న్యూఢిల్లీ, డిసెంబర్ 22: వచ్చే జనవరిలో చమురు, సహజ వాయువు బ్లాకుల అతి పెద్ద వేలానికి ప్రభుత్వం సమయాత్తమయింది. వేలం పాటకు సంబంధించి ఇప్పటివరకు అనుసరిస్తున్న లాభం-్భగస్వామ్యం పద్ధతిని కాగ్ తీవ్రంగా విమర్శించిన నేపథ్యంలో సవరించిన సరికొత్త నిబంధనల మేరకు ప్రభుత్వం ఈ వేలాన్ని నిర్వహించనుంది. చమురు, సహజ వాయువు అనే్వషణ కోసం 10వ విడత కొత్త అనే్వషణ లైసెన్సింగ్ విధానం (ఎన్‌ఇఎల్‌పి-ఎక్స్) కింద దాదాపుగా 86 బ్లాకులు లేదా ప్రాంతాలను వేలం వేయనున్నారు. ఈ మేరకు చమురు శాఖ కార్యదర్శి వివేక్ రాయ్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎన్‌ఇఎల్‌పి- ఎక్స్ విధానంలో కొత్త నిబంధనలుంటాయి. బిడ్డర్లు చమురు లేదా సహజ వాయువును తొలిరోజు ఎంత ఉత్పత్తి చేస్తారో అన్న మొత్తాన్ని తమ టెండరు పత్రాల్లో పేర్కొనాల్సి ఉంటుందని రాయ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ సి.రంగరాజన్ ఆధ్వర్యంలోని కమిటీ చేసిన సూచనల మేరకు ఈ కొత్త నిబంధనలుంటాయని రాయ్ తెలిపారు. ఏ కంపెనైతే నిర్ణీత బ్లాకు నుంచి అత్యధిక చములు లేదా సహజవాయువును ఉత్పత్తిచేస్తామని పేర్కొంటుందో ఆ కంపెనీకే బ్లాక్ కేటాయించటం జరుగుతుందన్నారు.
ప్రస్తుతం చమురు కంపెనీలు తొలుత తాము చేసిన అనే్వషణ, ఉత్పత్తి వ్యయాలను రాబట్టుకున్న తర్వాత, లాభాలను ప్రభుత్వంతో పంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం కాగ్ విమర్శలకు గురైంది. కంపెనీలు మూలధన వ్యయాలను పెంచుకుంటూ ప్రభుత్వ లాభాలకు గండికొడుతున్నాయని కాగ్ ఆరోపించింది. కాగా కొత్త పాలసీ ప్రకారం ఉత్పత్తి-అనుబంధ చెల్లింపుల పద్ధతి ఉంటుందని ఇది పారదర్శకమైన విధానమని రాయ్ చెప్పారు.
వచ్చే జనవరిలో చమురు, సహజ వాయువు బ్లాకుల అతి పెద్ద వేలానికి ప్రభుత్వం
english title:
g
Date:
Monday, December 23, 2013