వ్యాఖ్యలు రాశారు. ఈ సినిమాలో ప్రత్యేకమైనదేదీ లేదు, యాక్టర్లు సరిగా నటించలేదు, కోట్లు ఖర్చుపెట్టి ఈ సినిమా ఎందుకు తీశారో ఆ భగవంతునికే తెలియాలని చౌకబారు వ్యాఖ్యలను చేశారు. ప్రపంచమంతటా ఈ సినిమా సూపర్‌హిట్ అయింది. నెలరోజుల్లోనే దాదాపు 300కోట్ల రూపాయలు వసూలుచేసిన ఈ సినిమా గురించి తన అభిప్రాయాలు వ్రాసారంటే ఆయనకు సినిమాలపైన అవగాహన లేదంటే ఆశ్చర్యకరం. ఏదైనా సినిమాల గురించి వ్రాయాలనుకున్నప్పుడు వాటిలోని సబ్జెక్టు తీసుకోవాలి. కోట్లు ఖర్చుపెట్టి తీసిన చిత్రాల గురించి కేవలం రు.50- 100/- టిక్కెట్ కొని యిలా వక్రీకరించడం ఏంబాలేదు. ‘ఎమ్మిగనూరు’లో ఈ చిత్రం దాదాపు 25రోజులుగా ఒకే థియేటర్‌లో ప్రదర్శించబడుతుంటే, మరి ఏంబాగోలేని ‘క్రిష్-3’ ప్రేక్షకులు చూస్తున్నారంటే ఏమనుకోవాలి? ఇలా తప్పుడు సమాచారాల్ని వ్రాయరాదు.
- ఎస్.శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
వర్మ ప్రతిభ
‘సత్య-2’అనే కంటే వర్మ-2 అనుకోవాలి...రామ్‌గోపాల్‌వర్మ సినిమా వస్తోందంటే అదేం విచిత్రమో..కానీ చిన్నపాటి సునామీ లాంటి సంచలనం. ఫొటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది. ‘ఏవేవో పిచ్చి ఊహకే’ ఓ ప్రియా ఓ ప్రియా’ పాటలు బాగున్నాయి. ప్రతి సన్నివేశంలో వర్మ ప్రతిభ కనిపించింది.
- కాళహస్తి వెంకట శేషగిరిరావు, నెల్లూరు
చిన్ని చిన్ని ఆశ...!
అమెరికాలో స్థిరపడిన కొడుకుకోసం తాపత్రయపడే తల్లి భావోద్వేగాల్నీ.. డాలర్లతో రేటుకట్టే కొడుకు, ఐటి కోరల్లో చిక్కుకొన్న యువత జీవితాల్ని ప్రతిబింబింపజేసిన దర్శకుణ్ణి అభినందించాలి. ముచ్చటైన మూడు జంటలకదే.. ‘చిన్ని చిన్ని ఆశ...’!
- కె.వి.ఎస్.ఆర్, నెల్లూరు
----------------
‘మీ వ్యూస్’కు
మీ అభిప్రాయాలను పంపవలసిన
మా చిరునామా :
ఎడిటర్, వెన్నెల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 500003

మీ వ్యూస్
english title: 
mee views

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>