Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

సన్‌రైజర్స్‌తో పోరుకు ‘యువీ’ దూరం

$
0
0

చెన్నై, ఏప్రిల్ 16: ఐపిఎల్-6 క్రికెట్ టోర్నీలో భాగంగా బుధవారం సాయంత్రం పుణేలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగనున్న లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య పుణే వారియర్స్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ బరిలోకి దిగడం లేదు. ఈ విషయాన్ని యువీ సహచర సభ్యుడు రాస్ టేలర్ మంగళవారం ధృవీకరించాడు. గాయంతో బాధపడుతున్న యువరాజ్ సింగ్ మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌కు కూడా దూరంగా ఉన్న విషయం విదితమే. గాయం నుంచి యువరాజ్ కోలుకోనందున బుధవారం జరిగే మ్యాచ్‌లో అతను ఆడటం లేదని టేలర్ తెలిపాడు.
జైపూర్‌లో ‘రాయల్స్’ వర్సెస్ ముంబయి
కాగా, బుధవారం రాత్రి జైపూర్‌లో జరుగనున్న మరో లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య రాజస్థాన్ రాయల్స్ జట్టు ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది. సభ్యులందరి సమష్టి కృషితో ఇప్పటివరకూ నిలకడగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని ఎదురుచూస్తోంది. అయితే దిగ్గజ జట్టుగా పేరున్న ముంబయి ఇండియన్స్‌పై విజయం సాధించడం ‘రాయల్స్’కు అంత సులభమేమీ కాదు. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందోనని క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఐపిఎల్-6 క్రికెట్ టోర్నీలో భాగంగా బుధవారం
english title: 
s

‘మాంటే కార్లో’ మాస్టర్స్‌లో పేస్ జోడీ బోణీ

$
0
0

మాంటే కార్లో, ఏప్రిల్ 16: మాంటే కార్లో మాస్టర్స్ ఎటిపి టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్, అతని భాగస్వామి జుర్గెన్ మెల్జెర్ (ఆస్ట్రియా) శుభారంభం చేశారు. ఈ టోర్నీలో అన్ సీడెడ్ జోడీగా బరిలోకి దిగిన పేస్- మెల్జెర్ స్థానిక ఆటగాళ్లు బెంజమెన్ బాలెరెట్, గిల్యూమ్ కౌలార్డ్ జోడీపై 6-3, 7-5 వరుస సెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించారు. రెండో రౌండ్‌లో పేస్-మెల్జెర్ భారత జోడీ మహేష్ భూపతి-రోహన్ బొపన్నతో తలపడనున్నారు.

మాంటే కార్లో మాస్టర్స్ ఎటిపి టెన్నిస్ టోర్నమెంట్
english title: 
n

ఇదిగో భద్రాద్రి...

$
0
0

భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో ‘రామనవమి బ్రహ్మోత్సవం’ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులపాటు జరిగే ఉత్సవాల్లో తొలిరోజు బుధవారం అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం నిర్వహించారు. రెండోరోజు ‘ఎదుర్కోలు’ వేడుక సంప్రదాయబద్ధంగా జరిగింది. నవమి రోజున శ్రీ సీతారామ కల్యాణం కన్నుల పండువగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు భద్రాద్రికి తరలివచ్చారు. ఈ నెల 20న ‘పుష్కర సామ్రాజ్య పట్ట్భాషేకం’, 21న ‘హంసవాహన సేవ’, 22న ‘తెప్పోత్సవం’, 23న ‘ఊంజల సేవ’, ‘సింహవాహన సేవ’, 24న ‘వసంతోత్సవం’ జరుగుతాయి. 25న ‘పూర్ణాహుతి’తో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
అయోధ్య (ఉత్తరప్రదేశ్), సీతామర్హి (బీహార్), రామేశ్వరం (తమిళనాడు)ల్లో రామనవమి వేడుకలు జరుగుతున్నా, మన రాష్ట్రంలోని భద్రాచలం ఆలయంలో జరిగే వేడుకలనే ప్రధాన ఉత్సవంగా భక్తులు పరిగణిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తజనుల కోసం ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో ‘రామనవమి బ్రహ్మోత్సవం’
english title: 
idigo badradri

మహిమాన్వితం.. రామనామం

$
0
0

ఆపదామప హర్తారం
దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహమ్
చైత్రశుద్ధ నవమి.. దేశం నలుచెరగులా వేడుకగా జరుపుకొనే గొప్ప పవిత్ర పర్వదినమే ‘శ్రీరామనవమి’. సాక్షాత్తూ భగవానుడు విష్ణుమూర్తే శ్రీరామచంద్రమూర్తిగా ‘్ధర్మ సంస్థాపనార్థమై’ కౌసల్య, దశరథుని కుమారునిగా ప్రాదుర్భవించిన దినం కావడమే ఇందులోని విశేషం. భారతీయత అంటే శ్రీరాముడు. శ్రీరాముడు అంటే భారతీయత. భారతీయుల దృష్టిలో ఆయన ఆదర్శపతి, ఆదర్శ సోదరుడు, ఆదర్శరాజు, ఆదర్శ పురుషుడు, షోడశ కళాపరిపూర్ణుడు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘రామో విగ్రహవాన్ ధర్మః’ (రాముడు రూపం ధరించిన ధర్మం)
అందుకే ఆయనను ‘ఆర్షవాఙ్మయం’ ఘనంగా అడుగడుగునా కొనియాడింది. శ్రీరాముని చరిత్రను, నామాన్ని వేదాలు వేనోళ్ల కీర్తించాయి. పురాణాలు పొగిడినాయి. ఉపనిషత్తులు నిలువెత్తు దార్శనికతను చూపించినాయి. అష్టాక్షరిలోని ‘రా’, పంచాక్షరిలోని ‘మ’ అనే పదాలను సంపుటీకరించి ‘రామ’ అని పేరు పెట్టారు. ‘రామ’ అని అంటే చాలు- మనం సర్వకాల సర్వావస్థలయందుచేసిన పాపాలు తొలగిపోతాయి. ముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ‘రా’ అనగా రెండు పెదవులు తెరచుకొని సర్వపాపములు, చెడు దోషాలు బయటికి పోతాయి. ‘మ’ అంటే రెండు పెదవులు మూసుకొని మరల హృదయంలో అవి ప్రవేశించకుండా, ఇంటికి తలుపులు మూతపడినట్లుగా మూతపడతాయి. ఎంతో మహిమన్వితమైనది ‘రామనామం’. సకల దేవతా స్వరూపం ఆ నామం.
ఋగ్వేదంలో
ఋగ్వేదంలోని ఒకే మంత్రంలో ఇక్ష్వాకు రాజ్య ధర్మపరిపాలన రామకథ వివరింపబడింది. అలాగే ‘రామస్తుతి’ కూడా కనిపిస్తుంది.
అధర్వవేదం
అధర్వ వేదంలో కూడా ఇక్ష్వాకు పేరు ఉల్లేఖింపబడినది. ‘రామాయణం’ వేదంతో సమానం. దీన్ని వినడం, చదవటం వల్ల పాపా లు నశించిపోయ, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రయాగ వంటి పుణ్య తీర్థాలను, గంగవంటి పుణ్యనదులను, నైమిశం, కురుక్షేత్రం వంటి స్థలాలను దర్శించినందువల్ల కలిగె ఫలం ‘రామాయణం’ వింటే కల్గుతుంది.
పద్మ పురాణంలో
ఎవరి నాలుకపై ‘రామ’ అనే రెండక్షరాలు నిరంతరం జపించబడతాయో నిత్యం తపో, దాన, హోమ అర్చనలు చేసిన ఫలితం కల్గుతుంది.
మార్కండేయ పురాణంలో
నాల్గు వేదాల సారము, సమస్త సుఖాలకు ఏకమాత్ర కారణం, సర్వులకు ప్రేమను ప్రసాదించేది రామనామమే.
ఆనంద రామాయణం
‘రామ’ బీజం ‘రాం’లో అగ్ని సోమాత్మకమైన విశ్వమంతా ప్రతిష్ఠితమైనది. ‘రామ’లో ‘రా’ తత్వదార్థం, ‘మ’ కారము; ‘త్వం’ పదార్థం రెండు కల్సి ‘తత్త్వమసి’ (ఆత్మయే పరమాత్మ) అనే గొప్ప విషయాన్ని తెలియచెప్తుంది.
గరుడ పురాణం
పాపాత్ములు కూడా రామనామాన్ని ఉచ్చరిస్తే సహస్రకోటి పాపాల నుంచి విముక్తులగుతారు.
శ్రీణమోత్తర తాపినీ ఉపనిషత్తు
అవిముక్తమయిన కాశీ క్షేత్రంలో (వారణాసి) రామమంత్రం జపించినట్లయితే బ్రహ్మహత్యాది పాపాల నుంచి విముక్తులగుతారు. ముక్తి, మోక్షం కల్గుతాయి.
ముక్తికోపనిషత్తు
రామనామ సంకీర్తనం వల్ల జీవితంలో చేసిన పాపాలు అగ్నిలో పడిన సమిధల్లా దహించుకుపోతాయి. ఆపదలు పెనుగాలికి దూదిపింజల్లా ఎగిరిపోతాయి. ఇంకా ఎన్నో సందర్భాల్లో, పురాణాలో,్ల ఉపనిషత్తుల్లో, వేదాల్లో తారక మంత్రాన్ని గురించిన విశేషాలున్నాయి. శ్రీరాముడు సకల మానవాళికి ఆదర్శప్రాయుడు. మానవ జన్మ ఎత్తి మానవునిలో భగవంతుడైనటువంటి వాడు సాక్షాత్తూ శ్రీమన్నారాయణ స్వరూపుడు. కష్టసుఖాలను ఓర్చుకొని చివరివరకు మానవధర్మం పాటించవలెనని చెప్పినటువంటి మహనీయుడు. బ్రహ్మాది దేవతల ప్రార్థనపై లోక సంరక్షణార్థం ఈ భూమీద జన్మించి రఘువంశాన్ని పావన పునీతం చేశాడు. కలౌస్మరణాన్ముక్తి- అని కదా ఆర్యోక్తి. ఈ కలియుగంలో ‘్భగవన్మామ సంకీర్తనం’ అత్యంత ఫలప్రదాయకమైనది. భక్త రామదాసు తనకు వేదం, శాస్త్రం ఏమీ తెలియవు. ఒక్క రామనామం మాత్రం తెలుసునని చెప్పాడు. కనుకనే ‘రామనామం’ సర్వలోకాలకు మూలం అయినది.
పూజా విధానం
నవమి రోజున సీతారామ భరత శతృఘు్నల విగ్రములనుగాని, శ్రీరామ పట్ట్భాషేక పటాన్నిగాని పెట్టి శ్రీసూక్తము, పురుషసూక్తం చేత షోడశోపచార పూజ చేసి కౌసల్యా దశరాథులను పూజించి ఫల పుష్పజలం చేత నిండిన శంఖంలో శ్రీరామునికి అర్ఘ్యం ఇయ్యాలి. కలశాన్ని గంధపుష్పాక్షతలతో పూజించి, అధిదేవత ప్రత్యాధిదేవతా సహితంగా నవగ్రహ అష్టదిక్పాలకు మండపారాధన పూజ చేయాలి.
చక్కెర పొంగలి, చెరుకు ముక్కలు, పానకం, వడపప్పుతో నైవేద్యం ఇచ్చి హారతి, నీరాజనం, మంత్రపుష్పంతో పూజ పరిసమాప్తి చేయాలి. ఇలా చేసినవారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సమృద్ధిగా కల్గుతాయననడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్
english title: 
m
author: 
- వారణాసి దిలీప్‌కుమార్ శర్మ

ఆదర్శప్రాయం.. శ్రీరాముని వ్యక్తిత్వం.

$
0
0

....................................................
రామాయణం కేవలం ఓ కథ కాదు.. అది జీవన సారం. ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుగం వరకూ జాతి సంస్కృతిని, కుటుంబ వ్యవస్థను ప్రతిబింబించే మహాకావ్యం గనుకే రామాయణం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ప్రతి పాత్ర మానవాళికి ఏదో ఒక సందేశం, స్ఫూర్తినిచ్చేదే గనుక రామాయణ గాథకు జన హృదయాల్లో సుస్థిర స్థానం దక్కింది. ప్రజలంతా సుభిక్షంగా, సుఖశాంతులతో ఉంటే అది- ‘రామరాజ్యం’ అన్న నానుడి బలపడింది. ఎన్నో ఆదర్శాలు, సద్గుణాల మేలు కలయిక అయినందునే రాముడు ఒక వ్యక్తిగా కాకుండా ‘దేవుడి’గా పూజ్యనీయ స్థానాన్ని అధిష్ఠించాడు. ధర్మం, కర్తవ్య పాలనకు నిదర్శనమైనందున రాముడు సకల జనులకూ ఆదర్శమూర్తిగా నిలిచాడు. మంచి కుమారుడిగా, ఆదర్శ భర్తగా, ఉత్తమ పాలకుడిగా కీర్తినార్జించిన పరిపూర్ణ పురుషుడు రాముడు. వానర సేనను నడిపించిన నాయకుడిగా, కదన రంగాన యోధుడిగా ధర్మపరిరక్షణ చేసిన అవతార పురుషుడు. తండ్రి మాటను నెరవేర్చి పెద్దలను గౌరవించాలన్న సందేశం ఇచ్చాడు. ముగ్గురు సోదరులతో అన్యోన్యంగా ఉంటూ సోదర బంధం ఎలాంటిదో నిరూపించాడు. ఇక సీతారాములు అన్యోన్య దాంపత్యానికి నిదర్శనమై జన నీరాజనాలు అందుకున్నారు. ప్రజారంజకంగా పాలిస్తూ అందరినీ సమదృష్టితో చూసిన రాముడు ఏనాడో ‘సామాజిక న్యాయాని’కి పెద్దపీట వేశాడు. రామాయణాన్ని ఎన్ని కోణాల్లో, ఎంత లోతుగా విశే్లషించినా- కథలా అన్పించదు. జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఉన్నత విలువలతో ఉత్తమ జీవనానికి సరైన మార్గాన్ని నిర్దేశించినందునే రామాయణం ఏనాటికైనా నిత్య నూతనం, స్ఫూర్తిదాయకం.
.................................................

యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిం
బాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమద రాక్షసాంతకం
.....................................
ఎక్కడ రామనామం వినిపిస్తూ ఉంటుందో అక్కడ కళ్ల నిండా ఆనంద బాష్పాలు నింపుకుని తలవంచి నమస్కరిస్తూ నిలబడి ఉంటాడట- రాక్షసులను దోమల్లా నలిపి నశింపజేసే రామభక్తుడైన హనుమంతుడు. రామనామాన్ని జపిస్తే హనుమంతుడు ఎల్లవేళలా మనలను రక్షిస్తూ ఉంటాడు. రామనామ జపం కారణంగా కేవలం రాముడి కృపనే కాకుండా, హనుమంతుని కరుణ కూడా మనకు దక్కుతుంది.
.....................................

సకల లోకాల్లోని సద్గుణాలను రాశిగా పోస్తే మనకు సాక్షాత్కరించేది శ్రీరాముడి దివ్య మంగళ స్వరూపమే. యుగాలు గడిచినా, తరాలు మారినా సర్వ మానవాళికి ఆదర్శప్రాయుడు తారకరాముడు. ఏ కాలంలోనైనా ఉత్తమమైన, స్వచ్ఛమైన జీవనాన్ని మనం కొనసాగించాలంటే స్ఫూర్తి ప్రదాతలు ఎంతో అవసరం. ‘పరిపూర్ణ మానవుడు’ ఎలా ఉండాలన్నదానికి అసలు సిసలు తార్కాణం రామచంద్రుని జీవితం. ఆదర్శంగా జీవించడమంటే కష్టనష్టాలను సమర్ధవంతంగా ఎదుర్కొనడమే. అందుకే ఆదర్శ పురుషులను అనుసరిస్తేనే మన జీవనయానం సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా అనేక వత్తిళ్లకు, ప్రభావాలకు లోనవుతున్న నేటి యువత తమ జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే శ్రీరాముడి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.
జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని గమ్యం చేరాలంటే దృఢ చిత్తం, ఏకాగ్రత, సహనం వంటివి అవసరం. ఈ సుగుణాలన్నీ ఉన్నందునే శ్రీరాముడు ఆదర్శప్రాయుడిగా జనం గుండెల్లో ఈనాటికీ నిలిచాడు. విలాసాలు, విశృంఖలత్వం, విపరీత ధోరణులతో ఆధునిక యువతలో అనేకమంది దిశానిర్దేశం లేకుండా కాలక్షేపం చేస్తుంటారు. ఇలాంటి పెడ ధోరణులను తగ్గించుకునేందుకు సన్మార్గం అవసరం. ఇందుకు ‘రామావతారం’ ఎంతగానో దోహద పడుతుంది. ఆదర్శప్రాయుల బాటలో నడవాలని చాలామంది నిర్ణయం తీసుకున్నా, మధ్యలోనే దారి తప్పడానికి కారణం- సవాళ్లు, సమస్యలు ఎదురు కావడమే. ఇలాంటి సందిగ్ధ, సంక్లిష్ట సమయంలో సరైన దారి చూపేదే ‘రామాయణం’.
శ్రీరాముడంటే ఏకపత్నీ వ్రతుడని, శ్రీకృష్ణుడంటే విలాస పురుషుడని నేటి యువతలో కొంతమంది భావన. ఈ ఇద్దరి జీవనశైలి, ఆదర్శ నియమాలను సరైన రీతిలో ఆకళింపు చేసుకుంటే వీరు యువతకు స్ఫూర్తిదాతలన్న వాస్తవం తేటతెల్లమవుతుంది. కుటుం బం అంటే ఏమిటి? అందులో సభ్యులైన తల్లి, తండ్రి, భర్త, అన్న, తమ్ముడు, వదిన.. ఇలా ఎవరెవరు ఎలా ఉండాలన్నది విడమరచి చెప్పేదే ‘రామాయణం’. ఎవరి ధర్మాలను వారు ఉత్తమంగా ఆచరిస్తే కుటుంబ వ్యవస్థ సజావుగా సాగుతుందని రామాయణం చెప్పకనే చెబుతుంది. అలాగే, శ్రీకృష్ణ పరమాత్మ ‘్భగవద్గీత’లో ఉపదేశించిన 700 పైచిలుకు శ్లోకాలు యువతకు మనోవికాసం కలిగించేవే. నేడు పఠనాసక్తి తగ్గిపోయినప్పటికీ, ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాల (డివిడిలు, ఇంటర్నెట్ వగైరా) ద్వారా రామాయణ, భారతంలోని విషయాలను విశ్వవ్యాప్తంగా ఎవరైనా తెలుసుకునే అవకాశం ఉంది. ఇంతటి మహత్తర విషయాలున్నందునే రాముడి వ్యక్తిత్వం ఆచరణీయమని ప్రాచీనులే కాదు, ఆధునికులు సైతం అంగీకరిస్తారు.
శ్రీరామునిది ఒకే మాట, ఒకే బాణం, ఏకపత్నీ వ్రతం. అయితే, తన సహధర్మచారిణి సీతను రాముడు కష్టాలకు గురి చేశాడని, ‘నాతిచరామి’ అనే పెళ్లినాటి ప్రమాణాన్ని పట్టించుకోలేదని కొందరు వాదిస్తుంటారు. పెళ్లినాటి ప్రమాణాన్ని తుచ తప్పకుండా ఆచరించబట్టే రాముడు లంక నుంచి సీతను తీసుకువచ్చాక, ఆమె చేత అగ్ని ప్రవేశం చేయించి పునీతం చేసుకున్నాడు. భార్య పట్ల అచంచల విశ్వాసం ఉండబట్టే ఆమె అగ్ని ప్రవేశం చేస్తున్నా చలించని మనసుతో- సీత తిరిగి తన వద్దకు క్షేమంగా వస్తుందని ఎదురుచూశాడు. లంకలోని అశోకవనంలో సీత ఉండగా, బాధాతప్త హృదయంతో నిరంతరం ఆమె ధ్యానంలోనే గడిపాడు. సీత దూరమైనపుడు పర స్ర్తిల గురించి కలలోనైనా తలవక పోవడం రాముడి వ్యక్తిత్వానికి నిదర్శనం. పరస్ర్తిని విలాస వస్తువుగా చూస్తూ ఆమెపై అత్యాచారాలకు తెగబడుతున్న నేటి ఆధునిక కాలంలో యువతకు శ్రీరాముడి సద్గుణాలు ఎంతైనా ఆదర్శనీయం. సీతను పునీతం చేయడమే గాకుండా, ఆదర్శ వనితగా ఆమెను లోకానికి చాటి చెప్పేందుకే రాముడు తపన చెందాడు. తన అరణ్యవాసానికి కారకులైనప్పటికీ కైకేయి, మందరలపై ఎలాంటి ఆగ్రహం చూపలేదు. వారిని గౌరవ భావంతోనే చూశాడు. శూర్పణఖ వంటి రాక్షస స్ర్తిలను క్షమించి వదిలేశాడు. సీత భద్రత విషయమై ఆలోచించి తన సోదరుడైన లక్ష్మణుడిని ఆమెను అంగరక్షకుడిగా నియమించాడు. సీత కోసమే రావణ సంహారం చేశాడు. రామాయణ ఇతివృత్తాన్ని, అంతరార్థాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే యువతకు ఇలాంటి ఎన్నో విషయాలు తెలుస్తాయి.
శ్రీరాముని గుణగణాలను ప్రస్తుతించేందుకు ఏటా చైత్ర శుద్ధ నవమి నాడు ‘రామనవమి’ని ఘనంగా పాటించడం భారతీయ సంప్రదాయం. రామ జననం, సీతారామ కల్యాణం, రామావతారం పరిసమాప్తి జరిగిన రోజునే ‘నవమి’ వేడుకల్ని జరుపుకోవడం విశేషం. ఎవరి ఇళ్లలో వారు జరుపుకోకుండా సామూహికంగా నవమి ఉత్సవాలు నిర్వహించడం గ్రామాల్లో అనాదిగా వస్తున్న ఆచారం. భారతావనిలో రామాలయం లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. తాటాకు పందిళ్లు వేసి చాలా ప్రాంతాల్లో తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలను జరుపుతారు. సీతారాముల కల్యాణ వైభోగం కనులారా వీక్షించాల్సిందే. మరోవైపు వేసవి రాకతో వాతావరణంలో మార్పు ఫలితంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వీధుల్లో పసుపునీళ్లు చల్లే ఆచారం ఇప్పటికీ కొన్ని చోట్ల కనిపిస్తుంది. శ్రీరామనవమి ముందుగానే అంటే ఉగాది పర్వదినం నుంచి గరగ సంబరాలతో- వేప కొమ్మలు వేసిన పసుపునీళ్లు చల్లుతారు. ఇక, నవమి వేడుకల్లో నైవేద్యంగా సమర్పించే పానకం, వడపప్పు మనలో వేసవి తాపాన్ని చల్లార్చి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇంకోవైపు నవమి వేడుకలు కాబోయే దంపతులకు ఆహ్వానం పలుకుతాయి. శ్రీరామనవమి నుంచే పెళ్లి ముహూర్తాలు ఊపందుకుంటాయి. ఆదర్శ పురుషుడి కల్యాణంతోనే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభక కావడం అన్ని విధాలా శుభ సూచకం.
ఆధ్యాత్మికత, విజ్ఞానం, వినోదం, ఆరోగ్యం, చక్కటి కుటుంబ వ్యవస్థ, సామాజిక ఐక్యత వంటి విషయాలెన్నో కలగలిసి ఉన్నందునే రామాయణ గాథ నేటికీ అజరామరంగానే నిలిచిపోయింది. తరాలెన్ని గడిచినా తరగని సద్గుణ నిధి- శ్రీరాముడు. ఆ మహనీయుని మార్గంలో నడిచేలా యువత దీక్షా కంకణం ధరించేందుకు ‘రామనవమి’ అరుదైన సందర్భం. జీవితంలో మార్పుకు నాంది పలికేందుకు ఇదే శుభ తరుణం.

శ్రీరామనవమి
english title: 
a
author: 
- బాసు

కూర్మనాథుని క్షేత్రానికి శుద్ధి

$
0
0

శ్రీకాకుళం, ఏప్రిల్ 17: మూలవిరాట్ మైనపు నమూనా అంశంపై గడచిన రెండు రోజులుగా కూర్మక్షేత్రంలో భక్తులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి భక్తుల డిమాండ్ మేరకు బుధవారం ఉదయం ఆరు గంటలకు ఆలయ కార్యనిర్వాహణాధికారి ప్రసాద్‌పట్నాయక్, పాలక మండలి సభ్యుల నేతృత్వంలో అర్చక స్వాములు అభిషేకాలు నిర్వహించారు. మూలవిరాట్‌తో పాటు ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ముందుగా విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచనం గావించి లక్ష్మీ సన్నిధిలో వేదమంత్రాలతో హోమాది కార్యక్రమాలు నిర్వహించి జలశుద్ధి గావించారు. తొలుత ఆలయాన్ని కడిగి శుభ్రం చేసారు. అనంతరం శుద్ధి చేసిన జలాన్ని గర్భగుడితో పాటు పరిసర ప్రాంతాల్లో చల్లారు. అనంతరం స్వామి దర్శనార్ధం భక్తులను అనుమతించారు. ఇదిలా ఉండగా గడచిన శుక్రవారం మూలవిరాట్ మైనపు నమూనా సేకరణ, సోమవారం అదే అంశంపై భక్తులు ఆందోళన, ఇ.ఒ. అర్చకుడిపై దాడి, అర్చకునికి గాయం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని శాఖా పరంగా విచారించేందుకు బుధవారం ఇక్కడకు వచ్చిన జిల్లా దేవాదాయ శాఖ ఇన్‌చార్జ్ సహాయ కమిషనర్ ఆర్. పుష్పనాధం, కోటబొమ్మాళి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి గుర్నాధం లను భక్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై సి.బి.సి.ఐ.డి చే విచారణ సాగించాలే తప్ప శాఖాపరంగా విచారణను తాము అంగీకరించేది లేదని వారు కరాఖండిగా తేల్చిచెప్పడంతో విచారణ నిమిత్తం ఇక్కడకు వచ్చిన అధికారులు వెనుదిరిగారు.

ఆదిత్యునికి కల్యాణశోభ
శ్రీకాకుళం కల్చరల్, ఏప్రిల్ 17 నిత్యపూజలందుకుంటున్న అరసవల్లి ఆదిత్య నారాయణుడు కల్యాణశోభితుడయ్యాడు. చైత్ర శుద్ధ సప్తమి పర్వదినాన దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి వారికి కల్యాణాంగ ధ్వజరోహణతో వార్షిక కల్యాణోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 25వ తేదికి జరుగుతాయి. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం 6.20నిముషాల నుండి స్వామి వారికి ఆలయ అర్చక బృందం మేళతాళాలతో ప్రత్యేకపూజలు నిర్వహించారు. మూలవిరాట్ నుండి శ్రీ ఆంజనేయజయకేతనంతో పతాకావిష్కరణ పూజలు చేపట్టి ప్రధాన ధ్వజస్తంభం వద్దకు వేదమంత్రాలతో తోడ్కొని వచ్చారు. ఈ సందర్భంగా ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. విశేష అర్చన, దిగ్బలిప్రదానం, హారతి సేవలతో మొదటి రోజు వేడుకలను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ మాట్లాడుతూ వేడుకల్లో భాగంగా గురువారం సాయంత్రం నిర్వహించే సుగంధద్రవ్య మర్ధన ఉత్సవం సాంప్రదాయకీర్తనలతో జరిగే వేడుకలకు భక్తులు పాల్గొని స్వామి వారి దీవెనలు పొందారని కోరారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు తెలుగు సూర్యనారాయణ, పి రామకృష్ణ, కార్యాలయ సిబ్బంది మోహనరావు, మృత్యుంజయరావు, కొండలరావులతో పాటు భక్తుల పాల్గొన్నారు.

మళ్లీ అలజడి
సీతంపేట,ఏప్రిల్ 17:సీతంపేట ఏజెన్సీలో గజరాజులు అలజడి కొనసాగుతోంది.గడచిన నాలుగేళ్లుగా గిరిజనులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగులు అదే తరహాలో పంటలు నాశనం చేస్తున్నాయి. గిరిజనులను మానసికంగా,ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగిస్తున్న ఏనుగులను ఈ ప్రాంతం నుండి తరలించాలని గిరిజనులు పదే పదే కోరుతున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యాడు.గడచిన పది రోజుల క్రితం ఏ ప్రాంతంలోనైతే ఏనుగులు సంచరించాయో అదే ప్రాంతంలోని జీడి తోటల్లో గజరాజులు తిష్టవేసాయి. బుధవారం అర్థరాత్రి 2గంటల ప్రాంతంలో జామితోట గ్రామానికి ఆనుకొని ఉన్న చెరువుకు ఏనుగులు వచ్చినట్లు ఆ గ్రామానికి చెందిన ధర్మారావు తెలిపాడు. అర్థరాత్రి సమయంలో ఏనుగుల ఘీంకారాలు తమకు స్పష్టంగా వినిపించాయని,అయితే ఏ క్షణాన తమ గ్రామంలోకి అవి చొరబడతాయోనని భయంతో బిక్కు,బిక్కుమంటూ రాత్రంతా గడిపామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.తెల్లవారు జామున ఐదు గంటల ప్రాంతంలో ఏనుగులు చెరువు నుండి జీడితోటల్లోకి వెళ్లిపోయినట్లు గ్రామస్థులు చెప్పారు.రాత్రంతా చెరువులోనే సేదతీరిన ఏనుగులు చెరువు పరిసరాల్లో ఉన్న యిసాయి అసిరినాయుడు అనే రైతుకు చెందిన వరి,చెరకు పంటలను నాశనం చేసాయి.జామితోట పరిసర ప్రాంతాల్లోకి ఏనుగులు వచ్చాయనే వార్త తెలుసుకున్న పలు గ్రామాలకు చెందిన గిరిజనులు వాటిని చూసేందుకు ఎగబడ్డారు.అయితే అటవీశాఖాధికారులు ఏనుగులు సంచరించే ప్రాంతానికి చేరుకొని ఎవరూ అటుగా రాకుండా చర్యలు తీసుకున్నారు.
చెరువు పరిసరాల్లోనే ఏనుగుల
రిజర్వ్ ఫారెస్ట్‌లో ఏనుగులు తాగేందుకు చుక్క నీరు లభించక పోవడంతో అవి గ్రామ సమీపంలో ఉన్న చెరువులు, చెలమల వైపు వస్తున్నాయి.దీనిలో భాగంగానే జామితోట గ్రామ సమీపంలో ఉన్న చెరువుకు దాహార్తిని తీర్చుకునేందుకు అవి వచ్చినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.అయితే అటవీ ప్రాంతంలో నీరు లభించకపోవడంతో అవి ఈ చెరువు వైపు వచ్చాయని ,ఒకసారి ఈ చెరువుకు అలవాటు పడిన ఏనుగులు ఈ ప్రాంతాన్ని వదలి ఎటువైపు వెళ్లవని గిరిజనులు చెబుతున్నారు.ఏది ఏమైనప్పటికి ఏనుగుల బారి నుండి తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.

అధిక ధరలకు పుత్తడి ధరలు
నరసన్నపేట, ఏప్రిల్ 17: ప్రస్తుతం బంగారం ధరలు రోజురోజుకూ క్షీణిస్తున్నా.. వర్తకుల అమ్మకాల ధరల్లో మాత్రం ఎటువంటి తేడా ఉండటం లేదని వినియోగదారులు వాపోతున్నారు. గత మూడురోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నా స్థానికంగా అందుబాటులో లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తులం బంగారం మాత్రం 31,000 రూపాయలకు పైగా అమ్మకాలు జరుపుతున్నారని, ధరలు తగ్గాయన్న ఆనందం లేకుండాపోయిందని వినియోగదారులు వాపోతున్నారు. ఇటీవల ఎన్నడూ లేనంతగా బంగారం ధరల్లో సుమారు 30శాతం మేర తగ్గడంతో ప్రజలు పుత్తడి కొనుగోళ్లకు ముందుకువస్తున్నారు. బంగారం ధరల కారణంగావాటి కొనుగోలు సామర్ధ్యం లేక కొందరు వెనక్కి తగ్గారు. అయితే అమాంతం పుత్తడి ధర నేలకు రావడంతో ముందు చూపుతో కొందరు కొనుగోళ్లకు ముందుకు వస్తుండగా, భవిష్యత్‌లో అవసరం నిమిత్తం కూడా మరికొంతమంది బంగారం కొనుగోళ్లకు సిద్ధవౌతున్నారు. అయితే బుధవారం ఉదయం పది గ్రాముల బంగారం ధర 26,060 రూపాయలుగా ఉంది. ఈ లెక్కన తులం బంగారం సుమారు 30 వేల రూపాయల వరకు ఉండవచ్చునని, అయితే తాము తులం ఆభరణము 31 వేల రూపాయల పైబడి కు కొనుగోలు చేశామని ఒక వినియోగదారుడు చెప్పాడు. మరోవైపు గ్రామీణ ప్రాంతవాసులకు ధరలపై అవగాహన లేక వ్యాపారులు ఎంత చెబితే అంత చెల్లించుకుంటున్నారు. గత ఏడాది కిలో 70 వేలు రూపాయలుగా పలికిన వెండి నేడు 45,600 ఉండడంతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఆ ధరలను పక్కనపెట్టి వ్యాపారులు సిండికేటుగా మారి ఎక్కువ ధరకే అమ్మకాలు జరుపడం పట్ల నిరసన వ్యక్తవౌతుంది. కాగా, పుత్తడి దిగి వస్తున్నా స్థానికంగా వ్యాపారుల తగ్గించి అమ్మకాలు జరుపడం లేదని, గ్రామీణుల అమాయకత్వాన్ని, అవగాహన లేమిని ఆసరాగా చేసుకుని దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అధికారులు పూర్తిస్థాయి పర్యవేక్షణ జరపాలని వినియోగదారులు కోరుతున్నారు.
దీనిపై బంగారం వర్తకుల సంఘ ప్రధాన కార్యదర్శి వూన్న పకీరును వివరణ కోరగా బంగారం ధరలు తగ్గడం వాస్తవమేనని, అయితే విశాఖపట్నంలో ఉన్న హోల్‌సేల్ వ్యాపారులు తమకు తగ్గించిన బంగారం రేట్ల కన్నా ఎక్కువగా అమ్మకాలు చేస్తున్నారని, దీనివల్ల ఈ పరిస్థితి నెలకొందని వివరించారు. బిస్కెట్ బంగారం కొరత ఎక్కువగా ఉందని, దీనివల్ల తాము బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వెళ్లలేకపోతున్నామని స్పష్టంచేశారు. ఏది ఏమైనప్పటికీ బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నా స్థానిక వ్యాపారస్థులు మాత్రం వినియోగదారులకు అధిక ధరలకే అమ్మకాలు సాగిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు చొరవచూపి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

మన్మథరావుకు దళితరత్న
శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 17: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు బోసి మన్మధరావుకు దళితరత్న అవార్డును రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. అంబేద్కర్ 123వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చేతులు మీదుగా ఈ నెల 14వ తేదీన రవీంద్రభారతిలో అవార్డును అందుకున్నారు. సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు పితాని సత్యనారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ రేమాండ్‌పీటర్, కమిషనర్ ఉదయలక్ష్మీ, ఎం.ఆర్.పి.ఎస్. వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగ, ఉత్సవ కమిటీ చైర్మన్ నారాయణలకు ఈ మేరకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆధార్ కేంద్రం వద్ద ఆందోళన
నరసన్నపేట, ఏప్రిల్ 17: మండల కేంద్రంలో ఎం.పి.ఇ.పి స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ఆధార్‌కేంద్రం వద్ద స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. ఇక్కడ గతంలో కేంద్రాన్ని ఏర్పాటు చేసి 90 శాతం మేర ఆధార్‌కార్డులను జారీ చేశామని సివిల్‌సప్లై డి.టి హరిబాబు తెలిపారు. అయినా మిగిలిన పదిశాతం మందికి ఆధార్‌కార్డులు జారీచేసేందుకు ప్రత్యేకంగా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. అయితే ఒకేఒక వ్యక్తిని ఆధార్‌కేంద్ర నిర్వాహకునిగా పెట్టడంతో స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. కార్డు తీసుకునేందుకు కొన్ని గంటల సమయం పడుతుందని, దీనివల్ల వందలాది మంది వేచిఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీనిపై సిఎస్‌డిటి మాట్లాడుతూ రోజుకు కేవలం 20 మందికి మాత్రమే ఆధార్‌కార్డులు జారీ చేస్తున్నామని, క్రమపద్ధతిలో వార్డులవారీగా దరఖాస్తులను ఇస్తున్నామన్నారు. కార్డుల కోసం వందలాది మంది కేంద్రం వద్దకు ఒకేసారి రావడంతో ఈ పరిస్థితి నెలకొంటుందని, కేంద్రాన్ని నెలరోజుల పాటు నిర్వహిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.
కంప్యూటర్ పరిజ్ఞానంతో వృత్తినైపుణ్యం
* రిజిస్ట్రార్ కృష్ణమోహన్
ఎచ్చెర్ల, ఏప్రిల్ 17: కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించుకున్నట్లయితే వృత్తి నైపుణ్యం మరింత పెరుగుతుందని అంబేద్కర్ వర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణమోహన్ స్పష్టంచేసారు. బుధవారం క్యాంపస్ ఆవరణలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. అందువల్లే పదిరోజుల పాటు అధ్యాపకులకు మొదటివిడతగా కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టంచేశారు. అనంతరం పరీక్ష నిర్వహించి ధృవపత్రాలు కూడా అందించనున్నామన్నారు. రెండవ విడతగా సిబ్బందికి ఇదే తరహా శిక్షణ అందించి వృత్తి నైపుణ్యం పెంపొందించేలా మరిన్ని చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం.చంద్రయ్య, అసోసియేట్ ప్రొఫెసర్ కామరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
అదుపుతప్పిన ఒడిశా మంత్రి కాన్వాయ్ వాహనం
* కానిస్టేబుల్ దుర్మరణం * నలుగురికి గాయాలు
టెక్కలి, ఏప్రిల్ 17: ఒడిశా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషారాణి కాన్వాయ్‌లోని వాహనం టెక్కలి బైపాస్ వద్ద టైర్ పేలిపోవడంతో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఎఆర్ కానిస్టేబుల్ కిల్లి అప్పన్న(53) అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో డి.మల్లేసు, జనార్దనరావు, మాణిక్యం, నర్శింగరావులున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో టెక్కలి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టెక్కలి సిఐ రాంబాబు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
బూర్జ, ఏప్రిల్ 17: మండలంలోని మధనాపురం కూడలి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే సరుబుజ్జిలి నుండి పాలకొండ వైపు వస్తున్న ద్విచక్రవాహనాన్ని లకనాపురం కూడలివద్ద కొల్లివలస నుండి పాలకొండ వైపు వెళుతున్న క్వారీ లారీ ఢీకొంది. ఈ సంఘటనలో సీతంపేట మండలం ఈతమానుగూడ గ్రామానికి చెందిన సవర సుందరయ్య(45) అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలపాలైన సవర సోమేసుతో పాటు మరొకరిని 108వాహనంపై శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమేసు(40) మృతిచెందాడు. సంఘటన విషయాన్ని విఆర్‌ఒ వెంకటరావు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ చంద్రవౌళి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్వారీ లారీ డ్రైవర్, క్లీనర్‌లు పోలీసు స్టేషన్‌లో లొంగిపోయినట్లు వెల్లడించారు. ఘటనాస్థలంలో మృతిచెందిన సుందరయ్యను పాలకొండ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఫొటో

సిఎం పర్యటనతో ప్రజలకు మరింత భరోసా
* డిసిసి అధ్యక్షుడు నరేంద్ర
పాతశ్రీకాకుళం, ఏప్రిల్ 17: అమ్మహస్తం ప్రారంభోత్సవ నేపధ్యంలో జిల్లా పర్యటనకు విచ్చేసి టెక్కలిలో ప్రసంగించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరు ప్రజలకు, కార్యకర్తలకు మరింత మనోధైర్యాన్ని, భరోసాన్నిచ్చిందని డిసిసి అధ్యక్షుడు నర్తు నరేంద్రయాదవ్ అన్నారు. బుధవారం ఇందిరావిజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రచ్చబండ వలె అమ్మహస్తం కార్యక్రమం జయప్రదం కావడంతో జిల్లాకు ప్రతిష్ఠ మరింతగా పెంచిందన్నారు. అధికార ప్రతినిధి రత్నాల నర్సింహమూర్తి మాట్లాడుతూ సి.ఎం జిల్లా దీర్ఘకాలిక సమస్యను గుర్తించి వంశధార మరమ్మతులకు 70 కోట్లు కేటాయించారన్నారు. 52.5 టి.ఎం.సి.ల నీటిని అధికారికంగా జిల్లా రైతులకు వినియోగం కాగా కేవలం 17.5 టిఎంసి మాత్రమే వాడుక జరుగుతుందని, ఈ విషయంపై సి.ఎం దృష్టి సారించారన్నారు. ఈ నెల 22 నుండి 26వ తేదీవరకు కేంద్ర కమిటీ బృందం ఈ విషయమై జిల్లా పర్యటనకు రానున్నారని తెలిపారు. ముందుగా టెక్కలి ట్రాక్టర్‌బోల్తా మృతులకు సంతాపసూచికంగా రెండు నిమిషాలు వౌనం పాటించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ముస్తాక్‌మహ్మద్, యూత్‌కాంగ్రెస్ అధ్యక్షులు రజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు.

సిఎం పర్యటనతో ఒరిగేదేమీ లేదు

పాతశ్రీకాకుళం, ఏప్రిల్ 17: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన రాజకీయ లబ్ధికోసమే తప్ప జిల్లా ప్రజలకు ఒరిగేదేమీ లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు ఎద్దేవాచేసారు. బుధవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సి.ఎం వస్తారంటే జిల్లాకు ఏదో చేస్తారనే ప్రజలు ఆశలను నీరుగార్చారన్నారు. తోటపల్లి, వంశధార సమస్యలపై నోరెత్తిన ముఖ్యమంత్రి వెనుకబడిన జిల్లా అంటూ ముసలికన్నీరు కార్చడం హాస్యాస్పదమన్నారు. జలయజ్ఞం పేరుతో నిధులు పక్కదారిన పడ్డాయే తప్ప రైతుకు నీరందించే ఆలోచనే ప్రభుత్వానికి లేదన్నారు. అంబేద్కర్ వర్సిటీకి అనుమతులిచ్చి వౌళిక సదుపాయాలు కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. జిల్లాకు వచ్చిన మంత్రి అధికారుల పనితీరుపై కనీసం రెవెన్యూ సమావేశం కూడా నిర్వహించలేదంటే జిల్లా పట్ల ఆయనకు గల చిత్తశుద్ధి ఏమేరకు ఉందో ఇట్టే అర్ధమవుతోందన్నారు. షీల్డుకవర్‌లో ముఖ్యమంత్రి స్థానాన్ని పొందిన కిరణ్‌కుమార్‌రెడ్డికి చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు. గత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎందరో వారి అసమర్ధత పాలనతో టిడిపికి అధికారాన్ని అందించే విషయాన్ని గుర్తుచేస్తూ ఈ సి.ఎం కూడా అదే పంథాలో దేశం పార్టీకి అప్పగించే పరిస్థితులు కల్పించి శాశ్వత మాజీ సి.ఎం జాబితాలో చేరక తప్పదని చలోక్తి విసిరారు. ఎస్సీ, ఎస్టీ అభ్యున్నతి కోసం సబ్‌ప్లాన్ పెట్టామంటూ బడుగువర్గాలకు మభ్యపెట్టడం సరికాదని, గత తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎంత ఖర్చు చేసారో శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూలికి వెళ్తున్న వారిని బలవంతంగా సభకు తరలించి వారి బతుకులు బుగ్గిపాలు చేసారని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని, ఎక్స్‌గ్రేషియా పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, పి.వి.రమణ, రోణంకి మల్లేశ్వరరావు, కోరాడ బాబు, ఎస్.వి.రమణమాదిగ, డి.వి.ఎస్.ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి
* ముగ్గురికి గాయాలు
శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 17: జిల్లాలో రణస్థలం మండలం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై ఎద్దులబండిని, రెండు మోటారు బైక్‌లను లారీ ఢీకొన్న సంఘటనలో లావేరు మండలం తాళ్లవలస గ్రామానికి చెందిన అప్పలనాయుడు(49) మృతిచెందారు. అప్పలనాయుడు, పోలిరాజులు ఎద్దులబండిని తోలుకుని పాతపెట్రోల్‌బంకు ఎదురుగా ఉన్న కోతమిషన్‌కు వచ్చి జాతీయ రహదారిపై తిరిగివెళ్తుండగా విశాఖ నుండి శ్రీకాకుళం వైపు వెళ్తున్న సిమ్మెంటులోడు లారీ ఢీకొంది. ఈ ఘటనలో మీసాల పోలిరాజు తీవ్రంగా గాయపడ్డాడు. వీరిని 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అప్పలనాయుడు మృతిచెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. పోలిరాజు రిమ్స్‌లో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఎద్దులబండి నుజ్జునుజ్జు కాగా ఒక ఎద్దు దుర్మరణం పాలైంది. ఇదే ఘటనలో రెండు మోటారు సైకిళ్లు రోడ్డుపక్కన ఉంచి మాట్లాడుతున్న దన్నాన మహేశ్వరరావు, సూర్యనారాయణలకు గాయాలయ్యాయి. వీరు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యువజన సంఘాలకు సామాజిక బాధ్యత
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఏప్రిల్ 17: జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాల అమలులో యువజన సంఘాలు కీలకపాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ కోరారు. చైతన్యం కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా లోక్‌శిక్షాసమితి కార్యాలయంలో మండల సమన్వయకర్తలతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సాక్షర భారత్‌కేంద్రాల నిర్వహణ పూర్తిగా యువజన సంఘాలు పర్యవేక్షించాలన్నారు. యువజన సంఘాలకు వాటిపై సంపూర్ణ అవగాహన కలిగించాలని సూచించారు. మండలంలో నిర్మింపబడిన నెహ్రూ యువసంఘం సమన్వయకర్త, సాక్షరభారత్ మండల సమన్వయకర్తలు అవగాహనతో పనిచేయాలని ఆదేశించారు. సాక్షర భారత్ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో నిర్వహించాలన్నారు. జిల్లాను ఆదర్శవంతంగా నిలపాలని, శతశాతం అక్షరాస్యత జిల్లాగా అవతరించేందుకు కృషిచేయాలన్నారు. కార్యక్రమం పట్ల నిర్లక్ష్యవైఖరి, అలసత్వం ఉండరాదన్నారు. చిత్తశుద్ధితో పనిచేయాలనే తపన ఉన్నవారు కొనసాగవచ్చునని పేర్కొన్నారు. ఇప్పటివరకు మూడు విడతలుగా కార్యక్రమం నిర్వహించామని, జనవరి 2013 నుండి నాల్గవ విడత కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. గ్రామస్థాయి సమన్వయకర్తల పనితీరుపై మండల సమన్వయకర్తలు నివేదికలు అందించాలని ఆదేశించారు. అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలన్నారు. తదనుగుణంగా వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. వయోజనవిద్య కేంద్రాల జాబితాను ఎంపిడిఒకు అందజేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు వెంటనే విద్యుత్ ఏర్పాటు చేస్తారని చెప్పారు. విద్యుత్ కల్పించని పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్రాలకు అవసరమైన సామాగ్రి తదితర అంశాలను తెలియజేయాలని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో కార్యక్రమాన్ని తీసుకువెళ్లేందుకు యువసంఘాలతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలన్నారు. సాక్షరభారత్ ఎక్కడ అవసరమైతే అచ్చటకు మార్చాలని ఆదేశించారు. సంతకవిటి, పోలాకి మండలాల సమన్వయకర్తలను వెంటనే నియమించాలని సూచించారు. యువజన సంఘాలతో సామాజిక ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నామని, వాటిలో ఏడాదికి 30 యూనిట్ల రక్తాన్ని సేకరించడం, గ్రామంలో వందమంది నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేయడం, వంద మరుగుదొడ్లు నిర్మించడం, పంచాయతీ నుండి కనీసం 20 ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలో జరిగే విధంగా చేయడం వంటి చర్యలు చేపట్టడం అంశాలున్నాయని చెప్పారు. యువజన సంఘాలు మండలానికి పది స్పోర్ట్స్ కిట్‌లను పంపిణీ చేసామని, అదనంగా కావాలని ముందుకు వస్తే వారికి కూడా సరఫరా చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో ఎజెసి ఆర్.ఎస్.రాజ్‌కుమార్, వయోజన విద్యా ఇన్‌చార్జి ఉపసంచాలకులు ధర్మారావు, ప్రాజెక్టు అధికారి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

మూలవిరాట్ మైనపు నమూనా అంశంపై గడచిన
english title: 
k

నీటి కాలుష్యంతో - కామాక్షిపురం వాసులు ఆస్పత్రులపాలు

$
0
0

బంటుమిల్లి, ఏప్రిల్ 17: బంటుమిల్లి మండలం పెదతుమ్మిడి శివారు కామాక్షిపురంలో పలువురు వాంతులు, విరోచనాలతో ప్రైవేటు, ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారం రోజులుగా గ్రామంలో పలువురు అస్వస్థతకు గురవుతున్నారు. బుధవారం 10మంది వాంతులు, విరోచనాలతో బాధపడుతూ పెదతుమ్మిడి గ్రామంలోని ప్రైవేటు ఆసుపత్రిలో, బందరు, గుడివాడ, ముదినేపల్లి ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందుతున్నారు. గ్రామంలో ఈ పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా వైద్యాధికారులు స్పందించలేదని గ్రామస్థులు వాపోయారు. బోయిన నాంచారమ్మ, నాగ ఫణీంద్ర, మీగడ నాగేశ్వరరమ్మ, నాగమణి, గంగమ్మ తదితరులు వాంతులు, విరోచనాలకు గురయ్యారు. దీనిపై తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బొల్లా వెంకన్న తదితరులు బంటుమిల్లి, చినపాండ్రాక వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్ళగా డా. భార్గవి, చక్రధర్ పరిస్థితిని సమీక్షించి తుమ్మిడి గ్రామ పంచాయతీలో బుధవారం సాయంత్రం వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నారు. బావుల్లోని నీరు కలుషితం కావటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు పేర్కొన్నారు.

నీటి చౌర్యానికి పాల్పడితే క్రిమినల్ కేసులు
కలిదిండి, ఏప్రిల్ 17: మంచినీటి అవసరాల కోసం కాకుండా కాలువల ద్వారా అక్రమంగా నీటిని మళ్ళిస్తే క్రిమినల్ కేసులు పెడతామని గుడివాడ డిఎల్‌పివో వరప్రసాద్ హెచ్చరించారు. గురవాయిపాలెం, మట్టగుంట, భాస్కరరావుపేట, మూలలంక, పెదలంక గ్రామాల్లో అధికారుల బృందం బుధవారం తనిఖీలు నిర్వహించారు. నీటిని తాగునీటి చెరువులకు మాత్రమే ఉపయోగించాలని, మంచినీటి చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. తహశీల్దార్ క్షీరసాగర్, ఎండివో రామకృష్ణ నాయక్, కార్యదర్శులు కోటేశ్వరరావు, నరసింహ, విఆర్‌ఓ గంగాధర్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.

చేపల చెరువులకు అక్రమంగా
నీటి మళ్ళింపు
* పట్టించుకోని అధికారులు
కృత్తివెన్ను, ఏప్రిల్ 17: తాగే అవసరాల కోసం విడుదల చేసిన నీటిని అక్రమంగా చేపల చెరువులకు ఆయిల్ ఇంజన్‌ల ద్వారా తోడుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని నిడమర్రు పంచాయతీ పోడు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పోడు గ్రామంలో ఉన్న మంచినీటి చెరువుకు నీరు పెట్టేందుకు గ్రామస్థులు పనిచేస్తుండగా బుధవారం చిన్నగొల్లపాలెం పంట కాలువ పరిధి పోడు అడ్డరోడ్డు నుండి గరిశపూడి వరకు ఇంజన్‌లతో చేపల చెరువులకు అక్రమంగా నీటిని తోడుతున్నట్లు తెలుసుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోవటం లేదని గ్రామస్థులు వాపోయారు.

ప్రశ్నించేతత్వం అలవర్చుకోండి
* విద్యార్థులకు చుక్కా రామయ్య సూచన
తిరువూరు, ఏప్రిల్ 17: విద్యార్థులు ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ, సేఫ్ ఐఐటి వ్యవస్థాపకులు చుక్కా రామయ్య అన్నారు. బుధవారం ఆయన రాజుపేటలో విజన్ హైస్కూల్‌ను సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ పాఠ్యాంశాలను బట్టీ పట్టడం కాకుండా జ్ఞానం, సామాజిక స్పృహతో భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకుని దాని ప్రకారం నడుచుకోవాలన్నారు. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు తమవంతు శ్రద్ధ వహించాలన్నారు. ఆయన విద్యార్థులతో పలు అంశాలపై ముచ్చటించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. పాఠశాల యాజమాన్యం రామయ్యను దుశ్శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ప్రధానోపాధ్యాయుడు ఎ శ్రీనివాసరావు, చైర్మన్ సంకా శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొడ్డు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
* ఒకేఒక్క డైలాగ్‌తో ముగిసిన షర్మిల పాదయాత్ర
కంచికచర్ల/ వీరులపాడు, ఏప్రిల్ 17: వైఎస్‌ఆర్‌సిపి నాయకురాలు షర్మి ల పాదయాత్ర బుధవారం వీరులపా డు మండలంలో కొనసాగింది. జి కొం డూరు మండలం దుగ్గిరాలపాడులో రాత్రి బస చేసిన షర్మిల బుధవారం ఉదయం వీరులపాడు మండలం జి మాధవరం గ్రామంలోకి ప్రవేశించారు. ఈ మండల నాయకులు సరిహద్దుల వరకూ వెళ్లి షర్మిలను ఆహ్వానించకపోవడంతో పాదయాత్ర పేలవంగా జరిగింది. మాధవరంలో కూడా ఆమె చేయి ఊపుకుంటూ పాదయాత్ర కొనసాగించారేతప్ప నోరువిప్పి మాట్లాడలేదు. మధ్యలో తిమ్మాపురం గ్రామ ప్రజలు తమకు మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరగా ‘రాజన్న రాజ్యం వస్తుంది మీకోరికలు తీరుతాయి’.. అన్న ఒక్కమాట మాత్రం మాట్లాడారు. పరుగులాంటి నడకకే ప్రాముఖ్యం ఇచ్చారు తప్ప ప్రజల్లోకి చొరవగా దూసుకువెళ్లే ప్రయత్నం చేయలేదు. ఒకవైపు పోలీసులు, మరోవైపు ఆమె భద్రతా సిబ్బంది సామాన్యులను షర్మిల దరిచేరకుండా అడ్డుకున్నారు. ఉదయం 11గంటలకే యాత్ర ముగించుకొని పెద్దాపురం ఊరిబయట ఏర్పాటు చేసిన టెంట్‌లోకి ఆమె వెళ్లిపోయారు. తిరిగి సాయంత్రం 4గంటల తరువాత పాదయాత్ర ప్రారంభించిన షర్మిల పెద్దాపురం సెంటర్‌లో నాయకులు మాట్లాడే ఏర్పాట్లు చేసినప్పటికీ ఆగకుండా జయంతి వెళ్లారు. అక్కడక్కడ ఆగి మాట్లాడతారని ప్రజలు ఎదురుచూసినప్పటికీ నిరాశే మిగిలింది. సాయంత్రం 5.30గంటల సమయంలో జయంతి కాలనీకి ఆమె చేరుకున్నారు. బుధవారం ఉదయం వీరులపాడు మండలంలో ప్రవేశించినప్పటి నుండి సాయంత్రం వరకూ ఆమె నోటి నుండి ఒకే ఒక్క మాట రావడం, వేగంగా నడిచి వెళ్లడం కార్యకర్తల్లో నిరుత్సాహాన్ని కలిగించింది.

శ్రీ లక్ష్మీపతి స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
కూచిపూడి, ఏప్రిల్ 17: ముక్కోటి దేవతలు కొలిచే శ్రీ లక్ష్మీపతి స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలకు పెదముత్తేవి గ్రామం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. పంచ లక్ష్మీనారాయణ క్షేత్రాలలో ఒకటిగా పేరొందిన పెదముత్తేవిలో శ్రీ లక్ష్మీపతిస్వామి స్వయంభూగా వెలసినట్లు పెద్దలు చెబుతారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న పెదముత్తేవి గ్రామంలో ముత్తీవి వంశీయుల ఆరాధ్య దేవుడైన శ్రీ లక్ష్మీపతిస్వామి శంఖు, చక్ర, గద, అభయ హస్తాలతో శ్రీ లక్ష్మీదేవితో ఈ క్షేత్రానికి వేంచేశారని అంటారు. ముముక్షుజన మహాపీఠాధిపతులు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ముత్తీవి సీతారాం గురుదేవులు పర్యవేక్షణలో ఈ నెల 19న శ్రీరామనవమి మహోత్సవాలను, హనుమంత వాహనోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ పర్యవేక్షకులు తుర్లపాటి ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 21న స్వామివారిని పెండ్లి కుమారునిగా, అమ్మవారిని పెండ్లి కుమార్తెగా అలంకరిస్తారు. ఈసందర్భంగా ముత్తీవి సీతారాం గురుదేవుల అనుగ్రహ భాషణ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, దీక్షా శ్రీకారం, కంకణధారణ, మృత్సంగ్రహణం, అంకురారోపణ, హోమాలు, భజన, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కల్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు, గురుదేవుల ఆశీస్సులను అందుకోవాలని భక్తులను ఆనంద్ కోరారు.

ఎండవేడిమికి అల్లాడుతున్న జనం
కూచిపూడి, ఏప్రిల్ 17: వాతావరణంలో తేమశాతం ఒక్కసారిగా తగ్గిపోవటంతో ఉష్ణోగ్రతలు పెరిగాయి. మంగళవారం పడిన చినుకుల కారణంగా వేడిగాలులు వీచటంతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రైవేటు వైద్యశాలలు రోగులతో కిటకిటలాడాయి. కోళ్ళ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. బుధవారం 45.1 సెల్సియస్ (108.2 ఫారన్ హీట్) ఉష్ణోగ్రత నమోదైంది. గత 15రోజులుగా కేవలం 98, 96 ఫారన్ హీట్‌కే పరిమితమైన ఉష్ణోగ్రత ఒక్కసారిగా 108కి చేరటానికి వాతావరణంలో తేమ 23శాతానికి తగ్గటమే కారణమని వాతావరణ శాస్తవ్రేత్తలు పేర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలతో పాటు వందలాది లేయర్ కోళ్ళు మృత్యువాతపడ్డాయి. అలాగే బ్రాయిలర్ కోళ్ళు కూడా అధిక సంఖ్యలో మృత్యువాతపడినా పెంపకందారులు బ్యాంక్ రుణాల కారణంగా చనిపోయిన కోళ్ళను గుట్టుచప్పుడు కాకుండా పారవేస్తున్నారు. పలువురు పెంపకందారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టటంతో నష్టం నుండి బయటపడ్డారు.

జిల్లాలో పోలీసుల విస్తృత దాడులు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 17: జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జె ప్రభాకరరావు ఆదేశం మేరకు బుధవారం జిల్లాలో పోలీసులు విస్తృత దాడులు నిర్వహించారు. బందరు డివిజన్‌లో దాడులు నిర్వహించి పత్రాలు సరిగ్గా లేని 38మంది వాహనదారులకు రూ.6,550 జరిమానా విధించారు.
గుడివాడ సబ్ డివిజన్ పరిధిలో 97 మంది వాహనదారులకు రూ.19,200 జరిమానా విధించారు. గుడివాడ తాలూకా పిఎస్ పరిధిలో పేకాట ఆడుతున్న 16మందిని అదుపులోకి తీసుకుని రూ.6,160ను స్వాధీనం చేసుకున్నారు. నందిగామ సబ్ డివిజన్ పరిధిలో 31 వాహనాలను తనిఖీ చేసి 2,370 జరిమానా విధించారు. నూజివీడు సబ్ డివిజన్‌లో 24మంది వాహనదారులకు రూ.2,950, అవనిగడ్డ డివిజన్‌లో 27 వాహనాలను తనిఖీ చేసి రూ.4,750 జరిమానా విధించారు.

సకల సద్గుణ సంపన్నుడు
శ్రీరామచంద్రమూర్తి
మచిలీపట్నం (కల్చరల్), ఏప్రిల్ 17: శ్రీరాముడు సకల సద్గుణ సంపన్నుడని నారద మహర్షి చెప్పాడని ప్రముఖ సాహితీవేత్త మద్దూరి రామమోహనరావు అన్నారు. స్థానిక బచ్చుపేట ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. రామాయణంలోని పాత్రల విశిష్టతను తెలుపుతూ నారద, వాల్మీకి మహర్షుల సంభాషణను వివరించారు. గుణశీలుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, సర్వభూతముల హితవును కోరేవాడు, మొదలగు లక్షణాలను కలిగి ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి మహర్షి నారదుని అడుగగా అట్టివాడు శ్రీరామచంద్రుడని నారదుడు తెలిపాడు. సోదాహరణంగా నారదుడు తెలిపిన విధానాన్ని రామమోహనరావు వివరించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు డా. ధన్వంతరి ఆచార్య, పంచాయతిరాజ్ విశ్రాంత డెప్యూటీ కమిషనర్ ఎంఎస్ శాస్ర్తీ, ముక్తేవి రామకృష్ణ, వి పూర్ణచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

రిజర్వేషన్లు కల్పించాలని కాపుల ధర్నా
అవనిగడ్డ, ఏప్రిల్ 17: కాపులకు రిజర్వేషన్‌లు అమలు చేయాలని కోరుతూ స్థానిక రాయల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులు బుధవారం అవనిగడ్డ, నాగాయలంక తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. జనాభా దామాషా ప్రకారం కాపులకు రిజర్వేషన్‌లు అమలు చేయాలని, 1910-66 మధ్యకాలంలో అమలులో వుండిన కాపు రిజర్వేషన్‌లు పునరుద్ధరించాలి డిమాండ్ చేశారు. అంతకుముందు ప్రధాన వీధుల్లో అసోసియేషన్ సభ్యులు ప్రదర్శనలు నిర్వహించారు. ఈసందర్భంగా తహశీల్దార్‌లకు వినతిపత్రాలు అందజేశారు. అవనిగడ్డలో జరిగిన ధర్నాకు అప్పికట్ల సోములు, నాగాయలంకలో తోట శ్రీను, బీసాబత్తిన ప్రసాద్, రేబాక చంటి నాయకత్వం వహించారు.

కాపులను బిసి జాబితాలో చేర్చాలి
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 17: రాష్ట్రంలో నిరుపేదలు అత్యధికంగా ఉన్న కాపులను బిసిలుగా గుర్తించి వారి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కాపునాడు కృష్ణా జిల్లా శాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

బంటుమిల్లి మండలం పెదతుమ్మిడి శివారు కామాక్షిపురంలో
english title: 
n

చంద్రబాబుకు జననీరాజనం

$
0
0

నర్సీపట్నం, ఏప్రిల్ 17: తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వస్తున్నా మీ కోసం పాదయాత్రకు నర్సీపట్నంలో జనం నీరాజనాలు పలికారు. పాదయాత్రగా వస్తున్న బాబుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. మండలం బలిఘట్టం వద్ద బస చేసిన చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు మాడుగుల,చోడవరం నియోకవర్గాల కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విజయనగరం జిల్లా నుండి వచ్చిన పార్టీ నాయకులతో కార్యకలాపాలపై సమీక్ష జరిపారు. ఈసమీక్షలో ఎమ్మెల్యేలు అశోక్‌గజపతిరాజు, పడాల అరుణ, కె.లలితకుమారి, పతివాడ నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే శోభాహైమావతి పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు. బలిఘట్టం నుండి ప్రారంభమైన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వందలాది మంది బాబు అడుగులో అడుగు వేసుకుంటూ వెంట నడిచారు. నర్సీపట్నంలో బాబుకు అపూర్వస్వాగతం లభించింది. మహిళలు హారతు లు పట్టారు. నర్సీపట్నం అబీద్ సెంటర్ పసుపు మయంగా మారింది. పసుపు జెండాలు అలంకరించారు. మరో రెండు రోజుల్లో చంద్రబాబు 63వ జన్మదినోత్సవాన్ని జరుపుకోనున్న సందర్భంగా తెలుగు యువత నాయకుడు చింతకాయల విజయ్‌బాబు ఆధ్వర్యంలో 63 బెలూన్లను ఆకాశంలో ఎగురవేశారు. నర్సీపట్నం పొలిమేర్ల నుండి రోడ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్‌ను వేరే రూట్లకు మళ్ళించాల్సి వచ్చింది. అబీద్‌సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. వై ఎ స్సార్ సి.పి. అధినేత జగన్‌ను తీహార్ జైల్‌కు పంపించాలని, మద్యం బెల్ట్‌షాపులను ఎత్తివేయాలని చంద్రబాబుకు సూచించారు. జగన్ తీహార్‌జైల్‌కు వెళ్ళే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చంద్రబాబు పేర్కొనడంతో జనం కేరింతలు కొట్టారు. అబీద్ సెంటర్‌లో సుమారు రెండు గంటల పాటు చంద్రబాబు రాష్టస్థ్రాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు స్థానిక సమస్యలను ప్రస్తావించారు. నర్సీపట్నంను శాటిలైట్ టౌన్ గా అభివృద్ధి చేస్తామని, ట్రాఫిక్‌ను నిరోధించేందుకు రింగ్‌రోడ్డును నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. దేశం ప్రభుత్వ హయాంలో అయ్యన్నపాత్రుడు నాయకత్వంలో నర్సీపట్నం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందన్నారు.మళ్ళీ అధికారంలోకి వస్తే నర్సీపట్నాన్ని సుందరనగరంగా తీర్చిదిద్దుతామని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అనంతరం శ్రీకన్య జంక్షన్, పెదబొడ్డేపల్లి జంక్షన్‌లవద్ద బాబు ప్రసంగించారు. బలిఘట్టం నుండి బాబు రాత్రి మకాం ఉండే సుబ్బారాయుడుపాలెం వరకు సుమారు ఏడు కిలో మీటర్లు పాదయాత్ర పూర్తి చేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలో నాలుగు రో జుల పాటు జరిగిన పాదయాత్ర సుమారు 30 కిలోమీటర్లు సాగింది. బుధవారం పాదయాత్ర ప్రారంభం మొదలుకుని చివరి వరకు ఉత్సాహంగా సాగింది. చంద్రబాబు లేని ఓపికను తెచ్చుకుని ఉత్సాహంగా ముందుకు నడిచారు.

కడపాలెంలో భారీ అగ్ని ప్రమాదం
* వంద పూరిళ్లు దగ్ధం * రూ. 50 లక్షల ఆస్తి నష్టం
అచ్యుతాపురం, ఏప్రిల్ 17: మండలంలో పూడిమడక శివారు కడపాలెంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు వంద పూరిళ్లు దగ్ధమై సుమారు 50 లక్షల ఆస్తినష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో బాధితులు కట్టుబట్టలతో నిరాశ్రయులుగా మిగిలారు. గ్రామానికి చెందిన ఎరుపల్లి దేము డు ఇంటినుండి నిప్పురవ్వలు ఎగిరిపడి మంటలు వ్యాపించాయి. ఈ మంటలకు సముద్రపు గాలి తోడుకావడంతో గ్రామమంతా వ్యాపించి పూరిగుడిసెలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. క్షణాల్లో గ్రామమంతా అగ్ని కి ఆహుతైంది. విలువైన వలలు, వంట సామాగ్రి, తిం డిగింజలు, బట్టలు మంటల్లో కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన ఎరుపల్లి బంగారమ్మకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను 108 అంబులె న్స్‌లో ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. సుమారు 150 మత్స్యకార కుటుంబాలు కట్టుబట్టలతో నిరాశ్రయులుగా మిగిలారు. యలమంచిలి, అనకాపల్లి, నక్కపల్లి, ఎన్టిపిసిల అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఆస్తినష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యే కన్నబాబురాజు,ఆర్డీవో వసంతరాయుడు బాధితులను పరామర్శించారు. ఎస్‌ఐ సిహెచ్ నర్సింగరావు సిబ్బందితో కలసి మంటలను అదుపుచేస్తూ బాధితులకు సహాయ సహకారాలు అందిచారు. తహశీల్దార్ సీతారామారావు, ఎంపిడివో మంజుల వాణి బాధితుల వివరాల సేకరణ చేపట్టారు.
ఎవరిని ఉద్దరించడానికి బాబు పాదయాత్ర?
* మంత్రి బాలరాజు విమర్శ
పాడేరు, ఏప్రిల్ 17: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వస్తున్నా మీకోసం పేరిట నిర్వహిస్తున్న పాదయాత్ర ఎవరిని ఉద్దరించడానికని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు ప్రశ్నించారు. మండలం గొండెలి, డి.గొందూరు గ్రామాల్లో బుధవారం ఇందిరమ్మ కలలు కార్యక్రమాల్లో ఆయన అమ్మహస్తం పథకాన్ని ప్రారంభించారు. గ్రామసభల్లో మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న పాదయాత్రపై విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్న ప్పుడు ప్రజలకు ఏం చేయలేని చంద్రబాబు పాదయాత్ర నిర్వహిస్తూ ఏదో చేస్తానంటూ హామీలు గుప్పిస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. టిడిపి పాలనలో గిరిజనులకు ఒరిగిందీ ఏదీ లేదని ఆయన విమర్శించారు. గిరిజనుల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన ఎద్దేవాచేశారు. ఈ ప్రాంతం నుంచి గతంలో మంత్రులుగా పనిచేసిన వారు మన్యం అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత నాలుగేళ్ళ కాలంలోనే గిరిజనాభివృద్ధికి పెద్దపీట వేశామని ఆయన చెప్పుకున్నారు. గిరిజన, హరిజన వర్గాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను అమలులోకి తీసుకువచ్చి చట్టబద్ధత కల్పించిందన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మహస్తం పేదలకు వరమన్నారు. రాయితీపై నిత్యావసర వస్తువులను అందచేసి పేద ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందన్నారు. అనంతరం పాడేరులో 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన స్ర్తిశక్తి భవనాన్ని బాలరాజు ప్రారంభించి, 64 లక్షల 17 వేలతో చేపట్టనున్న పశువుల ఆసుపత్రి భవనానికి, పాడేరు నుంచి సప్పిపుట్టు గ్రామానికి 3 కోట్ల 36 లక్షలతో నిర్మించే తారురోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఐ.టి.డి.ఎ. నూతన ప్రాజెక్టు అధికారి వై. నరసింగరావు, ఆర్డీవో ఎం.గణపతిరావు, పాడేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎం.ఆర్.జి. నాయుడు, బి.అప్పలనాయుడు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

చేతకాకపోతే మన్యం వీడి వెళ్లండి
* గిరిజన మంత్రి బాలరాజు హెచ్చరిక
పాడేరు, ఏప్రిల్ 17: గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయలేకపోతున్న అధికారులు మన్యం విడిచిపెట్టి వెళ్లిపోవాలంటూ గిరిజన సంక్షేమ శాఖామంత్రి పసుపులేటి బాలరాజు తీవ్ర ంగా హెచ్చరించారు. పి.ఎం.ఆర్.సి. కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో బుధవారం రాత్రి సమావేశంలో మన్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును సమీక్షించారు. గిరిజన సంక్షేమం, పిఆర్ శాఖల ఇంజనీరింగ్ అధికారులు బాధ్యతారాహిత్యం గా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏజెన్సీలో అభివృద్ధి నిర్మాణ పనులకు కోట్లాది రూపాయలను మంజూరు చేస్తూ అనేక పనులను తీసుకువస్తుంటే వాటిని సకాలంలో పూర్తి చేయడంలో ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం చెందారు. మన్యంలో అభివృద్ధి కుంటుపడి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా తయారైందని ఆయన ఆక్షేపించారు. ఇటువంటి అధికారులు మన్యంలో పనిచేసే దానికంటే వేరే ప్రాంతానికి వెళ్లిపోవడమే మంచిదని అన్నారు. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ అధికారులకు ఉన్న పలుకుబడిని వినియోగించుకుని ఏజెన్సీ నుంచి వెళ్లిపోవడం ఉత్తమమని ఆయన సలహా ఇచ్చారు. ఇందిరాక్రాంతి పథం అధికారుల పనితీరు పట్ల మం త్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పథకా లను గిరిజనులకు తెలియచేసి వారిలో అవగాహన కల్పించడంలో ఇందిరాక్రాంతి పథం అధికారులు విఫలమయ్యారన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నా ఇవేమీ యువతకు తెలియడం లేదని, దీన్ని బట్టి ఇందిరాక్రాంతి పథం అధికారులు ఏం చేస్తున్నారంటూ ఆయన నిలదీశారు. అధికారులు ఇకనైనా పనితీరును మార్చుకుని చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఇకపై ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. మన్యంలో పనిచేసే అధికారులు బాధ్యతతో వ్యవహరించి పనిచేయడం వారికే మంచిదని, లేకుండే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తోందని బాలరాజు హెచ్చరించారు. ఈ సమావేశంలో ఐ.టి.డి.ఎ. ఇన్‌చార్జి ప్రాజెక్టు అధికారి నరసింగరావు, ఆర్డీవో ఎం.గణపతిరావు పాల్గొన్నారు.

ఫీల్డ్ అసిస్టెంట్లకు ‘ఉపాధి’ పనుల తనిఖీలు తప్పనిసరి
* జిల్లా పరిషత్ సిఇఒ వెంకటరెడ్డి
చోడవరం, ఏప్రిల్ 17: ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీ పనుల్లో హాజరుపట్టీని విధిగా తనిఖీలు జరిపి సకాలంలో కూలీలకు వేతనాలు అందించేలా చర్య లు చేపట్టాలని జిల్లా పరిషత్ సిఇఒ వెంకటరెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని అడ్డూరు, దుడ్డుపాలెం గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన చెరువు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో ఏడు మండలాల ఫీల్డ్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 2013-14 సంవత్సరానికి 447 కోట్ల రూ పాయల బడ్జెట్‌తో ఉపాధి హామీ పనుల ను జిల్లాలో నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందులో వేతనా ల కోసం 268 కోట్లు, ఆయా పనిముట్లు, పరికరాల ఏర్పాట్లకు 179 కోట్లు రూపాయలను కేటాయించామన్నారు. ఈ ప నుల కోసం రోజుకు రెండు లక్షల మంది కూలీలు పనిచేయాల్సి ఉందన్నారు. మంగళవారం నాటికి జిల్లాలో లక్షా 58,263మంది కూలీలు ఉపాధి హామీ పనులు చేస్తున్నారన్నారు. ఈ సంఖ్యను మరింతగా పెంచేందుకు ఫీల్డ్ సిబ్బంది కృషిచేయాల్సి ఉందన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు లేనిచోట సీనియర్ మేట్లే ఆయా పనులు చేపట్టాల్సిఉందన్నారు. ఈ వారాంతానికి రెండు లక్షల మంది కూలీలు పనుల్లో హాజరయ్యేలా చర్య లు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయాలని కార్యదర్శులకు ఆదేశాలు జారీచేశామన్నారు. మే నెలాఖరు నాటి కి మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తికావాల్సిఉందన్నారు. ఉపాధి హామీ పధకం ద్వా రా ఉద్యానవనాల పెంపకానికి 1454 ఎకరాలను జిల్లాలో గుర్తించామన్నారు. వీటిలో జూన్ నెలాఖరు నాటికి మొక్కలు నాటడం పూర్తిచేయాల్సి ఉందని ఆయన తెలిపారు.

‘మహా’ నష్టం
* ఆదాయాన్ని తీవ్రంగా కోల్పోతున్న జివిఎంసి

విశాఖపట్నం (జగదాంబ), ఏప్రిల్ 17: ‘‘దక్కిందే దక్కుదల’’ అన్న చందంగా మహావిశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) వ్యవహరించడంతో అధికారికంగా వచ్చే ఆదాయాన్ని కూడా తీవ్రంగా నష్టపోతోంది. ఆస్తిపన్ను, కమర్షియల్ టాక్స్ తరువాత అతిపెద్ద ఆదాయ వనరుగా ఫైర్ (అగ్నిమాపక) విభాగం ద్వారా వచ్చే కోట్లాది రూపాయల ఆదాయాన్ని చేతులారా పోగొట్టుకుంటోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ...సిబ్బంది కొరత....సంబంధిత అధికారుల నిర్లక్ష్యం...వెరసి మహావిశాఖ నగరపాలక సంస్థకు అంతా నష్టమే మిగులుతోంది. వివరాలు ఇలా...
జివిఎంసి కీలకమైన విభాగంలో అత్యంత ప్రాధ్యానతను సంతరించుకున్న విభాగం ఫైర్ విభాగం. అయితే ఈ విభాగం అందరి దృష్టిలో అవసరానికి మాఅతమే ఉపయోగపడుతుంది అయినప్పటికీ ఆదాయంలో మాత్రం ప్రథమస్థానంలో ఉంటుంది. ఏటా జివిఎంసి పరిధిలో ఉన్న స్కూళ్ళు, ఆసుపత్రులు, హోటళ్ళు, కల్యాణమండపాలు, షాపింగ్‌మాల్స్ తదితర వాటి ద్వారా ఫైర్‌విభాగానికి కోట్లాది రూపాయలు ఎన్‌ఓసిల ద్వారా వస్తుంటుంది. అయితే సకాలంలో తనిఖీలు నిర్వహించాక రెన్యువల్ చేయించని వాటిపై చర్యలు తీసుకోక, నిబంధనలు పాటించకుండా చేపడుతున్న నిర్మాణాలపై దృష్టి లేకపోవడంతో ఆదాయాన్ని భారీగానే నష్టపోతోంది. దీంతో పాటు జివిఎంసిలో 2010 నుంచి ఆ శాఖకు సంబంధించి పూర్తిస్థాయిలో అధికారులు లేకపోవడం కూడా ఒక కారణమే. దీని కారణంగా గడిచిన మూడు సంవత్సరాల వ్యవధిలో సుమారుగా జివిఎంసి మూడుకోట్ల రూపాయల ఆదాయాన్ని చేజార్చుకుంది. నగర పరిధిలో ఉన్న 58 పెట్రోల్ బంక్‌లలో కేవలం మూడింటికే లైసెన్సులు, ఎన్‌ఓసిలు కలిగి ఉండడం, అలాగే 144 ప్రైవేట్ పాఠశాలలకు ఎన్‌ఓసిలు లేకపోవడం, దీంతో పాటు 94 కల్యాణమండపాలు ఉండడం గుర్తించిన జివిఎంసి అధికారులు వాటి ద్వారా ఆదాయాన్ని పొందేందుకు ఇప్పుడు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే ఆ నగరంలో అగ్నిమాపక పరికరాలు లేకుండా నిర్వహిస్తున్న హోటళ్లు, ఆసుపత్రులు, స్కూళ్లు తదితర వాటికి నోటీసులు ఇచ్చారే తప్ప ఏ మాత్రం చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. మరో విషయం ఏమిటంటే జివిఎంసి ఇటీవలే నూతనంగా నియమించిన ఫైర్ ఆఫీసర్ ద్వారా నెలన్నర వ్యవధిలో జివిఎంసి ఫైర్ విభాగానికి సుమారు 40 లక్షల ఆదాయం తెచ్చినట్లు సమాచారం
వేధిస్తున్న సిబ్బంది కొరత:
జివిఎంసిలో గతంలో ఫైర్ విభాగానికి ఒక డిఎఫ్‌ఓ, ఇద్దరు ఎఎఫ్‌ఓలు, కానిస్టేబుల్స్ ఉండేవారు. 2010లో జరిగిన ఎసిబి దాడుల్లో ఇద్దరు అధికారులు దొరికిపోవడంతో ఆ శాఖ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. దీంతో ఇటీవల రాష్టస్థ్రాయి అధికారి (ఆర్‌ఎఫ్‌ఓ)గా ఎస్‌వి.నరసింహం జివిఎంసిలో ఫైర్ ఆఫీసర్‌గా నియమించడం జరిగింది. ఆర్‌ఎఫ్‌ఓ స్థాయి అధికారులు ఒక డిఎఫ్‌ఓ, ఇద్దరు ఎడిఎఫ్‌ఓలు, 10 మంది సిబ్బంది ఉండాలి కాని జివిఎంసిలో మాత్రం ఒక అసిస్టెంట్, ఒక హోంగార్డ్, డేటా ఆపరేటర్ మాత్రమే పని చేస్తుండడం విశేషం. నగరంలో నిత్యం ఏదో ఒక చోట అగ్నిప్రమాదాలు జరుగుతుండడం, వాటిని ఆర్పేందుకు పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో ఆదాయాన్ని కూడా రాబట్టుకోలేకపోతోంది. ఈ విషయమై జివిఎంసి కమిషనర్ ఎంవి.సత్యనారాయణ దృష్టిసారించి ఫైర్ విభాగానికి పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించి ఆదాయ వనరులను కాపాడాలని పలువురు కోరుతున్నారు.

కేంద్రంలో మూడో ప్రత్యామ్నాయం తప్పదు
* టిడిపియే చక్రం తిప్పుతుంది
* నర్సీపట్నం సభలో చంద్రబాబు నాయుడు

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఏప్రిల్ 17: కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి వచ్చే అవకాశం లేదని, అలాగే అధికారంలోకి వస్తామనుకుంటున్న బిజెపి ఆశలు కూడా అడియాశలవుతాయని, మూడో ప్రత్యామ్నాయానికే అవకాశాలు ఉన్నాయని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా విశాఖ జిల్లా నర్సీపట్నం అబిద్ సెంటర్‌లో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అత్యధిక ఎంపి స్థానాలను సాధించుకుంటామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నిన్న మొన్నటి వరకూ ఎగిరెగిరిపడిందని, ఇప్పుడు 12 స్థానాలతో సరిపెట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఒకప్పుడు కేంద్రంలో టిడిపి చక్రం తిప్పిందని, మళ్లీ అదే పరిస్థితి రాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో టిడిపి నూటికి నూరు శాతం అధికారంలోకి వస్తుందని బాబు జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పేద, మధ్య తరగతి ప్రజలను రాక్షసంగా హింసిస్తోందని చంద్రబాబు అన్నారు. ఈ వర్గాల ఆదాయం పెరగకపోయినా, పన్నుల పేరుతో వారి నడి విరుస్తోందని అన్నారు. చివరకు ఉపాధి హామీ పథకం కింద దొంగ లెక్కలు రాసి, డబ్బులు కొట్టేస్తున్నారని ఆయన విమర్శించారు. బెల్ట్ షాపులు పెట్టి ఏడాదికి 50 వేల కోట్ల రూపాయల మద్యాన్ని విక్రయించి, 20 వేల కోట్ల రూపాయలు ప్రజల నుంచి టాక్స్ రూపంలో వసూలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. తన హయాంలో 20-30 వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, అయితే, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తనపై అనేక విమర్శలు చేసిందని ఆయన అన్నారు. ఇప్పుడు 1,80,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా, ఎవరికి వారు ఆ మొత్తాన్ని దిగమింగారని బాబు విమర్శించారు. గడచిన తొమ్మిదేళ్ళలో ఒక్కరికైనా ఒక్క సహాయమైనా అందిందా? అని ఆయన ప్రశ్నించారు. తన హయాంలో ప్రజల ఆస్తులకు ట్రస్టీగా వ్యవహరించానే తప్ప, ఏనాడూ ప్రజల ఆస్తులను కొల్లగొట్టలేదని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. జగన్ ఏ సిద్ధాంతం కోసం పార్టీని స్థాపించాడో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. లేక ప్రజల కోసం పార్టీ పెట్టాడా? అని ఆయన ప్రశ్నించారు. కేవలం ముఖ్యమంత్రి కుర్చీ కోసం పార్టీని పెట్టాడని ఆయన అన్నారు. అవినీతిపై ప్రజల్లో చైతన్యం రావాలని బాబు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు జరుగుతున్న మోసాన్ని వివరించేందుకే తాను ఈ పాదయాత్ర చేపట్టానని అన్నారు.
విశాఖ ఉక్కుకు ఎపిఎండిసి గనులు
* కాలుష్య రహితంగా ‘జింక్’ను తీర్చిదిద్దాలి
* ఇంటక్ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఏప్రిల్ 17: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనుల కేటాయింపు జరిగే వరకూ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఎపిఎండిసి) ద్వారా ఐరన్‌ఓర్ సరఫరా చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అంగీకరించారని ఇంటక్ జాతీయ అధ్యక్షుడు గుర్రం సంజీవరెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లోని ఐరన్‌ఓర్ గనులను స్టీల్‌ప్లాంట్‌కు కేటాయిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. అలాగే విశాఖపట్నం పోర్టు ట్రస్టులో ప్రైవేటీకరణ పనులు జోరుగా సాగుతున్నాయని, వీటిని తక్షణమే నిలిపివేయాలని సూచించారు. ఐరన్‌ఓర్ హేండ్లింగ్ కాంప్లెక్స్‌ను పూర్తిగా పోర్టుయాజమాన్యమే నిర్వహించాలన్నారు. జింక్ కర్మాగారాన్ని కాలుష్య రహితంగా ఆధునీకరించి, తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. హిందుస్థాన్ షిప్‌యార్డుకు సంబందించి ఇప్పటికే 1100 కోట్ల రూపాయల మేర నష్టాల్లో కూరుకుపోయిందని, దీనికి యాజమాన్యం నిర్లక్ష్య ధోరణే కారణమని ఆయన ఆరోపించారు. యాజమాన్య ఏకపక్ష నిర్ణయాల కారణంగానే షిప్‌యార్డు నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. కార్మిక సంఘాలతో చర్చించి కొత్తగా ఆర్డర్లు పొందాలని, తద్వారా నష్టాల నుంచి గట్టెక్కాలని సూచించారు. ఇక కేంద్ర ప్రభుత్వం లాభాలతో నడుస్తున్న కర్మాగారాల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకునే విధానానికి స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక కాంట్రాక్టు కార్మికులకు 10 వేల రూపాయల కనీస వేతనం అమలు చేయాలని, అసంఘటిత రంగం, వ్యవసాయ కార్మికులకు వేతనాలు, సంక్షేమ నిధి ఏర్పాటు అంశంపై చర్యలు తీసుకోవాలన్నారు.

రైల్వేలో ప్రైవేటీకరణ విధానాలకు వ్యితిరేకం
* ఎన్‌ఎఫ్‌ఐఆర్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాఘవయ్య
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఏప్రిల్ 17: రైల్వే ప్రైవేటీకరణకు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే (ఎన్‌ఎఫ్‌ఐఆర్) వ్యతిరేకమని ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం రాఘవయ్య అన్నారు. రైల్వేలో కార్మిక గుర్తింపు ఎన్నికలను పురస్కరించుకుని ప్రచారం నిమిత్తం వచ్చిన ఆయన బుధవారం నాడిక్కడ విలేఖరులతో మాట్లాడారు. రైల్వేలను బతికించుకోవాల్సి బాధ్యత ప్రతికార్మికునిపై ఉందని అన్నారు. ప్రస్తుతం 90వేల కిలోమీటర్ల మేర ఉన్న రైల్వేలైన్లను రానున్న పదేళ్ళకాలంలో మరింత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రవాణా వ్యవస్థలో ఇది కేవలం 18.78 శాతం మాత్రమేనని, రానున్న కాలంలో దీన్ని 30శాతానికి పెంచుకుంటేనే భవిష్యత్ ఉంటుందన్నారు. అలాగే రైల్వేల పరంగా సరుకురవాణా కీలకమని, ఇందుకోసం ప్రత్యేక లైన్ల ఏర్పాటు అవసరాన్ని గుర్తించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. 2023 నాటికి వాల్తేరు కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు సాధించి తీరుతామని రాఘవయ్య ఉద్ఘాటించారు. ఇక తూర్పుకోస్తా రైల్వే పనితీరు బాగుందని కొనియాడారు. అయితే డివిజన్ పరిధిలో కొన్ని సమస్యలున్నాయని, ఈవిషయం తనదృష్టికి వచ్చిందని అన్నారు. సిబ్బందికి పదోన్నతుల్లో వివక్షకు గురవుతున్నారని అన్నారు. కేడర్‌ను పునర్‌వ్యవస్థీకరించడం ద్వారా పదోన్నతులు అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కార్మికుల పక్షాన న్యాయపరంగా తమ యూనియన్ పోరాడుతుందని హామీ ఇచ్చారు. గతంలో రెండుసార్లు వేతన సంఘాలను సాధించామన్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే కొత్త పెన్షన్ పథకాన్ని రద్దు చేయిస్తామని హామీ ఇచ్చారు. లోకోలో పనిగంటల పెరిగి భారం మోస్తున్న కార్మికులకు ఉపశమనం కల్పించడంతో పాటు కార్మికులకు పూర్తి న్యాయం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే వచ్చే 90 రోజుల్లో రైల్వేలో పనిచేస్తున్న 14 లక్షల మంది కార్మికుల తల్లిదండ్రులకు రైల్వే ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సదుపాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొత్త పెన్షన్ పథకాన్ని కార్మికులు నెత్తిన రుద్దేందుకు కొన్ని కార్మిక సంఘాలు కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఉద్యోగులుగా చేరిన కార్మికులకు భవిష్యత్‌లో ఎటువంటి అన్యాయం జరక్కుండా చూసేది ఎన్‌ఎఫ్‌ఐఆర్ ఒక్కటేనన్నారు. సమావేశంలో ఈస్ట్‌కోస్టు రైల్వే శ్రామిక కాంగ్రెస్ డివిజనల్ కోఆర్డినేటర్ విజె అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

బాబు ఆరోగ్యం కోసం
22న మహా చండీయాగం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఏప్రిల్ 17: పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని అలుపెరగకుండా పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కాంక్షిస్తూ మహా చండీయాగం నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్ర కొనసాగిస్తున్న చంద్రబాబు యాత్ర ఎటువంటి ఆటంకంలేకుండా సాగాలని కోరతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈయాగాన్ని ఈ నెల 22న నిర్వహించనున్నట్టు నగర పార్టీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ తెలిపారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వస్తున్నామీకోసం పాదయాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ జరిగే ఆంధ్రాయూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లోనే మహాచండీయాగం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వస్తున్నామీకోసం పాదయాత్ర ముగింపునకు చిహ్నంగా గాజువాడ సమీపంలో నిర్మిస్తున్న పైలాన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ముగింపు సందర్భంగా గాజువాకలో పైలాన్ ఆవిష్కరణ అనంతరం బహిరంగసభ వేదిక ఎయుగ్రౌండ్స్‌కు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, సుమారు 10 వేల మంది కార్యకర్తలు ద్విచక్రవాహనాలతో ఈర్యాలీలో పాల్గొంటారని తెలిపారు. అలాగే గాజువాక నుంచి మద్దిలపాలెం వరకూ జాతీయ రహదారిపై తెలుగుదేశం జెండాలతో అలంకరించనున్నట్టు తెలిపారు. ర్యాలీ ఏర్పాట్లను పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గణబాబు, బహిరంగ వేదిక ఏర్పాట్లను నల్లూరి భాస్కరరావు పర్యవేక్షిస్తారని తెలిపారు. చారిత్రాత్మక పాదయాత్ర విశాఖలో ముగించడం అదృష్టంగా తెలుగుదేశం కార్యకర్తలు భావిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే బాధ్యతలు అప్పగించిన కమిటీలు పనులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ఇక బహిరంగ సభకు భారీ ఎత్తున జనసమీకరణకు సన్నాహాలు చేస్తున్నట్టు వాసుపల్లి తెలిపారు. ఇదే అంశంపై అర్బన్ పరిధిలోని పార్టీ మాజీ కార్పొరేటర్లు, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి వార్డు నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలను, అభిమానులును తరలించాలన్నారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు నల్లూరి భాస్కరరావు, లేళ్ళ కోటేశ్వరరావు, గంధం శ్రీనివాసరావు,కె కన్నారావు, పి శ్రీను, సనపల సీతారామాంజనేయులు, పివి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముందస్తు ప్రణాళికతో అధిక దిగుబడులు
* వ్యవసాయశాఖ కమిషనర్ మధుసూదన రావు
విశాలాక్షినగర్, ఏప్రిల్ 17: ఖరీఫ్ సీజన్‌లో అత్యధిక దిగుబడులు సాధించేందుకు ముందస్తు ప్రణాళికలతో అధికారులు సిద్ధం కావాలని వ్యవసాయశాఖ కమిషనర్ కె మధుసూదన రావు సూచించారు. కోస్తాప్రాంత వ్యవసాయాధికారులతో ఇక్కడ బుధవారం నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌కు ముందే వ్యవసాయ యాంత్రీకరణ పూర్తి చేయాలని సూచించారు. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువులు, విత్తనాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఖరీఫ్ ముందస్తు ప్రణాళికలో లోపాలను సరిచూసుకుని ముందుకు సాగాలన్నారు. గతేడాది విత్తనాలు, ఎరువుల పంపిణీలో తలెత్తన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈసారి అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మేమాసాంతానికే అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సీడ్‌విలేజ్ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయాలని, విత్తనాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు సేంద్రీయ ఎరువులను వినియోగించేలా చైతన్య పరచాలని, పొలంబడి, ఆత్మ కార్యక్రమాల కింద రైతులకు పెద్ద ఎత్తున శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతిజిల్లాలోను 500 హెక్టార్ల విస్తీర్ణంలో భూచేతన కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఈకార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ఇక్రిశాట్ సహకారంతో సుశిక్షితులైన మాస్టర్ బృందాలను అన్ని జిల్లాలకు పంపుతున్నామని, వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే స్థానికంగా మరికొంతమందికి శిక్షణను ఇప్పించడం ద్వారా కార్యక్రమాన్ని అంతటా విస్తరించాలన్నారు. ఎస్టీ,ఎస్సీ ఉపప్రణాళికకు చట్టబద్దత కల్పించిన నేపధ్యంలో వారికి కేటాయించిన నిధులతో ఇందిర జలప్రభ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు వెచ్చించాలన్నారు. త్వరలోనే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేయనుందన్నారు. పంటల బీమా కార్యక్రమాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకునే విధంగా వారిని చైతన్య పరచాలన్నారు. బుర అర్హకార్డులున్న కౌలు రైతులందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 22నుంచి మే 8 వరకూ రైతుచైతన్య యాత్రలను, మే 9 నుంచి13 వరకూ రైతు సదస్సులను నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని, ఈకార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు అన్ని వ్యవసాయాధికారులు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు డి కూర్మారావు, ఎస్ మురళీకృష్ణ, లీలావతి, ప్రమీల, కృపాదాస్‌లతో పాటు అన్ని జిల్లాలకు చెందిన వ్యవసాయశాఖ ఉపసంచాలకులు పాల్గొన్నారు.

ఆమోదం పొందిన ప్రైవేటు లేఅవుట్‌ల వివరాలు వెబ్‌సైట్‌లో
* వుడా విసి యువరాజ్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఏప్రిల్ 17: విశాఖ నగరాభివృద్ధి సంస్థ అనుమతి పొందిన లేఅవట్‌ల వివరాలను వుడా వెబ్‌సైట్‌లో పొందుపరచి ప్రజలకు అందుబాటులో ఉంచాలని విసి యువరాజ్ నిర్ణయించారు. ఈమేరకు అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రతి 15రోజులకు ఒకసారి వుడా అనుమతి పొందిన ప్రైవేటు లేఅవుట్‌ల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచాలని బుధవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆదేశించారు. ఇప్పటికే అనధికార లేఅవుట్‌లను గుర్తించడంతో పాటు చర్యలకు సంబంధించి ఒక ప్రత్యేక బృందాన్ని విసి నియమించారు. అలాగే ఎల్‌పి నెంబర్ పొంది కూడా వౌలిక సదుపాయాలు కల్పించని లేఅవుట్‌లను గుర్తించేందుకు క్షేత్రస్థాయి తనిఖీలు, పర్యవేక్షణలు జరపాలని ఆదేశించారు. డెవలపర్ నిర్ధేశించిన గడువు మేరకు వౌలిక వసతుల కల్పన, పచ్చదనం పెంపు వంటి అంశాలను పూర్తి చేయని పక్షంలో వుడా ఆధీనంలో ఉండే 15శాతం ప్లాట్‌ల తనఖాను విడుదల చేయకూడదని నిర్ణయించారు. నిర్ణీత గడువులోగా అభివృద్ధిని పూర్తి చేయని డెవలపర్‌లను గుర్తించి వారితో ప్రత్యేకంగా సమావేశాన్ని ఈనెల 24 నిర్వహించాలని నిర్ణయించారు. నిబంధనల మేరకు గడువులోగా అభివృద్ధిని పూర్తి చేయని వారిపై తీసుకోవాల్సిన చర్యలపై ఈసమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

‘చెరకు రైతుల సమస్యలు తీర్చాలి’
బొబ్బిలి, ఏప్రిల్ 17: ఎన్‌సిఎస్ యాజమాన్యం చెరకు రైతుల పట్ల నిర్లక్ష్యం చూపుతోందని, అందుకు తగిన మూల్యం చెల్లించకతప్పదని రైతు సంక్షేమసంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మునాయుడు ఆరోపించారు. బుధవారం చెరకు అభివృద్ధి కేంద్రం సూపర్‌వైజర్‌కు చెరకు రైతుల సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని అందించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యంతోపాటు బ్రెజిల్ నుంచి ముడి పంచదారను దిగుమతి చేసుకుని కర్మాగారం ద్వారా ఆడించి విక్రయించుకోవడం దారుణమన్నారు. బిల్లులు చెల్లించాలని పలు పర్యాయాలు ఆందోళన చేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. అయినప్పటికీ ప్రజాప్రతినిదులు కనీసం నోరుమెదపడం లేదని ఆరోపించారు. ఇప్పటికైన ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించి చెరకు రైతుల సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో ఫ్యాక్టరీ వద్ద నిరవదిక దీక్షలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మోహనరావు, శ్రీనివాసరావు, లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.
‘షాపుల్లో సిబ్బందికి నియామకపు లేఖలు’
4.సమావేశంలో మాట్లాడుతున్న లేబర్ ఆఫీసర్ విజయకుమార్‌రెడ్డి
పార్వతీపురం, ఏప్రిల్ 17: షాపుల్లో పనిచేసే వారికి కచ్చితంగా నియామకపు లేఖలు ఇవ్వాలని పార్వతీపురం కార్మికశాఖాధికారి సిహెచ్ విజయ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం స్ధానిక కార్మికశాఖాధికారి కార్యాలయంలో దుకాణాల (వ్యాపార) ప్రతినిధులు, కార్మిక సంఘ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ షాపుల్లో పనిచేసే వారికి నియామకపు ఉత్తర్వులు ఇవ్వకుంటే తమ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే వెంటనే నియామకపు లేఖలు ఇప్పించే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణదారులు ఏర్పాటు చేస్తున్న బోర్డులు కచ్చితంగా తెలుగులోనే ఉండాలన్నారు. ఇతర భాషాల్లో బోర్డులున్నప్పటికీ మొదటి ప్రాధాన్యత తెలుగుకే ఇవ్వాలన్నారు. ప్రతి దుకాణ నిర్వాహకులు తమ షాపునకు రిజిస్ట్రేషన్ కచ్చితంగా చేయించుకోవాలని, అలాగే రిజిస్ట్రేషన్ నవీనీకరణ కూడా చేయించుకోవాలన్నారు. ఇలాంటి వాటికోసం ఈనెల 24న రాష్ట్ర వ్యాప్తంగా మెగా రిజిస్ట్రేషన్, రెన్యువల్ మేళాను నిర్వహిస్తున్నట్టు విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్లు, రెన్యువల్ చేయని షాపులపై మే నెలలో తమశాఖ పరంగా సర్వేచేస్తామన్నారు. అయితే రిజిస్ట్రేషన్లు, రెన్యువల్ చేయని షాపులు ఉంటే కచ్చితమైన చర్యలు తీసుకుంటామని కార్మికశాఖాధికారి హెచ్చరించారు. ఇదిలా ఉండగా భవన నిర్మాణ కార్మికుల కోసం కొత్తగా ఒక జీవోను విడుదల చేసిందని విజయకుమార్ రెడ్డి తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు గతంలో పని చేసిన చోట ప్రమాదవశాత్తు మృత్యువాత పడితే ప్రమాద బీమా రూ.2లక్షలు చెల్లించేందుకు కార్మికశాఖ చర్యలు తీసుకునేదని, కొత్త నిబంధనలు ప్రకారం భవన నిర్మాణ కార్మికులు ప్రమాదావశాత్తు మృత్యువాత పడితే అలాంటి వారికి సైతం ప్రమాదబీమా వర్తించే వీలు కల్పించే చర్యలు కార్మికశాఖ చేపట్టిందన్నారు. ఈ సమావేశానికి కార్మికవర్గాల తరుపున సిటూ నాయకుడు బొత్స వెంకటరమణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరుపున పెంటపాటి కిరణ్, బట్టల వర్తక సంఘం తరుపున గోపాల

* బాబును కలిసిన అశోక్‌గజపతి, ఇతర ఎమ్మెల్యేలు * జనంతో కిక్కిరిసిన పాదయాత్ర * ఏడు కిలోమీటర్ల నడక
english title: 
c

‘చెరకు రైతుల సమస్యలు తీర్చాలి’

$
0
0

బొబ్బిలి, ఏప్రిల్ 17: ఎన్‌సిఎస్ యాజమాన్యం చెరకు రైతుల పట్ల నిర్లక్ష్యం చూపుతోందని, అందుకు తగిన మూల్యం చెల్లించకతప్పదని రైతు సంక్షేమసంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మునాయుడు ఆరోపించారు. బుధవారం చెరకు అభివృద్ధి కేంద్రం సూపర్‌వైజర్‌కు చెరకు రైతుల సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని అందించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యంతోపాటు బ్రెజిల్ నుంచి ముడి పంచదారను దిగుమతి చేసుకుని కర్మాగారం ద్వారా ఆడించి విక్రయించుకోవడం దారుణమన్నారు. బిల్లులు చెల్లించాలని పలు పర్యాయాలు ఆందోళన చేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. అయినప్పటికీ ప్రజాప్రతినిదులు కనీసం నోరుమెదపడం లేదని ఆరోపించారు. ఇప్పటికైన ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించి చెరకు రైతుల సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో ఫ్యాక్టరీ వద్ద నిరవదిక దీక్షలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మోహనరావు, శ్రీనివాసరావు, లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.
‘షాపుల్లో సిబ్బందికి నియామకపు లేఖలు’
4.సమావేశంలో మాట్లాడుతున్న లేబర్ ఆఫీసర్ విజయకుమార్‌రెడ్డి
పార్వతీపురం, ఏప్రిల్ 17: షాపుల్లో పనిచేసే వారికి కచ్చితంగా నియామకపు లేఖలు ఇవ్వాలని పార్వతీపురం కార్మికశాఖాధికారి సిహెచ్ విజయ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం స్ధానిక కార్మికశాఖాధికారి కార్యాలయంలో దుకాణాల (వ్యాపార) ప్రతినిధులు, కార్మిక సంఘ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ షాపుల్లో పనిచేసే వారికి నియామకపు ఉత్తర్వులు ఇవ్వకుంటే తమ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే వెంటనే నియామకపు లేఖలు ఇప్పించే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణదారులు ఏర్పాటు చేస్తున్న బోర్డులు కచ్చితంగా తెలుగులోనే ఉండాలన్నారు. ఇతర భాషాల్లో బోర్డులున్నప్పటికీ మొదటి ప్రాధాన్యత తెలుగుకే ఇవ్వాలన్నారు. ప్రతి దుకాణ నిర్వాహకులు తమ షాపునకు రిజిస్ట్రేషన్ కచ్చితంగా చేయించుకోవాలని, అలాగే రిజిస్ట్రేషన్ నవీనీకరణ కూడా చేయించుకోవాలన్నారు. ఇలాంటి వాటికోసం ఈనెల 24న రాష్ట్ర వ్యాప్తంగా మెగా రిజిస్ట్రేషన్, రెన్యువల్ మేళాను నిర్వహిస్తున్నట్టు విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్లు, రెన్యువల్ చేయని షాపులపై మే నెలలో తమశాఖ పరంగా సర్వేచేస్తామన్నారు. అయితే రిజిస్ట్రేషన్లు, రెన్యువల్ చేయని షాపులు ఉంటే కచ్చితమైన చర్యలు తీసుకుంటామని కార్మికశాఖాధికారి హెచ్చరించారు. ఇదిలా ఉండగా భవన నిర్మాణ కార్మికుల కోసం కొత్తగా ఒక జీవోను విడుదల చేసిందని విజయకుమార్ రెడ్డి తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు గతంలో పని చేసిన చోట ప్రమాదవశాత్తు మృత్యువాత పడితే ప్రమాద బీమా రూ.2లక్షలు చెల్లించేందుకు కార్మికశాఖ చర్యలు తీసుకునేదని, కొత్త నిబంధనలు ప్రకారం భవన నిర్మాణ కార్మికులు ప్రమాదావశాత్తు మృత్యువాత పడితే అలాంటి వారికి సైతం ప్రమాదబీమా వర్తించే వీలు కల్పించే చర్యలు కార్మికశాఖ చేపట్టిందన్నారు. ఈ సమావేశానికి కార్మికవర్గాల తరుపున సిటూ నాయకుడు బొత్స వెంకటరమణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరుపున పెంటపాటి కిరణ్, బట్టల వర్తక సంఘం తరుపున గోపాల

ఎన్‌సిఎస్ యాజమాన్యం చెరకు రైతుల పట్ల నిర్లక్ష్యం చూపుతోందని,
english title: 
c

ట్రాన్స్‌కో కొత్త టెక్నిక్

$
0
0

ఏలూరు, ఏప్రిల్ 17: సామాన్య జనానికి నరకం చూపించటంలో సరికొత్త విధానాలను కనిపెడుతూ ఇంతవరకు అనుమానిస్తున్న ఒక వ్యవహారం నిజమేమోనన్న నమ్మకాన్ని కూడా ట్రాన్స్‌కో కలిగిస్తోంది. కొంత కాలం నుంచి రాష్ట్ర అధికారులు ప్రకటించిన కోతలకు అదనంగా మరిన్ని కోతలను ఎటువంటి గలాటా లేకుండా అమలు చేయగలిగితే అటువంటి అధికారులకు ట్రాన్స్‌కో ప్రోత్సాహకాలను ముట్టచెపుతోందని చెపుతున్నారు. దీనిలో వాస్తవం ఎంతున్నా ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే అది నిజమేమోననిపిస్తుంది. జిల్లాకు విఐపిలు వచ్చారంటే ట్రాన్స్‌కోకు పండుగ మాదిరిగా మారిపోయింది. విఐపిలు ఉన్నచోట్ల అధికారుల హుకుంల్లో, వేడుకోల్లో గాని ఆ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగించి ఆ ఫలితాన్ని కోతల ద్వారా మిగతా జనానికి పంచిపెడుతున్నారు. ఫలితంగా ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు పరిస్ధితి మారిపోయింది. తాజాగా బుధవారంనాటి పరిణామాలను చూసినా జిల్లా కేంద్రమైన ఏలూరులో పగటిపూట పట్టుమని వరుసగా 5,6గంటలు కరెంటు ఉన్న దాఖలాలు లేవు. ఉదయానే్న 7గంటలకు మొదలైన కోత దాదాపు 10గంటలకు పూర్తయింది. ఆతర్వాత 12గంటలకు మళ్లీ. ఇక రాత్రి సమయంలో అయితే దాదాపు రెండుగంటలకు పైగా కోతలతో నగర ప్రజానీకానికి నరకం చూపించారు. ఇంతకీ ఈస్ధాయిలో ట్రాన్స్‌కో ప్రతాపాన్ని ఎందుకు ప్రదర్శించిందంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ఏలూరులో మూడు జిల్లాల అధికారులతో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఆ సదస్సుకు విద్యుత్ అంతరాయం లేకుండా చేయడానికి నగరం మొత్తం అంధకారమయం చేశారు. ప్రాంతీయ సదస్సు స్ధాయిలో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇలాంటి సర్దుబాట్లు చేస్తారని సర్దుకున్నా చివరకు రాత్రి మూడు జిల్లాల అధికారులకు విందు ప్రహసనం నడిచింది. దీనికి కూడా పూర్తిస్ధాయిలో విద్యుత్ సరఫరా చేసేందుకు ఆ కోత మొత్తాన్ని నగరం మొత్తానికి పంచిపెట్టారు. ఈ కారణంగానే రాత్రి రెండుగంటలకుపైగా కోతలు విధించారని ట్రాన్స్‌కో వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. ఒక ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేసేందుకు వచ్చిన సిఫార్సులను ఆమోదించటం ఒక ఎత్తు అయితే ఆ ప్రాంతంలో విధించాల్సిన కోత మొత్తాన్ని మిగిలిన నగరానికి పంచిపెట్టడం మరో ఎత్తు. ఇటువంటి పరిణామాలతో నగర ప్రజలు దాదాపు బుధవారం నరకానే్న చూశారు. ఇటీవల ఏలూరులో జరిగిన డిఆర్సీ సమావేశం సందర్భంగాను, అంతకుముందు, ఆతర్వాత అమాత్యుల పర్యటనల నేపధ్యంలోనూ ఇటువంటి ప్రక్రియనే ట్రాన్స్‌కో అమలుచేసింది. అమాత్యులు ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా చేస్తూ అక్కడి కోతల మొత్తాన్ని మిగిలిన నగరానికి పంచింది. అయితే ఈవిధంగా సాధారణ కోతలకు తోడు ఈవిధంగా సిఫార్సుల కారణంగా వచ్చిన కోతలు తోడవటంతో సామాన్య ప్రజల పరిస్దితి ఆగమ్యగోచరంగా మారిపోయింది. దీనికితోడు బుధవారం ఇటీవలకాలంలో ఎన్నడూ లేనిరీతిలో ఎండవేడిమి ఠారెత్తించటంతో దాంతోనే జనం అల్లాడిపోతే కక్ష కట్టినట్లుగా ట్రాన్స్‌కో భారీఎత్తున కోతలకు దిగటంతో జనం అంతా గగ్గోలు పెట్టేశారు. వ్యాపారవర్గాల పరిస్ధితి చెప్పనక్కర్లేదు. ఏ నిముషంలో విద్యుత్ ఉంటుందో, ఎప్పుడు మాయమైపోతుందో తెలియక వ్యాపారం చేసుకునే మార్గం లేక వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదీఏమైనా ట్రాన్స్‌కో విఐపిల టెక్నిక్‌తో మరింత ఆదా చేస్తోందో ఏమోగాని జనానికి మాత్రం ప్రత్యక్ష నరకానే్న ప్రసాదిస్తోంది.
ప్రశాంతంగా పంచాయతీ రాజ్ ఎన్నికలకు చర్యలు
అధికారులకు ఎన్నికల కమిషనర్ రమాకాంతరెడ్డి ఆదేశం
ఏలూరు, ఏప్రిల్ 17 : రానున్న పంచాయితీ రాజ్ సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పి రమాకాంతరెడ్డి జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామ పంచాయితీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు చేపడుతున్న ముందస్తు చర్యలపై ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల అధికారులతో ఎన్నికల కమిషనర్ పి రమాకాంతరెడ్డి ప్రాంతీయ సమావేశం నిర్వహించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ, పంచాయితీ అధికారులు పాల్గొన్న సమావేశంలో ఎన్నికల విధి విధానాలను గూర్చి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. పంచాయితీరాజ్ ఎన్నికలను ఎన్నికల నియమనిబంధనలకు లోబడి నిర్వహించాలన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికల ఓటర్ల జాబితా ముసాయిదాలను మార్చి 26వ తేదీ నాటికి, మండల పరిషత్ ముసాయిదా ఏప్రిల్ 2వ తేదీ నాటికి సిద్దం చేయడం జరిగిందన్నారు. ఓటర్లు తమ పేర్లను ముసాయిదాలో పరిశీలించుకోవాలని, ఏమైనా మార్పులుంటే దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. గ్రామ పంచాయితీ ఎన్నికలు రిటర్నింగ్ అధికారులు ప్రకటించిన తేదీల్లో జరుగుతాయన్నారు. నామినేషన్ల స్వీకరణ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుందన్నారు. వార్డు మెంబర్‌కు పోటీ చేసే అభ్యర్ధి సదరు గ్రామంలో ఓటరుగా వుండాలన్నారు. వారిని బలపరిచేవారు పోటీ చేసే వార్డులో అభ్యుర్ధులై వుండాలన్నారు. నామినేషన్ల ఉపసంహరణ తరువాత పోలింగ్‌నకు కనీసం అయిదు రోజుల సమయం ఉండాలన్నారు. పోలింగ్ మొదలవడానికి 44 గంటల ముందు ప్రచారం నిలిపివేయాలన్నారు. పోలింగ్ ఉదయం 10.00 గంటలకు మొదలై 1.00 గంటలకు ముగుస్తుందన్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారన్నారు. ఉపసర్పంచ్ ఎన్నిక కూడా ఆ రోజే జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని 1097 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. జడ్పీటీసీల నామినేషన్లు జిల్లా పరిషత్ కార్యాలయంలో స్వీకరిస్తారన్నారు. ఈ ఎన్నికలకు జిల్లా కలెక్టర్ అప్పిలేట్ అధారిటీగా నిర్వహిస్తారన్నారు. జడ్పీటీసీ సభ్యులు జిల్లా పరిషత్ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారన్నారు. అదే రోజు కో ఆప్షన్ సభ్యులను కూడా ఎన్నుకుంటారన్నారు. ఎన్నికల నియమావళిని గూర్చి విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. అభ్యర్ధులకు పూర్తి అవగాహన కలిగించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికలలో ఎటువంటి అక్రమాలు జరగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అదనపు సిబ్బంది అవసరమైతే ముందుగా తెలియజేయాలన్నారు. పంచాయిత ఎన్నికల సందర్బంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో నిఘా కెమేరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధుల సేవలు వినియోగించుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ మాట్లాడుతూ పంచాయితీరాజ్ ఎన్నికల నిర్వహణకు జిల్లా పరిషత్, జిల్లా పంచాయితీ అధికారి కార్యాలయంలో జిల్లాస్థాయిలో 46 ఎంపిపి కార్యాలయాల్లో ప్రత్యేక ఎన్నికల సెల్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 30 లక్షల 52 వేల 369 మంది జనాభా ఉండగా వారిలో 21,48,462 మంది ఓటర్లుగా నమోదై వున్నారన్నారు. 2011 జనవరి 1 ప్రాతిపదికగా గ్రామ పంచాయితీ ఓటర్ల జాబితా ప్రచురణ కోసం మార్చి 26వ తేదీన పంచాయితీరాజ్ రూరల్ డవలప్‌మెంట్ ఇవోలకు అందజేయడం జరిగిందన్నారు. జిల్లాలో 883 గ్రామ పంచాయితీల ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో మూడు దశలుగా గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మొదటి దశలో ఏలూరు, రెండవ దశలో కొవ్వూరు, మూడవ దశలో నర్సాపురం డివిజన్లలో నిర్వహిస్తామన్నారు. జడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల ప్రక్రియ రెండవ దశ ఎన్నికల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికలకు 9786 పోలింగ్ స్టేషన్లు అవసరం కాగా జడ్పీ ఎన్నికలకు 2730 పోలింగ్ స్టేషన్లు అవసరమవుతాయన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి 200 రూట్ ఆఫీసర్లు, 160 జోనల్ ఆఫీసర్లను నియమించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. సమావేశంలో రాష్ట్ర పంచాయితీరాజ్ కమిషనర్ కె రాంగోపాల్, ఎన్నికల కమిషన్ జాయింట్ కార్యదర్శి ఎవి సత్య రమేష్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, కృష్ణాజిల్లా కలెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ ఎం జ్యోతి, విజయవాడ పోలీసు కమిషనర్ ఎన్ మధుసూధనరెడ్డి, ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల ఎస్‌పిలు ఎం రమేష్, ఎన్ శివశంకర్‌రెడ్డి, జె ప్రభాకరరావు, రాజమండ్రి అర్బన్ ఎస్‌పి రవికుమార్‌మూర్తి, డి ఆర్‌వో ఎం మోహనరాజు, డిపివో నాగరాజు వర్మ, సి ఇవో నాగార్జునసాగర్, ఆర్‌డివోలు కె నాగేశ్వరరావు, సూర్యారావు, సత్యనారాయణ, తూర్పుగోదావరి, కృష్ణాజిల్లాల ఆర్డీవోలు, డి ఎస్‌పిలు, డిపివోలు, జడ్పీ సి ఇవోలు పాల్గొన్నారు.
పేదలపాలిట అభయహస్తం
అమ్మహస్తం సభలో మంత్రి పితాని
పెరవలి, ఏప్రిల్ 17: అమ్మ హస్తం పేదల పాలిట అభయ హస్తమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పెరవలిలో బుధవారం అమ్మ హస్తం పథకం కింద కార్డుదారులకు నిత్యావసర సరుకులను ఆయన పంపీణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ నిరంతరం కార్డుదారులకు ఒకే ధరకు 9 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమ్మ హస్తం పథకాన్ని రూపొందించిందన్నారు. పెరిగిన ధరల వ్యత్యాసాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుందని వివరించారు. రాష్ట్రంలో కార్డుదారులకు నాణ్యమైన కిలో రూపాయి బియ్యంతో బాటు నాణ్యమైన నిత్యావసర సరుకులను సబ్సిడీ రేట్లకు పంపీణీ చేయడమే ఈ పథకం ముఖ్యోద్దేశమని వెల్లడించారు. పేద ప్రజలకు షౌష్టికాహారాన్ని సబ్సిడీ ధరకు అందించే ఈ పథకాన్ని ప్రతిపక్షాలు అపహాస్యం చేయడం విడ్డూరంగా వుందన్నారు. అమ్మ హస్తం మొండి హస్తమని చంద్రబాబు విమర్శించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అమ్మ హస్తం విమర్శకుల పాలిట సింహస్వప్నమవుతుందని హెచ్చరించారు. కార్డుదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని అన్నారు. రాష్ట్ర జనాభాలో సుమారు 23 శాతం వున్న ఎస్సీ, ఎస్టీ, గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 8865 కోట్ల రూపాయల నిధులతో సబ్‌ప్లాన్ అమలు చేస్తోందని తెలిపారు. వీరికి కేటాయిస్తున్న నిధులు ఈ వర్గాల అభివృద్ధికి సక్రమంగా అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందన్నారు. వారికి కేటాయించిన నిధులు పక్కదారి పడుతున్నాయని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందించి అమలు చేయడం ద్వారా వారి ప్రగతికి బాటలు వేస్తోందన్నారు. గతంలో 45 శాఖల ద్వారా ఈ నిధులు వినియోగం జరిగేవని, వీటిని కుదించి 27 విభాగాలకు పరిమితం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి మాజీ అధ్యక్షుడు జిఎస్ రావు, నిడదవోలు నియోజకవర్గ ఇన్‌చార్జి జి శ్రీనివాసనాయుడు, మండల పరిషత్ ప్రత్యేకాధికారి డిఎల్‌బిఎల్ కుమార్, తహసీల్దార్ అక్బర్ హుస్సేన్, సొసైటీ అధ్యక్షుడు కరుటూరి గోపాలకృష్ణ (తీపర్రు), పప్పొప్పు కాళీ ప్రసాద్ (అన్నవరప్పాడు), బొలిశెట్టి బ్రహ్మానందం (మల్లేశ్వరం), రామకృష్ణ (ముక్కామల), కాంగ్రెస్ నాయకులు కోటిపల్లి మురళీకృష్ణ, నేదునూరి గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
ముగ్గురు బుకీల అరెస్టు

17 సెల్‌ఫోన్లు, లాప్‌టాప్, టివి, ప్రింటర్ స్వాధీనం
ఏలూరు, ఏప్రిల్ 17 : క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు బుకీలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 17 సెల్‌ఫోన్లు, లాప్‌టాప్, టివి, ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్‌పి ఎం రమేష్ ఇందుకు సంబంధించి వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి. భీమవరం టుటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాయలం గ్రామంలో ఇంటూరి భగవాన్‌జీ అనే వ్యక్తి ఒక ఇంటిని అద్దెకు తీసుకుని పడమటి రామకృష్ణ అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ నిర్వహించుకోవడానికి ఆశ్రయం కల్పించాడు. ఈ ఇంటి నుంచి రాష్ట్రం నలుమూలల క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. జిల్లా ఎస్‌పి ఎం రమేష్ ఆదేశాల మేరకు ఈ ఇంటిపై భీమవరం సి ఐ జయసూర్య నిఘా వుంచారు. ప్రస్తుతం ఐపి ఎల్ క్రికెట్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఇంటి నుంచే భారీ ఎత్తున క్రికెట్ బెట్టింగ్‌లు జరుగుతున్నాయని సమాచారం అందింది. సి ఐ జయసూర్య తన సిబ్బందితో కలిసి రాయలం గ్రామంలోని భగవాన్ ఇంటిపై మంగళవారం రాత్రి దాడిచేసి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న పడమటి రామకృష్ణ, ఇంటూరి భగవాన్‌జీ, అనీల్‌రాజులను అరెస్టు చేశారు. బెట్టింగులకు వారు ఉపయోగిస్తున్న రికార్డింగ్ బాక్సులు, 17 సెల్‌ఫోన్లు, లాప్‌టాప్, ప్రింటర్, టివిలను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సి ఐ జయసూర్య, సిబ్బందిని ఎస్‌పి ఎం రమేష్ అభినందించారు. విలేఖరుల సమావేశంలో జిల్లా అదనపు ఎస్‌పి వి ఎన్‌వి సత్యనారాయణ, నర్సాపురం డి ఎస్‌పి రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
* ఎమ్మెల్యే ఈలి నాని
ఆంధ్రభూమి బ్యూరో
తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 17: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే ఈలి నాని అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూలులో బుధవారం అమ్మ హస్తం కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి మండల ప్రత్యేకాధికారి కె. సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఈలి నాని మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కిలో రూపాయికే బియ్యం అందించిన కిరణ్ నేడు 9 రకాల నిత్యావసర వస్తువులు 185/-లకే అందిస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించి దళితవాడల్లో వౌలిక వసతులు కల్పించడానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో తాడేపల్లిగూడెం పట్టణం, మండలం, పెంటపాడు మండలాల్లో నీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా ఆరుగురు మైనార్టీ విద్యార్థులకు సైకిళ్లు అందజేస్తారన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్, సిహెచ్. నాగేశ్వరావు, తహసీల్దారు పి.శ్రీనివాసరావు, ఎంపిడిఒ జివికె మల్లికార్జునరావు, కాంగ్రెస్ నాయకులు దుర్గా రామచంద్రారావు, పాలూరి వెంకటేశ్వరరావు, దాట్ల జగన్నాధరాజు, మారిశెట్టి సుబ్బారావు, కొల్లి రమావతి, నూకల బుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలి
వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ బాలరాజు
ద్వారకాతిరుమల, ఏప్రిల్ 17: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను జనంలోకి తీసుకెళ్లి, ప్రతి కార్యకర్త వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు. మండలంలోని కొమ్మర గ్రామంలో నూతనంగా నిర్మించిన వైఎస్సార్ విగ్రహం ప్రారంభోత్సవానికి బుధవారం సాయంత్రం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు, గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విగ్రహ ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే బాలరాజు ప్రసంగిస్తూ వైఎస్సార్ మరణానంతరం ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులపాలు చేస్తోందన్నారు. అధికార పార్టీ బెదిరింపులకు కార్యకర్తలు భయపడనక్కరలేదని, రాష్ట్భ్రావృద్ధే ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేసి, జగన్‌ను సిఎం చేయాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే వనిత మాట్లాడుతూ జగన్ సిఎం అయ్యే వరకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చిలుకాని రాజుబాబు, తలారి వెంకట్రావు, సుంకర ఆంజనేయులు, బుసనబోయిన సత్యనారాయణ పాల్గొన్నారు.
నేటి నుండి ఆధార్ కేంద్రం ఏర్పాటు
అత్తిలి, ఏప్రిల్ 17: అత్తిలి, ఈడూరు గ్రామాలలో గురువారం నుండి ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపిడివో ఎ ఆంజనేయులు తెలిపారు. ఇంతవరకు ఆధార్ కార్డులు పొందని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. గురువారం నుండి అత్తిలిలో ఒంటిపూట మంచినీరు సరఫరా చేయనున్నట్లు ఎంపిడివో ఆంజనేయులు తెలిపారు. ఈ నెల 24న అత్తిలిలో అమ్మహస్తం పథకం ప్రారంభిస్తున్నట్లు ఎంపిడివో ఆంజనేయులు తెలిపారు.
పూరిల్లుకి రూ.7వేలు విద్యుత్‌బిల్లు
ద్వారకాతిరుమల, ఏప్రిల్ 17: వీరేమీ పెద్దపెద్ద భవనాలకు యజమానులు కారు... అలాగే వీరింట్లో ఎసిలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు వంటివి కూడ లేవు. కేవలం ఫ్యాను, లైటు, చిన్న టివి మాత్రమే వుండి పూరిళ్లల్లో నివసిస్తూ కూలి పనులు వెడుతున్న వీరికి వేలల్లో విద్యుత్ బిల్లులు రావడంతో వారు షాక్‌కు గురవుతున్నారు. విద్యుత్ శాఖ అధికారుల చుట్టూ వీరు తిరిగి మొరపెట్టుకున్నా బిల్లులు చెల్లించాల్సిందేనని తేల్చడంతో వేలాది రూపాయలు తెచ్చి ఎలా కట్టాలని వారు వాపోతున్నారు. మండలంలోని జి కొత్తపల్లికి చెందిన నాగదాసు రామకృష్ణ, గంటా వెంకట్రావు, బోడా సూరిబాబు, ఎం ఆంజనేయులు ఇలా అనేక మందికి వేలాది రూపాయలు విద్యుత్ బిల్లులు రావడంతో వారు లబోదిబోమంటున్నారు. మీటర్లు మారుస్తామంటున్న సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు చెబుతున్నారు. వేలల్లో వచ్చిన బిల్లులు కట్టకపోయేసరికి అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పిల్లలతో అంధకారంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సి వుంది.
వేళాపాళా లేని విద్యుత్ కోతల పట్ల
మన్నించండి
సాంఘిక శాఖామంత్రి పితాని
పెరవలి, ఏప్రిల్ 17: వేళాపాళా లేని విద్యుత్ కోతల పట్ల మన్నించాలంటూ రాష్ట్ర సాంఘిక శాఖామంత్రి పితాని సత్యనారాయణ ప్రజలను వేడుకొన్నారు. పెరవలిలో బుధవారం జరిగిన అమ్మ హస్తం పంపిణీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విద్యుత్ కోతలపై సభ. నుండి వచ్చిన నిరసనలపై ఆయన స్పందించారు. విద్యుత్ కొరతను తీర్చడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఫలితాలు రావడానికి మరికొంత సమయం పడుతుందని అన్నారు. డిసెంబరు వరకూ ఇబ్బందులు తప్పవని, ఓపిక పట్టాలని అన్నారు. విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరుగుతోదని, యూనిట్ ధర 4.22 రూపాయల నుండి 5.22 రూపాయలకు పెరిగిందని అన్నారు. ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో సమకూర్చి పెంచిన చార్జీలను ఉపసంహరించుకొందని వెల్లడించారు. ఎన్ని అడ్డంకులు ఏర్పడ్డా విద్యుత్ కోతలను నివారించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందన్నారు.
185 తొమ్మిది రకాల వస్తువులు
పెనుగొండ, ఏప్రిల్ 17: దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలకు అమ్మ హస్తం ద్వారా 185 రూపాయలకే తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. బుధవారం పెనుగొండ శ్రీ లక్ష్మీజనార్దనస్వామి కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి అమ్మహస్తం సరుకుల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 1వ తేదీనుండి బహిరంగ మార్కెట్‌లో 232 రూపాయలకే దొరికే నిత్యావసర సరుకులను 185 రూపాయలకే అందిస్తున్నారన్నారు. నిరుపేదల కోసం, మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎపుడూ ముందంజలో వుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి అసలు వారసులము మేమేనని, వైఎస్ ఆత్మ తన వెంటే వుందని అన్నారు. జగన్, షర్మిల ఆస్తికి వారసులు తప్ప, వైఎస్‌ను తామెన్నడూ మరువలేదని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీవో కె. సూర్యారావు, మాజీ ఎంపి మెంటే పద్మనాభం, తహసీల్దార్ పిజెఎస్ కుమార్, ఎంపిడిఒ విజయలక్ష్మి, కేతా సత్తిబాబు, నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రెడ్‌క్రాస్‌కు విరాళాలు అందించాలి : కలెక్టర్
ఏలూరు, ఏప్రిల్ 17 : రెడ్‌క్రాస్‌లో సభ్యత్వం పొందడంతోపాటు విరాళాలు కూడా అందించి ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ కోరారు. స్థానిక జిల్లా కలెక్టర్ బంగ్లాలో బుధవారం డి ఇవో ఆర్ నరసింహరావు 7,23,919 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్‌ను రెడ్‌క్రాస్ సొసైటీకి విరాళంగా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్‌కు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదు, విరాళాల సేకరణలో పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలో ప్రధమస్థానంలో నిలిచిందన్నారు. ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో పెద్ద సంఖ్యలో రెడ్‌క్రాస్‌లో సభ్యత్వాన్ని నమోదు చేసి జిల్లాను ప్రధమస్థానంలో నిలిపేందుకు యువత సహకరించాలని అన్నారు. డి ఇవో ఆర్ నరసింహరావు మాట్లాడుతూ రెడ్‌క్రాస్ విరాళాల సేకరణలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ స్కూళ్ల విద్యార్ధినీ విద్యార్ధులు, డివై ఇవోలు, ఎం ఇవోలు సహకరించారన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యాలయం సూపరింటెండెంట్ కె పురుషోత్తం, సీనియర్ అసిస్టెంట్ కె ఎల్ శ్రీనివాస్, సెక్షన్ అసిస్టెంట్ జక్కా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

*మధ్యాహ్నం మీటింగ్*రాత్రి విందు*జనానికి కోతలతో నరకం
english title: 
tra

అమెరికాలో బీభత్సం...

$
0
0

అల్‌ఖాయిదా, తాలిబన్, హిజ్‌బొల్లా, జమాత్ ఉద్ దావా, ముజాహిదీన్, హుజీ..పేర్లు ఏవైనా కావచ్చు. ఈ బీభత్స ముఠాలు అంతర్జాతీయ సీమలలో నిరంతరం పొంచి ఉన్నాయనేది మరోసారి ధ్రువపడింది. అదను చూసుకొని గోడలు దూకి ఆవుల మందపై దాడులు చేసే తోడేళ్ళ వలె ఈ ముఠాలు అన్ని చోట్లా అప్పుడప్పుడు దూకుతూనే ఉన్నాయి. అత్యంత కట్టుదిట్టమైన ఆంతరంగిక భద్రతా వ్యవస్థను నెలకొల్పుకున్న అమెరికా సైతం అంతర్జాతీయ బీభత్స మృగాల దాడికి ‘అపవాదం’ కాజాలదని తేలిపోయింది. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని ప్రధాన నగరమైన బోస్టన్‌లో మరోసారి బీభత్సకారులు బాంబులు పేల్చగలగడం అమెరికా అంతర్గత భద్రతా కుడ్యంలో సైతం బొరియలు ఏర్పడి ఉన్నాయన్నదానికి నిదర్శనం. బోస్టన్ బీభత్సపు పొగలు చల్లారకముందే, టెక్సాస్ రాష్ట్రంలోని పెద్ద ఎరువుల కర్మాగారం ప్రాంగణంలో గురువారం భయంకరమైన విస్ఫోటం జరిగింది. టెక్సాస్ సంఘటనకు కారణం విద్రోహమా లేక ప్రమాదమా అన్నది ధ్రువపడాల్సి ఉంది. కానీ 16 మంది బలైపోవడానికి, 150 మందికి పైగా గాయపడటానికి దోహదం చేసిన ఈ విస్ఫోటనం బీభత్స చర్య అని అనుమానించడానికే ఎక్కువ అవకాశముంది. బోస్టన్‌లోని క్రీడా మహాపథంలో సోమవారం మధ్యాహ్నం బాంబులు పేల్చినవారు ఈ అంతర్జాతీయ ముఠాల వారేనన్నది వాస్తవం. ఎందుకంటె పేలుళ్ళ వల్ల మరణించినది ఇద్దరే అయినప్పటికీ గాయపడిన వారి సంఖ్య నూట డెబ్బయిని దాటిపోయింది. బోస్టన్‌లో జరుగుతుండిన పరుగు పందెంలో అనేక దేశాలకు చెందిన ఇరవై ఏడువేల మంది క్రీడాకారులు పాల్గొనడం ఈ మహా క్షిప్రచలన- మారథాన్- స్పర్ధ ప్రాధాన్యానికి నిదర్శనం. ఇరవై ఆరుమైళ్ళ దూరం పరిగెత్తగల ఇంతమంది క్రీడాకారులు పాల్గొనే పోటీ సందర్భంగా భద్రత గురించి అమెరికా నిఘా విభాగాల వారు పట్టించుకోలేదని ఆరోపించడానికి వీలులేదు. అల్ ఖాయిదా ముఠా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా దళాలు పాకిస్తాన్‌లో పట్టుకొని పరిమార్చిన తరువాత నిఘా నిర్నిద్ర ప్రవృత్తితో పనిచేస్తున్నట్టు ప్రచారంజరిగింది. బిన్ లాడెన్ వధకు అల్ ఖాయిదా తాలిబన్ మూకలు ప్రతీకారం తీర్చుకుంటాయన్న భయం ఆవహించి ఉండటమే అమెరికా నిఘా వ్యవస్థ ‘నిర్నిద్ర’ స్థితికి కారణం కావచ్చు. కానీ బీభత్స కారులు మళ్ళీ దాడి చేయగలిగారు. ప్రపంచ వాణిజ్య సంస్థను 2001లో బీభత్స విమానాలు ఢీకొన్న తరువాత పనె్నండు సంవత్సరాలుగా అమెరికాలో మరో బీభత్స ఘటన జరగలేదు. తమ ప్రధాన శత్రువులు భారత్, అమెరికాలేనని జిహాదీ ముఠాలు పాకిస్తాన్‌లోను ఇతర దేశాలలోను ప్రకటిస్తూనే ఉన్నాయి. బోస్టన్ బీభత్సకాండకు సరిగ్గా నెలరోజులు ముందు మన జమ్ము-కాశ్మీర్‌లో జిహాదీ బీభత్సం విరుచుకుపడింది. కేంద్ర రిజర్వ్ పోలీసు దళాల స్థావరం ప్రాంగణంలోకి చొరబడిన హంతకులు ఐదుగురు జవానులను హతమార్చగలిగారు. ఇప్పుడు బోస్టన్ పేలుళ్ళపై అంతర్జాతీయ దృష్టి కేంద్రీకృతం అయిన వెంటనే మన బెంగళూరులో బుధవారం పేలుళ్ళు జరిపారు. ఊహించనిచోట దెబ్బకొట్టడం క్రూరమృగ స్వభావం అనుమానం కలగని చోట దాడిచేయడం జిహాదీ పిశాచాల వ్యూహం...!
సౌదీ అరేబియా కేంద్రంగా అంతర్జాతీయ బీభత్సపు తండాలు అనుసంధానమై ఉన్నాయన్న వాస్తవం బోస్టన్ పేలుళ్ళ వల్ల మళ్ళీ బహిర్గతమైంది! బోస్టన్ పేలుళ్ళను ఏ బీభత్స సంస్థ జరిపించిందన్న విషయమై స్పష్టంగా చెప్పడానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిరాకరించినప్పటికీ ఒక సౌదీ అరేబియా దేశస్థుడిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ -ఎఫ్‌బిఐ- అధికారులు నిర్బంధించి ప్రశ్నించారట. సౌదీ అరేబియా ప్రభుత్వం అమెరికాతో సన్నిహిత మైత్రిని కొనసాగిస్తోంది. పశ్చిమాసియాలో ఇస్లాం మతరాజ్యాలన్నింటిలోను సౌదీ అరేబియా మాత్రమే అమెరికాతో గతంలో ఎప్పుడూ విభేదించలేదు. అమెరికాకు అత్యంత సన్నిహిత దేశమైన ఇజ్రాయిల్‌తో తీవ్ర విరోధాన్ని కొనసాగిస్తున్నప్పటికీ సౌదీ అరేబియా ఇలా గొప్ప వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సౌదీ అరేబియా ప్రభుత్వం అంతర్జాతీయ బీభత్సకాండకు వ్యతిరేకంగా అమెరికాతో కలిసి పోరాడుతోంది. కానీ ఆ దేశంలోని వేలాది మంది సంపన్నులు జిహాదీ టెర్రరిస్టు ముఠాలకు సకలవిధ సహాయం చేస్తున్నారు. ఇదంతా అమెరికాకు మాత్రమే కాదు, అంతర్జాతీయ సమాజానికి తెలిసిన రహస్యం. అల్ ఖాయిదాను నడిపించిన ఒసామాబిన్ లాడెన్ సౌదీ అరేబియాలో పుట్టి పెరికి అఫ్ఘానిస్థాన్‌కు పారిపోయాడు. ఇప్పుడు యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న తాలిబన్లు సోమాలియా ఓడ దొంగలతో జట్టుకట్టి ఉన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వ నిఘా విభాగం ‘ఐఎస్‌ఐ’ ఈ మైత్రిని కల్పించింది. ఇది కూడ అమెరికా వారి సిఐఎకు తెలుసు. అయినప్పటికీ ఓవైపు జిహాదీ ముఠాలతో పోరు సాగిస్తున్న అమెరికా ప్రభుత్వం మరోవైపు అన్ని ఇస్లాం రాజ్యాలతోను మైత్రీ సంబంధాలను పెంచుకొనడానికి కృషి చేస్తోంది. 2008కి పూర్వం అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ అంకురార్పణ చేసిన ఈ విధానాన్ని ఒబామా అమలు జరిపిస్తున్నాడు. సిరియా అధ్యక్షుడు అసాద్ నియంతృత్వానికి వ్యతిరేకంగా అరబ్ ‘లీగ్’ దేశాలు కలిసికట్టుగా పోరాడుతుండడం ఈ అమెరికా వ్యూహంలో భాగం. అందువల్లనే బోస్టన్ బాంబు పేలుళ్ళు జరిగిన తర్వాత ఏ బీభత్స సంస్థ ను కూడ ఒబామా పేరు పెట్టి నిందించలేదు. జిహా దీ టెర్రరిస్టుల పాత్ర స్పష్టమయ్యేవరకు వేచి చూడాలన్నదే ఒబామా వ్యూహాత్మక విధానం.
ఒసామా బిన్ లాడెన్ వధకు జిహాదీ సంస్థలు ప్రతీకారంలో భాగంగానే బోస్టన్‌లో పేలుళ్ళు జరిగాయన్న వాస్తవాన్ని అమెరికా వెంటనే బయటపెట్టలేదు. భవిష్యత్తులో వెల్లడించవచ్చు. వెల్లడించకపోవచ్చు. ఏమయినప్పటికీ గతంలో వలె జిహాదీ బీభత్సకాండ గురించి అమెరికా ప్రభుత్వం ఇప్పుడు తీవ్ర స్వరాలను సంధించలేదు. జిహాదీ ముఠాల పట్ల ఆగ్రహంతో అమెరికా ప్రజలు సామాన్య ముస్లింలపై దాడి చేస్తారన్న భయాందోళనను సైతం అమెరికా ప్రభుత్వం ధ్వనింపజేస్తోంది. ఇతర దేశాలలో జిహాదీలు జరుపుతున్న బీభత్సకాండ గురించి అతిగా పట్టించుకోరాదన్న విధానాన్ని గత కొనే్నళ్ళుగా పాటిస్తోంది. మన దేశానికి వ్యతిరేకంగా బీభత్సకాండను జరిపిన డేవిడ్ కాలిమన్ హెడ్లీ, తహవూర్ హుస్సేన్ రాణాలను మన దేశానికి తరలించడానికి అమెరికా ప్రభుత్వం అంగీకరించకపోవడం ఈ విధానానికి ఒక నిదర్శనం. ముంబయిలో 2008 నవంబర్ 26న పాకిస్తాన్ జరిపించిన బీభత్సకాండను ఇస్లాం దేశాల ప్రభుత్వాలు కొన్ని నిరసించాయి. మరి కొన్ని వౌనం వహించాయి. కానీ ఈ దేశాలలోని నోరున్న సామాన్య ప్రజలలో అత్యధికులు పాకిస్తానీ బీభత్స చర్యను సమర్ధించినట్టు సర్వేలు వెల్లడించాయి. రాణాను, హెడ్లీని అమెరికా ప్రభుత్వం మనకప్పగించకపోవడానికి ఇదీ ఒక పరోక్ష కారణం కావచ్చు. లిబియాలోని అమెరికా రాయబారి క్రిస్ స్టీవెన్స్‌ను గత ఏడాది సెప్టెంబర్‌లో జిహాదీలు దారుణంగా హత్య చేసిన తరువాత కూడా అమెరికా వారి ‘బీభత్స వ్యతిరేక అంతర్జాతీయ సమరం’ తీవ్రం కాలేదు. కేవలం తమ దేశం భద్రంగా ఉంటే చాలునన్న వైఖరి కొనసాగింది. కానీ ఈ విశ్వాసం సైతం ఇప్పుడు వమ్మయిపోయింది. ‘‘మేము విశ్రమించలేదు. విశ్రమించబోము’’ అని జిసాదీలు హెచ్చరించారు. అమెరికా బీభత్స వ్యతిరేక సమరం ఇకనైనా పదునెక్కాలి. మనదేశంతో కలసి బీభత్సంపై పోరాడాలన్న విధానం వికసించాలి.

సంపాదకీయం
english title: 
sampadakeeyam

‘మత సమన్వయ’ ముద్రాధికారులు..?!

$
0
0

‘సర్వమత సమభావ’- సెక్యులర్- చర్చ మళ్లీ పెద్దఎత్తున మొదలుకావడం అభిలషణీయ పరిణామం! గుజరాత్ ముఖ్యమంత్రి భారతీయ జనతాపార్టీ నాయకుడు నరేంద్రమోడీకి వ్యతిరేకంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నాయకత్వంలోని ‘ఐక్య జనతాదళ్’వారు ప్రదర్శిస్తున్న ‘‘సర్వమత సమభావ’’ తాండవం ఈ చర్చకు వర్తమాన ప్రాతిపదిక! నరేంద్రమోడీ సర్వమత సమవాది- సెక్యులరిస్టు- కాదన్నది నితీశ్‌కుమార్ బృందం తేల్చివేసిన నిగ్గు...నిజాన్ని నిగ్గుతేల్చారా? అబద్ధాన్ని నిగ్గుతేల్చారా? అన్నది వేరే విషయం. అందువల్ల నరేంద్రమోడీ ప్రధాని కారాదన్నది నితీశ్‌కుమార్ బృందంవారి అభిప్రాయం! నరేంద్రమోడీ ప్రధాని కావడానికి కాకుండాపోవడానికి ప్రాతిపదిక ప్రజాభిప్రాయమా? ‘జనతాఐక్యదళ్’ వారి అభిప్రాయమా అన్నది సహజంగా తలెత్తుతున్న సందేశం!
1977వరకు, శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండినప్పుడు, ఆ తరువాత 1980నుండి 1984 మధ్య ప్రధానంగా ‘ప్రజాస్వామ్య’చర్చ ‘సమష్టి’ నాయకత్వం చర్చ నడిచినట్టు చరిత్ర చెబుతోంది! శ్రీమతి ఇందిరాగాంధీని ‘నియంత’గా నిగ్గుతేల్చడం ప్రాతిపదికగా అప్పటి రాజకీయపు పొత్తు, శత్రుత్వం, రాజకీయ మైత్రి ఏర్పడుతూ ఉండేది! ఇందిరాగాంధీని వ్యతిరేకించిన వారందరూ ‘‘ప్రజాస్వామ్యవాదు’’లేనన్నది అలనాటి రాజకీయ కొలమానం! ఇందిరాగాంధీ నియంతా? కాదా? - అన్నది కాదు అసలు విషయం! ఆమెను వ్యతిరేకించడం ‘ప్రజాస్వామ్య’ స్వభావంగా ప్రత్యర్థులు నిగ్గుతేల్చారు! ఫలితంగా ‘ఎమర్జెన్సీ’- అత్యవసర స్థితి-లో ఇందిరాగాంధీని పొగడి, భజన చేసి, పదవులు పొందిన వారెందరో ఆమె అధికారచ్యుతి సమయంలో, ఆమెను తిట్టి ‘ప్రజాస్వామ్యవాదులు’గా ముద్ర వేయించుకున్నారు. ఇందిరాగాంధీ అనంతర రాజకీయ యుగంలో ‘‘్భరతీయ జనతాపార్టీ మతతత్వ పార్టీ’’అన్నది చర్చకు ప్రధానమైన అఖిల భారతస్థాయి అంశమైపోయింది! ‘్భజపా’ మతతత్వ పార్టీనా? కాదా? అన్నది వేరే విషయం! కానీ ఆ పార్టీతో జట్టు విడిపోయిన ప్రతి పార్టీ కూడ ‘్భజపా’సర్వమత సమభావ సంస్థకాదన్న ఆరోపణను సంధించడం 1986నుండి నడుస్తున్న చరిత్ర. అప్పటినుంచి ఆ పార్టీ ఎదగడం ఆరంభంకావడమే ఈ ‘చర్చ’కు ఏకైక కారణం! ఏ పార్టీ ‘సెక్యులర్’ సంస్థ? ఏదికాదు?- అన్న ‘‘నిర్ధారణ పత్రాన్ని’’ జారీచేయడానికి సర్వాధికారం స్వీకరించిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలవారు ఇదే ‘‘ప్రమాణాన్ని’’ పరిగ్రహించారు! ‘్భజపా’ ను వ్యతిరేకించిన ప్రతి పార్టీకి అలా కమ్యూనిస్టులు’’ సర్వమత సమభావ ప్రశంసాపత్రాన్ని’’ జారీచేశారు. ‘్భజపా’తో జట్టుకట్టిన ప్రతి రాజకీయ పక్షానికీ కమ్యూనిస్టులు ‘‘మతోన్మాద’’ముద్రను గుద్దిపారేయడం 2008 వరకు నడచిన చరిత్ర!
కథాకథిత మతోన్మాదం, సర్వమత సమభావం మధ్య జరిగిన సంఘర్షణ సృష్టించిన సంక్షోభంనుండీ ‘్భజపా’1980లో అవతరించింది. ‘‘ద్వంద్వ సభ్యత్వం’’అన్న పదజా లం అప్పట్లో ప్రచారమైంది. ‘‘రెండు రాజకీయ పార్టీలలో ఒకే వ్యక్తికి సభ్యత్వం ఉన్నప్పుడుకదా ‘ద్వంద్వ సభ్యత్వం’ అయ్యేది అన్న తర్కం అప్పుడు పనిచేయలేదు. ‘‘సత్యవంతుల మాట జనవిరోధంబయ్యె, వదరుపోతుల మాట వాసికెక్కె’’ అన్న శేషప్ప కవి భయం నిజమైంది. జాతీయ సాంస్కృతిక సంస్థ ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం’ చర్చా వైపరీత్యవాదుల దృష్టిలో ‘రాజకీయ సంస్థ’గా మారింది. అందువల్ల అప్పటి జనతాపార్టీలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ స్వయం సేవకులందరినీ ‘ద్వంద్వ సభ్య త్వం’్భతం ఆవహించింది. దాన్ని వదిలించుకొని వారంతా ‘్భజపా’గా అవతరించారు!!
2008లో ప్రధాని మన్‌మోహన్‌సింగ్ నాయకత్వంలోని ‘ఐక్యప్రగతి కూటమి’ ప్రభుత్వం కమ్యూనిస్టుల మద్దతును వదిలించుకొంది. ‘యుపిఏ’ బండి నీడలో నడవడం కమ్యూనిస్టులు మానుకున్న తరువాత కూడ ‘బండి’నడక ఆగలేదు! ఇది మొదటి ఘటన. 2011లో మమతాబెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ ముప్పయి నాలుగేళ్ల భారత కమ్యూనిస్టు పార్టీ తదితర వామపక్షాల పాలనను తొలగించింది. ఇది రెండవ ఘటన! ఈ రెండు ఘటనలకు కారణం ప్రాభవంకోల్పోయిన కమ్యూనిస్టుల ప్రభావం కూడ తగ్గింది. అందువల్ల మార్క్సిస్టుపార్టీనుండి ఇతర రాజకీయ పార్టీలవారు ‘సర్వమత సమభావ’ ప్రశంసాపత్రాన్ని కోరడంలేదు! అందువల్ల అదను చూసికొని బీహార్ ముఖ్యమంత్రి ఈ ‘సెక్యులర్ సర్ట్ఫికేట్’లను జారీచేసే అధికారాన్ని లాక్కున్నాడు... కమ్యూనిస్టులవలె పార్టీల వారీగాకాక పార్టీలలోని వ్యక్తులవారీగా నితీశ్‌కుమార్ ప్రశంసాపత్రాన్ని, అభిశంసన పత్రాన్ని ముద్రించి పంపిణీ చేస్తున్నాడు! ‘్భజపా’లో నరేంద్రమోడీ తప్ప మిగిలిన వారందరూ సర్వమత సమభావ స్వభావులేనన్నది నితీశ్‌కుమార్ బృందంవారి నిజనిర్ధారణలో నిగ్గుతేలిన అంశం!!
2002 ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రా స్టేషన్‌లో బీభత్సకారులు ఒక రైలుపెట్టెను తగలబెట్టారు. ఇది పథకం ప్రకారం పాకిస్తాన్ ప్రేరిత బీభత్సకారులు హంతక బుద్ధితో పాల్పడిన పైశాచిక చర్య! నరేంద్రమోడీని ‘సర్వమత సమవాది’కాదంటున్న వారికి ఈ బీభత్సకాండ గుర్తులేదు. సమస్య కాదు! స్థానిక ప్రజల ఆవేశం కట్టలుతెంచుకొనడానికి పరాకాష్ఠ గోద్రా బీభత్సం! ఆవేశపరులైన స్థానికులు ‘గోద్రా’తో సంబంధం లేని అమాయకులను హత్యచేయడం మరో పాశవిక కాండ! కానీ ఈ ‘కాండ’కు ఎవ్వరూ పథకం వేయలేదు, గోద్రా దహనకాండవలె ఇది పూర్వ నిర్ధారితంకాదు. బీభత్సకాండలను భరించి భరించి, ఆపలేని ప్రభుత్వపు అసమర్ధతను సహించి సహించి ఉద్విగ్న చిత్తవృత్తులై పడి ఉండిన ప్రజలు ‘గోద్రా’ఘటనతో- అరవై మంది సజీవంగా భస్మం కావడంతో- రెచ్చిపోయారంతే! ఇలా రెచ్చిపోవడం అమాయకులను హత్యచేయడం కూడ బీభత్సమే! అయితే మొదటి బీభత్స శృంఖల ఫలితం, పరాకాష్ఠ ఈ రెండవ హత్యాకాండ!! మొదటి దాన్ని గురించి మరచిపోవడం, రెండవ దాన్ని మాత్రమే పట్టుకొని సాగదీస్తుండడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం!!
గోద్రా దహనకాండను నిరోధించలేక పోయినందుకు నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని కథాకథిత ‘ప్రశంసాపత్ర’ ‘అభిశంసన పత్ర’ ప్రదాయకులు నిందించడం లేదు!! గోద్రా దహనకాండ తరువాత జరిగిన హత్యాకాండను నిరోధించలేకపోయినందుకు మా త్రమే అతగాడి ప్రభుత్వాన్ని ఈ ‘‘ముద్ర వేసే’’ రాజకీయ కోవిదులు నిందిస్తున్నారు!! ద్వంద్వ ప్రమాణాలకు ఇంతకంటే నిదర్శనాలు అక్కరలేదు! సుప్రసిద్ధ రచయిత్రి తస్లిమా నస్రీన్‌ను మతోన్మాదులు కలకత్తాలో ఉండనివ్వలేదు, స్వేచ్ఛగా బహిరంగంగా సంచరించే జీవించే హక్కును మన ప్రభుత్వాలు ఆమెకు కల్పించలేదు. ఇలా కల్పించడంలో విఫలమైన పశ్చిమ బెంగాల్ వామపక్ష ప్రభుత్వంవారు, కేంద్ర ప్రభుత్వ నిర్వాహకులు నితీశ్‌కుమార్ దృష్టిలో సర్వమత సమభావవాదులు... తస్లిమా నస్రీన్‌పై మన రాష్ట్ర రాజధాని నగరంలోనే 2007 ఆగస్టు 9వ తేదీన భయంకర దౌర్జన్యకాండ జరిగింది. నిరోధించలేని అప్పటి ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని మతతత్వవాదులని ఎవ్వరూ అనడం లేదు. సర్వమతాల సంపుటమైన, సర్వభాషల సమాహారమైన, ఈ దేశపు మనుగడకే మూలప్రాతిపదిక అయిన జాతీయతను ఎమ్.ఎఫ్.హుస్సేన్ అనే నగ్న చిత్రకారుడు నిరంతరం అవమానించాడు. భరతమాతను సైతం దిగంబరంగా చిత్రీకరించడం అతగాడి విద్రోహ వికృత చిత్తవృత్తికి పరాకాష్ఠ. కానీ దేశంనుండి పారిపోయి ‘ఖతార్’ పౌరసత్వం స్వీకరించిన అతగాడికి ‘‘ముద్రవేసే’’ రాజకీయవేత్తలు ఇప్పటికీ గౌరవం ఘటిస్తూనే ఉన్నారు!! ఒక మతవర్గంవారి వ్యతిరేకతకు మతోన్మాదానికి ప్రాతిపదిక- తస్లిమా నస్రీన్... మొత్తం జాతిని కించపరచడం గౌరవ గరిమకు ప్రతీక- ఎమ్.ఎఫ్. హుస్సేన్!!
గోద్రా బీభత్సకాండకు, ‘గోద్రా’ అనంతర హత్యాకాండకు సంబంధించిన దర్యాప్తులు జరిగాయి. న్యాయస్థానాలలో అభియోగాలు దాఖలయ్యాయి. విచారణ జరిగింది, జరుగుతోంది. హంతకులను శిక్షించే కార్యక్రమం నడుస్తోంది! గోద్రా స్టేషన్ శివార్లలో ‘రామసేవకుల’ను సజీవ దహనంచేసిన పదకొండుమందికి 2011 మార్చి ఒకటవ తేదిన అహమ్మదాబాద్‌లోని న్యాయస్థానం మరణశిక్ష విధించింది, మరో ఇరవై మంది నేరస్థులకు జీవిత నిర్బంధ శిక్షను విధించింది. గోద్రా బీభత్సకాండకు ప్రతిక్రియగా హత్యలుచేసిన అనేకమంది నేరస్థులను కూడ న్యాయస్థానాలు శిక్షించాయి. ఆనంద్ జిల్లాలోని ‘ఓదే’ గ్రామంలో ఇరవై ముగ్గురిని సజీవ దహనంచేసిన పద్దెనిమిది నేరస్థులకు ఆనంద్ ప్రత్యేక న్యాయస్థానం గత సంవత్సరం ఏప్రిల్‌లో 12న జీవిత నిర్బంధ శిక్షను విధించింది! 2002 ఫిబ్రవరి 28న విష్ణుగఢ్ పట్టణంలోని దీప్దా దర్వాజా ప్రాంతంలో దౌర్జన్యకాండ జరిపి పదకొండు మందిని బలిగొన్న ఇరవైఒక్క మందికి అహమ్మదాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానం గత ఏడాది జూలై 30న యావజ్జీవ నిర్బంధ శిక్షను విధించింది. నేరస్థులను శిక్షించే న్యాయ ప్రక్రియ కొనసాగుతోందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు...
‘గోద్రా’నంతర గుజరాజ్ కల్లోలాలు పథకం ప్రకారం, దుర్బుద్ధి వ్యూహంలో భాగంగా జరగలేదు. ఈ కల్లోలాల ఆవేశ విద్వేష ఆగ్రహం చల్లారిన తరువాత ఆ రాష్ట్రంనుండి ఏ మతానికి చెందినవారు కూడ పారిపోలేదు. పదకొండేళ్ల భద్రతాభావానికి ఇది నిదర్శనం! జమ్మూకాశ్మీర్‌లో 1947నుండి అల్పసంఖ్యాకుల హత్యాకాండ కొనసాగుతోంది. 1990వరకు ఇలా కొనసాగిన కాలంలో షేక్‌అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా లాంటివారు ముఖ్యమంత్రులు. ఈ మతోన్మాద బీభత్సానికి దాదాపు లక్ష మందికి పైగా హతులైపోయారు. కాశ్మీర్ లోయలో మిగిలిన అల్పసంఖ్యాకులు- లక్షలాది మంది- ఇళ్లను పల్లెలను పొలాలను మందిరాలను వదిలి పారిపోయారు. చెల్లాచెదరైపోయారు. కానీ దీన్ని నిరోధించలేని ఆ ముఖ్యమంత్రులను నితీశ్‌కుమార్ వంటివారు ‘సర్వమత సమవాదు’లుగానే గుర్తిస్తున్నారు. వారికి మతోన్మాద ముద్రవేయలేదు. గుజరాత్‌లో పదేళ్లకు పైగా అల్పసంఖ్యాకులకు భద్రత కల్పించిన ముఖ్యమంత్రి ‘మతోన్మాది’! కాశ్మీర్ లోయలో అలా కల్పించలేని ముఖ్యమంత్రులు ‘సర్వమత సమవాదులు’!! ప్రజలు గమనిస్తున్నారు!!

మెయన్ ఫీచర్
english title: 
main feature
author: 
- హెబ్బార్ నాగేశ్వరరావు

పురుషోత్తముడు శ్రీరాముడు

$
0
0

ఎవరి పేరు వినగానే అప్రయత్నంగా రెండు చేతులు కలిపి నమస్కారం చేస్తామో, ఆ పేరు వినగానే రెండు కళ్ళు భక్తితో మూతపడతాయో అతనే శ్రీరామచంద్రుడు. సకల సుగుణాభిరాముడు, సర్వలక్షణ సంపన్నుడు. నిరంతరం ప్రజాక్షేమాన్ని కాంక్షించే ప్రభువు అయిన శ్రీరాముడు యుగాలు మారినా, తరాలు మారినా నేటికి ప్రజలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. సాక్షాత్తూ మహావిష్ణువు అవతారమైనప్పటికీ దుష్టశిక్షణార్థం భువిలో మానవుడిగా అవతరించి మానవులు పడే కష్టాలను అన్ని అనుభవించాడు.
జీవితంలో స్వార్థమును వీడి ధర్మమార్గాన నడిచే మానవుడు మహాత్ముడవుతాడని రామాయణం ప్రబోధిస్తోంది. ధర్మాధర్మాలు, సత్యాసత్యాల సంఘర్షణే రామాయణంలోని రాముని జీవితం. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎవరెంత ప్రలోభపెట్టినా, బతిమిలాడినా ఇచ్చిన మాటకు కట్టుబడి సత్యవాక్కుకోసం అనేక కష్టనష్టాలను అనుభవించాడు. అన్యోన్య దాంపత్యానికి ఆదర్శం సీతారాములు. ఒకరి కష్టసుఖాలలో మరొకరు పాలుపంచుకుంటూ తన వల్ల ఇతరులకు కష్టం కలగకుండా ఎంతో ఆదర్శవంతమైన జీవనాన్ని గడిపారు. రావణ చెర నుంచి సీతను రక్షించాడు రాముడు. సీత ఎంత పవిత్రంగా ఉందో ఆయనకు తెలుసు. కానీ ఆ విషయాన్ని లోకానికి చాటి చెప్పడానికి లోకుల మాటలకు సీత నొచ్చుకోకూడదన్న కారణంగానే అగ్నిప్రవేశం చేయించాడు.
పుత్రుడిగా, మిత్రుడిగా, పతిగా, శత్రువుగా, ప్రభువుగా అనేక సమస్యలను ఎదుర్కొని వాటిని సమర్థవంతంగా పరిష్కరించాడు. ప్రభువనే వాడు ఏ విధంగా ప్రజారంజక పాలన అందించాలో తన పాలనతో లోకానికి చాటి చెప్పాడు. అటువంటి ఆదర్శమూర్తి పర్వదినం శ్రీరామనవమి దేశ ప్రజలకు పెద్ద పండుగ. శ్రీరాముడు కౌసల్య గర్భాన అన్ని నక్షతాలు సక్రమమైన మార్గంలో ఉండి, శుభ శకునాలు వెలువడుతున్న తరుణంలో చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రాన అవతరించాడు. దశావతారాల్లో సంపూర్ణ మానవ అవతారం. ఎదుటి వారిలో సుగుణాలను మెచ్చుకోవాలని, అది మిత్రుడైనా, శత్రువు అయినా ఒక్కటేనని రాముడు నిరూపించాడు. రామ, రావణ యుద్ధం ముహూర్త నిర్ణయం కోసం రాముడు లక్ష్మణుడిని రావణుడి వద్దకు వెళ్ళమంటాడు. అందుకు నిరాకరించిన లక్ష్మణుడికి రావణుడి గొప్పతనాన్ని వివరిస్తాడు. సకల వేదాలను చదివిన వాడు రావణుడు, మహాభక్తుడు, ఒక్క స్ర్తి వ్యామోహం మినహా మిగతా అన్నింటిలో రావణుడు సుగుణవంతుడేనని వివరిస్తాడు.
సోదర ప్రేమకు, పితృవాక్ పరిపాలనకు, సుపరిపాలన అందించే ఉత్తమ రాజుకు, గురుసేవకు ఇలా మన జీవితంలో ఏ అంశం తీసుకున్నా రాముడు ఆదర్శంగా నిలుస్తాడు. పితృవాక్య పరిపాలనకు, ధర్మాచరణకు, సత్యసంధతకు, ఏకపత్నీ వ్రతానికి ఇలా విశ్వంలోని సద్గుణాలకు ప్రతీక శ్రీరాముడు. శ్రీరాముడి చేత అయోధ్య తరించింది. కానీ శ్రీరామనామంతో మూడు లోకాలు తరిస్తున్నాయి. అంతటి సత్యసంధుడు, మర్యాదా పురుషోత్తముడు అయిన శ్రీరాముని పర్వదినంనుంచి మనలోని దుర్గుణాలను వదిలి, సుగుణాలను అలవర్చుకొని పునీతులమవుదాం.

సబ్ ఫీచర్
english title: 
sri ramudu
author: 
- ఏ.వి.సూర్యనారాయణ

‘చెద’రంగం

$
0
0

‘‘శ్రీరామరాజ్యమే కావచ్చు. ప్రక్షాళన అనేది దేనికయినా అవసరం. అది కూడా ‘పీరియాడికల్’గా జరగాలి. అంతేగానీ ఏండ్లూ పూండ్లూ మిన్నకుండి, అప్పుడు ఎప్పటికప్పుడు పట్టించుకోక తాత్సారం చేసి, ఆ తరువాత ఎప్పుడో మేల్కొంటే అప్పటికే జరగవలసిన ‘నష్టం’ జరిగిపోతుంది. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు’అనే సామెతే, అప్పుడు గుర్తుచేసుకోవలసి వస్తుంది’’ అన్నాడు సుందరయ్య.
‘‘ప్రక్షాళన ఎప్పుడు? ఏదయినా సరిగాలేదనుకున్నప్పుడే కదా! అంతే బానే వుంది, ‘సబ్‌ఠీక్‌హై’ అనుకున్నప్పుడు, జరిగిపోతున్నదాన్ని అలానే జరిగిపోనివ్వక తీరికూచుని ఎవరూ కెలుక్కోరుకదా! సజావయిన అస్తిత్వానికి ఏదో ఉపద్రవం సంభవించినప్పుడు కదా సవరణలకు, సంస్కరణలకు పూనుకునేది’’అన్నాడు శంకరయ్య.
‘‘అదేమరి! అంతా బానే వుందనుకుని కళ్ళుమూసుక్కూర్చుంటే ఎలా? ‘అనుమానం’అయినా కలగాలి కదా! అపసవ్యపు తీరుకి, రేఖామాత్రంగా సూచనలు కనిపించినా, వెంటనే ‘అప్రమత్తం’కావాలి! ‘ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్‌నైన్’అని మనకు ఆంగ్లంలో సామెత వుంది. అంటే గోటితోపోయే సమయంలోనే మేల్కొని, ప్రమాదాన్ని నివారించుకోవాలి కానీ, గొడ్డలి దాకా అవసరం పడే స్థితి తెచ్చుకోకూడదు. అనుమానం రాగానే మేల్కొని, పరిశీలించుకుని, ప్రక్షాళన చేపడితే, పెనుప్రమాదాలను తప్పించుకోవచ్చు’’ అన్నాడు సుందరయ్య.
‘‘మీరిద్దరూ దేన్ని గురించి మాట్లాడుతున్నారు? నేటి రాజకీయ పార్టీల గురించేనా? 2014లో రాబోయే ఎన్నికలకోసం, ఇప్పటినుంచే ఏ పార్టీకి ఆ పార్టీ, ‘ప్రక్షాళన’ మొదలుపెట్టినట్లే వున్నాయి కదా! ప్రజలలో తమ పార్టీ పలుకుబడి పెంచుకోవడానికీ, ప్రజావిశ్వాసాన్ని చూరగొని బలం పెంచుకోవడానికేగా- ‘పాదయాత్రలు’ గట్రా చేస్తున్నది? అధికార పార్టీపైనా, ప్రస్తుత ప్రభుత్వ వ్యవహార సరళిపైనా, ప్రజాగ్రహాన్ని పెంచి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ- విద్యుత్ కోత, ధరల పెరుగుదల, మంచినీటి సమస్య వంటి అంశాలమీద ధర్నాలకూ, నిరసనలకూ పూనుకుంటూ, తమ పార్టీకి ప్రజలలో పలుకుబడిని పెంచుకునే ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయికదా? తెలుగుదేశం పార్టీ చంద్రబాబునాయుడుగానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయమ్మ, షర్మిలలు కానీ, వామపక్షాల బి.వి.రాఘవులు, నారాయణగానీ, టి.ఆర్.ఎస్. చంద్రశేఖరరావు గానీ, బి.జె.పి. విద్యాసాగర్‌రావు, కిషన్‌రెడ్డి వంటి నేతలు గానీ, ఎవరిమేరకు వాళ్ళు ఇప్పటినుంచే ప్రచారాస్త్రాలు కూడా ‘సాన’బెట్టుకుంటున్నట్లే కనపడుతున్నారు కదా! ఇదంతా ‘ప్రక్షాళన’క్రిందకే వస్తుందికదా?’’అన్నాడు ప్రసాద్.
‘‘ ‘ప్రక్షాళన’ అంటే ఎదుటివారి మీద దాడికి దిగడమో, విమర్శనాస్త్రాలు సంధించడమో కాదయ్యా? ‘ప్రక్షాళన’అనేది- తమకుతాము ముందు ‘సొంత ఇంట’చేపట్టేది. పరిసరాల పరిరక్షణకు ముందు, ఇంటి‘చెత్తాచెదారం’ శుభ్రంచేసుకోవాలి. ఆ ఇంటి చెత్తను తీసుకెళ్ళి పరిసరాల్లో పోసేయమని కాదు సుమా! తమ అంతర్గత కుమ్ములాటలూ, తమవద్ద మేటవేసుకుని వుంటూనే- క్రియాశూన్యంగా పడివుండి- బూజుగా, చెదగా మారుతున్న విషయాలనూ, వ్యక్తుల నైజాలనూ సకాలంలో గుర్తెరిగి సంస్కరించుకోవడమే ప్రక్షాళన మరి.’’ అన్నాడు శంకరయ్య.
‘‘ ‘బూజు’, ‘చెద’అని సరిగ్గా వాడావోయ్ శంకరం! నిజానికి జరుగుతున్నదదే! నూట పాతిక సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన పార్టీ అంటాం. కానీ ఇప్పుడెలా వుందన్నది కదా ప్రధానం! ‘బూజు’పట్టిన భావాలతో, అవినీతి ‘చెద’లుపట్టి, ప్రక్షాళనకు కూడా లొంగనంతగా- అనడానికీ, అనుకోవడానికీ కూడా ‘్భయంకరంగా’ కనిపిస్తూంటే ఎలా? బహుశా ‘రాజకీయ’చెద ‘రంగం’ అన్నమాట సరిగ్గా వర్తిస్తుంది అనుకుంటాను’’అన్నాడు సన్యాసి కూడాను.
‘‘్భద్రపరుచుకోవాలన్న కాంక్ష మంచిదే! కొన్ని ‘యాం టిక్స్’కు ‘పురావిశేష’ విలువలుండచ్చు కాదనం! అసలు స్వాతంత్య్రం రాగానే- ‘కాంగ్రెస్ పార్టీ అనవసరం’ అన్నాడట గాంధీజీ! రాజకీయ పార్టీ మూసలోకాక, ప్రజాచేతనాపథంలో వ్యవహారాలు సాగాలన్నది- ఆయన సంకల్పం. కానీ ఎవరు పడనిస్తారు? ఇందిర, రాజీవ్‌ల కాలంనాటి విలువలు కూడా కనీసం ఇవాళ లేవు! ఒక్క కాంగ్రెస్ పార్టీ వ్యవహారమే కాదు. ‘తెలుగుదేశం’పార్టీ అయినా- అది స్థాపించిన ‘ఎన్.టి.ఆర్’ ఆశయాలకూ, అభిప్రాయాలకూ దూరంగా జరిగిపోయిందన్నది యధార్థం! జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీబోర్డుల వివాదాల్లో కనబడుతున్నంతగా, తాతగారి ఆశయాల ఛాయల్లో- ‘్ఛయామాత్రంగానైనా’ ఆశావహంగా వున్నాడా? చంద్రబాబునాయుడుగారు తమ పాలనలో ఎంత మామకు వెన్నుపోటు పొడిచిన అపకీర్తి మూటకట్టుకున్నా, తన పనులతో మొదట్లో కొంతయినా జనాదరణ పొందగలిగాడు కనుకే, కనీసం తొమ్మిదేళ్లు పాలించాడు. నిజానికి పొరపాట్లుగా భావించక- అప్పుడు అహంకరించి చేసిన పనుల కారణంగా, తాను అవలంబించిన ప్రక్షాళనారహిత కార్యక్రమాలవల్లే, ఆయనా దెబ్బతిన్నాడు. ఇంట్లో వుడ్‌వర్క్ చేయించిన అందమైన కప్‌బోర్డ్‌లే కావచ్చు. కానీ వాటిల్లో అమూల్యమైన పుస్తకాలు, ఫొటోలు వంటివి పెట్టి- ‘అంతా సజావుగానే వుంది’ అనుకుంటూ, ఏండ్ల తరబడి అవి అలానే వుంచేసామనుకో! లోపల లోపల ‘చెదలు’పుట్టి, వాటిని ‘నాశనం’చేసేస్తాయి. ‘ప్రక్షాళన’లేకుండా- కనీసం అనుమానం అయినా లేక, మధ్యమధ్యలో తెరచిచూసి సంస్కరించి సరిదిద్దుకోక వదిలేస్తే- ‘చెదలకొండే’ ఏర్పడి పారలు, గునపాలు వాడి ‘తవ్వి’పారేయక తప్పదు! సంస్కరణలకు లొంగని వాటిని సమూలంగా నాశనంచేయాల్సిందే! వర్తమాన భారతంలో- అసలు ‘రాజకీయాలే’ అలా తయారై, రూపుకడుతున్నాయి. ‘రాజకీయ’ ‘చెద’రంగం పెరిగిపోయింది. ప్రజాస్వామ్య వ్యవస్థకే పెనుప్రమాదమై కూచుంటోంది. మరి ప్రజాహృదయాల ఏ రసాయనిక చర్యలు ఈ ‘చెదల’ వ్యవస్థను రూపుమాపి, ఉత్థాన నవోదయాన్ని ఇస్తాయో చూడాల్సిందే!’’అంటూ లేచాడు సుందరయ్య.

సంసారాలు
english title: 
samsaralu

చిన్న వ్యాపారాలకు కూడా లైసెన్స్ ఉండాలి

$
0
0

భారతదేశం ప్రపంచంలోనే పెద్ద రైల్వే వ్యవస్థ గల దేశం. మన రాష్ట్రంనుండి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలోని పెద్దరైల్వే స్టేషన్ల వలె చిన్న చిన్న రైల్వే స్టేషన్లలో కూడా స్టేషన్ ఆవరణలో పండ్లు అమ్ముకునేవారికి లైసెన్స్, కాంట్రాక్ట్ సిస్టం ఏర్పాటుచేసి నిర్ణీత స్థలంలోనే అమ్ముకునే విధంగా రైల్వేశాఖ చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం మండల కేంద్రాల్లో వున్న రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉంటున్నది. ప్రయాణీకులు వచ్చిపోయే దారిలోనే పండ్ల వ్యాపారం చేస్తున్నారు. బుకింగ్ కౌంటర్ వద్ద, ప్లాట్‌ఫాం దగ్గరలో, బ్రిడ్జిల వద్ద ప్రయాణికులకు ఇబ్బందికరంగా చిరుపండ్ల వ్యాపారులు అనుమతిలేని పండ్లవ్యాపారం నిర్వహిస్తున్నారు. అట్టివారిని రైల్వేస్టేషన్లలో పండ్లు అమ్ముకోనీయరాదు. రాత్రివేళల్లో కూడా అర్ధరాత్రి వరకు అసాంఘిక కార్యకలాపాలు, మద్యం సేవించడం, జూదం వంటి కార్యక్రమాలు పండ్ల వ్యాపారులు నిర్వహిస్తూ ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. అమ్మకాలు రద్దు చేయాలని మనవి.
-రాపాక రవీందర్, జనగాం

అటొకటి ఇటొకటి రైళ్లను వేయాలి
ప్రకాశం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్‌నుండి గుంటూరు వైపునకు వెళ్లుటకు గానీ, అదే స్టేషన్‌నుండి గుంతకల్ వైపునకు వెళ్లుటకు గానీ తెల్లవారుజామున మూడు మూడున్నర గంటల తర్వాత ఉదయం పది పదిన్నర గంటల వరకు ఒక్క రైలు కూడా లేదు. కనక దయచేసి గిద్దలూరునుండి ఉదయం ఆరు ఆన్నరకు బయలుదేరునట్లు గుంటూరు వైపునకు ఒకటి, గుంతకల్ వైపునకు మరొకటి రైళ్లను ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
-సాయి రామానందస్వామి, ప్రకాశం

చదువు సంసారం సంస్కారం
చదువుకున్న ప్రతివారు సంస్కారులగుతారనేది వట్టిది. చదువు వేరు సంస్కారం వేరు. సంస్కారమనేది పెద్దల ద్వారా అభ్యాసం ద్వారా అబ్బుతుంది. ఎవరు ఎంత కాలం జీవించినా చివరకు వట్టి చేతులతోనే వెళ్ళాలి తప్ప తీసుకెళ్ళేది ఏమీ లేదు. ప్రపంచాన్నంతటిని జయించిన ‘అలెగ్జాండరు’ వట్టి చేతులతోనే భువిని వదిలి వెళ్ళాడు. పెద్దలు, విద్యావంతులు తమ చిన్నారులకు నీతి పాఠాలను నీతి శతకాలను నేర్పిస్తూ తెలుగు భాషను దాని ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలి. విద్యార్థులను సంస్కారవంతులుగా తీర్చిదాద్దిలి. ఈ బృహత్కార్యం ముఖ్యంగా తల్లిదండ్రులపైన, విద్యనొసగు ఉపాధ్యాయులపైనా ఎంతైనా ఉన్నది. చదువు సంస్కారాన్ని అందించాలి. సంసారమనేది ఇక్కడే వుంటుంది. కాని మనతో వచ్చేది ఒక్క సంస్కారం మాత్రమే. కృషితోనాస్తి దుర్భిక్షం మరువకూడదు.
-రాపర్తి ఆదినారాయణ, పిఠాపురం

పల్లెలే వెనె్నముక
దేశానికి వెనె్నముక పల్లెలే అన్నది నిర్వివాదాంశం. పాడి పశుసంపద, పచ్చదనం, పరిశుద్ధమైన జల సంపద, పుష్కలంగా లభించే గాలి, వెలుతురు, మానవ సంబంధాలు ఇవన్నీ పల్లెలకు మాత్రమే స్వంతం. భారతదేశపు పురోభివృద్ధి గ్రామీణాభ్యుదయంలోనే వుందన్న మహాత్ముని సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి పల్లెల అభివృద్ధిని పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. మరొక ప్రక్క నగరాలను అంచనాలకు అందనంత వేగంగా అభివృద్ధి చేస్తున్నందువల్ల కాలుష్యం, త్రాగునీటి సమస్య, వాహనాల రద్దీ, భూగర్భ జలాలు అడుగంటిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నవౌతున్నాయి. అరాచకాలు, అత్యాచారాల సంఖ్య పెరిగిపోతూ శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. బడ్జెట్ కేటాయింపుల్లో పట్టణాలకు, గ్రామాలకు మధ్య అంతరం పెరిగిపోతుండడం పాలకుల వివక్షతకు ప్రత్యక్ష నిదర్శనం. ప్రభుత్వం తక్షణం స్పందించి గ్రామాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలుచేయాలి. బహుముఖాల బృహత్పధకం ప్రకారం పల్లెసీమలను నగరాలతో సమానంగా అభివృద్ధిచేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.
- సి.ప్రతాప్, విశాఖపట్నం

ప్రధాని పదవికి మోడీయే సరైన వ్యక్తి
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్రమోడీ భారతదేశ ప్రధాని కాగల అర్హతలున్నట్లు దేశ ప్రజలు గుర్తించారు. భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడడగల శక్తియుక్తులు ఆయనకున్నాయి. అంతేగాదు, గుజరాత్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధివైపు తీసుకుపోయారు, అదే పద్ధతిలో దేశాన్ని నడిపిస్తారని దేశ ప్రజలకు ఆశ వున్నది. శాంతి భద్రతలు క్షేమంగా వుంచగలిగాడు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా ప్రజల ఆస్తులు దోచుకోబడలేదు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాడు. కులాలను, మతాలను ఆమడ దూరం పారవేయగలడు. బీద కుటుంబాలకు ప్రభుత్వం బాసటగా నిలవాలే గాని, కుల మతాల భజన పాటలు మానాలి. బీద కుటుంబాలను ఆదుకోవాలి. ఇది ప్రతి ప్రభుత్వం చేయాల్సిన పనే! ప్రజలను విభజించి, ఐకమత్యాన్ని దెబ్బతీయకండి.
- జి.శ్రీనివాసులు, అనంతపురం

ఉత్తరాయణం
english title: 
letters to the editor

అమెరికాలో ‘ఏమో... గుర్రం ఎగరావచ్చు’

$
0
0

సుమంత్ హీరోగా చంద్రసిద్దార్థ్ దర్శకత్వంలో ఆ నలుగురు ఫిలిమ్స్ పతాకంపై మదన్ నిర్మిస్తున్న చిత్రం ‘ఏమో...గుర్రం ఎగరావచ్చు’. పింకీ సావిక కథానాయిక. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ షెడ్యూలు పూర్తిచేశారు. ఈనెల 25నుంచి అమెరికాలో మరో భారీ షెడ్యూల్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు చంద్రసిద్దార్థ్ మాట్లాడుతూ- ‘‘సుమంత్‌తో ‘మధుమాసం’ త ర్వాత మళ్ళీ ఈ సినిమా చేస్తున్నాను. ఇదొక రొమాంటిక్ ఎంటర్‌టైనర్. కాంచీ తాను డైరెక్ట్ చేద్దామని ఈ కథ తయారుచేసుకున్నారు. మేం అడగ్గానే ఈ కథ ఇచ్చేశారు. ఆధునిక దృక్పథం ఉన్న అమ్మాయికి, పల్లెటూరి కుర్రాడికి మధ్య సాగే వినోదాత్మక కథ ఇది’’ అని చెప్పారు. బ్యాంకాక్‌లో స్టార్ హీరోయిన్ అయిన పింకీ సావిక ఇందులో నాయికగా చేస్తున్నారని మదన్ తెలిపారు. చిత్ర సమర్పకుడు నీలం శంకర్ మాట్లాడుతూ - ‘‘ఈనెల 25నుంచి నెలరోజులపాటు అమెరికాలో ము ఖ్య సన్నివేశాలను, పాటలను చిత్రీకరించబోతు న్నాం. తొలి షెడ్యూలుతో 50 శాతం టాకీ పూర్తయింది. కీరవాణి సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ-మాటలు: ఎస్. ఎస్. కాంచీ, కెమెరా: చంద్రవౌళి, ఆర్ట్: నాగేంద్ర, సాహిత్యం: చైతన్యప్రసాద్, స్క్రీన్‌ప్లే-నిర్మాత: మదన్.

సుమంత్ హీరోగా చంద్రసిద్దార్థ్ దర్శకత్వంలో ఆ నలుగురు ఫిలిమ్స్ పతాకంపై
english title: 
a

ఐడియా

$
0
0

ఎండాకాలంలో ముఖభాగం కాంతి విహీనమవుతోందని బాధపడే వారు ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటించి ఉపశమనం పొందవచ్చు. బ్యూటీ పార్లర్లను ఆశ్రయించి భా రీగా డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. పాలను కాచి చల్లార్చాక, దానిపై ఏర్పడే మీగడను చర్మ సంరక్షణ కోసం వాడవచ్చు. కాసేపు ఫ్రిజ్‌లో ఉంచిన చల్లటి మీగడను ముందుగా పేస్టులా తయారు చేసుకోవాలి. ముఖానికి దీన్ని ‘మాస్కు’లా వేసుకుని బాగా ఆరనివ్వాలి. అరగంట తరువాత ముఖాన్ని పరిశుభ్రమైన నీటితో కడిగేసుకోవాలి. ఇలా కొన్ని రోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే ముఖభాగం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. నిమ్మరసాన్ని ముఖంపై మృదువుగా రాసుకుని అరగంట తరువాత శుభ్రం చేసుకున్నా ఉల్లాసంగా ఉంటుంది.

ఎండాకాలంలో ముఖభాగం కాంతి విహీనమవుతోందని బాధపడే వారు ఇంట్లోనే
english title: 
idia

అమ్మ పాలను అందించే బ్యాంక్!

$
0
0

బిడ్డ ప్రాణరక్షణలో- అమృతం లాగా పనిచేస్తాయ ‘చనుబాలు’. పుట్టంగానే అమ్మను కోల్పోయిన దురదృష్టవంతులైన పసిపాపలకు- ఆవుపాలు అందుబాటులో వుంటే కొంత నయమేగానీ- అమ్మ పాలే దొరికితే - అంతకన్నా ఇంకేం కావాలి? రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో చనుబాల బ్యాంకు ఒకటి ప్రారంభించారు. దీన్ని మన్నాదాయి ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పరిచారు. దీనికి యిటీవల రాజస్తాన్ ఆరోగ్య శాఖామంత్రిగారు ప్రారంభోత్సవం చేసి- నామకరణం కూడా చేశారు. దీని పేరు ‘దివ్యా మదర్స్ మిల్క్ బ్యాంక్’. బిడ్డను ప్రసవించగానే మృత్యువాత పడ్డ తల్లులుంటారు, మృత శిశువులకు జన్మనిచ్చిన అమ్మలూ వుంటారు, పసికందులుగానే మాతృమూర్తిని పోగొట్టుకున్న పాపలెందరో వుం టారు. అటువంటి వారికి రుూ బ్యాంకు- ‘చనుబాలు’ సరఫరా చేస్తుంది.
ఈ బ్యాంకు స్థాపనకు- ‘మా భగవతీ సంస్థాన్’ అనే ఎన్.జి.ఓ సంస్థ సహాయపడ్డది. తల్లిపాలకు నోచని పాపలకు- దాదమ్మలు, వితరణగల పెంపుడు తల్లులు అరుదుగా దొరుకుతున్న రోజులివి. ఈ పాల బ్యాంకుకి ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించి- బిడ్డను కోల్పోయిన తల్లులు- తమ దగ్గర వున్న చనుబాలను యివ్వవచ్చును. అలాగే, తన బిడ్డ తాగగా మిగిలిపోయి, అధికంగా వున్న పాలను దయాళువులైన తల్లులు యివ్వవచ్చును.
ఈ పాలను ఆధునికమైన పద్ధతులలో శుద్ధి చేసి- నిల్వచేస్తారు. ఆస్పత్రులలో- ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వున్న పాపలకు, భూమీద తల్లిలేని అనాథ పాపలకు, రోగగ్రస్తులయి- వేరే రకం పాలు పడని పాపలకు- యిలా కావాల్సినవారికి- రుూ బ్యాంకు ‘అమ్మపాలు’ అందిస్తుంది. కాకపోతే, చనుబాలను యిక్కడ బ్యాంకులో యిచ్చే అమ్మలకు బ్యాంకు పరిహారం, పారితోషికం లాంటి ప్రోత్సాహాలు ఎంతమాత్రం యివ్వదు. మానవతా దృక్పథంతో- తల్లులు ముందుకు రావాల్సిందే... ఎందుకు రాకూడదూ?

బిడ్డ ప్రాణరక్షణలో- అమృతం లాగా పనిచేస్తాయ ‘చనుబాలు’.
english title: 
veeraji
author: 
- వీరాజీ veeraji@sify.com

బంగరు భవితకు సోపానం -వ్యక్తిత్వ వికాసం

$
0
0

‘వ్యక్తిత్వ వికాసం’ అనేది మనుషుల మనసులకు చెందిన ఒక లోతైన అధ్యయన పరిశీలన. ఇది మన ‘మైండ్ పవర్’ మీద ఆధారపడి ఉంటుంది. మానసికమైన ఎదుగుదల ఇందులో క్రియాశీలక పాత్రను పోషిస్తుంది. కొన్ని సందర్భాలలో ఆలోచనా సరళిని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. నిజానికి- దీని మూలాలు మనకు బాల్యంలో దొరుకుతాయి. జన్మతః వచ్చే శారీరక ఎదుగుదలతోపాటు, అవయవాల పొందిక ఇక్కడ ముఖ్య భూమికను పోషిస్తుంది. దీనిలో ఒక ప్రధాన భాగమే బుద్ధి అనే మన వివేచనా శక్తి. ఈ వికాసం బాల్య దశలో సక్రమంగా అమలు జరిగితే భవిష్యత్తు అంతా పూలబాట అవుతుంది.
పుట్టుకతోనే ప్రతి జీవికి కొద్దో గొప్పో తెలివితేటలు సహజంగానే సంక్రమిస్తాయి. జన్యుపరమైన లోపాలను అధిగమిస్తే బాల్యానికి మించిన స్వేచ్ఛా పూరితమైన, అందమైన జీవితానికి మించిన ఆనందం మరెక్కడా కనిపించదు. ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల పాఠశాలకు బందీగా అవుతున్న నేటి పిల్లల విషయంలో ఇది కొంత శాపగ్రస్త జీవితంగానే భావించాలి. భవిష్యత్తును సుందరవనంగా తీర్చిదిద్దుకోవాలంటే క్రమశిక్షణతో కూడిన విద్య చాలా అవసరం. విద్యార్థి దశలోనే జిజ్ఞాసను రేకెత్తించే ప్రేరణ మన పరిసరాలు, వాతావరణ పరిస్థితులు నుంచే ఊపిరి పోసుకొని అవగాహనా స్థాయిని ఏర్పరచుకుంటాయి. మనోవిశే్లషణకు చెందిన అభ్యాసన ప్రక్రియ ఈ ప్రాథమిక దశనుండే మొదలవుతుంది. ‘చిల్డ్రెన్ సైకాలజీ’ విషయానికొస్తే ముందుగా మనం మననం చేసుకోవాల్సిన మనస్తత్వ శాస్తవ్రేత్త ‘సిగ్మండ్ ఫ్రాయిడ్’. మానసిక వయస్సుకు, శారీరక ఎదుగుదలకు మధ్య ఒక పరిపక్వ దశ వచ్చేవరకూ వ్యక్తిగత జీవితంలోని అన్ని కోణాలనూ ఫ్రాయిడ్ తన పరిశోధనలో భాగంగా ఒడిసి పట్టుకున్నాడు. వ్యక్తిత్వ జీవితానికి సంబంధించి అనేక ముద్రలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మన మీద పడుతుంటాయి. వాటి ప్రభావంలో పడి జీవితంలో అనుకరించే వారు కోకొల్లలు. అందులో లోటుపాట్లను, గుణదోషాలను సక్రమ రీతిలో సంగ్రహించి మన భావాలకు అనుగుణంగా భవిష్యత్తులో మలచుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే వ్యక్తిలో అంతర్లీనమైన ప్రతిభా పాటవాలు నిద్రాణస్థితి నుంచి మేల్కొని ఆలోచనలు సవ్య దిశలో ప్రయాణించడం మొదలవుతుంది. మానసికమైన ఈ ఎదుగుదల వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది.
విద్య ఆవశ్యకత..
చదువు విషయానికొస్తే జ్ఞాన సముపార్జన గుర్తుకొస్తుంది. ‘విద్యలేనివాడు వింత పశువు’ అన్న నానుడిని గుర్తుకు తెచ్చుకుంటే దీని ఆవశ్యకత మనకు అవగతమవుతుంది. విశ్వకవి రవీంద్రానాథ్ ఠాగూర్ పద్ధతిలో ప్రశాంత వాతావరణంలో చెట్ల నీడన జరిగే విద్యాబోధనకీ, ఆధునిక కాంక్రీటు భవనాల గది గోడల మధ్య సాగే క్రమశిక్షణ విధానానికి పోల్చి చూస్తే చాలా అంతరం రూపుకడుతుంది. విద్య వ్యాపారమయమైన ఇప్పటి సామాజిక వ్యవస్థలో బుద్ధి వికసించడానికీ, మానసికంగా ఎదగడానికీ అంతర్గతమైన సంఘర్షణ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఈ స్థితికి దిగజార్చిన పరిస్థితులను అధ్యయనం చేస్తే సరికొత్త ప్రతికూల అంశాలు వాటంతటవే బయటపడతాయి. మన వ్యక్తిగత అభిరుచులను బట్టి కూడా పరిస్థితులు ఆధారపడి ఉంటాయి.
నానాటికీ యాంత్రికమైపోతున్న ఉరుకులు, పరుగుల జీవితంలో మాతృభాష ఉనికిని కోల్పోతున్న పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. వీటికి కారణాలేవైనా, తృప్తి లుప్తమైపోతున్న సందర్భాలు మన అవగాహనకు అందక, వ్యక్తిత్వ వికాస దశ స్థాయి వర్తమానంలో క్షీణించిపోతున్నదనే చెప్పాలి. ఈ క్షీణదశ నుంచి వ్యక్తిత్వ ఎదుగుదల దిశగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకోవాలి.
వ్యక్తిగత ఎదుగుదలకు కొన్ని జాగ్రత్తలు..
శైశవ దశలో అనుకరణ ప్రధానాస్తమ్రైతే, కౌమార దశలో స్వీయ పరిశీలనతోపాటు వ్యక్తిగత ప్రేరణ, పునశ్చరణ, విధేయత వికాస దశకు కొత్త ద్వారాలు తెరుస్తాయి. ఇది కీలక పరిణామాలకు దారితీసే ప్రధాన సందర్భం. టీచర్లతో పాటు తల్లిదండ్రులు కూడా చాలా జాగరూకతతో, మెలకువతో వ్యవహరిస్తూ పిల్లలతో సన్నిహితంగా, సున్నితంగా మెలగవలసిన తరుణం. జ్ఞానార్జనకు ఇదే కీలకమైన మెట్టు. దీనిని సృజనాత్మకంగా, స్ఫూర్తిదాయకంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దగలిగితే మానసికమైన ఉన్నత ఎదుగుదల క్రమపద్ధతిలో జరిగి వ్యక్తిగత వికాసానికి దిశా నిర్దేశనం చేసినట్టవుతుంది. భవిష్యత్తులో ఎలాంటి ప్రతికూల సమస్యలనైనా తనకు అనువుగా మార్చుకునే స్థితికి విద్యార్థిని సమాయత్తం చెయ్యాలి.
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు అనేక ప్రతికూల పరిణామాలు విద్యార్థినీ విద్యార్థుల ఎదుగుదలకు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. ఆధునిక పాశ్చాత్య పోకడలు విద్యార్థుల ఆలోచనా సరళిలో సరికొత్త మార్పులు తీసుకొస్తున్నాయి. వీటిపట్ల చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. ‘సెక్స్ ఎడ్యుకేషన్’ పరంగా విద్యార్థుల అవగాహనా స్థాయిని పెంచడంతోపాటు, ఇంటర్‌నెట్, సైబర్‌కేఫ్‌లు ప్రదర్శించే కొన్ని వికృత పైశాచిక సైట్ల విషయంలో అందరూ మెలకువతో వ్యవహరించాల్సి వుంది. ఈ కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల వేగంలో ఇంటర్నెట్ వినియోగం ఉత్తమ ఫలితాలతోపాటు దుష్పరిణామాలను కూడా వేగవంతం చేస్తూ వస్తోంది. పిల్లలు మానసికంగా ఎదిగే క్రమంలో సమాజం చుట్టూ అల్లుకుంటున్న నీలినీడల స్థితిగతుల పర్యవసానాలను వాళ్ళ స్థాయికి అర్థమయ్యేలాగా చూచాయగా వివరణాత్మకంగా బోధించి, తగు జాగ్రత్తలను పాటించే స్థాయికి మలచగలగాలి.
ఇక వ్యక్తిగతమైన విషయానికొస్తే ఈ కౌమార దశలో ఉండే పోటీతత్వం, వేగవంతం, ఆత్మన్యూనతా భావాలు, అసూయాద్వేషాలు బీజప్రాయంలోనే తొలగించి తగినంత జ్ఞానచికిత్స చెయ్యాలి. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే వీరగాథలు, నీతిశతకాలు, పాటలు, పద్యాలు, సామెతలు, బాల సాహిత్య రచనల పట్ల మక్కువను చూపించే విధంగా పఠనాభిలాషను పాఠ్యాంశాల బోధనలో భాగంగా విధిగా చేర్చాలి. దృశ్య, శ్రవ్య కళలపట్ల ప్రాధాన్యతను పెంపొందించి పిల్లలు ఆచరించేలా ప్రోత్సహించాలి. వ్యాసరచన, వక్తృత్వ అంశాలతోపాటు క్రీడలపట్ల ప్రత్యేక శ్రద్ధను చూపించాలి. వీటితోపాటు పోషకాహర విలువల పట్ల ఆసక్తిని కలిగించేలాగా కృషి చెయ్యాలి. ఈ రకమైన ప్రేరణలవల్ల విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు ధైర్యసాహసాలు, త్యాగం, దేశభక్తి, సేవానిరతి భావాలు చోటుచేసుకొని వాళ్ళ భవిష్యత్తుని ఉజ్జ్వలంగా, ఉన్నతంగా, ఆశాజనకంగా తీర్చిదిద్దినవాళ్ళమవుతాం!

‘వ్యక్తిత్వ వికాసం’ అనేది మనుషుల మనసులకు చెందిన ఒక లోతైన అధ్యయన పరిశీలన.
english title: 
gold
author: 
-మానాపురం రాజా చంద్రశేఖర్

అద్వైతం (కథ)

$
0
0

ఇప్పుడే కాదు.. ఎప్పుడు ఆనందరావుగారి దగ్గరికి ప్రయాణమైనా ఓ చిత్రమైన ఉద్వేగం. ఆయన, ఆయన ఇల్లు.. ఓ పల్లెటూరి ప్రశాంత దేవాలయ దర్శనంలా ఉంటుంది నాకు. ఆయనతో గడుపుతుంటే పసిపిల్లల నిష్కల్మషమైన బోసినవ్వు చూసినట్టు ఉంటుంది. అది లౌకికమే అయినా, ఏదో దైనందిన జీవితానికి వేరుగా అనిపించే మరో స్థాయి అనుభవం. నా భావన ఇదే అయినా ప్రత్యక్షంగా ఆయన, ఆయన తీరు చాలా సామాన్యంగా, అతి మామూలుగానే అనిపిస్తుంది. నాకూడా రామ్మూర్తి ఉన్నాడు. నిజానికి వాడి కూడా ఉన్నది నేను. ఏలూరు నుంచి వాడి కారులోనే బయలుదేరాం. వాడికీ నాలాగే ఆనందరావుగారంటే ఇష్టం. నాకన్నా వాడికే ఆయన దగ్గర చనువు కొంచెం ఎక్కువ.
కిందటిసారీ మేమిద్దరమే వెళ్ళాం... మూడేళ్ళైపోయింది. కావాలనుకుంటే వాడికి గంట ప్రయాణం.. కానీ వాడూ ఈ మూడేళ్ళుగా వెళ్ళలేదట.
మేం వెళ్ళేటప్పటికి ఆనందరావుగారు వరండాలోనే ఉ న్నారు. ‘‘రండి... రండి.. చాలా రోజులకి’’ అంటూ ఆప్యాయంగా ఆహ్వానించారు. యథావిధిగా మంచి కాఫీ వచ్చింది. కాఫీ తాగడం పూర్తయ్యేలోపు పరస్పరం పలకరింపులు పూర్తయ్యాయి.
‘‘మానకుండా నువ్వు కథలు రాస్తున్నావు రాజూ.. సంతోషం’’ అన్నారు నా వేపు చూస్తూ. మూడేళ్ళు కలుసుకోకపోయినా, తరచుగా ఫోన్‌లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. నా ప్రతి కథ గురించీ ఆయనకి తెలుసు.
ఆనందరావుగారూ కథలు రాసేవారు. ఆ యన రాసింది మొత్తం ఆరు కథలే. ఆ కథలన్నీ నాకు బాగా గుర్తే. దరిదాపు ఇరవై ఏళ్ళయింది ఆయన కథ రాసి. ఓ రకంగా కథారచనే మా పరిచయానికి కారణం.
కథలు రాస్తున్న కొత్తలో నేను రాసిన ఓ కథ ఆనందరావుగారికి చూపించాలంటే రామ్మూర్తే నన్ను ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు. రామ్మూర్తి నాకన్నా రెండేళ్ళు పెద్దయినా ఇద్దరం ఏలూరు కాలేజీలో కలిసి చదువుకున్నాం.
ఆ రోజు నా కథ గురించి, ఇతర విషయాల గురించి ఆయన మాట్లాడిన మాటలు నన్ను ఆనందరావుగారికి దగ్గర చేశాయి. పాతికేళ్ళపైగా మా అనుబంధం అలా సాగుతోంది. ఎక్కువగా మంచి గురించే మాట్లాడ్డం, దానికి భిన్నంగా చెప్పటం, తప్పనిసరైతే వీలున్నంత మృదువుగా చెప్పటం- ఆయనలో నాకు నచ్చిన విషయం. అందుకే ఆయనతో గడిపే సమయం హాయిగా ఉంటుంది. ఏ మాత్రం అలజడిగా ఉండదు.
ఆనందరావుగారు కథలు రాయటం మానేసినా, రచనని వదల్లేదు. ఈ ఇరవై ఏళ్లుగా... అచ్చుల్లో పేజీ, రెండు పేజీలలో వివిధ పత్రికల్లో ఆయన రాస్తున్న వాటికి ఏ పేరు నిర్ణయించాలో నాకు అర్థం కాలేదు.
ఆయనకో గమ్మతె్తైన ఒడుపు చిక్కింది. అవి పూర్తిగా వ్యాసాలు కావు. విమర్శలూ కావు.. పరిచయాలు కావు.. అన్నింటి కలగలుపు. కొన్ని ఆయన అనుభవాలు...మరికొన్ని ఇతరుల అనుభవాలు. కొన్ని ఆయన చదివినవి.. మరికొన్ని ఇతరులు చెప్పగా విన్నవి. కొన్ని ఊహలు.. కొన్ని అందమైన కలల్లాంటి భావనలు.. వెరసి.. స్నేహంగా, ఇష్టంగా ఓ వ్యక్తి నిస్సంకోచంగా మనతో పంచుకునే అనుభూతులు.. అవి నాకు కొత్తగా, చాలా ఇష్టంగా ఉంటున్నాయి. నాలాగే ఇంకా చాలామందికి అవి అలాగే అనిపిస్తున్నాయని- వాళ్ళే చెప్పగా విన్నాను.
తన రచనల గురించి ఆనందరావుగారు మాట్లాట్టం చాలా తక్కువ. ఎక్కువ ఆయన మాట్లాడేది రకరకాల మనుషుల గురించి. వాళ్ళకి తారసపడిన చిత్రమైన పరిస్థితులు... అప్పటి వారి ప్రవర్తన. మానవ నైజంలోని అనంత వైచిత్రి.. ఇవే ఆయనకి అభిమానమైన విషయాలు.
మాతో మాట్లాడుతున్న ఆయన మధ్యలో లేచి లోపలికి వెళ్ళి కొన్ని పుస్తకాలు తెచ్చారు.
‘‘ఇవి.. నువ్వు చదివితే బావుంటుంది... కూడా తీసికెళ్ళు, ఇవ్వటం మరిచిపోతానని ఇప్పుడే తెచ్చా’’ అన్నారు.
‘‘లోపల ఇంకా చాలా ఉన్నాయి. నీకు నచ్చినవి నువ్వూ తీసికెళ్ళరా...’’ అన్నారు రామ్మూర్తితో.
సాధారణంగా ఆ ఊరు దాటి ఎక్కడికీ వెళ్ళరు ఆయన. ఆ ఇల్లు దాటి వెళ్ళటమూ తక్కువే. ఎప్పుడైనా వారానికో, పది రోజులకో వెడితే తన పొలానికి, తోటకి వెడతారు.
అయినా ఆయనకి అందే సమాచారం అంతా ఇంతా కాదు. అనేక చోట్ల నుంచి రకరకాల మిత్రులు ఫోన్‌లో మాట్లాడుతారు. కొంతమంది తరచుగా వచ్చే వాళ్ళున్నారు. ఆయనకి నచ్చినవి, ఆయనకి నచ్చిన వాళ్ళు ఆయన దగ్గరికే రావటం విశేషం.
‘‘ఎప్పుడూ మేం రావటమేనా? నువ్వూ కదిలి ఈ ఊరు దాటి రావచ్చుగా!’’ అని రామ్మూర్తి కొంచెం నిష్ఠూరంగా ఒకటి రెండుసార్లు అనకపోలేదు.
‘‘రావచ్చురా... రాకూడదని కాదు.. ఎందుకో ఊరు కదలాలనిపించదు...’ అంటారే తప్ప ఆ విషయంగా మరే చర్చకి తావివ్వలేదు. వీలున్నంతవరకూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళుండాలన్నది ఏదో ఆయనలో బలంగా ఉంది.
ఇలా ఎప్పుడేనా బైటికి వచ్చినప్పుడు మధ్యాహ్నం భోజనానికి ముందు వాడికి నచ్చింది పుచ్చుకునే సరదా రామ్మూర్తికి ఉంది. ఆనందరావుగారి దగ్గర అభ్యంతరాలు చాలా తక్కువ. అందువల్ల రామ్మూర్తి తనకి కావాల్సింది చక్కగా తీసుకున్నాడు. తీరుబడిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశాం. భోజనాల దగ్గర ఆనందరావుగారి టేబుల్ మేనర్స్, భోజనాన్ని రుచిగా తినేలా కాకుండా, రుచిని తృప్తిగా ఆస్వాదించేలా ఉంటుంది. బరువైన భోజనంతో గెస్ట్ రూంలో పడుకున్న మేం నిద్దర లేచేటప్పటికి సాయంత్రపు చల్లదనం ఎంతో హాయిగా ఉంది.
ఆనందరావుగారి ఇంటి చుట్టూ రెండెకరాల విశాల ఆవరణ ఉంది. ఆ ఆవరణలో తూర్పు వైపు మొక్కల దగ్గరున్న ఆయన దగ్గరకెళ్ళాం.
‘‘ఒంటరిగా ఏం చేస్తున్నావురా? మమ్మల్ని పిలవలేకపోయావా?’’ అన్నాడు రామ్మూర్తి.
‘‘పడుకున్నారుగా.. అయినా నేను ఒంటరిగా ఎక్కడున్నాను?’’ అన్నారు.
చుట్టూ చూశాం.. ఎవరూ లేరు.
‘‘ఈ చెట్లతో కబుర్లు చెపుతున్నాను..’’ అన్నారు మా అయోమయం చూసి.
‘‘చెట్లతో కబుర్లేవిట్రా... వేళాకోళమా?’’ అన్నాడు రామ్మూర్తి.
‘‘వేలాకోళం కాదురా.. నిజమే.. మొక్కలకి ప్రాణం ఉంది.. జీవం ఉంది. ఆ గుర్తింపుతో ప్రవర్తిస్తుంటే నాకు అవి మాట్లాడుతున్నట్టు... నా మాటలకి బదులు పలుకుతున్నట్టు అనిపిస్తుంది...’’ అన్నారు నవ్వుతూ.
‘‘చాదస్తమో... భ్రమో... నాకు బావుంది. దీనివల్ల ఎవరికీ నష్టం లేదు. నువ్వూ ప్రయత్నించి చూడు... బావుంటే సరే... లేదంటే ఒదిలేయ్...’’ అన్నారు అదే నవ్వుతో.
ఇనే్నళ్ళుగా ఆయన ఆ పరిసరాల్లోనే ఉంటూ సంతృప్తిగానే ఉన్నారు. ఆయనలో ఏ ఆరాటం కనపడదు. తన పద్ధతే గొప్పదన్న భావనగానీ, వ్యక్తీకరణ గానీ మచ్చుకైనా లేవు.
‘‘ఇదే కాదు రామ్మూర్తి.. నా అనుభవంలో చాలా విషయాలు భ్రమో, నిజమో తెలియనివి చాలా ఉన్నాయి. తెలుసుకోవటం అంత తేలిక్కాదు. అది అంత అవసరమనీ నాకు అనిపించలేదు. ‘సత్యశోధన’ అని మనవాళ్ళు చాలామంది అంటారు. మన జీవితం చుట్టూ అల్లుకుని ఉన్న వాటిని సరిగా గుర్తించి పాలుపంచుకుంటే చాలనిపిస్తుంది నాకు..’’ అన్నారు. ఆ తర్వాత ఆయన మాటల్లో ఆ గుర్తింపుకి దగ్గరగా ఉన్న కొన్ని విషయాల ప్రస్తావన వచ్చింది.
వాటి గురించి చెపుతున్నపుడు అవేవో నిగూఢమైనవి, ప్రత్యేకమైనవి అన్న భావన ఆయనలో లేదు. ఆ మాటలు చాలా సామాన్యమైన వ్యక్తుల గురించి.. సంఘటనల గురించే.. తేడా అల్లా మనం గుర్తించటంలోనే. అవసరాన్ని మించిన ఆశ, ఆరాటం మనని ఎంతగా బాధపెడుతున్నాయో, మనకి అందుతున్న ఆనందాన్ని పట్టించుకోకపోవటం ఎంత అసంతృప్తి కలిగిస్తోందో చెపుతున్నారు.
ఈ ఇరవై ఏళ్ళుగా ఆనందరావుగారు రాస్తున్నవి వేరే వేరే అంశాలు అనిపించినా, అంతస్సూత్రంగా ఓ ధార వుంది. జీవన నాణ్యతకి సంబంధించిన వౌలిక ధార అది.
నెలకి పదివేలు ఆదాయం ఉన్న వ్యక్తికి డబ్బు సరిపోదు. మూడులక్షల ఆదాయం ఉన్న వ్యక్తికీ సరిపోదు. ఎవరికీ దేనికి పది నిముషాలు తీరిక లేదు. మళ్లీ గంటలు గంటలు టీవీ ముందో, లాప్‌టాప్‌తోనో గడుపుతారు. జీవితం గడుపుకోవటానికి కష్టపడేవాళ్ళం. కష్టపడటమే జీవితం అన్న నూతన సూత్రాలు, ఆర్థికమంత్రాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వ్యక్తుల మధ్య ఇరుకుదనం పెరుగుతోంది. ఏ విషయం ప్రస్తావనకి వచ్చినా ‘ఈ రోజుల్లో ఇది మామూలే. మనం చెయ్యగలిగిందేమీ లేదు’ అన్న ఉదాసీనత. వీటినే సామాన్య సంఘటనల రూపంలో, వ్యక్తుల నడవడిగా రాస్తున్నారు ఆనందరావుగారు. ఉన్నంతలో జీవితాన్ని మరింత ఆనందంగా మార్చుకునే అవకాశాల గురించి అందరికీ గుర్తింపు పెరగాలన్నది ఆయన తపన.
రామూర్తి, ఆనందరావుగారు కలిసి చదువుకున్నారు. చాలా దగ్గర స్నేహితులు. స్కూలు చదువు అయ్యేవరకు ఒకే పరిసరాల్లో పెరిగారు. అయినా ఇద్దరి పద్ధతుల్లో ఎంతో తేడా.
ఆనందరావుగారిలా ఆ పల్లెటూళ్ళో ఉండటం తనికి ఇష్టం లేదని ఏలూరులో స్థిరపడ్డాడు రామ్మూర్తి. డబ్బుకి లోటులేదు. పిల్లలు బాగానే స్థిరపడ్డారు. అయినా ఎందుకో కిందటిసారి నేను వచ్చినప్పటికన్నా బాగా చిరాగ్గా వున్నాడు. ఆ విషయం ఆనందరావుగారి దృష్టిలో పడింది. తెల్లారి లేచాక కాస్సేపు ఇంటిముందు మొక్కల మధ్య తిరిగాం.
టిఫిన్ చేసి ఇంక మేం బైలుదేరడమే. టిఫిన్ చేస్తుండగా.. ‘‘ఎందుకురా.. మరీ అలా ఉన్నావు?’’ అనడిగారు రామ్మూర్తిని ఆనందరావుగారు.
‘‘ఎందుకేమిట్రా..? నీకు అన్నీ బాగున్నాయి. అందరూ అంతేననుకుంటావు. జీవితం ఏం బావుందిరా..? కడుపున పుట్టిన ముగ్గురిలో ఒకడూ నా మాట వినడు. వాళ్ళకి ఏది తోస్తే అదే. వాళ్ళు తలోచోట. నేను, నా పెళ్ళాం ఇరవై నాలుగ్గంటలూ ఒకరి ముఖం ఒకళ్ళు చూసుకుంటూ ఏలూరులో.. పెద్దా చిన్నా అన్న గౌరవం, తల్లిదండ్రుల మాట వినాలన్న జ్ఞానం, చచ్చేకాలంలోనైనా మమ్మల్ని పట్టించుకోవాలన్న జాలీ లేవు వాళ్ళకి... ఇదీ ఒక బతుకే..’’ అన్నాడు.
రామ్మూర్తి ఇద్దరు కొడుకులు విదేశాల్లో ఉన్నారు. మూడోవాడు జలంధర్‌లో ఉన్నాడు. వాళ్ళతోటి, వాళ్ళ పిల్లలతోటి కలిసుండే జీవితం కరువైందన్న అసంతృప్తి. వాళ్ళు రాలేరు, వీళ్ళు వెళ్ళలేరు. చాలా కుటుంబాల్లో, చాలామంది పెద్దవయసు వాళ్ళ జీవితాల్లో ఉన్న సమస్యే. కొంతవరకూ ఆ బాధ నాకూ ఉంది.
అంతా విన్నా ఆనందరావుగారు ‘‘మనం చదువుకున్న రోజులు, నువ్వు కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు గుర్తున్నాయిరా నీకు?’’ అని చాలా నెమ్మదిగానే అడిగారు.
అప్పటి సంగతులు నాకూ తెలుసు. రామ్మూర్తి ఒక్కడే సంతానం. ఇష్టారాజ్యంగా పెరిగాడు. తల్లీ తండ్రీ అంటే ఎంతో ప్రేమ. అస్తమానం వాళ్ళ గురించే మాట్లాడేవాడు. అయినా తన చదువు విషయంలో, ఉద్యోగం విషయంలో, పెళ్లి విషయంలో తల్లిదండ్రుల మాట ఒక్కటీ లెక్కచెయ్యలేదు. డబ్బు సంపాదన మీద, ఆర్థికంగా పైకి రావటం మీద వాడి ఆరాటమే వాడికి ముఖ్యంగా తోచింది. ఎప్పటికప్పుడు ఇవన్నీ చెప్పి బాధపడేవాడు. తల్లీ తండ్రికి కావాల్సినట్టు ఉండలేకపోయానన్న బాధ ఉండేది.
వాడన్న మాటేమిటి! కొంతవరకూ నేనూ అంతే. కథలు, సినిమాలంటూ అర్ధరాత్రి వరకూ తిరిగేవాణ్ణి. ‘తొందరగా ఇంటికి రారా.. పొద్దునే్న లేవరా...’ అని అమ్మా, నాన్న ఎంత మొత్తుకున్నా ఒక్కనాడూ వినలేదు.
‘‘అప్పటి మన పద్ధతులు మనకి ముఖ్యం అనిపించాయి. ఇప్పుడు మాత్రం పిల్లలదే తప్పంటాం. సరే, ఇద్దరు కొడుకులు విదేశాల్లో వున్నారు. నువ్వు, మీ ఆవిడా అక్కడికి వెళ్ళి సౌకర్యంగా ఉండలేరు. జలంధర్ వెళ్ళొచ్చుగా.. వెళ్ళవు. వాడే సెలవు పెట్టి పెళ్లాం పిల్లలతో రావాలి. అన్నీ నీకు సౌకర్యంగా జరగాలి. అలా జరగకపోవటం పిల్లల తప్పు.. అంతేనా?’’ అన్నారు ఆనందరావుగారు. రామ్మూర్తి సమాధానం చెప్పలేదు. మరి కాస్సేపటికి మేం ప్రయాణమయ్యాం.
బయలుదేరుతున్న మా కారు దగ్గర నిలబడి ‘‘రావటానికి వీలు కుదరాలనుకో. వీలు కుదిరిన వెంటనే వస్తూండు. నువ్వొస్తే వీడూ వస్తాడు’’ అన్నారు రామ్మూర్తి వైపు చూస్తూ. ఆయన మాటలో, చూపులో, చేతలో ఆప్యాయత. మా కారు కనుమరుగయ్యేవరకూ బయట నిలబడిన ఆయన చెయ్యి ఊపుతూనే ఉన్నారు.
రామ్మూర్తి ముఖం తేటపడింది. మేం ఓ పదిమైళ్ళు ప్రయాణం చేశాక, రామ్మూర్తి నా వైపు చూస్తూ.. ‘‘నాకు ఎప్పుడూ అంతగా అర్థం కాదు గానీ, వాడిలో ఏదో గొప్పతనం వుంది రాజూ. వాడి మాటల్లో బలం, మనం పెద్దచిక్కులని అనుకున్నా వాటిని కూడా తేలిగ్గా విడగొట్టేస్తుంది’’ అన్నాడు.
నాక్కూడా తేలిగ్గానే ఉంది. జీవితం మెరుగుపట్టానికి వలసవెళ్ళటం ఎప్పట్నించో వున్నదే. పిల్లల్నే తప్పుపట్టటం ఎక్కువైపోతోంది. ప్రతిమాటకీ ముందు వాళ్ళకి తల్లిదండ్రులంటే ప్రేమ లేదనుకోటం అలవాటైపోయింది. వాళ్ళు మనకి దగ్గరగా లేరన్నదే మన బాధ. కానీ వాళ్ళకి చాలా వాటినుంచి దూరంగా ఉన్న బాధ వుంది. విశ్రాంతి నుంచి, కన్నవాళ్ళనుంచి, పుట్టి పెరిగిన పరిసరాల నుంచి, స్నేహితుల నుంచీ... ఇలా సంపాదన కోసం చాలావాటికి దూరంగా బతుకుతున్నారు. పరాయివాళ్ళ గురించే కాదు.. మన పిల్లల గురించి కూడా. మనం ఒకటి, వాళ్ళొకటిగా ఆలోచిస్తున్నాం. పిల్లల సంపాదన అండతో ఎంతో ధైర్యం. విశ్రాంతి లభించిన పెద్దవాళ్ళు చాలామందే వున్నారు. కానీ, ఆ విషయాన్ని అంతగా గుర్తించటం లేదు మనం.
తప్పు ఒకరిదే కాదు. అవధులు దాటిన జీవితానిది. ఎక్కడైనా, ఎవరైనా ఈ సృష్టిక్రమంలో కొంచెం అటూ ఇటూగా అందరం సమానమే. వీలున్నంతవరకూ దగ్గరగా బతకటమే... అదే ఆనందరావు గారి అంతస్సారం.

వి.రాజా రామమోహన రావు,
3-1-73/1/ఎ,
రాంశంకర్ నగర్, రామంతాపూర్,
హైదరాబాద్- 500 013.

ఇప్పుడే కాదు.. ఎప్పుడు ఆనందరావుగారి దగ్గరికి ప్రయాణమైనా ఓ చిత్రమైన ఉద్వేగం.
english title: 
a
author: 
- వి.రాజా రామమోహన రావు
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>