Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

పొత్తులపై నిర్ణయం తీసుకోలేదు

$
0
0

కళ్యాణదుర్గం, డిసెంబర్ 13 : 2019 ఎన్నికల్లో పొత్తులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అధిష్ఠానం నిర్ణయం మేరకే పని చేస్తామని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం పట్టణంలో గురువారం రఘువీరా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేయడానికే పని చేస్తుందని, ఆపై పార్టీ పెద్దల నిర్ణయం మేరకు ముందుకెళ్తామని వివరించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో పొత్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, చర్చించలేదని తెలిపారు. తెలంగాణాలో పొత్తులతో ఎన్నికలకు వెళ్లగా అక్కడి ప్రజలు పొత్తులను తిరస్కరించారన్నారు. ఏపీలో ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి పార్టీని బలోపేతం చేస్తున్నామని, అందులో భాగంగానే ఇటీవల ఇంటింటికీ కాంగ్రెస్ పార్టీ పేరుతో ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నామన్నారు. ఇక ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని, రాహుల్‌గాంధీ తీవ్రంగా కృషి చేయడం వల్లే ఆ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించామని, బీజేపీ బలహీన పడిపోయిందని తెలిపారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, రాహుల్ ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. 2019 ఎన్నికల్లో తాను కళ్యాణదుర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని రఘువీరా స్పష్టం చేశారు.


రఫేల్ ఓప్పందంపై మోదీ ప్రభుత్వానికి క్లీన్‌చిట్

$
0
0

న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంపై మోదీ ప్రభుత్వానికి క్లీన్‌చిట్ లభించింది. జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నేడు విచారణ చేపట్టి తీర్పునిస్తూ ఈ కేసును దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం లేదని పేర్కొంటూ పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం నుంచి మోదీ ప్రభుత్వానికి క్లీన్‌చిట్ లభించింది. రఫేల్ ఒప్పందంలో అనుమానించదగ్గ విషయాలు ఏమీ లేవని ధర్మాసనం తెలిపింది. దేశ భద్రత దృష్ట్యా కొన్ని విషయాల్లో గోప్యత పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెశిడెంట్‌గా కేటీఆర్

$
0
0

హైదరాబాద్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెశిడెంట్‌గా కేటీఆర్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని వెల్లడించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది.

కోస్తాంధ్రకు తుపాను ముప్పు

$
0
0

విశాఖపట్నం: కోస్తాంధ్రకు తుపాను ముప్పు ముంచుకు వచ్చింది. మచిలీపట్నానికి 1210 కి.మీ దూరంలోనూ, చెన్నైకి 1040 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 24 గంటల్లో తుపానుగా మారింది. దీంతో కోస్తాంధ్రలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కొన్నిచోట్ల 20 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అధికార యంత్రాంగం అప్రమత్తం

$
0
0

విజయవాడ: కోస్తాంధ్రకు తుపాను ముప్పు పొంచివుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వం ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలను సిద్ధం చేసింది. తుపాను సంభవించే ప్రాంతాల్లో నిత్యావసర సరుకులను సిద్ధం చేశారు. అధికారులు 1100 కాల్‌సెంటర్ నుంచి తుపాన్ జాగ్రత్తల సందేశాలను అందించే ఏర్పాట్లు చేశారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రతీరంలోని ఆరు మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.

స్కూలు బస్సులో పొగలు

$
0
0

రంగారెడ్డి: జిల్లాలోని షాద్‌నగర్ బైపాస్‌లో బాబా డాబా వద్ద ఆగివున్న ఓ స్కూలు బస్సులో పొగలు వ్యాపించటంతో బస్సులో ఉన్న విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాయికల్ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకువెళుతుండగా టోల్‌ప్లాజా వద్ద విపరీతమైన పొగలు రావటంతో డ్రైవర్ అప్రమత్తమై ఆపివేశారు. గ్రామస్తులు అద్దాలు పగులగొట్టి పిల్లలను బయటకు తీసుకువచ్చారు.

17న సీఎం కమల్‌నాథ్ ప్రమాణ స్వీకారం

$
0
0

భోపాల్: మధ్యప్రదేశ్ సీఎంగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ ఈనెల 17న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు భోపాల్‌లోని లాల్‌పెరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 230 సీట్లు ఉన్న మధ్యప్రదేశ్‌లో 114 సీట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఎస్పీ, బీఎస్పీ పార్టీల మద్దతుతో అధికారాన్ని చేపడుతున్న విషయం విదితమే.

రాహుల్ క్షమాపణలు చెప్పాలని లోకసభలో ఆందోళన

$
0
0

న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంలో తప్పు పట్టాల్సిన అంశాలు ఏమీ లేవంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు నేడు లోకసభలో ఆందోళన చేయటంతో సభను స్పీకర్ కొద్దిసేపు వాయదా వేయాల్సి వచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ సైతం డిమాండ్ చేశారు.


రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ నిరాధారమైన ఆరోపణలు

$
0
0

న్యూఢిల్లీ: రాజకీయ లబ్ధికోసమే కాంగ్రెస్ నిరాధారమైన ఆరోపణలు చేసిందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. ఆయన లోకసభలో మాట్లాడుతూ రఫేల్ ఒప్పందం స్పష్టంగా ఉందని తాము ముందు నుంచి చెబుతూనే ఉన్నామని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ఆరోపణలు చేసిందని, రాహుల్ క్షమాపణలు చెప్పాలని ఆయన కూడా డిమాండ్ చేశారు.

రాజస్థాన్ పగ్గాలు గహ్లోత్‌కే..

$
0
0

న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవికి సీనియర్ నేత అశోక్ గహ్లోత్‌ను ఎంపికచేస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాహుల్ ఓ ఫొటోను ట్వీట్ చేస్తూ యునైటేడ్ కలర్స్ ఆఫ్ రాజస్థాన్ అని ట్యాగ్ పొందుపరిచారు. ఈ ఫొటోలో గహ్లోత్, సచిన్‌లతో రాహుల్ కలిసి చిరునవ్వులు చిందిస్తున్నారు. మధ్యప్రదేశ్ సీఎం ఎంపిక జరిగిన సమయంలోనూ కమల్‌నాథ్, జోతిరాదిత్య సింథియాలతో దిగిన ఫొటోను షేర్ చేశారు.

కేటీఆర్‌తో కలిసి పనిచేస్తా:హరీశ్

$
0
0

హైదరాబాద్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెశిడెంట్‌గా కేటీఆర్ నియామకంపై సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హార్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన కేటీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు కేటీఆర్ చేదోడువాదోడుగా వుండాలని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కలిసి పనిచేశామని, ఇకముందు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటంలో కలిసే పనిచేస్తామని అన్నారు.

మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న రాజీనామా

$
0
0

హైదరాబాద్: అనంతపురం మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన స్పీకర్ కార్యాలయంలో తన లేఖను అందజేశారు. ఎన్నికల అఫిడవిట్లో తన వ్యక్తిగత వివరాలు దాచిపెట్టారని సుప్రీం కోర్టు ధర్మాసనం నిర్థారించి ఆయన ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది.

రైతు రుణమాఫీతో అనేక సమస్యలు:రఘురామ్ రాజన్

$
0
0

న్యూఢిల్లీ: రైతు రుణమాఫీతో అనేక సమస్యలు తలెత్తుతాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాజన్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు రుణమాఫీ వల్ల కొందరికి మాత్రమే ప్రయోజనం కలుగుతుందని, అసలైన పేదలకు లబ్ధిపొందలేరని అన్నారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీకి హామీ ఇచ్చిన విషయం విదితమే. వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు ఆటంకం కలుగుతుందని అన్నారు.

మహాభారతంలో ఉపాఖ్యానాలు-74

$
0
0

కాని ఇంద్రియాలను జయించిన వాడు, మనస్సును వశం చేసుకొన్న వాడు ఇహలోక పరలోక సుఖాలు పొందుతాడు. ఈ లోకంలో ఎవరినీ బాధించకుండా తన వృత్తినే చేసుకోవాలి. శిష్టుల ఉపదేశాన్ని అనుసరించి స్వధర్మాన్ని ఆచరించాలి. వివేకవంతుడు ఈ ధర్మాచరణలో ఆనందిస్తాడు. ధర్మబద్ధంగా సంపాదిం చిన ధనంతోనే జీవనం సాగిస్తాడు.
మానవుడు మనస్సుతో కోరుకొనే వాటిని అన్నింటిని తపస్సు వల్ల పొందుతాడు. ఇంద్రియ నిగ్రహం సత్యవాక్కు, మనోనిగ్రహం వల్ల మానవుడు పరబ్రహ్మను పొందుతాడు. కౌశికుడు ధర్మవ్యాధుని మరల ఇంకొక ప్రశ్న వేశాడు.
‘‘వ్యాధా! వేటిని ఇంద్రియాలు అంటారు? వాటిని ఎలా నిగ్రహించాలి? ఈ నిగ్రహానికి ఫలం ఏమిటి? దీని గురించి నాకు వివరించు’’
విషయం పట్ల అతని ఆసక్తిని గమనించి ధర్మవ్యాధుడు ఇలా వివరించాడు. ‘‘ఇంద్రియాల ద్వారా ఏ విషయమైనా తెలుస్తుంది. అలా తెలియడానికి మనస్సు ముందుగా ప్రవర్తిస్తుంది. అలా తెలిసిన తర్వాత మనస్సుకు దానిపైన రాగం కాని ద్వేషం కాని కలుగుతుంది. అప్పుడు వాటిని పొందడానికి మానవుడు ప్రయత్నిస్తాడు. కావలసిన రూప రస గంధాదులు దొరికితే వాటిని అనుభవిస్తాడు. వాటిపై రాగం కలుగుతుంది. అవి లభించకపోతే ద్వేషం కలుగుతుంది. తర్వాత కావలసిన వస్తువుపై లోభం కలుగుతుంది. ఆ తర్వాత మోహం కలుగుతుంది. వీటివల్ల పీడితుడైన అతని బుద్ధి ధర్మంపై పోదు. అధర్మంగా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. వంచనతో, ధనం సంపాదించడం వల్ల అతని బుద్ధి వాటి మీదే ఉంటుంది. అతని అధర్మప్రవర్తన వల్ల అతనిలోని మంచి గుణాలు నశిస్తాయి. పాపాత్ములు తమతో సరియైన పాపాత్ములతోనే స్నేహం చేస్తారు. ఇహలోకంలో దుఃఖపడుతారు. పరలోకంలో కష్టాలు, బాధలు అనుభవిస్తారు. అదే బుద్ధిమంతుడు తన తెలివితేటలతో సుదుఃఖాలలోని దోషాలు ముందే గుర్తించి వాటిని తొలగించుకొని మంచివారితో స్నేహం చేస్తాడు. సత్సాంగత్యం వలన అతని బుద్ధి ధర్మమార్గంలో నడుస్తుంది.’’
బ్రాహ్మణుడు అతని (వ్యాధుని) జ్ఞానం చూసి ఆశ్చర్యపోయాడు. అతనితో ఇలా అన్నాడు. ‘‘మహాత్మా! ధర్మవిషయాలలో నీ జ్ఞానం చూస్తే నీవు ఒక మహర్షివని నాకనిపిస్తుంది’’.
దానికి వ్యాధుడు ఇలా జవాబు చెప్పాడు. ‘‘్ధర్మాత్తులైన బ్రాహ్మణులు, పితృదేవతలు ఎప్పుడు ముందుగా భోజనం చేయదగినవారు. వారికి ఇష్టమైనదానిని చెపుతాను విను. ఈ పంచభూతాత్మకమైన చరాచర జగత్తు అంతా పరబ్రహ్మ స్వరూపమే. ఆ పరబ్రహ్మకంటే గొప్పది ఇంకేది లేదు. ఆకాశం, వాయు, అగ్ని, జలం, పృథ్వి ఇవి పంచభూతాలు. శబ్ద స్పర్శ రూప రస గంధాలు వాటి యొక్క గుణాలు.
ఈ పంచభూతాలే కాక ఆరవతత్వం ఉంది. అది మనస్సు. ఏడవతత్వం బుద్ధి. అహంకారం ఎనిమిదవది. ఇవికాక పంచ జ్ఞానేంద్రియాలు, ప్రాణం, సత్త్వరజస్తమస్సులు - ఈ పదిహేడు తత్వాలని అవ్యక్తం అంటారు. వ్యక్తవిషయాలు అవ్యక్త విషయాలు కలిపి 24 తత్త్వాలు అవుతాయి. ఈ తత్త్వాల సముదాయమే వ్యక్తావ్యక్త రూపమైన గుణాలు. ఇవన్నీ పరబ్రహ్మస్వరూపాలు’’.
ధర్మవ్యాధుడు ఇంకా ఇలా చెప్పాడు. ‘‘కంటికి కనిపించే ఈ శరీరమే రదము. బుద్ధి దాని సారథి. ఇంద్రియాలు గుర్రాలు అని శ్రుతులు చెప్తున్నాయి. బుద్ధిమంతుడు నేర్పరి అయిన సారథి గుర్రాలను అదుపులో ఉంచుకొని ప్రయాణం చేసినట్లు ఇంద్రియాలను తన వశంలో ఉంచుకొని జీవన మార్గంలో ప్రయాణిస్తాడు. తన గమ్యాన్ని చేరుకుంటాడు. ఆ గమ్యమే మోక్షము.
తర్వాత జిజ్ఞాసువు అయిన కౌశికుడు ధర్మవ్యాధునిని త్రిగుణాలు అయిన సత్త్వ రజ స్తమస్సుల గురించి వివరించి చెప్పమన్నాడు. అప్పుడు వ్యాధుడు త్రిగుణాల గురించి ఇలా విరించాడు. ‘‘కౌశికా! ఈ మూడింటిలో తమోగుణం మోహాన్ని కలిగిస్తుంది. రజోగుణం పనులు చేయడానికి ప్రేరేపిస్తుంది. సత్వగుణం సర్వశ్రేష్ఠమైనది. ఎప్పుడూ నిద్రపోయేవాడు, కోపిష్టి, సోమరి, ఇంద్రియ నిగ్రహం లేనివాడు తామసుడు. మిక్కిలి ఆశకలవాడు, ఇతరుల గుణాలలో దోషాలు ఎంచేవాడు, అభిమానం ఎక్కువ కలవాడు, సలహాలు ఇవ్వడంలో నేర్పరి రాజసుడు. జ్ఞానం అధికంగా కలవాడు, ధీరుడు ఇతరులలో దోషాలు ఎంచనివాడు, బుద్ధిమంతుడు, కోపం లేనివాడు సాత్వికుడు’’.
తర్వాత కౌశికుడు ప్రాణం ఏ ధాతువును ఆధారంగా చేసుకొని ఉంటుందని ప్రశ్నించాడు. ప్రాణం గురించి వివరించమని అర్థించాడు.
అప్పుడు ధర్మవ్యాధుడు ఇలా చెప్పాడు. ‘‘బ్రాహ్మణా! ప్రాణం శరీరాన్ని సురక్షితంగా ఉంచే అగ్ని స్వరూపమైన ఉదానవాయువు. అది శిరస్సును ఆశ్రయించి శరీరంలో ఉంటుంది. ముఖ్యంగా ప్రాణం శిరస్సు, ఉదానవాయువు రెండింటిలో ఉండి సంచరిస్తూ ఉంటుంది. మూడు కాలాలు ఈ ప్రాణాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఆ ప్రాణమే జీవుడు. అదే సమస్త జీవులకు ఆత్మ. అదే జాగ్రదవస్థలో మేల్కొని ఉండి స్వప్నావస్థలో కలలు కంటుంది.ఈ ప్రాణ సంచారం వల్ల ప్రాణిలో కదలిక ఉంటుంది. ఈ సంచారం ఆగిపోతే ప్రాణి మరణిస్తుంది అని అంటారు. ఈ ప్రాణమే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది.
పరమాత్మ సమస్త ప్రాణులలో ఉంటాడు. లోభ క్రోధాలని అణిచివేయటమే తపస్సు. ఇదే సంసార సముద్రాన్ని దాటించే నావ.
సుఖదుఃఖాలను రెండింటినీ వదిలినవాడే అనంతమైన బ్రహ్మపదాన్ని పొందుతాడు. ధర్మవ్యాధుడు మోక్షం గురించి ధర్మం ప్రాణం గురించి వివరించగా కౌశికుడు ఆశ్చర్యపడి వ్యాధునితో అతని ఈ జ్ఞానానికి కారణమేమిటని అడిగాడు. అప్పుడు వ్యాధుడు ఇలా సమాధానం చెప్పాడు.
ఇంకావుంది...

స్వాధ్యాయ సందోహం-169

$
0
0

బాల్య, కౌమార, వన, వృద్ధాప్యాల నన్ను క్రమ్ముకొంటాయి. దయతో నా ప్రార్థన విను. ‘సఖే సఖాయ మజరో జరిమ్ణే’ ‘‘ఓ మిత్రుడా! నన్ను వృద్ధాప్య దశనుండి రక్షించు. అయితే ఈ కోరిక దురాశతో కోరినదికాదు. నా శరీరం వృద్ధాప్య దశను తప్పక పొందేదది నాకు బాగా తెలుసు. కాని నేను కోరేది బాల్యంలోనో వనంలోనో ఆ వృద్ధాప్యదశ నా శరీరాన్ని ఆవహించ కూడదన్నదే నా ప్రార్థన. ఓ విత్రుడా! ఈ నా మరొక ప్రార్థన విను. నీవు మరణ రహితుడవు. శాశ్వతుడవు. అమృత స్వరూపుడవు. మృత్యువు నీ దరికి వచ్చేందుకు కూడ భీతి చెందుతుంది. కాని మమ్ములను మరణమే సహజ ధర్మంకలవారిగా పుట్టించావు. కాని మమ్ము పసిరికాయలా, కుళ్లిన పండులు మృత్యువనే చెత్తబుట్టలో పడవేయకు. ‘మర్త్యాన్ అమర్త్యస్త్వం నః’ ‘‘మృత్యువునుండి అమర్త్యుడవైన నీవే ముమ్మ రక్షించు’’ మిత్రుడవైన ఓ దేవా! నా రుూ కోరికలను వమ్ము(వ్యర్థము) చేయవు గదా!
***
155. మరణానికి ముందే
దైవాన్ని ఆశ్రయించు
ఆ వో రాజానమధ్వరస్య రుద్రం హోతా రం సత్యయజం రోదస్యోః
అగ్నిం పురా తనయిత్నోరచిత్తాద్ధిరూపమవసే కృణుధ్వమ్‌॥ ఋ.4-3-1.
భావం:- మృత్యువుచే కబళింపబడి మరణించక ముందే యజ్ఞ నిర్వాహకుడగు హోత, ఊర్ధ్వ, అధోలోకాలు రెండింటిని సంయోజన చేసే యాజ్ఞికుడు మరియు భయంకరుడగు రుద్రుడే అయినా బంగారు కాంతులీను హిరణ్మయ రూపుడగు భగవానుని ఆశ్రయించి రక్షణ పొందు.
వివరణ:- భగవంతుని సృష్టియే ఒక యజ్ఞం. అదే అధ్వరం. అధ్వ= మార్గాన్ని ‘ర’=చూపేది. జీవుడికి ఉన్నతమైన మార్గాన్ని ఈ లోకంలోనే చూపుతుంది కాబట్టి అది అధ్వరమని సార్థక నామధేయాత్మకమైంది. సృష్టిరూపమైన యజ్ఞానికి పురోహితుడు విధాత -బ్రహ్మ. కాబట్టి ఈ యజ్ఞంలో లేదా అధ్వరంలో హింసకు తావే లేదు. ఓ మానవుడా! ఇట్టి అధ్వరంలో హింసా రహితుడవై పాల్గొను. అహింస సత్యానికి మరో రూపం. భగవంతుడు అధ్వర రూపమైన ఈ సృష్టికి చెందిన సర్వవ్యవస్థలను సర్వశ్రేష్ఠమైన ‘సత్య’్ధర్మమనే పునాది మీదనే సృష్టించాడు. అథర్వణ వేదంలో స్వయంగా భగవంతుడే-
సత్యం బృహదృతముగ్రం దీక్షా తపో బ్రహ్మ యజ్ఞ?
పృథివీం ధారయంతి॥ అథ.వే.12-1-1.
‘‘మహత్తమ సత్యం, మహోగ్ర ఋతం, దీక్ష, తపస్సు(జ్ఞానం) యజ్ఞం ఇవన్నీ భూమిని వహిస్తున్నాయి’’అని ఉద్ఘాటించాడు. ఆ కారణంగా ఆ దైవమే ‘సత్యయజం రోదస్యోః’ ఊర్ధ్వ-అధోరూపమైన రెండు లోకాలలో సత్యమైన యాజ్ఞికుడు. సృష్టి సమస్త వ్యవస్థలను సువ్యవస్థితం చేసేవాడు కూడ ఆ దైవమే. ఆ దైవ నిర్మితమైన వ్యవస్థల కారణంగానే పాపులకు కష్టాలు కలుగుతాయి. దానివలన వారు రోధిస్తారు. ఎందుకంటె దృశ్యమానమైన సృష్టి మరియు యజ్ఞకర్త బ్రహ్మచారికి రుద్రుడుగా కనబడుతాడు. వాస్తవానికి ఆ దైవం భయంకరమైన రుద్రుడు కాడు. ‘హిరణ్మయ రూపమ్’బంగారు శరీరచ్ఛాయతో ప్రకాశించే సుందరాకారుడు. అట్టివాడు పాపులకు ‘రుద్రుడు’గా ఎందుకు కన్పడుతున్నాడు? అంటే వారు తమ పాపకర్మలచేత దైవానికి దూరంగా జరిగిపోయినవారు కాబట్టి. కాని సత్కర్మాచరణతో దగ్గరైన పుణ్యాత్ముల కా రుద్రుడు రుద్రుడు కాడు. హిరణ్మయ రూపుడే. అందుచేత పాపాచరణమే మృత్యువు. అది తలమీద తాండవిస్తూ ఉన్నదన్న జాగరూకత కలవాడు అమృతుడవుతున్నాడు. ‘మహద్భయం వజ్రముద్యతం య ఏతద్విదురమృతాస్తే భవంతి’ ‘‘అని ఉపనిషత్తు వచిస్తూంది. అందుచేత ఓ మానవుడా! ఆ మృత్యు వజ్రదండం తలమీద పడకముందే హిరణ్యరూపుడైన భగవంతుని ఆశ్రయించి రక్షకునిగా పొందు. ‘అగ్నిం పురా... కృణుధ్వమ్’అని ఉపదేశిస్తూందీ మంత్రం. అలా పొందిన వానిని మృత్యువేమి చేయగలదు? కాబట్టి పాపమృత్యువు కబళింపకముందే భగవదాశ్రమాన్ని పొందాలని ‘ఇహ చేదవేదీదథసత్యమస్తి’ (కేనోపనిషత్తు.2-5) ‘ఈ జన్మలోనే తెలిసికొంటే చాల ఉత్తమ’’మని కేనోపనిషత్తు హితోపదేశం చేస్తూంది. మరి ఎవ్వరూ దీనిని పెడచెవిని పెట్టరుగదా!
**
156. మనమేమి పాపం చేసామో ఎవరికి తెలుసు?
కిం స్విన్నో రాజా జగృహే కదస్యా- తి వ్రతం చక్రూమా కో వి వేద:
మిత్రచ్చిద్ధి ష్మా జుహురాణో దేవాన్ శ్లోకో న యాతామపి వాజో అస్తి॥ ఋ.10.12.5.
భావం:- రాజరాజేశ్వరుడయిన భగవానుడు మావి అయిన వానిని వేటిని తీసుకొన్నాడు?
ఇంకావుంది...


ఆలోచన కర్త

$
0
0

‘యేసు ప్రభువు ఆశ్చర్యకరుడే కాదు ఆశ్చర్యకరమైన ఆలోచనలు ఇచ్చే ఆలోచనకర్త. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడను గ్రహించబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతియని అతనికి పేరు పెట్టబడెను’ - యెషయా 9:6
ఈ లోకములో మనము ఎలా ఉండాలో ఏమి చేయాలో ఎలా చేయాలో ఎలా మాట్లాడాలో ఎక్కడ ఉండాలో ఏమి చూడాలో ఏమి చూడకూడదో పిల్లలను ఎలా జాగ్రత్తగా పెంచాలో ఎలా కాపాడాలో ఎటువంటి సలహాలు ఇవ్వాలో తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో ఆర్థిక విషయాల్లో ఏమి చేయాలో ఎలా చేయాలో వివాహ విషయాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో పనులలో ఎలా ఉండాలో దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలో ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు ఎలా కాపాడుకో వాడాలో కుటుంబం పట్ల బాధ్యత సంఘం పట్ల సమాజం పట్ల ఎటువంటి బాధ్యత వహించాలో మన జననము నుండి మరణము వరకు అన్ని విషయాలలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆలోచనలు ఇచ్చే దేవుడు మన దేవుడు. పెద్దలను తోటివారిని ఎలా గౌరవించాలో తేటగా తెలియజేశాడు.
బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు యేసు ప్రభువు నందే గుప్తమై యున్నవి. మనము ఎటువంటి పరిస్థితులలో ఉన్నా ఎంత చిక్కుల్లో ఉన్నా ఎంత గడ్డు సమస్య అయినా ఏమి చేయాలో ఎలా చేయాలో ఎటు వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితులలో అనారోగ్య పరిస్థితులలో ఆర్థిక ఇబ్బందులు పిల్లల తొందర ఆఫీసు వత్తిడి తోటివారితో ఇబ్బందులు లాంటి అన్ని విషయాలలో కూడా సరియైన ఆలోచన ఇచ్చే దేవుడు. విశ్వాసముతో ఆయన సలహా కోరితే చక్కని ఆలోచన ఇచ్చి మనలను నడిపించే ప్రభువు.
ఈ లోక జ్ఞానము ఎంత ఉన్నా ప్రభువు జ్ఞానము ఆలోచన లేకపోతే ఉపయోగం ఉండదు. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేసి యున్నాడు. ప్రభువు బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. జ్ఞాన కార్యములు ఆయన యొద్ద ఉన్నవి. ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ప్రభువే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును.
ప్రతి విషయములో ముందు ప్రార్థన ద్వారా ప్రభువు సలహాను తీసుకోవాలి. అది ఎటువంటి పనియైనా చిన్న విషయమైనా పెద్దవైనా సరియైన సలహా ఇచ్చే దేవుడు. సర్వజ్ఞానియైన దేవుని ఆలోచన మనకు ఎంతో ఉపయోగపడుతోంది. జరుగబోయే విషయాలు తెలిసిన దేవుడు గనుక సరియైన సలహా దొరుకుతుంది. మనకైతే ఇప్పటి సంగతులే తెలుసు గాని ప్రభువుకు జరుగబోయే విషయాలు కూడా తెలుసు. మన ఆలోచనల కంటె ప్రభువు ఆలోచనలు భూమి కంటె ఆకాశము ఎంత ఉన్నతమో అంత ఎత్తుగా ఉన్నవి.
ప్రభువు మన గురించి ఆలోచించుచున్నాడు గనుక మన గురించి ప్రభువుకు కలిగిన ఉద్దేశాలు ఎంతో సమాధానము కలుగజేసేవి. నిరీక్షణ కలుగజేసేటువంటివి. యేసు ప్రభువు పేతురును అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ప్రభువు వారిని పిలిచి నా వెంబడి రండి నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేయుదును అని చెప్పగా వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ప్రభువును వెంబడించిరి. అయితే ప్రభువు ఆలోచన మేరకు వారు వెంటనే వెంబడించటం ఎంతో ఆశీర్వాదము. ఒక్కొక్కసారి ప్రభువు మనలను కూడా పిలిచినప్పుడు చాలా ఆలోచిస్తాం. ఎవరెవరి సలహాలో అడుగుతాం. ఎంతో సమయాన్ని తీసుకొంటాం. ఎంతో అమూల్యమైన సమయాన్ని పోగొట్టుకొని చివరకు వస్తాము. కాని దేవుని సలహాను వెంటనే అంగీకరించటం ఆశీర్వాదము. మంచి ఉద్యోగం వదిలి సేవకు రమ్మంటే ప్రభువు సలహాకన్నా ఉద్యోగమే ఎక్కువగా భావించి, పదవీ విరమణ తరువాత వెళ్లవచ్చునులే అనుకుంటారు. అప్పటికే అమూల్యమైన సమయము దాటిపోతుంది. ప్రభువును వెంబడించటం ద్వారా చేపలు పట్టి వాటిని చంపే జాలరులు ఆత్మీయంగా చనిపోయిన మనుషులను పట్టి బ్రతికించేవారయ్యారు. ప్రభువు సలహాను పాటిస్తే మనకు ఆశీర్వాదము మన ద్వారా అనేకులు బ్రతికించబడతారు.
ప్రభువు ఇచ్చిన సలహాను మిగుల ఆస్తిగల యవ్వనుడు పాటించలేక పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నట్టు చూస్తున్నాం. నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించమని చెప్పిన సలహాను నిర్లక్ష్యపెట్టి సర్వాధికారిని, ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పోగొట్టుకున్నట్టు తెలుస్తుంది.
అబ్రహామును యెహోవా దేవుడు పిలిచి - నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించిన వాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అని చెప్పినప్పుడు అబ్రహాము ప్రభువు చెప్పినట్టు చేసి అద్భుతంగా ఆశీర్వదించబడ్డాడు. సమస్తమైన వంశములు ఆయనలో ఆశీర్వదింపబడ్డాయి. ప్రభువు సలహాను పాటిస్తే నీవు నేను కూడా అద్భుత రీతిగా ఆశీర్వదింపబడతాము. అంతేకాదు అనేకులకు ఆశీర్వాదముగా ఉంటాము.
ప్రభువు ఆలోచనలు విని వాటి ప్రకారము చేయువారు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి యుండును. వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. ప్రభువు ఇచ్చే సలహాలు బండ వంటి పునాది వంటిది. జీవితాలను కట్టుటకు ప్రభువు ఆలోచనలను పాటిస్తే ఎంతో నెమ్మదిగా ఉంటుంది. సాత్వికము కలిగి ఉండమన్నాడు. కనికరము హృదయ శుద్ధి కలిగి సమాధానముగా ఉంటూ సత్క్రియలు చేసుకుంటూ లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉండి నీతి న్యాయము కలిగి సత్యముగా ఉంటూ కోపము మాని మోహపు చూపుతో చూడవద్దు. మీ మాటలు అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టు ఉండాలి. శత్రువులను ప్రేమించమని హింసించువారి కొరకు ప్రార్థన చేయుమని, పరిశుద్ధంగా ఉండమని, ధర్మము చేయునప్పుడు ఎవరికీ తెలియకూడదు అది. ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనము చేయుచు తోటి వారిని క్షమిస్తూ ధనాశ లేకుండా తీర్పు తీర్చకుండా సహోదరులతో ఐక్యత కలిగి ఉంటూ, దేవునికి అంటుకట్టబడి మంచి ఫలములు ఫలిస్తూ ఎవరినీ హింసించక ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపమని అనేకమైన ఆలోచనలు ఇచ్చారు. ఆయన మాటలు పాటించిన వారు అనేకమైన మేలులు పొందుకున్నారు. ఆయన రాజ్యాన్ని పొందుకున్నారు.
సీమోను పేతురు చేపలు పట్టుటకు వెళ్లి రాత్రంతా శ్రమ పడినా ఏమీ దొరకలేదు కాని ప్రభువు వారికిచ్చిన చిన్న సలహా మేరకు కుడిప్రక్కన వల వేసి విస్తారమైన చేపలు పడినందున వలను ఒడ్డుకు లాగలేక పోయారు. ప్రభువు సలహా మనకు సమృద్ధిని క్షేమాన్ని కలుగజేస్తుంది. ప్రభువు సృష్టికర్త గనుక ఎక్కడ ఏముందో ఎలా ఉందో సమస్తము ఎరిగినటువంటి వాడు సరియైన ఆలోచన సరియన సమయములో ఇస్తాడు.
ఈ దినాలలో తల్లిదండ్రుల సలహాలే లెక్కచేయటం లేదు. అధికారులను లెక్కచేయటం లేదు. అంతా మాకే తెలుసు అనుకొని సొంత నిర్ణయాలు తీసికొని వివాహ విషయములలో అనేకమైన శోధనలకు గురవుతున్నారు. దేవుని ఆలోచన ప్రకారము చేసినట్లయితే ఆ కాపురం బండ మీద కట్టబడిన ఇంటి వలె ఉంటుంది. స్ర్తిలు తమ సొంత పురుషులకు లోబడి ఉండాలని ప్రభువు సలహా. కాని సొంత పురుషులను అస్సలు లెక్కచేయడం లేదు. మీ భార్యలను ప్రేమించమంటే, ఇక భర్తల సంగతి తెలిసిందే. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు ఉన్నారు. ఇలా ప్రభువిచ్చిన చిన్నచిన్న సలహాలు పాటించకుండా ఎన్నో కుటుంబాలు గలిబిలిగా ఉన్నాయి. ఎన్నో శోధనలు బాధలు ఎదుర్కొంటున్నారు. ప్రభువు ఆలోచనలు పాటించక పోతే ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుని పోలి యుండును. కనుక గాలివానలు వరదలు లాంటి శోధనలు ఇబ్బందులు బాధలు ఎదురైనప్పుడు ఆ ఇల్లు కూలిపోతుంది. దాని పాటు గొప్పదని ప్రభువు సెలవిస్తున్నాడు.
బైబిల్‌లో ప్రభువిచ్చిన ఆలోచనలు, సలహాలు, సూచనలు పాటించి బండపైన కట్టబడిన ఇంటి వలె బుద్ధిమంతుల వలె ఉంటూ ఇప్పటినుండైనా సంతోష సమాధానాలు ఆనందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ సహాయము చేసి క్రిస్మస్ బహుమానముగా అనుగ్రహించునుగాక.

సుందరకాండ

$
0
0

తరువాత ఆ తల్లియొక్క దర్శన రూపమైన విద్యను లోకానికి అందించిన వాడు నంది. అందుకనే ఆ తల్లిని గురించి చెప్పే మహావిద్యకు నంది విద్యా అని పేరు. తద్విద్యారూపమైన అమృతాన్ని లోకానికి పంచి అమృత మయముగా లోకాన్ని సంరక్షించిన ఘనత నందీశ్వరునిది.
స్వామి కూడా అట్టి స్థితిలో ఉన్నాడు-
సీతానే్వషణలో ఉన్న వానరులు నిరాశతో దైన్యంతో మృతప్రాయులై ఉండగా- మొట్టమొదట సీతాదర్శనమును తానుచేసి- ఆ తల్లిని గురించి తన జ్ఞాతికి చెప్పి వారిని అమృతులను చేస్తాడు.
ఈ విధంగా జ్ఞాతి దుఃఖాన్ని ఈ జాతి దుఃఖాన్ని పోగొట్టిన స్వరూపం ఆంజనేయస్వామిది. అందుకని ఆయన నందీశ్వరుడు. ఆయన చేసిన సీతా ప్రసంగం నంది విద్య.
నందికి రుద్రునకు అభేదం. అట్టి శివాంశ అయిన స్వామి సీతానే్వషణమునకు బయలుదేరుతున్నాడు.
ఒకప్పుడు శుంభ నిశుంభులనే రాక్షసుల్ని మహాశక్తి సంహరింపవలసి వచ్చింది. ఆ సమయంలో ఆ తల్లి శివుని పిలిచి
దూతస్త్వం గచ్ఛ భగవాన్ పార్శ్వం శుంభ నిశుంభయోః
అని దూతగా పంపించింది. ఆయన వెళ్ళి శంభు నిశుంభలకు పరాశక్తి యొక్క సామర్థ్యాన్ని చెప్పి ఆమె అనుగ్రహాన్ని పొందమని ఉపదేశిస్తాడు. వాళ్ళు ఆరుద్రుణ్ణి కూడా పరిహసిస్తారు. శివుడు తిరిగి వచ్చి ఆ విషయాన్ని ఆమెకు నివేదిస్తాడు.
ఆమె ఎందుకిలా పంపింది అనే రహస్యాన్ని
శివదూతీ స్వరూపేణ హతదైత్య మహాబలే.
అనే స్తుతిలో దేవతలు తెలియజేస్తారు. ఎవరి యందు రుద్రదృష్టి పడుతుందో వాళ్ళు క్షీణిస్తారు. అందుకని రుద్రుని వాళ్ళ దగ్గరకు రాయబారపు వంకగా పంపి వారిని కృశింపచేసింది. అలా కృశించిన వారిని తాను సంహరించింది. ఇప్పుడామెకు ‘‘శివదూతీ’’ అని పేరు.
ఈ లక్షణ: ఆంజనేయస్వామి బయలుదేరడంలో ఉంది. శత్రుకర్శనః అనే మాటకు అర్ధం ఇది. సుగ్రీవుడు సీతానే్వషణానికి పంపితే స్వామి సీతానుజ్ఞతో రావణుని చూడడానికి వెడతాడు.
అందుకని ఆమె శివదూతి.
పెరిగిన స్వరూపంతో హనుమ ఆ పచ్చికబయళ్ళలో ముందుకి వెనక్కి నడుస్తున్నాడు.
ఆ సమయంలో స్వామిని-
అధ వైడూర్య వర్ణేషు శాద్వలేషు మహాబలః
అని మహర్షి చూపెడతారు. ఇక్కడ మహాబలుడు వాయువు కూడాను. ఎరగడానికి సిద్ధమైన స్వామి వాయుతత్వాన్ని పొందేడు. అలా పొందడం వలన పచ్చికబయళ్ళు వైడూర్యాల్లా కనబడుతున్నాయి. ఎందుకని!
వాయో? వైడూర్య సంజ్ఞకం అని
‘‘పంచ సంఖ్యోపచారిణి’’ అయిన పరాశక్తి నీల ముకాఫల కౌస్త్భు వైడూర్య పుష్యరాగాలనే పంచరత్నములచేత సేవింపబడుతూ ఉంటుంది.
ఇంకా ఉంది

శ్రీ పరమహంస బోధామృతము

$
0
0

తదనుసారము సమీప గ్రామమందలి రామచంద్ర ముఖోపాధ్యాయుని కుమార్తెయగు శారదామణీదేవియను నైదేండ్ల బాలికను శ్రీరామకృష్ణునకు ఇచ్చి పెండ్లిచేసిరి. కాని యాతని పిచ్చి మాత్రము కుదరలేదు. అది దివ్యోన్మాదముగదా! అనతికాలముననే 1860-వ సంవత్సరమున తిరిగి దక్షిణేశ్వరము వచ్చినంతనే భగవదున్మాదమున మునిగిపోయెను.
ఇంతవఱకును శ్రీరామకృష్ణుడు తన భక్తిసాధనలను ఏ గురు సాహాయ్యమును లేకయే స్వయముగా సాగించుచుండెనని చెప్పనగును. ఇంతటి నుండియు దై వనిమంత్రితులై గురువులాతని వెదకికొనుచు రాసాగారి. పూవు వికసించినంతనే మధుపము దానిని వెదకికొనుచు రాకుండునా? శ్రీరామకృష్ణుడా గురువరేణ్యుల సాయమును గొని శాస్త్రోక్తముగా వివిధ సాధనల నభ్యసింపసాగెను.
బ్రహ్మానుభవమున నితరసాధకులకును శ్రీరామకృష్ణునకును రెండు విషయములలో విస్పష్టమగు భేదముగాన్పించును. ఏ సాధన నవలంబించినను ఆతడతి శీఘ్రముగా సిద్ధినిబొందుట మొదటి విషయము. ఆతని సత్యానే్వషణమునందలి తీవ్రతయే- ఆతని యనిర్వచనీయ భగవత్పరితాపమే- ఇందులకు కారణమని చెప్పనొప్పును. మానవ కోటి మత చరిత్రలో నింతకుముందు కనివిని యెఱుంగని వివిధ సాధనల నాత డభ్యసించుట రెండవ విషయము. ఆతని జీవితము బ్రహ్మానందానుభవ నందనవనమై, సర్వమత సామరస్య నిలయమై దీపించుటకిదియే హేతువ.*
శ్రీరామకృష్ణుని ప్రథమ గురువు భైరవీ బ్రాహ్మణియను యోగినీమణి. ఈమె విశేష విద్యావంతురాలు, తాంత్రిక సాధనలయం దఖండ విజయమును బడసిన మహనీయురాలు.
* (‘బ్రహ్మానంద తేజము బహువిధములుగా ప్రకాశితమై శ్రీరామ కృష్ణుని దివ్య జీవితమున సామరస్య దేవాలయమును నిర్మించియున్న’దనియు ‘ఆ దేవళమున కివే నా ప్రణతు’అనియు కవి చంద్రుడు రవీంద్రుడు నుడివి యున్నాడు.)
అరువది నాలుగు శాక్తేయ తంత్రములందునుగల ప్రధాన సాధనలనన్నిటిని శ్రీరామకృష్ణుడీమె శిక్షణమున జయప్రదముగా నభ్యసించెను. దైవమును జగజ్జననిగా భావించి సాగింపవలసిన యోగసాధనలలో ననేకము కష్టాత్కష్టతరములు,

ఇంకావుంది...

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి

అనంతం-10

$
0
0

‘‘ఎట్టా’’
‘‘మంచి బువ్వెట్టి మందుగోలీలు మింగిచ్చి దేవుడి పందికి శావలు జేస్తే - మడుసుల్లో యింకా భక్తి ఉండట్టు. పంది దారి పందిదంటే భక్తి లేనట్టు’’
‘‘ఏందేలింది’’ అని కాళీచరణ్ అడిగాడు
‘‘ఉండట్టే ’’
‘‘ఎట్టా’’
‘‘జొర్గవ్ తగ్గాలని పూజలే జేశారా. పొర్లు దండాలే బెట్టారా కొబ్బెరకాయలె గొట్టారా సివరాకరికి సర్కారు గూడా పందికి మంచి వైజ్జిగం సెయ్యాలని ఆడరేసింది’’
‘‘్భక్యా తండా వోళ్ల గూడా జొరాలోచ్చి సత్తన్నారు ఎయ్యలేదే ఆడరు’’ అని అడిగాడు కాళీచరణ్
బాణావతు కొంచెంసేపు ఆలోచించాడు
‘‘ఇది మాయదారి లోకం డీ కాళీచరణ్ ఈ లోకవ్ లో మనసువంటోళ్లు పందులకన్నా కుక్కల కన్నా ఎలకాసిలకల కన్నా సివాదోమలకన్నా నీశం! నీశాతి నీశం!’’ అన్నాడు బాధగా
కాళీచరణ్ వౌనంగా నడవసాగాడు. కొంతదూరం వెళ్లేదాకా ఎవ్వరూ మాట్లడలేదు.
‘‘కొడుకుదే దిగులయ్యింది ’’కాళీచరణ్ అన్నాడు
‘‘రాగ్యాగాడి యిసయమేనా’’
‘‘ఇంకెవ్వుడూ .. ఆడే’’
‘‘ఏటైందేటి ’’అడిగాడు బాణావతు
‘‘సంతెకి బొతావత్తా పట్నపోళ్ల మాయలోబడింటు సెప్పింది యినుకొలేదు పెడసరవ్ గయ్యిండు’’
‘‘ఆడూ సెడిపోయిండూ’’
‘‘సిన్నగంటవే ఇంగిలీసు సిల్మాలంట సిగిరెట్ల బ్రాందీలంట’’
‘‘గుట్కాలూ ఇస్కీలంట.. శానా గలీజయ్యిండు’’
‘‘్ధయిర్నెంగుండు కొండదేవరే ఉండాడు’’
‘‘మంచోళ్లని మంచిగా ఉంచుతాడే వోగానీ సెడిన్నాకొడుకుల్నేటి శాత్తాడు దేవర! నా గాశారం అట్టాగుంది తోసటం లేదు’’
‘‘సిగిరెట్లు బ్రాందీ యిస్కీ గూడా మరిగిండా’’
‘‘మరిగిండు.. తాగిండంటే మడిసి కాదు మైండు పోయిద్ది’’
‘‘బువ్వని పెండంటాడు. పెండని బువ్వంటాడు. మరాటడికి బువ్వెఎట్టాల్నో పెండే బెట్టాల్నో’’
‘‘అమ్మ లేనోడని గారబం జేత్తే అంతే’’
‘‘అనుభగిత్తున్నాను’’
’’అదేవంటే తండాలో ఉండడంట పట్నం బోయి గొప్పోళ్లకాడ ఉద్దోగం శాత్తానంటాడు. డబ్బులు సంపాయిచ్చి పులిగో సెచిన్నూ ఉంగరాలు దొడిగి సూటూ బూటూ యేత్తాడంట. తనంత మడిసి సూటూబూటూ ఏసి సిగిరెట్లు దాగుతా సిలకలెంట బడతా సీదర మాటలు మాట్సాడ్తా కళ్లబడితే సిల్మావోళ్లు రమ్మంటారంట’’
‘‘మావోడికి పైచ్చికారితనం గాకపోతే సిలకలెంటబడతా సీదర మాటలు మాట్టడతా సిగిరెట్లు గాల్సే సెట్టంత మడ ఇసంట వాళ్లకాడ లేరూ రుూ నాయాలే గావాలా!’’
‘‘పట్న పోళ్ల కాడ సదువుంది. మాటకారితనవూ బిత్తర తనవూ వుంది. గడ్డీ గాద గర్సి పెద్దోళ్లు దాపెట్టిన సొత్తుంది. పగలు పని, రేత్తిరిళ్ళు దతొంగతనాలు సెయ్యకుండా బతికే ఆదరువుంది. నీకేవుందిరా గోసీ అంటే ’’
‘‘ఇయ్యాల్సి గోసీలే రేపటి మినిట్టర్లని సదువు లేనోళ్లకే అతికారమని ప్రెగది పతంలోకి దేశం ఉరుకుద్దనీ సెప్తుండు’’
‘‘పట్నపోళ్ల బిత్తర మాటలు నమ్మిండా ’’అని అడిగాడు బాణావతు
‘‘రాగ్యాగాడి కుండొద్దూ గేనం
‘‘అవుడియా అన్నాడు బాణావతు
‘‘ఏంటిదది
‘‘నగ్గూరాంగాడి కూతురు శాందినీ సక్కంగుంటుంది
‘‘రాగ్యాగాడికీ శాందినీకీ లగ్గం జేస్తే సంసారంలో బడి సక్కంగుంటడు’’
‘‘ఒస్ అదా నీఅవుడియా’’
‘‘బాగాలేదా’’
‘‘బాగ్గానే ఉంది’’
‘‘ఇంకేమరి ’’
‘‘నగ్గురాంగాడు పిల్లనియ్యడు సచ్చినా ఒప్పుకోడు’’
‘‘ఎంటికని’’
‘‘ఒకపాలి శాందినీని రాగ్యా ఏంచేసిండో తెల్సా’’
‘‘తెలవదే..’’
‘‘పట్నంలో ఇంగిలీసు సిల్మా సూసొచ్చిండు. సిల్మాలో రుూరో రుూరోయిన్ని సెరిసిండంట సెరిపిచ్చుకున్న ఆడకూతురూ సెర్చిన మొగకొడుకూ నగుతానే మళ్ళా మళ్లా సెరసి సెరపిచ్చుకున్నారంట’’
‘‘సిల్లాల్లో అట్టా గుంటుందా’’ బాణావతు అడిగాడు
‘‘సిల్మాల్లో అంతే ’’అన్నాడు కాళీచరణ్
‘‘అయితే ’’
‘‘సిల్మా యిడిసినాక జీవులెక్క ఇంటికొచ్చిండు రాగ్యాగాడు’’
‘‘బువ్వదిని తొంగుండా’’
‘‘తొంగుంటే కతే వుంది. తొంగోలేదు. తూల్తా తూల్తా తూల్తా సింతల తోపుకాడికెళ్లిండు సెమ్మట్లుకొచ్చిన శాందినీ సెయ్యట్టుకొని సాటుకు లాగబోయిండు’’
‘‘అపుడేవయ్యింది’’
‘‘శాందినీ శాకులాంటి పిల్ల . పులులకీ సింహాలకీ భయపడని దైర్నంగల పిల్ల యవ్వారం సెడిదంటే సివంగోలే దూకే పిల్ల..’’
‘‘భయ్యంతో పారెళ్లిందా’’
‘‘మావోడే పారెళ్లిండు’’
‘‘అదెట్టాగా ’’
‘‘సెంబుతో గొట్టింది తలమీద బొప్పిలెగిసింది
‘‘ఇదంతా ఎవ్వురికీ తెలవదే’’
‘‘దాపెట్టినావు పరువుపోయిద్దని’’
వాళ్లు నల్లకొండకు చేరకొన్నారు. అలుపు తీర్చుకుంటూ ఒక్కక్షణం వౌనంగా నిల్చున్నారు.
‘‘తేనె పట్టు యాడుంది’’ నెమ్మదిగా కాళీచరణ్ అడిగాడు
‘ఆడ’ అంటూబాణావత్ వ్రేలు చూపించాడు
తలెత్తి అటువైపు చూశాడు కాళీచరణ్ అతని మొహం సంతోషంగా విప్పారింది.
పక్కపక్కనే ఉన్న రెండు టేకు చెట్లను ఆసరా చేసుకొని వ్రేలాడుతూ ఒక పెద్ద తేనె పట్టు కనిపించింది
‘‘ఎంత పెద్దగుంది’’ అన్నాడు కాళీచరణ్
‘‘అందుకే మరి నినె్నంట దెచ్చింది. పట్టుకొడితే రెండు బుగ్గలు నిండుతయ్యి సెరోబుంగ నె్తం మీద మోసుకపోవొచ్చు. నీ శాకరి నే నుంచుకొనే్ల’’
బాణావతు మాటలకు కాళీచరణ్ భుజాలు ఎగురవేసి ‘‘ఎంతిత్తావేటి ’’అని అడిగాడు నవ్వుతూ
‘‘కోర్నంతా ’’అని బాణావతు కూడా నవ్వాడు
ఇద్దరూ అలాసరదాగా మాట్లాడుకుంటూ తేనె పట్టు దగ్గరికి వెళ్లారు..
(ఇంకా ఉంది)

మధురభాషణం

$
0
0

అధికముగా మాట్లాడిన వదరుబోతని, మాట్లాడనిచో ముంగి అని మాటలు వచ్చిన వారిగురించి పలు వ్యాఖ్యానాలు చేస్తుంటారు. జ్ఞానులు మితభాషిణులు, మూర్ఖులు అతి ప్రసంగము చేస్తారని కూడా అంటారు. మాట కన్నా వౌనం గురించి తెలుసుకొంటే అందరూ మాటలు వదిలేసి ఆ వౌనంలో ఉండే మాధుర్యాన్ని గ్రోలడానికే ఇష్టపడుతారని చాలామంది పండితులు అంటారు.
నిజమే. ఎందుకంటే ఎన్నో పుణ్యకార్యాలు చేసి సంపాదించుకున్న పుణ్యంతో వచ్చిన జన్మ మానవజన్మ. ఈ జన్మలోనే మంచిచెడు వివేకం ఉండేది. పుణ్యాన్ని పాపాన్ని సంపాదించుకోగల శక్తి ఉండేదీ జన్మలోనే. కనుక మాట తో ఎదుటి వారిని బాధించి కాస్త పుణ్యమేథైనా మన ఖాతా భగవంతుడు వేసి ఉంటే దాని ఖర్చు చేసుకోవడ మెందుకు? ఈర్ష్యాసుయలు, రాగద్వేషాలు, పోటీతత్వము ఇవన్నీ సాధారణ మనుష్యుల్లో ఉండేదే. చాలామంది అందరికన్నా గొప్పగా ఉండాలన్న తాపత్రయంతో ఎన్నో అబద్ధాలు లేని సంపద ఉన్నట్టుగాను లేనిపోని అబద్ధాలు చెప్పి దాన్ని నిజం చేసుకోవడానికి మళ్లీ అబద్ధాలు ఇలా తప్పులు మీద తప్పులు చేస్తూ వెళ్లి పాపసంచయాన్ని పెంచుకుంటుం టారు.
ఈ ప్రపంచంలో ఎవరు తక్కువ కాదు. ఎవరూ ఎక్కువకాదు. ధనము, వస్తువా హనాలు, ఆభరణాలు ఇలాంటి వాటి ల్లో ఎక్కవ తక్కువలు చూసుకుంటేఇవన్నీ శాశ్వతమైనవి కాదు. ఒకరోజు ఉంటాయ,. మరుసటి రోజు పోతాయ. వీటిని చూసుకొని తామే గొప్పవారిమి అని భావిస్తే చివరకు ఏమీ లేనివారిగామారుతారు. అందుకే ఏది శాశ్వతమైనదో ఏది నిత్యమైనదో ఏది సత్యమైనదో తెలసుకొని ఆ తర్వాత మాటా లడితే అపుడు మాటలు కన్నా పరమాత్మ గురించి తెలసుకోవడమే మేలు అని పిస్తుంది. ఎపుడెప్పుడు ఈ దేహంలో ఉన్న ప్రాణి లేదా జీవుడుండగనే మంచి పనులు చేసి ఆ పుణ్యంతో భగవంతుని సన్నిధానానికి వెళ్దామా అని ఆలోచిస్తారు. భగవంతుని గురించి తెలసుకోవడానికి తనలోకి తాను చూడడం మొదలుపెడతాడు. అంతర్ముఖుడు అవుతాడు. దానితో ఇక మాటల ప్రసక్తి ఉండదు. ఒకవేళ మాటలు వచ్చినా అవి అన్నీ భగవంతుని విభూతులగురించి యే ఉంటాయ. కనుక అవి అన్నీ మధుర భాషణాలుగా కీర్తించబడుతాయ.
భగవంతుని కిష్టమైన పనులు చేయడంలో చేతులు ఉత్సాహం చూపించడంతో మనసా వాచా కర్మణా భగవంతుని సేవ చేస్తూ కాలయాపన చేయడం ఆరంభవౌతుంది. ఆ ఆరంభ మమే మంచిమాటలు నుడవడానికి ప్రాతిపదిక అవుతుంది. మాట విలువ తెలిసి, మసలుకోవాలి. సందర్భశుద్ధి, సంయమనము కల్గి తగు రీతిలో మాట్లాడుతూ ఎవరి స్థాయి వారు నిలబెట్టుకోవాలి.
అందుకే ఎక్కడ మాట్లాడుతున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, ఏ సందర్భమిది అన్నదాన్ని జ్ఞప్తిలో ఉంచుకుని మరీ మాట్లాడాలి. కాని ఎదుటివారిని కించపరిచేటట్టుగానో, ఎవరినో అనవసరంగా పొగడడమో అధికప్రసంగం చేయడమో అదీ కాకపోతే ఏమీ తెలియకపోయనా బాగా తెలిసినట్టుగా మాట్లాడడమో చేయాలి. అసలు బాగా తెలసిన వారు ఎంత అవసరమో అంతవరకే మాట్లాడుతారు. అనవసరపు మాటలు మాట్లాడరు. ఇట్లా చేయడం వల్ల ఎవరినీ బాధపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడదు.

Viewing all 69482 articles
Browse latest View live