Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

వచ్చే ఏడాది హవాయిలో ‘ఏసియాన్’ రక్షణ మంత్రుల భేటీ

$
0
0

సింగపూర్, జూన్ 1: వచ్చే ఏడాది హవాయి దీవిలో ఆగ్నేయాసియా దేశాల రక్షణ మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అమెరికా ప్రతిపాదించింది. ఆగ్నేయాసియా ప్రాంతంపై పెరిగిపోతున్న చైనా ప్రాబల్యాన్ని ఎదుర్కొనేందుకు ఆగ్నేయాసియా దేశాలు చేస్తున్న కృషికి మద్దతుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అమెరికా ముందుకు వచ్చింది. అంతకన్నా ముందు ఈ ఏడాది తాను బ్రూనేలో జరిగే ప్రాంతీయ సమావేశంలో ఆగ్నేయాసియా దేశాల రక్షణ మంత్రులను కలుస్తానని అమెరికా రక్షణ మంత్రి చక్ హగెల్ సింగపూర్‌లో జరిగిన ఓ భద్రతా సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. ‘వచ్చే ఏడాది హవాయిలో ఏసియాన్ రక్షణ మంత్రులు కలుసుకోవడానికి ఈ వారం ఇక్కడ నేను ఆహ్వానం పలుకుతున్నాను’ అని హగెల్ చెప్పినట్లు పెంటగాన్ తెలిపింది. అమెరికా తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశం ఈ ప్రాంతానికి పటిష్ఠమైన, శాంతియుతమైన, సుభద్రమైన భవిష్యత్తును అందించడం కోసం తాము తమ అభిప్రాయాలను పంచుకోవడానికి, చర్చించడానికి మరో అవకాశాన్ని అందిస్తుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. 10 దేశాలకు సభ్యత్వం ఉన్న ఏసియాన్‌లోని సభ్య దేశాలు బ్రూనే, మలేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాంలతో పాటుగా తైవాన్‌లకు దక్షణ చైనా సముద్రానికి సంబంధించి చైనాతో అంతర్జాతీయ వివాదాలున్నాయి. లావోస్, కంబోడియా లాంటి ఏసియాన్‌లోని చిన్న సభ్య దేశాలు చైనా అందిస్తున్న విదేశీ సహాయం కారణంగా ఆర్థిక, రాజకీయ ప్రభావానికి లోనవుతున్నాయి. దక్షిణ చైనా సముద్ర జలాలతో పాటుగా దాని తీరప్రాంతంలోని భూభాగాలన్నిటిపైనా హక్కు తమదేనని చైనా చెప్పుకుంటూ ఉండడం ఈ వివాదాలకు ప్రధాన కారణం. గత ఏడాది కంబోడియాలో జరిగిన ఏసియాన్ దేశాల మహాసభలో సైతం చైనా ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపించింది.

* అమెరికా ప్రతిపాదన
english title: 
america

ఓక్లహామాలో టోర్నడో బీభత్సం.. ఏడుగురు మృతి

$
0
0

హూస్టన్, జూన్ 1: వరుసగా సంభవిస్తున్న భీకర తుపాను (టోర్నడో)లతో అమెరికా అతలాకుతలమవుతోంది. శుక్రవారం తాజాగా ఓక్లహామా నగరాన్ని ముంచెత్తిన తుపాను తల్లి, బిడ్డతో సహా ఏడుగురి ప్రాణాలను బలితీసుకుంది. కొద్ది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో సంభవించిన భారీ తుపాను దాటికి 24 మంది మృతి చెందిన విషయం విదితమే. తాజాగా శుక్రవారం మరో పెనుతుపాను ఓక్లహామా నగరంలో బీభత్సం సృష్టించిందని, కారులో ప్రయాణిస్తున్న తల్లీ, బిడ్డ సహా ఏడుగురి ప్రాణాలను ఈ తుపాను బలితీసుకుందని, మరో 14 మంది గాయపడ్డారని అమెరికా అధికారులు తెలిపారు.

వరుసగా సంభవిస్తున్న భీకర తుపాను (టోర్నడో)లతో అమెరికా
english title: 
america

నేపాల్‌లో విమాన ప్రమాదం.. ప్రయాణికులు క్షేమం

$
0
0

ఖాట్మండు, జూన్ 1: ఏడుగురు ప్రయాణికులను కలిగివున్న ఒక చిన్న విమానం నేపాల్‌లోని విమానాశ్రయంలో శనివారం ఉదయం కూలిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా తప్పించుకున్నారు. నేపాల్‌గంజ్ నుంచి బయలుదేరిన సీతా ఎయిర్ సంస్థ విమానం స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 7.10 నిముషాలకు పొగమంచు నడుమ సిమికోట్ విమానాశ్రయంలో దిగుతుండగా ఈ ప్రమాదం సంభవించిందని, ఈ విమానం రెక్కలు ఒక గోడకు తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.

ఏడుగురు ప్రయాణికులను కలిగివున్న ఒక చిన్న విమానం
english title: 
air craft

కొలువుదీరిన పాక్ కొత్త పార్లమెంట్

$
0
0

ఇస్లామాబాద్, జూన్ 1: దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత పాకిస్తాన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నవాజ్ షరీఫ్ మళ్లీ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 66 ఏళ్ల పాకిస్తాన్ చరిత్రలో తొలిసారి ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన అధికార మార్పిడిలో భాగంగా జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)కి ఎన్నికయిన మిగతా పార్లమెంటు సభ్యులతో పాటుగా షరీఫ్ శనివారం పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసారు. గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య జాతీయ అసెంబ్లీ ప్రాంగణంలో శనివారం మధ్యాహ్నం కొత్త పార్లమెంటు సభ్యుల చేత ప్రస్తుత జాతీయ అసెంబ్లీ స్పీకర్ ఫెహ్మిదా మీర్జా ప్రమాణ స్వీకారం చేయించారు. గత నెల ప్రారంభంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పిఎంఎల్-ఎన్ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకోవడం, షరీఫ్ మూడోసారి పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనుండడం తెలిసిందే.
కొత్త పార్లమెంటు తొలి సమావేశంలో పాల్గొనడం కోసం నవాజ్ షరీఫ్ తన సన్నిహిత అనుచరులతో కలిసి లాహోర్ నుంచి రావల్పిండికి విమానంలో వచ్చారు. అక్కడి నుంచి ఆయన రోడ్డుమార్గంలో ఇస్లామాబాద్ చేరుకున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న పార్లమెంటు భవనం రక్షణ కోసం వందలాది మంది సైనికులను మోహరించడంతో పాటుగా మిలిటరీ హెలికాప్టర్లు నగరంలో ఏరియల్ గస్తీ నిర్వహించాయి. తెల్లటి సల్వార్ కమీజ్, ఎర్రమట్టి రంగు కోటు ధరించిన 63 ఏళ్ల షరీఫ్ తన పార్టీ సీనియర్ నాయకుడు చౌధరి నిసార్ అలీఖాన్‌తో కలిసి ముందువరసలో కూర్చున్నారు. సభ ప్రారంభానికి గుర్తుగా ఖురాన్‌లోని కొన్ని పంక్తులను పఠించిన తర్వాత స్పీకర్ కొత్తగా ఎన్నికయిన సభ్యుల చేత ప్రమాణం చేయించారు. కొత్త స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను ఈ నెల 3న ఎన్నుకుంటారని ప్రకటించిన స్పీకర్ ఆ తర్వాత జాతీయ అసెంబ్లీ రిజిస్టర్‌లో సంతకాలు చేయాల్సిందిగా సభ్యులను ఆహ్వానించారు. కొత్త ప్రధాని ఎన్నిక ఈ నెల 5న జరగనుంది. 342 మంది సభ్యులుండే జాతీయ అసెంబ్లీలో పిఎంఎల్-ఎన్‌కు 189 మంది సభ్యుల బలం ఉన్నందున సభా నాయకుడిగా నవాజ్ షరీఫ్ ఎన్నికవుతారనేది ఎప్పుడో తెలిసిపోయింది. అంతకుముందు రావల్పిండి విమానాయ్రంలో మీడియాతో కొద్దిసేపు మాట్లాడిన షరీఫ్ గత నెల 11న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో శాంతియుతంగా అధికార మార్పిడి జరుగుతున్నందుకు సంతృప్తి వ్యక్తం చేసారు. ప్రజలకు సేవ చేసేందుకు మరోసారి అవకాశమిచ్చినందుకు ఆయన భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ప్రజాస్వామ్యబద్ధ అధికార మార్పిడులుంటాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇస్లామాబాద్ చేరుకోగానే షరీఫ్ కొత్తగా ఎన్నికయిన పిఎంఎల్-ఎన్ సభ్యులతో సమావేశమయ్యారు. 1999లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని అప్పటి ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ సైనిక తిరుగుబాటు ద్వారా గద్దె దించడం తెలిసిందే. కాగా, శనివారం నాటి పార్లమెంటు సమావేశానికి విచ్చేసిన ప్రతినిధులు, వారి అభిమానులు, ప్రముఖుల వాహనాలతో జాతీయ అసెంబ్లీ లోపల, వెలుపల ఉన్న ఖాళీ ప్రదేశమంతా నిండిపోయింది. పలువురు జర్నలిస్టులు, ప్రభుత్వ, సైనిక ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. (చిత్రం) ఇస్లామాబాద్‌లో శనివారం పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నవాజ్ షరీఫ్ తదితరులు

* సభ్యులతో ప్రమాణం చేయించిన జాతీయ అసెంబ్లీ స్పీకర్ * 3న కొత్త స్పీకర్, 5న ప్రధాని ఎన్నిక
english title: 
pak

‘స్థానిక’ రిజర్వేషన్ల జీవో విడుదల

$
0
0

హైదరాబాద్, జూన్ 1: స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం 279 జీవోను విడుదల చేసింది. ఎస్‌సిలకు 19.43 శాతం, ఎస్‌టిలకు 6.28 శాతం, బిసిలకు 39.18 శాతం చొప్పున రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఈ జీవోను వెలువరించింది.

స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ
english title: 
go issued

నక్సల్స్‌కు బెదిరేది లేదు

$
0
0

రాయపూర్, జూన్ 2: గత నెల 25న తమ పార్టీ కాన్వాయ్‌పై నక్సలైట్లు మెరుపుదాడి చేసి పలువురిని పొట్టన పెట్టుకున్నప్పటికీ ఈ దాడి జరిగిన జీరమ్ ఘాటి సమీపంలోని కేస్లుర్ గ్రామం నుంచి పరివర్తన్ యాత్రను త్వరలోనే తిరిగి ప్రారంభించాలని చత్తీస్‌గఢ్‌లోని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కాగా, నక్సల్స్ దాడిలో మృతిచెందిన రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేశ్, అసెంబ్లీలో మాజీ ప్రతిపక్ష నాయకుడు మహేంద్ర కర్మ, మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముద్లియార్ తదితరులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ నెల 6న జిల్లా ప్రధాన కేంద్రాల్లో నివాళులర్పిస్తారు. ఆ మర్నాడు అంటే జూన్ 7న బ్లాక్ ప్రధాన కేంద్రాల్లో నివాళులర్పిస్తారు. అయితే బస్తర్ డివిజన్‌లోని బస్తర్, దంతేవాడ, బీజపూర్, నారాయణ్‌పూర్, సుక్మా, కంకేర్ జిల్లాల్లో నక్సల్స్ ప్రభావిత మారుమూల గిరిజన బ్లాక్‌లలో మాత్రం ఈ నివాళి కార్యక్రమాలు ఉండవు. ‘పరివర్తన్ యాత్ర ఎక్కడయితే ఆగిపోయిందో అక్కడినుంచి మేము త్వరలోనే తిరిగి ప్రారంభించి రాష్ట్ర రాజధాని రాయపూర్‌లో ముగిస్తాం’ అని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి బికె హరిప్రసాద్ ఆదివారం విలేఖరులకు చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పరివర్తన్ ర్యాలీ గత నెల 25న జగదల్‌పూర్ జిల్లా కేస్లూర్ పట్టణానికి వెళ్తుండగా జీరమ్ వ్యాలీ వద్ద నక్సల్స్ దాడికి గురయిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 28 మంది చనిపోగా, మాజీ కేంద్ర మంత్రి విసి శుక్లా సహా మరో 36 మంది గాయపడ్డారు. ఈ ర్యాలీ తిరిగి కేస్లూర్‌నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఆదివారం ఇక్కడ జరిగిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, జిల్లా అధ్యక్షులు, బ్లాక్‌స్థాయి సభ్యులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం అనంతరం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి కూడా అయిన హరిప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు జరిగింది. నక్సల్స్ కుట్రలో కొంతమంది కాంగ్రెస్ నాయకులకు పాత్ర ఉందన్న బిజెపి ఆరోపణ గురించి అడగ్గా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతోందని, అన్ని వాస్తవాలు వెల్లడవుతాయని హరిప్రసాద్ చెప్పారు. పరివర్తన్ ర్యాలీని తిరిగి ప్రారంభించడానికి ముందే కొత్త పిసిసి అధ్యక్షుడ్ని నియమించడంపై పార్టీ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని ఏఐసిసి కోశాధికారి మోతీలాల్ వోరా చెప్పారు.

చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం
రాయపూర్‌లో నల్ల దుస్తులు ధరించి ర్యాలీ నిర్వహిస్తున్న యువజన కాంగ్రెస్ కార్యకర్తలు.

దాడి జరిగిన చోటునుంచే మళ్లీ పరివర్తన్ యాత్రకు కాంగ్రెస్ సిద్ధం
english title: 
n

ప్రత్యేక పార్లమెంటు సమావేశం అంగీకారమే

$
0
0

న్యూఢిల్లీ, జూన్ 2: ఆహార భద్రత బిల్లును ఆమోదింపజేయడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అందుకు తాము వ్యతిరేకం కాదని ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ ఆదివారం స్పష్టం చేసింది. ‘ఆహార భద్రత బిల్లుకోసం ఆర్డినెన్స్‌ను జారీ చేయడం లేదా పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని పిలవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆలాంటి ముఖ్యమైన బిల్లు విషయంలో ఆర్డినెన్స్ జారీ సరికాదు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి మేము వ్యతిరేకం కాదు’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ తన ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. అయితే అంతకన్నా మెరుగైన మార్గం ఏమిటంటే జూలైలో జరగాల్సిన పార్లమెంటు వర్షాకాల సమావేశాన్ని ముందుగా నిర్వహించడమని ఆమె అభిప్రాయ పడ్డారు. ఆహార భద్రత బిల్లు అంశంపై చర్చించడానికి యుపిఏ సమన్వయ కమిటీ సోమవారం సమావేశమవుతున్న నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి బిజెపి మద్దతు లభించడం గమనార్హం. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం అనుకుంటోంది. ఈ బిల్లును ఆమోదించడానికి ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి అంగీకరించడం ఎంతయినా ముఖ్యం. ఎందుకంటే ప్రతిపక్షాల గొడవ కారణంగా బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదింపజేసుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఆహార భద్రత బిల్లుకు ఉన్న అడ్డంకులను ఏదో విధంగా తొలగించాలని గట్టిగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని పిలిచే విషయమై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ ప్రధాన రాజకీయ పార్టీలతో చర్చలు ప్రారంభించాలని శనివారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించింది. ఒకవేళ ఆ ప్రయత్నాలు విఫలమైన పక్షంలో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని కూడా కోర్ కమిటీ నిర్ణయించింది.
కాంగ్రెస్ పార్టీ సంక్షేమ అజెండాలో అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న ఆహార భద్రత బిల్లును దేశ జనాభాలో మూడింట రెండు వంతు మందికి అతి తక్కువ ధరకే ఆహార ధాన్యాలను అందించే లక్ష్యంతో రూపొందించిన విషయం తెలిసిందే.

హెడ్లీని అప్పగించండి
అమెరికాకు భారత్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, జూన్ 2: ముంబయి తీవ్రవాద దాడుల వెనుక జరిగిన కుట్రకు సంబంధించి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు వీలుగా లష్కరే తోయిబా తీవ్రవాది డేవిడ్ హెడ్లీని ఏడాది కాలం పాటు ‘తాత్కాలికం’గా భారత్‌కు అప్పగించాలని, అలాగే అతని అనుచరుడు తహవుర్ హుస్సేన్‌ను కూడా తమకు అప్పగించాలని అమెరికాకు భారత్ విజ్ఞప్తి చేసింది. పాకిస్తానీ అమెరికన్ తీవ్రవాది హెడ్లీని అప్పగించలేమని అమెరికా పేర్కొనడంతో అతనిని ప్రశ్నించేందుకు భారత్ తాజాగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే హెడ్లీని ఏడాది కాలం పాటు ‘తాత్కాలికం’గా తమకు అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఇండో-అమెరికా అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలపై గత నెల 20 నుంచి 22వ తేదీ వరకూ వాషింగ్టన్‌లో జరిగిన చర్చల్లో భారత్ ఈ విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిని కూలంకషంగా పరిశీలిస్తామని అమెరికా అధికారులు హామీ ఇచ్చినట్టు ఈ సమావేశంలో పాల్గొన్న భారత ఉన్నతాధికారి ఒకరు పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. 26/11 దాడులకు ముందు ముంబయిలో రెక్కీ నిర్వహించడంలో హెడ్లీకి సహకరించిన పాకిస్తానీ-కెనడియన్ తీవ్రవాది తహవుర్ హుస్సేన్ రాణాను భారత్‌కు అప్పగించే విషయాన్ని కూడా సానుకూలంగా పరిశీలిస్తామని అమెరికా హామీ ఇచ్చినట్టు ఆ అధికారి తెలిపారు. ముంబయి తీవ్రవాద దాడుల విషయమై భారత దర్యాప్తు అధికారులు ఇంతకుముందు హెడ్లీని ఒకసారి ప్రశ్నించిన విషయం విదితమే. అయితే ఈ దాడులకు సంబంధించి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు అతడిని తమకు అప్పగించాలని భారత్ పదేపదే వత్తిడి తీసుకురావడంతో హెడ్లీని మరోసారి ప్రశ్నించేందుకు వీలు కల్పిస్తామని అమెరికా అధికారులు హామీ ఇచ్చినట్టు ఆ అధికారి తెలిపారు. అయితే తహవుర్ రాణాను ప్రశ్నించేందుకు మాత్రం అమెరికా అధికారులు ఇప్పటివరకూ అవకాశం కల్పించలేదు. హెడ్లీకి అత్యంత సన్నిహిత అనుచరుడైన రాణాను ప్రశ్నించగలిగితే ముంబయి దాడుల వెనుక కుట్రకు సంబంధించి మరింత సమాచారం లభిస్తుందని భారత దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

ఆహార భద్రత బిల్లుపై బిజెపి
english title: 
p

న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వానికీ పాత్ర!

$
0
0

న్యూఢిల్లీ, జూన్ 2: సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకానికి గత రెండు దశాబ్దాలుగా అనుసరిస్తున్న కొలీజియం స్థానంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా పట్టు ఉండే జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ (జెఎసి) ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ జెఎసి ఏర్పాటు ప్రతిపాదనను అతి త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందు ఉంచబోతున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ తెలిపారు. ఒకసారి ఈ ప్రతిపాదన ఆమోదం పొంది కొత్త వ్యవస్థ అమలులోకి వస్తే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వానికి కూడా తన వాదన, అభిప్రాయం వినిపించే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. ప్రస్తుతం అమలులో ఉన్న కొలీజియం వ్యవస్థ ప్రభుత్వం ఆశించిన మేర ఫలితాలను ఇవ్వలేదని, అందువల్ల న్యాయమూర్తుల నియామకానికి తీసుకునే నిర్ణయాల్లో ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉండాలని ఆయన పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ ఆశించిన స్థాయిలో కూడా ఈ కొలీజియం విధానం పనిచేయలేదని తాను భావిస్తున్నట్లు ఆయన ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. గత నెలలో కొత్తగా న్యాయ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన సిబల్ కొలీజియం వ్యవస్థ స్థానంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడాన్ని సమర్థించుకున్నారు. మంచి వ్యక్తులు న్యాయమూర్తులుగా ఉండాలనేదే ఇటు ప్రభుత్వ, అటు న్యాయ వ్యవస్థ ధ్యేయమని పేర్కొన్నారు. న్యాయమూర్తుల నియామకం పూర్తి స్థాయి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, విస్తృత స్థాయి సంప్రదింపులతో జరగాలని ఆయన స్పష్టం చేశారు.
‘ఉన్నత న్యాయస్థానాల (సుప్రీంకోర్టు, 24 హైకోర్టులు) న్యాయమూర్తుల నియామకంలో కేవలం న్యాయమూర్తులకే పూర్తి అధికారాలు కాకుండా ప్రభుత్వానికి కూడా సమాన అవకాశాలు ఉండాలి. ఉన్నత న్యాయ స్థానాల న్యాయమూర్తుల నియామకంలో ఇద్దరికీ (ప్రభుత్వం, న్యాయమూర్తులు) భాగస్వామ్యం ఉంటే ఇద్దరు సంప్రదించుకోవడం తప్పనిసరి అవుతుంది. న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వానికి తన వాదన వినిపించే అవకాశం ఉండి తీరాలి’ అని సిబల్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న కొలీజియం వ్యవస్థను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆల్తమస్ కబీర్ ఇటీవల గట్టిగా సమర్థించిన విషయం తెలిసిందే. అయితే కొలీజియం వ్యవస్థను మార్చే ప్రతిపాదన పట్ల న్యాయ వ్యవస్థ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల గురించి ప్రస్తావించగా, న్యాయ వ్యవస్థ అభిప్రాయాలు తమకు తెలుసని, వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని సిబల్ బదులిచ్చారు.
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఆరుగురు సభ్యుల జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రభుత్వ ప్రతినిధిగా ఈ కమిషన్‌లో ఉంటారు. ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇందులో ఉంటారు. మరో ఇద్దరు న్యాయకోవిదులను ఈ కమిషన్ సభ్యులుగా రాష్టప్రతి నామినేట్ చేస్తారు. ఈ ఆరుగురు సభ్యుల జెఎసి ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకాన్ని చేపడుతుంది. ప్రతిపక్ష నాయకుడిని కూడా ఈ జెఎసిలోకి తీసుకోవడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్న కొలీజియం వ్యవస్థ స్థానంలో జెఎసిని ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో, మరో నలుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులతో కూడిన అయిదుగురు సభ్యుల కొలీజియం ప్రస్తుతం ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులను నియమిస్తోంది. 1993 తరువాత ఈ కొలీజియం వ్యవస్థ అమలులోకి వచ్చింది. అంతకుముందు ప్రభుత్వమే ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులను నియమించేది.
ఏప్రిల్ 18న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఎజెండాలో ఈ జెఎసి ఏర్పాటు ప్రతిపాదనను చేర్చినప్పటికీ, కేబినెట్ దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోలేదు. జ్యుడీషియల్ స్టాండర్డ్స్ అకౌంటబిలిటీ బిల్లు సహా న్యాయ మంత్రిత్వ శాఖకు సంబంధించి పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ ఆమోదింపచేయడానికి తాను కృషి చేస్తానని సిబల్ తెలిపారు.

సిబిఐకి స్వయంప్రతిపత్తిపై
బిల్లుకు కేంద్రం విముఖత?

న్యూఢిల్లీ, జూన్ 2: సిబిఐపై పట్టును వదులుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతమాత్రం సుముఖంగా లేదు. స్వేచ్ఛాయుతంగా దర్యాప్తు చేసేందుకు కొత్త బిల్లును తీసుకురావాలన్న ఆలోచనను కూడా పక్కన పెడుతున్నట్టు తెలుస్తోంది. అయితే డిపిఎస్‌ఇ చట్టంలో స్వల్ప మార్పులకు మంత్రుల బృందం సానుకూలంగా ఉన్నట్టు తాజా పరిణామాలు బట్టి తెలుస్తోంది. ఇప్పటివరకూ మంత్రుల బృందం రెండుసార్లు సమావేశం అయినప్పటికీ సిబిఐపై పూర్తిగా పట్టును వదులుకునే విషయంలో అంత సుముఖతను వ్యక్తం చేసిన సందర్భమేమీ లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఢిల్లీ ప్రత్యేక పోలీస్ వ్యవస్థ (డిఎస్‌పిఇ) చట్టంలో మార్పుల ప్రతిపాదనలకు సంబంధించి సుప్రీం కోర్టులో దాఖలు చేసేందుకు ఓ అఫిడవిట్‌ను సిద్ధం చేయాలని అటార్నీ జనరల్ వాహనవతిని మంత్రుల బృందం కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం డిఎస్‌పిఇ చట్ట నిబంధనల ప్రకారమే సిబిఐ పని చేస్తుంది. అంటే, ఈ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసే నేరాలను మాత్రమే సిబిఐ దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అయితే తాజాగా ప్రతిపాదిస్తున్న బిల్లు ద్వారా సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండానే వివిధ కేసులను దర్యాప్తు చేసే అధికారం లభిస్తుంది. దేశంలో నేరాల స్వభావం తీవ్రతలో మార్పులు వస్తున్నందున డిఎస్‌పిఇ చట్టం ఎంతమాత్రం ఉపకరించటం లేదని 2010లో సిబిఐ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ విషయంలో ఓ బిల్లును కూడా సమర్పించింది. ఇందులో సిబిఐ దర్యాప్తు పరిశీలనాంశాలు, డైరెక్టర్ ఎంపిక వ్యవహారం, సంస్థాగత వ్యవహారం, అధికారాల విస్తృతి, రాష్ట్రాలపై సిబిఐ పాత్ర మొదలైన వాటిని నిర్వచించింది. అయితే డిఎస్‌పిఇ చట్టంలో ఈ రకమైన మార్పులు చేయడానికి కేంద్రం సుముఖంగా లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మార్పులకు బదులుగా సిబిఐ డైరెక్టర్‌కు ఆర్థికపరమైన అటార్నీని కల్పించే దిశగా సిఫార్సులు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారం అతిచిన్న ఖర్చుకు సంబంధించి కూడా సిబ్బంది మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇటీవల జరిగిన మంత్రుల బృందం సమావేశంలో సిబిఐకి సంబంధించి న్యాయవ్యవస్థ ప్రభుత్వాన్ని ఎంతమాత్రం శాసించజాలదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ విషయంలో డిఎస్‌పిఇ చట్టంలో స్వల్పమార్పులు తెస్తే సరిపోతుందన్న వాదన వినిపించింది.

కొలీజియం స్థానంలో జెఎసి త్వరలో కేబినెట్ ముందుకు ప్రతిపాదన కేంద్ర మంత్రి కపిల్ సిబల్ వెల్లడి
english title: 
n

తెలుగు అకాడమీకి కొత్త హంగులు

$
0
0

హైదరాబాద్, జూన్ 2: తెలుగు అకాడమి రూపురేఖలు మారబోతున్నాయి. అకాడమికి సొంత భవన నిర్మాణంతో పాటు అనేక కొత్త చర్యలు చేపట్టడంతో విస్తృత వ్యాప్తితో దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని తెలుగు వారికి సైతం సేవలు అందించే స్థాయికి ఎదగబోతోంది. తెలుగు అకాడమిలో కొత్తగా రెండు విభాగాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో నాలుగు అకాడమి కేంద్రాలను నెలకొల్పుతారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న శబ్దసాగరం, తెలుగు మహానిఘంటువు రూపకల్పనకు మళ్లీ ఏర్పాట్లు మొదలయ్యాయి. తెలుగు అకాడమికి సొంత భవనాన్ని 20 కోట్ల రూపాయిలతో చేపట్టాలని అకాడమి కౌన్సిల్ నిర్ణయించింది. ఇందుకు బడ్జెట్ కూడా కేటాయించారు. స్థలాన్ని ఖరారు చేయడంతో పాటు భవనాన్ని నిర్మించేందుకు అకాడమి కౌన్సిల్ కూడా తీర్మానం చేసింది. ఉస్మానియా యూనివర్శిటీలో ఐదు ఎకరాల స్థలాన్ని గుర్తించినా, ఈ మేరకు ఉస్మానియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా తీర్మానం చేయాల్సి ఉంది. రానున్న రోజుల్లో అకాడమిలో అనువాద విభాగాన్ని, పత్రికా విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ రెండు విభాగాలకు ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రస్తుత కేంద్ర కార్యాలయంలోని ప్రాంతీయ కార్యాలయాన్ని వేరే భవనానికి తరలిస్తారు. పత్రికా విభాగానికి త్వరలోనే ప్రసిద్థి చెందిన సంపాదకులతో కమిటీని నియమిస్తామని అకాడమి సంచాలకుడు ఆచార్య కె. యాదగిరి చెప్పారు. అకాడమి తరఫున భాష, సాహిత్యం, వైజ్ఞానిక శాస్త్రాలపై మూడు ప్రత్యేక సంచికలను తీసుకువస్తామని, ఈ మూడు సంచికలు రాష్ట్రంలోని ప్రతి విద్యార్ధికీ రిఫరెన్స్ పుస్తకంగా ఉంటుందని అన్నారు. తెలుగు మాద్యమంలోనే అన్ని అంశాలపైనా పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ పత్రికలను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. విషయ నిపుణులతో అనేక అంశాలపై వ్యాసాలు రాయిస్తామని యాదగిరి పేర్కొన్నారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న మహానిఘంటు నిర్మాణం, శబ్దసాగరం రూపకల్పనకు సైతం చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. నిఘంటు నిర్మాణ కమిటీకి సైతం ఒక కమిటీని నియమిస్తామని, దేశంలో కన్నడ భాషకు మహా సమగ్ర నిఘంటువు అందుబాటులో ఉందని, అలాగే తెలుగులో తీసుకువచ్చి, కొత్తగా వచ్చిన ప్రతి పదాన్ని ఈ నిఘంటువులో చేర్చేలా చర్యలు చేపట్టాల్సి ఉందని ప్రొఫెసర్ యాదగిరి పేర్కొన్నారు. అలాగే తెలుగు పదాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు స్థిరీకరించేందుకు ఆధునిక వ్యవహార పదకోశాన్ని రూపొందించాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎంత మంది ఉన్నారనేది ఇంత వరకూ స్పష్టమైన సమాచారం లేదని తెలుగు వారిని గుర్తించేందుకు భాషా సర్వే జరగాల్సి ఉందని తెలిపారు. తెలుగు వారైనా తెలుగు వచ్చిన వారు, తెలుగు రాని వారు ఎంత మంది ఉన్నారో తెలియని పరిస్థితిలో తెలుగు అకాడమిలో ఉన్న ప్రత్యేక విభాగం ఈ గుర్తింపు కార్యక్రమాన్ని ఎట్టకేలకు ప్రారంభించింది.
ఇతర రాష్ట్రాల్లో చెన్నై, బెంగలూరు, ముంబై, ఢిల్లీ పట్టణాల్లో నాలుగు అకాడమి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి భాష సాహిత్యం, సాస్కృంతిక పరిచయాన్ని, అందుకు సంబంధించిన గ్రంథాలను అందించేందుకు తెలుగు అకాడమి పెద్ద ఎత్తున కృషి చేస్తోంది. అకాడమి స్థాపించినపుడు అనేక ఉన్నత లక్ష్యాలను రూపొందించుకున్నా, అవి నెరవేర్చేందుకు ఇంత వరకూ పెద్ద ప్రయత్నం ఏమీ జరగలేదు. నిజానికి అన్ని యూనివర్శిటీలకు పాఠ్యగ్రంథాలను, జనరంజక గ్రంథాలను అందిస్తూ, వనరుల కేంద్రంగా తెలుగు అకాడమి ఉపయోగపడుతోంది. విశ్వవిద్యాలయాల పరిపాలనా విద్యాత్మక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఉన్నత విద్యామండలి స్థాయిలోనే అకాడమి సైతం పనిచేస్తున్నా దానికి విశిష్ట విద్యా విజ్ఞాన కేంద్రంగా హోదా కల్పించకపోవడంతో లక్ష్యాలు దెబ్బతింటున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలను కూడా అకాడమి పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉంది. జాతి వికసించాలన్నా, దేశం, ప్రపంచం వికసించాలన్నా భాషా వికాసం అనివార్యం అనే భావనతోనే తెలుగు అకాడమికి కొత్త కార్యక్రమాలు రూపొందించామని యాదగిరి వ్యాఖ్యానించారు.

ధర్మానే రాజకీయ
గురువు: కొండ్రు
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జూన్ 2: జిల్లా కాంగ్రెస్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావే నా రాజకీయ గురువని రాష్ట్ర వైద్యవిద్య, 104, 108 శాఖామంత్రి కొండ్రు మురళీమోహన్ స్పష్టం చేశారు. శ్రీకాకుళంలోని ధర్మానను కలిసేందుకు ఆయన క్యాంపు కార్యాలయానికి ఆదివారం విచ్చేసిన మంత్రి కొండ్రు విలేఖరులతో మాట్లాడారు. రాజకీయ నేతలకు గతి నిర్దేశికుడని, కాంగ్రెస్ పార్టీకి తత్వవేత్త వంటి అనుభవం ఉన్న ధర్మాన అడుగుజాడల్లోనే పార్టీ శ్రేణులు పయనిస్తాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏ బాధ్యతలు అప్పగించినా సమర్ధవంతంగా పనిచేస్తానని స్పష్టంచేశారు. జిల్లా వైద్య రంగాన్ని విస్తృతంగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. రిమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి కావాల్సిన నిధులు కేటాయింపులో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తానని పేర్కొన్నారు. డిఎల్ బర్త్ఫ్ విషయమై మీ అభిప్రాయం ఏంటని మీడియాప్రతినిధులు ప్రశ్నించగా ఆ వ్యవహారంపై మాట్లాడేంత పెద్దవాడిని కాదని బదులిచ్చారు. ధర్మానను కలవడంలో రాజకీయ ప్రాధాన్యత ఉందా అన్న ప్రశ్నకు కూడా పదవులు ముఖ్యం కాదని, తాను ఈ స్థాయిలో ఉండటానికి ధర్మానే కారణమన్నారు.
జగన్ రాజకీయాలకు కిరణ్ మద్దతు: టిడిపి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 2: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలులో నుంచి సాగిస్తున్న రాజకీయ కార్యకలాపాలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మద్దతు ఉందని టిడిపి ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు ఆరోపించారు. మంత్రులు, అధికారులు, ముఖ్యమంత్రి అండ లేనిదే జైలులో జగన్ వ్యవహారాలు సాగుతున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. జైలులో నీలి చిత్రాలు చూస్తున్నారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శిలు చేశారు, దానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు. అనంతరం జైళ్ల శాఖ డిజి చంద్రబాబు ఆరోపణలను ఖండించారు. ఈ వ్యవహారంపై మండవ వెంకటేశ్వరరావు ఆదివారం ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ జగన్ జైలులో రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నారా? లేదా? అనే దానిపై జైళ్ల శాఖ డిజి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జైలులో జగన్ ములాఖత్‌ల గురించి టిడిపి నేత యనమల రామకృష్ణుడు సమాచార హక్కు చట్టం ప్రకారం వివరాలు కోరితే కొన్ని వివరాలు మాత్రమే ఇచ్చారని, బినామీ ములాఖత్‌ల గురించి వివరాలు ఇవ్వలేదని తెలిపారు. జగన్‌ను పరోక్షంగా ముఖ్యమంత్రి కిరణ్ రక్షిస్తున్నారని ఆరోపించారు. జైలు నిబంధనలకు వ్యతిరేకంగా చంచల్‌గూడ జైలులో వ్యవహారాలు సాగుతున్నాయని, ప్రభుత్వం అండతోనే ఇది సాగుతోందని మండవ వెంకటేశ్వరరావు ఆరోపించారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం
యర్రగుంట్ల, జూన్ 2: కడప వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లకు సమీపంలోని కడప, తాడిపత్రి రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దంపతుల సహా నలుగురు మృతి చెందారు. పదేళ్ల పాపతోపాటు ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో జువారీ సిమెంట్ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్‌గా పని చేస్తున్న జి సూర్యనారాయణ (52), ఆయన భార్య మురళీకుమారి (46), కమలాపురం పట్టణానికి చెందిన వెంకట సుబ్బయ్య (46), ఎర్రగుంట్లకు చెందిన ఆటో డ్రైవర్ మక్బూల్ (35) ఉన్నారు. సూర్యనారాయణరెడ్డి భార్య, మనుమరాలితో కలిసి కడప నగరంలోని ఓ ఇంజనీరు వీడ్కోలు సభకు వెళ్లి తిరిగి ఆటోలో వస్తుండగా ఎదురుగా వస్తున్న డీజల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ సంఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా వారితోపాటు ఆటోలో ఉన్న సూర్యనారాయణరెడ్డి మనుమరాలు స్నేహ, మరో ప్రయాణికుడు బుజ్జి గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సిఐ రామకృష్ణుడు ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రూ.2 కోట్లతో మహిళ పరార్
డిఎస్పీని ఆశ్రయించిన చీటీల బాధితులు
ఆత్మకూరు, జూన్ 2: పురపాలక సంఘం పరిధిలో ఓ మహిళ చీటీల పేరుతో ప్రజలను మోసం చేసి రెండు కోట్ల రూపాయలతో పరారైనట్లు బాధితులు ఆదివారం ఆత్మకూరు డీఎస్పీ రాజామహేంద్రనాయక్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు పంటవీధికి చెందిన ఓ మహిళ చీటీల పేరుతో 5వేల నుంచి 5 లక్షల రూపాయల వరకు నెలసరి చీటీ పాటల పేరుతో మోసం చేసిందని బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. బినామీ పేర్లతో చీటీపాటలతో మోసం చేసిందని బాధితులు తెలిపారు. ఈమేరకు తమకు న్యాయం చేయాలని బాధితులంతా డీఎస్పీకి వినతి పత్రం అందచేశారు.

నేడు రాజ్‌నాథ్ రాక
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 2: గత పది సంవత్సరాలుగా వాడిపోయిన కమలం వికసిస్తోంది. టిడిపి కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంతంలో పుంజుకుంటోంది. సీనియర్ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి సోమవారం ఇక్కడ నిజాం కాలేజీలో తెలంగాణ ఆత్మగౌరవ సభలో బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్‌సింగ్ ఆధ్వర్యంలో బిజెపిలో చేరనున్నారు. రాజ్‌నాథ్ సోమవారం ఉదయం 11.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీగా రాష్ట్ర బిజెపి కార్యాలయానికి చేరుకుంటారు. సాయంత్రం నిజాం కాలేజీలో జరిగే తెలంగాణ ఆత్మగౌరవ సభలో ప్రసంగిస్తారు. నాగం జనార్దన్ రెడ్డి బిజెపిలో చేరడం ద్వారా కాంగ్రెస్, టిఆర్‌ఎస్, టిడిపిలో నిరాశానిస్పృహలకు గురైన పలుకుబడి ఉన్న నేతలు బిజెపిలో చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు ఆ పార్టీని వీడిన నేపథ్యంలో త్వరలోనే టి అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటామని గులాం నబీ ఆజాద్ చేసిన ప్రకటన బూటకమని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు ఈ ప్రకటనను నమ్మేందుకు సిద్ధంగా లేరన్నారు. ఆహార భద్రత బిల్లు కోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్న యుపిఐ ప్రభుత్వం, అదే సమావేశాల్లో తెలంగాణ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టరాదని డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో మతపరమైనరిజర్వేషన్ల విధానాన్ని ప్రవేశపెట్టరాదని ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. బిసి ఇ కేటగిరీలో ఉన్న ముస్లింలకు విద్య, ఉపాధి అవకాశాలకే రిజర్వేషన్లు పరిమితమన్నారు. రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు.

దేశాన్ని మతపరంగా విడదీయడం వాంఛనీయం కాదన్నారు. పైగా బిసిల కోటా తగ్గిపోతుందన్నారు. విద్య, ఉపాధికి మాత్రం ముస్లింలకు రిజర్వేషన్లు అనుమతిస్తామని గతంలో ప్రభుత్వమే స్పష్టం చేసిందన్నారు.

తెలంగాణకు సిఎం
మోత్కుపల్లి లేదా రత్నం
బాబు అంగీకరించాడన్న
ప్రజా సంఘాల జెఎసి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే టిడిపి శాసనసభాపక్షం ఉప నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు లేదా కెఎస్ రత్నంను ముఖ్యమంత్రిని చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అంగీకరించారని తెలంగాణ ప్రజా సంఘాల జెఎసి అధ్యక్షుడు గజ్జెల కాంతం తెలిపారు. గజ్జెల కాంతం నాయకత్వంలో ప్రజా సంఘాల జెఎసి నాయకులు ఆదివారం చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలిశారు. తెలంగాణపై మహానాడులో మరోసారి తీర్మానం చేసినందుకు అభినందనలు తెలిపారు. తెలంగాణలో దొరల రాజ్యం కోసం కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ దొరల రాజ్యం తీసుకు రానివ్వమని ప్రజాసంఘాల నాయకులు చంద్రబాబుకు తెలిపారు. సామాజిక తెలంగాణకు టిడిపి కట్టుబడి ఉన్నందున టిడిపికే మా మద్దతు అని అన్నారు. కెసిఆర్ నిజమైన ఉద్యమకారులను విస్మరించి డబ్బున్న వారికే టికెట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌లు ఏకమై ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.

పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే టిడిపి ఎంపిలంతా అనుకూలంగా ఓటు వేస్తారని చంద్రబాబు వెల్లడించినట్టు చెప్పారు. 2014లో టిడిపి అధికారంలోకి వస్తే అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం చేసేందుకు అంగీకరించినట్టు చెప్పారు. తెలంగాణ ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి కావాలని, మోత్కుపల్లి నర్సింహులు లేదా కెఎస్ రత్నంను ముఖ్యమంత్రిని చేయనున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారని కాంతం తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై
శే్వతపత్రాన్ని ప్రకటించండి
ముఖ్యమంత్రి కిరణ్‌కు దత్తాత్రేయ బహిరంగ లేఖ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 2: రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని, ఆర్థిక పరిస్థితిపై శే్వతపత్రాన్ని ప్రకటించాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు బండారు దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రణాళిక సంఘం సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ అంకెలను తారుమారు చేసి రాష్ట్రంలో అభివృద్ధి గొప్పగా ఉందని పేర్కొన్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశం మొత్తం మీద ఐదవ స్ధానంలో ఉందని, వృద్ధిరేటు జాతీయ స్ధానంలో 8.18 శాతం ఉందని, జాతీయ స్ధాయి వృద్ధిరేటు కంటే ఎక్కువగా ఉందని పేర్కొనడం సబబుకాదన్నారు. ఒక రాష్ట్ర వృద్ధిరేటు జాతీయ స్ధాయితో పోల్చరాదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. జాతీయ స్ధాయి ధరల సూచిక కంటే ఇది ఎక్కువన్నారు. విద్యుత్ సంక్షోభం వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డయన్నారు. పరిశ్రమలు రుణాలు చెల్లించలేకపోతున్నాయన్నారు. గత రెండేళ్లలో ఒక మెగావాట్ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయలేకపోయామన్నారు. ఆర్‌బిఐ అంచనా ప్రకారం 15 నుంచి 20 శాతం చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. 30 లక్షల మంది ఉద్యోగులు రోడ్డునపడ్డారన్నారు. కొత్త పరిశ్రమలు రాలేదన్నారు. రుణాలను రీషెడ్యూల్ చేయాలని బ్యాంకులను ప్రభుత్వం కోరాలన్నారు. ఐదు వేల కి.మీ పొడువున ఆర్‌బి రోడ్లను అభివృద్ధి చేయలన్నారు. ఆర్టీసి యాజమాన్యం విద్యార్ధుల బస్ పాస్‌ల రేట్లను కూడా పెంచిందన్నారు.

తెలంగాణ ఏర్పాటుకు సంకేతాలు: పాల్వాయ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడానికి తమ పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకుంటున్నట్లు తనకు సంకేతాలు ఉన్నాయని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు పార్టీలో సామరస్యపూర్వక వాతావరణం కల్పించేందుకు యత్నిస్తున్నట్లు కనిపిస్తున్నదని ఆయన ఆదివారం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. వచ్చే నెల 5 నుంచి జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని అధిష్ఠానం భావిస్తున్నదని ఆయన తెలిపారు. సోమవారం జరగబోయే యుపిఎ స్టీరింగ్ కమిటీ సమావేశంలోనూ తెలంగాణ అంశంపై చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సీమాంధ్రలో కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లింది వాస్తవమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని పార్టీ అధిష్ఠానం ప్రకటిస్తే తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ బలపడుతుందని ఆయన చెప్పారు. లేకపోతే టిఆర్‌ఎస్ టిఆర్‌ఎస్ బలపడుతుందని ఆయన అన్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీలు టిఆర్‌ఎస్‌లో చేరడం తొందరపాటు చర్య అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇసికి కార్యదర్శిని ఇవ్వరా?

సిఎం నిర్లక్ష్యమా? ప్రధాన కార్యదర్శి నిర్లక్ష్యమా?
ఎస్‌ఇసి కోర్టులో ఎన్నికల బంతి
జాబితా రాగానే సన్నాహాలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 2: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికపై జరుగుతున్న వేళ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కార్యదర్శిని ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. కార్యదర్శి లేకపోవడం వల్ల ఎన్నికల ఏర్పాట్లలో కమిషన్‌కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కమిషన్‌కు కార్యదర్శిని నియమించకపోవడం ముఖ్యమంత్రి నిర్లక్ష్యమా? లేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్లక్ష్యమా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కమిషన్‌కు కార్యదర్శిని ఇవ్వటం లేదేమోనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 300 మంది వరకు ఐఎఎస్ అధికారులు వివిధ పదవుల్లో ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పి. రమాకాంత్ రెడ్డి గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న పి.కె. మహంతితో సహా ముఖ్యమంత్రి కార్యాలయంలో, జిఎడిలో పనిచేస్తున్న సీనియర్ ఐఎస్ అధికారులంతా రమాకాంతరెడ్డి కింద పని చేసిన వారే. ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌గా పని చేస్తున్న రాంగోపాల్ గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో కార్యదర్శిగా పని చేశారు. రాంగోపాల్‌ను 2012 జనవరిలో ఎన్నికల కమిషన్ కార్యదర్శి బాధ్యతల నుండి తప్పించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ కార్యదర్శి పోస్టు ఖాళీగానే ఉంది. జిల్లా కలెక్టర్‌గా పని చేసి, ప్రభుత్వంలో కమిషనర్‌గా పని చేస్తున్న సీనియర్ ఐఎఎస్ అధికారిని లేదా అందుకు సమాన హోదా కలిగిన ఐఎఎస్ అధికారిని కమిషన్ కార్యదర్శిగా నియమించాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ ప్రతి రోజూ జిల్లా కలెక్టర్లతో కమిషన్ కార్యదర్శి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మాట్లాడుతూ ఉండాలి. ఈ కారణంగానే జిల్లా కలెక్టర్ స్థాయి కన్నా హెచ్చుస్థాయి కలిగిన ఐఎఎస్ అధికారిని మాత్రమే కమిషన్ కార్యదర్శిగా నియమించాల్సి ఉంటుంది. కమిషన్ కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉన్న విషయాన్ని ఇప్పటికే అనేక పర్యాయాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి తెలియచేసిందని. అయినప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన కానరావడం లేదని తెలిసింది.
పంచాయతీరాజ్ శాఖలో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయి, ఈ జాబితా ఎన్నికల కమిషన్‌కు అందిన తర్వాత 18 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏప్రిల్-మే నెలల్లో పర్యటించి, ప్రాంతీయ సమావేశాలను ఏర్పాటు చేసి అన్ని జిల్లాల యంత్రాంగాలతో ఎన్నికల ఏర్పాట్లపై సవివరంగా చర్చించారు. గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లాపరిషత్‌లకు నిర్వహించాల్సిన ఎన్నికల ఏర్పాట్లకు సమాయత్తం అయ్యారు. ప్రభుత్వం తాజాగా పంచాయతీ సంస్థలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టింది. ఏ ఏ స్థాయిలలో ఎంత మేరకు రిజర్వేషన్లు ఉండాలో ఉత్తర్వులు జారీ చేసింది.
గుర్తించాల్సిన స్థానాలు
రిజర్వేషన్లు ఎంత మేరకు ఉండాలో ప్రభుత్వం ప్రకటించింది కాని, ఏ ఏ స్థానాలు ఎవరెవరికి రిజర్వ్ చేయాలో నిర్ణయించలేదు. 22 జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాల్లో 13 లేదా 14 స్థానాలను ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు రిజర్వ్ చేసే అవకాశం ఉంది. అలాగే మొత్తం మండలపరిషత్ అధ్యక్ష స్థానాల్లో 680 స్థానాలు ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు రిజర్వ్ అయ్యే అవకాశాలున్నాయి. ఏయే స్థానాలను ఏయే తెగలకు రిజర్వ్ చేస్తారో గుర్తించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ నెల 9 వరకు ఈ ప్రక్రియ పూర్తి కావచ్చని, ఆ తర్వాత ఈ జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. జూలై 5వ తేదీ తర్వాత దశల వారీగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

గల్ఫ్‌లో తెలుగువారి తిప్పలు

ఉద్యోగ రిజర్వేషన్లతో రెండు లక్షల మంది వెనక్కి జూలై 3 చివరి గడువుగా ప్రకటన

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 2: గల్ఫ్ దేశాలు ఇకమీదట ఉద్యోగ నియామకాల్లో తమ దేశాలకు చెందిన నిరుద్యోగులకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వబోతున్నాయి. ప్రతి పదిమంది వలస ఉద్యోగుల్లో ఒక్కరికైనా స్వదేశానికి చెందిన నిరుద్యోగికి ఉద్యోగం కల్పించే విధంగా రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయబోతున్నాయి. ఫలితంగా మన దేశం నుంచి వలస వెళ్ళిన నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్యోగాల కోసం వలస వస్తున్న వారితో గల్ఫ్ దేశాలు భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని రాబట్టుకుంటున్నప్పటికీ, వలస వస్తున్న వారితో స్వదేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతున్నదని ఆ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో తమ దేశాల్లోని యువతకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నాయి. ఫలితంగా మన దేశం నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిన వారు వెనుదిరగాల్సి వస్తున్నది. రాష్ట్రానికి చెందిన సుమారు రెండు లక్షల మంది తెలుగువారు ఇంటి బాట పట్టనున్నారు. అప్పులు చేసి ఉద్యోగాల కోసం గల్ఫ్‌కు వెళ్ళిన వారు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉపాధి, ఉద్యోగాల కోసం గల్ఫ్ వెళ్ళిన తెలుగువారికి రానున్న రోజులు కష్టకాలంగా మారనున్నాయి. గల్ఫ్ దేశాలకు చెందిన యువతకు ఉద్యోగాల రిజర్వేషన్ ఉండాలని అక్కడి పాలకులు ప్రకటించడంతో తెలుగువారు అయోమయంలో పడ్డారు. ఏ కంపెనీలో అయినా ప్రతి పది మందిలో గల్ఫ్ దేశానికి చెందిన ఒక వ్యక్తి ఉండాలని ప్రభుత్వాలు ప్రకటించాయి. దీంతో ఎక్కడ తమ ఉపాధి, ఉద్యోగాలు పోతాయోనని తెలుగువారు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం అక్కడ యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రభుత్వాలపై తిరుగుబాటుకు దిగుతారని ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడి యువతకు ప్రత్యేకంగా ఉద్యోగాల్లో ఎలాంటి రిజర్వేషన్ ఉండకపోవడం గమనార్హం. గల్ఫ్‌కు చెందిన ఆరు దేశాల్లో లక్షలాది మంది తెలుగువారు ఉన్నారు. జూలై 3వ తేదీ నాటికి ఉద్యోగాలకు సంబంధించిన పరిశీలన పూర్తి అవుతుందని ప్రోటోకాల్ అధికారి రమణారెడ్డి ఆంధ్రభూమి ప్రతినిధికి వివరించారు. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో మూడు కేటగిరీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కూలీలుగా పనిచేసే వారిని మొదటి కేటగిరీలో ఉంచారు. వివిధ రంగాల్లో వృత్తిలో ప్రావీణ్యం ఉన్న వారిని రెండవ కేటగిరీలో చేర్చారు. ఇక మూడవ కేటగిరీలో డాక్టర్లు, ఇంజనీర్లు, మేనేజర్లు, అకౌంట్ ఆఫీసర్లు జాబితాలో చేర్చారు. తెలుగుభాష మాత్రమే వచ్చిన వారిని భవన నిర్మాణ రంగాల్లోకి తీసుకుంటారు. తాపీ మేస్ర్తిలు, ప్లంబర్లు, స్వీపర్స్, మహిళలు అయితే ఇంటిపనిలో పెట్టుకుంటారు. రెండవ కేటగిరీలో డ్రైవర్లు, సెక్యూరిటి గార్డ్స్, మెకానికల్, కంప్యూటర్స్ ఆపరేటర్స్, షాపు క్లీనర్స్, ఎసి మెకానిక్ విభాగాల్లో చేర్చుకుంటారు. ఇక మూడవ కేటగిరీలో డాక్టర్లు, ఇంజనీర్లు, మేనేజర్లు, అకౌంట్‌కు చెందిన విభాగాల్లో ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తారు. గల్ఫ్‌కు వెళుతున్న వారిలో ఎక్కవమంది ఉపాధి కోసం పరుగులు తీస్తారు. 20-40 మధ్య వయసుల వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ వయసులో ఉన్న వ్యక్తులు చురుకుగా పని చేస్తున్నందున వారితో ఎక్కువ పనులు చేయించుకుంటారు. మూడవ కేటగిరిలో వివిధ రంగాల్లో అనుభవం ఉన్నందున వారికి జీత భత్యాలు ఎక్కువగా ఇస్తారు. గల్ఫ్‌కు వెళ్ళిన వారిలో 20 నుంచి 40 మధ్య వయసు ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. వివిధ రంగాల్లో పని చేస్తున్న వారు కనీసం రూ.25 వేలనుంచి లక్ష వరకు సంపాదిస్తున్నారు.

సౌర విద్యుత్ సంస్థల వ్యూహంపై

సర్వత్రా ఉత్కంఠ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 2: సౌర విద్యుత్ యూనిట్‌కు ఆరు రూపాయల 49 పైసలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు ఎన్ని సౌర విద్యుత్ ఉత్పాదన సంస్ధలు ముందుకు వస్తాయో ఈ నెల 4వ తేదీన తేలనుంది. విద్యుత్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రప్రభుత్వం సౌర విద్యుత్‌ను ప్రోత్సహించాలని నిర్ణయించింది. రాష్ట్ర మంత్రి వర్గ ఉప సంఘం సౌర విద్యుత్‌కు యూనిట్ ఆరు రూపాయల 49పైసలు ధరను బెంచ్‌మార్క్ ధరగా నిర్ణయించిన విషయం విదితమే. గతంలోనే వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపి ట్రాన్స్‌కో టెండర్లను ఆహ్వానించింది. దీనికి స్పందించి 331 బిడ్స్ వచ్చాయి. ఈ సంస్ధలు మొత్తం 1780 మెగావాట్ల సౌర విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ముందుకు వచ్చాయి. 56 మెగావాట్ల విద్యుత్‌కు 13 బిడ్స్ వచ్చాయి. ఈ సంస్ధలు యూనిట్ ఏడు రూపాయలు చొప్పున చెల్లించాలని కోరాయి. 593 మెగావాట్ల విద్యుత్‌కు 107 బిడ్స్ వచ్చాయి. ఈ సంస్ధలు 8 రూపాయల నుంచి ఎనిమిది రూపాయల 50పైసల మధ్య రేటును పేర్కొన్నాయి. గరిష్టంగా ఒక యూనిట్‌కు 15 రూపాయల 50 పైసలను కూడా కొన్ని సంస్ధలు పేర్కొన్నాయి. ఈ బిడ్స్ వచ్చిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై యూనిట్ సౌర విద్యుత్‌కు 6రూపాయల 49 పైసలు బెంచ్ మార్క్ రేటును ఖరారు చేసింది. ఆసక్తి ఉన్న సంస్ధలు జూన్ 4వ తేదీలోగా తమ నిర్ణయాన్ని తెలియచేయాలని ప్రభుత్వం కోరింది. తాజా సమాచారం ప్రకారం 60మెగావాట్ల సౌర విద్యుత్‌కు ఐదు సంస్ధలు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ సంస్ధలే యూనిట్‌కు 6 రూపాయల 49 పైసలకు సౌర విద్యుత్‌ను సరఫరా చేయగలమని ప్రభుత్వానికి తెలియచేసినట్లు తెలిసింది. ఈ వివరాలు రెండు మూడు రోజుల్లో వెల్లడవుతాయని భావిస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘం నిర్దేశించిన రేటు కంటే ఎక్కువ రేటు ఇవ్వరాదని ట్రాన్స్‌కో డిస్కాంలను ఆదేశించింది. యూనిట్‌కు 6 రూపాయల 49 పైసలకు మాత్రమే అంగీకరించాలనే యోచనలో డిస్కాంలు ఉన్నాయి. ఏపిఇఆర్‌సి మాత్రం గతంలోనే సౌర విద్యుత్ యూనిట్ రేటు 5 రూపాయల 50పైసలను ఖరారు చేసింది.
ఈ రేటును దృష్టిలో పెట్టుకుని అదనంగా 99 పైసలు చెల్లించేందుకు ముందుకు వచ్చింది. అంటే యూనిట్‌కు అదనంగా 99 పైసలు చొప్పున అదనపు భారాన్ని ప్రభుత్వం భరించి, ఈ మొత్తాన్ని డిస్కాంలకు చెల్లిస్తుంది. కాని ఇంతకంటే మించి రేటుకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేస్తే, ప్రభుత్వం మిగిలిన భారాన్ని భరించేందుకు సిద్ధంగా లేదు. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం 8500 కోట్ల రూపాయల వరకు బకాయిలను డిస్కాంలకు చెల్లించాల్సి ఉంది.

కొత్త క్యాంపస్ మరో రెండు విభాగాల ఏర్పాటు ఇతర రాష్ట్రాల్లో నాలుగు కేంద్రాలు శబ్దసాగరం, మహా నిఘంటువు ఏర్పాటు
english title: 
t

తెరాసతో తెలంగాణ కల్ల

$
0
0

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిజెపితోనే సాధ్యమని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం బిజెపిలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం జర్నలిస్టుల ఫోరం డాక్టర్ నాగంతో ‘మీట్ ది ప్రెస్’ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ప్రాంతీయ పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితితో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదన్నారు. బిజెపి సహకారం లేకుండా టిఆర్‌ఎస్ సొంతంగా తెలంగాణను ఎలా సాధిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో కెసిఆర్ చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. ఇక ఆ పార్టీ ఎప్పటికీ తెలంగాణ ఇవ్వదన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ చెప్పే కల్లబొల్లి మాటలు వినేందుకు ఈ ప్రాంత ప్రజలు సిద్ధంగా లేరన్నారు. 2014లో ఎన్టీఏ కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటు కావడం తథ్యమన్నారు. బిజెపిని మతతత్వ పార్టీగా కెసిఆర్ అభివర్ణించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఇదే నిజమైతే గత ఎన్నికలు ముగిసిన వెంటనే అద్వానీని కెసిఆర్ ఎందుకు కలిశారని పంజాబ్ ర్యాలీలో బిజెపితో కలిసి వేదికను ఎందుకు పంచుకున్నారని ఆయన నిలదీశారు. దేశమంతా బిజెపి నినాదాలతో మార్మోగుతుంటే, తెలంగాణ కావాలంటున్న కెసిఆర్ ఇక్కడ బిజెపిని ఓడించమనడం అసమంజసంగా ఉందన్నారు. కెసిఆర్ వాదనలో హేతుబద్ధత లేదన్నారు. టిఆర్‌ఎస్ కంటే ముందే బిజెపి తెలంగాణ డిమాండ్‌ను ప్రస్తావించిందన్నారు. ఒకవేళ టిఆర్‌ఎస్‌కు ఎక్కువ సీట్లు వస్తే తెలంగాణ కావాలని వత్తిడి చేయడం మినహా అంతకంటే మించి ఆ పార్టీ చేసేదేమీ ఉండదన్నారు. అదే బిజెపికి ఓటు వేస్తే తెలంగాణ ఏర్పాటు కావడం తథ్యమన్నారు.

హైదరాబాద్‌లో ఆదివారం జర్నలిస్టుల ఫోరం నిర్వహించిన
మీట్ ది ప్రెస్‌లో మాట్లాడుతున్న నాగం జనార్దన్‌రెడ్డి

బిజెపితోనే సాధ్యం మీట్ ది ప్రెస్‌లో నాగం ఆశాభావం
english title: 
t

కాంగ్రెస్‌లో డిఎల్ కలుపు మొక్క

$
0
0

కడప, జూన్ 2: మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కలుపుమొక్క అని కడప వైఎస్సార్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి పేర్కొన్నారు. ఆయనను తొలగించడం ఇప్పటికే ఆలస్యమయిందని, డిఎల్‌కు ఉద్వాసన పలికిన ముఖ్యమంత్రికి డబుల్ థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు. పార్టీకి చేటు చేస్తున్న మరిన్ని కలుపు మొక్కలను తక్షణం ఏరివేయాలని కోరారు. డిఎల్‌ను తొలగించడం ద్వారా పార్టీ వ్యతిరేకులకు గట్టి హెచ్చరిక జారీ చేసినట్లయిందన్నారు. ఆదివారం కడప నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిఎల్ బర్త్ఫ్‌న్రు తప్పుపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు, సిఎం కిరణ్ కుమార్‌రెడ్డి అధిష్ఠానానికి సూట్‌కేసులు మోస్తున్నారని ఆరోపణలు చేసినపుడు నిద్రపోయారా? అని ప్రశ్నించారు. 2 వేల కోట్ల రూపాయలు సంపాదించిన డిఎల్ ఏ వ్యాపారం చేశారని ప్రశ్నించారు. మంత్రి పదవిని లెక్కచేయని కొండా సురేఖను ఆడపులిగా అభివర్ణించారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా, యువనేత రాహుల్ గాంధీల నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు. వారి ఆధ్వర్యంలో వచ్చే సాధారణ ఎన్నికల్లో దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను సక్రమంగా అమలు చేయడంతోపాటు మరిన్ని మెరుగైన పథకాలతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముందడుగు వేస్తున్నారని, పేదల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. కడప ఎంపి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జైలు పార్టీగా అభివర్ణించారు. అక్రమాల ఊబిలో చిక్కుకున్న జగన్ జైలు నుండి బయటపడే అవకాశం లేదన్నారు. ఆ పార్టీ నేతల్లో మరికొంత మందికి జైలుయోగం తప్పదన్నారు. వైకాపాలో టికెట్లు వైఎస్ కుటుంబ సభ్యులకు, రెడ్లకు ముఖ్యంగా సూట్ కేసులు అందించేవారికి దక్కుతాయన్నారు. పేదల కోసం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయల బియ్యం పథకానికి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు తూట్లు పొడిచారన్నారు. మహిళల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే మద్యపానం నిషేధం విధించగా చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే మద్యం వ్యాపారులతో కుమ్మక్కై గాలిలో కలిపేశారన్నారు. ఉద్యోగులను భయభ్రాంతులను చేసి అభద్రతాభావం సృష్టించారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే కమలమ్మ, ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రాణాలైనా అర్పిస్తాం రైవాడ నీరు సాధిస్తాం
మాడుగుల, చోడవరం ఎమ్మెల్యేల శపథం
దేవరాపల్లి, జూన్ 2: ప్రాణాలు అర్పించైనా రైవాడ జలాశయం నుండి సాగునీటిని సాధిస్తామని విశాఖ జిల్లాలోని మాడుగుల, చోడవరం ఎమ్మెల్యేలు గవిరెడ్డి రామానాయుడు, కెఎస్‌ఎన్ రాజులు శపథం చేశారు. రైవాడ నీరు రైతుల హక్కు అనే నినాదంతో దేవరాపల్లిలో 36 గంటలపాటు ఎమ్మెల్యే గవిరెడ్డి చేపట్టిన దీక్షలో భాగంగా ఆదివారం చోడవరం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు, సుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు పాల్గొని గవిరెడ్డి దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాడుగుల ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ రైవాడ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి కనువిప్పు కలిగిస్తానన్నారు. రైతుల కోసం నిర్మించిన రైవాడ నీటితో గ్రేటర్ విశాఖ అధికారులు వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ నీటితో కోట్లాది రూపాయలు వసూలు చేసుకుని రైవాడకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వలన రైవాడ జలాశయం అభివృద్ధి కుంటుపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైవాడ నీరు రైతులకు ఇస్తామని 35 ఏళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు ఉద్యమం ఆగదని ఆయన హెచ్చరించారు. చోడవరం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ చలనం లేని ప్రభుత్వానికి పోరాటం ద్వారా కళ్ళు తెరిపించాలని పిలుపునిచ్చారు. నీటి బిందువులను లెక్కగట్టి విశాఖలో వ్యాపారం చేసుకుంటున్న ప్రభుత్వం రైతుల కోసం రైవాడ బకాయిలు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. ప్రత్యేక ఆందోళనకు దిగైనా గ్రేటర్ విశాఖకు మంచినీటి అవసరం కోసం తరలిస్తున్న నీటిని అడ్డుకున్నప్పుడే ఈ ప్రాంత రైతులకు న్యాయం చేకూరుతుందన్నారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్త తుట్టా నర్సింగరావులు మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరుపై దుయ్యబట్టారు. ఈ సమావేశంలో మాజీ ఎంపిపి రావాడ సింహాద్రినాయుడు, దేవరాపల్లి, కె.కోటపాడు మండల టిడిపి అధ్యక్షుడు పోతల పాత్రునాయుడు, సబ్బవరపురామునాయుడు, సుగర్ ఫ్యాక్టరీ వైస్ చైర్మన్ కొప్పాక కాసుబాబు, కర్రి నాయుడు, కిళ్లి గోవింద, చల్లా నానాజీ పాల్గొన్నారు.
నేడు ఎడ్‌సెట్
హాజరుకానున్న 1.48 లక్షల మంది
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 2: ఆంధ్రాయూనివర్శిటీ ఆధ్వర్యంలో బిఇడిలో ప్రవేశం నిమిత్తం నిర్వహించే ఎడ్‌సెట్ 2013 పరీక్ష సోమవారం జరగునుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ పరీక్షలకు 1.48 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నట్టు పరీక్షల కన్వీనర్ నిమ్మ వెంకటరావు ఆదివారం ఇక్కడ తెలిపారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆయన వెల్లడించారు. ఎడ్‌సెట్ 2013 పరీక్ష నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా 287 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పరీక్ష జరుగుతుందని తెలిపారు. 45 నిముషాల ముందుగానే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఒక్కనిముషం అలస్యమైనా అభ్యర్థులను అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థుల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచామని, వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమతో పాటు గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ఫోటోను తీసుకురావాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.
డిఎల్ తొలగింపును నిరసిస్తూ
మహిళ ఆత్మహత్యాయత్నం
మైదుకూరు, బ్రహ్మంగారిమఠం, జూన్ 2: మంత్రి పదవి నుండి డిఎల్ రవీంద్రారెడ్డిని తొలగించడాన్ని నిరసిస్తూ ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కడప వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. మైదుకూరుతోపాటు బ్రహ్మంగారి మఠంలో డిఎల్ రవీంద్రారెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇదిలావుండగా ఖాజీపేటలో డిఎల్ బర్త్ఫ్‌న్రు నిరసిస్తూ కడప జిల్లా మహిళా కార్యదర్శి లక్ష్మీదేవి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీనితో డిఎస్పీ ప్రవీణకుమార్‌రెడ్డి జోక్యం చేసుకుని వారించారు. నిరసన కారులందరినీ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
రూ. 50 లక్షల విలువైన గంజాయి పట్టివేత
నర్సీపట్నం (రూరల్), జూన్ 2: విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం పోలీసులు 50 లక్షల రూపాయల గంజాయిని పట్టుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన నలుగురితో సహా మరో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్‌లో స్థానిక ఎఎస్పీ విశాల్ గున్నీ ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు. ఆదివారం తెల్లవారు జామున మూడున్నర గంటల సమయంలో అందిన సమాచారం ఆధారంగా నర్సీపట్నం రూరల్ సిఐ పిఆర్ రాజేంద్రకుమార్ ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై అప్పారావు, రోలుగుంట ఎస్సై అప్పన్న, కోటవురట్ల ఎస్సై గోవిందరావులతో గంజాయి అక్రమ రవాణా దారులపై దాడి నిర్వహించారని తెలిపారు. గబ్బాడ పంచాయతీ మడ్డువారి పాకలు సమీపంలోని నెల్లిమెట్ట వద్ద 22 బ్యాగుల్లో ఉన్న 514 కిలోల గంజాయితో పాటు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు.
గూడ్స్ నిలిచిపోవటంతో
ఆలస్యంగా నడిచిన రైళ్లు
మధిర, జూన్ 2: ఖమ్మం జిల్లా బోనకల్ మండలం మోటమర్రి గ్రామ సమీపంలో ఓ గూడ్స్ రైలు ఇంజన్‌లో వచ్చిన సాంకేతిక లోపం కారణంగా ట్రాక్‌పై నిలిచిపోయింది. దీంతో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్, నవజీవన్ ఎక్స్‌ప్రెస్ ఆలస్యంగా నడిచాయి. ఆదివారం సాయంత్రం 4.40 గంటల సమయంలో ఖమ్మం వైపు వెళుతున్న గూడ్స్ రైలింజన్‌లో సాంకేతిక లోపం ఏర్పడి మోటమర్రి రైల్వేస్టేషన్‌లో నిలిచిపోయింది. వెనుక వస్తున్న ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మధిర రైల్వేస్టేషన్‌లో సుమారు గంటపాటు నిలిచిపోయింది. దీనివెనుక వచ్చే నవజీవన్‌ను తొండలగోపవరం రైల్వేస్టేషన్‌లో 50 నిమిషాల పాటు నిలిపివేశారు. మరో ఇంజన్‌ను తెప్పించి గూడ్స్ రైలును మోటమర్రి రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్ళటంతో నిలిచిపోయిన రైళ్లు బయల్దేరి వెళ్లాయి.

పిడుగుపాటుకు నలుగురు మృతి
బాపట్ల/ పొన్నూరు, జూన్ 2: గుంటూరు జిల్లాలో ఆదివారం పిడుగుపాటుకు గురై నలుగురు మృతి చెందారు. బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామంలో పంటపొలాల వద్ద కాపలా ఉండే రైతుకూలీ సాదు సుబ్బారావు (35), పశువుల కాపర్లు కాకుమాను అంజలీదేవి (30), మల్లవరపు జాలయ్య (12) ఆదివారం మధ్యాహ్నం హఠాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవటంతో సమీపంలోని చెట్టుకిందకు వెళ్ళి నిలబడ్డారు. అదేసమయానికి పిడుగుపడటంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. పొన్నూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గందుల వెంకటేశ్వర్లు (56) తుంగభద్ర డ్రైన్ పరిసరాల్లో గొర్రెలు కాస్తుండగా పిడుగు పడటంతో మృతిచెందాడు.
‘పిల్లల మనోభావాలను తల్లిదండ్రులు గుర్తించాలి’
శ్రీశైలం, జూన్ 2: శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని సిబిఐ జెడి లక్ష్మీనారాయణ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు ఆయన తరుఫున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన సుండుపల్లెలోని ఆయన చదువుకున్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రభావం విద్యార్థులపై అధికంగా ఉంటుందని దీనిని దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు సమన్వయం సాధించాలని అన్నారు. తల్లిదండ్రులు విద్యార్థుల మనోభావాలను గుర్తించి అందుకు అనుగుణంగా వారికి ప్రోత్సాహం ఇవ్వాలన్నారు.

మంత్రులపై చర్య చేపట్టే అధికారం సిఎంకు ఉంది : బాలరాజు
గాజువాక, జూన్ 2: మంత్రులు క్రమశిక్షణ తప్పితే వారిపై చర్యలు తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజు అన్నారు. ఇక్కడి జవహర్‌లాల్ ఫార్మాసిటీలోని గ్లోకెమ్ కంపెనీని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. మంత్రి డీఎల్ రవీంద్రరెడ్డిని మంత్రి వర్గం నుంచి తొలగించిన విషయాన్ని విలేఖరులు ఆయన వద్ద ప్రస్తావించగా, పై విధంగా స్పందించారు. సమష్టి నిర్ణయాలు తీసుకునే అధికారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే మంత్రి వర్గానికి ఉంటుందని, అటువంటి నిర్ణయాలను బహిరంగంగా విభేదించడం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొన్నారు. సమష్ట నిర్ణయాలపై అనుమానాలు ఉంటే ఏ మంత్రికి అయినా ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఉంటుందన్నారు. మంత్రులకు ఏ సమయంలోనైనా ముఖ్యమంత్రిని సంప్రదించే అవకాశం ఉందని తెలిపారు. మంత్రివర్గ సమావేశం అంటే ఒక క్రమశిక్షణ గల అత్యుత్తమ సమావేశమని, అటువంటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై బహిరంగంగా విభేదించడాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తప్పు పడుతుందని చెప్పారు. విలేఖరుల సమావేశంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, కాంగ్రెస్ నేతలు పయిల జగన్నాథరావు, బొద్దపు వెంకటరమణ, దుల్ల రామునాయుడు, అట్టా సన్యాసి అప్పారావు, జిబి నాయుడు, మోటూరి సన్యాసినాయుడు తదితరులు ఉన్నారు.

డిఎల్ బర్తరఫ్ బాధాకరం
కేంద్ర మంత్రి కోట్ల
ఎమ్మిగనూరు, జూన్ 2: విదేశాల్లో ఉన్న మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని భర్తరఫ్ చేయడం బాధాకరమని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని పార్టీలకు అవినీతి మచ్చలు ఉన్నాయన్నారు. టిడిపి, బిజెపి, వైకాపాల్లోనూ అనేక మంది నేతలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ విషయాల్లో చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ 2014 ఎన్నికల్లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ విజయబావుటా ఎగురవేస్తుందన్నారు. రైల్వే కోచ్‌ల గురించి అవగాహన లేకపోవడం వల్లే ఎమ్మెల్యే కెఇ కృష్ణమూర్తి ఆరోపణలు చేస్తున్నారన్నారు. జిల్లాలో 120 కోట్ల రూపాయలతో రైల్వే కోచ్ వర్కుషాప్ నిర్మాణం చేపడతామన్నారు. ఇందులో 5వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. రాహూల్‌గాంధీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు.

నన్ను తొలగించే విషయం సిఎంనే అడగండి
మంత్రి రామచంద్రయ్య
కంభం, జూన్ 2: రాష్ట్ర మంత్రివర్గం నుంచి తమను తప్పించే విషయం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డినే అడగండి అని రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి రామచంద్రయ్య విలేఖరులనే ప్రశ్నించిన వైనమిది. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో కమలాపురం సెంటర్‌లో ఆదివారం శ్రీకృష్ణదేవరాయుల విగ్రహా ఆవిష్కరణకు వచ్చిన సందర్భంగా మంత్రి రామచంద్రయ్య కొద్దిసేపు విలేఖరులతో మాట్లాడారు. గత రెండురోజులుగా మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై విలేఖరులు ఆయన్ని ప్రశ్నించగా ఈవిషయాన్ని సిఎంను అడగండంటూ ఎదురు ప్రశ్నించారు. కాగా జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన కంభం చెరువును పర్యాటక కేంద్రంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తానన్నారు.

జగన్‌ది జైలుపార్టీ : ఎమ్మెల్యే వీరశివారెడ్డి విమర్శలు
english title: 
c

నగదు బదిలీ కష్టాలు మొదలు!

$
0
0

రాజమండ్రి, జూన్ 2: గ్యాస్ వినియోగదారులకు నగదు బదిలీ కష్టాలు మొదలయ్యాయి. జూన్ 1వ తేదీ నుండి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వినియోగదారులకు, వెంటనే ఖాతాల్లో సబ్సిడీ మొత్త, (పర్మినెంట్ అడ్వాన్స్) జమవుతుందని ప్రకటించినప్పటికీ, చాలామందికి జమ కాలేదు. రాష్ట్రంలో తొలిదశలో గ్యాస్ వినియోగదారులకు నగదు బదిలీ పథకం అమలుచేస్తున్న జిల్లాల్లో ఒకటయిన తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవటంతో గ్యాస్ వినియోగదారుల్లో ఆందోళన మొదలయింది. ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలను గ్యాస్ ఏజన్సీలకు అందించటంతో పాటు, సంబంధిత బ్యాంకు ఖాతాలకు ఆధార్ నంబర్లు అందించి సీడింగ్ చేసుకున్న వినియోగదారులకు, జూన్ 1వ తేదీ నుండి సిలిండర్ బుక్ చేసుకున్న వెంటనే పర్మినెంట్ అడ్వాన్స్ జమకావాలి. కానీ కొంతమంది వినియోగదారులకు జమ కాలేదు. జమ కాకపోవడం పక్కనపెడితే, సిలిండర్‌కు సబ్సిడీ లేకుండా చెల్లించాల్సిన మొత్తాన్ని సూచిస్తూ వారి మొబైళ్లకు ఎస్‌ఎంఎస్ వస్తోంది. ఈ ఎస్‌ఎంఎస్ చూసుకున్న వినియోగదారులు వెంటనే బ్యాంకు ఖాతాలో పర్మినెంట్ అడ్వాన్స్ జమయిందో లేదో సరిచూసుకుంటే అలాంటి మొత్తమేదీ కనిపించటం లేదు.
నగదు బదిలీకి ముందు సిలిండర్ బుక్ చేసుకున్న వినియోగదారుడు రూ.411 చెల్లించే వారు. నగదు బదిలీ పథకం అమలుచేయటం మొదలుపెట్టిన తరువాత రూ.851.50 చెల్లించాల్సిందిగా వినియోగదారులకు ఎస్‌ఎంఎస్ వచ్చింది. అంటే పర్మినెంట్ అడ్వాన్స్ కింద 440.50 జమకావాలి. కానీ కొంత మందికి రూ.435మాత్రమే జమయినట్టు సమాచారం అందుతోంది. అంటే మిగిలిన రూ.5.50ను వినియోగదారులు చెల్లించుకోవాలన్న మాట. నగదు బదిలీ పథకం అమలుకాక ముందు సిలిండర్‌కు రూ.411 చెల్లించాల్సిన వినియోగదారులు, నగదు బదిలీ పథకం తరువాత రూ.416.50చెల్లించాల్సి ఉంటుందా? అసలు ఏమిటీ గందరగోళం? అని గ్యాస్ వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పర్మినెంట్ అడ్వాన్స్‌తో పాటు రాష్ట్రప్రభుత్వం అందిస్తున్న గ్యాస్ సిలిండర్ సబ్సిడి రూ.25కూడా జమకావాల్సి ఉంది. కానీ రాష్ట్రప్రభుత్వం అందించే సబ్సిడీ విషయంలో ఇంత వరకు ఎలాంటి స్పష్టత లేదు. తూర్పుగోదావరి జిల్లాలో తొలిరోజు 16,157 మంది గ్యాస్ సిలిండర్లను బుక్‌చేసుకుంటే, వారి ఖాతాల్లోకి పర్మినెంట్ అడ్వాన్స్‌గా రూ.70లక్షల 26వేల 999 జమచేసినట్టు అధికారులు ప్రకటించారు. మరి మిగిలిన ఖాతాదారుల సంగతేమిటో అంతుబట్టకుండా ఉంది.
అయితే సాంకేతికపరమైన లోపాలేమైనా వచ్చాయేమో సరిచూసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులు తమ ఖాతాల్లోకి పర్మినెంట్ అడ్వాన్స్ జమయిందో చూసుకునే వారికి అసలు విషయం తెలుస్తుందని, అలా చూసుకోని వారికి జమకాకపోయినా తెలియకపోగా, నష్టం జరుగుతుందని వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

బ్యాంకు ఖాతాల్లో జమకాని గ్యాస్ సబ్సిడీ రీఫిల్‌కు పూర్తి మొత్తం చెల్లించాలని ఎస్‌ఎంఎస్‌లు వినియోగదారుల్లో ఆందోళన
english title: 
n

ఇక మంత్రుల బర్తరఫ్‌లు ఉండవు

$
0
0

విజయవాడ, జూన్ 2: రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి బర్తరఫ్ కావటం బాధాకరమేనని, అయితే మున్ముందు మరే మంత్రి కూడా బర్తరఫ్ కాబోరని పిసిసి నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం విజయవాడ వచ్చిన ఆయన నగర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో విలేఖర్ల సమావేశంలో మట్లాడుతూ మంత్రులు ధర్మాన, సబితా ఇంద్రారెడ్డి రాజీనామాలు కూడా దురదృష్టకరమన్నారు. మంత్రి పార్థసారథి గురించి విలేఖరులు ప్రస్తావించగా ఆయన కేసు విషయంలో ఎక్కడా అవినీతి చోటుచేసుకోలేదని సమాధానమిచ్చారు. తెలంగాణకు చెందిన ఒకరిద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీని వీడిపోవటంలో అర్థంలేదని వ్యాఖ్యానించారు. మరెవరూ పార్టీని వీడి వెళ్లబోరని ఆయన చెప్పారు. గతంలో దోచుకున్నది దాచుకోటానికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావించిందని బొత్స విమర్శించారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ మహానాడులో చేసిన తీర్మానాలన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పాలనలో ఖజానా ఒట్టిపోయి పలుమార్లు ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్ళాల్సిరాగా తమ పార్టీ పాలనలో నేటివరకు ఒక్కసారి కూడా అలా జరగలేదన్నారు. బిసిలకు 100 సీట్లు ఇస్తానంటూ పదేపదే చెబుతున్న చంద్రబాబు గత ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఇచ్చారో చెప్పగలరా అని బొత్స ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో, కర్ణాటక శాసనసభ ఎన్నికల్లోనూ ప్రజలు అవినీతి పార్టీలకు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఎలా పట్టంకట్టారో అలాగే రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తపర్చారు. రిజర్వేషన్‌లు ఖరారైనందున స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరుగుతాయని చెప్పారు. కాగా, బొత్స సమక్షంలో వైఎస్సార్సీపీ యువనేత బాడిత శంకర్, తెలుగుదేశం డాక్టర్స్ సెల్ మాజీ చైర్మన్ డాక్టర్ కొడాలి రామకృష్ణ, తదితరులు కాంగ్రెస్‌లో చేరారు.

దోచుకున్నది దాచుకునేందుకే వైకాపా ఆవిర్భావం : బొత్స
english title: 
i

కర్నూలు జిల్లాలో భారీ వర్షం.. నిండిన సుంకేసుల

$
0
0

కర్నూలు, జూన్ 2: కర్నూలు జిల్లాలోని ఆదోని, కర్నూలు రెవిన్యూ డివిజన్ల పరిధిలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు నైరుతి రుతుపవనాల విస్తరణ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. జిల్లాలోని తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా నదిలోకి వరద నీరు వచ్చి చేరడంతో కెసి కెనాల్‌కు ఆధారమైన సుంకేసుల బ్యారేజ్ నిండింది. దీంతో సుమారు 1.2 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యం వున్న సుంకేసుల బ్యారేజీ పూర్తిస్థాయిలో నిండింది. వేసవిలో సుంకేసుల బ్యారేజీలో 0.04 టిఎంసిల నీటిని మాత్రమే నిల్వ వుంచి మిగతానీటిని తాగు, సాగు నీరు కింద వినియోగించారు. భారీ వర్షం కారణంగా సుంకేసుల నిండడంతో కెసి కాలువకు తాగునీటి కోసం నీరు విడుదల చేసే అవకాశం వుంది. కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్లలో ఓ మోస్తరు వర్షం కురిసినప్పటికీ నీరు భూమిలోకి ఇంకిపోయిందని మళ్లీ ఒకటి, రెండు వర్షాలు కురిస్తే వ్యవసాయానికి అనుకూలం కావచ్చని రైతులు చెబుతున్నారు.
తిరుమలలో కుండపోత వర్షం
తిరుపతి: తిరుమల కొండపై వరుణుడు కుండపోత వర్షం కురిపించాడు. దీంతో ఆదివారం భక్తులు తడిసి ముద్దయ్యారు. రోడ్లన్నీ జలయమయం అయ్యాయి. వర్షం కారణంగా ఘాట్‌రోడ్డులో సుమారు గంటపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినప్పటికీ అటు తరువాత యధావిధిగా కొనసాగాయి. ఇదిలా ఉండగా రద్దీ కారణంగా సాధారణ క్యూలో వెళ్లే భక్తులకు 18 గంటలు సమయం పడుతుండగా కాలిబాటలో వచ్చే భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. తలనీలాలు సమర్పించే భక్తులకు సైతం ఆరు గంటల సమయం పడుతోంది. ఆదివారం మధ్యాహ్న సమయంలో ఆకాశం నల్లమబ్బులతో నిండిపోయింది. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిచింది. స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు పరుగులు తీసిన భక్తులు రాంభగీచ అతిథి భవనాల్లో తలదాచుకున్నారు. సుమారు గంటపాటు వర్షం కురవడంతో తిరుమల రోడ్లన్నీ జలయమం అయ్యాయి. ఇదిలా ఉండగా కల్యాణోత్సవాలు ముగిసిన అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను ఆర్జిత సేవలు జరిగే వైభవోత్సవ మండపానికి పటాటోపం (గొడుగు) మధ్య తీసుకువచ్చారు. అనంతరం అక్కడ వసంతోత్సవం, బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. కాగా రద్దీ కారణంగా వసతి దొరకని భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

తిరుమలలో వెంకన్న దర్శనం కోసం వర్షంలోనే బారులు తీరిన భక్తులు

కర్నూలు జిల్లాలోని ఆదోని, కర్నూలు రెవిన్యూ
english title: 
k

కొండెక్కి కూర్చున్న టమోటా

$
0
0

మదనపల్లె, జూన్ 2: కరవు జయిస్తు.. ఉన్న అరాకొరా జలవనరులతో ఆరుగాలం కష్టించి పండించిన టమోటా పంటకు తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలలో డిమాండ్ ఉండటంతో ధరలు కూడా రైతులకు అనుకూలంగా ఉంటున్నాయి. గత రెండురోజులుగా మదనపల్లె మార్కెట్ టమోటానుంచి తమిళనాడు, పాండిచ్చేరి, కేరళలకు అధికంగా తరలివెళ్లాయి. జిల్లాలో పంటసాగు అధికంగా ఉన్నప్పటికీ దీనిని ఆసరాగా చేసుకున్న అనంతపురం, కడప జిల్లాలో రైతులతో పాటు సరిహద్దులలో ఉన్న కర్నాటక రాష్ట్ర సరిహద్దుల రైతులు పండించిన పంటను మదనపల్లె మార్కెట్ దిగుమతి చేస్తున్నారు. గత రెండురోజులుగా మార్కెట్‌కు 190నుంచి 210టన్నుల టమోటాలు వస్తున్నాయి.
ఇదిలావుండగా వ్యాపారుల మధ్య పోటీ పెరగడంతో ధరలు కూడా రైతులకు అనుకూలంగా పెరిగాయి. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, తంబళ్ళపల్లి, పుంగనూరు, పీలేరు, పలమనేరు తదితర మండలాల్లో టమోటా పంటను రైతులు అధికంగా సాగుచేశారు. గత రెండునెలలుగా ధరలు లేక విలవిలాడిన రైతులు ఆదివారం మదనపల్లె మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా కిలో టమోటా రూ.54లు నుంచి రూ.57లకు పలుకగా రైతులు ఊపిరిపీల్చుకున్నారు. శుక్ర, శనివారాల్లో సరాసరి ధరలు రూ.40లకు పడిపోయింది. శుక్రవారం మార్కెట్‌కు కాయలు 239టన్నుల వచ్చాయి. అయినా ధరలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామబాద్, ఆదోని, ఒంగోలు, కరీంనగర్ ప్రాంతంతో పాటు దక్షిణాది రాష్ట్రాల పరిధిలో మదనపల్లె టమోటాకు డిమాండు పెరగడంతో కాయలు ఎగుమతి పెరిగింది. అంతేకాకుండా డిమాండు మేరకు కాయలు మార్కెట్‌లో లభిస్తున్నా వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. గత రెండురోజులుగా మదనపల్లె మార్కెట్‌కు 200 నుంచి 225టన్నులు కాయలు వచ్చేవి, ఆదివారం మార్కెట్‌కు 189టన్నుల కాయలు వచ్చాయి. వాటిని పోటాపోటీగా వ్యాపారులు కొనుగోలు చేశారు. మార్కెట్‌లో గత రెండునెలలుగా ధరలు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు పండించిన పంటను యధావిధిగా మార్కెట్‌కు తరలించారు. వ్యాపారులు కాయలను జాక్‌పాట్ సిస్టం ద్వారా కొనుగోలుకు ప్రయత్నించగా ఇందుకు రైతులు ససేమిరా అనడంతో వేలంపాటలో వ్యాపారుల మధ్య పోటీ అనివార్యమైంది. ధరలు కూడా రైతులకు గిట్టుబాటు కల్పించాయి. ఏయే ప్రాంతాలలో కాయలు డిమాండ్ పెరిగాయని వ్యాపారులు మండీ యాజమానులకు చెప్పకుండా ముందుగా వారికి కావాల్సిన మొదటిరకం టమోటాలు తక్కువ ధరలు పలికినా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు మాత్రం డిమాండ్ మేరకు వేలంపాటలో అధికధరలకు కొనుగోలుకు మొగ్గుచూపారు. దీంతో మార్కెట్‌లోని అన్ని మండీలలో ధరలు పుంజుకున్నాయి. ఇతర జిల్లాల టమోటాలను మదనపల్లె మార్కెట్‌కు రానివ్వకుండా అడ్డుకుంటే తప్ప జిల్లాలోని టమోటా రైతులకు న్యాయం జరుగుతుందని రైతులు అంటున్నారు. ధరలు ఈరోజుకు ఇలావున్నా రేపటి పరిస్థితి ఎలావుంటుందో చెప్పలేమని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఆదివారం మార్కెట్‌కు కాయలు తెచ్చిన రైతులు మాత్రం ‘కష్టానికి తగ్గ్ఫలితం ఎన్నాళ్ళకు దేవుడు కరుణించెను’... అంటూ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌కు ఆదివారం వచ్చిన టమోటాలు

కిలో రూ. 56.. మదనపల్లె సరుకుకు మహా గిరాకీ.. పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి
english title: 
k

యాసిడ్ బాధితులను అవమానించడమే

$
0
0

న్యూఢిల్లీ, జూన్ 3: యాసిడ్ దాడిలో మృతిచెందిన బాధితురాలి కుటుంబ సభ్యులకు మహారాష్ట్ర ప్రభుత్వం కేవలం 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించడంపై బిజెపి సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది యాసిడ్ దాడి బాధితులను అవమానించడమేనని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ముంబయిలో కొత్తగా నర్సు ఉద్యోగంలో చేరేందుకు మే నెల 2న ప్రీతి రాఠి (23), ఆమె తండ్రితో కలిసి ఢిల్లీ నుంచి రైలులో ముంబయికి బయలుదేరింది. బాంద్రా టెర్మినస్‌లో దిగిన అనంతరం ప్రీతి రాఠిపై దుండగుడు జరిపిన యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడింది. ముంబయిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. ఇలావుండగా ప్రీతి మృతదేహం సోమవారం ఢిల్లీ చేరుకుంది. తమ కుమార్తె మృతికి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రీతి కుటుంబ సభ్యులు మహారాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్. పాటిల్‌కు ఆదివారం విజ్ఞప్తి చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాటిల్ రెండు లక్షల పరిహారాన్ని అందజేస్తామని ప్రకటించారు. ఈ కేసును సిబిఐకి అప్పగించామని, దాడికి పాల్పడినవారిని వదిలేది లేదని పాటిల్ స్పష్టం చేశారు.

2 లక్షల పరిహారంపై సుష్మా స్వరాజ్ ఆగ్రహం
english title: 
sushma

ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం

$
0
0

న్యూఢిల్లీ, జూన్ 3: దేశ ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరుకోవటానికి దారితీసిన పరిస్థితులపై ప్రధాని మన్మోహన్‌సింగ్ జాతికి వివరణ ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేసింది. ఎన్డీఏ అప్పగించిన పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను యుపీఏ పూర్తిగా నాశనం చేసిందని పార్టీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ ప్రతాప్ రూడీ ఆరోపించారు. ఆర్థిక రంగంలో నిష్ణాతుడైన వ్యక్తి ఏ దేశానికి అధినేతగా లేడని చెబుతూ భారత చరిత్రలో ఇప్పటివరకూ ఈ విధమైన తిరోగమనం మన్మోహన్ హయాంలోనే జరిగిందని సోమవారం ఇక్కడ మీడియాతో అన్నారు. దేశ ఆర్థిక చరిత్రలో మన్మోహన్ సింగ్ హయాం ఓ దుర్దశగా గుర్తుండి పోతుందని ఆయన అన్నారు. అభివృద్ధి రేటు ఐదు శాతానికి, పారిశ్రామికాభివృద్ధి ఒక శాతానికి, ప్రాథమిక సదుపాయాల కల్పన రెండు శాతానికి దిగజారిపోయాయని ఆయన విమర్శించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు విపరీతంగా తగ్గిపోయాయని అన్నారు. గత ఏడాది 22 బిలియన్ డాలర్ల మేరకు లభించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ ఏడాదిలో పది బిలియన్ డాలర్లకు పడిపోయాయని చెప్పారు. ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలు అడ్డూ అదుపులేకుండా పోవటంతో ప్రజా జీవితం నరకంగా మారిపోయిందని విమర్శించారు. ఇంత జరుగుతున్నా భారత్ నిర్మాణ్ గురించి తెగ ప్రచారం చేసుకోవటం విడ్డూరంగా ఉందని రూడీ ఎద్దేవా చేశారు. కుంభకోణాలతో కుదేలవుతున్న యుపీఏ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయిని ఆయన జోస్యం చెప్పారు.
ఆహార భద్రత బిల్లుపై సభలో పూర్తి స్థాయిలో చర్చించిన తరువాతే చట్టం చేయాలన్నదే బిజెపి అభిమతమని అన్నారు. ఈ బిల్లుతో పాటు భూసేకరణ బిల్లుకు చట్టరూపం ఇవ్వటానికి ఉద్దేశించిన బిల్లును చట్టం చేయటానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినా తమకు అభ్యంతరం లేదని అన్నారు. సాలీనా వంద రోజులు పని కల్పిస్తామని ఇచ్చిన హామీ నవ్వుల పాలవుతోందని ఆయన చెప్పారు. అవినీతి కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో భాగంగా ఐపిఎల్ క్రికెట్‌లో స్పాట్ ఫిక్సింగ్‌ను తెరపైకి తెచ్చారన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.

* ప్రధాని మన్మోహన్‌పై బిజెపి నిప్పులు
english title: 
economy

కోళ్ల కబేళాలో మంటలు: 112 మంది కార్మికులు మృతి

$
0
0

బీజింగ్, జూన్ 3: చైనాలోని జిలిన్ రాష్ట్రంలో సోమవారం ఉదయం కోళ్ల కబేళాలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 112 మంది కార్మికులు మృతి చెందారు. మరో 54 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. జిలిన్ బయోయువాన్‌ఫెంగ్ పౌల్ట్రీ కంపెనీకి చెందిన ఈ కోళ్ల కబేళాలో ఉదయం ఆరు గంటలకు అగ్ని ప్రమాదం సంభవించిందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. జిలిన్ రాష్ట్ర రాజధాని చాంగ్‌చున్‌కు ఈశాన్యంగా వంద కిలో మీటర్ల దూరంలోని దెహుయి నగరానికి చెందిన మిషాజి టౌన్‌షిప్‌లో గల ఈ కోళ్ల కబేళాలో అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో 300 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని ప్రమాదం నుంచి బయటపడిన వారు తెలిపారు. అకస్మాత్తుగా పెద్దశబ్దం వినిపించిందని, వెంటనే కబేళా ఆవరణ అంతటా దట్టమైన నల్లని పొగలు వ్యాపించాయని వారు వివరించారు. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ప్లాంట్ గేటుకు తాళం వేసి ఉంది. అయినప్పటికీ సుమారు వంద మంది కార్మికులు ప్లాంట్ బయటకు వచ్చి ప్రాణాలు రక్షించుకోగలిగారు. ఈ అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.
‘వంద మందితో కలిసి వర్క్‌షాప్‌లో ఉదయం ఆరు గంటలకు పనిచేయడం ప్రారంభించాం. ప్లాంట్‌లో రెండు వర్క్‌షాప్‌లు ఉన్నాయి’ అని కాలిన గాయాలతో బయటపడిన 44 ఏళ్ల మహిళ వాంగ్ ఫెంగ్యా తెలిపింది. ‘బయటకు పరిగెత్తండి’ అంటూ ఎవరో ఒకరు అరవడంతో మేము వెంటనే వర్క్‌షాప్ నుంచి బయటకు వెళ్లే మార్గం వైపునకు పరిగెత్తాం. ఆ మార్గం నేనున్న చోటు నుంచి 40 మీటర్ల దూరంలో ఉంది. అకస్మాత్తుగా లోపలి నుంచి మంటలు వ్యాపించి ప్లాంట్ అంతా దట్టమైన పొగతో నిండిపోయింది’ అని వాంగ్ చెప్పింది. బయటకు పరిగెత్తుతూ కింద పడిన తనకు కాలిన గాయాలయ్యాయని ఆమె తెలిపింది. మొత్తానికి బయటకు పెరిగెత్తిన తాను వెనుకకు చూడగా ప్లాంట్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం కనిపించిందని ఆమె తెలిపింది.
ఈ ప్లాంట్‌లో లోపలి నిర్మాణం బాగా లేదని, పైగా ఇందులో అగ్ని ప్రమాదం సంభవించడంతో బయటకు వెళ్లే మార్గం చిన్నగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం కూడా కష్టంగా మారిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మంటలను ఆర్పిన తరువాత కూడా స్టీల్ ఫ్రేమ్‌తో నిర్మించిన ఈ భవనంలో దట్టమైన పొగలు ఆవరించి ఉండటం కనిపించింది. ఈ అగ్నిప్రమాదం వల్ల వాతావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉంటుందోననే కోణంలో పర్యావరణ పరిరక్షణ సంస్థ పరిశీలిస్తోంది. 2009 సెప్టెంబర్‌లో ప్రారంభించిన జిలిన్ బయోయువాఫెంగ్ పౌల్ట్రీ కంపెనీలో 1200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏడాదికి 67వేల టన్నుల కోడిమాంసాన్ని (చికెన్‌ను) ఈ కంపెనీ సరఫరా చేస్తోంది.

54 మందికి గాయాలు * చైనాలో ఘోర అగ్నిప్రమాదం
english title: 
kabela

అఫ్గాన్ బాంబు పేలుళ్లకు 20 మంది బలి

$
0
0

కాబూల్, జూన్ 3: అఫ్గానిస్తాన్‌లో సోమవారం జరిగిన రెండు వేర్వేరు బాంబు పేలుళ్లలో 20 మంది చనిపోయారు. తూర్పు అఫ్గానిస్తాన్‌లోని రద్దీగల ఓ మార్కెట్ వెలుపల అమెరికా సైనిక దళాలను లక్ష్యంగా చేసుకుని పేలిన ఆత్మాహుతి బాంబు 13 మంది ప్రాణాలను తీయగా, ఇందులో 10 మంది పాఠశాల విద్యార్థులున్నారు. అలాగే తూర్పు ప్రావిన్స్ లగ్మన్‌లో పేలిన ల్యాండ్‌మైన్ ఏడుగురిని బలి తీసుకుంది. సమ్‌కని జిల్లాలో గల మార్కెట్ వెలుపల మధ్యాహ్న సమయంలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ద్విచక్ర వాహనంపై పేలుడు పదార్థాలను అమర్చుకుని వచ్చిన ఆత్మాహుతి బాంబు పేలిందని, ఇదే సమయంలో స్థానిక పాఠశాల విద్యార్థులు భోజన విరామం కావడంతో బయటకు వచ్చారని దీంతో 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని పక్టియా ప్రావిన్స్ పోలీస్ చీఫ్ జెన్ జెల్మియా ఒరియఖైల్ తెలిపారు. కాగా, ఈ దాడిలో ఇద్దరు సైనికులు చనిపోయారని అఫ్గానిస్తాన్‌లో ఉన్న అమెరికా సైనిక కూటమి స్పష్టం చేసింది. అయితే వారు ఏ దేశానికి చెందినవారనేది ఇంకా నిర్ధారించలేదు. అఫ్గాన్ పోలీస్ అధికారి కూడా ఒకరు చనిపోయినట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు తూర్పు ప్రావిన్స్ లగ్మన్‌లో పేలిన ల్యాండ్‌మైన్ ఏడుగురు పౌరులను పొట్టనబెట్టుకుంది. వంటచెరకు సేకరణ నిమిత్తం వెళ్లిన వీరి వాహనం ల్యాండ్‌మైన్‌పై నుంచి వెళ్లడంతో ఈ పేలుడు సంభవించిందని, వాహనంలో ఉన్నవారంతా మరణించారని, మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులతోపాటు వాహనం డ్రైవర్ ఉన్నారని స్థానిక ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలియజేసింది. తాలిబన్ తీవ్రవాదులు అఫ్గాన్ ప్రభుత్వాన్ని, అంతర్జాతీయ సంస్థలను, అమెరికా సైనిక కూటమిని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. రోడ్లకు ఇరువైపుల అమర్చిన బాంబులు పేలి అమాయకులు మరణిస్తున్నారు. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్‌ఖైదా దాడితో అఫ్గాన్‌లో ప్రవేశించిన అమెరికా సేనలు తాలిబన్ల నిర్మూలనే లక్ష్యంగా గత పనె్నండేళ్లుగా పోరాడుతున్నది విదితమే.

మృతుల్లో 10 మంది చిన్నారులు!
english title: 
20 killed

వేగవంతంగా ‘ఆజీవిక’ అమలు

$
0
0

న్యూఢిల్లీ, జూన్ 3: దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఉద్దేశించిన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం)ను దేశవ్యాప్తంగా ముఖ్యంగా మధ్య, ఈశాన్య భారతంలో వేగవంతంగా అమలు చేయాలని కాంగ్రెస్ అధినేత్రి, యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ పిలుపునిచ్చారు. వచ్చే సంవత్సరం లోక్‌సభకు ఎన్నికలు జరుగనుండటంతో పాటు బిజెపి పాలిత మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ సహా అయిదు రాష్ట్రాల విధాన సభల ఎన్నికలు ఈ సంవత్సరం జరుగనున్న దృష్ట్యా సోనియా గాంధీ ఈ ‘ఆజీవిక మిషన్’ అమలును వేగవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఎన్‌ఆర్‌ఎల్‌ఎంను ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇక్కడ నిర్వహించిన రెండో వార్షికోత్సవ కార్యక్రమంలో సోనియా మాట్లాడుతూ యుపిఎ ప్రభుత్వానికి బలహీన వర్గాలు, మహిళల సాధికారతే మూల స్తంభాలని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ వంటి కొండ ప్రాంతాల్లో అమలు చేయడానికి ఓ ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేసినట్లు సోనియా ప్రకటించారు. వచ్చే పదేళ్లలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ఏడు కోట్ల కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయని ఆమె పేర్కొన్నారు. అయితే దీన్ని సాధించడం అంత సులభం కాదని అన్నారు. కాని, అనేక రాష్ట్రాలు ఆజీవిక మిషన్‌ను అమలు చేస్తూ, మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక మార్పులు తేవచ్చని రుజువు చేశాయని ఆమె అన్నారు. ఈ విజయాన్ని చూసే ఇప్పుడు ఆజీవిక మిషన్‌ను దేశవ్యాప్తంగా, ప్రత్యేకించి మధ్య, ఈశాన్య రాష్ట్రాల్లో వేగవంతంగా అమలు చేయడానికి పూనుకున్నట్లు సోనియా చెప్పారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2011 జూన్‌లో ఆజీవిక మిషన్‌ను ప్రారంభించింది. సమర్థవంతమైన సంస్థలు, ఆర్థిక సేవల సహాయంతో గ్రామీణ పేదలు తమ జీవనోపాధిని పొందడంతో పాటు ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉద్దేశించినదే ఈ మిషన్. ఎనిమిది నుంచి పదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఆరు వందల జిల్లాల్లోని ఆరు వేల బ్లాకుల్లో గల రెండున్నర లక్షల గ్రామ పంచాయతీల పరిధిలోని ఆరు లక్షల గ్రామాల్లో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి, వాటికి ఆర్థిక సేవలను అందించడం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ఏడు కోట్ల కుటుంబాలను పేదరికం నుంచి విముక్తి చేయాలనే లక్ష్యంతో ఆజీవిక మిషన్‌ను ప్రారంభించారు.
యుపిఎ ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమం ఎన్‌ఆర్‌ఎల్‌ఎం అని ప్రశంసిస్తూ, మహిళా సాధికారతకు ఉద్దేశించిన ఇంత భారీ పథకం ప్రపంచంలోని మరే దేశంలోనూ లేదని సోనియా గాంధీ పేర్కొన్నారు. ఈ పథకం దారిద్య్ర కూపం నుంచి మహిళలకు విముక్తి కల్పిస్తుందని నేడు ప్రతి ఒక్కరూ రుజువు చేశారని అన్నారు. ఈ పథకం ద్వారా మరెవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా కేవలం నిలకడైన స్వయం ఉపాధి సాధించుకోవడం ద్వారా మహిళలు పేదరిక శృంఖలాల నుంచి విముక్తులవుతారని ఆమె పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలను బలోపేతం చేయడమే మన ప్రభుత్వ ధ్యేయమని సోనియా అన్నారు. సోనియా తన ప్రసంగంలో జమ్మూకాశ్మీర్‌కు చెందిన స్వయం సహాయక బృందం సభ్యురాలు ఒకరు సాధించిన విజయాన్ని ప్రస్తావించారు. అంతకు ముందు ఆ సభ్యురాలు వేదిక పైనుంచి మాట్లాడుతూ స్వయం సహాయక బృందంలో చేరడం ద్వారా తాను ఆర్థికంగా ఎలా ఎదిగిందో వివరించారు. (చిత్రం) జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ను ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక బృందం కార్యకర్తలతో మాట్లాడుతున్న సోనియా గాంధీ

ఎన్‌ఆర్‌ఎల్‌ఎం వార్షికోత్సవంలో సోనియా పిలుపు * ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ
english title: 
sonia
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>