
మీనా అంటే తెలుగులో ఒకప్పుడు టాప్‌స్టార్. ఇప్పుడు పెళ్లయ, ఓ బిడ్డకు తల్లయ్యాక కెరీర్ డౌన్‌ఫాల్ అనుకున్న సమయంలో ఆమె నటించిన మలయాళ చిత్రం సూపర్‌హిట్ అయింది. ఈ ఒక్క చిత్రంతో మీనా మళ్లీ లైమ్‌లైట్‌లోకొచ్చింది. మోహన్‌లాల్‌తో జంటగా నటించిన ఆ చిత్రంలో ఉత్తమశ్రేణి గృహిణిగా ఆమె నటనను ఇతర భాషా కథానాయకులందరూ ఇష్టపడ్డారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేయనున్నారు. తమిళంలో కమలహాసన్ కథానాయకుడు కాగా, హిందీలో అజయ్ దేవ్‌గన్ నటిస్తున్నారు. తెలుగులో వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో మీనా కూడా నటించనుందని సమాచారం. అయితే ఈ విషయంపై మీనాను సంప్రదిస్తే ‘దృశ్యం’ చిత్రం తరువాత తన పాత్రలు అదృశ్యమయ్యాయి అంటోంది. ప్రస్తుతం వచ్చిన స్టార్‌డమ్‌తో అనేకమంది తనను సంప్రదిస్తున్నారు కానీ, ఏదీ నిర్ణయం కాలేదని అంటోంది. ఇంతవరకూ తననెవరూ కాల్షీట్స్ ఇవ్వమని అడగలేదని, కొత్త చిత్రం ఏదీ తాను ఇంతవరకూ ఒప్పుకోలేదని చెబుతోంది. మీడియా అంతా ‘దృశ్యం’ రీమేక్స్‌లో కథానాయికగా మీనా అనే ప్రచారం చేస్తుంటే, ఈ ముదురు భామ మాత్రం తనకేమీ తెలియదంటోంది. ఎందుకలా అంటుందో ఏమో మరి! ఆరా తీస్తే విషయం తెలుస్తుంది మరి!! ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి అని అందరూ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఈర్ష్యపడతారని ముందుచూపో ఏమో!!?