న్యూఢిల్లీ, మార్చి 7: లండన్ ఒలింపిక్స్ స్పాన్సర్‌గా డౌ కెమికల్స్‌ను తప్పించాలన్న భారత ప్రభుత్వ డిమాండ్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఒసి) నిరాకరించింది. 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన యూనియన్ కార్బైడ్ ప్రస్తుతం డౌ కంపెనీ ఆధీనంలో ఉన్నందున ఆ కంపెనీని స్పాన్సర్‌గా తొలగించాలని కోరుతూ భారత క్రీడా మంత్రిత్వ శాఖ కార్య దర్శి రాహుల్ భట్నాగర్ ఫిబ్రవరి 24న ఐఒసికి ఒక లేఖ రాసిన విషయం తెల్సిందే. ‘్భపాల్ గ్యాస్ ఉదంతం భారత దేశానికి, ప్రపంచానికి ఒక పీడకల లాంటిది. ఒలింపిక్ ఉద్యమం బాధిత కుటుంబాలకు విచారాన్ని వ్యక్తం చేస్తూ తన సానుభూతిని తెల్పుతోంది’ అని ఐఒసిలోని ఎన్‌ఒసి రిలేషన్స్ డైరెక్టర్ పెరె మిరొ ప్రతి స్పందిస్తూ భట్నాగర్‌కు లేఖ రాశాడు. ‘మీరు లేఖలో తెలిపిన వివిధ సంస్థల అభిప్రాయాలను మేము పరిగణనలోకి తీసుకున్నాం. ఒలింపిక్ ఉద్యమ విలువలను పాటించే సంస్థల్నే ఐఒసి భాగస్వామిగా అంగీకరిస్తుందని మీకు నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను’ అని పెరె మిరొ పేర్కొన్నాడు. డౌ కంపెనీ కార్పొరెట్ విలువలను పాటించే కంపెనీ అని ఆయన కితాబు ఇచ్చాడు. డౌతో భాగస్వామ్యం గురించి చర్చించినప్పుడు భోపాల్ ఉదంతాన్ని దృష్టిలో ఉంచుకున్నామని ఆయన తెలిపాడు. భోపాల్ ఉదంతం జరిగిన తర్వాత 16 సంవత్సరాల వరకు,470 మిలియన్ డాలర్ల నష్ట పరిహారాన్ని సుప్రీం కోర్టు అంగీకరించిన 12 ఏళ్ల వరకు యూనియన్ కార్బైడ్‌లో డౌ కంపెనీకి ఎలాంటి యాజమాన్య హక్కులూ లేవుఅని ఆయన వివరించాడు. నష్ట పరిహార వివాదాన్ని సుప్రీం కోర్టు మూడో సారి సమీక్షిస్తోందని, అదేవిధంగా ఈ అంశంపై డౌ ఉద్దేశం కూడా తమకు తెలుసుననీ పెరె మిరొ చెప్పాడు. డౌని ఒలింపిక్ స్పాన్సర్‌గా తప్పించడానికి ఐఒసిని ఒప్పించడంలో భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) విఫలమవడంతో, క్రీడాశాఖ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అయినా ఐఒసి అంగీకరించలేదు. ఈ అంశంపై ప్రభుత్వం ఏ వైఖరి అవలంభిస్తుందో ఇంకా స్పష్టం కాలేదు.
లండన్ ఒలింపిక్స్ స్పాన్సర్‌గా డౌ కెమికల్స్‌ను తప్పించాలన్న
english title:
ioc
Date:
Thursday, March 8, 2012