కుటుంబమంతా
కలిసి భోజనం చేసే
రోజులు కావివి. ఎవరి
పనులు, వ్యాపకాలతో
వాళ్లు బిజీ. అందుకే
-వారంలో ఒకసారైన
కుటుంబ సమేతంగా
కలిసితింటే ఆనందం,
తృప్తి. అయితే,
అరచేతికి సెల్‌ఫోన్
ఆరోవేలిగా
మారిపోయిన ఈ
రోజుల్లో -ఆ కాస్త
సమయం కూడా
మొబైల్స్‌తో
మొగ్గలేయడానికే
సరిపోతుంది. ఆ
పరిస్థితిని
అనుభవించి
ఆలోచించాడు కనుకే
-ఇజ్రాయిల్ రెస్టారెంట్
ఓనరు ఇబ్రహీం
కుటుంబాలకు కొత్త
ఆఫర్ ఇస్తున్నాడు. -
‘కలిసి రండి. కుటుంబ
సమేతంగా భోజనం
చేయండి. ఆ
సమయంలో మొబైల్
ఫోన్లు ఆఫ్ చేస్తే, బిల్లు
సగమే చెల్లించండి
చాలు’ అంటూ
రెస్టారెంట్‌కు ఓ
ప్రత్యేకతను
ఆపాదించాడు.
ఎందుకు? అన్న ప్రశ్న
మనకే కాదు, అక్కడి
వాళ్లకూ వచ్చింది
కనుకే -పైన చెప్పిన
సమాధానం
వినిపిస్తున్నాడు.
కలిసి భోజనం చేసే
సమయంలోనూ
మొబైల్స్ పట్టుకుని
ఎవరి వ్యాపకాల్లో
వాళ్లుంటే -దానికి
అర్థమేముంటుంది.
ఆర్డరిచ్చిన పదార్థాలు
వచ్చేవరకూ కబుర్లు
చెప్పుకుంటూ
కాలక్షేపం చేస్తే
-అందులో ఎంతో
ఆనందం, హాయి.
పదార్థాల
రుచితోపాటు,
ఆప్యాయతల్లోని
ఆనందాన్ని నా
కస్టమర్లకు
అందించాలనే ఈ
ప్రతిపాదన పెట్టా.
మంచి ఫలితాలే
అందుతున్నాయి’
అంటున్నాడు
రెస్టారెంట్ ఓనర్
ఇబ్రహీం. చిన్న
చిట్కాతో ఎంత
ఆనందమో.