శ్యామ్‌సంగ్ తన నోట్ అయిదు అంగుళాల మొబైల్ కమ్ మినీ టాబ్లెట్ బ్రాండ్ నేమ్‌తో కొత్త టాబ్లెట్ ఒకదాన్ని తెస్తోంది. 10.1 అంగుళాల ఈ టాబ్లెట్ ఒక విధంగా ఇప్పటికే మార్కెట్‌లో వున్న శ్యామ్‌సంగ్ గెలాక్సీ టాబ్‌కు స్పెషల్ ఎడిషన్ అనుకోవచ్చు. గెలాక్సీ టాబ్ కన్నా కాస్త తక్కువ మందంతో, పవర్‌ఫుల్ చిప్‌సెట్‌తో ఇది కాస్త ఆకర్షణీయంగానే వుండొచ్చు. పైగా దీనికి గతంలో టచ్‌స్క్రీన్ ఫోన్‌లకు స్టైలెస్‌లు ఇచ్చిన మాదిరిగా, ఎస్ పెన్ అనే పరికరాన్ని అందిస్తున్నారు. టాబ్లెట్‌ను కాన్వాస్‌లా మార్చుకుని బొమ్మలు చిత్రించడం వగైరా పనులు చక్కబెట్టుకోవచ్చు. 1.4 గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 3.2 అంగుళాల ఆటోఫోకస్ కెమేరా, 1080 పిక్సల్ హెచ్‌డీ విడియో రికార్డింగ్, 2 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమేరా దీని బేసిక్ హార్డ్‌వేర్ స్పెషిఫికేషన్లు. అండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శ్యాండ్‌విచ్ ఓఎస్ వుంటుంది.
.........................
హెచ్‌పీ ఎన్వీ15
బ్యాక్‌లిట్ కీబోర్డు, అదీ ప్రతి బటన్ వెనకు ఓ ఎల్‌ఇడీ, ఆరు పవర్‌ఫుల్ బిల్టిన్ స్పీకర్లు, బీట్స్ అడియో ఎక్స్‌క్లూజివ్ టెక్నాలజీ, క్లాసిక్ బ్లాక్, సిల్వర్ ఫినిష్, ఇలా ఇటు సాంకేతికంగా, అటు సుందరంగా తీర్చిదిద్దిన నోట్‌బుక్ హెచ్‌పీ నుంచి వచ్చింది.
.............................................
ఎఓసి హాండీ ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లే
ఏఓసీ సంస్థ అతి తేలికైన, తక్కువ మందం కలిగిన, 15.6 అంగుళాల ఎల్‌ఇడీ మోనిటర్‌ను ఇండియా మార్కెట్‌లోకి తెస్తోంది. పైగా ఇది యుఎస్‌బీ పవర్డ్ మోనిటర్ కావడం విశేషం. ఇ 1649 ఎఫ్‌డబ్ల్యుయు అనే ఈ మోడల్ మోనిటర్ అద్భుతమైన పిక్చర్ క్లారిటీని అందిస్తుంది. దీనికి అమర్చిన ఫ్లెక్స్‌బుల్ స్టాండ్ సదుపాయంతో మోనిటర్‌ను ఎటు, ఎలా కావాలంటే, అలా తిప్పుకోవచ్చు. ఇటు హారిజాంటల్‌గా, అటు వెర్టికల్‌గా కూడా అమర్చుకోగలగడం ఈ మోనిటర్ ప్రత్యేకత. దీని ధర అయిదువేల దగ్గరలో వుంటుంది.