Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కొత్తగా ‘పుస్తక్’!

$
0
0

కొత్త తరాలన్నీ -పుస్తకాల సంస్కృతి నుంచి ఈ-బుక్ వినియోగ సంస్కృతికి అలవాటుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో -ప్రాథమికోన్నత విద్యార్థుల అభ్యాసనకు వీలుగా మార్కెట్‌కు వచ్చిన సరికొత్త టాబ్లెట్ -పుస్తక్. పుస్తకానికి ప్రత్యామ్నాయంగా సిబిఎస్‌ఇ, స్టేట్‌బోర్డు సిలబస్ చదువుతున్న 7వ తరగతి విద్యార్థుల కోసం అందుబాటులోకి వచ్చిన సరికొత్త సాంకేతిక పరికరం ఇది. ముఖ్యంగా -‘ముద్రణా పుస్తకాలతో పాఠాలు నేర్చుకునే దశను ఈ-కాలం పిల్లలు ఎప్పుడో దాటిపోయారు. సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్ని మల్టీమీడియా యానిమేషన్ ప్రోగ్రామ్‌తో పిల్లలకు నేర్పించే ముఖ్య ఉద్దేశంతోనే దీనికి రూపకల్పన చేశాం’ అంటున్నాడు నానొటెల్ టెక్నాలజీ గ్లోబల్ సిఇవో ప్రణయ్ మిశ్రా. ఈ టాబ్లెట్స్ 7వేల రూపాయల నుంచి 14వేల రూపాయల మధ్యలో దొరుకుతున్నాయి.

మైక్రోమాక్స్ ఫన్‌బుక్ ప్రో:
ఫన్‌బుక్ టాబ్లెట్ కంటిన్యుటీ వర్షన్ -్ఫన్‌బుక్ ప్రో. స్నాప్‌డీల్ ద్వారా ఆన్‌లైన్ మార్కెట్‌లో దొరుకుతున్న దీని ధర -9999. కొద్దిరోజుల క్రితమే ఆన్‌లైన్ మార్కెట్‌కు వచ్చినా, 10.1 అంగుళాల ఫన్‌బుక్ ప్రో కోసం కుప్పలు తెప్పలుగా ఆర్డర్లు వస్తున్నట్టు స్నాప్‌డీల్ చెప్తోంది. ఆండ్రాయిడ్ 4.0 (ఐస్‌క్రీం శాండ్‌విచ్), 7 అంగుళాల టచ్ స్క్రీన్, 1024 ఇంటూ 600 పిక్చర్ రిజల్యూషన్, ముందుభాగంగా విజిఎ కెమెరా, 1.2జిహెచ్‌జెడ్ ప్రాసెసర్, 1జిబి రామ్, 8జిబి ఇంటర్నల్ స్టోరేజ్, విఫి, యుఎస్‌బి ద్వారా 3జి డాంగల్ సపోర్టు, కార్టెక్స్-ఎ8 డిస్‌ప్లే, 5600 ఎంఎహెచ్ బ్యాటరీ దీని ఫీచర్లు. మైక్రో ఎస్‌డి కార్డు సాయంతో 3జిబి వరకూ దీని నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. స్లేట్ గ్రే రంగు ఫినిషింగ్‌తోవున్న మైక్రోమాక్స్ ఫన్‌బుక్ ప్రో కొనుగోలు చేసిన వారికి ఆన్‌లైన్ ఆఫర్‌గా టాటా డొకొమో మరియు డాటా కార్డును స్నాప్‌డీల్ అందిస్తోంది.

శామ్‌సంగ్ ఆమ్నియా-ఎం
ఆమ్నియా -ఎం పేరిట విండోస్ 7.5 ఆధారిత స్మార్ట్ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్‌కు తీసుకొచ్చింది శామ్‌సంగ్. ఆన్‌లైన్ మార్కెట్‌లో భాగంగా వారం క్రితం నుంచీ అన్ని వెబ్‌సైట్లలోకి అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ఫోన్ ధర -16,400. 1జిహెడ్జ్ సిపియు, 384 ఎంబి రామ్, 4జిబి అంతర్గత నిల్వ సామర్థ్యం, సూపర్ అమోలెడ్ స్క్రీన్, వెనుకవైపు 5ఎం లెడ్ ఫ్లాష్ కెమెరా, చాటింగ్ కోసం ముందుభాగంలో 0.3ఎంపి కెమెరా, 3.5ఎం ఆడియో జాక్ దీని ఫీచర్లు. 3జి హెచ్‌ఎస్‌డిపిఎను సపోర్టు చేయగల ఆమ్నియా ఎం-లో విఫి, బ్లూటూత్, బింగ్ మ్యాప్స్, 2.0 యుఎస్‌బి సౌకర్యాలూ ఉన్నాయి. 1500ఎంఎహెచ్ లియాన్ బ్యాటరీ -ఈ స్మార్ట్ఫోన్ వినియోగ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని శామ్‌సంగ్ చెప్తోంది.

బిఎస్‌ఎన్‌ఎల్ పెంటా టి- డబ్లుఎస్802సి
పెంటా టి-పేడ్ డబ్ల్యుఎస్802సి పేరిట పాంటెల్ టెక్నాలజీస్ ఎనిమిది అంగుళాల పరిమాణంలో 3జి టాబ్లెట్ తెస్తోంది. బిఎస్‌ఎన్‌ఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో -60రోజుల గడువు, 2జిబి స్పేస్‌తో 3జి డేటా ప్లాన్‌ను బిఎస్‌ఎన్‌ఎల్ అందించేందుకు అంగీకరించింది. ఆండ్రాయిడ్ 4.0 లేదా ఐస్‌క్రీం శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో పని చేసే ఈ టాబ్లెట్ ధర 14,699. 8అంగుళాల టచ్‌స్క్రీన్, 1జిహెడ్జ్ ప్రాసెసర్, 512ఎంబి డిడిఆర్11 రామ్ దీని స్పెసిఫికేషన్లు. 1080పిక్సల్ హెచ్‌డి వీడియోకు సపోర్టు చేయగలదని పాంటెల్ కంపెనీ చెప్తోంది. బిల్టిన్ జిపిఎస్, 3జి సిమ్ స్లాట్, విఫి ఆప్షన్లతో వస్తున్న టాబ్లెట్ పిసి ఇది. ఎంటర్‌టైన్‌మెంట్‌లో భాగంగా టాబ్లెట్ పీసీలో యాంగ్రీ బర్డ్స్, వావ్ ఫిష్ లాంటి అడ్వాన్స్‌డ్ గేమ్స్ ఉన్నాయ.

స్మార్ట్ బోర్డు
స్మార్ట్ఫోనే్ల కాదు, స్మార్ట్ బోర్డులూ వచ్చేస్తున్నాయి. ఐఒఎస్, మాక్, ఆండ్రాయిడ్, విండోస్.. ఇలా ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా -వాటికి సులువుగా అనుసంధానమయ్యే కీబోర్డును దేశీయంగా 20 పట్టణాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది ఆమ్‌కెట్టె. బ్లూటూత్ వైర్‌లెస్ టెక్నాలజీ ఆధారంగా పని చేస్తే ఈ స్మార్ట్‌బోర్డును -టెక్నాలజీపై పెద్దగా అనుభవం లేనివాళ్లు సైతం సులువుగా వాడుకోవచ్చట. ఇది తక్కువ విద్యుత్ వినియోగంతో పని చేయడమే కాదు, కీబోర్డుతో అవసరం లేనపుడు -వెనుకభాగంలో ఏర్పాటు చేసిన స్విచ్‌ను ఆఫ్ చేయడం ద్వారా బ్యాటరీని ఆదా చేయవచ్చని కంపెనీ చెప్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌బోర్డు విలువ -2695.

కొత్త తరాలన్నీ -పుస్తకాల సంస్కృతి నుంచి ఈ-బుక్ వినియోగ సంస్కృతికి
english title: 
pustak

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>