Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

$
0
0

విజయనగరం, ఏప్రిల్ 14 : బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం పలువురు లబ్ధిదారులకు ఆస్తులతోపాటు కులాంతర వివాహా ప్రోత్సాహక బహుమతులు పంపిణీ చేసారు. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా 21.55 లక్షల రూపాయలు విలువైన ఆస్తులను 28 మంది లబ్దిదారులకు అందజేసారు. కులాంతర వివాహం చేసుకున్న 32 జంటలకు 4 లక్షల రూపాయలు ప్రోత్సాహక బహుమతులను పంపిణీ చేశారు. 2010-11 విద్యాసంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్ధులను సత్కరించారు. హైదరాబాదులో శిక్షణ పొందిన కళాకారులతో ఉపప్రణాళిక చట్టంపై అవగాహనకు నిర్వహించిన సంక్షేమ కళాజాత, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని
english title: 
samskruthika pradarshana

ఘనంగా ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవాలు

$
0
0

జామి, ఏప్రిల్ 14 : మండలంలోని తెలగాపాలెం గ్రామంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుఝాము నుండి ఆలయ ప్రాంగణంలో భక్తి గీతాలు ఆలపిస్తూ భజన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పదలు సాంస్కృతిక కార్యక్రమాలను, ఆటల పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి ప్రోత్సాహకాలను అందజేయనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.

‘అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం’
గజపతినగరం, ఏప్రిల్ 14 : అగ్ని ప్రమాదాలపై మహిళలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించినప్పుడే ప్రమాదాలు కొంత వరకు నివారించవచ్చని స్థానిక ఫస్ట్ క్లాస్ మున్సిప్ మేజిస్ట్రేట్ కె.సత్యలత అన్నారు. ఆదివారం స్థానిక అగ్ని మాపక కేంద్రంలో అగ్ని మాపక వారోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణ మార్గాలపై వారికి అవగాహన లేనందున తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని అన్నారు. వారికి కరపత్రాల ద్వారా ఇతర మార్గాల ద్వారా అవగాహన కల్పించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. అగ్ని ప్రమాదాలతోపాటు బోర్లలో పిల్లలు పడిపోయినపుడు రక్షించాల్సిన బాధ్యత అగ్నిమాపక అధికారులపై ఉందని సిఐ ఎం.శ్రీనివాసరావు అన్నారు. అందుకు సిబ్బంది శిక్షణ పొందాల్సి ఉందన్నారు. 2011-13 సంవత్సరం వరకూ అగ్ని మాపక కేంద్రం పరిధిలో 76 ప్రమాదాల్లోని 15 కోట్ల రూపాయల మేరకు ప్రజాధనాన్ని కాపాడినట్లు అగ్ని మాపక కేంద్రం అధికారి పి.లక్ష్మినారాయణ అన్నారు. కార్యక్రమంలో ఎస్సై టి.కాంతికుమార్ పాల్గొనగా కరపత్రాలను విడుదల చేసిన అనంతరం అగ్ని మాపక ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

చెరకు రైతులకు చెక్కుల పంపిణీ
జామి, ఏప్రిల్ 14 : భీమసింగి సహకార చక్కెర కర్మాగార చెరకు రైతులకు ప్రోత్సాహక చెక్కులను గజపతినగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అందజేశారు. చెరకు సాగులో ఆధునిక పద్ధతులను అవలంభిస్తూ, సేంద్రియ ఎరువులనే వాడుతూ అధిక దిగుబడులను సాధించిన రైతులను గుర్తించి 9 మంది రైతులను ఎంపిక చేసారు. వీరికి సిడిసి ద్వారా 50 వేల రూపాయలు విలువ గల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేసారు. రాబోయే క్రషింగ్ సీజన్‌కు సంబంధించి అధిక చెరకు కర్మాగారానికి లభ్యమయ్యేలా ఏర్పాట్లు చేసుకున్న ప్రణాళికలను ఎమ్మెల్యేకు ఎండి నారాయణరావు తెలియజేసారు. కర్మాగార సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సమక్షంలో పలువురు కాంగ్రెస్‌లో చేరిక
జామి, ఏప్రిల్ 14 : మండలంలోని తాండ్రంకి గ్రామంలో గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఆకర్షితులు అయిన వీరు కాంగ్రెస్‌లో చేరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామంలో చిరకాలంగా ఉన్న సమస్య ప్రధాన వీధికి రహదారి ఏర్పాటు తాండ్రంకి, కొత్తూరు మీదుగా బిటి రోడ్డు ఏర్పాటు, మంచినీటికి సంబంధించి రక్షిత మంచి నీటి పథకం మరమ్మతులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అప్పలనర్సయ్య ద్వారానే పనులను పూర్తి చేసుకో గలిగామని గ్రామస్తులు తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సహకరించాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్‌లో చేరామన్నారు. పార్టీలోకి బీల సూరినాయుడు, వేండ్రపు దేముడు, చలంనాయుడు, కుటుంబాలతో సహా చేరినట్లు ప్రకటించారు.

‘పదవుల కోసం పార్టీ వీడితే గుణపాఠం’
బొబ్బిలి, ఏప్రిల్ 14: పదవుల కోసం పార్టీని వీడిన నాయకులకు రానున్న రోజుల్లో ప్రజలే గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. స్థానిక శ్రీకళాభారతిలో ఆదివారం కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పదవుల కోసం నాయకులు పదవులను వీడ్డం సమంజసమంగా లేదన్నారు. స్వార్థం కోసం కూడా పార్టీని వీడిన వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వారికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను యధావిధిగా చేపడుతున్నామన్నారు. వీటిని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేయాలన్నారు. స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించేందుకు కార్యకర్తలు, నాయకులు మరింత కృషి చేయవల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు శంబంగి వెంకటచినప్పలనాయుడు, వాసిరెడ్డి వరదారామారావులు మాట్లాడుతూ ఒకే కుటుంబానికి బొబ్బిలిలో రెండు పదవులున్నప్పటికీ ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. ఎక్కడా అభివృద్ధి చేపట్టలేదని ఆరోపించారు. ఐదేళ్లు మున్సిపల్ చైర్మన్‌గా ఉంటూ ఐదు పర్యాయాలు మాత్రమే సమావేశాలకు హాజరైతే ఏవిధంగా అభివృద్ధి జరుగుతుందని ప్రశ్నించారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందన్నారు. సంక్షేమ పథకాలు నిరుపేదలందరికీ అందిస్తామన్నారు. అసత్య ప్రచారాలను నమ్మరాదన్నారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సావు కృష్ణమూర్తినాయుడు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను), మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటి గోపాలరావు, నాయకులు బొద్దల సత్యనారాయణ, డి.సి.ఎం.ఎస్. డైరెక్టర్ గొట్టాపు సూర్యనారాయణ, దమ్మా అప్పారావు, శంకా గౌరీపతి, ఇంటి గోవిందరావు, తెర్లి సత్యారావు, బొత్స రమణమ్మతోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తలు మోటారు సైకిల్స్‌తో ర్యాలీ నిర్వహించారు.

‘ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత’
సీతానగరం, ఏప్రిల్ 14: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తామని వైకాపా అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి బేబీనాయన స్పష్టం చేశారు. ఆదివారం కాశాపేట గ్రామంలో కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామంలో పాదయాత్ర నిర్వహించి గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల పక్షాన పోరాడేది తమ పార్టీ ఒక్కటేనని, ఈ విషయాన్ని ప్రజలంతా గ్రహించాలని కోరారు. దళిత వాడల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వైకాపా అధికారంలోకి వస్తేనే రాజన్న రాజ్యం వస్తుందని ఆయన అన్నారు. అనంతరం గ్రామంలో గ్రామస్థులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు చలివేంద్రం నిర్వాహకులు మజ్జిగను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ తెంటు వెంకటప్పలనాయుడు, చినబోగిలి మాజీ సర్పంచ్ సబ్బాన జగన్నాథంలతోపాటు వివిధ గ్రామాలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

‘శాంతి భద్రతల పరిరక్షణకు కృషి’
పార్వతీపురం, ఏప్రిల్ 14: శాంతి భద్రతలు పరిరక్షణకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పార్వతీపురం ఎఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ దేవ్ శర్మ పేర్కొన్నారు. ఆదివారం ఆయన పార్వతీపురం ఎ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎఎస్పీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ వారం రోజుల్లో ఈ ప్రాంతంలో అన్ని అంశాలపై అవగాహన కోసం స్టడీ చేస్తానన్నారు. పార్వతీపురం ప్రాంతంలోని శాంతి భద్రతలతో పాటు ట్రాఫిక్, ఇళ్లదోపిడీ జరిగిన వివిధ అంశాలపై ప్రత్యేక దృషి సారించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఒడిశా సరిహద్దు ప్రాంతాలపై నిఘా ఉంచి ఆ ప్రభుత్వానికి కూడా తమ వంతు సహకారం అందించేందుకు అందించి సరిహద్దు ప్రాంతంలో అప్రమత్తంగా ఉండే చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గాదిమాబాద్ జిల్లాకు చెందిన తాను అలహాబాద్‌లో బి టెక్ చేసిన అనంతరం ఎన్‌టిపిసి, రైల్వేలలో సివిల్ ఇంజనీరుగా పనిచేశానన్నారు. అలాగే 2010 ఐపి ఎస్ బ్యాచ్‌లో సెలక్టయిన అనంతరం ఎపిపోలీసు అకాడమీ హైదరాబాదులోను, నెల్లూరు రూరల్ పోలీసు స్టేషన్ల పరిధిలో శిక్షణ పొందానన్నారు.

మండలంలోని తెలగాపాలెం గ్రామంలో ఉన్న ఆంజనేయస్వామి
english title: 
anjaneya swamy

‘జాతి గర్వించ దగిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్’

$
0
0

విజయనగరం, ఏప్రిల్ 14 :భరతజాతికి దిశను నిర్దేశించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. అంబేద్కర్ జయంతి స్థానిక అంబేద్కర్ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా కోలగట్ల అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అట్టడుగు స్థాయి నుంచి భారత రాజ్యాంగం రచించే స్థాయికి ఎదిగిన అంబేద్కర్ కృషి, పట్టుదల అందరికీ ఆదర్శ నీయమన్నారు. జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారానికి, అభ్యున్నతికి, సంక్షేమానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక పకడ్భందీగా అమలు చేయడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ కలల గ్రామ సభను జరుపుతున్నామన్నారు. జిల్లాలో 3.5 కోట్ల రూపాయలతో ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ బిహెచ్‌ఎస్ వెంకటరావు, జెడ్‌పి సిఇఓ ఎన్.మోహనరావు, ఆర్డీఓ రాజకుమారి, సోషల్‌వేల్ఫేర్ డిడి జీవపుత్రకుమార్, డిఆర్‌డిఎ, మెప్మా, డుమా, ఐసిడిఎస్ పిడిలు జ్యోతి, రమణ, శ్రీరాములనాయుడు, రాబర్ట్స్, ఎస్సీ సోసైటీ ఇడి మనోరమ, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు బాలాజీ జంక్షన్‌లోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య పూలమాల వేసి ఘననివాళులర్పించారు. పలు దళిత సంఘాల నాయకులు జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాబాసాహెబ్‌కు నివాళులర్పించారు.

భరతజాతికి దిశను నిర్దేశించిన మహోన్నత వ్యక్తి
english title: 
ambedkar

భద్రతా ఏర్పాట్లపై డిఐజి సమీక్ష

$
0
0

గజపతినగరం, ఏప్రిల్ 14 : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలని విశాఖ రేంజి డిఐజి స్వాతిలక్రా ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక మార్కెట్ కమిటీ యార్డులో మంగళవారం జరగనున్న సిఎం సభా ఏర్పాట్లను డిఐజి పరిశీలించారు. అలాగే హెలీప్యాడ్ నుంచి ముఖ్యమంత్రి వచ్చే వరకు రహదారులు పరిశీలించారు. సభకు ఎడమ వైపున వివిధ శాఖలకు చెందిన స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నందున ప్రజలు సభా వేదిక వద్దకు రాకుండా వేరే మార్గం ద్వారా సభా ప్రాంగణంలోకి వెళ్ళే ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే భద్రతా ఏర్పాట్ల దృష్యా విఐపి పాసులు ఉన్న వాహనాలు మాత్రమే ఎఎంసి గ్రౌండులోకి అనుమతులు ఇవ్వాలన్నారు. అలాగే సభ జరుగుతున్నంత సేపు సభచుట్టూ ఎక్కడబడితే అక్కడ ఉండకుండా సభా ప్రాంగణంలోకి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అమ్మహస్తం ప్రారంభం సందర్భంగా లబ్ధిదారులను విఐపిలతోపాటు ప్రత్యేకంగా వారికి స్థానాలు కల్పించాలన్నారు. సభకు ఒక్కరోజు సమయం ఉన్నందున ఎఎంసి చుట్టూ పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అనుమానితులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ కార్తికేయ, ఎఎస్పీలు టి.మోహనరావు, రాహుల్‌దేవ్‌శర్మ, జెసి పిఎ శోభ, ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, డిఎస్సీ ఫల్గుణరావు, సిఐ ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రతా
english title: 
swati lakhra

సిఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు

$
0
0

విజయనగరం, ఏప్రిల్ 14: ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16న గజపతినగరం మార్కెట్ యార్డు వద్ద అమ్మ హస్తం పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నాం 3 గంటలకు హెలీకాఫ్టర్‌లో ముఖ్యమంత్రి నేరుగా గజపతినగరం చేరుకుంటారు. ముందుగా అమ్మ హస్తం పథకం ప్రారంభించిన అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తరువాత వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలిస్తారు. కాగా, ఎన్నికల ముందర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటనకు రానుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకొంది. ముఖ్యమంత్రి మూడో దఫా జిల్లాకు విచ్చేస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఉత్సాహం నిండుకుంది. గతంలో బొబ్బిలి, నెల్లిమర్లలోని గుషిణి ప్రాంతాలకు వచ్చారు. .ఇప్పటికే సభాస్థలిని పలుమార్లు అధికారులు పరిశీలించి పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సభా వేదిక, బారికేడ్లు, హెలీప్యాడ్ నిర్మాణం, స్టాళ్ళ ఏర్పాటు, ప్రజానీకానికి వేర్వేరు ప్రవేశాలు కల్పించారు. మార్కెట్ యార్డు ఆవరణలో సభా వేదిక, విఐపిల మార్గం, బహిరంగ సభకు ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేశారు.జిల్లాలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను తెలియజేసే 21 ప్రదర్శన శాలలను ఏర్పాటు చేశారు. కాగా, రూ.50 కోట్ల రుణాలు, మరో రూ.50 కోట్ల విలువైన ఆస్తుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఇదిగాకుండా గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు ఏడు అంబులెన్స్ వాహనాలను ఆ రోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు.

ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న
english title: 
cm's tour

రాజకీయ గుర్రాలు- అందాలు

$
0
0

వావ్ అంటూ సిగ్గువల్ల వచ్చిన బిడి యంతో ఆమె నోటిని పూర్తిగా తెరిచి రెండు చేతులతో ముఖం దాచుకుంది. స్థానిక మండల విలేఖరి మురుగయ్య పక్కనోడి జేబులో నుంచి పెన్ను, సర్పంచ్ చేతిలోంచి కాగితం తీసుకుని ‘‘మిస్ మీ జీవితాశయం ఏమిటి?’’అని రాసుకొచ్చిన ప్రశ్నను అడిగాడు. ‘‘పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవిత లక్ష్యం. ఇప్పటి వరకు నా జీవితం నాది ఇకపై నా జీవితం ప్రజలది. ఈ జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నాను. ప్రజల కోసమే జీవిస్తాను. వారి కళ్లలో ఆనందాన్ని చూడడమే నా జీవితాశయం. పేదల కోసం తిప్పాయపాలెం మొత్తం తిరుగుతాను, తరువాత మొత్తం జిల్లాను, కోస్తా, సీమ, తెలంగాణలో పర్యటిస్తాను. అలానే దేశ మంతా పర్యటిస్తా, ఆ తరువాత ప్రపంచ మంతా పర్యటిస్తాను. ఎక్కడా పేదరికం అనేది ఉండకూడదని శపథం చేస్తున్నాను’’ అంటూ గత వారం రోజుల నుంచి బట్టీ పట్టిన పాఠాన్ని జయప్రభ చెప్పుకొచ్చింది. జయప్రద అంత అందంగా తనకు కూతురు పుట్టాలని తల్లి కోరుకుంది. ప్రభను మూగగా ప్రేమించిన తండ్రి ఆ ప్రేమను పైకి చెప్పుకోలేక అమ్మాయి పేరు ప్రభ అని పెట్టాలని భీష్మించాడు. మధ్యేమార్గంగా ఇద్దరి అభిమానుల పేర్లు కలిపి జయప్రభ అని పెట్టుకున్నారు. జయప్రభ గ్రామంలో కెల్లా తానే అం దగత్తెను అనే గట్టి నమ్మకం ఉండేది. ఆ నమ్మకానికి ఈరోజు అధికారిక ముద్ర పడింది. దాంతో సంతోషంలో తేలిపోతోంది. సర్పంచ్, మునసబు, గ్రామ మోతుబరి మనవ రాళ్ల మధ్య హోరా హోరీగా అందాల పోటీ జరిగి చివరకు ప్రజాస్వామ్య యుతంగా మిస్ తిప్పలాయపాలెంగా జయప్రభ ఎన్నికయ్యారు. ఎంతో కష్టపడి మండల కేంద్రం నుంచి విలేఖరులను కూడా పిలిపించి జయప్రభ ఇంటర్వ్యూ వచ్చేట్టు చేశారు. ‘‘ముదనష్టపు దానా వచ్చే వారం నుంచి పరీక్షలున్నాయి కాస్త చదువుకొని తగలబడే అంటే మాట వినలేదు. ఇంటికి రా నీ సంగతి చెబుతాను అని మనసులోనే తిట్టుకుంది జయప్రభ తల్లి. ఆరువందల గడపలు ఉన్న గ్రామ మది. అదేం చిత్రమో కానీ విశ్వసుందరిగా ఎన్నికైనప్పుడు ఐశ్వర్యారాయ్, సుస్మితా సేన్‌లైనా మిస్ తిప్పాయపాలెం అయినా పేద ప్రజలను ఉ ద్ధరించడమే తమ జీవిత లక్ష్యం అని చెబుతారు. విశ్వసుందరిగా ఎన్నిక కాగానే మురికి వాడల్లో మురికి పిల్లలు, అనాధ ఆశ్రమంలో అనాధ పిల్లలతో అరగంట కబుర్లు చెప్పి ఆ దృశ్యాలు టీవిల్లో కొన్ని గంటల పాటు వచ్చేట్టు చూసుకుంటారు.
ఇంతకూ రాజకీయాలు వదిలేసి అందాల పోటీల గురించి ఎందుకు? అనే కదా సం దేహం. రాజకీయాలంటే అందాల పోటీలు కావని కేంద్ర మంత్రి జైరాం రమేష్ సెలవిచ్చారు. ఆయనా మాట ఎందుకన్నారో కానీ రాజకీయాలు, అందాల పోటీలు ఒకే రీతిలో జరుగుతాయి. ఐశ్వర్యారాయ్ విశ్వసుందరి పోటీల సమయంలో పేదల ఉద్ధరణే తన లక్ష్యం అని చెప్పిందా? లేదా? సరిగ్గా ఇవే మాటలు ప్రతి రాజకీయ నాయకుడు చెబుతుంటాడు. అందాల పోటీలకు అనేక రౌండ్స్‌లో పోటీ ఉన్నట్టుగానే రాజకీయ నాయకులకు ఐదేళ్ల పాటు అనేక రౌండ్స్‌లో పోటీలు ఉంటాయి. పేదరికం గురించి ఇద్దరి అభిప్రాయాలు ఒకటే. ఇద్దరూ పోటీల తరువాత ఆ విషయం మరిచిపోతారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనేది ఇద్దరి సిద్ధాంతం. అధికారంలో ఉన్నప్పుడే నాయకులు నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు. అందంగా ఉన్నప్పుడు నా లుగు యాడ్స్, నాలుగైదు సినిమాలు కొట్టేయాలని అందగత్తెలు చూస్తారు.
రాహుల్‌గాంధీ, మోడీల మధ్య పోటీని చూసి జైరాం రమేష్ రాజకీయాలంటే అం దాల పోటీలు కాదని సెలవిచ్చారు. అందాల పోటీ అని ఒప్పుకోవడానికి జైరాంకు అభ్యంతరం ఏమిటో? ఇద్దరూ బ్రహ్మచారులే కూడా. ఒకరు స్వతంత్రంగా వ్యవహరిస్తారు, ఒకరు తల్లి చాటు బిడ్డ. ఒకరు స్వయం కృషితో ఎదిగిన వారు ఒకరు వంశ పారంపర్యంగా వస్తున్న ఆస్తిని అనుభవిస్తున్న వారు అంతే తేడా!
జైరాం అలా అంటే మన తెలుగు బాబేమో రాజకీయం అంటే గుర్రాల పోటీగా భావిస్తూ మేలు జాతి గుర్రాల కోసం అలుపెరగకుండా ప్రయత్నిస్తున్నారు. పేకాటలో డబ్బులు పోయిన వారు ఈ ఒక్క ఆటతో పోయిన సొమ్మంతా తిరిగి సంపాదించేద్దాం అని నిండా మునిగేంత వరకు ప్రయత్నిస్తారు. గుర్రాల పోటీల్లో కూడా అంతే! నిండా మునిగేంత వరకు తెలియదు. వరుసగా రెండు సార్లు నమ్ముకున్న గుర్రాలు నట్టేట ముంచడంతో ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లు అంటున్నారు.
గుర్రాలకే నేతల భాష వస్తే...మంచి గుర్రాల కోసం రౌతు వెతికినట్టే, మంచి రౌతు కోసం గుర్రాలు వెతుకుతాయి. గెలుపు గుర్రాల కోసం తెలుగు రౌతు వెతుకుతుంటే ఈ రౌతును నమ్ముకుంటే అతనితో పాటు మనమూ మునిగిపోతాం అని గుర్రాలు తోక జాడించి గెలిచే చాన్స్ ఉన్న రౌతు వద్దకు పరుగులు తీస్తాయ.
గుర్రాలు చంచలమైనవి ఒక చోట ఉండవు. ఆ విషయం వాటిని కొట్టుకొచ్చిన తెలుగు రౌతుకు కూడా తెలుసు. ఒక గుర్రం గోడ దూకితే 50 గుర్రాలను తయారు చేసుకుంటాను అంటున్నారు. గుర్రాలు గోడ దూకినప్పుడు కొత్త గుర్రాలను తయారు చేసుకోవడం మాంత్రికుడిని హతమార్చిన తోట రాముడికే సాధ్యం కానప్పుడు వాళ్ల అల్లుడికి సాధ్యం అవుతుందా? గుర్రాలకు రౌతు మీదనే నమ్మకం పోయింది. ఆ సంగతి మీకు తెలియడం లేదు అని గుర్రాలు అంటున్నాయి. ఇప్పుడున్న శాసన సభ్యుల వసతి గృహం( ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్) నిజాం కాలంలో గుర్రాల శాల. కొన్ని భవనాలను మళ్లీ నిర్మించినప్పటికీ అప్పటి గుర్రాల శాల ఆనవాళ్లు, నిర్మాణాలు కొన్ని ఇంకా అలానే ఉన్నాయి. గుర్రాల వసతి శాలను ఎమ్మెల్యేల వసతి శాలగా మార్చాలనే ఆలోచన ఎందుకొచ్చిందో? చిత్రమే.

వావ్ అంటూ సిగ్గువల్ల వచ్చిన బిడి యంతో ఆమె నోటిని పూర్తిగా తెరిచి
english title: 
r

స్వాతంత్య్రం ఎవరికి వచ్చింది?

$
0
0

స్వాతంత్య్రం వచ్చిందని భుజాలు ఎగరవేయడం తప్ప ఫలితం శూన్యం! అరవై అయిదు సంవత్సరాలు అయింది భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి. మరి పేదరికం మాత్రం తాండవం చేస్తోంది! కనీసం ఒక పూట అయినా ఆహారం లేక పస్తులతో మాడి బతుకు భారంగా వెళ్లబుచ్చే కుటుంబాలు ఎన్ని? గ్రామసీమలు అభివృద్ధికి నోచుకోని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నది. మంచినీరు దొరక్క మహిళలు దూర ప్రాంతాలకు వెళ్లి అవస్థపడే ప్రత్యక్ష నిదర్శనం కనిపిస్తుంది. స్వాతంత్య్రం కొరకు ప్రాణం ధనం అర్పించి ఫలాన్ని అందించిన మహా పురుషులు ఎంతటి త్యాగధనులో మాటలలో చెప్పేది కాదు! స్వార్ధపరులు రాజకీయ చదరంగంలో విషపావులుగా ఎత్తుకుపైఎత్తు వేస్తూ వాయిదాల పద్ధతి అయిదేళ్లకోసారి అధికార కుర్చీకోసం కుస్తీపడుతూ కుర్చీ ఎక్కిన వారు నిలువు దోపిడీతో ప్రజల రక్తమాంసాన్ని జలగలా పీల్చి వేస్తున్నారు. దేశంలో విచ్చలవిడిగా అవినీతి అడుగడుగునా అంగలు వేస్తున్న నేపథ్యంలో స్వాతంత్య్రం వచ్చింది బొజ్జరాయుళ్లకి కాక మరెవరికి?
-కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు
శిక్షాస్మృతి (ఐపిసి)ని తిరగరాయాలి
ఇప్పటి అవినీతి పద్ధతులు, నేరాలకు, అక్రమాలకు, చేసే తప్పుడు పనులకు 50 సంవత్సరాల క్రితం వ్రాయబడిన, పీనల్‌కోడ్ ప్రస్తుతం పనికి రాదు. సెక్షన్లలోని జుల్మానాలు, శిక్షలు ఆనాటికి, అప్పటి రోజులకు సరిపోవచ్చు. కాని ఈరోజుకు ఆ జరిమానాలు, శిక్షలు చాలా తక్కువ. 50 సంవత్సరాల క్రితం రూ.500/-లు జరిమానా వుంటే, అది ఇప్పుడు కనీసము రూ.5,000/-లైనా వుండాలి. అదే విధంగా జైలు శిక్ష కాలాన్ని కూడ పెంచాలి. నేరస్థులు జుల్మానాలకు, జైలు శిక్షలకు భయపడటం లేదు. పోలీసు వ్యవస్థన్నా, కోర్టులన్నా భయం లేదు. మహారాష్టల్రో శాసనసభ్యులే రాజకీయ గూండాలై, పోలీసు అధికారినే బహిరంగంగా కొట్టడం జరిగింది. దేశమంతా సిగ్గుతో తలదించుకునే పని చేశారు. అదే పోలీసుల రక్షణలో బ్రతుకుతున్న రాజకీయ నాయకులు, పోలీసులనే వ్యతిరేకిస్తే, వ్యవస్థ ఏవౌతుందో ఆలోచించాలి. కోర్టుల ఆధీనంలో పోలీసు వ్యవస్థ వుండాలే గాని రాజకీయ నాయకుల చేతుల్లో గాదు. మారిన కాలానుగుణంగా జరిమానాలు, శిక్షలు మారాలి. ఇండియన్ పీనల్ కోడ్ తిరగ వ్రాసి శిక్షలు, జరిమానాలు పెంచాలి. జరిమానాలు, శిక్షలు నేరస్థుడు భయపడే రీతిలో వుండాలి. అలా కానప్పుడు మానభంగాలు, రేప్‌లు, కూనీలు, అమాయకుల ఆస్తుల దోపిడీలు సర్వసాధారణము అవుతాయి. ప్రజల ఆస్తులకు రక్షణ వుండదు. పోలీసులకే రక్షణ లేకుండా పోయే రోజులు రావటం సిగ్గుచేటు.
- జి. శ్రీనివాసులు, అనంతపురం
నిస్వార్థపరులనే గెలిపించాలి
ఎందరో త్యాగధనులు నిస్వార్థపూరితంగా ఎనలేని పోరాటాలు చేసి, జీవితాలను బలిదానం గావించి మనకు స్వాతంత్య్రం తీసుకువచ్చారు. ప్రజలందరూ కుల, మత, వర్ణ, వర్గ బేధాలు లేకుండా సంక్షేమ ఫలాలు సమానంగా అనుభవిస్తూ హాయిగా జీవితం గడిపేందుకు అనువుగా చక్కని రాజ్యాంగాన్ని తయారుచేసి ఇచ్చారు. కాలక్రమేణా త్యాగధనుల కాలం అంతరించి స్వార్థపరులు, దోపిడీదారులు, వ్యాపారస్థులు రాజకీయాలలో ప్రవేశించి దాని స్వరూపం మార్చేసారు. ప్రజల సొమ్మును నిస్సిగ్గుగా స్వాహాచేస్తూ తమ, తమపై ఆధారపడిన భజనపరులను అభివృద్ధి చేసుకోడానికే పదవులు, అధికారం ఉపయోగించుకుంటున్నారు. పేదవాడి జీవన విధానంలో ఏమాత్రం మార్పులేకపోగా రాజకీయ నేతలు వేల కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించుకుంటున్నారు.రాజకీయం స్వార్థపరులకు అడ్డాగామారింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతోంది. ప్రజలందరూ మేల్కొని అక్రమదారులను, అవినీతిపరులను ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టాలి. నిస్వార్థపరులనే గెలిపించాలి. ప్రజల సొమ్ము దోచేవారికి ఏ దుర్గతి పడుతుందో ఎన్నికల ద్వారా ప్రత్యక్షంగా నిరూపించాలి.
- సిహెచ్.సాయిఋత్త్విక్, నల్గొండ
పనికిమాలిన చర్చ
పనిలేనివాడు పిల్లి తల గొరిగినట్లుగా ఉంది ఈ మంత్రివర్యుల ఆలోచనా ధోరణి.దేశంలో ఇంక ఏది పరిష్కరించవలసిన సమస్య లేనట్లుగా మంత్రులు ప్రవర్తిస్తున్నారు. ఆచార వ్యవహారాలు, కుటుంబ జీవన విధానం శారీరక ఆరోగ్యస్థితిని బట్టి ఆడపిల్లలు శృంగారమునకు అర్హులవుతారు. వారి శరీరంలో మార్పు సజముగా జరుగుతూ ఉంటుంది. అంతేకాని దీనికి వయసు నిర్ణయించుట ఇసుక నుండి తైలము తీయుట వంటిది. ఇటువంటి అనాలోచిత చర్యలకు కాలం వెళ్ళబుచ్చేబదులు అవినీతి నిర్మూలనకు, పేదలిక నిర్మూలనకు,ప్రతీ వానికి కూడు గూడు గుడ్డలకు లోటు లేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటే మంచిది. పనికిమాలిన పనులకు పార్లమెంటు చర్చావేదిక కాకూడదు.
- ఓలేటి నారాయణశాస్ర్తీ, కాకరపర్రు

స్వాతంత్య్రం వచ్చిందని భుజాలు ఎగరవేయడం తప్ప ఫలితం శూన్యం!
english title: 
s

నేర్చుకుందాం

$
0
0

చాపంబుట్టుచు బుట్ట జచ్చుచు మహా చండాల సంసార పా
రావారంబున గూలి తాజెడుటకుం బ్రవ్యక్తిగా నాత్మలో
నేపం బొందక యేను నీవనుట తానే జ్ఞానమో శ్రీ మహా
దేవా యట్టి కుతర్కముం గలదె చింతింపంగా సర్వేశ్వరా!
భావం: సర్వేశ్వరా! చావడం కోసం పుడ్తూ, పుట్టడం కోసం చస్తూ నీచమైన ఈ సంసారార్ణవంలో కూలి తాను చెడిపోయనందుకు మంచిమనిషిగా తాను అంతరంగంలో అసహ్యపడడానికి బదులుగా నీవే నేను (త్వమేవాహం) అంటే సో2 హం అని అనడం ఏమి జ్ఞానం? శ్రీ మహా దేవా! ఆలోచిస్తే (ఎక్కడైనా ) ఇలాంటి కుతర్కం ఉంటుందా?
శివుని గురించి ఆలోచించకుండా ఎపుడూ ఈ సంసారంలో ఉండే సుఖాలను చూసి వాటికోసం వ్యామోహం చెందుతూ ఇక్కడే పుడ్తూ, చస్తూ ఉండడమంటే అది నిజమైన అజ్ఞానమే. అలాకాక పరమాత్మను తెలుసుకొని ఆ పరమ శివుడికోసం అహర్నిశమూ యాతనపడి శివసాయుజ్యదృష్టిని అలవర్చుకుని శివునికోసం పరితపిస్తే ఆ సుఖమే, అంటే ఆ ఆనందం శాశ్వతమైనది కదా. దానికోసం ప్రతివారు ఆలోచించాలి అని శివభక్తుల భావమని కవి అంటున్నారు.

సర్వేశ్వర శతకములోని పద్యమిది

చాపంబుట్టుచు బుట్ట జచ్చుచు మహా చండాల సంసార పా
english title: 
nerchukundam
author: 
నిర్వహణ: శ్రీపావని సేవా సమితి, హైదరాబాద్

అమ్మ - 66

$
0
0

విశ్రాంతి శరీరం పొందింది కానీ మనసు కాదన్నట్లుగా అతని ముఖం అలజడితో వంకర్లు తిరిగి ఉంది. మంచం పక్కనే చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు... అతని తమ్ముడు రఘువర్. చాలా సేపటినుంచీ అన్నయ్యవైపే చూస్తూ ఆందోళన పడుతున్నాడు.
కళ్ళుతెరిచి తనవైపుచూసిన అన్నయ్యను చూసి అతనికి పరమానందం వేసింది. అన్నయ్య వైపు... ఆలంబనగా చూసి... పక్కన కూర్చుని అరచేయి తట్టాడు... ఆత్మస్థయిర్యంగా ఉండమని.
‘‘వారసులులేని మన భవంతి నాతోపాటుగా మూతపడుతుందేమో కదూ రాఘవా? అన్నారాయన గాద్గదికంగా..
‘‘అన్నయ్య... అదే దిగులుతో మీరు మంచమెక్కారు. అదే దిగులుతో మీరు మరణానికి దగ్గరవుతున్నారు. మీరు జీవించాలంటే.. ఆ దిగులును జయించాలి’’ అన్నాడు అనునయంగా.
‘‘బిడ్డలుకలుగలేదని మీ వదినగారు.. నా అసమర్థతను నిరసిస్తూ.. నాకు దూరంగా జీవిస్తుంది. గొడ్రాలి బ్రతుకు తనకు శాసించబడిందని కుమిలిపోతూంది. నావల్లే సంతానం కలగలేదనే ఆలోచన నన్ను నిర్వీర్యం చేసి క్షంతవ్యునిగా శిక్షిస్తుంది. మీ వదినగారికేకాదు... మన వంశానికే నేను కొనసాగింపు లేకుండా.... భవిష్యత్తు లేకుండా చేశానన్న భావన నా శక్తినీ.. మేధస్సునూ కరిగించి వేస్తూంది’’ ఆయన గొంతు దుఃఖంతో పూరుకుపోయి మాటరానీయడంలేదు.
‘‘అన్నయ్యా.. మీరిలా... అధైర్యపడితే... నేనేమీ చెయ్యలేను... మీరు ధైర్యంగా ఉండాలి’’
‘‘ఎక్కడి ధైర్యంరా రఘువర్? నువ్వు ప్రేమించిన అమ్మాయి మరణించిందని వివాహానే్న కాదన్నావు. నేనిలా సంతానంలేక బాధపడుతున్నాను. ఇక మన వంశం... నామరూపాలు లేకుండా పోతుందనే వేదన... నన్ను పిచ్చివాణ్ణి చేస్తుందిరా!’’ అంటూ లేచి కూర్చోడానికి ప్రయత్నించాడు.
ఫోన్ రావడంతో రఘువర్ ఫోన్ అందుకుని.. అటువైపు వ్యక్తికి పరిస్థితి వివరించాడు. అది వింటున్న అన్నయ్య ఇంద్రదత్... చెయ్యి సాచాడు రిసీవర్ కోసం... అటువైపునుంచీ తన ఫ్రెండ్ గొంతు విని ఆనందంతో ముఖం విప్పారింది.
‘‘ఇండియాకు ఎప్పుడు వస్తున్నావురా!’’ అనడిగాడు.
‘‘నేను రావడం సరే! నువ్వేంటి పిల్లలూ... పిల్లలూ... వంశం వారసత్వం గట్రా.. అంటూ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నావట.. ఇంకా ఏ సెంచరీలో ఉన్నావ్‌రా నువ్వు! పిల్లలు లేకపోతే ఏమవుతుంది! ఎవర్నయినా దత్తత తీసుకో, అదీ కాకపోతే ఆస్తంతా అనాధ శరణాలయాలకు దానం చేసి.. ఎంతోమంది పిల్లలకు తండ్రిగా నిలిచిపో... వంశం... వారసత్వం అంతా మనం సృష్టించుకున్న భ్రమలురా! ముందు అందులో నుంచి బయటకురా.. అప్పుడు నీ ఆరోగ్యం బాగుపడుతుంది!’’ గట్టిగా గరిచాడతను.
‘‘్భరతీయుల సెంటిమెంట్స్ అంత తొందరగా మారవురా! నన్ను నేను ఎంత సమర్థించుకున్నా.. మనసు దానంతటదే.. దిగులులో కూరుకుపోతుందిరా’’ అని బలవంతంగా నవ్వాడు.
‘‘అవునూ ఓ సంవత్సరం క్రితం స్పెర్మ్ ఇన్‌సెమినేషన్ జరిగింది కదా, దాని రిపోర్టు ఏమయిందీ’’ అడిగాడతను.
‘‘ఫెయిలయిందిరా! అదీ నా దురదృష్టానే్న నిరూపించింది’’ అన్నాడు.
‘‘ఓ.. ఐసీ.. కాని అది ఫెయిలవ్వడానికి వీలు లేదే. ఎలా జరిగింది? మేం చేస్తున్న ఏ కేసు ఇంతవరకూ ఫెయిలవ్వలేదు. ఇండియాలో కూడా ఇంచుమించుగా అన్ని కేసులూ సక్సెస్ అవుతున్నాయి. మరీ ఈ కేసు ఫెయిలవ్వడానికి కారణం ఏమిటో నేను... కేస్ డీల్ చేసి డాక్టర్స్‌ను కనుక్కుని.. మళ్లీ ఫోన్ చేస్తానాగు. ఏదైనా అవకాశం ఉంటే ఇంకొకసారి ట్రై చెయ్యొచ్చు’’ అంటూ ఫోన్ పెట్టేశాడు.
వెంటనే నాలుగైదు ఫోన్లు చేసి రెండు గంటలు పైగా డిస్కస్ చేశాడు. చివరి ఫోన్ ముగిసేసరికి అతని ముఖంలో నమ్మలేని ఓ నిజం తెలుసుకున్న ఆనందం.. పొరపాటును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వైద్య రంగం చేస్తున్న మోసం పట్ల కోపం ఒక్కసారిగా కలిగాయి.
ఆ రెండింనీ కలగలుపుతూ.. తన స్నేహితుడి ప్రాణం నిలిపేందుకు... అతనికో ఫోన్ చేశాడు.
ఆ ఫోన్ మాట్లాడాక అప్పటివరకూ ఉన్న నీరసాన్ని సింహం జూలు విదిల్చినట్లు వదిలించుకుని.. ఉవ్వెత్తున లేచి నిలబడ్డాడు.
***
అవినాష్ జీవన ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు.
కాట్స్ మీద ప్లేట్‌లో అన్నం కలిపి అవినాష్‌కు తినిపిస్తోంది. ముద్ద అందుకుంటూ ఏదో చదువుకుంటున్నాడు. పక్కనే కూర్చుని బొమ్మతో ఆడుకుంటున్న ప్రకృతి అవినాష్‌కు పెట్టబోయే చెయ్యి పట్టుకుని లాగి నోరు తెరిచి తనకు పెట్టమని..
‘‘ఆ..ఆ...’’ అంటూంది.
‘‘చూడు.. అవీ.. తన కోసం పప్పేసి, నెయ్యేసి, ఇల్లంతా తిప్పి ఆడిస్తూ పెడితేగానీ ఐదుముద్దలు తినడం కష్టం. నీకు తినిపిస్తూంటే చూడు ఎంత కుళ్ళో లాక్కుని మరీ పెట్టమంటుంది’’ అంది కంప్లయింట్ చేస్తూ...
‘‘పోనీ పెట్టు’’ అన్నాడు తల తిప్పకుండా...
‘‘పెట్టు! తనకు పెట్టేపుడు ఎంత విసిగిస్తుందో నీకేం తెలుసు!’’ అంది జీవన ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూసి పెట్టద్దని అర్థం చేసుకుందేమో...
‘‘నా...న్నా..న్నా’’ అంటూ అవినాష్‌కు, తనూ జీవనమీదేదో కంప్లయింట్ చేస్తున్నట్లుగా జీవన వైపుచెయ్యి చూపిస్తూ పెదవులు వంపేసి ఏడుపు మొహం పెట్టేసింది ప్రకృతి.
‘‘అమ్మ పెట్టనంటూంది కదా! గయ్యాళి అమ్మ. నేను పెడతానేం నీకు. ఆ.. ఆ..’’ అంటూ తను తినిపించసాగాడు. ఒక్కో ముద్దా జీవన అవినాష్‌కు పెడుతూంటే అవినాష్ ప్రకృతికి పెడుతూ... ఆడుతూ.. అల్లరిగా ఆనందంగా...
ఆ ఆనందం వాళ్ళకు పాప దక్కినప్పటినుంచి దక్కింది. అవినాష్ జీవనను వివాహం చేసుకున్నప్పటినుంచీ దక్కింది.
వారి జంటతో కాపురం పెట్టింది.. వసంత మనసు మజ్జిగకుండలా చల్లబడింది.
ఒకరికోసం ఒకరు అన్నట్లుండే ఆ ముగ్గుర్నీ చూస్తూంటే ఆ కాలనీలో అందరికీ ఆనందదాయకంగానే ఉంది.
ఇప్పటికీ జీవనను పాప గురించి.. మరో ప్రశ్న వేయలేదు అవినాష్.
‘‘పాప జీవనది. పాపతో కలిసిన జీవన నాది!’’ అనుకున్నాడు.
అనాధ జీవితం గడిపిన తనకు అద్భుతమైన అనుబంధాలు దొరికాయని ఆనందపడ్డాడు.
జీవన కూడా ఎంతో సంతృప్తిగా జీవనం సాగిస్తూంది.
తనకు గర్భం ఎలా వచ్చిందనేది... తనకే సాక్ష్యం దొరకలేదు ఇంకా..
వసంత జీవనలో తన గర్భాన్ని గురించిన అనుమానాలనూ ఆలోచ
అనవసరం ప్రస్తావనగా.. జీవితంలో.. ఆ ఆలోచనకు చోటు లేకుండా చేసింది.నలనూ జీవనలో రేగనివ్వడంలేదు.
-ఇంకాఉంది

విశ్రాంతి శరీరం పొందింది కానీ మనసు కాదన్నట్లుగా అతని ముఖం
english title: 
amma serial
author: 
--శ్రీలత

రంగనాథ రామాయణం - 197

$
0
0

అప్పుడు విభీషణుడు చిరునవ్వు నవ్వి దనుజనాథుడితో ‘‘రావణా! నిట్టూర్పులే మ్రోగడంగా, ఘన చింతయే గరళంగా, కోపం, చలం కోరలుగా, నిజనఖాలు ముణినికరం కాగా దారుణమైన సీతాకాల సర్పం నిన్ను ఎక్కడికి పోనిస్తుంది? అపకీర్తి అట! పాపం అట? సుఖానికి విపరీతం అట. ఈ చెడు త్రోవ విడిచిపెట్టు’’ అని పలికి అంతతో పోక ప్రహస్తుడితో ఈ కరణి పలికాడు.
‘‘పిడుగులవంటి రామ బాణాలు రెక్కలతో నీ వురమందు నాటి గాయపరిచేనాడు తెలుసుకొంటావు. ఇట్టట్టు మిడిసిపడుతున్నావు. ఇకమీద కరకు మాటలాడినట్లు కాదు. ఈ కుంభకర్ణుడు, ఈ కుంభ నికుంభులు, ఈ మహోదరుడు, ఈ మహాపార్శ్వుడు, ఈ ఇంద్రజిత్తు ఆ రాముణ్ణి యుద్ధంలో జయించేవారా? రాముడు ఎత్తి వచ్చాక మీరు ఎక్కడికి పోతారు? రావణుడికి అండగా, ఆ రాముడికి అడ్డపడుదురుగాక! వినండి. ఇంద్రుడు కాపడ వచ్చినా, దేవతలు రక్షింప ఏతెంచినా ప్రళయకాలాగ్ని రుద్రుడు ప్రోవవచ్చినా, కాల మృత్యువు కావవచ్చినా రావణుణ్ణి సంహరింపక ఆ రామ విభుడు పోవిడుచునా?
దనుజనాథుడిపై విల్లు ఎక్కిపెట్టినప్పుడు మనువంశాధిపుడు మన చేతులకు చిక్కుతాడా? ఫెళ ఫెళ ప్రజ్వలించే అగ్ని పిడికిట అణగుతుందా? ఉప్పొంగు ఉధధి ఉడిసిట అణగుతుందా? పాతాళ స్థలిని పట్టతరమా? గగనభాగాన్ని కట్టగలమా? దిక్కులను త్రెంప వశమా? ధూర్జటి వాలుత్రుంపవచ్చా? సూర్యడు అరచేత ఇమిడి పడి వుంటాడా? ఏమీ ఎరుగని మీతో మాట్లాడడం నిరర్థకం. దనుజాధిపతి మూర్ఖుడు. కామాతురుడు. మిముబోటి అవివేకులైన మంత్రుల దురాలోచనలవల్ల మడియడా? ఈ రావణుడు నా మాట వింటాడా? మీ మాటలు ఆలకించి నాశనం అవుతాడు కాని’’ అని మొగమోటమి లేకుండా వాక్రుచ్చాడు.
అప్పుడు ప్రహస్తుడు విభీషణుడి వివేకపు మాటలు కైకొనక ‘‘విభీషణా! ఇంతవరకు ఉరగులతో పోరి ఓడిపోము. సురలతో పోరాడి ఎప్పుడూ స్రుక్కము. యక్షులని ఎదిరించి ఎన్నడూ తలవంచము. రాక్షసుల చేత ఎన్నడు వెతలు పొందము. నరుడైన ఆ రామ విభుడికి మేము భీతి చెందుతామా? ఓడిపోతామా? ఏ విధంగా నువ్వు ఆ రామాదులని ఎరిగున్నావు? నీ నోట నేడింత వింతలు వింటున్నాము. మన రాక్షసుల లావు అంత తక్కువా?’’అని పలికాడు.
ఇంద్రజిత్తు విభీషణునకు తన లావు ఎరిగించుట
అంత దుర్మదగ్రంధి ఇంద్రజిత్తు- రాముడి తమ్ముడు లక్ష్మణుడి శరాగ్నిలో పడి కాలిపోనుండటంవల్ల ఆగ్రహించాడు. ‘‘విభీషణా! ఏ రూపంగానైనా మనస్సులో నీతిని తలపక నువ్వు భీతిల్లుతున్నావు. రాక్షస మహిమలు వూహింపగా మనలో హీనాతిహీనుడైనా రామలక్ష్మణుల్ని చంపనేరుస్తాడు. ముజ్జగములు పాలించువాడిని ఇంద్రుణ్ణి పట్టి చెరబెట్టునా? అతి వెల్ల యేనుగు చౌదంతి ఐరావతాన్ని పట్టుకొని దాని దంతాలు విరువలేదా? అగ్నిని అదలించాను. అంతకుణ్ణి నొప్పించాను. పాశిని మర్దించాను. శూలిని ఓడించాను. నేను విజృంభిస్తే నా చేత ఈ నరులు చావరా? నువ్వు పరమాణువులైన వారిని కొండలు చేసి పలుకుతున్నావు.
సప్త సమలుద్రాలని కలచి వేయమంటావా? మేరు మందరగిరుల్ని పిండీ గుండా చెయ్యమంటావా? ధరాతలాన్ని ఒక అంగలో దాటమంటావా? నేలను నింగిని ఏకం చేసి మీటమంటావా? జగాలను వంచమంటావా? మున్నీటిలో వనచరతతిని ముంచమంటావా? వేయి ఫణాలతో పుడమి భారాన్ని మోసే సర్పరాజు ఆదిశేషుణ్ణి పట్టి విషం పిండమంటావా? దిగ్గజాల తుండాలు పట్టి ఈడ్చుకొని తెమ్మంటావా? సూర్యచంద్ర బింబాలని నేల రాతునా? ఆజిలో నూతాలచేత వానరుల రక్తములు క్రోలించమంటావా? శరపరంపరలతో మిన్ను కప్పి వేయనా? పెడచేత పట్టి పుడిమిని మింటినీ నలిపి పొడి పొడి చేయమంటావా? దనుజ నాథుడి తమ్ముడివి- పెద్దవాడవు కనుక నిన్ను ఏమీ నిందించక మన్నిస్తున్నాను. మరొకడు ఈ రీతి పలికితే సైరిస్తానా?’’ అని నిష్ఠురోక్తులాడాడు.
-ఇంకాఉంది

అప్పుడు విభీషణుడు చిరునవ్వు నవ్వి దనుజనాథుడితో ‘‘రావణా!
english title: 
ranganatha ramayanam
author: 
--శ్రీ పాద కృష్ణ మూర్తి

శ్రీరామ నామామృతము

$
0
0

నవవసంత ఆగమనము ధర్మ పరిపాలనకు ఆధ్యుడైన శ్రీరాముని నవరాత్రులు ప్రారంభం ఒకేసారి జరుగుతాయి. శిశిరంలో ఆకురాలి లేలేత పల్లవాలు చిగురించేవేళ ‘రామనామామృత మహిమ’ తెలుసుకోవటము, స్మరించుకోవటం ఆనందదాయకమే.
‘కూజంతం రామ రామేతి ....వాల్మీకి కోకిలం’ అని భారతీయులకు అత్యంత ఆదరణీయమైన రామాయణం ప్రారంభంలో చెబుతుంది. కోకిల వంటి వాల్మీకి మహర్షి గళములోనే కాదు ప్రతి భక్తుని హృదయంలో స్థిరమైన వాడే ఆత్మారాముడు. విష్ణుమూర్తి దశావతారాల్లో సంపూర్ణ అవతారంగా గుర్తింపుపొందింది రామావతారం. ‘రామో విగహవాన్ ధర్మః’ అన్నట్లు ధర్మ, సత్య వాక్పరిపాలనకు, క్రమశిక్షణకు, నీతి నియమ పాలనకు ఆలవాలమైనది రామాయణము - రామనామము. అందుకే భారతంలో వ్యాసులవారు అనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామాల్లో కూడా రామనామ మహిమ వెల్లడించారు. పార్వతీదేవి విష్ణు సహస్రనామ పారాయణం శక్తిలేనివారికి సూక్ష్మంలో మోక్షం పొందే మార్గం ఏమిటని శివుణ్ణి ప్రార్థిస్తే.....
‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
శ్రీ సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’ అనే రామనామం ఉపదేశించాడట శివుడు.
రామ శబ్దము పరికించి చూసినట్లైతే ‘ర- అ - మ’ అను మూడు వర్ణాల కలయిక ఈ పదము. ‘ర’అగ్ని బీజాక్షరము- శత్రువును అజ్ఞానమనే చీకట్లను, పాపాలను భస్మం చేసి వెలుగులనిస్తుంది. ‘అ’ అక్షరం ప్రకాశ ప్రతాపాది గుణములు గలదని ఏకాక్షర నిఘంటువులు చెబుతాయి. ‘మ’ వర్ణం ఆనందానికి, లక్ష్మీ సంపదకు, అమ్మవారికి సంకేతం. శత్రు సంహారియై పాపం నాశనం చేసి, అజ్ఞానపు చీకట్లను తొలగించి వెలుతురునివ్వటం ద్వారా సుఖ సంతోషాది సంపదలివ్వగలశక్తిగలది ‘రామ’ శబ్దము. అందుకే దీనిని తారక మంత్రం అంటారు. సంస్కృత శబ్దమంజరిలో తొలి పదం ‘రామ’ శబ్దమే.
రమతే ఇతి రామః రమంతే ఇతి రామః అని వ్యుత్పత్తి అర్థం చెబుతుంది. వసంత ఋతువులో లేత పచ్చని చెట్లతో కూడిన ఆరామాల్లో వాల్మీకి కోకిల రాగాలు రామనామాలై పరవశింపజేస్తాయి.
‘‘రామ నామ పఠన రమణచే వాల్మీకి, పరగ బోయడైన బాపడాయె’ అన్నది తెలుగు పద్యం- రామనామం నిత్యం పఠనవల్ల సకల కష్టాలు తొలగి సౌభాగ్యాలు కల్గిస్తాయని పెద్దల వచనం. అందుకే దశరథుడు పుత్రకామేష్ఠి చేసి సంతానం పొందిన తర్వాతమొదటి శిశువుకు వసిష్ఠ మహర్షి ఆదేశంతోనే ‘రాముడు’ అని పేరు పెట్టాడట. ‘రామనామము నోటరా - తలువాని జన్మము భూమిలో వ్యర్థమురా’ అని రామదాసు కీర్తనలు చెబుతున్నాయి. ఈ శ్రీరాముని ఆరాధించేభక్తులు చైత్రశుద్ధి ప్రతిపద ఉగాది రోజు నవరాత్రులు ప్రారంభసూచకంగా కలశస్థాపన చేస్తారు. పునర్వసు నక్షత్రం, నవమి తేదీనాడు శ్రీరాముని పుట్టినరోజు. ఆ నాడే శ్రీరామునికి సీతతో వైభవంగా కల్యాణం చేయటంతో ముగిస్తారు.
శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ పరమభక్తుడు తులసీదాసు రామచరిత మానస్‌లో భక్తితో పాడుతారు. నిత్య జీవితంలో ఎంతో విలువైన రామనామం తలవటం భారతీయుల సంప్రదాయం. నమస్కారం చేసినపుడు ‘రాం రాం’ అనటం జానపద తెగల అలవాటు. ‘‘అయ్యో రామచంద్రా’’ అనటం, ‘రామ రామ’ అని చెవులు మూసుకోవటం నిత్యం కన్పిస్తుంటాయి, విన్పిస్తుంటాయి. ‘‘తాగరా శ్రీరామ నామామృతం- శ్రీరామ నామాలు శతకోటీ- ఒక్కొక్క పేరే బహుతీపి- బహు ప్రీతి’’ వంటి సినీ గేయాలూ బహుళ ప్రచారంలో ఉన్నాయి.

మంచిమాట
english title: 
manchimaata
author: 
-మాడుగుల నారాయణమూర్తి

రాశిఫలం 17-04-2013

$
0
0
Date: 
Wednesday, April 17, 2013 (All day)
author: 
-- గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి
వృశ్చికం: 
స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ప్రయాణాలవల్ల లాభం చేకూరుతుంది. కలహాలకు దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. బంధు, మిత్రులు కలుస్తారు.
మేషం: 
స్ర్తిల మూలకంగా లాభాలుంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభముంటుంది. అత్యంత సన్నిహితులను కలుస్తారు.
వృషభం: 
ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. అనవసరంగా డబ్బు ఖర్చగుటచే ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.
మిథునం: 
ఋణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది. అనారోగ్యమేర్పడకుండా జాగ్రత్త అవసరం. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి.
కర్కాటకం: 
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండుటచే మానసికానందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటివరకు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.
సింహం: 
అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా నుండుట మంచిది. భయాందోళనలకు లోనవుతారు. నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు.
కన్య: 
ఆకస్మిక ధనలాభయోగముంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. అంతటా అనుకూల వాతావరణమేర్పడుతుంది. స్ర్తిలు సౌభాగ్యాన్ని పొందుతారు.
తుల: 
అనుకోకుండా కుటుంబంలో కలహాలేర్పడే అవకాశముంటుంది. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. మనస్తాపానికి గురి అవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు.
ధనుస్సు: 
శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. బంధు, మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.
కుంభం: 
ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ధనలాభయోగముంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు. వారు ఉత్సాహంగా ఉంటారు.
మీనం: 
బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. ఆర్థిక ఇబ్బందుల నెదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది.
దుర్ముహూర్తం: 
ఉ.11.36 నుండి 2.24 వరకు
రాహు కాలం: 
..
వర్జ్యం: 
రా.10.49 నుండి 12.35 వరకు
నక్షత్రం: 
ఆర్ద్ర ఉ.09.37
తిథి: 
శుద్ధ సప్తమి రా.01.13
మకరం: 
గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్ర్తిల మూలకంగా లాభం వుంటుంది. మంచి ఆలోచనలను కలిగి వుంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. సత్కార్యాల్లో పాల్గొంటారు.

17-04-2013

$
0
0
crossimage: 
Date: 
Wednesday, April 17, 2013

మూలికా వైద్యం

$
0
0

మామిడి చెట్టు జిగురును నువ్వుల నూనెతోగాని, కొబ్బరినూనెతోగాని కలిపి ఆరారా రాస్తుంటే, గజ్జి, చిడుము, దురదలు తగ్గుతాయి.
రావిచెట్టు బెరడు కషాయం కాచి పుక్కిలించితే నోటి పూత తగ్గుతుంది. ఈ కషాయంతో కడుగుతూంటే దీర్ఘకాలంగా ఉన్న పుళ్లు, వ్రణాలు మానుతాయి. గుండ చేసి రాసినా మంచి ఫలితముంటుంది.
‘జిల్లేడు వేరును’ నూరి రాసినా, పట్టు వేసినా బోదకాలు తగ్గిపోతుంది.
శొంఠి గంధం, మంచి గంధం కలిపి పట్టువేస్తే తలనొప్పి తగ్గుతుంది. దాల్చిన చెక్క రసం కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తుంది.
‘పెద్దములకవేరు’గాని, చిన్న ములక వేరు రసంగాని తేనెతో కలిపి రాస్తూ లోనికి పుచ్చుకుంటుంటే పేను కొరుకుడు తగ్గి జుట్టు మొలుస్తుంది.
‘ములకవేరు’ గురివింద వేరు నూరి (తాజాగా ఉండాలి) బట్టతలపై రాస్తూంటే క్రిములు చనిపోయి, జుట్టు మొలుస్తుంది.
గంజాయి వేళ్ళుగాని, ఆకులు గాని, నూరి రాస్తే జుట్టు మొలుస్తుంది.
బీట్‌రూట్ రసాన్ని వేసి దుంపని నూరి ఆ ముద్దను ముఖానికి పట్టించి ఆరాక సున్నిపిండితో రుద్దుకుంటే ముఖం కాంతివంతవౌతుంది.

మామిడి చెట్టు జిగురును నువ్వుల నూనెతోగాని
english title: 
herbs
author: 
-ఎస్.చంద్రామణి

హార్మోన్ల లోపం.. ‘ఎడిసన్స్’కు మూలం

$
0
0

ఎడ్రినల్ గ్రంథులనేవి మూత్రపిండాలపైన టోపీ మాదిరిగా అమరి ఉంటాయి. ఒకవేళ ఇవి కార్టిసాల్, ఆల్డోస్టిరోన్ హార్మోన్లను తయారు చేయలేకపోతే ఎడిసన్స్ వ్యాధి ప్రాప్తిస్తుంది. 1855 సంవత్సరంలో డాక్టర్ థామస్ ఎడిసన్ క్షయవ్యాధిగ్రస్తుల్లో ఎడ్రినల్ గ్రంథి పని తీరు దెబ్బతినడాన్ని గమనించి దానిమీద అధ్యయనం చేశాడు. ఫలితంగా ఈ ‘స్థితి’ ఆయన పేరుతోనే ప్రసిద్ధి చెందింది.
కార్టిసాల్ అనేది శరీరంలోని ప్రతి నిర్మాణంపైనా ప్రభావం చూపుతుంది. శరీరం నిర్వర్తించే సాధారణ విధులన్నిటిలో కీలకపాత్ర పోషిస్తుంది. ఎడ్రినల్ గ్రంథులు కార్టిసాల్‌ని విడుదల చేసి తద్వారా శరీరం వివిధ రకాల ఒత్తిళ్ళను (వ్యాధి, గాయాలు, శస్త్ర చికిత్స, ప్రసవం) తదితర విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి సహకరిస్తాయి. ఆల్డోస్టిరోన్ అనేది శరీరంలో లవణాలు, నీటిని నిలువరించడం ద్వారా రక్తపోటును నిలకడగా ఉంచుతుంది.
ఎడ్రినల్ గ్రంథుల హార్మోన్ల తయారీ మెదడులోని హైపోథెలామస్, మెదడు కింద ఉండే పిట్యూటరీ గ్రంథులు నియంత్రణలో ఉంటుంది. ఈ హార్మోన్ల వ్యవస్థలో ముందుగా హైపోథెలామస్ పిట్యూటరీ గ్రంథికి సంకేతాలను పంపుతుంది. వీటిని అందుకొని పిట్యూటరీ గ్రంథి ఎడ్రినోకార్టికోట్రాపిక్ హార్మోన్‌ని (ఎ.సి.టి.హెచ్) విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ తిరిగి కిడ్నీలపైనుండే ఎడ్రినల్ గ్రంథులను ఉత్తేజితం చేసి అవి కార్టిసాల్‌ను విడుదల చేసేలా చేస్తుంది. ఏదైనా కారణం చేత కార్టిసాల్ నిర్ణీత స్థాయిలో తయారుకాకపోతే, దానిని ఎడిసన్స్ డిసీజ్‌గా చెబుతారు. కాగా, మెదడులోని హైపోథెలామస్‌గాని పిట్యూటరీ గ్రంథిగాని సరైన రీతిలో పనిచేయనప్పుడు అంటే ఎ.సి.టి.హెచ్ సరిగా విడుదల కానప్పుడు కూడా ఇవే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. దానిని సెకండరీ ఎడ్రినోకార్టికల్ ఇన్‌సఫీషియన్సి అంటారు. ఈ వ్యాసం ఎడిసన్స్ వ్యాధికి మాత్రమే సంబంధించిన అంశాలను ఆయుర్వేద దృక్పథాన్ని వివరిస్తుంది.
కారణాలు
ఎడిసన్స్ వ్యాధి ప్రాథమికంగా శరీరపు రక్షణ వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్) అదుపు తప్పి ఎడ్రినల్ గ్రంథి మీద దాడి చేసి అది తయారుచేసే కార్టిసాల్, ఆల్డోస్టిరోన్ విడుదలను గణనీయంగా తగ్గించినప్పుడు వస్తుంది. ఎడ్రినల్ గ్రంథులు దెబ్బతినడానికి ఇతర అంశాలు అనేకం దోహదపడతాయి. అలాంటి సందర్భాల్లో కూడా ఈ వ్యాధి ప్రాప్తిస్తుంది. ఉదాహరణకు క్షయ, క్యాన్సర్, హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షనే్ల కాకుండా అనేక రకాలైన బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లవల్ల ఇలా జరగవచ్చు. కొన్ని రకాల శస్తచ్రికిత్సలు, రేడియేషన్ చికిత్సల్లో సైతం ఇలా జరిగే అవకాశం ఉంది. రక్తాన్ని పలచగా ఉంచే యాస్ప్రిన్ తదితర మందులవల్ల ఎడ్రినల్ గ్రంథుల్లో రక్తస్రావం జరిగినప్పుడూ ఈ వ్యాధి వస్తుంది. దీర్ఘకాలం నుంచి కార్టికోస్టీరాయిడ్స్ వాడే వారిలో ఈ వ్యాధి కనిపించే అవకాశాలు ఎక్కువ. అలాగే, కెటోకెనజోల్ వంటి మందులవల్ల కూడా ఈ వ్యాధి రిస్కు పెరుగుతుంది. గర్భధారణ చివరి రోజుల్లోగాని, ప్రసవ సమయంలోగాని ఎడ్రినల్ గ్రంథికి దెబ్బతగిలితే కూడా ఈ వ్యాధి రావచ్చు. అయితే, ఇతర కారణాలతో పోలిస్తే ఇది చాలా అరుదుగా జరుగుతుంది.
ఈ వ్యాధి స్ర్తి, పురుషుల్లో ఎవరిలోనైనా కనిపించవచ్చు. ఏ వయసులోనైనా కనిపించవచ్చు. కాకపోతే వ్యాధి నిరోధక వ్యవస్థ వికటించటం కారణంగా ఏర్పడే ఎడిసన్స్ వ్యాధి మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. క్షయవ్యాధి మూలంగా ఏర్పడే ఎడిసన్స్ వ్యాధి పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.
లక్షణాలు
ఎడ్రినల్ గ్రంథులు సాధారణంగా నెమ్మదిగా వైఫల్యం చెందుతాయి కనుక ఎడిసన్స్ వ్యాధి లక్షణాలు కూడా నెమ్మదిగా పురోగమిస్తాయి. కాగా, ఒకవేళ ఈ గ్రంథులు హఠాత్తుగా దెబ్బతింటే లక్షణాలు కూడా వేగంగా వ్యక్తమవుతాయి.
ఈ వ్యాధిలో ప్రధానంగా బడలిక ఉంటుంది. కండరాల బలహీనత కనిపిస్తుంది. సమయం గడిచేకొద్దీ ఈ లక్షణాలు తీవ్రరూపం దాలుస్తాయి. బరువు తగ్గిపోవటం ఈ వ్యాధిలో కనిపించే మరో ప్రధాన లక్షణం. అలాగే ఆకలి కూడా గణనీయంగా తగ్గిపోతుంది. వికారం, వాంతులు, నీళ్లవిరేచనాలు, కడుపునొప్పి వంటి ఇతర లక్షణాలు కూడా అనేకం ఉంటాయి. ఉప్పగా ఉండే పదార్థాలను తీసుకోవాలని అనిపిస్తుంటుంది. చర్మంపైన నల్లని మచ్చలు తయారవుతుంటాయి. ముఖ్యంగా గాట్లు పడిన చోటగాని, చర్మం ముడతల్లోగాని, పెదవులపైనగాని, నోటినీ ముక్కునూ చుట్టి ఉండే లైనింగ్ వద్దగాని, మోచేతులు, మోకాళ్ళు వేళ్ల కణుపులవంటి కీళ్లజాయింట్ల వద్దగాని ఈ రకం నల్లని ముదురు మచ్చలు కనిపిస్తుంటాయి. చలిని తట్టుకోలేకపోవటం కూడా ఈ వ్యాధిలో ఒక ప్రధాన లక్షణం. మహిళల్లో వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతుంటాయి. కూర్చున్న భంగిమ నుంచి లేచి నిలబడితే తల తిరిగినట్లు, పడిపోతున్నట్లు అనిపిస్తుంది. దీనిని వైద్య పరిభాషలో ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. శరీరం కంపిస్తుంటుంది. కొంతమందిలో రక్తంలోని చక్కెర నిల్వలు తగ్గిపోతుంటాయి కూడా. దీనిలో అనేక మానసిక లక్షణాలు కూడా కనిపిస్తాయి. మనసు నిలకడగా ఉండదు. కేంద్రీకరణ కష్టమవుతుంది. చిరాకు, కోపం, అసహనం వంటివి రోజురోజుకూ ఎక్కువవుతుంటాయి. ఒక దశలో కుంగుబాటు (డిప్రెషన్) కూడా ప్రాప్తిస్తుంది.
చికిత్స
ఈ వ్యాధి దీర్ఘకాలం కొనసాగే తత్వం కలిగినది. ఆయుర్వేద చికిత్సలను కూడా దీర్ఘకాలం పాటు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ వ్యాధి చికిత్సను మూడు అంశాలుగా విభజించవచ్చు. మొదటిది ఆహార చికిత్స. రెండవది ఎడ్రినల్ గ్రంథులు పనితీరు మెరుగుపర్చడం. మూడవది, వ్యాధి నిరోధకశక్తిని సక్రమ మార్గంలో నడిపించడం.
ఈ వ్యాధిలో సోడియం నిల్వలు బాగా తగ్గిపోతుంటాయి కనుక సోడియం కలిగిన ఉప్పు వంటి పదార్థాలను, ఉప్పు కలిగిన ఆహారాలను సూచించాల్సి ఉంటుంది. ఉక్కపోత వాతావరణంలోను, స్వేదాధికృత అధికంగా ఉండే పరిస్థితుల్లోను మజ్జిగలో ఉప్పు చేర్చి తీసుకోవాలి. వ్యాయామం వంటివి చేసిన తరువాత, శరీరం నుంచి ఉప్పు చెమట ద్వారా బహిర్గతమయ్యే అవకాశం ఉంటుంది కనుక, ఏదైనా శ్రమ చేసిన తరువాత ఉప్పు చేర్చిన పానీయాలను తీసుకోవటం అవసరం. ఈ వ్యాధిలో పొటాషియం నిల్వలు శరీరంలో పరిమితికి మించి పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అనేక రకాల ఆహార పదార్థాల్లో పొటాషియం అధిక మొత్తాల్లో ఉంటుంది కనుక ఏ రకమైన ఆహారాలను తీసుకోవాలనే విషయం వైద్యులను అడిగి తెలుసుకోవాలి.
తరచుగా బరువును చూసుకోవాలి. ముఖ్యంగా ఆకలి తగ్గిన సందర్భాలోను, వాంతులవుతున్నప్పుడూ బరువు తగ్గిందీ లేనిదీ తెలుసుకోవాలి. బరువు చూసుకునేప్పుడు ఒకే విధానాన్ని అవలంబించాలి. ఉదాహరణకు, రోజులో ఒకే సమయంలో చూసుకోవాలి. అలాగే, బూట్లు, బట్టలవంటివి ఒకే విధంగా ఉండాలి. శరీరంలో గ్రంథుల పని తీరు మెరుగుపర్చడానికి ఆయుర్వేదంలో అనేక రకాల మందులు ఉన్నాయి. ఇవి నిర్మాణపరమైన సమస్యలను, శరీరపరమైన సమస్యలను సరిచేసే నైజం కలిగినవి. కాంచనార, వరుణ తదితర మూలికలకు ఈ లక్షణం ఉంది. వీటితో అనేక రకాల మందులు తయారవుతాయి. లక్షణాలను బట్టి, వ్యాధి సమగ్ర స్వరూపాన్ని బట్టి వీటిని వాడాల్సి ఉంటుంది.
వ్యాధి నిరోధక శక్తి వికటించి ఎడ్రినల్ గ్రంథులను దెబ్బతీసినప్పుడు, దానిని సరిచేసి మళ్లీ సక్రమంగా పనిచేసేలా చేసే చికిత్సలను ఆయుర్వేదంలో స్వస్థస్యోర్జస్కర చికిత్సలని అంటారు. శమన చికిత్సలలో పాటు పంచకర్మలు కూడా ఈ రకం చికిత్సల్లో ప్రధాన అంశాలుగా ఉంటాయి. అమృత లేదా గుడూచి, ఆమ్లకి, హరిద్ర వంటి మూలికలనుంచి తయారయ్యే శమనౌషధాలను చికిత్సలో ప్రయోగించాల్సి ఉంటుంది.

డ్రినల్ గ్రంథులనేవి మూత్రపిండాలపైన టోపీ మాదిరిగా అమరి ఉంటాయి
english title: 
adrenal
author: 
-డా.చిరుమామిళ్ల మురళీమనోహర్ murali manoharch@hotmail.com

కొనసాగడమా.. వెళ్లడమా?

$
0
0

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాన మంత్రి పదవికి సమర్థించే ప్రసక్తేలేదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తేల్చి చెప్పటంతో ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగే విషయమై బిజెపిలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. నితీష్ ప్రభుత్వం సుస్థిరతకు ఎలాంటి ఢోకాకాలేదన్న విషయం తెలిసినప్పటికీ ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో బిజెపి నాయకత్వం అనేక మార్గాలను అనే్వషిస్తోంది. 243 మంది సభ్యులున్న బీహార్ విధానసభలో జనతాదళ్‌కు 118 మంది ఎమ్మెల్యేలున్నారు. బిజెపికి 91 మంది సభ్యులున్నారు. బిజెపికి చెందిన సుశీల్‌మోడీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించటమేకాక పరుష పదజాలంతో విమర్ళలు కురిపించిన జనతాదళ్‌తో సంబంధాలను తెగతెంపులు చేసుకుతీరాలని బిజెపి బీహార్ శాఖకు చెందిన సీనియర్ నాయకులు అధినాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. నితీష్ మంత్రివర్గంలో ఉన్న అశ్వనీ కుమార్ చౌబే పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమై జెడియుతో పొత్తును తెగతెంపులు చేసుకోవటానికి తటపటాయించరాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కార్యకర్తలంతా ఇదే అభిప్రాయంతో ఉన్నారని ఆయన పార్టీ నాయకత్వానికి తెలిపారు. బీహార్‌లో నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం చేయటానికి వీల్లేదని నితీష్ షరతుపెడితే అంగీకరించి పార్టీ నాయకత్వం చేసిన తప్పు పునరావృతం కాకూడదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయటానికి పార్టీ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. కాగా మోడీ విషయంలో రెండు శిబిరాల మధ్య రాజీ కుదిరే అవకాశాలు లేనందున ప్రభుత్వంలో కొనసాగటం అనైతికం అవుతుందని పార్టీలోని ఒక వర్గం భావిస్తోంది. బిజెపి వైదొలగినప్పటికీ నితీష్ ప్రభుత్వం మనుగడకు ఎలాంటి ప్రమాదం లేనందున ప్రభుత్వం నుంచి నిష్క్రమించాలన్న పార్టీ ప్రతిపాదనకు అంతోఇంతో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలున్నాయి. ఉప ముఖ్యమంత్రి సుశీల్‌మోడీ ఈ ప్రతిపాదనకు అంత సుముఖంగా లేరని చెబుతున్నారు. నితీష్ ముఖ్యమంత్రిగా పదవి భాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీహార్ రూపురేఖలు మారిపోయి ప్రజలు సుఖంగా ఉన్నందున జెడియు వైపే ప్రజలు మొగ్గుచూపే అవకాశాలుంటాయని ఒక వర్గం వాదిస్తోంది. ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవలసిందిగా సూచించినట్లు తెలిసింది. కర్నాటక విధాన సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బిజెపి ఈ నిష్క్రమణపై తుది నిర్ణయం తీసుకుంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా బిజెపి ఒత్తిళ్లకు, బెదిరింపులకు తాము బెదిరే ప్రసక్తిలేదని జెడియు అధికార ప్రతినిధి త్యాగి ఎదురుదాడి చేశారు. లౌకిక వాదానికి కట్టుబడి ఉన్న తమ పార్టీ మోడీ విషయంలో రాజీపడదని ఆయన స్పష్టం చేశారు. మోడీ కోసం మంకు పట్టుపట్టి తమతో గత పదిహేడేళ్లుగా ఉన్న పొత్తును తెంచుకుంటే తమ కంటే బిజెపినే తీవ్రంగా నష్టపోతుందని జెడియు నేతలు స్పష్టం చేస్తున్నారు.

నితీష్‌తో పొత్తుపై బిజెపి తర్జనభర్జన
english title: 
k

నిర్దోషిగా తేలిన విజేందర్

$
0
0

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: భారత స్టార్ బాక్సర్, ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ డోపింగ్ పరీక్షల్లో నిర్దోషిగా తేలినట్టు కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. హెరాయన్‌తో పాటు నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్టు విజేందర్, మరో నలుగురు బాక్సర్లపై ఆరోపణలు రావడంతో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) ఇటీవల వారికి పరీక్షలు నిర్వహించిన విషయం విదితమే. ఆరోపణలు ఎదుర్కొంటున్న బాక్సర్ల రక్తం, మూత్రం నమూనాలు సేకరించి ‘నాడా’ ఈ పరీక్షలు నిర్వహించింది. అయితే వీరు ఇటీవలి కాలంలో హెరాయన్ లేదా ఎటువంటి నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు ఈ పరీక్షల్లో రుజువు కాలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

భారత స్టార్ బాక్సర్, ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ డోపింగ్
english title: 
n

నైట్ రైడర్స్‌కు పంజాబ్ షాక్

$
0
0

మొహాలీ, ఏప్రిల్ 16: ఐపిఎల్-6 ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బుధవారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు షాక్ ఇచ్చింది. మొహాలీలోని సొంత మైదానం పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పిసిఎ) స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 4 పరుగుల తేడాతో నైట్ రైడర్స్‌ను ఓడించి ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. దూకుడుగా ఆడి కింగ్స్ ఎలెవెన్ విజయంలో కీలకపాత్ర పోషించిన మన్‌ప్రీత్ గోనీ (42) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టులో కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (7) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినప్పటికీ నాన్ స్ట్రైకింగ్ ఓపెనర్ మన్‌దీప్ సింగ్ (41), మనన్ ఓరా (17), డేవిడ్ హస్సీ (12) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపారు. అయితే పంజాబ్ స్కోరు 99 పరుగుల వద్ద ఉండగా హస్సీతో పాటు అజర్ మహమూద్, గురుకీరత్ సింగ్‌లను వరుసగా పెవిలియన్‌కు చేర్చి సునీల్ నారాయణ్ ఈ సీజన్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. అనంతరం కొద్దిసేపటికి డేవిడ్ మిల్లర్ (20) సచిత్ర సేనా నాయకే బౌలింగ్‌లో నిష్క్రమించడంతో పంజాబ్ జట్టు 109 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ తరుణంలో దూకుడుగా ఆడిన మన్‌ప్రీత్ గోనీ 18 బంతుల్లోనే మూడు సిక్సర్లు మరో నాలుగు ఫోర్ల సహాయంతో 42 పరుగులు సాధించి ఇన్నింగ్స్‌కు ప్రాణం పోశాడు. గోనీ నిష్క్రమణ అనంతరం ప్రవీణ్ కుమార్ (1) జాక్ కాలిస్ బౌలింగ్‌లో వెనుదిరగ్గా పియూష్ చావ్లా (11), పర్వీందర్ ఆవానా (0) అజేయంగా నిలిచారు. దీంతో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
అనంతరం 158 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో కెప్టెన్ గౌతమ్ గంభీర్ (60), ఇయాన్ మోర్గాన్ (47) రాణించినప్పటికీ మిగిలిన బ్యాట్స్‌మన్లు క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. యూసుఫ్ పఠాన్ (13), రజత్ భాటియా (16) మినహా మిగిలిన వారెవరూ రెండంకెల స్కోర్లు సాధించకుండానే నిష్క్రమించడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌లు ఆడిన నైట్ రైడర్స్‌కు ఇది మూడో పరాజయం.

సునీల్ నారాయణ్ ‘హ్యాట్రిక్’ వృథా
english title: 
n

‘చాలెంజర్స్’కు ‘సూపర్’ విక్టరీ

$
0
0

బెంగళూరు, ఏప్రిల్ 16: ఐపిఎల్-6లో తొలి విజయాన్ని అందుకోవాలన్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆశలు మరోసారి నీరుగారిపోయాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం రాత్రి ఉత్కంఠ భరితంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య రాయల్ చాలెంజర్స్ జట్టు ‘సూపర్ ఓవర్’ ద్వారా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను చిత్తుచేసి ఈ సీజన్‌లో నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు సాధించింది. అనంతరం రాయల్ చాలెంజర్స్ జట్టులో ఎ.బి.డివిలియర్స్ (39), కెప్టెన్ విరాట్ కోహ్లీ (65) మినహా మిగిలిన వారెవరూ రాణించలేదు దీంతో రాయల్ చాలెంజర్స్ కూడా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు సాధించి సరిసమానంగా నిలువడంతో ‘సూపర్ ఓవర్’ ద్వారా ఫలితాన్ని తేల్చాల్సి వచ్చింది. ఈ ఓవర్‌లో రాయల్ చాలెంజర్స్ జట్టు వికెట్ నష్టపోకుండా 16 పరుగులు సాధించగా, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు 2 వికెట్లు నష్టపోయి 11 పరుగులు మాత్రమే రాబట్టింది.

‘డెవిల్స్’ ఖాతాలో ఐదో ఓటమి
english title: 
c

యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో భారత్‌కు రెండు బెర్తులు

$
0
0

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: చైనాలోని నాంజింగ్‌లో వచ్చే ఏడాది జరుగనున్న యూత్ ఒలింపిక్ గేమ్స్ బాలుర విభాగంలో పోటీపడేందుకు భారత వెయిట్‌లిఫ్టర్లు రెండు కోటా బెర్తులు కైవసం చేసుకున్నారు. కజకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌లో ఇటీవల ముగిసిన ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్స్‌లో భారత లిఫ్టర్లు రాహుల్ రాగాల వెంకట్ బాలుర 77 కిలోల విభాగంలో ఒక రజత పతకంతో పాటు కాంస్య పతకాన్ని కైవసం చేసుకోగా, బాలుర 50 కిలోల విభాగంలో జంజాంగ్ దేరు రజత పతకాన్ని సాధించాడు. దీంతో బాలుర విభాగంలో భారత్ మొత్తం 125 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలువడంతో యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో భారత లిఫ్టర్లకు రెండు కోటా బెర్తులు లభ్యమయ్యాయి. అయితే బాలికల విభాగంలో భారత్ 72 పాయింట్లు సాధించి 16వ స్థానంలో నిలువడంతో యూత్ ఒలింపిక్ గేమ్స్ కోటా బెర్తు తృటిలో చేజారింది.

చైనాలోని నాంజింగ్‌లో వచ్చే ఏడాది
english title: 
u
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>