Date:
Thursday, January 9, 2014 - 04
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక ఇబ్బందుల నెదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశముంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. వృత్తిరీత్య్లా అప్రమత్తంగా నుండుట అవసరం.
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.)
ఆరోగ్యం గూర్చి జాగ్రత్తపడుట మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. కుటుంబ కలహాలకు దూరంగా వుంటే మేలు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.)
నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశముంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా నుండుట మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చినచో అనారోగ్య బాధలుండవు.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.)
పిల్లలవల్ల ఇబ్బందులనెదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశే్లష)
ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభమేర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా వుంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఋణబాధలు తొలగిపోతాయి.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కుటుంబమంతా సంతోషంగానుంటారు. సంపూర్ణ ఆరోగ్యమేర్పడుతుంది. స్థిర నివాసముంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.)
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. అజీర్ణ బాధలు అధికమవుతాయి. కీళ్ళనొప్పుల బాధ నుండి రక్షించుకోవడం అవసరం.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.)
వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. కుటుంబ విషయాలందు అనాసక్తితో వుంటారు. స్ర్తిలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.్ధర్మిక కార్యాలు చేస్తుంటారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,)
దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నుంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.)
క్రొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసికానందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. క్రొత్త సమస్యలు రావచ్చు.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గూర్చి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులెదురవుతాయి.
దుర్ముహూర్తం:
ఉ.10.00 నుండి 10.48 వరకు తిరిగి మ.02.48 నుండి 03.36 వరకు
రాహు కాలం:
.............
వర్జ్యం:
రా.09.52 నుండి 11.31 వరకు
నక్షత్రం:
అశ్విని రా.1.52
తిథి:
శుద్ధ నవమి రా.1.38
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరతాయి. స్ర్తిలతో జాగ్రత్తగా నుండుట మంచిది.