పెడలుపై కాలు అమరక
సైకిలు దిగేటప్పుడు
వెల్లకిల్లా పడ్డా -
గాయపడ్డ మేమిద్దరం
వైద్యంతో నయమై
మూడు రోజుల్లో
మళ్లీ బతుకుబండి రోడ్డెక్కించా -
మాట కుదరక
పట్టింపు లొదలక
మా ఇల్లు రోడ్డున పడింది
వైద్యం కొదవతో
అరుదుగా మొదలై
తరచుగా కొనసాగి
ఇప్పుడు
ఇల్లే - రోడ్డు
రోడ్డే - ఇల్లయంది.
ఎన్ని ఒడిదుడుకుల
ఎగుడు దిగుడులిన అధిగమించైనా
బతుకు బండినైతే
రోడ్డెక్కించగలరేమో గాని
రోడ్డున పడ్డ కొంపను
మళ్లీ మామూలు ఇంటిగా
మలచడమంటే -
అది ఎనిమిదో వింతే
అవుతుందేమో!!
పెడలుపై కాలు అమరక సైకిలు దిగేటప్పుడు వెల్లకిల్లా పడ్డా -
english title:
y
Date:
Monday, September 3, 2012