Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

నేతల్లేని నిరసనలు

$
0
0

విశాఖపట్నం, ఆగస్టు 5: రాష్ట్రం ముక్కలైపోడానికి మరెంతో కాలం పట్టేట్టు లేదు. ఇది సమైక్య వాదల్లో రగులుకుంటున్న వేదన. విభజన జరగరాదన్నది సీమాంధ్రుల కోరిక. సమైక్య వాదం బలంగా వినిపిస్తున్న విశాఖ నగరంలో వారికి అండగా నిలబడ్డ నాయకుడు ఒక్కడు కూడా కనిపించకపోవడం దురదృష్టకరం. చిన్న వారి నుంచి వృద్ధులవరకూ ఉద్యమంలో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారు. యువకులు లాఠీ దెబ్బలు తింటున్నారు. నిరాహార దీక్షలు చేస్తున్నారు. విద్యార్థులు చదువులు మానుకుని మరీ రోడ్లెక్కి సమైక్య నినాదాన్ని వినిపిస్తున్నారు. కార్మికులు విధులను బహిష్కరిస్తున్నరు. ఉద్యోగులు పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ముస్లింలు మానవహారంగా ఏర్పడి తమ నిరసన తెలుపుతున్నారు. ఉద్యమ నేపథ్యంలో పలువురు జైళ్ళకు వెళుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రాణ త్యాగాలు చేశారు. ఇవేవీ మనం నేతలుగా కొలుచుకుంటున్న వారి కంట పడడం లేదా? ఇవి ప్రజల మనోభావాలు కావా? ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పదవులకు రాజీనామాలు చేసిన వారంతా ఉద్యమాన్ని నడిపించే బాధ్యత ఎందుకు తీసుకోలేదు?
రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడిన అనంతరం సుదీర్ఘ మంతనాలు తరువాత గంటా శ్రీనివాసరావు మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత విశాఖ వచ్చినప్పుడు సమైక్య వాదులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆ రోజంతా హడావుడిగా గడిపిన ఆయన నాన్ పొలిటికల్ జెఎసిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి మర్నాడు హైదరాబాద్ వెళ్లిపోయి ఇంత వరకూ తిరిగి రాలేదు. అప్పటి వరకూ ఉద్యమానికి ఎవరెవరో నాయకత్వం వహిస్తున్నారు. ఇక నుంచి గంటా ఈ బాధ్యతలు స్వీకరిస్తారని చాలా మంది భావించారు. కానీ ఇప్పటికీ అలా జరగలేదు. మంత్రి బాలరాజు కూడా సమ్యైవాదిననే చెపుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తాము కోరుకుంటున్నామని చెప్పుకొస్తున్నారు. పాడేరు, అరకు, నర్సీపట్నం ప్రాంతాల్లో బంద్ విజయవంతంగా జరిగింది. ఉద్యమకారుల వత్తిడో, స్వచ్ఛందంగానో వ్యాపారులు దుకాణాలు బంద్ చేసి సమైక్య ఉద్యమానికి మద్దతు పలికారు. మంత్రి పదవికి రాజీనామా చేయనక్కర్లేదన్న బాలరాజు కనీసం ఉద్యమం వైపు కనె్నతె్తైనా చూడ్డం లేదు. ఆయన జిల్లాలో పర్యటించినప్పుడైనా ఉద్యమానికి మద్దతు తెలపలేదు. ఇక ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఆ తరువాత ఆయన ఉద్యమంలోకే రాలేదు. జరుగుతున్న ఆందోళనలన్నీ వన్ టౌన్ ప్రాంతంలోనే జరుగుతున్నాయి. వాటికి మద్దతుగా ఆయన బయటకు రాకపోవడం గమనార్హం. అలాగే, తైనాల విజయకుమార్ కూడా ఉద్యమంలో పాల్గొనకపోవడానికి కారణాలేమిటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇక అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేసి, ఉద్యమంలో తూతూ మంత్రంగా పాల్గొంటున్నారే కానీ, దిశా నిర్దేశం చేయడానికి ముందుకు రావడం లేదు. పోలీసులతో ముందే కుదుర్చుకున్న ఒప్పందంతో ధర్నాల పేరుతో హడావుడి చేసి, కాసేపు వీడియోలు, ఫొటోలు తీయించుకుని వెళ్లిపోతున్నారు కొంతమంది నాయకులు.
ఇక సమైక్య నినాదాన్ని అందరికన్నా ముందుగానే వినిపించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధిష్ఠానం మనోభావాన్ని తెలుసుకుని ఇక్కడున్న ఆ పార్టీ నాయకులైనా ఉద్యమాన్ని భుజనా వేసుకోవచ్చు కదా! వారూ దీని గురించి పట్టించుకోవడం లేదు. ఆ పార్టీలోని ఏ కొద్దిమందో అప్పుడప్పుడు పత్రికల వారి తృప్తి..వారి సంతృప్తి కోసం ఉద్యమిస్తున్నారే తప్ప, సమైక్య రాష్ట్రం కోసం కాదన్నది వాస్తవం.
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ అథిష్ఠానం వెలువరించిన తరువాత టిడిపికి ముందు నుయ్యి..వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. బాబు చెవిలో ఉపదేశించారో..లేక వీరి బుర్రలో పుట్టిందో కానీ ఇక్కడి తెలుగుదేశం నాయకులు సమైక్య నినాదంతో వీధుల్లోకి వస్తున్నారు. ఎప్పటిలాగానే విచిత్ర నిరసనలు చేసి జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. వీరి ప్రయత్నం కూడా అంతంతమాత్రంగానే ఉంది.
విశాఖ జిల్లాలో ఉద్యమం కాస్త నిలదొక్కుకుందంటే ఈ ప్రజా ప్రతినిధుల వల్ల కాదన్నది ముమ్మాటికీ నిజం. వీరు ఉద్యమాన్ని కొనసాగించకపోయినా ఫరవాలేదు. పోలీసులను ఉసిగొలిపి, వారితో ఉద్యమంపై నీళ్ళు చల్లే ప్రయత్నాన్ని విజయవంతంగా చేయిస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు. తెలంగాణలో ఉద్యమం మహోద్యమంగా మారడానికి పోలీసుల సహకారం కూడా ఒక కారణం కాదా? మరి ఇక్కడెందుకు చిన్నపాటి ధర్నాను కూడా పోలీసులు భూతద్దంలో చూస్తున్నారు? విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులే లేకుంటే సమైక్యోద్యమ చరిత్రలో విశాఖ జిల్లాకు స్థానం ఉండేది కాదు. వీరంతా ఉద్యమానికి ముఖం చాటేయడాన్ని చూస్తుంటే, విభజనకే వీరు భజన చేస్తున్నారనుకోవాలా? ప్రజలను మోసగిస్తున్నారని అనుకోవాలా? ఉద్యమం చేయడం చేతకాక చేతులేత్తేశారని భావించాలా?

సమైక్య ఉద్యమంతో ఈపిడిసిఎల్‌కు తీవ్ర నష్టం
విశాఖటప్నం, ఆగస్టు 5: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగాను, సమైక్యాంధ్రకు మద్ధతినస్తూ గత వారం రోజులు జరుగుతున్న ఉద్యమాలు విద్యుత్, ఆర్టీసీ సంస్థలకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. విద్యుత్ సంస్థకు వచ్చే రెవెన్యూ వసూళ్ళు కాస్త పడిపోయాయి. ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లా పరిధిలో పనిచేస్తున్న పలు విభాగాల ఉద్యోగులు, ఆయా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు, ధర్నాలు వంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీని ప్రభావం కాస్త రెవెన్యూ వసూళ్ళపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని అధికారవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. సంస్థ పరిధిలో దాదాపు 50 లక్షల మంది వినియోగదారులుండగా, వీరి అందరి ద్వారా ప్రతినెల రూ.500 కోట్లకు పైగానే ఆదాయం వస్తోంది. సమైక్య ఉద్యమాలతో ఇపుడు ఇది కాస్త పడిపోయి, దాదాపు 30 శాతం మేర ఆదాయం తగ్గిందనేది స్పష్టమవుతోంది. విశాఖ జిల్లాకు సంబంధించి 11లక్షలకు పైగా వినియోగదారులుండగా ప్రతినెల దాదాపు వంద కోట్ల మేర ఆదాయం వస్తోంది. ఇపుడు ఇది కాస్త తగ్గిపోతోందని చెబుతున్నారు. ఉద్యోగులు ఆందోళనల్లో పాల్గొంటున్నందున బిల్లుల చెల్లింపుల కోసం వినియోగదారులు అంతగా చూపడంలేదు. దీనివల్ల 10 నుంచి 20 శాతం మేర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
* ఆర్టీసీకి పెరుగుతున్న నష్టాలు
సమైక్య ఉద్యమంతో ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు తీవ్ర నష్టం ఏర్పడుతోంది. విశాఖ నుంచి బెంగుళూరు, తిరుపతి, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళే ఏసి బస్సులను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిలిపివేస్తున్నందున దాదాపు కోటిన్నర రూపాయల వరకు నష్టం వాటిల్లింది. పలుచోట్ల అద్దాల పగులుగొట్టడం, ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఏసి బస్సులను నిలిపివేయడం వంటి కారణాలతో విశాఖ రీజియన్‌కు నష్టాలు తప్పడంలేదు.
నిధుల కోసం నిరీక్షణ
* పంచాయితీల్లో తీరని సమస్యలు
విశాఖపట్నం, ఆగస్టు 5: పంచాయితీలకు గత రెండేళ్ళుగా రావాల్సి ఉన్న నిధుల కోసం ఇవి నిరీక్షిస్తున్నాయి. రాష్ట్ర ఆర్ధిక సంఘం నుంచి ఏడాది కనీసం పది కోట్ల రూపాయల మేర గత రెండేళ్ళ నుంచి రావాల్సి ఉంది. అలాగే 13వ ఆర్ధిక ప్రణాళిక ద్వారా రూ. 45 కోట్లు నిధులు మంజూరు కావాల్సి ఉంది. అయితే గత రెండేళ్ళుగా ఒక్క పైసా కూడా రాకపోవడంతో పంచాయితీలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఇందులో తాగునీటి సదుపాయానికి రూ. 6.63 కోట్లు, ఈ ఏడాది నాలుగు త్రైమాసికాలకు సంబంధించి 24 కోట్ల రూపాయలు, అలాగే 2011-12 ఆర్ధిక సంవత్సరానికి సంబందించి రూ.2.34 కోట్ల మేర నిధులు రావాల్సి ఉంది. అయితే వీటిలో కొంతమేర వచ్చినా దేనికి సర్ధుబాటుకావడంలేదు. కొన్నాళ్ళపాటు ప్రీజింగ్ సమస్య నెలకొవడంతో వీటికి మోక్షం లభించలేదు. మొత్తం మీద అన్ని రకాలైన నిధులు రూ. 65 కోట్ల మేర రావాల్సి ఉండటంతో వీటి కోసం పంచాయితీలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాయి.

* ‘విభజన’కే నాయకుల భజనా? * ఉద్యమానికి తూట్లు పొడుస్తున్నారా? * జనాన్ని మోసగిస్తున్నారా? * చేతకాక చేతులెత్తేశారా?
english title: 
n

నేతల్లేని నిరసనలు

$
0
0

విశాఖపట్నం, ఆగస్టు 5: రాష్ట్రం ముక్కలైపోడానికి మరెంతో కాలం పట్టేట్టు లేదు. ఇది సమైక్య వాదల్లో రగులుకుంటున్న వేదన. విభజన జరగరాదన్నది సీమాంధ్రుల కోరిక. సమైక్య వాదం బలంగా వినిపిస్తున్న విశాఖ నగరంలో వారికి అండగా నిలబడ్డ నాయకుడు ఒక్కడు కూడా కనిపించకపోవడం దురదృష్టకరం. చిన్న వారి నుంచి వృద్ధులవరకూ ఉద్యమంలో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారు. యువకులు లాఠీ దెబ్బలు తింటున్నారు. నిరాహార దీక్షలు చేస్తున్నారు. విద్యార్థులు చదువులు మానుకుని మరీ రోడ్లెక్కి సమైక్య నినాదాన్ని వినిపిస్తున్నారు. కార్మికులు విధులను బహిష్కరిస్తున్నరు. ఉద్యోగులు పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ముస్లింలు మానవహారంగా ఏర్పడి తమ నిరసన తెలుపుతున్నారు. ఉద్యమ నేపథ్యంలో పలువురు జైళ్ళకు వెళుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రాణ త్యాగాలు చేశారు. ఇవేవీ మనం నేతలుగా కొలుచుకుంటున్న వారి కంట పడడం లేదా? ఇవి ప్రజల మనోభావాలు కావా? ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పదవులకు రాజీనామాలు చేసిన వారంతా ఉద్యమాన్ని నడిపించే బాధ్యత ఎందుకు తీసుకోలేదు?
రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడిన అనంతరం సుదీర్ఘ మంతనాలు తరువాత గంటా శ్రీనివాసరావు మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత విశాఖ వచ్చినప్పుడు సమైక్య వాదులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆ రోజంతా హడావుడిగా గడిపిన ఆయన నాన్ పొలిటికల్ జెఎసిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి మర్నాడు హైదరాబాద్ వెళ్లిపోయి ఇంత వరకూ తిరిగి రాలేదు. అప్పటి వరకూ ఉద్యమానికి ఎవరెవరో నాయకత్వం వహిస్తున్నారు. ఇక నుంచి గంటా ఈ బాధ్యతలు స్వీకరిస్తారని చాలా మంది భావించారు. కానీ ఇప్పటికీ అలా జరగలేదు. మంత్రి బాలరాజు కూడా సమ్యైవాదిననే చెపుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తాము కోరుకుంటున్నామని చెప్పుకొస్తున్నారు. పాడేరు, అరకు, నర్సీపట్నం ప్రాంతాల్లో బంద్ విజయవంతంగా జరిగింది. ఉద్యమకారుల వత్తిడో, స్వచ్ఛందంగానో వ్యాపారులు దుకాణాలు బంద్ చేసి సమైక్య ఉద్యమానికి మద్దతు పలికారు. మంత్రి పదవికి రాజీనామా చేయనక్కర్లేదన్న బాలరాజు కనీసం ఉద్యమం వైపు కనె్నతె్తైనా చూడ్డం లేదు. ఆయన జిల్లాలో పర్యటించినప్పుడైనా ఉద్యమానికి మద్దతు తెలపలేదు. ఇక ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఆ తరువాత ఆయన ఉద్యమంలోకే రాలేదు. జరుగుతున్న ఆందోళనలన్నీ వన్ టౌన్ ప్రాంతంలోనే జరుగుతున్నాయి. వాటికి మద్దతుగా ఆయన బయటకు రాకపోవడం గమనార్హం. అలాగే, తైనాల విజయకుమార్ కూడా ఉద్యమంలో పాల్గొనకపోవడానికి కారణాలేమిటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇక అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేసి, ఉద్యమంలో తూతూ మంత్రంగా పాల్గొంటున్నారే కానీ, దిశా నిర్దేశం చేయడానికి ముందుకు రావడం లేదు. పోలీసులతో ముందే కుదుర్చుకున్న ఒప్పందంతో ధర్నాల పేరుతో హడావుడి చేసి, కాసేపు వీడియోలు, ఫొటోలు తీయించుకుని వెళ్లిపోతున్నారు కొంతమంది నాయకులు.
ఇక సమైక్య నినాదాన్ని అందరికన్నా ముందుగానే వినిపించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధిష్ఠానం మనోభావాన్ని తెలుసుకుని ఇక్కడున్న ఆ పార్టీ నాయకులైనా ఉద్యమాన్ని భుజనా వేసుకోవచ్చు కదా! వారూ దీని గురించి పట్టించుకోవడం లేదు. ఆ పార్టీలోని ఏ కొద్దిమందో అప్పుడప్పుడు పత్రికల వారి తృప్తి..వారి సంతృప్తి కోసం ఉద్యమిస్తున్నారే తప్ప, సమైక్య రాష్ట్రం కోసం కాదన్నది వాస్తవం.
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ అథిష్ఠానం వెలువరించిన తరువాత టిడిపికి ముందు నుయ్యి..వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. బాబు చెవిలో ఉపదేశించారో..లేక వీరి బుర్రలో పుట్టిందో కానీ ఇక్కడి తెలుగుదేశం నాయకులు సమైక్య నినాదంతో వీధుల్లోకి వస్తున్నారు. ఎప్పటిలాగానే విచిత్ర నిరసనలు చేసి జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. వీరి ప్రయత్నం కూడా అంతంతమాత్రంగానే ఉంది.
విశాఖ జిల్లాలో ఉద్యమం కాస్త నిలదొక్కుకుందంటే ఈ ప్రజా ప్రతినిధుల వల్ల కాదన్నది ముమ్మాటికీ నిజం. వీరు ఉద్యమాన్ని కొనసాగించకపోయినా ఫరవాలేదు. పోలీసులను ఉసిగొలిపి, వారితో ఉద్యమంపై నీళ్ళు చల్లే ప్రయత్నాన్ని విజయవంతంగా చేయిస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు. తెలంగాణలో ఉద్యమం మహోద్యమంగా మారడానికి పోలీసుల సహకారం కూడా ఒక కారణం కాదా? మరి ఇక్కడెందుకు చిన్నపాటి ధర్నాను కూడా పోలీసులు భూతద్దంలో చూస్తున్నారు? విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులే లేకుంటే సమైక్యోద్యమ చరిత్రలో విశాఖ జిల్లాకు స్థానం ఉండేది కాదు. వీరంతా ఉద్యమానికి ముఖం చాటేయడాన్ని చూస్తుంటే, విభజనకే వీరు భజన చేస్తున్నారనుకోవాలా? ప్రజలను మోసగిస్తున్నారని అనుకోవాలా? ఉద్యమం చేయడం చేతకాక చేతులేత్తేశారని భావించాలా?

సమైక్య ఉద్యమంతో ఈపిడిసిఎల్‌కు తీవ్ర నష్టం
విశాఖటప్నం, ఆగస్టు 5: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగాను, సమైక్యాంధ్రకు మద్ధతినస్తూ గత వారం రోజులు జరుగుతున్న ఉద్యమాలు విద్యుత్, ఆర్టీసీ సంస్థలకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. విద్యుత్ సంస్థకు వచ్చే రెవెన్యూ వసూళ్ళు కాస్త పడిపోయాయి. ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లా పరిధిలో పనిచేస్తున్న పలు విభాగాల ఉద్యోగులు, ఆయా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు, ధర్నాలు వంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీని ప్రభావం కాస్త రెవెన్యూ వసూళ్ళపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని అధికారవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. సంస్థ పరిధిలో దాదాపు 50 లక్షల మంది వినియోగదారులుండగా, వీరి అందరి ద్వారా ప్రతినెల రూ.500 కోట్లకు పైగానే ఆదాయం వస్తోంది. సమైక్య ఉద్యమాలతో ఇపుడు ఇది కాస్త పడిపోయి, దాదాపు 30 శాతం మేర ఆదాయం తగ్గిందనేది స్పష్టమవుతోంది. విశాఖ జిల్లాకు సంబంధించి 11లక్షలకు పైగా వినియోగదారులుండగా ప్రతినెల దాదాపు వంద కోట్ల మేర ఆదాయం వస్తోంది. ఇపుడు ఇది కాస్త తగ్గిపోతోందని చెబుతున్నారు. ఉద్యోగులు ఆందోళనల్లో పాల్గొంటున్నందున బిల్లుల చెల్లింపుల కోసం వినియోగదారులు అంతగా చూపడంలేదు. దీనివల్ల 10 నుంచి 20 శాతం మేర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
* ఆర్టీసీకి పెరుగుతున్న నష్టాలు
సమైక్య ఉద్యమంతో ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు తీవ్ర నష్టం ఏర్పడుతోంది. విశాఖ నుంచి బెంగుళూరు, తిరుపతి, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళే ఏసి బస్సులను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిలిపివేస్తున్నందున దాదాపు కోటిన్నర రూపాయల వరకు నష్టం వాటిల్లింది. పలుచోట్ల అద్దాల పగులుగొట్టడం, ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఏసి బస్సులను నిలిపివేయడం వంటి కారణాలతో విశాఖ రీజియన్‌కు నష్టాలు తప్పడంలేదు.
నిధుల కోసం నిరీక్షణ
* పంచాయితీల్లో తీరని సమస్యలు
విశాఖపట్నం, ఆగస్టు 5: పంచాయితీలకు గత రెండేళ్ళుగా రావాల్సి ఉన్న నిధుల కోసం ఇవి నిరీక్షిస్తున్నాయి. రాష్ట్ర ఆర్ధిక సంఘం నుంచి ఏడాది కనీసం పది కోట్ల రూపాయల మేర గత రెండేళ్ళ నుంచి రావాల్సి ఉంది. అలాగే 13వ ఆర్ధిక ప్రణాళిక ద్వారా రూ. 45 కోట్లు నిధులు మంజూరు కావాల్సి ఉంది. అయితే గత రెండేళ్ళుగా ఒక్క పైసా కూడా రాకపోవడంతో పంచాయితీలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఇందులో తాగునీటి సదుపాయానికి రూ. 6.63 కోట్లు, ఈ ఏడాది నాలుగు త్రైమాసికాలకు సంబంధించి 24 కోట్ల రూపాయలు, అలాగే 2011-12 ఆర్ధిక సంవత్సరానికి సంబందించి రూ.2.34 కోట్ల మేర నిధులు రావాల్సి ఉంది. అయితే వీటిలో కొంతమేర వచ్చినా దేనికి సర్ధుబాటుకావడంలేదు. కొన్నాళ్ళపాటు ప్రీజింగ్ సమస్య నెలకొవడంతో వీటికి మోక్షం లభించలేదు. మొత్తం మీద అన్ని రకాలైన నిధులు రూ. 65 కోట్ల మేర రావాల్సి ఉండటంతో వీటి కోసం పంచాయితీలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాయి.

* ‘విభజన’కే నాయకుల భజనా? * ఉద్యమానికి తూట్లు పొడుస్తున్నారా? * జనాన్ని మోసగిస్తున్నారా? * చేతకాక చేతులెత్తేశారా?
english title: 
n

జివిఎంసిలో స్తంభించిన పాలన

$
0
0

విశాఖపట్నం, ఆగస్టు 5: సమైక్యాంధ్రకు మద్దతుగా మహావిశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) అధికారులు, సిబ్బంది ఉద్యమంలో భాగస్వామ్యమయ్యారు. ఎపి ఎన్జీఓల సంఘం, రాష్ట్ర పురపాలక ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జివిఎంసిలోని పట్టణ ప్రణాళిక విభాగం, ఎంప్లారుూస్ యూనియన్, జివిఎంసి ఆఫీసర్స్ అసోసియేషన్ (గోవా) సంయుక్తంగా రాష్ట్ర సమైక్య పోరాటంలో భాగస్వామ్యం అయ్యాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా తమ రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు సోమవారం నుంచి విధులను భహిష్కరిస్తున్నట్టు జివిఎంసి పట్టణ ప్రణాళిక అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈమేరకు యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు జయరాం, వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు ఉదయం నుంచి సిబ్బంది విధులకు హాజరుకాకుండా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, ఉద్యోగుల హక్కులు పరిరక్షించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు పట్టణ ప్రణాళిక విభాగం ప్రతినిధులు సమైక్యాంధ్రకు మద్దతుగా తాము ఉద్యమంలో పాల్గొంటున్నామని, 72 గంటల పాటు పెన్‌డౌన్ సమ్మెకు దిగుతున్నట్టు జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణకు లిఖితపూర్వకంగా తెలిపారు. అనంతరం వీరంతా జివిఎంసి కార్యాలయం ప్రధాన ద్వారం నుంచి ర్యాలీగా బయలుదేరి గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా, కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
‘గోవా’ ఆధ్వర్యంలో
జివిఎంసి ఆఫీసర్స్ అసోసియేషన్ (గోవా) ఆధ్వర్యంలో అన్ని విభాగాలకు చెందిన అధికారులు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అసోసియేషన్ ప్రతినిధులు ఎడిసి రమేష్, పూర్ణచంద్రరావు, సిఇ బి జయరామిరెడ్డి తదితరులు ముందుగా కమిషనర్ ఎంవి సత్యనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం విధులను బహిష్కరించి సమైక్య ఉద్యమంలో పాల్గొన్నారు. జివిఎంసి ప్రధాన కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈసందర్భంగా వారు రాష్ట్ర విభజన నిర్ణయం వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలను వివరించారు. కార్యక్రమంలో పట్టణ ముఖ్యప్రణాళికాధికారి బాలకృష్ణ, ప్రధాన ఆరోగ్య అధికారి డాక్టర్ ఎంఎస్ రాజు తదితరులు పారల్గొన్నారు. అనంతరం మానవహారం నిర్వహించారు.
జివిఎంసి గుర్తింపు యూనియన్ గౌరవాధ్యక్షుడు ఎం ఆనందరావు ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా తలపెట్టిన ఆందోళనలో పాల్గొన్నారు.

బీచ్‌రోడ్డులో ఇక నిరంతర పారిశుద్ధ్యం
* వ్యాపారులకూ ప్రత్యేక డ్రెస్ కోడ్
* జివిఎంసి కమిషనర్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఆగస్టు 5: సాగరతీరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంపై జివిఎంసి దృష్టి సారించింది. బీచ్‌రోడ్డులో పారిశుద్ధ్య మెరుగునకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు కమిషనర్ ఎంవి సత్యనారాయణ తెలిపారు. తన ఛాంబర్‌లో సోమవారం కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య మెరుగునకు చేపట్టే చర్యల్లో భాగంగా ఇక మీదట నిరంతరం పారిశుద్ధ్య పనులు జరుగుతాయని తెలిపారు. దీనిలో భాగంగా 24 గంటలూ పారిశుద్ధ్య పనులు జరిగే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసినట్టు వెల్లడించారు. దీని అమలుకు జోనల్ కమిషనర్‌తో పాటు సూరింటిండెంట్ ఇంజనీర్, డివిజనల్ ఇంజనీర్ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. బీచ్‌రోడ్డులో వ్యాపారాలు చేసుకునే వారందరికీ డ్రస్‌కోడ్‌ను అమలు చేయనున్నట్టు తెలిపారు. ఇక్కడ వ్యాపారం చేసుకునే చిరువ్యాపారులకు డస్ట్‌బిన్‌లు పంపిణీ చేసి చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా నిరోధించాలని నిర్ణయించామన్నారు. ఈ చెత్తను ఎప్పటికప్పుడు తరలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బీచ్‌లో సందర్శకులను ఆకర్షించేందుకు పార్కుల్లో ఏర్పాటు చేసిన కట్టడాలు దెబ్బతిన్నాయని, వీటికి మరమ్మతులు చేపట్టి మరింత సుందరంగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. ఆశీల్‌మెట్ట ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిందని, ఫ్లైఓవర్ కింది భాగాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు 70 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. బ్రిడ్జి కిందిభాగంలో ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. అయితే ఇక్కడ వాహనాల పార్కింగ్ వంటి వాటికి అనుమతిచ్చేందుకు నిబంధనలు అనుమతించవని ఆయన స్పష్టం చేశారు. నగర పరిధిలో శిధిల భవనాల కూల్చివేతకు సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, సమయం మించిన పక్షంలో వాటిని తామే స్వయంగా కూల్చేస్తామని స్పష్టం చేశారు.
జివిఎంసిలో భీమునిపట్నం, అనకాపల్లి మున్సిపాలిటీలు సహా 10 పంచాయతీల విలీనం పూర్తయిందని, నిబంధనల మేరకు 19లకు జివిఎంసి జనాభా చేరుకుందన్నారు. నిబంధనల ప్రకారం జివిఎంసిని 81 వార్డులుగా పునర్విభజించే అవకాశం ఉందని, ఈమేరకు ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు తెలిపారు. వార్డుల పునర్విభజన, మ్యాప్ తయారీ, నోటిఫికేషన్ జారీ, అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన వంటి అంశాలు పూర్తయ్యేందుకు నెల రోజులు సమయం పడుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
కెజిహెచ్, ఎఎంసికి పాకిన సమైక్య సెగ
* రోడ్డెక్కి నిరసన తెలిపిన వైద్యులు

విశాఖపట్నం, ఆగస్టు 5: సమైక్య సెగ కెజిహెచ్, ఆంధ్రామెడికల్ కాలేజీ (ఏఎంసి)కి పాకింది. వైద్యులంతా రోడ్డెక్కి మరీ తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతున్నారు. ప్రజా సంఘాలు, ఏన్జీవోలు, ఆర్టీసీ కార్మిక సంఘాలు, ముస్లింలు, కాలేజీ విద్యార్థులు, యువజన సంఘాలతోపాటు వైద్యులు తీవ్రతరమవుతున్న ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. దీంతో కేజిహెచ్, ఏఎంసిలు వైద్యుల నిరసనలతో హోరెత్తుతోంది. ఆంధ్రప్రదేశ్ గవర్న్‌మెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కేజిహెచ్ వద్ద పెద్ద సంఖ్యలో వైద్యులు పాల్గొని నిరసన ప్రదర్శన నిర్వహించార. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పిడకల శ్యామ్‌సుందర్ నాయకత్వంలో రాష్ట్ర విభజనపై జరుపుతున్న నిరసనల కార్యక్రమంలో భాగంగా సోమవారం యునైటెడ్ డాక్టర్స్ ఫోరం (ఏపి ప్రభుత్వ వైద్యుల సంఘం, ఐఎమ్, నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్స్) నర్సుల అసోసియేషన్స్, క్లాస్-4 ఎంప్లారుూస్ అసోసియేషన్స్ సంయుక్తంగా జరిపిన ధర్నా కార్యక్రమాలు కెజిహెచ్, ప్రాంతీయ కంటి ఆసుపత్రి వద్ద జరిగాయి. కంటి ఆసుపత్రి దగ్గర మానవహారంగా ఏర్పడి బుల్లయ్య కాలేజి దగ్గర విఐపి రోడ్డును దాదాపు గంటసేపు దిగ్భంధం చేశారు. ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ మాట్లాడుతూ మంగళవారం నుంచి వైద్య విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఉద్యమంలో పాల్గొనాలని కోరినట్టు చెప్పారు. రాష్ట్ర విభజనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించే వరకు ఈ నిరసన కార్యక్రమాలు ఎక్కడికక్కడ జరుగుతాయని శ్యాంసుందర్ తెలియజేశారు. అలాగే హైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక విభాగాధిపతిని ఒక అసిస్టెంట్ దుర్భాషలాడుతూ ఈ ప్రాంతం నుంచి వెళ్ళకపోతే పెట్రోలు పోసి తగులబెడతానని అందరి ముందు చేసిన వ్యాఖ్యలు 24 గంటల్లో ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పకపోతే ఈసారి తెలంగాణా బిడ్డలతోనే సమాధానం చెప్పిస్తామని హెచ్చరించారు. ఇకనైనా అలాంటి వ్యాఖ్యాలు చేయవద్దని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ ఆదినారాయణ, ఎపిఎన్‌ఏ ప్రతినిధులు, నర్సుల అసోసియేషన్, క్లాస్-4 ఎంప్లారుూస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్యులు శ్యామ్ సుందర్, ఉదయ్‌కుమార్, బాబీ శ్యాంకుమార్, రమణి, ఇందిర, శేఖర్, జయధీర్, సుధాకర్ పాల్గొన్నారు. కంటి ఆసుపత్రి వద్ద సూపరింటెండెంట్ వివిఎల్ నర్సింహ, ఆర్‌ఎంఓ సత్యనారాయణ, వైద్యులు, నర్సు, నాల్గవ తరగతి ఉద్యోగులు, పారామెడికల్ స్ట్ఫా పాల్గొన్నారు.

సమైక్యాంధ్రకు మద్ధతుగా
ఆర్టీసీ ఎన్‌ఎంయు నిరవధిక నిరాహారదీక్షలు

విశాఖపట్నం, ఆగస్టు 5: సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా సోమవారం ఆర్టీసీ ఎన్‌ఎంయు విశాఖ జిల్లాకమిటీ ఆధ్వర్యంలో మద్దిలపాలెం సిటీ డిపో వద్ద రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని జిల్లా అధ్యక్షుడు వి.అప్పారావు ప్రారంభించారు. ఈ శిబిరంలో తొమ్మిది డిపోల కార్మికులు పాల్గొన్నారు. స్టూడెంట్ జెఏసి నాయకులు, ఏపీఎన్జీవోల నాయకులు, పంచాయతీరాజ్ అసోసియేషన్ నాయకులు హాజరై సంఘీభావం తెలియపర్చారు. ఈ దీక్షా శిబిరానికి ముఖ్యఅతిథిలుగా హాజరైన ఎన్‌ఎంయు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ఒకే ఒక డిమాండ్త్ ఆర్టీసీ ఆర్మికులు, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళనలో భాగంగా ఈ రోజు జిల్లా కమిటి దీక్షలు నిర్వహించిందన్నారు. వీటిని నిరవధిక కొనసాగిస్తామన్నారు. కేవలం కొంతమంది స్వార్ధ రాజకీయ నాయకుల స్వప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రాన్ని విభజించాలని చూడటం దుర్మార్గమని, దేశంలో 20 రాష్ట్రాల విభజన కేంద్ర హోంశాఖలో పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ఈ రాష్ట్రాన్ని మాత్రమే విభజించాలని నిర్ణయం తీసుకున్న దానిపై సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తక్షణం వారి పదవులకు రాజీనామా చేసి ఉద్యమాన్ని నడిపించాలని డిమాండ్ చేశారు. సమావేశానికి హాజరైన జోనల్ కార్యదర్శి పివివి మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల ఆర్టీసీకి తీవ్ర నష్టమని, ఆస్తులన్నీ హైదరాబాద్‌లో ఉండి సీమాంధ్ర ఆర్టీసీకు నష్టపోతుందన్నారు. నీరు, విద్యుత్, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఏర్పడుతున్నాయన్నారు. అవసరమైతే సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి హాజరైన ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షులు కె.ఈశ్వరరావు సంఘీభావం తెలియజేశారు. ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంచేంతంట వరకు ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, మహిళలతో తీవ్ర ఉద్యమాన్ని సమిష్టిగా నడిపించాలని పిలుపునిచ్చారు. స్డూడెంట్ జెఏసి రాష్ట్ర అధ్యక్షుడు ఆడారి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తక్షణం రాజీనామా చేయాలని, ముఖ్యంగా కేంద్ర పర్యాటకశాఖామంత్రి చిరంజీవి ప్రజారాజ్యం అధ్యక్షులుగా ఉన్నపుడు గట్టిగా వాదించి, ఈ రోజు మంత్రి పదవి వచ్చిన తరువాత మాట మార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణం వారి పదవికి రాజీనామా చేసి, సమైక్యాంధ్రకు కట్టుబడకపోతే, సీమాంధ్రలో వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన సినిమాల విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎంయు నాయకులు, విజి విలియమ్స్, ఎంవిఆర్ మూర్తి, పిఎన్ రావు, జెఎం నాయుడు, అన్ని డిపోల అధ్యక్ష,కార్యదర్శులు హాజరయ్యారు. ఎపీఎన్జీవో సంఘ నాయకులు కెవి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, సత్తిబాబు, ఏపీ పంచాయితీరాజ్ అసోసియేషన్ అధ్యక్షులు యు.కూర్మారావులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ రోజు దీక్షా శిబిరంలో ఆర్టీసీ సిబ్బంది ఎల్.అప్పన్న, శంకర్, కెవిజె రావు, కెవిఎస్ ప్రసాద్, సంజీవి, టిఎస్ రావు, ఎంఆర్ బాబు, సాయిబబా, పివివిఎస్‌బి రావు, కృష్ణ, పి.రాంజీ, పివి రావు, కెవి కుమార్, వైఆర్‌సిహెచ్ రావు, తదితరులు పాల్గొన్నారు.

ముస్లింల మానవహారం
* సమైక్యాంధ్రకు మద్ధతుగా ర్యాలీ
విశాఖపట్నం, ఆగస్టు 5: సమైక్యాంధ్రకు మద్దతుగా సోమవారం ముస్లింలు జగదాంబ జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. సమైక్యాంధ్ర విశాఖ ముస్లింల జెఏసి ఆధ్వర్యంలో నిర్వహించిన మానవహారం సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన ముస్లింలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పిసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఏ రెహ్మాన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన ముస్లిం హృదయాలను గాయపర్చేదిగా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే అనేక రకాలైన నష్టాలుంటాయన్నారు. రంజాన్ మాసంలో యుపిఏ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ముస్లింలకు ఏమీ చేయాలో తెలియని అయోమయం నెలకొందన్నారు. హైదరబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని ముస్లిం పెద్దలు, జేఏసి ప్రతినిధులు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర కట్టుబడి ఉంటూ రాజకీయ నాయకులు దీని కోసం తీవ్రంగా కృషి చేయాలని, ఎటువంటి పరిస్థితుల్లోను రాష్ట్ర విభజన జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జహీర్ అహ్మద్, నజీర్, ఎకే ఖాన్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జగదాంబ జంక్షన్ నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఇక్కడ కొద్దిసేపు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ముస్లిం ప్రతినిధి బృందం జెసి ప్రవీణ్‌కుమార్‌కు వినితిపత్రం అందజేసింది.

సమైక్యాంధ్ర జెఎసి విద్యార్థుల ఆమరణ దీక్షల విరమణ

విశాలాక్షినగర్, ఆగస్టు 5: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి నాయకులు సోమవారం కెజిహెచ్‌లో దీక్షలు విరమించారు. ఆంధ్ర యూనివర్శిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్‌ఎన్ రాజు విద్యార్థులను పరామర్శించి నిమ్మరసం ఇచ్చి విద్యార్థులను దీక్షలు విరమింప చేశారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి రాష్ట్ర కన్వీనర్ లగుడు గోవింద రావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం శాంతియుత పోరాటాలు చేస్తామన్నారు. అన్ని రాజకీయ పక్షాల నాయకులు, విద్యార్థి నాయకులు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించ డానికి దీక్షలు విరమించామన్నారు. తాము చేపట్టిన దీక్షలకు సంఘీభావం తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎయు ఆచార్యులు, విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు, సిబ్బంది సహకారం మరువలేని దన్నారు. సమైక్యాంధ్ర యువజన జెఎసి రాష్ట్ర కన్వీనర్ ఆరేటి మహేష్ మాట్లాడుతూ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా విశాఖ నగరంలో భారీ సభ ఏర్పాటుకు రాజకీయ పక్షాల ప్రతినిధులు, ఎన్జీవో సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలతో చర్చలు జరుపుతున్నా మన్నారు. జెఎసి నాయకులు బి.కాంతారావు, టి.సురేష్ దీక్షలు విరమించారు. ఈ కార్యక్రమంలో ఎయు రెక్టార్ ఆర్‌కెవిఎస్ రాజు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కట్టా రామ్మోహన రావు, కెజిహెచ్ డాక్టర్లు ఎం.మధుసూధన బాబు, శివకుమార్, విజయ శంకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సమైక్యాంధ్ర బంద్ విజయవంతం
మునగపాక, ఆగస్టు 5: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాలేజీ విద్యార్థులు, యువజన సంఘాలు చేపట్టిన మండల బంద్ పూర్తిస్థాయిలో విజయవంత మైంది. మునగపాకలో తెల్లవారు 4గంటల నుండి మా జీ సర్పంచ్ పెంటకోట సత్యనారాయణ, ఆడారి గణప తి అచ్చింనాయుడు, ఆడారి మహేష్, పెంటకోట రా ము, దాడి అప్పలనాయుడు ఆధ్వర్యంలో అనకాపల్లి - పూడిమడక మెయిన్‌రోడ్డులో రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. అచ్యుతాపురం మండలంలో బ్రాండిక్స్‌లో విధుల కోసం రోజూ వేలాదిమంది ఉద్యోగులు వెళుతుంటారు. తెల్లవారు నుండే ఆందోళనకారులు మునగపాకలో బస్సులను నిలిపివేయడంతో బస్సులు నిలిచిపోయి మునగపాక నుండి అనకాపల్లి బైపాస్‌రోడ్డు వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆటోలను, వాహనదారులను ఎక్కడికక్కడే ఆందోళనకారులు అడ్డగించి తమ నిరసన వ్యక్తం చేశారు. మునగపాకలోనూ, ఒంపోలు, నాగులాపల్లి, తిమ్మరాజుపేట ఇతర ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేసి ఉద్యమాన్ని ఉద్ధృత రూపంలో నడిపించారు. శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలుగకుండా ట్రాఫిక్ సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీస్థాయిలో బలగాలను మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుండి బస్సులు నిలుపుదల చేయడంతో బ్రాండిక్స్ బస్సుల్లో ఉద్యోగులు చిక్కుకుపోయి ఆకలితో అలమటించారు. తెల్లవారు నాలుగు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు బంద్ పూర్తిస్థాయిలో కొనసాగింది. ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య, సహకార బ్యాంక్‌లు, హోటళ్లు, పాఠశాలలు, కళాశాలలు స్వచ్చందంగా మూసివేసి బంద్‌కు సహకరించాయి.

రాహూల్ కోసమే రాష్ట్రం ముక్కలు
* సమైక్యాంధ్ర కోరుతూ టిడిపి ఆందోళన
అనకాపల్లి, ఆగస్టు 5: భారత ప్రధాని పదవిని తన కుమారుడు రాహూల్‌గాంధీకి కట్టబెట్టే రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసమే ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలుగా చేసి తెలంగాణ ఇచ్చేందుకు సోనియాగాంధీ సిద్ధపడ్డారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. సమైక్యాంధ్ర కోరుతూ అనకాపల్లి అసెంబ్లీ టిడిపి సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పెద్దఎత్తున ఆందోళనలను అనకాపల్లిలో నిర్వహించారు. నెహ్రూచౌక్ జంక్షన్‌లో రాస్తారోకో, మానవహారం, పట్టణంలో నిరసన ప్రదర్శన తదితర ఆందోళనలు చేపట్టారు. రింగురోడ్డు జంక్షన్‌లో టిడిపి నాయకులు, కార్యకర్తలు సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాజీమంత్రి బండారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వనరులతో అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ను తెలంగాణ కు ధారాదత్తం చేయడం అన్యాయమన్నారు. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్న కెసిఆర్‌ను వెంటనే అరెస్టు చేయకుండా ప్రభుత్వం తాత్సార వైఖరిని అవలంబించడం తగదని జిల్లా టిడిపి అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు అన్నారు. అనకాపల్లి దేశం సమన్వయకమిటీ సభ్యులు బుద్ద నాగజగదీష్, డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ సమైక్యాంధ్రను సాధించేవరకు తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరు సాగిస్తుందన్నారు. సమైక్యాంధ్ర కోసం తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపిలు తమ పదవులకు రాజీనామాలు చేసి రుజువు చేసుకున్నారన్నారు. అసెంబ్లీ టిడిపి సమన్వయ కమిటీ సభ్యులు, మాజీ ఎంపిపిలు నిమ్మదల త్రినాథరావు, రొంగలి శ్రీరామ్మూర్తి, బోడి వెంకట్రావు, మాజీ జెడ్పీటిసి పొన్నగంటి నూకరాజు, బొలిశెట్టి శ్రీనివాసరావు, యల్లంకి సత్తిబాబు, పట్టణ తెలుగుయువత అధ్యక్షులు మళ్ల సురేంద్ర ఆందోళనలో పాల్గొన్నారు.

రాష్ట్ర విభజనకు నిరసనగా
భారీ సమైక్య ర్యాలీ
పాడేరు, ఆగస్టు 5: సమైక్యాంధ్రకు మద్దతుగా సోమవారం పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఐ.టి.డి.ఎ. కార్యాలయం నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ సినిమాహాల్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, మెయిన్‌రోడ్డు మీదుగా ఎం.పి.డి.ఒ. కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు సమైక్యాంధ్రపై చేసిన నినాదాలు పట్టణంలో హోరెత్తాయి. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నిన యు.పి.ఎ. చైర్‌పర్సన్ సోనియా గాంధీ తన దేశమైన ఇటలీకి వెళ్ళిపోవాలని, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ డౌన్‌డౌన్, సమైక్యాంధ్ర వర్థిల్లాలి, హైదరాబాద్ అందరిదీ, గిరిజన మంత్రి బాలరాజు రాజీనామా చేయాలనే పలు డిమాండ్లతో ఆందోళనకారులు నినాదాలు చేశారు. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నాయకులు, గిరిజన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల సహకారంతో ప్రెస్ క్లబ్ తలపెట్టిన సమైక్యాంధ్ర ర్యాలీ విజయవంతమైంది. స్థానిక మూడు రోడ్ల కూడలి వద్ద మానవహారం నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నాయకులు, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు క్షీరాభిషేకం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటువలన తెలుగుజాతి నాశనమయ్యే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి ఏకతాటిపై ఉన్న తెలుగువారిని రెండుగా చీల్చి తెలుగు ప్రజల మధ్య ఢిల్లీ పెద్దలు చిచ్చు రేపారని వారు ఆరోపించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో ముందుకు వచ్చి అవసరమైతే ఏ త్యాగానికైనా సిద్ధం కావాలని వారు డిమాండ్ చేశారు.
సమైక్యాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాలుపంచుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నాయకులు బొర్రా నాగరాజు, రొబ్బి రాము, చీకటి మధు, కొట్టగుళ్లి సుబ్బారావు, పి.పాండురంగస్వామి, సురేష్‌కుమార్, గిరిజన ఉద్యోగుల సంఘం కార్యదర్శి రూడి అప్పారావు, ప్రతినిధులు పి.సత్యనారాయణ, జి.వెంకటేశ్వరరావు, బూసిన నాగరాజు, జి.శంకరరావు, గురునాథ్, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు, శ్రీ కృష్ణాపురం, తలారిసింగ్ ఆశ్రమ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సరిహద్దుల్లో పోలీసుల తనిఖీలు
సీలేరు, ఆగస్టు 5: ఆంధ్రా - ఒడిశా సరిహద్దు చిత్రకొండ పోలీస్ స్టేషన్ సరిహద్దులో ఆదివారం మావోయిస్టు మిలీషియా సభ్యుడును అరెస్ట్ చేసి ఆరు తుపాకు లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈనేపధ్యంలో సరిహద్దు ప్రాం తంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. బి. ఎస్. ఎఫ్. పోలీసు బలగాలు ఎ.ఓ.బి. సరిహద్దుల్లో గిరిజన గ్రామాలకు వెళ్లి మావోయిస్టులు, మిలీషియా స భ్యుల ఆరా తీస్తున్నట్లు సమాచారం. మావోయిస్టు మిలీషియా సభ్యులుగా వ్యవహరిస్తున్న వారి వివరాలు సేకరించి వారి ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు. ఝాన్‌బాయ్,బలిమెల ప్రాంతాల మీదుగా వచ్చే వాహనాలను తనిఖీ చేసి విడిచి పెడుతున్నారు. మావోయిస్టు మిలీషియా సభ్యులుగా అనుమానం ఉన్న వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దీంతో సరిహద్దుల్లో పోలీసుల తనిఖీలు ముమ్మరం అయ్యాయి.

సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతం
అరకులోయ, ఆగస్టు 5: రాష్ట్ర విభజన నిరసనగా అరకులోయ పట్టణంలో సోమవారం చేపట్టిన ఆందోళన ఉగ్రరూ పం దాల్చింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక ఐక్య కార్యచరణ సమితి (జె. ఎ.సి.) ఆధ్వర్యంలో అన్ని వర్గాల వారు రోడ్డు ఎక్కి ఆందోళన చేపట్టారు. ప్రభు త్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వి ద్యార్థులు, రాజకీయ పార్టీల నాయకు లు, గిరిజనులు, కార్మికులందరూ ఏకమై సమైకాంధ్ర కోరుతూ నిరసన ప్రదర్శన, రాస్తారోకో, మానవహారం, ధర్నా నిర్వహించారు. సమైకాంధ్రకు మద్దతుగా చేపట్టిన బంద్ సంపూర్ణంగా జరిగింది. ఉదయం నుంచి సమైక్యవాదులు ప్రధా న కూడళ్ల వద్ద తిష్టవేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ప్రైవేట్ వాహనాలను నడవకుండా మోటారు, ఆటో యూనియన్ సభ్యులు పూర్తి సహకారా న్ని అందించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలతోపాటు సినిమాహాలు, పెట్రోల్ బంక్, వ్యాపార దుకాణాలను మూయించివేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ విధులను, విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోగా, బ్యాంకులలో లావాదేవీలు స్తంభించిపోయాయి. దుకాణాలు మూతపడడంతో నిత్యావసర సరుకులు దొరక్క గ్రామాల నుండి మండల కేంద్రానికి వచ్చిన గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
స మైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా యు.పి.ఎ. చైర్‌పర్స్‌న్ సోనియాగాంధీ, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె సిఆర్.కు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భం గా పలువురు సమైక్యవాదులు మాట్లాడుతూ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వె నక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రాన్ని విభజన చేస్తున్నట్టు కేం ద్రం తీసుకున

* 72 గంటల పెన్‌డౌన్ సమ్మెలో అధికారులు, సిబ్బంది * కమిషనర్‌కు తెలియపరిచిన అధికారులు * సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన ప్రదర్శన
english title: 
gvmc

ఆగ్రహ జ్వాలలు

$
0
0

విజయనగరం, ఆగస్టు 5: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్య సెగలు జోరందుకున్నాయి. రాస్తారోకో, మానవహారాలు, పిండప్రదానాలు, శవయాత్రలు, దిష్టిబొమ్మల దగ్ధం తదితర నిరసనలతో ప్రజలు అట్టుడికిపోతున్నారు. సోమవారం జిల్లా అంతటా నిరసన జ్వాలలు రగిలాయి. రామభద్రాపురంలో నలువైపులా ట్రాఫిక్‌ను దిగ్బంధించడంతో నాలుగు రాష్ట్రాల వైపు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నాం 3 గంటల వరకు ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలో విశాఖపట్నం వైపు వెళ్లే వై జంక్షన్ వద్ద టైర్లతో మంటలు ఏర్పాటు చేసి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించారు. పట్టణంలోని బీసీ కాలనీ సమీపంలో రైల్వే పట్టాలపై సమైక్యావాదులు ధర్నా చేయడంతో ఉద్త్రిక్త వాతావరణం నెలకొంది. సమైక్యాంధ్ర జై.. కెసిఆర్ డౌన్..డౌన్.. అంటూ నినాదాలు చేశారు. పట్టణంలో లారీ యజమానులు వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగుల 72 గంటల పిలుపులో భాగంగా విధులను బహిష్కరించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు, ఐవిపి రాజుల నేతృత్వంలో మోటారు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ, రిలే నిరాహార దీక్షలను కొనసాగించింది. దాదాపు ఏడు గంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. చీపురుపల్లి, ఎస్.కోటలో రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. అలాగే డెంకాడ-కుమిలి రహదారిపై చెట్లను రోడ్డుకు అడ్డంగా వేసి అటువైపుగా రాకపోకలను నిలిపివేశారు. ఇక పట్టణంలో కలెక్టరేట్ జంక్షన్, బాలాజీ జంక్షన్, మయూర జంక్షన్, కోట తదితర ప్రాంతాల్లో సమైక్యాంధ్ర జెఎసి, విద్యార్థి సంఘాలు, ప్రింటింగ్ ప్రెస్ యూనియన్, మోటార్ యూనియన్‌లతోపాటు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు బైక్ ర్యాలీలతో హోరెత్తించారు. బోగాపురం మండలంలోని ఐదో జాతీయ రహదారి సవరవిల్లిలో వర్షంలో కూడా వంటావార్పు కార్యకమం నిర్వహించారు. జామిలో దాదాపు ఆరు గంటల పాటు ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. ఈ విధంగా జిల్లా అంతటా సమైక్యాంధ్ర నినాదాలతో మార్మోగింది.
రెండోరోజుకు చేరిన కాంగ్రెస్ నిరాహారదీక్ష
విజయనగరం (్ఫర్టు) : రాష్ట్ర విభజనకు వ్యితిరేకంగా జిల్లా కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ చేపడుతున్న రిలే నిరాహారదీక్షలు సోమవారం నాటికి రెండోరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రక్రియ జరగడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ అనుకూలంగా వ్యవహించి, ఇప్పుడు మాటమార్చడం దారుణమన్నారు. అన్ని రాజకీయపార్టీలు అనుకూలంగా వ్యవహరించడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్టానవర్గం సుముఖం వ్యక్తం చేసిందన్నారు. ఈ నిరాహారదీక్షలో కాంగ్రెస్ నాయకులు బొద్దాన అప్పారావు, బోడసింగి ఈశ్వరరావు, పిన్నింటి రాజేష్, ఎస్.మంగాదేవి, వేముల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఉద్యోగుల విధుల బహిష్కరణ
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మున్సిపల్ ఉద్యోగుల సంఘం ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం ఇక్కడ మున్సిపల్ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. 72 గంటల ఆందోళనలో భాగంగా విధులను బహిష్కరించినట్లు మున్సిపల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎస్.అప్పయ్యశెట్టి తెలిపారు. మున్సిపల్ ఉద్యోగులను విధులను బహిష్కరించడంతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు.
పిడుగుపాటుకు
ఇద్దరి మృతి
శృంగవరపుకోట, ఆగస్టు 5 : మండలంలోని కొట్టాం గ్రామం నడిమశెట్టి కల్లం వద్ద సోమవారం సాయంత్రం పిడుగుపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా పక్కనే ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. ఈవార్తకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కొట్టాం గ్రామానికి చెందిన గుర్రపు ముత్యాలు (50), బొడ్డు సూర్యారావు (56), మరో నలుగురితో కలిసి పొలం పనికి కల్లాలకు వెళ్లారు. వర్షానికి వీరంతా ఒక చెట్టు క్రిందకు చేరారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పిడుగుపడటంతో గుర్రపు ముత్యాలు, బొడ్డు సూర్యరావులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిలో కె.ముచ్చుడు,అప్పన్న,అవతారం,సింహాద్రి లకు గాయలుకావడం వీరిని జామి ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. మృతులు రైతు కూలీపనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం ఎస్‌కోట సిహెచ్‌సికి తరలించారు.
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఆగస్టు 5: జిల్లా కేంద్రంలో సమైక్యాంధ్ర ఉద్యమాల వల్ల తమ వ్యాపారం సాగడం లేదని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే వద్ద మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టర్‌ను కలసి తమ వ్యాపారాలకు ఇబ్బంది కలుగకుండా తగిన రక్షణ కల్పించాలని కోరారు. సమైక్యాంధ్రాకు తాము మద్దతు పలుకుతున్నప్పటికీ ఆకతాయిల వల్ల వ్యాపారాలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఎక్కడైన ఇబ్బందులు ఉంటే వాటిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని కోరారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కె.ప్రకాష్, కాశీ విశ్వనాధం, రాజు తదితరులు పాల్గొన్నారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసనల వెల్లువ
చీపురుపల్లి, ఆగస్టు 5 : నియోజకవర్గ కేంద్రమైన చీపురుపల్లిలో సమైక్యాంధ్ర సెగలు, నిరనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడి జెసిసి ఆధ్వర్యంలో ఐదవ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ దీక్షలో శిష్టకరణ సంక్షేమ సంఘ సభ్యులు మన్మధరావు, మూర్తి, ప్రబాష్,శ్రీనివాసరావు,వెంకటేశ్వరరావు, రఘు, శివ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. మండలంలోని మెట్టపల్లి గ్రామానికి చెందిన రాజకీయ నాయకులు, విద్యార్ధులు, ఉపాధ్యాయులు 10 కిలో మీటర్లు పాదయాత్రగా తరలివచ్చారు. కొంత మంది విద్యార్ధులు గుండ్లు కొట్టించుకుని సమైక్యాంధ్రకు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కెసిఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. చీపురుపల్లి మూడురోడ్ల జంక్షన్ వద్ద మానవహారం చేస్తూ కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మండల ఉపాధ్యాయులు టెలికాన్పరెన్స్‌ను బహిష్కరించి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అలాగే స్థానిక ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల విద్యార్ధులు రాజాం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్య సెగలు జోరందుకున్నాయి.
english title: 
a

‘గ్రీవెన్స్’పై సమైక్యాంద్ర ఉద్యమ ప్రభావం!

$
0
0

విజయనగరం(టౌన్), ఆగస్టు 5 : సమైక్యాంధ్ర ఉద్యమ కార్యక్రమాలు, భారీ వర్షం వంటి పరిస్థితుల కారణంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సోమవారం నాటి గ్రీవెన్స్ సెల్‌కు వినతులు తగ్గాయి. సమైక్యాంధ్ర ఉద్యమ కార్యక్రమాలు సోమవారం కూడా పట్టణంలో కొనసాగడంతో గ్రీవెన్స్ సెల్‌కు అర్జీదారుల సంఖ్య తగ్గింది. పలు సమస్యలకు సంబంధించి కేవలం 80 వినతులు అందాయి. డిఆర్‌ఒ హెచ్‌ఎస్ వెంకటరావు వినతులు స్వీకరించారు. ఈ ఏడాది వర్షా భావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సీజన్‌లో వరినాట్లు పలు చోట్ల మొదలు కాలేదని సెప్టెంబర్ నెలాఖరుకుగాని వరినాట్లు పూర్తయ్యే పరిస్థితులు లేనందున పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువు తేదీని సెప్టెంబర్ నెలాఖరు వరకూ పొడిగించాలని కోరుతూ ఎపి రైతు సంఘం జిల్లా నాయకులు మర్రాపు సూర్యనారాయణ వినతినిచ్చారు. ఇందిరమ్మ పథకం క్రింద తమకు మంజూరైన ఇళ్లను నిర్మించి రెండు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇప్పటికీ బిల్లులు అందలేదని న్యాయం చేయాలంటూ ఎస్ కోట మండలం శివరామరాజుపేట గ్రామానికి చెందిన జయలక్ష్మి తదితరులు వినతినిచ్చారు. ఎల్‌కోట మండలం చందులూరు గ్రామంలోని ఒక రేషన్ డీలర్ వద్ద ఉన్న బోగస్ రేషన్ కార్డుల విషయమై దర్యాప్తు జరిపించాలని అదే గ్రామానికి చెందిన ఎస్.శ్రీను తదితరులు వినతినిచ్చారు. వికలాంగ పింఛన్‌ను పెంచాలని కోరుతూ విజయనగరానికి చెందిన బి.సూరమ్మ కోరింది. పూసపాటిరేగ మండలం కొల్లాయివలస గ్రామంలోని ఎంపిపి స్కూల్‌లో బోరు నిర్మించాలని కోరుతూ పలువురు వినతినిచ్చారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నిరోధానికి టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయాలని ఎస్.కోటకు చెందిన ఎస్.శ్రీనివాసరావు తదితరులు కోరారు. ఎల్.కోట మండలం లచ్చంపేట గ్రామంలో ఉపాధి హామీ పధకం పనుల్లో అవకతవకలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు ఫిర్యాదు చేశారు. క్రైస్తవ ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ కొంతమంది ర్యాలీ నిర్వహించి వినతిపత్రం ఇచ్చారు.

మధ్యాహ్న భోజన నిర్వాహకుల ఆందోళన
విజయనగరం (కంటోనె్మంట్), ఆగస్టు 5:మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు జిల్లా సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ మెస్ బిల్లుల బకాయిల చెల్లింపుతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని గతంలో అనేక సార్లు అధికారులకు విన్నవించడంతో కొన్ని మండలాల్లో కొంతమేర చెల్లించారని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి పెంచినట్లు ప్రకటించిన 500 రూపాయల గౌరవ వేతనం, పెంచిన మెనూ ధరలు జిల్లాలో అమలు కాలేదన్నారు. నిర్వాహకులపై ఇటీవల కాలంలో రాజకీయ వేధింపులు పెరిగాయని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం గతంలో డిఇఓ ఇచ్చిన హామలు అమలకు నోచుకోలేదన్నారు. గౌరవ వేతనాన్ని తక్షణమే చెల్లించాలని, పెంచిన మెనూ ధరలను అమలు చేయాలని, గ్యాస్,గుడ్లు ప్రభుత్వం సరఫరా చేయాలని, చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘం జిల్లా అధ్యక్షరాలు టి.శారధ, ప్రధాన కార్యదర్శి బొత్స సుధారాణి, సిఐటియు జిల్లా కార్యదర్శి టి.వి రమణ పాల్గొన్నారు.
‘సీమాంధ్రులకు అన్యాయం
జరిగితే సహించేదిలేదు’
విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 5: రాష్ట్రాన్ని ముక్కలు చేసి అన్యాయం జరిగితే సహించేదిలేదని సమైక్యాంధ్ర జెఎసి జిల్లా కన్వీనర్ మామిడి అప్పలనాయుడు హెచ్చరించారు. సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో సోమవారం మయూరి జంక్షన్‌లో కెసిఆర్, దిగ్విజయ్‌సింగ్, షిండే, సోనియాగాంధీ మాస్కులు ధరించి ఇనుప సంకెళ్లతో బంధించి వినూత్నన రీతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ఎంతోమంది మహానుబావుల త్యాగఫలితంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించడం దారుణమన్నారు. అంతర్జాతీయస్థాయిలో హైదరాబాద్‌ను అభివృద్ధి జరిగిందన్నారు. ఎన్ని త్యాగాలు చేసైనా ఆంధ్రప్రదేశ్‌ను రక్షించుకుంటామన్నారు. అయితే సమైక్యాంధ్ర ద్రోహులైన ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు.

సమైక్యాంధ్ర ఉద్యమ కార్యక్రమాలు, భారీ వర్షం వంటి పరిస్థితుల కారణంగా జిల్లా కలెక్టర్
english title: 
g

ఎమ్మెల్యే సికె బాబు దీక్ష భగ్నం

$
0
0

చిత్తూరు, ఆగస్టు 6: చిత్తూరు ఎమ్మెల్యే సి.కె.బాబు సమైక్యాంధ్ర కావాలంటూ గత వారం రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షను పోలీసలు భగ్నం చేశారు. ఆదివారం నుంచి ఎమ్మెల్యే సికె బాబు దీక్షను పోలీసులు భగ్నం చేస్తారని నాయకులు, స్థానిక ప్రజలు అనుకుంటూనే ఉన్నారు. అయితే రెండు రోజులు గుట్టుచప్పుడు కాకుండా ఉన్న పోలీసులు మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట 20నిమిషాల ప్రాంతంలో ఒక్కసారిగా పోలీసు బలగాలు గాంధీ విగ్రహం వద్ద సికె బాబు ఆమరణ నిరాహారదీక్ష వద్ద గుమికూడాయి. ఏమి జరుగుతుందో అని నాయకులు, సి.కె.బాబు అభిమానులు ఆలోచించే లోపే దీక్ష చేస్తున్న సి.కె.బాబును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అరెస్టును ఆయన అభిమానులు, నాయకులు, సతీమణి సికె లావణ్యబాబు, కుమారుడు సాయిక్రిష్ణ అడ్డుకున్నా ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో సికె లావణ్యబాబుకు తలపై స్వల్పగాయమైంది. ఎట్టకేలకు పోలీసులు పన్నిన వూహ్యం ఫలించడంతో ఎమ్మెల్యే సి.కె.బాబాను అంబులెన్సులో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయనపై ఉన్న అభిమానంతో అభిమానులు, నాయకులు, చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నుండి వేలాదిగా చర్చివీధిలో అంబులెన్సుకు ముందు, వెనుకగా ప్రభుత్వ ఆసుపత్రి వరకు వెళ్ళారు. ఆసుపత్రి గేట్లవద్ద అంబులెన్సు లోనికి వెళ్ళగానే పోలీసులు గేట్లు వేయడంతో అభిమానులు గేట్లవద్దనే ఆగిపోవాల్సి వచ్చింది. హుటాహుటిన వైద్యులు సి.కె.బాబుకు క్యాజువాలిటి పక్కనే ఉన్న ఐసియులో చేర్పించి ప్లూయిడ్స్ ఎక్కించారు. ఆయన ఎంత వారించినా పోలీసులు, డాక్టర్లు ఆయన మాట పట్టించుకోకుండా ప్లూయిడ్స్ ఎక్కించారు. చివరకు మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో సి.కె.బాబు కుమారుడు సాయిక్రిష్ణ తండ్రికి జూస్ తాగించి దీక్షను విరమింపజేశారు. అయితే సి.కె.బాబును అరెస్టుచేయడంతో ఒక్కసారిగా చిత్తూరుపట్టణం అట్టుడికిపోయింది. గత వారం రోజులుగా సి.కె.బాబు అమరణ నిరాహారదీక్ష చేస్తున్నా పట్టణంలో దుకాణాలు తెరచుకొని వ్యాపారులు వ్యాపారాలు చేసుకొంటు ఉండేవారు. అయితే మంగళవారం మధ్యాహ్నం ఎమ్మెల్యేను అరెస్టుచేసిన విషయం తెలిసి తెలియగానే వ్యాపారులు అందరు తమ దుకాణాలను మూసివేశారు. ఇంకోవైపు ఆందోళన చెందిన సి.కె.బాబు అభిమానులు, సమైక్యాంధ్ర వాసులు చిత్తూరు ఆర్టీసీ రెండవ డిపోలో ఒక బస్సు టైర్లకు నిప్పుపెట్టారు. అయితే అది పూర్తిగా కాలకమునుపే ఆర్టీసీ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఇంకోవైపు ఎం.ఎస్.ఆర్ సర్కిల్ వద్ద ఒక తోపుడు బండిన అంటించేశారు. రెడ్డిగుంట కలెక్టరేట్ వద్ద తెరచివున్న రెండు మూడు దుకాణాలను సమైక్యాంధ్ర వాదులు ధ్వంసంచేశారు. అయితే అప్పటికే తేరుకున్న పోలీసులు చిత్తూరు నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఎక్కడా ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా గట్టిపోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. అప్పటికే చిత్తూరులో సమైక్యాంధ్రకోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ఎమ్మెల్యే సి.కె.బాబును అరెస్టుచేసిన విషయం తెలుసుకున్న వ్యాపారులు, దుకాణదారులు వారి వారి దుకాణాలనుమూసివేశారు. చివరకు మెడికల్‌షాపులను సైతం చిత్తూరుపట్టణంలో మూసివేసి బంద్‌ను పాటించారు.

* ఆసుపత్రికి తరలించిన పోలీసులు * పలుచోట్ల విధ్వంసం
english title: 
ck babu

రాష్ట్ర విభజన జరిగితే జీవితాంతం వివాదాలే

$
0
0

తిరుపతి, ఆగస్టు 6: రాష్ట్ర విభజన జరిగితే జీవితాతం తెలుగువారి మధ్య చిచ్చుపెట్టినట్లేనని తిరుపతి న్యాయవాద సంఘం నేతలు అన్నారు. శాప్స్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట వున్న దీక్షాశిబిరంలో మంగళవారం తిరుపతి న్యాయవాదుల సంఘం నేతలు దీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాద సంఘం అధ్యక్షులు రమణ, కోశాధికారి దినకర్‌లు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో గాంధీకి ఒక న్యాయవాదిగా ఉద్యమాన్ని నడిపించాడన్నారు. ఆయన స్ఫూర్తితో న్యాయవాదులు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నామన్నారు. సోనియాగాంధీ పేరు చివరన గాంధీ అని పెట్టుకోవడానికి అనర్హురాలన్నారు. రాష్ట్ర విభజనతో జీవితాంతం సమస్య ఉత్పన్నం అవుతోందన్నారు. శాప్స్ నేతలు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ఎన్ రాజారెడ్డిలు మాట్లాడుతూ జల మనోభావాలను దృష్టిలో వుంచుకుని రాష్ట్రాన్ని సమైక్యాంగానే వుంచాలని డిమాండ్ చేశారు. తన కుమారుడ్ని ప్రధాని చెయ్యాలన్న కాంక్షతో సోనియాగాంధీ, తన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న కాంక్షతో కేసిఆర్‌ల ఇరువురి స్వార్ధానికి రాష్ట్ర ప్రజలు బలి అయ్యారన్నారు. దేశంలో విభజన ఉద్యమాలకు ఆజ్యం పోసిన సోనియాగాంధీ చరిత్ర హీనురాలుగా మారిపోతుందన్నారు. తెలంగాణ ప్రాంతంలో కేవలం 3 జిల్లాలు, ఒక యూనివర్శిటిలో ఆందోళనలు చేస్తే తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ నేడు 13 జిల్లాల్లో, 15 యూనివర్శిటిల్లో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున లేస్తోందన్నారు. సోనియాగాంధీ తెలుగువారిని విడదీసి చారిత్రక తప్పు చేసిందన్నారు. భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవలసి వుంటుందని హెచ్చరించారు. ఇకనైనా సోనియాగాంధీ చేసిన తప్పును సరిదిద్దుకోవాలని లేని పక్షంలో జీవితంలో కాంగ్రెస్ పార్టీని ఏ తెలుగువాడు నమ్మడన్నారు. అయితే సమైక్య ఉద్యమం ప్రజల చేతుల్లో వుందని ఇప్పటికైనా తెలుసుకుని కేంద్రం తిరిగి సమైక్య ప్రకటన చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చదలవాడ కృష్ణమూర్తి,విజయలక్ష్మి, మబ్బు చెంగారెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, నరసింహయాదవ్, దంపూరి బాస్కర్, బుల్లెట్ రమణ, కుమారమ్మ, సిందుజ, భారతి, సరోజమ్మ, హరిప్రసాద్, దంపూరి శివ తదితరులు మద్దతుపలికారు. కాగా దీక్షల్లో న్యాయవాదులు పి రమణ, టి దినకర్, అప్పప్పిలి, ఉమాపతి ఆచారి, కె విజయలకుమార్, గిరిబాబు, దొరబాబు, వి శ్రీనివాసులు, బాస్కర్, వినుత, అల్లానురాధా, జి సుజాత, శంకర్లు, పత్తికొండ మురళీ తదితరులు పాల్గొన్నారు.

* శాప్స్ ఆధ్వర్యంలో న్యాయవాదుల దీక్షలు
english title: 
deeksha

ఉద్యమం ఇంతటితో ఆగదు

$
0
0

చిత్తూరు, ఆగస్టు 6: సమైక్యాంధ్రకోసం వారం రోజులపాటు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ప్రజానాయకుడు, చిత్తూరు శాసనసభ్యులు సి.కె.బాబు దీక్షను పోలీసులు మంగళవారం మధ్యాహ్నం భగ్నం చేశారని ఆయన సతీమణి సికె లావణ్యబాబు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆమె మీడియాతో మాట్లాడారు. వారం రోజులపాటు ఎమ్మెల్యే సి.కె.బాబు చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపిన నాయకులు, ప్రజలు, ఆయన వెన్నంటే 24గంటలు ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. సి.కె.బాబు తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపినా వైద్యులు ఎమ్మెల్యే ఆరోగ్యం సరిగాలేదని పోలీసులకు నివేదిక ఇవ్వడంతో వారు అకస్మాత్తుగా మంగళవారం మధ్యాహ్నం అమరణ నిరాహారదీక్షను భగ్నం చేశారన్నారు. పోలీసుల ఓవరాక్షన్‌తో సి.కె.బాబు దీక్షను భగ్నం చేశారన్నారు. అయితే ఆయన కోలుకున్న వెంటనే బుధవారం నుండి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని సి.కె.లావణ్యబాబు స్పష్టంచేశారు. సి.కె.బాబు అరెస్టుకు నిరసనగా మంగళవారం మధ్యాహ్నం నుండి బుధవారం సాయంత్రం వరకు ఒకటిన్నర రోజులు చిత్తూరు బంద్‌కు ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఎమ్మెల్యే చేస్తున్న దీక్షలు ఇంకా ఉదృతం చేస్తామన్నారు. ఆయన కోలుకున్న వెంటనే చిత్తూరులోనే కాకుండా జిల్లానలుమూలలైన తిరుపతి, మదనపల్లె, పుత్తూరు, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాల్లో పర్యటించి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఆమె తెలిపారు. జడ్పీ మాజీ చైర్మన్ ఎంబి కుమార్‌రాజా మాట్లాడుతూ రాష్ట్రంలోనే సమైక్యాంధ్ర కోసం పాటుపడిన ఏకైక నాయకుడు ఒక సి.కె.బాబునే అన్నారు. అలాంటి నాయకుని దీక్షను పోలీసులు భగ్నంచేయడం దారుణమన్నారు. మాజీ ఎంపిపి బి.్ధనంజయరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్ర దీక్ష ఇంతటితో ఆగిపోదన్నారు. ఎమ్మెల్యేతోపాటు పూతలపట్టు మాజీ వైస్‌ఎంపిపి పి.సుబ్బారెడ్డి, సూరి, మాజీ మున్సిపల్ చైర్మన్ సురళామేరి, చిత్తూరురూరల్ మండల నాయకుడు త్యాగరాజు, గడ్డం రమణ, సాయిక్రిష్ణతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయన వెంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు.

అధికార లాంఛనాలతో హెడ్‌కానిస్టేబుల్‌కు అంత్యక్రియలు
పాకాల, ఆగస్టు 6: ఎర్రావారిపాళ్యంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చెంగల్రాయులు (45)కు మంగళవారం పోలీసులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పాకాల మండలం దామలచెరువు మంగినాయుడుపల్లెకు చెందిన చెంగల్రాయులు హైస్కూల్ గేటు నుండి సోమవారం రాత్రి ఇంటికి వెళుతుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పాకాల పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మంగళావారం మధ్యాహ్నం స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు చేశారు. పీలేరు సిఐ పార్ట సారధి, ఎర్రావారిపాళ్యం ఎస్‌ఐ వెంకటేశ్వరు మృతదేహానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గాలిలోకి మూడు రౌండ్లు పోలీసు కాల్పులు జరిపి అంత్యక్రియలు నిర్వహించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తెలున్నారు. ఈమేరకు పాకాల ఎస్‌ఐ మురళీమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* నేటి నుండి ఉద్ధృతం చేస్తాం * సి.కె.లావణ్యబాబు స్పష్టం
english title: 
l

చంద్రబాబు కనబడుట లేదని ఫిర్యాదు

$
0
0

కుప్పం, ఆగస్టు6: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, కుప్పం శాసనసభ్యుడు నారాచంద్రబాబు నాయుడు కనుబడుట లేదని మంగళవారం కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక వైకాపా నాయకులు కుప్పం శాసనసభ్యుడు కనుబడుటలేదని సమైక్యాంధ్రాకు మద్దతుగా ముందుండి పోరాటం చేయాల్సిన చంద్రబాబునాయుడు గత మూడురోజులుగా కనుబడుటలేదని ఆఫిర్యాదులో కె.కన్నన్, శెల్వంసార్, వెంకటేష్‌బాబు, యశోద, మురళీధర్ తదితరులు పేర్కొన్నారు.

బస్సు, లారీ దగ్ధం కేసులో ఇద్దరు అరెస్ట్
* పరార్‌లో ముగ్గురు
తిరుపతి, ఆగస్టు 6: సమైక్యాంధ్ర ఉద్యమం నేపధ్యంలో స్థానిక అలిపిరి పోలీస్ స్టేషన్ సమీపంలోని మున్సిపల్ పార్కు వద్ద ఆగి ఉన్న అలిపిరి డిపో ఆర్‌టిసి బస్సుకు, మున్సిపల్ కార్యాలయం వెనుక భాగంలో వున్న లారీకి మంగళవారం నిప్పు పెట్టారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. అలిపిరి డిపో ఆర్‌టిసి డ్రైవర్ శేఖర్‌రాజు మున్సిపల్ పార్కు సమీపంలో బస్సును వదిలి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆందోళనకారులు బస్సుకు నిప్పు పెట్టారు. ఈ సంఘటనలో తిరుపతికి చెందిన మస్తాన్, సుబ్రహ్మణ్యం అలియాస్ బాబులను అరెస్టు చేసినట్లు అలిపిరి సిఐ రాజశేఖర్, ఎస్సై హరిప్రసాద్‌లు వెల్లడించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వారు పేర్కొన్నారు. మున్సిపల్ పార్కు సమీపంలో ఏర్పాటు చేసి ఉన్న సిసి కెమెరాల ఫుటేజ్‌ల ఆధారంగా వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.

సిఎం రాజీనామా చేయాలి: పెద్దిరెడ్డి
పుంగనూరు రూరల్, ఆగస్టు 6: రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి రాయలసీమ గడ్డ రక్తం పంచుకుని పుట్టి ఉంటే వెంటనే సిఎం పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. ఇనే్నళ్లుగా అభివృద్ధి చేసుకొన్న నగరాన్ని మన చేతగాని సిఎం వల్లే వదులుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అసమర్థ సిఎం వల్లే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందన్నారు. హైద్రాబాద్ ఎవడబ్బ సొత్తు కాదని రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చేసుకున్న నగరమని అలాంటి నగరం ఒక ప్రాంత పరం కావడానికి చంద్రబాబు వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. మంగళవారం ఆయన పుంగనూరు పట్టణంలో సమైక్యాంధ్రాకు మద్దతుగా మహిళా మండలి సభ్యులు, న్యాయవాధులు, జేఏసి నాయకులు, ట్రాన్స్‌కో అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, చక్కెర ఫ్యాక్టరీ కార్మీకులు, వివిధ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కలసి సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఇందిరాసర్కిల్‌లో తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, టిడిపి వైకరి వల్లే రాష్ట్రం ముక్కలవుతోందని తెలిపారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల భద్రత గురించి ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందన్నారు. రాష్టన్రికి నిజమైన సీమాంధ్ర ద్రోహులు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలేననని అభిప్రాయపడ్డారు. సీమాంధ్రలో జగన్ ప్రభావం తగ్గించే ప్రయత్నంలో ఈరెండు పార్టీలు కుమ్మకయ్యాయని ఆరోపించారు. సోనియా గాంధీని ఎదిరించి ప్రజల పక్షం నిలచే ధైర్యం మన సిఎంకు కాని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు గాని లేదని విమర్శించారు. కాంగ్రెస్‌కు చెందిన సీమాంధ్రకు చెందిన ఎంపీలు సైతం ఉత్తుత్తి రాజీనామాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని వారు జిల్లాలకు వస్తే ప్రజల నుంచి రాళ్లు, చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో వెంకటరెడ్డి యాదవ్, నాగరాజరెడ్డి, నాగభూషణం, రెడ్డెప్ప, వరదారెడ్డి, రాజేష్, సత్యన్న, అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి
english title: 
babu missing

మిన్నంటిన సమైక్యాందోళనలు

$
0
0

కర్నూలు, ఆగస్టు 6: జిల్లా వ్యాప్తంగా సమైక్య ఆందోళన మంగళవారం మిన్నంటింది. అన్నిరాజకీయ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధన కార్యక్రమం విజయవంతం చేశారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిల్చిపోయాయి. కర్నూలు-బెంగుళూరు, కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారులపై సమైక్య ఆందోళనకారులు వంట-వార్పూ కార్యక్రమం, క్రీడా పోటీలను నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు సమైక్య ఆందోళనకు జిల్లాలోని గజిటెడ్ ఉద్యోగులు కూడా సంఘీభావం తెలుపుతూ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉద్యమంలో పాల్గొంటుండగా ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయునిలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. సమైక్య రాష్ట్రం కావాలంటూ వైకాపా, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో విడివిడిగా ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా విద్యార్థి, ఉద్యోగ, న్యాయవాద సంఘాలు సంయుక్తంగా ఉద్యమంలో పాల్గొంటున్నాయి. జిల్లాలోని ఆదోని, నంద్యాల, డోన్, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో ఉద్యమం తీవ్ర స్థాయిలో సాగుతోంది. వరుసగా ఏడవ రోజున ఆర్టీసి బస్సులు రోడ్డెక్క లేదు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఉద్యమంలో భాగస్థులు కావడంతో బస్సుల నిర్వహణ సాధ్యపడటం లేదని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నాచేసిన అనంతరం దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమంతో కలెక్టరేట్ ప్రాంగణమంతా బూడిదమయమైంది. సమైక్య వాదుల ఆందోళన కారణంగా జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్థంబించి పోయింది. ఇక సమైక్య ఆందోళనకు మద్దతుగా కేబుల్ ఆపరేటర్స్ ఆధ్వర్యంలో మంగళవారం వార్తా చానళ్లు మినహా ఇతర అన్ని చానళ్ల ప్రసారాలను నిలిపివేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. కాగా రాష్ట్ర ఎన్జీవో సంఘం పిలుపు మేరకు ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు ఎన్జీవోలు సిద్ధపడుతున్నారు. రాష్ట్ర విభజనచేస్తే రాయలసీమ, కోస్తాంధ్రా అగ్నిగుండంగా మారుతుందని శ్రీ కృష్ణ కమిటీ చెప్పినా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యపక్షాలు ప్రధానంగా కాంగ్రెస్ పట్టించుకోకుండా ఇష్టానుసారంగా రాష్టవ్రిభజన చేయడాన్ని సమైక్య ఆందోళనకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఆమరణ దీక్షలు భగ్నం
ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోరుతూ ప్రముఖ విద్యా సంస్థల అధినేత డాక్టర్ కెవి సుబ్బారెడ్డి, సమైక్యాంధ్ర కోరుతూ ప్రముఖ వైద్యుడు డాక్టర్ ప్రసాద్‌లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలను మంగళవారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. వారిద్దరు చేపట్టిన ఆమరణ దీక్ష 6వ రోజుకు చేరుకోవడంతో మంగళవారం ఉదయం ప్రభుత్వ వైద్యులు పరీక్షించి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని వెంటనే దీక్షను విరమించాలని కోరారు. అయినా వారిద్దరు దీక్షను విరమించడానికి నిరాకరించారు. ఆ తరువాత కలెక్టర్ సుదర్శన్ రెడ్డి కూడా దీక్షలను విరమించి వైద్య చికిత్సలకు సహకరించాలని కోరుతూ వర్తమానం పంపారు. అయినప్పటికీ తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దాంతో కలెక్టర్ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన నివేదికను ఎస్పీ రఘురామ్ రెడ్డికి పంపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాలతో కెవి సుబ్బారెడ్డి, ప్రసాద్‌లను దీక్ష విరమించి వైద్య పరీక్షలకు అంగీకరించాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎస్పీ హెచ్చరించారు. అయినా దీక్ష విరమించేందుకు వారిద్దరు నిరాకరించి ఆమరణ దీక్షను కొనసాగించడానికే నిర్ణయించుకున్నారు. అంతేగాక తమ దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తారని తమ మద్దతుదారులను నిరాహార దీక్ష శిబిరం వద్ద పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులు బుధవారం తెల్లవారుజామున వచ్చే అవకాశం ఉందని చర్చించుకుంటున్న సమయంలో పోలీసులు భారీ సంఖ్యలో వచ్చి దీక్ష విరమించని పక్షంలో అరెస్ట్ చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ వారిద్దరిని బలవంతంగా పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్యులు వారికి అత్యవసర చికిత్సలు అందజేస్తూ ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు.

జిల్లా వ్యాప్తంగా సమైక్య ఆందోళన మంగళవారం మిన్నంటింది
english title: 
s

ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ప్రకటించండి

$
0
0

కర్నూలు, ఆగస్టు 6: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేమని యుపిఎ భాగస్వామ్య పక్షాలు తీసుకున్న నిర్ణయంలో మార్పు లేనిపక్షంలో రాయలసీమ ప్రాంతాన్ని మరో ప్రాంతంతో కలపకుండా ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌లకు విజ్ఞప్తి చేశారు. కోట్ల సూర్య కర్నూలు జిల్లాకు చెందిన ఎంపి ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, మురళీ కృష్ణ, లబ్బి వెంకట స్వామిలతో కలిసి మంగళవారం పార్లమెంటు సెంట్రల్ హాలు సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని తీసుకొని లోతైన అధ్యయనం తరువాత అన్ని ప్రాంతాలకు న్యాయం చేసే దిశలో ప్రయత్నాలు చేయాలని కోరారు. ఇందుకు సోనియా గాంధీ స్పందిస్తూ యుపిఎ భాగస్వామ్య పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని ఈ పరిస్థితిలో వెనక్కి తగ్గలేమని తేల్చి చెప్పారు. దీంతో కోట్ల సూర్య బృందం మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనివార్యమని తేలితే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని అదీ వీలు కాదన్న పక్షంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరారు. నాలుగు జిల్లాలతో కూడిన రాయలసీమను ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాల్లో దేంట్లో కలిపినా న్యాయం జరుగదనీ, ఇప్పటికే రాయలసీమకు ఎంతో అన్యాయం జరిగిందని నివేదిక సమర్పిస్తూ ఇంకా నష్టపోలేమని కష్టమైనా, సుఖమైనా ప్రత్యేక రాష్ట్రంలో రాయలసీమ వాసులు ఉండటానికి ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. దీంతో సోనియా స్పందిస్తూ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న అనంతరం కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంత సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం అత్యున్నత కమిటీని నియమిస్తున్నామని వారికి తమ సమస్యలు, ఆవేదన చెప్పుకునే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఇద్దరితో కూడిన కమిటీ కాకుండా ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంత సమస్యలు వాటి పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఇద్దరి సభ్యులను కమిటీలో చేర్చాలని కోరడంతో అందుకు అంగీకరించి నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తామని వారు నివేదిక ఇచ్చే వరకు విభజన ప్రక్రియ పూర్తి కాదని వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో తదుపరి కార్యాచరణపై కర్నూలు వచ్చిన తరువాత నిర్ణయించుకోవాలని భావిస్తున్నారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేమని యుపిఎ భాగస్వామ్య పక్షాలు
english title: 
r

హంద్రీనివాకు నేడు నీటి విడుదల

$
0
0

నందికొట్కూరు, ఆగష్టు 6: కరువుసీమకు కృష్ణాజలాలను అదించేందుకు కోట్లాది రూపాయల వ్యయంచేసి, నందికొట్కూరు మండల పరిధిలోని మల్యాల గ్రామంలో నిర్మించిన హంద్రీనివా సుజలస్రవంతి మొదటి పంప్‌హౌస్ వద్ద నీటి విడుదలకు రంగం సిద్ధం చేశామని, నీటిపారుదల శాఖ డిఇ నాయక్ మంగళవారం తెలిపారు. ఇటివల కురిసిన వర్షాలకు వరదనీరు కృష్ణానదికి భారీగా రావడంతో హంద్రీనీవాకు సామర్ధ్యాని మించినీరు చేరడంతో నీటిని కాలువకు వదిలేందుకు అన్నిఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. 256 మీటర్లు నీటి సామర్ధ్యం ఉంటే కాలువకు నీటిని వదులవచ్చునని, ప్రస్తుతం 268 మీటర్లు నీరు హంద్రీనివా సుజలస్రవంతిలో ఉందన్నారు. హంద్రీనివా ప్రాజెక్టు అమర్చిన 12 పంపులలో 4,5,6,7,9,10 పంపుల ద్వారా ట్రయల్ నిర్వహించి హెచ్‌ఎన్‌యస్‌యస్ వివిధ ప్రాంతలలోగల 8పంపింగ్ స్టేషన్ల్‌ల ద్వారా 216 కిలోమీటర్లు మల్యాల నుండి అనంతపురము జిల్లాలోని జిడిపల్లె వరకు గత ఏడాది నీటిని సరాఫరా చేశామన్నారు. కాలువలో అక్కడక్కడ నీటిపారుదలకు అడ్డంగా వున్నా మట్టికుప్పలను, రాళ్లును మంగళవారం తొలగించడం జరిగిందన్నారు. ఈనెల 7వ తేది హంద్రీనివా నుండి 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని ఆయన తెలిపారు. హంద్రీనివా సుజలస్రవంతి ద్వారా కర్నూలు, అనంతపురము జిల్లాలో తాగు, సాగునీరు సరాఫరా కావడంతో రైతుల కలలు నెరవేరనున్నాయి. ప్రస్తుతం ఖరీఫ్‌కు రెండు జిల్లాలకు 40వేల ఎకరాలకు సాగునీటిని అందించడం జరుగుతుందని రైతులు ఆయకట్టు క్రింద ఆరుతడి పంటలు వేసుకోవాలని ఆయన సూచించారు. తొలిదశలో హంద్రీనివా పనులు పూర్తి అయినప్పటికి 1,97లక్షల ఎకరాలకు సాగునీరు అందించవలసి ఉండగా ప్రస్తుతం ఖరీఫ్‌కు కర్నూలుజిల్లాకు 20వేలు ఎకరాలకు, అనంతపురం జిల్లాకు 20వేల ఎకరాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు.
ఎసిబి వలలో వ్యవసాయాధికారి
ఆదోని, ఆగస్టు 6: ఆదోని డివిజన్‌లోని హొళగుంద మండలం వ్యవసాయశాఖ అధికారి వెంగళరెడ్డి, మహబూబ్‌బాషా అనే ఎరువుల దుకాణం వ్యాపారితో రూ. 3వేల లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు పట్టుబడిన సంఘటన మంగళవారం ఆదోనిలో చోటుచేసుకుంది. హొళగుంద మండలంలోని గజ్జహళ్లి గ్రామంలో ఉన్న క్రిమిసంహార మందులు, రసాయనిక ఎరువుల దుకాణం లైసన్స్‌ను తిరిగి రెన్యూవల్ చేయడానికి లంచం వెంగళరెడ్డి అడిగినట్లు ఏసిబి డిఎస్పీ విజయ్‌పాల్ తెలిపారు. మహబూబ్‌బాషా నుండి వెంగళరెడ్డి రూ. 3వేలు డిమాండ్ చేయడంతో మహబూబ్‌బాషా ఏసిబిని ఆశ్రయించినట్లు డిఎస్పీ తెలిపారు. మహబూబ్‌బాషా ఫిర్యాదు మేరకు వెంగళరెడ్డిపై విచారించగా అనేక అవినీతి ఆరోపణలు తమ దృష్టికి వచ్చినట్లు డిఎస్పీ తెలిపారు. దీంతో తాము పక్కా ప్రణాళికగా మంగళవారం ఆదోనిలోనే రాజశ్రీ హొటల్ వద్ద ఉన్న సైకిల్‌స్టాండ్ సీమీపంలో కాపుకాసినట్లు ఆయన తెలిపారు. ఇంతలో సైకిల్ స్టాండ్ వద్ద ఉన్న మహబూబ్‌బాషా వద్దకు వెంగళరెడ్డి వచ్చి రూ. 3వేల లంచం తీసుకుంటుండగా వెళ్లిపట్టుకున్నట్లు డిఎస్పీ చెప్పారు. ఆ తరువాత వెంగళరెడ్డిని అదుపులోకి తీసుకొని హోటల్ గదిలో విచారించగా లంచం తీసుకున్నట్లు వెలుగుచూసిందన్నారు. తాము ఇచ్చిన రూ. 3వేల రూపాయలు కూడా నెంబర్లు సరిపోయినట్లు పేర్కొన్నారు. ఈయన ఇంటిపై కూడా దాడులు నిర్వహించి అక్రమ ఆస్తుల వివరాలను కూడా పరిశీలిస్తున్నట్లు డిఎస్పీ చెప్పారు. ఈ దాడిలో తనతోపాటు, సిఐలు నాగరాజు, ప్రసాద్, కృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. వెంగళరెడ్డి పని చేస్తున్న హొళగుంద మండలంలో కూడా విచారణ చేస్తున్నట్లు డిఎస్పీ వివరించారు. మహబూబ్‌బాషా మాట్లాడుతూ తన ఎరువుల దుకాణం లైసన్స్‌ను రెన్యూవల్ చేయకుండా వేదిస్తున్నట్లు చెప్పారు. చివరికి రూ. 3వేల లంచం అడగడంతో తాను ఏసిబి అధికారులను ఆశ్రయించానన్నారు. ఏసిబి అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు.
ఏసిబి దాడితో మూతబడిన కార్యాలయం
హొళగుంద, ఆగస్టు 6:నిత్యం రైతులతో రద్దీగా ఉండే వ్యవసాయ కార్యాలయం మంగళవారం మూతబడింది. గజ్జహళ్లిలో సనా ఎరువుల దుకాణం రెన్యూవల్ చేయడానికి వ్యవసాయ అధికారి వెంగళరెడ్డి రూ. 3వేలు లంచం అడుగగా యజమాని బాషా అవినీతి నిరోదకశాఖ అధికారులను ఆశ్రయించాడు. ఆదోనిలో వ్యవసాయశాఖ అధికారికి రూ. 3వేలు ఇస్తుండగా ఏసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వ్యవసాయ అధికారి ఏసిబికి చిక్కిన విషయం బయటికిపొక్కడంతో వ్యవసాయశాఖ సిబ్బంది కార్యాలయానికి తాళంవేసి పరారైయ్యారు. వ్యవసాయశాఖ అధికారి ఏసిబికి చిక్కడం ఇది మూడవ సంఘటన.

కరువుసీమకు కృష్ణాజలాలను అదించేందుకు కోట్లాది రూపాయల వ్యయంచేసి
english title: 
handri neeva

పెరుగుతున్న తుంగభద్ర నీటి మట్టం

$
0
0

మంత్రాలయం, ఆగస్టు 6:తుంగభద్ర డ్యాం నుంచి లక్షా 50వేల క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదిలో వదలడంతో మంత్రాలయం వద్ద నీటి మట్టం పెరుగుతోంది. దీంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర నది పరవళ్లు తొక్కుతోంది. మంత్రాలయం వద్ద ప్రస్థుతం 311.500 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నట్లు సిడబ్ల్యూసి జెఇ విజయభారతి తెలిపారు. 312 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తే మొదటి ప్రమాద హెచ్చరికలు జారి చేస్తామని ఆయన అన్నారు. ప్రస్థుతం తుంగభద్ర నీటి మట్టం తగ్గవచ్చని ఆమె అన్నారు.
తుంగభద్ర డ్యాం నుండి పెద్ద ఎత్తున నీరు విడుదల చేయడంతో నదీతీర గ్రామ ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి వద్ద ఉన్న ఆర్డీఎస్ నదీతీర గ్రామాలను పరిశీలించారు. అనంతరం మంత్రాలయంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో విలేఖరులతో మాట్లాడుతూ, తుంగభద్ర డ్యాం నుంచి విడుదల చేసిన నీటిని ఎప్పటికప్పుడు దిగువ ప్రాంతాలకు పంపుతున్నామని, దీంతో శ్రీశైలం వద్ద ఉన్న నాగార్జునసాగర్‌కు 4లక్షల క్యూసెక్కులనీరు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నాయని ఆయన అన్నారు. మంత్రాలయం వద్ద ఫ్లడ్ వాల్ నిర్మాణాన్ని ప్రతిపాదన పెట్టామని, ఇందుకోసం రూ. 6కోట్లు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు ఆయన తెలిపారు. మంత్రాలయంలో అక్రమంగా లేఔట్లు వేసి ప్లాట్లు అమ్ముతున్నవారిపై కేసులు పెడుతామని ఆయన హెచ్చరించారు. మాధవరం వద్ద 133 కేవి సబ్‌స్టేషన్ నిర్మాణానికి పూర్తి స్థాయిలో స్థల పరిశీలన చేశామని నిర్మాణానికి కాంట్రాక్టర్ల ఆలస్యం వల్ల పనులలో జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు. అనంతరం మంత్రాలయం వద్ద తుంగభద్ర నది నీటి మట్టాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌ఇ సుధాకర్, ఇఇ శ్రీనివాసులు, డిఇ లక్ష్మినరసింహ, నేహామియా, ఆర్డీఓ రాంసుందర్‌రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్‌రావు, సిడబ్ల్యూసి జెఇ విజయభారతి, ఆర్‌ఐ ఆదాం, విఆర్‌ఓ భీమన్నగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

తుంగభద్ర డ్యాం నుంచి లక్షా 50వేల
english title: 
tunga bhadra

ఆగని నిరసన జ్వాలలు

$
0
0

ఆళ్లగడ్డ, ఆగస్టు 6: సమైక్యాంధ్ర కోసం మంగళవారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని నారీలోకం కదంతొక్కింది. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రపై చేపడుతున్న కార్యక్రమాలు రోజు రోజుకు ఊపందుకుంటున్నాయి. జెఏసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ర్యాలీలో నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి ఆశావర్కర్లు, ఎఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది, పాఠశాల విధ్యార్ధులు, నారుూబ్రాహ్మణులు, గ్రామసేవకులు, కార్మికులు, జీవిత బీమా సంస్థ ఏజెంట్లు, తదితరులు తహశీల్దార్ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా కిలోమీటరు పోడవునా యుపిఏ అధినేత్రి సోనియా డౌన్‌డౌన్, మన్మోహన్‌సింగ్ డౌన్‌డౌన్ అంటూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో శునక మహారాజుకు సోనియా అని పేరు వున్న స్లిప్పులు అంటించి ర్యాలీ వెంట ఊరేగించారు. ఈ కార్యక్రమంలో జెఏసి నాయకులు దస్తగిరిరెడ్డి, వరప్రసాదరెడ్డి శ్రీ రాఘవేంధ్రా బిఈడి కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. పుణ్యక్షేత్రమైన అహోబిలంలో సమైక్యాంధ్ర కోసం ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అహోబిల క్షేత్రానికి దర్శనార్ధం వచ్చిన ఇండోనేషియా దేశస్తులు జరుగుతున్న కార్యక్రమాలను తెలుసుకొని ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా చేశారని సమైక్యాంధ్రగా వుంచాలని ఫ్లే కార్డులు చేతబట్టి సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్ బివి నరసయ్య, ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్, మాలోలా మఠం మేనేజర్ బద్రీనారాయణ, ఆలయ సిబ్బంది, గ్రామప్రజలు పాల్గొన్నారు. బత్తలూరులో: మండలంలోని బత్తలూరులో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విధ్యార్థులు, గ్రామస్థులు సమైక్యాంద్ర కోసం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారికి ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచి పోయాయి. చివరగా దిష్టిబొమ్మలను దగ్దం చేశారు.
నందికొట్కూరులో...
నందికొట్కూరు: రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యాంధ్రను కోరుతూ పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక పటేల్ సెంటర్‌లో ధర్నా చేపట్టారు. ట్రాన్స్‌కో ఎడి హరిశ్చంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో ఉద్యోగులు కార్యాలయం నుంచి కెజి రహదారిపై నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్యవైశ్యసంఘం, జెఎసి ఆధ్వర్యంలో కూడా సమైక్యాంధ్ర ఆందోళనలు కొనసాగాయి. విశ్రాంత ఉపాధ్యాయురాలు శోభారాణి భద్రకాళి రూపంలో టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చిత్రపటాన్ని శూలంతో అంతంచేసి నిరసన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పటేల్‌సెంటర్‌లో వాసవీమాత అలంకరణలో సమైక్యవాదాన్ని విన్పించారు.
బేతంచెర్లలో...
బేతంచెర్ల : రాష్టవ్రిభజన ప్రకటనను నిరసిస్తూ బేతంచెర్ల సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో మంగళవారం ఆర్యవైశ్యులు, బ్రహ్మణులు రాస్తారోకో నిర్వహించి కేంద్ర మంత్రులకు ప్రజా ప్రతినిధులకు పిండా ప్రదానం చేశారు. రాష్టవ్రిభజన ప్రకటనతో సీమాంధ్రలో ఆగ్నిగుండంలా ప్రజల ఆవేదన రగులుతుంటే చేతకాని దద్దమ్మలా సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు వ్యవహరించడాన్ని నిరసిస్తూ సమైక్యవాదుల ఆధ్వర్యంలో బ్రహ్మణులు పాత బస్టాండ్ నందు బతికున్నా చచ్చిన వారితో సమానంగా భావించి పిండా ప్రదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు సుబ్బారెడ్డి, వెంకట్రాముడు, నారాయణలతో పాటు ఆర్యవైశ్యులు గుండా జగన్, జగదీశ్, వెంకటశెట్టి, ఆశ్వర్దనారాయణ, బ్రహ్మణ ప్రముఖులు సుజాత శర్మ, డాక్టర్ శ్రీకాంత్, అన్నారావు, కృష్ణారావు, రామయ్య, రామ్ శర్మ, శ్రీనివాసులు అధిక సంఖ్యలో సమైఖ్యావాదులు పాల్గొన్నారు.
బేతంచెర్లలో...
బేతంచెర్ల: రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నాటి నుండి 7 రోజులుగా బేతంచెర్ల సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో ఎడతెరిపి లేని ఉద్యమం కొనసాగుతుంది. విద్యార్థులతో ప్రారంభమైన సమైఖ్యాంద్ర ఉద్యమం జనర్నలిస్టు యూనియన్, ఎంఆర్‌పిఎస్, మాల మహనాడు, జీపు ఆటో డ్రైవర్ల యూనియన్ కుల సంఘాలు వివిధ రాజకీయ పార్టీలతో ఉద్యమం రోజురోజు ఓ వినూత్న రీతిలో సాగుతువుంది.
డోన్‌లో....
డోన్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మంగళవారం డోన్‌లో విద్యార్థిలోకం కదంతొక్కింది. సమైక్యాంద్రకు మద్దతుగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఇచ్చిన పిలుపుమేరకు పట్టణంలోని సిద్దార్థ, శ్రీసుధ, ఒనైరో, జ్యోతి, వాసవి, శాంజో, సార్క్, విజ్ఞాన్, సరస్వతి విద్యామందిర్, నలంద, సర్వేపల్లి రాధాక్రిష్ణ, లిటిల్ ప్లవర్, సెయింట్ జోసఫ్‌తో పాటు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో పాటు సాయిశ్రీ డిగ్రీ, బిఇడి కళాశాల, వైష్ణవి డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థులు డోన్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు చేసిన నినాదాలతో పట్టణ పురవీధులు హోరెత్తిపోయాయి. కెసిఆర్ డౌన్‌డౌన్, చెట్టుమీద కొంగ, సోనియా దొంగ, సమైక్యాంధ్ర వర్థిల్లాలి, రాష్ట్ర విభజన వద్దు, సమైక్యాంద్ర ముద్దు అంటూ విద్యార్థులు చేసిన నినాదాలు దద్దరిల్లిపోయాయి. ఎస్కేపి హైస్కూలు నుంచి ప్రారంభమైన ర్యాలీ పాతబస్టాండ్, ఇందిరాగాందీ చౌక్, పాతబస్టాండ్, రైల్వేగేట్లు, పాతపేట నుంచి జెఎసి శిబిరానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా విద్యార్థుల నుద్దేశించి సాయిశ్రీ విద్యాసంస్థల అధినేత సాయిరామ్, వైష్ణవి డిగ్రీ కళాశాల గౌరవాధ్యక్షులు తూర్పు జయ ప్రకాష్‌రెడ్డి, సిద్దార్థ కళాశాల అధినేత క్రిష్ణారెడ్డి, శ్రీ సుధ విద్యా సంస్థల అధినేత వేణుగోపాల్‌లు ప్రసంగించారు. ఈనెల 7వ తేదినుంచి 11వ తేది వరకు విద్యాసంస్థలకు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వలసల రామక్రిష్ణ, కొచ్చెర్వు విక్రమసేనారెడ్డి, బొబ్బల శివరామిరెడ్డి, చిట్యాల మద్దయ్య గౌడు, మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న విద్యార్థుల విన్నూత్న ప్రదర్శనలు: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా విద్యార్థిలోకం తలపెట్టిన నిరసన ర్యాలీలో విద్యార్థులు చేసిన విన్నూత్న ప్రదర్శనలు పట్టణ వాసులను ఎంతో ఆకట్టుకున్నాయి. అంతేగాక శ్రీక్రిష్ణ దేవరాయలు, భరతమాత, తెలుగుతల్లి, అల్లూరి సీతరామరాజుల వేషదారణలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగానిలిచాయి.
సమ్మెకు శ్రీకారం చుట్టిన మున్సిపల్ ఉద్యోగులు : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మున్సిపల్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు.

లేఖలు వెనక్కి తీసుకోండి
కర్నూలు, ఆగస్టు 6: రాష్ట్ర విభజనకు అనుకూలంగా తెలుగుదేశం, వైకాపా ఇచ్చిన లేఖలను ఏ క్షణాన వెనక్కి తీసుకుంటే ఆ క్షణాన విభజన ప్రక్రియ ఆగుతుందని రాయలసీమ హక్కుల ఐక్యవేదిక వ్యవస్థాపకులు, మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. చంద్రబాబు, జగన్ ఇచ్చిన లేఖలే రాష్ట్ర విభజనకు కీలకంగా మారాయని అన్నారు. వారు లేఖలు వెనక్కి తీసుకున్నా విభజన ఆగనిపక్షంలో తన ఆస్తి రాసిస్తానని ఆయన సవాల్ విసిరారు. కర్నూలులో మంగళవారం విలేఖరులతో మంత్రి మాట్లాడుతూ 1956 నుంచి ఇప్పటి వరకు రాయలసీమకు జరిగిన నష్టం ఏ ప్రాంతానికీ జరగలేదన్నారు. అయినా బాధను దిగమింగుకుంటూ తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. గత 57 సంవత్సరాలుగా రాయలసీమకు న్యాయం, సహాయం చేసే వారే కరువయ్యారని వాపోయారు. తెలంగాణవారు ప్రత్యేక రాష్ట్రం బూచిచూపి తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుపెడితే అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చినప్పటికీ వారు సంతృప్తి చెందకుండా భారీ ఎత్తున అభివృద్ధి సాధించి ఇప్పుడు విడిపోతున్నారని అన్నారు. రాజీవ్, ఇందిరాగాంధీ విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా సోనియా బాధపడుతున్నారన్నారు. దీంతో రాయలసీమ, ఆంధ్రావారు ఏం చెప్పినా వినే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి సమస్యలు పరిష్కరించిన తరువాతే విభజన గురించి ఆలోచించాలని ఆయన డిమాండ్ చేశారు.

వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కర్నూలు, ఆగస్టు 6: వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేసిన సమయంలో కర్నూలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఎస్పీ డా.కె.రఘురామిరెడ్డి చెప్పారు. వర్షాకాలం పూర్తయ్యేవరకు ప్రత్యేక పోలీసు కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వర్షాకాలంలో లోతుట్టు ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంగళవారం ఓక ప్రకటనలో తెలిపారు. అధిక వర్షాలు కురిసిన సందర్భంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు, అక్కడ నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు పోలీసు సిబ్బందితో గస్తీఏర్పాటు చేస్తామని, అయా లోతట్టు ప్రాంతాల్లో వర్తషపునీటి ఉద్ధృతి, నీటిస్థాయి తదితర విషయాలను వైర్‌లెస్ సెట్ ద్వారా జిల్లా స్పెషల్ బ్రాంచ్ కార్యాలయానికి చేరవేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో ప్రజలు భయాంధోళనలనకు గురికాకుండా వారికి పోలీసుశాఖ తమ వంతుగా కర్తవ్యంగా ముందు జాగ్రత్త చర్యలను చేపడుతుందన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇన్‌చార్జీలుగా నియమించిన సిబ్బంది వర్షాలు అధికంగా కురిసిన సమయంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న నీటిమట్టం, అక్కడి పరిస్థితులను జిల్లా స్పెషల్ బ్రాంచ్ కార్యాలయంలోని కంట్రోల్ రూంలో పనిచేసే సిబ్బందికి చేరవేయాలన్నారు. వర్షాకాలంలో ముందస్తు చర్యలు పాటించడం వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా అధికార యంత్రాంగం ఎదుర్కోనేందుకు అవకాశం ఉంటుందని, ఈ విషయం గుర్తించి అందరూ జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నేడు పతాంజలి యోగా సమితి ధర్నా
కర్నూలు టౌన్, ఆగస్టు 6: తెలంగాణకు వ్యతిరేఖంగా బుధవారం పతాంజలియోగా సమితి ఆధ్వర్యంలో సమైక్యాంద్రకు మద్దతుగా జాతీయ రహాదారిపై వెంకటరమణ కాలనీ దగ్గర ఉదయం 7నుండి యోగాద్వారా ధర్నాలు చేపడుతామని పతాంజలి సమితి అద్యక్షులు వీరత్న ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలోతెలిపారు. ఈకార్యక్రమానికి అందరు పాలొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మాజీ సైనిక సంఘం అధ్యక్షుడిగా శేషిరెడ్డి
కర్నూలు ఓల్డ్‌సిటీ, ఆగస్టు 6: నగరంలోని కర్నూలు మాజీ సైనిక సంఘం కార్యాలయంలో ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శుల ఎంపికలకు ఎన్నికలు జరిగాయి. ఆ సంఘం అధ్యక్షుడిగా పి.శేషిరెడ్డి, కార్యదర్శిగా కె.దేవ విష్ణుమూర్తిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి మనోహార రాజు తెలిపారు. ఎన్నికైన అభ్యర్థులకు డిక్లరేషన్ పత్రాలను అందజేశారు. ఈ కమిటీ 3 సంవత్సరాలపాటు కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఈ నెల 15వ తేదిన జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలల్లో మాజీ సైనికులందరు పాల్గొనాలని కోరారు.
రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేస్తే ఊరుకోం
కల్లూరు, ఆగస్టు 6: రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాటం చేబుతామని టిడిపి నాయకులు మల్లెల పుల్లారెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర విభజనను నిరసిస్తూ టిడిపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు, కేంద్ర రాష్ట్ర మంత్రులకు సోనియాతో రాష్ట్రంపై మాట్లాడే ధైర్యం లేదన్నారు. ఇప్పటికైన ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులకు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైన వుందన్నారు. ఏక పక్ష నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలను విభజించ లేరని క్రిష్టియన్ ఎంప్లాయిస్ గాస్పెల్ ఫెలోషిప్ కన్వీనర్ రత్నం అన్నారు. మంగళవారం క్రైస్తవ సోదరుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనను క్రైస్తవులు వ్యతిరేకిస్తున్నారని, తెలంగాణ ఏర్పడితే సీమ ప్రజలకు సాగు, తాగు నీరు లేక అనేక ఇబ్బందులు పడుతారని, విద్యా, ఉద్యోగ రంగాల్లో వెనుబడే ప్రమాదం వుందని అన్నారు. అలాగే విద్యుత్ కష్టాలతో సీమ చీకటిలో వుంటుందని అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాలకే సిపిఎం కట్టుబడి ఉంది
కల్లూరు, ఆగస్టు 6: మొదటి నుండి భాషా ప్రయుక్త రాష్ట్రాలకే సిపిఎం కట్టుబడి వుందని సిపిఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం కల్లూరు సిపిఎం కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘకాలంగా సమస్యను నానపెడుతూ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ప్రకటించిందని దీనికి యుపిఎ పక్షాలు కూడా ఆమోదం తెలపడం, బిజెపి కూడా మద్దతు ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావడం అన్న భావన సీమాంధ్రలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. సిపిఎం పార్టీగా సమైఖ్యాంధ్రకు కట్టుబడి భాషా ప్రయుక్త రాష్ట్రాలకే సంఘీభావంగా పార్టీ వుందన్నారు. రాష్ట్రాల అధికారాలు, నిధుల విషయంలో సరైన వాటా న్యాయం జరగాలంటే జాతీయ, భాష ప్రాతిపధికనే బలంగా వుండాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు సోమన్న, సుధాకరప్ప, ఆనంద్, రాజు, భాస్కర్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ ప్రతిభా పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానం
కర్నూలు స్పోర్ట్స్, ఆగస్టు 6: జాతీయ ప్రతిభా పరీక్ష లెవల్-1కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు తెలిపారు. 2013-14 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉన్నత పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు, ఐసిఎస్‌ఇ, సిబిఎస్‌ఇ సిలబస్ పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గతంలో 8వ తరగతి విద్యార్థులు ఎన్‌టిఎస్‌ఇ, ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన వారు పరీక్షకు అర్హులన్నారు. ఈ పరీక్షలో మెంటల్ ఎబిలిటీ , ల్యాంగ్వెజ్ కంప్రహెన్సివ్ టెస్టు, అప్టిట్యూడ్‌లో మ్యాధ్స్, సైన్స్, సోషల్ అబ్జెక్టుల్లో వుంటుందని అన్నారు. విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.100 డిడిని ది సెక్రటరీ, ది కమీషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఎపి, హైదరాబాద్ పేరిట ఎస్‌బిహెచ్/ఎస్‌బిఐలో మాత్రమే ఈ నెల 31వ తేదిలోగా తీయాలని అన్నారు. విద్యార్థుల నామినల్ రోల్స్ సెప్టెంబర్ 2వ తేదిలోగా డిఇవో కార్యాలయంలో సమర్పించాలని అన్నారు. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.బిఎస్‌ఇఎపి.ఓఆర్‌జి, డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎన్‌సిఇఆర్‌టి.ఎన్‌ఐసి.ఇన్ వైబ్ సైట్‌లో పొందవచ్చన్నారు.
కుట్రలో భాగమే రాష్ట్ర విభజన
నందికొట్కూరు, ఆగస్టు 6, స్వార్థ రాజకీయ నాయకుల కుట్రలో భాగమే రాష్ట్ర విభజన జరిగిందని వైకాపా నాయకులు కోకిల రమణారెడ్డి, ఐజయ్య అన్నారు. స్థానిక వైకాపా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత కేవలం రాహుల్‌గాంధిని ప్రధానమంత్రి చేయడానికి రాష్ట్ర విభజనకు పూనుకుందన్నారు. ప్రత్యేక రాయలసీమ అంటూ కొందరు ప్రజలను మభ్యపెడుతూ అక్రమంగా సంపాదించిన వేల కోట్ల ఆస్తులు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, అధికారంలో ఉన్ననాడు గుర్తుకు రాని రాయలసీమ నేడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. రాయల తెలంగాణ అంటూ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సోనియాను కోరడం కేవలం పదవిని కాపాడుకోడానికి తప్ప మరొకటి కాదన్నారు. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు విగ్రహాలు కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేయడం శోచనీయమన్నారు. తెలంగాణ ఏర్పాటువాదులు విగ్రహాలు కూల్చినపుడు ఎందుకు స్పందించలేదన్నారు. తెలుగు వారంతా సమైక్యాంధ్రకే కట్టుబడి ఉండి ఉద్యమ తీవ్రతను పెంచాలని వారు కోరారు.
ఘనంగా చౌడేశ్వరిదేవి పూజలు
పట్టణంలోని కెజి రహదారి పక్కనే వెలసిన చౌడేశ్వరి ఆలయంలో మంగళవారం దేవీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకపూజలు, కుంకుమార్చన, ఆకుపూజ నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేశారు. దేవాలయ కమిటీ నాయకులు మాజీ సర్పంచ్ చింతా నాగయ్య, దేశెట్టి శ్రీనివాసుల ఆధ్వర్యంలో పలు పూజా కార్యక్రమాలు జరిగాయి.
రాష్ట్రాన్ని విభజిస్తే ఉతికి ఆరేస్తాం
కర్నూలు స్పోర్ట్స్, ఆగస్టు 6:రాష్ట్రాన్ని విభజిస్తే ఉతికి ఆరేస్తామని ఎపి రజక ఐక్యసేవా సమితి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ సందర్భంగా సమితి ప్రధాన కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ తెలుగు జాతిని విభజించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని తక్షణమే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మద్దిలేట్టి, మధు, రంగ, బీసన్న, రాజు, జోషి, రామకృష్ణ పాల్గొన్నారు.

సమైక్యాంధ్ర కోరుతూ మిన్నంటిన ఆందోళనలు
ఆదోని, ఆగస్టు 6: ఆదోనిలో మంగళవారం సమైక్యాంధ్ర ఉద్యమం మ రింత తీవ్రరూపందాల్చింది. జెఎసి ఆ ధ్వర్యంలో ఆదోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కా లేజీ మైదానం నుంచి ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు సాయి ప్రసాద్‌రెడ్డి, రాచోటి రామయ్య, కాం గ్రెస్ నాయకులు విట్టారమేష్, నసీరుద్దీన్‌పటేల్, బసవరాజుస్వామి, నాయకులు చంద్రకాంత్‌రెడ్డి, ప్రసాద్, గోపాల్‌రెడ్డి, భూపాల్ చౌదరి, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నాయకులు రజీనికాంత్‌రెడ్డి, రమేశ్వర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, వలిబాషా, ప్రసాద్, నాగేంద్రప్ప, రామకృష్ణ, రంగన్న, విరుపాక్షి, యాసిన్, విజయలక్ష్మి, చంద్రశేఖర్, ప్రిన్సిపల్ సుధాకర్, తదితరుల ఆధ్వర్యంలో భారీ మోటర్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ విబిఎస్ కూడలికి చేరుకుని రాస్తారోకో చేశారు. అనంతరం బంగారు వ్యాపారుల దుకాణాలు మూసివేసి బంగారు దుకాణాల వీధి నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ అబ్దుల్‌ఖాదర్, సంఘం నాయకులు కేఎం రహిమ్, ది లిప్, తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం రాస్తారోకో చేశారు. ఏఎన్‌ఎం కార్యకర్తలు, సిబ్బంది కూడా ర్యాలీ నిర్వహించి విబిఎస్ కూడలిలో రాస్తారోకో చేశారు. ఆరోగ్య కార్యకర్తలు చాలా మంది చంటిబిడ్డలతో ఆం దోళనలో పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగులు పెద్దఎత్తున మోటర్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు తెలుగుజాతిని విడదీసిన ద్రోహులంటూ నాయకుల వ్యంగ్య చిత్రాలతో బ్యానర్లు పట్టుకుని ఆందోళన చేశారు.

సమైక్యాంధ్ర కోసం మంగళవారం ఆళ్లగడ్డ
english title: 
nirasana

telugu tagavu

$
0
0
Right Promo Image: 

ఆగని ఆగ్రహావేశాలు

$
0
0

శ్రీకాకుళం, ఆగస్టు 7: శివారు జిల్లా అయిన శ్రీకాకుళంలో సమైక్యగళం రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. వాడవాడలా ఉద్యమం ఊపందుకోవడంతో పలు ప్రాంతాల్లో సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. బుధవారం అంబేద్కర్ వర్శిటీ విద్యార్థులు బ్రాహ్మణుల ఆధ్వర్యంలో శాంతిహోమం నిర్వహించారు. అలాగే కేసీఆర్‌కు శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మానవహారం నిర్వహించి హైదరాబాద్ ఏ ఒక్కడి సొత్తుకాదని..ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిదంటూ ఎలిగెత్తారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులు వర్శిటీ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, ఎన్‌జిఒ నేతలు చౌదరి పురుషోత్తంనాయుడు, హనుమంతు సాయిరాం, బుక్కూరు ఉమామహేశ్వరరావు, జేఏసి ప్రతినిధులు జామి భీమశంకర్రావు, బరాటం లక్ష్మణరావు, సిటిజన్‌ఫోరం అధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు, సమైక్యాంధ్ర ఫోరం అధ్యక్షులు బలగ ప్రకాష్, వైకాపా నేతలు వరుదు కల్యాణి, కిల్లి రామ్మోహన్‌రావు తదితరులు విద్యార్థులు చేపట్టిన హోమంలో భాగస్వామ్యులై మరింత స్పూర్తిని నింపారు. విద్యార్థులే కాకుండా వ్యాపార, ఉద్యోగ సంఘాలు, వివిధ కమిటీల ప్రతినిధులు, రాజకీయ నాయకులు నిరసనలతో తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. పాతపట్నంలో 20 మంది సమైక్యవాదులు రాష్ట్ర విభజనను తప్పుబడుతూ పిండప్రదానం చేసి శిరోముండనానికి దిగారు. కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి పురోహితుల సాక్షిగా శార్దకర్మలు నిర్వహించి వినూత్న నిరసన వ్యక్తంచేశారు. పారిశ్రామిక వాడైన పైడిభీమవరం, రణస్థలం, కోష్ఠ కూడళ్లలో కూడా స్థానిక యువకులు హైవేపై బైఠాయించి సమైక్యనినాదాన్ని వినిపించారు. దుకాణాలు, వాణిజ్యసంస్థలు, విద్యాసంస్థలు, స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. రణస్థలం కూడలిలో తప్పిటగుళ్లు కళాకారులు రిలే నిరాహారదీక్ష శిబిరం వద్ద ప్రదర్శన నిర్వహించి సమైక్యవాదుల్లో ఉత్తేజాన్ని నింపారు. జిల్లా కేంద్రంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నైర వ్యవసాయకళాశాల విద్యార్థులు డే అండ్ నైట్ జంక్షన్‌వరకు నిరసనర్యాలీ కొనసాగించారు. జిల్లా పరిషత్ ఉద్యోగులు ఏడురోడ్ల కూడలి వరకు బైక్‌ర్యాలీ సాగించారు. రిమ్స్ వైద్యకళాశాల ఆవరణలో మానవహారం నిర్వహించి సమైక్యవాదానికి జై కొట్టారు. విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బాపూజీ కళామందిర్‌లో మేధావి వర్గం ప్రతినిధులతో చర్చావేదిక నిర్వహించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. న్యాయవాదులు చేపడుతున్న దీక్షలు రెండవరోజుకు చేరాయి. మహిళా న్యాయవాదులు వీరికి సంఘీభావం తెలిపారు. అలాగే పశువైద్యాధికారులు కూడా తాముసైతమంటూ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ అతిథి గృహంలో తహశీల్దార్‌లతో సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను వెల్లడించారు. తహశీల్దార్‌లు కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొనున్నట్లు ప్రకటించారు. మున్సిపల్ ఉద్యోగులు పాతబస్టాండ్ నుండి భారీ ర్యాలీ నిర్వహించి కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. ఎంపిడిఒ కార్యాలయాలన్నీ స్వచ్చంధంగా సెలవు ప్రకటించి సమైక్యాంధ్ర ఉద్యమానికి ఆ ఉద్యోగులు జై కొట్టారు. నరసన్నపేటలో జేఏసి ఆధ్వర్యంలో పలువురు వౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ సంఘీభావం తెలిపారు. అదేవిధంగా రాజాం, పాలకొండ, పలాస, టెక్కలి, ఇచ్ఛాపురం, సోంపేట తదితర ప్రాంతాల్లో సమైక్యవాదులు నిరసనలు వ్యక్తంచేశారు. ఈ ఆందోళనలకు గంటలపాటు వాహనాలు బారులు తీరడం కనిపించింది.

ఇఫ్తార్ పాలిటిక్స్
(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
రంజాన్ మాసంలో రాజకీయ నేతల విందుల సందడి షరామామూలే. అధికార, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా నాయకులూ ఇఫ్తార్ పార్టీలు ఇచ్చేవారే. పబ్లిగ్గా వక్ఫ్‌బోర్డు ఆస్తులను అమ్మకాలు చేసేవారు, పరాయివాళ్లకు పెద్ద మసీదు స్థలాలు, దుకాణాలు లీజులు..గలీజులు చేసే వారుకూడా షేర్వాణీలు వేసి, బుల్లి టోపీ తలకు తగిలించి ఇఫ్తార్ విందులు ఇకిలించుకుంటూ ఇచ్చేవారే. అసలు రంజాన్ సీజను రాగా ఇఫ్తార్ ‘పోటీల’వెగటు మొదలవుతుంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే కాకుండా తాజాగా ఈ సారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా కలిసింది. ఎవరి పార్టీకి ఎంత మంది వి.ఐ.పి.లు వస్తే అంత గొప్ప. బిర్యానీలు, కబాబ్‌లు, హాలీమ్ వంటి ఎన్ని రకాలు వడ్డిస్తే అంత గ్రేటు. అందుకేనేమో...యువనేత ఈ సారి ఇఫ్తార్ విందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి హాలీమ్ రప్పించి మరీ పెడుతున్నారు. ఎవరి పార్టీకి మీడియాలో కవరేజీ వస్తే వారు అంతగా మైనార్టీ వర్గాలకు దగ్గరైనట్టు లెక్క. మహ్మదీయుల పర్వదినాల పేరు చెప్పుకుని జోర్థారుగా ఇచ్చే పార్టీలో నూటికి 80 మంది భోక్తలు సాధారంగా ఇతర మతాలవారే అయినా ఫర్వాలేదు. వి.ఐ.పి. ముస్లింలకే తప్ప సామాన్య మహమ్మదీయులకు సహజంగానే ప్రవేశం ఉండదు. ఎక్కడచూసినా ఇఫ్తార్ విందులే. ఆహూతులను ఆకట్టుకోవటానికి ఈ మధ్య కొందరు బడా బాబులు గానా బజానాలు కూడా పెడుతున్నారు. మొత్తానికి సిక్కోల్ రాజకీయాలకు ఇఫ్తార్ విందులు ఇవాళ పెద్ద ఫార్సు. ఒకరిని చూసి ఒకరు, చివరికి - ఇఫ్తార్ విందు ఇవ్వకపోతే మైనార్టీలకు దూరమైపోయారన్ననింద ఎక్కడ వస్తుందోనని భయపడి, రోజుకు మూడు నాలుగు పార్టీల విందులకు కాల్‌షీట్లు ఇచ్చుకునే బిజీ షెడ్యూల్‌ను ఈ సారి రంజాన్ మాసం కల్పించింది! కాని - పరమపవిత్ర రంజాన్ ఉపవాస దీక్షను నాయకాగ్రేసురులందరూ కలిసి విందులారగించే పసందు సందర్భంగా మార్చడాన్ని చూస్తే ముస్లింసోదరులకు ఒళ్ళు మండవచ్చు కూడా. తెల్లవారు జాము మొదలుకుని పొద్దు గుంకేవరకూ మంచినీరు, ఉమ్మినికూడా మింగకుండా దైవ చింతనతో నిష్ఠగా చేసే ఉపవాసాన్ని నాలుగు కర్జూరాలను నోట్లో వేసుకుని నీరు తాగి ముగించి, నెలరోజుల పాటు మహమ్మదీయులు సాగించే దీక్షపేరు చెప్పుకుని సిక్కోల్ నేతలు జల్సా చేయటం పవిత్ర రంజాన్ స్ఫూర్తికి అపచారం కాదా? నిజానికి సర్వమతాలకు స్వాగతించే శ్రీకాకుళం జిల్లాలో మత సామరస్యానికి ఏనాడూ ప్రమాదం లేదు. రాజకీయ నేతలు పుర్రచేతితో ధైర్యం చెబితేగానీ గుండె దిటవు కలగనంతటి దుర్గతి మైనారిటీలకు లేదు. మతాల పేరిట చిచ్చుపెట్టే నిక్షేపరాయుళ్లకు ఇరువర్గాల్లోనూ లోటు లేకపోయినా సామాన్య జన జీవితానికి సంబంధించినంతవరకూ సామరస్యంఅదినుంచీ ఉంది. పట్టణంలో శివారు వీధుల్లో పేద హిందువులు, పేద ముస్లింలు కలిసిమెలిసి బతుకుతునే ఉన్నారు. అందుకు నిదర్శనమే ఇక్కడ జెండాలవీధి, సాయిబులతోట. రంజాన్ పండుగ రోజున ముస్లింల ఇళ్లకు హిందువులు వెళ్లి శుభాకాంక్షలు తెలిపి పాయసం అరగించటం సర్వసాధారణ దృశ్యం. మత సామరస్యం ఉండేది అక్కడా? లేక పార్టీ ముసుగులో ఓట్లు-సీట్లు కాకులెక్కల కోసం నేతలు ఇచ్చే ఇఫ్తార్ విందుల్లో బిర్యానీల భావనల్లోనా??

సమైక్యాంధ్ర పరిరక్షణకు
నేడు అత్యవసర సమావేశం
శ్రీకాకుళం (టౌన్), ఆగష్టు 7: స్థానిక ఎన్జీవో హోంలో జిల్లా ఎన్జీవో సంఘం, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గురువారం ఉదయం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు వేదిక కన్వీనర్ హనుమంతు సాయిరాం వెల్లడించారు. సమైక్య రాష్ట్ర సాధనే ధ్యేయంగా నిర్వహించే ఈ సమావేశానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, వైద్య, న్యాయవాదులు, జర్నలిస్టు, కార్మిక, కర్షక సంఘాలు, ఆర్టీసీ, విద్యుత్, ఇంజనీరింగ్, వ్యాపార, ధార్మిక, వృత్తి విద్యా సంస్థల యజమానులు, ఆటో, రిక్షా కార్మిక సంఘాల, యువజన, మహిళా, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు హాజరుకావాలని కోరారు. అదేవిధంగా విద్యార్థి, ఉద్యోగ సంఘాలతో వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

భారీగా బెల్లం ఊట ధ్వంసం

పలాస, మందస, ఆగస్టు 7: నాటుసారా అక్రమతయారీ కేంద్రాలపై స్థానిక పోలీసులు సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు బుధవారం దాడులు చేసారు. అక్రమనాటుసారా కేంద్రాలపై అధికారులకుసమాచారం ఉన్నప్పటికీ తమకు ఏమి పట్టని చందంగా వ్యవహరించడంతో పంచాయతీ ఎన్నికల్లో నాటుసారా ఏరులై పారిన విషయాన్ని ఆంధ్రభూమి వెలుగులోకి తీసుకొచ్చింది. అయినప్పటికీ ఎక్సైజ్ అధికారులు ఈ కథనాలకు కనీసస్థాయిలో స్పందించకపోవడంపై పలు అనుమానాలు రేకేత్తాయి. నాటుసారా తయారీకేంద్రాలపై గత వారం రోజులుగా మందస పోలీసులు హెచ్‌సి మెట్ట విజయకుమార్, ఇంటిలిజెన్స్ హెచ్‌సి కమలాకర్‌లు రెక్కీ నిర్వహించి స్పష్టమైన ఆధారాలు సేకరించారు. దీంతో పలాస ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి.త్యాగరాజు, సోంపేట సి ఐ జి.వి.రమణ సంయుక్తంగా రామరాయి సమీపంలోని రిజర్వు ఫారెస్టులో మెరుపుదాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 20 వేల బెల్లం ఊటలను గుర్తించి ధ్వంసం చేసారు. దీనితోపాటు 100 లీటర్ల నాటుసారాను నేలపోశారు. దీని విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని వారు పేర్కొన్నారు. కాగా, పోలీసుల రాకను పసిగట్టిన నాటుసారా తయారీదారులు తమ పెంపుడు కుక్కలను ఉసిగొల్పి సుమారు 9 మంది పరారీ అయ్యారని పోలీసులు చెబుతున్నారు. ఈ దాడుల్లో రామరాయి గ్రామానికి చెందిన సవర అప్పారావు, మాకన్నపల్లి గ్రామానికి చెందిన సైన కృష్ణారావులను పోలీసులు అరెస్టు చేసారు. కాగా నాటుసారా తయారీ కేంద్రాలను చూసిన పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. సుమారు 50 లీటర్లు పట్టే డ్రమ్ములు 100 వరకు ఉండడంతో ఓ కుటీరపరిశ్రమగా సారా కేంద్రం వర్థిల్లుతుండడంపై పోలీసులకు మైండ్‌బ్లాక్ అయ్యాంది.

సన్మార్గంలో పయనిస్తే సత్ఫలితాలు
* విశ్రాంత డిజిపి హెచ్.జె.దొర
ఎచ్చెర్ల, ఆగస్టు 7: సన్మార్గంలో విద్యార్థులు పయనించినట్లయితే సత్ఫలితాలు సాధించగలుగుతారని విశ్రాంత డి.జి.పి హెచ్.జె.దొర సూచించారు. బుధవారం అంబేద్కర్ విశ్వవిద్యాలయం సెమినార్ హాల్‌లో నైతిక విలువలు- ఉన్నత విద్య అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు నిస్వార్ధంగా పిల్లలను తీర్చిదిద్దుతారని, అయినప్పటికీ వృద్ధాప్యంలో వారి పట్ల నిర్లక్ష్యధోరణి వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జాతీయ నేతల జీవితకథల్లో ముఖ్యాంశాలను గ్రహించి మంచి ప్రవర్తనను అలవర్చుకోవాలన్నారు. నాణ్యమైన పుస్తకాలు అధ్యయనం చేసినట్లయితే పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపగలరన్నారు. వైస్‌ఛాన్సలర్ హెచ్.లజపతిరాయ్ మాట్లాడుతూ మానవతావిలువలు కాపాడుకునేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణమోహన్, సిడిసి డీన్ తులసీరావు, ప్రిన్సిపాల్ చంద్రయ్య, ఆచార్యులు పి.చిరంజీవులు, కామరాజు, అడ్డయ్య, ఫ్యాకల్టీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటా
జి.సిగడాం/లావేరు, ఆగస్టు 7: రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చినంతవరకు ప్రజల పక్షానే ఉంటానని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు అన్నారు. బుధవారం జి.సిగడాం మండలం నిద్దాం గ్రామం, అలాగే లావేరు మండలం బుడతవలస గ్రామానికి విచ్చేసిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. మంత్రులందరూ సోనియాగాంధీతో చర్చించి బయటకు వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారే తప్ప ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమాల తీవ్రతను ఆమెకు వివరించి సమస్య పరిష్కారానికి కృషిచేయాలన్నారు. రాజధాని వల్ల 70 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని, నీటి, విద్యుత్ సమస్యలపై చర్చించకుండా విభజించారని ఆరోపించారు. జిల్లా నుండి సుమారు మూడు లక్షల మంది కార్మికులు హైదరాబాద్‌లో ఉన్నారని, ఈ విభజన వల్ల వారంతా ఉపాధి కోల్పోతారన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సంపద ఏ ఒక్కరి సొత్తు కాదని స్పష్టంచేశారు. పల్లె నుండి పట్టణాల వరకు జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాలకు తాను మద్దతిస్తున్నానన్నారు. ఆయనతోపాటు దాలినాయుడు, కొమరాపు రవికుమార్, కె.సీతారామరాజు, సూర్యనారాయణ, బి.వెంకటేశ్వరరావు, పైల రామకృష్ణనాయుడు, లావేరు మండలానికి చెందిన దేశం పార్టీ కార్యదర్శి పిన్నింటి మధుబాబు, సర్పంచ్ బుడుమూరు నర్సింహులు, ఉపసర్పంచ్ రౌతు శ్రీనివాసరావులు ఉన్నారు.

విద్యార్థుల ఉద్యమం ఉద్ధృతం

ఎచ్చెర్ల, ఆగస్టు 7: ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా యు.పి.ఏ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంపై గత ఎనిమిది రోజులుగా అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు వివిధ రూపాల్లో వినూత్న నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బుధవారం తరగతులు బహిష్కరించి వీరంతా జాతీయ రహదారికి చేరుకొని సోనియా, కేసీఆర్, చిదంబరం, దిగ్విజయ్‌సింగ్‌ల బుద్ధిమారి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని హోమం నిర్వహించారు. పరమశివుడు, సీతారామలక్ష్మణులకు జాతీయ రహదారిపై పురోహితులు సారధ్యంలో హోమం చేపట్టారు. సోనియా డౌన్..డౌన్.., కేసీఆర్ డౌన్..డౌన్.., చిదంబరం, దిగ్విజయ్‌సింగ్ డౌన్..డౌన్..అంటూ నినదించారు. హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదని, రాష్ట్ర ప్రజానీకం కష్టం రాజధాని అభివృద్ధిలో దాగి ఉందన్న విషయాన్ని యుపిఏ నేతలు గుర్తెరగాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల వరకు జాతీయ రహదారిపై యూనివర్శిటీ విద్యార్థులతోపాటు వెంకటేశ్వర, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు రాస్తారోకోలో పాల్గొని హైవేను దిగ్బంధించారు. దీంతో సుమారు ఎనిమిది కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ స్తంభించిపోయింది. అంబులెన్స్ వాహనాలు సైతం ఇందులో చిక్కుకోవడం కనిపించింది. కేసీఆర్‌కు శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేసి సమైక్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రొఫెసర్ తులసీరావు, చంద్రయ్య, చిరంజీవులు, కామరాజు, ఫ్యాకల్టీ సిబ్బంది, నాన్‌టీచింగ్ ఉద్యోగులు, హాస్టల్ వర్కర్లు సమైక్యగళం వినిపిస్తున్నారు.
విభజించే హక్కు సిడబ్ల్యూసీకి లేదు:
మాజీమంత్రి తమ్మినేని
రాష్ట్రాన్ని విభజించే హక్కు సిడబ్ల్యూసీకి ఎవరిచ్చారని మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. రాజ్యాంగపరంగా విభజన ప్రక్రియ ఆరంభించకుండా తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించి ప్రాంతీయ ద్వేషాలను రెచ్చగొట్టారన్నారు. దిగ్విజయ్‌సింగ్, చిదంబరంలు వారివారి రాష్ట్రాలను విభజించకుండా తెలుగుజాతిని విభజించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. బిజెపి నేత నరేంద్రమోడీ సౌరాష్ట్ర విభజనకు కృషిచేయకుండా చిన్న రాష్ట్రాలే మా పార్టీ లక్ష్యమని ఆర్భాటమైన ప్రకటనలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ ప్రకటనతో దేశంలో వేర్పాటువాదాలు ఊపందుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత విశ్వవిద్యాలయం విద్యార్థులు సాగిస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి రాజకీయనేతలు, జేఏసి ప్రతినిధులు సంఘీభావం వ్యక్తంచేశారు. తమ్మినేనితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు వరుదు కల్యాణి, కిల్లి రామ్మోహనరావు, ఎన్జీఒ రాష్ట్ర సహాధ్యక్షులు చౌదరి పురుషోత్తంనాయుడు, సమైక్యఫోరం అధ్యక్షుడు బలగ ప్రకాష్, జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం, బుక్కూరు ఉమామహేశ్వరరావు, సిటిజన్‌ఫోరం అధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు, జామి భీమశంకర్‌రావు, బరాటం లక్ష్మణరావు తదితరులు హోమంలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

మరో ముప్ఫై ఏళ్లకూ సీమాంధ్ర అభివృద్ధి చెందదు
జలుమూరు, ఆగస్టు 7: నెహ్రూ, ఇందిరాగాంధీ లాంటి ఉన్నతమైన కుటుంబాలను స్వార్ధ రాజకీయాల కోసం నడివీధిలోకి లాగి రోడ్డెక్కించిన ఘనత సోనియాగాంధీకే దక్కిందని మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు విమర్శించారు. బుధవారం తన నివాసం అచ్యుతాపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర విభజన చేపట్టారని ఆవేదన చెందారు. హైదరాబాద్ రాజధానిగా ఏర్పడ్డాక సీమాంధ్రుల పెట్టుబడులతో గణనీయంగా అభివృద్ధి చెందిందని అటువంటి నగరాన్ని తెలంగాణకు అప్పగించడం సీమాంధ్రులకు సోనియా అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. సీమాంధ్ర ఏర్పాటైనా మూడు దశాబ్ధాల కాలం వరకు హైదరాబాద్ అంతటి అభివృద్ధిని తిరిగి చేపట్టలేమని స్పష్టంచేశారు. రాష్ట్రాన్ని ముక్కలుచేసిన అనంతరం ఈ దేశాన్ని పాకిస్థాన్‌కు సోనియా అమ్మేసినా ఆశ్చర్యపోవాల్సినదేమీ లేదన్నారు. పాలకులు స్వార్ధ రాజకీయాల కోసం అన్నదమ్ములను విడదీసే పరిస్థితి చేపట్టకూడదని, ఇదే నిజమైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లుతాయని హెచ్చరించారు.
ఔషధ మొక్కలకు నిలయం భారత్
శ్రీకాకుళం (టౌన్), ఆగష్టు 7: మనదేశం ఔషధమొక్కలకు నిలయంగా నిలుస్తుందని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్.లజపతిరాయ్ అన్నారు. బుధవారం ప్రభుత్వ పురుషుల డిగ్రీకళాశాల రజతోత్సవ భవనంలో నిర్వహించిన జీవవైవిధ్యం, ఔషధమొక్కల పెంపకం జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. ప్రతిప్రాణికి అవసరమైన ఔషధాలను మన ప్రకృతి ప్రసాదించిందని, వాటిని పరిరక్షించుకోవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రతి ఇంటిలో ఉండే తులసిమొక్క నుండి వేప, మామిడి వంటి ఇంట్లో పెంచుకొనే మొక్కలనేకం రోగాలను నయంచేసే గుణం కలిగి ఉన్నాయన్నారు. మనదేశంలో లభించే ఔషధమొక్కలనుండి ఔషధాన్ని వెలికితీసి విదేశాలు పేటెంట్ పొందుతున్నాయని, వాటిని మనకే సరఫరా చేసి మన ఆర్థ్ధికవ్యవస్థను దెబ్బతీస్తున్నాయన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ బి.పోలీసు మాట్లాడుతూ యుజిసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సు ద్వారా విద్యార్ధులు చాలా విలువైన మొక్కల నుండి రోగ నిరోధకశక్తి ఉత్పత్తి గురించి తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, ఐసిఎఫ్‌ఆర్‌సి సైంటిస్టు ఎన్.రామారావు, విశాఖపట్నం సర్కిల్ కన్జర్వేటర్ ఆప్ పారెస్టు కె.సూర్యనారాయణ, విశ్వవిద్యాలయం డీన్ జి.తులసీరావు, బోటనీ హెచ్‌వోడీ ఎన్.ఎస్.ఎన్.స్వామి పాల్గొన్నారు.
ఆటో బోల్తా..ఒకరి మృతి
నరసన్నపేట, ఆగస్టు 7: మండల కేంద్రంలో దేశవానిపేట వద్ద జరిగిన ఆటో బోల్తా సంఘటనలో ఒకరు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే..బుధవారం సాయంత్రం నరసన్నపేట నుండి పోలాకి అతివేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పోలాకి గ్రామానికి చెందిన పోలాకి శ్రీనివాసరావు(45) మృతిచెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలవ్వగా ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యసహాయం అందిస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించామని, కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పి.సత్యనారాయణ తెలిపారు.

మర్రివలస విషజ్వరాలు
జి.సిగడాం, ఆగస్టు 7: మండలం మర్రివలస గ్రామంలో ప్రతీ ఇంటా జ్వరాలతో మంచానపడి బాధపడుతున్నారు. బుధవారం ఆ గ్రామాన్ని సందర్శించిన ‘ఆంధ్రభూమి’తో గ్రామ ఉపసర్పంచ్ మహేశ్వరరావు మాట్లాడుతూ గత వారం రోజుల నుండి జ్వరాలు, కీళ్లనొప్పులతో బాధపడుతూ రాజాం, పొందూరు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారన్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించి గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటుచేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

శివారు జిల్లా అయిన శ్రీకాకుళంలో సమైక్యగళం
english title: 
s

సమైక్యాంధ్ర ఉద్యమాలతో హ రెత్తిన జిల్లా

$
0
0

మచిలీపట్నం, ఆగస్టు 7: కృష్ణా జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం హోరెత్తింది. ఉయ్యూరు, కైకలూరు పట్టణాల్లో బంద్ పాటించి నిరసన తెలిపారు. రాజకీయ పార్టీలతో పాటు అన్ని సంఘాలు కదలి రావటంతో రోడ్లు కిక్కిరిశాయి. పాఠశాలల విద్యార్థులు కదం తొక్కారు. ఉయ్యూరులో రైతులు ఎడ్లబండ్లతో ప్రదర్శన నిర్వహించేందుకు చేసే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రోడ్లపై వంటా వార్పు, దిష్టిబొమ్మల దగ్ధం, డప్పులు, డ్యాన్స్‌లతో ఉయ్యూరు పురపాలక సంఘం హోరెత్తింది. అనంతరం జరిగిన సభలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను బుట్ట దాఖలు చేసి ఏకపక్ష నిర్ణయంతో రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని దుమ్మెత్తి పోశారు. ఉయ్యూరు పట్టణం అంతా ఆందోళన కారులతో కిక్కిరిసింది. అలాగే కైకలూరులో కూడా బంద్ పాటించి ఏలూరు రోడ్డును దిగ్భందించారు. వంటావార్పు, ర్యాలీలు, సభలు నిర్వహించారు. మచిలీపట్నంలో అన్ని ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు రోడ్డెక్కారు. అన్ని వీధులు విద్యార్థుల ర్యాలీలతో కళకళలాడాయి. ప్రధాన రహదారుల్లో సమైక్యాంధ్ర రంగ వల్లులు తీర్చిదిద్దారు. ఇజ్రాలు పాటలు పాడుతూ కదం తొక్కారు. పురపాలక సంఘానికి చెందిన అన్ని పాఠశాలల విద్యార్థులు కదిలి రావటంతో పట్టణమంతా యువజనుల హడావిడి కనిపించింది. మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ ఈ ర్యాలీలను ముందుండి నడిపించారు. యానాదులు డప్పులు, డ్యాన్స్‌లు, విచిత్ర వేషధారణలతో అదరగొట్టారు. పట్టణానికి చెందిన ఒకరు అరగుండు గీయించుకుని నిరసన తెలిపారు. కంచర గాడిద ఫొటోకు కెసిఆర్ బొమ్మను అంటించి రిక్షాపై ఊరేగించారు. గుడివాడలో ఎన్‌జివోల బైక్ ర్యాలీ, బార్ అసోసియేషన్ మానవహారం, మున్సిపాలిటీ ఉద్యోగుల వంటా వార్పు, ఎలట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రధాన రోడ్డుపై కబాడీ ఆట తదితర కార్యక్రమాలు నిర్వహించారు. నందిగామ, జగ్గయ్యపేట, నూజివీడు, కంచికచర్ల, తిరువూరు, పెడన, అవనిగడ్డ, పామర్రు, మోపిదేవి, చల్లపల్లి ఇలా అన్ని మండలాల్లో రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు తదితరుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేశారు.
సత్వర న్యాయం
న్యాయ వ్యవస్థ లక్ష్యం
- జిల్లా జడ్జి చక్రధరరావు
మచిలీపట్నం (కల్చరల్), ఆగస్టు 7: ప్రతి ఒక్కరికీ సత్వర న్యాయం అందించడమే న్యాయ వ్యవస్థ లక్ష్యమని జిల్లా జడ్జి జి చక్రధరరావు చెప్పారు. కృష్ణా విశ్వవిద్యాలయం కళామందిరంలో బుధవారం న్యాయ సేవాధికార సంస్థ, కృష్ణా విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్ శిక్షణ, పునశ్చరణ తరగతుల సందర్భంగా నిర్వహించిన సమావేశంలో చక్రధరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టం దృష్టిలో అందరూ సమానమేనన్నారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా త్వరిత గతిన న్యాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక చట్టాలను అమలులోకి తెచ్చిందన్నారు. సివిల్, క్రిమినల్, లోక్ అదాలత్, ఫ్యామిలీ కోర్టులను ఏర్పాటు చేసిందన్నారు. విద్యార్థి దశ నుండే న్యాయపరమైన అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మద్య వర్తిత్వ రాజీ మార్గాల ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారమవుతాయని, వాణిజ్య, వ్యక్తిగత సంబంధాలకు విఘాతం కలగదన్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వెంకయ్య మాట్లాడుతూ విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రంలో న్యాయ సంబంధ విషయాలపై ప్రత్యేక కోర్సును ప్రారంభించనున్నట్లు తెలిపారు. చట్టాలపై ముద్రించిన పుస్తకాలను తెలుగులోకి అనువదించి విశ్వవిద్యాలయం వెబ్‌లో ఉంచుతామన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డా. సిఎం వినయ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జిలు చిన్నంశెట్టి రాజు, రామ్‌గోపాల్‌రావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కేశవాచార్యులు, డా. ఎన్‌ఎడి పాల్, న్యాయవాదులు, ఆంధ్ర, కృష్ణ విశ్వవిద్యాలయాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.
అనివార్యంగా మారిన అవనిగడ్డ అసెంబ్లీ పోలింగ్
అవనిగడ్డ, ఆగస్టు 7: స్థానిక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోటీలో ముగ్గురు అభ్యర్థులు ఉండటంతో పోటీ అనివార్యమైంది. ప్రధాన అభ్యర్థిగా ఉన్న తెలుగుదేశం అభ్యర్థి అంబటి శ్రీహరిప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం చేయటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ కారణంగా తెలుగుదేశం అభ్యర్థి అంబటి శ్రీహరిప్రసాద్‌తో పాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు చిలకలూరిపేటకు చెందిన రావు సుబ్రహ్మణ్యం, కోడూరు మండలం వేణుగోపాలపురం గ్రామానికి చెందిన సైకం రాజశేఖర్‌లు ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ కారణంగా అంబటి శ్రీహరిప్రసాద్‌కు సైకిల్ గుర్తు కేటాయించగా రావు సుబ్రహ్మణ్యంకు సీలింగ్ ఫ్యాన్, శైకం రాజశేఖర్‌కు కప్పుసాసర్ గుర్తును ఎన్నికల అధికారి జి రవి కేటాయించారు. ఉదయం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ పార్టీ ఎంపి కె నారాయణరావు, శాసనసభ్యులు దేవినేని ఉమా, బచ్చుల అర్జునుడు, కొనకళ్ళ బుల్లయ్య తదితరులు ఇక్కడే మకాం చేసి శత విదాలా ఏకగ్రీవానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. వేణుగోపాలపురానికి చెందిన శైకం రాజశేఖర్ అందుబాటులో లేకపోవటంతో చివరి క్షణం వరకు నిరీక్షించిన ఎన్నికల అధికారి ఇక ఎన్నికల ప్రక్రియకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన దివి సమాచార్ సంపాదకులు తుర్లపాటి రామ్మోహనరావు నామినేషన్‌లు ఉప సంహరించుకోవటానికి కొత్త తరహాలో హాజరయ్యారు. ఆయన వంటిపై కాగితాన్ని అంటించుకుని రాష్ట్రాన్ని విభజించిన సోనియా గాంధి పోకడలకు నిరసనగా నామినేషన్ విరమించుకుంటున్నట్లు ఆ కాగితంపై ముద్రించాడు. తోడికోడలు మేనకా గాంధితో సఖ్యతగా లేని సోనియాకు సమైక్యత గురించి ఏమి తెలుస్తుందని కూడా వంటిపై ముద్రించాడు. అనంతరం ఎన్నికల అధికారి ఎదుట నామినేషన్ ఉప సంహరించుకున్నాడు.
రోజు రోజుకూ తీవ్రవౌతున్న సమైక్య పోరు !
నూజివీడు, ఆగస్టు 7: సమైక్య ఆంద్ర కోరుతూ వివిధ వర్గాల ప్రజలు చేస్తున్న ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు సమైక్య ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు. బుధవారం నాడు నూజివీడు డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారులు, సిబ్బంది సమైక్య ఆంధ్రా కోరుతూ పురవీధులలో ప్రదర్శన చేశారు. అనంతరం చిన్నగాంధీబొమ్మ సెంటరులో ధర్నా చేశారు. సమైక్యాంధ్ర కోరుతూ విద్యార్థులు మానవహారం నిర్వహించారు. స్థానిక మడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల, త్రివిధ పాఠశాల, శ్రీ సత్యసాయిబాలభారతి విద్యాసంస్థ, కృష్ణా విశ్వవిద్యాలయం పిజి కేంద్రం విద్యార్థులు స్థానిక చిన్నగాంధీబొమ్మ సెంటరులో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా విభజిస్తుందో చూస్తామని హెచ్చరించారు. సమైక్యాంధ్ర కోసం అవసరమైతే ప్రాణత్యాగం చేస్తామని తెలిపారు. వ్యవసాయ శాఖ ఉద్యోగులు మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఉద్దేశించి చేసిన కెసీఆర్ వాఖ్యలు ప్రజాస్వామ్యబద్దంగా లేవని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు విజయకుమారి, గౌస్‌బాష, శ్రీనివాసరావు, భవానీ, మురళీ, నాగాంజనేయులు, సునీల్, సువర్ణకుమారి, సంయుక్త కార్యచరణ కమిటీ ప్రతినిధులు పగడాల సత్యనారాయణ, పివి కుమార్, త్రివిధ శ్రీనివాసరావు, సాంబశివరావు, మంగరాజు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ప్రజలకు తీరని ద్రోహం
* మాజీ వ్యవసాయశాఖా మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు

ఉయ్యూరు, ఆగష్టు 7: రాష్ట్ర విభజనపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ ఆషామాషీ నివేదిక ఇవ్వలేదని, దానిని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో వెల్లడించాలని మాజీ వ్యవసాయశాఖా మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండు చేశారు. పట్టణంలోని వివిధ స్వచ్ఛంద సంస్థలు, కళాశాలల, పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు, కెసిపి కార్మికులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, వర్తక, వాణిజ్య సంస్థలు, కుల సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమైక్యాంధ్ర మద్దతు ర్యాలీ అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తన కొడుకు రాహూల్ గాంధీని ప్రధానమంత్రి చేసే ఉద్దేశ్యంతోనే సోనియా గాంధీ రాష్ట్ర విభజనపై అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రం మొత్తం పర్యటించి చక్కని నివేదిక తయారు చేసిందని, సవివరంగా ఆరు సూచనలు చేసిందని తెలిపారు. ఆ సూచనలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తెలంగాణా ప్రకటించి తెలుగు ప్రజలకు తీరని ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనలో అన్ని రాజకీయ పార్టీల పాపం ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి జరిగిన పరిణామాలను ఉద్యమకారులకు వివరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు శ్రీమతి ఇందిరాగాంధీ చేసిన కృషి అభినందనీయమన్నారు. అవగాహనా లోపంతో ఆమె విగ్రహాలను ధ్వంసం చేయడం తగదన్నారు. వచ్చిన ప్రతీ ముఖ్యమంత్రీ వెనుకబడిన ప్రాంతమంటూ తెలంగాణా అభివృద్ధికి పాటుపడ్డారని, అభివృద్ధిలో సీమాంధ్ర కంటే తెలంగాణ ముందంజలో ఉందని, దీనిని శ్రీకృష్ణ కమిటీ తేటతెల్లం చేసిందన్నారు. ఇప్పటికైనా శ్రీకృష్ణ కమిటీ నివేదికను పార్లమెంటు ముందు చర్చకు వచ్చేలా సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు, మంత్రులు కృషి చేయాలన్నారు. సీమాంధ్రలో రగిలిన ఉద్యమం వెనుక ఏ రాజకీయ శక్తీ లేకపోవడాన్ని కేంద్రం గుర్తించాలని, అనాలోచిత నిర్ణయాలను తిరిగి సమీక్షించి, సముచిత నిర్ణయం ప్రకటించకుంటే ప్రజాగ్రహానికి గురికావలసి వస్తుందని హితవు పలికారు. సభకు కెసిపి చక్కెర కర్మాగారాల ముఖ్య కార్యనిర్వహణాధికారి జి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించి ప్రసంగిస్తూ సాగునీరు, విద్య, ఉపాధి సౌకర్యాలు తెలంగాణ విడిపోతే సీమాంధ్రలో సంభవిస్తాయని అన్నారు. సభలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు యార్లగడ్డ నాగేశ్వరరావు, లైన్స్‌క్లబ్ అధ్యక్షుడు ఖలీల్ రహమన్, ఇన్నర్‌వీల్ క్లబ్ అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

బందరులో హోరెత్తిన సమైక్యాంధ్ర ఉద్యమం
* ర్యాలీలు, ప్రదర్శనలతో కిక్కిరిసిన ప్రధాన రహదారులు * రంగవల్లులతో తీర్చిదిద్దిన రహదారులు
మచిలీపట్నం (కోనేరుసెంటరు), ఆగస్టు 7: పట్టణంలో సమైక్యాంధ్ర ఉద్యమం బుధవారం హోరెత్తింది. ర్యాలీలు, ప్రదర్శనలతో ప్రధాన రహదారులు కిక్కిరిశాయి. వివిధ పాఠశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థినులు రోడ్లపై సమైక్యాంధ్ర రంగవల్లులు తీర్చిదిద్దారు. సమైక్యాంధ్ర ముద్దు రాష్ట్రాన్ని విడదీయొద్దు అంటూ విద్యార్థులు చేసిన నినాదాలు మార్మోగాయి. యానాదులు విచిత్ర వేషధారణలతో నృత్యాలు చేస్తూ ఆకర్షించారు. రిక్షాపై కంచర గాడిద బొమ్మకు కెసిఆర్ చిత్రపటాన్ని అమర్చి పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. హిజ్రాలు కెసిఆర్ బావయ్యా.. రావయ్యా.. అంటూ చిందులు వేశారు. మున్సిపల్ కార్మికులు, వివిధ సంఘాల నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సంఘం నాయకులు అర్ధనగ్న ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో అన్ని శాఖల గ్రంథాలయ ఉద్యోగులు, రిటైర్డ్ గ్రంథాలయ సంస్థ ఉద్యోగులంతా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రొండి కృష్ణయాదవ్, జాయింట్ యాక్షన్ కమిటీ మచిలీపట్నం శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయం నుండి లక్ష్మీటాకీసు సెంటరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీటాకీసు సెంటరులోని డా. అంబేద్కర్ విగ్రహానికి, జిల్లా కోర్టు సెంటరులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రొండి కృష్ణయాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కన్వీనర్ ఐవివి రామారావు మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణా అన్నదమ్ముల్లా కలిసి ఉంటే అభివృద్ధి చెందుతుందని, కొంత మంది స్వార్ధ ప్రయోజనాలు కోసం తెలుగు వారిని విడదీయటం మంచి పద్దతి కాదన్నారు.

* కిక్కిరిసిన ఉయ్యూరు, కైకలూరు రహదారులు * బందరులో కదం తొక్కిన మున్సిపల్ ఉద్యోగులు * పలు చోట్ల విద్యార్థుల ర్యాలీలు
english title: 
s

మిన్నంటుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాలు

$
0
0

ఒంగోలు, ఆగస్టు 7: జిల్లావ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమాలు మిన్నంటుతూనే ఉన్నాయి. జిల్లాలో రోజురోజుకు ఉద్యమాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. అన్నివర్గాలవారు సమైక్యాంధ్రకే మద్దతు పలుకుతూ వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులో మానవహారాలు చేపట్టి చేస్తున్న నినాదాలు హోరెత్తుతున్నాయి. బుధవారం మున్సిపల్ ఉద్యోగులు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి వినూత్నరీతిలో ప్రకాశం జిల్లా చిహ్నమైన ఒంగోలు జాతి గిత్తలతో ప్రదర్శన నిర్వహించారు. ఈప్రదర్శన స్థానిక కార్పొరేషన్ కార్యాలయం నుండి చర్చి సెంటర్‌కు చేరింది. అనంతరం విద్యార్థులు, ఉద్యోగులతో మానవహారాన్ని నిర్వహించారు. ఈ మానవహారంలో మేళతాళాలతో కళాకారులు డప్పులు మోత మోగించారు. మానవహరాన్ని నిర్వహించటంతో ఒంగోలు వన్‌టౌన్ సిఐ, టౌన్ సిఐలు ప్రకాశరావు, సూర్యనారాయణ, ట్రాఫిక్ సిఐ రవి ట్రాఫిక్‌ను నియంత్రించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్దఎత్తున మున్సిపల్ ఉద్యోగులు, విద్యార్థులు నినాదాలు చేశారు. సమైక్యాంధ్ర వర్ధిల్లాలి, కెసిఆర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్ధి జెఎసి ఆధ్వర్యంలో ఒంగోలులోని హెడ్‌పోస్ట్ఫాసును ముట్టడించారు. అనంతరం ఉద్యోగులను బయటకు పంపి హెడ్‌పోస్ట్ఫాసుకు తాళాలు వేశారు. రిమ్స్ వద్ద ఎన్‌జివోలు, రిమ్స్ స్ట్ఫా నర్సులు, మెడికోలు, డాక్టర్ల ఆధ్వర్యంలో మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా పలు శాఖలకు చెందినవారు కూడా మద్దతు తెలిపారు. కోర్టు సెంటర్ వద్ద లాయర్లు సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ప్రైవేట్ కాలేజీల ఆధ్వర్యంలో విద్యార్థులు పొట్టిశ్రీరాముల విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా ఎన్‌జివో సంఘ చైర్మన్ షేక్ అబ్దుల్ బషీర్, విద్యార్థి జెఎసి కో కన్వీనర్ రాయపాటి జగదీష్ తదితరులు మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో టిఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర్ పనిచేసిన కాలంలో చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వకపోవటంతో టిఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేశారన్నారు. అప్పటి నుండి ఆయన మనుగడను కాపాడుకునేందుకు తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని లబ్ధిపొందారని పేర్కొన్నారు. తెలంగాణ విభజన ప్రకటన అనంతరం సీమాంధ్రలో ప్రజా ఉద్యమం వెల్లువెత్తిందన్నారు. దీంతో కెసిఆర్ ఏంచేయాలో అర్ధంకాక పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయా కార్యక్రమాల్లో ఎన్‌జివో సంఘ నాయకులు బండి శ్రీనివాసరావు, బి రాజ్యలక్ష్మి, స్వాములు, వీరనారాయణ, నాగూర్ వలి, ప్రకాష్, మున్సిపల్ ఉద్యోగులు రమేష్, బాబ్జి, నరేంద్ర, మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశం
ఒంగోలు అర్బన్, ఆగస్టు 7: స్వాతంత్య్ర వేడులకను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె యాకూబ్ నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని జెసి ఛాంబర్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ పెరేడ్ మైదానంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, డ్వామా, గృహ నిర్మాణ సంస్థ, రాజీవ్ విద్యామిషన్, వ్యవసాయ శాఖలకు సంబంధించిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, మెప్మా శాఖల ద్వారా ఈనెల 15న రాష్ట్ర మంత్రి చేతుల మీదుగా 50 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలను స్వయం సహాయక సభ్యులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 15న సంక్షేమ శాఖల అభివృద్ధి, పురోగతిని తెలియజేసే శకటాలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, డ్వామా, గృహ నిర్మాణ సంస్థ, వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ , జిల్లా విద్యాశాఖ, రాజీవ్ విద్యామిషన్ శాఖలు ఏర్పాటు చేయాలన్నారు. స్టాల్స్ ఏర్పాటుచేసే శాఖలు పూర్తి సమాచారాన్ని రెండు రోజుల్లో గృహ నిర్మాణా శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌కు అందజేయాలన్నారు. పోలీస్ పెరేడ్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు జిల్లా విద్యాశాఖాధికారి, రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు డైరెక్టర్ సమన్వయంతో ఏర్పాటు చేయాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ప్లాస్టిక్ వస్తువులతో తయారు చేసినవి వాడకూడదని, కాగితపు జెండాలు, గుడ్డతో తయారుచేసిన జెండాలు మాత్రమే వినియోగించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె రాధాకృష్ణమూర్తి, ముఖ్య ప్రణాళికాధికారి కెటి వెంకయ్య, స్టెప్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి డాక్టర్ బి రవి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె సరస్వతి, జిల్లా విద్యాశాఖాధికారి ఎ రాజేశ్వరరావు, లీడ్ జిల్లా మేనేజర్ జెవిఎస్ ప్రసాద్, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ కె పోలప్ప తదితరులు పాల్గొన్నారు.

టిడిపి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
మంత్రి మహీధర్‌రెడ్డి ఉద్యమంలో పాల్గొంటే
ఆయన విజయానికి కృషి చేస్తాం:దివి శివరాం
కందుకూరు, ఆగస్టు 7: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా టిడిపి ఆధ్వర్యంలో బుధవారం కందుకూరు పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, విద్యార్థులు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా పట్టణ పరిధిలోని అంబేద్కర్, ఎన్‌టిఆర్, పొట్టిశ్రీరాములు విగ్రహాలకు శివరాం, టిడిపి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ర్యాలీ ముగింపు సందర్భంగా ఆర్‌డిఓ కార్యాలయంలో ప్రజలను ఉద్దేశించి శివరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి చిత్తశుద్ధితో శాసనసభ్యత్వానికి, మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటే 2014లో జరిగే ఎన్నికలలో ఆయన గెలుపునకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. సమైక్యాంధ్రపై చిత్తశుద్ధి లేకుండా, అధిష్ఠానం మాటలకు వత్తాసు పలుకుతూ చిత్తం అనే విధంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎక్కడో ఇటలీలో జన్మించిన సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు రాష్ట్ర ప్రజల మనోభావాలను లక్ష్యపెట్టక రాష్ట్రాన్ని విభజించాలని కోరుకోవడం దురదృష్టకరం అని అన్నారు. కర్ణాటకు చెందిన వీరప్పమెయిలీ, కాశ్మీర్‌కు చెందిన గులాంనబీ ఆజాద్, తమిళనాడుకు చెందిన చిదంబరం, మధ్యప్రదేశ్‌కు చెందిన దిగ్విజయ్‌సింగ్‌కు మన రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. అధిష్ఠానం వద్ద పెదవి విప్పలేని నాయకులు రాష్ట్రంలో తమ రాజకీయ ఉనికికోసం డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువరించే సమయంలో నదీజలాలు, విద్యుత్, అప్పులు, రాజధాని తదితర అంశాలపై స్పష్టంగా పేర్కొనకపోవడం వెనుక కాంగ్రెస్ మార్క్ రాజకీయం ఉందని విమర్శించారు. ప్రకటన వెలువరించాము, కత్తులు దూసుకోండనే విధంగా కాంగ్రెస్ అధిష్ఠానం వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలుగుజాతి ప్రజలందరు తెలుగుజాతి ఆత్మగౌరవం కాపాడుకునేందుకు సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆర్‌డిఓ టి బాపిరెడ్డికి టిడిపి నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో టిడిపి అధికార ప్రతినిధులు గట్టమనేని చెంచురామయ్య, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు నాదెండ్ల వెంకటసుబ్బారావు, టిడిపి పట్టణ అధ్యక్షుడు తల్లపనేని వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు పొడపాటి వంశీ, టిడిపి నాయకులు కండ్రా హరిబాబు, బెజవాడ ప్రసాద్, ఈదర రమణమ్మ, తానికొండ ఆంజనేయులు, చిలకపాటి మధు, కలవకూరి యానాది, పిడికిటి రఘు, మాజీ కౌన్సిలర్లు మహర్షి శ్రీను, చదలవాడ కొండయ్య, వడ్డెళ్ళ రవిచంద్ర, ముచ్చు వరమ్మ, టిడిపి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, సానుభూతిపరులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

‘టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి, బిజెపి, సిపిఐ నిర్వాకం వల్లే
రాష్ట్ర విభజన’
ఒంగోలు అర్బన్, ఆగస్టు 7: తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, సిపిఐ పార్టీల నిర్వాకం వల్లే రాష్ట్ర విభజన జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జడా బాల నాగేంద్ర యాదవ్, సూపర్ బజార్ చైర్మన్, తాతా ప్రసాద్, మిరియాల కృష్ణలు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం , వైకాపా, బిజెపి , సిపి ఐ పార్టీల అధినేతలు తెలంగాణా రాష్ట్రం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లేఖలు రాయడం వల్లే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర విభజన చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా రాష్ట్ర విభజనకు పాల్పడిందని, ఆ పార్టీకి చెందిన శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు రోడ్లెక్కి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన తరువాత ఆ పార్టీల నేతలు రెండు కళ్ళ సిద్దాంతాలు పాటించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్రకు ఐదు లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇవ్వాలని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గత పది రోజుల నుండి సీమాంధ్రలో రాష్ట్ర విభజన పట్ల నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, రాజకీయ పార్టీల నేతలు ఉద్యమాల్లో విరివిగా పాల్గొంటున్నారన్నారు. ఉద్యమాల్లో పాల్గొనే రాజకీయ పార్టీల నేతలు ఆ పార్టీల అధినేతల వద్ద తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు ఉద్యమం పట్ల ముందకు రావడం శుభ పరిణామమన్నారు. అన్నీ రాజకీయ పార్టీలు చేసిన తప్పుకు కాంగ్రెస్ పార్టీని నిందించడం, విగ్రహాలు ధ్వంసం చేయడం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు, మంత్రులు అధినాయకత్వం వద్ద సీమాంధ్ర ప్రజల నిర్ణయాలను తేల్చి చెప్పడం వలన అధిష్టానం హై లెవల్ కమిటీని వేయడం జరిగిందని, సమైక్య ఆంధ్రప్రదేశ్‌గా ఉంటుందే తప్పా రాష్ట్ర విభజన జరగదన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదురుగా గురువారం నుండి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేంత వరకు దీక్షలు చేపడుతామన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రతిపక్ష పార్టీలను నిలదీయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పి కోటయ్య, పి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సమైక్యాంధ్ర ఉమద్యమంతో
ఆర్టీసీకి భారీ నష్టం
నెల్లూరు ఆర్టీసీ ఇడి ఆవేదన
కనిగిరి రూరల్, ఆగస్టు 7: చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల ఆర్టీసీకి భారీ నష్టం కలుగుతోందని నెల్లూరు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూర్యచంద్రరావు తెలిపారు. బుధవారం స్థానిక ఆర్టీసీ డిపోలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాలో గత వారం రోజులుగా బస్సులు సరిగా నడవడం లేదన్నారు. ఒంగోలులో కూడా సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా మూడు రోజులుగా బస్సులు నడవడం లేదని ఆయన అన్నారు. కనిగిరి డిపోకు ఈ ఆర్థిక సంవత్సరంలో 75.59 లక్షల ఆదాయం రాగా, అద్దంకి డిపో నష్టాలలో ఉన్నట్లు ఆయన తెలిపారు. 8కోట్ల రూపాయల నిధులతో నెల్లూరు జోన్ పరిధిలోని పలు బస్టాండ్‌లలో వౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జవహర్‌లాల్ పట్టణాభివృద్ధి పథకం కింద 100 బస్సులకు ప్రతిపాదనలు పంపామని, జోన్ పరిధిలో మార్చి చివరన 210 బస్సులు రావాల్సి ఉండగా ప్రస్తుతం 60 బస్సులు మాత్రమే వచ్చాయని ఆయన తెలిపారు. జిల్లాలోని కంభంలో డిపో ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. అనంతరం డిపోలో వివిధ రికార్డులను పరిశీలించి, పలు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో డిఎం వేణు, తదితర అధికారులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన యువకుడు
మార్కాపురం టౌన్, ఆగస్టు 7: రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైకాంధ్ర కావాలని కోరుతూ మండలంలోని ఇడుపూరు గ్రామానికి చెందిన గంగిరెడ్డి రాజశేఖర్ అనే యువకుడు బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు. ఈసందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగం చేశారని, అలాంటి రాష్ట్రాన్ని ఎసి గదుల్లో దర్జాగా కూర్చున్న సోనియాగాంధీ స్వార్ధరాజకీయ కుట్రతో రెండుగా చీల్చి తెలుగువారి మనోభావాలను దెబ్బతీశారన్నారు. విభజన ప్రకటన వెనుకకు తీసుకునేవరకు యువత అలుపెరుగని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర సాధన కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో బిసి సంఘ నాయకులు టివి కాశయ్య, వెంకటేశ్వరరావు, డివైఎఫ్‌ఐ నాయకులు ఏనుగుల సురేష్ పాల్గొని మద్దతు తెలిపారు.

కమిటీలతో కాలయాపన చేయవద్దు
ఎమ్మెల్యే కందుల హితవు
మార్కాపురం, ఆగస్టు 7: సీమాంధ్ర ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కమిటీలు వేసి కాలయాపన చేయవద్దని, సమైక్యాంధ్రగా ఉంచాలని, లేదంటే సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హితవు పలికారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుండి ఫోన్‌లో ఈ విలేఖరితో మాట్లాడుతూ, విభజనకు ముందే ఈప్రాంత ప్రజల మనోభావాలు తెలుసుకొని భవిష్యత్తులో వారికి రాబోయే కష్టాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా విద్యార్థులు ఉద్యోగాల కోసం, ఉద్యోగుల సమస్యలు, రైతులకు నీరు, విద్యుత్ సమస్యలాంటివి ఎన్నో ఉన్నాయని, వాటిపై నిర్ధిష్టమైన హామీలు ఇవ్వాలని, లేదా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర విభజన ప్రకటనతో సీమాంధ్ర అగ్నిగుండంగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపిలు ప్రజలకు విషయాన్ని తెలియచేయకుండా ఢిల్లీలో కూర్చోవడం మరింత ఆగ్రహానికి గురిచేస్తోందని కందుల అన్నారు. ఈనెల 12వ తేదీ నుంచి ఉద్యోగ సంఘాలు, ఆర్టీసీ, విద్యుత్, మున్సిపల్ ఉద్యోగులు నిరవధిక మెరుపు సమ్మెకు నోటీసు ఇవ్వడంతో పాలన స్తంభించిపోయే ప్రమాదం ఉందని, ఈవిషయాన్ని గమనించి ప్రభుత్వం వెంటనే విభజన ప్రకటనను వెనుకకు తీసుకొని ఈప్రాంత ప్రజలతో చర్చించి వారిలో మనోధైర్యం కల్పించి ఇరుప్రాంతాల వారికి ఆమోదయోగ్యమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే విద్యార్థి, యువజన, సామాజిక వర్గాలపరంగా ఉద్యమాలు తీవ్రమయ్యాయని, శాసనసభ్యులు నియోజకవర్గాలకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఏకపక్ష నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆగ్రహావేశాలకు కారణమైందని, వెంటనే విభజన ప్రకటనను వెనుకకు తీసుకొని తిరిగి పునరాలోచించాలని కందుల ప్రభుత్వాన్ని కోరారు.

గిత్తలతో నిరసన ప్రదర్శన హెడ్ పోస్ట్ఫాసు ముట్టడి విధులు బహిష్కరించిన రిమ్స్ నర్సులు
english title: 
m

పల్లెలకు పాకిన విభజన సెగ

$
0
0

కర్నూలు, ఆగస్టు 7: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా స్వచ్చందంగా ఉద్యమించిన ప్రజలకు కుష్టు వ్యాధిగ్రస్తులు మేము సైతం అంటూ తమ మద్దతును తెలియజేశారు. కర్నూలు నగరంలో బుధవారం కుష్టు వ్యాధి గ్రస్తులంతా కలిసికట్టుగా ర్యాలీ నిర్వహిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏ నాడోచేసిన పాప ఫలితాన్ని తాము అనుభవిస్తున్నామని ఇపుడు రాష్ట్ర విభజనకు పాల్పడి పాపాన్ని మూటగట్టుకొని తమ మాదిరే శాపగ్రస్తులు కావద్దంటూ వారు పాలకులను హెచ్చరించారు. కుష్టు వ్యాధిగ్రస్తులు చేపట్టిన ర్యాలీలో సమైక్యవాదులు పాల్గొని తమకు మద్దతునిచ్చి నిరసన వ్యక్తం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలో కళ్లుండీ వాస్తవాలు చూడలేకపోతున్న పాలకుల కన్నా కళ్లులేని కబోదులు అనేక రెట్లు మేలంటూ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అదే సమయంలో ఆసుపత్రికి చికిత్సల నిమిత్తం వచ్చిన రోగులకు రహదారిపైనే వైద్య సేవలందించి తమ నిరసన వ్యక్తం చేశారు. వైద్యులకు మద్దతుగా వైద్య, ఆరోగ్య సిబ్బంది సైతం సమైక్య ర్యాలీలో పాల్గొని రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు ఆరోగ్యం కోసం రోజూ యోగా చేసేవారు బుధవారం తెల్లవారుజామున 44వ నంబరు జాతీయ రహదారిపైకి చేరి అక్కడే యోగాభ్యాసాన్ని చేశారు. రెండు గంటల పాటు రాష్ట్ర సమైక్యత అవసరం గురించి వివరిస్తూ యోగాభ్యాసం చేస్తూ రహదారిపై రాకపోకలను అడ్డుకున్నారు. అనంతరం అక్కడే అల్పాహారాన్ని స్వీకరించారు. యోగాభ్యాసకులకు పత్తికొండ ఎమ్మెల్యే కెయి ప్రభాకర్ మద్దతు తెలిపి తన జీవితంలో ప్రజలే స్వచ్చందంగా ఉద్యమించడం అది తారాస్థాయికి చేరుకోవడం ఇదే ప్రథమమని వెల్లడించారు. ఏ ఒక్కవర్గమో, ఒకటి, రెండు సంఘాల వారో ఉద్యమించడం చూశానని సమైక్య ఉద్యమంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని తమ డిమాండ్‌ను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తుండటం ఎంతో గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ప్రజాగ్రహాన్ని చూస్తున్న పాలక కాంగ్రెస్‌నేతలు జనంలోకి రావడానికి భయపడి ఇళ్లకే పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా ర్యాలీ, ధర్నా, వంటా-వార్పు వంటి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజా, కుల సంఘాల వారు ఒక్క తాటి పైకి వచ్చి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. గత వారం రోజులుగా విద్యా సంస్థలన్నింటిని మూసివేయగా ఆర్టీసీ బస్సులు సైతం డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఉద్యోగులు, కార్మికులు, అధికారులు సైతం తమ వంతు బాధ్యతగా ఉద్యమంలో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, డోన్, బేతంచెర్ల, ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ తదితర పట్టణాల్లో ఉద్యమహోరు తారాస్థాయికి చేరుకుంది. శాంతియుతంగా నిర్వహిస్తున్న సమైక్య ఉద్యమం రానున్న ఒకటి, రెండు రోజుల్లో మరింత ఉధృతం చేస్తామని సమైక్య ఉద్యమ కార్యాచరణ కమిటీ ప్రకటించింది. సమ్మె చేయ తలపెట్టిన ఎన్జీవోలకు అన్ని వర్గాల నుంచి పూర్తి స్థాయి మద్దతును బేషరతుగా ఇచ్చి వారి సమ్మెను జయప్రదం చేస్తామని తెలిపారు. కేంద్రం తక్షణం దిగివచ్చిన రాష్ట్ర విభజన ప్రక్రియను ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
హంద్రీనీవాకు నీటి విడుదల
నందికొట్కూరు, ఆగస్టు 7: హంద్రీనీవా ముఖద్వారామైన నందికొట్కూరు మండలం మల్యాలవద్ద నిర్మించిన హంద్రీనీవా సుజలస్రవంతి మొదటిదశ పనుల పూర్తికావడంతో శ్రీశైలం బ్యాక్ వాటర్ సపోర్ట్ కెనాల్ ద్వారా ప్రాజెక్టులోకి నీరుచేరడంతో బుధవారం ప్రాజెక్టుకు అమర్చిన 12 పంపులలో 5వ మోటరు పంపు ద్వారా హంద్రీనీవా ప్రధాన కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. హంద్రీనీవా ప్రధాన కాలువను ప్రాజెక్టుకు అమర్చిన కంప్యూటర్ మోనిటర్ ద్వారా నీటిని పంపింగ్‌చేసే విధానాన్ని కలెక్టర్ సుదర్శన్ రెడ్డి పరీశీలించారు. కృష్ణా జలాల నీటి ప్రవాహం విద్యుత్ మోటర్ల పనితీరును, నీటి సామర్ధ్యతను నీటిపారుదల శాఖ ఇఇ పాండురంగయ్య కలెక్టరుకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుదర్శనరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో కృష్ణాజలాలు సంవృద్ధిగా వున్నాయన్నారు. రాయలసీమలోని కరువు ప్రాంత మండలాలకు త్రాగు,సాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం జిల్లాలోని ఆయాకట్టు క్రింద 15వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు 700 క్యూసెక్కుల నీటిని విడుదలకు ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసిందన్నారు. జిల్లాలో ఈ పథకం క్రింద ఏర్పాటుచేసిన కృష్ణగిరి, పత్తికొండ, పందికొన, జిడిపల్లె రిజర్వాయరులకు పూర్తినీటిమట్టం చేసుకోవచ్చున్నారు. హంద్రీనీవా యస్‌ఇ పాండురంగయ్య మాట్లాడుతూ హంద్రీనీవా కాలువకు అమర్చిన12పంపులలో 6పంపులను ట్రయల్ రన్ నిర్వహించి పరిశీలించామన్నారు. హెచ్‌ఎన్‌యస్‌యస్ వివిధ ప్రాంతలలోగల 8పంపింగ్ స్టేషన్లు ద్వారా మల్యాల వద్దనున్న పంపింగ్ స్టేషన్ ఫేస్1 నుంచి అనంతపురం జిల్లాలోని జిడిపల్లె రిజర్వాయరు వరకూ నీటిని సరాఫరా చేస్తామన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నందు 884.5 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఉదయం విడుదల చేసిన ఒక్కమోటరు ద్వారా 320 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా సాయంకాలం 5, 7 మోటర్లు ద్వారా నీటిని విడుదల చేశారు. బ్రాహ్మాణకొట్కూరు వద్దనున్న హంద్రీనీవా రెండవ ఎత్తిపోతల పథకానికి 7 అడుగుల లోతు నీరు రాగనే నీటిని పంపింగ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టరు వెంట వివిధ నీటి పారుదల శాఖ అధికారులు, హంద్రీనీవా డిఇ నాయక్, తదితరులు ఉన్నారు.
హంద్రీనీవాకు నీరు విడుదల
నందికొట్కూరు, ఆగస్టు 7: నందికొట్కూరు మండలం మల్యాలవద్ద నిర్మించిన హంద్రీనీవా సుజలస్రవంతి మొదటిదశ పనుల పూర్తికావడంతో శ్రీశైలం బ్యాక్ వాటర్ సపోర్ట్ కెనాల్ ద్వారా ప్రాజెక్టులోకి నీరుచేరడంతో బుధవారం ప్రాజెక్టుకు అమర్చిన 12 పంపులలో 5వ మోటరు పంపు ద్వారా హంద్రీనీవా ప్రధాన కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. హంద్రీనీవా ప్రధాన కాలువను ప్రాజెక్టుకు అమర్చిన కంప్యూటర్ మోనిటర్ ద్వారా నీటిని పంపింగ్‌చేసే విధానాన్ని కలెక్టర్ సుదర్శన్ రెడ్డి పరీశీలించారు. కృష్ణా జలాల నీటి ప్రవాహం విద్యుత్ మోటర్ల పనితీరును, నీటి సామర్ధ్యతను నీటిపారుదల శాఖ ఇఇ పాండురంగయ్య కలెక్టరుకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుదర్శనరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో కృష్ణాజలాలు సంవృద్ధిగా వున్నాయన్నారు. రాయలసీమలోని కరువు ప్రాంత మండలాలకు త్రాగు,సాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం జిల్లాలోని ఆయాకట్టు క్రింద 15వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు 700 క్యూసెక్కుల నీటిని విడుదలకు ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసిందన్నారు. జిల్లాలో ఈ పథకం క్రింద ఏర్పాటుచేసిన కృష్ణగిరి, పత్తికొండ, పందికొన, జిడిపల్లె రిజర్వాయరులకు పూర్తినీటిమట్టం చేసుకోవచ్చున్నారు. హంద్రీనీవా యస్‌ఇ పాండురంగయ్య మాట్లాడుతూ హంద్రీనీవా కాలువకు అమర్చిన 12పంపులలో 6పంపులను ట్రయల్ రన్ నిర్వహించి పరిశీలించామన్నారు. హెచ్‌ఎన్‌యస్‌యస్ వివిధ ప్రాంతలలోగల 8పంపింగ్ స్టేషన్లు ద్వారా మల్యాల వద్దనున్న పంపింగ్ స్టేషన్ ఫేస్1 నుంచి అనంతపురం జిల్లాలోని జిడిపల్లె రిజర్వాయరు వరకూ నీటిని సరాఫరా చేస్తామన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నందు 884.5 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఉదయం విడుదల చేసిన ఒక్కమోటరు ద్వారా 320 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా సాయంకాలం 5, 7 మోటర్లు ద్వారా నీటిని విడుదల చేశారు. బ్రాహ్మాణకొట్కూరు వద్దనున్న హంద్రీనీవా రెండవ ఎత్తిపోతల పథకానికి 7 అడుగుల లోతు నీరు రాగనే నీటిని పంపింగ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టరు వెంట వివిధ నీటి పారుదల శాఖ అధికారులు, హంద్రీనీవా డిఇ నాయక్, తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మోసం చేసింది
నంద్యాల రూరల్, ఆగస్టు 7: సమైక్యాంధ్ర విషయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రకటన వల్ల కాంగ్రెస్ పార్టీ అదిష్టానం మోసం చేసిందని అందువల్లే స్పీకర్‌కు రాజీనామా లేఖ అందించినట్లు నంద్యాల ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం నంద్యాలలోని జర్నలిస్టుల రిలేనిరాహారదీక్షలకు సంఘీభావం తెలుపుతూ జర్నలిస్టులకు నిమ్మరసం ఇచ్చి ఎమ్మెల్యే వారితో దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా విలేఖరులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రజలు ఏపార్టీ కోరితే ఆపార్టీలోకి వెళ్లి నంద్యాల నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడతానన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదుకాని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఎంపి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తెలంగాణ విభజన విషయం తెలియదన్నారు. సోనియాగాంధీ, ప్రధానమంత్రి చేతుల్లో ఉందని ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు అందరు కలిసి అదిష్టానానికి లేఖ ఇచ్చామన్నారు. సమైక్యాంధ్రకు చిన్నపెద్ద, విద్యార్థులు, ప్రజాసంఘాలు ప్రతి ఒక్కరు సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారన్నారు. సమైక్య విభజన విషయం తెలిసిన తరువాత భవిష్యత్తు ప్రణాళికను రూపొదిస్తానన్నారు. త్వరలోనే సోనియాగాంధీ, ప్రధానమంత్రి విభజన విషయాన్ని తెలియజేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. అన్నిపార్టీలు సమైక్యంగా ఉండి సమైక్యాంధ్ర సాధించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఎన్నికల్లో పార్టీల తరపున
పోటీ చేయమని తీర్మానం చేయండి
నంద్యాల రూరల్, ఆగస్టు 7: రాష్ట్రాన్ని విభజించినా కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకుండా మోసం చేస్తున్నారని సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని, కాంగ్రెస్ పార్టీతో పోటీచేయమని తీర్మాణం చేసి, రాజీనామా లేఖలు చూపించి ఉద్యమాల్లో పాల్గొనాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర గవర్నింగ్ సభ్యులు మాజీ ఎంపి భూమానాగిరెడ్డి అన్నారు. బుధవారం నంద్యాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ రాయల తెలంగాణ కావాలంటూ మంత్రులు మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎందుకు వౌనంగా ఉన్నారో తెలపాలని భూమా అన్నారు. రాజీనామాలు చేయని మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను జెఎసి నాయకులు ముట్టడించాలని భూమా నాగిరెడ్డి సూచించారు. రాష్ట్రంలో సమైక్యంగా ఉండేందుకు ప్రజలు ఉన్నారన్నారు. సమైక్యాంధ్ర కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు, దళితులు, ఎన్‌జిఓలు ప్రతి ఒక్కరు పోరాటాలు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇంతవరకు సమైక్యాంధ్ర గుర్తుకురాలేదా అంటూ నిలదీశారు. రాజీనామా చేసి పార్టీలకు దూరంగా ఉండి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని జిల్లా మంత్రులను భూమా కోరారు. ఆంధ్రప్రదేశ్‌ను తాకట్టుపెట్టి పార్టీలను రాబోయే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని భూమా అన్నారు.

రాహుల్‌గాంధీ కోసమే
రాష్ట్రంలో చిచ్చు
ఎమ్మిగనూరు, ఆగస్టు 7 : రాహూల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకే సోనియాగాంధీ కుట్రపన్ని రాష్ట్రాన్ని విభజిచడం దారుణమని, యుపిఎ చ ర్యల ఫలితంగానే రాష్ట్రం రావణకాష్టం లా మండుతోందని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి స్పష్టం చేశారు. సోమప్పసర్కిల్‌ల్లో బుధవారం రాష్ట్ర విభజనపై ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వేలాదిమంది వలసలు వచ్చి హైదరాబాద్‌లో ఉంటే వారు వెళ్లాలని కెసిఆర్ శాసించడం తగదన్నారు. వైకాపా దీక్షల్లో నాయకులు శ్రీనివాసులు, మధుసూదన్‌రెడ్డి, నాగేశ్వరరావు, రామలింగారెడ్డి కూర్చున్నారు. టిడిపి ఇన్‌చార్జి డాక్టర్ జయనాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు సోమప్ప సర్కిల్లో పెద్దఎత్తున రాస్తారోకో నిర్వహించారు.
ప్రజాభీష్టం మేరకే సిలికాన్ తవ్వకాలకు అనుమతి
* జెసి కన్నబాబు
ఓర్వకల్లు, ఆగస్టు 7: ప్రజలు అంగీకరిస్తేనే సిలికాన్ తవ్వకాలను అనుమతిస్తామని జెసి కన్నబాబు అన్నారు. మండల పరిధిలోని లోద్దిపల్లె గ్రామ మజార అయిన మంగంపల్లె ప్రాంతంలోబుధవారం ఆయన సిలికాన్ తవ్వకాలపై ప్రజాభిప్రాయసేకరణ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ హనుమాన్ మినరల్స్ అనే కంపెనీ ఈ ప్రాంతంలోని 270, 275, 273, 279 సర్వేనంబర్లకు సంబందించిన 153 హెక్టార్ల ప్రభుత్వ భూములలో సిలికాన్ తవ్వకం జరిపేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తులు చేసిందన్నారు. ఈ విషయమై ఈ ప్రాంతపు ప్రజలు, రైతుల అభిప్రాయాలు సేకరించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. సదస్సులో ఆయాయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతానికి చెందిన పుడిచెర్లరైతులు సిలికాల్ తవ్వకాల వల్ల ఈ ప్రాంతంలో వాతావరణ కాలుష్యం ఏర్పడి పొలాలలో పంటలకు నష్టం సంభమించే అవకాశం వుందని అబిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్పందించిన జెసి ప్రజాభిప్రాయాలను ప్రభుత్వానికి పంపి తుదినిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈకార్యక్రమంలో లొద్దిపల్లె సర్పంచు రాజేశ్వరరెడ్డి, సింగిల్ విడోచైర్మన్ వీర భద్రారెడ్డి, గ్రామ రైతులు పాల్గొన్నారు.
తెలుగుజాతిని విభజిస్తే సహించం
ఓర్వకల్లు, ఆగస్టు 7: ఎన్నో ఏళ్ల చరిత్రగల్గిన తెలుగు జాతిని విభజిస్తే సహించేది లేదని ప్రాణాలైన త్యాగంచేసి విభజనను అడ్డుకుంటామని నన్నూరు గ్రామ సర్పంచ్ చెన్నారెడ్డి అన్నారు. మండల పరిధిలోని నన్నూరు గ్రామంలో రాష్టవ్రిభజనను నిరసిస్తు ఆయన ఆధ్వర్యంలోబుధవారం మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కర్నూలు చిత్తూరుజాతీయ రహదారిపై రాస్తారోకో ధర్నానిర్వహించారు. శ్రీపతి, పరమేష్, కాంగ్రెస్ కార్యకర్తలు యేసు, పాల్గొన్నారు.
పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్‌పి
నందికొట్కూరు, ఆగస్టు 7, మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు పోలీసుస్టేషన్‌ను బుధవారం జిల్లా ఎస్‌పి రఘురామిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యాత్మక గ్రామాలైన కోళ్లబావాపురం, దామగట్ల గ్రామాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
ఉయ్యాలవాడ, ఆగస్టు 7:ప్రభుత్వం అర్హులైన రైతులకు సబ్సీడి రూపంలో అందించే అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయాధికారి సుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం కార్యాలయానికి సరఫరా అయిన 80 తార్పాలిన్ పట్టలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు 50 శాతం సబ్సీడితో వ్యవసాయ పనిముట్లు, ఇతర యంత్ర పరికరాలు సరఫరాకు డిడిలు చెల్లించినట్లయితే పరికరాల కొనుగోలుకు అనుమతి ఇస్తామన్నారు. తార్పాలిన్ పట్టలు మంజూరైన రైతులకు వాటిని అందజేశారు. ఏఈఓలు రాజు, నాగరాజు, రైతులు పాల్గొన్నారు.
సమైక్యాంధ్రను కొనసాగించాలి
క్రిష్ణగిరి, ఆగస్టు 7: సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలని కర్నూలు డివిజన్ విఆర్వో సంఘం అధ్యక్షులు పి.రామకష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో మండల వీఆర్వోలు, వీఆర్‌ఎలు, కార్యాలయ సిబ్బంది రాష్ట్ర విభజనకు నిరసనగా నల్లబ్యాడ్జిలు ధరించి విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వార్థ రాజకీయ నాయకులు తమ పదవుల కోసం రాష్ట్రాన్ని విభజించడం దారుణమన్నారు. సమైక్యాంధ్ర జెఎసి పిలుపుమేరకు ఈనెల 12 నుంచి మండల విఆర్వోలు, విఆర్‌ఎలు నిరవధిక సమ్మె నోటీసును తహశీల్దార్ మాధవరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి తహశీల్దార్ ప్రసన్న మోజెస్, సీనియర్ అసిస్టెంట్ మధుసుధన్‌రావు, విఆర్వోలు పార్ధసారధి, ప్రసాద్, రాజశేఖర్‌రెడ్డి, విఆర్‌ఎలు మాధవకృష్ణ, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ముట్టడికి భారీగా తరలిరండి
కర్నూలు టౌన్, ఆగస్టు 7: కల్లూరు మండలంలోని హంద్రీ పరివాహక ప్రాంతాల రైతులు కలెక్టరేట్‌ను బుధ, గురువారాల్లో ముట్టడి చేసేందు భారీగా వాహణాలలో తరలివెళ్తున్నామని హంద్రీ నది పరివాహక కమిటి సభ్యులు రామకృష్ణరెడ్డి తెలిపారు.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా స్వచ్చందంగా
english title: 
p

వరద తాకిడికి తీవ్రంగా నష్టపోయిన రైతులు

$
0
0

ఖమ్మం, ఆగస్టు 7: గోదావరి వరద తాకిడికి జిల్లాలోని 14మండలాల పరిధిలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. పరివాహక ప్రాంతంలోని రైతులు గోదావరి వరద తాకిడికి జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలనే దానిపై ఆందోళనలో ఉన్నారు. జూలై మొదటి వారంలో పత్తిగింజలను నాటిన పరివాహక ప్రాంత రైతులు పంట బాగుందని అనుకునేలోగానే గోదావరి నదికి వరద రావటంతో పంట కొట్టుకపోయింది. మళ్ళీ విత్తనాలు వేయగానే మరొక సారి వరద రాగా, తీవ్రంగా ఆందోళన చెందారు. అయినప్పటికీ మనోధైర్యంతో మరొసారి విత్తనాలు వేయగా వెంటనే గడిచిన రెండు సార్ల కంటే అధికంగా గోదావరి వరద ఉధృతంగా రావటంతో తీవ్రంగా నష్టపోయారు. మూడు సార్లు విత్తనాలతో పాటు ఎరువులను వేయటం, అవి వరద వల్ల నష్టం ఏర్పడటంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మళ్ళీ పెట్టుబడి పెట్టే పరిస్థితి లేక చేసిన అప్పులను తీర్చలేక ఒక్క కుక్కునూరు మండలంలోనే ఇప్పటికి ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అనేక మంది మంచాన పడ్డారు. వీరందరిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఇంత వరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవటం గమనార్హం. గతేడాది కూడా నీలం తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకున్న దాఖలాలు లేవు. ఆ నష్టాన్ని పూడ్చుకోవటానికి ఈ ఏడాది వ్యవసాయం ప్రారంభించిన రైతులకు గోదావరి వరద మరింత నష్టాన్ని చేకూర్చింది. ఇదిలా ఉండగా పెట్టుబడిదారులు సైతం ఈ ఏడాది రైతులకు అప్పులు ఇవ్వకపోవటం గమనార్హం. కొద్దిమంది పెట్టుబడిదారులు గతేడాది అప్పులు తీరిస్తేనే ఈ ఏడాది ఇస్తామని చెప్పటం, మరికొంత మంది ఇప్పటికే చాలా ఇచ్చామని, ఇప్పుడు ఇకలేమని చెప్తున్నారు. పరివాహక ప్రాంతంలోని సుమారు 20వేల ఎకరాల్లో పత్తినష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందుకు సంబంధించి వేలాది మంది రైతులు తిరిగి పత్తిగింజలు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేక తమ చేలను బీళ్ళుగా వదిలేసేందుకు సిద్ధ పడుతున్నారు. మరి కొంత మంది వేలేరుపాడు, కుక్కునూరు, అశ్వారావుపేట మండలాల నుంచి కూలీ పనులు చేసుకునేందుకు ఖమ్మం, కొత్తగూడెంలకు కూడా వస్తున్నట్లు సమాచారం. గోదావరి వరద వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం కూడా పక్షపాతంగా వ్యవహరిస్తుందని, ఆంధ్ర ప్రాంతంలోని రైతులను ఆదుకునేందుకు ప్రతి ఏడాది చర్యలు తీసుకుంటున్నదని, ఖమ్మం జిల్లా రైతులను మాత్రం పట్టించుకోవటం లేదని వివిధ రాజకీయ పక్షాల నాయకులు ఆరోపించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులు మళ్ళీ వ్యవసాయం తప్ప వేరే పనులు చేసే మార్గాలు లేవు కనుక ఇబ్బందులను, అప్పులను సైతం ఎదుర్కొని వ్యవసాయాన్ని చేసేందుకు ఉపక్రమిస్తున్నారు. ప్రస్తుతం పత్తి తోటలన్ని గోదావరి ముంపుకు గురవటంతో ప్రత్యామ్నాయంగా కొన్ని చోట్ల రైతులు పెసర, మినుము, కంది పంటలతో పాటు మరి కొంత మంది మళ్ళీ పత్తిని సాగు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్లలోని లక్షలాది ఎకరాల్లోని పత్తి పంట ముంపుకు గురై రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నప్పటికీ వ్యవసాయ శాఖాధికారులు గాని, రెవెన్యూ అధికారులు గాని పట్టించుకున్న దాఖలాలు లేవంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గోదావరి ముంపుకు గురైన పంటలను సర్వే చేపించి, రైతులకు నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

విద్యార్థులను సొంత పిల్లల్లా భావించండి
* నాణ్యమైన విద్యనందించి 100శాతం ఉత్తీర్ణత సాధించాలి
* హెచ్‌ఎంలతో కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్
ఖానాపురం హవేలి, ఆగస్టు 7: విద్యార్థులను సొంత పిల్లల్లా భావించి వారికి నాణ్యమైన విద్యనందించి 100శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎంబి గార్డెన్స్‌లో వార్షిక విద్య కార్యాచరణ ప్రణాళిక అమలుపై ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అలాంటి సమయాల్లోనే అనుకున్న ఫలితాలను సాధించగలుగుతామన్నారు. సమస్యలను ఎత్తిచూపటమే లక్ష్యంగా పెట్టుకోకుండా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తూ విద్యనందించటం ద్వారానే ఏదైనా సాధించవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించిన అనేక మంది ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారని, అందులో తాము ఒకరమనే విషయాన్ని చెప్పుకునేందుకు గర్వంగా ఉందన్నారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. జిల్లా స్థాయిలో కూడా ఉన్నతాధికారులతో ఒక కమిటీని వేసి వారి పర్యవేక్షణలో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం జెసి సురేంద్రమోహన్ మాట్లాడుతూ ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో పాటు ఎంత శాతం ఉత్తీర్ణత సాధించామనే దాని కంటే మన వద్ద నేర్చుకున్న విద్యార్థుల్లో ఎంత మందికి నాణ్యమైన విద్యనందించాం అనే విషయాలపై ఆలోచించి, విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ప్రస్తుతం పదో తరగతి ఫలితాల్లో 84శాతం ఉత్తీర్ణత సాధించారని, రాష్టస్థ్రాయిలో 19వ స్థానంలో ఉన్నామని, ఈ ఏడాది మొదటి స్థానానికి వచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఐటిడివో పిఓ వీరపాండ్యన్ మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులందరూ ఆయా పాఠశాలల్లో పాఠశాల ముగిసిన అనంతరం స్టడీ అవర్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా ప్రధానోపాధ్యాయులు స్థానికంగా ఉండి ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ తగిన సలహాలు, సూచనలు అందిస్తూ వారిలో వెనుకబడిన వారిని సైతం ఉత్తీర్ణులయ్యే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. అధికారులంతా తమ వంతు పూర్తిస్థాయిలో సహాయ, సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రధానోపాధ్యాయులు కృషి చేసి ఉన్నత స్థానాలకు చేరుకునే విధంగా ప్రయత్నాలు చేయాలన్నారు. అనంతరం గతేడాది పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నూరు శాతం ఫలితాలు సాధించిన 23పాఠశాలల ప్రధానోపాధ్యాయులను జిల్లా కలెక్టర్ శ్రీనరేష్, అధికారులంతా ఘనంగా సన్మానించారు. డిఈఓ రవీంధ్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్పీ సిఇఓ జయప్రకాశ్ నారాయణ, డిఆర్‌డిఏ పిడి పద్మజారాణి, ఏజన్సీ డిఈఓ, ఆయా మండలాల ఎంఇఓలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

శాంతించిన గోదారమ్మ
భద్రాచలం, ఆగస్టు 7: భద్రాచలం వద్ద వారం రోజుల పాటు ప్రజలను, అధికారులను ఉరుకలు పెట్టించిన ఉగ్ర గోదావరి శాంతించింది. మంగళవారం 45 అడుగులు ఉన్న నీటి మట్టం బుధవారం నాటికి 42 అడుగులకు చేరుకుంది. దీంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను సబ్ కలెక్టర్ భరత్ గుప్తా ఉపసంహరించారు. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని 12 మండలాల్లో గోదావరి వరదలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలు ఇప్పుడిప్పుడే తమతమ ఇళ్ళకు పయనవౌతున్నారు. ఇంకా పునరావాస కేంద్రాల్లో 8 వేల మంది ఆశ్రయం పొందుతూనే ఉన్నారు. వరదలు తగ్గుముఖం పట్టడంతో రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. కాగా పలు చోట్ల రోడ్లపై బురదనీరు ఉండటంతో ప్రయాణీకులు, వాహనచోదకులు ఫీట్లు చేస్తున్నారు. మండలాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాగా కొన్ని గ్రామాలకు సరఫరా జరగడం లేదు. భద్రాచలం రామాలయం చుట్టూ, పరిసర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, గోదావరి నదీ తీరం వద్ద స్నానఘట్టాలు, ఉప ఆలయాలు, వైకుంఠఘాట్‌లో వరదల నుంచి తేరుకున్నాయి. విస్తా కాంప్లెక్సు, సుభాష్‌నగర్, అశోక్‌నగర్ కొత్తకాలనీ తదితర ప్రాంతాలు వరదలు తగ్గడంతో బురదమయంగా ఉన్నాయి. వరదలు తగ్గడంతో అధికారులు పారిశుద్ధ్య పనులు ప్రారంభించగా వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు వైద్యసేవలందిస్తున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో మెరుగుపడకపోగా లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు వరదలోనే ఉండటంతో ఇప్పుడిప్పుడే పునరుద్ధరణ జరుగుతోంది.

భద్రాచలాన్ని తాకిన విభజన సెగ
* డివిజన్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి, ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేయాలి
* భద్రాచలం పరిరక్షణ కమిటీ డిమాండ్
భద్రాచలం, ఆగస్టు 7: భద్రాచలం ప్రాంతాన్ని విభజన సెగ తాకింది. బుధవారం భద్రాచలానికి చెందిన గిరిజన, గిరిజనేతర సంఘాలు కలసి భద్రాచలం పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ క్రమంలో స్థానిక రాజుల సత్రంలో జరిగిన సమావేశంలో కన్వీనర్ పివిఎస్ విజయవర్మ మాట్లాడుతూ 1956వ సంవత్సరానికి ముందు నుంచి తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగిన భద్రాచలం డివిజన్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో రంపచోడవరం ఏజెన్సీ కేంద్రంగా ఉన్న భద్రాచలం డివిజన్‌ను సౌలభ్యం దృష్ట్యా ఖమ్మం జిల్లాలో కలపాల్సి వచ్చిందన్నారు. కాగా నేడు అన్ని విధాలా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్న భద్రాచలాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం ద్వారా స్థానిక గిరిజనులకు సంపూర్ణ న్యాయం జరుగుతుందన్నారు. అలా కాకుండా తెలంగాణలో కలిపినట్లైతే గిరిజనులు పూర్తిగా తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని విజయవర్మ ఆవేదన వ్యక్తం చేశారు. 1956కి ముందున్న తెలంగాణ కావాలని నిన్నటి వరకు పోరాటం చేసిన నాయకులు నేడు తెలంగాణపై మాట మార్చడం దారుణమన్నారు. ఇది ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. రామయ్య గుడి నిర్మాణానికి రామదాసు ఖర్చుపెట్టిన డబ్బులను స్వామివారు చెల్లించి జైలు నుంచి విడిపించిన కథనాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. పిల్లల వాదన చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే స్థానిక ప్రజానీకం ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. అదే సమయంలో తెలంగాణాలో కలిపే ఏ ప్రయత్నం చేసినా సహించేది లేదన్నారు. భద్రాచలానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి విద్య, ఉద్యోగ, నీరు, రవాణా, ఆరోగ్య రంగాలలో ముందుకు తీసుకెళ్లడం ద్వారానే ఇక్కడ నిజమైన అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఇకపై భద్రాచలం ఆంధ్రాలో విలీనం ప్రకటన వచ్చే వరకు సంతకాల సేకరణ, ధర్నాలు వంటి ఆందోళన కార్యక్రమాలు గ్రామ స్థాయి నుంచి చేపట్టనున్నట్లు తెలిపారు. భద్రాచలంను ప్రత్యేక జిల్లా చేసి ఆంధ్రాలో విలీనమయ్యే ప్రక్రియకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. వాస్తవ కోణంలో ఆలోచించి ఇకనైనా స్థానిక ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని, లేదంటే స్థానిక ప్రజానీకం దృష్టిలో చరిత్ర హీనులుగా మిగులుతారన్నారు. ఇదిలా ఉండగా సమావేశం జరుగుతున్న సమయంలో తెలంగాణవాదులు ఒక్కసారిగా వచ్చి అడ్డుకున్నారు. జై తెలంగాణ, ఆంధ్ర నాయకుల్లారా ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. పోలవరంనకు జాతీయ హోదా వచ్చిందని, ఏజెన్సీని ముంచెత్తే ప్రయత్నం చేస్తుంటే మీరెలా ఆంధ్రాలో విలీనం చేయాలని మద్దతు పలుకుతున్నారని నిలదీశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తారా స్థాయిలో వాదోపవాదాలు చోటు చేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు సున్నం వెంకటరమణ, పి వెంకన్నరాజు, చిచ్చడి శ్రీరామ్మూర్తి, కారం సత్తిబాబు, సున్నం లక్ష్మయ్య, మర్మం నర్సింహారావు, గొంది బాలయ్య, అపకా శ్రీను, నాగయ్య, వీరస్వామి, వేణు, మున్నావర్, ఆదినారాయణ, కృష్ణంరాజు, కొర్సా రాజు, మామిడి పుల్లారావు, అలవాల రాజా, ఆవుల సుబ్బారావు, పడిసిరి శ్రీను, బాదం జగదీశ్ తదితరులు ఉన్నారు.

గూడు చెదిరే... గోడు మిగిలే...
చింతూరు, ఆగస్టు 7: శబరి నది గత కొద్ది రోజులుగా ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. దీంతో మండలంలోని పలు గ్రామాలు నీట మునిగాయి. మంగళవారం శబరి ఉగ్రరూపం శాంతించింది. ఉద్ధృతి తగ్గడంతో నీట మునిగిన రోడ్లు, ఇళ్లు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. గత నాలుగు రోజులుగా వరదనీటిలో మునిగి ఉన్న పలు పూరిళ్లు నేడో రేపో కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వరదల నుంచి బయటపడటంతో ముంపునకు గురైన ఇళ్లను బాధితులు ఇప్పుడిప్పుడే శుభ్ర పర్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా శబరి బుధవారం సాయంత్రానికి 28 అడుగులకు చేరుకొని ప్రవహిస్తోంది. కాగా చీకటివాగు, సోకిలేరు, కుయుగూరు వాగులు ఇంకా రోడ్లపైనే ఉన్నాయి. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు నేటికీ పునరుద్ధరణ కాలేదు. వరదలు తగ్గడంతో బాధితులు బురదలోనే నడుచుకుంటూ ఇళ్లకు వెళ్లి ఒండ్రు పట్టిన ఇళ్లను శుభ్రపర్చుకుంటూ మట్టిని తొలగిస్తున్నారు. పూర్తిగా ముంపునకు గురైన ఇళ్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇప్పటి వరకు పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు కొన్ని ఇళ్లు బయటపడటంతో సామగ్రి, పిల్లా పాపలతో ఇళ్లకు పయనమయ్యేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. వారం రోజుల పాటు వరద నీటిలో నానిపోయిన తమ ఇళ్లు ఎలా ఉన్నాయోనని సగం మేర బయటపడ్డ ఇళ్లను బాధితులు పరిశీలించుకుంటున్నారు. ఇదిలా ఉండగా పూర్తిగా, పాక్షికంగా నీట మునిగిన, వరద చుట్టుముట్టిన ఇళ్లకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
వేలేరుపాడు మండలంలో..
వేలేరుపాడు: గత నెల 18 నుంచి పదే పదే వస్తున్న గోదావరి వరదలు వేలేరుపాడు మండల ప్రజలకు తీరని కష్టాలు మిగిల్చాయి. పదే పదే సంభవిస్తున్న వరదలకు గోదావరి పరీవాహక గ్రామాలైన రుద్రంకోట, రేపాకగొమ్ము, వేలేరుపాడు, తిర్లాపురం, తాట్గూరుగొమ్ము, నాళ్లవరం, చిగురుమామిడి, కట్కూరు, ఎడవెల్లి, కొయిదా, కాకిసనూరు, టేకుపల్లి, టేకూరు, పేరంటపల్లి గ్రామాల ప్రజలంతా ఇప్పటికే మూడుసార్లు ఇళ్లను ఖాళీ చేసి సామగ్రి సహా మెరక ప్రాంతాలకు తరలివెళ్లారు. వరదలు తగ్గడంతో మళ్లీ గృహాలకు చేరడం వంటి పనులతో విసిగెత్తిపోతున్నారు. ఈ సమయంలో ఇంట్లోని సామగ్రిని చాలా వరకు వదిలేయాల్సి వచ్చిందని వాపోతున్నారు. బుధవారం గోదావరి వరద ప్రవాహం తగ్గడంతో పునరావాస కేంద్రాల్లోని ప్రజలంతా మళ్లీ ఇళ్లకు సామగ్రిని తరలించే పనిలో అష్టకష్టాలు పడుతున్నారు. ఇలా ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి వారు పడే బాధలు వర్ణనాతీతం. ఇక వరదలు మిగిల్చిన దుర్గంధభరితమైన దుర్వాసనకు పలు రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. ఇక వేసిన పంటలన్నీ కోల్పోయి రైతుల్లో తీవ్ర నిరాశ నిస్ప్రహలు అలముకొన్నాయి. వరదల తాకిడికి కొన్ని ఇళ్లు కూలిపోగా పలు ఇళ్ల గోడలు పడిపోగా బాధితులు కన్నీరు పెడుతున్నారు. ఈ తరుణంలో చిల్లిగవ్వ లేని తమకు బతకష్టమే కష్టమనుకుంటే మళ్లీ ఇళ్లు నిర్మించుకోవడం ఎలా సాధ్యమని ఆందోళనకు గురౌతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పోలింగ్ బూత్‌ల ఏర్పాటుపై అభ్యంతరాలు
ఖమ్మం (ఖిల్లా), ఆగస్టు 7: కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లకు సంబంధించి ఏర్పాటు చేయనున్న ఎన్నికల పోలింగ్ బూత్‌ల ఏర్పాట్ల గురించి సిపిఐ, సిపిఎం, టిడిపి, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపి, టిఆర్‌ఎస్, లోక్‌సత్తా పార్టీలకు చెందిన నాయకులు తమ అభ్యంతరాలను తెలిపారు. బుధవారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ 11వ డివిజన్ పరిధి ఇల్లెందు క్రాస్ రోడ్ నుండి రోటరీనగర్ వరకు విస్తరించి ఎక్కువ పోలింగ్ బూత్‌లను కలిగి ఉందని, పోలింగ్ కేంద్రాలను వీలైనంత వరకు ఒకే చోట కాకుండ వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. అదే విధంగా డివిజన్ల పరిధిలోనే ఆ డివిజన్‌కు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వేరోక డివిజన్‌లో ఏర్పాటు చేస్తే సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. కొత్తగా కార్పొరేషన్‌లో కలిసిన ధంసలాపురం, అగ్రహారం గ్రామాలకు సంబంధించి సీతారామపురంలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాన్ని 37 డివిజన్‌కు కేంద్రంగా ఉన్న ఎస్‌విఎం స్కూల్లో ఏర్పాటు చేస్తే అందరికి అనూకూలంగా ఉంటుందన్నారు. అనేక అభ్యంరాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కమిషనర్ శ్రీనివాస్ సమాధానం చెబుతూ ఓటర్లకు సౌకర్యంగా ఉండేందుకు డివిజన్ ప్రాంతంలో రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రతి పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కొ పోలింగ్ బూత్‌లో 12వందల నుండి 1400 ఓటర్లు ఉంటారని తెలిపారు. గతంలో పోలింగ్ జరిగిన భవనాలలోనే ఇప్పుడు కూడ పోలింగ్‌కేంద్రాలను ఏర్పాటు చేసేందులు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ సమావేశంలో టిపివో అఖిల్, ఆర్‌ఐ శ్రీనివాస్, రాంరెడ్డి, రవీంధ్రబాబు, సత్యనారాయణరెడ్డి, సాంబశివారెడ్డి, ఎర్రా శ్రీకాంత్, పంతంగి వెంకటేశ్వర్లు, పెనుగొండ ఉపెందర్, దొడ్డా అశోక్, తోట రామారావు, తవిడిశెట్టి రామారావు తదితరులు పాల్గొన్నారు.

కళాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే యువజనోత్సవాలు
* కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్
ఖమ్మం(ఖిల్లా), ఆగస్టు 7: గ్రామీణ కళాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు యువజనోత్సవాలను ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక అంబేద్కర్ భవనంలో ఖమ్మం నియోజకవర్గ స్థాయి యువజనోత్సవాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో యువజనోత్సవాలు జిల్లా స్థాయిలో మాత్రమే జరిగేవని, ప్రస్తుతం కళాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు నియోజకవర్గ స్థాయిలో యువజనోత్సవాలు నిర్వహించటం జరుగుతుందన్నారు. అక్టోబర్ 1తో ఖమ్మం జిల్లా ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తవుతున్న దృష్ట్యా డైమండ్ జూబ్లీ ఉత్సవాలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 15నుంచి జనవరి 26వ తేదీ వరకు ఆరు నెలల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. జిల్లాలో నిరుద్యోగ శాతం అధికంగా ఉందని, ఉపాధి అవకాశాలు ఆశించిన మేరకు లేనందున ఈ సమస్య తలెత్తుతుందన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సెట్‌కం సిఇఓ ఎస్ వెంకటరంగయ్య మాట్లాడుతూ జానపద, గేయాలు, ఏకపాత్రాభినయం, హిందూస్థాని, కర్ణాటక సంగీత వాయిద్యాలు, హార్మోనియం, గిటార్, క్లాసికల్ డాన్స్, వక్తృత్వ, జానపద నృత్యం, క్విజ్, వ్యాసరచన, పెయింటింగ్ తదితర వాటిలో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఖమ్మం నియోజవర్గంలో నిర్వహించిన యువజనోత్సవాలకు అనూహ్య స్పందన లభించిందన్నారు. మొత్తం 291 ఎంట్రీలు వచ్చాయన్నారు. ఈ అంశాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన యువ కళాకారులకు నవంబర్‌లో జరిగే జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐటిడిఏ పిఓ వీరపాండ్యన్, భద్రాచలం సబ్ కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా, ఆర్డీవోలు సంజీవరెడ్డి, జడ్పీ సిఇఓ జయప్రకాశ్ నారాయణ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నాసిరకంగా రోడ్డు నిర్మాణ పనులు
* అడ్డుకున్న సిపిఎం నాయకులు
మధిర, ఆగస్టు 7: మండల పరిధిలోని ఆత్కూరు నుంచి మాటూరు క్రాస్‌రోడ్డు వరకు నిర్మిస్తున్న ఆర్ అండ్ బి రహదారి పనులు నాసిరకంగా ఉండటంతో బుధవారం సిపిఎం నాయకులు అడ్డుకొని నిలిపివేయించారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కమిటీ సభ్యులు ఎస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ మండల పరిధిలోని సిరిపురం - నెమలి, మధిర - తిరువూరు రహదారి మరమ్మతు పనుల కోసం 1.96కోట్లు మంజూరయ్యాయన్నారు. అయితే మధిర - తిరువూరు రహదారిలో తారు వేస్తున్న రోడ్డు నాసిరకంగా ఉండటంతోవేసిన రెండు రోజులకే చిప్స్‌తో కూడిన తారు లేచిపోయి గుంటలు గుంటలుగా ఏర్పడిందన్నారు. వాస్తవంగా రహదారి 25మిల్లి మీటర్ల మందంతో నిర్మించాల్సి ఉండగా సంబంధిత కాంట్రాక్టర్ మాత్రం కేవలం 18నుంచి 20మిల్లి మీటర్ల మందంతోనే రోడ్డును నిర్మిస్తున్నప్పటికీ ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. అదే విధంగా సైడ్‌బర్మ్‌లు మూడు అడుగులు వదిలిపెట్టి తారు రోడ్డును నిర్మించాల్సి ఉన్నప్పటికీ సైడ్‌బర్మ్‌ల నిర్మాణం చేయకుండానే రోడ్డును నిర్మిస్తుండటంతో అడ్డదిడ్డంగా ఉందని విమర్శించారు. రోడ్డు నిర్మాణ సమయంలో ఇతర వాహనాలు రహదారిపైకి రాకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదన్నారు. వర్షం కురుస్తున్న సమయంలో కూడా నిర్మించకూడదనే నిబంధన ఉన్నా దీనికి విరుద్ధంగా రోడ్డు నిర్మాణ పనులను కొనసాగిస్తున్నారని, దీని వల్ల రోడ్డుకు బీటలు వారే ప్రమాదముందన్నారు. రహదారి పనుల నిర్మాణం జరిగే సమయంలో ఆర్ అండ్ బి ఏఈతో పాటు డిఈ కూడా పర్యవేక్షణ జరపాల్సి ఉన్నప్పటికీ ఆ శాఖకు సంబంధించిన వారు ఎవరూ లేకుండానే ఇష్టం వచ్చిన రీతిలో కాంట్రాక్టర్ రోడ్డు పనులు చేస్తున్నాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా గత పది హేను రోజుల క్రితం నిర్మించిన దెందుకూరు - చిలుకూరు రోడ్డు రహదారి పనులు కూడా నాసిరకంగా చేయటం వల్ల పలు చోట్ల రహదారిపై గుంటలు ఏర్పడ్డాయని, రోడ్డు వేసిన తర్వాత సైడ్‌బర్మ్‌లు నిర్మించకపోవటంతో ఈ రోడ్డు ప్రమాదకరంగా మారిందన్నారు. అదే విధంగా ప్రస్తుతం జరుగుతున్న పనులకు ఎస్టీమేషన్ సమయంలో చేపట్టాల్సిన దాని కన్నా అదనంగా ఎస్టీమేషన్లు తయారు చేశారని ఆరోపించారు. ప్రజల సొమ్మును కాంట్రాక్టర్లు, అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, క్వాలిటీ కంట్రోల్ శాఖ అధికారులు మండలంలో జరుగుతున్న అన్ని రహదారి మరమ్మతు పనులను పరిశీలించి నాసిరకంగా నిర్మించిన కాంట్రాక్టర్లపై, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలిన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండవ కృష్ణారావు, ఆవుల శ్రీనివాసరావు, వైవి అప్పారావు, వేముల శ్రీనివాసరావు, ఎస్‌కె మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

మణుగూరులో సిపిఎం ర్యాలీ
మణుగూరు, ఆగస్టు 7: పశ్చిమబెంగాల్‌లో సిపిఎం కార్యకర్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ హత్యా రాజకీయాలను ఖండిస్తూ బుధవారం మణుగూరు సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఈ ర్యాలీ స్థానిక ఆంధ్రబ్యాంకు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ పశ్చిమబెంగాల్‌లో తృణముల్ కాంగ్రెస్ చేస్తున్న నిరంకుశ దాడి దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమన్నారు. పశ్చిమబెంగాల్‌లో తుపాకీలతో, ఆంధ్రరాష్ట్రంలో డబ్బుతో ప్రజాస్వామ్యం కూని అవుతోందన్నారు. సిపిఎం కార్యకర్తలపై నిర్బంధకాండను కొనసాగిస్తే భవిష్యత్‌లో తృణముల్ కాంగ్రెస్ పతనం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాటబోయిన నాగేశ్వరరావు, నెల్లూరి నాగేశ్వరరావు, రావులపల్లి రామ్మూర్తి, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, నయనారపు నాగేశ్వరరావు, గద్దల శ్రీనివాసరావు, బండి రాజేష్, సమితిసింగారం ఉపసర్పంచ్ బోడ నాగమ్మ, ఎస్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

తగ్గుముఖం పట్టిన గోదావరి
కూనవరం, ఆగస్టు 7: గత కొద్ది రోజులుగా తీవ్రరూపం దాల్చి ప్రవహించిన వరద గోదావరి నెమ్మదిగా తగ్గుతోంది. బుధవారం సాయంత్రంకు 36 అడుగులకు చేరి క్రమంగా తగ్గుతోంది. కొండ్రాజుపేట కాజ్‌వేపై వారం రోజులుగా వరదనీరు నిలిచే ఉంది. దీంతో సుమారు పది గిరిజన గ్రామాలకు రాకపోకలు నాటి నుంచి నేటి వరకు పునరుద్ధరణ కాలేదు. వారం రోజులుగా పంట చేలపై వరద ప్రవహించడంతో పత్తి చేలు పూర్తిగా నాశమయ్యాయి. వరదలు తగ్గుముఖం పట్టడంతో విద్యుత్ శాఖాధికారులు మండలానికి విద్యుత్‌ను పునరుద్ధరించారు. రోడ్లపై ఉన్న వరదనీరు తగ్గడంతో భద్రాచలం నుంచి కూనవరం, వి.ఆర్.పురం మండలాలకు రాకపోకలు ప్రారంభమయ్యాయి. వరద ఉద్ధృతికి పోలిపాక వద్ద ప్రధాన రహదారి మూడు చోట్ల కొట్టుకుపోయింది. దీంతో ఆర్‌అండ్‌బి అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి రవాణాకు చర్యలు చేపట్టారు. రెవెన్యూ శాఖాధికారులు వరద ముంపునకు గురైన ఇళ్లను సర్వే చేస్తున్నారు. వ్యవసాయ శాఖాధికారులు మండలంలో పర్యటిస్తూ ముంపునకు గురైన పంట పొలాలను సర్వే చేపడుతున్నారు. ఇదిలా ఉండగా వరద ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులను బుధవారం డిపిఓ పి ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. వరదనీరు చేరిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చేపడుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించేందుకే తాను వచ్చానని, స్థానిక అధికారులతో 14 ప్రత్యేక బృందాలను జిల్లాలో నియమించామన్నారు. డిఎల్పీఓ ఆర్ ఆశలత, ఈఓఆర్డీ ఎ సత్యనారాయణ, ఈఓ ఆర్ సత్యనారాయణ, సర్పంచ్ కట్టం సునీత తదితరులు పాల్గొన్నారు.

24 క్రస్ట్‌గేట్ల ఎత్తివేతతో
సాగర్‌డ్యాం నుండి కృష్ణమ్మ పరవళ్లు

విజయపురిసౌత్, ఆగస్టు 7: శ్రీశైలం జలాశయం నుండి నాగార్జున సాగర్‌కు బుధవారం 4.50 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో సాగర్ జలాశయం గరిష్టస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో కృష్ణమ్మతల్లికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ యల్లారెడ్డి, ఎస్‌ఇ ఉదయరంజన్, డిఇ అంజ య్య సాంప్రదాయబద్ధం గా, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్విచాన్ చేసి క్రస్ట్‌గేట్లను ఎత్తారు. తొలుత 14వ నంబర్‌తోపాటు ఆరుగేట్లను ఐదడుగుల మేరకు ఎత్తి 40వేల క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణానదీలోకి వదిలారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో ఆరుక్రస్ట్‌గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. శ్రీశైలం నుండి వరదనీరు ఉద్ధృతి పెరగడంతో సాయంత్రం మరో 12గేట్లను ఎత్తారు. ఎగువ జలాశయాలైన జూరాల, రోజాప్రాజెక్టుల నుండి శ్రీశైలానికి 3.44లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుండి సాగర్‌కు 4.80లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండటంతో సాగర్ నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 585.80అడుగులకు చేరుకుంది. ఇది 306.90 టిఎంసిలకు సమానం, సాగర్ జలాశయం నుండి కుడి కాలువకు 8,006, ఎడమ కాలువకు ఎనిమిదివేల క్యూసెక్కులను, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 33,047, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుండి మొత్తం 1,92,567 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం 883.90 అడుగుల వద్ద కొనసాగుతుంది. ఇది 209 టిఎంసిలకు సమానమని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

*ఇప్పటికే ముగ్గురి ఆత్మహత్య *అయినా స్పందించని ప్రభుత్వం
english title: 
v
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>