
మీ శరీరానికి అవసరమైనంత కేలరీలను అందించగల ఆహారాన్ని తీసుకుంటున్నారా? ఈ విషయంలో ఎవరూ సరిగా సమాధానం చెప్పలేరు. ఒక వ్యక్తి రోజుకు ఇన్ని కేలరీల ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. కానీ ఇలా కేలరీలను లెక్కించి తినగలిగేంత సమయం అవకాశం ఎవరికీ ఉండదు. అలా కాకుండా అసలు మనం ఏం తింటున్నాము. అందులో ఏవైనా తినగూడని పదార్థాలున్నాయా.. మనం తినే ఆహారం నుండి ఎంత మేర శక్తి, కేలరీలు మనకు లభిస్తాయి? వంటి వివరాలను మనకు అందించేందుకు ఒక కొత్తరకం పరికరం రానుంది. ఈ పరికరాన్ని ఇలా ఆహారంపై తిప్పితే చాలట. అది మనం తినే ఆహారంలో ఉండే క్యాలరీలను, అలాగే అందులో మనకు అలర్జీని కలిగించే కారకాలు ఏవైనా ఉంటే వాటి గురించి, ఒకవేళ పొరపాటున అందులో పురుగు మందు అవశేషాలుంటే వాటి గురించి మనకు ఇట్టే చెప్పేస్తుందట.
టోరంటోకు చెందిన పరిశోధకులు ఒక కొత్తరకం స్కానర్‌ను తయారుచేశారు. ఈ స్కానర్ పేరు టెల్‌స్పెక్. బుల్లి వౌస్‌లాంటి ఈ స్కానర్‌ను మన ఆహారం పళ్లెంపై పెట్టి అలా తిప్పితే చాలు మన పళ్ళెంలోని ఆహారం చక్కగా స్కానింగ్ అయిపోతుంది. ఈ పరికరం నుండి తక్కువ శక్తిగల లేజర్ ఆహారంపై పడుతుంది. లేజర్ పడగానే ప్రతిబింబించే కాంతి తరంగాలను ఇది రామన్ సెక్ట్రోమీటర్ సాయంతో పసిగడుతుంది. ఈ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఉండే డేటాబేస్‌కు పంపిస్తుంది. దీంతో అక్కడ విశే్లషణ పూర్తయి దానికి సంబంధించిన వివరాలను ఒక అప్లికేషన్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్‌కు అందుతాయి.ఈ స్కానర్‌తో మన ఆహార పదార్థాలను 97.7శాతం కచ్చితత్వంతో స్కాన్ చేయవచ్చట. ఇప్పటివరకు దాదాపు మూడువేల ర కాల ఆహార పదార్థాలను స్కాన్ చేసేలాగా డేటాబేస్‌ను రూపొందించామని, ఇది దాదాపుగా అన్ని రకాల ఆహార పదార్థాలను స్కాన్ చేయగలదని దీ న్ని తయారుచేసిన ఇసాబెల్ హాఫ్‌మన్, స్టీఫెన్ వాట్సన్‌లు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. *