పిఠాపురం, మార్చి 14: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి రామచంద్రయ్యకు బుధవారం పిఠాపురంలో ఘనస్వాగతం లభించింది. జిల్లా పర్యటన సందర్భంగా ఆయన పిఠాపురం విచ్చేసి, స్థానికంగాగల శ్రీరుక్మిణీ సమేత వేణుగోపాలస్వామి ఆలయ పునర్మిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి దంపతులకు ఎమ్మెల్యే వంగా గీత, ఇఒ పెండ్యాల వెంకటచలపతిరావు, కాకినాడ దేవాదాయశాఖాధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అన్నవరం దేవస్థానం సమకూర్చిన 10 లక్షలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి మంజూరైన 5 లక్షలతో ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నట్టు ఆలయ ఛైర్మన్ బాలిపల్లి రాంబాబు తెలిపారు.
కొప్పనకు పరామర్శ
తొలుత మంత్రి రామచంద్రయ్య ఇటీవల హైదరాబాద్‌లో హృద్రోగ సమస్యతో బాధపడి తిరిగి రెండురోజుల క్రితమే పిఠాపురానికి వచ్చిన మాజీ మంత్రి కొప్పన మోహనరావును పరామర్శించారు. ఈసందర్భంగా కొప్పన ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాదగయ క్షేత్రానికి వెళ్లాల్సి ఉండగా హఠాత్తుగా పర్యటనను వాయిదా వేసుకున్నారు. మంత్రి వస్తున్నారన్న సమాచారం మేరకు పాదగయ ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. చివరకు మంత్రి పర్యటన వాయిదా పడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు బసవయ్యరాజు శ్రీనివాస్, జంగా గౌతమ్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఉమామల్లేశ్వరరావు, వర్ధినీడి సుజాత, దత్తుడు, చవ్వాకుల సుబ్బారాయుడు, మేడిద శ్రీనివాసరావు, జి సత్యనారాయణ, ఎస్‌కె యాసిన్, పద్మరాజు, దేవాదాయశాఖ ఎస్‌ఇ వేణుగోపాల్, ఇఇ ఇ ప్రకాశరెడ్డి, డిఇ ఎస్ శ్రీనివాస్, జెఇ దుర్గేష్‌కుమార్, ఆలయ ఇన్‌స్పెక్టర్ వివి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు మంత్రి రామచంద్రయ్య శంకుస్థాపన
english title:
s
Date:
Thursday, March 15, 2012