బైకుల మీద విరక్తిపుట్టిన షోకిల్లాలు ఇప్పుడు సైకిళ్ల వెనుక పడుతున్నారు. అలాంటి వారి ఆశల్ని సంతృప్తిపర్చడానికి ఫైర్ఫాక్స్ సంస్థ యూత్ మోడల్స్‌ను మార్కెట్‌కు దించింది. థోర్, స్మోక్, డర్ట్, హేడ్స్లాంటి విచిత్రమైన పేర్లతో కుర్రాళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆకారంలో అధునాతనం, పనితీరులో వేగాన్ని పుణికిపుచ్చుకుని -మోటారు‘సైకిళ్ల’ మాదిరిగా పరుగులు తీసేందుకు వస్తున్న ఈ మోడళ్లన్నీ మిడ్-సెగ్మెంట్ రేంజ్‌ని దృష్టిలో పెట్టుకుని తెచ్చేవే అంటోంది ఫైర్ఫాక్స్. చిత్రమైన పేర్లతో విచిత్రంగా కనిపిస్తున్న వీటి ధరలు 10 నుంచి 16వేల రూపాయల మధ్య ఉన్నాయి. డర్ట్, హేడ్స్ మోడల్ సైకిళ్లనే తీసుకుంటే షిమానో 21 స్పీడ్ గేర్స్ వీటి ప్రత్యేకత. ఇజెడ్ ఫైర్ షిప్టర్స్, అల్లోయ్ రిమ్స్, వి-టైప్ బ్రేకులు, 14, 16 ఎంఎం స్టీల్ గేజ్ స్పెసిఫికేషన్లతో తయారైన ఈ సైకిళ్లు కుర్రకారు ఉత్సాహాన్ని మరింత పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
బైకుల మీద విరక్తిపుట్టిన షోకిల్లాలు ఇప్పుడు సైకిళ్ల వెనుక
english title:
cycles
Date:
Wednesday, August 8, 2012