Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆధునిక వ్యవసాయ పద్ధతులతో రైతులకు మేలు

$
0
0

విశాఖపట్నం, డిసెంబర్ 24: ఆధునిక వ్యవసాయ పద్ధతులతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని రాష్ట్ర చిన్నతరహా నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. ఇక్కడ ఇరిగేషన్ కార్యాలయంలో నిర్మంచనున్న రైతు శిక్షణ కేంద్రానికి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయని అందుకు అనుగుణంగా నడచుకోవాలన్నారు. వ్యవసాయంలో కూడా కొత్త పోకడలు వస్తున్నాయని, రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఆకళింపు చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. అందుకు అనుగుణంగా ప్రాంతాల వారీగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. సేంద్రీయ ఎరువుల వినియోగం, అధిక దిగుబడనిచ్చే వంగడాల అభివృద్ధి, నీటి వినియోగంలో పొదుపు వంటి అంశాలను రైతులకు వివరించడంతో పాటు సాంకేతికంగా వస్తున్న పోకడలను వారికి అందుబాటులోకి తీసుకురావచ్చని అన్నారు. ఈ విషయంలో రైతులకు అవగాహన ఉంటే ఉత్పాదకత పెంచేందుకు దోహదపడుతుందన్నారు. దీనిలో భాగంగానే రైతు అనకాపల్లిలో ప్రాంతీయ రైతు శిక్షణ కేంద్రాన్ని రూ 14 కోట్లతో చేపట్టనున్నట్టు తెలిపారు. బిందు సేద్యం ద్వారా ఎంతో ఎంతో లబ్ది ఉందని భావించి అందుకు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు జరుపుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి, కోండ్రు మురళి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు సాంకేతికను అందిపుచ్చుకోవాలి
* ఎయు విసి ప్రొఫెసర్ రాజు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 24: సాంకేతిక రంగంలో చోటుచేసుకుంటున్న ఆధునిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ఆంధ్రాయూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జిఎస్‌ఎన్ రాజు పిలుపునిచ్చారు. ఎయు ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఇ-తరగతులను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సాంకేతిక రంగంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనడంతో పాటు వాటిని సానుకూలంగా మలచుకోవాలని సూచించారు. ప్రస్తుత విద్యావిధానం అన్ని విధాలా ఆధునికతను సంతరించుకుంటోందని, ఈ అంశాలను విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు అందిపుచ్చుకోవాలన్నారు. అలాగే బోధనా సిబ్బంది కూడా సాంకేతికంగా వస్తున్న ఆధునిక పోకడలకు అనుగుణంగా తమ బోధనా సామర్ధ్యాన్ని పెంచుకోవాలన్నారు. స్కాలర్లు, విద్యార్థులు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. అంతకు ముందు విసి రాజు ఎలక్ట్రానిక్స్ విభాగంలో వాటర్ ఫిల్టర్‌ను, తరగతి గదులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు.
లంకలపల్లి సంయుక్త మృతికి విసి సంతాపం
లంకలపల్లి బుల్లయ్య సతీమణి సంయుక్త మృతి పట్ల విసి ప్రొఫెసర్ రాజు సంతాపం వ్యక్తం చేశారు. శాసనమండలి మాజీ సభ్యురాలిగా పలు ఉన్నత పదవులు అలంకరించిన సంయుక్త మరణం విద్యారంగానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.
అధ్యయనంతో ఆవిష్కరణలకు మార్గం చూపండి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ స24: నిరంతరం అధ్యయనం ద్వారా నూతన ఆవిష్కరణలకు యువతరం మార్గం చూపాలని ఆంధ్రావిశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జిఎస్‌ఎన్ రాజు అన్నారు. ఎయు ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో భారత శ్రాస్త సాంకేతిక విభాగం నిర్వహిస్తున్న సదస్సును మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ దేశానికి సాంకేతిక సేవలందించే దిశగా నేటితరం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నూతన అంశాలను ఆకళింపు చేసుకోవాలన్నన కాంక్ష విద్యార్థుల్లో రావాలని సూచించారు. రాష్ట్ర ఉన్నతవిద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ విజయ్‌ప్రకాష్ మాట్లాడుతూ సాంకేతిక విద్య నభ్యసిస్తున్న విద్యార్థుల్లో నైపుణ్యం లోపిస్తున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైందని అన్నారు. జ్ఞానానికి మూలాలను అనే్వషించే తత్వాన్ని విద్యార్థులు అలవరుచుకోవాలని అన్నారు. భారతీయులు ఎన్నో వేల సంవత్సరాల నుంచి సృజనాత్మకత, సాంకేతిక విలువలను కలిగి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక అతిధి నాట్‌సోల్ ల్యాబ్ సిజిఓ జిఎ సుబ్బరాజు మాట్లాడుతూ పరిశోధనలకు నిధులు విడుదల పెంచాలని కోరారు. భారతీయ సంప్రదాయాల్లో సైన్స్ ఇమిడి ఉందని, దీన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయని అన్నారు. ఐటితో సమానంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ రాణిస్తోందని కొనియాడారు. తొలిరోజు సదస్సులో భాగంగా భౌతికశాస్త్రంలో అంశాలు ప్రస్తావించారు. కార్యక్రమంలో అకడమిక్ స్ట్ఫా కళాశాల డైరెక్టర్ షమీర్, ఫార్మశీ కళాశాల ప్రిన్సిపల్ గంగారాం తదితరులు పాల్గొన్నారు.

యుద్ధ ప్రాతిపదికన రోడ్లు పునరుద్ధరించండి
* అధికారులకు కమిషనర్ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 24: నగర పరిధిలో అధ్వాన్నంగా ఉన్న రహదార్లను తక్షణమే పునరుద్ధరించాలని జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. నగరంలోని రహదార్ల తీరుపై మంగళవారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నగరంలోని పలురహదార్ల పరిస్థితి ఘోరంగా తయారైందని గుర్తించారు. దెబ్బతిన్న రహదార్లను తాత్కాలికంగా పునరుద్ధరించేందుకు 2.7 కోట్ల రూపాయల అంచనాతో పనులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. దీనిలో భాగంగా తొలివిడతలో చేపట్టిన పనులు కొనసాగుతున్నాయన్నారు. సిరిపురం జంక్షన్ నుంచి పెదవాల్తేరు, ఎయు అవుట్‌గేట్, హెచ్‌పిసిఎల్ పెట్రోల్‌బంక్ వరకూ పనులు, రైల్వేస్టేడియం నుంచి తాటిచెట్లపాలెం, సత్యం కంప్యూటర్ జంక్షన్, నోవాటెల్ జంక్షన్, ఎల్‌ఐసి జంక్షన్, తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న రహదార్ల పునరుద్ధరుణ పనులను పరిశీలించారు. రెండో విడతలో చేపట్టనున్న రహదార్ల పునరుద్ధరణ పనులకు సంబంధించి ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీసు బ్యారెక్స్, సీతమ్మధార, హెచ్‌బి కాలనీ, టిటిడి కల్యాణ మండపం, దండుబజార్,గాజువాక, పెందుర్తి తదితర ప్రాంతాల్లో రహదార్లను పునరుద్ధరించాలని సూచించారు.

నగరానికి క్రిస్మస్ శోభ
* విద్యుత్ దీపకాంతులతో చర్చిలు
* ప్రార్ధనల్లో క్రైస్తవులు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 24: నగరం క్రిస్మస్ శోభ సంతించుకుంది. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరిగే క్రిస్మస్ పండుగ సందర్భంగా నగరంలోని క్రైస్తవ దేవాలయాలు సర్వాంగ సుందరంగా అలంకరించారు. చర్చిలన్నీ విద్యుత్ దీపకాంతులతో కళకళలాడుతున్నాయి. నగరంలోని సీతమ్మధార బాలయేసు చర్చి, అల్లిపురం కల్వరి బాప్టిస్టు చర్చి, జగదాంబలోని ట్రినికీ చర్చి, జ్ఞానాపురంలోని పునీత పేతురు దేవాలయం ఇంకా పలు చర్చిల్లో క్రిస్మస్ వేడుకల నిర్వాహణకు హంగామా చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి చర్చిల్లో క్రిస్మస్ సందడి నెలకొంది. క్రీస్తు భక్తులు ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా మంగళవారం రాత్రి నుంచి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఇక క్రిస్మస్ సందర్భంగా నగరంలోని పలు స్టార్ హోటళ్లు, రిసార్ట్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. బాలలతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నారులు విచిత్ర వేషధారణలతో అలరిస్తున్నారు. శాంటాక్లజ్ వేషధారులు చిన్నారులను మైమరపిస్తూ బహుమతులు అందజేస్తున్నారు. జగదాంబ జంక్షన్‌లోని ట్రినిటీ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి వరకూ ప్రత్యేక ప్రార్ధనలు, కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

పోస్ట్ఫాసుకి రండి...
పట్టుచీర పట్టుకెళ్ళండి
విశాఖపట్నం, డిసెంబర్ 24: సంక్రాంతి పండుగ సందర్భంగా విశాఖపట్నం నార్త్ (ఉత్తర) సబ్ డివిజన్ పరిధిలో మహిళలకు తపాల శాఖ అందిస్తున్న అపురూప కానుక. విశాఖపట్నం ఉత్తర సబ్ డివిజన్ ఏయు, హెచ్‌బి కాలనీ, ఎంవిపి కాలనీ, ఎల్‌బి కాలనీ, ప్రభుత్వ వైరీఫారమ్, విశాలాక్షినగర్, మధురవాడ, పోతినమల్లయపాలెం, గీతం ఇంజనీరింగ్ కాలేజ్, తగరపువలస, భీమిలి, రెడ్డిపల్లి అగ్రహారం పరిధిలో 61 పోస్ట్ఫాసుల్లో (గ్రామీణ పోస్ట్ఫాసులతో కలిపి) తపాల శాఖల్లో ఆర్‌డి (రికరింగ్ డిపాజిట్) మేళాలు నిర్వహించబడునని ఉత్తర సబ్ డివిజన్ ఇనె్సపెక్టర్ పోస్ట్ పి.శ్రవణ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేకంగా మహిళలకు మాఅతమేనని ఒక మహిళ ఎన్ని ఖాతాలైనా తెరవచ్చని పేర్కొన్నారు. కనీసం డిపాజిట్ 20 రూపాయలుగా తెలిపారు. ఈ పథకం ప్రకారం జనవరి-13 నాటికి తెరవబడిన ఖాతాల్లో లాటరీ తీసి ప్రతి పోస్ట్ఫాసులో ఒక పట్టుచీర బహుమతిగా ఇవ్వబడునన్నారు. ఈ అవకాశం మహిళలు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. చీఫ్ మాస్టర్ జనరల్ హైదరాబాద్, వారి ఆదేశానుసారం లక్ష ఆర్‌డి ఖాతాలు విశాఖ నార్త్ పరిధిలో సేకరణను లక్ష్యంగా నిర్ణయించుకునే విధంగా ప్రజల వద్దకు వెళ్తున్నామన్నారు.

బీచ్‌రోడ్డులో గిడుగు విగ్రహం ఏర్పాటు చేయాలి
విశాఖపట్నం, డిసెంబర్ : తెలుగు వ్యావహారిక భాషా పితామహుడు, స్వర్గీయ గిడుగు రామ్మూర్తి పంతులు కాంస్య విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర విద్యార్ధి సేన అధ్యక్షుడు సుంకరి రమణమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణను స్వయంగా కలిసిన సేన ప్రతినిధులు గిడుగు సేవలను స్మరించుకునే భాగ్యాన్ని విశాఖ వాసులకు కల్పించాల్సిందిగా కోరారు. తెలుగు భాషోద్యమానికి తన సర్వస్వం ఫణంగా పెట్టిన మహామనిషి గిడుగు జ్ఞాపకాలను సదా స్మరించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగుజాతి కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికి చాటిన గిడుగును విస్మరించడం సమంజసం కాదన్నారు. గిడుగు రామ్మూర్తి వర్ధంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 22లోగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రతో సంబంధం లేని నేతలు, మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసి, తెలుగుభాష ఉద్ధారకుడు గిడుగును విస్మరించడం ఎంతవరకూ సమంజసమని అన్నారు. విగ్రహం ఏర్పాటుపై సానుకూలంగా స్పందించని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

వివాదస్పదమైన హెచ్‌ఆర్‌డి నియామకం
* కోర్టు స్టే ఉండగానే కొత్త ఉత్తర్వులు
* జివిఎంసిలో నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 24: జివిఎంసిలో హెచ్‌ఆర్‌డి పోస్ట్ వివాదాస్పదమైంది. గతంలో ఇక్కడ హెచ్‌ఆర్‌డి కన్సల్టెంట్‌గా పనిచేసిన వ్యక్తిని కొనసాగించడానికి అధిక జీతాన్ని సాకుగా చూపి ఆయనను సాగనంపి, అంతకన్నా మరో 10 వేలు అధికంగా చెల్లిస్తూ మరో వ్యక్తిని ఆపోస్ట్‌లో నియమించారు జివిఎంసి అధికారులు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇలా ఉన్నాయి. విశాఖ నగరపాలక సంస్థ, జివిఎంసిగా ఆవిర్భవించిన తరువాత కార్పొరేట్ స్టైల్‌లో కార్యాలయాన్ని నడిపించేందుకు హెచ్‌ఆర్‌డి విభాగాన్ని 2008లో ప్రాంరభించారు. అప్పటి మేయర్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ తీర్మానం మేరకు ఈ నియామకం జరిగింది. అప్పట్లో హెచ్‌ఆర్‌డి కన్సల్టెంట్‌తోపాటు, అసోసియేట్ హెచ్‌ఆర్‌డి, అసిస్టెంట్ హెచ్‌ఆర్ కన్సల్టెంట్‌ను నియమించారు. హెచ్‌ఆర్ కన్సల్టెంట్‌కు 25 వేలు, అసోసియేట్ హెచ్‌ఆర్‌డికి 20 వేలు, అసిస్టెంట్ కన్సల్టెంట్‌కురి 15వేల రూపాయల జీతంతో నియమించారు. హెచ్‌ఆర్ కన్సల్టెంట్‌కు ఇచ్చే జీతాన్ని సంవత్సరానికి ఐదు శాతం పెంచుతూ రాగా, చివరకు ఆ జీతం 35 వేలకు చేరుకుంది. ఆయనకు కార్ అలవెన్‌కు కింద తొమ్మిది వేల రూపాయలు ఇచ్చేవారు. ఈ పదవిలో ఐదేళ్ళపాటు పనిచేసిన రాజేంద్ర పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. ప్రస్తుత కమిషనర్ సత్యనారాయణ, తిరిగి రాజేంద్రనే కొనసాగమని కోరారు. అయితే అడిషనల్ కమిషనర్ మాత్రం ఆయనను ఆ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకన్నా తక్కువ జీతంతో ఈ పోస్ట్‌ను భర్తీ చేయాలని భావిస్తున్నామని అడిషనల్ కమిషనర్, రాజేంద్రకు చెప్పినట్టు తెలిసింది ఆ తరువాత రాజేంద్ర కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. ఈ ఉత్తర్వులు అమల్లో ఉండగానే, జూన్ ఆరున హెచ్‌ఆర్‌డి పోస్ట్ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో ఉన్న హెచ్‌ఆర్‌డి కన్సల్టెంట్ పదవి స్థానే మేనేజర్ హెచ్‌ఆర్‌డి అని పోస్టు పేరును మార్చి, నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్ట్‌లో నియమిస్తున్న వ్యక్తికి నెలకు 45 వేల రూపాయల జీతాన్ని కూడా ఇవ్వడానికి జివిఎంసి సిద్ధపడుతోంది. గతంలో ఇక్కడ పనిచేసిన వ్యక్తికి జీతం అధికంగా చెల్లిస్తున్నామని చెప్పిన అధికారులు ఇప్పుడు 45 వేల రూపాయలు ఇవ్వడానికి ఎలా సిద్ధపడుతున్నారు? అలాగే గతంలో ఈ పోస్ట్‌కు ఒక సంవత్సరం కాల వ్యవధి విధించి, తాజాగా విడుదలైన ఉత్తర్వులలో రెండేళ్ళుగా పేర్కొనడం గమనార్హం. మరోపక్క స్టే ఉత్తర్వులు అమల్లో ఉండగానే ఈ పోస్ట్‌లో కొత్త వ్యక్తిని నియమించడం వివాదాస్పదంగా మారింది.

ఎవరెస్ట్ అధిరోహించినట్టుంది!
* ఎంపి పురంధ్రీశ్వరి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 24: విశాఖకు ఒక్కో కొత్త రైలు వస్తుంటే, తను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తున్నట్టుందని కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరి అన్నారు. విశాఖ నుంచి జోద్‌పూర్, గాందీథామ్‌కు రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లను పురంధ్రీశ్వరి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖకు ఇప్పటి వరకూ తన హయాంలో ఎనిమిది రైళ్ళను ప్రారంభించానని, అయినా తనకు సంతృప్తి లేదని అన్నారు. వాల్తేరును రైల్వే జోన్‌గా చేయడానికి ఇప్పటికి తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నానని చెప్పారు. విశాఖ నుంచి చెన్నైకు ప్రతి రోజు ఒక రైలు కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. టాటా ఎక్స్‌ప్రెస్ జనవరి ఒకటో తేదీ నుంచి, విశాఖపట్నం-కొల్లాం ఎక్స్‌ప్రెస్ ఫిబ్రవరి ఒకటి నుంచి రెగ్యులర్ రైళ్లుగా నడుస్తాయని ఆమె చెప్పారు. విశాఖ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు వౌలిక సదుపాయలు కల్పించాలని ఆమె కోరారు. 12 రిజర్వేషన్ కౌంటర్లు పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్టేషన్‌కు ఇరువైపుల ఆటోస్టాండ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ రైలు రవాణా సక్రమంగా లేని పరిస్థితుల్లో పురంధ్రీశ్వరి పలు కొత్త రైళ్ళను తీసుకువచ్చారని అన్నారు. కొత్త రైళ్లను మంజూరు చేసినందుకు బోర్డుకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ జోన్ అంశాన్ని రైల్వే మంత్రికి, బోర్డుకు పదే పదే చెపుతూ వస్తున్నామని అన్నారు. భారతీయ రైల్వేలో వేరే జోన్లకు డిమాండ్ ఉన్నందువలన, వాల్తేరు జోన్‌పై నిర్ణయం తీసుకోలేకపోతున్నారని అన్నారు. తన నియోజకవర్గంలోని 43వ వార్డులో 92కుటుంబాలు ఇళ్లు నిర్మించుకునే ప్రయత్నం చేశారని, ఆ స్థలంపై రైల్వే అధికారులు కోర్టుకు వెళ్లారని, ఆ స్థలం రైల్వేది కాదని కోర్టు తీర్పు ఇచ్చిందని, దీనిపై అధికారులు మళ్లీ అఫిడవిట్ దాఖలు చేశారని అన్నారు. జిల్లా కలెక్టర్ కూడా ఈ స్థలం రైల్వేది కాదని నివేదిక ఇచ్చారని ఎమ్మెల్యే మళ్ల చెప్పారు. రైల్వే అధికారులు ఈ అంశంపై సరళంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
గంటా ఇంట పెళ్లికి
తరలి వస్తున్న అతిథులు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 24: మంత్రి గంటా కుమార్తె పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడకల్లో పాల్గొనేందుకు ఇప్పటికే మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, కాసు వెంకట కృష్ణారెడ్డి నగరానికి రాగా, మంగళవారం కేంద్ర మంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివరావు, కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, మహిధర్‌రెడ్డి, గల్లా అరుణకుమారి, దానం నాగేంద్ర, వట్టి వసంతకుమార్, శైలజానాథ్, పార్థసారథి, పితాని సత్యనారాయణ, రఘువీరారెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హాజరయ్యారు.

బతుకులు బాగు చేస్తాం
* కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది
* గిరిజనులు, మత్స్యకారులకు మంత్రి కాసు భరోసా
* మత్స్యకారుల ఆచూకీ కోసం త్రిసభ్య కమిటీ
విశాఖపట్నం, డిసెంబర్ 24: అన్నింట వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్న గిరిజనులు, మత్స్యకారులను అన్నివిధాలా ఆదుకుంటామని రాష్ట్ర సహకారశాఖామంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి అన్నారు. జిల్లాప్రజాపరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల గిరిజనులు, మత్స్యకారుల సహకార సంఘాల ప్రాంతీయ సదస్సును ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉన్న పేదబడుగుబలహాన వర్గాల వారికి ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలన్ని చేరే విధంగా కృషి చేస్తున్నామన్నారు. గిరిజనులు, మత్స్యకారుల అభున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. గ్రామీణ వ్యవస్థలో ఉంటే రైతులు, రైతు కూలీలు, వ్యవసాయం, వివిధ వృత్తుల మీద ఆధారపడి శ్రమదానం చేసి జనజీవన స్రవంతి ఆహార పదార్దాలను అందజేస్తున్నారన్నారు. మత్స్యకారులు సముద్రతీర ప్రాంతాల్లో నివశిస్తూ ఎన్నో ఒడుకుదుకులను ఎదుర్కొంటున్నా సముద్రంలోకి వేటకు వెళ్తుంటారన్నారు. అలాగే మారుమూల గిరిజన ప్రాంత మండలాల్లో ప్రజాజీవనానికి దూరంగా గిరిజనులు నివశిస్తున్నారన్నారు. ప్రత్యేకంగా మత్స్యకార, గిరిజన ప్రాంతవాసుల సాధక బాధలను తెలుసుకుని వారికి ప్రభుత్వపరంగా సహాయసహకారాలను అందజేసేందుకు సమీక్ష సమావేశాన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మత్స్యకార సొసైటీలకు కోపరేటివ్ రుణాలు వచ్చే విధంగా చూస్తామన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి అదనంగా రుణ సౌకర్యాన్ని వచ్చేవిధంగా చూస్తామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంబవించినపుడు నష్టపోయిన బాధితులకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామన్నారు. సముద్రపు వేటకు వెళ్ళి అనుకోని పరిస్థితుల్లో కనపడకుండా పోయిన మత్స్యకారుల ఆచూకీ నిమిత్తం త్రిసభ్య కమిటీని వేళ్ళి విచారణ జరిపి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గిరిజన ప్రాంత మండలాల్లో ఉన్న సొసైటీలకు రుణ సౌకర్యం కల్పించే విధంగా చూస్తామన్నారు. కలెక్టర్, బ్యాంకర్లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి గిరిజనులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖామంత్రి పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ మత్స్యకార, గిరిజన వర్గాలకు సంబంధించి సామాజికంగా ఆర్ధికంగా వెనుకబడిన వారిని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందరికీ చేరుతున్నాయా? లేదా తెలుసుకునేందుకే ఈ సమీక్ష సమావేశమన్నారు. బి.్ఫరం పట్టాలను రుణ సౌకర్యం కల్పించే విధం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. గృహనిర్మాణం, వృత్తివిద్య, వైద్యాలకు ప్రత్యేక రాయితీల సదుపాయం గురించి స్పష్టమైన అభిప్రాయం తీసుకురావడం జరిగిందన్నారు. గిరిజన ప్రాంతాల్లో మత్స్యకారులకు మూడు పాఠశాలలను పెట్టడం జరిగిందన్నారు. విశాఖ జిల్లాలో మత్స్యకార విద్యార్థులకు రీజనల్ రెసిడెన్సియల్ పాఠశాలను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగిందన్నారు. అలాగే కోస్తాతీరం ప్రాంతం నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు రీజనల్ ఆఫీస్‌ను పెట్టె ఉద్దేశ్యం ఉందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని యువతకు వృత్తిపరంగా ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వౌలిక వసతులు, పెట్టుబడులు, ఓడరేవులుశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ మన రాష్ట్రం అతి పెద్ద సముద్రతీర ప్రాంతం గలదని దేశంలో రెండవ స్థానంలో ఉందన్నార. రాష్టవ్య్రాప్తంగా మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం నుండి ప్రోత్సహాకాలను అందించే విధంగా చూడాలని సహకార శాఖామంత్రిని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు సూర్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, పంచకర్ల రమేష్‌బాబు, మళ్ళ విజయప్రసాద్, చింతలపూడి వెంకటరామయ్య, యువి రమణమూర్తిరాజు, కెఎస్‌ఎన్ రజు, రాష్ట్ర మత్స్యకార సంఘాల చైర్మన్లు, మూడు జిల్లాల సంఘాల ప్రతినిధులు, కో-ఆపరేటివ్ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, జెసి ప్రవీణ్‌కుమార్, పాడేరు, పార్వతీపురం పిఓలు వినయచంద్, రజిత్‌కుమార్, కో-ఆపరేటివ్ ఆఫీసర్ అర్జునరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

స్వచ్చందంగా లొంగిపోతే కేసులుండవ్ : ఎస్పీ
నర్సీపట్నం, డిసెంబర్ 24: మావోయిస్టులు మన్యంలో పాల్పడిన ఇన్‌ఫార్మర్ల హత్యలు, పలు సంఘటనలపై సమగ్ర దర్యాప్తు చేశారని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ తెలిపారు. ఈ విచారణలో మావోయిస్టులకు సహకరించిన మిలీషియా సభ్యులు, సానుభూతిపరులను గుర్తించామన్నారు. బలపం పంచాయతీ కుడుమలకి చెందిన మిలీషియా కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్న గబలింగి అప్పారావు, కామరాజు, కొర్రా శ్రీరాములు, కిల్లో ప్రసాద్, సింద్రి నాగేశ్వరరావు, కొర్రా నాగేశ్వరరావు, వంతల మల్లేష్, పలాసి గణపతి, చిక్కుడు భాస్కరరావు, మువ్వల చిన్నబ్బాయి, సాగిన పొట్టిపడాల్, బొరుబోజుల లక్ష్మణరావులను గుర్తించామన్నారు. వీరు తమ కార్యకలాపాలకు స్వస్తి పలికి స్వచ్చందంగా లొంగిపోవాలని ఎస్పీ కోరారు. లేకుంటే చట్టపరంగా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో అమాయక గిరిజనులను మావోయిస్టులు హతమార్చిన కేసుల్లో ఆరుగురు మావోయిస్టు కీలక మిలీషియా సభ్యులను అరెస్ట్ చేసినట్లు రూరల్ ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ వెల్లడించారు. చింతపల్లి మండలం అన్నవరం పోలీస్ స్ట్ఫేన్ పరిధిలోని బలపం శివారు గ్రామాలకు చెందిన 19 మంది మిలీషియా సభ్యులు చింతపల్లి ఎఎస్పీ ఎదుట స్వచ్చందంగా లొంగిపోయినట్లు ఆయన తెలిపారు. మంగళవారం స్థానిక ఎఎస్పీ కార్యాలయంలో అరెస్టయిన, లొంగిపోయిన మిలీషియా సభ్యులను విలేఖరుల ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతపల్లి మండలం బలపం శివారు కొరుకొండకి చెందిన కొరుకొండ దళం మిలీషియా కమాండర్ అనుగురి వెంకటరమణ(25), మాజీ హోంగార్డు, మిలీషియా కీలక సభ్యులు గెమ్మిలి నాగరాజు(26), గెమ్మిలి సత్తిబాబు(26),కిష్టవరపు గ్రామానికి చెందిన మువ్వల చిన్నబ్బాయి(28), తోకపాడుకి చెందిన తలే సత్తిబాబు(30), బూరుగుబయలుకు చెందిన వంతల సిబు(25)లను అరెస్ట్ చేశామన్నారు. అరెస్టయిన వారు ఈ ఏడాది జూన్ 12వతేదీన బలపం ఎం.పి.టి.సి గబ్బాడ చిట్టిదొర ఇంటిపై దాడిచేసి లూఠీ చేసిన సంఘటనలో తులం బంగారం, పది తులాల వెండి, లక్షా 10వేల రూపాయల నగదు, మూడు రాజ్‌మా చిక్కుళ్ళ బస్తాలు, 200 కిలోల బియ్యం, టాటా స్కైడిస్క్, డబుల్‌కాట్ మంచం, 10 వేల రూపాయల విలువ చేసే ఇంటి సామాగ్రిని దోచుకుపోయారు. అలాగే జూలై 6వ తేదీన జరిగిన మార్కెట్ కమిటీ చైర్మన్ వంతల సుబ్బారావు ఇంటిపై దాడిచేసి తులంన్నర బంగారం, 12 రాగి, సెల్‌ఫోన్, ఎనిమిది బస్తాల ధాన్యం, ఒక బస్తా బియ్యం, బస్తా బీన్స్, మూడువేల రూపాయల నగదు లూఠీ చేసి పట్టుకుపోయారు. నవంబర్ 8వతేదీన జోహార్ ఘాట్‌రోడ్డులో పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో కిల్లో రాంబాబు, కొండమూడు రామ్మోహన్ హత్యల సంఘటనల్లో వీరు పాల్గొన్నట్లు ఎస్పీ వివరించారు. అలాగే వాల్‌పోస్టర్లు అతికించడం,కరపత్రాలు వెదజల్లడం, చెట్లు నరికివేత సంఘటనల్లో వీరు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.
అలాగే చింతపల్లి ఎఎస్పీ ఎదుట లొంగిపోయిన వారిలో బలపం శివారు కోరుకొండకి మిలీషియా డిప్యూటీ కమాండర్ తీముల విశే్వశ్వరరావు(24), డిప్యూటీ కమిటీ సభ్యుడు తీడల బాలరాజు(50), మిలీషియా సభ్యుడు గీదల గణపతి(26), పాంగి వెంకటేశ్వరరావు(25), వంతల మోహన్(18), పాంగి రాంబాబు(22), కమ్మట కోఠి(29), గీదల రాజు(23), వొండ పద్మన్న(26), మామిడి లింగరాజు(25), అనుభూరి బాబూరావు(25), తలే ఆనందరావు(25), తోకపాడుకి చెందిన మిలీషియా సభ్యుడు తలే రాంబాబు(21), గబలింగి ఆనందరావు(28), కిష్టవరపు గ్రామానికి చెందిన మువ్వల చిట్టిబాబు(22), మువ్వల సత్తిబాబు(27), కొర్రా సుందరరావు(20), పాంగి రామన్న(48), తూరుమామిడికి చెందిన పాంగి సింగురు(18)లు ఉన్నట్లు తెలిపారు. 2010, 2011లో మావోయిస్టు పార్టీ బి.సి.డిప్యూటీ కమాండర్ భూపతి ఆధ్వర్యంలో మిలీషియా సభ్యులుగా వీరిని నియమించారని ఎస్పీ అన్నారు. మావోయిస్టులు చెప్పే బూటకపు మాటలు నమ్మి మిలీషియా సభ్యులుగా పనిచేశామని, చివరకు మావోయిస్టులు వలన గిరిజనులకు ఎటువంటి మేలు జరగలేదని, గిరిజనులను గిరిజనులతోనే చంపించడం, గిరిజనుల ఇళ్ళను గిరిజనులతోనే దోచుకోమనడం, రోడ్లు నిర్మాణం చేయకుండా బళ్ళు తగులబెట్టడం పనులు మావోయిస్టులు తమతో చేయించారని లొంగిపోయిన మిలీషియా సభ్యులు తెలిపారు.

జగన్‌తోనే సమైక్య రాష్ట్రం సాధ్యం
* మాజీ మంత్రి కొణతాల
అరకులోయ, డిసెంబర్ 24: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలిగే సత్తాగల నాయకుడు తమపార్టీ అధినేత వై.ఎస్.జగన్ మాత్రమేనని మాజీమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా అరకులోయలో మంగళవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. స్థానిక వైఎస్సార్ కూడలివద్ద బహిరంగ సభలో ముఖ్య అతిధిగా ఆయన మాట్లాడుతూ ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పి విభజనను అడ్డుకునే సత్తా జగన్‌కు మాత్రమే ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి బతికి ఉన్నట్టయితే రాష్ట్రాన్ని విభజించి ఉండేవారు కాదని చెప్పారు. రాజశేఖరరెడ్డి మరణానంతరం అభివృద్ధి, సంక్షేమ పథకాలకు తూట్లు పొడవడమే కాకుండా రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరాకులా తయారుచేస్తున్నారని ఆయన విమర్శించారు.
రాజశేఖరరెడ్డి హయాంలో అమలుచేసిన వినూత్న పథకాల వలన కోట్లాది మంది బడుగు, బలహీనవర్గాలు లబ్ది పొందాయని, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో పథకాలకు తూట్లు పొడవడం వలన పేద కుటుంబాలన్నీ వీధిన పడాల్సిన పరిస్థితి దాపురించిందని అన్నారు.
వైఎస్సార్ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు జరగాలంటే ముఖ్యమంత్రిగా జగన్‌ను ఎన్నుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. కాబోయే ముఖ్యమంత్రి జగన్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రాన్ని విభజించడానికి జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు సమైక్యవాదులంతా ఒకేతాటిపైకి వచ్చి ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గిరిజన ప్రాంతం నుంచి లబ్ధి పొందిన అనేకమంది నాయకులు గిరిజన ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడుతూ గిరిజనులకు ద్రోహం చేస్తుండడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాంతం అభివృద్ధికి ద్రోహం చేస్తున్న నాయకులకు రానున్న ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలలో కిడారి సర్వేశ్వరరావును తమ నాయకుడిగా ఎన్నుకుని గిరిజనాభివృద్ధికి బాటలు వేసుకోవాలని రామకృష్ణ కోరారు.
అంతకుముందు స్థానిక అల్లూరి సీతారామరాజు పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఉన్న అరకులోయ ముఖద్వారం నుంచి భారీ ఊరేగింపు నిర్వహించి రాజశేఖరరెడ్డి విగ్రహానికి కండువా కప్పి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయకర్త కొత్తపల్లి గీత, పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్సీ కిడారి సర్వేశ్వరరావు, దొన్నుదొర, పెందుర్తి, మాడుగుల సమన్వయకర్తలు గండి బాబ్జి, పి.వి.జి.కుమార్, జిల్లా యువజన నాయకులు రాజు, నరసింహమూర్తి, నాయకులు శెట్టి అప్పాలు, సమర్డి రఘునాథ్, సమర్డి గులాబి, దొన్ను, ముత్యాలమ్మ, శ్రీరాములు, శెట్టి ఆనంద్, వీరన్న, సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజల సేవకు నిరంతరం పాటుపడతాం
* ఎ.ఎస్.పి. ఫకీరప్ప కార్నెల్లి
పాడేరు(రూరల్), డిసెంబర్ 24: సమాజంలో ప్రశాంత వాతావరణం కల్పించి సమస్యలు లేకుండా చూడడంతో పాటు తాము వారికి అండగా ఉండేందుకు నిరంతరం కృషి చేస్తామని పాడేరు ఎ.ఎస్.పి.్ఫకీరప్ప కార్నెల్లి తెలిపారు. స్ధానిక ఎ.ఎస్.పి.కార్యాలయంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇందులో భాగంగ ఈనెల 30వ తేదీ నుండి జనవరి 4వ తేది వరకు కమ్యూనిటీ పోలీసింగ్ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా 30వ తేదీన అన్ని పోలీస్ సర్కిల్ కేంద్రాలలో అన్ని గ్రామాల వాలీబాల్ జట్లను ఆహ్వానించి మండల స్ధాయి వాలీబాల్ పోటీలు నిర్వహించి 31వ తేదీ వరకు కొనసాగిస్తామన్నారు. జనవరి 1వ తేదీన సర్కిల్ పరిధిలోగల అన్ని మండల కేంద్రాలలో గల కళాశాలలు, పాఠశాలల నందు విద్యార్ధినీ, విద్యార్ధులకు యువకులకు ఉద్యోగ సాధనలో మెళుకువలు, ఉద్యోగ నియామకాల పద్ధతులు, విద్యార్ధినిలు తమను తాము రక్షించుకునే మెళుకువలపై అవగాహన కల్పించడంతో పాటు కమ్యూనిటీ పోలీసింగ్‌పై అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించనున్నామన్నారు. 2వ తేదీన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌లు వారి వారి పరిధిలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని ఉన్ని వస్త్రాలు, దుప్పట్ల పంపిణీ చేస్తామన్నారు. అదే విదంగ ఈ గ్రామాల నుండి 20 మంది మహిళలు, 10 మంది పురుషులను ఎంపిక చేసి వైజాగ్ సందర్శన చేపట్టి 3వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. 3వ తేదీన పోలీసులు, పౌరులు, మరియు స్వచ్ఛంద సంస్ధలు కలసి కళాశాలలు, ముఖ్య పర్యాటక కేంద్రాలలో శ్రమధానం కార్యక్రమం ద్వారా చేపట్టి పరిసరాలను శుభ్రపరచనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్ధాలు వంటివి వివరిస్తామన్నారు. ముగింపు రోజు 4వ తేదీన వైజాగ్ సందర్శన యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులలో వారి అనుభవాలను తెలుసుకోవడం జరుగుతుందని, వాలీ బాల్ పోటీలలో వివిధ స్ధాయిల్లో గెలుపొందిన జట్లలో పాడేరు డివిజన్ వాలీబాల్ టీంతో చింతపల్లి, నర్శీపట్నం డివిజన్ జట్లకు డివిజన్ పరిధిలో వాలీ బాల్ ఫైనల్ పోటీలు నిర్వహించనున్నామన్నారు. విజేతలతో పాటు గ్రామాల నుండి పాల్గొన్న వాలీ బాల్ జట్లకు వాలీ బాల్ కిట్లను పంపిణీ చేయనున్నామని ఫకీరప్ప కార్నెల్లి తెలిపారు. ఈ కార్యక్రమంతో పాటు డయల్ యువర్ ఎ.ఎస్.పి.కార్యక్రమాన్ని సైతం ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఫిర్యాదులను, సమస్యలను 9440904232 నెంబర్‌కు ఏ సమయంలోనైనా నేరుగా తనకే ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. సమాజంలో ఎటువంటి సమస్యలు తలెత్తినా, ఆకతాయిల వేదింపులు, సమాజంలో సంఘ విద్రోహక శక్తుల సమస్యలు, కళాశాలల్లో ర్యాగింగ్‌తో పాటు పోలీసుల సహాయం కావలసినప్పుడు ఎటువంటి సంకోచం లేకుండ తననే నేరుగా సంప్రదించి సమస్యను పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలన్నారు. తన నెంబర్ నిరంతరం అందుబాటులో ఉంటుందని, ఏ సమయంలోనైనా తనను సంప్రదించేందుకు సంశయించరాదని ఫకీరప్ప చెప్పారు.

వైద్య శిబిరాల ద్వారా మెరుగైన వైద్యం పొందాలి
* ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి వినయ్ చంద్
పాడేరు, డిసెంబర్ 24: ఉచిత వైద్య శిభిరాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపరచుకోవాలని గిరిజనులకు పాడేరు ఐ.టి.డి.ఎ.ప్రాజెక్టు అధికారి వినయ్ చంద్ సూచించారు. మంగళవారం ఆయన విలేఖర

* శిక్షణల ద్వారా రైతులకు అవగాహన * మంత్రి టిజి వెంకటేష్
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>