తుని, మార్చి 14: కుమ్మరిలోవలోని తాండవ నది సమీపంలో గల తపోవనాన్ని కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి బుధవారం సందర్శించారు. అన్నవరం సత్యదేవుని నూతన ఆలయాన్ని ప్రారంభించిన జయేంద్ర సరస్వతి తపోవన పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ ఆహ్వనం మేరకు ఇక్కడకు విచ్చేసారు. జయేంద్ర సరస్వతికి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ శిష్య బృందం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయనకు పాదాభివందనం చేసేందుకు భక్తులు ఎగబడ్డారు. తపోవనంలో సచ్చిదానంద సరస్వతి, ఆయన శిష్య బృందం పాదపూజలు నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులను, ఠాగూర్ సంస్థ విద్యార్థులను జయేంద్ర సరస్వతి ఆశీర్వదించారు. అనంతరం తపోవనం ప్రాంగణంలో గల వేద పాఠశాలను, నిర్మాణంలోగల దేవాలయాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో విశ్వనాధ గోపాలకృష్ణ, చంద్రాభట్ల చింతామణి గణపతిశాస్ర్తీ, వి మూర్తి, మున్సిపల్ కమిషనర్ యు శారదాదేవి, కెజె శర్మ, ఎంబి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
తపోవనాన్ని సందర్శించిన జయేంద్ర సరస్వతి
english title:
d
Date:
Thursday, March 15, 2012