Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

నవ్వులలో ముంచెత్తే బబ్లూ, గీతాసింగ్

$
0
0

విజయనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జీ-తెలుగు ఛానల్ రూపొందించిన గంగతో రాంబాబు నవ్వుల కార్యక్రమాన్ని అందరూ చూడాలని తెలుపుతున్నారు. ఆదాయం ఉచ్ఛస్థితిలో ఉండి, వ్యయం సున్నాగా ఉండే విధంగా చేస్తూ అందరికీ నవ్వులను పంచడానికి గంగతో రాంబాబు సీరియల్ ఓ మెగా ఎపిసోడ్‌ని సిద్ధం చేసిందని, ఆరు ప్రధానపాత్రలతో సాగిపోతున్న ఈ సీరియల్ నవ్వులలో ముంచెత్తుతున్న సంగతి తెలిసిందేనని, ఉగాది స్పెషల్‌గా ఈ ఆరు పాత్రలతోపాటు కమెడియన్స్ గీతాసింగ్, బబ్లూలతో రూపొందించిన ఈ ఎపిసోడ్ అందరూ చూడాలని జీ-తెలుగు బిజినెస్ హెడ్ అనూరాధ తెలిపారు.

విజయనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని
english title: 
n

‘అంజలి వెంటే పరిశ్రమ’

$
0
0

అంజలి నీకు ఏ సమస్య ఉన్నా నిన్ను ఆదుకోవడానికి తెలుగు పరిశ్రమ సిద్ధంగా ఉందని, నీవు ఇలా చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడంవల్ల పెద్ద చిత్రాల షూటింగ్‌లకు అంతరాయం కలుగుతోందని, ఇది హర్షణీయం కాదని, దయచేసి ఎక్కడ ఉన్నా నీ క్షేమ సమాచారాలతో సంప్రదించవలసిందిగా కోరుతున్నామని క్రేజీ చిత్ర నిర్మాత సురేష్ కొండేటి విజ్ఞప్తి చేశారు. ఆర్య, హన్సిక, అంజలి ప్రధానపాత్రధారులుగా నటించిన క్రేజీ చిత్రం విడుదల సందర్భంగా ఆయన ఈ మాటలు తెలిపారు. కన్నన్ దర్శకత్వంలో కె.వి.శ్రీ్ధర్‌రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్‌లో విడుదలైన ఢిల్లీబెల్లీ చిత్రానికి రీమేక్‌గా నిర్మించారు. తమిళంలో సేట్టైగా విడుదలైన ఈ చిత్రం గూర్చి నిర్మాత సురేష్ మాట్లాడుతూ ఉగాదినాడు చిత్రం విడుదలవుతుండడం ఆనందంగా వుందని, దాదాపు 200 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, అంజలి విషయం బాధాకరమని, ఆమెను ఎవరూ కిడ్నాప్ చేయలేదు కానీ కుటుంబ కలహాల నేపధ్యంలో ఎటో వెళ్లిపోయిందని ఆయన వివరించారు. చిత్ర సమర్పకుడు శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఇటీవల విడుదలైన ఆడియో పెద్ద హిట్‌గా మారిందని, తమిళంలో కూడా చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోందని, స్క్రీన్‌ప్లే హైలెట్‌గా నిర్మించిన ఈ చిత్రం ప్రేమిస్తే చిత్రంలా విజయవంతమవ్వాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాగర్ పాల్గొన్నారు.

అంజలి నీకు ఏ సమస్య ఉన్నా నిన్ను ఆదుకోవడానికి తెలుగు పరిశ్రమ సిద్ధంగా ఉందని,
english title: 
anjali

వెంకట్ వ్యాఖ్యలు ఆక్షేపణీయం

$
0
0

అనేక చిత్రాల్లో కథ, మాటలు అందించిన రచయిత కోనా వెంకట్ ఇటీవల ఓ తెలుగు దినపత్రికలో ఇచ్చిన ఇంటర్‌వ్యూలో విషయాలు, వ్యాఖ్యలు ఆక్షేపణీయాలని దర్శకుల సంఘం ఆరోపించింది. మాటల రచయిత వెంకట్ ఇటీవల ఓ తెలుగు దినపత్రికలో ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుల వల్ల తాను ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను తెలిపారు. ఈ నేపధ్యంలో హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాలులో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుల సంఘం తరఫున వి.సాగర్, మద్దినేని రమేష్, శ్రీనాధ్ పాల్గొని వెంకట్ వ్యాఖ్యలను కొట్టివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకట్‌కు ఎటువంటి అభ్యంతరాలున్నా అది డైరెక్టర్స్ అసోసియేషన్‌లో పెట్టి శాంతియుతంగా పరిష్కరించుకోవాలి కానీ అనవసరమైన రాద్ధాంతాలు చేయకూడదని, ఆయన కూడా రైటర్స్ అసోసియేషన్‌లో మెంబరు కనుక పరిస్థితిని అందరూ సానుకూలంగా పరిశీలిస్తారని, పర్సనల్ ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించుకోవాలి గానీ దర్శకులందరూ చెడ్డవారు అని చెప్పడం సబబుకాదని తెలిపారు. గత రెండు రోజుల్లో ఆయనను చర్చలకు ఆహ్వానిస్తే వస్తాను అని చెప్పి రాలేదని, మనసు కవి ఆత్రేయతో తాను కలసి మద్యపానం చేశానని చెప్పడం ఓ రైటర్‌గా అతని స్థాయికి తగిన విషయాలు కాదని, ఏ విషయాలు చెప్పాలో ఏ విషయాలు చెప్పకూడదో తెలియకుండా వ్యాఖ్యానాలు చేయడం మంచి పద్ధతి కాదని, ఆయనకు ఏ సమస్య ఉన్నా అసోసియేషన్‌కు వచ్చి పరిష్కరించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

అనేక చిత్రాల్లో కథ, మాటలు అందించిన రచయిత కోనా వెంకట్
english title: 
v

వినోదాత్మకంగా ‘మిస్టర్ మనీ’

$
0
0

నవీన్ (‘నచ్చావులే’ ఫేం), అలేఖ్య నాయకా నాయికలుగా కృష్ణవేణి ఫిలింస్, అరవింద్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ మనీ’ (‘కనెక్టింగ్ పీపుల్’ అనేది ట్యాగ్‌లైన్). ఈ చిత్రానికి కంది రామచంద్రారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మందాడి అరవింద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రం ఎడిటింగ్ పూర్తిచేసుకొని డబ్బింగ్‌ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా నిర్మాత అరవింద్‌రెడ్డి మాట్లాడుతూ-ఇది వినోదాత్మక చిత్రం. దర్శకుడు చిత్రాన్ని బాగా తీర్చిదిద్దుతున్నాడు. ఈనెలలోనే ఆడియోని విడుదల చేసి మేలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉంది. అందరి సహకారంతో ఈ చిత్రాన్ని మూడు షెడ్యూల్స్‌లో పూర్తిచేశాం. ఇదొక లవ్ ఎంటర్‌టైనర్. పాటలు చాలా బాగా వచ్చాయి అని తెలిపారు. కొండవలస, పృధ్వీరాజ్, చిత్రం శ్రీను, తడివేలు. తా.రమేష్, సుమన్‌శెట్టి, కోట శంకరరావు, వేదం నాగయ్య, పొట్టి చిట్టిబాబు, తిరుపతి ప్రకాష్, ద్రాక్షారామం సరోజ, బండ జ్యోతి, గబ్బర్‌సింగ్ బంటి, ఆంజనేయులు, పటేల్ అశోక్ పాండ్యన్, నల్లబాలు, పలాస శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:రైసాబ్, సంగీతం:శ్రీవెంకట్, సహ నిర్మాత: రమేష్ చౌదరి, నిర్మాత: మందాడి అరవింద్ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:కంది రామచంద్రారెడ్డి.

నవీన్ (‘నచ్చావులే’ ఫేం), అలేఖ్య నాయకా నాయికలుగా
english title: 
v

‘ప్రేమంటేనే చిత్రం...’

$
0
0

మానస్, ఆరుషి జంటగా మా మూవీస్ పతాకంపై వి.ఆర్.దొరైరాజు దర్శకత్వంలో గంగవరపు శ్రీనివాసులునాయుడు, జి.నరసయ్య, కృత్య నిర్మిస్తున్న సినిమా ‘ప్రేమంటేనే చిత్రం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ నేటి యువత ఎదుర్కొంటున్న అనేక సమస్యల నేపధ్యంలో ఈ చిత్రం సాగుతుందని, కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా కథను తయారుచేసుకున్నామని, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటూనే సందేశాన్ని అందించే ఫీల్‌గుడ్ మూవీగా నిర్మించామని తెలిపారు. చిత్రానికి సంబంధించిన పాటలను ఈనెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు అన్నారు. ఎమ్మెస్ నారాయణ, జీవా, గౌతంరాజు, అల్లరి సుభాషిణి, కోటేశ్వరరావు, మాధవి, రాజేంద్ర, కాంచనమణి, జయంతి, శివపార్వతి, శారద, గాయత్రి, డి.ఎం.కె తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.జి.కె.ప్రవీణ్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: జి.సెల్వకుమార్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.ఆర్.దొరైరాజు.

మానస్, ఆరుషి జంటగా మా మూవీస్ పతాకంపై
english title: 
pre

చాంపియన్స్ లీగ్ సెమీస్‌కు బార్సిలోనా

$
0
0

పారిస్, ఏప్రిల్ 11: పెడ్రో రోడ్రిగెజ్ 71వ నిమిషంలో సాధించిన గోల్ బార్సిలోనాను ఆదుకుంది. పారిస్ సెయింట్ జర్మెయిన్‌తో జరిగిన మ్యాచ్‌ని డ్రా చేసుకున్న బార్సిలోనా, పాయింట్ల ఆధారంగా సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరి మూడు గోల్స్ సాధించాయి. 2-3 తేడాతో ఓటమిపాలవుతుందనుకున్న బార్సిలోనాకు రోడ్రిగెజ్ చేసిన గోల్ వరంగా మారింది. ఈ క్వెలైజర్‌ను అందించడంతోపాటు అతను తన జట్టు సెమీస్ చేరడానికి అవసరమైన పాయింట్లను కూడా సంపాదించిపెట్టాడు. కాగా, జువెంటస్‌తో జరిగిన మ్యాచ్‌లో బయెర్న్ మ్యూనిచ్ 4-0 తేడాతో విజయం సాధించి సెమీస్‌కు అర్హత సంపాదించింది. బొరుసియా డార్ట్‌మండ్ 3-2 తేడాతో మలగాను, రియల్ మాడ్రిడ్ 5-3 గోల్స్ ఆధిక్యంతో గలటసరెను ఓడించి సెమీస్‌లోకి అడుగుపెట్టాయి.

జర్మెయిన్‌తో చివరి మ్యాచ్ డ్రా
english title: 
barcelona

ప్రపంచ బాడ్మింటన్ ర్యాంకింగ్స్ ఏడో స్థానానికి కశ్యప్

$
0
0

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: భారత యువ ఆటగాడు పారుపల్లి కశ్యప్ తాజాగా ప్రకటించిన ప్రపంచ బాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి చేరాడు. హైదరాబాద్‌కు చెందిన కశ్యప్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్. పురుషుల విభాగంలో కశ్యప్ తన స్థానాన్ని క్రమంగా మెరుగుపరచుకుంటూ రావడం విశేషం. కాగా, తమిళనాడుకు చెందిన అజయ్ జయరామ్ ప్రస్తుతం 30వ స్థానంలో ఉన్నాడు. కాగా, మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ రెండో స్థానంలో కొనసాగుతున్నది. ఒలింపిక్ చాంపియన్ లీ జురెయ్ (చైనా) ఈ విభాగంలో నంబర్‌వన్‌గా ఉంది. సైనాతోపాటు హైదరాబాద్‌కే చెందిన పివి సింధు 16వ స్థానంలో నిలిచింది. మన దేశం తరఫున ముగ్గురు హైదరాబాదీలు ర్యాంకింగ్స్‌లో ముందంజ వేయడం విశేషం.

విజ్డెన్ క్రికెటర్ల జాబితాలో
ముగ్గురు దక్షిణాఫ్రికా క్రికెటర్లు
జొహానె్నస్‌బర్గ్, ఏప్రిల్ 11: క్రికెట్ బైబిల్‌గా పేర్కొనే విజ్డెన్ పత్రిక 2012 సంవత్సరానికిగాను ప్రకటించిన ఐదుగురు అత్యుత్తమ క్రికెటర్ల జాబితాలో ముగ్గురు దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు స్థానం దక్కింది. ‘విజ్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైన వారిలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ మార్లొన్ సామ్యూల్స్, ఇంగ్లాండ్ ఓపెనర్ నికొలాస్ కాంప్టన్‌లతోపాటు దక్షిణాఫ్రికాకు చెందిన హషీం ఆమ్లా, జాక్వెస్ కాలీస్, డేల్ స్టెయిన్ కూడా ఉన్నారు. కాంప్టన్ ఇంగ్లాండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ, అతను దక్షిణాఫ్రికాలోనే జన్మించాడు. ఈ రకంగా చూస్తే, దక్షిణాఫ్రికాకు చెందిన నలుగురు ఆటగాళ్లకు ఈ జాబితాలో స్థానం లభించింది. కాగా, విజ్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్‌గా ముగ్గురు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఎంపిక కావడం ఇది మూడోసారి. 1966లో గ్రేమ్ పొలాక్, పీటర్ పొలాక్, కొలిన్ బ్లాండ్, 2009లో డేల్ బెకెన్‌స్టెయిన్, మార్క్ బౌచర్, నీల్ మెకెన్జీ ఈ ఫీట్‌ను సాధించారు.

బగాన్ అభిమానుల జాత్యహంకారం
ముంబయి ఆటగాడు యకుబూ ఆరోపణ
కోల్‌కతా, ఏప్రిల్ 11: మొహన్ బగాన్ అభిమానులు జాత్యహంకారాన్ని ప్రదర్శించారని ముంబయి ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాడు యూసిఫ్ యకుబూ ఆరోపించాడు. ఐ-లీగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం బగాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 2-3 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఆ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అభిమానులు తనను ఉద్దేశించి ‘మంకీ.. మంకీ’ అని అరుస్తూ హేళన చేశారని గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ యకుబూ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లానని తెలిపాడు. ఇలావుంటే, యకుబూ చేసిన ఆరోపణలను బగాన్ జట్టు మేనేజర్, ఆర్థిక కార్యదర్శి దేబశిష్ దత్తా ఖండించాడు. అలాంటి సంఘటన జరిగినట్టు తన దృష్టికి రాలేదని అన్నాడు. అభిమానులు ఈ విధంగా క్రీడాకారులను హేళన చేస్తారని తాను అనుకోవడం లేదని వ్యాఖ్యానించాడు.

ఐటిపిఎల్‌లో ఆడతా: ఐసం ఖురేషి
కరాచీ, ఏప్రిల్ 11: భారత వెటరన్ ఆటగాడు మహేష్ భూపతి పర్యవేక్షణలో ఈఏడాది చివరిన జరిగే అంతర్జాతీయ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (ఐటిపిఎల్)లో పాకిస్తాన్ ఆటగాడు ఐసం ఉల్ హక్ ఖురేషి పాల్గొననున్నాడు. ఈ విషయాన్ని అతను గురువారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపాడు. భారత ప్రభుత్వం ఈ టోర్నమెంట్‌కు తనను అనుమతించేదీ లేనిదీ తెలియదని పేర్కొన్నాడు.

భారత యువ ఆటగాడు పారుపల్లి కశ్యప్
english title: 
kashyap

సెవాగ్ కెరీర్‌కు తెర

$
0
0

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, విమర్శలు, ప్రతి విమర్శలకు కారణమయ్యే ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మన్ జెఫ్ బాయ్‌కాట్ మరోసారి తన నోటికి పని చెప్పాడు. వీరేందర్ సెవాగ్ కెరీర్‌కు ఇక తెరపడినట్టేనని, అతను మళ్లీ భారత జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశాలు లేవని వ్యాఖ్యానించి, కొత్త వివాదానికి తెరలేపాడు. సెవాగ్ వైఫల్యాల బాటలో నడుస్తున్నాడని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాయ్‌కాట్ చెప్పాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్ ఓటమిపొందిన మరుక్షణం నుంచే, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిందిగా తాను చెప్తునే ఉన్నానని అన్నాడు. ఇటీవల సెలక్టర్లు చేసిన కొన్ని మార్పులు అద్భుత ఫలితాలనిచ్చాయని గుర్తుచేశాడు. ఆస్ట్రేలియాపై భారత్ క్లీన్‌స్వీప్ సాధించడంలో యువ క్రికెటర్లే కీలక పాత్ర పోషించారని అన్నాడు. వీరంతా గొప్పగా రాణిస్తున్న తరుణంలో సెవాగ్‌కు జట్టులో స్థానం లభించడం కష్టమని బాయ్‌కాట్ పేర్కొన్నాడు. ఏ రకంగా చూసినా సెవాగ్ అంతర్జాతీయ కెరీర్ కొనసాగే అవకాశాలు లేవని స్పష్టం చేశాడు. ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌లో సెవాగ్ ఒకడని, ఈ విషయంలో మరో అభిప్రాయానికి చోటు లేదని పేర్కొన్నాడు. అయితే, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తాను తన అభిప్రాయాన్ని వెల్లడించానని అన్నాడు.

బాయ్‌కాట్ సంచలన వ్యాఖ్య
english title: 
boycott

ఎవరి పంచాంగం వారిదే..!

$
0
0

వర్షాలు పుష్కలం
*ప్రభుత్వ పంచాంగ శ్రవణం
హైదరాబాద్, ఏప్రిల్ 11: శ్రీ విజయనామ సంవత్సరంలో పుష్కలంగా వర్షాలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని ప్రముఖ జ్యోతిష్య శాస్తవ్రేత్త, తెలుగు విశ్వవిద్యాలయంలో జ్యోతిష్య శాఖాధిపతి సివిబి సుబ్రమణ్యం తెలిపారు. రవీంద్రభారతిలో ఉగాది సందర్భంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో సుబ్రమణ్యం విజయనామ సంవత్సరంలో జరగబోయే విషయాలను తెలిపారు. ఆషాడమాసంలో వర్షాలు బాగా కురుస్తాయని, భాద్రపద మాసంలో జలాశయాలు నీటితో నిండుతాయన్నారు. దాంతో పంటలు పుష్కలంగా పండుతాయని, పశుసంపద వృద్ధి చెందుతుందని, పాడి పెరుగుతుందన్నారు. ధరలు మాత్రం బాగా పెరుగుతాయని వెల్లడించారు. ఈ సంవత్సరం గురువు మహారాజు స్థానంలో ఉన్నాడని, అందువల్ల సజ్జనులు, మేధావులకు ప్రాధాన్యత లభిస్తుందని, పరిశోధనల్లో ముందడుగు ఉంటుందన్నారు. ఈ సంవత్సరం ప్రభువులు సత్కార్యాలు చేస్తారని, పాలకులు న్యాయంగా నీతిగా పరిపాలన సాగిస్తారన్నారు. రాష్ట్రంలో సుస్థిర పాలన సాగుతుందని, ఈ కారణంగా పాలకులు మంచి కీర్తిని సంపాదిస్తారని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందని సుబ్రమణ్యం వెల్లడించారు. ప్రభుత్వానికి కొన్ని విషమ పరిస్థితులు ఎదురైనప్పటికీ, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతారన్నారు. అంతర్జాతీయ కార్యక్రమాలు రాష్ట్రంలో ఏర్పాటవుతుండటం వల్ల రాష్ట్ర ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతుందన్నారు. విద్యారంగంలో పురోభివృద్ది ఉంటుందని, విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉంటాయని, సరిహద్దు దేశాలను అదుపులో పెట్టగల శక్తి మన దేశానికి కలుగుతుందన్నారు.

కలహాల్లో పాలకులు
* ఎన్టీఆర్ భవన్‌లో...
హైదరాబాద్, ఏప్రిల్ 11: ఈ సంవత్సరం రాజకీయ సంక్షోభాలు అనివార్యమని టిడిపి కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన పంచాంగ పఠనంలో పొన్నలూరి శ్రీనివాస గార్గేయ తెలిపారు. గురువారం ఉగాది సందర్భంగా జరిగిన పంచాంగ పఠనంలో గార్గేయ అనేక అంశాలు వివరించారు. జూలై 19 నుంచి వరుసగా మూడు రోజుల పాటు రాజకీయ, వర్ష బీభత్సాలు తప్పవని తెలిపారు. ఆగస్టు 18 నుంచి అక్టోబర్ ఐదవ తేదీ వరకు, తిరిగి 2014 ఫిబ్రవరి మూడవ తేదీ నుంచి మార్చి 29 వరకు రాజకీయంగా సమస్యలు వస్తాయని తెలిపారు. ఈ సంవత్సరం రైతులకు అనుకూలంగా ఉంటుందని, పాడిపంటలు బాగా పండుతాయని తెలిపారు. మే 31 నుంచి గురువు మిథున రాశిలో సంచరించడం వల్ల పాలకులు కలహాలతో ఉంటారని తెలిపారు. 2014 మార్చిలో అన్నదాతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి పారిశ్రామికవేత్తలు, విద్యా రంగం, ఐటి రంగాల్లోని వారు సరికొత్త ఆలోచనలతో ఆశావాదంతో ఉంటారని తెలిపారు. కాగా, వచ్చే ఉగాది చంద్రబాబు పాలనలోనే జరుపుకుంటామని టిడిపి శాసన సభాపక్షం ఉప నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు జోస్యం చెప్పారు. గురువారం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన పంచాగ శ్రవణంలో మండవ వెంకటేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తుమ్మల పాల్గొన్నారు.

230 సీట్లు ఖాయం
* వైఎస్‌ఆర్‌సిపి కార్యాలయంలో...
హైదరాబాద్, ఏప్రిల్ 11: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి 230 సీట్లు గెలుచుకుని మహాప్రభంజనం సృష్టించబోతోందని ప్రముఖ వేద పండితులు, జ్యోతిష్య శాస్తవ్రేత్త మారేపల్లి రామచంద్ర శాస్ర్తీ అన్నారు. గురువారం ఇక్కడ వైఎస్‌ఆర్‌సిపి కార్యాలయంలో శ్రీవిజయనామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు వైఎస్ విజయమ్మ, నేతలు శోభానాగిరెడ్డి, డిఏ సోమయాజులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రశాస్ర్తీ పంచాంగ శ్రవణం చేశారు. ఆయన మాట్లాడుతూ గందరగోళం తర్వాత స్ధిరత్వం వస్తుందని, జగన్మోహన్ రెడ్డికి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయన్నారు. త్వరలోనే బయటకు వస్తారన్నారు. కుట్రలు, కుతంత్రాలు ఎక్కువకాలం నిలబడవన్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా వైఎస్‌ఆర్ పార్టీ మద్దతు అవసరమవుతుందన్నారు. వైఎస్‌ఆర్‌సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కాంక్షించారు. రాష్ట్రంలో వైఎఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ సువర్ణ పాలన వస్తుందన్నారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయాలన్న నిబద్ధతతో తమ పార్టీ పనిచేస్తుందన్నారు.

సాహస నిర్ణయాలు
*గాంధీభవన్‌లో...
హైదరాబాద్, ఏప్రిల్ 11: కొత్త సంవత్సరంలో రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సత్వరమే సామాన్య ప్రజలకు చేరే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. గురువారం ఇక్కడ గాంధీభవన్‌లో జరిగిన ఉగాది శ్రీ విజయనామ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేద పండితులు కె సూర్యనారాయణమూర్తి పంచాంగ శ్రవణం చేశారు. రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా పడతాయని జోస్యం చెప్పారు. స్ర్తి, పురుషుల మధ్య కలతలు పెరుగుతాయన్నారు. పాలకులు సాహసంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారన్నారు. ఆంధ్రప్రదేశ్ మీడియాకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందన్నారు. దొంగస్వాములు పుట్టుకొస్తారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్య, విద్యారంగాలు వ్యాపారంగా మారాయని, ప్రభుత్వ నియంత్రణ అవసరమన్నారు. మతమార్పిడులు పెరుగుతాయన్నారు. వైట్ కాలర్ నేరాలు పెచ్చుమీరుతాయని, అధికారుల్లో ధిక్కార స్వభావం పెరుగుతుందన్నారు. న్యాయ వ్యవస్ధ జోక్యం పెరుగుతుందన్నారు. రాజకీయాలు, సామాజిక రంగంలో యువకుల పాత్ర అధికమవుతుందన్నారు. రాష్ట్రంలో పంటలు బాగా పండి అన్నపూర్ణ అనే పేరును నిలబెట్టుకుంటామన్నారు. కొత్త పథకాలతో రాష్ట్రప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతుందన్నారు. ప్రతి వ్యక్తి పంచాంగాన్ని ప్రతి రోజూ శ్రవణం చేయాలన్నారు. తిథి, వార, నక్షత, యోగ,కర్ణాలను తెలుసుకోవడం వల్ల కాలమహిమను పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమమంలో వేద పండితులు డాక్టర్ సిహెచ్ శ్రీనివాసమూర్తి, కె సూర్యనారాయణమూర్తిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వర్షాలు పుష్కలం *ప్రభుత్వ పంచాంగ శ్రవణం
english title: 
panchanga sravanam

తెలుగు జాతి పరువు తీయొద్దు

$
0
0

హైదరాబాద్, ఏప్రిల్ 11: తెలుగు సినిమా పోకడలు ఇటీవల కాలంలో తెలుగు ప్రజల గౌరవానికి భంగం కలిగే విధంగా ఉన్నాయని సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి డికె అరుణ ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమాలు ఇతర భాషా చిత్రాలను ధీటుగా ఉండలేకపోతున్నాయని ఆమె అన్నారు. పబ్లిక్ గార్డెన్‌లో గురువారం లలిత కళాతోరణంలో జరిగిన నంది బహుమతుల ప్రదానాన్ని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి చేయగా, మంత్రి అరుణ అధ్యక్షోపన్యాసం చేశారు. తెలుగు భాషకుగానీ సంస్కృతిగానీ తెలుగు సినిమాల్లో తగిన గౌరవం దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తిస్తుండగా, ఆ గౌరవం సినిమాల్లో దక్కడం లేదని మంత్రి విమర్శించారు. ఇక నుంచి అయినా తెలుగు సినిమాలకు మునుపటి ఖ్యాతి తెచ్చేలా, జాతీయ స్థాయిలో గౌరవం పెరిగేలా సినిమాలు తీయాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిరావడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతగానో కృషి చేసిందని ఆమె పేర్కొన్నారు. తెలుగు సినిమా పరిశ్రమను ప్రోత్సహించేందుకు స్టూడియోలకు స్థలాలు కేటాయించడం, కళాకారులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం, సినిమా థియేటర్ల నిర్మాణానికి ప్రోత్సహాకాలు అందించడం వంటి అనేక చర్యలను ప్రభుత్వం చేపట్టిందని మంత్రి అన్నారు. ఎన్‌టిఆర్ జాతీయ చలన చిత్ర పురస్కారాన్ని అందుకున్న అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుని పేరుపై స్థాపించిన అవార్డు తనకు దక్కడం గర్వంగా ఉందనీ, అలాగే తనకు ఎంతగానో ఆనందాన్ని కలిగించిందన్నారు. దివంగత ఎన్టీఆర్‌తో తనకు ఎంతగానో సన్నిహితం ఉండేదనీ, ఆయన నిర్మించిన చిత్రాలను ఎన్నింటినో తాను రీమేక్ చేశానని అమితాబ్ బచ్చన్ గుర్తు చేశారు. సినిమా కళామాతల్లికి కులం, మతం, ప్రాంతం ఏదీ లేదన్నారు. దేశ సమగ్రతను కపాడేందుకు కూడా సినిమా కళామాతల్లి దోహదపడుతుందని ఆయన కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంత్రులు గీతారెడ్డి, పితాని సత్యనారాయణ, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. (చిత్రం) ఉత్తమ నటుడిగా అమితాబ్ బచ్చన్‌నుంచి నంది అవార్డు అందుకుంటున్న మహేష్‌బాబు. చిత్రంలో సిఎం కిరణ్ తదితరులు

* నంది అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి డికె అరుణ హితవు
english title: 
dk aruna

ప్రజల వద్దకే పోలీసు

$
0
0

హైదరాబాద్, ఏప్రిల్ 11: రాష్ట్ర పోలీసు శాఖ పారదర్శకత, జవాబుదారీతనానికి ‘డయల్ 100’ నిదర్శనంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. డయల్ 100 సర్వీస్ భవిష్యత్తులో పోలీసు శాఖలో పెద్ద మార్పునకు శ్రీకారం చుడుతుందని అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే పోలీసుల వద్దకు ఇప్పటి వరకు ప్రజలు వెళ్లే వారని, ఇక నుంచి ప్రజల వద్దకే పోలీసులు వెళతారని అన్నారు. జివికె-ఇఎంఆర్‌ఐతో చేసుకున్న ఒప్పందం మేరకు పోలీసు శాఖ డయల్ 100 ప్రాజెక్టును చేపట్టింది. ఈ సర్వీస్‌ను గురువారం మేడ్చల్ సమీపంలోని దేవరయాంజాల్ వద్ద జివికె-ఇఎంఆర్‌ఐ ప్రాంగణంలో సిఎం చేతుల మీదుగా ప్రారంభించారు. 100కి తొలి డయల్ చేసి ఈ సర్వీస్‌ను ప్రారంభించారు. అయితే సిఎం రెండుసార్లు వరుసగా డయల్ చేసినా 100 సర్వీస్‌కు కనెక్ట్ కాలేదు. దీంతో ఆయన ప్రసంగం ప్రారంభించారు. నిజంగా డయల్ 100 అవసరం లేదు కాబట్టి ఇప్పుడు పని చేయలేదని చెప్పి నవ్వులతో సరిపెట్టుకున్నారు. డయల్ 100ను ప్రారంభించగానే సరికాదని ఇది పోలీసు శాఖకు పెద్ద సవాల్‌గా మారుతుందని అన్నారు. ఈ సర్వీస్ ప్రారంభం కాకుండానే రోజుకి 40 వేల కాల్స్ వస్తున్నాయని, ఇక సర్వీస్ అందుబాటులోకి వస్తే మరెన్ని కాల్స్ వస్తాయో ఊహించవచ్చునని అన్నారు. ఏ మారుమూల పల్లె నుంచైనా సరే 100కి డయల్ చేసి ఫిర్యాదు లేదా, అత్యవసర విషయం చెబితే ఆ కాల్ సంబంధిత పోలీసు స్టేషన్‌కు వెళ్లి అక్కడ నమోదు అవుతుంది. వెంటనే తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కాల్ చేసిన వ్యక్తికి తిరిగి ఎంత సేపటిలో ఆ పని పూర్తయ్యిందో కూడా చెప్పాల్సి ఉంటుంది. కాల్ చేసిన సారాంశం మొత్తం రికార్డు అవడమే కాకుండా, పోలీసులు ఇచ్చే జవాబు కూడా రికార్డు అవుతుందని అన్నారు. ఈ విధానంలో కిందిస్థాయి పోలీసు సిబ్బంది సహజంగా స్టేషన్‌కు వచ్చే వారితో మాట్లాడే భాష బాగోదని, ఇక మీదట అది కుదరదని చెప్పారు. ఫోన్ కాల్‌కి స్పందించి ఏం మాట్లాడిందీ రికార్డు అవుతుంది కాబట్టి చాలా పద్దతిగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. ఈ సర్వీస్‌ను తయారు చేసిన జివికె-ఇఎంఆర్‌ఐ యాజమాన్యాన్ని, డిజిపి వి.దినేశ్‌రెడ్డిని సిఎం అభినందించారు. ఈ సర్వీస్ బాగా పని చేసేందుకు మరికొన్ని రోజులు పడుతుందని, పర్యవేక్షణ ఒక సీనియర్ ఆఫీసర్‌కు అప్పగించాలని అన్నారు. ప్రజలకు పారదర్శకత అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే ప్రారంభించిన మీ సేవ సర్వీస్ చాలా బాగా ప్రజలకు ఉపయోగపడిందని, ఇంకా సర్వీస్‌లో కొన్ని మార్పులు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ఏదైనా సర్వీస్ నిర్దిష్ట సమయంలో అందించలేకపోతే సంబంధిత అధికారి తిరిగి దరఖాస్తుదారునికి జరిమానా చెల్లించే విధానం త్వరలో అమల్లోకి తేనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి స్వాగతం పలికిన డిజిపి వి.దినేశ్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు 100 డయల్ ఉందని, అది లోకల్‌గా మాత్రమే పని చేస్తోందని అన్నారు. దీనిలో ఉన్న కొన్ని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సర్వీస్ అందుబాటులో ఉండే విధంగా డయల్ 100ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సర్వీస్ అందుబాటులోకి రావడం దేశంలోనే ఇది ప్రధమమని అన్నారు. మంత్రులు పితాని, ప్రసాద్‌కుమార్, జివికె అధినేత జివికె రెడ్డి, ఇఎంఆర్‌ఐ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

* ‘డయల్ 100’ ప్రారంభ సభలో ముఖ్యమంత్రి కిరణ్
english title: 
dial 100

పంచెకట్టుతో ముఖ్యమంత్రి!

$
0
0

హైదరాబాద్, ఏప్రిల్ 11 : శ్రీ ‘విజయ’నామ సంవత్సరం ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రవీంద్రభారతిలో గురువారం ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలుగుతనం ఉట్టిపడే ఆహార్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులంతా సాధారణ దుస్తులైన ప్యాంట్లు చొక్కాలతో హాజరుకాగా, కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ధరించే సాంప్రదాయ దుస్తులైన పంచె, తెల్లరంగు చొక్కాతో పాల్గొన్నారు. అయితే ఆయనలో నిద్రలేమి, అలసట ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపించింది. సాధారణంగా ఏ కార్యక్రమంలో అయినా చాలా చలాకీగా, చిరునవ్వుతో కనిపించే కిరణ్‌కుమార్‌రెడ్డి పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మాత్రం అలసిపోయినట్టు కనిపించారు. అయినప్పటికీ పంచాంగ శ్రవణం, ‘అమ్మ హస్తం’, అవార్డుల పంపిణీ తదితర కార్యక్రమాలు రవీంద్రభారతిలో రెండు గంటల పాటు కొనసాగినప్పటికీ, ఎలాంటి విసుగు కనిపించకుండా పాల్గొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం జ్యోతిష్య శాఖాధిపతి సివిబి సుబ్రమణ్యం చేసిన పంచాంగ శ్రవణం చాలా ఓపికగా విన్నారు. ఈ సందర్భంగా జరిగిన అవార్డుల కార్యక్రమంలో కొందరు అవార్డు గ్రహీతలు ఏవో విషయాలు చెబుతూ ఉంటే వారికి దగ్గరగా జరిగి మరీ శ్రద్దగా విన్నారు. టిటిడి ప్రచురించిన పంచాంగాన్ని, వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రచురించిన వ్యవసాయ పంచాంగాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అవార్డుల ప్రదానం వివిధ రంగాల ప్రముఖులకు ఈ సందర్భంగా అవార్డులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అందచేశారు. పదిహేను మందికి ప్రతిష్టాత్మకమైన ‘హంస’ అవార్డులను అందచేశారు. పలువురు వేద పండితులను సన్మానించారు. పంటల ఉత్పత్తుల్లో అత్యధిక ఉత్పాదకత సాధించి రికార్డు నెలకొల్పిన రైతులను నగదుపారితోషికం, శాలువా, మెమెంటోలతో సన్మానించారు. అలాగే వ్యవసాయ, ఉద్యాన శాస్తవ్రేత్తను సన్మానించారు. సంగీత, సాహిత్య తదితర రంగాల్లో ప్రతిభ కనబరచిన ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అందచేశారు.

శ్రీ ‘విజయ’నామ సంవత్సరం ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం
english title: 
cm

శక్తివంతమైన పార్టీగా బిజెపి: కిషన్‌రెడ్డి

$
0
0

హైదరాబాద్, ఏప్రిల్ 11: రాష్ట్రంలో శక్తివంతమైన పార్టీగా బిజెపి ఎదగబోతోందని, కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలోని ఎన్‌డిఎ అధికారంలోకి వస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. ఉగాది సందర్భంగా పార్టీ రాష్టక్రార్యాలయంలో అనేక కార్యక్రమాలు జరిగాయి. గత ఏడాది మాదిరి బిజెపిలో ఉగాది ఉత్సవం భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా హోమం జరిగింది. అనంతరం పంచాగ శ్రవణం జరిగింది. రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని, విజయం దక్కాలని పార్టీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ధర్మం నాలుగు పాదాల నడవాలని, అధర్మంపై ధర్మం విజయం సాధించాలని పేర్కొన్నారు. అలాగే అన్యాయంపైన న్యాయం సాధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశ అభివృద్ధిని కుంటుపరుస్తున్న ప్రతిష్ట దిగజార్చేవిధంగా ఉన్న అవినీతిపై నీతి విజయం సాధించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధనరెడ్డి, బండారు దత్తాత్రేయ, చింతాసాంబమూర్తి, శాంతారెడ్డి, డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, ప్రధానకార్యదర్శి ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ రామకృష్ణ సిద్ధాంతి, శ్రీనాధ్‌శర్మ, మహాదేవ్ శర్మ, ఫాల చంద్రశర్మ, శంకరమంచి శివసాయి శ్రీనివాస శర్మ పంచాగ శ్రవణంలోనూ, హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్రంలో ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడతామని, అందుకే తాను బిజెపి కార్యాలయానికి వచ్చానని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధనరెడ్డి అన్నారు. అందరికీ మేలు జరగాలని ఆకాంక్షిస్తున్నట్టు జనార్ధనరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చేలా లేదని, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ మాత్రమే తెలంగాణ ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో తన సంపూర్ణ మద్దతు ఎల్లవేళలా ఉంటుందని, కాంగ్రెస్ పాలనలో అనేక ఈతిబాధలను ప్రజలు అనుభవిస్తున్నారని నీళ్లు, కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారని శనిగ్రహాలను దూరంగా పంపితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు.

రాష్ట్రంలో శక్తివంతమైన పార్టీగా బిజెపి ఎదగబోతోందని
english title: 
kishen reddy

ఉపాధిలో నేనే నంబర్ వన్

$
0
0

హైదరాబాద్, ఏప్రిల్ 11: చదువుకున్న విద్యావంతులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత తనకు తప్ప మరొకరికి దక్కదని, ఈ విషయంలో నేనే నంబర్ వన్ అంటూ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. గడచిన 25-30 సంవత్సరాల్లో ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం చేయడంతో వివిధ శాఖల్లో ఖాళీల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. గత రెండు సంవత్సరాల్లో లక్షల మంది యువకులకు ఉపాది కల్పించానని ఆయన చెప్పారు. గురువారం జ్యోతిబా పూలే 187 జయంత్యుత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనామ సంవత్సరం సందర్భంగా జ్యోతిబా పూలే పండుగను జరుపుకోవడం అదృష్టమన్నారు. సమాజంలో అసమానతలను తొలగించడానికి జ్యోతిబా పూలే చేసిన కృషిని నేటికి గుర్తు చేసుకోవడం గర్వకారణమని అన్నారు. భావితరాలకు జ్యోతిబా పూలే ఆదర్శప్రాయుడన్నారు. ఈ ఏడాది పంచాంగంలో అన్నింటా అభివృద్ధి జరుగుతుందని చెప్పడం ఆనందంగా ఉందన్నారు. వర్షాలు, పంటలు, వ్యాపారాలకు మంచి రోజులు వస్తున్నాయని చెప్పారు. దీంతో ఎవరి పని వారు చేసుకోవచ్చునని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యపై ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమాలను ఉత్తుత్తివిగా సిఎం అనివర్ణించారు. 200 యూనిట్ల విద్యుత్ వరకు పాత పద్దతినే అమలు చేస్తున్నామని దీంతో సామాన్యులతో పాటు మధ్యతరగతి వర్గాలు ఇళ్లల్లో అన్ని రకాల విద్యుత్ వాడకాన్ని వినియోగించుకోవచ్చునని ఆయన హామీ ఇచ్చారు. అలాగే విద్యుత్‌ను పొదుపుగా వాడకంతో బిల్లులు తగ్గుతాయన్నారు. విద్యుత్‌పై ప్రతిపక్షాల వాదనల్లో పసలేదన్నారు. కేవలం ధనికుల కోసం విపక్షాలు ఆందోళన చేయడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజలకు దక్కకుండా చేయడానకి ప్రతిపక్షాలు చేస్తున్న ఎత్తుగడలని ఆయన ఎద్దేవ చేశారు. ప్రతి కుటుంబంలో పస్తులు ఉండకుండా చూడాలనే దృక్పథంతో అమ్మ హస్తం పథకం ద్వారా 9 రకాల నిత్యావసర వస్తువులను రూ. 185 రూపాయలకే ఇవ్వడం జరుగుతోందన్నారు.
ఈ పథకానికి రూ. 660 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా ప్రభుత్వం మాత్రం 9 రకాల వస్తువులను రూ. 185 రూపాయలకే ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. నిధులు ఖర్చు చేయడానికి వనరులను సమీకరించుకోవాలని అందుకు పన్నులను వేయక తప్పదని ఆయన గుర్తు చేశారు. వెనుకబడిన వర్గాల కోసం గత ప్రభుత్వాలు కేటాయించని బడ్జెట్ కంటే ఎక్కువ నిధులను కేటాయించిన ఘనత మా ప్రభుత్వానిదేనని ఆయన నొక్కి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కేటాయించిన నిధులను ఆయా వర్గాలకే ఖర్చు చేయడానికి తమ ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. వెనుకబడిన వర్గాల కోసం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిధులు సమీకరించడం జరుగుతుందన్నారు. నిధుల కేటాయింపు ముఖ్యం కాదని వాటిని అమలుకు చిత్తశుద్ధి అవసరం అన్నారు. తన ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నానని ఆయన చెప్పారు.
పని చేస్తున్నామని వెంటపడకండి: సిఎం
ఫ్రనుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం నిధులను భారీగా ఖర్చు చేస్తున్నామని, అలాగే పనుల కోసం వెంటపడవద్దని కుల సంఘాల నేతల నుద్దేశించి ముఖ్యమంత్రి హితవు పలికారు. కాయలున్న చెట్టువద్దకే పండ్ల కోసం జనం వెళతారని, అలాగని చెట్టుపై ఉన్న పండ్లకోసం రాళ్ళు రువ్వితే పండ్లు కాదు ఆకులు, కొమ్మలు రాలుతాయని కాబట్టి చెట్టును కాపాడడానికి ప్రయత్నాలు చేయాలన్నారు. గురువారం జ్యోతిబా పూలే సందర్భంగా బిసీ నేతలు ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి పైవిధంగా స్పందించారు.
ముఖ్యమంత్రి గారూ నా ప్రసంగాన్ని కొనసాగిస్తా: బొత్స
మహాత్మా జ్యోతిబా పూలే 187వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కిరణ్ పాల్గొనడం కొంత ఆలస్యం కావడంతో సభా కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు. రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్న సమయంలో ముఖ్యమంత్రి వేదికపైకి వచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్ గారు నా ప్రసంగాన్ని కొనసాగిస్తున్నందున అన్యధా భావించకుండా చూడాలని బొత్స సిఎంకు సూచించారు. ప్రసంగం మధ్యలో ముగిస్తే సామెత చెప్పినట్లుగా రెడ్డిచ్చే మొదలెట్టు అన్న సామెతను గుర్తు చేయడం ఎందుకని ఆయన పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఈ కార్యక్రమానికి బిసి వర్గాల శాఖ మంత్రి బసవరాజు సారయ్య అధ్యక్షత వహించారు. మంత్రులు శ్రీ్ధర్‌బాబ, గడ్డం ప్రసాద్‌కుమార్, వైద్యవిద్య శాఖ మంత్రి కొండ్రు మురళీమొహన్, కేంద్ర మంత్రి బలరాం నాయక్, వెనుకబడిన వర్గాల సంఘాల నేతలతో పాటు ఎస్సీ,ఎస్టీ వర్గాల నాయకులు పాల్గొన్నారు.

ధనికుల కోసం విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి: కిరణ్‌కుమార్‌రెడ్డి
english title: 
kiran kumar reddy

పర్యాటక పరవళ్లు

$
0
0

హైదరాబాద్, ఏప్రిల్ 11: కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నేటి నుంచి మూడు రోజుల పాటు ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ 25వ ఉమ్మడి సదస్సు జరుగనున్నాయి. దీంతో అంతర్జాతీయ పర్యాటక రంగ ప్రతినిధులతో రాజధానిలో కోలాహలం నెలకొంది. ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సదస్సును విజయవంతం చేసేందుకు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం ఘనతను ప్రపంచానికి చాటేందుకు కేంద్ర మంత్రి చిరంజీవి సవాలుగా తీసుకుని పనిచేస్తున్నారు. తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈ సదస్సు హైదరాబాద్‌లో జరగడం విశేషం. ప్రస్తుతం యుఎన్‌డబ్ల్యుటివో రీజనల్ కమిషషన్‌కు భారత్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రారంభించనున్న ఈ సదస్సులో చిరంజీవి కీలకోపన్యాసం చేయనున్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని చిరంజీవి ఇప్పటికే ప్రకటించారు. 29 దేశాల నుంచ 200 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. 2013-14 సంవత్సరంలో రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 221 కోట్ల రూపాయలను కేటాయించింది. రాష్ట్రంలో కోనసీమ, భద్రాచలం, పాపికొండలు, కొండపల్లి, ఇబ్రహీంపట్నంలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది. విదేశీ, స్వదేశీ అతిథులకు తారామతి , గోల్కొండ కోటల్లో విందును ఏర్పాటు చేస్తున్నారు. అలాగే శిల్పారామం, నాగార్జునసాగర్, నాగార్జునకొండ పర్యాటక ప్రదేశాలకు ప్రతినిధులను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లుచేశారు. ఈ సదస్సు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.

నేటి నుంచి మూడు రోజులు ప్రపంచ పర్యాటక సదస్సు * తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారిగా భాగ్యనగరం ఆతిథ్యం
english title: 
three day world conference

మంత్రి ఆనంకు మతిభ్రమించింది: వైకాపా

$
0
0

హైదరాబాద్, ఏప్రిల్ 12: రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి మతిభ్రమించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై మంత్రి ఆరోపణలు చేయడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ఆనం లోగడ అన్నారని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా 60 అడుగుల కటౌట్ పెట్టించారని, అనేక విధాలుగా పొగిడారని ఆయన గుర్తు చేశారు. నాడు కీర్తించి, నేడు విమర్శలు గుప్పిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఇలాఉండగా మంత్రి ఆనం మానసిక పరిస్థితి చూస్తుంటే, ఆయన మంత్రి పదవికి, ప్రజాజీవితానికి అనర్హుడని స్పష్టమవుతున్నదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, టి. బాలరాజు ఒక ప్రకటనలో విమర్శించారు. మంత్రిని వెంటనే ఎర్రగడ్డలోని పిచ్చాసుపత్రిలో చేర్చించాలని వారు సూచించారు. పదవి కోసం దిగజారుడు రాజకీయాలు చేయడం మానుకోవాలని, లేకపోతే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని వారు మంత్రిని హెచ్చరించారు.

టీచర్ల సమస్యలు పరిష్కరించండి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 12: ఉపాధ్యాయుల ముఖ్యమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకన కేంద్రాల్లో టీచర్లు ఉద్యమించాలని యుటిఎఫ్ పిలుపునిచ్చింది. ఈ నెలవ 15,16 తేదీల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన సభలు నిర్వహించాలని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఇతర ఉపాధ్యాయ సంఘాలను కలుపుకుని స్పాట్ కేంద్రాలను దిగ్బంధనం చేయాలని యుటిఎఫ్ నేతలు ఎన్ నారాయణ, ఐ వెంకటేశ్వరరావులు చెప్పారు.
కారుమంచి కన్నుమూత
నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం నిర్వాహక కమిటీ సభ్యులు కారుమంచి వేంకటేశ్వరరావు (81) గురువారం రాత్రి కన్నుమూశారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నీరుకొండలో ఆయన 1932 జూలై 1న జన్మించారు. అంత్యక్రియలు 13వ తేదీ ఉదయం గుంటూరులో జరుగుతాయని విజయకుమార్ చెప్పారు.

అక్రమ కిరోసిన్ బాధ్యులు డికె కుటుంబమే: నాగం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 12: పేదలకు పౌర సరఫరాశాఖ అధ్వర్యంలో పంపిణీ చేయాల్సిన నీలి రంగు కిరోసిన్‌ను అక్రమంగా తరలించడం వెనుక మంత్రి డికె అరుణ కుటుంబం హస్తం ఉందని ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా మన్నాపురంలో తొమ్మిది వేల లీటర్ల కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారికంగా ప్రకటించారని, డికె భరతసింహారెడ్డికి చెందిన బిటి హాట్ మిక్సింగ్ ప్లాంటులో సీజ్ చేశారని వివరించారు.
అధికారులు తొమ్మిది వేల లీటర్లుగా చెబుతుండగా, భరతసింహారెడ్డి కేవలం 1600 లీటర్లుగా చెబుతున్నారని, ఇది ఎలా సాధ్యమని నాగం ప్రశ్నించారు. ఈ ఘటన నేపథ్యంలో అధికారులు కేవమలం 6ఎ కేసు మాత్రమే వాహనం, డ్రైవర్‌పై నమోదు చేశారని, ప్లాంట్ యజమాని భరత్‌పై ఎటువంటి కేసు నమోదుచేయలేదని నాగం ఆరోపించారు. కాగా, మంత్రివర్గంలో అవినీతి మంత్రులు ఎక్కువైపోయారని, వారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని నాగం డిమాండ్ చేశారు.

ఎసిబికి చిక్కిన విద్యుత్ అధికారి
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, ఏప్రిల్ 12: ఓ రైతు వద్ద నుంచి 30 వేలు లంచం తీసుకుంటూ బోనకల్ మండలానికి చెందిన విద్యుత్ ఎఇ మున్నీర్‌పాషా ఎసిబికి రెడ్ హ్యాండెడ్‌గా శుక్రవారం దొరికిపోయాడు. సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని రావినూతల గ్రామానికి చెందిన తాళ్ళూరి రామకృష్ణ అనే రైతు తన పొలానికి విద్యుత్ కనెక్షన్ కోసం గత ఏడాది ఎఇని కలవగా డిడి తీయాలని రైతుకు సూచించాడు. దీంతో సదరు రైతు డిడి తీసి ఎఇ కార్యాలయంలో సమర్పించగా గత కొంతకాలంగా కనెక్షన్ ఇవ్వకుండా తిప్పుతున్నాడు.
అయితే చివరకు సర్వే చేసి విద్యుత్ సౌకర్యం కల్పించాలంటే 45 వేల రూపాయలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఏమి చేయాలో తెలియని రైతు ఇస్తానని ఒప్పుకొని శుక్రవారం తన ఇంటికి పిలిపించుకొని 30 వేలు లంచం ఇచ్చి రెడ్ హ్యాండెడ్‌గా ఎసిబి అధికారులకు పట్టించాడు. ఈ మేరకు నిందితుడిని హైదరాబాద్‌లోని ఎసిబి కోర్టుకు తరలిస్తున్నట్లు డిఎస్పీ శ్రీ్ధర్, సిఐ సాంబయ్య పేర్కొన్నారు. దాడుల్లో రాఘవేంద్ర, బాబురెడ్డిలున్నారు.

వైకాపా
english title: 
m

14న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

$
0
0

కంటోన్మెంట్, ఏప్రిల్ 12: ఈనెల 14న కంటోన్మెంట్ లోని అన్నానగర్ చౌరస్తాలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆవిష్కరిస్తారని మాజీ ఎమ్మెల్యే టి.పద్మారావుతెలిపారు. శుక్రవారం క్లాసిక్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. అన్నానగర్, శివానగర్, ఈద్గ అంబేద్కర్ నగర్, ఇందిరానగర్, శ్రీలంక బస్తీ, చంద్రబాబునగర్, కట్టమైసమ్మ కృష్ణానగర్, ఎయిర్‌పోర్టు గుడిసెలు ప్రాంతంలో నివసిస్తున్న 30 వేల మంది తెలంగాణ వాదులు అన్నానగర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, వారు పార్టీ అధినేత చంద్రశేఖరరావును విగ్రహప్రారంభోత్సవానికి రావాల్సిందిగా కోరారని, వారి అభ్యర్థన మేరకు ఆయన వస్తున్నారన్నారు. గడపగడపకు తెలంగాణ వాదాన్ని తీసుకుపోవటంలో భాగంగా కంటోనె్మంట్‌లోని 8 వార్డుల్లో ఆందరినీ ఏకం చేస్తున్నామని, కెసిఆర్ రాకతో పార్టీ మరింతగా బలోపేతం అవుతుందని చెప్పారు. సమావేశంలో నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్ రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, గ్రేటర్ హైద్రాబాద్ నేత కట్టెల శ్రీనివాస్ యాదవ్, కంటోనె్మంట్ ఇన్‌చార్జి గజ్జెల నాగేష్, కంటోనె్మంట్ బోర్డు మాజీ సభ్యుడు బి.ప్రభాకర్, నాయకులు ప్రభుగుప్తా, సుజన్, ఎర్రోల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈనెల 14న కంటోన్మెంట్ లోని అన్నానగర్ చౌరస్తాలో
english title: 
telugu talli

ఆర్‌టిఐకి ఆన్‌లైన్ ఊతం

$
0
0

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: పరిపాలనలో మరింత పారదర్శకత దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు సమర్పించడంతో పాటుగా వాటికి సంబంధించిన ఫీజులను సైతం ఆన్‌లైన్‌లోనే చెల్లించే ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది. ఆన్‌లైన్ పద్ధతి ద్వారా సమాచారాన్ని కోరే తమ హక్కును వినియోగించుకోవడానికి ప్రజలకు తోడ్పడే ఉద్దేశంతో ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు, ఆర్‌టిఐఆన్‌లైన్, జిఓవి.ఇన్’ అనే పోర్టల్‌ను రూపొందించినట్లు దేశంలో సమాచార హక్కు చట్టం అమలుకు నోడల్ డిపార్ట్‌మెంట్‌గా పని చేసే కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (డిఓపిటి)కి చెందిన అధికారులు తెలిపారు.
సమాచారాన్ని కోరే వ్యక్తి పది రూపాయల ఫీజును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని అనుబంధ బ్యాంకుల ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. అంతేకాదు ఈ ఫీజును చెల్లించడానికి క్రెడిట్ కార్డులు లేదా డెబిట్ కార్డులను కూడా ఉపయోగించుకోవచ్చని వారు తెలిపారు. ప్రస్తుతం సమాచారానికి సంబంధించిన దరఖాస్తులు, అపీళ్లను ఆన్‌లైన్‌ద్వారా తమ శాఖకు దాఖలు చేయవచ్చని, అయితే వారు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుని ఆర్‌టిఐ ఫీజును కూడా చెల్లించవచ్చని ఈ శాఖకు చెందిన అధికారి ఒకరు చెప్పారు. ఈ వెబ్‌సైట్‌ను ఈ వారం ప్రారంభంలో ప్రారంభించారు. దీనిద్వారా భారత దేశ పౌరులు మాత్రమే న్యూఢిల్లీలోని అన్ని కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించిన ఆర్‌టిఐ దరఖాస్తులు, లేదా తొలి అపీళ్లను దాఖలు చేయవచ్చు. ఈ నెలాఖరుకల్లా దేశ రాజధానిలోని అన్ని మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలకు ప్రభుత్వం ఈ సదుపాయాన్ని విస్తరింపజేస్తుందని ఆ అధికారి చెప్పారు.
....
సిద్దూకు బుజ్జగింపు
ఆంధ్రభూమి బ్యూరో
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: పార్టీ నాయకత్వం తనను నిర్లక్ష్యం చేస్తోందన్న ఆవేదనతో లోక్‌సభ సభ్వత్వానికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూను బుజ్జగించటానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. ఆయన శుక్రవారం ఫోన్‌లో సిద్దూతో ఈ విషయమై మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలియచేశాయి. తొందరపడి ఎట్టి నిర్ణయం తీసుకోవద్దని రాజ్‌నాథ్ సలహా ఇచ్చినట్లు తెలిసింది. పార్టీలో సముచితమైన ప్రాతినిధ్యం కల్పించటం జరుగుతుందని రాజ్‌నాథ్ హామీ ఇవ్వటంతో పాటు వీలు చూసుకుని ఢిల్లీకి వచ్చి తనను కలవవలసిందిగా సిద్దూను కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు
english title: 
rti

వికలాంగులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే కూన

$
0
0

జీడిమెట్ల, ఏప్రిల్ 12: వికలాంగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు కూన శ్రీశైలంగౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని జగద్గిరిగుట్ట డివిజన్ శ్రీరాంనగర్‌లో క్రాంతి వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వికాలంగులకు 8ట్రై సైకిళ్లు, 2 వీల్ ఛైర్‌లను శ్రీశైలంగౌడ్ చేతులమీదుగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వికలాంగుల సమస్యలను పరిష్కరించడంలో తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. వికలాంగులు తాము అంగవికలురమని అధైర్యపడకుండా మనోధైర్యంతో ముందుకు నడవాలని సూచించారు. ఇంకా ఎవరైనా వికాలంగులకు ట్రైకిళ్లు, వీల్‌చైర్‌లు కావాలనుకుంటే తన దృష్టికి తీసుకువస్తే తాను ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌లు జగన్, రావుల శేషగిరి, సీనియర్ నాయకులు అంజన్‌గౌడ్, ఎత్తరి మారయ్య, తిరుపతిరెడ్డి, సంతోష్‌కుమార్, నందుగౌడ్, సాయిప్రతాప్, క్రాంతి వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాములు, ఉపాధ్యక్షులు బాలస్వామి, రాజేశ్, పరమేశ్వర్, సయ్యద్ ముస్త్ఫా, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
గిరినగర్‌లో హైమాస్ట్ లైట్లు ప్రారంభం
కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని గిరినగర్‌లో హైమాస్ట్ లైట్లను స్థానిక శాసనసభ్యుడు కూన శ్రీశైలంగౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రివేళల్లో ఈ వీధిలైట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. స్థానికంగా నెలకొని ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

వికలాంగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని కుత్బుల్లాపూర్
english title: 
mla kuna srisailam

హత్యకు గురైన యువతి ఆచూకీ లభ్యం

$
0
0

నార్సింగి, మొయినాబాద్, ఏప్రిల్ 12: గండిపేట్ చౌరస్తాలో గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి తగులబెట్టిన యువతిని గుర్తించారు. వివరాల్లోకి వెళితే మాసబ్‌ట్యాంక్ హుమాయూన్‌నగర్‌లో జెఎన్ అపార్ట్‌మెంట్ మూడవ అంతస్తులో అంజుమ్ తస్లీం ఉంటోంది. తస్లింకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. రెండునెలల క్రితమే సికింద్రబాద్ నుంచి వీరు హుమాయూన్ నగర్‌కు మారారు. తస్లిం చిన్నకుమార్తె సానియా అలైస్ (18) అస్నా వెడ్డింగ్ ఈవెంట్ ఆర్గనైజర్‌గా చేస్తోంది. అయితే ఈనెల పదవ తేదీన సాయంత్రం ఇద్దరు వ్యక్తులు ఫోన్‌చేసి అర్జంటు పనిఉందని, వెంటనే రమ్మని పిలిచారు. దీంతో సానియా అర్జంట్ పని ఉందని, తన కోసం కింద కారులో ఇద్దరు వెయిట్ చేస్తున్నారని తల్లితో చెప్పి వెళ్లిపోయింది. అయితే రాత్రి వరకు రాలేదు. అంతేకాకుండా మర్నాడు కూడా రాకపోవడంతో తల్లి తస్లిం స్థానిక హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈనెల 11న ఉగాది పండుగ రోజున గండిపేట్ చౌరస్తాలో ఓ గుర్తుతెలియని యువతిని కొందరు హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు. మృతురాలు సానియా కావచ్చునని అనుమానించిన పోలీసులు ఆమె తల్లిని తీసుకురాగా ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్న మృతదేహం సానియాదేనని ఆమె గుర్తించింది. సానియా తండ్రి షకీర్ దుబాయిలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమయి ఉంటుందని, నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు.

యువతి అదృశ్యం
నార్సింగి, ఏప్రిల్ 12: ఓ యువతి కనిపించకుండా పోయిన సంఘటన ఇది. ఎస్‌ఐ రవీందర్ కథనం ప్రకారం విజయనగర్ కాలనీకి చెందిన స్వామి మొయినాబాద్ ప్రాంతంలో ఓ ఫౌమ్‌హౌస్‌లో పనిచేస్తున్నాడు. స్వామి కూతురు లావణ్య (16) శుక్రవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఓ ఇంట్లో పనిచేసేందుకు లావణ్య వెళ్లింది. మళ్లీ తిరిగి రాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. లావణ్య తల్లిదండ్రులు అన్నిచోట్లా వెతికి ఆమె ఆచూకీ తెలియక హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

* మృతురాలు ఈవెంట్ ఆర్గనైజర్‌గా గుర్తింపు
english title: 
event manager
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>