ఆరిలోవ, డిసెంబర్ 22: అరుదైన జాతి జంతువులు, పక్షులు ఇందిరాగాంధీ జూపార్క్‌కు తీసుకురావాలన్న కల నేటికి నెరవేరిందని రాష్ట్ర అటవీశాఖా మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. సందర్శకులు వీక్షించేందుకు వీలుగా మలేషియా నుండి తెచ్చిన రెండు జిరాఫీలు, కాన్పూరు నుండి తెచ్చిన ఖడ్గమృగం, చెన్నై నుండి తెచ్చిన రెండు తెల్లహంసలు, రెండు నల్లహంసలను ఆదివారం ఉదయం ఓపెన్ ఎన్‌క్లోజర్‌లో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటైన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూపార్కుకు మరిన్ని అరుదైన జాతి జంతువులు, పక్షులు, సరీసృపాలను ఇతర జూపార్క్‌ల నుండి మార్పిడి విధా నం ద్వారా తీసుకురానున్నట్లు తెలిపారు. చెక్ రిపబ్లిక్ నుండి చిరుతపులులు తీసుకురానున్నట్లు తెలిపారు. శ్రీలంక నుండి జత పిగ్మీహిప్పోలు, రెండు జతల ఫిషింగ్ కేట్‌లు, అస్సాం నుండి మూడు థామిన్‌డీర్‌లు, రెండు లెపర్డ్ కేట్‌లు, రెండు గులాబీ గూడబాతులు, మార్పిడి విధానం ద్వారా ఇతర జూపార్క్‌ల నుండి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఇజ్రాయిల్ నుండి తెచ్చిన నామాల కోతులు, లెమ్మూరు కోతులు, హార్మోసెట్ కోతులను త్వరలో ప్రజల సందర్శనార్థం మోటులో విడిచిపెట్టనున్నట్లు తెలిపారు. అరుదైన వన్యప్రాణులు తీసుకురావడానికి అధికారుల సహకారంతో రెండేళ్ళు శ్రమించాల్సి వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన జిరాఫీలు, ఖడ్గమృగం, తెల్ల, నల్లహంసల పోస్టర్లను ఆవిష్కరించారు. మరో అతిథి ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బిఎస్‌ఎస్.రెడ్డి మాట్లాడుతూ అరుదైన జంతువుల సంరక్షణ కోసం అనుభవం ఉన్న యానిమల్ కీపర్లను నియమిస్తామని, మిగిలిన చోట్ల కాంట్రాక్టు పద్ధతిన నియామకాలు జరుపుతామన్నారు. అటవీశాఖలో 3820 మంది సిబ్బందిని నియమించనున్నట్లు ఆయన తెలిపారు. జూపార్క్‌లో ఏనుగులు ఉంచడానికి డాల్ఫినోరియం ఏర్పాటుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయన్నారు. డాల్ఫినోరియంకు బదులు మెరైన్‌పార్క్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మరో అతిథి ప్రిన్సిపల్ కంజర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్‌లైఫ్) ఎవి.జోసెఫ్ మాట్లాడుతూ అరుదైన జాతి వన్యప్రాణులు తీసుకురావడం వల్ల సందర్శకుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోందని తెలిపారు. జూ క్యూరేటర్ జి.రామలింగం ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యక్రమంలో రాష్ట్ర జూపార్క్‌ల డైరెక్టర్ పి.మల్లికార్జునరావు, విశాఖ సిఎఫ్ ఎ.్భరత్‌కుమార్, సిఎఫ్ సోషల్ ఫారెస్ట్ కె.సూర్యనారాయం, డిఎఫ్‌ఓ సోషల్ ఫారెస్ట్ కె.లోహితాస్యుడు, శ్రీకాకుళం డిఎఫ్‌ఓ బి.విజయకుమార్, విజయనగరం డిఎఫ్‌ఓ ఐకెవి.రాజు, వుడా డిఎఫ్‌ఓ రాజారావు, ఎపిఎఫ్‌డిసి రీజనల్ మేనేజర్ రత్నాకల్ జుహారి, జూపార్క్ డాక్టర్ శ్రీనివాస్, జూ అభివృద్ధి కమిటీ సభ్యులు యాదవ్, జ్యోతి, సురేష్‌లు పాల్గొన్నారు.
అరుదైన జాతి జంతువులు, పక్షులు ఇందిరాగాంధీ జూపార్క్‌కు
english title:
zoo park
Date:
Monday, December 23, 2013