అడిలైడ్, మార్చి 7: ముక్కోణపు సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో ఫైనల్ ప్రారంభానికి ముందే ఆసీస్ జట్టుకు ఎదురు దెబ్బలు తగిలాయి. నేడు జరగనున్న మూడో ఫైనల్ నుంచి ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్, యువ పేస్ బౌలర్ జేమ్స్ పాటిన్సన్ గాయంతో తప్పుకున్నారు. క్లార్క్‌కు చీలమండ వద్ద గాయమైందనీ, పాటిన్సన్ పిరుదు కండరాలకు గాయమైందనీ ఆసీస్ కోచ్ మికీ ఆర్థర్ తెలిపాడు. పాటిన్సన్, క్లార్క్‌లకు స్కానింగ్ తీయనున్నారు. గాయం తీవ్రమైనదైతే క్లార్క్ వెస్టిండీస్ పర్యటనకు సైతం దూరమయ్యే ప్రమాదముంది. విండీస్‌కు ఆస్ట్రేలియా జట్టు శుక్రవారం బయల్దేరుతుంది. అయితే క్లార్క్ గాయ తీవ్రత గురించి ఇప్పుడే ఏం చెప్పలేనని ఆర్థర్ చెప్పాడు. విండీస్‌తో జరిగే వనే్డ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లకు క్లార్క్ అందుబాటులో ఉండేది అనుమానమేనని ఆసీస్ కోచ్ విలేఖరులకు తెలిపాడు. శ్రీలంకతో జరిగిన రెండో ఫైనల్లో పాటిన్సన్ డైవ్ చేసినప్పుడు గాయపడ్డాడని ఆర్థర్ పేర్కొన్నాడు. ఈ సిరీస్‌లో కీలక ఆస్ట్రేలియా ఆటగాళ్లకు గాయాలవడంతో ఆ జట్టు తంటాలుపడుతోంది. ఇప్పటికే గాయాలతో ఆడుతున్న వారి జాబితాలో బ్రెట్ లీ, డేవిడ్ వార్నర్ ఉన్నారు.
ముక్కోణపు సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో ఫైనల్ ప్రారంభానికి ముందే ఆసీస్ జట్టుకు ఎదురు దెబ్బలు తగిలాయి.
english title:
clorck
Date:
Thursday, March 8, 2012