విశాఖపట్నం, డిసెంబర్ 22: బిసిలకు రాజ్యాధికారం కావాలని, సామాజిక న్యాయం కోసం విశాఖలో వచ్చేనెలాఖరున ‘బిసి గర్జన’ను నిర్వహిస్తున్నట్టు బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. డాబాగార్డెన్స్ విజెఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు లక్షల మందితో ఇది ఉంటుందన్నారు. బిసి సంక్షేమ సంఘం అండగా ఉంటుందన్నారు. పారిశ్రామికవేత్తలకు, రియలర్లకు, కాంట్రాక్టర్లకు టికెట్ల అమ్ముతున్నారని, దీనివల్ల బిసిలు అన్యాయానికి గురవుతున్నారన్నారు. అందువల్ల ఇటువంటి సంఘటనలను గుర్తించేందుకు బిసిలకు చెందిన ఐదు వేలమందితో ఓ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. టికెట్ల అమ్మితే ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రముఖులు బూర్గుల రామకృష్ణారావు, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న వంటి వారింతా సంఘ సంస్కరణకు, సమాజ శ్రేయస్సు కోసం రాజకీయాలు చేసేవారన్నారు. అణచివేతకు, అత్యాచారాలకు, అవమానాలకు గురవుతున్న బిసిల రక్షణ కోసం ‘బిసి ప్రొటెక్షన్ యాక్ట్’ను తీసుకురావాలన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు జనాభా ప్రకారం బిసిలకు 150 అసెంబ్లీ, 22 పార్లమెంటు టికెట్లు కేటాయించచాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయపార్టీలు బిసి డిక్లరేషన్ చేయాలన్నారు. రాజకీయ రంగంలో రిజర్వేషన్లు లేకపోవడంతో బిసిల ప్రాతినిధ్యం పెరగడంలేదని, దేశ జనాభాలో 54 శాతం జనాభా కలిగి ఉన్న బిసిలకు రాజకీయ రంగంలో 15 శాతం ప్రాతినిధ్యం లేదన్నారు. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 16 రాష్ట్రాల నుండి ఒక ఎంపీలేరని, అలాగే దేశంలో 2300 బిసిల కులాలుండగా, 2250 కులాల వారు ఇంతవరకు పార్లమెంట్‌లో అడుగుపెట్టలేదన్నారు. బిసిలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక్క రాజకీయ పార్టీ కూడా నోరు మెదపడంలేదన్నారు. రాజకీయపార్టీలు బిసిలను జెండాలు మోయడానికి, ఓట్లు వేయించుకునే కార్యకర్తలుగా చూస్తున్నారే తప్ప నాయకత్వానికి దూరంగా ఉంచుతున్నారని కృష్ణయ్య విమర్శించారు. అసెంబ్లీ,పార్లమెంటు ఎన్నికల్లో అన్ని పార్టీలు అన్యాయం చేస్తున్నాయని, ఆంధ్ర రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాల్లో జనాభా ప్రకారం 160 స్థానాలుండాలని, కేవలం 58 మంది మాత్రమే బిసిలున్నారన్నారు. రాష్ట్రంలో ప్రకాశం, కడప, చిత్తూరు, ఖమ్మం మొదలైన జిల్లాల నుండి ఒక బిసి ఎమ్మెల్యే కూడా లేరన్నారు. రాష్ట్రంల 126 బిసి కులాల్లో 104 కులాల వారికి ఇంతవరకు ఎమ్మెల్యేలకు అవకాశం రాలేదన్నారు. సామాజికంగా న్యాయం జరగకపోతే బిసిలే పార్టీ పెడతారన్నారు. గత మూడున్నర దశాబ్ధాల కాలంగా బిసిల కోసం పోరాడుతున్న నేత ఒక్క కృష్ణయ్య మాత్రమేనన్నారు. 70 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 50 వేల మంది ఒప్పంద కార్మికులు విద్యుత్‌శాఖలో పనిచేస్తున్నారని, ఇందులో 50 వేల మంది ఒప్పందకార్మికులను తక్షణమే పర్మినెంట్ చేయాల్సిందిగా కొనే్నళ్ళ నుంచి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా పెడచెవిని పెట్టిందన్నారు. చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బిసిలను నిర్లక్ష్యం చేస్తే బిసిలు తడాకా చూపుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో బిసి సంఘ నేతలు ఆల్సి అప్పలనారాయణయాదవ్, నరవ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
25న నగరానికి
అమాత్యుల సందడి
విశాఖపట్నం, డిసెంబర్ 22: ఒక రోజు పాటు విశాఖ నగరం మినీ సచివాలయంగా మారనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమర్ రెడ్డితో సహా సచివులంతా ఈనెల 25న విశాఖలో కొలువుతీరనున్నారు. రాష్ట్ర పెట్టుబడులు, వౌలిక వసతుల కల్పనల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయి పూజిత వివాహ వేడుకలకు సిఎం సహా మంత్రులంతా హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్, చిన్నతరహా నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్, సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి సి రామచంద్రయ్య తదితరుల కార్యక్రమాలు ఇప్పటికే ఖరారయ్యాయి. ఇంకా పలువురు రాష్ట్ర మంత్రులు మంగళవారం రాత్రి నుంచి విశాఖ పయనం కానున్నారు.
మంత్రి ఇంట్లో వివాహానికి హాజరయ్యేందుకు విశాఖ వస్తున్న మంత్రులు పనిలో పనిగా తమ శాఖలకు సంబంధించి సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు ఉపక్రమిస్తున్నారు. సహకార మంత్రి కాసు కృష్ణారెడ్డి ఈనెల 24న జిల్లా అధికారులతో జెడ్పీ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 23,24 తేదీల్లో నగరానికి వస్తున్న మంత్రులంతా స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర మంత్రుల రాక సందర్భంగా నగరంలోని అన్ని అతిధిగృహాలు, స్టార్ హోటళ్లు ఇప్పటికే కిటకిటలాడుతున్నాయి. గదులు దొరకడం కష్టమైపోయింది. మంత్రులంతా బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రితో కలిసి హైదరాబాద్ చేరుకుంటారు.
పోర్టు చైర్మన్‌గా ఎంటి కృష్ణబాబు!
* నియామకం ఖరారు
విశాఖపట్నం, డిసెంబర్ 22: విశాఖపట్నం పోర్టు ట్రస్టు చైర్మన్‌గా ఎంటి కృష్ణబాబు నియామకం దాదాపు ఖరారైనట్టు తెలిసింది. రాష్ట్ర పెట్టుబడులు, వౌలిక సదుపాయాల కల్పన విభాగంలో పనిచేస్తున్న ఈ సీనియర్ ఐఎఎస్ అధికారి పోర్టు చైర్మన్‌గా నియమితులైనట్టు పోర్టు వర్గాలు వెల్లడిస్తున్నాయి. గతంలో పోర్టు చైర్మన్‌గా పనిచేసిన అజయ్‌కల్లాం బదిలీకావడంతో కొద్ది రోజులుగా ఖాళీగానే ఉంది. ప్రస్తుతం కోల్‌కతా పోర్టు చైర్మన్ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. 36 మంది ఐఎఎస్ అధికారులతో తీవ్ర పోటీని ఎదుర్కొన్నప్పటికీ కృష్ణబాబు అందర్నీ అధిగమించి పోర్టు చైర్మన్ పదవిని దక్కించుకోగలిగినట్టు ప్రచారం జరుగుతోంది. సీనియర్ ఐఎఎస్ అధికారులకు దక్కే పోర్టు చైర్మన్ పదవిని కృష్ణబాబుకు కట్టబెడుతూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
రాష్ట్ర విభజనపై మోసగిస్తున్న ప్రభుత్వం
* ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు
మాడుగుల, డిసెంబర్ 22: రాష్ట్ర విభజనపై కాం గ్రెస్ ప్రభుత్వం దోబూచులాట ఆడుతూ ప్రజలను మోసగిస్తుందని మాడుగుల శాసనసభ్యుడు గవిరెడ్డి రామానాయుడు వి మర్శించారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రస్తుతం ప్రజా సమస్యలను గాలికి వదిలి స్వప్రయోజనాల కోసం పాకులాడుతోందన్నారు. ప్రభుత్వ పథకాలు పేదలకు అందజేస్తున్నామని ముఖ్యమంత్రి, మంత్రులు ప్రకటనలు చేయడం తప్ప అర్హులకు అందడం లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని, అధికారులు అధికార పక్ష నాయకులకు వత్తాసు ప లుకుతున్నారని ఆయన ఆరోపించారు. మాడుగుల నియోజకవర్గంలో అసంపూర్తిగా నిలిచిపోయిన జలాశయాలను పూర్తి చేయాలని పలుసార్లు ముఖ్యమంత్రిని కోరినప్పటికీ పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. శాసనసభ సమావేశాలలో ప్రజా సమస్యలపై చర్చించకుండా తెలంగాణ బిల్లు సాకుతో వాయిదాలతో కా లం వెల్లిబుచ్చారన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ ప్రాంతం అన్ని రంగాలలో గణనీయమైన అభివృద్ధిని సాధించిందని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన చేపడితే రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని టిడిపి అధినేత చం ద్రబాబునాయుడు పట్టుదలతో ఉన్నారని గవిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్ర జలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్‌కు నూకలు చెల్లినట్టేనని చెప్పారు. రానున్న ఎన్నికలలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ద్వా రా ప్రజా సమస్యలకు పరిష్కారం లభించి సుస్థిర పాలన సాధ్యవౌతుందని ఆ యన అన్నారు. మాడుగుల మండలంలో ఈనెల 24వతేదీన ఇంటింటా టిడిపి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రామానాయుడు తెలిపారు.
సాంకేతిక లోపంతో తాండవలో నిలిచిన క్రషింగ్
పాయకరావుపేట, డిసెంబర్ 22: తాండవ చ క్కెర కర్మాగారంలో యం త్రాలకు సాంకేతిక లోపం కారణంగా క్రషింగ్ నిలిచిపోయింది. శనివారం రాత్రి రెండు గంటల సమయం లో క్రషింగ్ ఆగిపోయింది. సోమవారం వరకు తిరిగి క్రషింగ్ ప్రారంభమయ్యే అవకాశం కనిపించడం లేదని కార్మికులు అంటున్నారు. ఈ ఏడాది క్రషింగ్ ప్రారంభించి నెలరోజులు కాకుండానే ఇప్పటికీ నాలుగుసార్లు సాంకేతిక లోపం కారణంగా క్రషింగ్ నిలిచిపోయింది. క్రషింగ్‌కు అంతరాయం తో కర్మాగారానికి చెరకు తెచ్చిన వాహనాలు బారులు తీరి నిలిచిపోయాయి.
‘కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పండి’
డుంబ్రిగుడ, డిసెంబర్ 22: గిరిజన గ్రామాలు అభివృద్ధి సాధించాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని పార్టీ అరకు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు అన్నారు. మండలంలోని పోతంగి పంచాయతీ తోటవలసలో ఆదివారం గడపగడపకు వైఎకాపా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రా మాల్లో మంచినీరు, రహదారులు, విద్యుత్, వైద్యం, విద్య సౌకర్యాలు పూర్తిస్థాయిలో ప్రభుత్వం కల్పించడం లేదని ఆయన విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆయన ఆరోపించారు. ప్రజల కోసం ప్రవేశపెట్టిన సం క్షేమ పథకాల ఫలాలను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వారిస్వార్థాల కోసం వినియోగించుకుంటున్నారని ఆయన విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో దోపిడి ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పి సమర్థవంతమైన నాయకుడ్ని ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.
ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభంతో చెరకు తరలింపులో బిజీ
యలమంచిలి రూరల్, డిసెంబర్ 22: ఏటికొప్పాక సుగర్ ఫ్యాక్టరీలో ఆదివారం అర్ధరాత్రి నుంచి క్రషింగ్ ప్రారంభం కావడంతో చెరకు కొనుగోలు కేంద్రాల వద్ద సందడి మొదలైంది. ఆదివారం కొత్తపాలెం చెరకు కాటాకు రైతులు ఎడ్లబళ్లుపై చెరకును తరలించుకు వస్తున్నారు. దీంతో వ్యవసాయ కూలీలకు ఉపాధి లభిస్తుంది. యలమంచిలి, రాంబిల్లి మండలాల్లో చెరకు రైతులు యలమంచిలి, సోమలింగపాలెం, కొత్తపాలెం కాటాలకు చెరకును తరలించుకు వస్తున్నారు.
పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై నోటీసులు!
పాయకరావుపేట, డిసెంబర్ 22: పా యకరావుపేట పంచాయతీ కార్యాలయంలో సుమారు ఏడు లక్షల రూపాయలు నిధులు దుర్వినియోగం జరిగి ంది. ఈ ఏడాది ఆగస్టు 2వతేదీన పంచాయతీ నూతన పాలకవర్గం పదవీ బా ధ్యతలు స్వీకరించింది. గత నాలుగు నె లల కాలంలో ఇంటిపన్నులు, పంచాయతీ దుకాణాలు అద్దెలు సుమారు ఏ డు లక్షల రూపాయలు వసూలు చేశా రు. ఏరోజుకారోజు వసూలు చేసిన ఇం టి పన్నులు మొత్తం పంచాయతీ ఎక్కౌ ంటు జమ చేయవల్సి ఉంది. తరువాత నే పంచాయతీ తీర్మానం చేసి నిధులు డ్రాచేసి ఖర్చు చేయవల్సి ఉంది. పంచాయతీ కార్యదర్శి నిబంధనలకు విరుద్దంగా వసూలుచేసిన పన్నులను జమ చేయకుండానే ఖర్చు చేశారు. నిబంధనలకు విరుద్దంగా పంచాయతీ దుకాణా ల నుంచి సుమారు 9 లక్షల రూపాయ లు వసూలు చేశారు. వాస్తవానికి ఈ దుకాణాలకు వేలంపాటలు నిర్వహించా ల్సి ఉంది. వారికే కేటాయించేందుకు దు కాణాల్లో అద్దెలకు ఉంటున్న వారి నుం చి లక్ష రూపాయలు చొప్పున వసూలు చేశారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి డి.రఘునాధబాబును ప్రశ్నించగా రెండు రోజుల్లో ఏడు లక్షల రూపాయల ఎక్కౌంటులో జమచేస్తానని తెలిపారు. సమైక్యాంధ్ర బంద్ కారణంగా నిధులు ఖర్చు చేయవల్సి వచ్చిందని తె లిపారు. ఈ విషయమై పంచాయతీ సర్పంచ్ థనిశెట్టి నాగమణిని ప్రశ్నించ గా ఇంటిపన్నులు, దుకాణాల అద్దెలు వసూలు చేసిన డబ్బులను పంచాయతీ ఎక్కౌంటులో జమచేయక పోవడంపై గ తంలోనే పంచాయతీ కార్యదర్శిని హె చ్చరించామని తెలిపారు. ప్రస్తుతం మూడేళ్ళకు సంబందించి ఆడిట్ జరుగుతుందని, దుర్వినియోగం చేసిన సొమ్ము ఏడు లక్షల కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయా న్ని గతంలోనే తాము జిల్లా పంచాయ తీ అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
చెట్ల నరికివేత : పట్టణంలోని 5వ వార్డులో పంచాయతీ చెట్లను నరికివేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం సుమారు 24 చెట్లను గుట్టుచప్పుడు కాకుండా నరికించి వేశారు. వీటిద్వారా వచ్చిన సుమా రు 1.30 లక్షల రూపాయల సొమ్మును వాటాల ప్రకారం పంచుకున్నట్లు సమాచారం. పంచాయతీకి ఒక్క రూపాయి జమ చేయలేదు. చెట్ల నరికివేతపై ప్రశ్నిస్తే చెట్ల వేర్లు కాలువల్లోకి, మంచినీటి పైపుల్లోకి వెళ్తున్నాయని, అందుచేత నరకించివేసినట్లు సాకులు చెబుతున్నారు. పంచాయతీ కార్యదర్శి రఘునాధబాబుని ప్రశ్నించగా చెట్లు నరికివేత లో తప్పు జరిగిన మాట వాస్తవమేనని తెలిపారు. దీనికి సంబందించి పంచాయతీకి నిధులు జమ కాలేదన్నారు.
సిబ్బందికి షోకాజ్ నోటీసుల జారీ
పంచాయతీలో నిధులు దుర్వినియో గంపై కార్యదర్శితోపాటు ఇద్దరు గుమస్తాలకు, ముగ్గురు బిల్లు కలెక్టర్లకు షో కాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఎం.పి డి.ఒ. ఎన్. సంతోషం తెలిపారు. పంచాయతీ ఇంటి పన్నులు, దుకాణాల అద్దె లు పంచాయతీ ఎక్కౌంటులో జమచేయకపోవడం, 5వ వార్డులో పంచాయతీ చెట్లు నరికివేసి నిధులు పక్కదారి ప ట్టడం పై రికార్డులతో సహా పూర్తి నివేదిక ఇవ్వాలని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఎం.పిడి.ఓ. తెలిపారు.
20 కిలోల గంజాయి స్వాధీనం
మాడుగుల, సెప్టెంబర్ 22: ఏజెన్సీ ప్రాంతం నుండి మైదాన ప్రాంతానికి గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుండి 20 కిలోలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్.ఐ. హరి తెలిపారు. దీనికి ఎస్.ఐ. అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం తెల్లవారుజామున మండలంలోని జె.డి.పేట మీదుగా పట్టణ ప్రాం తానికి తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో జె.డి.పేటవద్ద మాటువేసు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అ రెస్టు చేసినట్టు చెప్పారు. జి.మాడుగుల మండలం బంధవీధికి చెందిన కొండప ల్లి కృష్ణ, పలాసి బాలకృష్ణలు ద్విచక్రవాహనం 20 కేజీల గంజాయిని తరిస్తున్నారని ఆయన చెప్పారు. వీరిపై కేసు న మోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.ఐ. తెలిపారు. ఈ దాడుల్లో ట్రైనింగ్ ఎస్.ఐ. ఎం.తేజేశ్వరరావు పాల్గొన్నారు.
‘కాంట్రాక్టు సేల్స్మెన్ల వేతనాలు పెంచాలి’
పాడేరు, డిసెంబర్ 22: విశాఖ ఏజెన్సీలోని డి.ఆర్.డిపోలలో పనిచేస్తున్న కాంట్రాక్టు సేల్స్మెన్ల వేతనాలు పెం చాలని పాడేరు డివిజన్ కాంట్రాక్టు సే ల్స్‌మెన్ల సంఘం అధ్యక్షుడు ఎస్.లింగందొర కోరారు. స్థానిక గిరిజన లైబ్రరీ భ వనంలో ఆదివారం నిర్వహించిన కాం ట్రాక్టు సేల్స్‌మెన్‌ల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ గత ఏడేళ్ళుగా కాంట్రాక్టు ప్రాతిపదికన జి.సి.సి.లో సే ల్స్‌మెన్‌లుగా పనిచేస్తున్న వారికి కనీస వేతనాలు చెల్లించడం లేదన్నారు. కాం ట్రాక్టు సేల్స్‌మెన్‌లకు నెలకు మూడు వే ల రూపాయల అతి తక్కువ వేతనాన్ని ప్రభుత్వం చెల్లిస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. వి విధ విభాగాలలో పనిచేస్తున్న కాం ట్రాక్టు ఉద్యోగులకు ఐదు నుంచి పది వేల రూపాయలను చెల్లిస్తున్నప్పటికీ త మకు మాత్రం మూడు వేల రూపాయల ను మాత్రమే ముట్టజెప్పి అన్యాయం చే స్తున్నారని ఆయన వాపోయారు. ప్రస్తు తం పెరుగుతున్న ధరలకు అనుగుణం గా వేతనాలు పెంచాల్సి ఉన్నప్పటికీ ఈ విషయాన్ని పాలకులు, అధికారులు ప ట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. తమకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని అనేకసార్లు సంస్థ అధికారులు, గిరిజన మంత్రిని కోరినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని ఆయన వాపోయారు. ఈ విషయమై పాలకులు ఇప్పటికైనా దృష్టి సారించి జి.సి.సి.లో కాంట్రాక్టు సేల్స్‌మెన్‌ల వేతనాలను పె ంచేందుకు చర్యలు తీసుకోవాలని లిం గందొర కోరారు. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు బి.రామారావు, కె.అప్పలస్వామి, ఎ.హనుమంతు, జి.నాగేశ్వరరావు, బి. ముత్యంనాయుడు పాల్గొన్నారు.
పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఫైబర్ కళాకృతులు
అరకులోయ, డిసెంబర్ 22: అరకులోయ గిరిజన సంస్కృతి మ్యూజియంలోని కళాకృతులు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. మట్టితో తయారుచేసిన బొమ్మలతోపాటు నూతనంగా ఫైబర్ గ్లాస్‌తో తయారుచేసిన గిరిజన కళాకృతులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటివరకు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను తెలియజెప్పే మట్టి కళాకృతులు మ్యూజియంలో పర్యాటకులకు దర్శనమిచ్చేవి. ప్రస్తుతం ఫైబర్‌తో తయారుచేసిన అనేక రూపాల కళాకృతులు పర్యాటకుల మదిని దోచుకుని కనువిందు చేస్తున్నాయి. మట్టితో తయారుచేసిన కళాకృతులు, కొంతకాలం తరువాత చెడిపోతున్నాయన్న కారణంగా ఫైబర్ గ్లాస్‌తో తయారుచేసిన కళాకృతులను మ్యూజియంలో పొం దుపరుస్తున్నారు. ఫైబర్ గ్లాస్ కళాకృతుల మూలంగా ఎటువంటి నష్టాలు వాటిల్లదని భావించిన మ్యూజియం నిర్వాహకులు మరిన్ని కళాకృతులను తయా రుచేయించాలని భావిస్తున్నారు. పర్యాటకులు ఫైబర్‌గ్లాస్‌తో తయారు చేసిన కళాకృతుల పట్ల మక్కువ చూపుతున్న నేపథ్యంలో భవిష్యత్‌లో మరిన్ని ఆకర్షణీయమైన కళాకృతుల కోసం ప్రతిపాదించారు.
వైకాపా బలోపేతానికే ఇంటింటికి ప్రచారం
మాడుగుల, డిసెంబర్ 22: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నియోజకవర్గం పార్టీ నా యకుడు పి.వి.జి. కుమార్ కోరారు. మాడుగులలో ఆ దివారం ఆయన గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జగన్ ముఖ్యమంత్రి కావల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మాడుగుల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈనెల 30వతేదీ వరకు దీనిని చేపడుతున్నామని, పార్టీ కార్యకర్తలంతా పాల్గొని విజయవంతం చేయాలని కో రారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎ.సన్యాసినాయుడు, భాస్కరరావు, వి.దేముళ్లు, ఎం.రాజునాయుడు, శ్రీను, ఎస్.ముత్యాలనాయుడు, బి.అప్పలనాయుడు, పరమేశ్, ఆర్.కుమార్ పాల్గొన్నారు.
ఓటరు నమోదులో నిర్లక్ష్యం చూపితే మెమోలు జారీ చేస్తాం
చోడవరం, డిసెంబర్ 22: ఓటరు నమోదు కార్యక్రమంలో బూత్‌స్థాయి అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం చూపినా మెమోలు జారీ చేస్తామని తహశీల్దార్ పి. శేషశైలజ అన్నారు. ఆదివారం మండలంలోని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారమ్మపాలెం పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఆమె ఎంతమంది నూతన ఓటర్లను చేర్పించారు, ఎంతమందిని తొలగించారని డిఎల్‌ఒ పద్మావతిని ప్రశ్నించారు. ఇంటింటికి తిరిగి ఓటర్ల నమోదు చేస్తున్నామని, ఇప్పటివరకు నూతన ఓటర్లు 48మందిని గుర్తించినట్లు ఆమె తెలియజేశారు. కేవలం ఒక్కరోజే ఓటరు నమోదుకు గడువు ఉండటం వలన నమోదు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని తహశీల్దార్ సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా గుర్తించాలన్నారు. అలాగే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పూర్తిచేసుకోవాలని, వ్యక్తులకు ఆయా రసీదులను అందజేయాలని ఆమె డిఎల్‌ఒ పద్మావతిని ఆదేశించారు. అలాగే మృతి చెందిన ఓటర్లను తొలగిస్తూ నూతన ఓటర్లను చేర్పించి జాబితాలలో ఏమైనా మార్పులుఉంటే సరిచేయాలన్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు విధులు నిర్వహించాలన్నారు. ఇదిలాఉండగా చోడవరం పరిధిలో లక్షా 84వేల 719మంది ఓటర్లు ఉండగా, నూతనంగా 8,016 మంది ఓటర్లు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వెంట ఎంఆర్‌ఐ భారతి పాల్గొన్నారు.