ఓ పదిమంది వాళ్ళను రౌండప్ చేస్తూ నిలబడి పహారా కాస్తున్నారు.
పిచ్చిది మగరాయుడిలా ఒక కాలు మడిచి ఒక కాలు చాచి నిర్లక్ష్యంగా కూర్చుని ఉంది. నోట్లో ఏదో పైపులాంటిది పెట్టుకుని చుట్టలా పొగ పీలుస్తూంది. జీవన ఆమె కాళ్ళ దగ్గర పడి ఉంది. విసురుగా నెట్టడాన తల దిమెక్కిందేమో అలాగే పడి ఉంది. ‘‘రేయ్ దీనిబట్టలిప్పెయ్‌బె. అన్నలొస్తుండ్రు అరుస్తరు’’ అంది. మత్తు కళ్లు విరబోసిన జుట్టు, భారీ కాయ మగరాయుడి గొంతు.. చూస్తుంటే తాటకిలా ఉంది. జీవనను కాలుతో ఓ నెట్టు నెట్టింది. జీవన కదిలి వణుకుతూ లేచి కూర్చుంది. అక్కడ వాళ్లందదరూ క్రూరంగా అనేకంటే అసహ్యంగా ఉన్నారు.
‘‘హ్హి హ్హి అక్కా ముందు నాకిడువే ముందు నాకిడువే’’ కుప్పిగంతులు వేస్తూ ఒకడడిగాడు.
‘‘నాకిడువక్కమ్మా నాకిడువే’’ ఇంకొకడు తూలుతూ జీవన దగ్గరకు రాబోయాడు.
‘‘చుబ్బే! అందరు దీస్కోండి పోండి’’ అరిచింది.
‘‘మాయక్క కుంతీదేవిరా! ఆయమ్మ ద్రౌపది నిడిసినట్లు ఇడిసింది.. ఇంక మనిష్టం.
జల్ది జేయుండి అన్నొస్తడు. అందరు చుట్టుముట్టి జీవన దగ్గరకు రాసాగారు. జీవన భయపడుతూ వెనక్కి జరిగింది.
పిచ్చిదానికి అందుబాటులోకి రాగానే ఒక్క తన్ను తన్నింది. జీవనెళ్లి వామన్రాములు కాళ్ళ దగ్గర పడింది. చేతిలో చుట్టలాంటిది దాంతో జీవన నడుంమీద అంటించాడు.
‘‘అమ్మా’’ అని అరిచింది జీవన. అందరూ పగలబడి నవ్వారు. అవినాష్ ఇనప తలుపును బలంగా నెట్టాడు. ‘రేయ్’ అనరిచాడు. ఎవ్వరికీ అవినాష్ అరుపు వినిపించలేదు. అందరూ అదొక మత్తులో ఉన్నారు.
‘‘మస్తుగ గాల్చినలే’’ అడిగాడు వామన్రాములు.
‘‘అవ్వన్న నాకు మస్తు ఖుషి అయ్యింది’’ ఇంకొకడు ఎగురుతూ అన్నాడు. వాళ్ళసలు మనుషుల్లా లేరు. పిచ్చెక్కిన జంతువుల్లా మదమెక్కిన క్రూరమృగాల్లా ఉన్నారు. చూస్తుంటే జుగుప్సగా అసహ్యంగా ఉన్నారు. వాళ్ళ ఆనందం ఎదుటివాళ్ళ బాధను చూసినకొద్దీ పెరిగేలా ఉంది.
‘‘జీవనా, జీవనా ఇటురా’’ అనరిచాడు అవినాష్. జీవన రాబోతుంటే కాళ్ళకున్న పైజామా పట్టుకున్నాడొకడు. వాడి బలానికి పైజామా నాడా తెగి జారిపోయింది. ముడుచుకుని కూర్చుండిపోయింది జీవన.
‘‘అన్నొస్తుండు అన్నొస్తుండు’’ ఇంకొకడు కేరింతలు కొడుతూ అన్నాడు. అందరూ ఒక మూలకు ఉన్న గుహలాంటి ద్వారం వైపు చూశారు.
సన్నగా, పీలగా ఒళ్ళంతా తెల్లటి పొడలతో మచ్చలతో పాములా ఉన్నాడు అతను. బల్లికి కొద్దిగా గెటప్ వేసి మనిషి ఆకారాన్ని తెస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. వాడ్ని చూడగానే జీవన భయంతో ముడుచుకుపోయింది. వాడి కళ్ళు పచ్చగా మెరుస్తున్నాయి. వాడు పాక్కుంటూ పాక్కుంటూ పిచ్చిదాని దగ్గరకు వచ్చాడు. మోకాలు కనబడుతుంటే ఆ మోకాల్ని ఆబగా నాకాడు. అది మత్తులో ఉండటాన మోకాలు వెనక్కి తీసుకుని ఒక్క తన్ను తన్నింది అంతే.
‘‘అఅ... అఅ.. అఅ’’ అని రొప్పుతూ అంత బలమైనదాన్ని చుట్టుకుని, ఒక్క ఒడుపుతో కిందపడేసి, ఒళ్ళంతా గోళ్ళతో రక్కేసి...ఒళ్ళంతా తడమసాగాడు. గోళ్ళు దిగబడి రక్తం ఓడుతోంది. అది చూసి జీవన ప్రాణాలు ఉగ్గబట్టుకుంది. వాడో భయంకరమైన సైకిక్‌లా అనిపించాడు.
కిందపడి పిచ్చిదాని ఒళ్ళంతా రక్కుతూ నెత్తుటి మరకలూ ఏర్పడ్డాయి. పిచ్చిది మత్తులోంచి బయటపడి.
‘‘రేయ్ చింపుగా నీకా పిల్లను దెచ్చినా, దాంతోటి ఆడుకోరా, అగజూడు ముద్దుగుంది. మెత్తగుంది. గక్కడవోరా గక్కడవో. పోరా... పో’’ అని సముదాయించసాగింది. వాడు జీవన వైపు తిరిగాడు. జీవన వాడి చూపులకే కెవ్వున అరుస్తూ గోడకు అతుక్కుపోయింది. భయంతో వణికిపోయింది. వాడటు చూడగానే బట్టలు సర్దుకుని..
‘‘దొంగ కొడుకు ఆడదాన్ని జూస్తే సాలు అంగలల్లారుస్తడు, నీయమ్మ ఒళ్ళంతా వూనం చేసిండు’’ అని గొణికి మళ్ళీ చుట్ట కాల్చడంలో మునిగిపోయింది పిచ్చిది. అక్కడున్న వాళ్ళందరూ అప్పటిదాకా కామెడీ సీన్‌లోని అడ్వర్‌టైజ్‌మెంట్ చూసి ఆకర్షించబడ్డవాళ్ళలా... అదే పనిగా చూస్తున్నారు.
నెక్ట్స్ చూడబోయే సినిమా తలుచుకుని సస్పెన్స్ ఫీలవ్వసాగారు. నవ్వడానికి సిద్ధమవ్వసాగారు. ఆనందంతో పిచ్చి గంతులు వేశారు. అవినాష్‌లో కసి, కోపం, ఏమీ చేయలేని తన స్థితి, ఉద్రేకం తెప్పిచ్చింది. కాలితో ఇనప కచ్చడాన్ని తన్నాడు.
చింపు అనబడినవాడు పాక్కుంటూ మెల్లగా జీవన వైపు బయల్దేరాడు.
‘‘వద్దూ.. వద్దూ.. జీవన వణుకుతూ పలవరిస్తోంది. జీవన ముఖంలోని భయాన్నిచూసి అందరూ మహదానందపడిపోతున్నారు.
జీవన అవినాష్‌వైపు జరగడానికి ప్రయత్నించసాగింది.
ఎదురుగా ఒకడు అడ్డం వచ్చి ‘‘కబ్బాడి... కబ్బాడి.. కబ్బాడి’’ అంటూ జీవనను పట్టుకోవడానికి కబాడీ ఆటలోలాగా ఆడసాగాడు.
జీవన వెనక్కి పరుగెత్తింది. వెనకనుంచీ ఒకడు ‘కబ్బాడి.. కబ్బాడి... కబ్బాడి’’ అంటూ తరిమాడు.
-ఇంకాఉంది
అమ్మ - 59
రంగనాథ రామాయణం - 190
మనకి అవశ్యం విజయం లభిస్తుంది. నా అస్త్రాలు ఎదుర్కొనడం కన్న దనుజారికి వేరు ఉపాయం ఏముంది కనుక? ఎక్కడ దాగికొని వుండగలడు?
పిమ్మట వానరచమూ నాయకుడు నీలుడిని కనుగొని ‘‘మిక్కిలి చక్కదనం, కడు నిర్మలం, మిక్కిలి స్వాదుజలం కల తావు చూసి పరిపక్వ ఫలాలు, కౌచిషలించిన వృక్షాలుచూసి ఆ తెరువున సేనను నడిపించు. వృక్షములు ఏపుగా, సాంద్రంగా పెరిగితే శత్రువులు కానరాకుండా దాగి వుంటారు. ఏమరుపాటు తగదు’’ అని వాకొన్నాడు. శ్రీరామచంద్రుడి ఆజ్ఞ తలదాల్చి నీలుడు ఆ రీతిగానే సేనల్ని నడిపించమొదలిడ్డాడు.
సుగ్రీవుడు కపిసేనలను వెడలించుట
అప్పుడు కపిరాజు సుగ్రీవుడు వానరులను పిలిచి లంకపై దండుగ వెడల ఆజ్ఞాపించాడు. వానర సైన్యం పటురభసంతో పర్వత గుహలనించి ప్రయాణం అయింది. ఆ కపివీరుల పదఘట్టనలకి పుడమి క్రక్కడలింది. వారి భీకరరావాలకి పర్వత గుహలు ఘూర్జిల్లాయి. వానరవీరుల సింహనాదాలు, హాసాలు, గర్జనలు ఆకసం అంటాయి. వానరులుకొందరు కోపంతో పెనుబొబ్బలు పెట్టారు. మరికొందరు త్రుళ్లింతలాడుతూ శక్తికొలది ఆకాశంలోకి ఎగురుతున్నారు.
మరికొందరు పండిన బదరీనికుంజాలు మూపులమోస్తూ రేగుపండ్లు నమలుతున్నారు. రావణుడితోకూడా రాక్షసుల్ని మేమే చంపుతాం అని అరుస్తున్నారు. కుతూహలులై పైకి దుముకుతున్నారు. అక్కడ నించి భువిమీదికి ఉరుకుతున్నారు. ఇంకొందరు తోకలు విసరికొడుతూ ఆడుతున్నారు. వేగంగా పర్వత శిఖరాలపైకి కొందరు బొబ్బలు పెడుతున్నారు. ఈ మాదిరి వానర వీరులు సర్వులూ చెలరేగి ఆడుతూవుంటే రామ విభుడు పరమానందభరితుడయాడు. కపుల నినాదాలతో దిక్కులు ప్రతిధ్వనులీనుతున్నాయి. భూమి అట్టిట్టు కంపించింది. అద్రులు అదిరాయి.
దిగ్గజాలు మ్రొగ్గతిల్లాయి. శేషుడికి భూమి మోయలేనంతభారంగా తోచింది. కూర్మము తన అవయవాలనులోపలికి ముడుచుకొన్నది.
ఈ విధంగా వానర సైన్యం ఉద్ధతితో నడవగా పైకెగసిన ధూళిపటలం బహువర్ణాలతో మింట అంతటా వ్యాపించింది.
నీలుడు మంగలియై సాగే సేన అత్యుగ్రతుండగా- ఇరుప్రక్కల కదలు కపిబలము ఉద్ధత పక్షాలుగా మధ్య నడతెంచువారు, రామవిభుడు ఆత్మగా సొంపు మీరి, వెన్క కాచి వచ్చు సేన వాలంగా-ఉరగపాశాల కట్టువడనున్న ఇనకుల తిలకుని అవస్థలు తొలగించడం కోసం గరుత్మంతుడు భూస్థలిని నడచు కరణి ఆ మర్కట మహాసేన అలరారింది.
ప్రజంఘుడు, కేసరి, దధీముఖుడు సందడి తొలగ, విరళంగా శ్రీరామ వెల్లువ కదల పరమ సంతోష భరితాత్ములు అవుతూ గవయుడు, తారుడు, గంధమాదనుడు, పనసుడు, హనుమంతుడు, అంగదుడు, శరభుడు, నలుడు జాంబవంతుడు, హరుడు, మైందుడు ఆదిగా గలుగు తరుచర పతులు వడివడిగా వెంబడి ఏతేరగా చనుదెంచి రాముడు సహ్య పర్వతాన లక్ష్మణ సమేతంగా విడిశాడు. అప్పుడు అంతం లేక పెంపొందే వనాల, తటాకాల, విరివియైన ఛాయల, ఇరవైన తావుల విడుదులు కావించుకొని, ఆ సేనలు సుగ్రీవుడి ఆజ్ఞను శిరసావహించి నిలిచాయి. మరునాడు ఎప్పటివలెనే లక్ష్మణుడు, రామవిభుడు, కపిరాజు సుగ్రీవుడు, వానర నాయకులు పయనం సాగించారు. వీరరసంతో పొంగి పొంగి, అంతటా పర్విన ధ్వనులతో రేగి రేగి, శరీర కాంతి తరంగాల తనరారి ఆరి, ఘనమైన మ్రోతతో ఆకసం అంటి అంటి, వనశైలములందు ఒప్పి ఒప్పి, మనువంశ ప్రభువైన శ్రీరామవిభుచే మదిని ఉబ్బి వుబ్బి, ఆ సముద్రం పెంపుని అణచివేయ భాసురమైన వానరసేనా సముద్రం నడచింది.
అంత ధైర్య గుణాఢ్యులైన రామలక్ష్మణులు సూర్యచంద్రుల మాదిరిగా శోభిల్లారు.
-ఇంకాఉంది
త్రివిధ పూజావిధానములు

సాత్త్విక, రాజస, తామస పూజా విధానములే త్రివిధ పూజావిధానములుగా అంటారు. శివ పార్వతులు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, విష్ణువు, ఆదిత్యుడు... ఈ ఆరుగురు దేవుళ్ళను భక్తిపూర్వకంగా పూజించే విధానమే సాత్త్విక పూజా విధానం. ప్రతిరోజూ శివుని భక్తి పూర్వకంగా పూజించుట, మాస శివరాత్రి, మహాశివరాత్రి.. ఇత్యాది పర్వదినాలలో సముద్ర స్నానం లేదా నదీ స్నానం ఆచరించి ఉపవాస దీక్ష, జాగరణతో కూడిన శివనామస్మరణ చేయుటవలన తరించి, లింగోద్భవ కాలంలో పరమ శివుని రూపాన్ని తనివితీరా చూస్తూ పులకించి అనిర్వచనీయమైన అనుభూతిని సొంతం చేసుకొనుటలో అంతర్లీనమై ఉన్న పూజా విధానాన్ని అణువణువు పరికించగలిగితే ఇది సాత్త్విక పూజా విధానం.
సాత్త్విక పూజా విధానంలో వాడబడుతున్న ద్రవ్యములు అత్యంత పవిత్రమైనవి. పుష్పములు, గంధము, కుంకుమ, క్షీరము, ఘృతము, పెరుగు, తేనె, చక్కెర, బెల్లం, తమలపాకులు, వక్కలు, బియ్యం, పసుపు, అగరుబత్తులు, దీపపు ఒత్తులు, ఉదకం, పంచపాత్ర, ఉద్ధరిణి, మామిడాకులు, అరటి ఆకులు, అరటిపండ్లు, కొబ్బరికాయ, పన్నీరు, కర్పూరం.. తదితర పూజా సామగ్రిని పరికించి చూస్తే ప్రతి యొక్క ద్రవ్యమూ సత్త్వగుణానికి ప్రతీకగా ఉంటూ సాత్త్విక పూజావిధానము యొక్క విశిష్టతనుచెబుతాయ.
అట్టహాసంగా చేసే పూజావిధానమే రాజసపూజావిధానమని చెప్పవచ్చు.ఈ విధానంలో భారీఎత్తున పూజకు పుష్పాలు, అందరినీ ఆకట్టుకునేలా మంత్రోచ్చారణ ఇత్యాదులు ఉండేవి అన్నింటినీ రాజసపూజలుకానే చెప్పవచ్చు.
ఇక మూడవది, అత్యంత ప్రమాదకరమైన పూజా విధానం, ఆచరణయోగ్యం కాని తామస పూజా విధానం. క్షుద్రశక్తులను పూజించుట, చేతబడి, బాణామతి, ఇవన్నీ తామస పూజా విధానానికి చెందినవి. ఎదుటి వ్యక్తి యొక్క నాశనాన్ని తద్వారా తన ఉన్నతిని కోరుతూ, ఆ కోరికలు నెరవేరాలన్న దురుద్దేశ్యంతో ఆచరింపబడుతున్న పరమ నీచమైన విధానమే తామస పూజా విధానం. ఇటువంటి పూజా విధానం ఆచరించుటవలన ఎదుటి వ్యక్తి నాశనం అవుతాడనో లేక శాశ్వతంగా దూరమై (మృత్యుదేవత కౌగిలిలోనికి వెళ్లి) తన పదవికి లేదా వ్యాపారానికి అడ్డు తొలగుతాడని ఆశించడం కేవలం భ్రమ. ఏ వ్యకె్తైతే ఈ తామస పూజా విధానాన్ని ఆచరిస్తాడో, ఏ వ్యకె్తైతే తోటి వ్యక్తిలో నిక్షిప్తమై ఉన్న దైవాన్ని గుర్తించలేక ఆ వ్యక్తిని నాశనం చేయాలని మనసులో అనుకుంటాడో.. అటువంటి వ్యక్తి (తామస పూజను ఆచరించిన వ్యక్తి) భగవంతుని ఆగ్రహానికి గురై కొలది కాలంలోనే జీవితంలో పతనమవుతాడు.
కోటానుకోట్ల ప్రాణుల క్షేమాన్ని కోరి చేయబడేటటువంటి సాత్త్విక పూజ పరమ పవిత్రమైనది. అందుకే సాత్త్విక పూజా విధానం అత్యంత విశిష్టమైనది. కుల దేవతలను లేదా గ్రామ దేవతలను కొలిచే రాజస పూజా విధానం, సాత్త్విక పూజా విధానమంతటి విశిష్టత కలిగియుండకపోయినప్పటికీ, ఆచరణయోగ్యమైనదిగా పెద్దలచే నిర్దేశింపబడినది. ఇక మూడవ పూజా విధానంగా పరిగణింపబడుతున్న తామస పూజావిధానం అత్యంత ప్రమాదకరమైనది. పాపాలను మూట కట్టుకుని నరకయాతనను అనుభవించాల్సి వస్తుంది కనుక దీనిని ఆచరించకపోవడమే ఉత్తమమని పెద్దలు చెప్తారు.
===========================
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి. మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.
===========================
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003
మాటాట - 61 -- 09-04-2013
రాశిఫలం 09-04-2013
శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు ప్రారంభం
శ్రీశైలం, ఏప్రిల్ 8: శ్రీశైలం దేవస్థానంలో ఐదు రోజుల పాటు జరిగే ఉగాది మహోత్సవాలు సోమవారం ఉదయం 9.15 గంటలకు అంకురార్పన, యాగశాల ప్రవేశంతో ప్రారంభమయ్యాయి. శాస్త్రోత్తంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు వాహన సేవలు భ్రమరాంభికాదేవికి ప్రత్యేక అలంకరణ, రుద్ర, చండీ హోమాలు నిర్వహిస్తారు. ఉదయం వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయం వద్ద శివ సంకల్పం, గణపతి పూజ, చండీశ్వర పూజ నిర్వహించి ఉగాది ఉత్సవాలకు అంకురార్పన గావించారు. ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజు దేవస్థానం ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కర్నాటకలోని బెల్గాం సంకనట్టికి చెందిన జగత్ జ్యోతి బసవేశ్వర నాట్య సంఘ్ వారిచే బసవేశ్వర చరిత్ర కన్నడ నాటక ప్రదర్శన ఉంటుంది. ఉగాది ఉత్సవాల్లో పాల్గొనేందుకు కన్నడిగులు పెద్దసంఖ్యలో శ్రీశైలం చేరుకుంటున్నారు. (చిత్రం) శ్రీశైలంలో సోమవారం ఉగాది ఉత్సవాలకు అంకురార్పణ చేస్తున్న అర్చకులు
శ్రీశైల మల్లన్నకు భృంగివాహన సేవ
ఉగాది మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సోమవారం రాత్రి స్వామి, అమ్మవార్లకు విశేష అలంకారాల్లో పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు భృంగివాహన సేవ నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి భృంగివాహనంపై ఆశీనులు చేసి ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు మహాదుర్గ అలంకారంలో అలరించనున్నారు. మల్లన్న, భ్రమరాంబిక అమ్మవార్లకు కైలాసవాహన సేవ నిర్వహిస్తారు.
ప్రవాహంలా మల్లన్న భక్తులు
కర్నూలు, ఏప్రిల్ 8: నల్లమల అటవీమార్గం గుండా మల్లన్న భక్తులు ప్రవాహంలా శ్రీశైలం వైపు తరలివెళ్తున్నారు. తమ ఇంటి ఆడపడుచుగా భావించే భ్రమరాంబికమాతకు సారె ఇవ్వడానికి కన్నడిగులు పాదయాత్రగా వెళ్తున్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం గ్రామం వద్ద నల్లమలలోకి అడుగుపెట్టే కన్నడిగులు శ్రీశైలం వరకు అటవీ మార్గంలోనే వెళ్తుంటారు. వారి కోసం మహారాష్టక్రు చెందిన భక్తుల బృందం గత రెండు దశాబ్దాలుగా నాగలూటి దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కన్నడ భక్తులకు 3 రోజుల పాటు అన్నదానం చేసేందుకు ఏకంగా 12 టన్నుల బియ్యం, మూడు టన్నుల కందిపప్పు ఖర్చయింది. ఒక్క ఆదివారం మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు సుమారు 1.50 లక్షల విస్తరాకులను వినియోగించినట్లు తెలిపారు. ఇక అల్పాహారంగా సుమారు 7 టన్నుల ఉప్మా రవ్వను ఉపయోగించినట్లు పేర్కొన్నారు. ఇక ఇతర వంట సరుకులతో పాటు బెల్లం, చక్కెర వంటివి సైతం భారీ ఎత్తున వినియోగించి భక్తులకు అన్నదాన కార్యక్రమంలో ఏ లోటు లేకుండా చూస్తున్నారు. ఇప్పటికే శ్రీశైలం ఆలయ పరిసర ప్రాంతాల్లో సుమారు 3లక్షల మంది కన్నడిగులు ఉండగా మరో మూడు, నాలుగు లక్షల మంది ఉగాది నాటికి శ్రీగిరికి చేరుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, ఏప్రిల్ 8: తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పురస్కరించుకుని మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ అత్యంత వైభవంగా టిటిడి నిర్వహించనున్నది. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో సుమారు నాలుగుగంటల పాటు కొనసాగుతుంది. ఆనందనిలయం మొదలుకుని ఆలయంలో వున్న ఉపదేవాలయాలన్నీ కూడా ఈ సందర్భంగా సుగంధ ద్రవ్యాలతో కలగలిపిన పవిత్ర ద్రవ్యాలతో శుద్ధి చేస్తారు. ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది. సర్వదర్శనాన్ని మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుండి అనుమతించనున్నారు.
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఉగాది శుభాకాంక్షలు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్‌ఎన్ నరసింహన్ సోమవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు సంవత్సరాది విజయనామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవదేవుని వేడుకున్నానన్నారు.
ఏసిబికి చిక్కిన జైళ్ల అధికారి
నూజివీడు, ఏప్రిల్ 8: జైలులో అందించిన అనధికార సేవలకుగాను 15వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసిబి అధికారులు జైలు సూపరింటెండెంట్‌పై సోమవారం సాయంత్రం దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన చలమలశెట్టి శ్రీనివాసరావు ను అత్యాచార యత్నం కేసులో మార్చి 28న పోలీసులు అరెస్టు చేయగా కోర్టు రిమాండ్ విధించింది. అతడిని నూజివీడు జైలుకు తరలించారు. శ్రీనివాసరావుకు జైలు తిండి పడక అనారోగ్యం పాలయ్యాడు. యటి నుంచి ఆహారం తెచ్చుకునేలా జైలు సూపరింటెండెంట్ కుటుంబరాజుతో బేరమాడాడు. రెండు పర్యాయాలు 5వేల రూపాయల వంతున ఇచ్చాడు. తరువాత 80 బస్తాల సిమెంట్ కావాలని రాజు ఒత్తిడి చేశాడు. ఈలోగా ఈ నెల 4న శ్రీనివాసరావు బెయిల్‌పై విడుదలయ్యాడు. అప్పటి నుండి డబ్బులు కావాలని నిత్యం వేధిస్తుండటంతో ఒన్‌టైం సెటిల్‌మెంట్‌గా 15వేల రూపాయలు ఇచ్చిపుచ్చుకునేలా ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. ఈవిషయాన్ని శ్రీనివాసరావు అవినీతి నిరోధక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. సోమవారం సాయంత్రం ఆర్డీవో కార్యాలయం సమీపంలోని గాంధీబొమ్మ వద్ద ఉన్న బడ్డీలో జైలు సూపరింటెండెంట్ కుటుంబరాజు డబ్బులు తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నట్లు డిఎస్పీ వివరించారు. ఆయనను అరెస్టు చేశారు. ఈ దాడిలో ఎసిబి అధికారులు నాగరాజు, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
చిన్నారిపై అత్యాచారం కేసులో కామాంధుడికి పదేళ్ల జైలు
గుంటూరు , ఏప్రిల్ 8: మూడేళ్ల చిన్నారిపై పైశాచికంగా అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడికి పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ గుంటూరు ఒకటో అదనపు జిల్లా కోర్టు ఇన్‌చార్జ్, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి విరూపాక్ష దత్తాత్రేయ గౌడ సోమవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... గుంటూరు జిల్లా బాపట్లలోని రైలుపేటకు చెందిన ఉయ్యాల దాసు(26)కు అక్కడి రాజీవ్‌గాంధీ కాలనీలో ఓ భవన నిర్మాణ కార్మికుడితో పాత గొడవలున్నాయి. ఈనేపథ్యంలో 2011 అక్టోబర్ 7న కాలనీలో తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న ఆ కార్మికుడి మూడేళ్ల కుమార్తెను రాత్రి 10గంటల సమయంలో అపహరించుకెళ్లిన దాసు సమీపంలోని దిబ్బల్లోకి తీసుకెళ్లి చిన్నారిపై పైశాచికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రి ఒంటి గంట సమయంలో చిన్నారి ఏడుపు విన్న చుట్టుపక్కల వారు అక్కడకు వెళ్లగా వారిని చూసి దాసు పరారయ్యాడు. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాపట్ల సిఐ ఎండి మహబూబ్ బాషా నిందితుడు దాసుని అరెస్ట్ చేసి చార్జిషీటు దాఖలు చేశారు. దాసుపై నేరం రుజువుకావడంతో పదేళ్ల జైలుశిక్ష, 7,500 రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం
ప్రత్తిపాడు, ఏప్రిల్ 8: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 9మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆక్సిజన్ సిలిండర్లతో బెంగుళూరు నుండి కోల్‌కత్తా వెళుతున్న లారీని డ్రైవర్ నిద్రమత్తులో నడుపుతూ నిర్మాణంలో వున్న వంతెనను అతివేగంగా ఢీకొట్టటంతో డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం బంగారన్నపేటకు చెందిన 12 మంది ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని నాగభట్లవారిపాలేనికి బెల్లం తయారీ కూలి పనుల కోసం వచ్చి స్వగ్రామం వెళ్లడానికి లారీ ఎక్కారు. పిన్నింటి అప్పలనాయుడు(45), సత్తెమ్మ(40) అనే దంపతులు, లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు. అల్తి రాము(40) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
‘పార్కింగ్’ ట్రైలర్ విడుదల

రాజా, సోనూచోప్డా, అజయ్ ప్రధానపాత్రధారులుగా ఎ భూమిజ సినిమా పతాకంపై ఎ.వి.వి.నాయుడు దర్శకత్వంలో డి.రమేష్‌బాబు నిర్మించిన ‘పార్కింగ్’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్లు విడుదలయ్యాయి. దర్శకుడు వి.సాగర్ ట్రైలర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నాయుడు మాట్లాడుతూ యువతకు సందేశం అందించే విధంగా నిర్మించిన ఈ చిత్రంలో అందాన్ని చూసి ఆనందించినా, వీలైతే దాన్ని సొంతం చేసుకున్నా సంతోషంగా ఉంటుందని, అలా కాకుండా అక్రమ మార్గాలలో అందాన్ని సొంతం చేసుకోవాలని రావణాసురుడిలా మారవద్దన్న సందేశం ఈ చిత్రం ఇస్తుందని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేస్తామని ఆయన వివరించారు. కార్యక్రమంలో టి.ప్రసన్నకుమార్, ఎమ్మెస్ కోటారెడ్డి, డి.రమేష్‌బాబు చిత్రం గురించి వివరించారు. జాకీ, రావుశ్రీ, కాదంబరి కిరణ్‌కుమార్, ముంతాజ్, ఇషావర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు, పాటలు: కాంచనపల్లి రాజేంద్రబాబు, సంగీతం: బాబూశాస్ర్తీ, కెమెరా: శ్రీకర్‌బాబు, నిర్మాత: డి.రమేష్‌బాబు, దర్శకత్వం: ఎ.వి.వి.నాయుడు.
అంజలి అలా..పిన్ని ఇలా.. * ఎవరి మాటల్లో ఎంత నిజం?

‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ చిత్రంతో తెలుగువారికి దగ్గరైన తెలుగు నటి అంజలి. గతంలో ‘షాపింగ్ మాల్’ చిత్రంతో పరిచయమైన ఈ అమ్మడు మొదట అలీతో ఓ చిత్రంలో హీరోయిన్‌గా నటించినా సరైన గుర్తింపు రాకపోవడంతో కోలీవుడ్‌కు వెళ్లి గుర్తింపు తెచ్చుకుంది. మంచి నటిగా వారు గుర్తించాక, టాలీవుడ్ కూడా ఆమెకు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టింది. సీతమ్మవాకిట్లో చిత్రంతో లభించిన గుర్తింపుతో ప్రస్తుతం వరుస చిత్రాలు చేస్తూ అగ్ర కథానాయికగా మారడానికి కృషిచేస్తోంది. అయితే ఇంతలోనే చిన్న కుదుపు వచ్చింది. హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్న అంజలి చెన్నై మీడియాకు ఫోన్ చేసి తన బాధంతా ఏకరువుపెట్టింది. తాను సినిమాల్లో నటించి సంపాదించిన డబ్బంతా తన సవతి తల్లి భారతీదేవి, దర్శకుడు కళంజియం కలసి దోచేస్తున్నారని ఆరోపించింది. ఇన్నాళ్లూ తన వెంబడి వస్తున్న ఆమె తన తల్లికాదని, కేవలం డబ్బుకోసమే వారు తనను వాడుకుంటున్నారని చెబుతోంది. తా ను సంపాదించిన డబ్బంతా దోచుకోవడమే కాక, తన ప్రాణానికి హాని కూడా తలపెడుతూ తన వెనుక గోతులు తీస్తున్నారంటూ వా పోయింది. తాను సంపాదించిన డబ్బంతా ఇవ్వాలని నిత్యం వేధిస్తున్నారని పోలీసులకు తెలిపింది. వారిద్దరూ తనను వాడుకోవడానికి ఎటిఎమ్‌ను కాదని, ప్రస్తుతం వారికి దూరంగా హైదరాబాద్‌లోనే ఉంటున్నానని తెలిపింది. డబ్బు ఇవ్వనందుకు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తాను సంపాదించిందంతా వారు దోచేయడంతో ప్రస్తుతం తన వద్ద ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఎదురైందని చెప్పారు. ఈ విషయంపై చెన్నై పోలీసు కమిషనరేట్‌కు ఫిర్యాదు ఇవ్వడానికి సిద్ధమవుతున్నానని, తన స్వంత అన్న, అక్కలతో కూడా వారు మాట్లాడనివ్వడం లేదని అంజలి ఆరోపించింది. ఈ విషయంపై సవతి తల్లి భారతీదేవిని సంప్రదిస్తే అంజలి తన అక్క కూతురని, ఆమెను 15ఏళ్ల వయసులోనే చట్ట రీత్యా దత్తత తీసుకున్నామని తెలిపారు. కన్నతల్లి కంటే ఎక్కువగా అంజలిని చూసుకున్నానని, పార్టీలకు, పబ్బులకు వెళ్ళొద్దని మందలించిన మాట నిజమేనని, అయితే వేరే ఉద్దేశంతో ఎటువంటి ఇబ్బందులకు ఆమెను గురిచేయలేదని తెలిపారు. షాపింగ్‌మాల్ విజయవంతమయ్యాక అంజలి ప్రవర్తనలో మార్పువచ్చిందని, మొదట్లో ఎంతో ప్రేమగా చూసేదని, ఇలా ఎందుకు మారిందో, ఆమె వెనుక ఎవరున్నారో తనకు తెలియదని ఆమె చెప్పుకొచ్చారు. కేవలం 20 లక్షలు మాత్రమే పారితోషికంగా తీసుకునే అంజలికి, తాము దోచుకోవడానికి కోట్లు ఎక్కడినుంచి వచ్చాయని ఆమె ప్రశ్నించారు. తాను తప్పుచేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని, అంజలి తల్లి ప్రస్తుతం గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తుందని, అక్కాచెల్లెళ్లమిద్దరం ఇప్పటికీ చాలా సఖ్యతగా మెలుగుతామని ఆమె వివరించారు. ఈ కథ ఇలా ఉండగా, సినీ దర్శకుడు కళంజియం తనపై అంజలి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, తన పరువుకు భంగం కలిగేలా మాట్లాడారని ఆరోపిస్తూ చెన్నై పోలీసులకు ఫిర్యాదుచేశారు. అంజలిని మొదటిసారిగా తమిళ తెరకు పరిచయం చేసింది తానేనని, నిరంతరం ఆమె ఎదుగుదలకోసమే తాను ప్రయత్నించానే తప్ప మరో ఉద్దేశం ఏనాడూ లేదని, కేవలం కుటుంబ స్నేహితులమే తప్ప మరేంలేదని ఆయన వివరించారు. మొత్తానికి అంజలి రేకెత్తించిన ఈ సమస్య ఎటువైపు వెళ్లనుందో కాలమే తేల్చాలి. గల్ఫ్‌లో ఉన్న ఆమె తల్లి తిరిగివస్తే కానీ ఈ ముడి వీడదేమో?!
‘జననం’ ప్రారంభం

నూతన నిర్మాణ సంస్థ సాయి వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఎల్.మణిగంజి దర్శకత్వంలో నూతన నిర్మాత ఎం.ఎస్.రాజు నిర్మిస్తున్న ‘జననం’ చిత్రం ప్రారంభమైంది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో మంగళవారం ఉదయం డి.ఎస్.రావు క్లాప్ ఇవ్వగా బాబూమోహన్ కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.సాగర్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ప్రేమ రెండు విధాలుగా ఎలా ఉంటుంది అనే కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, ప్రేమ త్యాగంతో కూడుకుని ఉండాలని చెబుతూ అమ్మ ప్రేమకు, ప్రియురాలి ప్రేమకు గల తేడాను కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 12నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి పాటల చిత్రీకరణ చేస్తామని ఆయన అన్నారు. భువన్, ప్రియంత్, నితిన్ విడెమ్, గీతాభగత్, శ్రావణి, పావని, నరేష్, బాబూమోహన్, వైజాగ్ ప్రసాద్, మాధవి, తెలంగాణ శకుంతల, ఉత్తేజ్, అంబటి శ్రీను, ఫిష్ వెంకట్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎస్.ఎస్.తిరు, సంగీతం: తొగరాణి, ఎడిటింగ్: శివ, నిర్మాత: ఎం.ఎస్.రాజు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎల్.మణిగంజి.
‘యాక్షన్ హీరోగా నిరూపించుకుంటా’

గతంలో తాను నటించిన శ్రీరామ్ చిత్రంలో పోలీస్ ఉద్యోగంకోసం పోరాడితే జైశ్రీరామ్ చిత్రంలో ఎసిపి శ్రీరామ్ శ్రీనివాస్‌గా ప్రజలకోసం పోరాడతానని, ఎసిపిగా తన కెరీర్‌లో తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రతీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుని చేశానని కథానాయకుడు ఉదయ్‌కిరణ్ తెలిపారు. ఫైవ్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బాలాజీ ఎన్.సాయి దర్శకత్వంలో తేళ్ల రమేష్, ఎన్.సిహెచ్.రాజేష్ నిర్మిస్తున్న జైశ్రీరామ్ చిత్రం ఈనెల 11న విడుదలవుతున్న సందర్భంగా కథానాయకుడు ఉదయ్‌కిరణ్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మరిన్ని సంగతులు వివరిస్తూ తన 13ఏళ్ల సినిమా ప్రయాణంలో ఓ మైలురాయిలా ఈ చిత్రం నిలుస్తుందని, పూర్తి యాక్షన్ హీరోగా నిరూపించుకునే అవకాశం ఈ చిత్రం ద్వారా దొరికిందని తెలిపారు. షూటింగ్ చేయటానికి ముందు అనేక మంది పోలీస్ అధికారుల సలహాలు తీసుకున్నానని, ఆరు బాంబు బ్లాస్ట్‌ల మధ్య మోటార్ సైకిల్‌తో ప్రయాణించడం ఈ చిత్రంలో హైలెట్‌గా నిలుస్తుందని, ఇప్పటికే పాటలకు, ట్రైలర్స్‌కు మంచి స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. దర్శకుడు బాలాజీ పనితనం, ఫైట్ మాస్టర్ డ్రాగన్‌ప్రకాష్ డిజైన్ చేసిన ఫైట్స్ సరికొత్తగా ఉంటాయని, చిన్ననాటి నుండి యాక్షన్ సినిమాలంటే ఇష్టం ఉండడంవల్ల ఈ చిత్రంలో కూడా తాను నటించడం సులువైందని ఆయన అన్నారు. 13ఏళ్ల సినీ ప్రయాణంలో జయం, అపజయం అనేది మన చేతుల్లో లేదని, మొదటి నుంచి తన పనిని తాను ప్రేమిస్తూ వచ్చానని, అయితే సినిమాను మార్కెట్ చేసుకోవడం తనకు తెలియనిపని అని, ప్రస్తుతం ఉన్న హీరోలతో పోటీ పడాలంటే సినిమాను వ్యాపార వస్తువుగా కూడా అవగాహన చేసుకునే తత్వం ఉండాలని ఆయన అన్నారు. ఉగాది రోజున విడుదల కానున్న ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని, త్వరలో సుధీర్‌వర్మ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ కమర్షియల్ సినిమాలో నటించనున్నానని ఆయన వివరించారు.
‘బలుపు’ చూపిస్తాడా?

తన వరస పరాజయాలతో మాస్‌రాజా రవితేజ బెంబేలెత్తిపోతున్నాడు. ‘వీర’ నుండి నిన్న మొన్నటి ‘దరువు’ వరకు అన్నీ ఫ్లాపులే కావడం విశేషం. ఇప్పుడు హిట్టు అనేది రవితేజకు తప్పని సరైంది. ఇక తన ‘బలుపు’ చూపించక తప్పదన్న నిర్ణయానికొచ్చాడు రవితేజ. ఇప్పుడు అదే పనిలో వున్నాడు. హిట్టు లభించకపోతే ఇక ఇతడి ఆట కట్టే అంటున్నారు సినీ వర్గాలు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ‘బలుపు’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో రవితేజ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించబోతున్నాడట. ప్రసాద్ వి, పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి రవితేజ ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారట. ప్రత్యేక శ్రద్ధ వహించి ఎంతో కష్టపడుతున్నాడని యూనిట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ చిత్రం పాటలను మే 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరో పక్క నిర్మాణానంతర పనుల స్పీడును సైతం పెంచారు. అన్ని పనులు పూర్తి చేసి అదే నెల 24న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా శృతిహాసన్, అంజలి నటిస్తున్నారు. ఈ ఇద్దరు భామలతో రవితేజ పండించే వినోదం అందర్నీ ఆకట్టుకునే స్థాయిలో వుంటుందని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. చూద్దాం..ఈ సినిమాతోనైనా రవితేజ తన ‘బలుపు’ను చూపిస్తాడో..లేదో!!
కష్టానికి తగ్గ ఫలితం : ఎన్‌టిఆర్

దర్శకుడు శ్రీనువైట్ల సినిమాలు అంటేనే పూర్తి హాస్యంతో నిండి వుంటాయన్న నమ్మకం ప్రేక్షకులకు వుందని, ఆయన చిత్రాలు చూస్తుంటే జంధ్యాల చిత్రాలు గుర్తొస్తాయని ఎన్టీఆర్ తెలిపారు. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన బాద్‌షా చిత్రానికి సంబంధించి విజయోత్సవ వేడుక హైదరాబాద్‌లో జరిగిన సందర్భంలో పై మాటలు ఎన్టీఆర్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ బ్లాక్‌బస్టర్ కొట్టాలన్నా గణేష్ మాటలు నేడు నిజమయ్యాయని, ఈరోజు ఇలాగే ఆగిపోతే బాగుండుననిపిస్తుందని, తన కెరీర్‌లో ఇంత పెద్ద విజయాన్ని అందజేసినందుకు దర్శకుడు శ్రీనువైట్లకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన తెలిపారు. ఈ చిత్ర కథ విన్నప్పుడే బాగా వుంటుందని అనిపించిందని, షూటింగ్ సమయంలో తన నటనే కాక తాను వేసుకునే కాస్ట్యూమ్స్, చెప్పే డైలాగులు, వేసే స్టెప్పులు ఆచితూచి శ్రీను పరిశీలించారని, ఎన్టీఆర్ పోషించిన జస్టిస్ చౌదరి పాత్ర వేయమన్నప్పుడు మొదట చెమటలు పట్టాయని, ఇప్పుడు ప్రేక్షకులు ఆ పాత్రను ఆస్వాదిస్తున్నందుకు సంతోషంగా వుందని, ఇంత పెద్ద విజయం అందించిన రాష్ట్ర ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన వివరించారు. అందరూ కష్టపడి పనిచేయడంవల్లనే ఇంత పెద్ద విజయాన్ని నమోదుచేసుకున్నామని, గణేష్ బ్లాక్‌బస్టర్ కొట్టాలని చెప్పే ఈ విజయాన్ని సాధించారని, ఆయన అన్ని విధాలుగా సహకరించడంవల్లే ఇంత పెద్ద విజయాన్ని అందుకున్నామని దర్శకుడు శ్రీనువైట్ల చెప్పారు. ఎన్టీఆర్ ఒక సంవత్సరంపాటు తనతోనే ప్రయాణం చేశారని, ఏ ఇగో లేకుండా ఆయన తనతో కలిసిపోబట్టే బాద్‌షా ఇంత చక్కగా తీయగలిగానని, ముఖ్యంగా స్విట్జర్లాండ్‌లో చేసిన పాట సమయంలో చాలా కష్టపడ్డామని ఆయన వివరించారు. అందంగా ఓ అద్భుతం ఆవిష్కృతమైందని, తానాసించిన విధంగా ఎన్టీఆర్ కుటుంబానికి ఓ బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించాలన్న కోరిక బాద్‌షాతో తీరిందని నిర్మాత గణేష్ తెలిపారు. ఈ చిత్రంకోసం ఎన్టీఆర్ తన పర్సనల్ లైఫ్‌ను కూడా త్యాగంచేసి, ఆదివారాలు కూడా పనిచేశారని, ఇంత మంచి చిత్రాన్ని అందించినందుకు ఓ రకంగా గర్వంగా ఉందని, భవిష్యత్‌లో కూడా ఇలాంటి చిత్రాలనే నిర్మించే ప్రయత్నం చేస్తానని ఆయన వివరించారు. కార్యక్రమంలో గోపీమోహన్, కాజల్, ఆచంట గోపీనాథ్, బి.ఎ.రాజు, విశ్వ, హరి, ప్రవీణ్, సుధాకర్, ప్రకాష్, విజయ్, రామారావు, శంకర్, రామజోగయ్యశాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు.
26న ‘గ్రీకువీరుడు’

కింగ్ నాగార్జున కథానాయకుడుగా కామాక్షి మూవీస్ పతాకంపై నిర్మించిన గ్రీకువీరుడు చిత్రం ఈనెల 26న విడుదలకు సిద్ధమవుతోంది. కె.దశరథ్ దర్శకత్వంలో డి.శివప్రసాదరెడ్డి నిర్మించిన ఈ చిత్రం గూర్చి నిర్మాత మాట్లాడుతూ ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని, త్వరలో ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహించనున్నామని తెలిపారు. వేసవి కానుకగా ఈనెల 26న విడుదలవుతున్న ఈ చిత్రంలో నాగార్జున లుక్స్, గెటప్, స్టైల్ సరికొత్తగా ఉంటాయని, అభిమానులకే కాక అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని ఆయన తెలిపారు. నయనతార, మీరాచోప్రా, కె.విశ్వనాథ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాస్, శరత్‌బాబు, నాగబాబు, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు, అలీ, వేణుమాధవ్, రఘుబాబు, కాశీవిశ్వనాథ్, వెనె్నలకిషోర్, నాగినీడు, సుప్రీత్, అశోక్‌కుమార్, భరత్‌రెడ్డి, సంజయ్ స్వరూప్, తా.రమేష్, సారిక రామచంద్రరావు, గీతాంజలి, సుధ, జయలక్ష్మి, జయవాణి, లహరి, ఇందు ఆనంద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అనిల్‌భండారి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం: థమన్ ఎస్.ఎస్, నిర్మాత: డి.శివప్రసాద్‌రెడ్డి, కథ, మాటలు, దర్శకత్వం: కె.దశరథ్.
'vijaya' raasi phalitalu
బంద్ ప్రశాంతం.. సంపూర్ణం
విశాఖపట్నం, ఏప్రిల్ 9: విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని కోరుతూ విపక్షాలు మంగళవారం నిర్వహించిన బంద్ సంపూర్ణంగా జరిగింది చిన్న,చిన్న సంఘటనలు మినహా నగరంలో అంతటా బంద్ ప్రశాంతంగా సాగింది. ఆర్టీసీకాంప్లెక్స్, జగదాంబ జంక్షన్ల వద్ద ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలను అడ్డుకున్నారు. జాతీయ రహదారి మద్దిలపాలెం, గురుద్వారా, మర్రిపాలెం, ఎన్‌ఏడి జంక్షన్, హనుమంతువాక జంక్షన్, కారుషెడ్, మధురవాడ ప్రాంతాల వద్ద ఆందోళనకారులు రోడ్డుపైన బైఠాయించడం, రాస్తారోకలు జరపడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. దుకాణాలు, వాణిజ్యసముదాయాలు చాలాచోట్ల స్వచ్చందంగానే మూడపడ్డాయి.
భారీగా అరెస్టులు
బంద్‌లో పాల్గొన్న వామపక్షాలకు చెందిన నేతలు, కార్యకర్తలు దాదాపు 400 మందిని పోలీసులు వేర్వేరుచోట్ల అరెస్టు చేసి ఆయా పోలీసు స్టేషన్లకు తరలించారు. ఆ తరువాత వీరందర్ని విడిచిపెట్టారు.
మూతపడిన స్కూళ్ళు, కాలేజీలు
బంద్ కారణంగా ముందుగానే ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీలు, పాఠశాలలకు సెలవుప్రకటించారు. సిటీ సర్వీసులు నిలిచిపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు బోసిపోయాయి. కొన్ని కార్యాలయాల్లో ఉద్యోగులు పల్చబడ్డారు. కలెక్టరేట్, కెజిహెచ్, జిల్లాప్రజాపరిషత్, ప్రణాళిక విభాగం, ఈపిడిసిఎల్, పశుసంవర్ధక శాఖ, జిసిసి, డిసిసి బ్యాంకు, ఆర్టీసీ, రవాణాశాఖల్లో పలు విభాగాల్లో ఉద్యోగుల శాతం తగ్గింది. దీంతో ఇవన్నీ ఖాళీకా దర్శనమిచ్చాయి.
మధ్యాహ్నం నుంచి కనిపించని ప్రభావం
మంగళవారం వేకువజాము నుంచి రోడ్డెక్కిన వామపక్షాల నేతలు మధ్యాహ్నాం ఒంటి గంట వరకు బంద్‌ను విజయవంతంగా నిర్వహించగలిగారు. ఆ తరువాత బంద్ ప్రభావం మధ్యాహ్నాం నుంచి ఎక్కడా కనిపించలేదు. సిటీ సర్వీసులు యథావిధిగా నడిచాయి. దుకాణాలు తెరుచుకున్నాయి.
సిపిఐ ఆధ్వర్యంలో
మంగళవారం విశాఖ నగరంలో నిర్వహించిన బంద్ సంపూర్ణమైంది. పలుచోట్ల ప్రదర్శనలు, రాస్తారోకలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉదయం ఐదు గంటలకే సిపిఐ జిల్లా కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి సారధ్యంలో నాయకులు, కార్యకర్తలు మద్దిలపాలెం బస్ డిపో వద్దకు చేరుకుని బస్సుల రాకపోకలను నిలువరించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. మద్దిలపాలెం జంక్షన్ నుంచి ఆటోమోటివ్ వరకు వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ప్రదర్శనలో సిపిఐ, నాయకులు ఎ.విమల, సిహెచ్.రాఘవేంద్రరావు, పైల ఈశ్వరరావు, జి.వామనమూర్తి, పడాల రమణ, సిపిఎం నాయకులు సిహెచ్, నర్సింగరావు, గంగారావు, కుమార్, బిజెపి నాయకులు ఎమ్.నాగేంద్ర, పివిఎన్ మాధవ్, ఎస్‌యుసిపిఐ నాయకులు సురేష్‌కుమార్, వైఎస్‌ఆర్‌సిపి నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. అనంతరం సిపిఐ కార్యాలయం అల్లిపురం నుంచి అల్లిపురం మార్కెట్, సింహాలదేముడు జంక్షన్, లీలామహల్ మీదుగా జగదాంబ వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తితో పాటు నాయకులు ఎ.విమల, సిహెచ్.రాఘవేంద్రరావు, కాసులరెడ్డి, కోట సత్తిబాబులు పాల్గొన్నారు. రోడ్డుకిరువైపులా తెరచిన షాపులను మూయించి ఆందోళన నిర్వహించారు. జగదాంబ జంక్షన్‌లో మానవహారం నిర్వహించిన అనంతరం డాబాగార్డెన్స్ మీదుగా ఆర్టీసీకాంప్లెక్స్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీకాంప్లెక్స్ అవుట్‌గేట్ వద్ద బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు.
దీంతో అప్పటికే అక్కడి మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని త్రి టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తితో పాటు ఎ.విమల, జెడి నాయుడు, శివప్రసాద్, ప్రశాంత్, గురుమూర్తి, గురునాధరావు, వెంకటేశ్వరరావు, పిఏ రాజు, ఇబ్రహీమ్, సూరిబాబు, వజ్రం, అప్పన్నలు ఉన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ విద్యుత్‌చార్జీల పెంపును నిరసిస్తూ వామపక్ష పార్టీలు రాష్టవ్య్రాప్తంగా నేడు రాష్ట్ర బంద్ చేస్తుంటే ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించి ఆందోళన చేస్తున్న నాయకులను అరెస్టు చేయిస్తుందని విమర్శించారు. విద్యుత్ చార్జీలు తగ్గించేంతవరకు తమ ఆందోళన ఆగదని, దశలవారీగా వివిధ రూపాల్లో ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చేందుకు పోరాటాలు నిర్వహిస్తామన్నారు. 2013-14 సంవత్సరానికి 6334 కోట్ల రూపాయలు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపైన కాంగ్రెస్ ప్రభుత్వం భారం మోపిందన్నారు. చార్జీల పెంపునకు నియంత్రణ ఉండాలని అది నేడు లేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇంధన సర్ధుబాటు చార్జీలు, కోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, పెంచిన విద్యుత్‌చార్జీలు పూర్తిగా రద్దు అయినంతవరకు ప్రజలను ఐక్యం చేసి ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.
సమస్యలపై కస్తూరిబా విద్యార్థినుల పాదయాత్ర
* ఆర్డీవోకు బాలికల వినతి
నర్సీపట్నం, ఏప్రిల్ 9: ప్రతి రోజు సమస్యలు ఎదుర్కొంటున్న వసతి గృహ విద్యార్థినులు చివరకు పోరుబాట పట్టారు. ప్రతిరోజు తాము తింటున్న అన్నంలో పురుగులున్నా ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోకపోవడం, సరైన భోజనం పెట్టకపోవడంతో కస్తూరిబా విద్యార్థినులు చివరకు సుమారు 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఆర్డీవోకు సమస్యను వివరించి పరిష్కరించాలని కన్నీళ్ళతో వేడుకున్నారు. మండలంలోని వేములపూడిలో కస్తూరిబా పాఠశాల ఉంది. సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు సుమారు 70 మంది విద్యార్థినులు నిద్ర లేచి తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేయాలనే లక్ష్యంతో అందరూ ఒక్కమాటిపైకి వచ్చి నడక ప్రారంభించారు. ఈ విషయం స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మికి తెలియడంతో ఆమె అప్రమత్తమైంది. దారిలో కనిపించిన విద్యార్థులను తిరిగి కస్తూరిబా పాఠశాలకు పంపించే ప్రయత్నం చేశారు. అప్పటికీ కొందరు విద్యార్థినులు మొండికేసి శ్రీరాంపురం, దుగ్గాడ, బైపురెడ్డిపాలెం మీదుగా బలిఘట్టం చేరుకున్నారు. దారిపొడవునా తమకు జరుగుతున్న అన్యాయాలను నినాదాల చేసుకుంటూ వచ్చారు. బలిఘట్టంలో సి.పి.ఐ. నాయకులు రుత్తల బుజ్జి, గ్రామ నాయకుడు గవిరెడ్డి రమణ విద్యార్థునులను ఎక్కడకు వెళ్తున్నారని ప్రశ్నించగా, పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నామని విద్యార్థ్ధినులు చెప్పారు. అక్కడ వారిద్దరూ వ్యాన్‌ను పురమాయించి విద్యార్థినులను ఆర్డీవో వసంతరాయుడు వద్దకు తీసుకువచ్చారు. ఆర్డీవో కార్యాలయం వద్ద విద్యార్థినులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరవు పెడుతూ నినాదాలు చేశారు. చివరకు ఆర్డీవో బయటకు వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. తాము రోజూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, అన్నంలో పురుగులు వస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, మీరైనా మాకు న్యాయం చేయాలని విద్యార్థినులు ఆర్డీవోను కన్నీళ్ళతో వేడుకున్నారు. అక్కడకు చేరుకున్న ప్రత్యేకాధికారి విజయలక్ష్మిని ఆర్డీవో విద్యార్థినుల పట్ల జాగ్రత్తగా ఉండాలని మందలించారు. వారి సమస్యలు ఎదుర్కొకపోతే ఇంత దూరం నడుచుకుంటూ ఎందుకు వస్తారని విజయలక్ష్మిని నిలదీశారు. అనంతరం ఆర్డీవో విద్యార్థినులతో మాట్లాడుతూ తాను కస్తూరిబా పాఠశాలకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. అనంతరం విద్యార్థినులను స్కూల్‌కు తీసుకువెళ్ళమని ఆర్డీవో ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్దత
* మంత్రి బాలరాజు
కోటవురట్ల, ఏప్రిల్ 9: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు మొట్టమొదట చట్టబద్దత కల్పించారని గిరిజన సంక్షేమశాఖా మంత్రి పసుపులేటి బాలరాజు స్పష్టం చేశారు. సబ్‌ప్లాన్‌పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన కళాజాత బృందం సా ంస్కృతిక ప్రదర్శనను మంగళవారం మండలం పాములవాక ఎస్సీ కాలనీలో మంత్రి బాలరాజు ప్రారంభించారు. అనంతరం అవగాహన సదస్సులో మంత్రి బాలరాజు మాట్లాడుతూ స్వర్గీయ ఇందిరాగాంధీ 1975 ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను ప్రవేశపెట్టారన్నారు. అప్పటి నుంచి అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు, పాలకులు ఉప ప్రణాళికను పట్టించుకోకుండా నిర్లక్ష్య ం చేస్తూ వచ్చాయన్నారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీలకు సరైన న్యాయం జరగడం లేదన్నారు. వారి కోసం కేటాయించిన నిధులు దారిమళ్ళేవన్నారు. ఈ లోపాలు సరిదిద్ది వారికి కేటాయించిన నిధులను వారి కోసమే ఖర్చు చేసే విధంగా ముఖ్యమంత్రి సబ్‌ప్లాన్‌పై చట్టబద్దత చేశారన్నారు. చట్టం వలన బడ్జెట్‌లో 22 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికే కేటాయిస్తారన్నారు. ఈనిధులతో ఎస్సీ. ఎస్టీ అవాసిత ప్రాంతాల్లో వౌలిక సదుపాయాలు కల్పిస్తారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు విద్య, వైద్యం కోసం నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ డి.వి.ఎస్.రాజు మాట్లాడుతూ సబ్‌ప్లాన్ కింద ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి 1,250 కోట్ల రూపాయ లు ఖర్చు చేస్తారన్నారు. సబ్‌ప్లాన్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి ఎస్సీ, ఎస్టీల్లో అవగాహన కల్పించేందుకు కళాజాత బృందాల ద్వారా సాంస్కృతిక ప్రదర్శనలు తొలిసారి మండలంలో నిర్వహిస్తారన్నారు. ప్రతిపక్ష పార్టీలు సబ్‌ప్లాన్ చట్టబద్దతను వ్యతిరేకించడం విచారకరమన్నారు. ఈకార్యక్రమంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ నర్సింహారావు, నర్సీపట్నం ఆర్డీవో వసంతరాయుడు, సాంఘిక సంక్షేమ శాఖ డి.డి. శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారి రామారావు, ఎడీవో కృష్ణారావు, తహశీల్దార్ లక్ష్మణమూర్తి, ఐ.సి.డి. ఎస్.పి. ఓ. అనంతలక్ష్మి, మాజీ సర్పంచ్ కిల్లాడ శ్రీనివాస్, కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్‌ప్రసాద్ పాల్గొన్నారు.
లక్ష్యానికి చేరువలో తాండవ క్రషింగ్
పాయకరావుపేట, ఏప్రిల్ 9: 2012-13 క్రషింగ్ సీజనుకు తాండవ చక్కెర కర్మాగారంలో మంగళవా రం నాటికి 1,50,920 ట న్నులు చెరకు క్రషింగ్ జరిగినట్లు మేనేజింగ్ డైరక్టర్ వి.ఎస్.నాయుడు తెలిపా రు. దీనిద్వారా 1,40,600 క్వింటాళ్ల పంచదార బ స్తాలు ఉత్పత్తి సాధించామన్నారు. 9.61 శాతం రికవరీ సాధించామన్నారు. ఈ ఏడాది రెండు లక్షల టన్నులు చెరకు క్రషింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, లక్ష్యానికి చేరువలో ఉన్నామన్నారు. మార్చి నెలాఖరు నాటికి చెరకు రవాణా చేసిన రైతులకు టన్నుకు 1,832.60 రూపాయలు చొప్పున 10.11 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. వచ్చే సీజనుకు ఇప్పటికే 2,731 హెక్టార్లలో చెరకు నాట్లు జరిగాయని మేనేజింగ్ డైరెక్టర్ నాయుడు తెలిపారు.
గిరిజన యువతిపై అత్యాచారం
పాడేరు, ఏప్రిల్ 9: గిరిజన యువతిని అపహరించి, అత్యాచారానికి పాల్పడిన ఓ ప్రబుద్ధుని ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాడేరు పోలీసుల కధనం ప్రకారం పెదబయలు మండలం లింగేటి పంచాయతీ మఠంవీధికి చెందిన 20 ఏళ్ళ యువతి పాతపాడేరులో నివాసం ఉంటున్న తన మామగారి ఇంటికి ఇటీవల వచ్చింది. బావ గోపాలకృష్ణ గతనెల 22వ తేదీన మీ అక్క రమ్మంటున్నదంటూ చెప్పి ఆమెను ఆటోలో తీసుకువెళ్లాడు. పాతపాడేరు నుంచి బంట్రోతుపుట్టు గ్రామానికి ఆమెను తీసుకువెళ్లిన ప్రబుద్ధుడు ఒక ఇంటిలో ఆమెను బందించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికి చెప్పినా చంపుతానని బెదిరించడంతో బాధిత యువతి చాలారోజులు తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టినట్టు తెలుస్తోంది. ఈవిషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఈనెల 8వతేదీ సోమవారం రాత్రి పాడేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి అపహరణ, అత్యాచారం నేరాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.ఐ. జి.అప్పన్న మంగళవారం రాత్రి విలేఖరులకు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన చెప్పారు.
ఎఎన్‌ఎంకు లైంగిక వేధింపులు
పాడేరు, ఏప్రిల్ 9: తనను లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఎ.ఎన్.ఎం. పాడేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలం మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ఎన్ .ప్రకాశరావు కిందిస్థాయి ఉద్యోగి చెండా చంద్రమ్మ అనే ఎఎన్‌ఎం.ను గత కొంతకాలంగా లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నట్టు ఫిర్యాదు చేశారు. తన దారికి రాకపోతే పై అధికారులకు ఫిర్యాదు చేసి ఉద్యోగం చేయకుండా చేస్తానంటూ తనను బెదిరిస్తున్నట్టు చంద్రమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. లైంగిక వేధింపుల నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ ఆమె పోలీసులను అభ్యర్థించింది. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్.ఐ. జి.అప్పన్న మంగళవారం విలేఖరులకు తెలిపారు.
లొంగిపోయిన మావోయిస్టు
సీలేరు, ఏప్రిల్ 9: మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ అక్కిరాజు అలియాస్ హరిగోపాల్‌కు గన్‌మాన్‌గా వ్యవహరిస్తున్న సందీప్‌మాడి అలియాస్ రాజు మంగళవారం మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ అఖిలేశ్వర్‌సింగ్ ఎదుట లొంగిపోయారు. ఎస్పీ విలేఖరులకు అందించిన వివరాలిలా ఉన్నాయి. మల్కన్‌గిరి జిల్లా మోటు పోలీస్ స్టేషన్ పరిధిలో మంచిపురానికి చెందిన సందీప్‌మాడి బలిమెల ఏరియా కమిటీ కార్యదర్శి అశోక్‌ద్వారా 2006లో మావోయిస్టు పార్టీలో చేరాడు. 2007లో జిల్లాలో కోరుకొండ ఏరియా కమిటీ మావోయిస్టు దళంలో శిక్షణ పొందాడు. 2008లో నయాగడ్ ఆయుధకర్మాగారంపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకుపోయిన సంఘటన, ఉదయగిరి జైల్‌పై దాడి, కలిమెల,పోడుగెట్ట ఎదురుకాల్పులు ఘటనలో కీలకపాత్ర పోషించినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో చింతపల్లి, పెదబయలు, ముంచింగ్‌పుట్ ప్రాంతాల్లో కోరుకొండ ఏరియాతో కలిసి అనేక విధ్వంసాలకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. సందీప్ కుటుంబ సభ్యులు పరిస్థితులు అనుకూలించక వారు అనారోగ్యంతో ఉండడంతో వారి ఒత్తిడి మేరకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం కీలక నేత రామకృష్ణ గన్‌మెన్‌గా వ్యవహరిస్తున్నాడని, ఈయన గన్‌మెన్‌గా వ్యవహరించడానికి ప్రత్యేక శిక్షణ పొందాడని ఎస్పీ తెలిపారు.
ముగింపుదశలో ‘అంతకుముందు.. ఆ తరువాత’

గతంలో ‘అలామొదలైంది’ చిత్రం నిర్మించిన శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ‘అంతకుముందు.. ఆ తరువాత’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తికావస్తోంది. దామోదరప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, ఈషా జంటగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ తమ గత చిత్రాల స్థాయిలోనే ఈ చిత్రం ఉంటుందని, దర్శకుడు చెప్పిన కథలో కొత్తదనం ఉండడంతో తెరపై దాన్ని సరికొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారని, మే నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. నేటి యువత ప్రేమించడం, ఆ ప్రేమను నిలబెట్టుకోవడంలో ఎదురవుతున్న అయోమయాలు ఈ చిత్రంలో కనపడతాయని, అమ్మాయి అబ్బాయి వాళ్ళ ప్రేమను ప్రకటించుకున్న క్షణంనుంచి శాశ్వతంగా కలిసి బతకడానికి మధ్య ఓ విచిత్రమైన పరిస్థితి ఉంటుందని, ఆ సమయంలో వారు తీసుకున్న నిర్ణయం సరైనదేనా? తానెంచుకున్న వ్యక్తి సరైన వ్యక్తేనా అన్న అనుమానం, కంగారు, భయం కూడా కలుగుతుంటాయని, ఆ పరిస్థితిని తెలియజెప్పే ఓ ఉద్వేగమైన కథాంశంతో డ్రామా, రొమాన్స్, హాస్యం వంటి ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెలిపారు. రవిబాబు, రావురమేష్, ఉప్పలపాటి నారాయణరావు, అవసరాల శ్రీనివాస్, తా.రమేష్, కళ్యాణిమాలిక్, పమ్మిసాయి, సోహైల్, కె.ఎల్.ప్రసాద్, రోహిణి, మధుబాల, ప్రగతి, ఝాన్సీ నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: సిరివెనె్నల, అనంత్‌శ్రీరామ్, సంగీతం: కళ్యాణి కోడూరి, కెమెరా: పి.జి.వింద, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్‌రెడ్డి వి. నిర్మాత: కె.ఎల్.దామోదర్‌ప్రసాద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.
పరిశ్రమకు కొత్తనీరు వస్తుంది

సినిమా పేరులో వున్న ‘జై, శ్రీ’ అన్న అక్షరాలు విజయానికి గుర్తులని, అదే విధంగా విజయనామ సంవత్సరంలో తొలిసారిగా సోలో చిత్రంగా విడుదలవుతున్న ‘జై శ్రీరామ్’ చిత్రం అందరికీ విజయాన్ని అందించాలని, బ్లాక్‌బస్టర్‌లా కాకుండా నిండు కుండలా ప్రేక్షకాదరణ పొందుతూ సిరులు కురిపించాలని, నిర్మాతలు మళ్లీమళ్లీ ఇలాంటి చిత్రాలు నిర్మించాలని దర్శకరత్న దాసరి నారాయణరావు తెలిపారు. ఫైవ్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బాలాజీ ఎన్. సాయి దర్శకత్వంలో తేళ్ల రమేష్, ఎన్. సిహెచ్.రాజేష్ నిర్మించిన ‘జైశ్రీరామ్’ చిత్రానికి సంబంధించిన పాటలకు ప్లాటినమ్ డిస్క్ లభించిన సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో పలు విషయాలు దాసరి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలోకి కొత్త నీరు వస్తుందని, మంచి మంచి టెక్నీషియన్లు, నటులు వస్తున్నారని, వీరందరూ వారికి లభించిన అవకాశాలను నిలబెట్టుకోవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. 287 థియేటర్లలో ఈ ఉగాదికి విడుదలవుతున్న ఈ చిత్రాన్ని మల్టీ మీడియా సంస్థ పంపిణీ చేస్తోందని, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లు సహకరిస్తేనే చిన్న సినిమాలు విజయం పొందుతాయని ఆయన అన్నారు. బాలాజీ గతంలో మంచి చిత్రాలను తీశాడని, ఈ చిత్రం కూడా అదే విధంగా తీసి ఉంటాడన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తంచేశారు. ఈ ఉగాదికి కొత్త ఉదయ్‌కిరణ్ మళ్లీ పుడుతున్నాడని, లవ్ ఫీల్‌లో హోలీగా చూపే హీరో గా కనిపిస్తాడని, మళ్లీ ఓ కెరీర్ అతని జీవితంలో ప్రారంభమైందని, ఈ చిత్ర నిర్మాతలు కొత్త కొత్త చిత్రాలను ఇంకా నిర్మించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ ఉగాదికి కొత్త కెరీర్ ప్రారంభిస్తున్న తాను ముఖ్యంగా రెండు విషయాలు చెప్పాలని, ఒకటి శ్రీరామరక్షగా నాకు వెన్నంటి ఉండే శక్తి ఒకటి అయితే పదేళ్ల క్రితం విడుదలైన శ్రీరామ్ ఎంత పేరు తెచ్చిందో ఈ చిత్రం మరలా అంత పేరు తెస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ప్రతి నటుడు తన కెరీర్‌లో డిఫరెంట్ క్యారక్టర్స్ చేయాల్సిన అవసరం తప్పక వస్తుందని, ఈ చిత్ర దర్శకుడికి ఉన్న విజన్ పోస్టర్స్‌లోనే తెలుస్తుందని తెలిపారు. ఉగాది రోజు ఈ చిత్రం విడుదలవటం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. చిత్ర దర్శకుడు బాలాజీ మాట్లాడుతూ చిత్రం చాలా బాగా వచ్చిందని, తమ యూనిట్‌కు అద్భుతమైన విజయాన్ని అందిస్తుందని ఆకాంక్షించారు. నటులందరూ చక్కగా నటించడంతో ఈ చిత్రం అందరికీ నచ్చే విధంగా రూపొందిందని, విజయ నామ సంవత్సరంలో విడుదలవుతున్న ఈ చిత్రం విజయం సాధించాలని నిర్మాత రాజేష్ కోరుకున్నారు. కార్యక్రమంలో మల్టీ డైమన్షన్ వాసు, కొడాలి వెంకటేశ్వరరావు, రేష్మ, సంగీత దర్శకుడు డాకె తదితరులు చిత్ర విశేషాలు తెలిపారు. కార్యక్రమంలో నిరంజన్, అక్కినేని వెంకట్, సంధ్యారవి తదితరులు పాల్గొన్నారు.
గోలశీను’ సక్సెమీట్

బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ‘గోలశీను’ సక్సెమీట్‌లో
పాల్గొన్న దర్శకుడు రాజ్ కందుకూరితో చిత్రం యూనిట్
శ్రీకాంత్ హీరోగా లేపాక్షి సినిమా

లేపాక్షి వారి పతాకంపై శ్రీకాంత్ కథానాయకుడుగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఎ.గురురాజ్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిర్మాత మాట్లాడుతూ కథ వినగానే శ్రీకాంత్ నచ్చి సినిమా చేయడానికి అంగీకరించారని, ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, మే నెలాఖరులో షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. ఓ విభిన్నమైన కథతో ఈ చిత్రం సాగుతుందని, తన కెరీర్‌లో ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన చిత్రాల్లాగ ఈ చిత్రం సరికొత్త జానర్‌లో నిర్మిస్తున్నారని హీరో శ్రీకాంత్ తెలిపారు. నా కూతురు స్వేచ్ఛగా, క్షేమంగా పెరిగి పెద్దవ్వడానికి అనుకూలమైన పరిస్థితులు ప్రస్తుత సమాజంలో లేవని బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ అన్న మాటల స్ఫూర్తితో ఈ కథ తయారుచేసుకున్నానని, సోషల్ రెస్పాన్స్‌బులిటీతో చిత్రం సాగుతుందని చిత్ర దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల తెలిపారు. నటీనటులు, సాంకేతిక నిపుణులను త్వరలో ప్రకటిస్తామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి నిర్మాత: ఎ.గురురాజ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల.