Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi

కడప నగరంలో కోవిడ్-19 ఆసుపత్రిగా ఫాతిమా మెడికల్ కళాశాల

$
0
0

కడప, ఏప్రిల్ 13: కడప జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం రాత్రి వరకు 31 కేసులు నమోదయ్యాయి. సోమవారం ఎలాంటి కొత్తకేసులు నమోదుకాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. నమోదైన కేసుల్లో ఢిల్లీ మర్కస్‌కు వెళ్లి వచ్చిన వారు 17 మంది ఉన్నారు. ప్రస్తుతానికి జిల్లాలో ప్రొద్దుటూరు, కడప , పులివెందుల, బద్వేలు, మైదుకూరు, వేంపల్లె పట్టణాల్లో కరోనా పాజిటివ్ కేసులు తేలాయి. వీటిని జిల్లా ఉన్నతాధికారులు రెడ్‌జోన్‌లుగా ప్రకటించారు. ప్రొద్దుటూరులో 2, కడపలో 6, పులివెందులలో 4, బద్వేలులో 4, మైదుకూరులో 3, వేంపల్లెలో 2 పాజిటివ్ కేసులు ఉన్నాయి. కరోనా పాజిటివ్ వ్యక్తులందరినీ కడపలోని ఫాతిమా మెడికల్ కాలేజిలో ఏర్పాటుచేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచారు. జిల్లాలో పరీక్షల నిమిత్తం తీసుకొచ్చిన వారిని క్వారైన్‌టైన్‌లో ఉంచేందుకు కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేలులలో క్వారైన్‌టైన్ సెంటర్లు ఏర్పాటుచేశారు. కడపలో యోగివేమన యూనివర్సిటీ, హజ్‌హౌస్ కేంద్రాలను క్వారైన్‌టైన్ కేంద్రాలుగా ఏర్పాటుచేశారు. ప్రొద్దుటూరులో వెంకటేశ్వర ప్రభుత్వ పశువైద్యశాలలో 200 పడకల క్వారైన్‌టైన్ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. పులివెందులలో 52 పడకల క్వారైన్‌టైన్ సెంటర్‌ను ఎన్‌ఏసీ (నేషనల్ అకాడమి ఆఫ్ కన్‌స్ట్రక్షన్)లో ఏర్పాటుచేశారు. బద్వేలులో ఎస్‌బీవీఆర్ కళాశాలలో 88 పడకలతో క్వారైన్‌టైన్‌ను ఏర్పాటుచేశారు. జిల్లాలో కరోనా పరీక్షల ప్రయోగశాలను ఫాతిమా వైద్యకళాశాలలో ఏర్పాటుచేశారు. లాక్‌డౌన్ విధించిన తొలినాళ్లలో జిల్లాలోని త్రోట్ (గొంతు) శ్యాంపిల్స్‌ను తిరుపతిలోని స్విమ్స్‌కు పంపేవారు. ఢిల్లీ మర్కస్ సంఘటన తరువాత ఫాతిమా వైద్యకళాశాలను కోవిడ్ -19 ఆసుపత్రిగా మార్చారు. ఇక్కడే పరీక్షల కోసం ల్యాబ్ ఏర్పాటుచేశారు. జిల్లాలో ఏర్పాటుచేసిన ప్రొద్దుటూరు, బద్వేలు, పులివెందుల క్వారైన్‌టైన్ సెంటర్‌లో ఉన్న వారి నుండి గొంతు శ్యాంపిల్స్ తీసుకుని కడపలోని ఫాతిమా వైద్యకళాశాలకు పంపుతున్నారు. విదేశాల నుండి వచ్చిన వారి త్రోట్ శ్యాంపిల్స్‌ను, వారి కుటుంబ సభ్యుల త్రోట్ శ్యాంపిల్స్ కూడా ఇక్కడే పరీక్షిస్తున్నారు. ఈ ల్యాబరేటరీలో రోజుకు 80 పరీక్షలను మాత్రమే నిర్వహించగలుగుతున్నారు. దీంతో పరీక్షల ఫలితాలు వచ్చేందుకు 2 నుండి 4 రోజులు పడుతోంది.
విదేశాల నుండి వచ్చిన వారు హోమ్ క్వారైన్‌టైన్‌లో
జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన వారు 4,941 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉండవచ్చునని అనధికారిక సమాచారం. గుర్తించిన వారందరినీ హోమ్ క్వారైన్‌టైన్‌లో ఉంచారు. మర్కస్ సంఘటన తర్వాత ఢిల్లీకి వెళ్లివచ్చిన 59 మందిని హోమ్ క్వారైన్‌టైన్‌లలో ఉంచి పరీక్షలకు శ్యాంపిల్స్ పంపారు. వీరి కుటుంబ సభ్యులను కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసిన క్వారైన్‌టైన్ సెంటర్లలో ఉంచి త్రోట్ శ్యాంపిల్స్ తీసుకున్నారు. కాగా హోమ్ క్వారైన్‌టైన్‌లలో ఉన్న వారిపై సరైన నిఘా కొరవడిందనే ప్రచారం ఉంది. చేతిపై హోమ్ క్వారైన్‌టైన్ అనే ముద్రవేసి ఇళ్లలో ఉంచడం మినహా వారిపై సరైన నిఘా లేదనే ప్రచారం ఉంది. ఇలాంటి వారు బయట తిరుగుతున్నారని జనాంతికంగా వినిపిస్తోంది. కడప నగరంలో హోమ్ క్వారైన్‌టైన్‌లో ఉంచిన వారిని రోజుకు మూడుసార్లు చెక్ చేస్తున్నట్లు నగర కార్పొరేషన్ కమిషనర్ లవన్న తెలిపారు. ఇది అందరి సమస్య కాబట్టి ఎవరికి వారు బాధ్యతగా ఉండాలని సూచించారు.


‘పాజిటివ్స్’ కనిష్టమే.. అయినా ఆందోళనే..

$
0
0

అనంతపురం, ఏప్రిల్ 13: కరోనా (కోవిడ్-19) మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పోలిస్తే అనంతపురం జిల్లాలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు తక్కువగా నమోదైనా ప్రజలను భయం వెంటాడుతోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోయినా, కాంటాక్ట్ ట్రేసింగ్ (పాజిటివ్ వ్యక్తి కలిసిన వ్యక్తులు, వారు ఎవరెవరిని కలిశారన్న వివరాల సేకరణ) ద్వారా కొత్త కేసులు బయటపడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు కరోనా వ్యాప్తి నివారణకు కట్టుదిట్టమైన చర్యలను పకడ్బందీగా కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు అనుమానితులను క్వారంటైన్ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 15 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వాటిలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఇంకా 13 పాజిటివ్ కేసులుండగా, వారందరికీ ఐసోలేషన్ వార్డులు, కోవిడ్-19 ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అనంతపురం, హిందూపురం, కొత్తచెరువు, కల్యాణదుర్గంలో పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో రెడ్ జోన్లను అమలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. దీంతో కొత్త కేసులు వెలుగు చూస్తాయేమోనన్న ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. ఇక అక్కడి పరిస్థితులను బట్టి ఆరంజ్, గ్రీన్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మొత్తం 33 కరోనా సెంటర్లలో అనుమానితులను క్వారంటైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అనుమానితుల నుంచి శ్యాంపిల్స్ సేకరణ నిమిత్తం రెవెన్యూ డివిజన్‌కు 3 చొప్పున మొత్తం 18 ప్రత్యేక వాహనాలను వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకూ 1221 శాంపిల్స్ తీయగా, రోజుకు 90 వరకూ ఫలితాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిస్తోంది.
అయితే శ్యాంపిల్స్ టెస్టింగ్ వేగవంతం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని వీఆర్‌డీఎల్ కేంద్రంలో రోజుకు 310 శ్యాంపిల్స్ పరిశీలించేలా చర్యలు చేపట్టారు. అనంతపురంలోని వీఆర్‌డీఎల్‌లో 70, బత్తలపల్లి ఆర్డీటీలో ప్రాథమికంగా 240 శ్యాంపిల్స్ టెస్ట్ చేసేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకూ మొత్తం 41 శాంపిల్స్ నెగెటివ్ వచ్చాయి. సోమవారం 30 శ్యాంపిల్స్ కూడా నెగెటివ్ వచ్చాయి. కాగా 7 రోజుల పాటు ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తిస్తున్నారు. వీటిలో హైరిస్క్, మీడియం రిస్క్, లోరిస్క్ వారీగా జాబితాలను శరవేగంగా తయారు చేసేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పాజిటివ్ కేసుల్లో తీవ్ర అనారోగ్యానికి గురైతే వారిని నెల్లూరు, తిరుపతికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం నుంచి ఓపీ సేవలను ప్రారంభించారు. దీంతో రోగులు సామాజిక దూరం పాటిస్తూ ఆసుపత్రి వద్ద క్యూ కట్టారు. ఒక్కొక్కరుగా రోజులుగా లోపలకి వదులుతుండడంతో ఆసుపత్రి బయట చాంతాడంత క్యూ కనిపించింది.
*చిత్రం... అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ముందు బారులుతీరిన ఓపి రోగులు

విరి వనాలకు కరోనా కాటు...!

$
0
0

కడియం/ఆలమూరు, ఏప్రిల్ 13: కరోనా మహమ్మారి ప్రజారోగ్యానే్న కాకుండా ప్రత్యక్షంగా ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తూర్పుగోదావరి జిల్లా కడియం, ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లో వేల ఎకరాల పూల తోటలపై కరోనా ప్రభావం పడింది. లాక్‌డౌన్ నేపథ్యంలో రవాణా స్తంభించడం, కూలీలు పూల తోటలకు రాకపోవడంతో తోటల్లోనే పూలు వాడిపోయి రాలిపోతున్నాయి. వేసవిలో మల్లెపూల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. అయితే దేశవ్యాప్తంగా ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులు పూల కోతకు ఆసక్తి చూపడంలేదు. అలాగే కనకాంబరం, లిల్లీ, చామంతి, బంతి వంటి పూలు కూడా తోటల్లోనే రాలిపోతున్నాయి. కోయకపోతే తోటలు దెబ్బతింటాయని పలువురు రైతులు వ్యయ ప్రయాసలతో వాటిని కోసి కాలువల్లో విడిచిపెడుతున్నారు. ఎకరా పూల సాగుకు లక్ష నుండి రెండు లక్షల రూపాయలు వ్యయం కావడంతో పాటు పూలసాగు చేసే భూములకు ఎకరాకు రూ.50 వేల నుండి 1.5 లక్షల వరకు కౌలు చెల్లిస్తారు. భారీ వ్యయంతో కూడిన ఈ సాగు ఇప్పుడు రైతులకు తీవ్ర మనోవేదనను మిగిల్చింది. సరిగ్గా పూల దిగుబడులు వచ్చే సమయానికి లాక్‌డౌన్ ప్రకటించడంతో పూల రైతుల ఆశలు ఆవిరయ్యాయి. అలాగే పెళ్లిళ్ల సీజన్ కావడం, నిర్ణయించిన ముహూర్తాలు కరోనా ప్రభావంతో వాయిదా పడడంతో పూల మండపాలు నిర్మించే వ్యాపారులు కూడా ఉపాధి కోల్పోయారు. రాష్ట్రంలోనే అతి పెద్ద పూల మార్కెట్ కడియపులంకలో ఉంది. లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో గత 20 రోజులుగా వ్యాపారులు కూడ మార్కెట్‌ను తెరవకపోవడంతో పూల రైతులకు చిల్లిగవ్వ కూడ రాకుండా పోతోంది.
*చిత్రం... కోయకుండా వదిలేయడంతో ఎండిపోతున్న చామంతి పూలు

ఐసోలేషన్ కోచ్‌లను పరిశీలించిన కలెక్టర్

$
0
0

గుంతకల్లు, ఏప్రిల్ 13: అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వేస్టేషన్‌లో ఉన్న ఐసోలేషన్ రైల్వేకోచ్‌లను కలెక్టర్ గంధం చంద్రుడు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసరమైతే ఈ కోచ్‌లను వినియోగించుకుంటామన్నారు. జిలో 9 కంటోనె్మంట్ జోన్‌లను ఏర్పాటు చేశామన్నారు. పాజిటివ్ కేసులు, కాంటాక్ట్ కేసులను బట్టి హైరిస్క్ జోన్ ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణంలోని రైల్వే ఏరియాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలు, రైల్వే ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులను పరిశీలించారు. రైల్వే అధికారులు కరోనా నివారణ, చికిత్సల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఎం అలోక్ తివారీ, ఏడీఆర్‌ఎం సూర్యనారాయణ, సైమన్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు, తహశీల్దార్ హరికుమార్, రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... గుంతకల్లు రైల్వేస్టేషన్‌లో రైల్వేకోచ్‌లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ను పరిశీలిస్తున్న అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

కరోనా కట్టడిలో గోదావరి జిల్లాలు

$
0
0

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 13: కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా గత మూడు వారాలుగా గోదావరి జిల్లాలు కర్ఫ్యూ వాతావరణంలో కాలం వెళ్లబుచ్చుతున్నాయి. ఉదయం 11 గంటల వరకూ నిత్యావసరాల కోసం వస్తున్న వారితో కాస్త జన సంచారం కనిపిస్తున్నప్పటికీ, ఆ తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. కోవిడ్-19 సేవల్లో పాల్గొంటున్న అత్యవసర సేవల సిబ్బంది వాహనాలు, నిత్యావసరాలు రవాణాచేస్తున్న వాహనాలు మినహా రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. భౌగోళికంగా గోదావరి నదికి అటూ ఇటూ ఉండే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య రవాణా సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇరు జిల్లాలను కలిపే రోడ్డుకం రైలు బ్రిడ్జిని కంచె వేసి పూర్తిగా మూసివేసి పోలీసులు పహారా కాస్తున్నారు. ఏలూరు రేంజి డీఐజీ కెవి మోహన్‌రావు, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాం నరుూం అస్మీ, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ షిమోషీ బాజ్‌పాయ్ నిత్యం రోడ్లపై తిరుగుతూ లాక్‌డౌన్ అమలుతీరును పర్యవేక్షిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చే వారికి కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే వారి వాహనాల స్వాధీనానికి ఆదేశాలు జారీచేస్తున్నారు. గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం కరోనా ప్రభావానికి దూరంగా వుంది. కరోనా వైరస్ సోకిన వారికి ఐసొలేషన్ వార్డుల్లో చికిత్సనందిస్తున్నారు. రెండోసారి కూడా పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో శంఖవరం, కొత్తపేట మండలాలను రెడ్ జోన్లుగా గుర్తించారు. అడ్డతీగల, కాకినాడ రూరల్, పెద్దాపురం, పిఠాపురం, రాజమహేంద్రవరం అర్బన్ మండలాలను ఆరంజ్ జోన్లుగా గుర్తించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, పెనుగొండ భీమవరం, ఆకివీడు, ఉండి తదితర ప్రాంతాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. కరోనా వైరస్ తెచ్చిన స్వీయక్రమ శిక్షణతో దైనందిన జీవితాన్ని మల్చుకుని లాక్‌డౌన్‌కు జనం అలవాటు పడిన వాతావరణం కన్పిస్తోంది. మంగళవారంతో లాక్‌డౌన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన కోసం ఇరు జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.
*చిత్రాలు.. నిర్మానుష్యంగా కనిపిస్తున్న రోడ్-కమ్-రైలు వంతెన
* రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటిస్తున్న ఏలూరు రేంజి డీఐజీ మోహన్‌రావు

సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రిలో 142 కరోనా ఐసోలేషన్ పడకలు

$
0
0

హైదరాబాద్, ఏప్రిల్ 13:కరోనా వ్యాధి బాధితుల కోసం సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రిలో 142 ఐసోలేషన్ పడకలను ఏర్పాటు చేశారు. కరోనా వ్యాధి సోకిన వ్యక్తులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించడానికి రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపధికన ఐసోలేషన్ పడకలను సిద్ధం చేశారు. కరోనా వ్యాధి సోకిన వ్యక్తులకు అందించే వైద్య సదుపాయ ఏర్పాట్లను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ ఆసుపత్రిని పరిశీలించారు. సికింద్రాబాద్‌తో పాటు విజయవాడలో 100 ఐసోలేషన్ పడకలు, గుంతకల్‌లో 42 ఐసోలేషన్ పడకలను సిద్ధం చేశారు. ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. అందుబాటులో మాస్కులు, వెంటిలేటర్లు, ప్రైవేట్ పర్సనల్ ఎక్విప్‌మెంట్‌ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాత్కాలికంగా వైద్య సిబ్బందిని భర్తీ చేయడానికి ఆదేశాలు జారీ చేశారని రైల్వే సీపీఆర్‌వో సీహెచ్ రాకేష్ తెలిపారు.
నిత్యావసర సరకుల రవాణాకు
89 ప్రత్యేక పార్శిల్ రైళ్లు

హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలుగు రాష్ట్రాల్లో కరోనా లాక్‌డౌన్ అమలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర సరుకులను చేరవేయడానికి 89 ప్రత్యేక పార్శిల్ రైళ్లను నడుపుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు పార్శిల్ రైళ్ల ద్వారా నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నారు. కాకినాడ నుంచి సికింద్రాబాద్, రేణిగుంట నుంచి గుంతకల్ వరకూ ఈ పార్శిల్ రైళ్లు నడుస్తాయి. పార్శిల్ రైళ్లు నడిచే మార్గంలో ఉన్న ముఖ్యమైన స్టేషన్లలో సరుకును అన్‌లోడ్ చేస్తారు.

విద్యుత్ బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లించాలి

$
0
0

హైదరాబాద్, ఏప్రిల్ 13: కరోనా ఎఫెక్ట్ నేపథ్యంతో లాక్‌డౌన్ అమలు జరుగుతున్నందున గత సంవత్సరం మార్చి నెల బిల్లులనే ఈ ఏప్రిల్‌లో చెల్లించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ బిల్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నందున వాటికి సంబంధించిన బిల్లులు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి వినియోగదారులకు సూచించారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ బిల్లుల చెల్లాంచే అంశంలో వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన హితవు పలికారు. గత మార్చి నెలలో విద్యుత్ బిల్లు ఎంత చెల్లించారో ఏప్రిల్ నెలలో కూడా అంతే విద్యుత్ బిల్లు చెల్లిస్తే సరిపోతుందని మంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ రీడింగ్ తీసుకోలేదు కనుక వచ్చే నేలలో రీడింగ్ పెరిగిపోయి భారీగా బిల్లులు వస్తాయని వినియోగదారులు పరేశాన్ కావద్దన్నారు. బిల్లుల గురించి బెంగ పడవద్దని ఆయన సూచించారు. విద్యుత్ బిల్లులు తీసుకోవడానికి ఇళ్లలేకి విద్యుత్ సిబ్బంది వెళ్లలేరు కనుక మార్చి, ఏప్రిల్ నెలల విద్యుత్ బిల్లులు మే నెలలో ఇస్తామన్నారు. అయితే రెండు నెలల బిల్లులో ఎక్కువ విద్యుత్ బిల్లు వస్తుందని వినియోగదారులు అపోహ పడవద్దన్నారు. 60 రోజుల రీడింగ్‌లో 30,30 రోజులకు ఎంత బిల్లు వస్తుందో వాటిని పరిగణలో తీసుకుంటామన్నారు. గతంలో వచ్చిన బిల్లుల కంటే మార్చి, ఏప్రిల్ నెలలో విద్యుత్ బిల్లులు అధికంగా 15-20 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇంటి వద్దనే ఉండడంతో 24 గంటలు విద్యుత్ వాడకంతో బిల్లులు పెరిగే అవకాశం ఉండవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.
సోషలిజమే శరణ్యం
*-సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

హైదరాబాద్, ఏప్రిల్ 13: ప్రపంచ మానవాళికి సోషలిజమే మార్గమని, ప్రస్తుతం ప్రపంచం అనుసరిస్తున్న లాక్‌డౌన్, క్వారంటైన్, భౌతిక దూరం, ఇంటికే పరిమితం కావడం, ఐసోలేషన్ వంటి ప్రక్రియలన్నీ చైనా అనుసరించినవేనని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఆ వ్యూహాలను ఇపుడు అన్ని దేశాలూ అనుసరిస్తున్నాయని, అమెరికా వంటి దేశాలు అహంభావంతో వ్యవహరించి , కరోనా తీవ్రతకు మూల్యం చెల్లించుకున్నాయని పేర్కొన్నారు. పకడ్బందీ విధానాలతో వియత్నాంలో కరోనా సోకలేదని గుర్తుచేశారు. క్యూబాలో ప్రభుత్వ వైద్యరంగం పటిష్టంగా ఉండటంతో కరోనా నామమాత్రంగా ఉందని, ఇంకోవైపు క్యూబా వైద్యులు తమ సేవలు అందించేందుకు ఇతర దేశాలకు వెళ్తున్నారని అన్నారు. ప్రజారోగ్యం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చోట కరోనా కట్టడి అవుతోందని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయని వీరభద్రం పేర్కొన్నారు. సోషలిస్టు భావజాలం ఉన్న కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కరోనా కేసులు , మరణాలు పెరగకుండా ఆపగలిగారని వివరించారు. ఆపదలో ఉన్న ప్రజలు, కార్మికులకు వామపక్ష ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పారు. కరోనా కట్టడి, ప్రజలను ఆదుకోవడంలో కేరళ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలించిందని అన్నారు. సోషలిస్టు వ్యవస్థ ప్రత్యేకత, పెట్టుబడిదారీ విధానం వైఫల్యం కనిపిస్తోందని పేర్కొన్నారు.
చురుకుగా సీపీఎం సేవలు
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో సీపీఎం, ప్రజా సంఘాలు ప్రజలకు అండగా నిలిచాయని తమ్మినేని చెప్పారు. రాష్ట్రంలోని 34 జిల్లాల్లో వివిధ రూపాల్లో ప్రజలకు సహాయ పడడానికి సీపీఎం వర్గాలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. బియ్యం,కూరగాయలు, నిత్యావసరాలు, మాస్కులు, శాటిటైజర్లు లక్షలాది రూపాయిలు విలువైనవి పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు.

675 అక్రమ మద్యం కేసుల నమోదు

$
0
0

హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్రంలోని వైన్‌షాప్‌ల ద్వారా మద్యం తరలించి ఎక్కువ ధరలకు అమ్మడం వంటి అంశాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని, ఇప్పటి వరకు అక్రమంగా మద్యం అమ్మిన వారిపై 675 కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ అదేశాలు జారీ చేశారు. సోమవారం ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఉన్నాతాధికారులతో వివిధ అంశాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పద్యం దుకాణాల ద్వారా మద్యం తరలించి ఎక్కువ ధరలకు అమ్మిన వారిపై, అందుకు కారకులైన షాపు లైసెన్స్‌లను రద్దు చేయాలని, భారీ జరిమానాలను విధించాలని మంత్రి అధికారులకు సూచించారు. సోషల్ మీడియా ద్వారా వస్తున్నటువంటి అసత్య వార్తలను ఎప్పటికపుడు మానిటర్ చేసి, పోస్టు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. అలాగే ఆదివారం ట్విట్టర్లో కూలీలకు మద్యం పంచుతూ హైదరాబాద్‌లోని చంపాపేట నుండి వచ్చిన వీడియో ఆధారిత ఫిర్యాదును అబ్కారి శాఖ అధికారులు నాలుగు, ఐదు గంటల్లోనే సంజు కుమార్‌ను గుర్తించి అరెస్టు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. మద్యం అమ్మకాలు, అక్రమ మద్యం సరఫరా జరిగినట్లయితే సంబంధిత స్థానిక ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ సమీక్షలో ఎక్సైజ్, ప్రొహిబిషన్‌కు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు.


ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా

$
0
0

హైదరాబాద్, ఏప్రిల్ 13: జాతీయ , రాష్ట్ర స్థాయి ప్రవేశపరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అన్ని ప్రవేశపరీక్షలను వాయిదా వేశాయి. తెలంగాణలో ప్రవేశపరీక్షలకు ఎలాంటి అదనపు రుసుం లేకుండానే గడువును మే 5వ తేదీ వరకూ పొడిగించగా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపరీక్షల దరఖాస్తు గడువును ఏప్రిల్ 17వ తేదీ వరకూ పొడిగించారు. మరో పక్క నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ నిర్వహించే జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, నీట్ యూజీ పరీక్షలు వాయిదా పడే అవకాశం కనిపిస్తున్నాయి. తెలంగాణలో, ఆంధ్రాలో టెన్త్ పరీక్షలు జరగాల్సి ఉంది, వాటికి ఇంకా షెడ్యూలు ఖరారు కాలేదు. తెలంగాణలో అధికారికంగా ఏప్రిల్ 30 వరకూ లాక్‌డౌన్ పొడిగించడంతో మే నెలలోనే టెన్త్ పరీక్షలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పరీక్షల నిర్వహణలో జరిగిన జాప్యంతో 2021-22 విద్యాసంవత్సరం ప్రవేశాలు అనివార్యంగా జాప్యం జరిగే వీలుందని చెబుతున్నారు. జాతీయ స్థాయి ప్రవేశపరీక్షల వ్యవహారం తేలితే తప్ప రాష్ట్రాల ప్రవేశపరీక్షల తేదీలను ఖరారు చేసే అవకాశం లేదు. జాతీయ స్థాయిలో ఎక్కువ మంది హాజరయ్యే ఐఐటీ జేఈఈ మెయిన్స్, ఐఐటీ జేఈఈ అడ్వాన్స్, నీట్ యూజీ, ఐసీఎఆర్ అగ్రికల్చర్ ఎంట్రన్స్ యూజీ పరీక్షల తేదీలు ఖరారు కావల్సి ఉంది. మరో పక్క దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉండటంతో ఆయా రాష్ట్రాల్లోని ప్లస్ టు ఫలితాలు విడుదలలో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ఒక వేళ ర్యాంకులను ప్రకటించినా, అడ్మిషన్లలో తీవ్ర జాప్యం జరగనుంది. గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఆగస్టు 31లోగా అన్ని రకాల అడ్మిషన్లు పూర్తికావాలి. అయితే ఈ ఏడాది అందుకు అవకాశం కనిపించడం లేదు. నీట్‌కు దరఖాస్తు చేసుకునే గడువు ఇప్పటికే ముగిసింది. పరీక్ష మే 3న జరగాల్సి ఉంది. ఫలితాలు మే చివరిలో ప్రకటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ గతంలో నిర్ణయించింది. ఒక వేళ నీట్ -యూజీ వాయిదా పడితే ఫలితాలు జూన్‌లోనే వెలువడతాయి. జేఎన్‌యూ ప్రవేశపరీక్షలు, ఢిల్లీ యూనివర్శిటీ ప్రవేశపరీక్షలు, ఏఆర్‌పీఐటీ, యూజీసీ నెట్ గడువులను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ సవరించింది. పరీక్షల దరఖాస్తు గడువులను సవరించిన , ఎన్‌టీఏ ఇంత వరకూ పరీక్షల నిర్వహణ తేదీల షెడ్యూళ్లను మారుస్తూ ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. రానున్న వారం పరిస్థితిలో మార్పు వచ్చి కొంత అనుకూలంగా ఉంటే యథాతథంగా షెడ్యూలు కొనసాగించనున్నారు. కాగా ఉస్మానియా యూనివర్శిటీ, జేఎన్‌టీయూ హెచ్, ఇంగ్లీషు- విదేశీ భాషల విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే ఎసైన్‌మెంట్లను ఇచ్చి వాటికి అనుగుణంగా మార్కులు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
లాక్‌డౌన్‌లో పోలీసుల సేవా నిరతి

హైదరాబాద్, ఏప్రిల్ 13: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఒక పక్క విధులు నిర్వహిస్తూనే సేవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అపదలో ఉన్న ప్రజలను అదుకొని వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలోని ఎస్పీలు, కమిషనరేట్ పరిధిలో పోలీసులు సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు. సోమవారం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోమవారం ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు ఆహార ప్యాకెట్‌లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అందజేశారు. లంగర్‌హౌస్ ఓలీవ్ ఆసుపత్రి సమీపంలోని జీఎం గార్డెన్ ఫంక్షన్‌హాలులో జరిగిన కార్యక్రమంలో సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చి పనులు నిర్వహిస్తున్న వర్కర్స్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రతి డివిజన్ పరిధిలో ఏసీపీల ఆధ్వర్యంలో పోలీస్టేషన్‌ల వారీగా ఫుడ్ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. లాక్‌డౌన్‌లో ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. ఫుడ్ పంపిణీ కార్యక్రమం ప్రతి రోజు కొనసాగుతుందని సీపీ తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ మహ్మద్ ఇక్బాల్ సిద్ధిఖీ, ఏసీపీ శివ మారుతితో పాటు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని పోలీసులు సోమవారం రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా రక్తదానం సేకరణ కార్యక్రమం జరిగింది. రక్తదానంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. రక్తదానం చేయాలనుకునే వారు పోలీసులను సంప్రదిస్తే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో మెడికల్ ఎమర్జెన్సీ, తలసేమియా, క్యాన్సర్, వ్యాధిగ్రస్తులకు రక్తం అవసరం ఉందని సజ్జనార్ పేర్కొన్నారు. ఒక్కరుచేసిన రక్తదానం ముగ్గురికి ఉపయోగపడుతుందన్నారు. కోవిడ్ కంట్రోల్ రూం నెంబర్స్ 9490617440, 9490617431ను సంప్రదిస్తే పోలీసుల సహకారం అందిస్తామని చెప్పారు.
13 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచామని, ఇప్పటి వరకు 250 మందికి మెడికల్ ఎమర్జెన్సీ సేవలు అందించామని, 500 మంది డయాలసిస్ రోగులకు సేవలు అందిస్తున్నామని తెలిపారు.

కరోనాపై కాంగ్రెస్ అఖిలపక్షం

$
0
0

హైదరాబాద్, ఏప్రిల్ 13: కరోనా పై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఫల్యంపై అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ వివరాలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. అన్నపూర్ణ కేంద్రాలపై సమాచారం ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. వలస కూలీల పరిస్థితుల పై అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. తెల్ల రేషన్ కార్డులు లేని వారికి బియ్యం, డబ్బులు ఇవ్వాలన్నారు. టీపీసీసీ కరోనా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో వివరించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రభుత్వం చేపట్టిన పనులు,తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ నెల 15 లేదా 16వ తేదీన అఖిల పక్షం నిర్వహిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కర పరిస్థితి నెలకొందని, ఇప్పటికే ఒక లక్షకు పైగా కరోనాతో చనిపోయారన్నారు. లక్ష మంది కరోనాకు గురయ్యారని, అమెరికా లాంటి అగ్ర దేశంలో ఒక్క రోజే 1500కుపైగా చనిపోయారన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే, మ దేశంలో ఆ స్థాయిలో లవేకపోవడం అదృష్టమన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కరోనాపై ముందుగా కేంద్రాన్ని హెచ్చరించిన విషయాన్ని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రాహుల్‌గాంధీ ఇచ్చిన సలహాలను పెడచెవిన పెట్టారన్నారు. పార్లమెంటులో ఫైనాన్స్ బిల్లు పెట్టిన తర్వాత కేంద్రం లాక్ డౌన్‌కు వెళ్లిందన్నారు. తెలంగాణలో మార్చి 21వ తేదీన ప్రకటన చేశారని, 22 నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిందన్నారు. నాటి నుంచి ఇంతవరకు 21 రోజుల తర్వాత నిరుపేదలు, కూలీలు, రెక్కాడితే కానీ డొక్కాడని వారు ఎలా బ్రతుకుతారన్నారు. చాలా మందికి రాష్ట్రప్రభుత్వం నుంచి సహాయం అందలేదన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలకు రూ.1500 ఇస్తామన్నారు. ఇంతవరకు ఒక్కరికి కూడా పైసా అందలేదన్నారు. మనిషికి 12వేల కిలోల బియ్యం 60 శాతం మంది ప్రజలకు చేరిందన్నారు. ప్రజలకు అందిన సాయంపై సీఎం కేసీఆర్ సమగ్రంగా లేఖ రాశామని, సీఎస్‌ను కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తామన్నారు. రాష్ట్రంలో రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని, వెంటనే వేతనాలు అందచేసి మాస్కులు , గ్లౌజులు, శానిటైజర్లు అందచేయాలన్నారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలొడ్డి పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, మున్సిపల్ గ్రామ పంచాయతీ, పోలీసు ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది తదితర కార్మికులకు ప్రభుత్వం అదనంగా సగం జీతం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఉన్న వలస కూలీలను ఆదుకనే విషయంలో ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు చెప్పారన్నార. కడపులో పెట్టుకుని చూస్తామన్నారని, కాని సాయం అందిచలేదన్నారు. ఈ విషయాలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు వలస కూలీల పరిస్థితి, పేదలకు డబ్బులు బియ్యం అందిన అంశాలను సేకరించి నివేదిక అందిస్తామన్నారు. హైదరాబాద్‌లో వలస కూలీలకు రెండు పూటలా భోజనాల కోసం 200 అన్నపూర్ణ కేంద్రాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతుందని అయితే వాటి వివరాలు కావాలని అడిగితే ఇంతవరకు ఇవ్వలేన్నారు. ఉపాధి హామీ కూలీలకు పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, రెండు నెలల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెలో ఉన్నారని వారు భేషరతుగా సమ్మె విరమించినా పనిలోకి తీసుకోవడంలేదన్నారు.
రాష్ట్రంలో లాక్‌డౌన్ పరిస్థితులు తీవ్రంగా ఉంటే కేసీఆర్ కాలేశ్వరం మూడో టీఎంసీ పనుల కోసం 22వేల కోట్ల రూపాయల టెండర్లు వేయడం దారుణమన్నారు. వీటిని వెంటనే రద్దు చేయాలన్నారు. దేశంలో ధనిక రాష్టమ్రని దేశానికి అన్నం పెడుత్నునమని గొప్పలు చెప్పిన కేసీఆర్ పది రోజులకే చేతులవు ఎత్తేశారన్నారు. నెలవకు 24 వేల కోట్ల రూపాయల ఆదాయం ఉందని చెప్పిన కేసీఆర్ మ ఆర్చి నెలలో పది రోజుల లాక్‌డౌన్ కే ఉద్యోగుల వేతనాలు ఇవ్వడానికి డబ్బులు లేవని కోతలు పెట్టారన్నారు. వృద్థుల పెన్షన్ డబ్బుల్లో కూడా కోతలు పెట్టిన దుర్మార్గం కేసీఆర్‌దేనన్నారు.

*చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి