Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి

$
0
0

నిడుమనూరు, జూలై 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని ఒకటి, రెండు నెలల్లో పూర్తిగా అమలు చేయాలని మాజీ మంత్రి సీ ఎల్పి నేత కె.జానారెడ్డి అన్నారు. శుక్రవారం నిడుమనూరు మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశం అనంతరం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఇటీవల మంత్రి వర్గంలో తీర్మాణం చేసిన అన్ని అంశాలను ప్రభుత్వం హామీ మేరకు ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. హామీలు ఇవ్వడమే కాకుండా వాటి అమలు తీరును ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలించి ప్రజారంజకమైన పాలనను ప్రభుత్వం అందించాలని తాము కోరుకుంటున్నామన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తాము ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి న్యాయమైన సమస్యలపై పోరాడుతామన్నారు. ప్రభుత్వం రుణమాఫీపై రైతులకు ఇచ్చిన హామీ మేరకు అన్ని రుణాలను మాఫీ చేయడంతోపాటు ఖరీఫ్ సీజన్‌లో రైతులకు కొత్త రుణాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో అభిప్రాయ బేధాలేవి నాయకుల మధ్య లేవని ఆయన అన్నారు. గ్రామస్థాయి నుండి కూడా కార్యకర్తలు కలిసి పనిచేసి పార్టీ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసన సభ్యుడు నల్లబోతు భాస్కర్‌రావు, జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడు యెడవల్లి విజయేందర్‌రెడ్డి, నిడుమనూరు పి ఎసి ఎస్ అధ్యక్షుడు యెడవల్లి కనకయ్యరెడ్డి, జడ్పీవైస్ చైర్మన్ లింగారెడ్డి, నిడుమనూరు ఎంపిపి దాసరి నర్సింహ్మ, జడ్పీటీసీ అంకటి రుక్మిణిసత్యం, మాజీ ఎంపిపి చేపూరి హన్మంతరావు, మాజీ జడ్పీటీసీ కొండేటి మల్లయ్య, మేరెడ్డి సురేందరెడ్డి, జూలకంటి అప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని ఒకటి, రెండు నెలల్లో
english title: 
implement

బాధ్యతతో హామీలన్ని అమలు చేయాలి

$
0
0

* కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్
నల్లగొండ , జూలై 18: ఎన్నికల ముందు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్ని బాధ్యతగా గుర్తించి అన్ని హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి స్థానిక శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మన ఊరు మన ప్రణాళిక వార్డుల వారి సమీక్ష సమావేశం పట్టణంలోని 9వ వార్డులో జరిగింది. సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమం ద్వారా పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని ఇది మంచి కార్యక్రమమన్నారు. ప్రణాళిక బద్దంగా వార్డులను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేవలం రోడ్లు వేసుకోగానే సరిపోదని మురికి కాల్వలు, డ్రైనేజీలు, వీధిలైట్లు తదిత అనేక సమస్యలను పరిష్కరించుకున్నప్పుడే అభివృద్ధి కనబడుతుందన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు అందించాల్సిన అవసరం ఉందని గతంలో కాంగ్రెస్ పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసినందుకే ప్రజలు మూడుసార్లు అధికారం ఇచ్చారన్నారు. పట్టణంలో ఐటి పార్కు, మెడికల్ కళాశాల ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని పేదలకు ఇండ్ల స్థలాలకై భూమిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేసేందుకై ముఖ్యమంత్రిని కలిసి చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి మాట్లాడుతూ నవ తెలంగాణ నిర్మాణానికి చక్కని ప్రణాళికలు చేసి వార్డుల అభివృద్ధికి పాటుపడాలని, వార్డుల అవసరాలను గుర్తించి పరిష్కారం దిశగా వౌలిక సదుపాయాలు కల్పించుటకు కృషి చేయాలని కౌన్సిలర్లను కోరారు. అనంతరం వార్డు సమస్యలకు సంబంధించి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కాలనీల వాసులు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ వేణుగోపాల్‌రెడ్డి, కౌన్సిలర్ ఆలకుంట నాగరత్నంరాజు, వార్డు కాలనీల వాసులు తదితరులు పాల్గొన్నారు.

* కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్
english title: 
venkat reddy

విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి

$
0
0

* ఎమ్మెల్యే భాస్కర్‌రావు
మిర్యాలగూడ, జూలై 18: లోఓల్టేజి, ఓవర్‌లోడ్ సమస్యలను పరిష్కరించేందుకు నియోజకవర్గంలో మంజూరైన విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరిగతిన పూర్తిచేయాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అధికారులకు సూచించారు. శుక్రవారం విద్యుత్ డిఇ కార్యాలయంలో డిఇ, ఎడిఇ, ఎఇలు, విద్యుత్ కాంట్రాక్టర్లతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న విద్యుత్ పనులు పూర్తిచేయాలని ఆయన సూచించారు. నియోజకవర్గంలోని నీటిపారుదల శాఖ, ఇందిర జలప్రభ, వాటర్‌సప్లయ్ స్కీంలకు విద్యుత్ సరఫరా చేసే పనులు పెండింగ్‌లో ఉన్నాయని వాటికి త్వరగా విద్యుత్ సరఫరా అందించాలని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని రైతులు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల కోసం డిడిలు చెల్లించినప్పటికి ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటుచేయకపోవడంతో లోఓల్టేజి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, లోఓల్టేజి సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటుచేయాలని ఆయన అన్నారు. పట్టణంలోని చైతన్యనగర్, రాంచంద్రగూడెం, తాళ్లగడ్డ, విద్యానగర్, సుభాష్‌నగర్, భారత్‌నగర్, గొల్లగూడెం, సీతారాంపురం, సాగర్‌రోడ్డు, కుండలబజార్, ఇస్లాంపురం, ఈదలగూడెం క్రాస్‌రోడ్డు, రాజీవ్‌చౌక్, ప్రకాశ్‌నగర్, అశోక్‌నగర్, రెడ్డికాలని, ముత్తిరెడ్డికుంట, సాగర్‌రోడ్డులో లోఓల్టేజి సమస్య పరిష్కారం కోసం 100కెవి ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేయించడం జరిగిందని. అదేవిధంగా దామరచర్ల మండల కేంద్రంలో 5ఎంవిఎను 8ఎంవిఎగా, కొత్తనందికొండకు అదనంగా 3ఎంవిఎను మంజూరు చేయించడం జరిగిందని, వీటిని పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన అధికారులకు సూచించారు. వేములపల్లి మండలంలో లోఓల్టేజి సమస్యను పరిష్కరించేందుకు మొల్కపట్నం గ్రామం వద్ద 33కెవి సబ్‌స్టేషన్‌ను మంజూరైనట్లు ఆయన తెలిపారు. మిర్యాలగూడలోని వాటర్‌ట్యాంక్ తండా, దామరచర్ల మండలంలోని తాళ్లవీరప్పగూడెం గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటు కోసం అవసరమైన స్థల సేకరణ పూర్తిచేస్తే నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయిస్తానని ఆయన అన్నారు. దామరచర్ల మండలంలో దామరచర్ల మూసి, గాంధినగర్, శాంతినగర్ పరిదిలోని ఆయకట్టు రైతులకు నీరందించేందుకు ఎత్తిపోతల పథకం పనులు పూర్తికావచ్చాయని దీనికి అవసరమైన విద్యుత్ సరఫరాను అందిస్తే రైతులకు నీరందుతాయని ఆయన అన్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను సత్ఫరమే పరిష్కరించే విధంగా అధికారులు కృషిచేయాలని ఆయన పేర్కొన్నారు. కాగా డిఇ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ మంజూరైన పనులను పూర్తిచేసేందుకు అవసరమైన మెటిరియల్ అందకపోవడం వల్లనే పనులు పూర్తిచేయడంలో ఆలస్యవౌతుందని ఆయన అన్నారు. రెండు మాసాల్లో పెండింగ్‌లో ఉన్న పనులన్ని పూర్తిచేస్తామని తెలిపారు. సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు తిరునగరు భార్గవ, దామరచర్ల, వేములపల్లి, మిర్యాలగూడ మండలపార్టీ అధ్యక్షులు వీరకోటిరెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, నామిరెడ్డి కర్నాకర్‌రెడ్డి, భిక్షంగౌడ్, నాయకులు చిట్టిబాబునాయక్, గుడిపాటి సైదులుబాబు తదితరులు పాల్గొన్నారు.

* ఎమ్మెల్యే భాస్కర్‌రావు
english title: 
bhaskar rao

నల్లగొండకు ఉద్యానవన యూనివర్సిటీ దక్కేనా..!

$
0
0

గులాబీ నేతలపై గురుతర బాధ్యత..ఒత్తిడి పెంచుతున్న విపక్షాలు !!
నల్లగొండ, జూలై 18: ఉద్యానవన పంటల సాగులో తెలంగాణ జిల్లాల్లో అగ్రగామిగా ఉన్న నల్లగొండ జిల్లా రైతాంగానికి ప్రయోజనకరంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం 2014-15బడ్జెట్‌లో ప్రకటించిన ఉద్యానవన యూనివర్సిటీని నల్లగొండ జిల్లాలోనే నిర్మించాలన్న డిమాండ్ జిల్లా రైతు సంఘాలు..రాజకీయ పక్షాల నుండి రోజురోజుకు ఊపందుకుంటుంది. జిల్లాలోని 4.90లక్షల హెక్టార్ల సేద్యపు భూమిలో 1.20లక్షల హెక్టార్లు ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఇందులో 70శాతం బత్తాయి పండ్ల తోటల సాగుతో జిల్లా భారత దేశంలోనే ప్రథమ స్థానంలో కొనసాగుతుంది. 75,739హెక్టార్లలో బత్తాయి తోటలు, 10,335హెక్టార్లలో మామిడి, 14,649హెక్టార్లలో నిమ్మ, 205హెక్టార్లలో సపోట, 6,601హెక్టార్లలో కూరగాయల తోటలు సాగవుతున్నాయి. ఏటా 16.00లక్షల మెట్రిక్ టన్నుల బత్తాయి దిగుబడులతో ఏకంగా 1600కోట్ల రూపాయల మేరకు జిల్లా నుండి పండ్ల వ్యాపారం జరుగుతుండటం విశేషం. అటు జిల్లాలో దిగుబడి జరుగుతున్న కూరగాయలు జంటనగర వాసుల అవసరాలను తీర్చడంలో కీలకంగా మారాయి. ఇంత పెద్ద మొత్తంలో పండ్లు, కూరగాయల వ్యాపారం జిల్లా ఉద్యాన వన పంటల ద్వారా జరుగుతున్నందునా ఈ జిల్లాలో ఉద్యానవన యూనివర్సిటీ మంజూరు జరిగితే జిల్లా రైతాంగానికి మేలు జరుగుతుందన్న వాదన క్రమేణా అన్ని వర్గాల నుండి ఊపందుకుంటుంది. ఇప్పటికే జిల్లాలో బత్తాయి మార్కెట్ లేక..జ్యూస్ ఫ్యాక్టరీ-కోల్డ్ స్టోరేజీ ఫ్లాంట్లు లేక ఏటా వందల కోట్ల నష్టాలు చవి చూస్తూ..తగిన మద్ధతు ధర పొందలేక పోతుండటం జిల్లా పండ్ల తోటల రైతులకు ప్రతికూలంగా మారింది. ఈ పరిస్థితుల్లో కనీసం ఉద్యానవన యూనివర్సీటీయైనా జిల్లాలో ఏర్పాటు జరిగిన పక్షంలో జిల్లా రైతులకు ప్రోత్సహకరంగా ఉంటుందని మరిన్ని పరిశోధనలు..కొత్త ఆవిష్కరణలతో రైతాంగ ప్రగతికి దోహదం చేస్తుందని రైతు సంఘాలు భావిస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో 32శాతం, ఖమ్మంలో 23, మహాబూబ్‌నగర్, కరీంనగర్‌లలో 12శాతం పండ్ల తోటలు సాగవుతున్నాయని అధికంగా ఉద్యానవన పంటలు సాగు జరిగే నల్లగొండలోనే ఉద్యానవన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రైతుసంఘాలు వాదిస్తున్నాయి.
జంట నగరాల అవసరాలకు నల్లగొండ కీలకం !
వరి..పత్తి పంటల సాగుతో లక్షల రూపాయలు ఖర్చు చేస్తు బోర్లు, మోటార్లు ఏర్పాటు చేసుకుంటు..విద్యుత్ కోతలు..సాగునీటి కొరత సమస్యలతో పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు భారీ నష్టాలు చవి చూస్తున్న జిల్లా రైతాంగాన్ని ఉద్యాన వన పంటల దిశగా మళ్లీంచాలంటు గతంలోనే వ్యవసాయ నిపుణులు ప్రభుత్వాలకు సూచనలందించారు. ముఖ్యంగా జంట నగరాలకు సరిహద్ధు జిల్లాగా ఉన్న నల్లగొండ జిల్లాలో అధికంగా కూరగాయలు, పండ్ల తోటల సాగును, పాడి పోషణను అభివృద్ధి చేయడం ద్వారా జంట నగరాల ప్రజల అవసరాలను తీర్చడంతో పాటు కొరతను అధిగమించి ధరల నియంత్రణ సైతం సాధించవచ్చని నిపుణులు భావించారు. ఈ నేపధ్యంలో ఉద్యాన వన యూనివర్సిటీని నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేసినట్లయితే ఇటు జిల్లా రైతుల ప్రగతితో పాటు అటు రాజధాని హైద్రాబాద్ వాసుల అవసరాలు తీర్చడంలో పురోగతి సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు..రైతు సంఘాలు వాదిస్తున్నాయి. పండ్ల తోటల మార్కెట్ కోసం గత కలెక్టర్ల హాయంలో నల్లగొండ పట్టణ సమీపంలో భూసేకరణ ప్రయత్నాలు జరిగినా ముందడుగు పడలేదు. అయితే జిల్లాలో ఉద్యానవన యూనివర్సిటీకి అవసరమైన భూములకు మాత్రం కొరతలేదు. పైగా ఆక్రమణకు గురైన జిల్లాలోని వేలాది ఎకరాల వక్ఫ్, భూదాన్ భూములు స్వాధీనం కోసం ప్రభుత్వం చర్యలు ఆరంభించింది. అయితే జిల్లాకు ఉద్యానవన యూనివర్సిటీ సాధన దిశగా జిల్లా టిఆర్‌ఎస్ మంత్రి జి.జగదీష్‌రెడ్డి, ఆ పార్టీ ఇతర ఎమ్మెల్యేలు, ఎంపి ఎంత మేరకు తమ ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ఒత్తిడి తేవడంలో విజయం సాధిస్తారన్నదీ ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రాజధాని అవసరాల కోసం డంపింగ్ యార్డును, వెహికల్ ఫిట్‌నెస్ సెంటర్‌ను, మూసీ జల కాలుష్యాన్ని భరించడంతో పాటు ఫ్లోరోసిస్, యూరేనియం, శిశువిక్రయాలు, భ్రూణ హత్యలు, మాతా శిశు మరణాలు వంటి సమస్యలతో అక్షరాస్యతలో..అభివృద్ధిలో వెనుకబడిన జిల్లాకు ఉద్యాన వన యూనివర్సిటీ కేటాయించడం ద్వారా జిల్లా అభివృద్ధికి బాటలు వేయాలన్న డిమాండ్‌ను విపక్షాలు రేకెత్తిస్తున్నాయి. నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులకు భూములను సైతం ఇచ్చిన జిల్లా రైతాంగానికి ఉద్యాన వన యూనివర్సిటీ ఇచ్చి న్యాయం చేయాలని కోరుతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే సిపిఎం పార్టీ రౌండ్‌టేబుల్ సమావేశాలతో రైతాంగాన్ని ఉద్యమ దిశగా సమీకరిస్తుంది. ఇతర విపక్షాలు సైతం క్రమంగా అధికార పక్షంపై ఒత్తిడి పెంచుతు ఉద్యాన వన యూనివర్సిటీని జిల్లాలోనే ఏర్పాటు చేయాలంటు డిమాండ్ చేస్తుండటంతో ఈ వ్యవహరం అటు రాజకీయ ప్రాధాన్యతను సైతం సంతరించుకోవడం విశేషం.

గులాబీ నేతలపై గురుతర బాధ్యత..ఒత్తిడి పెంచుతున్న విపక్షాలు !!
english title: 
horticultural university

ఎన్నికల మేనిఫెస్టోను అమలుచేస్తాం

$
0
0

* వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బోధన్, జూలై 18: ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేసే విషయంలో రాజీ పడేది లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం బోధన్ మండలం ఘన్‌పూర్ గ్రామం నుంచి చందూర్ వరకు 6 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రోడ్డుపనుల నిర్మాణానికి శంకుస్తాపన చేశారు. అనంతరం సంగెం గ్రామంలో జరగిన సభలో మంత్రి మాట్లాడుతూ, ఎన్నికల మెనిఫెస్టోను పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. బీదలకు, పేదవర్గాలకు, మైనార్టీలకు న్యాయం చేయడం తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఎన్నికల మేనిఫెస్టోకు తీర్మానం చేసిందన్నారు. ఎవరెన్ని రకాల విమర్శలు చేసిన అభివృద్ది విషయంలో రాజీ పడేది లేదన్నారు. గ్రామీణ ప్రాంతాలను అన్నిరకాల అభివృద్ది చేసేందుకు మనఊరు-మనప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలు అభివృద్ది విషయంలో గ్రామాలకు వచ్చే అధికారులకు తగిన సలహాలు ఇవ్వాలని మంత్రి సూచించారు. ఈసమావేశంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, మాజీ ఎంపిపి గంగారెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు రజాక్, శరత్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

* వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
english title: 
pocharam

తెలంగాణ పునర్నిర్మాణంతోనే అభివృద్ధి సాధ్యం: మంత్రి పోచారం

$
0
0

మాక్లూర్, జూలై 18: తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి సాధించుకునేందుకు ఈప్రాంత పునర్ నిర్మాణానికి అందరు సహకరించాలని వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మాక్లూర్ మండలంలోని ఎంపిపి చాంబర్‌లో జరిగిన సన్మాన కార్యక్రమం అనంతరం మంత్రి పోచారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో జరిగిన ఎన్నికల్లో మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను అమలు చేయడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని మంత్రి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కెసిఆర్, సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలు కోరుకున్న పాలనను అందిస్తుందన్నారని అన్నారు. ప్రజలకు ఉపయోగకరమైన హామీల విషయంలో రాజీ లేకుండా ప్రభుత్వం ఏర్పడిన 45రోజుల్లోనే అసెంబ్లీలో ఆమోదింపచేసుకుని దేశ చరిత్రలో నిలిచిందన్నారు. తెరాస పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజలు కెసిఆర్ పాలనపై సందేహాపడాల్సిన అవసరం లేదని, రైతులకు రుణమాఫీ పథకం తప్పకుండా అమలు అవుతుందన్నారు. నిరుపేదలందరికీ ఇళ్ల నిర్మించి ఇచ్చి తీరుతామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలు అర్హులకు అందే విధంగా జిల్లా యంత్రాంగం కృషి చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎంపిపి గజ్జెల శిరీష, జడ్పీటిసి లత పాల్గొన్నారు.

తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి సాధించుకునేందుకు ఈప్రాంత పునర్
english title: 
pocharam

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పనే కెసిఆర్ లక్ష్యం

$
0
0

ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
ఆర్మూర్, జూలై 18: ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కసరత్తు చేస్తున్నారని, రిజర్వేషన్లు కల్పించడమే కెసిఆర్ లక్ష్యమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపాలిటీ ఆవరణలో శుక్రవారం సాయంత్రం టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం 43 అంశాలపై సమగ్రంగా చర్చించి తీర్మానాలు చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, తెలంగాణ అమరవీరులకు 10 లక్షల ఆర్థిక సహాయం, వృద్ధులు, వితంతువులకు వెయ్యి, వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్, దళితులు, గిరిజన బిడ్డల వివాహాల కోసం కళ్యాణ లక్ష్మీ పథకం అమలు చేస్తామని స్వయంగా కెసిఆర్ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటపై వెనక్కి తగ్గేది లేదని, అభివృద్ధి చేసి చూపిండమే లక్ష్యంగా కెసిఆర్ ముందుకు సాగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా అధికారులతో అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలపై సమగ్రంగా అవగాహన ఉన్న కెసిఆర్ అందుకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పోతు నర్సయ్య, టిఆర్‌ఎస్ నాయకులు ఎల్‌ఎంబి రాజేశ్వర్, విఠల్, సంజయ్‌సింగ్ బబ్లూ, కొక్కుల రమాకాంత్, యామాద్రి భాస్కర్, పోల మధుకర్, విద్యాసాగర్, జోశ్రీను, భీమాగౌడ్, అజీమ్, సాజిద్, మోయిజ్, సుంకరి రంగన్న, నూకల విజయ్‌కుమార్, నూకల ప్రభాకర్, కలిగోట గంగాధర్, సంతోష్ పాల్గొన్నారు.

సమస్యలను పరిష్కరించుకుందాం
*ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి
గాంధారి, జూలై 18: దాదాపు 60 ఏళ్ల పోరాటం, 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో సాధికున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని మనమందరం కలసికట్టుగా ఉండి సమస్యలను పరిష్కరించుకుందామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ప్రజలకు సూచించారు. శుక్రవారం గాంధారి పంచాయతి కార్యాలయ ఆవరణలో జరిగిన మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన ఆయా ప్రభుత్వ శాఖల పనితీరును నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు ముఖ్యమంత్రి మంచి కార్యక్రమాలను చేపడుతున్నారని అన్నారు. ఎన్నికల మేనిపెఫ్టోలో తాము ఇచ్చిన అన్ని రకాల హామీలను తప్పక నెరవేర్చడం జరుగుతుందన్నారు. రైతుల రుణాలు మఫీ, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్‌లు పెంచడం జరుగుతుందన్నారు. అలాగే దళితులకు మూడెకరాల భూమి, బంగారంపై రైతులు తీసుకున్న రుణాలు మాఫీ తదితర వాటన్నీ తప్పక నెరవేరుస్తామని ఆయన మరోమారు గుర్తుచేశారు. వీటన్నింటిపై ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు రోజుల క్రితం స్పష్టమైన ప్రకటన కూడా చేశారని, ఇది తెలంగాణ ప్రజలు హర్షించదగ్గ విషయమన్నారు. కాగా ఇక నుండి అయినా ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వీడాలని వారికి సూచించారు. గాంధారిలోని దుర్గానగర్ కాలనీ నుండి ఉన్నత పాఠశాల వరకు 25 కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ నిర్మాణం, 16 కోట్లతో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన ప్రజలకు వివరించారు.
సమావేశంలో గందరగోళం
గాంధారిలో శుక్రవారం జరిగిన మన ఊరు-మన ప్రణాళికలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ముందుగా ఆయా శాఖల అధికారులు మాట్లాడారు. అనంతరం ఉపాధిహామి ఎపిఓ మంగూత్‌నాయక్ మాట్లాడుతుండగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా తాము ఉపాధి డబ్బుల కోసం పోస్ట్ఫాస్ వెళితే డబ్బులు రాలేవని వారు తిరిగి పంపిస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నాలుగైదు ఏళ్లుగా తాము పని చేసినా తమకు ఇప్పటి వరకూ డబ్బులు రాలేదని మరికొందరు అధికారుల తీరుపై మండిపడ్డారు. ఎవరు ఎవరిని నిందిస్తున్నారో తెలియని గందరగోళంపరిస్థితి నెలకొంది. దీంతో కల్పించుకున్న ఎమ్మెల్యే ఎపిఓతో మాట్లాడారు. ఉపాధి హామి పనులపై కూలీలు అసంతృప్తి చెందవద్దని, త్వరలో గాంధారిలో కూలీల సమస్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన కూలీలకు హామి ఇచ్చారు. గాంధారి బస్టాండ్ ఆవరణ సరిగ్గా లేకపోవడంతో ప్రయాణీకులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు ఆయనకు వివరించారు. ఈ సమావేశంలో కామారెడ్డి ఆర్డీవో వెంకటేశ్వర్లు, గాంధారి ఎంపిపి యశోదా బాయి, జడ్పీటీసి తానాజీరావు, సదాశివనగర్ జడ్పీటీసి రాజేశ్వర్‌రావు, గాంధారి సర్పంచ్ సత్యం, మండల ప్రత్యేకాధికారిణి వసంత, ఎంపిడివో సాయాగౌడ్, తహసీల్దార్ విజయ్ భాస్కర్, గాంధారి, ముదెల్లి సొసైటీ చైర్మన్‌లు ముకుంద్‌రావు, శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీ్ధర్‌తో పాటు అన్ని శాఖల అధికారులు ప్రజలు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
english title: 
mla

‘మన ఊరు - మన ప్రణాళిక’ను బహిష్కరించిన ఎమ్మెల్యే

$
0
0

కమ్మర్‌పల్లి, జూలై 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మన ఊరు - మన ప్రణాళిక కు సంబంధించిన గ్రామసభలో ఫ్లెక్సీ కట్టకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం కమ్మర్‌పల్లి మండలం కోనసముందర్ గ్రామంలో మన ఊరు - మన ప్రణాళిక కార్యక్రమాన్ని కొనసాగించడానికి అధికారులు సన్నద్ధం కాగా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డికి అక్కడికి చేరుకున్నారు. వేదికపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఫొటోతో కూడిన ఫ్లెక్సీ లేకపోవడంతో ఎపిఓ సురేష్‌కుమార్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గ్రామాల సమస్యలను పరిష్కరించి అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని అధికారులు నిర్లక్ష్యం చేయడం సరికాదని ఆయన అన్నారు. ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలని సర్పంచ్‌కు సూచించామని ఎపిఓ ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో అక్కడే ఉన్న సర్పంచ్ గుడిసె అంజమ్మ ఆగ్రహంతో తాను ఫ్లెక్సీని ఏర్పాటు చేయనని, అధికారులే ఫ్లెక్సీ తీసుకురావాలని ముందే చెప్పానంటూ వివరణ ఇచ్చుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే అక్కడే ఉన్న ఎంపిడివో రాజేశ్వర్‌ను ఫ్లెక్సీ విషయం ఎవరు చూసుకోవాలి, దీనికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఆయా గ్రామాల కార్యదర్శులు ఫ్లెక్సీని తయారు చేయాల్సి ఉంటుందని ఎంపిడివో వివరణ ఇచ్చారు. ఇలాంటి పొరపాట్లు మరోమారు జరిగితే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత నర్సాపూర్, అమీర్‌నగర్, కోనాపూర్ గ్రామాల్లో జరిగిన మన ఊరు - మన ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా చేపట్టిన కార్యక్రమాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి బహిష్కరించడం చర్చనీయాంశంగా మారింది.

ఉద్యమ ఫలితంగానే పెన్షన్ల పెంపు
కంఠేశ్వర్, జూలై 18: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వికలాంగుల హక్కుల పరిరక్షణ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే వికలాంగులకు 1500రూపాయల పెన్షన్ మంజూరైందని విహెచ్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వృద్ధులు, వితంతులకు పెన్షన్ పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అవిశ్రాంత పోరాటం చేశారన్నారు. ఇందుకు 2014ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పెన్షన్ల పెంపుదలను తమ మేనిఫెస్టోలో పొందుపర్చడం జరిగిందన్నారు. రెండు రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. పెంచిన పెన్షన్ వెంటనే అమలు చేయడంతో పాటు వికలాంగులకు ఇండ్ల స్థలాలు కేటాయించి పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సంబరాల్లో ఎమ్మార్పీఎస్, విహెచ్‌పిఎస్ నాయకులు నాగభూషణం, బాలు మాదిగ, గంగాధర్, రాములు, కిష్టయ్య, నారాయణ, సాయిలు, శివమాల పాల్గొన్నారు.

సూక్ష్మ బిందుసేద్యానికి రూ:45కోట్ల నిధులు
* వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
నందిపేట, జూలై 18: తీవ్ర వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని సూక్ష్మనీటి బిందుపథకానికి 45కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో నిర్వహించిన మన ఊరు - మన ప్రణాళిక గ్రామసభకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రైతులు తమతమ పంట పొలాల్లో బిందుసేద్యం సాగు కోసం అవసరమైన పైపులు, మెటీరియల్స్ ఏ కంపెనీవైనా ఎక్కడైనా కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. జిల్లాలోని ఊరచెరువుల శిఖం భూములు కబ్జాలకు గురవుతున్నట్లు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా కబ్జాలకు పాల్పడేవారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. శిఖం కబ్జాదారులపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. చెరువుల పూడిక మట్టిని ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా అందించాలని, పారిశుద్ధ్యం పథకం కింద గ్రామంలోని చెత్తాచెదారాన్ని తరలించేందుకు గ్రామ శివార్లలో డంపింగ్ యార్డు ఏర్పాటు కోసం రెండు ఎకరాల స్థలాన్ని సేకరించాలన్నారు. సభలో గ్రామస్థులు వివరించిన పలు సమస్యలను శ్రద్ధగా విన్న మంత్రి, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని, లైన్‌మెన్‌లు, ఎఇలు స్థానికంగా ఉండటం లేదని రైతులు మంత్రికి ఫిర్యాదు చేయడంతో మంత్రి సంబంధిత శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలోని 593గ్రామాల్లో గృహ రుణాల కుంభకోణం జరిగిందని, బాధ్యులపై త్వరలో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వ్యవసాయం కోసం తీసుకున్న నగదుతో పాటు బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి భారమైనా, మాపీకి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. నిరుపేదలకు గృహ నిర్మాణాల కోసం మూడు లక్షల రూపాయలు చొప్పున అందించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న ఐదేళ్లలో బంగారు తెలంగాణగా తీర్చి దిద్దేందుకే మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందన్నారు. అందువల్ల గ్రామంలో సామాజిక పరమైన ప్రజోపకరమైన సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకవచ్చి ప్రణాళికలో పొందుపర్చాలని మంత్రి గ్రామస్థులకు, అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ జీవన్‌రెడ్డి, ఇంచార్జ్ కలెక్టర్ వెంకటేశ్వర్‌రావు, ఎంపిపి అంకంపల్లి యమున, ఎంపిడిఒ నాగవర్ధన్, తహశీల్దార్ బావయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు, టిఆర్‌ఎస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మన ఊరు
english title: 
our village - our plan

సహకార సంఘాల బలోపేతానికి సంపూర్ణ సహకారం

$
0
0

నిజామాబాద్ , జూలై 18: తెలంగాణ రాష్ట్రంలోని సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు తనవంతు సహకారం అందిస్తానని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పాలక మండలి ఆధ్వర్యంలో మంత్రి, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, నగర మేయర్‌లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు గంగాధర్‌పట్వారీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలోనే నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంక్ మెరుగైన సేవలను అందించి ముందంజలో ఉందని మంత్రి కితాబు ఇచ్చారు. రైతులకు అండగా నిలువడంతో పాటు సొసైటీల ద్వారా జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడంలో జిల్లా కేంద్ర బ్యాంకు చూపిన చొరవ అభినందనీయమన్నారు. గత 2007వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేపడితే తెలంగాణ రైతులకు కేవలం 3,300కోట్ల రూపాయల మాత్రమే ఉందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రుణమాఫీపై తీసుకున్న కెసిఆర్ నిర్ణయం సాహసోపేతమైందన్నారు. ఇందుకు గాను ఎలాంటి షరతులు లేకుండా రైతులకు సంబంధించిన అన్ని పంట రుణాలను మాఫీ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. దీంతో తెలంగాణలోని రైతాంగానికి 19వేల కోట్ల రూపాయల అన్ని రకాల పంట రుణాలు మాఫీ కానున్నాయన్నారు. రైతుల రుణమాఫీ పథకంపై వచ్చిన అపోహలను తొలగిస్తు ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ధన్యవాదాలు తెలుపుతూ, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ తీర్మానం చేయాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా బ్యాంక్ పాలక మండలి పలు డిమాండ్‌లను మంత్రి దృష్టికి తీసుకరాగా, అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా సొసైటీల చైర్మన్‌లను ప్రోటోకాల్‌లోకి తీసుకురావాలని సూచించగా దీనిపై క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, మీ డిమాండ్‌ను సిఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి విండో చైర్మన్లకు హామీ ఇచ్చారు. అదే విధంగా సొసైటీల పరిధిలోని అన్ని గ్రామాలలో గోదాంలను నిర్మించేందుకు మంత్రిగా కృషి చేయాలని పాలక మండలి సభ్యులు కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ గోదాం నిర్మాణం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని, కేంద్ర మంత్రితో మాట్లాడి రైతు కృషి యోజన పథకం ద్వారా గోదాంల నిర్మాణానికి నిధులను మంజూరు చేయిస్తానన్నారు. ఇటీవల జిల్లాలోని సొసైటీల ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్న పంటకు సంబంధించిన కమిషన్ సొసైటీలకు రావాల్సి ఉందని, వాటిని విడుదల చేయించాలని కోరగా అందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులతో చర్చించి సాధ్యమైనంత తొందరలో సొసైటీలకు రావాల్సిన ధాన్యం కొనుగోలు కమిషన్‌లను ఇప్పిస్తానని మంత్రి స్పష్టం చేశారు. కమిషన్ నిధులు విడుదల అయితే జిల్లాలోని అన్ని సొసైటీలు ఆర్థిక పరిపుష్టి సాధించి అభివృద్ధి బాటలో నడుస్తున్నాయని పలువురు సొసైటీ చైర్మన్‌లు మంత్రికి విన్నవించారు. డిసిసిబి చైర్మన్ గంగాధర్‌పట్వారీ అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో శాసనసభ్యులు ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్ధన్, జీవన్‌రెడ్డి, షకీల్ అహ్మద్, బాజిరెడ్డిగోవర్ధన్, హన్మంత్‌సింధే, బిగాల గణేశ్‌గుప్తా, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, నగర మేయర్ ఆకుల సుజాత తదితరులు పాల్గొన్నారు.

‘కో-ఆప్షన్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది’
కామారెడ్డి , జూలై 18: కామారెడ్డి బల్దియాలో జరిగే కో-ఆప్షన్లను కాంగ్రెస్ పార్టీ సభ్యులే కైవసం చేసుకుంటారని పార్టీ పట్టణ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, సిడిసి చైర్మన్ కారంగుల అశోక్‌రెడ్డి, జడ్పిటిసి సభ్యులు నిమ్మ మోహన్‌రెడ్డిలు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ కౌన్సిలర్ యం.డి ఇషాక్ షేర్ కో-ఆప్షన్ సభ్యుని ఎన్నికకు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నందున తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సుష్మ, వైస్ చైర్మన్ మసూద్, కౌన్సిలర్లు కైలాస్ లక్ష్మణ్, కాళ్ల గణేశ్, బట్టు మోహన్, నిమ్మ దామోదర్‌రెడ్డి, రాంమోహన్, మాజీ కౌన్సిలర్లు ముదాం ఎల్లయ్య, చాట్ల రాజేశ్వర్, రాజేందర్, రవిందర్‌గౌడ్, అన్వర్ హైమాద్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాంకుమార్‌గౌడ్, నాయకులు లక్కపతిని గంగాధర్, పిప్పిరి వెంకటి, దయానంద్, ప్రసాద్ తదితరులున్నారు.

మైనార్టీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
మోర్తాడ్, జూలై 18: తెరాస ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మైనార్టీ రిజర్వేషన్ల విషయంలో కట్టుబడి ఉన్నామని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం మోర్తాడ్ జామా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మైనార్టీ సోదరులతో కలిసి విందులో పాల్గొన్న ఆయన, తెరాస ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని అన్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలోని చాల హామీలను అమలు చేసేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఈయన వెంట జడ్పీటిసి ఎనుగందుల అమిత, పార్టీ అధ్యక్షుడు రాజాపూర్ణనందం, మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందులో పాల్గొన్న డిసిసి అధ్యక్షుడు తాహెర్
ఇందూర్, జూలై 18: ఎడపల్లి మండల కేంద్రంలోని మజీద్‌లో శుక్రవారం సాయంత్రం మండల జడ్పీటిసి బిల్లా సరోజిని ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ ముఖ్య అతిథిగా హాజరై, ప్రత్యేక ప్రార్థనల అనంతరం మండల కాంగ్రెస్ నాయకులు, మైనార్టీ సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో బోధన్ ఎఎంసి చైర్మన్ పోల మల్కారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లయ్యయాదవ్, బిల్లా రాంమోహర్, కొండెంగల శ్రీనివాస్, మైనార్టీ నాయకులు అబ్దుల్ వాహెబ్‌బారీ, జహీర్, పాషా, ఇస్మాయిల్‌పటేల్ పాల్గొన్నారు.

బోధన్ అభివృద్ధికి అందరు సహకరించాలి
* ఎమ్మెల్యే షకీల్ అహ్మద్
బోధన్, జూలై 18: బోధన్ పట్టణ అభివృద్ధికి అన్ని పార్టీల వారు సహకరించాలని నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కోరారు. శుక్రవారం బల్దియా నూతన పాలకవర్గం మొదటి సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. మున్సిపల్ పరిధిలోని అనేక వార్డుల్లో సమస్యలు అలుముకున్నాయని ఆయన పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరిస్తూ, అభివృద్ధికై నిధులు తీసుకొచ్చేందుకై తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. పట్టణాభివృద్ధి విషయంలో రాజకీయాలను పక్కనబెట్టాలని ఆయన కోరారు. మున్సిపల్ అధికారులు ప్రధానంగా సానిటేషన్, తాగునీరు, రోడ్లు, వీధి దీపాలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతిరోజు అధికారులు వార్డుల వారిగా పర్యటించి, పరిస్థితి చక్కదిద్దాలని అన్నారు. కౌల్సిలర్లు సమస్యలను తన దృష్టికి తీసుకవస్తే, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో చైర్మన్ ఎల్లయ్య, వైస్ చైర్మన్ ఖదీర్, కమిషనర్ ప్రసాద్‌రావు, మేనేజర్ దేవేందర్‌తో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
బల్దియా తొలి సమావేశం రసాభాస

నిధుల కేటాయింపుపై కౌన్సిలర్ల వాగ్వివాదం * పరస్పర దూషణలు
బోధన్, జూలై 18: బోధన్ బల్దియా కార్యాలయంలో శుక్రవారం జరిగిన నూతన పాలకవర్గం మొదటి సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిలర్లు పరస్పరం వాగ్విదానికి దిగి దూషించుకోవడం తోటి మహిళా కౌన్సిలర్లను ఆందోళనకు గురి చేసింది. ఉదయం 11గం.కు చైర్మన్ ఎల్లయ్య అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. అజెండాలోని అంశాలపై చర్చ జరుగుతుండగా, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఆబీద్‌అలీ అభ్యంతరం వ్యక్తం చేశారు. వార్డుల వారీగా నిధుల కేటాయింపు సక్రమంగా జరుగలేదని ఆరోపించారు. మొదటిసారి నిధులలో టిఆర్‌ఎస్ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులకే కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అభివృద్ధి విషయంలో అన్ని వార్డులను సమానంగా చూడాలని ఆయన కోరారు. దీనిపై టిఆర్‌ఎస్ కౌన్సిలర్లు షరీపోద్దీన్, అక్తర్‌లు మాట్లాడుతూ, అన్ని వార్డుల అభివృద్ధి చేయడమే తమ పార్టీ లక్ష్యమని, కాంగ్రెస్ కౌన్సిలర్లు మున్సిపల్ సమావేశంలో పార్టీల పరంగా ఆరోపణలు చేయడం మంచిపద్ధతి కాదన్నారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నందున నిధులు కేటాయించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్ రఫీ జోక్యం చేసుకుని టిఆర్‌ఎస్, ఎంఐఎం కౌన్సిలర్లను తప్పుబట్టారు. రెండు పార్టీలకు చెందిన కౌన్సిలర్ల మధ్య మాటమాటా పెరిగి తీవ్ర వాగ్వివాదం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన చైర్మన్ ఎల్లయ్య రెండు పార్టీల వారిని సముదాయిస్తూ తమ హయంలో అన్ని వార్డులకు సమన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. మునుముందు అన్ని వార్డులకు సమానమైన నిధులు కేటాయిస్తామని వివరించారు. ఎంఐఎం కౌన్సిలర్ అక్తర్ చైర్మన్‌తో మాట్లాడుతుండగా, కాంగ్రెస్ కౌన్సిలర్ రఫీ జోక్యం చేసుకుని, ఆయనతో వాగ్విదానికి దిగారు. కాంగ్రెస్ పుణ్యమా అని బోధన్ మున్సిపల్ వార్డులు అభివృద్ధికి నోచుకోలేదని తెరాస కౌన్సిలర్లు ఆరోపించడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీలను పైకి ఎత్తారు. బోధన్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే సహించేది లేదని తెరాస కౌన్సిలర్లను హెచ్చరించారు. చైర్మన్ జోక్యంతో గొడవ సద్దుమణగగా, అజెండా అంశాలపై తీర్మానించి ఆమోదించారు.

తెలంగాణ రాష్ట్రంలోని సహకార సంఘాలను మరింత బలోపేతం
english title: 
cooperative societies

సర్కార్ కొలువుల్లో సోలార్ విప్లవం

$
0
0

విశాఖపట్నం, జూలై 19: ప్రభుత్వ సంస్థల్లో సోలార్ విప్లవం ప్రారంభమైంది. చాలాకాలం తరువాత మళ్ళీ అధికారులు దీనిపై దృష్టిపెడుతున్నారు. కాలుష్య రహిత విద్యుత్ వెలుగులు, నిరంతరాయ విద్యుత్‌ను పొందాలంటే సులభమైన మార్గం ఇదొక్కటేనని భావిస్తోన్న ప్రభుత్వ సంస్థ విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించాయి. దీనిలోభాగంగా ఇప్పటికే పలు ప్రభుత్వరంగ సంస్థలు సోలార్ ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. కేంద్రం సహాయంతో నెడ్‌క్యాప్ సాంకేతికపరమైన చేయూతతో సోలార్ వెలుగులు పొందుతున్నారు. ఈ విధంగా ఈపిడిసిఎల్ తొలి ప్రయోగంలో విజయం సాధించింది. కేంద్రం అందించిన రూ.16 కోట్లతో విశాఖ ఏజెన్సీ పాడేరులో 36 గిరిజన మారుమూల ప్రాంతాలకు సోలార్ వెలుగులు అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే నర్సీపట్నం పరిధిలో మరో 21 మారుమూల ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ద్వారా వెలుగులివ్వగలుగుతోంది. ఇది విజయవంతం కావడంతో ఇపుడు మరో మూడు సోలార్ ప్రాజెక్టులకు సంస్థ యాజమాన్యం శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో 263 మారుమూల గ్రామాలకు ఆర్‌ఇసి నిధులు రూ.47.96 కోట్లతో సోలార్ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ నిర్ణయించింది. దీనిలోభాగంగా దీనికి తగిన ప్రతిపాదనలు పంపడం, కేంద్రం ఆమోదించడం అన్నీ జరిగిపోయాయి. ఇపుడు టెండర్ల ప్రక్రియలో ఈ ప్రాజెక్టు ఉంది. ఇది జరిగితే త్వరలో పనులు ప్రారంభమవుతాయి. ఈ విధంగా పాడేరు, అరకు, ముంచింగ్‌పుట్, చింతపల్లి, గూడెం కొత్తవీధి తదితర ఏజేన్సీ మారుమూల గ్రామాలన్నింటికీ సోలార్ వెలుగులు విరజిమ్మతాయి.
కెజిహెచ్‌లో సోలార్ ప్రాజెక్టు
కెజిహెచ్‌లో సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆసుపత్రికి ఒకటి నుంచి రెండు మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని గుర్తించి ఆసుపత్రి వైద్యాధికారులు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపారు. కోటి రూపాయల పైగానే ఖర్చు అవుతుందని అంచనా వేసిన అధికారులు ఆసుపత్రిలో ముఖ్యమైన విభాగాలకు సోలార్ వెలుగులు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. దీనివల్ల అత్యవసర వైద్య సేవలందించినపుడు విద్యుత్ సరఫరాలో అంతరాయాలున్న సందర్భాల్లో సోలార్ విద్యుత్‌కు ప్రాధాన్యత పెరుగుతుంది. అందువలనే గత ఆరు మాసాలుగా నిర్వహిస్తున్న కసరత్తు త్వరలో కొలిక్కి రానుంది.
ఆర్టీసీకి వెలుగులు
సంస్థ కార్యాలయాల్లో అధికారుల విభాగాలు, ఏసిలు, ఆర్టీసీ కాంప్లెక్స్, డిపోల్లో వాడుతున్న విద్యుత్ వలన ఆర్ధిక భారం పడుతోంది. దీని నుంచి బయటపడేందుకు ఆర్టీసీ విశాఖ రీజియన్ ఇటీవల సోలార్ ప్రాజెక్టు వైపు దృష్టిపెట్టింది. దీనిలోభాగంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్టీసీ యాజమాన్యానికి పంపింది. కేంద్రం నుంచి సహాయం అందితే నెడ్‌క్యాప్ ద్వారా సాంకేతికపరమైన సహాయాన్ని తీసుకుని ఈ దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది పూర్తయితే చాలామటుకు ఆర్టీసీలో విద్యుత్ సమస్యలు తీరుతాయి. అసలే నష్టాల్లో ఉన్న సంస్థ విద్యుత్‌పరంగా చార్జీల భారం నుంచి బయటపడే అవకాశాలుంటాయి. ఇదే తరహాలో రెవెన్యూ, ఖజానా వంటి ప్రభుత్వరంగ సంస్థలు తమ కార్యాలయాల్లో ముఖ్యమైన విభాగాలకు సోలార్ విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించాయి. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రతిపాదనలకు కేంద్రం స్పందించి సబ్సిడీని అందజేస్తే టెండర్లను పిలవడం ద్వారా దీనిని అందుబాటులోకి తీసుకురావడం సాధ్యపడుతుంది.

ఎస్‌ఎంఎస్ ద్వారా సమస్యల పరిష్కారం
* ఈపిడిసిఎల్ మరో ప్రయోగం
* వినియోగదారుల నుంచి సమాచారం సేకరణ
* ఐదు జిల్లాలకు ప్రత్యేకం
విశాఖపట్నం, జూలై 19: అనేక రకాలైన ప్రయోగాలతో విద్యుత్ వినియోగదారులకు చేరువ అవుతోన్న ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) ఇపుడు తాజాగా మరో సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. వినియోగదారుల సమస్యల సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా ఎస్‌ఎంఎస్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. దీనిలోభాగంగా వినియోగదారుడు సంస్థ కోరిన సమాచారాన్ని అందిస్తే సరిపోతోంది. దీనివల్ల వినియోగదారుడు నిత్యం ఎదుర్కొనే అనేక విద్యుత్ సమస్యలపై సంబంధిత సిబ్బంది, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసే పరిస్థితులుండవు. మెరగైన, నాణ్యతతో కూడిన సేవలందించడంలో భాగంగా ఎస్‌ఎంఎస్ సమాచారం ద్వారా ఎప్పటికపుడు సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించిన సంస్థ కేవలం వినియోగదారుని వద్ద ఉండే సమాచారం అందించాల్సి ఉంటుంది. విద్యుత్ వినియోగదారులకు మరిన్ని విశిష్ట సేవలను అందించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. దీనిలోభాగంగా విద్యుత్ సంబంధిత సమాచారాన్ని ఎప్పటికపుడు అందించేందుకు, అత్యవసర విద్యుత్ అంతరాయాలు, విద్యుత్ కోతలు, సేవల వివరాలను తెలియజేసేందుకు వినియోగదారుల మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్లు సంస్థకు అందిస్తే సరిపోతుంది. సంస్థ ఇపుడు ఇదే పనిలో ఉంది. విద్యుత్ స్థితిగతులపై అవగాహన, సత్వర సేవలను వినియోగదారుడు పొందడానికి ఈ ఎస్‌ఎంఎస్ (సమాచార) ఎలెర్ట్ కార్యక్రమం తోడ్పడుతోంది. ఏపీ ఈపీడిసిఎల్ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఏలూరు ప్రాంతాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు బిల్ వివరాలు నమోదు చేయడానికి వచ్చే సిబ్బందికి లేక సమీపంలో విద్యుత్ సిబ్బందికి ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్లను అందజేయాలని శనివారం ప్రకటనలో సంస్థ (ఓ అండ్ సిఎస్) చీఫ్ జనరల్ మేనేజర్ కెయస్‌ఎన్ మూర్తి తెలిపారు. లేదా బిల్లు చెల్లింపు సమయంలో సంబంధిత వ్యక్తికి వివరాలు తెలియజేయవచ్చన్నారు.

కొనసాగుతోన్న ట్రామాకేర్ సమ్మె
విశాఖపట్నం, జూలై 19: తొమ్మిది మాసాలుగా బకాయిపడిన జీతాలను చెల్లించాలని కోరుతూ కెజిహెచ్ ట్రామాకేర్ సెంటర్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె శనివారం కొనసాగింది. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఏపీ ట్రామాకేర్ సెంటర్ కాంట్రాక్ట్ ఎంప్లారుూస్ యూనియన్ (కెజిహెచ్) ఆధ్వర్యంలో పది రోజుల కిందట కెజిహెచ్ మెయిన్‌గేట్ వద్ద సమ్మెకు దిగారు. ఈ శిబిరంలో ఉద్యోగులు పాల్గొని నిరసన తెలియజేస్తున్నారు. ఇప్పటికే అనేకసార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోయిందని, దీనివల్ల తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నట్టు యూనియన్ గౌరవ అధ్యక్షుడు వై.త్రినాథ్ తెలిపారు. కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని సిబ్బంది డిమాండ్ చేశారు.
నివేదిక పంపాం: సూపరింటెండెంట్
సమ్మెలోకి దిగిన 76 మంది ఉద్యోగులకు సంబంధించి తొమ్మిది మాసాలుగా జీతాలు చెల్లించాల్సి ఉందని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపామని కెజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.మధుసూధన్‌బాబు తెలిపారు. ఎప్పటికపుడు ఉద్యోగులతోను సమస్యపై చర్చిస్తున్నామన్నారు. ట్రామాకేర్ సెంటర్‌లో పనిచేస్తున్న 76 మందికి ఉద్యోగులకుగాను ప్రతినెల 11,15,200 రూపాయల మేర జీతాలుగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే ట్రామాకేర్ ఉద్యోగులు విధులకు హజరైన పరిస్థితులను బట్టి దీని చెల్లింపు ఉంటుందన్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 66,91,200రూపాయలు, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి గత నెల వరకు 33,45,600రూపాయలు మేర ఈ విధంగా ఏడాదికి 1,43,92,800 రూపాయలు వరకు వెచ్చించాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగుల సమస్యలు, జీత,్భత్యాలపై ఎప్పటికపుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తుండగా సమ్మె విరమణకు తరచూ చర్చలు జరుపుతున్నామన్నారు.

గీతం మేనేజ్‌మెంట్ జర్నల్‌ను ఆవిష్కరించిన సార్క్ సెక్రటరీ జనరల్
విశాఖపట్నం, జూలై 19: గీతం విశ్వవిద్యాలయం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నూతనంగా ప్రచురించిన మేనేజ్‌మెంట్ జర్నల్‌ను శనివారం గీతం యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో భారత మాజీ రాయబారి, సార్క్ మాజీ సెక్రటరీ జనరల్ అమిత్‌దాస్ గుప్తా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మేనేజ్‌మెంట్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారతదేశ యువశక్తి భవిష్యత్‌లో కీలకంగా మారనుందని ముఖ్యంగా యువతరాన్ని సాంకేతిక నిపుణతతో తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యాలయాలపై ఉందన్నారు. మానవ వనరుల అభివృద్ధిమంత్రిత్వశాఖ తాజా నివేదిక ప్రకారం రానున్న ఐదేళ్ళల్లో దేశంలో వెయ్యి నూతన విశ్వవిద్యాలయాలు, 55 వేల నూతన పాలిటెక్నిక్ కళాశాలలు దాదాపు రెండు లక్షల మంది అధ్యాపకులు అవసరమన్నారు. యువత ఆలోచనాశక్తిని పెంచే విధంగా విద్యా విధానం రూపు దిద్దుకోవాలని పిలుపునిచ్చారు. ఆలోచనల్లో విప్లవాత్మక దోరణులు నూతన ఆవిష్కరణలకు, నూతన విద్యావిధానానికి దారి తీస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యను భిన్న కోణాల నుంచి పరిశీలించి వివిధ రూపాల్లో పరిష్కార మార్గాలను అనే్వషించే విధంగా యువత ఆలోచనలను పెంపొందించుకోవాలని, ఆలోచనలకు విజ్ఞానాన్ని జోడించి ముందుకు సాగాలని ఆయన సూచించారు. గౌరవ అతిథిగా హాజరైన జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ సంస్థ మానవ వనరుల విభాగం ఉపాధ్యక్షుడు విజయ సిన్హా మాట్లాడుతూ నూతన ఆర్ధిక విధానాలు,ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాలను అర్ధం చేసుకుని యువతరం ముందుకు సాగాలని సూచించారు. బహుళజాతి కంపెనీల ప్రవేశంతో దేశంలోని పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులకు తగిన విధంగా యుతవ తమను సిద్ధం చేసుకోవాలన్నారు. మార్కెట్, వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా ఉత్పత్తులను అందించడం విజయానికి దారి తీస్తుందన్నారు. గీతం విశ్వవిద్యాలయంతో కలసి తమ పరిశ్రమలోని నిపుణులు భవిష్యత్‌లో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గీతం ప్రొ- వైస్ ఛాన్సలర్ డి.హరినారాయణ మాట్లాడుతూ దేశ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత అన్ని రంగాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆ దృష్ట్యా గీతం విశ్వవిద్యాలయం కోర్సుల్లో మార్పులు చేస్తున్నామన్నారు. కార్పొరేట్ రంగానికి అవసరమైన మానవ వనరులను అందించడంలో గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ముందంజలో ఉందన్నారు. గీతం విశ్వవిద్యాలయం బోధనా, పరిశోధనలతో దేశంలో అగ్రస్థాయి ఉన్నత విద్యా సంస్థగా ఎదిగిన తీరును ఆయన వివరించారు. కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ పాల్గొని మేనేజ్‌మెంట్ విద్యా విధానంలో వస్తున్న మార్పులను, ఇనిస్టిట్యూట్ ద్వారా అందిస్తున్న కోర్సులను వివరించారు. వైస్-ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ షీలా తదితరులు పాల్గొన్నారు.

నయన మనోహరం ‘గోపికావర్మ బృందం’ నృత్యరూపకం
ఆరిలోవ, జూలై 19:తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయంలో కొలువైన స్వామి కొలిచే కృతులు, కీర్తనలకు ప్రఖ్యాత కేరళ రాష్ట్ర మోహినీయట్టం కళాకారిణి గోపికావర్మ, బృందం కళాకారులు హావభావ నృత్యాభినయంతో మోహినీయట్టం నృత్యరూపకాన్ని నయన మనోహరంగా ప్రదర్శించి ఆహూతుల కరతాళ ధ్వనులందుకున్నారు. నగరానికి చెందిన ఆంధ్రా మ్యూజిక్ అకాడమీ, న్యూఢిల్లీకి చెందిన సంగీత నాటక అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఎనిమిది రోజుల పాటు ‘నృత్యవైశాఖి-2014’ పేరున నిర్వహించనున్న జాతీయ నృత్యోత్సవాలలో భాగంగా మూడవ రోజు శనివారం సాయంత్రం కళాభారతి ఆడిటోరియంలో గోపికావర్మ బృందం నృత్య కళాకారుల మోహినీయట్టం నృత్యరూపక ప్రదర్శభ జరిగింది. భోగీంద్రశయన ....కృతికి కళాకారుల నృత్య ప్రదర్శనతో కార్యక్రమం ప్రారంభమైంది. గోపికావర్మ బృందం కళాకారులు అద్భుతంగా తమ నృత్యాభినయాన్ని ప్రదర్శించి ఆహూతులను పరవశింప చేసారు. సంస్థల ముఖ్య కార్యవర్గ సభ్యులు, నృత్య కళాకారులు, అధికసంఖ్యలో కళాభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మన్యం సమస్యలపై అవగాహన లేదు
కలెక్టర్ యువరాజ్
పాడేరు, జూలై 19: గిరిజనుల సమస్యలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై తనకు అవగాహన లేదని కలెక్టర్ ఎన్.యువరాజ్ స్పష్టం చేసారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా శనివారం పాడేరు విచ్చేసిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ ప్రాంత సమస్యలను మీడియా తనకు తెలియచేయాలని సూచించారు. తాను కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే పాడేరు పర్యటనకు వచ్చానని, ఈ ప్రాంత సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పుడిప్పుడే తాను తెలుసుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంత పరిస్థితులపై పూర్తి అవగాహన ఏర్పరచుకుని గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. విశాఖ మన్యంలో కాఫీ కుంభకోణం వివరాలను తాను తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన పేర్కొన్నారు. ఏజెన్సీలో మారుమూల గ్రామాలకు ప్రధాన రోడ్లతో అనుసంధానం చేసే విధంగా రహదారులను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. గిరిజన ప్రాంతంలో ఇంతవరకు తొమ్మిది వందల కిలోమీటర్ల రహదారులను నిర్మించి అనేక మారుమూల గ్రామాలకు ప్రధాన మార్గంతో అనుసంధానం చేసామని ఆయన పేర్కొన్నారు. రానున్న కాలంలో మరిన్ని రోడ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నట్టు యువరాజ్ తెలిపారు. కలెక్టర్ వెంట పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్, రెవెన్యూ డివిజనల్ అధికారి రాజకుమారి, పలువురు అధికారులు ఉన్నారు.

ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
పాడేరు, జూలై 19: వైద్య విధాన పరిషత్ పాడేరు ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ఎన్.యువరాజ్ శనివారం తనిఖీ చేసారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను ఆయన సందర్శించి గిరిజన రోగులకు వైద్య సేవలు అందుతున్న తీరును పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ఆయన పరామర్శించి ఏ వ్యాధులతో వారు బాధపడుతున్నదీ, వారికి అందిస్తున్న వైద్యం వంటి అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఏరియా ఆసుపత్రిలోని పౌష్టికాహార పునరావాస కేంద్రంలో ఉన్న నేహరిక అనే గిరిజన చిన్నారిని ఆయన పరిశీలించి బాలిక ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసారు. అయితే పౌష్టికాహర లోపంతో నేహరిక బాధపడుతుందని, రెండు సంవత్సరాల వయస్సు కలిగిన బాలిక 12 కిలోల బరువు ఉండాల్సి ఉండగా కేవలం 7.2 కిలోల బరువు మాత్రమే ఉందని వైద్య విదాన పరిషత్ కో-ఆర్డినేటర్ నాయక్ కలెక్టర్‌కు వివరించారు. ఆసుపత్రిలో చేరిన తరువాత బాలిక బరువు క్రమేణా పెరుగుతుందని, మరికొద్ది రోజులలోనే బాలికను ఆసుపత్రి నుంచి డిశార్జ్ చేయనున్నామని ఆయన చెప్పారు. తక్కువ బరువుతో జన్మించిన శిశువులను ఆసుపత్రిలోని పౌష్టికాహార పునరావాస కేంద్రంలో చేర్చించి వారికి పౌష్టికాహారం అందించే చికిత్స చేస్తున్నట్టు నాయక్ వివరించారు. ఆసుపత్రిలో మందుల నిల్వ గదిని కలెక్టర్ తనిఖీ చేసి మందుల నిల్వ వివరాలను అడిగి తెలుసుకున్నారు. దూర సంచార నేత్ర విభాగాన్ని సందర్శించిన ఆయన రోజుకు ఎన్ని కేసులు వస్తున్నాయని ఆరా తీసారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్య సేవలలో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా యువరాజ్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్, ఆసుపత్రి సూపరింటెండెంట్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

కందమామిడి మేట్రిన్ సస్పెన్షన్
పాడేరు, జూలై 19: పాడేరు మండలం కందమామిడి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల మేట్రిన్ రమాసుందరిని ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి సస్పెండ్ చేసారు. ఆశ్రమంలో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని వచ్చిన పిర్యాదుల మేరకు ఆమెను సస్పెండ్ చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మెనూ అమలులో లోపాలపై సమగ్ర విచారణ నిర్వహించి నివేదికను అందచేయాలని ప్రాజెక్టు అధికారి వినయ్‌చంద్ గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను ఆదేశించారు.

* ఈపిడిసిఎల్ పరిధిలో రూ.60 కోట్లతో సౌర వెలుగులు
english title: 
s

గిరిజన జిల్లాకు యోచన

$
0
0

ఏలూరు, జూలై 19 : రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు కలిపే అంశం సాంకేతికంగా పూరె్తైంది. ఇప్పుడు ఆ మండలాలను ఉభయగోదావరి జిల్లాలకు కలుపుతూ నిర్ణయం తీసుకున్నా పరిపాలనా పరంగా మాత్రం పూర్తిస్థాయి క్రమబద్దీకరణ జరగలేదు. హైదరాబాద్‌లో శుక్రవారం ఉన్నత స్థాయిలో జరిగిన సమావేశంలో ఇదే అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. దీనిలో కొత్తగా గిరిజన జిల్లాను ఏర్పాటు చేసే యోచనపై చర్చించినట్లు తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజు పేరున ఈ జిల్లాను ఏర్పాటు చేయాలని కూడా తలపోస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ ఖమ్మంజిల్లా నుంచి కలిసిన ఏజెన్సీ ప్రాంతాలను కూడా కలిపి ఒక గిరిజన జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీని సాధ్యాసాధ్యాలపై హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో అధికారుల నుంచి అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి జిల్లా నుంచి జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు హాజరయ్యారు. కాగా పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు ఆంధ్రాలో కలిసిన నేపధ్యంలో పశ్చిమగోదావరి జిల్లాకు వాటిలో రెండు మండలాలు, ఆరు గ్రామాలు వచ్చి చేరాయి. దీనిలో 47 రెవిన్యూ గ్రామాలు వుండగా 155 హ్యాబిటేషన్లు వున్నాయి. ఇవి పశ్చిమగోదావరిలో కలవడం ద్వారా 58776 మంది జనాభా జిల్లాకు వచ్చి చేరారు. వీరిలో 25139 మంది గిరిజనులు కాగా 11889 మంది ఎస్‌సిలు, మిగిలిన వారు ఇతరులు వున్నారు. మొత్తంగా చూస్తే ఈ జనాభా ఇప్పుడు జిల్లాకు జత చేరినట్లైంది. కాగా ఖమ్మం జిల్లా నుంచి పలు ప్రాంతాలు ఉభయగోదావరి జిల్లాలో కలిసినా వారంతా పాలనాపరంగా జిల్లా యంత్రాంగాల పరిధిలోకి రాకపోవడం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి వుందని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. వీటిని త్వరితగతిన విడుదల చేయడమే కాకుండా ఈ నెల నుంచి జీతాలు ఆ అధికారులంతా పశ్చిమగోదావరి జిల్లా నుంచే పొందాల్సి వుంటుందన్న అంశాన్ని కూడా స్పష్టం చేయాలని నిర్ణయించారు. ఈ పరిణామాలు ఇలా వుంటే మరోవైపు ఖమ్మం నుంచి ఉభయగోదావరి జిల్లాలకు ఆయా మండలాలు, గ్రామాలు కలిసిన నేపధ్యంలో ఆయా జిల్లాల కంబైన్డ్ మ్యాప్‌లను తయారు చేయాలని కూడా నిర్ణయించారు. ఈ బాధ్యతను తూర్పుగోదావరి జిల్లాయంత్రాంగానికి అప్పగించారు. పరిపాలనా పరంగా క్రమబద్దీకరణ సత్వరం పూర్తి చేసేందుకు నిర్ణయించారు. దీనికోసం ఫీల్డ్ టెస్ట్ కూడా త్వరితగతిన నిర్వహించాలని నిర్ణయించారు. అదే విధంగా పాలనాపరమైన క్రమబద్దీకరణ సత్వరం పూర్తికాకుంటే ఈ ప్రాంతాల్లో వున్న జనాభాకు పెన్షన్లు అందించడం నుంచి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అమలు చేయడం వరకు అనేక సమస్యలు తలెత్తుతాయని పలువురు అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపధ్యంలోనే ఈ కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించారు.

*కలిసిన మండలాలపై ఉన్నత స్థాయి చర్చ*పాలన క్రమబద్ధానికి యత్నం*జిల్లాకు 155 హేబిటేషన్లు
english title: 
d

కొల్లేరు గ్రామాలకు పరిశుద్ధ జలాలు

$
0
0

భీమవరం, జూలై 19: కొన్ని వందల ఏళ్ళుగా కాలుష్య జలాల మధ్య జీవిస్తున్న కొల్లేరు ప్రజలకోసం పరిశుద్ధ జలాలను అందించనున్నట్లు నరసాపురం ఎంపి డాక్టర్ గోకరాజు గంగరాజు చెప్పారు. వారికి పరిశుద్ధ జలాలు అందివ్వడంతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా అందివ్వడం తమ బాధ్యత అన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సిద్ధంగా ఉండాలన్నారు. మూలన పడ్డ మంచినీటి పథకాలను తిరిగి పునఃప్రారంభించి ఆ పనులు పూర్తిచేసేలా గ్రామీణ నీటి సరఫరా విభాగం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. భీమవరంలోని గ్రామీణ నీటిసరఫరా విభాగం, పంచాయతీరాజ్, రహదారుల, భవనాలు, నీటిపారుదల, డ్రైనేజి శాఖల అధికారులతో శనివారం ఎంపి సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లోని రహదారుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రహదారుల, భవనాల శాఖ తీరప్రాంతాల్లోని రహదారులను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. నీటిపారుదల, డ్రైనేజి శాఖలు చేపట్టిన కోట్లాది రూపాయల పనుల గురించి ఆయన ఆరా తీశారు. నీటిపారుదల, డ్రైనేజీ శాఖలపై ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నట్లు ఎంపి తెలిపారు. సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్‌ఇ వేణుగోపాల్, ఇఇ బ్రహ్మరెడ్డి, ఏలూరు పిఆర్‌ఇఇ కెవిపి రామారావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ బివి రమణ, ఇఇ లక్ష్మీపతిరాజు, ఆర్ అండ్ బి ఎస్‌ఇ శ్రీమన్నారాయణ, నీటిపారుదలశాఖ ఎస్‌ఇ తిరుమలరావుతదితరులు పాల్గొన్నారు.
కోటరీ ఖుష్
*చిత్తగించిన మరో అధికారి
*తాఖీదులన్నీ గాలికి
*డిపిఆర్‌ఓ ఇక స్థిరం
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, జూలై 19 : ఆ వచ్చినాయన కూడా ఇక్కడి పరిస్థితులు చూసి చల్లగా జారుకున్నారు. ఇలాంటి చోట ఎలా పనిచేయగలమన్న ఆందోళనతోనే కుటుంబ కారణాలతోపాటు మరికొన్ని కారణాలు చూపుతూ జిల్లా నుంచి చిత్తగించారు. దీంతో పౌర సంబంధాల శాఖలో బలంగా పాతుకుపోయిన కోటరీ జాబితాలోకి మరో అధికారి వచ్చి చేరిపోయారు. ఇంతకుముందు ఇలాగే కొంతమంది జిల్లాస్థాయి అధికారులనే అనుకోగానే మార్పులు చేసి అనుకున్న వారికే పోస్టింగ్‌లు దక్కేలా చేసిన కోటరీ మరోసారి విజయాన్ని సాధించింది. ఇప్పుడు వారి బాధితుల జాబితాలోకి మరో అధికారి చేరిపోయి తిరుగుటపా కట్టేశారు. దీనికి అన్ని స్థాయిల్లోనూ రాజకీయం, అధికారం కూడా ఉపయోగపడింది. అయితే ఈ విధంగా ఇచ్చిన తాఖీదులు అమలు కాకుండా గాలిలో కలిసిపోవడానికి కారణమేమిటన్న అంశంపై ఆ శాఖ ఉన్నతాధికారుల్లో కూడా అనుమానాలు రాకపోవడానికి ఇంకేమి కారణాలున్నాయన్నది అంతుపట్టకుండా వుంది. ఏది ఏమైనా జిల్లా పౌర సంబంధాల శాఖాధికారిగా ఇక్కడ బాధ్యతలు స్వీకరించేందుకు శుక్రవారం వచ్చిన లోకేశ్వర్ శనివారం నాటికి తిరుగుటపా కట్టేశారు. కుటుంబ కారణాలతోపాటు మరికొన్ని కారణాలను చూపుతూ వెనక్కి వెళ్లిపోయేందుకే ఆయన సిద్ధమయ్యేలా పరిస్థితులు మారిపోవడంతో దానికి ఆయన అంగీకరించి పాత పోస్టుకు వెళ్లిపోయేందుకు ప్రయాణం కట్టేశారు. ఈ పరిణామాలతో ఇక్కడ డిపి ఆర్‌వోగా వున్న భాస్కర్ నారాయణ పోస్టు స్థిరంగా మారినట్లే భావించాలి. ఏది ఏమైనా వివాదాలు, విమర్శలు ఎన్ని చుట్టుముట్టినా అనుకున్న కార్యక్రమాన్ని ముగించడంలో ఇక్కడి కోటరీ మరోసారి విజయం సాధించింది. ఉన్నతాధికారుల తాఖీదులను కూడా గాలిలో కలిసిపోయేలా చేయడంలో ఈ కోటరీ ప్రముఖులు మరోసారి తమ పలుకుబడిని ఉపయోగించగలిగారు.

డ్రైనేజి, నీటి పారుదల శాఖలపై ప్రత్యేక దృష్టి: నరసాపురం ఎంపి గోకరాజు
english title: 
k

పోలవరం పనులపై తక్షణమే నిర్ణయం

$
0
0

ఏలూరు, జూలై 19: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పనుల విషయంలో తక్షణమే నిర్ణయం తీసుకుంటామని, ఈ విషయంలో దిగువ స్థాయి అధికారులు నేరుగా ఫైల్స్ తన వద్దకు తీసుకువచ్చి అప్పటికప్పుడు అనుమతులు పొందాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో కాలయాపన చేయవద్దని అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాయని అన్నారు. ఇటువంటి దశలో నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. నిర్వాసితులకు ప్రభుత్వాదేశాలను అనుసరించి సహాయాన్ని అందించాలని అన్నారు. మొదటి దశలో చేపట్టిన ఏడు నిర్వాసిత గ్రామాల్లో పెండింగ్‌లో వున్న పనులపై కలెక్టర్ సమీక్షించారు. గృహ నిర్మాణ పనులను ఇంత వరకు పూర్తి చేయకపోవడం పట్ల గృహ నిర్మాణ శాఖ జనరల్ మేనేజర్‌ను కలెక్టర్ ప్రశ్నించారు. పునరావాస గ్రామాల్లో ఇళ్లు, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్వాశిత గ్రామాల్లో భూమికి భూమి అందించడం జరిగిందన్నారు. ప్రతీ ఐదు ఎకరాలకు ఒక బోరు మంజూరు చేయాలని నిర్వాసితులు కోరుతున్నారని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలన్నారు. పోలవరం ప్రాజెక్టు కుడికాలువ నిర్మాణానికి భూసేకరణ పనులను పూర్తి చేయాలని చెప్పారు. కోర్టులో పెండింగ్‌లో వున్న విషయాలను ఎప్పటికప్పుడు న్యాయపరంగా పరిశీలిస్తూ పరిష్కార చర్యలు తీసుకోవాలని అన్నారు. కుడికాలువకు సంబంధించి 9800 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉండగా ఇంత వరకు 8703 ఎకరాలు భూసేకరణ పూరె్తైందన్నారు. మిగిలిన వాటిని కూడా త్వరితగతిన భూసేకరణ పూర్తి చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు కుడికాలువకు సంబంధించి 177.87 కిలోమీటర్లు పొడవు నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండగా వాటిలో 129 కిలోమీటర్ల పొడవు నిర్మాణ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలుపై ఇక నుంచి ప్రతీ శనివారం అధికారులతో సమీక్షిస్తానని కలెక్టర్ అన్నారు. నెలలో మొదటి, మూడవ శనివారాలు భూసేకరణపైన, 2, 4 శనివారాలు ప్రాజెక్టు నిర్మాణ పనులు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలుపై సమీక్షిస్తానన్నారు. సంబంధిత అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో సమావేశానికి హాజరుకావాలన్నారు. కార్యక్రమంలో జెసి డాక్టర్ టి బాబూరావునాయుడు, డి ఆర్‌వో కె ప్రభాకరరావు, పోలవరం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ ఎల్ విజయసారధి, హెడ్‌వర్క్స్ ఎస్ ఇ కె పోలేశ్వరరావు, ఇరిగేషన్ ఎస్ ఇ డి తిరుమలరావు, జంగారెడ్డిగూడెం ఆర్‌డివో మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ కాటంనేని
english title: 
p

26 మంది హెచ్‌సిలకు ఎఎస్‌ఐలుగా పదోన్నతి

$
0
0

ఏలూరు, జూలై 19 : జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న 26 మంది హెడ్‌కానిస్టేబుళ్లకు ఎఎస్‌ఐలుగా పదోన్నతి కల్పిస్తూ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఎఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన హెడ్‌కానిస్టేబుళ్లలో ఆర్ రాంబాబు, కెవిడిఎంఆర్ ప్రసాదరావు, ఎం అర్జునరావు, డివివి సత్యనారాయణ, ఎంకెవివిఎస్ నారాయణ, విజికె రాజు, విజె జయకుమార్, ఎన్‌డిఎం గగారిన్ యూరి, ఎస్‌వివిఎస్ కృష్ణాజీ, పి పార్ధసారధి, కెఆర్‌జె మోజెస్, కె అజయ్‌కుమార్, కెవిఎస్ ఉదయభాస్కరరావు, సి భాస్కరరావు, ఎం శివరామకృష్ణ, ఎస్ నాగిరెడ్డి, బి రాధాకృష్ణ, ఎన్‌వి సత్యనారాయణ, జి కేశవరావు, కె శ్రీ్ధర్, పివిజి రాజు, ఎఎస్ రామచంద్రమూర్తి, ఎస్‌వికెపిహెచ్ భూపతి, కె సూరి, బిఎస్ మోజెస్, వివి రంగారావులు వున్నారు.

రుణాల మాఫీ కోసం రైతుల ధర్నా
ఏలూరు, జూలై 19: కౌలు రైతులు, రైతుమిత్ర గ్రూపుల రుణాలు మాఫీ చేయాలని, ఖరీఫ్ రుణాలు ఇవ్వాలని, కృష్ణా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కౌలు రైతుల సంఘం, రైతు మిత్ర గ్రూపుల సమాఖ్య, రైతు సంఘాల ఆధ్వర్యంలో శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించి ధర్నా చేశారు. ధర్నానుద్దేశించి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి బలరామ్, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్‌లు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు రైతులకు వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేయాలన్నారు. కొత్తగా ఖరీఫ్ రుణాలు ఇవ్వాలని కోరారు. కౌలు రైతులందరికీ చట్ట ప్రకారం గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ఎటువంటి హామీ లేకుండా కౌలు రైతులకు లక్ష రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలన్నారు. అనంతరం తహశీల్దార్ జిజె ఎస్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రైతులు మరడాని అప్పారావు, ఎస్ శివ, ప్రసాద్, కేశవరావు, రెడ్డి పవన్‌కుమార్, పిట్టా రఫాయేలు, దాకారపు సూర్యప్రకాశరావు, సత్యనారాయణ, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న 26 మంది హెడ్‌కానిస్టేబుళ్లకు ఎఎస్‌ఐలుగా పదోన్నతి
english title: 
d

ఇరాక్ నుండి ఇంటికి..

$
0
0

మొగల్తూరు, జూలై 19: జీవనోపాధి కోసం ఇరాక్ దేశం వెళ్లిన మొగల్తూరుకు చెందిన వెలిది పాపయ్య శనివారం సురక్షితంగా ఇంటికి చేరుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో భవన నిర్మాణ సెంటరింగ్ పనుల నిమిత్తం ఇరాక్ వెళ్లిన అతను అక్కడ కంపెనీ యాజమాన్యం పెట్టిన అనేక హింసలకు గురయ్యాడు. తినటానికి తిండి లేక, తాగేందుకు మంచినీరు లేక అనేక అవస్థలు పడ్డామని, ఈలోగా దేశంలో అంతర్యుద్ధం రావటంతో పరిస్థితి దయనీయంగా మారిందని పాపయ్య స్థానిక విలేఖరులకు తెలిపారు. ఇండియన్ ఎంబసీ అధికారులు కంపెనీ యాజమాన్యంతో చర్చించారని, జీతాలివ్వకపోయినా పాస్‌పోర్టులు ఇచ్చేందుకు అంగికరించడంతో తనతోపాటు ఇరాక్‌కు వెళ్లిన 192 మందిని ఢిల్లీకి ప్రత్యేక విమానంలో పంపారన్నారు. అక్కడ నుండి విమానంలో విశాఖకు చేరిన తాను శనివారం ఉదయం ఇంటికి చేరినట్లు తెలిపారు. తనను మోసగించిన ఏజెంటుపై కలెక్టరుకు, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు పాపయ్య తెలిపారు. పాపయ్య సురక్షితంగా ఇంటికి చేరటంతో ఆయన కుటుంబ సభ్యులు అనందం వ్యక్తం చేశారు.

జీవనోపాధి కోసం ఇరాక్ దేశం వెళ్లిన మొగల్తూరుకు చెందిన వెలిది పాపయ్య శనివారం సురక్షితంగా
english title: 
i

ఆర్టీసి ఎంప్లారుూస్ సొసైటీలో రూ.250 కోట్లు దుర్వినియోగం

$
0
0

భీమవరం, జూలై 19: ఎపిఎస్‌ఆర్టీసి ఎంప్లారుూస్ కో-ఆపరేటివ్ సొసైటీలో రూ.250 కోట్ల నిధులను యజమాన్యం దుర్వినియోగం చేసిందని ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మాకర్ ఆరోపించారు. వెంటనే యజమాన్యం ఈ నిధులను తిరిగి జమచేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 22వ తేదీ నుండి రాష్టవ్య్రాప్తంగా నిరసనలకు దిగనున్నట్లు భీమవరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ప్రకటించారు. అదేవిధంగా నల్లబ్యాడ్జిలతో విధులకు హాజరవుతామన్నారు. ఈ నెల 30వ తేదీ నుండి మెరుపుసమ్మెకు పిలుపునిచ్చామని విలేఖర్లకు చెప్పారు. ఉద్యోగుల సంక్షేమానికి ఉపయోగించాల్సిన ఈ నిధులు యజమాన్యం తమకు నచ్చినరీతిలో వినియోగించుకుని దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. ప్రస్తుతం ఆర్టీసి కలిసే ఉందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆర్టీసి ఆస్తులను కేంద్ర ప్రభుత్వ నిధులతో, ఉమ్మడి ఆస్తుల సౌలభ్యంతో సీమాంధ్ర రాజధానిగా ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి పెంచుతున్న డీజిల్ ధరల వల్ల ఆర్టీసికి ఏటా రూ.400 కోట్ల అదనపు భారం అవుతోందన్నారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎస్ రావు, రీజియన్ కార్యదర్శి అల్లం సత్యనారాయణ తదితరులు మాట్లాడారు.

30 నుండి మెరుపుసమ్మె:ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మాకర్
english title: 
rtc

భీమవరంలో పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటుకు కృషి

$
0
0

భీమవరం, జూలై 19: భీమవరంలో పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు కోసం నూతనంగా నిర్మించిన మున్సిపల్ భవనాన్ని నరసాపురం ఎంపి డాక్టర్ గోకరాజు గంగరాజు పరిశీలించారు. పూర్వం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో వంటశాలగా ఉన్న దీనిని మెరుగులు దిద్ది రెండంతస్థుల భవనంగా మున్సిపాల్టీ రూ.40 లక్షలు వ్యయం చేసి నిర్మించింది. అయితే పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు చేయాలని, గతంలో మాజీ ఎంపి కనుమూరి బాపిరాజు ప్రయత్నాలు చేసి సంబంధిత అధికారులను భీమవరం తీసుకువచ్చారు. నిర్ణీత స్థలంలో నూతనంగా నిర్మించిన భవనం అధునాతన హంగులు లేకుండా ఉండటంతో వారు పాస్‌పోర్టు కార్యాలయ ఏర్పాటుకు నిరాకరించారు. ఈ విషయం తెలుసుకున్న నరసాపురం ఎంపి గోకరాజు గంగరాజు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలిసి స్వయంగా వినతిపత్రాన్ని అందచేశారు. అలాగే పాస్‌పోర్టు కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వనరుల గురించి వివరించారు. దీంతో స్పందించిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ భీమవరం మున్సిపాల్టీకి ఈమెయిల్ ద్వారా పాస్‌పోర్టు కార్యాలయ ఏర్పాటుకు సన్నాహాలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎంపి ఢిల్లీ నుండి రాకముందే ఈ సందేశం మున్సిపల్ అధికారులకు అందింది. శనివారం ఎంపీతోపాటు భీమవరం మున్సిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు (చినబాబు), వివిధ శాఖల అధికారులు కలిసి పాస్‌పోర్టు కార్యాలయ నిర్మాణాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి సుష్మా స్వరాజ్‌తో మరోమారు చర్చించి విజయవాడ, విశాఖపట్నం మాదిరిగా భీమవరంలో పాస్‌పోర్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరతానన్నారు.
రైల్వేగేటును పరిశీలించిన ప్రజాప్రతినిధులు
ఎన్నో ఏళ్ళుగా పెండింగ్‌లో ఉన్న బైపాస్ రోడ్డులోని రైల్వేగేటు ప్రాంతాన్ని ఎంపి డాక్టర్ గోకరాజు గంగరాజు, ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు పరిశీలించారు. బైపాస్ రోడ్డులో రైల్వేగేటు ఏర్పాటుచేస్తే రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని పోలీస్ అధికారులు కూడా సూచించారు. అంతేకాకుండా పాలకొల్లు వరకు ప్రత్యేకంగా బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టవచ్చునని అధికారులు తెలిపారు. దీంతో స్పందించిన ఎంపి రైల్వే మంత్రితో మాట్లాడతానని తెలిపారు. గోకరాజు రామరాజు, పొత్తూరి ఆంజనేయరాజు తదితర ప్రజాప్రతినిధులు వారి వెంట ఉన్నారు.

భీమవరంలో పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు కోసం నూతనంగా నిర్మించిన మున్సిపల్ భవనాన్ని
english title: 
b

దొడ్డిపట్లలో పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉంది

$
0
0

యలమంచిలి, జూలై 19: యలమంచిలి మండలం దొడ్డిపట్లలో తన పుట్టిన రోజు వేడుకను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. దొడ్డిపట్ల గ్రామంలో ఆచంట మాజీ సర్పంచ్ చేగొండి సూరిబాబు స్వగృహంలో రాజేంద్రప్రసాద్ పుట్టిన రోజు వేడుకను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష సంఖ్యలో వచ్చిన అభిమానుల సమక్షంలో పుట్టిన రోజు కేక్ కట్‌చేశారు. ఈ వేడుకలలో పాల్గొన్న మాజీ ఎంపి, చిత్ర నిర్మాత చేగొండి హరిరామజోగయ్య సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌చే కేక్‌ను తినిపించారు. కార్యక్రమంలో దర్శకుడు వనె్నంరెడ్డి రాజా, కెమెరామెన్ మోహన్, టామీ ది డాగ్ చిత్ర యూనిట్‌తోపాటు చేగొండి చిన్ని, సదాశివరావు తదితర్లు పాల్గొని రాజేంద్రప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చేగొండి హరిరామజోగయ్య విలేఖర్లతో మాట్లాడుతూ యలమంచిలి, పాలకొల్లు పరిసర ప్రాంతాలలో సుమారు నెల రోజుల నుండి చిత్రీకరిస్తున్న టామీ ది డాగ్ చిత్రం సెప్టెంబర్ నెలలో విడుదలవుతుందని, మరో మూడు నాలుగు రోజులలో చిత్ర నిర్మాణం పూర్తవుతుందన్నారు.

సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్
english title: 
d

త్వరలో ప్రధానమంత్రి ఫోన్లో వార్డు సభ్యులతో సంప్రదింపులు

$
0
0

ఏలూరు, జూలై 19: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీ నుంచి నేరుగా పంచాయితీ వార్డు మెంబర్లతో త్వరలో ఫోన్‌లో మాట్లాడే అవకాశం వుందని జిల్లా పంచాయితీ అధికారి ఎ నాగరాజు వర్మ చెప్పారు. ఇందుకు సంబంధించి జిల్లాకు చెందిన వార్డు మెంబర్ల ఫోన్ నెంబర్ల వివరాలు రాష్ట్ర పంచాయితీ రాజ్ కమిషనర్ కార్యాలయానికి సమర్పించినట్లు ఆయన చెప్పారు. స్థానిక నిక్‌నెట్ కార్యాలయంలో శనివారం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల పంచాయితీ అధికారులు, ఇ-పంచాయత్ డిసి ఎంలతో రాష్ట్ర పంచాయితీరాజ్ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయితీ వార్డు మెంబర్లతో ప్రధానమంత్రి నేరుగా మాట్లాడే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తోందని, ఈ మేరకు వార్డు మెంబర్ల పేర్లు, సెల్‌ఫోన్ నెంబర్లు తదితర వివరాలను సిద్ధం చేశామని నాగరాజు వర్మ చెప్పారు. వచ్చే నెల 1 నుంచి గ్రామ పంచాయితీల ఆదాయ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచి పారదర్శక పాలనకు చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 531 క్లస్టర్ పంచాయితీలను గుర్తించామని, ఇప్పటికే 404 పంచాయితీలకు బి ఎస్ ఎన్ ఎల్ ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని చెప్పారు. 275 పంచాయితీల్లో ఆన్‌లైన్ కార్యకలాపాలు పూర్తయ్యాయన్నారు. 15 రోజుల్లో నిర్ధేశించిన పంచాయితీల్లో కంప్యూటర్ల ఏర్పాటు, ఆన్‌లైన్ కార్యకలాపాలు పూర్తి చేస్తామన్నారు. చిన్న చిన్న పంచాయితీలు సమీపంలో పెద్ద పంచాయితీల కార్యాలయాల్లో తమ ఆన్‌లైన్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని పంచాయితీల్లో సురక్షితమైన తాగునీటి సౌకర్యం, పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించడానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. పంచాయితీరాజ్ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం లోగా రాష్ట్రంలోని అన్ని పంచాయితీల్లోని వార్డుమెంబర్ల ఫోన్ నెంబర్ల జాబితాలను సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో డివిజనల్ పంచాయితీ అధికారులు రాజ్యలక్ష్మి, ఆర్ విక్టర్, ఎస్ సత్యనారాయణరాజు, కార్వే సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ చక్రవర్తి, ఇ-పంచాయత్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ పులి నాగ వెంకట సత్యనారాయణ, అడిషనల్ డిపి ఎం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు వర్మ
english title: 
t

గోవుల సంరక్షణకు భారీ ఉద్యమం

$
0
0

అనంతపురం సిటీ, జూలై 20: గోవుల సంరక్షణ, గోమాత హత్యల నివారణ కోసం అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున ఉద్యమం ప్రారంభమయింది. ఉద్యమకారులు ఆదివారం సప్తగోమాత పూజతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. లక్ష్యం నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలనే సంకల్పంతో టవర్‌క్లాక్ వద్ద నిరవధిక ధర్నా ప్రారంభమయింది. ఈ ఉద్యమం ప్రజల్లో స్ఫూర్తిని కలిగించాలనే ఉద్దేశ్యంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వందమందితో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గోమాత సంరక్షణ గోహత్య నివారణ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మేయర్ మదమంచి స్వరూప చిన్మయ మిషన్ జిల్లా ఇన్‌ఛార్జి స్వామి ఆత్మవిదానంద, కామధేను సేవా ట్రస్టు చైర్మన్ కొండూరు బాలసుబ్రమణ్యం, శ్రీకృష్ణ అవేర్‌నెస్ ట్రస్టు లక్ష్మీనారాయణ, కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి రోజు దేశ వ్యాప్తంగా 50 వేలకు పైగా గోవులను కర్కశంగా సంహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ సనాతన ధర్మానికి ఆయువు పట్టయిన గోమాతల సంరక్షణకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గోవుల సంరక్షణకు రూపొందించిన ఆరు చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

చిత్రం.. సమావేశంలో మాట్లాడుతున్న కామధేను సేవాట్రస్టు అధ్యక్షుడు బాల సుబ్రహ్మణ్యం

భారీ ఉద్యమం
english title: 
n
Viewing all 69482 articles
Browse latest View live