Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

‘కిస్’ టీజర్ ఆవిష్కరణ

$
0
0

అడవి శేషు స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన ‘కిస్’ చిత్రానికి సంబంధించి టీజర్‌ను విడుదల చేశారు. అడవి సాయికిరణ్ మైడ్రీమ్స్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్, థౌజండ్ లైట్స్ సినిమా చిత్రం పతాకంపై ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమాకు సంబంధించిన 30 సెకండ్ల టీజర్‌ను ఎ.రమేష్‌ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. అనంతరం దర్శకుడు, కథానాయకుడు అడవి శేషు మాట్లాడుతూ- సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల అందించిన ట్రాక్స్ అద్భుతంగా కుదిరాయని, ముఖ్యంగా రీ రికార్డింగ్ అందరికీ నచ్చుతుందని, ఆడియోను ఈ నెల 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఈ టీజర్ కూడా అందరికీ నచ్చుతుందని తెలిపారు. సినిమాలో పాటలు అందరికీ నచ్చుతాయని తాను ఆశిస్తున్నట్లుగా శ్రీచరణ్ పాకాల తెలిపారు. క్వాలిటీ వీడియోగా ఆర్.ఆర్.ట్రాక్స్‌తో కలిసి ఈ పాటలను ప్రేక్షకులకు అందిస్తున్నామని, అందుకే ఆడియో ఆలస్యంగా వచ్చేవారం విడుదల కానుందని నిర్మాత సాయికిరణ్ అడవి తెలిపారు. (చిత్రం) ‘కిస్’ చిత్రానికి సంబంధించి టీజర్ ఆవిష్కరణలో పాల్గొన్న అడవి సాయకిరణ్, తమ్మారెడ్డి భరద్వాజ, శేషు, ప్రియ, రమేష్‌ప్రసాద్

అడవి శేషు స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన
english title: 
kiss teaser

‘శివకేశవ్’ పాటలు

$
0
0

శ్రీహరి, జయంత్ (భానుచందర్ తనయుడు) ప్రధాన పాత్రధారులుగా సీతారామా ఫిలింస్ పతాకంపై ఆర్.వి.సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో భానూ రు నాగరాజు (జడ్చర్ల) నిర్మించిన చిత్రం ‘శివకేశవ్’. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. చిత్రానికి సంబంధించిన పాటల సీడీని శ్రీహరి, టీజర్‌ను నాగబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత భానూరు నాగరాజు మాట్లాడుతూ- దర్శకుడు కొత్తవాడైనా ఎటువంటి తడబాటు లేకుండా ఈ చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దాడని, అదేవిధంగా శ్రీ వసంత్ మంచి పాటలను అందించారని, శ్రీహరి నటన ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు. దర్శకుడు కథ చెప్పడానికి వచ్చినపుడు ఈయన దర్శకత్వం చేయగలడా? అని అనుకున్నానని, అతను కథ చెప్పిన విధానం నచ్చి ఈ సినిమాలో నటించానని, ఈ చిత్రంలో తాను రెండు పాటలకు డాన్స్ చేశానని నటుడు శ్రీహరి తెలిపారు. పల్లె కన్నీరు పెడుతుంది తనకెంత పేరు తెచ్చిందో అదేవిధంగా ఈ చిత్రంలోని పాటలు కూడా ప్రేక్షకులకు నచ్చుతాయని ఆయన వివరించారు. సహకారంతో ఈ సినిమాను ప్రేక్షకులకు నచ్చే విధంగా తాను తీర్చిదిద్దానని దర్శకుడు ఆర్.వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. కార్యక్రమంలో జయంత్, గుర్లిన్ చోప్రా, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. (చిత్రం) జయంత్ , సంజన

శ్రీహరి, జయంత్ (భానుచందర్ తనయుడు) ప్రధాన పాత్రధారులుగా
english title: 
songs

ఆ సంగీత శకం ఇక జ్ఞాపకాల్లోనే ..!

$
0
0

ఒకప్పుడు తెలుగు చలనచిత్ర వినీలాకాశంలో అటు నటన పరంగా, ఇటు సంగీతపరంగా కొందరు ధృవతారలుగా వెలిగి చరిత్ర సృష్టించిన మహానుభావులుండేవారు. కీర్తిశేషులు చిత్తూరు నాగయ్య, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, పి.సూరిబాబు, రఘురామయ్య, వేమూరి గగ్గయ్య, అద్దంకి శ్రీరామమూర్తి, శ్రీమతులు టంగుటూ రి సూర్యకుమారి, కృష్ణకుమారి, శాంతకుమారి, కన్నాంబ, జి.వరలక్ష్మి, ఎస్.వరలక్ష్మి, పి.్భనుమతి, మాలతి- వీరందరూ ముఖంలో హావభావాలు పలికించడంలోను, గళంలో స్వర మాధుర్యాలు నింపడంలోను జగత్ ప్రసిద్ధులు. అయితే కన్నాంబ, జి.వరలక్ష్మి, ఋష్యేంద్రమణి, మాలతులు మధ్యలోనే అర్ధాంతరంగా తమ సంగీత శకానికి స్వస్తిపలికారు. నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాక కృష్ణవేణి గళం వినిపించడం మానుకున్నారు.
చివరికంటా అవకాశం ఉన్నంత వరకూ తమ స్వరమాధురి వినిపిస్తునే వచ్చిన నటీమణులు శాంతకుమారి, భానుమతి, ఎస్‌వరలక్ష్మి, సూర్యకుమారిలు. అయితే వీరందరు ఇప్పుడు కీర్తి శేషులు. అలాగే చివరి శ్వాస వరకూ నటనతోపాటు స్వరార్చనా చేసిన నటులు సూరిబాబు, రఘురామయ్యలు. సిఎస్‌ఆర్, నాగయ్యలు మధ్యలోనే ఆపివేశారు. ఇతరులూ అంతే.
ప్రత్యేకించి ‘నేపథ్యగానం’ ఒక తప్పనిసరి అవసరమైన యుగం ఆవిర్భవించినపుడు ఎం.ఎస్ రామారావు, ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, ఎ.ఎం.రాజా, మాధవపెద్ది, పిఠాపురంలు ఇటు, అటు టి.ఎం.సౌందరరాజన్, శర్కాళి గోవిందరాజన్లు తమిళ చిత్రరంగంలో ఒక ‘మహత్తర సంగీత శకాన్ని’ సృష్టించిన సంగీత మహనీయులు.
‘వెళిపోయారెళిపోయారు’. నిన్న మొన్న ఎనిమిది దశకాల ప్రాయం దాటి పి.బి.శ్రీనివాసు, తొమ్మిది దశకాలు దాటి టి.ఎం.సౌందరాజనూ పరమపద సోపానం అధిరోహించడంతో-అటు తమిళ, ఇటు తెలుగు చలనచిత్ర రంగంలో ఒకప్పటి శకకర్తలుగా విరాజిల్లి చిత్ర సంగీత ప్రపంచాన్ని శాసించిన మధుర గాయనీ గాయకుల శకం పూర్తిగా ముగిసిపోయినట్లే.
కేవలం ఆకాశవాణి ‘ఆపాత మధురాలలోనో’, దూరదర్శన్ ‘మధుర గీతాలు’లోనో వారి గళ మాధుర్యాన్ని ఆస్వాదించడమే మనకు మిగిలింది. ఆ దినాలలో విషాద గీతాలకయితే ఈ గళం, ప్రేమ గీతాలకయితే ఈ గొంతు, హాస్య గీతాలకంటే ఈ స్వరాలు అన్ని ఆరోగ్యకర సాంప్రదాయం ఉండేంది. కనుకనే ఆ మహానుభావులందరూ సంగీత శకకర్తలయ్యారు. అలాగే సంగీత దర్శకులు కూడా. నాగయ్యా, ఓగిరాల, అద్దేపల్లి, వెంకట్రామన్ తదితరులు మంచి సంగీతమే అందించినా వారు ‘శకాన్ని‘ ఏమీ సృష్టించలేదు. కానీ, ఘంటసాల, సాలూరు, పెండ్యాల, సుబ్బరామన్, కె.వి.మహదేవన్, ఎం.ఎస్.విశ్వనాధ్‌లు ‘సంగీత స్వర శకకర్తలు’గా మిగిలిపోయారు. ఈదినాలలో ఎందరు ఎన్ని వందల చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించినా, ఎన్ని వేల గీతాలు వినిపించినా శకకర్తలుగా కీర్తిగాంచడం అసంభవమే! లేదూపోదూ అంటే ఈ వర్తమానం భవిష్యత్తులో భూతకాలంగా పరిణమించే నాటికి, ఒక ఎస్పీబాలసుబ్రహ్మణ్యం స్వర మాధుర్యానికి ఒక ‘శకకర్తగా’ సంగీత సృష్టికి ఒక రమేష్ నాయుడు, ఇళయరాజాలు సంగీత దర్శక శకకర్తలుగా నిలబడవచ్చు.
గాయనీమణులు లీల, జిక్కిలు కీర్తిశేషులు. వారి శకమూ అంతరించింది. పి.సుశీల, జానకిల శకమూ ముగిసింది. బాలసరస్వతి, కోమల, జమునారాణి, వైదేహి (సీ), స్వర్ణలత (సీ) రాణి, ఉడత సరోజని, ఎల్.రాజేశ్వరిలు కేవల గాయనీమణులే. వీరి శకమంటూ ప్రత్యేకించి చెప్పుకునే రికార్డులేవీ లేవు. రాబోయే తరానికి నేటి ‘చిత్ర’ ఒక శకరాజ్ఞి కావచ్చేమో అంతే తప్ప వెనకటిలా ‘ఐదు, పదుల’ సంఖ్యలలో ఈ రంగంలో ఏ శాఖవాళ్లూ భవిష్యత్తులో ‘శకం ముగించిన వాళ్ల’ కీర్తిని మోసేవాళ్లు మాత్రం కాలేరు. చాలామందికీ‘తీర్మానం’ రుచించకపోయినా ఇది చేదు నిజం!

ఒకప్పుడు తెలుగు చలనచిత్ర వినీలాకాశంలో అటు నటన పరంగా
english title: 
sangeetha shakam
author: 
-ఎం.రమేష్

వినోదాత్మకంగా ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’

$
0
0

రాజ్‌కుమార్ కథానాయకుడిగా నృత్య దర్శకురాలు తార దర్శకత్వంలో నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి పిక్చర్స్ పతాకంపై శ్రీమతి రమా రాజ్‌కుమార్ సమర్పణలో రూపొందిన చిత్రం ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర పనులు ముగింపుదశకు వచ్చాయి. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ చిత్ర విశేషాలు వివరిస్తూ- సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా ఈ బారిష్టర్ శంకర్ నారాయణ్ తెరకెక్కింది. ఇందులో నేను లాయర్‌గా రెండు విభిన్నమైన పాత్రలను పోషించాను. వృత్తి జీవితంలో బారిష్టర్ శంకర్ నారాయణ్‌కు ఎదురైన సంఘటనలు, సమస్యలు, వాటి పర్యవసానం ఏమిటి, చివరకు ఏం జరిగిందన్న అంశానికి వినోదాన్ని జోడించి రూపొందించిన చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా సీనియర్ నృత్య దర్శకురాలు తార మాస్టర్‌ను దర్శకురాలిగా పరిచయం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. బారిష్టర్ శంకర్ నారాయణ్ పాత్ర తీరుతెన్నులను తార మాస్టర్ తెరకెక్కించిన తీరు తెరపై చూడాల్సిందే. ఓ మంచి కథాచిత్రం ద్వారా ఆమె వెండితెరకు దర్శకురాలిగా పరిచయమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలై ప్రథమార్థంలో ఆడియోను, అదే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. దర్శకురాలు తార మాట్లాడుతూ- దర్శకురాలిగా నాకు ఇది తొలి చిత్రం. ఇందులో నాయకా నాయికల పాత్రలు అభినయానికి ఎంతో అవకాశం ఉన్నవి. పాత్రల మధ్య భావోద్వేగాలు సన్నివేశాలను రక్తి కట్టిస్తాయి. నృత్యదర్శకురాలిగా నాకున్న పేరును ఈ చిత్రం దర్శకురాలిగా మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళుతుందన్న నమ్మకం నాకుంది. ఇందులో ఎం.ఎస్.నారాయణ, ఏ.వి.ఎస్, అనంత్, కిశోర్‌దాస్, హేమ, అపూర్వల పాత్రలు ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచుతాయి. అలాగే సాకేత్ సంగీతం ఆకట్టుకుంటుంది. కథానుగుణంగా సాగే వెంకట్ మాడభూషి సంభాషణలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేస్తాయి. ఎస్.వి.శివారెడ్డి ఛాయాగ్రహ పనితనం ఈ చిత్రానికి ఓ ఎస్సెట్ అని తెలిపారు. అలంగ్రిత, అలియా త్రివేది నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో లక్ష్మీ, హేమ, అపూర్వ, ఎం.ఎస్.నారాయణ, ఏవీఎస్, అనంత్, మహర్షి, కిశోర్‌దాస్, శ్రీరాం, శశాంక్, సింగం మహేష్, టంగుటూరి రామకృష్ణ, రవిదాస్, అంజన్‌బాబు, ప్రత్యేక పాత్రలో 20 సూత్రాల పథకం చైర్మన్ ఎన్.తులసీరెడ్డి నటించారు. ఈ చిత్రానికి మాటలు: వెంకట మాడభూషి, సంగీతం: సాకేత్, పాటలు: భువనచంద్ర, కెమెరా: ఎస్.వి.శివారెడ్డి, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: రామకృష్ణ, సమర్పణ: శ్రీమతి రమా రాజ్‌కుమార్, నిర్మాత: వి.వి.రాజ్‌కుమార్, కొరియోగ్రఫి, దర్శకత్వం: తార. (చిత్రం) రాజ్‌కుమార్, అలంగ్రిత

రాజ్‌కుమార్ కథానాయకుడిగా నృత్య దర్శకురాలు తార
english title: 
barrister

బ్యాంకాక్ చుట్టొచ్చిన ‘బలుపు’

$
0
0

రవితేజ, శృతిహాసన్, అంజలి హీరో హీరోయిన్లుగా పెర్ల్ వి.పొట్లూరి సమర్పణలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పరం వి.పొట్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘బలుపు’. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే బ్యాంకాక్‌లో రవితేజ, లక్ష్మీరాయ్‌పై ఓ పాటను చిత్రీకరించారు. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఈన ల 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత పరం వి.పొట్లూరి మాట్లాడుతూ-‘‘రవితేజ, లక్ష్మీరాయ్‌పై శేఖర్ మాస్టర్ నృత్యదర్శకత్వంలో బ్యాంకాక్‌లో పబ్ సాంగ్ తీశాం. మరోపక్క ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నెలాఖరులో డిస్క్ ఫంక్షన్ నిర్వహించబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి 28న ప్రపంచ వ్యాప్తంగా ‘బలుపు’ను విడుదల చేస్తున్నాం. క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకొనే ఆద్భుతమైన యాక్షన్ సీన్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. రవితేజ కెరీర్‌కు ఈ చిత్రం ఓ మైలురాయిలా నిలుస్తుందనే నమ్మకం ఉంది. ఆయన కెరీర్‌లోనే గొప్ప హిట్ చిత్రంగా ఈ ‘బలుపు’ మిగిలిపోతుంది’’ అన్నారు. ప్రకాష్‌రాజ్, నాజర్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రావూ రమేష్, అలీ, అశుతోష్ రాణా, అడివి శేషు, సుప్రీత్, ఆదిత్య మీనన్, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, శేఖర్, అజయ్, షఫి, శ్రీనివాసరెడ్డి, సన, రాజశ్రీ నాయర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, కె.ఎస్.రవీంద్ర, మాటలు: కోన వెంకట్, పాటలు: సిరివెనె్నల సీతారామశాస్ర్తీ, భాస్కరభట్ల, ఫైట్స్: స్టన్ శివ, కొరియోగ్రఫీ: రాజు సుందరం, బృంద, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: గౌతంరాజు, కెమెరా: జయనన్ వినె్సంట్, సంగీతం: తమన్.ఎస్.ఎస్, నిర్మాత: పరం వి.పొట్లూరు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని. (చిత్రం) రవితేజ, శృతిహాసన్

రవితేజ, శృతిహాసన్, అంజలి హీరో హీరోయిన్లుగా
english title: 
balupu

అందీ అందని ‘ప్రాచీన’ హోదా ?!

$
0
0

భాషకు ప్రాచీన హోదాను

కట్టబెట్టడంలో కొత్త

పొడిగింపుగా భారత

ప్రభుత్వం మే 24,

2013న ‘మలయాళం’

భాషకు కూడా ప్రాచీన

హోదాను ప్రకటించడం

హర్షదాయకం. అయితే

మలయాళ ప్రజలు, వారి

సాహితీవేత్తలు,

ముందునుంచీ, మాకేమీ

వెయ్యేళ్ళు - పదిహేను

వందల ఏళ్ళ సాహిత్య

చరిత్ర లేదనీ, వున్నదల్లా

అయిదారొందల ఏళ్ళ

సాహిత్య సృజన మాత్రమే

అనీ, స్పష్టంగా చెప్తూ

వచ్చారు. అయిదారొందల

ఏళ్ళ చరిత్రగల మలయాళ

భాషకు ప్రాచీన హోదా

ఇవ్వడంవల్ల జరిగిన

మంచి ఏమిటంటే, ఇంక ఏ

భాషా కుటుంబంవారు,

తమకు వెయ్యేళ్ళు

మించినదో, ఏ పదిహేను

వందల ఏళ్ళ దోచరిత్ర

వుందని

నిరూపించుకునేందుకు,

అందుబాటులో లేని

కాలపు సాహిత్య

రచనలను, పోనీ

శాసనాలను వెదుక్కునే

ప్రయాసకు పాల్పడాల్సిన

అవసరం లేదు.
ఈ నేపథ్యంలో వచ్చే ఒక

ప్రశ్న 2004లో

మొదటిసారిగా దేశ వ్యాప్త

బుజ్జగింపు రాజకీయాలలో

భాగంగా, తొలి యు.పి.ఎ

సర్కారు, తమిళ

సోదరులకు కావాల్సిన

మంత్రిత్వ శాఖలు

యిచ్చినట్టే, వారు వీర

భాషావాదులు కనుక,

తమ భాష ఇతర దక్షిణాది

భాషలకన్నా గొప్పదని

నమ్ముతూ, అందర్నీ

నమ్మించే ప్రయత్నం

చేస్తారు కనుక, వారికి

తమిళనాట భాషా

రాజకీయాలు, పార్టీలు

పదవిలోకి రావడం అనే

దానితో బలంగా

ముడిపడుతున్నాయి

కనక, భాషాపరంగా సైతం,

తమ పార్టీ భాగస్వామ్యంతో

సంకీర్ణ ప్రభుత్వంగా

ఏర్పడనున్న యుపిఎ. పై

తెచ్చిన ఒత్తిడి కారణంగా

భాషకు సంబంధించిన ఒక

ప్రత్యేక గుర్తింపును

రాయితీగా

సాధించుకున్నారు. ఈ

ప్రాచీన హోదాను తమిళ

భాషకు కట్టబెడ్తూ అక్టోబరు

2004లో కేంద్ర ప్రభుత్వ

ఆదేశాలు వెలువడ్డాయి.

నిజానికి తమిళం దక్షిణాది

భాషలలోకెల్లా పాతకాలపు

భాష అంటూ అందుకు

తగు గుర్తింపులేవో

కావాలనే ధోరణి ఇవాళ్టిది

కాదు. ఇది 1897లో

మద్రాసు క్రిస్టియన్

కళాశాలలో తమిళ

ఆచార్యులుగా పనిచేసిన

వి.జి. సూర్యనారాయణ

శాస్ర్తీకాలం నుంచి

వినబడుతున్నదే.

అప్పుడప్పుడూ పైకి వస్తూనే

వుంది. అయితే ఎంత

రాజకీయ బుజ్జగింపు,

రాయితీలలో భాగమైనా,

తాము ఏకపక్షంగా

వ్యవహరించి, ఒక

దక్షిణాది భాషకు కిరీటం

తొడగడం సరైనది కాదు

అన్నది గ్రహించిన భారత

ప్రభుత్వం, ఈ ఆదేశాలు

వెలువడిన నెల రోజులు

తిరక్కుండానే

1.11.2004న ఇతర

భాషలేవయినా ఇటువంటి

హోదాకు తగిన అర్హతలు

కలిగివుంటే, వారి

దరఖాస్తులను పరిశీలించి,

తగు సూచనలు

చేసేందుకు అన్ని

రాష్ట్రాలనుంచి ప్రతినిధులు,

కేంద్ర సంస్థల ప్రతినిధులతో

కూడిన నిపుణుల

కమిటీని ఏర్పాటుచేసింది.

తమిళానికి ‘క్లాసికల్’

హోదాను ప్రకటిస్తూ కేంద్ర

ప్రభుత్వం జారీచేసిన

ఆదేశంలో గల ఒక

ముఖ్యమైన నిబంధన,

ఇటువంటి హోదాకు

అర్హమయ్యే భాష, కనీసం

వెయ్యేళ్ళ సాహిత్య చరిత్ర /

శాసన ఆధారాల చరిత్ర

కలిగి వుండాలన్నది.

అయితే తాము ఎంత

రెండు వేలు, రెండువేల

అయిదువందల ఏళ్ళ

చరిత్ర కలిగివున్నామని

పైపై మాటలలో

చెప్పుకున్నా, ఖచ్చితమైన

ఆధారాలుగల వెయ్యేళ్ళ

పరిమితికే లోబడి, తాము

కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ

గుర్తింపు

తెచ్చుకున్నామన్నది

బాగా ఎరిగిన తమిళులు,

ప్రభుత్వం తమకు ఈ

క్లాసికల్ గుర్తింపు యిచ్చిన

నెలలోపే ఏర్పాటయిన

నిపుణుల సంఘం ద్వారా

ఏం జరగబోతున్నదో యిట్టే

గ్రహించారు. ఇంచుమించు

అంతే సాహిత్య

చరిత్ర/శాసన ఆధారాల

చరిత్రగల మరో రెండు

దక్షిణాది పెద్ద రాష్ట్రాలు

అయిన ఆంధ్రప్రదేశ్,

కర్ణాటక, సులువుగా ఈ

వెయ్యేళ్ళ నిబంధన కింద,

అతి త్వరలో ‘క్లాసికల్’

హోదాను పొందకుండా

ఆపడం అసాధ్యమని ఎరిగి,

కేంద్రంలో చక్రం తిప్పారు

తమ రాజకీయ

నాయకత్వం ద్వారా.

ఫలితంగా వారు కోరింది

ఏమనంటే క్లాసికల్

హోదా పొందగోరే

భాషలకు ఏ రకంగా రెండు

వేల ఏళ్ళ సాహిత్య చరిత్ర

వుండి తీరాలని. ఇది

దక్షిణాది భాషలకు

ఎప్పటికైనా యివ్వవలసిన

గుర్తింపే అని బాగా ఎరిగిన

కేంద్ర ప్రభుత్వం, మరీ

అంత అడ్డగోలు

నిబంధనలకు

తలొగ్గకుండా, అలా అని

కోరుతున్న తమిళ

రాజకీయ నాయకత్వాన్ని

నిరాశపరచకుండా కర్ర

విరగని, పాము చావని

విధానాన్ని ఎంచుకుంది.

ప్రాచీన భాషగా గుర్తింపుకు

కావాల్సిన సాహిత్య చరిత్ర

పరిమితిని పదిహేను

వందలు- రెండు వేలు

ఏళ్ళుగా ఈ మధ్యలో

ఉండవచ్చన్న రీతిన

తేల్చింది. ఇది మొదలు

తెలుగునాట ఒక మూడేళ్ళ

కాలం మా సాహిత్యం ఇంత

పాతది అంటే అంత పాతది

అని చెప్పే రచనలు, వెదికే

కొత్త పరిశోధకులు

పుట్టుకొచ్చి అరకొర

సమాచారంతో

ఊదరగొట్టారు.

ఇంచుమించు యిలాంటి

స్థితే కర్ణాటక ప్రజలకు

అనుభవంలోకొచ్చింది.
ఎవ్వరూ ఆలోచించనిది

ఏమిటంటే తాము

వెయ్యేళ్ళ పరిమితికే

‘క్లాసికల్’ హోదాను

తెచ్చుకున్న తమిళులు,

ఎలా తెలుగు, కన్నడ

భాషా సమాజాల్ని ఒక

కృత్రిమమైన పోటీలోకి

నెట్టారని,. ఉన్నట్టుండి

అయిదు వందల ఏళ్ళ

సాహిత్య చరిత్రను / శాసన

ఆధారాల చరిత్రను

పుట్టించడానికి చరిత్ర ఏమీ

పుక్కిటి పురాణం కాదు

అని వీళ్ళు

తెల్సుకోలేకపోయారు.

పట్టుపట్టిన విక్రమార్కుల్లా

అందని సాహిత్య చరిత్ర

పరిశోధనలకు

బయలుదేరారు. చివరకి

జరిగిందేమంటే, 2008

దాకా ఈ రెండు భాషా

సమాజాలు ఈ సాహిత్య

చరిత్ర విషయమై నానా

ప్రయాసాపడి, పెద్దగా

నిరూపించిందేమీ

లేకపోయినా,

మొదటినుంచీ తమిళ

లాబీ వత్తిడికి లోనయి,

తాము కేవలం వారి

మొండి డిమాండ్‌ను

సంతృప్తిపరచడం కోసమే

వెయ్యేళ్ళ కాలపరిమితిని-

1500-2000

ఏళ్ళుగా మార్చామన్నది

ఎరిగున్న కేంద్ర ప్రభుత్వం,

కొంత సంకీర్ణ ప్రభుత్వాన్ని

నియంత్రించే పరిస్థితులు

మారగానే, ఈ రెండు

భాషల తరఫున

సమర్పించబడిన

వివరాలను 1500-

2000 ఏళ్ళు అన్న

పరిగణనను పక్కనపెట్టి,

2008లో ఈ రెండు

భాషలకూ క్లాసికల్

హోదాను

ప్రకటించేందుకు మార్గం

సుగమం చేసింది. ఇలా

అంతా సక్రమంగా జరిగితే

అసలు కథే లేదు. తాము

భాషకు పొందిన గుర్తింపు,

అవే అర్హతలు గల సోదర

భాషా కుటుంబాలకు

లభ్యం కాకుండా

మోకాలడ్డుపెట్టే

ప్రయత్నాలు ఇంకా

కొనసాగించారు

తమిళులు.
ఎంతలా పరిమితి

అర్హతను పదిహేను

వందలు- రెండు వేల

ఏళ్ళుగా చేసి, నాలుగేళ్ళు

తోటి భాషా కుటుంబాన్ని

అడ్డుకున్నా వారి అక్కసు

తీరలేదు. 2008 జూన్ -

జూలై ప్రాంతాలలో జరిగిన

నిపుణుల సంఘ

సమావేశం, ఈ రెండు

భాషల ప్రాచీన హోదాకు

దాదాపు సానుకూల

సూచనలు చేసే పరిస్థితి

వుండగా, ఆ నిపుణుల

సంఘంలో తమిళ భాషా

ప్రతినిధులు తమ

అనంగీకారాన్ని తెలిపినా,

వారు మైనారిటీలోనే

వున్నారు కనుక, ఇక

యింతకుమించి తెలుగు,

కన్నడ భాషలకు ప్రాచీన

లేదా క్లాసికల్ హోదా

ప్రకటన క్రమాన్ని

నిరోధించలేము అని

స్పష్టంగా

తెలుసుకున్నారు.

ఇంతటితో వారు వదిలినా

బాగుండేది. కానీ రాబోయే

ప్రభుత్వ ప్రకటన గురించి

ముందుగానే ఎరిగి

వున్నందువల్ల, వీరు,

తమిళనాడు భాషా

రాజకీయవేత్తలు అందరూ

కలిసి, ఆగస్టు 5,

2008న మద్రాసు

హైకోర్టు సీనియర్

న్యాయవాది ఆర్.గాంధీచే

ఈ రెండు భాషలకు ప్రాచీన

హోదా యిచ్చే కమిటి

నిపుణుల నైపుణ్యాల

స్థాయిని, అటువంటి

నిర్ణయం తీసుకునేందుకు

వారికిగల సమర్థత

(కాంపిటెన్సీ)ని సవాలు

చేస్తూ రిట్ పిటిషన్

దాఖలు చేయించారు. ఈ

విషయం తేలినదాకా ఈ

రెండు భాషలకు ప్రాచీన

హోదా అమలు నిలుపు

చేయాలని కోరారు. ఈ రిట్

పిటిషన్‌ను గౌరవనీయ

మద్రాసు హైకోర్టు

స్వీకరించి, మధ్యంతర

ఉత్తర్వులు యిచ్చింది. ఈ

రిట్ పిటిషన్ నెంబరు

18180/2008.

తరువాత ఈ రెండు

భాషలకు క్లాసికల్

హోదాను ప్రకటిస్తూ కేంద్ర

ప్రభుత్వం

31.10.2008న

ఆదేశాలు జారీ చేసింది. ఈ

ఆదేశాల అమలు,

మద్రాసు హైకోర్టులో

పెండింగులో వున్న

పిటిషన్ తీర్పు

వెలువడేవరకు జరగదన్న

విషయం తెలియచెప్పింది.

ఇదీ తమకు

సంబంధంలేని తోటి భాషా

కుటుంబాలు తెలుగు,

కన్నడాల అభివృద్ధికి

వారందించే వెన్నుపోటు

తోడ్పాటు. ఈ దశలో

‘ప్రాచీన’ హోదా వచ్చిందా

అంటే వచ్చింది. రాలేదా

అంటే రాలేదు అన్న

త్రిశంకు పరిస్థితి ఏర్పడింది

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పౌర

సమాజాలలో. అయిదేళ్ళు

కావస్తున్న ఈ కేసు

పరిష్కార దిశగా

చెప్పుకోదగ్గ పురోగతి ఏమీ

సాధించలేకపోయాము.

అధికార భాషా సంఘం

కొత్త అధ్యక్షుడ్ని పొందింది.

రాష్ట్ర సాంస్కృతిక శాఖ దీని

విషయమై ఏ కార్య

ప్రణాళికను కలిగివుందో,

రాజకీయ సచేతనత ఈ

విషయంలో ఎలాంటి

సమన్వయ చర్యలు

తీసుకుంటున్నదో అంతా

అస్పష్టం.
ఎందుకు పదిహేను

వందలు- రెండు వేలఏళ్ళ

చరిత్ర సాహిత్య పరంగా/

శాసన చరిత్ర ఆధారాల

వుంది, వుండాలి అని

తంటాలు పడ్డామా అని

ఆలోచించవలసిన పరిస్థితి

యిప్పుడు ఏర్పడింది.

ఎందుకంటే కేవలం

అయిదారువందల ఏళ్ళ

సాహిత్య చరిత్ర కల

మలయాళ భాషకు

‘క్లాసికల్’ హోదా

యిప్పుడు

ప్రకటితమయ్యాక, కాల

పరిమితికీ క్లాసికల్

హోదా ప్రకటనకు మధ్య

ఎటువంటి నిర్బంధ

నిబంధనా లేదన్నది అర్థం

అవుతుంది.సరే, ఇప్పుడు

మలయాళ భాషకు

క్లాసికల్ హోదావల్ల వచ్చే

రాయితీలు, గుర్తింపులు

అందాలన్నా- ఈ మద్రాసు

హైకోర్టులోని రిట్ పిటిషన్

అడ్డమే. తెలుగు, కన్నడ,

మలయాళ భాషా

సమాజాల భాషాభివృద్ధి,

సాహిత్య రంగ కృషి

ప్రణాళికలు, క్లాసికల్

ఇన్స్టిట్యూట్‌ల ఏర్పాటు

ఏమి జరగాలన్నా ఈ

కేసును ముందు

తొలగించుకోవాల్సిన

పరిస్థితి ఏర్పడింది.

భాషకు ప్రాచీన హోదాను కట్టబెట్టడంలో కొత్త పొడిగింపుగా భారత
english title: 
telugu
author: 
-రామతీర్థ 9849200385

‘రైస్ బాయల్’చేయకండమ్మా!

$
0
0

కొత్త రకాల వంటలను

నేర్చుకోడం, తాము

నేర్చుకున్న వాటిని

నలుగురికీ నేర్పించడం

స్ర్తిలందరూ ఇష్టపడే

పనులు. కొత్త

వంటకాలను పదిమందికీ

తెలియచెప్పడానికి

పత్రికలు (టివి చానెళ్ళు

కూడా) అవకాశం

కల్పించడం

ఆనందించతగిన విషయం.

అయితే

‘కన్యాశుల్కం’లోని

వెంకమ్మ వారసులకు

ఇంగ్లీషు మీద

మోజున్నంతగా

మాతృభాషపై మమకారం

లేదు. తెలుగులో పదమే

లేనప్పుడు (ఉదాహరణకు

బేకింగ్) లేదా తెలుగు

పదంకన్నా ఇంగ్లీషు మాట

ఎక్కువ వాడకంలో

ఉన్నప్పుడు (ఉదాహరణ

ఆపిల్) ఇంగ్లీషు పదం

వాడడంలో తప్పులేదు.

కానీ ఇంగ్లీషు వాడడం

హోదాకి

చిహ్నమనుకుంటేనే

మాతృభాషాభిమానులకి

బాధ కలుగుతుంది. ఈ

క్రింది వాక్యాలు

గమనించండి.
‘‘రైస్ బాయిల్ చెయ్యండి’’
‘‘పాన్‌లో పొటాటోస్ ఫ్రై

చెయ్యండి’’
‘‘మినప్పప్పు నానపెట్టి

గ్రైండ్ చెయ్యండి’’
‘‘జీడిపప్పు కట్ చెయ్యండి’’
ఎన్ని ఉదాహరణలైనా

ఇవ్వవచ్చు. ఇవే

వాక్యాలను కింది విధంగా

రాయడం అసాధ్యమా?
‘‘అన్నం వండండి’’
‘‘మూకుడు (లేదా

బాణలి)లో

బంగాళాదుంపలు

వేయించండి’’
‘‘మినపప్పు నానపెట్టి

రుబ్బండి’’
‘‘జీడిపప్పు చిన్నముక్కలు

చెయ్యండి’’
మాతృభాషపై

అభిమానమున్నవారి

మనస్సును పిండేసేలా

ఉన్న వాక్యాలను చదివితే

ఆంగ్ల భాషాభిమానులు

సంతోషిస్తారా? భాషను

ఖూనీ చేస్తున్నారని

బాధపడతారా?

ఎందుకంటే ఇంగ్లీషులోనే

వెలగబెట్టాలనుకుంటే

రాయాల్సిన వాక్యాలిలా

ఉండాలి.
రైస్‌ని స్టీమ్ చెయ్యండి

అనాలి తప్ప బాయిల్

చెయ్యండి అని ఇంగ్లీషు

వచ్చినవారెవరూ అనరు.

పాన్ అంటే దోసెలు, అట్లు

వేసుకునే పెనం. కూరలు

వేయించే మూకుడుని

స్కిల్లెట్ అంటారు. స్కిల్లెట్

మన మూకుళ్ళలా

కాకుండా అడుగు భాగం

బల్లపరుపుగా ఉంటుంది

(ఇప్పుడు ఇండియాలోనూ

అటువంటివి

దొరుకుతున్నాయి). మన

మూకుడు లాంటివి

పాశ్చాత్య దేశాలలో చైనీస్

వంటకాల పుణ్యమాని

ఈమధ్యనే

వాడుతున్నారు. చైనీస్

మూకుడుని వాక్ (ఆ, ఓ

కారాలమధ్యగా పలకాలి)

అంటారు. పాశ్చాత్యులు

చైనీస్ పదాన్ని తమ

భాషలో చేర్చుకున్నారు.

స్కిల్లెట్‌ని సాటీన్ అని

కూడా అంటారు.

కూరలను తక్కువ

మంటలో వేయించడం ‘ఫ్రై

చెయ్యడం’ కాదు. ఆ వంట

ప్రక్రియను సాటింగ్

అంటారు. పిండి విసరడం

గ్రెండింగ్. పిండి రుబ్బడం

వెట్ గ్రెండింగ్. పాశ్చాత్యుల

వంటలో వెట్ గ్రెండింగ్

అంతా కనబడదు. ఎక్కువ

వేడిలో నూనెల కూరలను

కలుపుతూనే వేయించడం

స్టిర్ ఫ్రై. గారెలు, పకోడీలు

వంటివి వేయించడం డీప్

ఫ్రై.
తల్లికి తిండి పెట్టనివాడు

పినతల్లికి బంగారు గాజులు

చేయించాడట అని ఒక

సామెత ఉంది.

మాతృభాషపై మమకారం

లేనివారు, మాతృభాష

నేర్చుకోవాలనుకోనివారు,

మాతృభాషపై పట్టు

సాధించనివారు పరాయి

భాషలో పాండిత్యం

సంపాదించడం చాలా

అరుదు. అందుకే

ముందుగా తెలుగు బాగా

నేర్చుకోవాలి. ఆపైన

ఇంగ్లీషు నేర్చుకుని ఆ

భాషలో బ్రహ్మాండంగా

దంచెయచ్చు.
‘కన్యాశుల్కం’లో

రామప్పంతులు ‘నాలుగు

బొట్లేరు ముక్కలు’

అంటాడు.

ఆంగ్లేయాధికారులకు

(1947కి పూర్వం)

వడ్డన చేసే స్వదేశీ బట్లర్లకు

ఇంగ్లీషు వచ్చేది కాదు.

కానీ ఇంగ్లీషులో

మాట్లాడడం తప్పనిసరి.

వారి ఎంగిలి మంగలమైన

ఇంగ్లీషుని బట్లర్ ఇంగ్లీష్

అనేవారు. వంటా, వడ్డానా

ప్రధానమైన రచనలలో

బట్లర్ ఇంగ్లీషే ఉంటుందా?
ఆంగ్ల భాషా పరిజ్ఞానానికి

చిన్న పరీక్ష.
సరళ ఇంటికి విరళ

భోజనానికి వెళ్ళింది. విరళ

కోసం సరళ చేసిన

వంటలలో చిన్న

ఉల్లిపాయల సాంబారుంది.
‘‘అదేమిటి శాటర్‌డే నేను

ఆనియన్స్ తినను కదా.

ఆనియన్స్ సాంబారు

చేశావేమిటి?’’ అని విరళ

అడిగింది.
సరళ నేనెక్కడ ఆనియన్స్

వేసి చేశానంది. అదేమిటి

సాంబారులో స్మాల్

ఆనియన్స్ వేశావుగా

అంది విరళ.
సరళ చెప్పింది నిజమా

లేక విరళ అన్నది సరైన

మాటా?
సరళ చెప్పింది నిజమేనని

ఇంగ్లీషు వచ్చినవారికి

తెలుస్తుంది. మనం చిన్న

ఉల్లిపాయలు, మద్రాసు

ఉల్లిపాయలు, సాంబారు

ఉల్లిపాయలు మొదలైన

పేర్లతో పిలిచేవాటిని

ఇంగ్లీషులో స్మాల్

ఆనియన్స్ అని అనరు.

ఆనియన్‌కి దగ్గరగా ఉన్న

ఏ పదమూ ఆ అర్థంలో

వాడరు. సాంబారు

ఉల్లిపాయలకు సరైన ఆంగ్ల

పదం షలాట్స్

(SHALLOTS).

ఇది ఉల్లి జాతికి చెందినదే

కానీ ఉల్లిపాయ కాదు.

శనివారం విరళ వంటివారు

ఉల్లిజాతికి చెందింది ఏదీ

తినరనుకోండి. అది వేరే

సంగతి. ఈ వ్యాసం ఆంగ్ల

భాషకు మాత్రమే

సంబంధించినది. తల్లికి

తిండీ లేదు, పినతల్లికి

బంగారు గాజులూ లేవు.

ఇద్దరు భాషామ తల్లుల

నెత్తినా ముళ్ళకిరీటాలే.

కొత్త రకాల వంటలను నేర్చుకోడం, తాము నేర్చుకున్న వాటిని
english title: 
riceboil
author: 
-పాలంకి సత్య

యూనికోడ్..

$
0
0

వేదిక
------
కంప్యూటర్లు ప్రధానంగా

అంకెలతో పనిచేస్తాయి.

వాటికి కేవలం సున్నాలు,

ఒకట్లు మాత్రమే

అర్థమవుతాయి. ఒక్కో

అక్షరానికీ, వర్ణానికి ఒక్కో

సంఖ్యని కేటాయించి

నిక్షిప్తం చేసుకొంటాయి.

వాటి భాషలోనే మనం

వాటికి అన్నీ విడమర్చి

చెప్పాలి. అందుకనే వివిధ

రకాల కోడ్‌లు

తయారుచేయబడ్డాయి.

ఉదాకు ASCH,

EBCDICవంటివి

ఇంగ్లీషు భాషను

కంప్యూటర్లు అర్థం

అయ్యేటట్లు చెప్పడానికి

తయారుచేయబ్డాయి.

అలాగే తమ అవసరానికి

కంప్యూటర్లు

ఉపయోగిస్తున్న వివిధ

భాషలవాళ్ళు, వివిధ

కంపెనీల వాళ్ళు కూడా

చాలా రకాల కోడ్‌లు

ఉపయోగించేవారు. కానీ

ఇలా రకరకాల కోడ్‌లు

ఉపయోగించడంవల్ల ఎన్నో

సమస్యలు

ఉత్పన్నమయ్యాయి. ఈ

సమస్యలనుండి

బయటపడడానికి

ప్రపంచంలో ఉన్న అన్ని

లిపులను కల్పి ఒకే కోడ్

తయారుచేసారు అదే

‘యూనీకోడ్’.

యూనీకోడ్‌వల్ల ఎన్నో

ప్రయోజనాలు ఉన్నాయి.

దీని ఆధారంగా అన్ని

భాషలవలెనే తెలుగులో

కూడా సులువుగా

వెబ్‌సైట్లు

రూపొందించవచ్చు.

ఉత్తరాలు కూడా

తెలుగులో పంపవచ్చు,

చదువుకోవచ్చు. ఇప్పుడు

బ్లాగులు, వెబ్‌సైట్లు,

పత్రికలు అన్నీ

యూనీకోడ్‌లో

తయారవుతున్నాయి.

ఇదివరకు అంతర్జాలంలో

ఉన్న వివిధ

దినపత్రికలవాళ్ళు

తమకంటూ ఒక

ప్రత్యేకమైన ఫాంట్ లేదా

ఖతిని ఉపయోగించేవారు.

ఆ ఖతి మన కంప్యూటర్లో

ఉంటేనే ఆ పత్రికలోని

తెలుగు స్పష్టంగా

కనిపించేది లేకపోతే

ముగ్గులు, జిలేబీలే...

కాని ఈమధ్య దాదాపు

అన్నీ తెలుగు దినపత్రికలు

యూనికోడ్‌లోనే తమ

పత్రికలను

అందిస్తున్నాయి.

పుస్తకాల ప్రచురణకు

ఎక్కువగా అను ఫాంట్స్

లేదా శ్రీలిపి వాడతారు.
అది టైప్ చేయడానికి పేజ్

మేకర్ ఉండాల్సిందే. కాని

ఇలా టైప్ చేసింది

కంప్యూటర్లో తెలుగులా

కనిపించదు, పిడిఎఫ్ చేస్తే

తప్ప. ఇటువంటి

సమస్యలను

నివారించడానికి, తెలుగు

టైపింగ్‌ని మరింత

సులభతరం చేయడానికి

కొందరు ఔత్సాహికులైన

సాంకేతిక నిపుణులు

యూనికోడ్ కీబోర్డు

లేఅవుట్లు, ఎటువంటి

సాఫ్ట్‌వేర్ లేకుండా

కంప్యూటర్లోనే ఉండే

‘ఇన్‌స్క్రిప్ట్’ విధానంలో

టైపింగ్ చేయడానికి

ట్యూటర్, ఉచితంగా

తెలుగు టైపింగ్ కోసం

అక్షరమాల, పలక, లేఖిని

మొదలైన ఉపకరణాలు

తయారుచేశారు. అలాగే

ఫైర్‌ఫాక్స్ (మంట నక్క)లో

కూడా నేరుగా తెలుగు

రాయడానికి గల

పద్ధతులు: ఇండిక్

ఇన్‌పుట్, పద్మ పొడిగింత

ఉన్నాయి.

గూగుల్‌లోకూడా నేరుగా

తెలుగు రాయడానికి

Google IME అనే

సాధనం ఉంది.. అను

వాడేవారికోసం

మాడ్యులర్, ఆపిల్ కీబోర్డు

లేఅవుట్లు కూడా

అందుబాటులో ఉన్నాయి.

వీటి సాయంతో

తెలుగువాళ్ళు ప్రపంచంలో

ఎక్కడినుండైనా తెలుగు

పుస్తకాలను, వ్యాసాలను

కంప్యూటర్, అంతర్జాలంలో

సులభంగా

చదవగలుగుతారు.

వ్రాయగలుగుతారు.

విషయాలను

వెతుక్కోగలుగుతారు.
మన కంప్యూటర్లో అందరికి

తెలిసిన ఫాంట్ లేదా ఖతి

గౌతమి... ఇది విండోస్

వాడేవారికి డీఫాల్టుగా

ఉంటుంది. అను

సాఫ్ట్‌వేర్‌లో ఎన్నో

అందమైన ఖతులు

ఉన్నాయి కాని అవి మనం

కంప్యూటర్లో వాడలేము.

పెరుగుతున్న సాంకేతిక

విజ్ఞానంవలన

యూనికోడ్‌లో

వాడుకోవడానికి అనువుగా

కొత్త ఖతులు

తయారయ్యాయి. వీటిని

ఉచితంగా డౌన్లోడ్

చేసుకుని మన సిస్టమ్‌లో

సి డ్రైవ్‌లోని ఫాంట్స్

విభాగంలో వేసుకుంటే

మనం రాసుకున్న

డాక్యుమెంట్, పేర్లు,

ఇంగ్లీషులోలాగే దాని

ఫాంట్/ ఖతి

మార్చుకోవచ్చు. ఇటీవల

ప్రపంచ తెలుగు

మహాసభల సమయంలో

15 కొత్త యూనికోడ్

ఫాంట్లు/ ఖతులను

విడుదల చేశారు.

శ్రీకృష్ణదేవరాయ, పెద్దన,

తిమ్మన, తెనాలి

రామకృష్ణ, సూరన్న,

రామరాజు, ధూర్జటి,

మల్లన్న, రామభద్ర,

గిడుగు, సురవరం,

ఎన్.టి.ఆర్. పొన్నాల

స్వర్ణ, రవిప్రకాష్,

లక్కిరెడ్డి...వీటిని

htttp://

teluguvijayam.or

g/fonts.html

నుండిడౌన్‌లోడ్‌చేసుకుని

కంప్యూటర్లో

C/Windows/

Fontsలో సేవ్

చేసుకోవాలి. ఇవన్నీ

ఉచితంగానే లభిస్తాయి.

వర్డ్ డాక్యుమెంట్‌లో రాసిన

సమాచారాన్ని నచ్చిన

ఖతిలోనే సేవ్

చేసుకోవచ్చు. డిజైనింగ్

చేసేటప్పుడు కూడా ఈ

ఫాంట్లు

ఉపయోగపడతాయి.

ఇంగ్లీషు అక్షరాలతో

ఇబ్బందిగా ఉంటే

ఈమధ్యనే తెలుగు

అక్షరాలతో ఉన్న సురవర

కీబోర్డు కొనుక్కుని

సులువుగా తెలుగులోనే

టైప్ చేయవచ్చు. ఈనాడు

కంప్యూటర్, అంతర్జాలం

ఉపయోగించడానికి

తప్పనిసరిగా ఇంగ్లీషు

రావలసిన అవసరం లేదు.

ఇన్ని విధాలుగా తెలుగు

సులభంగా రాయగలిగే

ఉపకరణాలు ఉన్నప్పుడు

తెలుగులోనే మెయిల్

చాటింగ్ చేయవచ్చు,

పద్యాలు, వ్యాసాలు,

కథలు, నవలలు

రాయవచ్చు. తెలుగులో

వెబ్ సైట్లు కూడా

నిర్వహించవచ్చు.. అది

కూడా పైసా ఖర్చు

లేకుండా.. ఎక్కువ శ్రమ

లేకుండా..

వేదిక
english title: 
unicode
author: 
-జ్యోతి వలబోజు

సమగ్రదృష్టి కావాలి

$
0
0

స్పందన
========
ఫిజిక్సు, ఓషనోగ్రఫీ

చదివిన పి.విజయ్‌గారు

రాసిన వ్యాసాలకు

స్పందిస్తూ రాస్తున్నాను.

ఈ వ్యాసాల్లో వారి

అనుభవము, ఆవేదన

వ్యక్తమవుతున్నాయి.

అయితే- పది

సంవత్సరాలపాటు ఉన్నత

పాఠశాలల్లో సైన్సు

బోధించిన అనుభవం ఉంది

నాకు. జూనియర్ డిగ్రీ

కాలేజీల్లో ఇరవై

ఎనిమిదేళ్లు తెలుగు

బోధించాను. కాబట్టి నా

ఆలోచనలు సగటు

ఉపాధ్యాయుని

అభిప్రాయాలుగా

స్వీకరించవచ్చు.

1965-75

మధ్యకాలంలో నేను

ఫిజికల్, బయలాజికల్

సైన్సులు ఎస్‌ఎస్‌ఎల్‌సి,

ఎస్‌ఎస్‌సి విద్యార్థులకు

బోధించాను. ఆ కాలంలో

ఇంగ్లీషు టర్మినాలజీకి

సమాంతరంగా తెలుగు

పదాలు ఉపయోగించారు

పాఠ్యపుస్తకాల్లో.
కార్బన్‌డయాక్సైడ్-

బొగ్గుపులుసు వాయువు-

కర్బన ద్విఆమ్లజనిదం

ఆక్సిజన్- ప్రాణవాయువు,

సల్ఫ్యూరిక్ ఆమ్లము -

గంధకికామ్లము, నైట్రిక్

ఆసిడ్ - నత్రికామ్లము,

పెండులమ్ - లోలకము,

డోలనము,

డోలనకాలము,

డోలనావర్తనకాలము,

లివర్స్ - తులాదండాలు;

మేగ్నెటిజమ్ -

అయస్కాంత ధర్మం,

కిరణజన్య సంయోగ క్రియ

- ఫొటో సింథసిస్,

ఇవాపరేషన్ -

భాష్పీభవనము.
మొక్కల్లో- ఆకర్షణ

పత్రాలు, రక్షణ పత్రాలు,

కేసరాలు, పుప్పొడి

తిత్తులు, కశేరుక - వెనె

్నముక- కశేరుకాలు,

అకశేరుకాలు ఇలా తెలుగు

పేర్లతో పాఠ్య గ్రంథాలు

ఉండేవి. పి.యు.సిలో

చేరిన విద్యార్థికి ఆంగ్ల

మాధ్యమంలో సైన్సు

టెర్మినాలజీ అతి కష్టమై

ఎక్కువమంది

చదువుమానుకునేవారు.

తెలివితేటలు ఉండి కూడా

మీడియం, టర్మినాలజీ

కారణంగా ఇబ్బంది

పడ్డారు. సైన్సు

ఉపాధ్యాయునిగా నేను

శాస్ర్తియ పదాలను

ఇంగ్లీషు టెర్మినాలజీతోనే

చెప్పాను.
ఉదా:్ఫటోసింథసిస్

జరగాలంటే

కార్బన్‌డయాక్సైడ్, నీరు,

క్లోరోఫిల్, సన్‌లైట్ ఉండాలి

(ఈ పదాలకు సరైన

తెలుగు పదాలను చెప్పి

అవగాహన కలిగించాను).

నా విద్యార్థులు ఇంగ్లీషు

టర్మినాలజీకి అలవాటు

పడినందున ఇంగ్లీషు

మీడియంకు నెమ్మదిగా

అలవాటుపడి- చక్కగా

చదువు కొనసాగించారు.
ఈ వివరణ ఎందుకంటే-

విజయ్‌గారు చెప్పినట్లు

తెలుగు పదాలను

నేర్పడం, అంతకుపూర్వం

నుంచీ జరుగుతున్న

సంస్కృత అనువాదము

(వెలాసిటీ- త్వరనము

వంటివి) ఈనాడు రెండూ

అవసరం లేదు.
తెలుగు విద్యార్థి

ప్రపంచంలో ఎక్కడైనా

ఉన్నత విద్యలు

చదవడానికి ఇంగ్లీషు

మీడియం, ఇంగ్లీషు

టెర్మినాలజీ పనికివస్తుంది

గాని తెలుగు కాదు.
పైగా విజయ్‌గారు నేను

ఎప్పుడూ వినని, ఊహకు

అందని పదాలు

కూర్చారు.
మాగ్నెటిజం -

సూదంటుతనం
కన్‌వెక్షన్ - వేడి కూడి

పారు
వేవ్ లెంక్తు - అల పొడవు
పొటెన్షియల్ ఎనర్జీ - ఎత్తు

సత్తువ
కైనెటిక్ ఎనర్జీ - కదలు

సత్తువ
వారినే అడుగుతున్నాను-

మీ పిల్లలకుగాని, మిత్రుల

పిల్లలకు గాని ఈ పదాలతో

సైన్సు బోధిస్తారా?
ఒకప్పుడు- అచ్చతెలుగు

పిచ్చిబట్టి పొన్నగంటి

తెలుగన్న వంటి కవులు

రాసిన కృత్రిమ భాషను

ఒక పరి పరిశీలించండి-

గ్రీకు, లాటిన్ మాటలను

వౌలిక శాస్ర్తియ

పదజాలంగా

స్వీకరించినందువల్ల శాస్త్ర

విజ్ఞానం ప్రపంచమంతటా

వ్యాపించింది. మరొక్క

విషయం-
ప్రాచీన గ్రీకు, లాటిన్,

సంస్కృతము- ఈ భాషలో

ఎక్కడో కొద్ది మందికి తప్ప

వ్యవహారిక భాషలు కాదు.
ప్రవాహినీ దేశ్యా- అన్నట్లు

దేశీయ భాషలవలె అవి

మారవు. స్థిరంగా నిలిచిన

ఆ పదాలను శాస్ర్తియ

పదాలుగా స్వీకరించడం

వల్ల సైన్సులో ప్రాథమిక

చర్చ అందరూ

చేయగలుగుతున్నారు.

నిత్యమూ మాట్లాడే భాషలో

శాస్ర్తియ పదాలను

ఉపయోగించకపోవడానికి

మూలకారణం ఇదే.
న్యూటన్ మొదలుకొని

రామన్ దాకా- శాస్తజ్ఞ్రులు

తమ సొంత భాషలో తమ

పరిశోధన వివరాలు చెప్పి

ఉంటే- ఇంగ్లీషు ప్రంచ

భాష కాకుండా ఉంటే-

ఏమి జరిగి ఉండేదో

ఆలోచించండి.
తెలుగు అభివృద్ధి

చెందడానికి మన బాల

బాలికలను ఎందుకూ

పనికిరాని వారుగా

చేయనవసరంలేదు.
ఈనాటి మన అవసరం
తెలుగు పాఠ్యాంశాన్ని

ఒకటవ తరగతినుండి డిగ్రీ

స్థాయి దాకా తప్పనిసరి

చేయడం.
మిగిలిన పాఠ్యాంశాలను,

ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రాలు

(ఇంజనీరింగ్, మెడిసిన్

మొ), ఎకనామిక్స్- వీటిని

ఆంగ్ల మాథ్యమంలో

బోధించడం.

న్యాయస్థానాల్లోను, చరిత్ర,

సివిక్సు వంటి పాఠ్యాంశాలు

వాడుక భాషలో

ఉన్నందున పెద్దనష్టం

రాదు. కార్యాలయాల్లో

తెలుగు మాత్రమే

ఉపయోగించాలి.

బ్యాంకింగ్, పన్నులు

వంటివి తెలుగులో

ఉండాల్సిన అత్యవసర

పరిస్థితి ఏర్పడింది.

ఇంగ్లీషులో- ఉన్నందువల్ల

ప్రజలు మోసపోతున్నారు.

నక్కను చూచినవాడు

వేటగాడు- అనే

తెలుగుసామెత ఉంది.

తెలుగు అంటే అభిమానం

లేనివారు, అరకొరగా

తెలుగును పరీక్షల కోసం

చదివిన

ఉపాధ్యాయులవల్ల తెలుగు

భాషకు నేటి గతి పట్టింది.

ఏదీ కాకపోతే తెలుగుకు

పనికొస్తాడనే ఆలోచన

వీరిది. వర్ణమాలను

తెలియనివారు తెలుగు

భాషా చరిత్ర, సాహిత్య

చరిత్ర తెలియనివారు,

ప్రాచీన కవిత్వం మీద

ద్వేషం, ఆధునిక కవిత్వం

మీద అవగాహన లేని

తెలుగు ఉపాధ్యాయులు

తెలుగును బోధించడంవల్ల

ఈ దుర్గతి పట్టింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న

ఓరియంటల్ కళాశాలల్లో

పదేళ్ళ కోర్సు పెట్టి-

తెలుగుతోపాటు ద్రావిడ

భాషల తులనాత్మక

అధ్యయనము, ఇంగ్లీషుతో

మంచి పరిచయం,

సంస్కృతంతో శాస్ర్తియ

సంబంధము విద్యార్థులకు

నేర్పాలి.
వారు పాఠశాలల్లో,

కళాశాలల్లో తెలుగు

నేర్పడానికి అర్హత

పొందుతారు. ఎన్ని ఏళ్ళు

నిరాదరణకు గురైన

తెలుగు భాషకు

పదేళ్లకాలం

ఎదురుచూడటం

కష్టంకాదు.
విజయ్‌గారు తమ

వ్యాసాల్లో తనె్ననరు

(స్వాభిమానం) అనుకోలు

(అభిప్రాయము) అరగల

(సందేహము),

మాటమూట(ఒకాబులరీ),

మాటామంతి (ఇంటర్వ్యూ)

మొదలైన మాటలు

పేర్కొన్నారు. ఎన్నో

ప్రాంతాల్లో ఉద్యోగం చేసిన

నేను ఈ పదాలను

వినలేదు (మాటా మంతి-

వారిచ్చిన అర్థంలో లేదు).

జన వ్యవహారంలో లేని ఈ

పదాలు ఎందుకు?
చీనా, జపాను, ఫ్రాన్స్,

జర్మనీ, రష్యన్ దేశాల్లో

ఇంగ్లీషు లేదు గదా- అని

ఒక వాదం ఉంది.
ఆ దేశాల్లో ఆయా భాషలు

మాట్లాడే జనం తొంభై

శాతం ఉన్నారు. మిగిలిన

పది శాతానికి ఆయా

భాషలు బాగా

అర్థమవుతాయ.
మన దేశంలో అలా

ఉందా? ఎవరి ప్రాంతీయ

భాషలో వారు

నేర్చుకుంటే- సరిహద్దులు

దాటిపోలేరు. అందుకే

ఇంగ్లీషును అందరూ

ఆదరించారు. ఒక భాష

పెరగడానికి, మరొక భాష

తరగడానికి కారణం

ఔపయోగికత (యుటిలిటీ)

ఇది నిపుణుల

అభిప్రాయం. ఈనాడు

ఇంగ్లీషులో ఏబదికి పైగా

మాండలిక భేదాలున్నాయి

ప్రపంచం అంతటా. కాని

శాస్త్ర చర్చలకు, గ్రంథ

రచనకు, ఉపన్యాసాలకు

ఉపయోగిస్తున్నది

ఆక్స్‌ఫర్డ్- కేంబ్రిడ్జి

మాండలికమే.
సంస్కృత పదాలను

తెలుగు భాషపై ఎవరో

రుద్దారు అనుకోవడం

శాస్ర్తియమైన ఆలోచన

కాదు. ఇతిహాస

పురాణాలు, మతపరమైన

కర్మకాండలు, జైన, బౌద్ధ

మతాలు, శాతవాహనుల

పాలన- ఇవన్నీ

సంస్కృత, ప్రాకృత

పదజాలాన్ని తెలుగులో

చేర్చాయి. ఇక్కడ

కులానికి, ప్రాంతానికి

ప్రాధాన్యం లేదు. అరవం,

కన్నడం, హిందీ, మరాఠీ,

ఒడిషాలు- సరిహద్దు

భాషలు. ఉర్దూ, ఇంగ్లీషు

రాజభాషలు. పాలకుల

భాషలు.
ఇవన్నీ తెలుగు జనాన్ని

ప్రభావితం చేశాయి. ఉదా:

మామూలు, అసలు-

మన దేశ పదాలు కాదు.

వీటిని ఎవరు నెత్తిన

రుద్దారు?
కాబట్టి ఒక విన్నపం-
మన పిల్లలను తెలుగు

ప్రాంతానికి పరిమితం

చేయొద్దు
తెలుగును అందరూ విధిగా

చదవాలి.
తెలుగు సాహిత్యము,

తెలుగు భాషా చరిత్ర

తెలిసిన వారిచేత తెలుగు

చెప్పించండి.

===========

రచనలు పంపవలసిన

చిరునామా : ఎడిటర్,

ఆంధ్రభూమి దినపత్రిక

36, సరోజినీ దేవి రోడ్

సికింద్రాబాద్ - 500

003.

స్పందన
english title: 
samagra drishti
author: 
-డాక్టర్ పమిడిఘంటం సుబ్బారావు 9441084316

ఐడియా

$
0
0

* సాధ్యమైనంతవరకూ మృదువయిన హెయిర్ బ్రష్‌లను, పళ్ళు దూరంగా ఉండే దువ్వెనలను ఉపయోగిస్తుంటే శిరోజాలు త్వరగా రాలిపోవు.
* నిమ్మచెక్కలను బాగా ఎండబెట్టి పొడి చేసి, దాన్ని సీకాయ పొడిలో కలుపుకొని అభ్యంగన స్నానం చేస్తుంటే శిరోజాలు చక్కని మెరుపును సంతరించుకుంటాయి.
* నువ్వుల నూనె, ఉసిరికాయ రసం సమభాగాలుగా కలిపి, మరిగించి చల్లారాక, ప్రతిరోజూ తలకు రాసుకుంటే శిరోజాలు త్వరగా నెరవవు.
* జుట్టుపలచగా ఉంటే ప్రతిరోజూ పచ్చిపాలను కుదుళ్ళకు బాగా రాసి, ఓ గంట తర్వాత తల స్నానం చేస్తే రెండు మాసాలలో జుట్టు పెరగడం గమనించవచ్చు.
* జడలు గట్టిగా బిగించి వేసుకున్నట్లయితే శిరోజాలు రాలిపోతాయి. ఆరోగ్యవంతమైన శిరోజాల కోసం ఆహారంలో విటమిన్ ఎ, బి అధికంగా ఉండేటట్లు చూసుకోవాలి.

సాధ్యమైనంతవరకూ మృదువయిన హెయిర్ బ్రష్‌లను
english title: 
idea
author: 
-లక్ష్మీ సువర్చల

ఆర్భాటాల జోలికెళితే ఆర్థిక బాధలే మరి..

$
0
0

పిల్లలకైనా, పెద్దలకైనా ‘సింద్‌బాద్ సాహస యాత్రలు’ పరిచయమున్న పుస్తకమే. కథ మొదట్లో సింద్‌బాద్ ఇంటిముందు కూచున్న ఒక పేదవాడు (అతడి పేరు కూడా సింద్‌బాద్) తన దారిద్య్రం గురించి, సింద్‌బాద్ సంపద గురించి వాపోతాడు. అతడ్ని లోపలకు పిలిచి సింద్‌బాద్ తాను ధనవంతుడవడానికి పడ్డ కష్టాలను కథల రూపంలో చెప్తాడు. నిజానికి సంపద పెరగడానికి కష్టపడాలి. పేదరికానికి మాత్రం సులభమైన పది మార్గాలివిగో...
* ఇరుగు పొరుగుల వద్ద, బంధువుల వద్ద మీ గొప్పదనం ప్రదర్శించండి.
ఈ విషయంలో ప్రతి ఒక్కరికీ కొద్దోగొప్పో కోరిక వుంటుంది. పక్కింటి వారి అభిప్రాయం మనకి చాలా ముఖ్యం. ఇంటికెవరైనా వస్తే కాఫీ, బిస్కెట్లూ ఇచ్చి పంపితే ఏం బావుంటుంది? ప్రతి పెళ్లికీ పచ్చ పట్టుచీరే కట్టుకెళితే ఎంత అవమానం? మగవారైతే బుల్లెట్ మోటార్ వాహనంపై ఆఫీసుకెళ్ళాలి కానీ సెకెండ్ హాండ్ స్కూటరా?
నిజమే మరి. పక్కవాళ్ళకీ, ఫ్రెండ్స్‌కీ, బంధువులకీ, సహోద్యోగులకీ పనేముంది? మీరెంతటి ఘనకార్యాలు సాధిస్తున్నారో అన్న విషయం గురించే ఆలోచించడం తప్ప.
* పెద్ద ఇల్లు కొనుక్కోండి
రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రకటనల ప్రభంజనమో, ప్రభుత్వం వడ్డీ రేట్లు తగ్గించిపారెయ్యడమో కానీ సొంతింటి కల నిజం చేసుకోవడం మీద అంతా దృష్టి సారిస్తున్నారు. ఇల్లనేది ఒక్కసారేగా కొంటాం లేదా కట్టుకుంటాం. కాస్త పెద్దదైతే మేలు. అంత పెద్ద ఇల్లు కొనుక్కున్నాక షో కేసులు లేకపోతే ఎలా? వంటింటికి టైల్సు వేయించొద్దా.. ఆ లిస్టుకి అంతమేముంది.
అయ్యో.. ఇంత ఇల్లు కట్టుకున్నాక నలుగురూ చూసి అభినందించాలి కదా! గృహప్రవేశానికి అయ్యే ఖర్చుతో ఇంకో రెండు గదులు కట్టవచ్చు. ఎవరికి ఈ ఆలోచన వచ్చేది?
* హాబీలుండాలి మరి
గాజు గ్లాసులపై పెయింటింగు, చీరలమీద అప్లిక్ వర్కు, బొమ్మల తయారీ, పూసల డిజైన్లు- ఎన్నైనా చెయ్యచ్చు. ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటామన్న ప్రశ్నలేదు. బూజు పట్టకుండా చూసుకునే ఓపికా ఉండదు. ఎంత చెట్టుకి అంత గాలి- అన్నట్లు విదేశాల్లో అయితే గోల్ఫ్, బోటింగు వంటి ఖరీదైన హాబీలుంటాయి. ఏ రాయైతేనేం పళ్ళూడగొట్టుకునేందుకని జేబుకి చిల్లు తప్పదు.
* పిల్లలను గారంగా పెంచండి..
వాళ్లు ఏదడిగినా కాదనవద్దు..
పల్లెలతో సంబంధమున్న మధ్య వయసు వారికి తాటాకు బొమ్మలూ, ముంజికాయల బళ్ళూ గు ర్తుండి ఉండవచ్చు. వాటితో ఆడుకున్న పిల్లలకన్నా నేడు ఖరీదైన బొమ్మలతో ఆడుకుంటున్న పిల్లలే ఎక్కువ ఆనందంగా ఉన్నారని గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పగలమా? అయితేనేం ప్రేమ చూపించడానికి ఒక్కటే మార్గం. పిల్లలకు అన్నీ కొనివ్వడం, ఖరీదైన బట్టలుల తొడగడం, బ్రహ్మాండంగా బర్త్‌డే పార్టీలు చెయ్యడం, శ్రామిక వర్గాలలో సైతం కేక్ కొనందే పుట్టిన రోజు పూర్తవడంలేదు. ఇక-డబ్బు ఎలా మిగుల్తుంది?
* నలుగురితో నారాయణా..!
వయస్సు పెరిగినకొద్దీ, వయస్సుతోపాటు జ్ఞానం వృద్ధి చెందిన కొద్దీ మెజారిటీ మాడై రైటనే అభిప్రాయం తప్పు అని తెలుస్తుంది. కొందరికి ఎప్పటికీ తెలియకపోవచ్చు. అందరూ ఏం చేస్తే అది చెయ్యడమే కానీ- లాభనష్టాలు, కష్టసుఖాలు బే రీజు వేసుకుందామనిపించదు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలంటే కొనెయ్యడమే. ఫలానా షాపులో మంచి చీరలున్నాయంటే ఆఫీసుకి శెలవుపెట్టయినా పరిగెత్తడమే. ఆఫీసరయ్యావు ఇంకా పాత కారేమిటి? అంటే వెంటనే బుక్ చేసెయ్యడమే. అందరూ ప్లాస్మా టీవీ కొంటే మనమూ కొనెయ్యడమే. మనం మనలా, మనకి తగినట్లుగా జీవించడం మంచిది కదా.!
* ఇప్పటి నుంచే పొదుపెందుకు?
యవ్వనంలో సుఖపడాలి, ఇప్పటినుంచీ పొదుపేమిటి? అన్న మాట తరుచుగా వింటూంటాం. అలా విన్నప్పుడు 1980ల నాటి విషయమొకటి జ్ఞాపకమొస్తుంది. ఒక ప్రభుత్వోద్యోగికి ముగ్గురమ్మాయిలు. పిల్లల పెళ్లికి డబ్బు దాచమని ఎవరైనా చెప్తే మూడేళ్ళ (పై)సంపాదనతో ముగ్గురమ్మాయిల పెళ్ళిళ్ళూ చేసేస్తాననేవాడు. అకస్మాత్తుగా ప్రభుత్వం రిటైర్మెంటు వయసుని 58 నుంచి 55కి తగ్గించింది. ఉద్యోగ విరమణ చెయ్యాల్సి వచ్చింది. ఆపైన ఉద్యోగ సంఘాలు కోర్టుకి వెళ్లి 58 వయస్సుని పునరుద్ధరించుకున్నాయన్నది వేరే సంగతి. ప్రభుత్వం జీతం ఇచ్చినా ‘గీతం’ ఎవరూ ఇవ్వరు కదా! ఇదంతా- లంచగొండితనం సరైనది అని చెప్పడానికి కాదు. దేశ, కాలమాన పరిస్థితులు ఎప్పుడూ ఎలా మారతాయో ఎవరూ చెప్పలేరు. చాలా బాగా పనిచేస్తోందన్న కంపెనీ మూత పడవచ్చు. బిపిఓలు ఏ ఫిలిప్పైన్స్‌కో తరలిపోవచ్చు. అందుకే చిన్న వయసు నుంచే పొదుపు చెయ్యాలని ఆర్థికశాస్తవ్రేత్తలు చెప్తున్నారు.
* క్రెడిట్ కార్డ్ జిందాబాద్..
అప్పుచేసి పప్పుకూడు తినడం ఒకప్పుడు చులకనగా చూసేవారు. ప్రస్తుతం అంతా వ్యతిరేకంగా నడుస్తున్నది. ఏం కావాలన్నా బ్యాంకులూ, ఆర్థికసంస్థలూ, షాపులూ పోటీపడి అతి సులభంగా అప్పులిస్తున్నాయి. మా ఆఫీసుకి రానక్కరలేదని చేతిలో క్రెడిట్ కార్డు పెట్టేస్తున్నాయి. ఆఖరుకి విలాస యాత్రలకు వెళ్లాలన్నా అప్పులిచ్చేవాళ్ళు రెడీ! దారిద్య్రం నుంచి బయటపడడానికి ఒక్కటేమార్గం. అది డబ్బుంటేనే కొనుక్కోడం.
* పిసినారితనం ఎందుకు?
గది బయటకు వస్తూ లైటాపినవాణ్ణి ‘పిసినారి వెధవ’ అనేవారికి కొదవలేదు. నీళ్ళు, కరెంటు, ఆహారం, అన్నిటికీ మించి సమయం వృథా చెయ్యడం దారిద్య్రానికి ప్రథమ సోపానం.
* దానం చేస్తే మంచిదే...
విన్న వెంటనే నమ్మశక్యం కాని విషయమిది. నలుగురికి ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా పెడితేనే సంపద వృద్ధి చెందుతుంది. భగవంతుడిపై సంపూర్ణ విశ్వాసమున్నవాళ్ళు దానం చేస్తే పుణ్యం వచ్చి తద్వారా సంపద పెరుగుతుందని నమ్మవచ్చు. విశ్వాసం లేనివారికి దానం వృథా ఖర్చు అన్పిస్తుంది. కాదని నమ్మడం కష్టం. గణాంక శాస్త్రాల ద్వారా రుజువైందని చెప్తే నమ్ముతారేమో. దానం ద్వారా సంపద పెరగడం ఎలా సాధ్యం? కష్టంలో ఉన్నవారిని అతి దగ్గరగా గమనించడంవల,్ల కష్టసుఖాల బేరీజు బాగా వేసుకోవడం వస్తుందేమో. కారణమేమైనా దానధర్మాలు సంపదకు కారణాలు.
* పెళ్ళిళ్ళూ, పేరంటాలూ
ఆర్భాటంగా చెయ్యడం
మా నాన్నగారిని ఒకసారి- వారి మేనమామల అరవై ఎకరాల ఆస్తి హారతి కర్పూరంలా ఎలా కరిగిపోయిందని అడిగాను. పెళ్ళిళ్ళు జమీందారీ ఫాయాలో చెయ్యడమే అన్నారు. అప్పట్లో పంచదార అపురూపం. సేనా మిఠాయి వడ్డించారంటే గొప్ప. పొలం మీద అప్పు తేవడం, అయిదు రోజుల పెళ్ళిళ్ళు చెయ్యడం. నేటికీ అదే పద్ధతి కొనసాగుతోంది. పెళ్ళిళ్ళలో అయితే మగపెళ్లివారి అజమాయిషీ ఉందనుకోవచ్చు. అమ్మాయి రజస్వల అయితే అప్పు చేసైనా ‘గ్రాండ్’గా ఫంక్షన్ చేస్తున్నారు. ఈ విషయంలో విదేశీయులని మెచ్చుకోవాలి. పెళ్ళికి వందమంది వస్తే గొప్ప. మనకి వెయ్యి విస్తళ్ళు తక్కువ లేస్తే నామోషీ.
పెళ్ళికయిన ఖర్చుని వధూవరుల పేరున డిపాజిట్ చెయ్యడమో, వారికి ఇల్లు కొనుక్కునేందుకు మొదట కట్టే ‘డౌన్ పేమెంట్’ చెయ్యడమో చేస్తే బాగుండదా? కన్యాదాతకి డబ్బులేక అప్పు చేస్తే.. పరిస్థితి ఘోరం కాదా?
పేదరికానికి పది మార్గాలే ఇక్కడ చెప్పినా, ఇంకా పదివేల మార్గాలున్నాయని తాను ఎంత కష్టపడి ధనవంతుడయ్యాడో సింద్‌బాద్ చెప్పాడు. నిచ్చెన మెట్లెక్కడం కష్టం. కిందికి జారి పడిపోవడం సులువు. ముందు కష్టపడి, తరువాత హాయిగా ఉండే మార్గం ఎంచుకుంటామా? ముందు సులభంగా అన్పించి తరువాత కష్టాలలోకి నెట్టే మార్గం ఎంచుకుంటామా? అన్నది మన చేతిలోనే ఉంది.

ఫీచర్
english title: 
main feature
author: 
-పాలంకి సత్య

మంచి పనులతో మానసిక తృప్తి

$
0
0

నెల రోజుల తరువాత గుడికి వచ్చారు మామ్మగారు. కంటికి ఆపరేషన్ చేయించుకున్నారని తెలిశాక, ‘ఎవరు చేయించారు? పెద్దకొడుకా? చిన్న కొడుకా?’ అడిగాను నవ్వుతూ. ‘‘వాళ్లు కాదమ్మా... దైవం మానుష రూపేణా అంటారు కదా..! ఆ త్రిమూర్తులే నన్ను కాపాడారు’’-అంటూ కల్యాణ మండపంలో తోరణాలను కడుతూ బిజీగా ఉన్న ముగ్గురిని చూపించారావిడ. ఆ ముగ్గురినీ అక్కడివారు ‘త్రిమూర్తులు’ అంటారు. బాల్యం నుంచి కలిసి చదువుకుని, రిటైరయ్యాక ఖాళీగా కూర్చోకుండా తమకు వచ్చే పెన్షన్‌లో సగభాగాన్ని సమాజసేవకు వినియోగిస్తూ... దైవ కార్యక్రమాలను శ్రద్ధగా చేసే ఆ ముగ్గురిని చూస్తుంటే... ‘వృద్ధాప్యం వయసుకేగానీ మనసుకు కాదని’ అనిపిస్తోంది. ‘మానవసేవే మాధవసేవ’ అని మహనీయుల బోధనలను ఆచరణలో పెడుతున్న ఆ ముగ్గురూ అక్కడివారి హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు.
భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని మంచిపనులకు వినియోగిస్తూ వారు తమ జీవితాలను చరితార్థం చేసుకుంటున్నారు. ఇలాంటివారి గురించి ఓ మంచిమాటను అక్షరజ్ఞానం లేనివారికి ఎవరు చెబుతారు? నా కొడుక్కి, మనవడికి, భార్యకి ఎన్నికల్లో టిక్కెట్లంటూ ఎనభైదాటినా ప్రజాసేవ ముసుగులో కోట్లాదిరూపాయలు కూడబెట్టి దాన్ని కాపాడుకోవటానికి ‘పవర్’ కావాలని ఆరాటపడేవారిని చూస్తుంటే జాలేస్తోంది. బాగా చదువుకున్నవారే ఇలావుంటే.. ఇక చదువురానివారికి ‘మంచి’ గురించి ఎవరు చెబుతారు?
పదిమందికీ దానధర్మాల విశిష్టత, సంఘ సేవలో కలిగే ఆనందం, తృప్తి గురించి చెబితే సమాజంలో మార్పు రాకుండా పోతుందా? సామాజిక మార్పేమి ఆసాధ్యం కాదు. బాగా చదువుకున్నవారు తాము మోనార్క్‌లని అనుకుంటూ మాట వినడానికి కూడా ఇష్టపడరు. వారిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. కొందరు విని ఆచరణలో పెట్టి తద్వారా కలిగే ఆనంద పరిమళాలను చుట్టూ వెదజల్లితే అక్కడి వాతావరణమే మారిపోదూ! ఇపుడు అలాంటివారే కావాలి. కొంతమంది మంచిచేయకపోగా మాటలతో చెడుని బాగా చేస్తున్నారు. అటువంటివారికి మనమే దూరంగా వుండాలి. తస్మాత్ జాగ్రత్త...!
మంచిపనుల విశిష్టతను పదుగురితో పంచుకోండి. వారిని మంచిపనులు చేయడానికి ప్రోత్సహించండి. నాలుగు మంచిమాటలు చెప్పడానికి ఎవరైనా ఫరవాలేదు. దానికో అధికార పీఠం, మైకు వంటి ఆర్భాటాలు ఎంతమాత్రం అవసరం లేదని గ్రహించండి.

నెల రోజుల తరువాత గుడికి వచ్చారు మామ్మగారు
english title: 
manchi
author: 
-జ్యోతిర్మయి

అతిగా ఆలోచిస్తే అవస్థలే..

$
0
0

సౌమ్యలో ఆలోచనలు పరిపరి విధాలుగా పో తున్నాయి. కాస్త రిలాక్సయి మళ్లీ ఆలోచించినా తృప్తి లభించలేదు. మనసులో కలిగిన ఒకే ఒక పాజిటివ్ ఆలోచనతో తన సమస్యకు పరిష్కారం లభించాక కుదుటపడింది.
విక్రాంత్ ఆలోచనలు తీవ్రస్థాయిలో పరుగెడుతున్నాయి. అనుకున్నదానికంటే ఎక్కువ విజయం సాధించాలనే ఆరాటంలో జరిగే నష్టం కూడా అతనికి తెలుసు. చివరకు అనంతమైన ఆలోచనలే అతనిని కిరాతకుడిగా మార్చేశాయి.
మంచి ఆలోచన ఓ విజయాన్ని అందిస్తే చెడ్డ ఆలోచన ఓ విధ్వంసానే్న సృష్టిస్తుంది. ఓ వేడి టీ తాగితే ఆలోచనలు తన్నుకొస్తాయంటారు కొం దరు. ఓ దమ్ము లాగితే బుర్ర పనిచేసి మంచి ఆలోచనలు వస్తాయని నమ్ముతారు మరికొందరు. ఆలోచనలు నిరంతరం పుట్టుకొస్తూనే వుంటాయి. వాటిలో మంచేదో, చెడేదో అనిపించేంతవరకూ ఆలోచించాల్సిందే. సౌమ్య ఓ మంచి ఆలోచన దగ్గర ఆగిపోవటం వల్ల విజయాన్ని సొంతం చేసుకుంది. విక్రాంత్ ఆలోచనా స్థాయి పెరగటం వలన విధ్వంసం చోటు జరిగింది. మానవ మస్తిష్కం నిత్యం ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతూ వుంటుంది. విశ్రాంతి తీసుకునే సమయంలోనూ మనసు ఆలోచించటం వల్ల కలలు మనుషులను భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. ఏ మాత్రం తక్కువగా ఆలోచించినా ‘కాస్త బుర్ర పెట్టొచ్చుకదా!’ అని, ఎక్కువగా ఆలోచన చేస్తే ‘అతిగా ఆలోచించబట్టే’ అన్న నిందలూ తప్పవు. సాధారణ ఆలోచనలతో పనులు నెమ్మదించినా జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆలోచనలు తీవ్రమైతే వాటికి తగ్గట్టుగా పరిగెత్తే సామర్థ్యం ఉందో? లేదో? చూసుకోవాలి. రోబోను సృష్టించడంలో సైంటిస్ట్ ఆలోచన మేధాశక్తికి తార్కణమైతే, అదే సైంటిస్ట్ రోబోకి ఆలోచనా శక్తిని కల్పించాలనుకోవడం తీవ్రస్థాయి ఆలోచనగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఆలోచన చేసేటపుడు లక్ష్యాన్ని, తీవ్రతను పరిగణనలోకి తీసుకోవడం ఉత్తమం. మంచి ఆలోచనలతోనే మానవ మనుగడ సాఫీగా సాగుతుంది. కనుక- ఆలోచించేటపుడు జరభద్రం సుమా!

సౌమ్యలో ఆలోచనలు పరిపరి విధాలుగా పో తున్నాయి
english title: 
ati
author: 
-బాసు

సీతమ్మగుడి ముందు రావణుడి విగ్రహం!

$
0
0

అవీ.. ఇవీ.. అన్నీ..
----------------
సీతమ్మ వారు రావణ సంహారానంతరం అగ్నిపరీక్షకు గురైనదిగా భావింపబడుతున్న- నువారా ఇలియా కొండపై ఆమెకు గుడి కట్టించడానికి- మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్ పూనుకోడాన్ని శ్రీలంకలోని ‘రావణశక్తి’ అనే బౌద్ధ తీవ్రవాద సంస్థ కన్వీనర్, ప్రఖ్యాత బౌద్ధ సన్యాసి శ్రీ ఇత్తేకండీ సద్థా తిస్సాథిరో తీవ్రంగా ఖండించాడు. ఆ కొండపై సీతాలయం నిర్మిస్తే ముందు ఇండియా- ఆ గుడి ముందు రావణబ్రహ్మ వి గ్రహ ప్రతిష్ఠకు దోహదించాలని ‘రావణశక్తి’ ప్రకటించింది. సీతమ్మ గడిపిన అశోకవనం, ఈ ‘పర్వత నగరం’, ‘కాంతినిలయం’ (నువారా ఇలియా)లను పవిత్ర తీర్థయాత్రాస్థలంగా భావించి హిందువులు వస్తూంటారు. ‘‘సీతమ్మ వాళ్లకి దేవుడైతే, రావణబ్రహ్మ మాకు దేవుడు’’ అన్నాడీ బౌద్ధ సన్యాసి. శ్రీలంకపై విదేశీ దండయాత్రను తొలిసారి ప్రతిఘటించిన మహనీయుడు, సీతమ్మను అపహరించినా ఆమెను తాకని మహావీరుడు రావణబ్రహ్మను- సింహళ దేశం పరమ పూజ్యుడిగా ఆరాధిస్తుంది. ఇక్కడి బౌద్ధ ఆలయాల్లో గణేశుడు, హనుమంతుడు, విష్ణుమూర్తి విగ్రహాలున్న ఉప దేవాలయాలు చాలానే వున్నాయి.
‘‘శ్రీరాముడు రావణ సార్వభౌముడ్ని ఓడించడానికి ఎనిమిది సంవత్సరాల కాలం పట్టింది. అటువంటి మహవీరుణ్ణీ, మహాపురుషుడ్నీ- శ్రీలంకలో జాతీయతా భావాన్ని పెంపొందించే ఉద్దేశంతోనే- మేము ప్రచారం చేస్తున్నాం. రావణ చక్రవర్తిని ఎవ్వరు కించపరిచినా సహించం’’ అని ఆ బౌద్ధమత తీవ్రవాద సంస్థ దయానంద ట్రస్టుకి వార్నింగ్ ఇచ్చింది. అంతేనా..? శ్రీలంక గవర్నమెంటు రావణబ్రహ్మ వైభవాన్ని గుర్తించి, ఆ వీరవర్యుడిని కీర్తించాలని కూడా శ్రీ సద్ధాతిస్సాథిరో వాదన!

సీతమ్మ వారు రావణ సంహారానంతరం
english title: 
seethamma gudi
author: 
veeraji@sify.com

రోదసిలో రమణుల జైత్రయాత్ర

$
0
0

‘చందమామ రావే.. జాబిల్లి రావే..’- అంటూ ఆకాశంలో దాగిన జాబిల్లిని చూపిస్తూ బిడ్డకు గోరుముద్దలు తినిపించడం తల్లులకు తెలిసిందే. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళ - నేడు అదే చందమామ చెంతకు చేరుకుని అద్భుతాలను ఆవిష్కరిస్తోంది. అంతరిక్ష పాఠాలను తన బిడ్డకు బోధించే స్థాయకి ఎదిగింది. రోదసీ యానంలోనూ తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుని స్వర్ణోత్సవ సంబరాలను జరుపుకుంటోంది. ‘ఆకాశంలో సగం మాదేనం’టూ రుజువు చేసేలా అతివలు రోదసీయాత్రలో ఎన్నో మైలురాళ్లను అధిగమించారని సాక్షాత్తూ అ మెరికాలోని జాతీయ వైమానిక, అంతరిక్ష నిర్వహణ సంస్థ (నాసా) ప్రశంసించింది.
ప్రపంచంలో తొలి మహిళా వ్యోమగామిగా వలెంటీనా తెరెస్కోవా ప్రారంభించిన విజయప్రస్థానం ఎందరెందరికో స్ఫూర్తిదాయకంగా మారింది. 1984లో స్వెత్లానా సావిత్సాయా అంతరిక్షంలో వేసిన తొలి అడుగుజాడలను స్ఫూర్తిగా తీసుకుని 2012లో భారతీయ సంతతికి చెందిన సునీతా విలియమ్స్ అంతరిక్షంలో నడిచారు. రష్యాకు చెందిన వలెంటీనా తెరెస్కోవా అంతరిక్షంలోకి అడుగుపెట్టి సరిగ్గా ఈ నెల 16 నాటికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పలు దేశాల్లో ప్రస్తుతం సంబరాలు చేస్తున్నారు. ఈ స్వర్ణోత్సవ సంబరాలను పురస్కరించుకుని మరింతమంది మహిళలను రోదసీయాత్రలో భాగస్వాములను చేసేందుకు ‘నాసా’ సమా యత్తమవుతోంది. ఇప్పటికే చైనా రెండవ మహిళా వ్యోమగామిని అంతరిక్షం లోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది.
రష్యా తొలి మహిళా వ్యోమగామిని పంపిన 20 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి శాల్లీరైడ్ అంతరిక్షయానం చేశారు. ఇలా అనేక దేశాల నుంచి మహిళలు అంతరిక్షయానం చేసి తమ దేశాల పేర్లను చరిత్రలో లిఖించారు. వలెంటీనా తెరెస్కోవా ఇప్పటికీ మహిళలను అంతరిక్ష రంగంలో ముందుకు నడిపించేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తూనే ఉన్నారు. ప్రపంచంలోనే రోదసిపై కాలుమోపిన తొలివ్యక్తిగా రష్యా జాతీయుడు యూరీ గగారిన్ ఆ ఘనతను సాధించిన రెండేళ్లకే తెరిస్కోవాకు అవకాశం రావటం కాకతాళీయంగా జరిగిందేమీ కాదు.
తెరిస్కోవా ఓ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో తల్లితో పాటు కార్మికురాలిగా పనిచేసేది. పట్టుమని పదేళ్లు కూడా స్కూలు విద్యాభ్యాసం చేయలేదు. పనిచేసుకుంటూనే కరస్పాండెన్స్ కోర్సు ద్వారా విద్యాభ్యాసం పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచి ‘స్కై డైవింగ్’ అంటే ఆమెకు మక్కువ. 22 ఏళ్ల వయసులో తొలిసారిగా స్కై జంప్ చేసింది. 1961లో సెర్గేవ్ కోరోల్యావ్ సోవియట్ రాకెట్ చీఫ్ ఇంజనీర్‌గా వచ్చారు. పురుషులతో పాటు మహిళలనూ అంతరిక్షంలోకి పంపాలనే ఆలోచన ఆయన చేశారు. తెరిస్కోవా (1962 ఫిబ్రవరి 16న) తొలి మహిళా వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఈమెతో పాటు మరో ఇద్దరు మహిళలు ఎంపికైనా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళా వ్యోమగామిగా తెరస్కోవానే నిలిచారు. అంతరిక్షయానంలో 48 సార్లు ఆమె భూమిని చుట్టివచ్చారు. జూన్ 16, 1963లో ‘ఒస్టాక్ 6’ అనే రాకెట్‌లో ఆమె చేసిన సాహసయాత్రను మెచ్చి అప్పటి సోవియట్ ప్రభుత్వం సముచితంగా గౌరవించింది.
తెరిస్కోవా సోవియట్ కమ్యూనిస్టు పార్టీలో సభ్యురాలిగా ఉండేవారు. అంచెలంచెలుగా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ క్రీయాశీలక పాత్ర పోషించారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్‌కు అధ్యక్షురాలిగానూ, సోవియట్-అల్గేరియన్ ఫ్రెండ్‌షిప్ సొసైటీకి అధ్యక్షురాలిగానూ పనిచేశారు. ఆనాడు రష్యాలో అత్యున్నత పురస్కారమైన ‘సోవియట్ మెడల్’ తెరెస్కోవాకు దక్కింది. యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ డాక్టరేట్‌ను ఇచ్చి గౌరవించింది. సోవియట్ యూనియన్ పతనానంతరం ఆమె రాజకీయ జీవితం మసకబారినా, తొలి వ్యోమగామిగా ఇప్పటికీ అందరూ గౌరవిస్తారు. ఆమె అందించిన స్ఫూర్తితో వివిధ దేశాలు మహిళలను వ్యోమగాములుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాయి. అమెరికా నుంచి 1984లో శాల్లీరైడ్ తొలి మహిళా వ్యోమగామిగా రోదసీయాత్ర చేశారు. ఆ తర్వాత కెనడా నుంచి రాబర్ట్ బొందార్, జపాన్ నుంచి చైకిముకై, చైనా నుంచి లియుయంగ్ రోదసీయాత్ర చేశారు. అనేక దేశాల్లో మహిళలు అంతరిక్ష విజ్ఞానం పట్ల ఆసక్తి చూపుతున్నారు. టెర్రస్ మీద పడుకుని ఆకాశంలోని నక్షత్రాలను చూడటం కాదు, రోదసిలోకి అడుగుపెట్టి స్వెత్లానా సవిత్సయా, సునీతా విలియమ్స్ లాంటివారు ఆ నక్షత్రాల సరసన తమ పేర్లను లిఖించుకుంటున్నారు. నేడు అంతరిక్షరంగంలో తమ ప్రతిభను చాటుకునేందుకు విద్యావంతులైన మహిళలు ఎంతోమంది వస్తున్నారు. ఇంకా రావాల్సిన ఆవశ్యకత ఉందని తెరిస్కోవా అంటారు. ‘ఒక్క రెక్కతో పక్షి ఎలా ఎగరలేదో, అంతరిక్షం అనే విమానం కూడా మహిళల భాగస్వామ్యం లేకుండా ఎగరలేదని, భూమ్యాకాశాలను శోధించే విషయంలో మహిళల భాగస్వామ్యం అవసరం’ అని ఆమె అంటారు. (చిత్రం) వలెంటీనా తెరెస్కోవా

సబ్ ఫీచర్
english title: 
sub feature
author: 
-టి.ఎస్.

ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

$
0
0

విజయవాడ, జూన్ 17: కృష్ణా జిల్లాతో సన్నిహిత సంబంధం కలిగిన ఏలూరు పార్లమెంట్ సభ్యులు కావూరి సాంబశివరావుకు తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించడంపై జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన వెనువెంటనే కావూరికి జౌళి, చేనేత శాఖను అప్పగించారు. కావూరి మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పలుమార్లు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నా జిల్లాలోని నూజివీడు, కైకలూరు శాసనసభా స్థానాలు ఏలూరు పార్లమెంట్ స్థానం పరిధిలోనే ఉన్నాయి. ఏదిఏమైనా కావూరికి కేంద్రంలో కీలకపదవి లభించడం వల్ల జిల్లా అభివృద్ధికి ఆయన సహకరిస్తారని భావిస్తున్నారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు కార్యకర్తలందరితో కావూరికి సత్సంబంధాలున్నాయి. ప్రఖ్యాత ఇంజనీర్ కెఎల్ రావు తరువాత సుదీర్ఘ కాలం 40ఏళ్లకు కావూరికి మంత్రి పదవి లభించింది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ పార్టీ సభ్యునిగా పర్వతనేని ఉపేంద్ర కూడా నాడు కేంద్ర మంత్రిగా పనిచేశారు. మళ్లీ ఇన్నాళ్లకు కావూరిని కేంద్ర మంత్రి పదవి వరించటంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తవౌతోంది.
కేంద్ర కేబినెట్‌లో జిల్లా మంత్రులు ముగ్గురు!
విజయవాడ, జూన్ 17: ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా జిల్లాకు చెందిన వారు ముగ్గురు ఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న కావూరి సాంబశివరావు కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం దోసపాడుకు చెందిన వారు. ఈయన బందరు పార్లమెంట్ స్థానానికి ఐదుసార్లు పోటీ చేశారు. కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి కృష్ణా జిల్లా నిమ్మకూరు ఆడపడుచు. పనబాక లక్ష్మి గుడివాడ రూరల్ మండలం సత్యవేడుకు చెందినవారు. ఈమె తరచూ అక్కడకు వస్తుంటారు కూడా.

రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో కాకలు తీరిన యోధుడు
విజయవాడ, జూన్ 17: కాంగ్రెస్ కురువృద్ధుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ జిఎస్ రాజు (93) తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మరణించారన్న వార్త విన్న జిల్లా వాసులు కన్నీరుమున్నీరయ్యారు. ఆయన మృతదేహాన్ని సోమవారం రాత్రి 8 గంటల సమయంలో విజయవాడలోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు. వీరికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారులు గోకరాజు రామరాజు, గోకరాజు సుబ్బరాజు సిరీస్ సంస్థలో డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. దశాబ్ద కాలం క్రితం సిరీస్ కంపెనీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో రెండో కుమార్తె కె.బంగారమ్మ భర్త రాయపరాజు సజీవ దహనమయ్యారు. 1983లో శాసనమండలి రద్దుకు పూర్వం డాక్టర్ రాజు శాసనమండలి సభ్యునిగా, శాసనమండలి చైర్మన్‌గా, ఉడా చైర్మన్‌గా పనిచేశారు. 1985 ప్రాంతంలో కాంగ్రెస్ నగర అధ్యక్షునిగా పనిచేశారు. రాజు మరణవార్త తెలిసిన వెంటనే పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుర్లపాటి కుటుంబరావు, నగర ప్రముఖులు పలువురు జిఎస్ రాజు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన భౌతికకాయానికి పలువురు నివాళులు అర్పించారు. శాసనసభ సమావేశాల్లో ఉన్న స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎంపి లగడపాటి రాజగోపాల్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు అడపానాగేంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేశ్వరరావు, కాంగ్రెస్ నగర మహిళా అధ్యక్షురాలు వాసిరెడ్డి అనూరాధ, మాజీ మేయర్ ఎంవి రత్నబిందు, కాంగ్రెస్ నగర శాఖ మాజీ అధ్యక్షుడు పైలా సోమినాయుడు తదితరులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. రాజు మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పలువురు పేర్కొన్నారు. తెలుగుదేశం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కేశినేని నాని జిఎస్ రాజు మృతిపట్ల సంతాపం తెలిపారు.

విద్యా దాత జిఎస్ రాజు
సీమాంధ్రలో తొలిసారిగా 1926లో విజయవాడలో ప్రారంభమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం 1930 దశకంలో విశాఖపట్నం తరలివెళ్లింది. దీంతో నాగార్జున విశ్వ విద్యాలయ అభివృద్ధికి రాజు కోటి 50 లక్షలు విరాళంగా ఇచ్చారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఔషధ ఉత్పత్తి విభాగానికి ఆయన కోటిన్నర విరాళమిచ్చారు. యోగ విద్యా భవన్‌లో శిక్షణ కేంద్రం స్థాపనకు 50 లక్షలు విరాళంగా ఇచ్చారు. డాక్టర్ రాజు భూరి విరాళంతో ఫార్మసీ, యోగ, ధ్యాన రంగాలలో రెండు కళాశాలల ఏర్పాటుతో యూనివర్శిటీ కొత్త పుంతలు తొక్కింది. వ్యక్తిగతంగా ఈ రెండు రంగాలు ఆయనకు ఎంతో ఆత్మీయమయ్యాయి. డాక్టర్ రాజు అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఫార్మసీ రంగంలో అత్యున్నత డిగ్రీ సాధించారు. ఆ రంగంలో అమెరికా ఆయనకు పెలోషిప్ ఆఫ్ ది అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అనే అవార్డు ప్రదానం చేసింది. ఆయన అనేక దేశాల్లో పర్యటించి ఆ పరిజ్ఞానంతో విజయవాడలో సిరీస్ కంపెనీ నెలకొల్పారు. 1958లో అవతరించిన ఆంధ్రప్రదేశ్ డాక్టర్ రాజు ప్రథమ డిప్యూటీ చైర్మన్. నాడు మాడపాటి హనుమంతరావు చైర్మన్‌గా వ్యవహరించారు. భావాతీత ధ్యాన యోగం పట్ల డాక్టర్ రాజుకు ప్రగాఢ విశ్వాసం. మహేష్ యోగి ఆదర్శం. అందుకే తన సిరీస్ సంస్థలో ఉద్యోగులకు యోగా శిక్షణ ఏర్పాటు చేశారు. యోగశాలను మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాంతో పాటు ఎందరో జాతీయ నాయకులు సందర్శించారు. ప్రపంచ శాంతికి యోగ, ధ్యానం అనే విషయంపై పిహెచ్‌డి చేశారు. 93 ఏళ్ల వయసులో కూడా ఆయన ఆరోగ్యంగా, ధారుడ్యంతో కనిపించేవారు.

సార్వా పనుల్లో రైతులు బిజీ
తోట్లవల్లూరు,జూన్ 17: తొలకరి పలకరింపుతో రైతులు సార్వా పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. వరుణుడు అనుకూలంగా ఉన్నా ప్రభుత్వం అనుకూలత లేదని రైతులు అంటున్నారు. అనుకున్న సమయానికంటే ముందుగానే వానలు రావటంతో పొలాలు దుక్కి దున్నటానికి, నారుమడులు పోయటానికి అవకాశం లభించింది. ప్రస్తుతం సార్వా వరిసాగు చేపట్టే రైతులు పొలం పనుల్లో నిగ్నమయ్యారు. పొలాలను ట్రాక్టర్లతో దున్నించటం, నారుమడులు పోస్తూ బిజీ అయ్యారు. బోర్లు ఉన్న రైతులందరూ నారుమడులు సిద్ధం చేస్తున్నారు. బోర్లు లేని రైతులు అష్టకష్టాలు పడుతూ పంట బోదెల్లో నిల్వ ఉన్న వాననీటిని బకెట్టుతో వేస్తూ మడులు సిద్ధం చేస్తున్నారు. మండలంలో సుమారు 8760 ఎకరాలలో ఈ సార్వా సీజన్‌కు వరి సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ విస్తరణాధికారి సునిల్‌గవాస్కర్ చెప్పారు. ఇందుకు తగ్గట్టు రైతులకు వరి విత్తనాలు అందుబాటులోకి రాకపోవటం శాపంగా మారింది. మండలంలోని 16 గ్రామాలకు ఒక్క తోట్లవల్లూరులోని నార్త్‌వల్లూరు పిఎసిఎస్‌కు మాత్రమే 1061 రకం వరి విత్తనాలు 17 టన్నులు వచ్చాయి. ఈ విత్తనాల పంపిణీ ఈ నెల 6న మొదలుపెట్టగా 9వ తేదీకే అయిపోయాయి. కేవలం మూడు రోజుల్లో 17 టన్నుల వరి విత్తనాలను రైతులు తీసుకువెళ్ళారు. నాలుగు రోజుల నుంచి రైతులు వరి విత్తనాల కోసం తిరిగి వెళుతున్నారు. సోమవారం ఏడు టన్నుల వరి విత్తనాలు మాత్రమే రెండో విడతగా వచ్చాయని పిఎసిఎస్ అధ్యక్షుడు గుత్తా రామకృష్ణ చెప్పారు. రెండో విడతకు కూడా 17 టన్నుల ఇండేంట్ పెడితే కేవలం ఏడు టన్నులు మాత్రమే వచ్చాయన్నారు. ఈ విత్తనాలు రైతులకు ఏ మాత్రం సరిపోవు. ఇంకా మండలంలోని భద్రిరాజుపాలెం, చాగంటిపాడు, దేవరపల్లి, ఐలూరు, పెనమకూరు, కుమ్మమూరు, గరికపర్రు, వల్లూరుపాలెం, బొడ్డపాడు, రొయ్యూరు గ్రామాల్లోని సహకార సంఘాలకు వరి విత్తనాలు రాకపోవటం ఆయా గ్రామాల రైతులకు శాపంగా మారింది. బయట గ్రామాలకు, ప్రైవేటు వ్యాపారుల వద్దకు వెళ్ళి విత్తనాలను కొనుగోలు చేసుకు వస్తున్నామని రైతులు చెపుతున్నారు. తోట్లవల్లూరు వచ్చినా ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళాల్సి వస్తోందంటున్నారు. నారుమడుల సమయానికి రైతన్నలకు పుష్కలంగావిత్తనాలను అందుబాటులోకి తీసుకురాకపోవటం వారిని కష్టాలకు గురిచేస్తోంది. ఇదిలా ఉండగా ఎక్కువగా సాగుచేసే బిపిటిలు (తెలుపు రకం) వరి విత్తనాలు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిపిటిల కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నామని అనేకమంది రైతులు చెపుతున్నారు. కీలక సమయంలో వ్యవసాయాధికారి సెలవుతో రైతులకు ఇక్కట్లు: రైతులు సార్వా పనుల్లో బిజి అయిన తరుణంలో మండల వ్యవసాయాధికారి సెలవులో ఉండటం పెద్ద లోపంగా తయారయిందని పలువురు రైతులు అంటున్నారు. పిఎసిఎస్‌లకు వరి విత్తనాలను ఎసిసీడ్స్ నుంచి తీసుకు రావటంలో వ్యవసాయాధికారి కీలక పాత్ర పోషించాల్సి ఉంది. ఏ సొసైటీకి ఎన్ని టన్నులు అందించాలో ఎఓ నిర్ణయిస్తారు. అయితే కొన్ని బలమైన కారణాల వల్ల ఎఓ శివప్రసాద్ నెలరోజులు సెలవు పెట్టాల్సి వచ్చింది. లంక పొలాల్లో ఇసుక మేటలు తొలగించుకునేందుకు రైతులకు అనుమతులు ఇవ్వటంలో ఎఓ సర్ట్ఫికెట్ ఇవ్వటం ఎంతో ముఖ్యమైనది. ఇసుక పాయలను రైతుల పొలాలుగా చూపటంతో అందులో ఇసుక తవ్వటానికి అనుమతులు ఇవ్వటం తనవల్ల కాదని, నిబంధనలకు విరుద్ధంగా చేయలేనని ఎఓ కుండబద్దలు కొట్టినట్టు అధికార పార్టీ నాయకులకు తేల్చి చెప్పటంతో సెలవు పెట్టమని ఒత్తిడి చేయటంతో ఆయన నెల రోజులు సెలవుపై వెళ్ళారు. అప్పటి నుంచి ఎఇఓ సునిల్‌గవాస్కర్ మాత్రమే కార్యాలయానికి వస్తున్నారు. ఎఇఓ వివరణ: ఎఇఓ సునీల్ గవాస్కర్‌ను వరి విత్తనాలపై వివరణ కోరగా నార్తువల్లూరు పిఎసిఎస్‌కు 17 టన్నుల విత్తనాలు వచ్చాయని, అవి అయిపోయాయన్నారు. రెండో విడత కూడా వస్తాయన్నారు. మండల కేంద్రంలోని సొసైటీకి మాత్రమే విత్తనాలు వస్తున్నాయన్నారు. ఏది ఏమైనా గతంలో పోలిస్తే ఈ ఏడాది విత్తనాల సరఫరా తక్కువేనని రైతులు పెదవి విరుస్తున్నారు.

‘అభయగోల్డ్’ ఎండిపై చీటింగ్ కేసు
కైకలూరు, జూన్ 18: ఎంతో మంది పేద ప్రజలను మభ్యపెట్టి కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన శ్రీ అభయగోల్డ్ కంపెనీ రచ్చకెక్కింది. కైకలూరు బ్రాంచ్ మూతపడడంతో ఖాతాదారులు ఖంగుతిన్నారు. చివరకు బాధితుల ఫిర్యాదు మేరకు కైకలూరు పోలీసులు కంపెనీ ఎడీపైన, బ్రాంచి మేనేజర్‌పైన చీటింగ్ కేసులు నమోదు
చేశారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలు ఇలా వున్నాయి. 2010 సంవత్సరంలో కైకలూరు గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఓ భవనంలో శ్రీ అభయగోల్డ్ స్కీమ్ కార్యాలయాన్ని స్థాపించారు. ఏజెంట్ల ద్వారా వందలాది మంది ఖాతాదారులను చేర్చారు. సుమారు కోటి రూపాయల వరకు వ్యాపారం సాగించారు. చెల్లించాల్సిన
సొమ్ము చెల్లించకుండా తాత్సారం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17 బ్రాంచిల్లో కల్లోలం రేగింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదైయ్యాయి. విజయవాడలో ఇటీవల ఎడీ కూకట్ల శ్రీనివాస్‌ను అరెస్టు చేసి జిల్లా జైలుకు పంపారు. ఇదిలావుండగా కైకలూరులో రెండోవ తేదిన కేసు నమోదు చేశారు. ఈ మేరకు టౌన్ ఎస్‌ఐ అశోక్‌కుమార్ ఎడీ శ్రీనివాస్, కైకలూరు బ్రాంచ్ మేనేజర్ మునగాల శ్రీదేవిలపై చీటింగ్ కేసులు నమోదు చేశారు. ఆదివారం ఆకివీడు మండలంలో భీమవరంలో శ్రీదేవిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం కైకలూరు స్టేషన్‌కు తీసుకువచ్చారు. రాత్రి 7 గంటల సమయంలో సిఐ అశోక్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆమెను బ్రాంచ్ కార్యాలయానికి తీసుకువెళ్ళి రికార్డులు తనిఖీ చేసేందుకు ప్రయత్నం చేశారు. వీఆర్వో అందుబాటులో లేకపోవడంతో తిరిగి వచ్చేశారు. సోమవారం బ్రాంచ్ కార్యాలయాన్ని పరిశీలించి రికార్డులను, కంప్యూటర్లును స్వాధీనం చేసుకున్నారు. ఆఫీసుకు తాళాలు వేసి సీలు వేశారు. మేనేజర్ శ్రీదేవిని రూరల్ స్టేషన్‌లో విచారణ నిమిత్తం పోలీసుల అదుపులో ఉంచారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం కైకలూరు పోలీసులు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న అభయా గోల్డ్ ఎడీ శ్రీనివాస్‌ను పిటి అరెస్టు వారెంట్‌తో కైకలూరు కోర్టుకు హాజరుపరిచారు. కైకలూరు న్యాయమూర్తి లక్ష్మీవరప్రసాద్ నిందితుడికి రిమాండ్ విధించగా శ్రీనివాసును పోలీసు బందోబస్తుతో తిరిగి విజయవాడ జైలుకు తరలించారు. రెండు రోజుల తరువాత శ్రీనివాసును విచారణకు అనుమతి తీసుకుని వస్తామని సమగ్ర విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. సిఐ మాట్లాడుతూ ప్రస్తుతం బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసులు నమోదు చేశామని, కైకలూరు బ్రాంచి కార్యాలయానికి తాళాలు వేశామని, రికార్డులు, హార్ట్ డిస్కులు స్వాధీనం చేసుకున్నామని దీనిపై విచారణ నిర్వహిస్తున్నామని తదుపరి చర్యలు విచారణ అనంతరం తీసుకుంటామని తెలిపారు.
బాధితులందరికీ రికవరీ చేస్తాం: నిందితుడు శ్రీనివాస్
కైకలూరు కోర్టుకు వచ్చిన నిందితుడు అభయాగోల్డ్ ఎడీ శ్రీనివాస్ విలేకర్లతో మాట్లాడుతూ బాధితులందరికీ న్యాయం చేస్తామని, నూరుశాతం రికవరీ చేస్తామని అన్నారు. అధికారుల లెక్కల్లో ప్రజలకు తాను చెల్లించాల్సింది రూ.36 కోట్లుగా చూపిస్తున్నారనని, రూ.25 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. తమకు రూ.165 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయన్నాయని ప్రజలకు ఇంకా కట్టాల్సింది రూ.25 కోట్లు మాత్రమేనని ఖాతాదారులు కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. రెండు నెలల్లో జైలు నుంచి బయటకు వస్తానని అందరికీ న్యాయం చేస్తానని చెప్పారు.

అర్జీదారులతో కిక్కిరిసిన కలెక్టరేట్
మచిలీపట్నం , జూన్ 17: ప్రజావాణి అర్జీదారులతో కలెక్టరేట్ సోమవారం కిక్కిరిసింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులు క్యూకట్టారు. కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం జ్యోతి, జాయింట్ కలెక్టర్ పి ఉషాకుమారి, డిఆర్‌వో ఎల్ విజయచందర్, అదనపు డిసిపి ప్రేమ్‌కుమార్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి అర్జీలను చిత్తశుద్ధితో పరిష్కరించాలన్నారు.
ప్రజావాణి అర్జీలు:
బందరు మండలం కరగ్రహారంలో 1992 సంవత్సరంలో సుమారు 50 కుటుంబాలకు 118 ఎకరాలు ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా చెరువుల నిమిత్తం పంపిణీ చేయగా, తరువాత ఆ స్థలాన్ని బలహీన వర్గాల ఇళ్ళ స్థలాల కోసం ప్రభుత్వం తీసుకుందని, దీనికి బదులుగా వేరే చోట చెరువులు లేదా వ్యవసాయం చేసుకోవడానికి భూమి కేటాయించాలని కోరుతూ ప్రజావాణిలో అర్జీ సమర్పించారు. రెవిన్యూ, డిఆర్‌డిఎ, డ్వామా, ఎస్‌సి కార్పొరేషన్ అధికారులు కరగ్రహారం గ్రామాన్ని వెంటనే సందర్శించి సమస్య పరిష్కారానికి తీసుకోవాలసిన చర్యలు గురించి నివేదిక సమర్పించాలని బందరు ఆర్డీవో సాయిబాబా, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి కె శివశంకరరావు, డ్వామా పీడి హనుమానాయక్‌కు కలెక్టర్ సూచించారు. గుడివాడ మున్సిపాలిటీ బిసి ఓటర్ల గణన సరిగా నిర్వహించలేదని మరీదు కృష్ణమూర్తి, కెఎన్ రాజా అర్జీ దాఖలు చేశారు. స్థానిక వలందపాలెంకు చెందిన ఖాజిబాబా స్వయం సహాయ సంఘం రైతు బజారులో స్టాలు కేటాయించాలని అర్జీ దాఖలు చేసింది. మొవ్వ మండలం నిడుమోలులో నివశిస్తున్న షెడ్యూల్డు కులాలకు చెందిన లావుడియా పున్నమ్మ, లావుడియా నాగమల్లేశ్వరితో పాటు 18 మందికి ఇళ్ళ స్థలాలు ఇప్పించాలని అర్జీ సమర్పించారు. పెనమలూరు అగ్నికులక్షత్రియ ఫిషర్‌మెన్ కో-ఆపరేటివ్ సొసైటీ పరిధిలో చెరువులు ఆక్రమణలు తొలగించి సర్వే చేసి హద్దులు చూపాలని ఎ దుర్గారావు అర్జీ దాఖలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పలువురు అర్జీదారులు అర్జీలను సమర్పించారు.

త్వరలో రేషన్‌కార్డులకు ఆధార్ నెంబర్లు సిద్ధం చేసుకోవాలి
కూచిపూడి, జూన్ 17: మొవ్వ మండలంలోని రైతులు నుండి 1422 ఫసలి నీటి తీరువా శిస్తు వసూళ్ళను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని తహశీల్దార్ జి భద్రు విఆర్‌ఓలను ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదు కార్యక్రమం 95 శాతం పూర్తయ్యిందన్నారు. ఈ నెల 23వ తేదీతో ముగియనున్న ఓటర్ల నమోదు కార్యక్రమం సందర్భంగా ఏరోజుకారోజు దరఖాస్తులను కంప్యూటరీకరణ చేయాలని విఆర్‌ఓలను ఆదేశించారు.
పాఠశాల విద్యార్థులకు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను తక్షణమే విచారణ జరిపి కంప్యూటరీకరణ చేయాలన్నారు. జూలై 1వ తేదీ నుండి 1423 ఫసలి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. మండలంలో 10,119 ఎల్‌పిజి గ్యాస్ కనెక్షన్‌ల లబ్ధిదారులు ఆధార్ కార్డులు, బ్యాంక్ ఎకౌంట్ నెంబర్లను సేకరించి ఫారాలను ఒక సెట్టు బ్యాంక్‌కు, తహశీల్దార్ కార్యాలయానికి ఒక సెట్టు, విఆర్‌ఓ వద్ద ఒక సెట్టు సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన తెలిపారు. త్వరలో నగదు బదిలీ పథకాన్ని పౌర సరఫరాల శాఖ రేషన్ కార్డులకు కూడా అమలుపర్చే అవకాశం ఉండటంతో రేషన్ కార్డుల నెంబరుతో పాటు ఆధార్ కార్డుల నెంబర్లను సేకరించుకుని సిద్ధం చేసుకోవాలని విఆర్‌ఓలకు సూచించారు.

బడిబయట పిల్లలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి
మచిలీపట్నం, జూన్ 17: బడిబయట పిల్లలను బడిలో చేర్పించి జిల్లాను బడిబయట పిల్లలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డా. బుద్ధప్రకాష్ ఎం జ్యోతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన విద్యా సంబరాల కార్యక్రమాల్లో భాగంగా మూడు వారాలలో బడిబయట పిల్లలను బడిలో చేర్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం పథకం, ప్రభుత్వం అమలుచేస్తున్న సౌకర్యాలను గురించి ప్రచారం నిర్వహించాలన్నారు. బడిబయట గుర్తించిన 1200 మంది చిన్నారులను బడిలో చేర్పించేందుకు మండల ప్రత్యేక అధికారులు, మండల విద్యా శాఖాధికారులు దృష్టి సారించాలన్నారు. వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో తాగునీటి వనరులు కలుషితం కాకుండా క్లోరినేషన్, బ్లీచింగ్ చేయాలన్నారు. ఆధార్ కార్డులు జారీ వేగవంతం చేయాలన్నారు. ఆగస్టు 1వ తేదీ నుండి వంట గ్యాస్ వినియోగదారులు ఆధార్ కార్డుల ద్వారా సబ్సిడీ నేరుగా బ్యాంకు ఖాతాలు ప్రారంభించి ఆధార్ నెంబర్లతో లింకప్ చేయడం, వాటిని గ్యాస్ కంపెనీలలోనమోదు చేయించడం వేగవంతం చేయాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను కూడా వేగవంతం చేయాలన్నారు. జిల్లాకు 2.41లక్షల బిటి పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం కాగా 2.50లక్షల ప్యాకెట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండి రైతులను మోసం చేసే కంపెనీలపై కేసులు నమోదు చేయాలన్నారు. ఉన్నతాధికారుల నుండి వచ్చే మెయిల్సును ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని ప్రత్యేకాధికారులకు సూచించారు.

అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై సమీక్ష
మచిలీపట్నం, జూన్ 17: పంట దిగుబడిలో నష్టపోయిన రైతులకు ఆర్థికంగా అదుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన నేషనల్ అగ్రికల్చర్ ఇన్యూరెన్సు పథకాన్ని మోడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్యూరెన్సు పథకంగా మార్పు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. బుద్ధప్రకాష్ ఎం జ్యోతి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో మోడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్యూరెన్సు పథకం అమలుతీరును కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి, జొన్న, కంది, పెసర, వేరుశనగ, పత్తి, మిర్చి, చెరకు పంటలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. చిన్న సన్నకారు రైతులతో పాటు అన్న కేటగిరిల రైతులు పథకానికి అర్హులన్నారు. రుణాలు తీసుకున్న రైతులందరు ఇన్సూరెన్సు ప్రీమియం చెల్లించాలని కలెక్టర్ చెప్పారు. రైతులందరు జూలై 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు గడువు పొడిగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయశాఖ జెడిని కోరారు.

ఈపాస్ వెబ్‌సైట్లలో కార్పొరేట్ కళాశాలల్లో అడ్మిషన్లు
మచిలీపట్నం (కల్చరల్), జూన్ 17: పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎ-1, ఎ-2, బి-1, బి-2 గ్రేడ్‌లతో ఉత్తీర్ణులైన విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల్లో అడ్మిషన్ల పథకం ద్వారా ప్రవేశం పొందడానికి ఈపాస్ వెబ్‌సైట్లలో అవకాశం కల్పించినట్లు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదాయ, కుల ధృవీకరణ పత్రము, ఫొటో, ఆధార్ కార్డు, రేషన్‌కార్డులతో హెచ్‌టిటిపిఎస్:// ఇపాస్ వెబ్‌సైట్. సిజిజి. జివోవి. ఇన్/కార్పొరేట్ అప్లికేషన్ ఫ్రమ్ డు అడ్రస్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ట్రాక్టర్ బోల్తా : డ్రైవర్ మృతి
కృత్తివెన్ను, జూన్ 17: మండల పరిధిలోని లక్ష్మీపురం పంచాయతీ హరిజనవాడలోని జాతీయ రహదారి వద్ద ట్రాక్టర్ పల్టీ కొట్టి డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా లోసరి బోనగాలదిబ్బలో ఉన్న ఆనంద్ ప్యాక్టరీలో పనిచేస్తున్న గూడ్లపాడు గ్రామానికి చెందిన వాన రాంబాబు (32) ప్యాక్టరీ నుండి రొయ్యల మేత ట్రాక్టర్‌పై లోడు చేసుకుని కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం ఒంటిల్లు గ్రామానికి వస్తుండగా మార్గమధ్యంలో వాహనానికి సైడ్ ఇస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్‌ఐ ఉస్మాన్‌ఖాన్ తెలిపారు. కుమార్తెను ఒడిలో పెట్టుకుని ట్రాక్టర్ నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడింది. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

25లోగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి విద్యార్థులు
ఆధార్ కార్డు నెంబర్లు నమోదు చేయించుకోవాలి
మచిలీపట్నం , జూన్ 17: కళాశాలలో చదువుతున్న ఎస్‌సి, ఎస్‌టి, బిసి విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోపు ఆధార్ కార్డు నెంబర్లు కళాశాలల్లో నమోదు చేయించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి ఉషాకుమారి అన్నారు. స్థానిక కృష్ణవేణి ఐటిఐ కళాశాలలో ఏర్పాటు చేసిన కళాశాలల ప్రిన్సిపాల్స్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2013-14 సంవత్సరానికి అన్ని కళాశాలల్లో ఈపాస్ వెబ్‌సైట్ రిజిస్ట్రేషన్ చేయాలని, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను ఎస్‌సి, ఎస్‌టి, బిసి కార్యాలయాలకు పంపాలన్నారు. విద్యార్థుల ఆధార్ కార్డులను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఆధార్ కార్డుల వివరాలను ఆప్‌లోడ్ చేయని విద్యార్థికి ఉపకార వేతనం మంజూరు కాదన్నారు. తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఓటు నమోదు చేయించాలని, ప్రతి సంవత్సరం యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లను సంబంధిత కార్యాలయాలకు అందచేయాలని సూచించారు. ఉపకార వేతనాలకు అర్హులైన విద్యార్థులకు వర్కుషాపు నిర్వహించాలని కోరారు.

పెట్రోల్ చార్జీల పెంపు ఉపసంహరించుకోవాలి
మచిలీపట్నం , జూన్ 17: ఆయిల్ కంపెనీలు పెట్రోల్ చార్జీల పెంపు ఉపసంహరించుకోవాలని ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లారుూస్ యూనియన్ బందరు డివిజన్ ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక కోనేరుసెంటరులో పెట్రోల్ చార్జీల పెంపుదలను నిరసిస్తూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ పెట్రోల్ ఛార్జీల నిర్వహణను ప్రభుత్వం మార్కెట్ శక్తులకు అప్పచెప్పిన కారణంగా లాభాపేక్షతో ఆయిల్ కంపెనీలు పెట్రోల్ ఛార్జీలను పెంచుతున్నాయన్నారు. రూపాయి విలువ పడిపోవటం వలన పెట్రోల్ చార్జీలు పెంచాల్సి వచ్చిందని చెప్పడం అసమంజసం అన్నారు. సిపిఐ పట్టణ కార్యదర్శి కొడాలి శర్మ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలన్నారు.

జంధ్యాలకు హాస్యనటుల నివాళి
సబ్‌కలెక్టరేట్, జూన్ 17: ‘హాస్యబ్రహ్మ’ జంధ్యాల చనిపోయారని చాలామంది భ్రమపడుతున్నారని మనందరి నవ్వుల్లో ఆయన ఎన్నటికి చిరస్థాయిగా నిలిచి ఉంటారని పలువురు హాస్యనటులు అన్నారు. సోమవారం సాయంత్రం నగరంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఆవరణలో కళామంజరి సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జంధ్యాల 12 వర్ధంతి కార్యక్రమం జరిగింది. ప్రముఖ హాస్యనటుడు ఏవిఎస్ మాట్లాడుతూ రవీంద్రభారతిలో గత పది సంవత్సరాలుగా జంధ్యాల వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. రెండు సంవత్సరాలుగా అనివార్య కారణాల వల్ల జంధ్యాల వర్ధంతి చేయలేకపోతున్నామని అందువల్ల నగరంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. చలనచిత్ర రంగంలో విభిన్న, విచిత్ర పాత్రలు సృష్టించిన వ్యక్తిగా జంధ్యాల చరిత్రలో నిలుస్తారన్నారు. జంధ్యాల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని చెప్పారు. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు రాజకీయ ఒత్తిడి భరించలేక తిరుపతి వచ్చి నాలుగు రోజుల పాటు జంధ్యాల సినిమాలు చూసి రిలీఫ్ అయ్యారని ఈ విషయాన్ని పి.వి.నరసింహారావు స్వయంగా చెప్పారని ఏవిఎస్ తెలిపారు. హాస్యం ఇలా వుంటుందని చెప్పిన మహానీయుడు జంధ్యాల అని కొనియాడారు. నవ్వు కోసం యూనివర్శిటిలు ప్రత్యేకంగా కోర్సు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ స్పీకర్ కూడా సభ్యులు నవ్వుతోనే ఏ విషయానైనా మాట్లాడాలని రూలింగ్ ఇవ్వాలంటూ నవ్వు ప్రాధాన్యతను తెలియజేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిహెచ్ శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ కళాకారులను ఆదుకోవాలన్నారు. వారికి చేతనైనంత సాయం చేసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. జంధ్యాల హాస్య నటులు నేటికీ సజీవంగా ఉన్నారన్నారు. హాస్య నటుడు గుండు హనుమంతరావు, అనంత్, జయలలిత మాట్లాడుతూ జంధ్యాల వల్లనే నేడు సినిమాల్లో నటిస్తున్నామని ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సమావేశంలో ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు, పిళ్ళా ప్రసాద్, నగరాల సీతారామస్వామి, మహాలక్ష్మమ్మ, దేవస్థానం అధ్యక్షుడు మరుపిళ్ళ హనుమంతరావు, జంధ్యాల సతీమణి అన్నపూర్ణ పాల్గొన్నారు. కళామంజరి సంస్థ అధ్యక్షుడు ఎ.వి.రమణ సభకు అధ్యక్షత వహించారు. సభకు ముందు కుమారి మద్దాలి సాయిచంద్రిక బృందం స్వాగత నృత్యాంజలి అలరించింది. ప్రముఖ రంగస్థల నటులు రంగావరల ఆదిశేషయ్య, బాయనేని సుబ్బారావులను ఆత్మీయ సత్కారం జరిగింది. సభ ముగిసిన తర్వాత గీతాంజలి ఆర్ట్స్ థియోటర్ వారి ‘మనసా కవ్వించకే’ హాస్య నాటిక ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. మంగళ, బుధవారాల్లో కూడా హాస్యనాటికలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.

జాతీయస్థాయి ఈత పోటీలకు
జిల్లా క్రీడాకారులు
విజయవాడ , జూన్ 17: గోవాలో ఈ నెల 20 నుండి 23వ తేదీ వరకు జరుగనున్న 30వ సబ్ జూనియర్ జాతీయస్థాయి స్విమ్మింగ్ (ఈత) చాంపియన్‌షిప్‌కు జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా స్విమ్మింగ్ సంఘ కార్యదర్శి సిహెచ్ మధుకుమార్ తెలిపారు. ఎంపికైన జిల్లా క్రీడాకారులను జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి కెపి రావు, డిఎస్‌డిఓ పి.రామకృష్ణ, సంఘ సన్యులు తదితరులు అభినందించారు. ఎంపికైన క్రీడాకారులు వివరాలు ఇలా వున్నాయి.
బాలురు: ఎం.లోహిత్, ఆర్.పాండురంగారెడ్డి, పి.సుజన్‌చౌదరి, డి.కె.టి.సుశాంత్, ఎం.వాసురామ్, భార్గవ్ అనికేత్
బాలికలు: సిహెచ్ జ్ఞానేశ్వరి, ఎల్.మేఘన
భారత క్రికెట్ జట్టులో రిక్కీబోయ్
విజయవాడ , జూన్ 17: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) నుండి విశాఖపట్నానికి చెందిన రిక్కీబోయ్ భారత అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికైననట్లు ఆంధ్ర క్రికెట్ సంఘ కార్యదర్శి జి.గంగరాజు తెలిపారు. గాంధీనగర్‌లోని ఎసిఎ కార్యాలయంలో సోమవారం విలేఖర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిక్కీబోయ్ 2008 సంవత్సరం నుండి విశాఖపట్నం జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికవ్వడం అభినందనీయమన్నారు. ఎసిఎ నుండి కెఎస్ భరత్ ప్రాబబుల్స్ జట్టులో ఉన్నాడని, రానున్న రోజుల్లో మరింత మంది క్రికెటర్లు ఎసిఎ నుండి భారతజట్టుకు ప్రాతినిధ్యం వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎసిఎ అకాడమీలను ప్రారంభించి క్రికెట్‌తో పాటు చదువును కూడా అందజేయడం జరుగుతుందన్నారు. సౌత్‌జోన్ (కడప), నార్త్‌జోన్(విజయనగరం), సెంట్రల్‌జోన్ (మంగళగిరి)లో మూడు అకాడమీలు ప్రారంభించినట్లు తెలిపారు. మాజీ భారతజట్టు సభ్యుడు ఎంఎస్‌కె ప్రసాద్ ఆధ్వర్యంలో అకాడమీలు నడపబడుతున్నాయని, లెవల్-3 శిక్షకులు ద్వారా మెళకువలు నేర్పుతున్నట్లు పేర్కొన్నారు. ఇండియాలోనే మూడు అకాడమీలు స్థాపించి శిక్షణ ఇస్తున్న సంఘం ఆంధ్ర క్రికెట్ సంఘం అన్నారు. సెంట్రల్ జోన్ (మంగళగిరి) అకాడమీని మంగళవారం ఉదయం భారతజట్టు మాజీ సభ్యుడు పద్మశ్రీ వివిఎస్ లక్ష్మణ్ చేతల మీదగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎసిఎ సంయుక్త కార్యదర్శి సిహెచ్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ మూడు అకాడమీలు స్థాపించి శిక్షణ ఇచ్చి విద్యకు కూడా ప్రాముఖ్యతనిస్తున్నట్లు తెలిపారు. 9 కోట్ల వ్యయంతో అకాడమీలు ప్రారంభించడం జరిగిందని, ఇంకా 6 నెలల్లో అకాడమీలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయని, ఇండోర్‌లో శిక్షణకు కావల్సిన అన్ని సౌకర్యాలు అకాడమీలో ఉన్నాయన్నారు. అనంతరం ఎసిఎ కార్యదర్శి జి.గంగరాజు రిక్కిబోయ్‌కు లక్ష రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. విలేఖర్ల సమావేశంలో ఎసిఎ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఎంఎస్‌కె ప్రసాద్, సెంట్రల్ జోన్ కార్యదర్శి కె.రమేష్, జిల్లా సంఘ కార్యదర్శి ఎ.యల్లారావు, సిఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

* కావూరికి మంత్రి పదవిపై హర్షాతిరేకాలు
english title: 
kavuri

తెలంగాణ కోసం మాట్లాడినందుకే సిఎం నాపై కక్ష పెంచుకున్నాడు..

$
0
0

కమాన్‌పూర్, జూన్ 17: తాను పదవుల కోసమో.. టిక్కెట్ల కోసమో పార్టీ మారలేదని, తెలంగాణ సాధనే తమ ముఖ్య ధ్యే యమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వివేకానంద అన్నారు. సోమవారం కమాన్‌పూర్ మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా క్రాస్‌రోడ్డు వద్ద స్వాగతం పలికి బైక్ ర్యాలీతో తొలుకొ ని వచ్చారు. అలాగే స్థానిక బస్టాండ్ వద్ద టిఆర్‌ఎస్ జెండాను ఎగురవేశారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపైన నమ్మకం లేకనే విసికి వేసారి తెలంగాణ సాధన కోసం టిఆర్‌ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. తన తండ్రి ఆశ యం ఒక్కటే ప్రత్యేక తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. తె లంగాణ రాష్ట్రం సాధించే సత్తా టిఆర్‌ఎస్‌కే ఉందని పేర్కొన్నా రు. మల్హర్ మండలంలో జరిగిన రచ్చబండలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడనివ్వకుండా తమ గొంతు నొక్కియత్నించి అడ్డు తగిలారని, ఆసమయంలో తెలంగాణ గురించి మాట్లాడగా సి ఎం జీర్ణించుకోలేక నాపై కక్ష కట్టాడని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్‌ను విడే ఉద్దేశ్యంతో ఉన్నారని, ఆజాద్ తెలంగాణ ఉద్యమంపై కేంద్రానికి స్పష్టత ఇవ్వక తప్పుడు సంకేతాలు పంపారని ఆరోపించారు. నూతనంగా ఎన్నికైన ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ తెలంగాణాకు సానుకూలంగానే వ్యవహరిస్తాడనే నమ్మకం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలోని వనరులు దోచుకునేందుకు రాష్ట్రాన్ని వేరు కానివ్వడం లేదని, దీనిలో భాగంగా తాడిచర్ల బొగ్గు గనులు సీమాంధ్ర వాసులకు అప్పగించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సాధించే వరకు కలిసికట్టుగా పోరాడుదామని ఆయన అన్నారు. ఎంపి సమక్షంలో ముత్తారం మండల మాజీ కో ఆప్షన్ సభ్యుడు జానీతోపాటు కొలిపాక లక్ష్మీ, ఇరుగురాల్ల లక్ష్మీలతోపాటు తదితరులు టి ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి, నాయకులు సునీల్ రెడ్డి, కోరుకంటి చందర్, గంట వెంకట రమణారెడ్డి, గుర్రం లక్ష్మీమల్లు, నల్లవెల్లి శంకర్, కాపురబోయిన భాస్కర్, మేకల సంపత్, ఇంతియాజ్, అలుగువేని కృష్ణవేణి, జ్యోతిరెడ్డి, పిడుగు అంజి, మచ్చ గట్టయ్య, దామర దేవయ్యలతోపాటు తదితరులు పాల్గొన్నారు.
సిఎం, స్పీకర్
దిష్టిబొమ్మల దగ్ధం
కరీంనగర్ టౌన్, జూన్ 17: టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి రెండు రోజుల పాటు సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక్‌లో సోమవారం సాయంత్రం సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నాయకులు, కార్యకర్తలు సిఎం, స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు సర్దార్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ శాసనసభలో తెలంగాణ పదం వినపడవద్దని సీమాంధ్ర సిఎం, స్పీకర్, ప్రతిపక్ష నేత చంద్రబాబులు కుట్రలు పన్ని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఇలాగే సస్పెండ్‌లు చేసుకుంటూ పోతే రాబోయే 2014 ఎన్నికల్లో ప్రజలకు సీమాంధ్ర నాయకులను సస్పెండ్ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, అనంతుల రమేష్, మైఖేల్ శ్రీను, పెండ్యాల మహేష్, మాజిద్, శ్రీనివాస్‌గౌడ్, సంపత్, సుధాకర్, ఓంప్రకాష్, అరుణ రేణుక, సత్యనారాయణ, శ్రావణ్‌లతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పందిల్లలో పొలం పనుల్లో బయల్పడిన ప్రాచీన విగ్రహం
హుస్నాబాద్,జూన్ 17: పందిల్ల గ్రామంలో గడ్డం సంపత్ అనే రైతు వ్యవసాయపనుల్లో భాగంగా ట్రాక్టర్‌తో దున్నుతుండగా ఓ ప్రాచీన విగ్రహం మంగళవారం నాడు బయల్పడింది. ఈ విగ్రహం అలనాటి జైన మతానికి చెందినదా.. లేక బయ్యన్న దేవుడిదా తెలియక గ్రామస్థులు నాటి పురాణ ఇతిహాసాలను తిరగేస్తున్నారు. కాగా ముందుగా హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహిచేందుకు సిద్ధమయ్యారు.
డయల్ యువర్ కలెక్టర్‌తో సమస్యలు పరిష్కారం
కరీంనగర్, జూన్ 17: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ద్వారా ప్రతి సోమవారం ప్రజలు ఫోన్ ద్వారా తెలిపిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఇంచార్జి కలెక్టర్ హెచ్. అరుణ్‌కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులను సమావేశ పరిచి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. సుల్తామాబాద్‌కు చెందిన కిశోర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి సంబంధించిన 41దుకాణాలు బహిరంగ వేలం నిర్వహించాల్సి ఉందని తెలుపగా ఇంచార్జి కలెక్టర్ స్పందిస్తూ పరిశీలించి చర్య తీసుకుంటామని తెలిపారు. వేములవాడ నుండి శ్రీనివాస్ మాట్లాడుతూ నగర పంచాయతీ పరిధిలో ఫినో సంస్థ ద్వారా వృద్ధాప్య, వితంతు పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయడం లేదని తెలిసిందన్నారు.
విత్తనాల కోసం మళ్లీ రోడ్డెక్కిన రైతులు
మల్లాపూర్, జూన్ 17: మల్లాపూర్‌లో సోనియాబీన్ విత్తనాల కోసం రైతన్నలు సోమవారం మళ్లీ రోడ్డెక్కి 3గంటలపాటు ధర్నా,రాస్తారోకో చేశారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయ. ట్రాఫిక్ స్తంభించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు సర్థిచెప్పినా ససేమిరా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను శాంతపర్చేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. గత నాలుగు రోజుల క్రితం సోయాబీన్ విత్తనాల కోసం రోడ్డెక్కి ఆందోళన చేస్తే రెండు రోజుల్లో విత్తనాలు సరఫరా చేస్తామని ఇచ్చిన హామీ అధికారులు నిలుపుకోకుండా అన్నదాతలను అష్టకష్టాలు చేస్తున్నారని ఆగ్రహంతో ఊగిపోతూ ఆగ్రోస్ సెంటర్ ఎదుట 300మంది రైతులు మళ్లీ సోమవారం బైఠాయించి సోయాబిన్ విత్తనాలు అందించే వరకు ఆందోళన విరమించబోమని భీస్మించుకు కూర్చొని ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ విషయం తెలుసుకున్న తహశీల్దార్ జయరాజ్, ఎస్సై చిట్టిబాబు సంఘటన స్థలానికి చేరుకొని రైతులను శాంతించే ప్రయత్నం చేయగా ఆగ్రహించిన రైతులు విత్తనాలు సరఫరా చేసే వరకు ఆందోళన ఆపమంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో మెట్‌పల్లి వ్యవసాయ శాఖ ఎడి అజారోద్దీన్ తహశీల్దాన్ ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా సోయాబిన్‌విత్తనాల కొరత మల్లాపూర్‌లోనే కాదు..జిల్లా వ్యాప్తంగా ఉందని, ప్రభుత్వం బీహార్ రాష్ట్రం నుండి సోయాబిన్ విత్తనాలను మరో 2,3రోజుల్లో దిగుమతి చేసుకొని రైతులకు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు. 3రోజుల్లోగా సోయాబీన్ విత్తనాలు అందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
మళ్లీ మొదటికొచ్చిన చెరువు పంచాయతీ..
ఎల్లారెడ్డిపేట, జూన్ 17: ఎల్లారెడ్డిపేట మండలం గుండారంలో చేపల చెరువు పంచాయతీ మళ్లీ తార స్థాయికి చేరింది. ఇరువర్గాల్లో నిప్పులు పోసింది. తమకు అనుమతులు ఉన్నాయని పేర్కొంటూ ఓ సామాజిక వర్గం సోమవారం ‘ఖాకీ’ నీడలో చేపల కోసం వల విసిరింది. చేపలెలా పడుతారంటూ జనం తిరగబడింది. వలలను లాక్కోవడానికి యత్నించింది. చెరువు వద్ద ఇరు వర్గాల నడుమ మాటల యుద్ధానికి దారి తీసింది. తాము చెరువు మరమ్మత్తుకు చెమటోడ్చామని మండి పడింది. ఇదేం న్యాయం అంటూ పోలీసులను నిలదీసింది. ఆగ్రహించిన పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఆందోళకారులను చెదరగొట్టారు. సుమారు ఐదు గంటల పాటు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. స్థానికుల కథనం మేరకు.. గత పదేళ్ల కిందట గ్రామ శివారులో ప్రజల భాగస్వామ్యంతో పసర్ల చెరువు నిర్మించారు. అందులో చేపల పెంపకం చేపట్టి వచ్చిన ఆదాయాన్ని గ్రామస్థులు సమానంగా పంచుకునేవారు. ఇటీవల ఓ సామాజిక వర్గానికి చెందిన మాజీ, తాజా ప్రజాప్రతినిధి పంచాయతీ సభ్యుల తీర్మాణం లేకుండానే చెరువును వారి సంఘం పేరిట నమోదు చేయించారు. చెరువులో చేపల పెంపకం తమకే చెందుతుందని కోర్టును ఆశ్రయించారు. దాంతో పంచాయతీ మొదలైంది. గతంలో వివాదంపై అప్పటి ఆర్డీవో సునంద, సిరిసిల్ల గ్రామీణ, పట్టణ సీ ఐలు మహేశ్‌గౌడ్, సర్వర్ విచారణ జరిపారు. అందరు కలిసి పెంపకాన్ని చేపట్టాలని సూచించారు. ఓ వర్గం వారు అంగీకరించలేదు. కోర్టు ఆదేశాల మేరకు మత్స్య శాఖ అధికారులు గతంలో గ్రామస్థులతో సమావేశమయ్యారు. చెరువులో ప్రజలు, సంఘం వారికి హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో సామాజిక వర్గం కోర్టును ఆశ్రయించి చెరువులోని చేపలను పట్టుకోవడానికి అనుమతులున్నాయని పేర్కొంటూ సిద్ధమైంది. అందుకు పోలీసుల సహాయం కోరింది. విషయం తెలుసుకున్న జనం చెరువు వద్దకు చేరుకుంది. భారీ ఆందోళన చేపట్టింది. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వివాదానికి దిగింది. మహిళలు చెరువులోనికి చొచ్చుకుపోవడానికి యత్నించారు. ఆగ్రహించిన పోలీసులు లాఠీచార్జీ చేశారు. గ్రామస్థులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. చేపలు పట్టడాన్ని నిలిపి వేయాలని ఆదేశించారు. ఎస్సై దామోదర్‌రెడ్డి నేతృత్వంలోని పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కోర్టు ఆదేశాల మేరకు తాము బందోబస్తు కల్పించామని పేర్కొన్నారు. ఇరు వర్గాల వారితో సమావేశమై శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పట్టిన చేపలను ఇరువర్గాల వారు లాక్కున్నారు. అటవీ శాఖ అధికారులు చెరువు రిజర్వ్ అటవీ పరిధిలోకి వస్తుందని చేపలు పట్టడానికి వీలు లేదని స్పష్టం చేశారు.

తెలంగాణకు దిగ్విజయ్‌సింగ్ సానుకూలమే - పెద్దపల్లి ఎంపి వివేక్ -
english title: 
vivek

తెరాసలో ముందస్తు కసరత్తు

$
0
0

మహబూబ్‌నగర్, జూన్ 17: తెరాసలో ముందస్తు కోలాహలం కనబడుతోంది. ఇప్పటి నుండే గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు కెసిఆర్ ప్రత్యేకంగా మహబూబ్‌నగర్ జిల్లాపై దృష్టి పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే సంవత్సరం ఎన్నికలు ఏప్రిల్, లేక మేలో జరుగనున్న నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాలలోనే జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు తెలిసింది. అందుకు గాను కొంతమంది నేతలకు కొన్ని బాధ్యతలు కూడా అప్పజెప్పినట్లు తెలిసింది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఎంపి మంద జగన్నాథం, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నిరంజన్‌రెడ్డికి ఆ పని అప్పజెప్పినట్లు తెలిసింది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని గద్వాల, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఈ పరిధిలోని అన్ని మండలాల్లో పార్టీని పటిష్టం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాలని కూడా కెసిఆర్ ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే కొల్లాపూర్‌కు జూపల్లి కృష్ణారావు ప్రాతినిథ్యం వహిస్తుండటం, ఎంపి మంద జగన్నాథం కూడా ఇటీవల టిఆర్‌ఎస్‌లోకి రావడంతో ఈ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మెరుగైందని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. ఇదే అంశాన్ని కూడా కెసిఆర్ ధృవీకరించినట్లు కూడా తెలిసింది. గత రెండు రోజుల క్రితం ఎంపి మంద జగన్నాథం అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల నేతలు, కుల సంఘాల నేలతో హైదరాబాద్‌లో రహస్యంగా మంతనాలు జరిపినట్లు కూడా సమాచారం. అందులో ప్రధానంగా రెండు వర్గాలకు చెందిన పెద్ద మనుషులు కూడా మంద జగన్నాథంతో భేటి కావడంతో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలో తెరాస బలోపేతం కోసమే ఈ సమావేశం జరిగినట్లు తెలిసింది. అంతేకాకుండా ఉద్యోగ సంఘాల నేతలు కూడా మంద జగన్నాథంతో కొందరు భేటి అయినట్లు తెలిసింది. అలంపూర్ నియోజకవర్గం నుండి మంద జగన్నాథం తనయుడిని రాబోయే ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా రంగంలోకి దింపనున్న నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నట్లు తెలిసింది. తెరాస పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి కూడా ఎలాగైనా నడిగడ్డలో గులాబీ జెండాను ఎగుర వేయాలని వ్యూహాలను రచించుకుంటున్నట్లు కూడా సమాచారం. మంద, జితేందర్‌రెడ్డిలకు ఆ రెండు నియోజకవర్గాలలో మంచి పరిచయాలు ఉండటంతో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. ముందస్తుగా కెసిఆర్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉండటంతోనే ఇలాంటి సమావేశాలు జరుగుతున్నాయని కూడా తెరాస వర్గాలు భావిస్తున్నాయి. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలపై కెసిఆర్ దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఈ నియోజకవర్గాల ఇన్‌చార్జిలకు బలమైన నాయకత్వం లేదనే సమాచారం కెసిఆర్‌కు అందడంతో ఈ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు రెండు, మూడు నెలల్లోపు క్యాడర్‌ను పెంచుకుని నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలుస్తారనే ప్రచారం జరిగితే ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గాల ఇన్‌చార్జిలకే భవిష్యత్తులో టికెట్లు దక్కే అవకాశాలు ఉంటాయి. లేనిపక్షంలో ఇతరులకు కెసిఆర్ టికెట్లు ఇచ్చి అక్కడ పోటీ చేయించే అవకాశాలు కూడా లేకపోలేవు. కొందరు నాయకులు ఈ మూడు నియోజకవర్గాల కోసం టికెట్లను ఆశిస్తున్నారు. వారితో కొందరు నాయకులు మంతనాలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తుంది. కెసిఆర్ ప్రాతినిథ్యం వహించే మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో నాయకత్వ లోపం ఉండటంతో ఆ నియోజకవర్గాలలో పార్టీని పటిష్టం చేయాలని కూడా మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్యలకు కూడా కెసిఆర్ సూచించినట్లు తెలిసింది. ఏదిఏమైనా మహబూబ్‌నగర్ జిల్లాపై తెరాస అధినేత కెసిఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం.

కలెక్టరేట్ ఎదుట స్వీపర్ల ధర్నా
మహబూబ్‌నగర్, జూన్ 17: జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న కంటింజెన్సీ స్వీపర్లు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ పార్ట్‌టైం కంటింజెన్సీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గట్టన్న మాట్లాడుతూ స్వీపర్ల సమస్యలను పరిష్కరించనందుకే నిరవధిక సమ్మెకు దిగామని, సమస్యలు పరిష్కరించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో 1700 మంది స్వీపర్లు వివిధ పాఠశాలల్లో పని చేస్తున్నారని, వీరిలో 250 మందికి నెలకు కేవలం రూ. 75 మాత్రమే వేతనాలు ఇస్తున్నారని, మిగతా వారికి రూ. 1623 వేతనం ఇస్తున్నారని తెలిపారు. మిగతా 150 మందికి ఎలాంటి వేతనాలు ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని, పేరుకు పార్ట్‌టైం స్వీపర్లు అయినప్పటికీ ఫుల్‌టైంగానే పని చేస్తున్నారని, పాఠశాలల్లో పని చేస్తున్న స్వీపర్లందరిని 112 జిఓ ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఎనిమిది నెలల వేతనాలు కూడా ఇవ్వలేదని, తక్షణమే ఆ వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్వీపర్ల సమ్మెకు మద్దతు పలికిన టిఆర్‌ఎస్ జిల్లా కోకన్వీనర్ బెక్కం జనార్దన్, ఐఎఫ్‌టియు నాయకులు కృష్ణయ్య, చిన్న, జెఎసి నాయకులు సత్యనారాయణ, రామకృష్ణారావులు కూడా మాట్లాడారు. స్వీపర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వీపర్ల సంఘం నాయకులు షబ్బీర్, చంద్రాయుడు, రాంచంద్రయ్య, ఫకీర్ ఆహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రంలో బిజెపిదే అధికారం
* రాష్ట్రంలో బలీయమైన శక్తిగా ఎదుగుతాం
* బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మాలతిరాణి
మహబూబ్‌నగర్, జూన్ 17: ఎన్డీఎ భాగస్వామ్యంలోని జెడియు బయటకు పోయినంత మాత్రాన బిజెపికి ఎలాంటి నష్టం లేదని, మిత్ర ద్రోహానికి పాల్పడ్డ నితీష్‌కుమార్‌కు ఆ రాష్ట్ర ప్రజలు రాబోయే కాలంలో తగిన బుద్ధి చెబుతారని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మాలతిరాణి ఆరోపించారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశ ప్రజలు బిజెపి పాలనను కోరుకుంటున్నారని, నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయాలనే పట్టుదల రోజురోజుకు ప్రజల్లో పెరిగిపోతుందని, ఈ ఆదరణను చూసి కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని విమర్శించారు. ఎన్ని శక్తులు ఏకమైనా బిజెపి శక్తిని ఎవరు ఎదుర్కోలేరని, దేశంలో మరింత బలియమైన శక్తిగా బిజెపి ఎదుగుతుందని ఆమె అన్నారు. అన్ని సర్వేలు నరేంద్ర మోడీకి అనుకూలంగా చెబుతున్నాయని, ఎవరితో పొత్తు ఉన్నా, లేకున్నా బిజెపికి మాత్రం అధికారం రావడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో కూడా రాబోయే ఎన్నికల్లో ఊహించని పరిణామాలు కూడా జరుగుతాయని, బిజెపి ఇటు తెలంగాణ, అటు కోసాంధ్రంలో బలంగా సీట్లను గెలుస్తుందని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలుచుకుని రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించనున్నట్లు తెలిపారు. మరో రెండు, మూడు నెలల్లో రాష్ట్ర రాజకీయాలన్ని బిజెపి వైపు మల్లనున్నాయని తెలిపారు. బిజెపిలోకి పెద్దఎత్తున మహిళలు చేరుతున్నారని, అందుకు నిదర్శనం వనపర్తిలో జరిగిన మహిళా మోర్చా సదస్సుకు ఊహించని రీతిలో మహిళలు హాజరుకావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్లు ఉండటంతో బిజెపి తరఫున మహిళలు పోటీలో ఉంటారని, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకే మహిళా మోర్చా సదస్సులను నియోజకవర్గాల వారిగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. 2014 ఎన్నికల నాటికి బిజెపిలో మహిళా నాయకత్వం మరింత పెరగనుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మహిళా బిల్లును తీసుకురావడంలో చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు దేశం కోసం పనిచేసే పార్టీ కేవలం బిజెపియే కాబట్టి మహిళలు బిజెపి వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండురెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పార్టీ రోజురోజుకు బలంగా పెరుగుతుందని, నాగం జనార్దన్‌రెడ్డి బిజెపిలోకి రావడంతో పలు నియోజకవర్గాలలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు త్వరలోనే పెద్దఎత్తున బిజెపిలో చేరుతున్నట్లు తెలిపారు. ఈనెల 20న దళిత మోర్చా జిల్లా సదస్సు, 23న మజ్దూర్ కార్మిక సదస్సు, 25న యువమోర్చా సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బిజెపి అనుబంధ మోర్చాలను కూడా పటిష్ట పరిచి రాబోయే ఎన్నికల్లో సత్తా చాటుతామని అన్నారు. విలేఖరుల సమావేశంలో మహిళా మోర్చా నాయకురాళ్లు పద్మజారెడ్డి, రామేశ్వరి, ఉమాదేవి, అంజమ్మ, నాయకులు నరేందర్, నాగరాజు, అనంతరెడ్డి, అంజయ్య, బుడ్డన్న తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజలను వంచించడానికి కుట్ర
* టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నిరంజన్ రెడ్డి
వనపర్తి, జూన్ 17: ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ ప్రజలను మరోసారి వంచించడానికి సీమాంధ్ర పార్టీలైన కాంగ్రెస్, టిడిపిలు ప్రయత్నిస్తున్నాయని టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మట్లాడుతూ తెలంగాణకోసం చర్చలు జరుపుతున్నామని కాంగ్రెస్, తాము అనుకూలంగానే ఉన్నామని టిడిపి దొంగాట ఆడుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంపై పూర్తిగా నమ్మకం కోల్పోయిన కిరణ్‌కుమార్ రెడ్డి సర్కార్ ఉద్యమకారులపై నిర్బంధకాండ కొనసాగిస్తున్నదన్నారు. ప్రజల ఆకాంక్షను, సుదీర్గకాలంగా అపరిస్కృతంగా ఉన్న సమస్యను పరిస్కరించకపోగా ఉద్యమకారులపై నిర్భంధాన్ని కొనసాగిస్తూ కేంద్రం మెప్పు పొందడానికి ప్రయత్నిస్తున్నదన్నారు. సీమాంధ్ర పార్టీల కదలికలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, అవకాశం వచ్చినపుడు వారు ఓట్లద్వారా చూపిస్తారన్నారు. ఎఐసిసిలో సీమాంధ్రుల మాటలకున్న ప్రాధాన్యత తెలంగాణ ప్రాంత ప్రతినిధులకు లేదని తెలిసి ఎఐసిసిలో ఎంతపెద్దపదవి తీసుకున్నా వన్నరాదని, అపవాదే మిగులుతుందని ఆయన చిన్నారెడ్డినుద్దేశించి విమర్శించారు. 13 సంవత్సరాల క్రితం తెలంగాణకు ప్రత్యేక పిసిసి కావాలని కోరిన చిన్నారెడ్డి నేడు తెలంగాణ గురించి మాట్లాడకుండా ఎఐసిసిలో చేరడాన్ని తెలంగాణ ప్రజలు ఏవిధంగా అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. ఇది తెలంగణకు అనుకూలమా, ద్రోహమా అని ప్రశ్నించారు. టిడిపి సమైఖ్యవాదం వినిపించిన ఆరు సంవత్సరాలు అధికార ప్రతినిధిగా ఉన్న రావుల నేడు తెలంగాణ అంటే ఎలా చెల్లుబాటవుతుందన్నారు. టిడిపికి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జెఎస్సి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు పార్టీల స్థానిక నాయకులు తెలంగాణ ద్రోహులేనని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు గట్టుయాదవ్, నాగవరం వెంకట్, నాగమ్మ, జ్యోతి, సతీశ్‌కుమార్, చిలుక రవి, కిట్టు, లతీప్, గందం ఆంజనేయులు, రాము, చరణ్‌దీప్ తదితరులు పాల్గొన్నారు.

ఆధార్ కార్డులున్న విద్యార్థులకే ఉపకార వేతనాలు
* వివరాలు ఇవ్వని కళాశాలలను బ్లాక్‌లిస్టులో పెడతాం
* సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయప్రకాష్
నాగర్‌కర్నూల్, జూన్ 17: జిల్లాలోని వివిధ సంక్షేమ శాఖల ద్వారా ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌కోసం దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు విధిగా ఆధార్ కార్డును జతచేయాల్సి ఉంటుందని, ఆధార్ కార్డులు ఉన్నవారికే ఫలాలు అందుతాయని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటి డైరక్టర్ జయప్రకాష్ తెలిపారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందీరంలో జరిగిన డివిజన్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాల్స్ సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతేడాదికి సంబందించి విద్యార్థులు ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తులకు సంబందించిన వివరాలను చాలా కళాశాలలకు చెందిన వారు ఇంకా అందచేయలేదని, అట్టి కళాశాలల వారు వారం రోజుల్లో ఇవ్వకపోతే అట్టి కళాశాలలను బ్లాక్‌లీస్టులో పెడతామని హెచ్చరించారు. గత సంవత్సరం ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్‌మెంట్ పొందిన వారిలో ఆధార్ కార్డు వివరాలు అందించని వారు కూడా వెంటనే తమ నెంబర్లను ఇచ్చేలా చూడాలన్నారు. విద్యార్థులకు ఆధార్ కార్డులను ఇచ్చేందుకు ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నాగర్‌కర్నూల్ ప్రాంతానికి చెందిన వారికి పట్టణంలోని సాధన డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని, అచ్చంపేటలో చైతన్య కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని విద్యార్థులు ఉపయోగించుకునేలా ప్రిన్సిపాల్స్ ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయా కళాశాలలకు మంజూరైన ఫీజు రియంబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు తదితర వాటిని సమీక్షించారు. ఈ సమావేశంలో ఎటిడబ్ల్యువో రాములు, ఎఎస్‌డబ్ల్యువో భీమయ్యగౌడ్, పర్యవేక్షకులు సత్యనారాయణ పాల్గొన్నారు.

సిఎంది నియంతృత్వ పాలన
* టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్య
మహబూబ్‌నగర్, జూన్ 17: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిది నియంతృత్వ పాలనలా కొనసాగుతుందని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్య ఆరోపించారు. సోమవారం మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విఠల్‌రావు ఆర్య మాట్లాడుతూ తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, నాలుగున్నర కోట్ల ప్రజలు తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపిస్తుంటే అణచివేయడానికి సిఎం కుట్ర పన్నాడని విమర్శించారు. సిఎంకు తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వత్తాసు పలుకుతుండటంతోనే నియంతలా వ్యవహరిస్తున్నాడని, ముఖ్యమంత్రి చరిత్రలు తెలుసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నియంతలా వ్యవహరించిన హిట్లరే కనుమరుగైన సంగతి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలుసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమ తాకిడికి అసెంబ్లీ ఒక్కరోజు కూడా కొనసాగడం లేదని, ఇలాంటి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎలా కూర్చుంటున్నారని, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి ఒక్క రూపాయి ఇవ్వనని బహిరంగంగా చెప్పిన ముఖ్యమంత్రిని మంత్రులు, ఎమ్మెల్యేలు నిలదీయకపోవడం ఈ ప్రాంత ప్రజలను అవమానించినట్లేనని అన్నారు. మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ చలో అసెంబ్లీకి పిలుపునిస్తే ముఖ్యమంత్రి ఉద్యమాన్ని పోలీసులతో అణచివేయడానికి 40వేల మంది పోలీసులను రప్పించుకుని సాధించిన విజయం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఉద్యమానికి భయపడి అసెంబ్లీకి ప్రైవేటు వాహనాలలో వెళ్లారంటే తెలంగాణ వాదుల విజయమా, లేక ముఖ్యమంత్రి విజయమో ప్రజలకు అర్థమైపోయిందని, ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమం ముందు ఓటమి చెందాడని ఎద్దేవా చేశారు. ఉద్యమంలో సిఎంతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రికి వత్తాసు పలుకుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు కాలగర్భంలో కలువకతప్పదని హెచ్చరించారు. టిఆర్‌ఎస్ జిల్లా కోకన్వీనర్ బెక్కం జనార్దన్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న టిడిపి, అవినీతిలో కూరుకుపోయిన వైకాపాలు ముమ్మాటికీ సమైక్యవాద పార్టీలేనని, ఆ పార్టీల జెండాలకు తెలంగాణ ప్రాంతంలో స్థానం లేకుండా చేస్తామని, భవిష్యత్తులో జరిగే ఉద్యమంలో సీమాంధ్ర పార్టీలకు జెండాలు ఎగురవేసే వారు కరువవుతారని ఎద్దేవా చేశారు. విలేఖరుల సమావేశంలో తెరాస నాయకులు కృష్ణ, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘ప్రజావాణి’కి ఫిర్యాదుల వెల్లువ
* సమస్యల పరిష్కారానికి పెద్దపీట : కలెక్టర్
మహబూబ్‌నగర్, జూన్ 17: ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించిన ప్రజావాణికి సోమవారం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ను కలిసి నేరుగా విన్నవించుకున్నారు. అదేవిధంగా గత వారంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై కూడా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కాగా ప్రజావాణికి వివిధ గ్రామాల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారులతో కలెక్టరేట్ ఆవరణలో బారులు తీరి నిల్చున్నారు. ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరించాలని, అందుకు గాను అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని అన్నారు. ప్రతి ఫిర్యాదును కంప్యూటరైజేషన్ చేసి వచ్చే వారానికి కల్లా సంబంధిత అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. గతంలో వచ్చిన ఫిర్యాదులు తరచూ రాకుండా ఉండేలా చూసినప్పుడే ప్రజావాణికి విలువ ఉంటుందని, ఫిర్యాదుదారులకు సమస్య పరిష్కారమైనట్లు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అన్నారు. ఒకవేళ సమస్య పరిష్కారం అధికారుల పరిధిలో లేకుంటే ఆ విషయాన్ని కూడా ఫిర్యాదుదారుడికి సూచించాలని అన్నారు. భూతగాదాల విషయాలలో జాగ్రత్త వహించాలని, ఆ ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెసి శర్మన్, అదనపు జెసి రాజారాం తదితరులు పాల్గొన్నారు.

* నియోజకవర్గ ఇన్‌చార్జిలపై అభిప్రాయ సేకరణ * గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేందుకు వ్యూహం * మండలాల నేతలతో రహస్య సమావేశాలు * పలు నియోజకవర్గాల ఇన్‌చార్జిల నాయకత్వంపై అసంతృప్తి
english title: 
trs

ఇక ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే

$
0
0

సంగారెడ్డి,జూన్ 17: ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే జరిగేలా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులతో వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రజలకు సులువుగా అర్థమయ్యేల అన్ని శాఖలలో తెలుగులో ఉత్తరప్రత్యుత్తరాలు జరపాలన్నారు. ఈ సంవత్సరం తెలుగుబాష సంస్కృతి వికాస సంవత్సరంగా ప్రకటించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాలన్ని తెలుగులో చెప్పినట్లైతే సామాన్య ప్రజలు సులభంగా అర్థం చేసుకొని ఆయా పథకాలలో లబ్దిపొందే అవకాశముంటుందన్నారు. అన్ని శాఖలలో హాజరు రిజిష్టర్‌లో తెలుగులోనే సంతకం చేయడం, సెలవుదరఖాస్తులు, వివరణ పత్రాలు, ఉత్తర్వులు తెలుగులో ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమైనందున జిల్లాలో దోమలు విజృంభించకుండ, అంటువ్యాధులు ప్రభలకుండ, మలేరియా వ్యాధి నివారణపై దృష్టిసారించాలని మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులు, ప్రత్యేక అధికారులను ఆదేశించారు. విద్యాసంవత్సరం ప్రారంభమైనందున వసతి గృహాల సంక్షేమాధికారులు ఏలాంటి అలసత్వం వహించకుండా విద్యార్థినీ,విద్యార్థులకు ఆరోగ్య, ఆహారపు అలవాట్లపై జాగృతం చేయాలన్నారు. ప్రత్యేకాధికారులు గ్రామాలకు వెళ్లినప్పుడు పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీతో అన్ని విషయాలపై సమగ్రంగా చర్చించి సమాచారం సేకరించాలన్నారు.జిల్లాలో డ్రాప్ అవుట్ పిల్లలు ఉండకూడదని, డ్రాప్ అవుట్ పిల్లల విషయంలో తీసుకుంటున్న చర్యలు, కనబరుస్తున్న శ్రద్ధపై జిల్లా విద్యాధికారిని కలెక్టర్ అభినందించారు.జిల్లాను బాలకార్మికులు లేని జిల్లాగా రూపొందించాలని, కార్మికశాఖాధికారులు విస్తృతంగా పర్యటించి ప్రణాళికబద్దంగా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా స్థాయిలోనే కాకుండ గ్రామీణ స్థాయిలో ఆయా శాఖల సేవలు కేంద్రీకృతమయ్యేలా చూడాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. జూలై 2న అర్బన్ డేను పురస్కరించుకొని ఏ రోజుకారోజు వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపర్చాలన్నారు.జిల్లాకు అంచనాల మేరకు అవసరమైన విత్తనాలు, ఎరువులు వస్తున్నాయని, కృత్రిమ కొరత సృష్టించకుండా నివారించడానికి ఆయా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లాకు మంజూరైన సబ్ సెంటర్ల భవనాల నిర్మాణ జాప్యం లేకుండా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు. కస్తూరీభాగాంధీ బాలికల విద్యాలయాలు,సాంఘీక,గిరిజన సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు ఉపకార వేతనాల నుండి అన్ని విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.జాయింట్ కలెక్టర్ ఎ.శరత్ మాట్లాడుతూ అమ్మహస్తం పథకం కింద విధిగా 9రకాల నిత్యావసర వస్తువులు వచ్చే మాసం నుండి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపుజాయింట్ కలెక్టర్ మూర్తి, డిఆర్‌ఓ ప్రకాష్‌కుమార్, జెడ్‌పి సిఈఓ ఆశీర్వాదం, వివిధ శాఖల అధికారులు, ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

21న పాఠశాలలు బంద్
* ఎబివిపి పిలుపు
సంగారెడ్డి,జూన్ 17: విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు పరచాలని, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో 91 జీవోను అమలు చేయాలని తదితర సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21న ఎబివిపి తలపెట్టిన పాఠశాలల బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎబివిపి రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కె.యాదగిరి పిలుపునిచ్చారు. పేదవిద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలో 25 శాతం సీట్లు కేటాయించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు కల్పించాలని, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, గుర్తింపులేని పాఠశాలలను రద్దు చేయాలన్న డిమాండ్ల పరిష్కారానికి ఈ బంద్‌ను నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.

గిరిజనులకు ప్రధాని ఇచ్చిన భూములను లాక్కోవద్దు
సంగారెడ్డి,జూన్ 17: సంగారెడ్డి మండలంలోని ఎర్దనూర్ గ్రామ గిరిజనులకు ప్రధానమంత్రి పంచిన భూములను లాక్కొని క్రషర్‌లకు అప్పజెప్పే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబుకు వినతిపత్రం సమర్పించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సాయిలు మాట్లాడుతూ ఎర్దనూర్ గ్రామంలోని 20 గిరిజన కుటుంబాలకు 2005 సంవత్సరంలో భూపంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రధాని చేతులమీదుగా సర్వే నంబరు 259 లో 20 ఎకరాలకు పట్టాలు ఇచ్చారని నాటినుండి గిరిజనుల సాగులోనే భూమి ఉందన్నారు. ఇదే భూమిని హైదరాబాద్‌కు చెందిన క్రషర్ యజమానికి కేటాయించారని ఆ వ్యక్తి తన అనుచరులను వెంటబెట్టుకొని వచ్చి గిరిజనులను వారి భూములను సాగుచేయనీయకుండా అడ్డుకొని బెదిరింపులకు గురిచేస్తున్నాడని, గిరిజనులకు కేటాయించిన భూములను క్రషర్‌ల యజమానులకు ఎలా కేటాయిస్తారన్నారు.స్వయాన ప్రధాని పంచిన భూములనే లాక్కొంటే పేద గిరిజనులకు రక్షణ ఎక్కడిదని ఆవేదన వ్యక్తం చేశారు.ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పేద,దళిత,గిరిజనులదేనంటూ వారికిచ్చిన భూములను లాక్కొని బడాబాబులకివ్వడం ఏమేరకు సమంజసమన్నారు.వెంటనే గిరిజనుల భూములను తిరిగి వారికే ఇవ్వని పక్షంలో వ్యకాస ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పి.అశోక్,ఎన్.శ్రీనివాస్,సత్యానందం తదితరులు పాల్గొన్నారు.

బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న
రేషన్‌బియ్యం పట్టివేత
* వాహనం సీజ్
తొగుట, జూన్ 17: మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలోని రేషన్ షాపు నుంచి అక్రమంగా తరలిస్తున్న 9 క్వింటాళ్ళ బియ్యాన్ని గ్రామస్థులు పట్టుకున్న సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సత్యనారాయణ రేషన్ దుకాణం నుండి ఆదివారం రాత్రి ఎపి 23ఎక్స్ 5932 నెంబర్ గల టాటాఏసి వాహనంలో 9 క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన గ్రామస్థులు వాటిని పట్టుకుని తహశీల్దార్ నజీబ్ ఆహ్మద్‌కు సమాచారం అందించగా తహశిల్దార్ ఆదేశాల మేరకు ఆర్‌ఐ వంశీ, విఆర్వో శ్రావణ్‌లు గ్రామానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. బియ్యంతో పాటు టాటా ఏసిని స్వాధీనం చేసుకుని సీజ్‌చేసి రేషన్ డీలర్‌పై కేసు నమోదు చేసినట్లు తహశీల్దార్ నజీబ్‌అహ్మద్ తెలిపారు. రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

భూకబ్జాలకు పాల్పడితే
కఠిన చర్యలు
మెదక్, జూన్ 17: ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల కబ్జాలకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మెదక్ సబ్ కలెక్టర్ భారతి హొళ్లికేరి అధికారులను అదేశించారు. సోమవారం నాడు జరిగిన ప్రజాదర్భార్ కార్యక్రమంలో మెదక్ డివిజన్‌లోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు 36 దరఖాస్తులు అందజేసి తమ సమస్యలను సబ్ కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. అనంతరం జరిగిన డివిజన్ స్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో పలు సంక్షేమ కార్యక్రమాలపైన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో లబ్దిదారులకు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని అమె అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిధుల కోరత లేదని ఆమె వెల్లడించారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి వెంట వెంట బిల్లులు అందజేయాలని ఆమె తెలిపారు. ఎక్కువ సంఖ్యలో మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు అధికారులు చొరవ చుపాలని ఆమె కోరారు. ఎరువులు విత్తనాలు సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చుడాలని ఎడి మనోహారను సబ్ కలెక్టర్ ఆదేశించారు. రసాయన ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై పొందేందుకు రైతులు పట్టా పాసుపుస్తకాలతో సంబంధించిన వ్యవసాయ అధికారి విస్తరణ అధికారిని సంప్రదించేలా రైతులకు అవగాహాక కల్పించాలని ఆమె ఆదేశించారు. ఎరువులు, విత్తనాలు అమ్మె డీలర్ల దుకాణాల వద్ద విధిగా ష్టాక్ వివరాలను, ఎరువుల ధరలను తప్పనిసరిగా సూచిక బోర్డును ఏర్పాడు చేయాలని సబ్ తెలిపారు. ఎరువులు, విత్తనాలు అమ్మకాలలో డీలర్లు అవకతవకలకు పాల్పడితే వారి దుకాణాలను సీజ్ చేసి లైసెన్స్‌లు రద్దు చేస్తామని సబ్ కలెక్టర్ హెచ్చరించారు. మెదక్ పట్టణంలో చాలా ప్రాంతాల్లో చెత్తచెదారం ఎక్కడపడితే అక్కడ ఉందని వీటిని శుభ్రపరిచేందుకు చర్యలు తీసుకొవాలని మున్సిపల్ కమీషనర్ ప్రభాకర్‌ను ఆమె అదేశించారు. ఈ కార్యక్రమంలో మెదక్ తహశీల్దార్ పుష్పలత, ఎంపిడిఓ శారద, డిఎల్‌పిఓ శ్రీనివాస్‌రావు, మున్సిపల్ కమీషనర్ ప్రభాకర్, వ్యవసాయ శాఖ ఎడి మనోహార, బిసి వెల్‌ఫేర్ అధికారి రాంరెడ్డి, సురేష్, వసంత, మంగ నాగభూషనంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అప్పుల బాధతో రైతుకూలీ ఆత్మహత్య
తొగుట, జూన్ 17: బతుకుతెరువు కోసం సిద్దిపేటకు వలసవెళ్లిన ఓ రైతు కూలీ అప్పుల బాధ తాళలేక పురగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ పోషణ, కుమార్తెల వివాహాల కోసం, కుమారుల చదువుల కోసం చేసిన అప్పులకు తోడు భార్యకు కాన్సర్ వ్యాధి చికిత్సకోసం చేసిన అప్పులు అధికం అవడంతో వాటిని తీర్చేదారి కానరాక రైతు కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని పెద్దమాసాన్‌పల్లి మదిర ఇందిరానగర్‌కు చెందిన నర్ర సత్తయ్య(56)కు గ్రామంలో ఎకరం మేర భూమి ఉంది. కుటుంబ పోషణ కష్టంగా మారడంతో కొనే్నళ్ల క్రితం కుటుంబంతో సిద్దిపేటకు వలసవెళ్ళాడు. సిద్దిపేటలోని ఓ సామిల్‌లో పనిచేస్తూనే సత్తయ్య కుటుంబాన్ని పోషిస్తూ ఇద్దరు కుమార్తెల వివాహం చేశాడు. ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివించాడు. వారికోసం వెచ్చించిన డబ్బులు కూడా అప్పుచేశాడు. దీనికి తోడు సత్తయ్య భార్య లక్ష్మికి రెండెళ్ల క్రితం కాన్సర్ వ్యాధి బయటపడింది. ఆమె చికిత్స కోసం సత్తయ్య కుటుంబాన్ని పోషిస్తునే లక్షలాదిగా వెచ్చించాడు. బార్య చికిత్సకు కుమార్తెల వివాహాలకు, కుమారుల చదువులకు చేసిన అప్పులు అధికమయ్యాయి. ఈ మద్య బార్య లక్ష్మి ఆరోగ్యం మరింత క్షీణించింది. దీనితో మానసికంగా కృంగిపోయిన సత్తయ్య ఆదివారం సిద్దిపేటలో పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

విధులకు డుమ్మాకొడితే కఠినచర్యలు
సంగారెడ్డి,జూన్ 17: కార్యాలయ విధులకు అనధికారికంగా గైర్హాజరైతే సిబ్బందిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబు హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ సముదాయంలో గల వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యవసాయ శాఖ జెడి కార్యాలయంలో సిబ్బంది హాజరు రిజిష్టర్‌ను పరిశీలిస్తూ సిబ్బంది హాజరు పట్టికలో సంతకం పెట్టి బయటకు వెళ్లిపోవడం, అనధికారికంగా గైర్హాజరవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోని సిబ్బంది నిర్వహణ పనుల అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కదలికల రిజిష్టర్ నిర్వహించాలని వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మను ఆదేశించారు.పశుసంవర్ధక శాఖ జెడి కార్యాలయంలో రిజిష్టర్‌ను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు.

మహిళా జూనియర్ కళాశాల
భవన నిర్మాణానికి కృషి: జగ్గారెడ్డి
సంగారెడ్డి, జూన్ 17: సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల పాత భవనం స్థానంలో 14నూతన గదులు,ఒక ల్యాబ్ నిర్మాణానికి 2.85లక్షల రూపాయల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగింది, అతి త్వరలోనే మంజూరవుతాయని ప్రభుత్వ విప్,స్థానిక శాసన సభ్యులు తూర్పు జయప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని మహిళా జూనియన్ కళాశాలను సందర్శించి, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ పలు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. కుర్చీలు, టేబుళ్లు, తాగునీటికి మంజీర కనేక్షన్, కంప్యూటర్ స్కానర్, ప్రింటర్, పాత కళాశాలకు మరమ్మత్తులు, ఫ్యాన్లు, టాయిలెట్ల మరమ్మతులు తదితర అవసరాలు తీర్చాలని కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే టాయిలెట్ల మరమ్మతు పనుల కోసం 10వేల రూపాయల నగదును విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాశాల టీచర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

విత్తనాలు, ఎరువుల కోసం రైతుల పాట్లు
* యూరియా దుకాణం వద్ద
బారులు తీరిన రైతులు
* ఎరువుల కౌంటర్ మెదక్‌లో...
సరఫరా మార్కెట్ యార్డులో..
* రైతుల పడిగాపులు
మెదక్, జూన్ 17: ఖరీఫ్ సీజన్ విత్తనాలు, ఎరువుల విషయంలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మృగశిర కార్తె ప్రారంభం కాగానే వర్షాలు భారీగా కురవడం, వర్షాలకు ఎడతెరపి కావడం వలన నారుమళ్లకు అవసరమైన విత్తనాల కోసం రైతులు అప్పులు చేసి సొసైటీల దగ్గరకు, డీలర్ల వద్దకు ఎగబడినా విత్తనాలు, ఎరువులు దొరకడం లేదని వాపోతున్నారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచే రైతులు మెదక్ సొసైటీ కార్యాలయంలో విత్తనాల కోసం తరలివచ్చారు. వచ్చిన రైతులు తమ పాదరక్షలను వరుస క్రమంలో పెట్టుకోవడం కనిపించింది. తిండిలేక ఉపవాసంతో విత్తనాల కోసం వచ్చి కూర్చున్నప్పటికీ ఉదయం 6 గంటల నుంచి 10:30 గంటల వరకు వేచిచూసినా అధికారులు రాకపోవడంతో ఆందోళనకు దిగారు. ఈలోగా సొసైటీ కార్యాలయం ప్రాంగణంలో వచ్చిన మెదక్ సొసైటి చైర్మన్ సత్యవర్ధన్‌రావు రైతుల డిమాండ్‌లను గుర్తించి అధికారులకు ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. అధికారుల నిర్లక్ష్యంపై రైతులు నిలదీశారు. 1010 రకం వరి విత్తనాలు 525 రుపాయలకు మాత్రమే అమ్మాలని హామాలీ చార్టీలు చెల్లించమని రైతులు డిమాండ్ చేశారు. విత్తనాలు, యూరియా విషయంలో ప్రభుత్వం సరఫరా చేయడంలో విఫలమైందన్నారు. భూములు దున్నకాలు మొదలుపెట్టామని రైతులు తెలిపారు. ప్రస్తుతం మొక్కజోన్నకు, చెరుకు పంటకు యూరియా చాలా అవసరంగా ఉందని రైతులు తెలిపారు. పాస్పెట్ తీసుకుంటేనే యూరియా ఇస్తామని డీలర్లు లింక్ పెడుతున్నారని రైతులు వాపోయారు. మెదక్ వ్యవసాయ శాఖ అధికారి దశరథం మాట్లాడుతూ యూరియా 7 టన్నులు మెదక్ పట్టణంలోని మనగ్రోమోర్ డీలర్‌కు 17 టన్నులు వచ్చినట్లు చెప్పారు. యూరియాకు రైతుల నుండి పాస్‌బుకులు కోరుతున్నట్లు ఆయన తెలిపారు. మనగ్రోమోర్ డీలర్‌కు మరో 17 టన్నుల 1010 రకం వరి సీడ్ రానున్నట్లు దశరథం తెలిపారు. వ్యవసాయ శాఖ ఎడి కార్యాలయంకు వచ్చిన మెదక్ సొసైటి చైర్మన్ సత్యవర్ధన్‌రావు రైతులతో చర్చించడం జరిగింది. యూరియా అవసరం లేకపోయిన ఎకరాకు నాలుగు బస్తాల వంతున రైతులు నిలువ చేసుకున్నారని తెలిపారు. 13 రోజుల క్రింద డిడి పంపితే ఆదివారం నాడు 1010 రకం విత్తనాలు సొసైటికి వచ్చాయని ఆయన తెలిపారు. పట్వారీ సీపారస్ లేనిదే యూరియా ఇవ్వమని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్న విధానాన్ని సర్ధన మాజీ సర్పంచ్ హన్మంతరావు తీవ్రంగా ఖండిచారు. పట్వారీ రైతులకు అందుబాటులో ఉండడని ఆయన తెలిపారు. అందువలన రైతు పాసుపుస్తకాల మీదనే యూరియా సరఫరా చేయాలని హాన్మంతరావు డిమాండ్ మేరకు వ్యవసాయ శాఖ అధికారి దశరథం అంగీకరించారు. ప్రభుత్వానికిగానీ, జిల్లా యంత్రంగానికి గానీ, వ్యవసాయ శాఖ అధికారులకు గానీ వ్యవసాయ సీజన్‌కు సంబంధించిన అవసరాలపై ముందు చూపులేదని యాక్షన్ ఫ్లాన్ లేదని హాన్మంతరావు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌కు రెండు నెలల ముందే మెదక్ జిల్లాలో సాగుభూమి ఎంత ఏ రకాల పంటలు పండిస్తారు, ఆ పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అవసరాన్ని యాక్షన్ ప్లాన్ క్రింద తయారు చేసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో రైతులు ఎరువుల కోసం విత్తనాల కోసం రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితులు మరొక సారి రాకుండా జిల్లా యంత్రాంగా చుసుకొవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. యూరియా ఒక ప్రైవేటు డీలర్‌కు వచ్చింది. ఆ ప్రైవేటు డీలర్ వ్యవసాయ శాఖ అధికారి సిఫారు ఉంటేనే యూరియా ఇస్తామంటున్నారని ఒక రైతు ఎడి కార్యాలయంకు వచ్చాడు. దీనిపైన హాన్మంతరావు, సొసైటి చైర్మన్ సత్యవర్ధన్‌రావు చర్చించడంతో దశరథం నేరుగా యూరియా సరఫరా చేసే మనగ్రోమోర్ సెంటర్‌కు తరలివెళ్లారు. అంతకు ముందు దశరథం మాట్లాడుతూ ప్రైవేటు డీలర్స్ అమ్మకాలు జరుపుతున్న ఎరువులు, విత్తనాల వద్ద ఇన్‌చార్జీలను ఏర్పాటు చేశామని తెలిపారు.

* సక్రమ అమలుకు అధికారులకు కలెక్టర్ ఆదేశం
english title: 
telugu

గిరిజన హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

$
0
0

మిర్యాలగూడ, జూన్ 17: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు గిరిజనుల హక్కులను కాలరాస్తున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఆరోపించారు. పట్టణంలోని టిఎన్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన గిరిజన సంఘం 5వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన గిరిజన సాధికారత సెమినార్‌లో ఆమె పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామంలో కీలకపాత్ర పోషించిన గిరిజనుల త్యాగాలు ప్రభుత్వాలకు గుర్తుకురావడం లేదా అని ఆమె అన్నారు. స్వాతంత్ర పోరాటంలో పనిచేసిన గిరిజనులకు ప్రభుత్వం నుండి సరైన గుర్తింపు లభించడం లేదని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్, బిజెపి సొంత ప్రయోజనాల కోసం చారిత్రక ఆస్తులను కొల్లకొడుతున్నారని, కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు పెట్టుబడిదారులకు ప్రయోజనకరంగా మారాయి. కానీ, స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన గిరిజనులకు ఆర్థిక సంస్కరణల ఫలితాలు ఏరకంగాను మేలు చేయలేదని కారత్ అన్నారు. శ్రామిక వ్యవసాయ కూలీలు దేశాన్ని నిలపెడుతున్నాయని, శ్రామిక వర్గానికి అభివృద్ధిలో వాటా ఇవ్వకపోవడం బాధాకరమని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వం కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి చేస్తున్నామని ప్రకటనలు చేస్తుందని, ఫొటోలు చూపి ఇవే అభివృద్ధికి ప్రగతి చిహ్నాలని ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం చూపిస్తున్న ప్రకటనలకు విరుద్ధంగా ప్రస్తుత పరిస్థితుల్లో వంద గిరిజన కుటుంబాల్లో 30 కుటుంబాలు తినడానికి తిండిదొరక్క, చేయడానికి పనిలేక ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. కేంద్రప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కాని గిరిజనులకు మాత్రం పనులు కల్పించడం లేదని, పని పొందడం అందరి హక్కని, పని ప్రభుత్వం ఎందుకు కల్పించడం లేదని ఆమె విమర్శించారు. గిరిజనులకు విద్యా, వైద్యం అందక అల్లాడుతున్నారని, అడవుల్లోని గిరిజనులకు చెందిన భూముల హక్కులను కారరాస్తూ బుల్డోజర్లా నడుపుతుందని ఆమె ఆరోపించారు. గిరిజనుల జనాభాకు అనుగుణంగా నిధులను కేటాయించాలని, తెలంగాణాలోని గిరిజనులకు అన్యాయం జరుగుతుందని ఆమె విమర్శించారు. దేశంలో గిరిజనులకు సమగ్రంగా అభివృద్ధి చేయాలని ట్రైబల్ సబ్‌ప్లాన్‌కు నిధులు ఖర్చు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 1161 తండాల్లో విద్యుత్ సౌకర్యం లేదని, గిరిజన విద్యార్థులు విద్యనభ్యసించేందుకు కేవలం 48 గిరిజన ఆశ్రమ పాఠశాలలున్నాయని, గిరిజనులు చచ్చినా బతికినా ప్రభుత్వాలకు పట్టడం లేదని ఆమె ఆరోపించారు. గిరిజన స్ర్తిలకు పౌష్టికాహారం అందక అనారోగ్యంగా ఉంటున్నారని, గిరిజనులు పిల్లలను పోషించలేక అమ్ముకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. కడుపునింపుకోవడం కోసం పిల్లలను అమ్ముకుంటున్న గిరిజనులను ఆదుకోవాల్సిందిపోయి వారిపై కేసులుపెట్టి జైలుకు పంపుతున్నారని ఆమె అన్నారు. గిరిజన శిశువుల అమ్మకాలను నిరోధించాలని, ఆర్థిక సమస్యలతోపాటు సామాజికంగా అభివృద్ధి చెందాలని ఆమె సూచించారు. గిరిజన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆమె అన్నారు. గిరిజన హక్కులను పరిరక్షించాలని కేంద్రం ముందు ఉంచుతామని ఆమె అన్నారు. సమావేశంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాంనాయక్, సిపిఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహ్మారెడ్డి, ఎయు ప్రోఫెసర్ నేచర్ల ప్రసాద్‌రావు, భుక్య భంగ్యానాయక్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పాపానాయక్, ధీరావత్ రవినాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ డి.మల్లేష్, యుటిఎఫ్ అసోసియేట్ అధ్యక్షుడు లక్పతినాయక్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదు
* దిగ్విజయ్ నియామకమే ఇందుకు నిదర్శనం
* బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు
కట్టంగూర్, జూన్ 17: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదని, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడిగా తెలంగాణను వ్యతిరేకించే దిగ్విజయ్‌సింగ్‌ను నియమించడమే ఇందుకు నిదర్శనమని భారతీయ జనతాపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు మండిపడ్డారు. పులిచింతల ముంపు గ్రామాలను పరిశీలించేందుకు వెళ్తున్న ఆయనకు సోమవారం జిల్లా బిజెపి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనస్వాగతం పలికారు. జిల్లాపార్టీ అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డిలు పూలమాలలతో స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ విషయంలో దిగ్విజయ్‌కు అవగాహనలేదని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే ఆయనను రాష్ట్ర పరిశీలకుడిగా నియమించడం ఎంఐఎం పార్టీని మచ్చిక చేసుకోవడం కోసమేనని విమర్శించారు. ప్రజావిశ్వాసం కొల్పోయిన యుపిఎ ప్రభుత్వాన్ని గద్దెదింపి అవినీతినుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు తమపార్టీ పోరాడుతుందని చెప్పారు. ఈకార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు నూకల వెంకట్‌నారాయణరెడ్డి, దాసరి మల్లేషం, కర్నాటి ధనుంజయ, పోతంశెట్టి రవీందర్, జిల్లా ప్రధానకార్యదర్శి పోతపాక సాంబయ్య, మండల అధ్యక్షుడు మండల వెంకన్న పాల్గొన్నారు.

విద్యాపక్షోత్సవాలకు పాఠశాలల ముస్తాబు
* 21కోట్లతో తరగతి భవనాల ప్రారంభోత్సవాలు
నల్లగొండ, జూన్ 17: విద్యాపక్షోత్సవాల సన్నాహాల్లో భాగంగా జిల్లాలో అదనపుతరగతి గదులు, నూతన కసూర్తిబా పాఠశాలల భవనాల ప్రారంభోత్సవాలను జరుపుకునేందుకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైంది. జిల్లాలో 20నుండి 26వరకు విద్యాపక్షోత్సవాలు నిర్వహించనుండగా జిల్లా మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలతో పాఠశాలల తరగతి గదులను ప్రారంభించనున్నారు. జిల్లాలో 21కోట్లతో 12అసెంబ్లీ నియోజకవర్గాల్లో 155అదనపుతరగతి గదులను, 10కస్తూరిభా పాఠశాలల భవనాలను విద్యాపక్షోత్సవాల్లో భాగంగా ప్రారంభించేందుకు తుది దశ నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నారు. నిజానికి జిల్లాలో కస్తూరిబా పాఠశాలల భవనాలతో పాటు వివిధ పాఠశాలల అదనపు తరగతి గదుల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నట్లుగా విమర్శలు ఉన్నాయి. నిర్మాణ పనుల్లో అలసత్వం కారణంగా జిల్లాలోని అనేక పాఠశాలల్లో విద్యార్థులకు ఈ ఏడాది కూడా ఆరుబయట, చెట్ల కింది చదువులు తప్పని పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో కోటి 25లక్షల వ్యయంతో 12కస్తూరిబా పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాల్సి వుండగా ప్రస్తుతం గుండాల, వలిగొండ, పోచంపల్లి, నడిగూడెం, మునగాల, మిర్యాలగూడ, మునుగోడు, కట్టంగూర్, మోత్కూర్, జాజిరెడ్డిగూడెంలలో మాత్రం నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి. వాటిల్లో నాలుగైదు కూడా ఈ విద్యాపక్షోత్సవాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసుకోవడం అసాధ్యంగా కనిపిస్తుంది. అదనపు తరగతి గదులు జిల్లాలో 415మంజూరుకాగా ఓక్కో తరగతి గదిని 5.30లక్షలతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం విద్యాపక్షోత్సవాల నాటికి కేవలం 155గదులను మాత్రమే ప్రారంభించుకునే పరిస్థితుల్లో ఉండటం గమనార్హం. ఇక మరుగుదొడ్లు, మంచినీటి వసతులు, ప్రహరీ నిర్మాణాలు వంటి వౌలిక వసతులకు అధిక శాతం పాఠశాలలు దూరంగా ఉండటంపై విద్యార్థి సంఘాలు, బాలల హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రారంభోత్సవాలకు సిద్ధమైన తరగతి గదులు
ఆలేరు నియోజకవర్గంలో 35లక్షలతో ఐదు పాఠశాలల్లో 7తరగతి గదులు నిర్మాణ పనులు పూర్తికాగా, భువనగిరి నియోజకవర్గం పరిధిలో 1కోటి 68లక్షలతో 13పాఠశాలల్లో 18గదులు, దేవరకొండ నియోజకవర్గంలో 10పాఠశాలల్లో 68లక్షలతో11పాఠశాలల్లో 14గదుల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి ఈ విద్యాపక్షోత్సవాల్లో ప్రారంభించనున్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 7పాఠశాలల్లో 40లక్షలతో 8గదులు, కోదాడ నియోజకవర్గం పరిధిలో 10పాఠశాలల్లో 90లక్షలతో 18గదులు, మిర్యాలగూడ నియోజకవర్గంలో 47లక్షలతో 5పాఠశాలల్లో 10గదులు, మునుడోగుడ నియోజకవర్గంలో 60లక్షలతో 11పాఠశాలల్లో 14గదులు, సాగర్ నియోజకవర్గంలో 14పాఠశాలల్లో 1కోటి 55లక్షలతో 22గదులు, నకిరేకల్ నియోజకవర్గంలో 3పాఠశాలల్లో 15లక్షలతో 3గదులు, నల్లగొండ నియోజకవర్గంలో 4పాఠశాలల్లో 48లక్షలతో 8గదులు, సూర్యాపేట నియోజకవర్గంలో 9పాఠశాలల్లో 15గదులు, తుంగతుర్తి నియోజకవర్గంలో 12పాఠశాలల్లో 18గదులతో 10కసూర్త్భి పాఠశాలల భవనాలను విద్యాపక్షోత్సవాల్లో ప్రారంభించేందుకు ఆర్‌విఎం సన్నాహాలు చేపట్టింది.

విత్తనాల కోసం రోడ్డెక్కిన రైతన్న
హాలియా, జూన్ 17: విత్తనాల కోసం హాలియాలో సోమవారం నాడు రైతన్నలు రోడ్డెక్కి ధర్నాకి దిగి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా ప్రధాన రహదారిపై వ్యవసాయ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటికి వ్యవసాయాధికారులు రైతులకు వరి, పెసర, జీలుగ వంటి విత్తనాలు సరఫరా చేయడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకివ్వాల్సిన విత్తనాలను అధికారులు బ్లాక్ మార్కెట్లోకి తరలిస్తున్నారని ఆరోపించారు. సుమారు గంటకు పైగా రాస్తారోకో చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. త్రిపురారం మండలానికి చెందిన వరివిత్తనాలు ఆటోలో బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయని టిఆర్‌ఎస్ నేతలు ఆటోలో వెళ్తున్న విత్తనాలను అడ్డుకున్నారు. దీంతో రైతులు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. సంఘటన స్థలానికి హాలియా సిఐ ఆనంద్‌రెడ్డి చేరుకుని ఆందోళన విరమింపచేశారు. అనంతరం ఎడిఎ ప్రతాప్, ఎఓ విజయేందర్‌రెడ్డితో మాట్లాడి రైతులకు కావాల్సిన విత్తనాలను వెంటనే అందచేయాలని సిఐ కోరడంతో ఆందోళన విరమింపచేశారు. టిఆర్‌ఎస్‌నాయకులు వర్ర వెంకట్‌రెడ్డి, వడ్డె సతీష్‌రెడ్డి, సురభిరాంబాబు, తెలంగాణ సత్యం, బిజేపి నాయకులు చెన్ను వెంకటనారాయణరెడ్డి, సిపిఐ నాయకులు రాములు, కెవిపిఎస్ నాయకులు కొండేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ పథకాలు అందించడమే లక్ష్యం
* ఎంపి సుఖేందర్‌రెడ్డి
దేవరకొండ, జూన్ 17: అర్హులైన పేదవారందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే తమ లక్ష్యమని ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎంపిడివో కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఎమ్మెల్యే బాలూనాయక్‌తో కలిసి ఆయన దీపం పథకం లబ్ధిదారులకు గ్యాస్‌స్టవ్‌లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ కట్టెల పొయ్యి వాడడం వల్ల గ్రామీణ ప్రాంత మహిళలు అనేక అనారోగ్యాలకు గురవుతున్నారని మహిళల ఇబ్బందులను తొలగించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం దీపం పథకం కింద అన్ని వర్గాల మహిళలకు గ్యాస్‌స్టవ్‌లను పంపిణీ చేస్తోందని చెప్పారు. దేవరకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు ఇప్పటి వరకు దీపం పథకం కింద 3500 కనెక్షన్‌లను మంజూరు చేసినట్లు చెప్పారు. మరో అయిదు వందల కనెక్షన్‌లను మంజూరు చేసేందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ్ధర్‌బాబు హామీ ఇచ్చారని వీటిని కూడా త్వరలో పంపిణీ చేస్తామని గుత్తా హామీ ఇచ్చారు. దీపం పథకం కింద గతంలో 1250, రెండో విడత 1250, మూడో విడత 1000 కనెక్షన్‌లను పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 3.70 లక్షల మంది వికలాంగులు, వితంతువులకు పెన్షన్‌లను అందించినట్లు చెప్పారు. ఇంకా 35 వేల మంది అర్హులైన వారికి పెన్షన్‌లను మంజూరు చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. అర్హులైన పేదలకు పక్కాగృహాలను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 2 వేల గృహాలను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బాలూనాయక్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. దేవరకొండ నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ప్రసాదరావు, ఎంపిడివో విజయలక్ష్మి, రాములునాయక్, మార్కెట్ కమిటీ చైర్మెన్ తిప్పర్తి సురేశ్‌రెడ్డి, మాజీ జడ్పిటిసిలు గుంజ రేణుక, తేర గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపిపి ముత్యాల సర్వయ్య, మాజీ సర్పంచ్ ఆలంపల్లి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

డిఇవోను ఘెరావ్ చేసిన ఎబివిపి
నల్లగొండ , జూన్ 17: ప్రైవేటు విద్యాసంస్థల అర్భాటపు ప్రచారాన్ని నివారించి, టెక్నో, గ్రామర్ వంటి ఆకర్షణీయ పదాలతో కూడిన బోర్డులను తొలగించేందుకు డిఇవో చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తు సోమవారం ఎబివిపి ఆధ్వర్యంలో విద్యార్థులు డిఇవో ఆచార్య జగదీష్‌ను ఘెరావ్ చేసి నిరసన తెలిపారు. ఆర్‌విఎం కార్యాలయంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశంలో ఉన్న డిఇవోను ఎబివిపి విద్యార్థులు చుట్టుముట్టి గంటకుపైగా ఘెరావ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం విద్యార్థులను బయటకు లాగి స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట సాగింది.

ఉత్తర కాశీలో చిక్కుకున్న జిల్లా వాసులు
మిర్యాలగూడ టౌన్, జూన్ 17: మిర్యాలగూడ పట్టణం నుండి ఈ నెల 3 కొంతమంది, 5న కొంతమంది ఉత్తర భారతం తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్లిన భక్తులు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ వద్ద చిక్కుకు పోవడంతో వారి కుటుంబాలకు ఆందోళనకు గురవుతున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలకు కొండచరియలు విరిగిపడటంతో ఉత్తర కాశీ వద్ద భారీగా సుమారు 500 వాహనాలు నిలిచి పోయాయని అందులో నల్లగొండ జిల్లా నుండి వెళ్లిన సుమారు 55 మంది వరకు ఉన్నారని, అందులో మిర్యాలగూడ పట్టణానికి చెందిన రైస్‌మిల్లర్లు రంగా రంజిత్, కొండూరు శ్రీనివాస్, పద్మావతి, కమీషన్ మర్చంట్ రాయపూడి లవకుమార్, కల్యాణి దంపతులున్నారు. ఈ నెల 11న ఢిల్లీ నుండి వారు ఉత్తరాఖండ్‌కు ట్రావెల్స్‌లో తీర్థయాత్రలకు వెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. కొండ చరియలు విరిగి రోడ్డుపై పడటంతో ఎక్కడి వాహనాలు అక్కడనే నాలుగు రోజులుగా నిలిచిపోయాయని, దీంతో వాహనాల్లో తమ వెంట తీసుకు వెళ్లిన ఆహారం, తాగు నీరు అయిపోవచ్చిందని కుటుంబ సభ్యులకు తెలిపారు. అదే విధంగా సెల్‌ఫోన్‌ల చార్జీంగ్ అయిపోవడంతో ఒకరి సెల్ మరొకరు తీసుకుని తాజా సమాచారాన్ని చేరవేస్తున్నారు. టివిల్లో విస్తృత ప్రచారం జరగడంతో బంధువులు, స్నేహితులు ఫోన్‌లు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తన తమ్ముడు లవకుమార్‌తో మాట్లాడానని, ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడం జరగలేదని, ఇంకా గంటలు పట్ట వచ్చని అన్నారని రాయపూడి లోకనాధం, బంధువురోశయ్యలు అన్నారు. అదే విధంగా కొండూరు శ్రీనివాస్ కొంతమంద మిర్యాలగూడ వాసులతో కలిసి లేకున్నా, వేరే వాహనంలో ఉన్న క్షేమ సమాచారాన్ని అందిస్తున్నారని బంధువులు తెలిపారు. మొత్తం మీద తీర్ధయాత్రలకు వెళ్లి చిక్కుకుపోవడంతో ప్రతి ఒక్కరు ఆందోళనకు గురవుతున్నారు.

త్వరలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్
* జెడ్పి సిఈవో కోటిరెడ్డి
తుర్కపల్లి, జూన్ 17: పంచాయతీ రిజర్వేషన్ల కేటాయింపులపై ప్రభుత్వం నుంచి తుది నివేదిక వచ్చినట్లయితే ఈనెలాఖరులోగాని, జూలై మొదటివారంలోగాని పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేయనుందని జిల్లా పరిషత్ సిఈవో కోటిరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ఎంపిడివో కార్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అంటువ్యాధులు వ్యాపించకుండా మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించాలని ఆయన పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు సమన్వయంతో అవగాహన ర్యాలీలు నిర్వహించాలని ఆయన కోరారు. 2012-13కు సంబంధించిన నిధులతో చేపట్టిన పనుల వివరాలను ఆయన ఎంపిడివోను అడిగి తెలుసుకున్నారు. బిఆర్‌జిఎఫ్ నిధులతో చేపట్టి అసంపూర్తిగా మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన ఎంపిడివోలకు ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఎంపిడివో కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ రవీందర్, ఈవోఆర్డీ శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
10వ పిఆర్‌సిని అమలు చేయాలి
* టిఎన్‌జియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి
వలిగొండ, జూన్ 17: ప్రభుత్వం 10వ పిఆర్‌సిని వెంటనే అమలు చేయాలని టిఎన్‌జియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మందాడి ఉపేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు వర్తించే 10వ పిఆర్‌సీని అమలు చేయాలని, 65శాతం ఫిట్‌నెస్‌తో అందించాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని అన్నారు. తెలంగాణ ఏర్పాటుతోనే ఈప్రాంత ఉద్యోగులకు ప్రయోజనం ఏర్పడుతుందని అన్నారు. ఈసమావేశంలో డిటి కృష్ణమూర్తి, ఆర్‌ఐ లాయక్‌అలీ, ఎంఆర్‌ఐ నర్సింహా, విఆర్‌వో సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఓటమి భయంతోనే రిజర్వేషన్ ప్రక్రియ జాప్యం
నల్లగొండ, జూన్ 17: కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతో రిజర్వేషన్ల ప్రక్రియలో జాప్యం చేస్తు ఎన్నికల నిర్వాహణకు వెనుకడుగు వేస్తుందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి, నకిరేకల్ నియోజకవర్గ ఇన్‌చార్జి పాల్వాయి రజనీకుమారి విమర్శించారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె టిడిపి రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి నెల్లూరి దుర్గాప్రసాద్‌లతో కలిసి మాట్లాడుతూ రిజర్వేషన్ల ఖరారులో మీనమేషాలు లెక్కిస్తు బిసి రిజర్వేషన్ల స్థానాలను తగ్గించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను టిడిపి తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. 34శాతం రిజర్వేషన్లు తగ్గకుండా బిసిలకు సర్పంచ్ స్థానాలకు కేటాయించాలని, వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని టిడిపి డిమాండ్ చేస్తుందన్నారు. వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ ఆ పార్టీ క్యాడర్‌ను రెచ్చగొడుతు జగన్‌ను, వైకాపాను తిట్టిన విపక్షాలపై భౌతిక దాడులు చేయాలంటు అప్రజాస్వామికంగా మాట్లాడటాన్ని టిడిపి తీవ్రంగా ఖండిస్తుందన్నారు. సమావేశంలో ఎల్‌వి.యాదవ్, మధుసూధన్‌రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

బుజిలాపురంలో మధ్యాహ్న భోజనం బంద్
ఏజెన్సీ నిర్వాహణ సంఘాల మధ్య ఘర్షణే కారణం * పస్తులతో ఇంటికి వెళ్ళిన విద్యార్థులు
మోత్కూరు, జూన్ 17: మండలంలోని బుజిలాపురం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట ఏజెన్సీ నిర్వాహణ సంఘాల మధ్య సోమవారం ఘర్షణ జరిగింది. దీంతో వంద మంది విద్యార్థులు పస్తులతో ఇంటికి వెళ్ళారు. స్వయం సహాయక పొదుపు సంఘాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతిభ, విఘ్నేశ్వర సంఘాల మహిళలు పంగ సావిత్ర, అంబటి శాంతమ్మలు మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం నుండి వంట చేస్తున్నారు. ఈసంవత్సరం కొత్త సంఘానికి అవకాశం ఇవ్వాలని 26 సంఘాలకు చెందిన మహిళలు చుక్క ఎల్లమ్మ, పంగ సుగుణమ్మ, రాధ, అనిత, లత, సావిత్ర, విజయలక్ష్మి, వెంకటమ్మ, శోభలు, పాత వంట ఏజెన్సీ మహిళలు వంట సామాగ్రి కోసం తీవ్ర వాగ్వివాదం చేసుకొని ఘర్షణ పడ్డారు. పాత ఏజెన్సీ మహిళలను మిగతా గ్రూప్‌ల మహిళలు అడ్డుకోవడంతో మధ్యాహ్నం వంట నిలచి పోయింది. సంవత్సరానికి ఒక సంఘానికి అవకాశం ఇవ్వాలని, ఈ సంవత్సరం నుంచి శ్రీసాయిచైతన్య సంఘానికి వంట ఏజెన్సీకి అవకాశం ఇవ్వాలని 30 సంఘాల మహిళలు తీర్మానాలు చేశారని తెలిపారు. కొత్త సంఘానికి వంట ఏజెన్సీకి అవకాశం కల్పించాలని ప్రధానోపాధ్యాయుల కార్యాలయం ఎదుట బైఠాయించి మహిళలు ఆమెతో వాగ్వివాదానికి దిగారు. కొత్త సంఘం వంట చేయడానికి సంఘబంధం తీర్మానం తెచ్చినా ఎందుకు అవకాశం ఇవ్వడంలేదని ప్రధానోపాధ్యాయురాలు ఇందిరప్రేమజ్యోతిని నిలదీశారు. వంట ఎవరు చేయక పోవడంతో విద్యార్థులు పస్తులతో ఇంటికి వెళ్లారు. వంట ఏజన్సీ విషయంలో ఘర్షణ విషయాన్ని భువనగిరి డిప్యూటీ డిఇఓకు సమాచారం అందించగా ఎంఇఓ తో విచారణ జరిపించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని హెచ్‌ఎం జ్యోతి తెలిపారు.

త్వరలో 59 మండలాల్లో ‘ఆధార్’ ఏర్పాటు
* జిల్లాకు 25,101 దీపం కనెక్షన్లు * డిఎస్‌ఓ నాగేశ్వర్‌రావు
మిర్యాలగూడ, జూన్ 17: జిల్లాలో ఆధార్‌నమోదు కేంద్రాలను త్వరలో అన్ని మండలాల్లో ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా పౌరసరఫరా శాఖాధికారి నాగేశ్వర్‌రావు అన్నారు. సోమవారం పట్టణంలోని రైతుబజార్‌లో ఏర్పాటు చేసిన బియ్యం అమ్మకం కేంద్రాన్ని, రైతుబజార్‌ను, రేషన్ దుకాణాలను, హెచ్‌పిగ్యాస్ ఏజెన్సి, మధ్యాహ్న భోజనపథకాన్ని, సివిల్‌సప్లైస్ గోదామును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెల్లరేషన్‌కార్డుదారులు ఆధార్‌కార్డు జిరాక్స్, బ్యాంకు పాసుబుక్ జిరాక్స్, సెల్‌నెంబర్‌ను చౌక ధరల దుకాణాల్లో అందచేయాలని ఆయన సూచించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే సబ్సిడిని లబ్ధిదారుల బ్యాంకుఖాతాల్లో నేరుగా జమచేయడం జరుగుతుందని, అందువల్ల ఆధార్‌కార్డు, బ్యాంకు పాసుపుస్తకాల జిరాక్స్‌లను చౌకధరల దుకాణాల్లో వెంటనే అందించాలని ఆయన సూచించారు. ఆధార్‌కార్డు నమోదు చేసేందుకు 29 మండలాల్లో కేంద్రాలను ప్రారంభించామని, మిగిలిన 30 మండలాల్లో కూడా ఆధార్ కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేసి ఆధార్‌కార్డుల నమోదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అమ్మహస్తం సరుకులను అందరికి అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అమ్మహస్తం సరుకులను ప్యాకింగ్ సమస్య తీవ్రంగా వేదిస్తుందని, సరుకుల ప్యాకింగ్‌కు అదనపు సిబ్బంది ఏర్పాటు చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. 1.50 లక్షల టన్నుల బియ్యం లక్ష్యంగా నిర్ణయించగా, 1.36 లక్షల టన్నుల మాత్రమే సరఫరా చేశారని, ఇంకా 14 వేల టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాల్సి ఉందని ఆయన అన్నారు. కస్టమ్‌మిల్లింగ్ 53 వేల టన్నులు లక్ష్యంగా నిర్ణయించగా 3 వేల టన్నులు మాత్రమే సేకరించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 25,101 దీపం కనెక్షన్లు మంజూరు కాగా 5792 లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని, మిగిలిన 19,309 దీపం కనెక్షన్ల లబ్ధిదారుల ఎంపికను యుద్దప్రాతిపధికన చేపట్టాలని ఎంపిడిఓ, మున్సిపల్ కమిషనర్లను జేసి ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

గిరిజనుల త్యాగఫలాలు ప్రభుత్వాలకు గుర్తులేవా..? * గిరిజన సదస్సులో సిపిఎం నేత బృందాకారత్
english title: 
tribal rights
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>