మె గ్నీషియంకి, జ్ఞాపకశక్తికి దగ్గర సంబంధం ఉంది.మెగ్నీషియం తగ్గితే జ్ఞాపకశక్తి తగ్గుతుంది. వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి బాగా ఉండాలంటే యవ్వనంలో మెగ్నీషియం గల ఆహార పదార్థాలని అధికంగా తీసుకోవాలి. ఇందువల్ల అల్జిమర్స్ వ్యాధిని నివారించవచ్చు.
..........................
స్ఫూర్తి...
అమెరికాలో వేటగాళ్ళు తమ వెంట వేటకి శిక్షణపొందిన హోండ్స్ (వేటకుక్కలు)ని తీసుకెళ్తారు. వేట సీజన్ అయిపోగానే చాలామంది వాటిని అడవుల్లో వదిలేసి వెళ్లిపోతారు. సౌత్ కరోలినాకు చెందిన ట్రేసీ మించుకు ఓ రోజు కార్లో వెళ్తూంటే అలాటి ఓ కుక్కని రోడ్డుమీద చూసింది. వాటి దుర్గతి గురించి తెలుసుకున్న ట్రేసీ కనపడ్డ కొన్నిటిని తన కార్లో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్ళింది. వాటి మెళ్ళోని లైసెన్స్ బిళ్ళలని బట్టి వాటి యజమానులని కాంటాక్ట్ చేస్తే వారు వాటిని వెనక్కి తీసుకునేందుకు నిరాకరించారు. ట్రేసీ హోల్ ఫుడ్స్ మార్కెట్ బయట వాటితో కూర్చుంటుంది. ఆ స్టోర్ వారు ఆ కుక్కలకి ఉచితంగా ఆహారాన్ని ఇస్తారు. దయగలవారు వాటిని పెంచుకోడానికి తీసుకెళ్ళడమో, లేదా వాటి వైద్యానికి డబ్బివ్వడమో చేస్తూంటారు. తన తీరిక వేళల్లో ఈ సేవను చేస్తున్న ట్రేసీ ఆ కుక్కల కోసం తన స్వంత డబ్బు 5 వేలడార్లని కూడా ఖర్చుచేసింది.
........................................
డైవర్స్
పెళ్లిళ్లు స్వర్గంలో. విడాకులు భూమీద. అయితే ఎవరూ తాము విడాకులు తీసుకోవాల్సి వస్తుందని పెళ్లి సమయంలో అనుకోరు. కొన్ని వింత కారణాల వల్ల కొందరు దంపతులు విడాకులు తీసుకుంటుంటారు.
..........................
ఫేస్‌బుక్ చాలా విడాకులకు దారితీస్తోంది. నైల్ బ్రాడీ అనే అతను ‘తన వివాహం ఎమ్మా బ్రాడీతో అంతమైంది’ అని తన ఫేస్‌బుక్‌లో అప్‌డేట్ చేసుకున్నాడు. ఈ సంగతి తెలిసిన ఎమ్మా భర్తని ఈవిషయం మీద నిలదీసింది. అతను ఆమె మీద కోపంగా అరిచి, ఇంటి వెనక్కి తోసి, వెనక ఉన్న గార్డెన్‌లో ఆమెని బంధించాడు. ఆమెకి ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని నింద కూడా మోపాడు. వెంటనే పక్కింటివారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి విడిపించారు. ఈ కేసు కోర్టుకి వెళ్తే, అతను తన భార్యకి అపరాధ రుసుమును చెల్లించాల్సి వచ్చింది. ఆరు సంవత్సరాల వారి వైవాహిక జీవితం ఆ విధంగా విడాకులతో భగ్నమైంది.
......................
బారతీయ వంటల అడ్డా. ఇందులో మీ వంటల్ని పోస్ట్ చేయచ్చు కూడా.
www.INDIANFOOD FOREVER.COM