Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

అలుపెరుగని ‘అక్షర యజ్ఞం’

$
0
0

కొండకోనల్లో అభివృద్ధి జాడే తెలియని గిరిజన బాలలను బడిబాట పట్టించేందుకు ఆమె నిత్యం అలుపెరుగని ప్రయాణం చేస్తున్నారు.. దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రతిరోజూ నదిని దాటుతూ, కొండలను ఎక్కుతూ ఆమె బోధన సాగిస్తున్నారు.. కేరళలోని తిరువనంతపురం జిల్లా ఆంబూరి గ్రామానికి చెందిన ఉపాధ్యాయురాలు కేఆర్ ఉషాకుమారి ప్రతిరోజూ ఉదయం ఏడున్నర గంటలకు తన ‘బడి ప్రయాణం’ ప్రారంభిస్తారు. స్కూటీపై కొంత దూరం ప్రయాణించి ఆ తర్వాత పడవపై నదిని దాటుతారు. అనంతరం కొండలపై నడుచుకుంటూ పాఠశాలకు చేరుకొంటారు. చిరుతలు, ఏనుగులు సంచరించే కొండలపై ఆమె రెండు కిలోమీటర్లు ఒంటరిగా నడచి వెళ్తుంటారు. కున్నతుమల ప్రాంతంలోని ‘కన్ని’ గిరిజన ప్రాంతానికి ఆమె ఒక్కరే ధైర్యంగా చేరుకొంటారు. ‘నెయ్యర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం’ పరిసరాల్లో 6,129 అడుగుల ఎత్తు ఉన్న కొండపైకి చేరుకొని గిరిజన బాలలకు విద్యాబుద్ధులు చెబుతుంటారు. తాను పనిచేసే ‘అగస్త్య ఎగ అధ్యాపక విద్యాలయ’కు చేరుకొనేందుకు ఉషాకుమారి ప్రతిరోజూ రెండు కిలోమీటర్ల మేరకు ప్రయాణిస్తుంటారు. ఆమె గత పదహారేళ్లలో ఏనాడూ పాఠశాలకు ఆలస్యంగా వెళ్లలేదు. ‘సింగిల్ టీచర్ స్కూల్’ కావడంతో ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ఆ బడిలో అన్నీ తానే చూసుకొంటారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో ఒకటి నుంచి నాలుగవ తరగతి వరకూ కేవలం 14 మంది విద్యార్థులే ఉన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నా, తనతోపాటు పనిచేసేందుకు మరో టీచర్ లేకున్నా ఉషాకుమారి ఏనాడూ అసంతృప్తికి లోనుకాకుండా బోధనపైనే దృష్టిసారిస్తుంటారు. పాఠాలు చెప్పే పంతులమ్మలా మాత్రమే కాదు.. పిల్లల సంరక్షకురాలిగానూ ఆమె సేవలందిస్తున్నారు. మధ్యాహ్నం వేళ విద్యార్థులకు గుడ్లు, పాలు అందిస్తూ వారిలో పోషకాహార లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అనుదినం రెండు గంటలు ప్రయాణించాల్సి వస్తున్నా, నెలల తరబడి జీతం అందకపోయినా విధి నిర్వహణను ఆమె ఏనాడూ అలక్ష్యం చేయలేదు. పిల్లలకు మంచి భోజనం అందించేందుకు ఒక్కోసారి సొంత డబ్బును సైతం ఖర్చు చేస్తుంటారు. బడికి సొంత భవనం సమకూరక ముందు ఆరుబయట చెట్ల నీడలో విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలు చెప్పేవారు. గిరిజన పిల్లలను తీర్చిదిద్దేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నందుకు ఉషాకుమారికి ఇప్పటికే ‘సాక్షరతా పురస్కారం’తో పాటు పలు అవార్డులు దక్కాయి. తన వద్ద అక్షరాలు నేర్చుకున్న పిల్లలు డిగ్రీలు, పీజీలు పూర్తిచేసి ఉన్నత స్థానాల్లో నిలవడమే తన ఆకాంక్ష అని ఉషాకుమారి చెబుతుంటారు. గిరిజన గ్రామాల్లో నిజమైన మార్పు కోసం తన ప్రయాణం ఇలాగే కొనసాగుతూనే ఉంటుందని ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో అంటున్నారు.


మరింత ముందుకు..

$
0
0

జీవులన్నిటిలోకీ మనిషి ప్రత్యేకం అన్నది మామూలు మాట. అది చెప్పడానికి నేను అవసరం లేదు. అందరికీ ఆ సంగతి అర్థమయింది. కనుక నేను పని గట్టుకుని మనుషులలో ఎవరికి వారే ప్రత్యేకం అని ఆధారాలతో సహా వారాలుగా చెపుతున్నాను. ఎన్నో ఉదాహరణలు చూపించాను. మీరు ఇప్పటివరకు ఈ అంశం గురించిన ముక్కలు చదవకున్నా ఇక్కడ మొదలుపెట్టి చదవండి.
మన శరీరంలో మనకన్నా ఎక్కువగా సూక్ష్మజీవులు ఉన్నాయంటే నమ్మగలరా చెప్పండి. ఇవి ఎక్కడో ఉండే సూక్ష్మజీవులు కావు. మన శరీరంలో ఉండేవే. ఈ విషయం మనకు ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదేమో కానీ, జెరెమీ నిక్సాన్ అనే పరిశోధకుడు ‘నీవు కేవలం 0.7 శాతం మాత్రమే మనిషివి. మిగతాదంతా సూక్ష్మజీవులే ఉన్నాయి నీ శరీరంలో’ అన్నాడు. శరీరంలో మన శరీరానికి సంబంధించిన కణాల సంఖ్యకు, పది రెట్లు ఎక్కువగా సూక్ష్మజీవులు ఉంటే మరి ఆ మనిషి మనిషికన్నా సూక్ష్మజీవుల కుప్పలు అంటేనే బాగుంటుంది. మన శరీరంలో ఉండే జన్యువులు సుమారు 23వేల ప్రాంతం. కానీ 33 లక్షల జన్యువులు సూక్ష్మజీవులకు సంబంధించినవి మన శరీరం లోపల ఉన్నాయి. వెయ్యికి పైగా రకాల సూక్ష్మజీవులు మన శరీరం లోపల, బయట బతుకుతున్నాయి. ప్రతి వ్యక్తిలో కనీసం 150 రకాలు ఒక్క పేగుల్లోనే ఉంటాయి. మిగతావి ఒంటి మీద ఉంటాయి.
ప్రతి వ్యక్తి శరీరంలో ఉండే సూక్ష్మజీవులు రకాలు ప్రత్యేకమయిన కలయికతో గుర్తించడానికి అనువుగా ఉంటాయి. చర్మం మీద ఉండే సూక్ష్మజీవులే ఎవరికి వారిని వేరుచేసి చూపడానికి తగినంత వరకు వేరువేరుగా ఉంటాయి. పైగా వయసు పెరిగినా సరే ఈ ఒంటి సూక్ష్మజీవులు మారకుండా ఆశ్రయించి ఉంటాయి.
మన శరీరం మీద ఇన్ని సూక్ష్మజీవులు ఉన్నాయంటే, మనం తాకిన ప్రతి వస్తువు మీదకు అవి కూడా చేరుకుంటాయి. మీ చేతి సూక్ష్మజీవులు మీరు చదువుతున్న పుస్తకానికి అంటుతున్నాయి. అవి అక్కడ ఒకటి, రెండు వారాల దాకా బతికి ఉంటాయి. ఒకే రకంగా ఉండే కవలల్లో కూడా ఈ సూక్ష్మజీవులు వేరువేరుగా ఉంటాయి. అంటే మీరు ఈ పుస్తకం చదివారని, మీ స్వంత సూక్ష్మజీవుల ఆధారంగా తెలుసుకునే వీలు ఉందని అర్థం. అవును, అవి నిజంగా మీ స్వంత సూక్ష్మజీవులే.
ఒక వ్యక్తి శరీరంలో, పైన ఉండే సూక్ష్మజీవుల ఆధారంగా ఆ వ్యక్తిలోని జీవచర్యలు కూడా వేరువేరుగా ఉండే వీలు ఉంది. అందరిలోను జీవరసాయనాలు ఒకే రకంగా ఉంటాయి. కానీ ఈ సూక్ష్మజీవుల జీవ రసాయనాలు వేరువేరుగా ఉంటాయి. శరీరంలో స్వంత రసాయనాలకన్నా సూక్ష్మజీవుల రసాయనాలు ఎక్కువ కనుక వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
సూక్ష్మజీవుల చర్య ద్వారా ఎన్నో రసాయనాలు పుడతాయి. వాటిలో వైవిధ్యం ఉంటుంది. కొలెస్టరాల్, స్టెరాయిడ్‌లు ఇందుకు ఉదాహరణలు.
మనిషి శరీరంలో వేలాది రసాయన చర్యలు జరుగుతూ ఉంటాయి. అంటే ఆ చర్యలో పాల్గొనే రసాయనాలు కూడా వేలాదికన్నా ఎక్కువగా ఉంటాయి అని అర్థం. ఇక మానవ కణాలతోపాటు సూక్ష్మజీవులు కూడా అదే రకంగా చర్యలను కొనసాగిస్తాయి. ఈ రెండు రకాల చర్యల మధ్యన సంబంధాలు కూడా ఉంటాయి. ఈ రకంగా మనిషి శరీరంలో వైవిధ్యానికి చక్కని ఆధారం ఏర్పడుతుంది.
ఇక శరీరం తీరు గురించి చూడవలసి ఉంది. మనిషి మరెన్నో మృగాలకన్నా మిన్నా...!
ఎన్నో జంతువులతో పోలిస్తే మనిషి ఆకారం చాలా చిన్నది. అయినా చాలా విషయాల్లో మనిషికి చేతనయిన పనుల జంతువులకు చేతకావడంలేదు.
మానవులకు ప్రత్యేకతను ఇచ్చిన శరీరం గురించి మానవులకే అర్థం కాలేదు. మొదట్లో కేవలం మెదడు కారణంగానే ప్రత్యేకత అనుకున్నారు. శరీరంలోని భాగాలను గురించి అంతటా పట్టించుకోలేదు.
కానీ మెదడు ఒక్కటే సాధించలేని విషయాలను శరీరం సాధించగలిగింది. ఈ సంగతి అర్థం కావటానికి చాలాకాలం పట్టింది. నిజానికి మన శరీరాలు చాలా అసాధారణమయినవి. మిగతా జంతువు వలె కాక మన ఒంటి మీద వెంట్రుకలన్నీ తగ్గిపోయాయి. అవి తల మీద మాత్రమే మిగిలాయి. మనం నిటారుగా నడుస్తూ బతకడం నేర్చాము కనుక ఈ పద్ధతి వచ్చింది. మరికొన్ని కారణాల వల్ల తల, మెదడు పెద్దవిగా మారాయి. ఇక తెలివి కూడా ఎక్కువయింది. మొత్తానికి ఈ రకంగా మనిషి ప్రత్యేకత మొదలయింది, అనవచ్చు. శరీరంలోని అసాధారణమయిన అంశాలను పరిశీలిస్తూ ముందుకు వెళితే ఇంతకు ముందు తెలిసినవే అయినా కొన్ని సంగతులు మనకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి.
మనుషులు ప్రత్యేకత గలవారు అన్న మాట మామూలు అయింది. కానీ శరీరపరంగా మిగతా జంతువుల ముందు మనిషి నిలువలేక పోయాడు. దగ్గరి బంధువు అనుకున్న చింపాంజీ భారీ మనిషితో పోల్చినా నాలుగంతలు భారీగా ఉంటుంది. మనకంటే ఎన్నో జంతువులు ఎక్కువ దూరం దూకగలుగుతాయి. ఊడలు పట్టుకుని ఊగ గలుగుతాయి. పరుగు విషయంలో కూడా మనిషి వేగం అంతంత మాత్రమే. మనుషులను కూడా కలిపి జంతువు అన్నింటికీ ఆటల పోటీలు పెడితే అందులో మానవజాతి అందరికన్నా తక్కువ మెడల్స్ సంపాదిస్తుంది. అందులో అనుమానం లేదు. మిగతా జంతువుతో పోటీ పడలేక పోయినంత మాత్రాన మనిషిని చిన్నచేసి చూడడం మంచి పద్ధతి కాదు. ఒకటి, రెండు విషయాలలో మిగతా జంతువులకు లేని శక్తి మనిషికి ఉంది. ఈ రెండు విషయాలలోను అటు శరీర శక్తితోబాటు, దాని నిర్మాణం కూడా ప్రత్యేకంగా సహాయం చేస్తుంది. శరీరంలో ఇతర జంతువులకు లేని చిత్రమయిన ఏర్పాట్లు ఉన్నాయి కనుకనే మనిషి జాతికి మిగతా జంతువుల మీద అధికారం సంపాదించే వీలు కలిగింది.
పరుగు విషయంలో మిగతా జంతువులతో మనిషి పోటీ పడగలుగుతాడు అంటే, నమ్మకం కుదరకపోవచ్చు. ఒలింపిక్ పరుగు వీరుడు ఉసేన్ బోల్ట్ గంటకు 45 కిలోమీటర్లు పరుగెత్త గలుగుతాడు. అది అతను సాధించిన అన్నిటికన్నా ఎక్కువ వేగం. అయితే చిరుత పులులు చాలా సులభంగా అంతకు రెండంతల వేగాన్ని అందుకుంటాయి. గ్రే హౌండ్ కుక్కలు, గుర్రాలు, కొన్ని చింపాంజీలు కూడా బోల్ట్‌ను ఓడించగలుగుతాయి. ఒలింపిక్స్‌లో కిలోమీటర్ పందెన్ని అరగంటకు తక్కువ సమయంలో గెలుస్తున్నారు. రేస్ గుర్రాలు మాత్రం ఆ దూరాన్ని ఇరవై నిమిషాల్లో దాటగలుగుతాయి. ఈ పద్ధతి చూస్తే మరి మనిషి పరుగు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం కనిపించదు. కానీ పట్టుదలగా ఎక్కువ దూరాలు పరుగు తీయవలసిన చోట మనిషి బలం బయటపడుతుంది. మారథాన్ అనే పరుగు పోటీలో మనిషి శక్తి పరీక్షకు వస్తుంది. బాగా శిక్షణ పొందిన పరుగు వీరుడు గంటకు ఇరవై కిలోమీటర్ల ప్రకారం కొన్ని గంటలపాటు పరుగు పెట్టగలుగుతాడు. ఈ రకంగా ఓపికగా ఎక్కువ దూరం పరుగుపెట్టే జంతువులు కొన్ని మాత్రమే ఉన్నాయి. అడవి కుక్కలు, జీబ్రాలు, జింకలు, మరి కొన్ని రకాలు మాత్రమే ఎక్కువ దూరాలు పరుగు పెడతాయి. చిరుతలు ఎక్కువకాలం పరుగెత్తలేవు.
మనిషి లేదా మరొక జంతువు చాలా దూరం, చాలాసేపు పరుగెత్తాలంటే శరీరంలో కొన్ని ఏర్పాట్లు ఉండాలి. లక్ష సంవత్సరాల నాడే మనిషి అరికాళ్లు, కాళ్లు, తరువాత పిరుదులు, వెనె్నముక, చివరకు ఎదలోని ఎముకల గూడు అందుకు తగినట్టు మారాయి. ఎక్కువ దూరం పరుగెత్తడానికి అనువుగా మనిషి శరీరం మారడానికి కారణంగా వేటను పరిశోధకులు సూచిస్తున్నారు. వేటాడదలచుకున్న జంతువును మనిషి అది అలిసిపోయేదాకా తరిమాడట. ఇక పరుగుతీయలేని పరిస్థితి వచ్చినప్పుడు జంతువును చంపడం సులభం అయింది. ఇక కుక్కలు, దుమ్ములగొండ్లతో పోటీ పడి పరుగు పెట్టి జంతు శరీరాలను వశం చేసుకోవడం కూడా మనిషికి వీలయింది. మొత్తానికి ఎక్కువ దూరం పరుగెత్తినందుకు మనిషికి మంచి తిండి దొరికింది. ఆ తిండి కారణంగా శరీరం, మెదడు, రెండూ పెరిగాయి.

అష్ట ఐశ్వర్యాలు.. అష్ట అలవాట్లు

$
0
0

అమ్మాయి పుట్టినప్పటి నుంచి అత్తవారింటికి వెళ్లేంత వరకు ఎలా ఉండాలో? అత్తవారింట్లో ఎలా మసలుకోవాలో మనకెన్నో పాఠాలు ఉన్నాయి. పిల్లల పెంపకానికి సంబంధించి సూత్రాలున్నాయి. తెలియకపోతే చెప్పే పెద్దలు ఉన్నారు. మరి జీవితంలో ప్రతి క్షణం అవసరం అయిన డబ్బుకు సంబంధించి మనకు పాఠాలు లేవు. చెప్పే వారు ఉండరు. కాళ్లు కడిగినప్పుడే కాపురం చేసే విధానం తెలిసింది అనే సామెత ద్వారా కాళ్లు కడిగే విధానం గురించి కూడా బోధిస్తారు. పెళ్లి సంప్రదాయానికి సంబంధించి మనకెన్నో పాటలున్నాయి. సంప్రదాయాల గురించి చెప్పే పెద్దలుంటారు. నడవడికకు సంబంధించి, పిల్లల పెంపకానికి సంబంధించి చెప్పే పాఠాల మాదిరిగానే సంపద, డబ్బుకు సంబంధించిన పాఠాలు చెబితే మన జీవితం కచ్చితంగా మెరుగ్గా ఉంటుంది.
కొత్త పెళ్లి కూతురు అత్తవారింట్లో ఎలా మసలుకోవాలో పూర్వం చెప్పేవారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. వాటి సంగతి ఎలా ఉన్నా అమ్మాయి అయినా అబ్బాయి అయినా డబ్బుకు సంబంధించి కనీస అవగాహన లేకుంటే జీవితం కష్టాల మయం అవుతుంది.
ఉద్యోగంలో కొత్తగా చేరారు. ఇప్పుడేం చేస్తారు?
జీవితమంతా కార్పొరేట్ స్కూల్‌లోనే బందీలుగా బతికాం. కానె్వంట్ స్కూల్ నుంచి కార్పొరేట్ కాలేజీ వరకు మార్కుల పరుగు పందెంలోనే జీవితం గడిచిపోయింది. ఎంసెట్ ర్యాంకులు, ఇంజనీరింగ్ కాలేజీలు, క్యాంపస్ సెలక్షన్‌ల తరువాత ఇప్పుడే ఉద్యోగంలో చేరాం. ఇప్పుడైనా ప్రశాంతంగా ఉండనివ్వరా? జీవితమే ఒక పోటీ అనుకున్నప్పుడు ఏ దశలోనైనా పోటీ అనివార్యం. ఉద్యోగం రాగానే మార్కుల పోటీ ముగిసిపోయిందను కోవద్దు. ఉద్యోగంలో చేరిన తరువాత కూడా పరీక్షలకు ప్రిపేర్ కావలసిందే. ఐతే ఈ పరీక్షలు వేరుగా ఉంటాయి.
గతంలో ఎప్పుడూ లేనంత సంక్లిష్టంగా ఇప్పుడు జీవితం మారిపోయింది. ఆ రోజుల్లో ఉద్యోగంలో చేరడం అంటే పదవీ విరమణ చేసేంత వరకు ఢోకా ఉండేది కాదు. ఇప్పుడలా కాదు. ఉద్యోగం లభించినా, ఎప్పుడు ఏ మార్పుతో ఏమవుతుందో తెలియదు. మరలాంటప్పుడు నిరంతరం విద్యార్థిగా నేర్చుకోవలసిందే.
ఆర్థిక అంశాలకు సంబంధించి ప్రతి వారికి ఎనిమిది లక్షణాలు తప్పని సరి అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు.
1.నో క్రెడిట్: అప్పు అత్యంత ప్రమాదకరమైన అలవాటు. వచ్చిన జీతాన్ని రెండు వారాల్లోని ఖర్చు చేసి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అప్పులు చేసేవాళ్లు మన చుట్టూ కనిపిస్తూనే ఉంటారు. క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్లు, చివరకు సహ ఉద్యోగులు, స్నేహితుల వద్ద చేబదుళ్లు కొందరికి అలవాటు. అప్పు అన్నా, ఇఎంఐ అన్నా భవిష్యత్తులో సంపాదించేదాన్ని ఇప్పుడే ఖర్చు చేయడం. ఒకసారి అప్పుల ఊబిలో చిక్కుకుంటే బయటకు రారు. ఇంటి నిర్మాణం కోసం అప్పు, వ్యాపారం కోసం చేసే అప్పులు వేరు. కేవలం ఖర్చు కోసం అప్పు చేయడం మంచిది కాదు. ఇలాంటి అలవాటు మీకుంటే దాని నుంచి బయటపడిండి.
2.లెక్కలు: ఎంసెట్‌లో లెక్కల్లో టాప్‌లో నిలిచిన వారు కూడా జీవితానికి సంబంధించిన లెక్కల్లో చాలా బలహీనంగా ఉంటారు. నెలకు ఇంట్లో దేనికి ఎంత ఖర్చు అవుతుంది అని లెక్కలు రాసుకోవాలి. ఇలా అన్ని ఖర్చులు లెక్కలు రాస్తే, దేనిపై వృథా అవుతుంది అనేది తెలుస్తుంది.
3.దురలవాట్లు: మనిషిని ఆర్థికంగా దెబ్బతీసేవి ప్రధానంగా దురలవాట్లు. రోజుకు సిగరేట్ల ఖర్చు రోజుకు 50 రూపాయలు అనుకున్నా నెలకు పదిహేను వందలు, ఏడాదికి పద్దెనిమిది వేలు. అదే డబ్బును నెల నెలా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినా, చిట్టీ వేసినా చక్రవడ్డీతో కొంత కాలానికి పెద్ద మొత్తం అవుతుంది. అదే సిగరెట్లు అలా తాగుతూనే పోతుంటే కొంత కాలానికి క్యాన్సర్ వంటి రోగాల బారిన పడవచ్చు. ఎక్కువగా టీ తాగడం, మద్యం సేవించడం, హోటల్ తిండి, ఇలా ఏదైనా ఇలాంటి అతి అలవాట్లు ఆర్థికంగా దెబ్బతీస్తాయి.
4.రికార్డ్: వాహనాల బీమా, ఆరోగ్య బీమా, ఎలక్ట్రానిక్ వస్తువుల గ్యారంటీ కార్డు, ఆస్తులకు సంబంధించిన రికార్డు. బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, పెట్టుబడులకు సంబంధించి ముఖ్యమైన రికార్డు అన్నీ ఒక ఫైల్‌లో భద్రపరచాలి. అంశాల వారిగా ఈ రికార్డులను ఒకే చోట భద్రపరిస్తే, అవసరానికి ఉపయోగపడతాయి.
5.పొదుపు- పెట్టుబడి: ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే పొదుపు, పెట్టుబడి ఒక అలవాటుగా మారాలి. ఉద్యోగం చేసేవారు కావచ్చు, ఏదైనా వృత్తిలో ఉన్న వారు కావచ్చు. సంపాదన మొదలైన నెల నుంచే పొదుపు- పెట్టుబడి అలవాటుగా మారాలి. పొదుపు చేయడమే కాక దానిని సరైన రీతిలో ఇనె్వస్ట్ చేస్తే, భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది. ఇనె్వస్ట్‌మెంట్ అనేది రిటైర్‌కావడానికి ముందు చేసే ఆలోచన కాదు. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే అలవాటు కావాలి. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే ఇనె్వస్ట్ చేయడం వల్ల చిన్నమొత్తంలో ఇనె్వస్ట్ చేసినా అది చక్రవడ్డీ వల్ల భారీ మొత్తం అవుతుంది.
6.ఒకేసారి కొనుగోలు: ఇంటికి అవసరం అయిన వస్తువులను ఒకేసారి నెల మొత్తానికి కొనడం వల్ల పదినుంచి పదిహేను శాతం వరకు తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. ఆ మొత్తాన్ని పొదుపుకిందకు మార్చుకోవచ్చు.
7.ఆరోగ్యంపై దృష్టి: జిమ్‌కు వెళ్లడం కావచ్చు, యోగ, నడక ఏదైనా కావచ్చు. ముందు నుంచే ఆరోగ్యంపై ఇనె్వస్ట్ చేయాలి. ఇప్పుడు నెలకు వెయ్యి రూపాయలు జిమ్‌కు ఖర్చు అవసరమా? అనిపించవచ్చు. కానీ వయసు మీరాక అనారోగ్యంపై చికిత్సకు లక్షల్లో ఖర్చు చేయడం కన్నా ఆరోగ్యంపై ముందుగానే చిన్న మొత్తాల ఖర్చు లాభసాటి నిర్ణయమే అవుతుంది.
8.నిత్య విద్యార్థి:: అన్నింటికన్నా ముఖ్యమైనది నిరంతరం నేర్చుకోవడం. ఇప్పుడు సాంకేతికంగా ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. ఉద్యోగంలో చేరేప్పుడు ఉపయోగపడిన సాంకేతిక విద్య కొంత కాలానికి పనికి రాకుండా పోవచ్చు. ఎప్పటికప్పుడు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకుని అప్‌డేట్ అయితే పోటీని తట్టుకొని నిలబడగలరు. సాంకేతికంగా అప్‌డేట్ అయితే ఈ కంపెనీ కాకుంటే మరో కంపెనీ అని ఎప్పుడూ సిద్థంగా ఉండవచ్చు. ఒకసారి నేర్చుకున్నాం, ఉద్యోగం వచ్చింది ఇక నేర్చుకోవడం చాలు అంటే కుదిరే కాలం కాదిది. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే. ఆన్‌లైన్‌లో తక్కువ ఖర్చుతో, ఉచితంగా బోధించే సంస్థలు కూడా ఉన్నాయి. వాటిపై దృష్టిసారించాలి. వృత్తికి సంబంధించి నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవాలి.

విశ్వదాభిరామ.. వినురవేమ!

$
0
0

ఎంత నేర్పు తోడ నేమేమి చదివినఁ
జింతలేని విద్య చిక్కఁబోదు
పంతగించి మదిని పరికించి చూడరా!
విశ్వదాభిరామ వినురవేమ!
పుస్తకంలోని విషయాలను మెదడులోకి మక్కికి మక్కిగా ఎక్కించుకుంటే లాభం లేదు. అలాటి చదువు వప్పజెప్పటానికే పనికొస్తుందే కాని శాస్త్రాలను అర్థం చేసుకోవడానికి ఏమీ ఉపయోగపడదు. శాస్త్ర విషయాల్లోని లోతైన విషయాలు అర్థం కావాలంటే తెలివిగా, యుక్తియుక్తంగా, విమర్శ చేసుకుంటూ చదివిన వాటిని ఎప్పటికప్పుడు మననం చేయాలి. అంతవరకూ శాస్తజ్ఞ్రానం ప్రకాశించదు.
భగవద్గీత, రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను అచ్చువేసే వారికి అందులోని విషయాలన్నీ తెలిసిపోతున్నాయా? అందంగా అచ్చు వేసేవరకే వారి పని. అదో యాంత్రికమైన విద్య. కానీ సంగీతం యాంత్రికం కాదు.
ఎవరో పాడేసిన పాటను ముక్కున పట్టేసి ఊదేస్తే, సంగీత జ్ఞానమంతా తెలిసినట్లు కాదు.
అందుకే వేమనంటాడు..
‘గురుని శిక్ష లేక గురుతెట్లు కల్గునో
అజునికైన వాని యబ్బకైన
తాళపు చెవిలేక తలుపెట్టులూడునో
విశ్వదాభి రామ! వినురవేమ!
వేమన పేరు తెలియని ఆంధ్రుడుండడు. ప్రజలతో మమేకమిన ఆ కవిని ఆకాశానికి ఎత్తేసిన మహాపురుషుడు బ్రౌన్ అనే ఓ పాశ్చాత్యుడు.
ప్రఖ్యాత విమర్శకుడు, కవి పండితుడు జానమద్ది హనుమచ్ఛాస్ర్తీ గారి పుణ్యమా యని ‘వేమన’ గురించి నాకు తెలియని విషయాలు ఎన్నో తెలిశాయి. ఆ పద్యాలన్నీ ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం.
మూఢాచారాలు, మూఢ నమ్మకాలను నిరశించి, నిజాన్ని నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టి చెప్పి మరీ వెళ్లిపోయాడు. వాటి సారాంశం ‘విన్నవాడిదే అదృష్టం. వినకపోతే వాడి ఖర్మం’ అన్నట్లుగానే ఉంటాయి. ఆయన పద్యాలన్నీ యోగి వేమన పాత్రలో ‘చిత్తూరు నాగయ్య’ నటించిన 1947 నాటి చిత్రం ఎంత కీర్తిని సంపాదించిందో మనందరికీ తెలుసు.
కె.వి.రెడ్డిగా బాగా ప్రసిద్ధుడైన కదిరి వెంకటరెడ్డి దర్శకత్వంలో వెలువడిన ఆ చిత్రంలో నాగయ్య నటన గొప్పదా? సంగీతం గొప్పదా? అని తేల్చి చెప్పలేం. సాహిత్యం ద్వారా మనసుకు అందించలేని విషయ సంగీతం వల్లనే పూర్తిగా తలకెక్కుతుందనే సత్యాన్ని తన గానంతో నిరూపించి పరిపూర్ణత్వాన్ని తెచ్చిన ఘనత నాగయ్యదే.
ఒకవైపు సముద్రాల రాఘవాచార్య, మరోవైపు ఓగిరాల రామచంద్రరావులు కలిసి ఆ చిత్రం తాలూకు జ్ఞాపకాలు మాయమవ్వకుండా చేయటంలో కృతకృత్యులయ్యారు. నాగయ్యతో సమానంగా నువ్వా? నేనా? అని నటించిన ముదిగొండ లింగమూర్తిని ఎలా మరచిపోగలం. అటువంటి నటుల్ని ఈ వేళ వెదకాలంటే మనకున్న చేతివ్రేళ్లు ఎక్కువే.
నిశితంగా గమనిస్తే శృతిలయలు ఒక్క పాటకేగాదు, మాటల్లో కూడా ఉదాత్త అనుదాత్తాలుంటాయి. అందుకే వాళ్లు మహానటులయ్యారు. హావభావ ప్రకటనతో వెలువడే వారి మాటలే మధురంగా ఉంటాయి.
- ఎవరు నాయనా నువ్వు?
- ఎందుకింత ఆవేదన పడుతున్నావు?
- జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తి చెందుతున్న అంధుణ్ణి.
- జీవితానికి పరమార్థమంటూ ఒకటుందనుకున్నావా?
- లేదా స్వామీ?
వేద వేదాంగాలూ తెలిసిన మహర్షులూ, దేశ దేశాలూ జయించిన చక్రవర్తులూ పుట్టి, పెరిగి మరణించి వెళ్లిపోతున్నారే?
వీరంతా ఏవౌతున్నారు స్వామీ?
- పిచ్చివాడా? లోకంలో అందరూ ఈ శరీరంతో జీవించి సుఖించాలనీ, భోగాలనుభవించాలనుకుంటూ వుంటే మరణించిన తర్వాత ఏవౌతారనే తాపత్రయం నీకెందుకు? ఆ తాపత్రయం వదులుకో - ఇదిగో? చూడు! నీకు అష్ట ఐశ్వర్యాలు లభించే మార్గం అనుగ్రహిస్తాను. హాయిగా అనుభవించు.
- వద్దు స్వామీ! వద్దు. అవన్నీ ఎప్పుడో అనుభవించేశాను. అంతా క్షణికమని తెలుసుకున్నాను. వాటిపై వాంఛలేదు. నాకున్నదొక్కటే సందేహం. మనం ఎక్కడ నుండి పుట్తున్నాం? ఎక్కడికి మళ్లీ వెళ్లిపోతున్నాం?
- ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేదే. మానవులైన మీకెలా సాధ్యమవుతుందయ్యా?
- అన్నీ తెలిసిన మీ వంటి మహానుభావులే అలాగంటే మాబోటి వారికి ఇంక దిక్కెవరు స్వామీ?
ఈ జనన మరణ ప్రభావంలో కొట్టుకు పోవలసిందేనా స్వామీ! తరించే మార్గం లేదా? అంటూ వేసిన ప్రశ్నలకు ఒక పరమ గురువు వల్ల జ్ఞానోదయమైన వేమన పాత్రలో నాగయ్య పలికిన ఆ మాటల్లోనే సంగీతం ధ్వనిస్తుంది బాగా గమనించి వింటే.. అందుకే మాట్లాడే ప్రతి మాటకూ ఒక శ్రుతి ఉంది. దాన్నిబట్టే భావం ఏర్పడేది. ఇంక వేలాదిగా పుట్టుకొచ్చిన వేమన పద్యాలలో వేదాంత సాధనకు తోడ్పడేవి అనేకం.
నా చిన్నతనంలో పల్లెటూళ్లలోని పాఠశాల గోడల మీద ఈ పద్యాలను రాసి ఉంచేవారు.
చీకట్లో చిరుదివ్వె కనిపిస్తే ఎలా వుంటుందో ఈ పద్యాలు చదువుతోంటే అలా ఉండేది.
మనకు తెలియకుండానే బాల్యం నుంచి అలవోకగా అలా అలవాటైన జ్ఞానోపదేశాలే ఈ వేమన పద్యాలు. కూర్చోపెట్టి, ప్రత్యేకంగా బోధించవలసిన అవసరం లేని మంత్ర సమానమైన మాటలు.. అటువంటి వాతావరణం ఈ వేళ దాదాపు మృగ్యం. నాలుగు సార్లు చదివితే చాలు. పిల్లలకు శాశ్వతంగా గుర్తుండిపోయే ఈ పద్య సాహిత్యానికి, వాళ్లను చాలా దూరం చేసేశాం. తెలుగు భాషకు వనె్నలద్దిన శతక సాహిత్యం వంటిది ఏ ఇతర భాషల్లోనూ కనపడదు. పద్యం తెలుగువారి ఆస్తి. వేదాంతిగా యోగి వేమనను అర్థం చేసుకోవడానికి ప్రజలలో వాడుకలో వున్న కొన్ని కథలే కారణం. చిన్నతనంలో వనంలో ఏ లక్ష్యం లేకుండా వేవన జీవితం చాలా బాధ్యతారహితంగానే తిరిగేవాడు. వేశ్యాలోలుడై తిరిగేవాడు.
తల్లిగా ప్రేమించే ఒక్క వదినగారు తప్ప మరెవ్వరూ వేమనను శాసించేవారు లేకపోయేవారు. చివరకు మాయా నాటకం వల్ల వేశ్యా వ్యామోహం నుంచి బయటపడ్డాడు.
రాజదర్బార్‌లో కాలక్షేపానికి జవహరీ, బంగారు నగలకూ సంరక్షకుడిగా ఉండేవాడు. అక్కడున్న వారిలో ముఖ్యుడు అభిరాముడు అనే స్వర్ణకారుడు.
యితను మంచి యోగ సాధకుడు. ఓ మహనీయుడైన గురువుగారి సేవలో నిత్యమూ నిమగ్నుడై వుండేవాడు. ఒకరోజు ఈ అభిరాముడు దివాణానికి రావడంలో ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైందని వేమన నిలదీశాడు. గురువు దగ్గర ఆలస్యమైందని చెప్తాడు. గురువు, గురువంటాడేమిటి? ఎవరీ గురువు? అసలు గురువు అవసరం ఏముంది? వెంటనే వేమనలో, ఉత్సుకత బాగా పెరిగింది. గురువంటే ఎలా ఉంటాడో? చూడాలనిపించింది. రహస్యంగా ఒక రోజు అభిరాముణ్ణి వెంబడించాడు. సొరంగం లాంటి గుహలో ప్రవేశించాడు. అంతా చీకటి.
అక్కడ వృద్ధుడైన గురువుకు అభిరాముడు పాదాలకు నమస్కరించి నిలబడ్డాడు. అంతా గమనిస్తున్నాడు వేమన.
అభిరాముడితో, ‘నాయనా! ఇన్నాళ్లూ నాకు నిష్కల్మషంగా నన్ను సేవించావు. ఈ రాత్రి నేను ఈ శరీరాన్ని త్యిజించి వేస్తాను. అర్ధరాత్రి నా దగ్గరకు రా. నీకు ఉపదేశమిస్తాను’ అన్నాడు. వేమనలో ఆసక్తి పెరిగింది. ఉపదేశం అంటే? అది స్వీకరిస్తే ఏవౌతుంది. ఎలా తెలుసుకోవడం? ఆ ఉపదేశం తనకే లభిస్తే బాగుణ్ణు, అనుకున్నాడు. రాత్రంతా అభిరాముడు దివాణంలోనే ఉండి పనిచేసేట్లుగా, తన వదిన కోసం ఒక నగను అత్యవసరంగా చేయాలని బలవంతపెట్టి, అభిరాముడి స్థానంలో తాను వెళ్లి ఆ యోగిని దర్శించి, నమస్కరించి నిలబడ్డాడు... అభిరాముడి స్థానంలో కనిపించిన వేమనకే ఉపదేశం చేసి, శరీర త్యాగం చేశాడు ఆ యోగి.
ఆ మహనీయుని ఉపదేశం వేమన కళ్లు తెరిపించి, యోగి వేమనగా మారిపోయాడనేది ఒక కథ. వేమన మాత్రం తన అపరాధానికి ప్రాయశ్చిత్తంగా ‘అభిరాముడి’ పేరు కూడా లోకంలో నిలిచేలా చేయాలని సంకల్పించి, తన పద్యాలలో చాలా వాటికి ఈ ‘విశ్వదాభిరామ వినుర వేమ’ మకుటంగా ఇచ్చాడు.

పజిల్-708

$
0
0

అడ్డం( ఆధారాలు)
================
1.మిక్కిలి విశదము (5)
4.తోట (3)
6.స్వప్నము (2)
7.కొంటెవాడు. అడివి బాపిరాజు నవల (3)
10.‘నసా’ అని రుూసడించకండి. వెనక్కి తిరిగి చూసుకుంటే పూర్వం దీని మీదే గంధం తీసేవారు (2)
11.చుట్టూ నీరుగల భూప్రదేశం (2)
12.లక్ష్మీదేవి (2)
15.విష్ణువు (2)
16.పొమ్ము, పొమ్ము. ఇది వ్యావహారికం (2)
19.యుద్ధం అంటే వెళ్లరు (2)
21.సౌమ్యత ఆంగ్లంలో ప్రోవెర్బ్ (3)
23.నేతాజీ (2)
25.మర్మము, రహస్యము (3)
26.తోకగల కత్తి (5)

==============
నిలువు( ఆధారాలు)
===========
2.యవనిక (2)
3.త్రిభుజం (3)
4.నిలయం, నెలవు (4)
5.్భవనం (3)
7.‘కోసీమన’గానే ఆంధ్రాలో ఒక
ప్రాంతం స్ఫురిస్తుంది (4)
8.కొండ (2)
9.వంతెన (3)
13.్భరీ వర్షానికి వాడే ఉపమానం (4)
14.సముద్రము (3)
17.సాగుబడికి రాని నేల. అటూ ఇటూ పోకు (4)
18.దీన్లోనే పరమాత్మ వున్నాడట (2)
20.మేనా (3)
22.ఆడవాళ్లు తిట్టేటప్పుడు ‘....’లు విరుస్తారు (3)
24.నర్మదానది మరో పేరు (2)

దృశ్యాదృశ్య ప్రస్థానాన్ని

$
0
0

నేను-
ఏడు లోకాల సప్త దేహవాసిని
దృశ్యాదృశ్య జగత్తుల ప్రస్థానాన్ని
నలుకంచెల విజ్ఞాన బంధనాన్ని
పై మూడంచెల దేహాతీత ప్రజ్ఞానాన్ని
స్పృహ శక్తుల పాంచభౌతికాన్ని
మనసూ బుద్ధుల స్నేహితుణ్ని.
అవును, నేను
షట్చక్ర చాలనంతో భక్తి శోభితున్ని,
దళ సాపేక్షత లేని చక్రకోశాన్ని.
* * *
కనిపించే భూగోళంలో కనిపించని మరో ఆరు గోళాలు స్నేహిస్తుంటాయి. మట్టిపొరల గాలి తరంగాలను శ్వాసించే ఈ పాంచభౌతికానికి కనిపించని ఆరు చక్రాల బంధం. మూలాధారం నుండి ప్రతీ ఆరు అంగుళాలలో ఉండే ఒక్కో చక్రం ఈ ఒక్కో గోళ ప్రతిబింబమే! ఆ గోళ తత్వాలే ఈ చక్ర తత్వాలు కూడా! అందుకే ఫిజికల్ బాడీది ఎర్త్ ఎనర్జీ అవుతుంటే తక్కిన ఆరు శరీరాలది ప్లానెటరీ ఫోర్స్ అవుతోంది. ‘సెవన్ ఎడ్జెస్ట్‌మెంట్స్’ హ్యూమన్ బాడీకి అవసరమవుతుంటే ‘సెవన్ బోరింగ్స్’ ఈ ఎర్త్‌కు అవసరమవుతోంది. షట్చక్ర చాలన సప్త శరీరాల సమాహారానికి ‘తర్టీన్ ప్లానెటరీ ఫోర్సెస్’ అవసరమవుతున్నాయి. అప్పుడు కానీ మానవత్వంలో గికత్వం నిలదొక్కుకోవటం లేద. ఈ ప్రస్థాన ప్రజ్ఞానమే ఫిజికల్ బాడీకి సంక్రమించే ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ.
* * *
మనం మూలాధారం అంటూ భౌతిక శరీరంలో వెనె్నముక క్రింది కొసను చెప్పుకుంటుంటాం. నిజానికి కుండలినీ స్థానం ఫిజికల్ బాడీది కాదు.. ఈథరిక్ బాడీది. ఈథరిక్ బాడీకి చెందింది కాబట్టి వెనె్నముకను ఈథరిక్ స్పైన్ అనాలి. ఈథరిక్ స్పైన్‌లోనిదే సర్పెంట్ పవర్. తర్టీన్ ప్లానెటరీ ఫోర్సెసే సర్పంట్ పవర్. అందుకే, ఫిజికల్ బాడీ కంటే ఈథరిక్ బాడీ సున్నితమూ, శక్తివంతమూ. పైగా హీట్ బాడీ కూడా. అంటే, నూట పదమూడు డిగ్రీలు హీట్‌ను సైతం తనలో నిలుపుకుని నిశ్చలంగా ఉండగలము. ఇలా ఫిజికల్ బాడీ అస్తిత్వమంతా ఈథరిక్ బాడీదే! అందుకే షట్చక్రాలు పిజికల్ స్పైన్‌వి కావు... ఈథరిక్ స్పైన్‌వి.
ఈథరిక్ బాడీ తర్వాతివే యాస్ట్రల్, మెంటల్, బుద్ధిక్, ఆత్మిక్, నిర్వాణిక్ బాడీస్. ఈథరిక్ స్పైన్‌లో ఉండే షట్చక్రాలు బొంగరంలా తిరుగుతున్నట్టు అనిపించటం మనకు తెలుసు. నిజానికి రెండు విరుద్ధ శక్తులు అంటే టు ఆపోజిట్ ఫోర్సెస్ కలయికతో సంభవిస్తున్న వైబ్రేషనే్స ఈ చక్ర భ్రమణాలు. రెండు విరుద్ధ శక్తులు అంటే ఇండిపెండెంట్ ఎనర్జీస్ ఎదురుపడి తలబడటం అంటే తలలు పగలటంలా అనిపించినా అది ‘ఇండిపెనె్డన్సీ’ సంకేతమే!
ఈథరిక్ స్పైన్‌ది సర్పచాలనం.. అంచెలంచెలుగా సర్పం శరీరం కదులుతుంటుంది. పైగా సర్పం ఏ కొంత ఎత్తుకు ఎగసినా ఉగ్రత్వాన్ని వీడదు. తీక్షణతను తగ్గించుకోదు. అలాగే కుండలినీ శక్తి విజృంభించినా విస్ఫోటనమే!
మొత్తానికి, ఈథరిక్ బాడీలో ఉత్పన్నమైన శక్తి ఫిజికల్ బాడీని చేరుతుంది. ఆ శక్తే మానవ ఇంద్రియాల బలమూ, బలహీనతా. కారణం ఈథరిక్ బాడీ విరుద్ధ శక్తుల సంగమం కాబట్టి. ఇంతకీ ఈథరిక్ బాడీలో విరుద్ధ శక్తులు తలపడటానికి కారణం యాస్ట్రల్ బాడీ. యాస్ట్రల్ బాడీని చేరిన ఫిజికల్ ఎమోషన్స్ ప్లస్ యాస్ట్రల్ ప్లేన్ ఫోర్సెస్.
ఒక విధంగా, యాస్ట్రల్ బాడీ అనేది ఎమోషనల్ బాడీ. మేడపైన బలంగా అడుగులు పడుతుంటే క్రింది అంతస్తు సైతం దడదడ లాడుతుంటుంది. తలపైన నడుస్తున్నట్టుంటుంది. యాస్ట్రల్ బాడీలోని ఎమోషన్స్ వైబ్రేషన్స్‌గా ఈథరిక్ బాడీని చేరి అవి ఫిజికల్ బాడీని దడదడ లాడిస్తుంటాయి. ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే ఈ ఫిజికల్ బాడీ బీటలు వారటం తథ్యం. అంటే, శారీరక అవయవాలు, వాటి పనితీరు బలహీనపడుతుంటాయి. ఇదే అనారోగ్యం.
అన్నట్టు, మనం ‘ఆరా’ అంటుంటాం. మన మానవ ఆకారాన్ని పోలిన మరో తెల్లని కాంతి శరీరమే ఈ ఆరా. తెల్ల కాగితాన్ని మనకు కావలసిన రంగుతో నింపేసుకోవచ్చు అన్నట్టుగానే ఈ తెల్లటి శరీరాన్ని మనకు కావలసిన రంగులోకి మార్చుకోగలం... లేదా మన ఎమోషన్స్‌కు అనుగుణంగా అదే రంగు మార్చుకుంటుంది.
మన ఆరాను మనం చూసుకోగలిగితే దాని రంగును బట్టి మన ఎమోషనల్ లైఫ్‌ని చెప్పేసుకోవచ్చు. దీనే్న మనం యాస్ట్రల్ అవేర్‌నెస్ అంటాం. అంటే, మనలోని సెన్సిటివిటీనే యాస్ట్రల్ అవేర్‌నెస్‌కు పెట్టుబడి అవుతుంటుంది. సింపుల్‌గా చెప్పుకోవాలంటే, యాస్ట్రల్ అవేర్‌నెస్ అందని మ్రానిపండు కాదు.. అందుకోగల, అందుబాటులో ఉన్న ఫలమే! మన సాధన ఒక్కటే ఆ ఫలాన్ని అందుకోగలదు.
ఉదాహరణకు - ఒక పువ్వును చూశాం.. దాని సువాసన మత్తెక్కిస్తుంటుంది. అందం ఆకర్షిస్తుంటుంది. ఆ వికసిత పుష్పం మన మనసు పొరల్ని తట్టి లేపుతుంటుంది. ఇదంతా సెన్సిటివిటీనే! ఆ పువ్వు విషయంలో ఈ సెన్సిటివిటీనే మనకు ఎమోషన్ అయింది. అదీ ఆ పుష్పం యాస్ట్రల్ ఎనర్జీ. అది మన యాస్ట్రల్ ఎనర్జీ సంయోగించగలిగితే ఆ పుష్ప యాస్ట్రల్ ఎనర్జీ మన ఈథరిక్ బాడీ గుండా ఫిజికల్ బాడీని సంపన్నం చేయగలుగుతుంది. మన భౌతికత, పుష్ప భౌతికత ఫిజికల్ ప్లేన్‌వి అయితే ఆ పుష్ప యాస్ట్రల్ ఎనర్జీ, మన యాస్ట్రల్ ఎనర్జీ యాస్ట్రల్ ప్లేన్‌వి. కాబట్టి, మన ఫిజికల్ కంటే, ఈథరిక్ కంట్ యాస్ట్రల్ ఎనర్జీ మరింత శక్తిమయమైనటువంటిది. అందుకే, ఫిజికల్ వైబ్రేషన్స్‌లా అనిపించే యాస్ట్రల్ వైబ్రేషన్స్‌ను తట్టుకోవటం కష్టం.
ధ్యానంలో యాస్ట్రల్‌ను చేరుకోవటం స్వానుభవం. యాస్ట్రల్ ఎనర్జీ ఫిజికల్‌ను చేరినపుడు యాస్ట్రల్ వైబ్రేషన్స్ కలుగుతుంటాయి. ధ్యాన సమయంలో మన శరీరం పాములా మెలికలు తిరుగుతుండటం, మనం పాములా బుసకొట్టడం జరుగుతుంటుంది. యాస్ట్రల్ ఎనర్జీ కుండలినిని చేరటం, ఆ యాస్ట్రల్ ఎనర్జీ ఈథరిక్ స్పైన్ ద్వారా చక్రాలను స్పందింప చేయటం - వైబ్రేషన్స్ రూపేణా వ్యక్తమవటం ధ్యానస్థితినే.
ఒక విధంగా భౌతిక స్పృహలా అనిపించే తొలి ధ్యాన స్పృహ జాగృతావస్థది అయితే యాస్ట్రల్ స్పృహ స్వప్నావస్థను పోలినటువంటిది. అందుకే యాస్ట్రల్ ఎక్స్‌పీరియన్స్‌లలో అధిక భాగం ఫిజికల్ ఎక్స్‌పీరియనె్సస్ అనిపిస్తుంటాయి. ఇలా ధ్యాన ప్రస్థానంలో యాస్ట్రల్‌ను ప్రభావితం చేయటం తొలి అధిభౌతికం అవుతుంటుంది. ఈ యాస్ట్రల్ గాఢతతో అటు ఈథరిక్ బాడీ, ఇటు ఫిజికల్ బాడీ ప్రభావితమవుతుంటాయి.
యోగా ట్రీట్‌మెంట్స్ జరిగేది ఈ యాస్ట్రల్ గాఢతతోనే. అంటే, గికంగా చికిత్స జరిగేది భౌతికానికే అరునా యాస్ట్రల్ ప్లేన్‌తో ప్రభావితమైన ఈథరిక్ ఎనర్జీతోనే! మొత్తానికి యాస్ట్రల్ ప్లేన్ సంపూర్ణ చైతన్యాన్ని జాగ్రదావస్థలోలాగ, అనుభూతించటమే యాస్ట్రల్ ట్రావెల్! అంటే, ఫిజికల్ ఎటువంటి ప్రయాణమూ చేయదు. ఈథరిక్ బాడీ ప్రయాణించి యాస్ట్రల్ ప్లేన్‌ను చేరటం వల్ల అక్కడి ప్రభావాలకు ఫిజికల్ బాడీ తావలమవుతుంటుంది.
* * *
ఇంతకీ, దేహం నుండి మనసును తప్పించగలిగితే యాస్ట్రల్ ప్రయాణం సాధ్యమవుతుంటుంది. ఇహ తలం నుండి గగన తలానికి ధ్యానమగ్నం కావటమే యాస్ట్రల్ ట్రావెల్. కనిపించే గగనాన్ని దాటితే తప్ప ఈథరిక్‌ను చేరుకోలేం.. మనస్సును సైతం ఈథరిక్ ప్లేన్‌లో వదిలితే తరువాతి ప్రస్థానం యాస్ట్రల్ ప్లేన్‌నే! యాస్ట్రల్ బాడీతో విశ్వావరణలన్నింటా సంచరించగలం. విశ్వ పురుషులతో సంభాషించగలం. విశ్వకర్మలను అవలోకించగలం.
ఇంతకీ, ఈ యాస్ట్రల్ ట్రావెల్ ప్రస్థానానికి కావలసింది
* దేహం ధ్యానముద్ర కావాలి
* మనసు వౌనస్వామి కావాలి
* స్వరపేటిక స్వరాలతో, వినిపించే శబ్దాలతో సంయోగించాలి
* దృశ్యాలకు తొలుత సమ్మోహనమైనా, మలి మలుపులో ఆ ఆకర్షణ నుండి విముక్తం కావాలి
* కాల నియమంలోకి వెళ్లక, కాలయాపన చేయక, యాస్ట్రల్ ప్రయాణ అనుకూలతలో సంగమించాలి
* ఈ తిమిరాంధకార ప్రయాణంలో భయంతో ఉండకూడదు
* సహనంగా సంయమనంతో ప్రస్థానిస్తుంటే అదృశ్యాలన్నీ దృశ్యమానమవుతుంటాయి.
* మొత్తానికి మనసుతో కాక అనుభూతిగా మాత్రమే మిగిలేది యాస్ట్రల్ విహారం!
* మనం హ్యూమన్ ఇంటెలిజెన్స్‌తో కంప్యూటర్ యుగంలో ఎంతలా కోడ్ లాంగ్వేజ్ నిష్ణాతులమయినా ‘జెనటిక్ కోడ్’ని పునః లిఖించగల శక్తిసంపన్నులం కాగలిగేదీ ఈ ‘యాస్ట్రల్ ఇంటెలిజెన్స్’తోనే!!

నెలకంటి వేళలో..

$
0
0

ఆకాశంలో చందమామ..
నేలన మెరుస్తోంది!
నెలవంకై..
అమ్మ పెట్టిన ముగ్గులో..
కళ్లాపి చల్లిన వాకిళ్లు..
కల్యాణ తిలకమద్దుకున్నట్లు..
నేలంతా రంగురంగుల చిత్రాలు..
ఊరంతా సంక్రాంతి ముగ్గులు..
ధరణికి దరహాస శ్రీకారం
మగువుల కరవిలాస సాకారం
ప్రతీ ధనూర్మాసమందూ!
నేలే విరిసిందా?
నింగే నేలపై మురిసిందా!?
ఇంటింటా ముగ్గులు
వీధి పొడుగునా ముచ్చట్లు
ఊరంతా ఇంద్రధనుస్సులు
చెట్లు చిగురించినట్లు..
లతలు పూసినట్లు..
జాబిల్లి వెనె్నల కురిసినట్లు..
నక్షత్రాలు తళుకులీనుతున్నట్లు..
ఎన్ని వనె్నలు? ఎన్ని చినె్నలు?
మా పల్లి ముగ్గులు..
లెక్కలు పెట్టి..
చుక్కలు చుట్టి..
గీతలు కలిపి..
సిత్రంగా..
చిత్రాలు సృష్టించడం చూస్తుంటే..
జ్యామితీయ లెక్కలకి
రేఖా గణితానికి
వారసత్వం మా రంగవల్లికలేననిపిస్తోంది!
ముక్కనుమ పొద్దులో..
ఇంటి ముంగిట..
రథం ముగ్గేసి..
వీధి చివరి వరకూ లాగుతూంటే..
ముందుతరాల కోసం..
మన నాగరికతను నడిపిస్తున్నట్లుండేది..
సర్ప విన్యాసాలు..
మయూర నాట్యాలు..
కూచిపూడి నృత్యాలు..
హరిదాసు కీర్తనలు..
కోయిల రాగాలు..
గజరాజుల హొయలూ..
బాజాభజంత్రీల మోతలు..
సదృశ్యంగా చూపించే
స్వరాగంగా వినిపించే
సర్వకళాకేళి..
నవవసంతాల హోళి..
నా సంప్రదాయ రంగోళి..
ముగ్గంటే..
మనిషికీ, మట్టికీ ఉన్న
బంధాల్ని గుర్తుచేసే
అనుబంధాల మాలిక
మనుషుల్నావిష్కరించే వేదిక
హృదయాన్ని ఉప్పొంగించే చైతన్య గీతిక..
ఇవాళ..
నవీన తరం!
కంప్యూటర్లలో పొదిగిన ఆకృతుల్ని..
హైటెక్కు టెక్కుల్ని రంగరించి
వందల వర్ణాలు కుమ్మరించి
కాంక్రీటు కళ్లాలపై పరిస్తే..
అది ముగ్గవుతుందా..!?
కుండ పిడతలోని..
గుల్ల ముగ్గుతో..
మట్టినేలపై..
మమకారాలు పండించిన
నా పల్లెమ్మ ముగ్గుముందు..
నిలుస్తుందా!?

ఆహార ఔషధం.. ఆలూ

$
0
0

ప్రశ్న: బంగాళా దుంపల గురించి వివరంగా చెప్పండి సార్. ఏ వ్యాధుల్లో తినవచ్చో.. ఏ వ్యాధుల్లో తినకూడదో తెలుపగలరు.
-వేమూరు కోకిలాంబ (జగిత్యాల)

జ: ఆలూ దుంపల్ని వైద్య శాస్త్ర పరంగా ళ్ఘ్యూజళ ఔ్ఘషరీళజూ ఆఖఇళూ (కేలరీలు దట్టించిన దుంపలు) అంటారు. తక్కువ ఖర్చుతో దొరికే ఎక్కువ కేలరీలు కలిగిన ఆహారంగా పేదవాడి ఆహారంగా ఇది ప్రపంచ ప్రసిద్ధి.
ఒకప్పుడు మన పెద్దవాళ్లు అప్పటికప్పుడు ఊడిపడిన అతిథి దేవుడికి అత్యవసరంగా వండిపెట్టేందుకు ఆలూ దుంపల్ని ఎక్కువగా ఉపయోగించుకునేవాళ్లు. ఫలానా వారింట భోజనంలో బంగాళాదుంపల్ని వడ్డించారని ఘనంగా చెప్పుకునేవాళ్లు. నిజానికి స్వాతంత్య్రం వచ్చేవరకూ ఈ దుంపల్ని మన వాళ్లు అంతగా ఆదరించలేదు. 1941లో వెలువడిన ‘వస్తుగుణ మహోదధి’ అనే తెలుగు వైద్య గ్రంథంలో ఇవి తెల్ల నాగరికతకు చిహ్నాలని, వీటిని వాడటం దేశానికీ, దేహానిక్కూడా శ్రేయస్కరం కాదని వ్రాశారు. ఆలూ దుంపలు దేవుడు సృష్టి కాదు, విశ్వామిత్ర సృష్టి అని నమ్మేవారు ఇప్పటికీ చాలామంది వండరు. బ్రిటీష్ వారి మీద కోపంతో మనవాళ్లు ఈ దుంపలను మరింతగా ద్వేషించారు. రానురానూ వాటికి అలవాటు పడి ఆలూ దుంపలు లేకుండా వంట ఎలా చేయగలం..? అనే స్థితికి చేరుకొన్నాం మనం.
ప్రపంచంలో 125 దేశాల్లో ఏటా 300 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆలూ దుంపలు పండుతున్నాయి. వీటిలో కనీసం 4వేల రకాలున్నాయని చెప్తున్నారు. సగటు అమెరికన్ ఒక యేడాది కాలంలో 30 కిలోల ఆలూ దుంపల్ని తింటున్నాడని ఒక అంచనా. ఆ సంఖ్యతో పోలిస్తే తెలుగు వారి ఆలూ వాడకం కొంత తక్కువే కావచ్చు. కానీ, ఇటీవలి కాలంలో ఆలూ వాడకంలో గణనీయమైన పెరుగుదల కనిపించటానికి విదేశీ ఆహార పదార్థాల పట్ల మోజు పెరగటం ముఖ్య కారణం.
కొలంబస్ అమెరికాని కనుగొన్నప్పుడు అక్కడ ‘ఇంకా’ జాతి రెడ్ ఇండియన్ ప్రజలు ఆలూ దుంపల పిండితో రొట్టెలు చేసుకోవటాన్ని చూసి ముచ్చటపడి, ఈ దుంపలను తన స్పెయిన్ దేశానికి తీసుకువెళ్లి పరిచయం చేశాడట. స్పెయిన్ ద్వారా ఆలూ దుంపలు ప్రపంచానికి వెల్లడయ్యాయి. గోధుమ పిండికి ప్రత్యామ్నాయం కూడా వాటి వలన దొరికినట్లయింది. పారిశ్రామిక విప్లవ కాలంలో బ్రిటిషర్లు తమ సైన్యానికీ, కార్మికులకూ రేషన్ పంచటానికి ఈ దుంపల పిండిని ఎక్కువగా ఉత్పత్తి చేశారని చెప్తారు. రెండవ ప్రపంచ యుద్ధం రోజుల్లో ఆలూ దుంపలే చాలా దేశాలలో ఆహార కొరతని తీర్చాయట! ఒక టన్ను గోధుమలు పండే నేలలో అంతే శ్రమకు ఆరు టన్నుల ఆలూ దుంపలు పండుతాయంటున్నారు.
ప్రపంచంలో అత్యధికంగా పెరూలో ఆలూదుంపలు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. గోధుమలు, వరి, జొన్న, బార్లీ తరువాత ప్రపంచంలో ఐదవ స్థానంలో ఆలూ దుంపలు పండుతున్నాయి.
1830లో బ్రిటిషర్లు డెహ్రాడూన్‌లో ప్రత్యేకంగా తోటలు వేయించి ప్రయోగాత్మకంగా వీటిని పండింప చేశారు. డెహ్రాడూన్ అప్పట్లో బెంగాల్ ప్రావిన్స్‌లో భాగంగా ఉండేది. బెంగాల్ రాష్ట్రాన్ని బట్టి వీటికి బంగాళా దుంపలనే పేరు సార్థకం అయ్యింది.
బియ్యం, గోధుమ, రాగి, జొన్నల్లాగా ఈ దుంపల పిండి రొట్టెలు తయారుచేయటానికి కూడా ఉపయోగపడుతుంది. చాలా దేశాల వాళ్లు ఆలూ దుంపల పిండితో రొట్టెలను ఎక్కువ ఇష్టపడుతున్నారు. గోధుమల్లో గ్లుటెనిన్ అనే ప్రొటీన్ పదార్థం చాలామందికి సరిపడక పోవటం ఇందుకు ఒక కారణం. బేకరీలో తయారయ్యే బ్రెడ్ లేదా బన్ను రొట్టెలు మాత్రమే కాదు. చపాతీలు, పుల్కాలు, పూరీలు, పరోటాలు, దోసెలు ఈ అన్నింటినీ ఆలూ దుంపల పిండితో మనం చేసుకోవచ్చు.
ఆలూదుంపలు తింటే షుగరు వ్యాధి, స్థూలకాయం, కీళ్లనొప్పులు, కాళ్ల నొప్పులు, నడుం నొప్పి వగైరా వాత వ్యాధులు కూడా తిరగబెడతాయనే భయం మనలో బాగా ఉంది. ఆలూదుంపలు మాత్రమే కాదు కష్టంగా అరిగే ఆహార పదార్థాలు ఏవి తిన్నా, వాతం వికటించి నొప్పులతో సహా అన్ని వాతవ్యాధుల్నీ తెచ్చిపెడతాయి. వాటిని తేలికగా అరిగే పద్ధతిలో వండుకొంటే వాతం చేయవు. కానీ కుర్మాగానూ, పూరీకూర, పులుసుకూర, వేపుడు కూరలుగానూ వండుకొంటే దెబ్బ తీస్తాయి. ఆలూ దుంపల్ని చపాతీ, పూరీ, లేదా దోశెల్లాంటి అరగని ఆహార పదార్థాలతోనే ఎక్కువగా తింటున్నాం. ఇలా కష్టంగా అరిగే పదార్థాలను కలిపి తింటే అరగకపోవటం సహజమే గదా! తినేది పూరీలాంటి నూనె పదార్థాల్నీ, తిట్టేది ఆలూ దుంపల్నీ అవుతుంది.
అలా కాకుండా, తేలికగా అరిగేలా ఆలూదుంపల్ని వండుకొంటే, ఈ వాతం గోల ఉండనే ఉండదు. అందుకే, ‘ఇంకా’ జాతి ప్రజలు కనిపెట్టిన పద్ధతిలో ఆలూ దుంపల పిండితో చేసిన రొట్టెలు ఆరోగ్యానికి మంచివన్నమాట! ఈ పిండితో అప్పడాలు చేసుకొని పెనం మీద కాల్చుకుని తింటే, జొన్న రొట్టెల్లా రుచిగా ఉంటాయి. అవి అధిక ఉష్ణోగ్రత దగ్గర నూనెలో వేగిన ఆలూ దుంపల చిప్స్ కన్నా ఆరోగ్యదాయకంగా ఉంటాయి కూడా! అల్లం, ధనియాలు, కొత్తిమీర, పుదీనా, వాము ఇలాంటివి చేర్చి ఆలూ దుంపలను వండుకొని వాటిని ప్రత్యేకంగా తినాలి. వరి అన్నంలో గానీ, గోధుమ రొట్టెల్లో కానీ నంజుకోవటానికి ఆలూ దుంపలను ఉపయోగించుకోవటం కన్నా ఇలా కొత్తగా ఆలోచించటం వలన ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.


వారం వారం గోచారం (13-1-2019 నుంచి 19-1-2019 వరకు)

$
0
0

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఆదివారం ఖర్చులు పెట్టుబడులు అధికం. ప్రయాణావకాశాలు. విశ్రాంతి లభిస్తుంది. సౌఖ్యంగా గడుపుతారు. ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి. వ్యాపార వ్యవహారాల్లో శుభ పరిణామాలు. సోమవారం పరామర్శలకు అవకాశం. నిర్ణయాదుల్లో కొంత ఒత్తిడి. సంప్రదింపులకు అనుకూలం. విజయ సాధన. మంగళవారం బాధ్యతలు అధికం. వ్యవహారాల్లో విజయం. వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో ఒత్తిడులు. నిర్ణయాల్లో జాగ్రత్త. బుధవారం భాగస్వామ్య సమస్యలు. కుటుంబంలో, ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త. అధికారిక వ్యవహారాలపై దృష్టి. గురువారం సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం. నిల్వధనం పెంచుకుంటారు. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. శుక్రవారం ఆహార విహారాలపై ప్రత్యేక దృష్టి. మాట విలువ పెరుగుతుంది. వ్యర్థమైన ఖర్చులకు అవకాశం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఆదివారం అనుకోని సమస్యలు. అనారోగ్య భావాలు. ఊహించని సంఘటనలు. ఆలోచనల్లో ఒత్తిడులు. సంతానంతో జాగ్రత్త. పరిచయాలు లాభిస్తాయి. వ్యతిరేకతలుంటాయి. వ్యాపారాదుల్లో అనుకూలత. సోమవారం కొత్త పనులపై దృష్టి. కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. కీర్తి ప్రతిష్టలు. దూర ప్రయాణావకాశాలు. మంగళవారం వ్యతిరేక ప్రభావాలు ఇబ్బంది పెట్టవచ్చు. చికాకులకు అవకాశం. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. బుధవారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. ఆహార విహారాలపై ప్రత్యేక దృష్టి. వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు. గురువారం అధికారిక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. శ్రమ ఉన్నా స్థాయి పెరుగుతుంది. పోటీ రంగంలో అనుకూలత. శుక్రవారం ఖర్చులు పెట్టుబడుల్లో సంతోషం. విశ్రాంతిగా గడుపుతారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆదివారం సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. ఆహార విహారాలపై దృష్టి. ఆలస్య నిర్ణయాదులు. బద్దకం తగ్గించుకోవాలి. భాగస్వామ్యాల్లో అనుకూలత. వృత్తిలో నైపుణ్యం. సోమవారం ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. సంతోషం. అభీష్టాలు నెరవేరుతాయి. మంగళవారం కుటుంబ ఆర్థికాంశాల్లో జాగ్రత్త అవసరం. మాటల్లో నైరాశ్య ధోరణి. నిల్వధనం కోల్పోవచ్చు. విందుల కోసం వెచ్చిస్తారు. బుధవారం ప్రయాణాలు. షాపింగ్‌పై దృష్టి. సౌఖ్యం. విహార యాత్రలు. విశ్రాంతి లభిస్తుంది. కుటుంబ వత్తిడులు. గురువారం మాటల్లో అధికారిక ధోరణి. వ్యతిరేకతలున్నా గుర్తింపు. కొన్ని అనుకోని సమస్యలు. శుక్రవారం అన్ని పనుల్లోనూ చికాకులకు అవకాశం. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆహార విహారాల్లో ఒత్తిడులు.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఆదివారం లాభాలపై ప్రత్యేక దృష్టి. ఆశించిన ప్రయోజనాలు అందకపోవచ్చు. అనుకోని సమస్యలు. వ్యాపారాదుల్లో జాగ్రత్త. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. సోమవారం కుటుంబ ఆర్థికాంశాల్లో సమస్యలు. ఆలోచనల్లో ఒత్తిడులు. సంతానంతో జాగ్రత్త. ఖర్చులు పెట్టుబడులుంటాయి. మంగళవారం ఆధ్యాత్మిక ప్రయాణాదులపై దృష్టి. ఉన్నత వ్యవహారాలుంటాయి. భాగస్వామ్య అనుబంధాల వృద్ధి. బుధవారం పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. ఖర్చులు అధికవౌతాయి. విశ్రాంతి. కొత్త పనులుంటాయి. గురువారం అధికారిక వ్యవహారాలపై దృష్టి. సౌకర్యాలు సమకూర్చుకుంటారు. ఒత్తిడులు, సంప్రదింపులుంటాయి. శుక్రవారం సంప్రదింపుల్లో అనుకూలత. బాధ్యతల వృద్ధి. స్పష్టమైన నిర్ణయాలు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఆదివారం పరిచయాలు స్నేహానుబంధాలు వృద్ధి చెందే అవకాశం. సౌకర్యాలు ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార విహారాల్లో జాగ్రత్త. విద్యారంగంలో అనుకూలత. నిర్ణయాలు ఫలిస్తాయి. సోమవారం వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కొన్ని అనుకోని ఇబ్బందులకు అవకాశం. మంగళవారం తొందరపాటు కూడదు. నిర్ణయాదులు వాయిదా వేసుకోవాలి. సంతానంతో ఒత్తిడులు. సంప్రదింపులు. బుధవారం కమ్యూనికేషన్స్‌లో కొంత ఇబ్బంది. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. నిర్ణయాదుల్లో కొంత జాగ్రత్త. గురువారం ఆలోచనల్లో తొందరపాటు కూడదు. కీర్తి ప్రతిష్ఠలపై దృష్టి. లక్ష్యాల సాధన. లాభాలు సంతోషాన్నిస్తాయి. శుక్రవారం పెద్దల ఆశీస్సులుంటాయి. పరిచయాలు స్నేహానుబంధాల్లో అతి జాగ్రత్తగా మెలగాలి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఆదివారం సంప్రదింపులుంటాయి. సహకారం లభిస్తుంది. పరామర్శలకు అవకాశం. కాలం ధనం వ్యర్థం కావచ్చు. వ్యాపారాదుల్లో పెట్టుబడులుంటాయి. సోమవారం దూర ప్రయాణాలపై దృష్టి. వినోద విహారాలకు అవకాశం. పోటీల్లో విజయం. ఆహార విహారాల్లో అనుకూలత. మంగళవారం నిర్ణయాదుల్లో జాగ్రత్త. కొంత నిరాశ ఉంటుంది. ఆత్మవిశ్వాస లోపం. సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి. బుధవారం అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి. గృహ వాహనాదులపై ప్రత్యేక దృష్టి. శారీరక ఒత్తిడులుంటాయి. గురువారం అభీష్టసిద్ధి. సంతానవర్గ వ్యవహారాల్లో సంతోషం. నిర్ణయాదుల్లో సమస్యలు. భాగస్వామ్యాల్లో సంతోషం. శుక్రవారం పరిచయాలు విస్తరిస్తాయి. కొత్త పనులపై దృష్టి. ప్రయాణాదుల్లో జాగ్రత్త అవసరం. శనివారం భాగస్వామ్యాల్లో జాగ్రత్త.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆదివారం వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. అధికారిక వ్యవహారాలు. భాగస్వామ్యాల్లో ఒత్తిడులు. పరిచయాల్లో జాగ్రత్త. వ్యాపార వ్యవహారాల్లో నూతన పోకడలుంటాయి. సోమవారం నిర్ణయాదులకు అనుకూలం. సౌకర్యాలు పెంచుకుంటారు. లాభాలపై దృష్టి. అనుకోని ఇబ్బందులు. మంగళవారం ఊహించని సంఘటనలు. నిర్లిప్తత. ఆశించిన ఫలితాలు అందకపోవచ్చు. వ్యతిరేకతలున్నా విజయం. బుధవారం పోటీ రంగంలో గుర్తింపు. కొంత అసహనం, చికాకులు. ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. ఆరోగ్య లోపాలు. గురువారం ఆహార విహారాలపై ప్రత్యేక దృష్టి. సంప్రదింపుల్లో ఒత్తిడులు. కొంత సమాచారం కలవరపెడుతుంది. శుక్రవారం సంప్రదింపులుంటాయి. సౌఖ్యంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు. ఘర్షణలకు అవకాశం.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఆదివారం పోటీలు ఒత్తిడులు చికాకులుంటాయి. గుర్తింపు లభిస్తుంది. సహకారం కోసం ప్రయత్నం. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త. వార్తలలో లోపాలుంటాయి. సోమవారం లక్ష్యాలను సాధిస్తారు. సుదూర ప్రయాణాలపై మక్కువ. వ్యాపార సమాచారం. భాగస్వామ్యాలపై ప్రత్యేక దృష్టి. మంగళవారం సౌకర్యాలు ఇబ్బంది పెడతాయి. ఆహార విహారాలలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో అనుకూలత. బుధవారం ఆర్థిక నిర్ణయాలు ఫలిస్తాయి. మాటల్లో చమత్కార ధోరణి. కార్యనిర్వహణలో కొంత జాగ్రత్త అవసరం. గురువారం గృహ వాహనాది సౌకర్యాలు శ్రమకు గురి చేయవచ్చు. అనుకోని ఇబ్బందులుంటాయి. వృత్తిలో ఘర్షణ. శుక్రవారం అధికారిక వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. వ్యతిరేక ప్రభావాలు తీవ్రవౌతాయి. శ్రమాధిక్యం.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఆదివారం లాభాలకు అవకాశం. ఆధ్యాత్మికవేత్తలపై దృష్టి. పెద్దలతో పరిచయాలు. బద్దకంగా వ్యవహరిస్తారు. కుటుంబ ఆర్థికాంశాల్లో అనుకూలత. ప్రయోజనాలుంటాయి. సోమవారం వ్యాపారాల్లో అనుకూలత. ఆలోచనలకు రూపకల్పన. అనుకోని ఒత్తిడులు. సంప్రదింపులకు అవకాశం. మంగళవారం వ్యర్థమైన ప్రయాణాలు. ఖర్చులు. సౌఖ్య లోపం. పరామర్శలు. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. బుధవారం సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. అధికారిక వ్యవహారాలపై దృష్టి. ఉన్నతి కోసం కొన్ని ఖర్చులు, ప్రయాణాలు. గురువారం భాగస్వామి కోసం వెచ్చిస్తారు. ఆరోగ్య లోపాలు. విశ్రాంతి తీసుకోవడం మంచిది. వ్యతిరేకతలపై విజయం. శుక్రవారం గుర్తింపు. పోటీ రంగంలో అనుకూలత. కుటుంబ ఆర్థికాంశాల్లో జాగ్రత్త అవసరం.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఆదివారం ఉన్నత విలువలుంటాయి. లక్ష్యాలను సాధించే ప్రయత్నాలు. కీర్తి ప్రతిష్టలపై దృష్టి. వ్యతిరేకతల విషయంలో జాగ్రత్త. పోటీ రంగంలో ఇబ్బంది. వ్యాపార వ్యవహారాలకు అనుకూలం. సోమవారం ఖర్చులు పెట్టుబడుల్లో అనుకూలత. సంప్రదింపులు సంతోషాన్నిస్తాయి. వృత్తి ఉద్యోగాదులపై ప్రత్యేక దృష్టి. మంగళవారం అధికారిక వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. పరిచయాలు అనుబంధాల్లో కొంత ఇబ్బంది. బుధవారం మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ సంతోషం. అధికారిక పరిచయాలు. గురువారం లాభాలు సంతోషాన్నిస్తాయి. పరిచయాలు స్నేహానుబంధాల్లో కొంత అప్రమత్తం. నిర్ణయాదుల్లో అనుకూలత. శుక్రవారం పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఆదివారం అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్త. ఆచితూచి మాట్లాడటం మంచిది. నిల్వధనం కోల్పోవచ్చు. సోమవారం కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. పోటీ రంగంలో విజయం. మంగళవారం సంప్రదింపుల్లో జాగ్రత్త. వార్తలు కలవరపెట్టే సూచనలు. కొంత నిరాశ. నిర్ణయాదుల్లో అనుకూలత. బుధవారం ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. సంతోషంగా గడుపుతారు. సంప్రదింపులకు అనుకూలం. పోటీలు. గురువారం వృత్తిలో అనుకూలత. అధికారుల సహకారం. ప్రయాణాలు. కీర్తి ప్రతిష్టలపై దృష్టి. కార్యనిర్వహణ. శుక్రవారం ఉన్నత వ్యవహారాలు. గౌరవం. ఆలోచనల్లో కొంత వత్తిడి. సంతానవర్గ వ్యవహారాల్లో ఇబ్బందులు.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదివారం ఆత్మవిశ్వాసంతో మెలగుతారు. నిర్ణయాదుల్లో అనుకూలత. బాధ్యతలు అధికం. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమాధిక్యం. గుర్తింపు. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. సోమవారం సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. పరిచయాలు విస్తరించే అవకాశం. ఆర్థిక నిల్వలను పెంచుకుంటారు. పెద్దలతో జాగ్రత్త. మంగళవారం ప్రయోజనాలు కొన్ని కోల్పోవచ్చు. వ్యవహారాల్లో జాగ్రత్త. ఉన్నత వ్యవహారాలు. లక్ష్యాలను ఆలోచిస్తారు. బుధవారం సంప్రదింపులకు అనుకూలం. ఊహించని సమస్యలను అధిగమిస్తారు. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలు. గురువారం వ్యతిరేకతలపై విజయం. అధికారుల ఆదరణ, అభీష్టాలు నెరవేరుతాయి. కొత్త వార్తలు తెలుస్తాయి. శుక్రవారం సంతానంతో సంతోషంగా గడుపుతారు. అభీష్టసిద్ధి. తొందరపాటు భావాలను వదిలిపెట్టాలి.

కవనం.. ఓ కన్నెవదనం

$
0
0

మోగెలే ఎదను సితార సాగెలే
హృది రస అసిధార
పాడెలే కొమ్మలనూగెలే ఆడెలే గండుకోయిల
ఊగే కొమ్మల తూగాడే పూవుల సుమ
సుగంధ పరిమళాల సౌరభాల...
కన్నె వధువులా గుండె మధువులా..
సాగిపోసాగే లేలేత కడలి కెరటాల
చిరుగాలి రెపరెపలా పైట చెంగు పెరపెరలా
పురివిప్పిన ఆ వయసుల
రెపరెపలాడే నీలికన్నుల
మొగ్గగ విరిబుగ్గల సిగ్గుగ ముసినగలై
ముత్యపు మెరుపై తొలకరి చినుకై
ప్రేమ మొలకై అలకల కులుకుల తళుకై
విరిసింది రసహృదయం
మురిసింది యువ గమనం
పురోగమనమె కాని తిరోగమన మెరుగని
జాలువారు పద కవితల
తరుణీ సొగసుల ఆస్వాదించే
రస హృదయం.. అంగలార్చకుండేనా
అల్లసాని పెద్దనైనా...
మతిపోవక మనియేనా ప్రవరాఖ్యుడైనా...

ఆర్తిని హరించే ఆదిపురుషుడు (రాస క్రీడాతత్త్వము-10)

$
0
0

(iii) ఈ మాటలేమిటో అర్థం కాక, ఆ గోపికలు తత్తరపడుతుంటే - ఆయన మళ్ళీ కొంచెం ఆగి-
(iv) ‘‘ఇది అర్ధరాత్రి. ఇది క్రూరమృగాలు విచ్చలవిడిగా తిరిగే చోటు. ఇంత సాహసించి మీబోటివాళ్ళు ఇక్కడికి రావచ్చా?’’ - అన్నాడు.
(v) ఈ మాటలకు గోపికలందరూ బిత్తరపోయారు.
(vi) అయినా స్వామి ఆగలేదు. ఆయన ఇంకా ఇలా అన్నాడు-
ఒక వేళ వచ్చినా - కాని వేళ, కాని చోట, ఆడవాళ్ళు ఉండటం తగిన పని కాదు. తిరిగివెళ్ళండి. మీ తల్లిదండ్రులూ, అన్నదమ్ములూ, కొడుకులూ, కూతుళ్ళూ, భర్తలూ, మీకోసం ఇప్పటికే వెతుకుతూ వుంటారు’’- అని.
ఈ మాటలతో గోపికలకు నవనాడులూ క్రుంగి పోయినట్లయింది. వారి దగ్గరనుంచి బదులు కోసం ఎదురు చూడకుండానే, స్వామి మళ్ళీ కొనసాగించాడు. ‘‘కళ్యాణుల్లారా! వెనె్నల పొంగుతో వనమంతా శోభగా వుంది. ఏటి గాలులు చల్లగా సాగుతున్నాయి. పూల సువాసనలు గుబాళిస్తున్నాయి. ఈ వనశోభ చూసినకొద్దీ అందంగా వుంది’’ - అని
‘‘శ్రీకృష్ణుడేదో మొదట్లో కొంచెం కఠినంగా మాట్లాడినా, ఇప్పుడు హాయిగా మాట్లాడుతున్నాడులే’’ - అని గోపికలు ఒకింత ఊరట చెందుతూ వుండగానే, ఆయన మళ్ళీ తన మాట వరస మార్చేశాడు. ‘‘మీరింత సాహసం చేసి ఇక్కడకు వచ్చినందుకు, ఈ ప్రకృతి శోభను చూడగలిగారు. అక్కడ మీ భర్తలు మీకోసం ఎదురుచూస్తూ వుంటారు. పిల్లలు పాలకోసం ఎదురుచూస్తూ వుంటారు. ఇక బయలుదేరండి’’ - అన్నాడు.
గోపికలకు మళ్ళీ అయోమయం అయిపోయింది. ఇంతలో స్వామే మళ్ళీ అందుకున్నాడు -
(i) నీ మీద స్నేహంతో చిత్తాలు మెత్తనై, ఇక్కడికి వచ్చామంటారు. మంచిది. మీ ప్రీతియే చాలు. మీరిక్కడికి రావటమే చాలు. ప్రీతేయే ముఖ్యం.
(ii) కామినుల్లారా! స్ర్తిలకు కొన్ని ధర్మాలున్నాయి. వాళ్ళు నిష్కపటంగా పతిని సేవించాలి. పిల్లలను పోషించాలి. ఇవే స్ర్తిలకు ముఖ్య ధర్మాలు. ఈ ధర్మాలను ఆచరిస్తే, దానివల్ల మీవాళ్ళకు ప్రీతి, మీకు సుఖమూ కలుగుతాయి.
(iii) దీనికి భిన్నంగా ఆడపడుచులు ఇతరుల వెంటబడటం అప్రతిష్ఠ పని. స్వర్గానికి భంగకరం-అని.
ఈ మాటలకు గోపికల కళ్లన్నీ చెరువులైనాయి. వారేమీ మాట్లాడలేకపోయారు. స్వామి మళ్ళీ కొనసాగించాడు - ‘‘కళ్యాణుల్లారా! నా సన్నిధానంలో మీకేదో గొప్ప మేలు జరుగుతుందని ఆశతో ఇంత దూరం వచ్చారా? వున్న విషయం చెబుతాను వినండి. నిజానికి నా సన్నిధానం కంటే దూరమే మేలు. ఎందుకంటే దూరాన ఉన్నప్పుడు మీ ఆలోచనలన్నీ నా మీదే ఉంటాయి. మీ మాటలన్నీ ననే్న కీర్తిస్తాయి. కాబట్టి నాకు దూరంగా వుండటమే మేలు. కనుక, ఇక మీరందరూ మీ ఇళ్ళకు బయలుదేరండి’’ - అని.
ఇక గోపికలకు ఏడుపాగలేదు. కన్నీళ్ళకు కట్టలు లేవు. ఏమనాలో తోచక, కాలి వ్రేళ్ళతో నేలను గీస్తూ, బొమ్మల్లాగా నిలబడిపోయారు. కొంత సేపటికి వాళ్ళు తమని తామే సంబాళించుకుని ఇలా అన్నారు -
(iv) ‘‘నాథా! నువ్విలా మాట్లాడవచ్చా? అన్నీ వదిలిపెట్టి నీ పాదాలాశ్రయించామే, మమ్మల్ని కాల దన్నటం న్యాయమా?
(v) పతి, పుత్రుల సేవలు మాకు ధర్మమన్నావు. నిజమే. ఆ ధర్మం ద్వారా మేము పొందవలసింది ఎవర్ని? అందరికీ ఆత్మవైన నిన్ను కాదా?
(vi) భర్తలూ, పిల్లలూ, మీకు ప్రియులు కాదా?-అంటావేమో? ప్రియులే. కానీ, వాళ్ళంతా చిట్ట చివరికి దుఃఖం మిగిల్చే ప్రియులు. నువ్వొక్కడివే సమస్త దుఃఖాలనూ పోగొట్టే ప్రియుడవు.
(vii) ఓ పరమేశ్వరా! మేము ఎంతో కాలంగా నినే్న ఆశ్రయించి వున్నాం. నీ మీదే ఆశలు పెంచుకుని ఉన్నాం. వాటిని తుంచకు.
(viii) మేము సహజంగానే గృహబంధాలలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నాం. నువ్వే ఎలాగో ఆ బంధాలను దాటించి, నీ దగ్గరకు ఇలా చేర్చుకున్నావు. ఇప్పుడు వెళ్ళమంటే ఎలా పోతాం?
(ix) నువ్వు వెళ్ళమన్నావు గదా అని ఎలాగోలా వెళ్ళినా, మేం అక్కడ ఏమీ చేయలేము.
(x) సఖా! మా విరహాగ్నిని నువ్వే మధురగానంతో రెచ్చగొట్టావు. మేము నీ తిరస్కారాన్ని సహించలేము. ఇక్కడే, ఇప్పుడే, నీ పాదాల దగ్గరే, నినే్న ధ్యానిస్తూ, నువ్వు రేపిన విరహాగ్నిలో మాడిపొమ్మంటే మాడిపోతాం’’-అని.
ఇలా చాలాసేపు దీనంగా మాట్లాడి, మాట్లాడి, చివరకు తమ సిద్ధాంతం చెప్పేశారు.
వ్యక్తం భవాన్ వ్రజజనార్తిహరో-్భజాతో
దేవో యథాదిపురుష స్సురలోక గోప్తా
తన్నో విధేహి కరపంకజ మార్తబంధో
తప్త స్తనేషు చ శిరస్సు చ కింకరీణామ్ ॥
(్భవం : దేవా! దేవలోకాలను రక్షి ంచే ఆది పురుషు డవైన నువ్వు ఇప్పుడు గోపాల జనుల ఆర్తిని హరించడానికి అవతరించావు. ఈ మాట మాకు స్పష్టంగా తెలిసిపోయింది. కనుక, మాకింకా పరీక్షలు పెట్టకు. హే ఆర్తబంధూ! నీ కరపద్మాన్ని మాడిపోతున్న మా స్తనాల మీదా, మా శిరస్సు మీదా, వుంచు. మేము నీకు దాసీలం.)
గోపికల మాటలకు పరమాత్మ హృదయం కరిగి నీరైపోయింది. ఎందుకంటే-ఆయన యోగేశ్వరుడు. ఎదు రుగా వున్న ఈ గోపికలు యోగులు. వారికీనాడు తాను పంపిన సంకేతం అంది, తన దగ్గరకు చేరుకోగలిగారు. అంతే గాక తమ హృదయం మీదా, శిరస్సు మీదా, చేయి తాకించి శక్తిపాతం చెయ్యమని అడుగుతున్నారు. అందుకే, ఆ పరమాత్మ వారి మాటలకు పులకించిపోయాడు.
(ఇంకా వుంది)

ఇక స్కైటాక్సీల కాలమేనా?

$
0
0

నగరాల్లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ఇక్కట్లకు చెక్ పెట్టేందుకు టెక్ కంపెనీలు సరికొత్త పరిష్కారాలతో ముందుకొస్తున్నాయి. గగనతలంలో రివ్వున దూసుకెళ్లే స్కై టాక్సీలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. త్వరలోనే ఈ టాక్సీలను అందుబాటులో తెచ్చేందుకు దుబాయి సిద్ధమవుతోంది. 2019 మొదటి మూడునెలల్లోనే పైలెట్ రహిత ఎయిర్ టాక్సీలను గగనతలంలో పరీక్షించేందుకు జర్మనీకి చెందిన స్టార్టప్ సంస్థ వోలోకాప్టర్ ఏర్పాట్లు చేస్తోంది. అందుకు దుబాయి రవాణా శాఖ అనుమతులు ఇచ్చింది. ఇద్దరు ప్రయాణికులను సులువుగా తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఎయిర్ క్రాఫ్ట్‌లను వోలోకాపటేర్ తయారుచేస్తోంది. ఈ స్కై టాక్సీలు గరిష్ఠంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలిలో ప్రయాణించగలవని ఆ సంస్థ చెబుతోంది. అరగంట సేపు గాలిలో తిరిగేందుకు వీలుగా తొమ్మిది బ్యాటరీలు ఉంటాయి. ఈ టాక్సీల్లో భద్రతకు ఎలాంటి డోకా ఉండదని తయారీ సంస్థ చెబుతోంది. ఒకవేళ సాంకేతికంగా ఏదైనా సమస్యలు తలెత్తితే ఈ టాక్సీ దానంతట అదే లాండ్ అవుతుందట. అలాగే.. చైనాకు చెందిన డ్రోన్ తయారీ సంస్థ ఇహంతోనూ దుబాయి రవాణా శాఖ కలిసి పనిచేస్తోంది. ఒకరిని తీసుకెళ్లగలిగే ఇహంగ్ 184 పైలెట్ రహిత ఎయిర్‌క్రాఫ్ట్‌ను పరీక్షిస్తోంది. ఇది ఎక్కడికైనా సులువుగా లాండవుతుందని చెబుతున్నారు. ప్రాజెక్ట్ ఎలివేట్ పేరుతో ఉబర్ ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్‌ల తయారీ ప్రాజెక్టును ప్రారంభించింది. 2023లోగా తొలి 50 ఎయిర్ టాక్సీలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. వాహనం పేరుతో ఎయిర్‌బస్ ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్‌లను తయారుచేస్తోంది. ఇవి నాలుగు నుంచి ఆరుగురిని తీసుకెళ్లగలవు.
గగనతలంలోనైనా టాక్సీలో ఛార్జీలు తక్కువేనని ఉబర్ చెబుతోంది. ప్రస్తుతం ఉబర్ ఎక్స్ కాబ్ ఛార్జీలతో సమానంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. అయితే బ్యాటరీలతో ఈ టాక్సీలు ఎంత దూరం నడుస్తాయన్న విషయంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ టాక్సీలో ఉపయోగించనవన్నీ మెరుగైన బ్యాటరీలని, వీటితో ఏ రకమైన సమస్యలు ఉండవని ప్రతినిధులు చెబుతున్నారు. ఈ గగనతల టాక్సీలు వస్తే ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణ ఓ సవాలుగా మారుతుంది. సిగ్నలింగ్ వసతులూ మెరుగుపడాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం.. సైన్స్ అండ్ అవైడ్ అనే సాంకేతికతను నాసా అభివృద్ధి చేస్తోంది. దాంతో పైలెట్ రహిత ఎయిర్ క్రాఫ్ట్‌ల మధ్య సమాచార మార్పిడి జరుగుతుందని, ప్రమాదాలను నివారించే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా మరో మూడు నాలుగేళ్లలో ఈ గగనతల టాక్సీలను అందరూ చూసే అవకాశం రావచ్చు.

వైవిధ్య భరితం.. ‘చంద్రలేఖ’ సంగీతం

$
0
0

మస్తాన్‌రాజా ప్రఖ్యాత కీ బోర్డ్ ప్లేయర్. వీరి స్టేజి పేరు చంద్రలేఖ. ప్రొ.అలేఖ్య పుంజాల, దీపికారెడ్డి, పద్మభూషణ్ స్వప్నసుందరి మొదలగు కళాకారుల ప్రదర్శనలలో వీరు సంగీత సహకారాన్ని అందించారు. ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు విద్యాసాగర్, స్నేహలతా మురళి మొదలగు వారితో కలిసి పనిచేశారు. టీటీడీ ఆధ్వర్యంలో బి.వి. మోహన కృష్ణగారికి వంద అన్నమయ్య పదాలకి కీబోర్డు వాయించారు. 724 పాయిజన్, తొలి పాట, అనుష్ఠానం, అతడొక్కడుంటాడు, ఎలుకా మజాకా సినిమాలకు సంగీత సహకారాన్ని అందించారు. దర్శకులు రాఘవేంద్రగారు వీరికి చంద్రలేఖ అనే పేరు స్థిరం చేశారు. ఆ పేరుతోనే ఎంతో పేరు తెచ్చుకున్నారు మస్తాన్‌రాజా. ఆ పేరే వాళ్లమ్మాయికి పెట్టారు.
1968 ఏప్రిల్ 8న పంపన తాతారావు, శ్రీమతి కుసుమాంబ దంపతులకు నాల్గవ సంతానంగా భద్రాచలంలో జన్మించారు మస్తాన్‌రాజా. వీరికి ఇద్దరు అన్నలు, ఒక చెల్లి. విద్యాభ్యాసం భద్రాచలంలోనే జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ వరకు విద్యను అభ్యసించారు. వీరిది ఉన్నతమైన ఉమ్మడి కుటుంబమే కాదు కళాకారుల కుటుంబం అని చెప్పాలి. వీరి తండ్రి కీ.శే.పంపన తాతారావుగారు 1969వ సం.లో భద్రాచలంలో ‘అరుణ కల్చరల్ అసోసియేషన్’ అనే సాంస్కృతిక సంస్థను స్థాపించి అనేక కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది స్థానిక, స్థానికేతర కళాకారులను చేరదీసి ప్రోత్సహించారు. వీరి తల్లిగారు సైతం సంగీతాభిరుచి కలిగిన వారే. తల్లి ప్రోద్బలంతోనే చంద్రలేఖ 1990వ సం.లో తెలుగు పండితులు, శాస్ర్తియ సంగీత విద్వాంసులు విద్వాన్ రాజగోపాలాచార్యుల వారి వద్ద శాస్ర్తియ సంగీతాన్ని సుమారు ఐదు సంవత్సరాలపాటు అభ్యసించారు. 1996లో వారిజతో వివాహమయ్యింది. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటున్నారు.
1998వ సం.లో కొండపల్లి మహేష్ రచించిన శ్రీ షిరిడీసాయిబాబా భక్తి గీతాలను, ఎస్.ఎస్.ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై బుడగం శ్రీనివాస్ సమర్పించిన శ్రీ సాయి సంకీర్తన అను భక్తిగీతాల ఆల్బమ్‌కు చంద్రలేఖ తొలిసారి విలక్షణమైన సంగీతం సమకూర్చారు. ‘సాయి సంకీర్తన’ భక్తి గీతాలకు చంద్రలేఖ అందించిన సంగీతానికి ముగ్ధుడైన బుడగం శ్రీనివాస్ యస్.యస్.ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై వై.జితేంద్ర దర్శకత్వంలో తీసిన ‘సంకెళ్లు’ టీవీ సీరియల్‌కు చంద్రలేఖకు సంగీత దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పించారు.

ఫిలిం క్విజ్-113

$
0
0

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2. 1970లో వచ్చిన బాలభారతం చిత్రంలో ధృతరాష్ట్రుడు ఎవరు?
3. సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి హీరోయిన్‌గా తొలి చిత్రం?
4. పాతతరం గొప్పనటి ఎస్ వరలక్ష్మి నటించిన చిట్టచివరి తెలుగు సినిమా?
5. వందరోజుల సినిమా ఎన్టీఆర్ యమగోలకు సంగీత దర్శకుడు?
6. గోపీచంద్ ఒక్కడున్నాడు చిత్రానికి సంభాషణల రచయిత?
7. చీటికి మాటికి చిట్టెమ్మంటే.. పాటకు బాణీ కట్టింది ఎవరు?
8. మే4న పుట్టి మే 30న మరణించిన 70ఏళ్ల దిగ్గజ దర్శకుడు?
9. చిన్న వేషంతో తన ఇంటిపేరును ఒక జాతికి సింబల్ చేసిన నటుడు?
10. పక్క చిత్రంలోని హీరోయిన్ ఎవరు?

సమాధానాలు- 111

1.మనం
2. హలోబ్రదర్
3. చరణదాసి
4. గునుపూడి విశ్వనాథ శాస్ర్తీ
5. వీడెవడండి బాబూ
6. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ
7. కె చక్రవర్తి
8. ఉప్పలదదియం
9. లిజి
10. నందితాశే్వత

సరైన సమాధానాలు రాసిన వారు

ఆర్ వేదిక, విశాఖ
ఎంవిబి రెడ్డి, కుతుకులూరు
జివిఎం మోహన్, ముచ్చుమిల్లి
ఎన్ స్వామి, బొబ్బిలి
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
సిహెచ్ రమాదేవి, హైదరాబాద్
బీర కృష్ణ, తెనాలి
బలరామ్, తుని
ఎల్ అహ్మద్, సుల్తానాబాద్
జి భలేరావు, గౌరీపట్నం
ఎస్ నాగశే్వత, బెంగళూరు
కె అర్జున్, హైదరాబాద్
కెఎస్ రావు, కర్నూలు
బిఎస్ రాజు, కర్నూలు
యన్ శ్రుతకీర్తి, బొబ్బిలి

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

పనికొచ్చే జోరేనా?

$
0
0

కొంతకాలంగా గోళ్లుగిల్లుకుంటూ కూచున్న కాజల్ మళ్లీ పరుగందుకుంది. అటు సీనియర్ నటుడు కమల్‌హాసన్‌తో ఇటు కుర్ర హీరో బెల్లంకొండతో చాన్స్ కొట్టేసింది. మరో రెండు చిత్రాలు లైన్‌లో ఉన్నాయంటూ చెప్పుకోవడం బాగానే ఉంది. కానీ, ఏం లాభం? చేస్తున్న సినిమాలు ఏమేరకు ఆమె కెరీర్‌కు ఉపకరిస్తాయో అర్థంకాని విషయమే. ఈమధ్యే వచ్చిన ‘కవచం’ పవర్ తగ్గిన పోలీస్ కథ. నటించడానికి ఏమీలేక గుంపులో గోపికైంది. భారతీయుడు-2లో నిండా కమల్‌హాసన్ కనిపిస్తాడుగాని కాజల్‌కి ప్రాముఖ్యం ఉండదు. ప్రాముఖ్యం లేని పాత్రలవల్ల కాజల్‌కి డబ్బురావచ్చుగాని ఆహా, ఓహోలు దక్కవు. ఇది నిజం.
-సత్య, ఐ పోలవరం
బతుకు దొంతరలే
మొన్నవచ్చి సంచలనం సృష్టించిన మహానటితో బయోపిక్‌ల యుగం ప్రారంభమైందని జనాలు తలపోస్తున్నారు. బయోపిక్ అంటే ఓ మనిషి జీవిత చరిత్రను తెరమీద చూపడం. ఇటువంటి బయోపిక్‌లు వందలకొద్ది వచ్చాయి. చారిత్రాత్మక, పౌరాణిక సినిమాలన్నీ బయోపిక్‌లు కావంటారా? కాశీమజిలీ కథలనాధారంగా నిర్మించబడ్డ జానపద చిత్రాలూ బయోపిక్‌ల లాంటివే. ఇకపోతే సాంఘిక చిత్రాలు కల్పితకథలే అయినా, కొన్ని నిజజీవితాలకు పోలికలుగా ఉంటాయి. ఇవి బయోపిక్‌లు కాదు.
-ఎన్.ఆర్.లక్ష్మి, సికిందరాబాద్
ఔను.. ఏకబిగిన
దేశమంతటా బయోపిక్‌ల వరద! ప్రజలు మరిచిపోతున్న స్టార్లు, క్రీడాకారులు, మాఫియా లీడర్లు బయోపిక్‌ల రూపంలో బయటకొస్తున్నారు. విచిత్రం ఏమంటే ఒకే వ్యక్తిమీద మూడు బయోపిక్‌లు, ఒక వెబ్‌సీరీస్ రానుండడం ప్రపంచ రికార్డే. ఆ వ్యక్తి జయలలిత! వెబ్ సీరీస్‌ని రమ్యకృష్ణతో గౌతమ్‌మీనన్ తీస్తున్నాడట. ఒక బయోపిక్‌లో నిత్యమీనన్, ఇంకో దానిలో విద్యాబాలన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారట. అయితే ఒకే కథతో కొద్దిపాటి గ్యాప్‌తో మూడు బయోపిక్‌లూ విడుదలైతే ఒకటి హిట్, మిగిలినవి ఫట్ అయ్యే అవకాశం ఉన్నా నిర్మాతలు ఎందుకు ఎగబడుతున్నారో వారికే తెలియాలి.
-కమలాకర్, సికింద్రాబాద్
పాజిటివ్‌గా..
భారతీయ సినీ పరిశ్రమ టెక్నాలజీగా ఎంత ఎదిగిందో 2.ఓ సినిమా చూస్తే బాగా అర్థమవుతుంది. 3డి సాంకేతికతలో ఈ సినిమా ఏ హాలీవుడ్ సినిమాకైనా సాటి అని చెప్పొచ్చు. సినిమాలో షూటింగ్‌లకంటే విజువల్ ఎఫెక్ట్ భాగం ఎక్కువుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కథలో లీనంకావడం కంటే.. సినిమాలోని సాంకేతికత గురించే లోతుగా ఆలోచిస్తాడు. భవిష్యత్‌లో మొబైల్ ఫోన్ రేడియేషన్ ప్రభావంతో పర్యావరణం ఎంతగా కాలుష్యమవుతుందో ఇప్పుడే ఊహించి చెప్పాడు దర్శకుడు. సాంకేతిక మాయకుతోడు పక్షిజాతి అంతం అనే సామాజిక అంశాన్ని జోడించి చెప్పిన విధానం బాగుంది. ఈ సినిమాను అనుసరించి పేరడిగా భవిష్యత్ సినిమాల్లో పక్షిరాజా, మినీ రోబో లాంటి సన్నివేశాలను వాడుకుంటారనడంలో ఎలాంటి సందేహంలేదు. అయితే 2.0 అన్న పేరులో ఉన్న అర్థము, సాంకేతికత అర్థం కాలేదు.
- జి.అశోక్, గోదూర్
ప్రయోగం ఓకే
అంతరిక్షం చాలారోజులకి ఒక మంచి చిత్రం చూశామనిపించింది. హీరో వరుణ్‌తేజ్, హీరోయిన్లు అదితిరావు హైదరి, లావణ్యత్రిపాఠి, అవసరాల శ్రీనివాస్ అద్భుతంగా నటించి మెప్పించారు. ‘సంకల్ప్’ దర్శకత్వం అమోఘం. ఇలాంటి వెరైటీ సినిమాలు ఇంకా రావాలి. అయితే అక్కడక్కడ లోపాలున్నా, కొద్దిగా విసుగనిపించినా మొత్తంగా ప్రశంసించదగిన చిత్రమే. హాలీవుడ్ స్థాయిలా అగుపించే చిత్రమిది. చెప్పుకోదగ్గ చిత్రమే.
-సిహెచ్ సాయిమన్విత, హైదరాబాద్
ముట్టుకుంటే మసే
రోబో సీక్వెల్ హిట్ అవగానే శంకర్ తీసే అన్ని సీక్వెల్స్ హిట్ అయిపోతాయనుకోనక్కరలేదు. సీక్వెల్‌కి పునాది మొదటి చిత్రంలోనే పడాలి. మొదటి చిత్రంలోనే కొన్ని సన్నివేశాలు అసంపూర్తిగా వదిలేసి సీక్వెల్‌పై ఆసక్తిపెరిగే విధంగా సంభాషణలు, ప్రశ్నలూ చొప్పించాలి. సీక్వెల్ చూస్తున్నప్పుడు మాతృకలోని సన్నివేశాలు గుర్తుకువస్తూ ఉండాలి. సాధ్యమైనంతవరకు మాతృక నటించినవారే సీక్వెల్‌లో ఉండాలి. మొదటే ఈ జాగ్రత్తలు తీసుకోకుండా సీక్వెల్ తీస్తే తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం వేర్వేరు అయిపోయి సీక్వెల్ దెబ్బతింటుంది.
- శాండోప్రచండ్, శ్రీనగర్
ఇదో గోల
కాలం కలిసొచ్చినప్పుడు అగ్రస్థానంలో ఉండి వయసు మీరాక అవకాశాలు తగ్గిపోయి తీరిక ఎక్కువై కూచున్నవాళ్లు ఏదో ఒక నెపం చూపి రభసచేసి అందరి దృష్టిలో పడాలనుకుంటారు. కోలీవుడ్‌లో అదే జరిగింది. విశాల్ తమిళుడు కాదు. అతనికి ఆంధ్ర మూలాలున్నాయి. అతడు నిర్మాతల సంఘానికి అధ్యక్షుడిగా తగడంటూ భారతిరాజా, రాధిక తదితర 50 మందికి హఠాత్తుగా జ్ఞాపకంవచ్చి రభస జరిగి వ్యవహారం కోర్టువరకు పోయింది. కరుణానిధికి ఆంధ్ర మూలాలున్నాయని ఎంజిఆర్, రజనీకాంత్ మహారాష్ట్ర వాడని వారికి జ్ఞాపకం రాలేదు. వారి చిత్రాలు తెలుగులో కూడా హిట్ అయి వారికి పురస్కారాలు లభించాయని రాధిక, భారతిరాజాలు మరిచిపోయారు.
-జి సంచిత, నల్గొండ
ఆమే చెప్పాలి
అదితిరావ్ హైదరి ‘నేను ఐటంసాంగ్స్ చెయ్యనుగాక చెయ్యను. స్పెషల్‌సాంగ్స్ చేస్తా’అటుంది. రెండింటికీ తేడా ఏమిటని మీడియా అడిగితే ‘ఐటంసాంగ్‌లో ఆర్టిస్ట్‌ని హాట్‌గా చూపిస్తారు. స్పెషల్ సాంగ్ అయితే గ్లామరస్‌గా చూపిస్తారు’ అందట. సామాన్య ప్రేక్షకుల దృష్టిలో ఐటం, స్పెషల్- రెండూ ఒకటే. తేడా ఏమిటో విలేఖరులే కాదు ఆర్టిస్టులూ చెప్పలేరు. అదితి చేస్తే అది స్పెషల్, ఇతరులు చేస్తే అది ఐటం అనుకోవాలి కాబోలు! చాలా తెలివిగా చెప్పింది అదితి!
-్ధర్మతేజ, గొడారిగుంట


వరకట్నం

$
0
0

నటుడు నందమూరి తారక రామారావుది కృష్ణా జిల్లా నిమ్మకూరు. గుంటూరులో పట్ట్భద్రులయ్యారు. మన దేశం చిత్రంతో నటునిగా ప్రస్థానం ప్రారంభించి శత చిత్రాలు పూర్తి చేసుకున్నాక దర్శకత్వంపై దృష్టిసారించి 1961లో సీతారామకల్యాణం, 1962లో గులేబకావళి కథ చిత్రాలకు సారథ్యం వహించారు (దర్శకుడిగా పేరు మాత్రం వేసుకోలేదు). దర్శకుడిగా పేరు వేసుకున్న తొలి చిత్రం ‘శ్రీకృష్ణపాండవీయం’ (1966). తరువాత 13 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. నిర్మాతగా ఎన్‌ఏటి సంస్థపై కొన్ని చిత్రాలు రూపొందించారు. కుమారుడు ‘రామకృష్ణ’ మృతి చెందిన తరువాత అతని పేరు కలిపి ‘రామకృష్ణ ఎన్‌ఏటి’ నిర్మాణ సంస్థపై చిత్రాలు నిర్మించారు. శ్రీకృష్ణపాండవీయం, ఉమ్మడి కుటుంబం తరువాత 1969లో శ్రీ రామకృష్ణ ఎన్‌ఏటి బ్యానర్‌పై నిర్మించిన చిత్రం వరకట్నం. శ్రీ రామకృష్ణా సినీ స్టూడియోస్‌పై 1969 జనవరి 10న ఈ చిత్రం విడుదలైంది.

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్‌టి రామారావు
సంగీతం: టివి రాజు
నృత్యం: వెంపటి సత్యం
కూర్పు: జిడి జోషి
స్టంట్స్: సాంబశివరావు
కళ: ఎస్ కృష్ణారావు
కెమెరా: రవికాంత్ నగాయిచ్
మాటలు: మద్దిపట్ల సూరి, సముద్రాల (జూ)
నిర్మాత: టి త్రివిక్రమరావు

వరకట్నం -రెండు గ్రామాలకు చెందిన కథ. మీసాల సుబ్బయ్య ఓ గ్రామానికి మోతుబరి రైతు (నాగభూషణం). కొడుకు దేవసింహ (ఎన్‌టి రామారావు), భార్య కాంతమ్మ (హేమలత). పక్క గ్రామానికి చెందిన మరో మోతుబరి భద్రయ్య (మిక్కిలినేని). అతని కొడుకు బలరామయ్య (సత్యనారాయణ), కోడలు సుభద్ర (సావిత్రి), కుమార్తె సుజాత (కృష్ణకుమారి). సుబ్బయ్య కుమారునికి భద్రయ్య కుమార్తెకు వివాహం నిశ్చయమవుతుంది. పెళ్లిలో సుబ్బయ్య గ్రామానికి చెందిన పేచీకోరు అచ్చయ్య (అల్లు రామలింగయ్య) తెచ్చిన మాట పట్టింపుతో దేవసింహ సుజాతకు తాళి కట్టకుండా వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది. అదే గ్రామంలో శ్రీరాములు (పెరుమాళ్లు) సాధారణ రైతు. అతని కూతురు లక్ష్మి (చంద్రకళ). చుక్కమ్మ- రంగయ్య (రేలంగి)ల కుమారుడు దేవయ్య (పద్మనాభం). దేవయ్య -లక్ష్మి పెళ్లిలోనూ కట్నం కారణంగా గొడవలు తలెత్తుతాయి. అయినా లక్ష్మికి దేవయ్య తాళికట్టడంలో, అత్తింటివారు ఆమెను తమతో తీసుకెళ్తారు. కట్నం పేచీ నేపథ్యంలో కొడుకు దేవయ్యను లక్ష్మి కలవకుండా చుక్కమ్మ వేధింపులకు గురి చేస్తుంటుంది. కట్నం కోసం ఆమెపైన, ఆమె తండ్రిపైన నిందలు వేయటంతో లక్ష్మి, శ్రీరాములు ఇబ్బందులు పడుతుంటారు. లక్ష్మి అన్న సుబ్బన్న (ప్రభాకర్‌రెడ్డి) వేలుకు దెబ్బ తగలడం వలన చెల్లెలి కోసం ఆరాట పడుతుంటాడు. ఈ క్రమంలో తండ్రి ఆంక్షలు పెట్టినా దేవసింహ మాత్రం సుజాతే తన భార్య అని నిశ్చయించుకుంటాడు. తల్లి దీవెన తీసుకుని, సుజాతను ఆమె వదిన సుభద్ర సాయంతో కలుసుకుంటాడు. ఆమెకు తాళికట్టి భార్యగా స్వీకరిస్తాడు. బలరామయ్య తన మిత్రుడు మల్లయ్యదొర (రాజనాల)తో తిరిగి, సుజాతకు పెళ్లిచేయ నిశ్చయించటం, దేవసింహ మల్లయ్యదొర గొడవ పడటం, బలరామయ్య వలన దేవసింహ గాయపడటం, మనసు చెదిరిన సుజాత ఆత్మహత్య ప్రయత్నం చేసి మామగారింటికి చేరటం, వారంతా తిరిగి సుజాత ఇంటికి వచ్చి భద్రయ్య, బలరామయ్యతో కలిసి దేవసింహ, సుజాతలను ఆశీర్వదించటం, దేవయ్య తన తల్లితో నాటకమాడి బుద్ధివచ్చేట్టుచేసి, లక్ష్మిని, తండ్రిని కలపటం, ఈ రెండు జంటలు ఒకచోట ఆనందంగా నిలవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
‘అత్తా ఒకింటి కోడలే’, ‘ఆడ పెత్తనం’ వంటి పాత చిత్రాలు, మరికొన్ని చిత్రాల్లో అత్తలు కోడళ్లను ఆరడిపెట్టడం, కట్నం కోసం పెళ్లిళ్లు ఆగిపోవటం వంటి పలు అంశాలు దృష్టిలో వుంచుకొని ఈ చిత్రకథను మరికొంత వైవిధ్యంగా రూపొందించారు. దానికితగ్గట్టుగా సన్నివేశాలు చిత్రీకరించి చిత్రానికి ఓ ప్రత్యేకత కలిగించారు ఎన్‌టి రామారావు.
తొలుత చిత్రంలో మేజువాణి దృశ్యాలు, పాటలు వివరంగా చూపటం, ఆ ఆడంబరం చూసిన పేచీకోరు అచ్చయ్య మాటలువిని, ఇరువురు పెద్దలు పెళ్లిని నిలుపుదల చేయించటం, దానిలో భాగంగానే బంగారం పరీక్ష చేయించటం, మరోచోట దేవయ్య భార్య లక్ష్మితో సరసాలు, తల్లి ఆమెను శిక్షించటం, మామగారు వౌనంగా వుండటం, అత్తగారి ఆరళ్లు తీవ్రంగా చూపటం, ఇక ఎన్‌టిఆర్ తన భార్య అనుకున్న సుజాతను కలవటానికి ముసుగులో వెళ్లి దెబ్బలు తినటం, మరోసారి వూరు చివర భార్యను, ఆమె వదినను కలిసి తన నిశ్చయం వెల్లడించి వారింటికి వెళ్లి సుజాత మెడలో తాళికట్టడం, సుజాతను చాటుగా కలుసుకుంటున్న దేవసింహతో సుభద్ర, చాటుమాటు రాకపోకలవలన కలిగే నష్టాలు చూచాయగా, సున్నితంగా వెల్లడించటంలాంటి సన్నివేశాలను ఎంతో పరిపక్వతతో చిత్రీకరించారు. తన భర్తకు జరిగిన అవమానానికి సున్నిత హృదయంగల సుజాత ఆత్మహత్యకు పాల్పడటం, మరోచోట చంద్రకళ డబ్బులేని కారణంగా పుట్టింటి ఆదరణ పొందలేకపోవటం వంటి సాధారణ విషయాలను దర్శకుడు పట్టుతో నడిపించటం కనిపిస్తుంది. రాజనాలతో ఎన్టీఆర్ ఎడ్లబండిని వేగంగా నడిపి అతన్ని ఢీకొట్టడం, నది ఒడ్డున వారిద్దరి మధ్య కర్ర యుద్ధం, సుజాత గదిలో వారిద్దరి మధ్య వట్టి చేతులతో సాగిన పోరాటాలను ఎంతో విపులంగా ఉత్సుకత కలిగించేలా చిత్రీకరించారు. ఇక క్లైమాక్స్‌లోనూ ఎంతో సున్నితంగా పెద్దలమధ్య రాజీ మాటలు, అంతకుముందు రెండు వైపులా నౌకర్లు ఒకరినొకరు కర్రలతో తీవ్రంగా కొట్టుకోవటం ద్వారా సన్నివేశానికి బలం చేకూర్చటంలాంటి సన్నివేశాలను దర్శకునిగా, నిర్మాతగా యన్‌టి రామారావు చక్కని విశే్లషణతో వీటిని రూపొందించి ఆకట్టుకున్నారు.
చూడచక్కని చిరునవ్వు, కొంత చిలిపిదనం, ఒకింత గాంభీర్యం, తక్కువ మాటలు ఎక్కువ భావ ప్రకటనతో దేవసింహ పాత్రలో యన్‌టి రామారావు సంయమనంతో కూడిన నటన ప్రదర్శించారు. సుభద్రగా సావిత్రి సమర్ధవంతురాలైన ఇల్లాలిగా, కోడలిగా, అక్కగా పొందికైన నటనను ప్రదర్శించారు. సత్యనారాయణ, మిక్కిలినేని, ఎన్‌టిఆర్‌లతో, మరదలుతో చిలిపితనం.. ఇలా పలు భావాలను ఈజ్‌తో ప్రదర్శించిన అద్భుతమైన నటనను చూపారు. అమాయకత్వం, పెద్దల మాటను ఎదిరించలేని నిస్సహాయత, కావాలనుకున్న భర్తపట్ల అనురాగం, ప్రేమ, అత్తమామల పట్ల గౌరవం, ఇలా కృష్ణకుమారి సుజాతగా సున్నితమైన భావాలతో కూడిన నటనతో అలరించింది. అటు లక్ష్మిగా చంద్రకళ పాత్రోచితమైన భావాలను నిండైన నటనలో చూపగా, మిగిలిన పాత్రధారులంతా తమ పాత్రలను అంతే ఈజ్‌తో పోషించి మెప్పించారు. రాజనాల సహాయకునిగా రావికొండలరావు పాత్ర ప్రాధాన్యతబట్టి మధ్యలో పద్యాలు, సూక్తులను వల్లిస్తూ ప్రత్యేకత చూపించారు. ప్రభాకర్‌రెడ్డి, సత్యనారాయణ తమ పాత్రోచితమైన నటనను అలవోకగా ప్రదర్శించి చిత్రాన్ని రక్తికట్టించారు.
చిత్ర గీతాలు:
సి నారాయణరెడ్డి రచనతో ఘంటసాల, పి సుశీల ఆలాపనతో యన్‌టిఆర్, కృష్ణకుమారిలపై చిత్రీకరించిన రసవత్తర యుగళ గీతం -అడుగు అడుగులో మదమరాళములతో.. మొదలై, ఎన్నాళ్ళకు నా నోము పండింది’ అంటూ సాగుతుంది. వరకట్న దురాచారంపై మరో గీతం -ఇదేనా మన సంప్రదాయమిదేనా (రచన: సినారె, గానం: ఘంటసాల). సావిత్రి, కృష్ణకుమారిపై సాగే తమాషా గీతం -మరదల మరదల తమ్ముని పెండ్లమా (రచన: సినారె, గానం: పి సుశీల, జిక్కి). ఈ చిత్రంలో కొసరాజు రచించిన గీతాలు నాగుల చవితి గీతం -పుట్టలోని నాగన్నా లేచి రావయ్యా (గానం: పి సుశీల, జిక్కి). చంద్రకళ, పద్మనాభంలపై గీతం -గిలకల మంచం ఉంది, చిలకల పందిరి (గానం: కె జమునారాణి, పిఠాపురం). వారిరువురిపై మరో గీతం -మల్లెపూల పందిట్లోనా (బి గోపాలం, జమునారాణి). రావి కొండలరావుపై చిత్రీకరించిన రెండు పద్యాలు -్భగవతి అమృతమాతగా, ధరసింహాసనమై నభంబు (గానం: మాధవపెద్ది). రాజనాలపై చిత్రీకరించిన ఎడ్లబండి పాట -సైసై జోడెడ్లబండి షోకైన దొరలబండి (గానం: ఘంటసాల, మాధవపెద్ది). రావికొండలరావు, రేలంగిపై చిత్రీకరించిన తత్వగీతం -ఎవరు చేసిన కర్మ (గానం: మాధవపెద్ది). ఇల్లువాకిలిరోసె ఈ తీరున (గానం: మాధవపెద్ది). మేజువాణితో పాట -ఎందుకే తొందర సుందరాకారా (పి సుశీల, తిలకం).
‘వరకట్నం’ చిత్రం ప్రజాభిమానంతోపాటు విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ‘బెస్ట్ ఫీచర్ ఫిలిమ్ ఇన్ తెలుగు’గా నేషనల్ ఫిలిమ్ అవార్డ్ పొందింది. కుటుంబ కథా చిత్రాల నిర్మాతగా, దర్శకునిగా యన్‌టి రామారావుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. అంతేకాదు, తల్లా పెళ్లామా? కోడలుదిద్దిన కాపురం వంటి మహిళా కోణంలోని చిత్రాలు రూపొందించి విజయం సాధించేందుకు వరకట్నం ఆలవాలమైంది.

ఖేర్’ తీసుకున్నారు!

$
0
0

ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ** ఫర్వాలేదు

తారాగణం: అనుపమ్‌ఖేర్, అక్షయ్ ఖన్నా, విపిన్ శర్మ, సుజనె్న బెర్నెట్, మునీష్ భరద్వాజ్, అర్జున్ మాథుర్ తదితరులు
సంగీతం: సుదీప్‌రాయ్, సాధు తివారీ
సినిమాటోగ్రఫీ: సచిన్ క్రిష్న్
ఎడిటింగ్: ప్రవీణ్ కెఎల్
నిర్మాణం: రుద్ర ప్రొడక్షన్స్, బోహ్రా బ్రదర్స్
దర్శకత్వం: విజయ్ రత్నాకర్ జి
=====================================================
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఆంతరంగికుడు -మీడియా అడ్వైజర్ సంజయ్ బారు, తాను మన్మోహన్‌ని చూసిన కోణం నుంచి, ఆయనపట్ల ప్రజల్లో ‘ఇమేజ్’ని కాపాడాల్సిన బాధ్యతగల వ్యక్తిగా యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలెయెన్స్ (యుపిఎ) ప్రభుత్వంలోని అనేకానేక రాజకీయ మలుపుల్నీ.. న్యూక్లియర్ డీల్‌నీ.. కాంగ్రెస్ అధినేత్రి రాజకీయ చతురతనీ.. నెహ్రూ కుటుంబం రాజకీయ తెరవెనుక నడిపించిన వివిధ ఎత్తుగడలనూ అత్యంత సన్నిహితంగా గమనిస్తూ వాటన్నింటినీ క్రోడీకరించి రచించిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ కథ యథాతథంగా సెల్యులాయిడ్‌ని అలరించింది.
ఒక్కమాటలో చెప్పుకోవాలంటే -మన్మోహన్ సింగ్ జీవితాన్నీ, ఆయన వ్యక్తిత్వాన్నీ.. ‘సింగ్’గురించి బయటి ప్రపంచానికి తెలీని సంగతులనూ.. ఆయన గురించిన ఎన్నో ప్రశ్నలకు జవాబులనూ వెతుక్కోవచ్చు. ‘రాష్టప్రతి’ అంటే రబ్బర్‌స్టాంప్ అని ఒక నానుడి. అయితే -ప్రధాని పదవికీ దాన్ని ఆపాదించారా? అన్న సందేహం చాలామందిలో కలగటానికి గలకారణం ‘మన్మోహన్’ అన్నిటికీ వౌన ముద్రలో కనిపించటమే. ఆయన ముఖంలో ‘సిట్యుయేషనల్ ఎమోషన్స్’ని కనిపెట్టడం కష్టమని సన్నిహితులే అంటూంటారట. అత్యున్నతమైన ప్రధాని పదవికి ‘సింగ్’ అర్హుడుకాడనీ.. ఆయనంతటి వెనె్నముక లేని వ్యక్తి.. సోనియాగాంధీ ఆడించినట్టల్లా ఆడే ‘కీ’లుబొమ్మ’ అనీ.. ఏ నిర్ణయమైనా -...గాంధీ చెప్పినట్టే తీసుకుంటాడనీ -ఆయనకస్సలు ఆలోచనలే లేవనీ.. ఇలా లెఖ్ఖకుమించిన అభిప్రాయాలు ఇటు సోషల్ మీడియాలోనూ, పత్రికల్లోనూ, కార్టూన్ల రూపంలో -జోక్స్ రూపంలో జనంలోకి చొరబడ్డాయి. చాలామంది నిశ్చితాభిప్రాయం కూడా అదేనేమో?! అన్న తంతుగా మారిన మాట వాస్తవం.
2004లో ఎన్నికల అనంతరం -యూపీఏ ప్రభుత్వం నెలకొనటంతో ‘కథ’ మొదలవుతుంది. సింగ్ (అనుపమ్‌ఖేర్) ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. రాహుల్‌గాంధీ తన తల్లి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన సోనియాగాంధీ చెవిలో ఏదో ముచ్చటించాడు. అక్కడ సమావేశమైన మంత్రులెవ్వరికీ ఆ ‘గుసగుస’కి అర్థం తెలీలేదు. ప్రియాంక గాంధీకి కూడా కొద్దిగా కన్‌ఫ్యూజన్. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య ప్రధాని హోదాని ‘సింగ్’కి కట్టబెట్టారు.
అక్కడ్నుంచీ మొదలైన ఆయన ప్రస్థానంలో ఎదురైన సమస్యలూ.. మిన్నకుండిన పరిస్థితులూ.. నెహ్రూ కుటుంబం తాలూకు నీలినీడలు ‘సింగ్’ రాజకీయ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి? ‘సింగ్’ యాదృచ్ఛికంగా ప్రధాని అయ్యారా? లేక అనూహ్యంగా ప్రధాని అయ్యారా? అన్న సందిగ్ధంలోంచి బయటపడేందుకు ఆయన ఏమాత్రం ప్రయత్నించక పోవటం.. ఇవన్నీ ఆయనలానే ప్రేక్షక పాత్ర వహించి చూట్టమే. ఇన్నింటి మధ్య ఆయన సత్యసంధతనూ.. రాజకీయ అవినీతి ఆయనని అంటకపోవటం వొకింత అచ్చెరువొందించే అంశం. కానీ, పార్టీ సభ్యులూ.. ‘సింగ్’ ప్రభుత్వంలోని మంత్రులూ అవినీతి చెరువులో ఈదులాడుతూంటే చూడకపోవటం తప్పేనన్న విమర్శ ఉండనే ఉంది. పార్టీ అనుచర వర్గం, నెహ్రూ కుటుంబం సమాంతరం వెళుతూంటే -ఆ సమాంతర రేఖల మధ్య వౌనంగా ఉండిన ‘సింగ్’ వ్యక్తిగత జీవితాన్ని నిందించటానికి ఏమీ లేదు. అయితే -ఈ నవల విడుదలైన తర్వాత మాటేమోగానీ -సినీ కథగా రూపాంతరం చెందిన తర్వాత అనేకానేక వాదోపవాదాలు తెరమీదికి వచ్చాయి. కోర్టు మెట్ల వరకూ వెళ్లాయి. మొత్తానికి సమస్యలన్నిటినీ దాటుకొని -మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘క్లీన్‌చిట్’తో సినిమా విడుదలైంది.
కథాపరంగా ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే -నటన విషయానికి వస్తే.. ‘సింగ్’గా అనుపమ్‌ఖేర్, సంజయ్‌గా అక్షయ్‌ఖన్నా, సోనియాగా బెర్నెర్ట్, రాహుల్‌గా మాథుర్, ప్రియాంకగా కుమ్రా, అహ్మద్ పటేల్‌గా శర్మ.. వాజ్‌పేయి, అద్వానీ, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్.. టీవీ యాంకర్లు.. ప్రత్యర్థి వర్గానికి చెందిన నాయకులు.. ఇంకా ఇతరత్రా రాజకీయ నాయకుల పాత్రల్లో ప్రతి ఒక్కరూ వొదిగిపోయారు. నటనలో జీవించారు. రియల్ లైఫ్ హీరోలను ‘రీల్’ లైఫ్‌లో చూపాలంటే కొద్దిగా కష్టమే. అయినప్పటికీ -వాస్తవ పాత్రలను తెరపై అందంగా అందించారు.
బాలీవుడ్‌లో ఎన్నో పొలిటికల్ డ్రామాలు వచ్చినప్పటికీ.. ‘యాదృచ్ఛికంగానో -ప్రమాదవశాత్తో’ ఈ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది.

రొటీన్ రివేంజ్

$
0
0

పేట ** ఫర్వాలేదు
**
తారాగణం: రజనీకాంత్, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్దిఖీ, సిమ్రన్, త్రిష, బాబీ సింహా, యోగిబాబు తదితరులు
సంగీతం: అనిరుథ్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫీ: తిరు
ఎడిటర్: వివేక్ హర్షన్
నిర్మాత: కళానిథి మారన్, అశోక్
దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజు
**
రజనీ అంటేనే స్టైల్ ఆఫ్ మేనరిజమ్స్. తనదంటూ క్రియేట్ చేసుకున్న స్టైల్‌తో -సూపర్‌స్టార్ అనిపించుకున్నాడు. ఒకదశలో వచ్చిన ఇమేజ్‌ను కంటిన్యూ చేయడానికి మాత్రం ఇటీవలి కాలంలో ఇబ్బంది పడుతున్నాడు. ఇది రజనీ సినిమా అని చెప్పుకోడానికి తప్ప, అందులో రజనీ మార్క్ ఉందని చెప్పగలిగే సినిమా ఇటీవలి కాలంలో ఒక్కటీ లేదు. కొచ్చాడయాన్, కబాలి, కాలా, 2.ఓ -ఇలా ఏది చూసినా.. ఆయా చిత్రాలో మరొకరి మార్క్ తప్ప, రజనీ మార్క్ లేదన్నది కాదనలేని వాస్తవం. పాతికేళ్ల క్రితం ఇదే సంక్రాంతి సీజన్‌లో ‘బాషా’గా వచ్చిన రజనీ -మళ్లీ సంక్రాంతి సీజన్‌లో ‘పేట’గా వస్తున్నాడన్నప్పుడు -మళ్లీ తాము కోరుకునే రజనీని చూసే అవకాశం దక్కుతుందని ఫ్యాన్స్ అంతా సంబరపడ్డారు. అలాంటి కథతోనే పేటను తెరకెక్కించానని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ప్రకటించినపుడు -అభిమానులంతా ఎగిరి గంతులేశారు. పేట విడుదలైంది. మరి -రజనీ ఎలా కనిపించాడు. ఎలాంటి స్టైల్ చూపించాడు. ఇంకెలాంటి మేనరిజమ్స్ ప్రదర్శించాడు. అసలు -అభిమాని ఆశించే రజనీ ఉన్నాడా? సమీక్షిద్దాం.
ఓ పొలిటీషియన్ రికమెండేషన్‌తో హాస్టల్ వార్డెన్ ఉద్యోగంలో చేరతాడు కాళీ (రజనీకాంత్). అక్కడి సమస్యల్ని పరిష్కరించి, ఓ ప్రేమ జంటని ఒక్కటి చేయడంలో తనదైన స్టైల్ చూపిస్తాడు. అదేక్రమంలో కాలేజీ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్న పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌వున్న గ్యాంగ్‌తో గొడవ పడతాడు. కాళీని అంతమొందించాలని గ్యాంగ్‌లీడర్ మైఖేల్, అతని ఫాదర్ ప్లాన్ చేస్తారు. అలా వాళ్ల గ్యాంగ్ హాస్టల్‌లోకి ఎంటరయ్యాక తెలుస్తుంది, హాస్టల్‌లోకి చొరబడింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఠా అని. అయితే హాస్టల్‌లో ఉన్నది కాళి కాదని, అతను యూపీకి సుపరిచితమైన పేట వీర అని బయటపడుతుంది. యూపీ గ్యాంగ్‌తో పేట వీరకున్న వైరమేంటి? అక్కడి పొలిటీషియన్ సింగ్ (సింహాచలం) -పేటను ఎందుకు అంతమొందించాలని అనుకుంటున్నాడు? పేట అసలు కథేంటి? అన్న ఆడియన్స్ ప్రశ్నలకు స్క్రీన్‌పైన సమాధానం మొదలవుతుంది -సినిమాగా.
రజనీ మెస్మరైజ్డ్ మేనరిజమ్స్‌ని స్క్రీన్‌పై ప్రజెంట్ చేయడానికి గొప్ప స్పాన్‌వున్న స్టోరీ కంటెంట్. పైగా -ఇలాంటి పాత్రల్ని ఆడియన్స్ గుండెల్లోకి తీసుకెళ్లడంలో రజనీ స్క్రీన్‌హస్తుడు. కాకపోతే -కథ మొదలై పరుగందుకునే సరికి -ఈ స్క్రీన్‌ప్లే ఎక్కడో చూశామన్న ఆలోచనలు ఆడియన్స్‌లో మొదలైపోతాయి. కొద్దిసేపటికే -పాతికేళ్ల క్రితం చూసిన బాషా రీళ్ళురీళ్లుగా మైండ్‌లోకి వచ్చేస్తుంటాయి. ఇదే పెద్ద మైనస్. ఇక -కంటెంట్ స్పాన్‌కు తగ్గట్టుగా రజనీ మార్క్ మేనరిజమ్స్‌ని ప్రజెంట్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఫార్ములా బేస్డ్ స్టోరీలా -పగ, ప్రతీకారాల నేపథ్యంగా కథను తిప్పేయడంతో రజనీ పని సులువైపోయింది. గత ఐదు చిత్రాలుగా -రజనీ మార్క్ చూడ్డానికి అవకాశం లేక నిరాశతోవున్న ఫ్యాన్స్‌ను మెప్పించేందుకు తీసిన ఫక్తు సినిమా ఇది. అయినా, ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయారు. ఫస్ట్ఫాలోని రజనీ వాకింగ్ స్టైల్, యువకుడిగా చూపించిన చరుకుదనం, హావభావాలు, సిమ్రన్‌తో లవ్ ట్రాక్ మాత్రమే ఒకే అనిపిస్తాయి. రజనీతో తక్కువ నిడివే దొరికినా -సిమ్రన్ సమర్థంగా ఉపయోగించుకుంది. రజనీతో స్క్రీన్ షేర్ కోసం ఎప్పటినుంచో ఉబలాటపడుతున్న త్రిషకు మాత్రం -ప్రాధాన్యత లేని పాత్ర దొరికింది. సింగ్ (సింహాచలం)గా నవాజుద్దీన్ సిద్ధిఖీ, జీతూగా విజయ్ సేతుపతి, మాలిక్‌గా శశికుమార్, మేఘా ఆకాష్‌లు ఫరవాలేదనిపించారు. అనిరుథ్ అందించిన పాటలు కథకు అడ్డం తిరిగితే, నేపథ్య సంగీతం మాత్రం నిలబెట్టేందుకు భుజం అందించింది. ఒడిసా స్టైల్ బీజీయం ఆకట్టుకుంటుంది. తిరునవుక్కరసు చాయాగ్రహణం, సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు ఓకే.
ఐదు వరుస హిట్లు.. ఐదు వరుస ఫ్లాపులతో గ్రాఫ్ ‘గ్రౌండ్’కు చేరిన టైంలో -‘పేట’తో మళ్లీ పేట్రేగుతాడని ఆశించిన ఫ్యాన్స్‌ను ఇది పూర్తిగా నిరాశపర్చిన చిత్రం. రజనీ మేనరిజమ్స్, స్టైల్‌పై కొండంత ఆశలతో వెళ్లిన ఆడియన్స్‌కి ఆశాభంగమైంది. మాస్‌ని ఉర్రూతలూగించే కథను ఎంచుకున్నా, కథనం బాషాకు కాపీ కావడంతో పేట తేలిపోయింది. రజనీకి వీరాభిమాని అయిన కార్తీక్ సుబ్బరాజ్ -తన దర్శకత్వ బాధ్యతను విస్మరించటం ‘పేట’లో ప్రధానంగా కనిపిస్తుంది. తొలిభాగంలో వచ్చే ఎపిసోడ్స్ అన్నీ -ముత్తు, నరసింహ, బాషా చిత్రాలను గుర్తు చేస్తుంటాయి. అభిమానుల కోసమే అన్నట్టు ఫస్ట్ఫాలో రజనీని రజనీయే కాపీకొట్టేలా దర్శకుడి పంథా సాగిపోవడంతో ఆడియన్స్ సరిపెట్టేసుకున్నారు.
సెకెండాఫ్‌లో మాత్రం ఆ పనినీ కార్తీక్ సమర్థంగా నిర్వర్తించలేకపోయాడు. కాళీగా కనిపించిన పేట అసలు కథలో ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందన్న ఆశతో ద్వితీయార్థం నుంచి అలెర్టెయిన ఆడియన్స్‌కి అలాంటిదేమీ కనిపించలేదు. పేట వీర కథను హైట్స్‌కు తీసుకెళ్లడంలో దర్శకుడు విఫలమవ్వడంతో -పగ, ప్రతీకారాల నేపథ్యంలో సాగే రొటీన్ యాక్షన్ డ్రామా అయిపోయింది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కథ సీరియస్‌గా సాగుతుందే తప్ప, రజనీ నుంచి ఆశించే మెరుపులేవీ ఎక్కడా కనిపించవు. సెకెండాఫ్‌ను ఫ్లాష్‌బ్యాక్‌కే పరిమితం చేయడం కూడా కాపీ కథనమే అయినా -పగ, ప్రతీకారాల కథలో రజనీని ఇమడ్చడం కుదరలేదు. కథనాన్ని కొత్త గమనంలోకి తీసుకెళ్లివుంటే పేట ఫలితం మరోలా ఉండేదేమో. సెంటిమెంట్ సీజన్‌లోనూ రజనీ మేనరిజమ్స్ చూడలేకపోయామన్న భావన ఆడియన్స్‌లో కనిపించింది. రజనీ సినిమా కాదు, రొటీన్ రివేంజ్ డ్రామా అనుకుంటూ బయటకు వచ్చేయడం కనిపించింది.

సంపూర్ణ రామాయణం (నాకు నచ్చిన సినిమా)

$
0
0

రామదండు కదిలింది... కదిలిందీ రామయ తండ్రీ... వంటి చక్కటి పాటలతో అందరినీ అలరించిన పౌరాణిక చిత్రరాజం ‘సంపూర్ణ రామాయణం’. శోభన్‌బాబు శ్రీరామచంద్రుడు, అనుంగు తమ్ముడు సౌమిత్రిగా రామకృష్ణ చక్కని నటన ప్రదర్శించిన చిత్రమిది. చంద్రకళ సీతమ్మగా దుఃఖ రసాన్ని చిలికించింది. రావణుడుగా యస్.వి.రంగారావు ప్రతి నాయకుడుగా అద్భుతమైన నటనతోపాటు, రాక్షస అహంకారాన్నీ ప్రదర్శించి మెప్పించారు. చిత్రం ఏంటంటే -టైటిల్‌కి తగ్గట్టుగానే సంపూర్ణ రామాయణాన్ని తెరకెక్కించిన చిత్రమిది. రాముడు పుట్టుక (అవతారం) దగ్గర్నుంచీ పట్ట్భాషిక్తుడై రాజ్యపాలన చేపట్టి రామయుగం అంతమయ్యే వరకూ చాలా పెద్ద కథను మూడుగంటల లోపే చిత్రీకరించడంలో నిర్మాతలు విజయం సాధించారు. చిన్న విషయమైనా ‘ఉడత’ చేసిన సాయాన్నీ ఈ చిత్రంలో ప్రత్యేక సన్నివేశంగా చూపించడాన్ని ప్రశంసించాలి. వాలి మరణించే సమయంలో శ్రీరాముని ప్రశ్నించడం తార్కికంగా, యుక్తియుక్తంగా ఉంటుంది. ఇంద్రజిత్తు మేఘాల నుండి శరపరంపర ప్రయోగించడం గ్రాఫిక్ సహాయం లేకుండా కెమెరా సహాయంతో చూపించడం ఒకటైతే, రామయణంలో మనకు బాగా తెలిసిన అనేక అంశాలను అప్పట్లోనే అద్భుతంగా చూపించగలిగారు. కుంభకర్ణుణ్ణి లేపడానికి చేసే ప్రయత్నాలు పామరులను బాగా అలరించాయి. ఒక్కసారి గాలి పీల్చి వదలినపుడు ఆ శ్వాస వేగానికి అక్కడి సైనికులు కదలడం, పడిపోవడంలాంటి అంశాలను చూస్తుంటే మనకు ఆశ్చర్యమేస్తుంది. లంకారాక్షసిని ఆంజనేయస్వామి అణచివేయడం, ఆవిడ తాను శాపవశంగా ఇలాగ ఉన్నానని చెప్పడం, నన్ను ఒక వానరుడు జయించడంతో అంతా శుభమే జరుగుతుందని చెప్పి వెళ్లిపోవడం లాంటి అనేక అంశాలు -ఎంఎస్ రామారావు సుందరకాండను పోలి ఉంటాయ. ఆయన గాత్రంలో సుందరకాండ వింటే, ఇక్కడ దృశ్యరూపంలో చూస్తున్నామా? అన్న ఆసక్తి కలుగుతుంది. వాల్మీకి రామయణం నుంచి తీసుకున్న కథాసారాన్ని దర్శకుడు బాపు అద్భుతంగా తెరకెక్కిస్తే, అత్యద్భుతమైన సంభాషణలను ఆయన స్నేహితుడు ముళ్లపూడి వెంకట రమణ అందించారు. రామాయణ కావ్యంగా వచ్చిన చిత్రానికి కెవి మహదేవన్ సంగీతం సమకూరిస్తే, నిర్మాత నిడమర్తి పద్మాక్షి తెరకెక్కించారు. పాత కాలపు ప్రేక్షకులను అన్నివిధాలుగా అలరించిన చిత్రం ‘సంపూర్ణ రామాయణం’.

మంచిని మరచీ వంచన నేర్చీ.. (నాకు నచ్చిన పాట )

$
0
0

మంచిని మరచీ/ వంచన నేర్చీ/ నరుడే ఈనాడు వానరుడైనాడూ- వానరుడైనాడు’
ఈ పాటను ఎస్‌పి కోదండపాణి సంగీత స్వరాల బాణీలతో దాశరథి సాహిత్యంతో ఘంటసాల అద్భుతంగా పాడారు. ముఖ్యంగా ఎన్‌టి రామారావు సైకిల్ మీద పయనిస్తూ బుట్టలో పసిపిల్లాడిని కూర్చోబెట్టి హుషారుగా విజయవాడ పట్టణంలో అద్భుతంగా అభినయించారు. ఈ పాటంటే చాలా ఇష్టం నాకు. ఇప్పటికీ రేడియోలో, టీవీలో వింటూ ఆనందిస్తున్నాం. చిన్నతనంలో దూరమైన రాము ఒక ముస్లిం పెంపకంలో రహీం పేరుతో ఎదుగుతాడు. అప్పటిదాకా తన తల్లిదండ్రులెవరో తెలియని (రాము) రహీం, ఒకానొక సందర్భంలో పెంపుడు తండ్రి ముస్లింనుంచి తన జన్మరహస్యాన్ని తెలుసుకుని, మార్తాండం దురాగతాలను అరికట్టి ప్రేమించిన క్రైస్తవ యువతిని వివాహమాడతాడు. తగిన బుద్ధితెచ్చుకుని మార్తాండం జైలుకు వెళ్ళడంతో కథ శుభంగా ముగుస్తుంది. అయితే ఈ పాటలో ‘చదువు తెలివీ పెంచాడూ/ చంద్రలోకము జయించాడూ/ నీతులు చెప్పి, గోతులు త్రవీ పాతాళానికి జారాడూ’ అన్న వాస్తవాన్ని అద్భుతంగా దాశరథి వ్రాశారు. ఈ చిత్రంలో ఇంకా కాంతారావు, రాజశ్రీ, లక్ష్మి, రుక్మిణి, నాగభూషణం, అల్లు రామలింగయ్య, ధూళిపాళ, నాగయ్య, నారాయణరావు, నిర్మల, అతిథి నటులు చాలాబాగా నటించి మెప్పించారు. అన్ని పాటలు హిట్ సాంగ్స్. వాటిలో ఈ పాట ఇంకా చెప్పనక్కర్లేదు. దర్శకులు ఏ బీమ్‌సింగ్ తన ప్రతిభను కనబరిచారు. కథాపరంగా నాగభూషణం రవి ఆర్ట్ థియేటర్స్ నిర్మాణ సారథ్యంలో విజయం సాధించారు, ఎన్నో కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది. సంగీతం, కెమెరా పనితనం చక్కగా కుదిరాయి. అందుకే ఈ చిత్రంలో పాటంటే మళ్ళీమళ్ళీ వినాలనిపిస్తోంది. చక్కటి కుటుంబ కథావస్తువు. ఇందులో నాగభూషణం, అల్లు రామలింగయ్యల కాంబినేషన్ భలేగా వుంది. అలాగే పదునైన సంభాషణలు గొప్పగా ఉంటాయ.

Viewing all 69482 articles
Browse latest View live