వెంకటేశ్వర్రావు ఓసారి చేపలమ్మే దుకాణానికి వెళ్లాడు. చేపలో ఏ భాగం మాంచి రుచిగా వుంటుందని అడిగాడు. దానికి షాప్ వాడు ‘తల భాగం తీసుకోండి. రుచిగా వుండడమే కాదు, దానిని తినడం వల్ల మీ తెలివి కూడా పెరుగుతుంది’ అన్నాడు.
‘నిజమా?’ అన్నాడు వెంకటేశ్వర్రావు.
‘కావాలంటే మీరే ట్రయ్ చేయండి’ బదులిచ్చాడు షాప్‌వాడు.
సరే అని రెండు తలకాయలు కొని తిన్నాడు. నచ్చాయి. వారానికి రెండు మూడు సార్లు కొని తినడం ప్రారంభించాడు.
ఆఖరికి ఓ రోజు దుకాణానికి వచ్చి.
‘చేప మొత్తం మూడు రూపాయలైతే, తలకాయ ఒక్కటీ నాలుగు రూపాయిలకు అమ్ముతున్నావేం. మూడు రూపాయిలు పెట్టి చేప కొంటే, తల కూడా వస్తుందిగా’ అన్నాడు వెంకటేశ్వర్రావు.
‘చూసారా.. నే చెప్పలా.. చేప తలకాయ తినడం వల్ల మీ తెలివి పెరుగుతుందని’ బదులిచ్చాడు షాప్‌వాడు.
............................................................................
హామీ పత్రం
రచయిత కుమారస్వామి కొడుకు పరీక్ష రాసి, జవాబు పత్రం టీచరుకు ఇచ్చాడు.
అందులో మొదటిపేజీపై ఇలా వుంది.
‘ఈ జవాబులన్నీ నా స్వంతం, ఎక్కడా చూసి కానీ, చదివికానీ రాసినవి కావు, ఏ పుస్తకంలోంచీ తీసుకున్నవి కావు’
..................................................................................................................
మాట్లాడే వాచీ
ఫుల్లుగా మందు కొట్టాక, తన ఫ్రెండ్స్ ముగ్గుర్నీ తీసుకుని అర్ధరాత్రి వేళ తన కొత్త ఇల్లు చూపిస్తానని తీసుకువచ్చాడు వెంకటేశ్వర్రావు.
తన దగ్గర వున్న డూప్లికేట్ తాళంతో డోర్ తెరిచి లోపలకు వెళ్లాడు. పెద్ద అరుపు, ఏదో పడిన చప్పుడు వినిపించింది.
‘ఏమిటది’ అడిగారు మిత్రబృందం
‘ఏమీలేదు. మాట్లాడే వాచ్’అన్నాడు వెంకటేశ్వర్రావు.
‘నిజమా..చూపించు, ఇప్పుడు టైమ్ ఎంతయిందో చెప్పమను’ కోరస్‌గా అన్నారు తాగుబృందం.
‘వన్ మినిట్ ఇక్కడే వుండండి’ అని బెడ్‌రూమ్‌లోకి వెళ్లి, మంచం నిండుగా ముసుగు కప్పి, పడుకున్న భార్యపై చేయి వేసాడు.
‘యూ..ఇడియట్.. నౌ టైమ్ ఈజ్ టెల్వ్ థర్టీ’ అన్న సౌండ్ గట్టిగా వచ్చింది.
బయటకు వచ్చి వెంకటేశ్వర్రావు అన్నాడు
‘విన్నారా..’ అని.
........................................................................................................
బివేర్ ఆఫ్ లాబ్స్
ఫిజిక్స్ లాబ్‌లో దేన్నీ చూడకు
కెమీస్ట్రీ లాబ్‌లో దేన్నీ రుచి చూడకు
బయోలజీ లాబ్‌లో ఏ వాసనా పీల్చకు
మెడికల్ లాబ్‌లో దేన్నీ ముట్టుకోకు
అన్నింటికీ మించి
ఫిలాసఫీ క్లాసులో ఏదీ వినకు