పెద్ద హీరోల చిత్రాలు అటో ఇటో అయిపోయాయి. చూసేవాళ్లు చూస్తున్నారు, చూడనివాళ్లు చూద్దామా అని ఆలోచిస్తుండడంతో, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సినిమాలపై అంత శ్రద్ధ పెట్టకపోవడంతో బాక్సాఫీస్ వెలవెలపోతోంది. ఏది ఎలా వున్నా వారం వారం సినిమాలు మాత్రం విడుదలవుతూనే వున్నాయి, ప్రేక్షకుల తీర్పుకోసం. ఈ వారం షార్ట్ఫిలింస్‌తో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న రామ్ భీమాన రూపొందించిన ‘హమ్ తుమ్’ విడుదలైంది. మంచి దర్శకుడిగా నిరూపించుకున్న రాజా వనె్నంరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ డాట్ కామ్’ కూడా విడుదలైంది. తమిళం నుండి తెలుగులోకి అనువదించబడిన ‘ట్రాఫిక్’ చిత్రం కూడా వచ్చింది. ఈ మూడు చిత్రాల్లో తెలుగు చిత్రాలైన ‘హమ్ తుమ్’, ‘లవ్ డాట్ కామ్’ బిలో యావరేజ్‌కన్నా కిందకి పడిపోయాయి. ఈ రెండు చిత్రాల్లో సరైన కథా, కథనాలు లేక బాక్సాఫీస్ కళ తప్పింది. డబ్బింగ్ రూపంలో వచ్చిన రాధిక, శరత్‌కుమార్‌ల ‘ట్రాఫిక్’ ప్రేక్షకుణ్ణి ఆలోచింపచేస్తూ ఓ మంచి చిత్రంగా టాక్‌ను సొంతం చేసుకుంది.
పెద్ద హీరోల చిత్రాలు అటో ఇటో అయిపోయాయి.
english title:
trade talk
Date:
Friday, February 21, 2014