Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మిరపకాయలు, పచ్చిమిర్చి

$
0
0

భారతీయత, భారతీయ వంటకాలు వీటి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎవరికైనా గుర్తుకు వచ్చేది మిరప, పచ్చిమిర్చి, పండు మిర్చి ఇవి రెండూ భారతీయ వంటకాల్లో కీలక స్థానం పోషిస్తాయి.
నాలుగు వందల ఏళ్ల క్రితం భారతీయులకి మిరప తెలియదు. ఆ రోజుల్లో కారం రుచి కోసం మిరియాల మీదనే ఆధారపడేవాళ్లు. పొడవుగా, మెలికలు తిరిగి వాడిగా కనిపించే మిరపను చూసి, తేలులాగా కుడుతుందని భావించేవారు. పోర్చుగీసు వారు భారతదేశానికి మిరపను పరిచయం చేశారు. తరువాత కాలంలో ఇది భారతీయ సంస్కృతిలో ఇమిడిపోయింది.
మిరపలోని గుణాలను బట్టి ఆయుర్వేదం దీనిని కటువీర, రక్తమిర్చి, పిత్తకారిణి, లంక తదితర పేర్లతో వ్యవహరిస్తుంది. మిరప చెట్టులో అనేక రకాలున్నాయి. ముఖ్యంగా తెల్లపువ్వులు కలిగిన మొక్క మొదటిరకం. దీనిలో తీక్షణత ఎక్కువ. ఆకుపచ్చని పువ్వులు కలిగినది రెండవ రకం. దీనిలో తీక్షణత తక్కువ.
మిరప పండ్లు, కాయల్లో చాలా తేడాలున్నాయి. ఆకారాన్నిబట్టి, ఆకృతిని బట్టి, రంగును బట్టి, రుచిలో తీక్షణతను బట్టి మిరపకాయలు, పండ్లు రకరకాలుగా లభిస్తున్నాయి. అవసరాన్నిబట్టి వీటిని వాడుతుంటారు.
మిరపలో ‘క్యాప్పైసిన్’ అనే పదార్థం తాలూకు మొత్తాన్నిబట్టి దీని తీక్షణత ఆధారపడి ఉంటుంది. మిరపలోని ఘాటుదనం లాలాజలాన్ని ప్రేరేపిస్తుంది. లాలాజలంలో పిండి పదార్థాలను పచనం చెందిందే సెలైవరీ ఎమైలేజ్ ఉంటుంది. ఈ కారణంగానే భక్ష్యాలను వండేటప్పుడు మిరపను తగలనిస్తే, అవి చక్కగా జీర్ణమవుతాయి. మిరపలో విటమిన్-ఎ, విటమిన్-సి తదితర పదార్థాలుంటాయి. ఇవి ఆరోగ్యానికి హితం చేస్తాయి. మిరప శరీరంలో పేరుకుపోయిన విష తత్వాలను నిర్వీర్యపరుస్తుంది. ముఖ్యంగా పెద్ద పేగులో సంచితమైన హానికర విష రసాయనాలను శుభ్రం చేస్తుంది. అలాగే మిరప రక్తశోధకంగా కూడా పని చేస్తుంది. మద్రాస్‌కి చెందిన కేన్సర్ రీసెర్చ ఇన్‌స్టిట్యూట్ పచ్చిమిర్చిలో కేన్సర్‌ను నిరోధించే అంశాలు పుష్కలంగా ఉన్నట్లు ధృవీకరించింది.
గృహ చికిత్సలు
గొంతు బొంగురు (స్వర భంగం)
ఒక టీ స్పూన్ పంచదారను, ఒకటి రెండు బాదం గింజలను, ఒక పండు మిరపకాయను కలిపి దంచండి. దీనిని చిన్నచిన్న ఉండలుగా తయారుచేసి తీసుకుంటే గాయకులకు, ఉపన్యాసకులకు, టీచర్లకు, లెక్చరర్లకి గొంతు బొంగురు సమస్య తగ్గుతుంది.
కడుపు నొప్పి
100 గ్రాముల బెల్లంలో ఒక గ్రాము ఎర్ర మిరప పొడిని కలిపి చిన్నచిన్న మాత్రలుగా తయారుచేసి నీళ్లతో తీసుకుంటే కడుపునొప్పి తగ్గుతుంది.
అర గ్రాము ఎండు మిరప పొడిని 2 గ్రాముల శొంఠి చూర్ణంతో కలిపి తీసుకుంటే అజీర్ణం, కడుపునొప్పి తగ్గుతాయి.
అరుచి
125 గ్రాముల మిరపగింజలను అర కిలో నువ్వుల నూనెలో వేసి చిన్న మంట మీద గింజలు మాడిపోయే వరకూ వేడి చేయండి. తరువాత వడపోసి సీసాలో నిల్వ చేసుకోండి. మిరప గింజల తైలం సిద్ధమవుతుంది. శరీరంలో వేడి పెరిగిపోవటం, పైత్యం పెరగటం వంటి సమస్యల వల్ల ఆహార పదార్థాల రుచి తెలియకపోతుంటే, ఆకలి తగ్గితే, ఈ మిరప గింజల తైలాన్ని 5 నుంచి 30 చుక్కలు ఒక టీస్పూన్ పంచదారతో కలిపి తీసుకోండి. దీంతో ఆకలి పెరుగుతుంది.
కలరా (వాంతులు, విరేచనాలు)
మిరప గింజలను చెరిగి శుభ్రం చేసి, మెత్తగా పొడిచేసి గుడ్డతో వస్తగ్రాళితం చేయండి. దీనిని ఒక చిటికెడు తీసుకొని చిటికెడు కర్పూరం, చిటికెడు పొంగించిన ఇంగువ పొడిని కలిపి, తగినంత తేనె కలిపి తీసుకోండి. లేదా వీటి మిశ్రమాన్ని 125 మిల్లీగ్రాముల మాత్రలుగా చేసి నిల్వ చేసుకొని ప్రతి రెండు గంటలకూ ఒక్కోటి చొప్పున నీళ్లతో వేసుకుంటే కలరా వ్యాధిలో నాడి తగ్గిన సందర్భాల్లో నాడి వేగం పెరుగుతుంది.
నల్ల మందు, పొంగించిన ఇంగువ వీటిని సమంగా కలిపి 125 మి.గ్రా. మాత్రలుగా చేయండి. దీనిని మిరప కషాయంతో తీసుకుంటే కలరా వ్యాధి తగ్గుతుంది.
125 గ్రాముల మిరపకాయలను అర కిలో నువ్వుల నూనెలో వేసి చిన్న మంట మీద గింజలు మాడిపోయే వరకూ వేడి చేయండి. తరువాత దించి వడపోసి నిల్వ చేసుకోండి. మిరప తైలం సిద్ధం. కలరాలో విరేచనాలు, వాంతుల తరువాత ఈ తైలాన్ని పూటకు అర టీస్పూన్ మోతాదుగా రెండు మూడు పూటలు వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఎండు మిరపకాయల పొడిని తేనెతో కలిపి రేగు గింజలంత మాత్రలుగా తయారుచేసి పెట్టుకోండి. కలరా వ్యాధిగ్రస్థునికి గంటకో మాత్ర చొప్పున చన్నీళ్లతో ఇస్తే ప్రమాదం నుంచి బయటపడతాడు.
ప్రమేహం, మధుమేహం
మిరియం తైలాన్ని రెండు మూడు చుక్కలు లస్సీతోకలిపి తీసుకుంటే మూత్రంలో మంట, మూత్రంలో సుద్ద పోవటం వంటి సమస్యలు తగ్గుతాయి.
మూత్రంలో మంట
3 గ్రాముల ఈసబ్‌గోల్ గింజల పొడిని మూడు నాలుగు చుక్కలు మిరప తైలంతో కలపండి. దీనిని నీళ్లకు కలిపి కషాయం తయారుచేసి తీసుకుంటే పైత్యం కారణంగా వచ్చిన మూత్రంలో మంట తగ్గుతుంది.
ఎగ్జిమా, దురద, కీళ్లనొప్పి, కుక్కకాటు, కందిరీగ కాటు వంటి సమస్యల్లో మిరప పండ్ల తైలాన్ని పై పూతగా వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
*

వెంకటరెడ్డి (విశాఖపట్నం)
ప్రశ్న: నా వయసు 35. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాను. గత రెండేళ్లుగా మెడ నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్లు ఎం.ఆర్.ఐ. తీయించి సర్వైకల్ స్పాండిలోసిస్ అని తేల్చారు. అప్పటి నుంచి రకరకాల మందులు వాడాను. అయినప్పటికీ నొప్పి తగ్గలేదు. ఆయుర్వేదంలో దీనికి శాశ్వత చికిత్స ఉందా? పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఇక నేను ఉద్యోగాన్ని కొనసాగించలేనని అర్థమవుతోంది. కారు నడిపినా, అరగంట పాటు కూర్చున్నా మెడనొప్పి, వెన్ను నొప్పి వచ్చేస్తున్నాయి.
జ: ఈ మధ్యకాలంలో ఐటి ప్రొఫెషనల్స్‌లో కనిపిస్తున్న సమస్య ఇది. ఎక్కువ గంటలపాటు కూర్చొని పని చేయటం, కంప్యూటర్ల మీద, కీ బోర్డుల మీద విసుగూ, విరామం లేకుండా, ఎడతెరిపి లేకుండా శ్రమించటం, బరువైన ల్యాప్‌టాప్‌లని భుజానికి తగిలించుకొని తిరుగుతుండటం, సెల్‌ఫోన్లను మెడకు, భుజానికి మధ్య ఇరికించుకొని మాట్లాడుతూ పని చేయటం వీటన్నిటి కారణంగా వెన్నునొప్పి వస్తుంది. బాగా ఎత్తుగా ఉండే దిండ్లను వాడకండి. అలాగే బాగా బరువుగా వుండే హెల్మెట్లు వాడకండి. సాధ్యమైనంత వరకు ద్విచక్ర వాహనాలను ఉపయోగించకండి. ఆయుర్వేదంతో ఈ సమస్యను తగ్గించే సమర్థవంతమైన ఔషధాలు చాలా ఉన్నాయి. మహాయోగరాజ గుగ్గులు, మహా రాస్నాది క్వాథం, మహా నారాయణ తైలం వంటి ఔషధాల్లో మీ తత్వానికి సరిపోయే వాటిని ఒక క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ ఫిజీషియన్‌ని కలిసి వాడుకోండి.
*

ఇంటి వైద్యం
english title: 
m
author: 
- డా. చిరుమామిళ్ల మురళీమనోహర్

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>