న్యూఢిల్లీ, మార్చి 7: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, మహిళల డబుల్స్ విభాగంలో జ్వాలా గుత్తా-అశ్వనీ పొన్నప్ప రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సైనా నెహ్వాల్ థాయిలాండ్‌కు చెందిన దిగువ ర్యాంకు క్రీడాకారిణి శాప్‌సిరీ టిరట్టనచాయ్‌పై విజయం సాధించింది. తొలి గేమ్ గేమ్‌ను 21-11 తేడాతో కైవసం చేసుకున్న సైనాకు రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్రమైన పోటీ ఎదురైంది. దీంతో రెండో గేమ్‌ను 13-21 తేడాతో చేజార్చుకున్న సైనా ఆ తర్వాత పవర్‌ఫుల్ షాట్లతో విజృంభించింది. నిర్ణాయక మూడో గేమ్‌ను 21-13 తేడాతో కైవసం చేసుకుని 58 నిముషాల్లో ప్రత్యర్థిని చిత్తు చేసింది. కాగా, మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో జ్వాలా గుత్తా-అశ్వనీ పొన్నప్ప ఇండోనేషియాకు చెందిన అనెకీ ఫెనియా అగస్టీన్-నిత్యా కృషిండా మహేశ్వరి జంటపై 21-16, 21-16 వరుస గేముల తేడాతో విజయం సాధించి రెండో రౌండ్‌లో ప్రవేశించారు.ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను 21-16 తేడాతోనూ, రెండో సెట్‌ను కూడా 21-16 తేడాతోనూ కైవసం చేసుకున్న జ్వాలా-పొన్నప్ప సునాయాసంగా ప్రత్యర్థులను మట్టికరిపించారు. గురువారం జరిగే రెండో రౌండ్‌లో వీరు చైనాకు చెందిన క్వింగ్ తియాన్-యున్‌లీ జావో జోడీతో తలపడనున్నారు. అయితే మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మాత్రం జ్వాలా గుత్తా-వి.దిజు జోడీకి చేదు అనుభవం ఎదురైంది. తొలి రౌండ్‌లో వీరు 14-21, 12-21 గేముల తేడాతో పెంగ్ సూన్ చాన్-లియు యింగ్ గోహ్ జోడీ చేతిలో ఓటమిపాలయ్యారు.
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్
english title:
rendo round
Date:
Thursday, March 8, 2012