Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ఆశల పల్లకిలో అభ్యర్థులు

$
0
0

కడప,మే 7: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలో బుధవారం జరిగిన పోలింగ్‌లో జిల్లా వ్యాప్తంగా దాడులు, విధ్వంసాలు, ఘర్షణలు చోటుచేసుకున్నా ఓటర్లు వాటిని లెక్కచేయకుండా ఓటు హక్కును జిల్లా వ్యాప్తంగా 76.41 మంది వినియోగించుకున్నారు. అత్యధికంగా కమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్‌లో 84.82 శాతం మంది, అతి స్వల్పంగా కడప అసెంబ్లీ సెగ్మెంట్‌లో 55.99శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక జమ్మలమడుగు అసెంబ్లీ సెగ్మెంట్‌లో 82శాతం, ప్రొద్దుటూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో 77.80శాతం, మైదుకూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో 78.5శాతం, రైల్వేకోడూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో 74శాతం, పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్‌లో 80శాతం, రాయచోటి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 74.95 శాతం, రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో 78శాతం, బద్వేలు అసెంబ్లీసెగ్మెంట్ లో 75శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో వాతావరణం ఉదయం 10గంటల వరకు,సాయంత్రం 4 గంటల తరువాత పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. అన్ని నియోజకవర్గాల్లో 74 శాతం మొదలుకుని, 82 శాతం వరకు ఓటింగ్ జరిగింది. అయితే నేతలు మాత్రం గెలుపుధీమాతో ఆశల పల్లకిలో ఊగిపోతున్నారు. ఓటరు నాడి మాత్రం అంతుపట్టడంలేదు. జిల్లాలో రెండుపార్లమెంట్, పది అసెంబ్లీ సెగ్మెంట్లలలో 21,61,324 మంది ఓటర్లుండగా పురుషులు 10,62,658 మంది, మహిళలు 10,98,385మందిలో తమ ఓటు హక్కును 76.41 శాతం వినియోగించుకున్నారు. జిల్లాలో మహిళా ఓటర్లే 35,627 మంది పురుష ఓటర్లకంటే అధికంగా ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే కీలకంగా ఉన్నారు. బుధవారం జరిగిన పోలింగ్‌లో కడప పార్లమెంటరీ నియోజకవర్గంలో 1798, పది అసెంబ్లీ సెగ్మెంట్లలో 2,540 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కులో 76.41 మంది వినియోగించుకున్నారు. కాగా నియోజకవర్గాల వారీగా పోలింగ్ ప్రక్రియ తీసుకుంటే బద్వేలు పురుషులు 1,09,300లు, మహిళలు 1,06,581 ఓటర్లలో 75శాతం, రాజంపేట పురుషులు 1,01,510, మహిళలు 1,08,376 ఓటర్లలో 78శాతం, కడప పురుషులు 1,34,508 మంది, మహిళలు 1,35,504 ఓటర్లలో 58.99శాతం, రైల్వేకోడూరు పురుషులు 85,492 మంది, మహిళలు 91,089 ఓటర్లలో 74శాతం, రాయచోటి పురుషులు 1,11,978మంది, మహిళలు 1,13,710 ఓటర్లలో 74.95శాతం, పులివెందుల పురుషులు 1,11,111 మంది, మహిళలు 1,13,882 ఓటర్లలో 80శాతం, కమలాపురం పురుషులు 92,189 మంది, మహిళలు 94,798 ఓటర్లలో 84.82శాతం, జమ్మలమడుగు పురుషులు 1,10.882 మంది, మహిళలు 1,10,817 ఓటర్లలో 82శాతం, ప్రొద్దుటూరు పురుషులు 1,19,554 మంది, మహిళలు 1,18,908 ఓటర్లలో 77.80శాతం, మైదుకూరు పురుషులు 95,694మంది, మహిళలు 99,259 ఓటర్లలో 78.5శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోలింగ్‌లో ఫ్యాక్షన్
ఆంధ్రభూమి బ్యూరో
కడప, మే 7: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బుధవారం జిల్లాలో జరిగిన ఎన్నికల్లో ఏకంగా పోలీసు అధికారులపై దాడులుచేసి వారి వాహనాలు ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థుల వాహనాలను ధ్వంసంచేసి, కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాసరెడ్డి వాహనాన్ని తగులబెట్టారు. అలాగే టిడిపి నేతలకు చెందిన మరో రెండు వాహనాలు, వైకాపాకు చెందిన ఒక వాహనాన్ని ధ్వంసం చేశారు. పలు నియోజకవర్గాల్లో వైకాపా, టిడిపి కార్యకర్తల, నేతల మద్య రాళ్లవర్షం, మారుణాయుధాలతో దాడి చేసుకున్నారు. ఈ సంఘటనలో ఇరుపార్టీలకు చెందిన 50 మంది కార్యకర్తలు, నేతలు గాయపడ్డారు. ఫ్యాక్షన్ గ్రామాల్లో యధేచ్చగా, ఏకపక్షంగా ఓటింగ్ జరిగింది. పులివెందులలో పోలింగ్ ముగిసే సమయంలో వైకాపా దొంగ ఓట్లు వేసుకుంటుండగా తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్వీ సతీష్‌కుమార్‌డ్డి, కాంగ్రెస్ డిసిసి ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకోగా అప్పటికే అక్కడికి చేరుకున్న వైకాపా నేతలు మంగళి కృష్ణప్ప, భాస్కర్‌రెడ్డి, వైసీపీ నేతలు, కార్యకర్తలు వెళ్లారు. దీంతో ఇరువర్గాల మద్య మాటమాట పెరిగి వైకాపా నేతలపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లవర్షం కురిపించడంతో ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు సతీష్‌రెడ్డి వాహనాన్ని ధ్వంసంచేసి, శ్రీనివాసరెడ్డి వాహనాన్ని తగులబెట్టారు. ఈసంఘటనలో వైకాపా నేత భాస్కర్‌రెడ్డికి గాయాలయ్యాయి. కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదినె్న మండలం ఎర్రమాచుపల్లెలో టిడిపి వల్లూరు జెడ్పిటిసి అభ్యర్థి పుత్తా లక్ష్మిరెడ్డి, వైకాపా యువనాయకుడు, మాజీ ఎమ్మెల్యే శివానందరెడ్డి తనయుడు నానిలు పోలింగ్ ముగిసే సమయానికివెళ్లి పరస్పరం మాటమాట పెరిగి ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో వారి ఇరువురి వాహనాలు ధ్వంసం చేశారు. అనంతరం పుత్తాలక్ష్మిరెడ్డి అనుచరులు గ్రామంపై మూకుమ్మడిగా దాడులు చేయడంతో ఆ గ్రామస్తులంతా కడప -పులివెందుల ప్రధాన రహదారిపై వందలాది మంది లక్ష్మిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఈ సంఘటన తెలుసుకుని కడప డిఎస్పీ రాజేశ్వరరెడ్డి భారీ పోలీసు బలగాలతో మోహరించిన ఆందోళన కొనసాగింది. ఇక జిల్లాలో సంఘటనల విషయానికొస్తే ఫ్యాక్షన్‌కు నిలయమైన జమ్మలమడుగు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి సి.ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ సి.నారాయణరెడ్డి సొంత ఇలాఖా అయిన దేవగుడిలో శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం స్వయంగా పోలీసు అధికారులే వెళ్లారు. దేవగుడికి ఇరువురు ఐపిఎస్ అధికారులు, జమ్మలమడుగు ఎఎస్పీ వెంకట అప్పలనాయుడు, బెటాలియన్ కమాండెంట్ రాజేష్‌కుమార్‌లు తమ సిబ్బందితో వెళ్లారు. అక్కడ పోలింగ్ కేంద్రంలో ఓటర్లు వరుస తప్పి గుంపులు గుంపులుగా ఉండగా వారందర్నీ క్యూలో నిలుచుకుని ఓటేసు కోవాలని సూచించారు. దీంతో అక్కడి వైకాపా నేతలు, కార్యకర్తలు అధికారులపై తిరగబడి వాహనాలు ధ్వంసం చేశారు. వైకాపా కార్యకర్తల దాడిలో సిద్దారెడ్డి, బాబు అనే కానిస్టేబుళ్లు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న రాయలసీమ జోన్ ఐజి నవీన్ చంద్ ఈప్రాంతానికి ఎన్నికల అధికారిగా నియామకం చేసిన డిఐజి ఎం.సురేంద్రబాబులు హుటాహుటిని భారీ బలగాలతో వెళ్లి జమ్మలమడుగులో మకాంవేసి దేవగుడికి భారీ పోలీసు బలగాలు పంపి అక్కడ ఉన్న అధికారులను రప్పించారు. అలాగే దేవగుడి ఇలాఖా అయిన గొరిగనూరు పోలింగ్ కేంద్రంలో టిడిపి ఏజెంట్‌గా కూర్చోబెట్టడానికి రాజారెడ్డి అనే వ్యక్తిని టిడిపి అసెంబ్లీ అభ్యర్థి పి.రామసుబ్బారెడ్డి స్వయంగా తీసుకెళ్లారు. అక్కడ వైకాపా నేతలు ఏజెంట్ ఫారాలు చించి ఆయన్ను కిడ్నాప్‌చేశారు. పి.రామసుబ్బారెడ్డి వారిని ప్రశ్నించగా ఆయన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. అలాగే జమ్మలమడుగు పెద్ద ముడియం మండలం కొండ సుంకేసులలో వైకాపా, టిడిపిలు ముష్టియుద్ధానికి దిగి ఘర్షణపడ్డారు. మైదుకూరు అసెంబ్లీ చాపాడు మండలం అయ్యవారిపల్లెలో టిడిపి ఏజెంట్ వెంకటసుబ్బయ్యపై వైకాపా నేతలు దాడిచేయగా, కుచ్చుపాపలో టిడిపి ఏజెంట్ లక్ష్మినారాయణను వైకాపా నేతలు, పల్లవోలులో టిడిపి ఏజెంట్ రామాంజనేయులు, ఆయన కుమారుతు మారుతీకుమార్, తిప్పిరెడ్డిపల్లె చల్లాలక్ష్మినారాయణ, సిద్ధయ్య, శ్రీనివాసులపై వైకాపా నేతలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. వైకాపా అభ్యర్థి ఎస్.రఘురామిరెడ్డి సొంత ఊరికి టిడిపి అభ్యర్థి పుట్టాసుధాకర్ యాదవ్‌రాకతో వైకాపా నేతలు ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. విశ్వనాధపురం పోలింగ్ కేంద్రానికి వైకాపా అభ్యర్థి వెళ్లగా టిడిపి కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఆయన వాహనంతోపాటు ఆయనకు షాడోగా అనుసరించి పోలీసు, ఎన్నికల అధికారుల కార్లు ధ్వంసం అయ్యాయి. బి.మఠం మండలం ముడుమాల, చెంచయ్యగారిపల్లె వైసిపి, టిడిపి పరస్పరం కలబడి రాళ్లవర్షం కురిపించుకున్నారు. దువ్వూరు ఉర్దూ పాఠశాల పోలింగ్ కేంద్రంలో సిఐ రమణ ఏకపక్షంగా వ్యవహరిస్తు వైకాపాకు వంత పాడటంతో టిడిపి కార్యకర్తలు ఆయనపై తిరగబడి తరుముకున్నారు. కమలాపురం నియోజకవర్గంలో వీరపునాయునిపల్లె మండలం ఓబులరెడ్డిగారిపల్లెలో వైకాపా గ్రూపులోనే ఇరువర్గాల వారు కలబడి రాళ్లవర్షం కురిపించుకుని ఐదుమందికి తీవ్రగాయాలయ్యాయి. అలాగే చింతకొమ్మదినె్న మండల ఎర్రమాచుపల్లెలో టిడిపి, వైకాపా నేతలు, కార్యకర్తలు కలబడి రాళ్లవర్షం కురిపించారు. ఇక రైల్వేకోడూరు విషయానికొస్తే వైకాపా అభ్యర్థి కె.శ్రీనివాసులు సొంత స్వగ్రామమైన రెడ్డివారిపల్లెలో టిడిపి, వైకాపా అభ్యర్థులు పరస్పరం ఏకధాటిగా మూడుగంటలపాటు రాళ్లవర్షం కురిపించడంతో అక్కడ ఉన్న భారీ పోలీసు బలగాలు కూడా పారిపోయారు. తమ రక్షణ నిమిత్తం ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు గాలిలో రెండు పర్యాయాలు కాల్పులు జరిపారు. ఉన్నతాధికారులు వచ్చేవరకు సంఘటన సద్దుమణగలేదు. ఈ సంఘటనలో పదిమంది పైబడి తీవ్రంగా గాయపడ్డారు. అలాగే రాజంపేట అసెంబ్లీలోని రోళ్లమడుగు, బాలరాజుపల్లె పోలింగ్ కేంద్రాల్లో వైసిపి, టిడిపి నేతలు కలబడి కత్తులు, కొడవళ్లు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో ఆరుమంది తీవ్రంగా గాయపడ్డారు. రాయచోటి అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందిర రామాపురం కలపనాయునిచెరువులో వైకాపా ఏకపక్షంగా ఓట్లు వేసుకుంటుండగా టిడిపి, వైకాపా నేతలు ఘర్షణకు దిగి గాయాలపాలయ్యారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత ఇలాఖా అయిన నియోజకవర్గ కేంద్రంలోని రవీంద్రనాధ్ స్కూల్‌లో పోలింగ్ ముగిసే సమయానికి టిడిపి అభ్యర్థి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిలు రిగ్గింగ్ జరుగుతుందని వెళ్లగా అక్కడ వైకాపా నేతలు మోహరించి ఇరువర్గాలు పరస్పరం కలబడి సతీష్‌రెడ్డి వాహనాన్ని ధ్వంసంచేసి, శ్రీనివాసరెడ్డి వాహనాన్ని తగులబెట్టారు. ఈ తరహాలో జిల్లా మొత్తం ఎన్నికలు ముగిసిన తమకు అనుకూలంగా ఓట్లుపడలేదని తమను నట్టేట ముంచారని పరస్పరం ఇరుపార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తల్లో కోపం కట్టలుతెంచుకుని వచ్చి ఘర్షణలకు దిగుతున్నారు. పోలీసులు హడావిడి, ప్రకటనలు తప్ప శాంతి భద్రతలు కాపాడటంలో పూర్తిగా విఫలయ్యారనే ఆరోపణలు జోరుగా విన్పిస్తున్నాయి.

ఓటేసిన కలెక్టర్
కడప (అర్బన్), మే 7:వైఎస్సార్ జిల్లాలో బుధవారం జరిగిన సార్వత్రి ఎన్నికల్లో తమ ఓటు హక్కును జిల్లా కలెక్టర్ కోన శశిధర్ వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 61లో జిల్లాకలెక్టర్ వేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రెండు పార్లమెంట్ 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం ఓటింగ్ ప్రారంభంలో కొన్ని పోలింగ్ స్టేషన్లల్లో ఈవిఎంలు మొరాయించి నా సెక్టోరల్ అధికారుల వద్ద నున్న ఈవి ఎంలతో సర్దుబాటు చేయడం జరిగిందన్నారు. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగుతున్నందున ఓటర్లందరూ పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో చాలినంత పోలీసు బలగాలు ఎన్నికల విధుల్లో ఉన్నారని తెల్పుతూ ప్రజలు ప్రశాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
పులివెందులలో
ఓటేసిన జగన్, విజయమ్మ
పులివెందుల రూరల్, మే 7: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. బుధవారం ఉదయం 8:30గంటలకు పట్టణంలోని బాక్రాపురంలో ఉన్న 124వ నెంబరు గల పోలింగ్ బూత్‌లో తన ఓటును వేశారు. వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయలక్ష్మి, మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి, వైకాపా పార్లమెంటు అభ్యర్థి వైఎస్.అవినాష్‌రెడ్డి, వైఎస్.షర్మిల, వైఎస్.్భరతి, వైఎస్.్భస్కర్‌రెడ్డి, ఇసి.గంగిరెడ్డి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే వేంపల్లెలో తెలుగుదేశంపార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎస్‌వి.సతీష్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి సుమతి, ఆయన సోదరుడు విష్ణువర్ధన్‌రెడ్డి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా పట్టణంలోని పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఫ్యాక్షన్ గ్రామాల్లో పోలింగ్ ఏకపక్షం!
ఆంధ్రభూమి బ్యూరో
కడప, మే 7: ఫ్యాక్షన్‌కు నిలయమైన పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు అసెంబ్లీ సెగ్మెంట్లలో పలుపోలింగ్ కేంద్రాల్లో మళ్లీ ఏకపక్షంగానే ఓటింగ్ జరిగినట్లు బుధవారం జరిగిన పోలింగ్‌లో తేటతెల్లమైంది. ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో దిట్ట అయిన వైకాపా నేతలు సంబంధిత ప్రాంతాల్లో విధ్వంసాలకు పాల్పడి పంతం నెగ్గించుకుని ఓటింగ్‌ను తమకు అనుకూలంగా మలుచుకున్నట్లు సంబంధిత ప్రాంతాల నేతలే బాహాటంగా చెబుతున్నారు. టిడిపి అధిష్టానం, కడప దేశం ఎంపి అభ్యర్థి ఆర్.శ్రీనివాసరెడ్డి ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో జరిగిన అక్రమాలు, వైకాపా నేతలు బుధవారం అనుసరించిన విధానాలు, జరిగిన సంఘటనలపై ఎన్నికల కమిషన్‌కు, జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదుచేసినా ఏమాత్రం లాభం చేకూరలేదు. సాక్షాత్తు ఇరువురు పోలీసు అధికారులను, కానిస్టేబుళ్లపై దాడులుచేసి వారి వాహనాలు ధ్వంసంచేసినా సంఘటన జరిగి 12 గంటలైన ఇంతవరకు ఎవరిమీద కేసులు బనాయించాలో వారికే అర్థంకావడంలేదు. దశాబ్దాల కాలం నుంచి బ్యాలెట్‌ను చూడని ఓటర్లు ఈ ఎన్నికల్లో కూడా బ్యాలెట్‌ను చూడలేదు. ఫ్యాక్షన్ గ్రామాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ జరిపించేందుకు తెలుగుదేశం కడప పార్లమెంట్ అభ్యర్థి ఆర్.శ్రీనివాసరెడ్డి గళ్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నికల కమిషన్‌ను సంబంధిత అధికారులను కలిసి ప్రశాంతంగా అందరూ ఓటు వినియోగించుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. చివరకు సంబంధిత ప్రాంతాల్లో టిడిపి తరపున పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను స్థానికేతరులను పెట్టేందుకు ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకొచ్చారు. తెలివిగా వైకాపా నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి టిడిపి నేతల ప్రయత్నాలకు నీళ్లుచల్లి పథకం ప్రకారమే సంబంధిత ప్రాంతాల్లో ఏకపక్షంగా ఓట్లు వేయించుకున్నారు. గతంలో జరిగిన ఎన్నికల కంటే ఈమారు ఏకపక్షంగా ఓటింగ్ కొన్నిప్రాంతాల్లో టిడిపి నేతల పుణ్యమా అని ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో వైకాపా నేతలు విధ్వంసాలు, దాడులు చేసినప్పటికీ టిడిపి నాయకులు జడసకుండా ఓటర్లకు, తమ అనుచరగణానికి అండగా నిలిచారు. మైదుకూరు, పులివెందుల నియోజకవర్గాల్లో స్వపక్షంలోనే అనుకూల శత్రువులతో టిడిపి అధిష్టానం, కడప ఎంపి అభ్యర్థి ఆర్.శ్రీనివాసరెడ్డి అనుకున్న వ్యూహం ఫలించలేదు. అయితే సంబంధిత నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని శ్రీనివాసరెడ్డికే అనుకూలంగా ఉండవచ్చునని పలువురు భావిస్తున్నారు.

వైకాపా, టిడిపి బాహాబాహీ
ప్రొద్దుటూరు, మే 7: బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాలలోని పలుచోట్ల తెలుగుదేశం, వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలకు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో గాయాలయ్యాయి. ఆయా ప్రాంతాల్లో గాయపడిన కార్యకర్తలను కడప, ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ప్రొద్దుటూరు 12వ వార్డులోని 23వ పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘర్షణలో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి వి ఎస్.ముక్తియార్ వాహనం ధ్వంసమయింది. శంకరాపురం, చిన్నశెట్టిపల్లె తదితర గ్రామాలలో కూడా చిన్నపాటి ఘర్షణలు జరిగాయి. ఈ సంఘటనలో వైకాపా, టిడిపిలకు చెందిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అదేవిధంగా మైదుకూరు నియోజకవర్గంలో చాపాడు మండలం నక్కలదినె్న గ్రామంలో టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌పై వైకాపా నాయకులు దాడిచేసి వాహనాన్ని ధ్వంసం చేశారు. తప్పెట ఓబాయపల్లెలో ఆ రెండు పార్టీల మధ్య ఘర్షణలు జరిగాయి. మైదుకూరు మండలంలోని ఎన్. ఎర్రబల్లెలో వైసిపి ఏజెంట్లను టిడిపి నేతలు కొట్టి బయటకు పంపడంతో పరామర్శించేందుకు వెళ్లిన వైకాపా అభ్యర్థి రఘురామిరెడ్డిపై రాళ్ల వర్షం కురిపించారు. అదేవిధంగా బి.మఠం మండలంలోని చెంచయ్యగారిపల్లె, పి.కొత్తపల్లె, గొడ్డవీడు తదితర గ్రామాలలో వైకాపా, టిడిపి నేతల మధ్య ఘర్షణలు జరిగి రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దువ్వూరులో టిడిపి కార్యకర్తలు, వైకాపా అభ్యర్థి రఘురామిరెడ్డి తనయుడు నాగిరెడ్డిపై రాళ్లతో దాడిచేశారు. ఈ సందర్భంగా వైకాపా, టిడిపి నేతల మధ్య ఘర్షణ చెలరేగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టారు. ఖాజీపేట మండలం తవ్వారుపల్లెలో కూడా ఆ రెండు పార్టీల మధ్య ఘర్షణలు జరిగాయి. అదేవిధంగా దేవగుడి గ్రామంలో ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతున్నాయని టిడిపి నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు చేరుకొని వైకాపా నేతలపై లాఠీచార్జ్ చేయడంతో ప్రజలు తిరగబడి పోలీసుల వాహనాలను ధ్వంసం చేయడంతోపాటు పోలీసులపై కూడా చేయి చేసుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బద్వేలు నియోజకవర్గంలోని పుట్టంపల్లె గ్రామంలో వైకాపా, టిడిపిల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.

9న సయ్యద్ మీర్‌షా ఖాద్రీ ఉరుసు
కడప(కల్చరల్), మే 7: కడప నగరంలోని బెల్లంమండి వీధిలోని హజరత్ ఖాజి సయ్యద్ మీర్‌షా ఖదీరి చిష్టి బందానవాజ్ సాహెబ్ 20వ ఉరుసు ఉత్సవం పీఠాధిపతి సయ్యద్ మున్వర్ బాష ఖాద్రి ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదిన శుక్రవారం వైభవంగా జరుగుతుందని దర్గాకమిటీ కార్యదర్శి సయ్యద్ జహంగీర్‌బాష ఒక ప్రకటనలో తెలిపారు. ఉరుసు రోజు రాత్రి 8గంటలకు అన్నదానం, ఫాతెహాఖాని, నాత్‌ఖాని, ఫకీరుల మేళ తాళాలతో సమాధిపై గంధం, పూలచాందిని సమర్పణ అనంతరం తబర్రుక్ (ప్రసాదం) భక్తులకు పంపిణీ చేస్తారన్నారు. ఈకార్యక్రమంలో ఆస్థాన-పీఠాధిపతులు ప్రముఖ ఉర్దూకవులు, ఆధ్యాత్మిక ప్రసంగీకులు పాల్గొంటారని ఆయన కోరారు.
10న కాశిరెడ్డినాయన ఆరాధన మహోత్సవం
కడప (కల్చరల్), మే 7: కడప-రాయచోటికి వెళ్లే రహదారిలో భగత్‌సింగ్‌నగర్‌లో వెలసివున్న అవధూత కాశిరెడ్డినాయన సప్తమ ఆరాధన మహోత్సవాలు ఈనెల 10వ తేదిన వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త జె.ఈశ్వరమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 5 గంటలకు స్వామివారి అభిషేకం, 6 గంటలకు రుద్రాభిషేకం, 8 గంటలకు నైవేద్యం భక్తులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉదయం 10 గంటలకు వృషభరాజములచే బండలాగుడు పోటీలు జరుగుతుందన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన వృషభరాజముల యజమానులకు ప్రథమ బహుమతి 25వేలు, ద్వితీయ బహుమతలి 15వేలు, తృతీయ బహుమతి 10 వేలు, నాల్గవ బహుమతి 5,116 ఇవ్వబడుతుందన్నారు.జ్యోతులతో స్వామి వారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. భక్తులు, ప్రజలు పెద్దఎత్తున ఆరాధన మహోత్సవంలో పాల్గొని ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆమె కోరారు.
12 నుండి నరసింహస్వామి జయంతి
కడప (కల్చరల్), మే 7:కడప నగరం మోచంపేటలోని అహోబిలం మఠంలోని లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో స్వామివారి జయంతి మహోత్సవాలు ఈనెల 12,13 తేదీలలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు అహోబిల మఠం నిర్వహకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తాదులందరూ స్వామి వారికి అవతార మహోత్సవాలను తిలకించి వారి కృపాకటాక్షములను పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
9న ఉత్తమ ఉపాధ్యాయుల సమావేశం
కడప (కల్చరల్), మే 7:జిల్లా పరిషత్‌లోని డిసిఇబి హాల్‌లో ఈనెల 9వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉత్తమ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహిస్తున్నట్లు అవార్డీ టీచర్స్ అసోసియేషన్ కడప జిల్లా కోశాధికారి నూక ఆదినారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో 2013 అవార్డీ టీచర్లకు సన్మానం,జిల్లా కార్యవర్గం ఏర్పాటు, హౌస్‌బిల్డింగ్ సభ్యుల ఏర్పాటు, ఛలో హైదరాబాద్‌లపై చర్చజరుగుతుందన్నారు. ఈ సమావేశానికి ఉత్తమ ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులందరూ పాల్గొని తమ సలహాలు, సూచనలు ఇచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.
60 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సిద్దవటం, మే 7: సిద్దవటం రేంజ్ మద్దూరు బీటులోని అరిబాట సమీపంలో బుధవారం అటవీశాఖ అధికారులు 60 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున తరలింపు కోసం స్మగ్లర్లు, కూలీలు ప్రయత్నించారు. ఫారెస్ అధికారి సుబ్బరాయుడు, డీ ఆర్వో లక్ష్మీనారాయణ, బీట్ అధికారి గంగాధర్,సిబ్బందితో వెళ్లి దాడ

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలో బుధవారం జరిగిన పోలింగ్‌లో జిల్లా వ్యాప్తంగా దాడులు, విధ్వంసాలు, ఘర్షణలు
english title: 
a

పో(ఓ)టెత్తిన ఓటర్లు

$
0
0

కర్నూలు, మే 7 : జిల్లావ్యాప్తంగా బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికలు చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 14 శాసన సభ, రెండు లోక్‌సభ స్థానాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. బనగానపల్లె పట్టణంలో తెలుగుదేశం, వైకాపా కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో టిడిపి కార్యకర్తలు ఇద్దరు గాయపడగా అవుకు మండలంలోని రామాపురం గ్రామంలో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాటసాని రామిరెడ్డిని పోలింగ్ ముగిసే వరకు పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆళ్లగడ్డలో టిడిపి, వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇంతకు మించి పెద్ద సంఘటనలేవీ జరుగకపోవడంతో అధికారులు, ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు ఊపిరి పీల్చుకున్నారు. పత్తికొండ పట్టణంలోని ఒక పోలింగ్ బూత్‌లో అధికారి నిబంధనలకు వ్యతిరేకంగా బ్యాలెట్ యూనిట్లను బహిరంగంగా ఉంచడం, ఒకపార్టీకి అనుకూలంగా ఓటేయాలని ఓటర్లకు చెప్పడం వివాదాస్పదంగా మారడంతో కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి అధికారిని విధులను తప్పించడంతో సమస్య సద్దుమణిగింది. ఉదయం 11 గంటల సమయానికి జిల్లావ్యాప్తంగా 42 శాతం పోలింగ్ నమోదు కాగా ఆ తర్వాత ఎండ వేడి కారణంగా ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తిని కనపర్చలేదు. తిరిగి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ఊపందుకుంది. ఈసారి ఎన్నికల్లో పట్టణాల్లో ఓటింగ్ శాతం పెరిగిందని అధికారులు వెల్లడిస్తున్నారు. కాగా జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజేతలెవరో తేల్చడం విశే్లషకులకు కష్టసాధ్యంగా మారింది. పట్టణాల్లో చాలామంది ఓటు ఓటేసేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించడం, క్రాస్ ఓటింగ్, ఓట్ల చీలిక తదితర అంశాలపై ఎవరు గెలుస్తారో అని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం, వైకాపాలు సమాన స్థాయిలో విజేతలుగా నిలిచే అవకాశం ఉందని పలువురు అనుకుంటున్నారు. ఏదైనా మార్పులు చోటు చేసుకుంటే ఏదో ఒక పార్టీకి ఒకస్థానం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పరిస్థితి ఆ పార్టీ చరిత్రలో లేని విధంగా దయనీయ పరిస్థితిలో ఉందని వెల్లడిసున్నారు. ఒకటి, రెండు నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ మూడవ స్థానంలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి ఎస్పీవై రెడ్డి మరోమారు విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. కర్నూలు లోక్‌సభ స్థానంలో వైకాపా ఊహించినంత ఊపు కనిపించడం లేదని విశే్లషకులు పేర్కొంటున్నారు. ఈ స్థానంలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కర్నూలు, కోడుమూరు, ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి అనుకూలంగా ఓట్లు పడ్డాని అంటున్నారు. ఇదే జరిగితే ఆయన విజేతగా నిలవవచ్చని అంచనాకు వస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వైకాపా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఓట్లు పడ్డాయని, దీంతో కర్నూలు ఎంపి విజేత ఎవరో తేల్చి చెప్పడానికి విశే్లషకులు సంశయం వ్యక్తం చేస్తున్నారు.
అందరికీ ధన్యవాదాలు : కలెక్టర్, ఎస్పీ
జిల్లావ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగడానికి సహకరించిన ప్రజలు, రాజకీయ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులకు కలెక్టర్ సుదర్శన్ రెడ్డి, ఎస్పీ రఘురామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ పంచాయతీ, పరిషత్, పురపాలక సంఘాల ఎన్నికల మాదిరిగానే ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అంతా సహకరించడంపై హర్షం వ్యక్తం చేశారు. తాము తీసుకున్న చర్యలు అక్కడక్కడా ప్రజలను ఇబ్బందులకు గురి చేసినా పోలింగ్ ప్రశాంతంగా ముగిసేందుకు తప్పలేదని వివరణ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఇక పురపాలక సంఘ ఓట్ల లెక్కింపుపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.

75 శాతం పోలింగ్
* నంద్యాల 76%
* కర్నూలు 74%
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, మే 7 : జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 75 శాతం పోలింగ్ నమోదైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 2009 ఎన్నికలతో పోలిస్తే ఆసారి సుమారు ఐదు శాతం ఎక్కువ పోలింగ్ నమోదైంది. కర్నూలు పార్లమెంటు పరిధిలో మొత్తం 14,81,190 ఓట్లు ఉండగా 10,91,785, నంద్యాల పార్లమెంటు పరిధిలో మొత్తం 15,75,677 ఓట్లు ఉండగా 11,99,721 ఓట్లు పోలయ్యాయి. దీంతో నంద్యాల పరిధిలో 76 శాతం, కర్నూలు పరిధిలో 74 శాతంగా పోలింగ్ నమోదైంది. కర్నూలు పార్లమెంటు పరిధిలో ఈఏడాది సుమారు 7 శాతం ఎక్కువ ఓట్లు నమోదు కాగా నంద్యాల పార్లమెంటు పరిధిలో 2.50 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఇక ఆళ్లగడ్డ శాసన సభ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,20,812 ఓట్లు ఉండగా 81 శాతం, శ్రీశైలంలో 1,83,650 ఓట్లకు 80శాతం, నందికొట్కూరులో 2,03,541 ఓట్లుండగా 77 శాతం, పాణ్యంలో 2,80,646 ఓట్లకు సుమారు 69 శాతం, నంద్యాలలో 2,42,742 ఓట్లుండగా అందులో 66 శాతం, బనగానపల్లె నియోజకవర్గంలో 2,16,545 ఓట్లు ఉండగా అందులో 86 శాతం, డోన్‌లో 2,27,741 ఓట్లుండగా 74 శాతం ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. కర్నూలు శాసన సభా నియోజకవర్గంలో 2,45,427 ఓట్లకు 60 శాతం, పత్తికొండలో 1,98,991 ఓట్లకు 71 శాతం, కోడుమూరులో 2,03,841 ఓట్లకు 87 శాతం, ఎమ్మిగనూరులో 2,23,059 ఓట్లుండగా 76 శాతం, మంత్రాలయం నియోజకవర్గంలో 1,79,686 ఓట్లకు 72 శాతం, ఆదోనిలో 2,11,266 ఓట్లు ఉండగా 65 శాతం, ఆలూరులో 2,18,920 ఓట్లకు 85శాతం ఓట్లు నమోదయ్యాయి. జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు ముగియడంతో అధికారులు, ప్రజలు, రాజకీయ పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు చైతన్య కార్యక్రమం కారణంగా పోలింగ్ శాతం పెరగడం అధికారుల్లో ఉత్సాహాన్ని నింపింది. గత 2009 ఎన్నికలతో పోలిస్తే ఒక్క పాణ్యం నియోజకవర్గంలో మాత్రం ఒక శాతం ఓట్లు తగ్గగా ఇతర అన్ని నియోజకవర్గాల్లో పెరగింది. ఆలూరు నియోజకవర్గంలో గతంతో పోలిస్తే ఏకంగా 14 శాతం పెరగడం విశేషం.

నంద్యాల పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత
* వైకాపా అభ్యర్థి భూమా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి మధ్య వాగ్వివాదం
* ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
నంద్యాల అర్బన్, మే 7: పట్టణంలోని మున్సిపల్ టౌన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉదయం వైకాపా అభ్యర్థి భూమా నాగిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, టిడిపి నాయకులు గంగిశెట్టి విజయకుమార్ మధ్య మాటామాటా పెరిగింది. టౌన్‌హాల్‌లో ఒకరికొకరు ఎదురుపడిన సందర్భంలో ఇవే నీకు ఆఖరి ఎన్నికలు అని భూమా గంగిశెట్టిని అనడంతో, ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. నీలాంటి వారికి ప్రతిరోజూ ఎన్నికలు తప్పవని గంగిశెట్టి జవాబు ఇచ్చి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ఇదే పోలింగ్ కేంద్రంలో సాయంత్రం 4.30 ప్రాంతంలో భూమా నాగిరెడ్డి పోలింగ్ కేంద్రంలో తిష్టవేసి పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్న విషయం తెలుసుకుని టిడిపి అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి బావమరిది జగదీశ్వరరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్ తమ అనుచరులతో హుటాహుటీన టౌన్‌హాల్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. మళ్లీ ఇక్కడ కూడా ఇరువర్గాలు ఎదురుపడి మాటామాటా పెంచుకున్నారు. గంగిశెట్టి నిన్ను గంగలో కలుపుతా అని భూమా నాగిరెడ్డి హెచ్చరించినట్లు టిడిపి వర్గాలు తెలిపాయి. దీంతో గంగిశెట్టి, జగదీశ్వరరెడ్డి, భూమానాగిరెడ్డిల మధ్య తీవ్రవాగ్వివాదం చోటుచేసుకుంది. ఇన్నీ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్న మీకు దొంగ ఓట్లు వేసుకునే ఖర్మ ఎందుకు పట్టిందని భూమా ఎద్దేవా చేయగా, దొంగ ఓట్లు వేసుకునే సంస్కృతి మీకే ఉందని నంద్యాల అసెంబ్లీలో అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని జవాబు ఇచ్చినట్లు అనుచరులు పేర్కొన్నారు. దీంతో ఇరువర్గాలు కోపంతో తోపులాడుకునే పరిస్థితి తలెత్తడంతో అక్కడే ఉన్న పోలీసులు, ప్రత్యేక బలగాలు జోక్యం చేసుకుని ఘర్షణ జరగకుండా ఆపగలిగారు. విషయం తెలుసుకున్న నంద్యాల డిఎస్పీ అమరనాథనాయుడు ఆగమేఘాల మీద సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల నాయకులను, వారి అనుచరులను చెదరగొట్టి ఎవరిదారిన వారిని పంపివేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. విషయం తెలుసుకున్న వైకాపా ఎంపి అభ్యర్థి ఎస్పీవైరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
30 ఏళ్ల తర్వాత బొల్లవరంలో ఎన్నికలు
కర్నూలు టౌన్, మే 7 : దాదాపు 30 ఏళ్ల తర్వాత కల్లూరు మండల పరిధిలోని బొల్లవరం గ్రామంలో ఎన్నికలు జరిగాయి. ఈ గ్రామంలో ఎంపి, ఎమ్మెల్యే ఎన్నికలను స్వచ్ఛందంగా ఎన్నికలను గ్రామస్థులు బహిష్కరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లాలో బుధవారం జరిగిన ఎంపి, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నోటా ఓటును కల్పించడంతో దానిద్వారా ఓటుహక్కు వినియోగించుకున్నామని బొల్లవరం గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో మొత్తం 1800 ఓటర్లు ఉన్నారు. వారిలో సాయంత్రం వరకు ఓటర్లు పాల్గొని ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉలిందకొండ ఎస్ ఐ నరేంద్రకుమార్ రెడ్డి గట్టి బందోబస్తు నిర్వహించారు.
.....................

* చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం * ఉదయం నుంచే బారులుతీరిన వైనం...
english title: 
p

జిల్లాలో పోలింగ్ 77.03 శాతం

$
0
0

కాకినాడ, మే 7: జిల్లాలో జరిగిన సాధారణ ఎన్నికల్లో 3 పార్లమెంట్, 19 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 77. 03 శాతం పోలింగ్ నమోదైందని బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ వెల్లడించారు. జిల్లాలో అత్యధికంగా రామచంద్రపురం నియోజకవర్గంలో 87.43 కాగా అత్యల్పంగా పిఠాపురంలో 65.01 శాతం నమోదయిందని చెప్పారు. ఇక నియోజకవర్గాల వారీగా తునిలో 81, ప్రత్తిపాడు 82.50, కాకినాడ రూరల్ 70, పెద్దాపురం 76, కాకినాడ సిటీ 67, జగ్గంపేట 78, కాకినాడ పార్లమెంట్ 73. 92, ముమ్మిడివరం 82. 32, అమలాపురం 77.51, రాజోలు 77.15, పి గన్నవరం 77.94, కొత్తపేట 83. 67, మండపేట 85.11, అమలాపురం పార్లమెంట్ 81. 70, అనపర్తి 83. 09, రాజానగరం 84, రాజమండ్రి సిటీ 68.51, రాజమండ్రి రూరల్ 74, రాజమండ్రి పార్లమెంట్ 76. 90, రంపచోడవరం 65. 01 శాతం నమోదందని చెప్పారు. జిల్లాలో ఎన్నికల పోలింగ్ శాతం పెరిగేందుకు సహకరించిన స్వచ్ఛంద సంస్థలకు, ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి, వివిధ రాజకీయ పార్టీలకు, ఓటర్లకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.\

ఇవిఎంలు, జీపు దగ్ధం

వై రామవరం, మే 7: మండల సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా కొయ్యూరు మండలం పలకజీడి గ్రామంలో బుధవారం మావోయిస్టులు ఎన్నికల బూత్‌ను స్వాధీనం చేసుకోవడంతోబాటు కమాండర్ జీపు, 6 ఇవిఎంలకు నిప్పుపెట్టి తగులబెట్టారు. ఈమేరకు అక్కడున్న ఎన్నికల అధికారికి ఒక లేఖ ఇచ్చారు. మావోయిస్టులు ఎన్నికలు బహిష్కరించినప్పటికీ ఎన్నికలు నిర్వహిస్తున్నందుకు జీపు, ఇవిఎంలు తగులబెడుతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద ఏవిధమైన బందోబస్తు లేకపోవడంతో ఒక మహిళా మావోయిస్టు సహా ఆరుగురు మావోయిస్టులు ఈ ఘటనలో పాల్గొన్నారు. దిక్కుతోచని స్థితిలో ఎన్నికల సిబ్బంది నడుచుకుంటూ వై రామవరం చేరుకున్నారు. ఈ పలకజీడి గ్రామం వై రామవరం మండలం జంగాలతోట గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.

పోలింగ్ ముగిసేవరకూ పంపకాలు!

ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, మే 7: పోలింగ్‌కు మూడు రోజులు ముందు మొదలైన పంపకాలు బుధవారం పోలింగ్ ముగిసే వరకు కొనసాగుతూనే ఉన్నాయి. డబ్బులివ్వకపోతే తాము ఓట్లు వేసేందుకు వెళ్లేది లేదని జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో ఓటర్లు భీష్మించుకుని కూర్చోవటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అభ్యర్ధులు డబ్బులు ఇవ్వాల్విన పరిస్థితి ఏర్పడింది. కొంత మంది ఓటర్లకు మాత్రమే డబ్బులిచ్చి, మిగిలిన వారికి ఇవ్వకపోవటంతో ఆగ్రహం వ్యక్తంచేసిన ఓటర్లు, పోలింగ్ బూత్‌లకు వెళ్లేందుకు నిరాకరించారు. ఇలాంటి పరిస్థితి జిల్లాలో దాదాపు అన్ని అసెంబ్లీ నియోకవర్గాల్లోను ఉన్నప్పటికీ, రాజమండ్రి నగరంలో మాత్రం మరీ దారుణంగా కనిపించింది. ఉదయం 10గంటలకే కొంత మంది ఓటర్లు ఆటోల్లో అభ్యర్ధుల ఇళ్లకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేసారు. డబ్బులివ్వకపోతే తాము ఓటు వేసేది లేదని ఆందోళనకు దిగారు. అయినప్పటికీ తాము డబ్బులు ఇవ్వలేమని అభ్యర్ధులు చెప్పటంతో, సాయంత్రం 3గంటల వరకు కూడా పోలింగ్ బూత్‌లకు కొన్ని ప్రాంతాలకు చెందిన ఓటర్లు వెళ్లలేదు. అయితే రాజమండ్రిలో పోలింగ్ శాతం 4 గంటలకు 53 శాతం మాత్రమే నమోదవటంతో అప్పుడిక ఆందోళన చెందిన అభ్యర్ధులు నాయకులను పంపారు. ఒక పక్క పోలింగ్ గడువు ముగుస్తున్నాగానీ, ఓటర్లు ఏ మాత్రం కంగారుపడకుండా తమకు డబ్బులిస్తేనే ఓటు వేస్తామని పట్టుబట్టారు. ఒక పార్టీకి చెందిన నాయకులు ఓటుకు రూ.500 చొప్పున కొన్ని ప్రాంతాల్లోను, రూ.300చొప్పున కొన్ని ప్రాంతాల్లోను ముట్టచెప్పిన తరువాత అపుడు పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలాంటి పరిణామాల కారణంగానే రాజమండ్రిలో పోలింగ్ శాతం కేవలం 57.56శాతంగా నమోదయింది. ఇంత తక్కువ శాతం గతంలో ఎప్పుడూ నమోదుకాలేదు. డబ్బులు అందలేదన్న ఉద్దేశ్యంతో చాలా మంది ఎన్నికలను బహిష్కరించటం, అసలు డబ్బుతో పనిలేకుండా నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకోవాలని భావించిన వారు ఉదయం 7 గంటల నుండే పోలింగ్ బూత్‌లకు రావటం వంటి కారణాల వల్లే ఈ మాత్రం పోలింగ్ శాతం రాజమండ్రిలో నమోదయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
16న ఓట్ల లెక్కింపు
కాకినాడ, మే 7: జిల్లాలో బుధవారం నిర్వహించిన పార్లమెంట్, అ సెంబ్లీ నియోజక వర్గాల ఎన్నికల పోలింగ్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ వెల్లడించారు. జిల్లాలో 4056 కేంద్రాల ద్వారా పోలింగ్ నిర్వహించి జిల్లా వ్యాప్తంగా అంచనాల ప్రకారం మొత్తం 77.78 శాతం పోలింగ్ నమోదైందని ఇంకా పూర్తి సమాచారం రిటర్నింగ్ అధికారుల నుండి అందాల్సి ఉందని చెప్పారు. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అన్ని పోలింగ్ కేంద్రాల నుండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు జిల్లా కేంద్రానికి చేరుకుని సంబంధిత పార్లమెంట్ నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపరుస్తున్నట్లు చెప్పారు. 16వ తేదీన ఉదయం 8గంటలకు కాకినాడలో 3కేంద్రాల్లోని జెఎన్‌టియుకె, రంగరాయ మెడికల్ కళాశాల, విద్యుత్ నగర్ ఐడియల్ కళాశాలల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతామని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ పార్లమెంటరీ నియోజవర్గంతో పాటు దాని పరిధిలోని 7 అసెంబ్లీ నియోజవర్గాల ఓట్ల లెక్కింపు జెఎన్‌టియు కాకినాడ డిపార్టుమెంట్ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్ అండ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ బ్లాకు, స్కూల్ ఆఫ్ పుడ్ టెక్కాలజీ బ్లాకులోను, అమలాపురం పార్లమెంట్ వాటి పరిధిలోని 7అసెంబ్లీ నియోజవర్గాలు, అరకు పార్లమెంట్ నియోజవర్గంలోని రంపచోడవరం అసెంబ్లీ నియోజవర్గం ఓట్ల లెక్కింపు కాకినాడ విద్యుత్ నగర్ ఐడియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోను, రాజమండ్రి పార్లమెంట్, దాని పరిధిలోని 4 అసెంబ్లీ నియోజవర్గాల ఓట్ల లెక్కింపు కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలోను నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామనికలెక్టర్ నీతూ ప్రసాద్ పేర్కొన్నారు.

ప్రశాంతంగా పోలింగ్
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, మే 7: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది... ఇక ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. నరాలు తెగే ఉత్కంఠతో అభ్యర్ధులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెల 16వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. జిల్లాలో మొత్తం 78 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా మొదట మందకొడిగా సాగింది. మధ్యాహ్నానికి ఆయా నియోజకవర్గాలలో పోలింగ్ జోరందుకుని మొత్తంమీద భారీగానే పోలింగ్ జరిగింది. ఎండ తీవ్రతలోనూ మహిళలు భారీగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి కనిపించారు. జిల్లాలోని ఏజన్సీ నియోజకవర్గం రంపచోడవరంలో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ప్రక్రియను ముగించగా, మిగిలిన 3 పార్లమెంట్, 18 అసెంబ్లీ నియోజకవర్గాలలో సాయంత్రం 6 గంటల తరువాత కూడా పోలింగ్ కొనసాగింది. నిర్దేశిత సమయంలోగా క్యూలో ఉన్నవారికి పొద్దుపోయే వరకు ఆయా పోలింగ్ కేంద్రాలలో ఓటువేసేందుకు అనుమతించారు. జిల్లాలో ఉదయం 9 గంటలకు 15.2 శాతం పోలింగ్ నమోదయ్యింది. తుని నియోజకవర్గంలో ఉదయం 11 గంటలకు 40 శాతం పోలింగ్ జరగ్గా, జిల్లాలో సరాసరిన 29.95 శాతం నమోదయ్యింది. జిల్లాలో మధ్యాహ్నం ఒంటిగంటకు 46.51 శాతం, 3గంటలకు 60.45శాతం నమోదైంది. సాయంత్రం 4 గంటలకు 66.59 శాతం, 5 గంటలకు 70.64 శాతం పోలింగ్ జరిగింది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలను మొహరించారు. జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాలలో పలు గ్రామాలలో తెలుగుదేశం-వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణలు జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కాకినాడ సిటీలో కాంగ్రెస్-వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట మండలం బ్రహ్మదేవం గ్రామంలో టిడిపి-వైసిపి కార్యకర్తల మధ్య ఘఱ్షణ చెలరేగడంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. వేట్లపాలెంలో టిడిపి-వైసిపి మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. జగ్గంపేట నియోజకవర్గంలోని గండేపల్లిలో ఎన్నికల అధికారులు తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరించారంటూ వైసిపి అభ్యర్ధి జ్యోతుల నెహ్రూ సాయంత్రం ధర్నాకు దిగారు. వైసిపికి వ్యతిరేకంగా తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళన చేశారు. తొండంగి మండలంలోన వేమవరం, దానవాయిపేట, గోపాలపట్నం తదితర సమస్యాత్మక గ్రామాలలో దేశం-వైసిపి కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తొండంగి మండలంలోని ఒంటి మామిడి, టి కొత్తపల్లి గ్రామాలలో మొదట ఇవిఎంలు మొరాయించడంతో సుమారు గంటన్నర ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. కరప మండల పరిధిలో పోలింగ్ ప్రారంభంలో ఒకటి రెండు చోట్ల ఇవిఎంలు మొరాయించడంతో అధికార్లు ప్రత్యామ్నాయంగా ఉంచిన ఇవిఎంలను ఏర్పాటుచేశారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలోని సాంబమూర్తినగర్‌లో వైసిపి కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ అభ్యర్ధి పంతం నానాజీ ధర్నా చేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కాగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నీతూప్రసాద్ నగరంలోని శ్రీనగర్ పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేశారు. కేంద్రమంత్రి, కాకినాడ ఎంపి కాంగ్రెస్ అభ్యర్ధి ఎంఎం పళ్ళంరాజు స్థానిక మున్సిపల్ హైస్కూల్‌లోను, వైసిపి కాకినాడ సిటీ అభ్యర్ధి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి శ్రీనగర్ హైస్కూల్ కేంద్రంలోను, టిడిపి అభ్యర్ధి వనమాడి వెంకటేశ్వరరావు జగన్నాథపురం చర్చిస్క్వేర్ సెంటర్ పోలింగ్ కేంద్రంలోను, కాకినాడ సిటీ అభ్యర్ధి పంతం నానాజీ గొడారిగుంట పోలింగ్ కేంద్రంలోను తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మన్యంలో భారీగా పోలింగ్
రాజవొమ్మంగి, మే 7: సార్వత్రిక ఎన్నికల్ని బహిష్కరించాలంటూ మావోయిస్టులు ఇచ్చిన పిలుపును అడవి బిడ్డలు లెక్కచేయలేదు. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మారుమూల పల్లెల్లో సైతం బుధవారం భారీగా పోలింగు జరిగింది. పొరుగున ఉన్న విశాఖ జిల్లా కొయ్యూరు మండలం పలకజీడి గ్రామంలో ఇవిఎంలను, జీపును మావోయిస్టులు తగులబెట్టినా సరే జిల్లా ఏజెన్సీలో ఎటువంటి ప్రభావం కనిపించలేదు. వృద్ధులు, మహిళలు, యువకులు, యువతులు గుంపులు గుంపులుగా వచ్చి ఓటు వేశారు. రాజవొమ్మంగి మండలంలో పూదేడు, పాకవెల్తి, కేశవరం, లోదొడ్డి తదితర గ్రామాలకు చెందిన గిరిజనులు 15 కి.మీ దూరాన ఉన్న వాతంగి పోలింగు కేంద్రానికి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు. అత్యంత మారుమూల గ్రామాల నుండి కూడా ఓటర్లు పెద్ద ఎత్తున తరలి రావడం కనిపించింది. అదే విధంగా చికిలింత, కొండలింగంపర్తి, కరుదేవుపాలెం గ్రామాలకు చెందిన గిరిజనులు పెద్ద ఎత్తున తరలివచ్చి వంచంగి పోలింగు కేంద్రంలో ఓటు వేశారు. 80 ఏళ్లు నిండిన వృద్ధులు సైతం యువకుల సహాయంతో వచ్చి ఓటు వేశారు. రాజవొమ్మంగి, జడ్డంగి, వట్టిగెడ్డ, వాతంగి పోలింగు కేంద్రాలకు భారీగా ఉదయమే ఓటర్లు చేరుకోవడంతో గంటల తరబడి ఎండలో నిలబడి ఓటు వేశారు. మావోయిస్టుల ప్రాబల్యమున్న వై.రామవరం, అడ్డతీగల మండలాల్లో కూడా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగు కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజవొమ్మంగి మండలంలో 2009 సార్వత్రిక ఎన్నికల్లో 68 శాతం పోలింగు నమోదు కాగా ఈ ఎన్నికల్లో 73 శాతం పోలింగు నమోదవడం గమనించదగిన విషయం.
కనీస సౌకర్యాలు మృగ్యం: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంచినీరు, టెంట్లు పోలింగు బూత్‌ల వద్ద ఏర్పాటు చేశామని అధికారులు చెప్పిన మాటల్లో వాస్తవం కనిపించడంలేదు. చాలా పోలింగు కేంద్రాల్లో చిన్నచిన్న టెంట్లు ఏర్పాటు చేయడంతో ఎండలో గంటల తరబడి నిలబడలేక ఇబ్బందులు పడ్డారు. ఇక మంచినీటి సరఫరా అంటూ ఎక్కడా కనిపించలేదు. రాజకీయ పార్టీల నాయకులే అక్కడక్కడా వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడం కనిపించింది. వికలాంగ ఓటర్లకు మట్టితో అప్పటికపుడు ఏర్పాటు చేసిన ర్యాంపులు పెద్దగా ప్రయోజనం చేకూర్చకపోగా, కొంతమంది జారి పడిపోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.
వేట్లపాలెంలో ఇరువర్గాల దాడి
సామర్లకోట, మే 7: సాధారణ ఎన్నికల పోలింగ్‌ను పురస్కరించుకుని బుధవారం సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో టిడిపి, వైసిపి వర్గాల మధ్య జరిగిన దాడిలో వైసిపి కార్యకర్త శీలం మల్లేష్, కలగపూడి చిన్నారితో పాటు మరొకరికి గాయాలయ్యాయి. దాంతో ఉద్రిక్తత ఏర్పడగా పోలీసు లాఠీచార్జికి దారి తీసింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బుధవారం ఉదయం 10.30 గంటల సమయంలో గ్రామంలోని పిహెచ్‌సి వైపు నుండి పోలింగ్ కేంద్రానికి వైసిపి కార్యకర్త శీలం మల్లేష్ తదితరులు వస్తుండగా, ఎదరుపడ్డ టిడిపి కార్యకర్తలు వారిని హేళన చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో టిడిపికి చెందిన మన్యం చిన తమ్మన్న వర్గీయులు చేసిన దాడిలో వైసిపికి చెందిన శీలం మల్లేష్‌కు ముఖం, తలపై తీవ్ర రక్తగాయాలు కాగా, మిగిలిన ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటనతో వివాదం ముదరకుండా స్థానిక పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పెద్దాపురం డిఎస్పీ ఓలేటి అరవింద్‌బాబు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని లాఠీచార్జి చేసి అల్లరి మూకలను చెదరగొట్టారు. కాగా మాజీ జడ్పీటీసీ, వైసీపీ నాయకుడు బొబ్బరాడ సత్తిబాబు ఆధ్వర్యంలో దళితులపై దాడులు చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోరని డిఎస్పీతో వాగ్వివాదికి దిగారు. తీవ్రంగా గాయపడిన మల్లేష్‌ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి, సామర్లకోట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే మండలంలోని జి మేడపాడు గ్రామంలో వైసిపి, టిడిపి కార్యకర్తల మధ్య పలుమార్లు వివాదాలు ఏర్పడడంతో పోలీసులు అల్లరి మూకలను చెదరగొట్టి, ఐదుగురిని అదుపులోకి తీసుకుని సామర్లకోట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
రావులపాలెం: పోలింగ్ ముగిసిన తరువాత ఆత్రేయపురం మండలం నార్కెడిమిల్లి గ్రామంలో వైసిపి, టిడిపి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బాలం సోమన్న (శ్రీనివాస్) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతనిని కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన వివరాలు సేకరించారు. ప్రసుత్తం గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
బతికున్నా మృతి చెందినట్టే లెక్క
సామర్లకోట, మే 7: బిఎల్వో ఇచ్చిన జాబితాలో మరణించిన ఓటరుగా ఉన్న మండలంలోని పెదబ్రహ్మదేవం గ్రామానికి చెందిన తోటకూర జయప్రసాదబాబు సజీవంగా బుధవారం ఓటు వేసేందుకు వచ్చి మరణించిన లిస్టులో పేరు ఉండడాన్ని చూసి అవాక్కయ్యారు. కాగా ఆయన ఓటు హక్కును వినియోగించేకునేందుకు గ్రామంలోని 95వ బూత్ అధికారులు అనుమతించలేదు. ఓటరు ప్రసాద్‌బాబు బతిమలాడినా ఓటు వేయడానికి అంగీకరించకపోవడంతో, పాత్రికేయులను ఆశ్రయించాడు. దాంతో విలేఖరులు ఈ విషయమై పోలింగ్ అధికారులను వివరణ కోరగా, గ్రామానికి చెందిన బూత్ లెవిల్ అధికారిణి బి సత్యవతి చేతి రాతతో ఇచ్చిన తొలగింపుల జాబితాను వారు చూపించారు. దాంట్లో ప్రసాద్‌బాబు బతికి ఉన్నప్పటికీ మరణించిన జాబితాలో నమోదయినట్టు తెలిసింది. అయితే ఆ జాబితాపై నియోజకవర్గ ఎన్నికల అధికారి సంతకం గానీ, మండల తహసీల్దార్ సంతకం గానీ లేకుండా కేవలం బిఎల్‌వో సంతకం మాత్రమే ఉండడంతో దానిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎన్నికల సామాగ్రిని తమకు అప్పగించిన సందర్భంలో తొలగింపు జాబితాను అధికారులు ఇచ్చి, ఈ జాబితాలో ఓటర్లను అనుమతించవద్దని ఆదేశించినట్టు పోలింగ్ అధికారులు చెప్పారు. సజీవంగానే ఉన్న ఓటరు ప్రసాద్ బాబు మృతుల జాబితాలోకి ఎందుకు వెళ్ళారని స్థానికులు సైతం పోలింగ్ అధికారులను ప్రశ్నించగా, వారు ఉన్నతాధికారులతో ఫోనులో సంప్రదించి ఎట్టకేలకు ప్రసాద్‌బాబును ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చారు. కాగా అదే పోలింగ్ కేంద్రం 462వ వరుస సంఖ్యలో ఉన్న ఆకుల దివ్య ఓటు వేసేందుకు రాగా అప్పటికే ఆమె ఓటును ఎవరో వేశారని ఏజెంట్లు, పోలింగ్ అధికారులు చెప్పడంతో ఆమె ఆయోమయానికి గురైంది. ఇదెలా సాధ్యం అని ఆమె ప్రశ్నించగా, ఏజెంట్లు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు వేయడానికి ఆమెను అంగీకరించలేదు.
నాలుగు తాటాకిళ్లు దగ్ధం
రాజానగరం, మే 7: జాతీయ రహదారిపై రాజానగరంలోని వైఎస్సార్ జంక్షన్లో మంగళవారం అర్థరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 8 తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. దీంతో ఆ పాకల్లోనే కాఫీ హోటళ్లు, కిళ్లీ బడ్డీలు నిర్వహించుకునే తొమ్మిది కుటుంబాల వారు జీవనోపాధి కోల్పోయి వీధిన పడ్డారు. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు రూ.6 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లిందని అంచనా. దీనికి సంబంధించి వివరాలు ఈవిధంగా ఉన్నాయి. స్థానిక వైఎస్సార్ జంక్షన్లో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించి, తాటాకు పాకలు వేసుకున్నారు. అయితే వీటిని వేరే వ్యక్తులు అద్దెకు తీసుకుని కాఫీ హోటళ్లను, కిళ్లీ బడ్డీలను నిర్వహించుకుంటున్నారు. అయితే చందమళ్ల సత్యనారాయణ, తామర్ల బాబూరావు కుటుంబాలు అవే ఇళ్లలో నివాసం ఉంటూ కిళ్లీ బడ్డీలు నిర్వహించుకున్నారు. ఇలావుండగా మంగళవారం రాత్రి మిగిలిన వారు వ్యాపారాలు మూసివేసి, ఇళ్లకు వెళ్లిపోయిన తరువాత అర్థరాత్రి 12 గంటల సమయంలో చింతా నారాయణరావు అనే వ్యక్తి కాఫీ హోటల్ నిర్వహించుకుంటున్న ఇంటి నుండి మంటలు ప్రారంభమయ్యాయి. ఆ మంటలు మిగిలిన పాకలకు కూడా వ్యాపించడంతో 8 తాటాకిళ్లు కాలిబూడిదయ్యాయి. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో గ్యాస్ సిలెండర్లతోబాటు సోడా గ్యాస్ కూడా గట్టి శబ్దంతో పేలిపోవడంతో అక్కడికి చేరుకున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. అనంతరం అగ్నిమాపక అధికారి శేఖర్ ఆధ్వర్యంలో రాజమండ్రి నుండి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సహకారంతో మంటలను అదుపు చేశారు. ఈ మంటల్లో 8 పాకల్లో వ్యాపారాలకు సంబంధించి సామాగ్రితోబాటు చంద్రమళ్ల సత్యనారాయణ ఇంట్లో భద్రపరచుకున్న రూ.9 వేల నగదు కాలి బూడిదైంది. ఈ ప్రమాదం కారణంగా జీవనోపాధిని కోల్పోయిన వారిలో చింతా నారాయణరావు, మల్లిమొగ్గల సుబ్రహ్మణ్యం, తామర్ల బాబూరావు, చొప్పెల్ల నాగమణి, బొడ్డు అరుణ, మార్గాని శ్రీను, నక్కిన జానకిరాం, హనుమంతుల మేరియ్య కుటుంబాలు ఉన్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని రాజానగరం తహసీల్దార్ షేక్ ఇంతియాజ్ బాషా, వైసిపి రాజానగరం అభ్యర్థి జక్కంపూడి విజయలక్ష్మి మంగళవారం అర్థరాత్రి సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు.
మావోల దాడితో ఉలిక్కిపడిన యంత్రాంగం
అడ్డతీగల, మే 7: విశాఖ జిల్లాకు చెందిన తూర్పు సరిహద్దులోని పలకజీడి గ్రామంలో ఏర్పాటుచేసిన 68 పోలింగ్ కేంద్రంపై మావోయిస్టుల ఆకస్మిక దాడి తూర్పు మన్యంలోని గ్రామాలను, పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఐదుగురు సభ్యులు కలిగిన మావోల బృందం ఈ దాడికి తెగబడింది. పోలింగ్ కేంద్రానికి భద్రతకు వచ్చిన పోలీసులు గ్రామంలో గస్తీ తిరగడానికి వెళ్ళిపోయారనే పక్కా సమాచారాన్ని అందుకున్న మావోలు పట్టపగలు ధైర్యంగా పోలింగ్ కేంద్రంపై మెరుపుదాడి జరిపారు. పోలింగ్ కేంద్రంలోని సిబ్బందిని, వారికి సంబంధించిన వస్తువులను తీసుకుని వెళిపోవాలని, ప్రభుత్వానికి చెందిన వాటిని వదిలి వెళ్ళాలని హెచ్చరించారు. పలకజీడి పోలింగ్ కేంద్రంలో 7 గ్రామాలకు చెందిన 470 మంది ఓటర్లకు అప్పటికే 70 శాతానికి పైగా ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నట్టు సిబ్బంది తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్‌లకు చెందిన రెండు ఇవిఎంలను తీసుకుని బయటకి వచ్చి, సిబ్బంది వచ్చిన కమాండర్ జీపును కలిపి తగులబెట్టారు. అవి పూర్తిగా కాలిపోయి ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఈ రోజు సాహసించలేదని తెలుస్తోంది. తూర్పు మన్యానికి సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడి పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. మధ్యాహ్నం సమయం కావడంతో పోలింగ్‌కు ఇంకా దాదాపు నాలుగైదు గంటలు సమయం ఉండడంతో సరిహద్దు గ్రామాలపై తూర్పు పోలీసులు నిశితంగా నిఘా కొనసాగించారు.

నోట్ల పంపకంలో
అసలుకే ఎసరు!
అయినవిల్లి, మే 7: సాధారణ ఎన్నికల నేపథ్యంలో తమ అభ్యర్థికి ఓటు వేయాలంటూ ఓటర్లకు ఒక పార్టీ నాయకులు దొంగ నోట్లు పంచడంతో అసలుకే ఎసరొచ్చిందని గ్రామస్థులు లబోదిబోమంటున్నారు. మండంలోని పొట్టిలంక, కొండుకుదురు, గున్నంమెరక, ఎస్ మూలపొలం గ్రామాల్లో ఒక పార్టీకి చెందిన నాయకులు ఓటుకు మూడొందలు చొప్పున ఇంట్లో రెండు ఓట్లకు 600 రూపాయలు ఇవ్వలసి వుండగా వారికి వెయ్యినోటు ఒకటి ఇచ్చి ఓటర్ల దగ్గర మిగిలిన నాలుగు వందల రూపాయలు వసూలు చేసినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. అయితే ఆ పార్టీ నాయకులు ఇచ్చిన వెయ్యి నోటు దొంగదిగా తేలడంతో ఓటర్లు లబోదిబోమంటున్నారు. ఆ పార్టీ నాయకులు ఇచ్చిన వెయ్యి నోటుతో అసలు నాలుగు వందల రూపాయలు పోయాయంటూ నెత్తినోరు కొట్టుకుంటున్నారు.
పోలింగ్ ప్రశాంతం:ఆర్డీవో ప్రియాంక
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, మే 7: అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అమలాపురం ఆర్డీవో, అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి సిహెచ్ ప్రియాంక తెలిపారు. అసెంబ్లీ పరిధిలో ఏ విధమైన హింసాత్మక సంఘటనలు జరగలేదని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆర్డీవో తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామని ఆర్డీవో తెలిపారు.
80 శాతం ఓటర్ల ఓటుహక్కు
రాజమండ్రి: రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గంలోని 7అసెంబ్లీ సెగ్మంట్లలో 80శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనపర్తి నియోజకవర్గంలో 83.9శాతం, రాజానగరంలో 84శాతం, రాజమండ్రి సిటిలో 68.1శాతం, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 74శాతం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 84.8శాతం, గోపాలపురంలో 83శాతం, నిడదవోలులో 85.46శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

జిల్లాలో జరిగిన సాధారణ ఎన్నికల్లో 3 పార్లమెంట్
english title: 
j

తెలంగాణాలో తొలి ప్రభుత్వం మాదే...

$
0
0

ఖమ్మం(ఖిల్లా), మే 7: నవ తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక జిల్లా పార్టీ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్సెనని ఉద్ఘాటించారు. తెలంగాణ ప్రజలు చేసిన మేలు మరువరని, స్పష్టమైన తీర్పును ఇచ్చి కాంగ్రెస్‌కే పట్టం గడతారని ఇందులో సందేహం పడాల్సిందేమీ లేదన్నారు. సమన్వయలోపంతో పార్టీకి కొంత నష్టం జరిగిందని దాన్ని త్వరలోనే సరిచేసుకుంటామన్నారు. కొన్ని ప్రాంతాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని, ఎంతటి వారినైనా క్షమించేది లేదని వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. టిఆర్‌ఎస్ నేత కె చంద్రశేఖర్ మైండ్ గేమ్ ఆడటంలో ఆరితేరారని, అధికారం చేజిక్కించుకునేందుకు ఆయన చేస్తున్న జిమ్మిక్కులను తెలంగాణ ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో నాయకులు మనోహర్ నాయుడు, ఫజల్ తదితరులు పాల్గొన్నారు.

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయండి
* కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశం
ఖానాపురం హవేలి, మే 7: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ రిటర్నింగ్ అధికారులకు ఆదేశించారు. బుధవారం నగరంలోని సెయింట్ జోసెఫ్, వౌంట్‌ఫోర్ట్ స్కూల్స్, ఎస్‌ఆర్ అండ్ బిజిఎన్‌ఆర్, విజయ ఇంజనీరింగ్ కళాశాల, బ్రౌన్స్ ఫార్మసీ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూంలను పరిశీలించి ఆర్‌వోలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ హాల్స్‌లో పార్లమెంట్, అసెంబ్లీ ఓట్ల లెక్కింపు టేబుల్స్ వైపున వేర్వేరుగా ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ సమాచారాన్ని రౌండ్ల వారీగా ఎప్పటికప్పుడు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, అదే విధంగా బారికేడ్లను, ఐరన్ మేష్‌లను పటిష్టంగా ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ హాల్‌లో రిటర్నింగ్ అధికారితో పాటు ఎన్నికల అబ్జర్వర్ కూడా ఉంటారని, వారికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాలన్నారు. స్ట్రాంగ్ రూంల పరిశీలన సందర్భంగా ఆయా కేంద్రాలలోని బుక్‌లను కలెక్టర్ పరిశీలించి సంతంకం చేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ లేక్కింపు, అబ్జర్వర్ గదులు, మీడియ సెంటర్ గదులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డి రమణయాదవ్, ఖమ్మం డీఎస్పీ భాలకీషన్‌రావు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.

మన్యంలో కన్పించని ‘మార్పు’
* నానాటికీ పెరుగుతున్న మరణాలు
* అంపశయ్యపై మాతా,శిశు సంరక్షణ
భద్రాచలం, మే 7: మాతా, శిశు సంరక్షణ మన్యంలో కరవైంది. మరణాలు నానాటికీ పెరుగుతున్నాయి. ఎన్ని చర్యలు చేపట్టినా అవి క్షేత్రస్థాయికి చేరడం లేదు. ఫలితంగా ప్రసవవేదనతోనే తల్లులు మరణిస్తుండగా, పురిట్లోనే బిడ్డలు కన్నుమూస్తున్నారు. తాజాగా బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన అజీజున్ ప్రసవం అనంతరం రక్తహీనతతో చనిపోయింది.
ఆందోళన కల్గిస్తున్న గణాంకాలు
జిల్లాలో మాతా,శిశు మరణాలు ఆందోళన కల్గిస్తున్నాయి. ప్రసవం సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం, పోషకాహారం లోపంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గర్భిణీలు, మహిళలకు ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు క్షేత్రస్థాయికి చేరకపోవడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. జిల్లాలో ఏడాదిలోపు ప్రతి 1000 మంది చిన్నారులకు సగటున 50 మంది మరణిస్తున్నారు. ఇనె్సంట్ మోరాల్టిటీ రేటు(ఐఎంఆర్)గా పిలుచుకునే ఈ సంఖ్య రాష్ట్రంలో సగటున 45 ఉండగా, జిల్లా సహా, జిల్లా కేంద్రం పరిసరాల్లో అంతకంటే అధికంగా ఉంది. గతేడాది ఖమ్మం గ్రామీణ ప్రాంతంలో ఈ ఐఎంఆర్ 52గా, ఏజెన్సీ ప్రాంతం వరరామచంద్రాపురంలో ఈ సంఖ్య 59.14గా నమోదైంది. ఇటు తల్లుల మరణాల సంఖ్య అధికంగానే ఉంది. జిల్లాలో ప్రసవానంతర మాతా మరణాల సంఖ్య అధికంగానే ఉంది. లక్ష ప్రసవాలకు 154 మంది చనిపోతున్నారు. రాష్ట్రంలో నమోదైన సగటు 134తో పోల్చితే ఇది చాలా అధికం. ఈ మరణాలు ఆందోళన కల్గిస్తున్నాయి.
గణాంకాలు పరిశీలిస్తే
సంవత్సరం శిశు మరణాల సంఖ్య మాతా మరణాలు
2007-08 189 14
2008-09 120 19
2009-10 40 03
2010-11 260 23
2011-12 195 18
2012-13 348 26
2013-14 311 32
రక్తహీనతతో
ప్రతి 1000 మంది మహిళల్లో 55 మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. పోషకాహార లోపంతో 30శాతం నవజాత శిశువులు మరణిస్తున్నారు. 42 శాతం మంది 0-5 సంవత్సరాల పిల్లలు పౌష్టికాహార లోపంతో జీవిస్తున్నారు. పాఠశాలల్లో 25 వేల మంది విద్యార్థులు రక్తహీనతతో, 25 వేల మంది కంటి చూపువ్యాధితో బాధపడుతున్నారు. మాతా,శిశు మరణాలను తగ్గించేందుకు చేపట్టిన ‘మార్పు’ అనే పథకం ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. ఐకేపి ద్వారా నిర్వహణ చేపట్టారు. కానీ ఫలితాలు మరి దారుణంగా తయారయ్యాయి. ఇప్పటికైనా వైద్య,ఆరోగ్యశాఖ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ప్రసవించి కొద్దిసేపటికే బాలింత మృతి
* ఏరియా ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన
* సూపరింటెండెంట్‌పై దాడికి యత్నం
* తీవ్ర ఉద్రిక్తత... పోలీసుల రంగప్రవేశం
భద్రాచలం, మే 7: పండంటి బాబును ప్రసవించి మురిసిపోయింది. పురిటి నొప్పులను మరిచి భర్తతో కల్సి ఆసుపత్రిలో తోటి రోగులకు స్వీట్లు పంచింది ఆ తల్లి. తన వంశాకురాన్ని చూసి పుత్రోత్సాహంతో పొంగి పోయిన తండ్రికి అంతలోనే షాక్. గంటలు కూడా గడవకుండానే తనకు వంశాకురాన్ని ఇచ్చిన అర్ధాంగి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో భోరున విలపిస్తున్న దృశ్యం కఠినహృదయులను సైతం కరిగించింది. ఆనందాన్ని కొడుకు రూపంలో ఇచ్చి, భార్యను తీసుకెళ్లి దేవుడు దు:ఖాన్ని మిగిల్చాడు అంటూ బంధువులు రోదిస్తున్న తీరు పలువురిని కలచివేసింది. బుధవారం భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో జరిగిన ఈ సంఘటనలో బూర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్‌కు చెందిన అజీజున్ ప్రాణాలు కోల్పోయింది. భర్త ముజఫర్ సారపాకలో గ్రామీణ వైద్యుడు. ప్రసవించిన కొద్ది గంటల్లోనే అజీజున్ కన్నుమూయడంతో జీర్ణించుకోలేని బంధువులు ఏరియా ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. అజీజున్ రెండవ కాన్పుకు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు చికిత్స చేసి కాన్పు చేయగా బాబు పుట్టాడు. అయితే ఆమెకు రక్తం తక్కువగా ఉండటంతో రక్తం ఎక్కించారు. రక్తం ఎక్కించాక కొద్దిసేపటికే ఆమె కన్నుమూసింది. 48శాతం మాత్రమే రక్తం ఉండటం వల్ల చనిపోయిందని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మృతురాలి బంధువులు వాగ్వివాదానికి, దాడిగి దిగారు. ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సారపాక సర్పంచి చందూనాయక్ కూడా బాధితుల పక్షాన నిలిచారు.
వైద్యసిబ్బంది నిరసన
తమ సూపరింటెండెంట్ విజయారావుపై దాడి చేయడాన్ని వైద్యసిబ్బంది తీవ్రంగా ఖండించారు. విధులను ఆపి నిరసన తెలిపారు. ఒకవైపు బాధితులు, మరోవైపు వైద్యసిబ్బంది ఆందోళనలకు దిగడంతో పరిస్థితి చేయిదాటుతుందని పట్టణ ఎస్సై మురళి రంగప్రవేశం చేశారు. ఇరువర్గాలతో చర్చించారు. సూపరింటెండెంట్‌పై దాడిని ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. ఏదైనా ఉంటే న్యాయపరంగా పోరాడాలని, దాడులు సమంజసం కాదని నచ్చజెప్పారు. చివరకు ఇరువర్గాలు ఆందోళన విరమించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

ప్రశాంత కౌంటింగ్‌కు సహకరించాలి
* రిటర్నింగ్ అధికారి బాబూరావు
కొణిజర్ల, మే 7: ఈ నెల 13న జరిగే ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని పార్టీల నాయకులు, అభ్యర్థులు సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి బాబురావు కోరారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సాయంత్రం ఐదు గంటల లోపు ఎంపిటిసి, జడ్పీటిసి అభ్యర్థులు ఎన్నికల నిర్వాహణకు సంబంధించిన ఖర్చుల వివరాలను అందజేయాలని రిటర్నింగ్ అధికారి వి బాబురావు సూచించారు. 13న ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, ఉదయం ప్రారంభం నుంచి సాయంత్రం కౌంటింగ్ ముగిసేవరకు వీడియో తీయడం జరుగుతుందన్నారు. అభ్యర్థులతో పాటు ఏజెంట్లు క్రమశిక్షణతో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అధికారులకు కౌంటింగ్ సమయంలో సహకరించాలని కోరారు. నిబంధనలను అతిక్రమించిన వారిని నిర్దాక్షిణ్యంగా కౌంటింగ్ హాల్ నుండి పంపేస్తామన్నారు. కౌంటింగ్ హాల్‌లోకి సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులు అనుమతించబడవన్నారు. పోస్టల్ బ్యాలెట్‌పై గెజిటడ్ అధికారి సంతకం ఉంటేనే చెల్లుతుందన్నారు. జిల్లాలో కొణిజర్ల మండలంలోనే ఎక్కువ శాతం పోలింగ్ నమోదయిందని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన వారందరికి ధన్యవాదలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి హరినందనరావు, అభ్యర్థులు, నేతలు పాల్గొన్నారు.

స్థానికేతర ఉద్యోగులు స్వస్థలాలకు వెళ్లాలి
* టిఎన్జీవోస్ జిల్లాల అధ్యక్షుడు కూరపాటి
ఖానాపురం హవేలి, మే 7: స్థానికేతర ఉద్యోగులు తమ స్వంత ప్రాంతాలకు తరలివెళ్ళాలని టిఎన్జీవోస్ జిల్లాల అధ్యక్షుడు కూరపాటి రంగరాజు అన్నారు. బుధవారం టిఎన్జీవోస్ ఫంక్షన్ హాలులో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రంగరాజు మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న స్థానికేతర ఉద్యోగులందరు తమ స్వంత ప్రాంతాలకు తరలివెళ్ళాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కడ ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏటువంటి లాభం ఉండదన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఒక నెల జీతం బోనస్‌గా ఇవ్వాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. పోలవరం ముంపు మండలాల్లో పని చేస్తున్న ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రంలో ఉంచాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉండాలని కొంతమంది తప్పుడు ధృవీకరపత్రాలు సృష్టిస్తున్నారి, అలాంటి వారిని గుర్తించి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ 2వ తేదీన జిల్లాలో ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. నవతెలంగాణ నిర్మాణం కోసం ప్రతి ఉద్యోగి ఒక గంట అదనంగా పని చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవోస్ అసోసియేట్ అధ్యక్షుడు వీరయ్య, రామయ్య, టిఎన్జీవోస్ నగర అధ్యక్షుడు వల్లోజి శ్రీనివాసరావు, రామారావు, నాగేశ్వరరావు, జహీరుద్దీన్, వేల్పుల శ్రీనివాస్, ఆనంద్, దుర్గాప్రసాద్, వేలాద్రి, గోపాలరావు, శంకరయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

పార్టీల ఏజెంట్లు ఎన్నికల నియమావళి పాటించాలి
వైరా, మే 7: ఈ నెల 16న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆయా పార్టీల ఏజెంట్లు ఎన్నికల నియమావళి తప్పకుండా పాటించాలని వైరా నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పోరిక మోహన్‌లాల్ సూచించారు. బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఆయన కౌటింగ్‌లో పాల్గొనే వివిధ పార్టీల ఏజెంట్‌లతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు 16న జరిగే ఓట్ల లెక్కింపులో పాల్గొనే వారి పేర్లు, వారి ఫోటోలు ఇవ్వాలని కోరారు. ముందుగా ఇచ్చిన ఆయా పార్టీల నాయకులను ఏజెంట్‌లుగా గుర్తించి వారికి గుర్తింపు కార్డులు జారీ చేస్తామని తెలిపారు. అయితే ఏజెంట్లు ఏ పార్టీ వారైనా ఎన్నికల నియమావళి పాటించాలని, లెక్కింపు పరిసర ప్రాంతంలో ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలన్నారు. అలా కాకుండా ఎదుటివారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినట్లయితే చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, సహాయ ఎన్నికల అధికారి సైదులు, నియోజకవర్గ పరిధిలో ఉన్న వివిధ మండల ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

ఆకట్టుకుంటున్న చేనేత, హస్తకళా ప్రదర్శన
మధిర, మే 7: స్థానిక రిక్రియేషన్ క్లబ్‌లో ఏర్పాటుచేసిన హస్తకళా ప్రదర్శన అందరిని ఆకట్టుకుంటోందని నిర్వాహకులు పవన్‌ఖండేల్‌వాలా తెలిపారు. బుధవారం మధిరలో ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ అనుకూలంగా ఉండేలా అందరికి ఉపయోగపడే వస్తువులను తాము ఏర్పాటుచేసినట్లు తెలిపారు. జైపూర్ ఎక్స్‌పోర్టు క్వాలిటీ స్కర్ట్స్, ఫ్యాన్సీ టాప్స్, టి షర్ట్స్, ఫైజమా, వైట్ మెటల్ గిఫ్ట్ ఆర్టికల్స్, కోల్‌కత్తా జ్యూట్ హ్యాండిక్రాఫ్ట్ తదితర వస్తువులను విక్రయానికి ఉంచినట్లు తెలిపారు. తమ క్రాఫ్ట్ బజార్‌లో ఉన్న వస్తువులను ప్రదర్శన, అమ్మకం వుంటాయన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సామాన్య ప్రజలందరికి అందుబాటులో ఉండే విధంగా ధరలను నిర్ణయించినట్లు తెలిపారు. తమ వద్ద ఉన్న వస్తువులు గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల్లో నుంచి తయారు చేసిన వస్తువులను సైతం ప్రదర్శనలో ఉంచినట్లు తెలిపారు.

నిబంధనలకు లోబడి మీడియా కవరేజ్ ఉండాలి
* జిల్లా కలెక్టర్ సూచన
ఖానాపురం హవేలి, మే 7: ఈ నెల 12వ తేదీన మున్సిపల్ ఓట్ల లెక్కింపు ఉన్నందున నిబంధనలకు లోబడి మీడియా కవరేజ్ చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఒక ప్రకటనలో తెలిపారు. సత్తుపల్లి, మధిర, ఇల్లెందు, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు చేపడుతున్నామని, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ప్రెస్ కవరేజ్ చేయాలన్నారు. మీడియా సౌకర్యార్థం ప్రతి లెక్కింపు కేంద్రం వద్ద మీడియా గదిని ఏర్పాటు చేయటంతోపాటు పాత్రికేయులకు టెలిఫోన్, ఫ్యాక్స్, కంప్యూటర్, ప్రింటర్లను అందుబాటులో ఉంచామని, వాటిని సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. లెక్కింపు కేంద్రాల వద్ద మున్సిపల్ కమిషనర్లు మీడియా సెంటర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు
సత్తుపల్లి, మే 7 : అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, సమాధినిష్టా గరిష్టుడు, భూతభవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన ప్రవక్త శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనా మహోత్సవాలు శుక్రవారం ఉదయం 8గంటలకు పట్టణ పరిధిలోని విరాట్‌నగర్‌లో వేంచేసియున్న స్వామి వారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయకమిటీ నిర్వాహకులు బుధవారం తెలిపారు. ఉదయం 6గంటలకు తోరణాల, గణపతిపూజ, 7గంటలకు స్వామివారి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు, 11గంటలకు స్వామివారికి ఆరాధన, మధ్యాహ్నం 12గంటలకు మహానైవేద్యం, మంత్రపుష్ప నీరాజనం అనంతరం మహాన్నదానం ఉంటుందని ఆలయ ధర్మకర్తలు ముగదంపురం రామకృష్ణ, మేడిది సత్యనారాయణ, పూచి సీతమ్మ, అర్చకులు రమేషాచార్యులు తెలిపారు.

ఘనంగా సాయిబాబా ఆలయ వార్షికోత్సవం
వైరా, మే 7: స్థానిక హరిహర సుత అయ్యప్ప క్షేత్రం నందుగల సాయిబాబా ఆలయ పంచమ వార్షికోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో తెల్లవారు జామున 6గంటలనుండే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పాలాభిషేకం, అష్టోత్తరం, పంచామృత స్నానాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి స్వయంగా భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి సోదరులు మహేందర్‌రెడ్డి, నరసింహరెడ్డి, ఎమ్‌ఎస్.ఎస్.ఎస్.ఇ బోర్డు మెంబర్ కట్ల రంగారావు, మాదినేని రాము, కట్ల నాగరాజు, రాచబంటి నాగేశ్వరావు, పసుపులేటి మోహన్‌రావు, రాపర్తి రంగారావు, ఫజల్, కొత్తా సీతారాములు, బ్రహ్మారెడ్డి, పోరిక లక్ష్మీబాయి, కూసంపూడి మాదవరావు, రేచర్ల నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

కౌంటింగ్‌కు అభ్యర్థులు సహకరించాలి
* ఎన్నికల అధికారి బెనర్జీ
కొత్తగూడెం రూరల్, మే 7: మండల పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపిటిసి, జడ్‌పిటిసి అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈ నెల 13న జరగనున్న కౌంటింగ్‌కు సహకరించాలని మండల ఎన్నికల అధికారి డాక్టర్ బి బెనర్జీ అన్నారు. బుధవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో జరిగిన కౌంటింగ్ నిర్వహణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. కౌంటింగ్ వద్ద మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేసి ప్రతిక్షణం వీడియో ద్వారా చిత్రీకరించడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థులతోపాటు ఒక ఏజెంట్‌కు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఏజెంట్లు ఏజెంట్ ఫాం కోసం శుక్రవారం కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎటువంటి కేసులున్నా అలాంటి వ్యక్తులను ఏజెంట్లుగా ఎంపికచేయకూడదన్నారు. ఎంపిటిసి అభ్యర్థుల కౌంటింగ్‌కు 12 రౌండ్లు, జెడ్‌పిటిసి అభ్యర్థుల కౌంటింగ్ 10 రౌండ్లు ఉంటాయని చెప్పారు. ఏజెంట్లు, అభ్యర్థులు కౌంటింగ్ రోజు ఉదయం 7.30 గంటలకే కౌంటింగ్ కేంద్రమైన ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో హాజరుకావాలని కోరారు. ఏజెంట్లు, అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం ప్రవేశించే సమయంలో సెల్‌ఫోన్, కెమెరా, ఎంటువంటి మరాణాయుధాలు తీసుకురావద్దన్నారు. మద్యపానం సేవించి కౌంటింగ్ కేంద్రానికి వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు మండే వీరహనుమంతరావు, శ్రీనివాసరెడ్డి, సోమరాజు మనోహర్, జెబి శౌరి, గుగులోత్ కృష్ణ, కున్సోత్ ధర్మా, జెడ్‌పిటిసి అభ్యర్థులు సలిగంటి శ్రీనివాస్, పాల్, వివిధ పార్టీల ఎంపిటిసి అభ్యర్థులు పాల్గొన్నారు.
.....................

* ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి
english title: 
t

జిల్లాలో సార్వత్రిక రణరంగం

$
0
0

గుంటూరు, మే 7: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఊహించినట్లుగానే రణరంగాన్ని తలపించింది. జిల్లావ్యాప్తంగా సగటున 82.71శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. తొలి రెండుగంటల్లో 14.5శాతం పోలింగ్ నమోదుకాగా, 11గంటలకు 35.7శాతం, ఒంటిగంటకు 47.2శాతం, 3గంటలకు 67శాతం, 5గంటలకు 74శాతం, 6గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 82.71శాతం పోలింగ్ నమోదైంది. గుంటూరు నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ఉదయం పోలింగ్ ప్రారంభంలోనే ఇవిఎంలు మొరాయించాయి. టెక్నీషియన్లు రంగంలోకి దిగి కొన్నిచోట్ల మొరాయించిన ఇవిఎంలను బాగుచేయగా, మరికొన్నిచోట్ల రీప్లేస్ చేయాల్సి వచ్చింది. దీనివల్ల ఆయా కేంద్రాల్లో సుమారు గంటపాటు పోలింగ్‌కు అంతరాయమేర్పడింది. జిల్లాలోని పల్నాడులో బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం వరకు టిడిపి,వైసిపి కార్యకర్తల నడుమ ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. నరసరావుపేట రూరల్ మండలం బసికాపురంలో సాక్షాత్తు టిడిపి ఎంపి అభ్యర్థి రాయపాటి సాంబశివరావు లక్ష్యంగా ప్రత్యర్థులు దాడులకు తెగబడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడి గ్రామస్థులు మూకుమ్మడిగా రాయపాటి, ఆయన అనుచరులపై దాడికి దిగడంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని గన్‌మేన్ల సాయంతో బయటపడాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఎంపి రాయపాటి పోలీసు ఉన్నతాధికారులు, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్ పూర్తయ్యాక వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఈపూరు మండలం ఇనిమెళ్ల (ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు స్వగ్రామం)లో ఇరువర్గాలు రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో అదుపు చేయడం పోలీసులకు సైతం సాధ్యం కాలేదు. ఆ గ్రామంలో సుమారు రెండుగంటలకుపైగా ఈ దాడులు యథేచ్చగా కొనసాగాయి. స్థానిక సిఐ, ఎస్‌ఐలు వచ్చినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రత్యేక పోలీసుబలగాలను రప్పించి అదుపులోకి తెచ్చారు. బసికాపురంలో అక్కడ ఓట్లుగల అవిశాయపాలెం వారిని వైసిపి కార్యకర్తలు ఓట్లు వేయడానికి రాకుండా అడ్డుకుంటున్నారన్న సమాచారంతో తెలుగుదేశం పార్లమెంటు అభ్యర్థి, ఎంపి రాయపాటి సాంబశివరావు తమ వాహనంలో అనుచరులతో అక్కడకు వెళ్లారు. అయితే అప్పటికే పెద్దఎత్తున అక్కడ గుమిగూడి ఉన్న వైసిపి కార్యకర్తలు ఒక్కసారిగా రాయపాటి కారుపై ఎగబడి రాళ్లతో దాడికి దిగారు. ఎంపి రాయపాటిని గన్‌మ్యాన్లు జాగ్రత్తకు వెనక్కి తీసుకెళ్లగా, ఆయన అనుచరులు గాయపడ్డారు. నరసరావుపేట రెడ్డినగర్‌లో బిజెపి అసెంబ్లీ అభ్యర్థి నల్లబోతు వెంకట్రావు ప్రయాణిస్తున్న కారుపై కూడా వైసిపి కార్యకర్తలు దాడికి దిగారు. నరసరావుపేట అసెంబ్లీ పరిధిలోని రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెం తెలుగుదేశం ఏజంట్‌ను వైసిపి కార్యకర్తలకు బయటకు లాగేసే ప్రయత్నం చేయగా, టిడిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు అక్కడకు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నంలో గాలిలోకి కాల్పులు జరిపారు. నరసరావుపేట రూరల్ మండలం రంగారెడ్డిపాలెం, రొంపిచర్ల మండలం బుచ్చిబాపన్నపాలెంలలో టిడిపి ఏజంట్లను వైసిపినాయకులు బయటకు లాగేశారు. గురజాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నడికుడిలో టిడిపి-వైసిపి కార్యకర్తల ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా వైసిపి నేతలు ప్రకాష్‌రెడ్డి, రమేష్‌రెడ్డిలను టిడిపి కార్యకర్తలు రాళ్లతో వెంబడించి కొట్టడంతో వారు తీవ్రంగా గాయపడగా, పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలించారు. వినుకొండ అసెంబ్లీ పరిధిలోని శావల్యాపురం మండలం వేల్పూరులో వృద్ధులతో ఓట్లు వేయించే విషయమై టిడిపి-వైసిపి నేతలు ఘర్షణకు దిగారు. ఈ సమయంలో అక్కడకు చేరుకున్న ఎస్‌ఐ రవికృష్ణ మాజీ సర్పంచ్, టిడిపి నేత హైమారావు కణతకు తుపాకీ గురిపెట్టి కాల్చిపారేస్తానంటూ వీరంగం సృష్టించారు. ఈపూరు మండలం వరికుంటలో ఒక పార్టీకి అనుకూలంగా ఓటేయమని చెబుతున్న ఎపిఓ సత్యనారాయణను విధులనుంచి తప్పించారు. గురజాల అసెంబ్లీ పరిధిలోని మాచవరం మండలం గోవిందాపురంలో టిడిపి-వైసిపి కార్యకర్తలు బల్లలు, కుర్చీలుఎత్తి కొట్టుకోవడంతో కొద్దిసేపు పోలింగ్ నిలచిపోయింది. ఆ తర్వాత పోలీసులు జోక్యం చేసుకొని యథావిధిగా కొనసాగించారు. పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో అచ్చంపేట మండలం రుద్రవరం, బెల్లంకొండ మండలం పాపాయపాలెం, క్రోసూరు మండలం గరికపాడులో ఇరువర్గాలు ఘర్షణలకు దిగగా, పలువురికి గాయాలయ్యాయి. రుద్రవరం టిడిపి ఏజంట్ రమేష్‌పై వైసిపి కార్యకర్తలు దాడిచేయగా, తలకు గాయమైంది. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నకరికల్లు మండలం చేజర్లలో వైసిపి కార్యకర్తల దాడిలో ఇద్దరు టిడిపి కార్యకర్తలకు గాయాలయ్యాయి. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రెంటచింతలలో టిడిపి నేత వెలిగండ్ల రమేష్‌ను వైసిపి కార్యకర్తలు కొట్టగా, రెంటాలలో వైసిపి నేత పమ్మి సీతారామిరెడ్డిపై టిడిపి కార్యకర్తలు దాడిచేశారు. తర్వాత పోలీసులు అక్కడకు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని స్టాల్‌గళ్స్ హైస్కూలు 143వ నెంబర్ పోలింగ్ బూత్ వద్ద దొంగఓట్లు వేయడానికి వచ్చిన నలుగురు మహిళలను టిడిపి అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వేమూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని కొల్లూరు మండలం దొనేపూడి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్, టిడిపి కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో అక్కడకు చేరుకున్న ఎస్‌ఐ వెంకటయ్య వైఎస్సార్ సిపి వారి ఇళ్లలోకి వచ్చి లాఠీచార్జికి దిగారు. దీంతో ఆగ్రహించిన మహిళలు ధర్నాకు దిగడంతో వైసిపి అభ్యర్థి మేరుగ నాగార్జున అక్కడకు చేరుకొని సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. పొన్నూరు మండలం కట్టెంపూడిలో తెలుగుదేశం వారు తమవారిని ఓటింగ్ రాకుండా అడ్డుకుంటున్నారంటూ వైసిపి కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. రేపల్లెలో బందోబస్తు విధుల కోసం కరీంనగర్ జిల్లానుంచి వచ్చిన హోంగార్డు వైకుంఠం గుండెపోటుతో మృతిచెందారు. రేపల్లె నియోజకవర్గ పరిధిలోని నిజాంపట్నం మండలం గోకర్ణమఠంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పెద్దింటి చినవీరరాజు వాహనంపై తాజామాజీ ఎమ్మెల్యే సోదరుడు మోపిదేవి హరనాథ్‌బాబు దాడికిదిగారు. జిల్లాలోని వినుకొండ, మాచర్ల, పెదకూరపాడు, గురజాలలో సాయంత్రం 5గంటలకే పోలింగ్ ముగియగా, మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 6గంటల వరకు కొనసాగింది. జిల్లావ్యాప్తంగా 20మందికి పైగా టిడిపి, వైసిపి కార్యకర్తలు ప్రత్యర్థుల దాడుల్లో గాయాలపాలయ్యారు. రాజుపాలెం మండలం గణపవరంలో టిడిపికి చెందిన మహిళలపై ఓ వైఎస్సార్ కాంగ్రెస్ నేత అనుచిత ప్రవర్తనకు నిరసనగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు ధర్నాకు దిగారు. మొత్తమీద అత్యంత సమస్యాత్మకమైన పల్నాడులో పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి.

జిల్లాలో 82.71 శాతం పోలింగ్
గుంటూరు (సిటీ), మే 7: చెదురుమదురు సంఘటనల మినహా జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రెండు పార్లమెంటు స్థానాలు, 17 అసెంబ్లీ స్థానాలకు బుధవారం జరిగిన ఎన్నికలు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. మండుటెండను సైతం లెక్కచేయకుండా మహిళలు, పలువురు వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి చిలకలూరిపేట, మంగళగిరి, బాపట్ల నియోజకవర్గాల పరిధిలో పలు ఇవిఎంలు మొరాయించాయి. అయితే అందుబాటులోని ఇవిఎంలతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టడంతో ఆయా ప్రాంతాల్లో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల సమయానికే మొత్తం 14.5 శాతం పోలింగ్ నమోదు కాగా, 9 నుంచి 11 గంటల సమయానికి 35.7, 11 నుంచి మధ్యాహ్నం 1 గంట సమయానికి 47.2, 1 నుంచి 3 గంటల సమయానికి 67 శాతం, 3 నుంచి 5 గంటల వరకు 74 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 17 నియోజకవర్గాల్లో పెదకూరపాడు, గురజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లోని పోలింగ్‌ను అధికారులు సాయంత్రం 5 గంటలకే నిలిపివేశారు. మిగిలిన 13 నియోజకవర్గాల్లో పట్టణ ప్రాంతాల్లో మినహా గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి సైతం ఓటర్లు బూత్‌ల వద్ద బారులు తీరి ఉన్నారు. ఓటు హక్కు వినియోగానికి వచ్చిన ఓటరు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటుహక్కును వినియోగించుకునేలా పోలీసు యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్, నరసరావుపేట రిటర్నింగ్ అధికారి, జెసి వివేక్‌యాదవ్ క్షుణ్ణంగా పరిశీలించారు. జెసి నరసరావుపేటలో పర్యటించి వేములూరుపాడు, ఫిరంగిపురం, నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను స్వయంగా సందర్శించారు. అక్కడి ఓటర్లతో మాట్లాడి వౌలిక వసతులపై ఆరాతీశారు. ఫొటో ఓటరు స్లిప్పు పూర్తిస్థాయిలో పంపిణీ జరిగిందా లేదా అనే విషయాలను జెసి సంబంధిత బూత్ లెవల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బూత్‌లోకి వెళ్లే సమయంలో మహిళలకు ప్రత్యేక క్యూలైను ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా పలువురు పిఒలను ఆదేశించారు. కలెక్టర్ నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. ఎస్‌కెబిఎం హైస్కూల్, చలమయ్య స్కూలు, స్టాల్ గర్ల్స్ హైస్కూల్‌తో పాటు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన పోలింగ్ సరళిపై సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం నగరంపాలెంలోని స్టాల్‌గర్ల్స్ హైస్కూల్‌లో కలెక్టర్, జెసి దంపతులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ ఎన్నికల పోలింగ్ సరళిని కలెక్టర్ వెబ్‌కాస్టింగ్ ద్వారా కలెక్టరేట్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు పలువురు పిఒలతో ఆయన ఫోన్‌లో సంభాషించి అక్కడి పరిస్థితులపై ఆరాతీశారు. రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ మధ్యాహ్నం 2 గంటల సమయంలో జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో సంభాషించి పోలింగ్ సరళిపై వివరణ కోరారు. ప్రతి 2 గంటలకొకసారి పోలింగ్ శాతాన్ని రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సమాచార కేంద్రాలకు జిల్లా అధికారులు వెల్లడిస్తూ వచ్చారు. సాయంత్రం 6 గంటలకు జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిన అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రీ పోల్‌ను తావులేకుండా జిల్లాలో సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. మొత్తంగా 82.71 శాతం పోలింగ్ నమోదైందన్నారు. పోలింగ్ ప్రక్రియలో భాగస్వాములైన పోలీసు, రెవెన్యూ ఇతర అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు.

కల్తీ మద్యం నిల్వల కేసు...
పొన్నూరు వైసిపి అభ్యర్థి రావి అరెస్ట్
గుంటూరు (క్రైం), మే 7: గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావి వెంకటరమణను ఎక్సైజ్ పోలీసులు బుధవారం సాయంత్రం 5గంటల సమయంలో అరెస్ట్ చేశారు. యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలోని ఓ పత్తి మిల్లులో అక్రమంగా కల్తీ మద్యాన్ని నిల్వ ఉంచారంటూ ఇటీవల వెంకటరమణపై కేసు నమోదైంది. అయితే ఎన్నికల నేపథ్యంలో తన అరెస్ట్‌పై ఆయన హైకోర్టు నుంచి స్టే పొందారు. స్టే గడువు 7న సాయంత్రం 5గంటలకు ముగియడంతో అప్పటికే ఆయనతో పాటు కాపుకాసి ఉన్న ఎక్సైజ్ పోలీసులు గుంటూరు సాంబశివపేటలోని ఆయన కార్యాలయం వద్దకు రాగానే అరెస్ట్ చేశారు. వెంకటరమణను చిలకలూరిపేట ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

స్వల్ప ఘటనలు మినహా సత్తెనపల్లిలో పోలింగ్ ప్రశాంతం
సత్తెనపల్లి, మే 7: సత్తెనపల్లి నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు స్వల్ప సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. ఉదయం ఏడుగంటలకే ఓటర్లు బారులు తీరారు. తుది గడువు సమయానికి 80.4శాతంగా నమోదయింది. పట్టణంలో ఎటువంటి అవాంఛానీయ సంఘటనలు జరగకుండా సర్కిల్ ఇన్స్‌పెక్టర్ యు శోభన్‌బాబు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్ళ మండలం మాదల గ్రామంలో దేశం, వైసిపీ వర్గాలు బాహాబాహీకి దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. అలాగే పలుదేవర్లపాడు గ్రామంలో వైసిపీకి చెందిన జక్క్రయ్య, జగన్నాధం, సుందరావులపై టిడిపి నాయకులు దాడి చేయడంతో వారికి స్వల్ప గాయాలైనాయి. వారిని అంబులెన్స్ సహాయంతో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అదే మండలంలోని రుద్రవరంలో టిడిపి ఎజెంట్‌పై వైసిపీ వర్గం దాడి చేయడంతో తలకు తీవ్రగాయాలైనాయి. నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో వైసిపీ వర్గం టిడిపి వర్గీయులపై దాడి చేయడంతో ఇద్దరికి గాయాలైనాయి. సత్తెనపల్లి మండలంలోని గుడిపూడి గ్రామంలో టిడిపి, వైసిపీలు పరస్పర దాడికి దిగగా పోలీసులు అప్రమత్తం కావడంతో వివాదం సద్దుమణిగింది. అదే మండలంలోని లక్కరాజు గార్లపాడులో బొమ్మనబోయిన వెంకయ్యపై టిడిపి వర్గీయులు దాడి చేయడంతో ఆయనకు స్వల్ప గాయాలైనాయి. రాజుపాలెం మండలంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. డిఐజి రాథోడ్ నియోజకవర్గంలోని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. వైసిపి అభ్యర్థి అంబటి రాంబాబు పదవ వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకోక, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యర్రం వెంకటేశ్వరరెడ్డి తన స్వగ్రామమైన లంకెలకూరపాడులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఊహించినట్లుగానే రణరంగాన్ని తలపించింది. జిల్లావ్యాప్తంగా సగటున
english title: 
j

పోలింగ్ 76శాతం

$
0
0

శ్రీకాకుళం, మే 7: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కావల్సిన పోలింగ్ 58 పోలింగ్ కేంద్రాల్లో ఇ.వి.ఎం.లు మోరాయించడంతో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. కాని - 2009 ఎన్నికల కంటే మూడు శాతం అధికంగా పోలింగ్ జరిగింది. జిల్లా అంతటా 76 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మూడు కొట్లాటలు...ఆరు ఘర్షణలతో ముగిసిన ఈ ఎన్నికల పోలింగ్ ముగింపు తర్వాత ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం కొత్తకోటలో వైకాపా - టిడీపీ పార్టీ వర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఇందులో వైకాపాకు చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రిమ్స్ ఆసుపత్రికి చికిత్సకై తరలించగా, ఆ గ్రామంలో పోలీసులు పికెటింగ్ నిర్వహించారు. ఇదిలా ఉండగా, శ్రీకాకుళం అసెంబ్లీలో కాంగ్రెస్ గుర్తు ఉన్న న్యూస్‌పేపర్‌తో పోలింగ్ నిర్వహిస్తున్న అధికారులను ఓటు వేసేందుకు వెళ్లిన ఓటర్లే నిలదీసిన వైనం కన్పించింది. బందరువానిపేట, కళింగపట్నం గ్రామాల్లో పోలింగ్ మందకొడిగా సాగింది. రాజకీయ నేతలు ఎక్కడపడితే అక్కడకు జెండాలు పట్టుకునితిరగడం వల్ల ఎన్నికల నిర్వాహణ అధికారులు ఇబ్బంది పడాల్సివచ్చింది. వైకాపా ఎం.పి. అభ్యర్థిని రెడ్డి శాంతి వాహనానికి జెండాతోనే పోలింగ్ కేంద్రాలకు వెళ్తుంటే ఎన్నికల అధికారులు ఆమెను శ్రీకూర్మంలో అడ్డుకున్నారు. శ్రీకాకుళం పట్టణంలో ఇ.వి.ఎం.లపై అవగాహన లేక సిబ్బంది పోలింగ్ ఆలస్యంగా నిర్వహించారు. దీంతో కలెక్టర్ సౌరభ్‌గౌర్ అక్కడకువచ్చి సమస్యను జటిలంకాకుండా చూసారు. వజ్రపుకొత్తూరు మండలం పొల్లాడ పోలింగ్ కేంద్రంలో విఆర్వో గుండెపోటుతో మృతి చెందారు. పాలకొండలో రిగ్గింగ్‌కు వచ్చిన మహిళను అక్కడ సిబ్బంది పసిగట్టి పట్టుకుని అడ్డుకున్నారు. పోలీసులకు అప్పగించారు.
ముగిసిన పోలింగ్ సరళి పరిశిలీస్తే....
ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ 58 కేంద్రాల్లో అర్థగంట ఆలస్యంగా ప్రారంభమైంది. మొదటి రెండు గంటల సమయానికి జిల్లాలో 14.12 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. 11 గంటల సమయానికి 32.12 శాతం, మధ్యాహ్నం ఒంటి గంటకు 52.88 శాతం పోలింగ్ నమోదుకాగా, మూడు గంటల సమయానికి 63.30 శాతం, సాయంత్రం ఐదు గంటల సమయానికి 71.75 శాతం పోలింగ్ నమోదుకాగా, సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసినప్పటికీ, క్యూలో వున్న ఓటర్లంతా వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇలా పోలింగ్ ప్రారంభ దశలో మందగొడిగా ప్రారంభమైనప్పటికీ, నాలుగు గంటలపాటు జోరందుకున్నా, జిల్లాలో ఉష్ణోగ్రత అత్యధికంగా ఉండడంతో 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ పోలింగ్ కేంద్రాలు చాలావరకూ ఖాళీగానే ఉన్నాయి. మరలా సాయంత్రం ఆరు గంటల వరకూ బారులుతీరిన ఓటర్లు కన్పించారు. జిల్లా ఎన్నికల అధికారి సౌరభ్‌గౌర్ పర్యవేక్షణలో రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎచ్చెర్లలో గల శివానీ కళాశాలకు ఇ.వి.ఎం.లు చేరడం ఆరంభమైంది. అభ్యర్ధుల భవితవ్యం భద్రంగా ఈ నెల 16 వరకూ అక్కడ ఉంచేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
ఈవిఎంలో భవితవ్యం

(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
ప్రధాన పార్టీల మధ్య ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఎన్నికల పోరు ఎటుదారితీస్తుందోనన్న భయం అటు అధికారులు..ఇటు ఓటర్లను ఉత్కంఠకు గురిచేస్తుంది. జిల్లా వ్యాప్తంగా భారీగా ఓటింగ్‌శాతం పెరగడంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగింది. సాంప్రదాయ ఓటర్లు వారివారి పార్టీలకు పల్లకి మోస్తారని బరిలో దిగిన అభ్యర్థులు ఎవరి ధీమాలో వారు ఉన్నారు. కొత్త ఓటర్లు మాత్రం ఎవరికి పట్టం కడతారో అన్న భయం అభ్యర్థులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నామినేషన్ ఘట్టం నుండి ప్రచార పర్వం పరిసమాప్తం వరకు ఎన్నో వ్యయప్రయాసలకు లోనై అభ్యర్థులు పడ్డ శ్రమను ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పకతప్పదు. పోలింగ్ కేంద్రాల నుండి తమ ఓటుహక్కును వినియోగించుకుని ఇంటిముఖం పట్టిన అనేక మంది ఓటు ఏ పార్టీకి వేశారన్న విషయాన్ని కూడా వెల్లడించేందుకు నిరాకరించడం చాలాచోట్ల కనిపించింది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పార్టీలు మేనిఫెస్టోలకు ఓట్లు రాలుతాయని ధీమా వ్యక్తం చేసిన నేతలు అక్కడితో ఆగకుండా పోటాపోటీగా తాయిలాలు అందించారు. ప్రతీ నియోజకవర్గంలోను నువ్వా-నేనా అన్న రీతిలో రసకందాయమైన పోరు సాగడంతో ఓటరు నాడి కూడా అంతుచిక్కడం లేదు. జిల్లాలో పార్టీల పరిస్థితిని మరింత లోతుగా పరిశీలిస్తే, ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూస్తున్నాయి. దివంగత ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ప్రభంజనం మాదిరిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గాలి వీస్తుందని ఆ పార్టీ అభ్యర్థులు ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఓటింగ్ సరళి మాత్రం వీటికి భిన్నంగా ఉందని విశే్లషకులు చెబుతున్నారు. దీనికి తోడు ఈ ఎన్నికలలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువత అంతా మోడీ, పవన్‌ల మాయలో పడిపోయారని మరికొంతమంది చెప్పుకొస్తున్నారు. ఇదే జరిగితే జిల్లాలో అధిక స్థానాలు తెలుగుదేశం పార్టీ దక్కించుకోవడం ఖాయం. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి మునుపెన్నడూ లేని విధంగా ప్రధాన సామాజిక వర్గాల అభ్యర్థుల నడుమ త్రిముఖ పోటీ హోరాహోరీగా సాగింది. అనుకున్నట్టే ఎర్రన్న వారసుడికి సానుభూతి అండగా నిలవడమే కాకుండా మోడీ ప్రభంజనం కూడా కలసి వస్తుందని విశే్లషకులు చెబుతున్నారు. ఇచ్ఛాపురంలో టిడిపికి సానుకూలంగా ఉండగా, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, ఆమదాలవలస నియోజకవర్గాల్లో వైకాపా- తెలుగుదేశం పార్టీల అభ్యర్థులు నడుమ ఉత్కంఠభరితంగా పోరు సాగినట్లు సమాచారం. పాతపట్నంలో ఫ్యాన్ గాలి స్పీడ్‌కు శత్రుచర్లకు భంగపాటు తప్పదనే ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వైకాపా- టిడిపి నువ్వా-నేనా అన్న రీతిలో పోరు సాగినట్లు సమాచారం. నరసన్నపేట పోలింగ్ సరళితో కృష్ణదాస్ శిబిరంలో కలవరం మొదలైనట్లు చర్చ సాగుతున్నట్లు తెలిసింది. ఆమదాలవలస నియోజకవర్గంలో మామ- అల్లుళ్ల మధ్య ఉత్కంఠమైన పోరు సాగగా బూర్జ ఓటర్లు ఎవరికి మొగ్గుచూపితే వారు అసెంబ్లీలో అడుగుపెడతారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పాలకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున బరిలో దిగిన నిమ్మక జయకృష్ణ గెలుపు దాదాపు ఖాయమని అక్కడ ప్రధాన పార్టీల నేతలు చెప్పకనే చెబుతున్నారు. రాజాం నియోజకవర్గంలో ప్రధాన పార్టీలకు రెబల్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కన్పిస్తుంది. రాజకీయ నేతలు, విశే్లషకులు అంచనాలు తారుమారవుతాయా, లేకుంటే వాస్తవ రూపం దాల్చుతాయా అన్న అంశం తేలాలంటే ఇ.వి.ఎం.ల్లో దాగివున్న జాతకాలు బయటపడాల్సిందే.

ఆర్‌ఒపై సిబ్బంది ఆగ్రహం

ఎచ్చెర్ల, మే 7: సార్వత్రిక ఎన్నికల విధులకై డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు హాజరైన ఎన్నికల సిబ్బందంతా ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం ఆర్.ఒ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసారు. సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ విధులు నిర్వర్తించేందుకు యధావిధిగా శివానీ ఇంజనీరింగ్ కళాశాల సముదాయానికి మంగళవారం వీరంతా చేరుకున్నారు. అయితే రిజర్వు సిబ్బందిగా 92 మందిని విధులకు వెళ్లకుండా నిలిపివేసినట్లు వారు ఆరోపిస్తున్నారు. ఇచ్ఛాపురం, రాజాం, వంగర, పాతపట్నం, సంతబొమ్మాళి తదితర ప్రాంతాలకు చెందిన ఈ సిబ్బందికి రాత్రి భోజనాలు కూడా సమకూర్చలేదని వారు ఆరోపిస్తున్నారు. ఉదయం అల్పాహారం, మంచినీరు ఇవ్వలేదంటూ ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని ఆర్.ఒ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించలేదన్నారు. దీనిపై కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశామని వారంతా పేర్కొన్నారు. పి.ఒ., ఎపిఒలకు రెండేసి వేలు, ఒపిఒకు 750 రూపాయలు ఎన్నికల విధుల నిమిత్తం చెల్లించాల్సి ఉన్నప్పటికీ మహిళా సిబ్బందికి మాత్రం కేవలం 250 రూపాయలే చెల్లించారన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లోనే ఆందోళన సాగిస్తుండగా ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించడంతో అక్కడకు చేరుకున్న హౌసింగ్ పి.డి రామనర్సింగరావు సిబ్బందితో చర్చించి సమస్యను పరిష్కరించడంతో వివాదం సద్దుమణిగింది.

ఎండ తీవ్రతతో ఓటర్లకు ఇక్కట్లు
శ్రీకాకుళం(రూరల్), మే 7: ఓ వైపు సార్వత్రిక ఎన్నికల పోలింగ్, మరోవైపు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఓటర్లు ఉక్కపోతకు గురయ్యారు. పోలింగ్ కేంద్రాల వద్ద చెట్ల నీడన కొంత ఉపశమనం పొందినప్పటికీ మధ్యాహ్న సమయంలో పోలింగ్ కేంద్రాలన్నీ నిర్మాణుష్యంగా మారాయి. గత వారంరోజుల కన్నా బుధవారం ఎండతీవ్రత అధికంగా ఉందని పలువురు ఓటర్లు వాపోతున్నారు. 12 గంటల నుంచి మూడు గంటల వరకు పోలింగ్ కేంద్రాలు ఖాళీగానే కనిపించాయి. సాయంత్రం సమయంలో మరలా ఓటర్లు ఓటు వేసేందుకు బయటపడ్డారు. కొన్నిచోట్ల నీడ కోసం షామ్యానాలు వేసినప్పటికీ మరికొన్నిచోట్ల నీడ లేకపోవడంతో ఓటర్లు తమ కొంగులతో ఎండ నుంచి ఉపశమనం పొందారు. అందులో వృద్ధులు మరీ ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఏజెంటును కొట్టిన ఓటరు
*కుమ్మరిగుంటలో ఉద్రిక్తత
సారవకోట, మే 7: మండలంలో బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కుమ్మరిగుంట పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ యాళ్ల జనార్ధనరావును ఇదే గ్రామానికి చెందిన పి.మాధవరావు అనే ఓటరు కొట్టాడు. మాధవరావు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన సందర్భంలో జరిగిన ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన మాధవరావు అకస్మాత్తుగా వైఎస్సార్‌సీపీ ఏజెంట్ యాళ్ల జనార్ధనరావుపై చేయి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చిన్నాల సోదరుల స్వగ్రామంలో మొట్టమొదటిసారిగా పోలింగ్ సందర్భంగా ఘర్షణ చోటుచేసుకోవడంతో పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయోనని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విషయాన్ని తెలుసుకున్న ఎస్సై గణేష్ మొబైల్ పార్టీతో గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రత్యేక డిఎస్పీ శ్రీనివాసరావు గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో పోలీసు పికెట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏజెంట్‌పై చేయి చేసుకున్న ఓటరు మాధవరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చివరి నిముషంలో మొరాయించిన ఇవిఎం
* 6.45 వరకు కొనసాగిన పోలింగ్
పోలాకి, మే 7: మండలంలో డోల పోలింగ్ కేంద్రం 212లో చివరి నిముషంలో ఇ.వి.ఎం మొరాయించడంతో పోలింగ్ సాయంత్రం 6.45 గంటల వరకు కొనసాగింది. అసెంబ్లీ స్థానానికి సంబంధించిన మిషన్ మొరాయించడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై మరో మిషన్‌ను తీసుకువచ్చి ఏర్పాటు చేశారు. అయితే ఈ కేంద్రంలో 1063 ఓట్లు ఉండగా 783 పోలయ్యాయి. 775 ఓట్లు వినియోగించిన వరకు పనిచేసిన మిషన్ చివరి నిముషంలో ఆగడంతో అధికారులు మొదటి మిషన్‌ను సీజ్ చేసి మిగిలిన ఎనిమిది ఓట్లను మరో మిషన్‌పై వేయించారు.
కొత్తకోటలో వైసిపి, టిడిపి వర్గాల కొట్లాట
* నలుగురికి గాయాలు
సరుబుజ్జిలి, మే 7: మండలంలోని కొత్తకోట గ్రామంలో బుధవారం పోలింగ్ ముగిసిన తరువాత టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాల మధ్య కొట్లాట జరిగింది. పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న వాగ్వివాదాలు ఇతర కక్షలు కారణంగా ఈ కొట్లాట జరిగినట్లు తెలిసింది. ఈ సంఘటనలో వైకాపా వర్గానికి చెందిన శివ్వాల ప్రసాద్ ,మామిడి రాంబాబు, తేజ, సురవరపు నారాయణరావులకు గాయాలయ్యాయి. వెంటనే వీరిని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన జరిగిన తక్షణమే ఆముదాలవలస, సరుబుజ్జిలి మండలాలకు చెందిన పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. అనంతరం ఆ గ్రామంలో పోలీసులను మోహరించారు.
కౌంటింగ్ కేంద్రాలకు ఇవిఎంలు

పాతశ్రీకాకుళం, మే 7: ఉత్కంఠ వాతావరణంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు తెరపడింది. జిల్లాలో పది అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి పోలింగ్ ముగిసింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో దేశ భవితను, రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర భవిష్యత్‌ను ఓటర్లు తన విజ్ఞతతో నిర్ధేశించారు. జిల్లా వ్యాప్తంగా 2550 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు ఆరువేల ఇ.వి.ఎం.లను వినియోగించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లా కేంద్రంలో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరుగంటలవరకు పోలింగ్ నిర్వహించారు. కొన్నిచోట్ల ఇ.వి.ఎం.ల మొరాయింపు తదితర కారణాల వల్ల ఏడుగంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. ప్రతి పోలింగ్ కేంద్రం నుండి ఇ.సి.ఐ.ఎల్ కంపెనీకి చెందిన సాంకేతిక నిపుణులు ఇ.వి.ఎం.ల పనితీరును పరిశీలించారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఎన్నికల అధికారులు ఏజెంట్ల సమక్షంలో ఇ.వి.ఎం.లకు సీళ్లు వేశారు. ఇందులో లోక్‌సభ ఇ.వి.ఎం. బాక్సుపై తెలుపు, అసెంబ్లీ ఇ.వి.ఎం. బాక్సుపై పింక్ లేబుల్‌ను అతికించి మార్క్ చేశారు. అనంతరం నిర్ధేశించిన వాహనాల్లో ఎచ్చెర్ల మండలం చిలకపాలెంకు ఇ.వి.ఎం.లను చేరవేశారు. ఇక ఈ నెల 16వ తేదీన పార్లమెంట్‌తోపాటు అసెంబ్లీ అభ్యర్థుల భవిత తేలనుంది.

మొరాయించిన ఇవిఎంలు
పోలాకి, మే 7: పార్లమెంట్, శాసనసభ స్థానాలకు మండలంలో బుధవారం జరిగిన ఎన్నికల్లో రెండు చోట్ల ఇ.వి.ఎం.లు మొరాయించడంతో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు నిరీక్షించాల్సి వచ్చింది. మండలంలో గంగివలస పంచాయతీ కొండలక్కివలస పోలింగ్ స్టేషన్ 223లో లోక్‌సభ స్థానానికి చెందిన ఇ.వి.ఎం. మొరాయించింది. ఇక్కడ నిర్ణీత సమయానికే ప్రారంభమైన పోలింగ్‌లో 20 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్న తరువాత సుమారు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ యంత్రం మొరాయించింది. విషయం తెలుసుకున్న అధికారులు రెండు గంటల తరువాత మరో యంత్రాన్ని అమర్చి పోలింగ్ కొనసాగించారు. మరమ్మతుకు గురైన యంత్రాన్ని మొదటి వేసిన 20 ఓట్లతో సీజ్ చేశారు. ఈ విధంగా ఈ పోలింగ్ కేంద్రంలో ఇ.వి.ఎం మొరాయించడంతో పోలింగ్ సిబ్బంది ఖాళీగా ఉండాల్సి వస్తే ఓటర్లు గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. అయితే ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో కేవలం 123 మంది ఓటర్లు మాత్రమే ఉండటంతో పెద్దగా ఇబ్బంది లేకపోయింది. అలాగే మబగాం-195 పోలింగ్ కేంద్రంలో ఇ.వి.ఎం మొరాయించింది. కొద్దిసేపట్లోనే అధికారులు ఇక్కడ ఇ.వి.ఎం.ను మార్చారు. ఈ విధంగా అక్కడక్కడా ఇ.వి.ఎం.లు మొరాయించడంతో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు నిరీక్షించాల్సి వచ్చింది.
* బారులు తీరిన ఓటర్లు
స్థానిక పార్లమెంటరీ స్థానానికి, అలాగే శాసనసభ స్థానానికి బుధవారం నాడు జరిగిన సాధారణ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మండలంలో 65 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 49,586 మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు బారులు తీరడం కనిపించింది. మబగాంలో వైకాపా అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డోల జగన్మోహన్‌రావు కూడా స్వగ్రామమైన డోలలో తన ఓటు వేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సి.ఐ సూర్యనారాయణ, ఎస్సై సత్యనారాయణలు మండలమంతా పర్యటిస్తూ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల పరిశీలకులు దిలీప్‌కుమార్‌దాస్ పోలాకి తదితర పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల సరళిని పరిశీలించారు. అయితే మండలంలో వనిత మండలం పంచాయతీ జొన్నాం, మబగాంలలో వైఎస్సార్‌సీపీ, టిడిపి కార్యకర్తల మధ్య చిన్న చిన్న ఘర్షణలు చోటుచేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

ప్రశాంతంగా పోలింగ్
ఆమదాలవలస, మే 7: సార్వత్రిక ఎన్నికలు మండలంలో బుధవారం చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసాయి. మండలంలో కొల్లివలస, బొబ్బిలిపేట, కొర్లకోట, కనుగులవలస, చింతలపేట, కొత్తవలస గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ, టిడిపి కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ, తోపులాటలు జరిగాయి. ఈ సంఘటనలపై పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. మండలంలోని సమస్యాత్మక గ్రామాలపై పోలీసులు ప్రత్యేక నిఘా వేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. పట్టణంలో రైల్వేగేటు వద్ద ఉన్న పోలింగ్ కేంద్రంలో వైకాపా అభ్యర్థి తమ్మినేని సీతారాం తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.

అధునిక సాంకేతికతో ఎన్నికల పరిశీలన
శ్రీకాకుళం(టౌన్), మే 7: జిల్లాలో నిర్వహించిన ఎన్నికల సరళని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు అందజేసినట్లు జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి క్వాడ్రియం సాప్ట్‌వేర్ సంస్థ రూపొందించిన జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా మొబైల్‌కు కంప్యూటర్‌ను అనుసంధానించి పోలింగ్ సరళిని పరిశీలించడంతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైనా ముందుగానే పసిగట్టి అక్కడి సిబ్బందికి తగుసూచనలు అందజేయడం ద్వారా ముందుగానే నివారించగలిగామన్నారు. ఈ సిస్టమ్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా విజువల్స్ చూడవచ్చని తెలిపారు. ప్రస్తుతం వందమంది అధికారులకు హేండ్‌సెట్ సెల్‌ఫోన్‌లో ఈ సాఫ్ట్‌వేర్‌ను అమర్చినట్లు తెలియజేశారు.
ఏ అధికారి ఎక్కడ ఉన్నదీ కనుగొనడంతో పాటు పోలింగ్ బూత్‌లో విషయాలు తెలుసుకునే వీలుంటుందన్నారు. దీనిద్వారా పోలింగ్‌బూత్‌ల్లో పొటోలు, వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఆయనతో పాటు డి ఎస్పీ పి.శ్రీనివాసరావు, ఎస్‌బి సి ఐ సతీష్ కుమార్‌లు ఉన్నారు.
14వ వార్డులో ఇరువర్గాల కొట్లాట
* పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
శ్రీకాకుళం(టౌన్), మే 7: స్థానిక 14వ వార్డు పరిధిలోని చేపలవీధి మున్సిపల్ స్కూల్ నందు ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకుంటుండగా మాటమాట పెరిగి చేలరేగిన వివాదం ఇరువర్గాల మద్య కొట్లాటకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే...చేపలవీధి మున్సిపల్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద సాయంత్రం ఓటర్లు క్యూలో నిల్చొన్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు కొంతమంది స్థానికులు క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలంటూ చేస్తున్న ప్రచారాన్ని స్థానిక దేశం పార్టీ నేత చూసి దేశం పార్టీ అభ్యర్థి లక్ష్మీదేవికి తెలియజేయడంతో ఆమె వర్గీయులు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి వైకాపా వర్గీయులను నిలదీశారు. దీంతో ఇరువర్గాల మద్య మాటమాట పెరిగి కొట్లాటకు దారితీసింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు టూ టౌన్ సిఐ పి.రాధాకృష్ణ ఆధ్వర్యంలో సంఘటనా స్థలికి చేరుకొని ఇరువర్గీయులను చెదరగొట్టారు. దీంతో వివాదం సద్దుమణిగి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
మత్య్సకారుల్లో కానరాని ఓటు చైతన్యం
శ్రీకాకుళం(టౌన్), మే 7: ఓటు నా హక్కు... ఓటు నా ఆయుధం...ఓటుహక్కుతో మంచి నాయకున్ని ఎన్నుకోండి..ఇది ఎన్నికల కమిషన్ లక్షల సొమ్ము ఖర్చుచేసి చేపట్టిన ప్రచారం. ఎందుకంటారా! ఈ ఎన్నికల్లో ఎలాగైనా ప్రజలందరితో ఓటువేయించాలని, అధిక ఓటు శాతం నమోదు కావడం ద్వారా ఓటరు నాడి అంతుబట్టకుండా సరైన నాయకున్ని ఎన్నుకోవాలన్న ఉద్దేశ్యంతో కమీషన్ చేపట్టిన చైతన్య సదస్సులు తుస్సుమన్నాయనే చెప్పొచ్చు. లక్షలు ఖర్చుచేసి చేపట్టిన ఓటరు చైతన్య సదస్సు యాత్రలు మత్య్సకారుల్లో చైతన్యం తేలేకపోయాయి. గార మండలం బందరువానిపేట గ్రామంలో పూర్తిగా మత్స్యకారుల ఓట్లే ఉన్నాయి. అయితే బందరువానిపేట పోలింగ్ కేంద్రాల్లో 62, 63, 64 తదితర బూత్‌ల్లో అసలు ఓటర్లు కానరాకపోవడం విశేషం. వీధుల్లో అక్కడి గ్రామప్రజలు తిరుగాడుతున్నప్పటికీ, ఓటు వేయడానికి మధ్యాహ్నం వరకు వారు పోలింగ్ కేంద్రానికి చేరకపోవడంతో పోటీలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఓటర్లను కేంద్రాలకు రప్పించి ఓటేయించాల్సి వచ్చింది.

పారితోషికం కోసం అంగన్‌వాడీల ఆందోళన
పాతశ్రీకాకుళం, మే 7: ‘‘పోలింగ్ శాతాన్ని పెంచడానికి మేం ఎంతో శ్రమించాం. ఎన్నికలు పూరె్తైన వరకు మా సేవలు వినియోగించుకొని అధికారులు మాకు ఎలాంటి పారితోషికం చెల్లించకపోగా చీదరించుకోవడం, అవమానించడం తట్టుకోలేకపోతున్నాం’’ అంటూ అంగన్వాడీలు ఆవేదన వ్యక్తంచేశారు. గత మూడురోజులుగా ఇంటింటికి వెళ్లి ఓటరు స్లిప్పులు పంపిణీ చేశామని, అధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల ముందురోజు రాత్రి 8.30 గంటల వరకు పోలింగ్ కేంద్రం వద్ద హాజరై ఓటర్లకు సహకరించామని వాపోయారు. పోలింగ్ రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు ఆరుబయట వేచి ఉండి విధులు నిర్వహించిన తమకు అధికారులు చీదరించుకోవడంతో మనస్థాపానికి గురయ్యామని బిఎల్‌ఒలు సునీత, బి.సూర్యకుమారి, పైడితల్లిలు విలేఖరుల ముందు వాపోయారు. అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు నేపథ్యంలో అధికారులు రాతపూర్వక ఆదేశాల మేరకు గత నాలుగురోజులు సంపూర్ణ సేవలను చేయించుకున్నారని, పారితోషికం కోరిన తమకు ఎన్నికల విధులకు ఎవరు రమ్మన్నారంటూ అవమానించారన్నారు. జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ బూత్ ముందు నిరసనతెలిపారు.

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కావల్సిన పోలింగ్ 58
english title: 
p

టిడిపి, వైకాపా నువ్వా.. నేనా!

$
0
0

విశాఖపట్నం, మే 7: ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన పోలింగ్ ముగిసింది. ఓటర్లు అభ్యర్థుల జాతకాలను రాసేశారు. వీటిని స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. 16వ తేదీన అభ్యర్థుల జాతకాలు వెలువడనున్నాయి. అప్పటి వరకూ అభ్యర్థులకు కంటిమీద కునుకు ఉండదు. సుమారు మూడు నెలల నుంచి ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. ఇందులో పార్టీల నాయకులు, కార్యకర్తలు చమటోడ్చి పనిచేయాల్సి వచ్చింది. జిల్లాపరిషత్, మున్సిపల్, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇక ఒక్కటొక్కటిగా వెలువడనున్నాయి. ఫలితాలు వచ్చే వరకూ పార్టీ శ్రేణులకు కాస్తంత విశ్రాంతి లభించినట్టయింది. ప్రచారాల్లో ఎండనక, వాననక, రాత్రనక, పగలనక తిరిగిన అభ్యర్థులు విశ్రాంతి తీసుకోడానికి వేర్వేరు ప్రాంతాలకు ప్రయాణం కడుతున్నారు. జిల్లాపరిషత్, మున్సిపల్ ఫలితాలపై అందరూ దృష్టి పెట్టకపోయినా, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపైనే అందరి కళ్ళూ ఉన్నాయి. ఈ ఫలితాలపై అప్పుడే బెట్టింగులు మొదలయ్యాయి. ముఖ్యంగా, వైకాపా, టిడిపిలపై బెట్టింగులు జోరుగా జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో భారీ పోలింగ్ జరుగుతుందని భావించారు. కానీ జిల్లా వ్యాప్తంగా 70 శాతానికి మించి పోలింగ్ జరగకపోవడం వలన ఏ పార్టీకి లాభిస్తుందన్నది ప్రశ్నార్థంగా మారింది. పోలింగ్ సరళిలో మార్పు రావడం వలన అంచనాలు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఆయా పార్టీల విజయావకాశాలు మెరుగుపడినట్టు క్యాడర్ ద్వారా తెలుసుకుంటున్న అభ్యర్థులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇరు పార్టీలకు విజయావకాశాలు సగం సగం ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులకు కంటిమీద కునుకు ఉండే పరిస్థితి లేదు. కాగా ఈ ఎన్నికల్లో ఓటర్లు అభ్యర్థులకు విలువ ఇవ్వలేదు. కేవలం డబ్బులకే ప్రాధాన్యత ఇచ్చినట్టు తేలిపోయింది. గాజువాక నియోజకవర్గంలో ఒక అభ్యర్థి దండిగా డబ్బులు ఖర్చు చేస్తే, మరో అభ్యర్థి అంతగా తూగలేకపోయారు. దీంతో డబ్బిచ్చిన అభ్యర్థికే ఓటర్లు జై కొట్టినట్టు తెలుస్తోంది. చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. ఒక్కో నియోజకవర్గంలో ఓటుకు 1000 రూపాయల చొప్పున కూడా పంపిణీ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఎన్నికల సంఘం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడం విచారకరం.
జిల్లాలో మందకొడిగా పోలింగ్
జిల్లాలో బుధవారం జరిగిన పోలింగ్ మందకొడిగా సాగింది. చాలా చోట్ల ఉదయం 6.30 గంటల నుంచే ఓటర్లు క్యూలలో నిలబడ్డారు. నగరంలోని పలు పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు బారులుతీరి కనిపించారు. మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో పెద్దగా ఓటర్లు లేకపోవడంతో పోలింగ్ ఆరంభమైన తొలి రెండు గంటల్లో అధికారుల లెక్కల ప్రకారం కేవలం 11.7 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 11 గంటలకు 30.97 శాతం, ఒంటి గంటకు 47.04 శాతం ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం మూడు గంటలకు 56.40 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం ఆరు గంటలకు 69 శాతం ఓట్లు పోలయ్యాయి. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
--------------------------------------------------
నియోజకవర్గం 9గం. 11గం. 1గం. 3గం. 6గం.
---------------------------------------------------
ఎస్‌కోట 20 38 49 58 68
భీమిలి 16 25 42 58 72
విశాఖ తూర్పు 05 26 48 53 62
విశాఖ దక్షిణం 11.72 22 40.21 49.02 65
విశాఖ ఉత్తరం 12 29.30 38.40 49.30 59
విశాఖ పశ్చిమం 11 25.20 48 49.17 60
గాజువాక 22 28 32 45.23 61
చోడవరం 15 39 56 70 82
మాడుగుల 14 31 43 56 78
అనకాపల్లి 13 32 56 62 82
పెందుర్తి 10 34 58.16 70.46 77
యలమంచిలి 21 33 53 65 86
పాయకరావుపేట 22 38 52 63.25 73
నర్సీపట్నం 16 34.25 50 65 81
అరుకు 11 29 41 55 62
పాడేరు 19 32.60 51 51 54
----------------------------------------------------
మొత్తం 11.710 30.97 47.04 56.40 68
---------------------------------------------------

సెహభాష్ ఈసీ
ఎన్నికల కమీషన్ కృషి వల్ల పెరిగిన పోలింగ్ శాతం
ఓటర్లలో పెరిగిన చైతన్యం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 7: ఎన్నికల కమిషన్ తీసుకున్న పలు నిర్ణయాల ప్రభావం ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో స్పష్టంగా కన్పించింది. ఓటరు నమోదు నుంచి శతశాతం ఓటు హక్కు వినియోగంపై కొద్ది రోజులుగా చేస్తున్న ప్రచారం మంచి ఫలితాన్నిచ్చింది. ఈదేశానికి అవసరమైన నాయకుణ్ణి ఎన్నుకునేందుకు ఓటు హక్కు వినియోగం ఒక్కటే మార్గమని భావించిన ఓటర్లు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారనే చెప్పాలి. యువ ఓటర్లతో పాటు చదువుకున్న వారంతా ఈసారి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపడం విశేషం. జిల్లాలో తొలిసారి ఓటు హక్కును పొందిన యువ ఓటర్లు 8 శాతం ఉండగా వీరిలో అత్యధికులు పోలింగ్ స్టేషన్లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలోనే పోలింగ్‌లో పాల్గొనడం విశేషం. ఓటర్లలో చైతన్యం ద్వారానే ఈసారి ఎన్నికల్లో భారీ పోలింగ్ సాధ్యమైందని చెప్పాలి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు కూడా ఓటింగ్ పెరుగుదలకు కారణంగా విశే్లషకులు భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ పోలింగ్‌లో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపని వర్గాలు సైతం ఈసారి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపాయి. ఉద్యోగస్తుల కుంటుంబాలు కూడా ఈసారి ఓటు వేసేందుకు ఆసక్తి కనబరిచాయి. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగులు, కార్మికులు, ఇతర సిబ్బందికి తప్పనిసరిగా ఆర్జిత సెలవు మంజూరు చేసే విధంగా ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు ఖచ్చితంగా అమలు చేసేందుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయనే చెప్పాలి. నగరంలో షాప్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం అన్ని వ్యాపార సంస్థలు సెలవు ప్రకటించాయి. దీంతో ఉద్యోగ, కార్మిక వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సందడి మినహా పట్టణంలోని ప్రధాన ప్రాంతాలన్నీ దాదాపునిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ, ఇతర ప్రేవేటు వాహనాలను ఎన్నికల విధులకు తరలంచడంతో రోడ్లపై వాహనాల సంచారం కూడా పెద్దగా కన్పించలేదు. దీనికితోడు ఉదయం నుంచి భానుడు తనప్రతాపాన్ని చూపడంతో జనం రోడ్డెక్కేందుకు ఇష్టపడలేదు.

రూరల్‌లో పెరిగి అర్బన్‌లో తగ్గిన పోలింగ్
* ఎవరికి లాభించేనో
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 7: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తీరు రాజకీయ పార్టీలను ఆలోచనలో పడేస్తోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 70 శాతంగా నమోదైన పోలింగ్ అర్బన్ పరిధిలోకి వచ్చే సరికి 60కి మించలేదు. దీంతో రూరల్ ప్రాంతాల్లో పెరిగి, అర్బన్‌లో తగ్గిన పోలింగ్ శాతంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న అంచనాల్లో రాజకీయ పార్టీలు నిమగ్నమైపోయాయి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సరళి సజావుగానే కొనసాగింది. రూరల్ పరిధిలో పోలింగ్‌లో ఎటువంటి మార్పు లేనప్పటికీ, నగర పరిధిలో మాత్రం తడబడుతూనే కొనసాగింది. వేసవి కాలం కావడంతో ఎండలకు భయపడిన ఓటర్లు పోలింగ్ ప్రారంభంలో కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 11 గంటల వరకూ పోలింగ్ భారీగానే నమోదైంది. ఉదయం నుంచి బారులు తీరిన ఓటర్లు మధ్యాహ్నం 12 గంటల సమయానికి కన్పించలేదు. తిరిగి 4 గంటల నుంచి సాయంత్రం వరకూ ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎండలకు భయపడే ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొని ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
విశాఖ అర్బన్ పరిధిలో తగ్గిన పోలింగ్ శాతంపై రాజకీయ పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. నగర పరిధిలో సాధారణంగానే ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది. అయితే రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొడతారని భావించారు. అందుకు అనుగుణంగానే రూరల్ పరిధిలో పోలింగ్ శాతం ఊహించిన దానికన్నా పెరిగింది. ఇక అర్బన్ పరిధిలో మాత్రం పోలింగ్ శాతం తగ్గుదల రాజకీయ పార్టీలను ఆలోచనలో పడేస్తోంది. ఇక్కడ తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. జిల్లాలోని రెండు పార్లమెంట్, 15 అసెంబ్లీ సెగ్మెంట్‌లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. విశాఖ పార్లమెంట్‌లో బిజెపి, వైకాపాల మధ్య పోరు నెలకొనగా, అనకాపల్లిలో తెలుగుదేశం, వైకాపాల మధ్య తీవ్ర పోటీ జరిగింది. పాడేరు, అరకు, విశాఖ దక్షిణ నియోజకవర్గాల్లో మినహా మిగిలిన అన్ని స్థానాల్లోను ముఖాముఖి పోరు నువ్వానేనా అన్నట్టు కొనసాగింది.

సమాచారం నాస్తి... సమస్యలు జాస్తి
విశాఖపట్నం, మే 7: పోలింగ్ ప్రశాంతంగానే సాగింది. పలుచోట్ల మహిళా ఓటర్లు అధికంగా కనిపించారు. అయితే సంబంధిత బూత్ నెంబర్లను తెలుసుకోవడం వీరికి కష్టమైంది. ఎటువంటి సమాచారం లేక, దీనిని అందించిన వారు అందుబాటులోకి రాకపోవడంతో ఓటర్లకు తిప్పలు తప్పలేదు. ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలోనే నాలుగు బూత్‌లున్నాయి. రోడ్డుకిరువైపుల ఏర్పాటైన ఈ బూత్‌లకు చెందిన నెంబర్లు తెలియజేసే బోర్డులు లేకపోవడంతో మహిళా ఓటర్లు పదేపదే బూత్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది. లోపల ఉండే పోలింగ్ అధికారుల వద్దకు వెళ్ళే వీలు లేక, పోలీసులకు సైతం తగిన సమాచారం తెలియక ఓటు వేయాల్సిన బూత్ కోసం మండుటెండలో సైతం మహిళలు అవస్థలు పడాల్సి వచ్చింది. చిన్న పిల్లలతో సహా మహిళలు, వృద్ధులు ఓపిగ్గా కాళ్లీడ్చుకుంటూ ఇక్కడికి చేరుకున్నారు. తీరా వచ్చేసరికి బూత్ నెంబర్ల కోసం అటుఇటు తిరగాల్సి వచ్చింది.
స్లిప్‌లు రాక సమస్యలు
ఓటరు కార్డులు కలిగి ఉన్న మహిళలు, పురుషులు తమ ఇళ్ళకు స్లిప్‌లు రాలేదంటూ బూత్‌ల వద్ద వాపోయారు. స్లిప్‌లున్న మరికొందరికి ఓటరు కార్డు లేకపోవడం మరో సమస్యగా మారింది. దీంతో ఏళ్ళ తరబడి ఒకే ప్రాంతంలో ఉంటూ రేషన్‌కార్డులు, పాస్‌పోర్టు, పాన్‌కార్డులతోపాటు ఓటరు కార్డు ఉందని, అయితే స్లిప్‌లు మాత్రం అందలేదంటూ ఇంకొందరు మహిళలు చెప్పుకోవాల్సి వచ్చింది. అసలే బూత్ నెంబరు తెలియక, ఆపైన స్లిప్‌లు జారీ కాక మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది.
పోలీసుల అతి
విశాఖ నగరంలో ప్రతి ఒక్క బూత్ వద్ద ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తలేదు. ఆయా రాజకీయపార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, వారి వెంట ఉండే సన్నిహితులు, నాయకులు, కార్యకర్తలు ప్రశాంత ఓటింగ్‌కు సహకరించారు. తప్పితే ఎటువంటి సంఘటనలు తలెత్తలేదు. అయితే పలుచోట్ల పోలీసుల అతి మరోసారి స్పష్టమైంది. ఇంజనీరింగ్ కాలేజీ లోపల భాగంలో ఏర్పాటైన నాలుగు పోలింగ్ బూత్‌ల వద్దకు వెళ్ళే వృద్ధులు, చిన్నపిల్లలతో ఉండే తల్లులు, గర్భిణులకు మాత్రం పోలీసుల నుంచి చేదు అనుభవమే ఎదురైంది.

* తగ్గిన పోలింగ్ శాతం * తారుమారైన అంచనాలు * అభ్యర్థుల విజయాలపై బెట్టింగులు * స్ట్రాంగ్ రూంకు చేరిన ఈవిఎంలు
english title: 
tdp

ఓటెత్తారు

$
0
0

మచిలీపట్నం, మే 7: జిల్లాలో బుధవారం నిర్వహించి న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. స్వల్ప సంఘటనలు మినహా చెప్పుకోదగ్గ అంశాలు లేవు. కొన్ని చోట్ల ఇవిఎంలు మొరాయించటంతో ఆయా కేంద్రాల్లో పోలింగ్‌లో జాప్యం ఏర్పడింది. పలు చోట్ల గుంపులు గుంపులుగా ఉన్న ఇరుపార్టీల కార్యకర్తలను పోలీసులు చెల్లాచెదురు చేశారు. మందుబాబుల వీరంగం ప్రత్యక్షం గా కనిపించింది. మండుటెండలను సైతం లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. ప్రారంభ దశలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి కనిపించారు. 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. రెడ్డిగూడెం మండలం రంగాపురం గ్రామంలో టిడిపి, వైఎస్‌ఆర్ సిపి కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఇరువర్గాలు ఘర్షణకు దిగగా పోలీసులు రంగ ప్రవేశం చేసి చెల్లాచెదురు చేశారు. ఇటువంటి స్వల్ప సంఘటనలు మినహా చెప్పుకోదగ్గ అంశాలు లేవు. పలుచోట్ల ఇవిఎంలు మొరాయించాయి. వాటి స్థానంలో అధికారులు కొత్త ఇవిఎంలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలింగ్‌కు కొంత సేపు అంతరాయం ఏర్పడింది. పామర్రు 130, 131, 132, 134 పోలింగ్ బూత్‌లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగటంతో గంట పాటు పోలింగ్ నిలిచిపోయింది. సమీపంలోని ట్రాన్స్‌ఫారం పేలటంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి గ్రామంలో 117వ నెంబరు పోలింగ్ బూత్ ఇవిఎంలో ఏ బటన్ నొక్కినా వైఎస్‌ఆర్ సిపికి పోలవుతున్నాయని పుకార్లు వ్యాపించాయి. ఇది అవాస్తవమని రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ చెన్నకేశవరావు ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు. మొత్తం 630 ఓట్లు పోలైన తర్వాత ఈ పుకారు రావటంతో హుటాహుటిన ఆ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఇవిఎంను తనిఖీ చేయగా ఎలాంటి లోపం లేదని తేలింది. ఈ మేరకు ఆయా పార్టీల అభ్యర్థులను మొత్తం విషయాన్ని వివరించటంతో సర్దుబాటైంది. నూజివీడు నియోజకవర్గం పల్లెర్లమూడి గ్రామంలో కూడా ఇటువంటి సమస్యే ఉత్పన్నం కావటంతో ఇవిఎంను మార్పు చేశారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కొన్ని బూత్‌లలో ఇవిఎంలు మొరాయించటంతో హుటాహుటిన సమస్యను అధికారులు పరిష్కరించారు. రెండు రోజుల నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పోలింగ్ ముగిసే వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగింది. అన్ని నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశారు. ఇరుపార్టీలకు క్రాస్ ఓటింగ్ బెడద పట్టుకుంది. కొన్నిచోట్ల ఎంపి అభ్యర్థికి ఒకపార్టీకి, ఎమ్మెల్యే అభ్యర్థికి మరో పార్టీకి ఓట్లు పోలైనట్లు సమాచారం. ఈ ప్రక్రియ ఎవరి కొంప ముంచుతుందోనన్న ఆందోళన అభ్యర్థుల్లో స్పష్టంగా కనిపించింది. మచిలీపట్నం, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇరుపార్టీల అభ్యర్థులు నువ్వా..నేనా.. అన్నట్టు తలపడ్డారు. జిల్లా కలెక్టర్ ఎం రఘునందనరావు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జె ప్రభాకరరావు పోలింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. మెరుగైన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా మానిటరింగ్ చేశారు. గొడవ జరుగుతోందని తెలిసిన వెంటనే ఆయా ప్రాంతాల పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేయటంతో అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలింగ్ ముగిసింది. ప్రతి పోలింగ్ బూత్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు గైకొనటంతో ప్రశాంత వాతావరణం నెలకొంది.

గుడివాడలో కోట్ల డబ్బు పంపిణీ
గుడివాడ, మే 7: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి గుడివాడ నియోజకవర్గంలో కోట్ల రూపాయల డబ్బును వైఎస్సార్‌సిపి, టిడిపిలకు చెందిన నేతలు పంపిణీ చే యడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకూ భిన్నంగా గు డివాడ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో భారీగా డబ్బు పంపిణీ జరుగుతూ వస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్, ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలకు కూడా భారీగానే డబ్బును ఓటర్లకు పంపిణీ చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కూడా భారీగానే డబ్బు పం పిణీ చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో అనుకున్నట్టుగానే వైఎస్సార్‌సిపి, టిడిపిలకు చెందిన నేతలు భారీగా డబ్బు పంపిణీలు జరిపారు. నియోజకవర్గంలో గుడివాడ పట్టణం, రూర ల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాలున్నాయి. నియోజకవర్గం మొత్తం ఉన్న దాదాపు 2లక్షల మంది ఓటర్లకు రూ.వెయ్యి చొప్పున వైఎస్సార్‌సిపి నేతలు పంపిణీ చేపట్టారు. అప్పటికే రూ.వెయ్యి పంచేందుకు సిద్ధంగా ఉన్న టిడిపి నేతలు మరో రూ.200లను అదనంగా పంపిణీ చేసి ఆధిపత్యాన్ని చాటారు. డబ్బు పంపిణీకి ముందు వైఎస్సార్‌సిపి, టిడిపిలు పెద్ద హైడ్రామానే నడిపాయి. ముందు మీరు పంచండి అంటే మీరు పంచండి అన్నట్టుగా పంపిణీ కార్యక్రమాన్ని గంటగంటకూ వాయిదా వేస్తూ వచ్చాయి. దీంతో ఏ పార్టీ ఎంత మొత్తం పంచుతుందనే దానిపై అనేక ఊహాగానాలు వచ్చాయి. మంగళవారం రాత్రి 10గంటల నుంచి వైఎస్సార్‌సిపి నేతలు, 12గంటల నుంచి టిడిపి నేతలు డబ్బు పంపిణీ చేపట్టారు. ఉదయం పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి కూడా అక్కడక్కడా ఓటర్లకు డబ్బులు పంచుతూనే ఉన్నారు. స్థానిక ఎన్టీఆర్ కాలనీ, 7వ వార్డు, 30వార్డులోని ధనియాలపేట తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది ఓటర్లు గుడివాడ ఏలూర్ రోడ్డులోని టిడిపి కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. టిడిపి నేతలకు వ్యతిరేకంగా శాపనార్థాలు పెట్టారు. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మంగళవారం రాత్రి 10గంటల వరకు హడావుడి సృష్టించిన పోలీసులు ఆ తర్వాత వారి కళ్లెదుటే బుధవారం మధ్యాహ్నం వరకు రూ.కోట్ల డబ్బును పంపిణీ చేస్తున్నా పట్టించుకోక పోవడం విమర్శలకు దారి తీసింది. గెలుపు, ఓటములను డబ్బు ప్రభావితం చేస్తుందనే భ్రమలో ఉన్న పార్టీల్లో ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి.

బందరు సార్వత్రిక ఎన్నిక ప్రశాంతం
మచిలీపట్నం టౌన్, మే 7: బందరు అసెంబ్లీ నియోజకవ ర్గ సార్వత్రిక ఎన్నిక బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఎ టువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం 192 పో లింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. లక్షా 82వేల 288 మంది ఓటర్లకు గాను లక్షా 35వేల 394 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 82గా నమోదైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంట ల వరకు పోలింగ్ నిర్వహించగా ఓటర్లు బారులు తీరి కనిపించారు. పోలింగ్ ప్రారంభ దశలోనే అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. 11గంటల నుంచి ఎండ వేడిమి కారణంగా ఓటర్లు ఓటు వేసేందుకు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. సా యంత్రం 4గంటల నుంచి పెద్ద ఎత్తున ఓట్లు పోలయ్యాయి. సకుటుంబ సమేతంగా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలి వ చ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ ఎం రఘునందనరావు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జె ప్ర భాకరరావు పోలింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. పలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ రఘునందనరావుతో పాటు ప్రధాన పా ర్టీల అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సె యింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేం ద్రంలో జిల్లా కలెక్టర్ ఎం రఘునందనరావు, సతీమణి లక్ష్మి తో కలిసి ఓటు వేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఎంపి అ భ్యర్థి కొనకళ్ళ నారాయణరావు లేడీస్‌క్లబ్‌లో, జై సమైక్యాం ధ్ర పార్టీ ఎంపి అభ్యర్థి కమ్మిలి శ్రీనివాస్ హైనీ హైస్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైఎస్‌ఆర్ సిపి ఎమ్మె ల్యే అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య (నాని), భార్య జయసుధ హిందూ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓ టు వేశారు. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర కూడా జ లాల్‌పేటలోని సరస్వతీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలా ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, పట్టణ ప్రముఖులు తమ తమ ఓ టు హక్కు వినియోగించుకున్నారు.
మొత్తం మీద బందరు అసెంబ్లీ నియోజకవర్గం లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగింపు సమయంలో 6గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారందరికీ ఓటు వేసేందుకు అనుమతించారు.

కృష్ణప్రసాద్‌ను అరెస్ట్ చేయంచడం బాధాకరం
నందిగామ, మే 7: నియోజకవర్గ నాయకుడు వసంత కృష్ణప్రసాద్ పది మందికి మేలు చేసే వ్యక్తే కా నీ కీడు చేసే వ్యక్తి కాదని, అతని పేరు ఎఫ్‌ఐఆర్‌లో, చార్జిషీటులో లేకపోయినప్పటికీ అరెస్టు చేయడం బాధాకరమని మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని ఐతవ రం గ్రామంలో వసంత నాగేశ్వరరావు కుటుంబ స భ్యులను, అనంతరం నందిగామ సబ్ జైలులో ఉన్న వసంత కృష్ణప్రసాద్‌ను పరామర్శించారు. తదుపరి ఆయన మీడియాతో మాట్లాడుతూ 1999 నుంచి కృ ష్ణప్రసాద్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం కొంత ఇబ్బంది కల్గినప్పటికీ అ తని పక్షాన న్యాయం, ధర్మం ఉండడంవల్ల కేసు నుం చి బయటపడతారన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విలేఖర్లు ప్రశ్నించగా ఇంతకు ముందే చెప్పా కదా, కొత్తగా చెప్పేది ఏమీ లేదంటూ 12వ తేదీ సర్వే పై మాట్లాడతానన్నారు. కెసిఆర్, జగన్, కాంగ్రెస్ నా యకులు అన్ని సీట్లు వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయి అ ని వారి అభిప్రాయాలను వెల్లడిస్తే వారిని ఇసి తప్పుబట్టలేదని, తాను అభిప్రాయం వ్యక్తం చేస్తే మాత్రం నోటీసు పంపుతున్నట్లు చెప్పారని, ఇంకా తనకు నో టీసు అందలేదని, నోటీసు అందిన తరువాత పరిశీల న చేసి వివరణ ఇస్తానన్నారు. ఆయన వెంట మార్కె ట్ కమిటీ చైర్మన్ పాలేటి సతీష్ పాల్గొన్నారు.
తెదేపా పరిస్థితి బాగుంది : సుజనాచౌదరి
సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా బాగుందని, అధికారంలోకి రావడం ఖాయమని, ఎ టువంటి అనుమానం లేదని తెదేపా రాజ్యసభ స భ్యు డు సుజనాచౌదరి అన్నారు. నందిగామ సబ్ జై లులో ఉన్న నియోజకవర్గ నాయకుడు వసంత కృష్ణప్రసాద్‌ను బుధవారం ఆయన పరామర్శించారు. అ నంతరం ఆయన్ను మీడియా ప్రతినిధులు ప్రస్తుత ప రిస్థితిపై ప్రశ్నించగా పై వ్యాఖ్యానం చేశారు. తాను వ సంత కృష్ణప్రసాద్‌ను పరామర్శించేందుకు వచ్చినట్లు తెలిపారు. కృష్ణప్రసాద్ తెలుగుదేశం కోసం ప్రచారం చేస్తుండటంతో ప్రత్యర్థులు రాజకీయంగా ఎదుర్కోలే క తప్పుడు కేసు పెట్టించి ఎన్నికల సమయంలో అరె స్టు చేయించారన్నారు. ఆయన వెంట తెదేపా అసెంబ్లీ అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావు, సీనియర్ నాయకుడు వసంత సత్యనారాయణ, ఎస్‌సి సెల్ జిల్లా అధ్యక్షుడు కనె్నకంటి జీవరత్నం, పట్టణ పార్టీ అధ్యక్షుడు వేజండ్ల భానుప్రసాద్ తదితరులు ఉన్నారు.

నూజివీడులో భారీగా క్రాస్ ఓటింగ్!
* ఈ పరిణామం ఎవరి కొంప ముంచేనో...?!
* గెలుపుపై ఎవరి ధీమా వారిదే..!
నూజివీడు, మే 7: నూజివీడు నియోజకవర్గంలో బుధవారం జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో భారీ స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగింది. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభిమానులు అసెంబ్లీ అభ్యర్థికి ఒకరికి, పార్లమెంట్ అభ్యర్థికి మరొకరి ఓటు వేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభిమానులైతే ఏకంగా ఇరుపార్టీల పక్కన చేరి పోయారు. ఈ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఇరు పార్టీలకు చెందిన వారు క్రాస్ ఓటింగ్ పాల్పడటంతో ఎవరి కొంప మునుగుతుందోనని అభ్యర్థులు ఆందోళన చెందుతూ లెక్కలు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇరు పార్టీల నుండి ఎక్కువ శాతం ఓటర్లు డబ్బులు తీసుకున్నప్పటకీ వారి మనోగతం అర్థం కాకపోవటంతో సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఈ సైలెంట్ ఓటింగ్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నూతన ఓటర్లతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి ఎక్కువ శాతం పడతాయని విశే్లషకులు భావిస్తున్నారు. చివరకు కనీసం మూడు వేల ఓట్ల మేజార్టీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూజివీడు పురపాలక సంఘం పరిధిలో 76 శాతం ఓట్లు పోలయ్యాయి. పట్టణంలో వైకాపా అభ్యర్థి ప్రతాప్ అప్పారావు మెజార్టీ పైనే అభ్యర్థుల గెలుపుఓటములు ఆధారపడి ఉన్నాయి. విజయావకాశాలపై ఇరు పార్టీల నాయకులు ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు.

పోలీసుల పక్షపాత వైఖరిపై కేశినేని ఫిర్యాదు
జగ్గయ్యపేట, మే 7: జగ్గయ్యపేటలో పోలీసు అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని తెదేపా ఎంపి అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అరోపించారు. పట్టణంలో వారు విలేఖర్లతో మాట్లాడుతూ శాంతి భద్రతల నిర్వహణలో పోలీసుల తీరు సక్రమంగానే ఉన్నా పార్టీల విషయంలోకి వచ్చేసరికి పక్షపాతంగా వ్యవహరించారని అన్నారు. ఏజెంట్ల స్లిప్‌లు లేకుండానే వైకాపా నేతలు బూత్‌ల్లోకి వెళుతున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, చీరలు పంపిణీ చేస్తున్నారని చెప్పినా స్పందించలేదని, ఎమ్మెల్యే నివాసం వద్ద ఎలాంటి ఉద్రిక్తత లేకున్నా భారీ స్థాయిలో పోలీసులతో పికెటింగ్ ఏర్పాటు చేసి కార్యకర్తలను భయపెట్టారని, ఈ అంశంపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంపి అభ్యర్థి కేశినేని తన విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుస్తారని అన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
ఎ కొండూరు, మే 7: సార్వత్రిక ఎన్నికలు మండలంలోని బుధవారం ప్రశాతంగా ముగిసాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. ఉదయం 7గంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో అత్యంత సమస్యాత్మ, సమస్యాత్మక గ్రామాల్లో ఏలాంటి గొడవలు జరుగకుండా నూజివీడు డిఎస్‌పి సూర్యప్రకాశరావు, మైలవరం సిఐ పి రామ్మోహనరెడ్డి, ఎ కొండూరు ఎస్‌ఐ పి ఉమామహేశ్వరరావు, సిబ్బంది గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. దీంతో ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. మండలంలోని 90 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు చెప్పారు.

ఆగిరిపల్లి మండలంలో 90శాతం పోలింగ్
ఆగిరిపల్లి, మే 7: ఆగిరిపల్లి మండలంలో బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 90.25శాతం పోలింగ్ నమోదైనట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కె పద్మావతి తెలిపారు. 44వేల 646 ఓట్లకు గాను 40వేల 294 ఓట్లు పోలైనట్లు ఆమె తెలిపారు. మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిశాయి. బూత్ నెం 184, 188, 204లో ఈవిఎంలు మొరాయించడంతో పోలింగ్ పక్రియ ఉదయం 2గంటలు అలస్యంగా ప్రారంభమైంది. వాటిని సరిచేసి ఎన్నికల సరళిని ప్రారంభించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అటు పోలీసులు, ఇటు ఎన్నికల అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

ముసునూరులో 90.11 శాతం పోలింగ్
ముసునూరు, మే7: సార్వత్రిక ఎన్నికలు బుధవారం ప్రశాంత వాతావరణంలో జరిగాయి. మండలంలోని 43 పోలింగ్ బూత్‌ల్లో ఉదయం 7గంటలకే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. మండలంలో 90.11 శాతం ఓట్లు పోలైనట్లు తహశీల్దార్, ఎన్నికల సహాయ అధికారి డి సూర్యనారాయణ శర్మ తెలిపారు. మండలంలోని ముసునూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ఒక పోలింగ్ బూత్‌లో, చింతలవల్లి పంచాయతీ శివారు గోగులంపాడులో ఒక గంట సేపు ఈవిఎంలు పనిచేయలేదు. సాంకేతిక లోపాలను సరిచేయడంతో రెండు చోట్లా గంట అలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. మండలంలోని అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముసునూరు ఎస్‌ఐ పి శోభన్‌కుమార్ తన సిబ్బందితో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. వైకాపా అసెంబ్లీ అభ్యర్థి మేకా ప్రతాప్‌అప్పారావు మండలంలోని పలు గ్రామాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించారు.

గంపలగూడెంలో 88.07శాతం పోలింగ్
గంపలగూడెం, మే 7: మండలంలో బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 24 గ్రామ పంచాయతీలకు 54 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రామచంద్రన్ తెలిపారు. మొత్తం ఐదు సెక్టార్‌లు, ఏడు రూట్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం మండలంలోని 52వేల 690 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 26వేల 371 మంది, మహిళలు 26వేల 319 మంది ఉన్నారు. మండలంలోని సత్యాలపాడు, చినకొమెర, అమ్మిరెడ్డిగూడెం, గోసవీడు, గంపలగూడెం, వినగడప పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటుచేశారు. అత్యధికంగా సొబ్బాల గ్రామంలో 96శాతం ఓట్లు, అత్యల్పంగా గంపలగూడెంలో 75శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం 46వేల 688 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 23వేల 548 మంది, మహిళలు 23వేల 129 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు మండల ఎన్నికల అధికారి వెంకటసుబ్బయ్య చెప్పారు.

ఉయ్యూరు మండలంలో 83.64 శాతం పోలింగ్
ఉయ్యూరు, మే 7: మండలంలో బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 83.64 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మండలంలో 58వేల 401 మంది ఓటర్లకు గాను 48వేల 849 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలోని పెదఓగిరాల 172వ పోలింగ్‌బూత్‌లో తొలిగంటలోనే ఇవిఎం మోరాయించడంతో గంటసేపు అంతరాయమేర్పడింది. అప్పటికి 37 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, ఇవిఎం 40 మందిని చూపించడంతో అనుమానం వచ్చిన అధికారులు సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించడంతో ఆ ఇవిఎం స్థానే కొత్త ఇవిఎం తెప్పించి తిరిగి పోలింగ్‌ను కొనసాగించారు. మండలంలో పురుషులకంటే మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ముందంజలో ఉన్నారు. మండలంలోని జబర్లపూడి గ్రామంలో అత్యధికంగా 99.97 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా ఉయ్యూరు 178వ పోలింగ్ బూత్‌లో 73.13 పోలింగ్ నమోదైంది.

జి.కొండూరు మండలంలో పోలింగ్ ప్రశాంతం
జి.కొండూరు, మే 7: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జి.కొండూరు మండలంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మండల వ్యాప్తంగా సాయంత్రం 5 గంటల సమయానికి 79 శాతం పోలింగ్ నమోదైంది. మండలంలో 42వేల మంది ఓటర్లు ఉండగా 44 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గడ్డమణుగు, కవులూరు, కోడూరు, వెల్లటూరు గ్రామాల్లో ఉదయం కొన్ని ఎవిఎంలు మొరాయించాయి. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పోలింగ్‌ను నిర్వహించారు. మైలవరం అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అప్పసాని సందీప్ తన స్వగ్రామమైన గడ్డమణుగులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్‌బాబు కుంటముక్కలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థులు దేవినేని ఉమామహేశ్వరావు, జోగి రమేష్, అప్పసాని సందీప్, బొమ్మసాని సుబ్బారావు, వివిధ పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సరళిని పరిశీలించారు. జి.కొండూరులో శతాధిక వృద్ధురాలు శీలం మహాలక్ష్మమ్మ (105) తన ఓటు హక్కును వినియోగించుకుంది.

జగ్గయ్యపేట రూరల్ మండలంలో ప్రశాంతంగా పోలింగ్
జగ్గయ్యపేట రూరల్, మే 7: మండలంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు చెదురుమదురు సంఘటనల మధ్య దాదాపు ప్రశాంతంగా జరిగాయి. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 6.30గంటల సమయం నుండే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని క్యూలైన్‌లలో బారులు తీరారు. ప్రధానంగా మహిళా ఓటర్లు, యువకులు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 11గంటల వరకూ వేగంగా జరిగిన పోలింగ్ తదుపరి కొద్దిగా మందగించినప్పటికీ మళ్లీ తిరిగి 3గంటల నుండి వేగం పుంజుకుంది. మండలంలోని షేర్‌మహమ్మద్‌పేట 13వ పోలింగ్ కేంద్రంలో ఇవిఎంలు రెండు గంటల పాటు మోరాయించడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. తదుపరి కొత్తగా ఇవిఎంలు తెప్పించి అధికారులు పోలింగ్ ప్రారంభించారు. తక్కెళ్లపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని రామచంద్రునిపేట గ్రామంలో రెండు మూడు పర్యాయాలు తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇరుపార్టీల్లోని కొంత మంది వ్యక్తులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మండలంలోని ముక్త్యాల గ్రామంలో మాజీ మంత్రి నెట్టెం రఘురాం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వేసవి కాలం పురస్కరించుకొని పోలింగ్ బూత్‌ల వద్ద షామియానాలను ఏర్పాటు చేయడంతో పాటు వైద్య సిబ్బందితో శిబిరాలు ఏర్పాటు చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

కంచికచర్ల మండలంలో పోలింగ్ ప్రశాంతం
కంచికచర్ల, మే 7: కంచికచర్ల మండలంలో బుధవారం సార్వత్రిక ఎన్నికలు చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. పరిటాలలో 190 బూత్, కంచికచర్ల 170, 175, పెండ్యాల 152, 153 బూత్‌ల్లో ఇవిఎంలు మొరాయించడంతో గంట సేపు పైగా పోలింగ్ నిలిచిపోయింది. తదుపరి టెక్నీషియన్లు వచ్చి మరమ్మతులు చేసిన తరువాత పోలింగ్ యథావిధిగా జరిగింది. వైకాపా విజయవాడ పార్లమెంటరీ అభ్యర్థి కోనేరు ప్రసాద్ కంచికచర్లలో ఓటింగ్ సరళిని పరిశీలించారు. పోలీసు శాఖ శాంతి భద్రతలను పరిరక్షించడంలో పూర్తిగా సఫలమైంది.

వీరులపాడు మండలంలో 87 శాతం పోలింగ్
వీరులపాడు, మే 7: మండలంలో బుధవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మొత్తం 42 పోలింగ్ కేంద్రాల ద్వారా పోలింగ్ జరగ్గా 87శాతం ఓటింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఉదయం నుండే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలోని చట్టన్నవరం పోలింగ్ బూత్‌లో అత్యధికంగా 91.3శాతం పోలింగ్ నమోదైంది. కాగా తెదేపా ఎంపి అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావు గోకరాజుపల్లిలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.

చందర్లపాడులో 85 శాతం పోలింగ్
చందర్లపాడు, మే 7: మండలంలో బుధవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం నుండే పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్‌ల వద్ద బారులుతీరారు. యువతీ యువకులు, మహిళలు, పురుషులు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలంలో 85శాతం ఓటింగ్ నమోదైనట్లు తహశీల్దార్ పి వెంకటేశ్వరరావు తెలిపారు.

చాట్రాయి మండలంలో 90.48 శాతం పోలింగ్
చాట్రాయి, మే 7: మండలంలో బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 90.48శాతం ఓట్లు పోలైనట్లు తహశీల్దార్ శ్రీ్ధర్ తెలిపారు. మండలంలోని గత ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికల్లో 91.07శాతం నమోదు కాగా సార్వత్రిక ఎన్నికల్లో ఒక శాతం తగ్గింది. మండలంలో 39వేల 511 మంది ఓటర్లకు గాను 35వేల 593 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవరం గ్రామానికి చెందిన వడ్లమూడి ఫకీర్ (64) తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి రాగా వడదెబ్బ తగిలి అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.

వత్సవాయి మండలంలో 72శాతం పోలింగ్
వత్సవాయి, మే 7: వత్సవాయి మండలంలో 72శాతం పోలింగ్ నమోదైనట్లు తహశీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. చెదురుమదురు సంఘటనలు మినహా మండలంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మండలంలోని కాకరవాయి, మంగొల్లు గ్రామాల్లో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడగా పోలీసులు అదుపులోకి తీసుకువచ్చారు. మక్కపేట గ్రామంలో ఇవిఎం మొరాయించడంతో గంట ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైంది. దీంతో సాయంత్రం 6గంటల సమయానికి కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులుతీరి ఉండటంతో రాత్రి 7.15గంటల వరకూ పోలింగ్ కొనసాగింది.

నందివాడ మండలంలో 90శాతం పోలింగ్
నందివాడ, మే 7: గుడివాడ నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నందివాడ మండలంలో 90శాతం ఓట్లు పోలైనట్టు తహశీల్దార్ ఎస్.ఆర్.వి.ఎల్ ప్రసాద్ బుధవారం తెలిపారు. మధ్యాహ్నానికి 50శాతం పైగా ఓట్లు పోలయ్యాయన్నారు. 35పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. మండలంలోని 23 పంచాయతీల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. కుదరవల్లిలో 92శాతం పోలింగ్ నమోదయ్యిందన్నారు.
నందిగామ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతం
* క్యూలైన్లలో బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు

నందిగామ, మే 7: నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బుధవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా ఇటువంటి ఘర్షణలు లేకుండా ప్రశాతంగా పోలింగ్ జరగడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఉదయం 6.30గంటల నుండి ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. కీసర, చెరువుకొమ్ముపాలెం, కెబికె పాలెం, చందాపురం, కమ్మవారిపాలెం, గుత్తావారిపాలెం, కోనాయపాలెం గ్రామ పోలింగ్ బూత్‌ల్లో మాక్‌పోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఇవిఎంలు సరిగా పని చేయకపోవడంతో వెంటనే వేరే ఇవిఎంలను ఏర్పాటు చేసి పోలింగ్ ప్రారంభించారు. మొత్తం లక్షా 84వేల 061 ఓటర్లు ఉండగా ఉదయం 9గంటల సమయానికి 18శాతం పోలింగ్ జరగ్గా 11గంటలకు 33శాతం, 1గంటకు 53, 3గంటలకు 70.5, 5గంటలకు 81.08 శాతం, సాయంత్రం 6గంటలకు సుమారు 87శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రజనీకాంతారావు తెలిపారు. ఐతవరంలో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, నందిగామ పట్టణంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెదేపా, వైకాపా, కాంగ్రెస్, బిఎస్‌పి, ఎఎపి తదితర అభ్యర్థులు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. వృద్ధులు, వికలాంగులు సహాయకులతో పోలింగ్ కేంద్రాలకు విచ్చేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతీయువకులు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలు ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కువ మంది క్యూలో ఉన్న సమయంలో కొందరు ఓటర్లు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడ్డారు.అదనపు పోలీస్ బలగాలతో ఏర్పాటు చేసిన బందోబస్తును డిఎస్‌పి చిన హుస్సేన్ పర్యవేక్షించారు. స్పెషల్ టాస్క్ఫోర్స్ ఇన్‌చార్జిగా నియమితులైన ఎడిషనల్ ఎస్‌పి పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఘర్షణలు జరగకుండా గ్రామాల్లో పర్యటించి బందోబస్తు పరిశీలించారు.

తిరువూరులో పోలింగ్ ప్రశాంతం
తిరువూరు, మే 7: ఎస్‌సి రిజర్వుడు తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం అసెంబ్లీ లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలు కేంద్రాల్లో ఈవిఎంలు పనిచేయక కొద్దిసేపు పోలింగ్ ఆలస్యం కావడం మినహా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పోలింగ్ జరగడంతో అటు పోలీసులు, ఇటు ఎన్నికల అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. 201 పోలింగ్ కేంద్రాలను 27 రూట్‌లు, 19 జోన్‌లుగా విభజించారు. 1300 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. 64 సమస్యాత్మక, 67 అత్యంత సమస్యాత్మక, 70 సాధారణ పోలింగ్ కేంద్రాల్లో వాటి స్థాయిని బట్టి బందోబస్తు నిర్వహించారు. ఒక డిఎస్‌పి నలుగురు సిఐలు, మొత్తం 600 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 135 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, 18 చోట్ల సూక్ష్మపరిశీలకులను ఏర్పాటు చేశారు. మార్కెఫెడ్ చైర్మన్ కంచిరామారావు, సర్వోదయ పాఠశాలలో, టిడిపి అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు, జడ్‌పి మాజీ చైర్‌పర్సన్ ఎన్ సుధారాణీ, సిపిఎం అభ్యర్థి మర్సకట్ల ప్రభాకరరావు, అభ్యుదయ పాఠశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గ ఎన్నికల అధికారి వి వెంకటసుబ్బయ్య, సిఐ ఎం శ్యామ్‌కుమార్ ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. టిడిపి లోక్‌సభ అభ్యర్థి కేశినేని శ్రీనివాసరావు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.

పామర్రులో 75 శాతం పోలింగ్
పామర్రు, మే 7: పామర్రు ఎస్సీ రిజర్డ్వ్ నియోజకవర్గంలో బుధవారం జరిగిన ఎన్నికల్లో 75 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత తాజా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి డివై దాస్ స్థానిక మార్కెట్ యార్డ్ బూత్‌లో, టిడిపి అభ్యర్థి వర్ల రామయ్య ఎలిమెంటరీ పాఠశాలలో, వైకాపా అభ్యర్థిని ఉప్పులేటి కల్పన హైస్కూల్ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరెంట్ కోత మూడు సార్లు ఏర్పడినప్పుడు ఈవిఎంలు యథావిధిగా పని చేసినా సిబ్బంది మాత్రం ఇబ్బందులకు గురయ్యారు. జుఝవరంలో అంజయ్య అనే వికలాంగుడు, నిమ్మకూరులో ఆకాశపు శ్రీనివాసరావు అనే రెండు చేతులు లేని వికలాంగుడు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని రెవెన్యూ, పోలీసు అధికారులు తెలిపారు.

కైకలూరు నియోజకవర్గంలో 78 శాతం పోలింగ్
కైకలూరు, మే 7: కైకలూరు నియోజకవర్గంలో సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటలకు 78 శాతం పోలింగ్ నమోదు అయినట్టు అధికార వర్గాలు తెలిపాయి. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇవియంలు మొరాయించాయి. మండవల్లి మండలం రుద్రవరంలో 43 ఓట్లు పోలైన తర్వాత ఇవియంలో సాంకేతిక లోపం తలెత్తింది. అధికారులు వెంటనే మరమ్మతు చేసి తిరిగి ప్రారంభించారు. కానుకొల్లు, చావలిపాడు, తక్కెళ్లపాడు, మూడుతాళ్లపాడు, వెలమపేట 117వ పోలింగ్ కేంద్రాల్లో ఇవియంలు మొరాయించాయి. వాటి స్థానంలో కొన్ని ఈవియంలు కొత్తవి ఏర్పాటు చేయగా, మరికొన్ని ప్రాంతాల్లో మరమ్మతులు చేసి పోలింగ్ కొనసాగించారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ మొత్తం ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులుతీరారు. పెరికెగూడెం శివారు కొత్తూరు వనపురంలో సుమారు 70 మంది ఓటర్లు తాయిలాలు అందకపోవటంతో తొలుత ఓట్లు వేసేందుకు నిరాకరించారు. అయితే తర్వాత ఓట్లు వేశారు. పోలింగ్ సందర్భంగా ప్రధాన అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర పార్టీల అభ్యర్థులు నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద కలియతిరిగారు. తెలుగుదేశం పార్టీ బలపర్చిన బిజెపి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ వరహాపట్నంలో ఓటు వేశారు. మాజీ ఎమ్మెల్సీ, టిడిపి నాయకులు కమ్మిలి విఠల్ రావు స్థానిక యుపి స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోను, తాజా మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ కొట్టాడలో, రాష్ట్ర పార్టీ కార్యదర్శి చలమలశెట్టి రామానుజయ, కలిదిండి మండలం ఆవకూరులో ఓటు వేశారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరహరిశెట్టి నరసింహారావు ఆవకూరులో ఓటు వేశారు. జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి బొర్రా చలమయ్య పెనుమల్లిలో ఓటు వేశారు.
గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో 79శాతం పోలింగ్
* వైఎస్సార్‌సిపి, టిడిపి బాహాబాహీ
గుడివాడ, మే 7: గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి బుధవారం జరిగిన ఎన్నికల్లో 79శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7గంటలకు 207బూత్‌లలో పోలింగ్ ప్రారంభమైంది. 9గంటల వరకు మందకొడిగా సాగి 9.8శాతంగా పోలింగ్ నమోదైంది. 11గంటలకు 24.8శాతం, 12గంటలకు 45శాతం, సాయంత్రం 5గంటలకు 66.5శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్ వెంకటసుబ్బయ్య చెప్పారు. ఈ ఎన్నికలకు సంబంధించి 1400మంది సిబ్బందిని వినియోగించారు. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలను కలుపుతూ 28రూట్‌లను ఏర్పాటు చేశారు. 164పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు అదనంగా 50, పార్లమెంట్‌కు మరో 50ఈవీఎంలను అందుబాటులో ఉంచడంతో పాటు వాటి మరమ్మతుల కోసం 18మంది మైక్రో ఇంజనీర్లను కూడా సిద్ధం చేశారు. స

జిల్లాలో బుధవారం నిర్వహించి న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. స్వల్ప సంఘటనలు
english title: 
o

వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ పరిశీలన

$
0
0

ఏలూరు, మే 7 : జిల్లాలో 2014 సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎంతో అద్భుతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ చెప్పారు. స్థానిక కలెక్టరు కార్యాలయం నుండి బుధవారం ఉదయం నుండి కలెక్టరు వెబ్‌కాస్టింగ్ తీరును స్వయంగా పరిశీలించి ఆయా పోలింగ్ కేంద్రాలలో తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు అందజేశారు. జిల్లాలో 2249 పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్ నిర్వహణ ఎంతో సంతృప్తికరంగా సాగిందని ట్రిపుల్ ఐటి, ఇంజనీరింగ్ విద్యార్ధినీ విద్యార్ధులతోపాటు మీ-సేవ కేంద్రాలకు చెందిన ఆపరేటర్లు మంచి సహకారం అందించడం వల్ల జిల్లాలో మారుమూల పల్లె ప్రాంతాలలోని పోలింగ్ కేంద్రాలలో కూడా ఏమి జరుగుతుందో కలెక్టరేట్ నుండే ప్రత్యక్షంగా చూడగలిగానని ఆయా పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని కూడా పరిశీలించడం వల్ల అక్కడ పోలింగ్ సిబ్బంది మరింత చురుకైన పాత్ర పోషించేలా తగు సలహాలు, సూచనలు అందించగలిగినట్లు కలెక్టర్ చెప్పారు. గతంతో పోలిస్తే వెబ్‌కాస్టింగ్ వల్ల మంచి ఫలితాలు లభించాయని ముఖ్యంగా మంచి నాణ్యమైన కెమేరాలు ఏర్పాటు చేయడం వల్ల స్పష్టత బాగా కనిపించిందని కలెక్టర్ చెప్పారు.
ఇక కూడికలు...తీసివేతలు
*తప్పని ఎనిమిది రోజుల నిరీక్షణ*12నుంచి 16వరకు ఫలితాల వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, మే 7: ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన ఎనిమిది రోజుల అనంతరం మే 16వ తేదీన లెక్కింపు జరగనుండటంతో రెండు పార్లమెంటు, 15 అసెంబ్లీ సిగ్మెంట్ల ఈవిఎంలను లెక్కింపు కేంద్రాల్లో భద్రపరిచారు. గతంలో మాదిరిగా కాకపోయిన ఈసారి కూడా ఎన్నికల్లో ఓట్ల లెక్కింపునకు రోజుల వ్యవధి రావటంతో నాయకులు, కార్యకర్తలు అంచనాలు వేసుకునేందుకు చాలా సమయం కలిసివచ్చింది. కానీ ఎవరి భవితవ్యం ఏమిటన్నది ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. అభ్యర్ధుల సంగతి ఎలాఉన్నా పందెగాళ్లకు మాత్రం కాళరాత్రులు తప్పేట్లు లేవు. పందాలు కట్టాలన్న ఆవేశంతో అప్పులు చేసి మరీ కొంతమంది పందాలు కట్టారు. తీరా పోలింగ్ ముగియటం, విజేతలు తేలేందుకు ఇంకా ఎనిమిది గడువు ఉండటంతో వారి మానసికస్ధితి ఆందోళనగా మారింది. ఎనిమిది రోజుల తర్వాత ఏం జరుగుతుందోనన్న ఆందోళన వారిలో ఇప్పటినుంచే గూడుకట్టుకుంటోంది. ఇక అభ్యర్ధుల విషయానికొస్తే బూత్‌ల వారీగా పోలైన వివరాలు సేకరించి వాటిలో తమకు ఎన్ని పడ్డాయి, ప్రత్యర్ధులకు ఎన్ని పడ్డాయి, నియోజకవర్గం మొత్తం మీద సామాజికవర్గాల వారీగా ఓటింగ్ శాతం తీరు ఏమిటి, డబ్బు, మద్యం పంపిణిలు ఎంతవరకు కలిసివస్తాయి తదితర అంశాలను క్షుణ్ణంగా అంచనా వేసుకునేందుకు బోలెడంతా సమయం కలిసి వచ్చింది. ఇంకో పక్క అభ్యర్ధులు, నాయకులు విజయావకాశాలపై ధీమా వ్యక్తం చేస్తుండటంతో వారి కార్యకర్తలు, అభిమానుల అనందానికి అవధులు లేకుండా ఉంది. బుధవారం పోలింగ్ ముగిసిన తర్వాత పోలింగ్‌శాతాన్ని బట్టి కొంతమంది అభ్యర్ధుల గెలుపుఓటములపై అంచనాలు వేసి భారీపందాలకు దిగటం ఈసారి విశేషం. 70శాతం పోలింగ్ ధాటితే టిడిపికి అనుకూలంగా ఉంటుందని కొంతమంది, 70శాతం దాటింది కాబట్టి ఓట్లు చీలిక తప్పదని భావించి మరికొంతమంది వైఎస్సార్‌సిపి అభ్యర్ధులపై భారీమొత్తాలను పందాలుగా కాస్తున్నారు. రెండునెలలుగా వరుసగా జరిగిన ఎన్నికల ఫలితాలు మే 12వ తేదీ నుంచి వెలువడనున్నాయి. ఇప్పటికే నగర పంచాయితీలు, మున్సిపాల్టీలు, నగరపాలకసంస్ధల ఎన్నికల ఫలితాలపై పోటీ చేసిన అభ్యర్ధులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఫలితాలు ఈనెల 12న లెక్కించి ప్రకటించనున్నారు. గెలుపు,ఓటములపై ఇప్పటికే కొందరు అభ్యర్ధులు ఓటింగ్ సరళిని బట్టి వచ్చిన సమయాన్ని బట్టి డివిజన్లు, వార్డుల వారీగా సమాచారం సేకరించి ఫలితాలపై ధీమాతో ఉన్నారు. ఈ ఎన్నికలపై కూడా భారీగానే పందాలు కొనసాగాయి. ఇక జడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల విషయంలో కూడా అదే పరిస్దితి ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు ఈనెల 13న లెక్కించి ప్రకటిస్తారు. ఇక సాధారణ ఎన్నికల ఫలితాలు ఈనెల 16న ప్రకటించనున్నారు.

స్వల్ప ఘటనలు మినహా
పోలింగ్ ప్రశాంతం

ఏలూరు, మే 7 : జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొత్తంగా చూస్తే పోలింగ్ శాతం ఎక్కువగానే నమోదైందని, అయితే పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఆశించినంత స్పందన కనిపించలేదని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సాయంత్రం 5 గంటల సమయానికి 76.8 శాతం నమోదైందని, చివరి గణాంకాలు వచ్చే సరికి ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని చెప్పారు. కాగా దెందులూరు పరిధిలో 82 శాతం వరకు 5 గంటల సమయానికి పోలింగ్ నమోదు కాగా అదే సమయంలో పట్టణ ప్రాంతాలైన ఏలూరులో 65 శాతం, భీమవరంలో 66 శాతం మాత్రమే నమోదైందని తెలిపారు. కాగా పట్టణ ప్రాంతాల పరిధిలోకి వచ్చే కొవ్వూరులో 78 శాతం వరకు పోలింగ్ నమోదైందన్నారు. ఇక ఆయా ప్రాంతాల్లో ఇవి ఎంలు మొరాయించడం, సాంకేతిక సమస్యల కారణంగా నిలచిపోవడం వంటివి స్వల్పంగానే చోటు చేసుకున్నాయన్నారు. మొత్తం ఏడు వేల ఇవి ఎంలలో 58 ఇవి ఎంలు మాత్రమే ఇబ్బంది పెట్టాయని, వాటిని సకాలంలో మార్పు చేశామని తెలిపారు. అంతేకాకుండా 40 ఇవి ఎంలు పోలింగ్ మొదలు కాకముందే మాక్ పోలింగ్‌లో మొరాయించడం, వాటిని మార్పు చేయడం జరిగిందన్నారు. కేవలం 18 ఇవి ఎంలు మాత్రం పోలింగ్ ప్రారంభమైన తరువాత ఇబ్బంది పెట్టాయని, వాటిని కూడా వెంటనే మార్పు చేశామని తెలిపారు. ఒక చోట ఎండ వేడికి ఇవి ఎంల నుంచి పొగాలు వచ్చాయని, దాన్ని కూడా సకాలంలో మార్పు చేశామన్నారు. పెదవేగి మండలం రాయన్నపాలెంలో ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుందన్నారు. ఇదిలా ఉంటే పలు చోట్ల ఓటర్లను తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, అలాగే మరికొన్ని చోట్ల ఓటర్లకు పంచేందుకు తీసుకువెళుతున్న నగదును కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ విధంగా దెందులూరులో 48 వేల రూపాయలు, భీమడోలు మండలం ఆగడాలలంకలో 88 మద్యం సీసాలను, 5.50 లక్షల రూపాయలను, పాలకోడేరులో 35 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇదే విధంగా మరికొన్ని చోట్ల కూడా నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇక తణుకు మండలం వేల్పూరులో ఒక పోలింగ్ పార్టీ ఆ ప్రాంతంలో పోటీలో వున్న అభ్యర్ధి బంధువు ఇంటిలో భోజనం చేసినట్లు తేలడంతో రాత్రికి రాత్రి ఆ పోలింగ్ పార్టీని మార్చి వేసి మరో పార్టీని నియమించామని తెలిపారు. బుట్టాయిగూడెంలోనూ ఒక పోలింగ్ స్టేషన్‌లో ఒక పోలింగ్ సిబ్బంది ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో వెంటనే ఆయన్ను మార్పు చేశామన్నారు. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగడానికి సహకరించిన పోలింగ్ సిబ్బందికి, మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విలేఖరుల సమావేశంలో పశుసంవర్ధక శాఖ జెడి జ్ఞానేశ్వర్, సమాచార శాఖ ఎడి వి భాస్కర నరసింహం పాల్గొన్నారు.
ఇవిఎంలకు భద్రత
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, మే 7: సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధుల భవితను అరుదైనరీతిలో సాయుధ పోలీసులు పరిరక్షిస్తున్నారు. జిల్లాలోని రెండు పార్లమెంటు, 15 అసెంబ్లీ సిగ్మెంట్లకు సంబంధించి ఈవిఎంలను పటిష్ట ఏర్పాట్ల మధ్య వివిధ ప్రాంతాల్లో భద్రపరిచారు. ఏలూరు పార్లమెంటు స్ధానానికి సంబంధించి అయిదు అసెంబ్లీ సిగ్మెంట్ల ఈవిఎంలను ఏలూరులోని రామచంద్రా ఇంజనీరింగ్ కళాశాలలోను, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ సిగ్మెంట్ల ఈవిఎంలను పెదపాడు మండలం వట్లూరులోని సర్ సిఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలోను భద్రపరిచారు. వీటికి సాయుధ పోలీసు రక్షణ కల్పించారు. అంతేకాకుండా స్ట్రాంగ్ రూంల వద్ద సిసి కెమెరాలను కూడా ఏర్పాటుచేశారు. ఇక నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఏడు అసెంబ్లీ సిగ్మెంట్ల ఈవిఎంలను భీమవరం సమీపంలోని విష్ణు విద్యాసంస్ధల్లో భద్రపరిచారు. బుధవారం రాత్రికి వివిధ ప్రాంతాల నుండి ఈవిఎంలు పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ఇక్కడకు చేరుకున్నాయి. అనంతరం వాటిని గదుల్లో ఉంచి హాజరైన అభ్యర్ధుల సమక్షంలో వాటికి సీళ్లు వేశారు. మే 16వ తేదీ వరకు వీటికి రక్షణ కొనసాగుతుంది.
నగుబా(ఓ)టు2
*్భరీగా పేర్లు గల్లంతు*కొన్నిచోట్ల దొంగఓట్లు*ఓటరుకు మరోసారి భంగపాటు
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, మే 7: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వచ్చాయికాబట్టి దొంగఓట్లు ఇక సాధ్యం కాదని అనుకున్నవారికి బుధవారం పోలింగ్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఓటుహక్కును సద్వినియోగం చేసుకుందామని బయలుదేరిన పలువురు ఓటర్లకు పోలింగ్ కేంద్రాల వద్ద చుక్కెదురైంది. కొంతమందికి ఫోటో గుర్తింపుకార్డులున్నా వారి పేర్లు ఓటర్ల జాబితాలో గల్లంతు కావటంతో ఓట్లు వేయడానికి అస్కారం లేకుండా పోయింది. మరికొంతమంది పేర్లు ఉన్నా అప్పటికే వారి ఓటును ఎవరో వేయటం జరిగిపోయింది. జిల్లావ్యాప్తంగా చాలా సిగ్మెంట్లలో ఓటర్లు భంగపాటుకు గురయ్యారు. కొంతమందికైతే విచిత్రమైన పరిస్ధితులు ఎదురయ్యాయి. కుటుంబంలో భార్యకు, కుమార్తె, కుమారునికి ఓటు ఉంటే భర్తకు లేకపోవటం, మరికొన్నిచోట్ల భార్యకు రెండు ఓట్లు ఉండటం, ఇంకొన్నిచోట్ల పురుషుల ఓట్లు మహిళల ఓట్ల జాబితాలో ఉండటంతో వారు ఓట్లు వినియోగించుకోలేకపోయారు. చదువుకున్నవారైతే తమ ఓటు కోసం కొంతసేపు శ్రమపడ్డ ఈసమయంలో తాము ఏమి చేయలేమని అధికారులు చేతులెత్తేయటంతో నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. కొన్నిచోట్లయితే ఈవిఎంలు సక్రమంగా పనిచేయకపోవటం కన్పించింది. ఓటు వేసేందుకు బటన్ నొక్కిన బీప్ శబ్ధం రాకపోవటం, అదేమిటని ప్రశ్నించగా ఓటు అయిపోయిందని సమాధానం రావటంతో వారు తెల్లమొఖం వేసుకుని బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. చాలాచోట్ల దొంగఓట్లు పడటంతో నిజమైన ఓటర్లు నిరాశగా వెనుతిరగాల్సి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్ధితి మరింత దారుణంగా ఉంది. సరైన సమాధానం కూడా అందని పరిస్దితుల్లో తమ ఓటు ఎవరో వేసారంటూ పెద్దసంఖ్యలో ఓటర్లు గగ్గోలు పెట్టిన సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా జాబితాల్లో చనిపోయినవారివి, సంవత్సరాల క్రితం ఊరు విడిచి వెళ్లిపోయినవారివి అధికసంఖ్యలో ఓట్లు ఉన్నాయి. కానీ ఓటు కోసం దరఖాస్తు చేసుకుని, ఫోటోలు కూడా అందించి మరోసారి అధికారులు అడిగితే దరఖాస్తులు చేసుకున్నా వారి పేర్లు మాత్రం జాబితాల్లోకి ఎక్కలేదు. కొంతమంది అంతకుముందు ఓటర్ల జాబితాల్లో ఉన్నప్పటికీ తాజాగా విడుదల చేసిన జాబితాలో మాత్రం కన్పించలేదు. మార్పులు, చేర్పుల గందరగోళంలో నిజమైన ఓటర్లు తమ హక్కును వినియోగించుకోలేకపోయారు. ఇక కొన్నిచోట్ల అంధులు ఓట్లు వేసే విషయంలో ఎన్నికల సిబ్బంది తమ చాతుర్యాన్ని చూపించారు. వారిని ఓటువేసే బాక్సుల వద్దకు తీసుకువెళ్లి వారు చెప్పిన గుర్తుపై కాకుండా తమకు అనుకూలమైన వారికి చెందిన గుర్తుపై ఎన్నికల సిబ్బంది ఓట్లు వేయించిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. మొత్తంమీద ఈవిఎంలు, ఫోటో ఓటరు గుర్తింపుకార్డులతో అధునిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టినా పాత జాడ్యాలు మాత్రం వదలలేదు. దీంతో ఓటరు మరోసారి నిరాశ చెందకతప్పలేదు.

ఎర్రకాలువలో స్నానానికి దిగి అన్నదమ్ములు మృతి
నల్లజర్ల, మే 7: మండలంలోని నబీపేట ఎర్రకాలువలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ నీట మునిగి అన్నదమ్ములు ఇద్దరు మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే...నబీపేట గ్రామానికి చెందిన మేడూరి శ్రీనివాసరావు (40), మేడూరి పద్మాచార్యులు (37) అనే ఇరువురు అన్నదమ్ములు బుధవారం తమ బావ గారైన చిలకలపూడి కేదారేశ్వరరావు అంత్యక్రియల్లో పాల్గొని బంధువులతో కలిసి స్నానం నిమిత్తం ఎర్రకాలువలో దిగారు. ఆ సమయంలో జంధ్యం పళ్లెం ప్రవాహంలో కొట్టుకుపోతుండటంతో తెచ్చేందుకు వెళ్లిన పద్మాచార్యులు ఊబిలో కూరుకుపోయాడు. అతనిని రక్షించేందుకు వెళ్లిన అన్న మేడూరి శ్రీనివాసరావు కూడా ఊబిలో చిక్కుకున్నాడు. వారితోపాటు కాలువలోకి దిగిన వారికి ఈత రాకపోవడంతో వారిని కాపాడే ప్రయత్నం చేయలేకపోయారు. మూడు గంటలపాటు ఈతగాళ్లు కాలువలో గాలించి ఎట్టకేలకు పద్మాచార్యులు, శ్రీనివాసరావు మృతదేహాలను వెలికితీశారు. మృతుడు పద్మాచార్యులకు ఇద్దరు పిల్లలు, భార్య, అతని సోదరుడు శ్రీనివాసరావుకు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు.
మత్తులో జోగిన జిల్లా
ఏలూరు, మే 7: గడచిన 24గంటల్లో జిల్లా మొత్తం మత్తులో జోగింది. ఎన్నికల నేపధ్యంలో రాజకీయ పార్టీలు సిద్ధం చేసుకున్న మద్యం నిల్వలు ఏరులై పారాయి. ఒక్క మంగళవారం రాత్రి రాజకీయపార్టీలు ఓటర్లకు అందించిన మద్యం విలువ పది కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచనాలు విన్పిస్తున్నాయి. విజయావకాశాల కోసం సర్వశక్తులూ ఒడ్డిన ప్రధాన రాజకీయ ప్రత్యర్ధులు జిల్లాలో భారీగానే మందు అందజేశారన్న వార్తలకు బుధవారం పోలింగ్ సందర్భంగా ఎదురైన పలు సంఘటనలు ఉదాహరణగా నిలుస్తాయి. చాలాచోట్ల ఓటర్లు కొంతమంది మత్తులో జోగుతూ ఓటు వేసేందుకు తరలివచ్చారు. మరికొంతమంది రాత్రి తాగింది దిగక ఓటు వేసేందుకు వచ్చినవారికి అడ్డం పడి మరీ ఫలానా అభ్యర్ధికి ఓటు వేయాలని వారిని ఇబ్బందులు పెడుతూ వచ్చారు. మద్యం నిల్వలను నియంత్రించామని, షాపుల్లో అదనపు నిల్వలను స్వాధీనం చేసుకున్నామని జిల్లా యంత్రాంగం చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమైపోయాయి. పోలింగ్ జరిగే 48గంటల ముందు మద్యం షాపులను మూసివేయాలని ఆదేశించిన అధికారులు అందుకనుగుణంగా చర్యలు తీసుకున్నా మద్యం విక్రయాలు మాత్రం యదేచ్చగా సాగిపోయాయి. ఇంకోవైపు వివిధ పార్టీలు ఇప్పటికే భారీగా మద్యాన్ని నిల్వ చేసుకోవటంతో మంగళవారం ఉదయం నుంచి దానిని పంపిణి చేస్తూ వచ్చారు. కాగా ప్రచారం పూర్తయిన తర్వాత మద్యం దుకాణాలకు ఎక్సైజ్ అధికారులకు సీళ్లు వేసినా మద్యం విక్రయాలకు మాత్రం బ్రేక్ పడలేదు. అయితే రేట్లు మాత్రం భారీగా పెంచి తమ పంట పండించుకున్నారు. 40 రూపాయలు ఉండే మద్యం ధరను 20 రూపాయలు పెంచి 60 రూపాయలకు విక్రయించారు. ఈరకంగానే అన్నిరకాల మద్యం బ్రాండ్లపైన 20 నుంచి 30 రూపాయల వరకు ధర పెంచి విక్రయించారు. దీంతో మద్యం దుకాణాలను మూసివేసినందువల్ల ఒరిగిన ప్రయోజనం ఏమి లేకుండా పోయింది. అంతేకాకుండా బెల్టు దుకాణాల కధ మరింత విచిత్రంగా సాగింది. ఎంతోకాలంగా ఒకచోట బెల్టుషాపు నిర్వహిస్తుంటే అధికారుల సూచనల మేరకు అ దుకాణాన్ని మూసివేసి అక్కడకు దగ్గరలోనే మరో హోటల్‌నో, కిళ్లీబడ్డీనో బెల్టు దుకాణంగా మార్చివేశారు. కొన్నిచోట్ల అధికారులతో బెల్టు దుకాణాల నిర్వాహకులు ఆటాడుకోగా మరికొన్నిచోట్ల అధికారులే ఈ లోపాయికారీ సలహా అందించి తమ రాబడికి బ్రేక్ పడకుండా చూసుకున్నారు.
వైర్‌లెస్ విధానంతో పోలింగ్ సిబ్బందికి ఆదేశాలు
ఏలూరు, మే 7 : జిల్లాలో బుధవారం జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై పోలింగ్ సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేయడానికి వైర్‌లెస్ విధానం ఎంతో దోహదపడిందని జిల్లా కలెక్టర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్ నుండి బుధవారం జిల్లాలోని 3055 పోలింగ్ కేంద్రాలలో ఉదయం నుండి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ తీరును ఆయన వైర్‌లెస్ ద్వారా ఆయా ప్రాంత అధికారులను అడిగి తెలుసుకుని ఎక్కడికక్కడే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయగలిగారు. బుధవారం ఉదయం తొలుత ఇవిఎంలు కొంత మొరాయించినప్పటికీ జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ ఒక ప్రక్క సెల్‌ఫోన్‌లో, మరోవైపు వైర్‌లెస్ సెట్ ద్వారా జిల్లా వ్యాప్తంగా అందరినీ చైతన్యపరచడంతో చిన్న లోపాలను కొద్ది సమయంలోనే సరిదిద్దగలిగారు. జిల్లాలో ఓటర్లను ఆకర్షించడానికి బుధవారం ఉదయం కూడా కొన్ని ప్రాంతాలలో డబ్బు, మద్యం వెదజల్లుతున్నారన్న సమాచారం అందడంతో కలెక్టరు అటు టాస్క్ఫోర్స్ బృందాలను, ఇటు పోలీసులను ఆయా ప్రాంతాలకు పంపించి ధన ప్రభావాన్ని నిరోధించగలిగారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు, డి ఆర్‌వో కె ప్రభాకరరావు, ఏలూరు రేంజ్ డి ఐజి విక్రమ్‌సింగ్ మాన్, ఎస్‌పి ఎస్ హరికృష్ణ, డి ఎస్‌పిలతో కలెక్టర్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా జరగడానికి ఎంతో కృషి చేశారు.
టిడిపి, వైసిపి కార్యకర్తల ఘర్షణ
కారుమూరి గన్‌మెన్‌కు గాయాలు
పెదవేగి, మే 7 : సార్వత్రిక ఎన్నికల కోలాహలం బుధవారం ఉదయం 7 గంటల నుంచే గ్రామాల్లో సందడి నెలకొంది. వేసవి కాలం కావడంతో ఉదయానే్న ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నానికి 60 శాతం ఓటింగ్ పూరె్తైంది. వృద్ధులు, మహిళలు, యువత తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు గుర్తింపు కార్డులతో పోలింగ్ కేంద్రాల వద్దకు తరలి వచ్చారు. మండలంలో మొత్తం 78 పోలింగ్ కేంద్రాల్లో 80 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలంలో రాయన్నపాలెం గ్రామంలో మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రాయన్నపాలెం గ్రామంలో వై ఎస్ ఆర్ సిపి కార్యకర్తలు, టిడిపి కార్యకర్తలు మధ్య సాధారణంగా మొదలైన గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. టిడిపి కార్యకర్త కారుకు అడ్డుగా వచ్చిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు మధ్య ఘర్షణ ప్రారంభమై రెండు కులాల పెద్ద ఘర్షణకు దారితీసింది. అటుగా పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్న వై ఎస్ ఆర్ సిపి అభ్యర్ధి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి రావడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. టిడిపి కార్యకర్తలు, వై ఎస్ ఆర్ సిపి కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో టిడిపి కార్యకర్తలు విసిరిన రాళ్లు కారుమూరి కారుకు తగలడంతో అద్దాలు పగిలి ఆయన వెంట వున్న గన్‌మెన్ వెంకటరమణకు తలకు గాయమవడంతో ఆయనను ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు డి ఐజి విక్రమ్‌సింగ్ మాన్, డిజి వికె సింగ్, డి ఎస్‌పి సత్తిబాబు, ఎస్ కె స్వామి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఘర్షణ జరగడానికి గల కారణాలను పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తామని అధికారులు వివరించారు.

అకాల వర్షంతో అపార నష్టం
పోలవరం, మే 7: పోలవరం మండలంలో మంగళవారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురుగాలులలతో మండలంలో ఎక్కడికక్కడే విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో బుధవారం కొన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యానికి అంతరాయం కలిగింది. దాంతో రక్షిత మంచినీటి పథకాలు పనిచేయకపోవడంతో తాగునీటికి ఆటంకం ఏర్పడింది. పట్టిసీమలో చేతికందివచ్చిన అరటితోటలు నేలమట్టమయ్యాయి. ఎగుమతికి సిద్ధం చేసిన మొక్కజొన్న గింజలు తడిసిపోవడంతో రైతులు బుధవారం ఆరబెట్టుకున్నారు. ఈదురుగాలులు కారణంగా మామిడికాయలు పెద్ద ఎత్తున రాలిపోవడంతో రైతులు నష్టం వాటిల్లిందని వాపోయారు.
ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తత
ద్వారకాతిరుమల, మే 7: సార్వత్రిక ఎన్నికల్లో మండలంలోని రెండు ప్రాంతాల్లో బుధవారం టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దౌర్జన్యానికి పాల్పడడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ద్వారకాతిరుమల, మారంపల్లి గ్రామాల్లో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. మారంపల్లి పోలింగ్ కేంద్రంలో టిడిపి నేతలు కొందరు వైసిపి పోలింగ్ ఏజెంట్ జంగా కృష్ణారెడ్డిని స్థానికేతరుడన్న నెపంతో బయటకు నెట్టివేయడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. గోపాలపురం నియోజకవర్గ వైసిపి అభ్యర్థి తలారి వెంకట్రావు వచ్చి ప్రశ్నించడంతో ఇరువర్గాల నడుమ తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. దీనిపై తలారి కలెక్టర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. అలాగే ద్వారకాతిరుమలలో సైతం వైసిపి కార్యకర్త ఒకరు దొంగ ఓటు వేస్తున్నాడని టిడిపి ఏజెంటు పేర్కొనడంతో వివాదం చెలరేగింది. దీంతో ఇరువర్గాల నడుమ ఘర్షణ ప్రారంభమై అది తోపులాటకు దారితీసింది. పోలీసులు, అధికారులు పరిస్థితిని చక్కదిద్దారు.
శ్రీవారి క్షేత్రంపై సార్వత్రిక ప్రభావం
ద్వారకాతిరుమల, మే 7: సార్వత్రిక ఎన్నికల ప్రభావం రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయమైన చినవెంకన్న ఆలయంపై పడింది. నిత్యం రద్దీగా వుండే ఈ ఆలయం బుధవారం భక్తుల లేమితో బోసిపోయింది. ఆలయంలో అన్ని విభాగాలు ఖాళీగా కన్పించాయి. ఓటుహక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో భక్తులు ఆలయానికి వచ్చేందుకు ఆసక్తి చూపలేదని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ప్రతి ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలనే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్షేత్రంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు మూసివేయాలని అధికారులు హెచ్చరించడంతో దుకాణాలు తెరుచుకోలేదు. దీంతో క్షేత్రం నిర్మానుష్యంగా మారింది.
ఓటు హక్కు వినియోగించుకోవడంతో ప్రజాస్వామ్యా వ్యవస్థ బలోపేతం:డిఐజి
ఏలూరు, మే 7 : ప్రతీ పౌరుడూ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యా వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి వీలు కలుగుతుందని ఏలూరు రేంజ్ డి ఐజి విక్రమ్‌సింగ్ మాన్ చెప్పారు. ఏలూరు రామకృష్ణాపురంలోని మత్స్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లలో బుధవారం ఉదయం డి ఐజి విక్రమ్‌సింగ్ మాన్ ఆయన సతీమణి నందినీమాన్, జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్, జిల్లా ఎస్‌పి ఎస్ హరికృష్ణ, ఆయన సతీమణి శే్వతా హరికృష్ణ క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శంగా మారిందని ఇటువంటి స్థితిలో బాధ్యతగల ప్రతీ పౌరుడూ ఎన్ని పనులున్నా పోలింగ్ రోజున విధిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని డి ఐజి కోరారు.
క్యూలో నెలబడి ఓటు వేసిన కలెక్టర్
జిల్లా కలెక్టరు సిద్ధార్ధ్‌జైన్ బుధవారం మధ్యాహ్నం మత్స్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అప్పటికే 50 మందికి పైగా ఓటర్లు క్యూలో నిలబడి ఉండగా కలెక్టరు చివరన క్యూలో చేరారు. బారులు తీరి ఉన్న ఓటర్లు కలెక్టరు వద్దకు వచ్చి ఎంతో బిజీగా ఉండే మీ వంటి జిల్లా అధికారి క్యూలో నిలబడడం భావ్యం కాదని తామంతా అంగీకరిస్తున్నందున ముందుగా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని ప్రాధేయపడ్డారు. ఓటర్ల విన్నపాన్ని సున్నితంగా చిరునవ్వుతో తిరస్కరించిన కలెక్టర్ సామాన్య ఓటరు మాదిరిగా పావుగంట క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జడ్పీ సి ఇవో డి వెంకటరెడ్డి కూడా క్యూలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జిల్లాలో 2014 సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎంతో అద్భుతంగా నిర్వహించడం జరిగిందని
english title: 
v

జిల్లాలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రూ. 260 కోట్లు

$
0
0

గుంటూరు , మే 8: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు 260 కోట్లు ఎన్నికల కోసం ఖర్చు చేశారని ఎన్నికల నిఘావేదిక జిల్లా కన్వీనర్ కొండా శివరామిరెడ్డి తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా అభ్యర్థులో పోటీపడి మరీ గెలుపుకోసం డబ్బును వ్యయం చేశారన్నారు. 17 అసెంబ్లీ, 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఇష్టానుసారంగా ఎన్నికల వ్యయం చేశారన్నారు. గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు స్థానాలకు పోటీ చేసిన ప్రధాన పార్టీలకు చెందిన నలుగురు అభ్యర్థులు మాత్రం రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా 110 కోట్ల మేరకు ఖర్చు పెట్టారని, వీరుకాక మరో ప్రధాన పార్టీ అభ్యర్థి మొత్తం 6 కోట్లు ఖర్చుపెట్టారని తమ పరిశీలనలో తేలిందన్నారు. అలాగే అసెంబ్లీకి పోటీచేసిన వారిలో ఇరు పార్టీలకు చెందిన 9 మంది ఒక్కొక్కరు 7 కోట్లకు పైగా ఖర్చు చేశారని, మరో 14 మంది 4 కోట్ల చొప్పున ఖర్చు చేశారన్నారు. ఆరుగురు మాత్రం 2 కోట్లకు మించి ఖర్చు చేయలేదన్నారు. 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేసిన రెండు పార్టీలకు చెందిన 33 మందిలో రిజర్వుడ్ స్థానాలు మినహాయించి జనరల్ సీట్లలో పోటీచేసిన వారి ఖర్చుకు అంతులేకుండా పోయిందన్నారు. అలాగే మరో నలుగురు కూడా 4 కోట్ల చొప్పున ఖర్చు చేశారన్నారు. మొత్తం మీద గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఎన్నికలు ఖరీదైన ఎన్నికలుగా మిగిలి పోతాయన్నారు. ఖర్చు చేసిన మొత్తంలో 60 శాతం ఓటర్లకు ఒక్కొక్కరికీ 500 నుండి 2500 వరకు ఖర్చు చేయగా 20 శాతం ప్రచార ప్రకటనలకు, మరో 20 శాతం మద్యం, అనుచరులకు ఖర్చు చేసినట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. అయితే అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులు ఖర్చు చేయాల్సిన 28 లక్షలకు లోబడి ఖర్చుచేసిన వారిలో 22 మంది ఉన్నారని, వీరిలో 2 లక్షల నుండి 10 లక్షల లోపు ఖర్చు చేసిన వారు 10 మంది ఉన్నారని తెలిపారు.

జిల్లాలో 82 శాతం పోలింగ్
గుంటూరు , మే 8: చెదురుమదురు సంఘటనల మినహా బుధవారం జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ వెల్లడించారు. గురువారం కలెక్టరేట్‌లోని డిఆర్‌సి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పోలింగ్ వివరాలు వెల్లడించారు. జిల్లాలో 36,40,011 మంది ఓటర్లకు గాను 29,85,871 మంది ఓటర్లు (81.89 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. పలు ప్రాంతాల్లో ఇవిఎంలు మొరాయించినప్పటికీ వెంటనే ప్రత్నామ్నాయ చర్యలు చేపట్టామని, ఫలితంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. జిల్లావ్యాప్తంగా అత్యధికంగా పెదకూరపాడు నియోజకవర్గంలో 88.93 శాతం, తాడికొండలో 88.87 శాతం పోలింగ్ నమోదైందన్నారు. అత్యల్పంగా గుంటూరు పశ్చిమ పరిధిలో 64.99 శాతం, తూర్పు పరిధిలో 68.17 శాతం పోలింగ్ నమోదైందన్నారు. ఓటర్లను చైతన్యపర్చే విధంగా రూపొందించి అమలుచేసిన స్వీప్ కార్యక్రమం మంచి ఫలితాన్ని అందించిందని కలెక్టర్ అభిప్రాయం వ్యక్తంచేశారు. జిల్లాలో 2009లో 77.06 శాతం పోలింగ్ నమోదైందని, ప్రస్తుత ఎన్నికల్లో 82 శాతం పోలింగ్ నమోదైందన్నారు. ఇది రాష్ట్రంలోనే మొదటి స్థానమని కలెక్టర్ స్పష్టంచేశారు. పోలింగ్ అనంతరం గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఇవిఎంలను నాగార్జున యూనివర్శిటీకి, నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఇవిఎంలను నల్లపాడు లయోలా స్కూలుకు, బాపట్ల పరిధిలోని మూడు నియోజకవర్గాల ఇవిఎంలను బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలకు తరలించామన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద రాష్ట్ర, కేంద్ర పోలీసు బలగాలతో మూడంచల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఓట్లు లెక్కింపు రోజున 1,156 మంది సిబ్బంది అవసరమవుతారని, వీరికి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అర్బన్ పరిధిలో ఏర్పాటు చేసిన క్యూలైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను మొత్తం 6,200 మంది ఓటర్లు వినియోగించుకున్నారన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొని ప్రమాదవశాత్తు, అనారోగ్య కారణాల రీత్యా ప్రాణాలు కోల్పోయిన కెవికె కిషోర్, వణుకూరి వైకుంఠంలకు ఎన్నికల సంఘం అందించే పరిహాం వర్తించేలా చూస్తామన్నారు. ప్రశాంత పోలింగ్‌కు సహకరించిన పోలీసు యంత్రాంగానికి ఆర్మ్‌డ్ రిజర్వ్ ఫోర్స్‌కు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు, మీడియా ప్రతినిధులకు కలెక్టర్ సురేష్‌కుమార్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

గొడవలకు దిగిన వారిపై కఠిన చర్యలు: డిఎస్పీ
ఈపూరు, మే 8: సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎవరైనా గ్రామంలో జరిగిన దాడుల్లో పాల్గొన్నట్లు నిర్ధారణ అయితే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని నరసరావుపేట డిఎస్పీ దేవరకొండ ప్రసాద్ గ్రామస్థులను హెచ్చరించారు. మండలంలోని ఇనిమెళ్ళ గ్రామంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం జరిగిన రాళ్ళ దాడుల్లో పాల్గొన్న అనుమానితులకు గురువారం ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇనిమెళ్ళ గ్రామంలో టిడిపి, వైయస్సార్‌సీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్ళ దాడులకు పాల్పడ్డారు. పోలీసులు వచ్చినా లెక్కచేయకుండా సుమారు నాలుగు గంటలపాటు రాళ్ళ వర్షం కురిపించారు. ఈ దాడుల్లో సుమారు 15మందికి గాయాలైనట్లు తెల్సిందే. ఈ సందర్భంగా పోలీసు బృందాలతో వచ్చిన డిఎస్పీ, సిఐ చినమల్లయ్యలు గ్రామంలో దాడులకు పాల్పడిన వారిని పట్టుకోవడం కోసం ఇల్లిల్లూ గాలించారు. సుమారు 50మందిని తీసుకువచ్చి గ్రామంలోని పాఠశాలలో కౌన్సిలింగ్ ఇచ్చి, వారిని వినుకొండకు తరలించారు. గ్రామంలో పికెటింగ్ యధావిధిగా కొనసాగుతుందని సిఐ చినమల్లయ్య తెలిపారు. డిఎస్పీ వెంట ఈపూరు, శావల్యాపురం, బొల్లాపల్లి ఎస్‌ఐలు మాల్యాద్రి, రవికృష్ణ,నారాయణస్వామి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సమర్థుడైన చంద్రబాబు పాలనకే ప్రజామద్దతు
గుంటూరు , మే 8: ఓటింగ్ ప్రారంభమైన 2 గంటల్లోనే వైఎస్‌ఆర్ సిపి నేతలు ఓటమి భయంతో దౌర్జన్యాలు, అరాచకాలను సృష్టించి ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసి గద్దెనెక్కాలని యత్నించిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కొమ్మాలపాటి శ్రీ్ధర్, గల్లా జయదేవ్, మద్దాళి గిరిధర్‌రావులతో కలిసి పుల్లారావు విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఓటమి భయంతో జిల్లాలో రాయపాటి సాంబశివరావు, నల్లబోతు వెంకట్రావ్‌లపై వైసిపి వర్గీయులు భౌతికదాడులకు దిగి, వాహనాలు ధ్వంసం చేయడం ఆ పార్టీ నైజాన్ని తెలియజేస్తుందన్నారు. రాష్ట్రంలో పులివెందుల, కడప, జమ్మలమడుగు, గుంటూరు తదితర ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థులపైనే దాడులకు దిగడం హేయమన్నారు. బరితెగించి వైఎస్‌ఆర్ సిపి దాడులకు పాల్పడుతన్నప్పటికీ తెలుగుదేశం క్యాడర్ సహనంగా ఉన్నారని, వీరు తిరగబడితే రాష్ట్రం నుంచి వైఎస్‌ఆర్ సిపిని తరిమికొట్టేవారన్నారు. అధికారంలోకి రాకముందే వైఎస్‌ఆర్ సిపి దాడులకు పాల్పడుతుందని, అధికారంలోకి వస్తే వారి ప్రవర్తన మరింత దారుణంగా ఉంటుందని భావించిన ఓటర్లు తెలుగుదేశం పార్టీవైపు మొగ్గు చూపారన్నారు. రాష్ట్రంలో సమర్థుడైన చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని, ఈనెల 18వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని జోస్యం చెప్పారు. గుంటూరు పార్లమెంటు అభ్యర్థి గల్లా జయదేవ్ మాట్లాడుతూ అభ్యర్థుల ఎంపిక ఆలస్యమైనప్పటికీ రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీ తదితర ప్రజాప్రయోజనకర పథకాలను చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టడంతో తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. తాము ఎగ్జిట్‌పోల్ నిర్వహించామని 50 వేల మెజార్టీతో తాను, జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారని తెలిపారు. పెదకూరపాడు టిడిపి అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీ్ధర్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్ సిపి అధినేత జగన్మోహనరెడ్డి ఎన్నికల్లో ఏ విధంగా దాడులు నిర్వహించాలనే వ్యూహాలను ముందుగానే రచించారని, అందులో భాగంగానే ఈ దాడులు జరిగాయన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థి మద్దాళి గిరిధర్‌రావు మాట్లాడతూ దాడులకు పాల్పడిన వైఎస్‌ఆర్ సిపి నేతల భవితవ్యం ఈనెల 16వ తేదీన బయటపడనుందని, ఓటమి పసిగట్టిన వైసిపి నేతలు దాడలకు దిగడం హేయమైన చర్య అన్నారు. రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ హింసే లక్ష్యంగా ఓటర్లను ప్రలోభాలకు, దౌర్జన్యాలకు, భయబ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో జగన్ గెలిచేందుకు కుట్రలు పన్నారని, ప్రజలు తెలుగుదేశం పార్టీవైపే ఉన్నారనడానికి పోలింగ్ శాతమే నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి రాజామాస్టారు, జిడిసిసి చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య, చంద్రగిరి ఏడుకొండలు, జాగర్లమూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఛీటింగ్ కేసులో నలుగురికి మూడేళ్ల జైలు
గుంటూరు , మే 8: ఛీటింగ్ కేసులో నలుగురు నిందితులకు మూడేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ ఐదవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సుంకర శ్రీదేవి గురువారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం ఖాదర్‌బీ, ఆమె భర్త మహబుల్లాఖాన్‌లు కూలిపనులు చేసుకుంటూ స్థానిక శారదా కాలనీలో నివసిస్తుంటారు. పఠాన్ ఖాదర్‌బీ పేరుపై ఆమె మేనత్త శారదాకాలనీలో 50 గజాల స్థలం, అందులో పూరిల్లును 1994లో రిజిస్టరు చేసింది. అనంతరం పూరిల్లును ఖాదర్‌బీ తీసివేసి రేకుల ఇంటిని నిర్మించింది. ఇంటిని అదే ప్రాంతానికి చెందిన షేక్ సలీమూన్, షేక్ కరీమూన్‌కు అద్దెకు ఇచ్చింది. అనంతర కాలంలో తన ఇంటిలో తాను ఉంటానని, ఇళ్లు ఖాళీచేయాలని వారిని కోరగా వారు నిరాకరించారు. దీంతో ఇంటిని ఖాళీచేయించాలంటూ రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన షేక్ జుహూర్ బాషాను ఖాదర్‌బీ ఆశ్రయించింది. ఇంటిని ఖాళీచేయిస్తానంటూ పఠాన్ ఖాదర్‌బీని నమ్మించిన జుహూర్‌బాషా పోలీసులకు, న్యాయవాదులకు చూపాలంటూ ఆమె ఇంటి అసలు దస్తావేజులను తీసుకున్నాడు. ఎంతకీ ఇంటిని ఖాళీ చేయించకపోవడంతో అనుమానం వచ్చిన ఖాదర్‌బీ తన అసలు దస్తావేజులు ఇవ్వాలని బాషాపై ఒత్తిడి తీసుకురాగా ఇంటిని అద్దెకు ఉంటున్న సలీమూన్, కరీమూన్‌కు అమ్మానని చెప్పి, ఇకపై ఇంటి విషయం ప్రస్తావిస్తే చంపుతానని 2011 జనవరి 12న బెదిరించాడు. దీంతో ఖాదర్‌బీ అదే నెల 13వ తేదీన అరండల్‌పేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. కేసులు ఎస్‌ఐ బ్రహ్మయ్య దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలుచేశారు. నిందితులు షేక్ జహీర్ బాషా, షేక్ దిల్షాద్, షేక్ సలీమూన్, షేక్ కరీమూన్‌పై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి వారికి ఒక్కొక్కరికి మూడేళ్ల జైలుశిక్ష, ఆరు వేల రూపాయల చూప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో ఎపిపి ఎల్ లక్ష్మీరాంనాయక్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు.

పెదకూరపాడు టిడిపి అభ్యర్థి
కొమ్మాలపాటి గెలుపు ధీమా
పెదకూరపాడు, మే 8: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుతమదేనని, చంద్రబాబు త్వరలో సిఎం కానున్నారని టిడిపి పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీ్ధర్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం నియోజకవర్గంలోని అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, బెల్లంకొండ పెదకూరపాడు మండలాల నుండి విచ్చేసిన కార్యకర్తలతో కొమ్మాలపాటి తన స్వగృహంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొమ్మాలపాటి మాట్లాడుతూ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రాత్రి సమయంలో పోలీసుస్టేషన్‌కు పిలిపించి హింసిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్న భయంతోనే వైఎస్‌ఆర్ సిపి నాయకులు పోలీసులతో కుమ్మక్కై ఈ తరహా తప్పుడు కేసులు, వేధింపులకు పురిగొల్పుతున్నారని ఆరోపించారు. పెదకూరపాడు, అమరావతి, బెల్లంకొండ, క్రోసూరు మండలాల్లో టిడిపి మెజార్టీ సాధిస్తుందన్నారు. సమావేశంలో నాదెండ్ల అప్పారావు, బెల్లంకొండ రామగోపాలరావు, ఎన్‌వివిఎస్ వరప్రసాద్ (బుజ్జి), భాష్యం ఆంజనేయులు, అర్తిమళ్ల రమేష్, గల్లా బాబురావు, చెరుకూరి పుల్లయ్య, మద్దినేని వెంకట సత్యనారాయణ, షేక్ లాలు, జాఫర్, దిలీప్, అజుముల్లా, ఖలీల్, జిల్లా బిసి నాయకులు పోలురాజు, కాల్వ అప్పారావు, తూమాటి ఏడుకొండలు, కృష్ణయ్యగౌడ్, వెంకటేశ్వర్లు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

చిన్నారి వైష్ణవికి రాష్టస్థ్రాయి పురస్కారం
గుంటూరు , మే 8: స్థానిక గోరంట్లలోని ఆక్స్‌ఫర్డ్ ఐఐటి పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని సిహెచ్ వైష్ణవి, ఇటీవల హైదరాబాదులో రావ్‌బహదూర్ వెంకట్రామిరెడ్డి మెమోరియల్ రాష్టస్థ్రాయి చదరంగం పోటీల్లో మొదటి బహుమతి సాధించి, తమ పాఠశాల కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేసిందని ఆ విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్ ఫ్రాన్సిస్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో వైష్ణవిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా అండర్-9 చదరంగం పోటీల్లో వరంగల్, విజయవాడ, హైదరాబాద్‌లలో అంతర్‌జిల్లా, రాష్టస్థ్రాయి పోటీల్లో వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించిందన్నారు. ఈనెల 19 నుండి 28 తేదీల్లో తమిళనాడులోని పాండిచ్చేరిలో జరిగే జాతీయస్థాయి చదరంగం పోటీలకు వైష్ణవి ఎంపికైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ఎస్ విజయభాస్కరరెడ్డి, ప్రిన్సిపాల్‌అమీనా, వైష్ణవి తల్లిదండ్రులు సుబ్బారావు, సరళ, శిక్షకులు విజయకుమార్, పిఇటి షేక్ ఖాదర్‌వలి తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ ఓటర్ గోపాలకృష్ణమూర్తికి సత్కారం
గుంటూరు , మే 8: ప్రతి ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఉత్తమ పౌరుడు గోపాలకృష్ణమూర్తిని అవగాహన సంస్థ సభ్యులు గురువారం ఘనంగా సత్కరించారు. స్థానిక అరండల్‌పేటలోని సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కృష్ణమూర్తి సత్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు నూతలపాటి తిరుపతయ్య మాట్లాడుతూ 1962 సంవత్సరం నుండి ఇప్పటివరకు క్రమం తప్పకుండా గోపాలకృష్ణమూర్తి తన ఓటు హక్కు వినియోగించుకుంటూ వచ్చారన్నారు. ఓటుహక్కును వినియోగించుకున్న వారే రాజకీయాల గురించి మాట్లాడేందుకు అర్హులన్నారు. ప్రతిఒక్కరూ మూర్తిని ఆదర్శంగా తీసుకుని ఓటు హక్కును వినియోగించుకుని, సమర్థవంతమైన ప్రభుత్వాలను ఎన్నుకోవాలన్నారు. అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొంటే పోలింగ్ శాతం పెరిగి మంచివారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతారన్నారు. సన్మాన గ్రహీత గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ ఎంత దూరమైనా వెళ్లి ఓటు వేయాలనే పట్టుదలతోనే తాను ఉండేవాడినన్నారు. ఓటు వేయని వారు మృతులతో సమానమన్నారు. కార్యక్రమంలో సంస్థ సీనియర్ సభ్యుడు వెంకటేశ్వరరావు, కాలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నాగార్జున వర్సిటీ పీజీసెట్- 2014 ఫలితాలు విడుదల
నాగార్జున యూనివర్సిటీ, మే 8: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలో పిజి కోర్సులలో ప్రవేశానికి ఇటీవల జరిగిన ఎఎన్‌యుపిజిసెట్-2014కు సంబంధించిన ఫలితాలను వర్సిటీ వీసీ ఆచార్య కె వియన్నారావుమంగళవారం విడుదల చేశారు. మొత్తం పిజిసెట్‌కు 6347 మంది దరఖాస్తు చేసుకోగా, 5912 మంది అర్హతపరీక్షకు హాజరయ్యారని ఆయన తెలిపారు. ఎంఎస్సీ జువాలజీ అండ్ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ నానోబయోటెక్నాలజీ, ఎంఎ స్సీ బోటనీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఎంఎస్సీ జియాలజీ, ఎంఎస్సీ మ్యాధ్‌మాటిక్స్, ఎంఎస్సీ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ ఆయిల్స్ అండ్ పాట్స్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఎ ఎకానమిక్స్, ఎంఎ ఇంగ్లీషు, ఎంఎ హిందీ, ఎంఎ జర్నలిజం, ఎంఎ పొలిటికల్ సైన్స్, ఎంఎ సోషియాలజీ, సోషల్‌వర్క్, ఎంఎ తెలుగు, ఎంయిడి, ఎంకామ్ కోర్సులలో ప్రవేశం కొరకు నిర్వహించిన అర్హత పరీక్షకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశామని, ఈ పరీక్షా ఫలితాలను ఎఎన్‌యు.ఎసి.ఇన్ అనే వర్సిటీ వెబ్‌సైట్ నుండి పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య పి రామసుబ్బయ్య, రిజిస్ట్రార్ ఆచార్య పి రాజశేఖర్, సైన్స్ కళాశాల వైస్‌ప్రిన్సిపాల్ ఆచార్య బి విక్టర్‌బాబు, వర్సిటీ అడ్మిషన్స్ డైరక్టర్ డాక్టర్ జి రోశయ్య, పిజి కోఆర్డినేటర్ డాక్టర్ వి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
నరసరావుపేట, మే 8: ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని వైయస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి అన్నారు. గురువారం ఆయన గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. వైయస్సార్‌సీపీ విజయదుందుభి మోగించబోతుందని అన్నారు. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. మేము నరసరావుపేట ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు. తాము అధికారంలోకి వస్తే పాజిటివ్ పాలిటిక్స్‌ను అమలుచేస్తామని అన్నారు. ఈనెల 16వ తేదీన తీర్పు వస్తుందని అన్నారు. రంగారెడ్డిపాలెంలో ఎన్నికలు సందర్భంగా వైయస్సార్‌సీపీ నాయకులు విలేఖరులపై దాడి చేశారని, దీనిపై తాము తీవ్రమైన మనస్థాపానికి గురయ్యామని ఓ విలేఖరి తెలుపగా, అందుకు అయోధ్య తీవ్రంగా స్పందిస్తూ దీన్ని ఖండిస్తున్నానని అన్నారు. ఏమైనా ఉంటే మాట్లాడాలే తప్ప దాడులు చేయడం సరైంది కాదన్నారు. చేతకాని వాళ్లు దాడులు చేస్తారని అన్నారు. పద్ధతులు మార్చుకుని, కొత్తతరం రాజకీయం నేర్చుకోవాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నరసరావుపేట ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను వైయస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందని అన్నారు. ఎన్నికల్లో పనిచేసిన నాయకులకు, అభిమానులకు కృతజ్ఞతలన్నారు. మీడియాపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఎన్నికల ఘట్టం ముగిసిందని, గ్రామాల్లో అందరూ కల్సిపోయి, వారి వారి పనులు చేసుకోవాలని ఎంపీ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి కోరారు. ఈ సమావేశంలో డాక్టర్ గజ్జెల బ్రహ్మారెడ్డి, షేక్ హుస్సేన్, వేముల శివ, ఖాదర్‌బాషా, అనీఫ్, మిట్టపల్లి రమేష్, నల్లపాటి రామచంద్రప్రసాద్, ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.

జరిగిన ఎన్నికలు చరిత్రాత్మకం
నరసరావుపేట, మే 8: జరిగిన ఎన్నికలు నిజంగానే చారిత్రాత్మకమని మాజీ మంత్రి, సత్తెనపల్లి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం, బిజెపీ పొత్తుతో రాష్ట్రంలో 120 నుండి 130 ఎమ్మెల్యే స్థానాలను, 19నుండి 20 వరకు ఎంపీ స్థానాలను గెలవబోతున్నామని స్పష్టం చేశారు. దేశానికి, రాష్ట్రానికి స్వర్ణయుగం ప్రారంభం కాబోతుందన్నారు. ఎన్నికల యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం బాగా పనిచేశాయని తెలిపారు. ఓడిపోతున్నామనే భయంతో వైయస్సార్‌సీపీకి చెందిన వారు దుర్మార్గాలు చేశారని అన్నారు. రామసుబ్బారెడ్డి, రాయపాటి సాంబశివరావు, నరసరావుపేట బిజెపీ అభ్యర్థి వెంకట్రావులతోపాటు తనపైన, మీడియాపైన జరిగిన దాడిని ఖండిస్తున్నామని అన్నారు. నరసరావుపేట మండలంలోని బసికాపురం, రొంపిచర్ల, వీరవట్నం, చేజర్ల, కంటెపూడి, చీమలమర్రి తదితర గ్రామాల్లో ఎన్నికల రోజున దాడులు చేశారని అన్నారు. అదే విధంగా మాదల, దమ్మాలపాడు, చాగంటివారిపాలెం గ్రామాల్లో దొంగనోట్లును ఓటర్లకు పంపిణీ చేశారని అన్నారు. వేలకొద్ది కల్తీమద్యం సీసాలు దొరికాయని అన్నారు. దేశంలో 250కోట్ల రూపాయలు పట్టుబడితే అందులో ఆంధ్రప్రదేశ్ నుండి 180కోట్లు పట్టుకోవడం దారుణమన్నారు. సత్తెనపల్లిలో చీరలు, వెండిగినె్నలు, బొట్టుబిళ్ళలు పంపిణీ చేసి వైయస్సార్‌సీపీ నైజాన్ని చాటుకుందని తీవ్రంగా విమర్శించారు. విజ్ఞులైన ఓటరు స్పష్టమైన తీర్పును ఇవ్వబోతున్నారని అన్నారు. ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు వేల్పుల సింహాద్రియాదవ్, కొల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

బాధితులకు న్యాయం చేస్తా
*మాజీ ఎమ్మెల్యే జీవీ
ఈపూరు, మే 8: రాళ్ళదాడుల్లోని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. మండలంలోని ఇనిమెళ్ళ గ్రామంలో బుధవారం జరిగిన ప్రధాన పార్టీల కార్యకర్తలు రాళ్ళ దాడుల్లో గాయాలపాలైన బాధితులను, గ్రామస్థులను గురువారం పరామర్శించారు. రాళ్ళదాడులు ఎందుకు, ఏవిధంగా జరిగాయో బాధితులను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, ఎవరి ప్రలోభాలకు, భయానక వాతావరణానికి భయపడవద్దని అన్నారు. అందరికీ న్యాయం జరిగే విధంగా సంబంధిత అధికారులతో మాట్లాడతానని వారికి హామీ ఇచ్చారు. జీవీ ఆంజనేయులు వెంట మండల టిడిపి అధ్యక్షులు రాపర్ల జగ్గారావు, గన్నమనేని వెంకయ్య, శేషగిరి, నర్సింహారావు, సుబ్బరాయుడు, హనుమయ్య తదితరులు పాల్గొన్నారు.

గురజాలలో అధిక ధరలకు మద్యం విక్రయాలు
గురజాల, మే 8: రెవెన్యూ డివిజన్ కేంద్రమైన గురజాల పట్టణంలో అక్రమంగా మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ మద్యం వ్యాపారులు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. మండలంలోని మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రతి క్వార్టర్ బాటిల్‌కు ప్రభుత్వం సూచించిన ధరల కంటే 50రూపాయలకు పైగా అధికంగా వసూలు చేస్తూ మందుబాబుల జేబులకు చిల్లు పెడుతున్నారు. వ్యసనానికి బానిసలైన మందుబాబులు తప్పనిసరి పరిస్థితుల్లో అధిక రేట్లకు మద్యంను కొనుగోలు చేస్తూ నిలువుదోపిడీకి గురవుతున్నారు. సామాన్యులు అధికంగా సేవించే చీప్‌లిక్కర్‌ను సైతం 40 రూపాయల నుండి 60రూపాయల వరకు అధికంగా చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంది. 85రూపాయలకు విక్రయించాల్సిన ఆఫీసర్స్ చాయిస్ బాటిల్ 130రూపాయలుకు, 110రూపాయల ఎంఆర్పీ ఉన్న మాన్‌సన్‌హౌస్ ఎసీ ప్రీమియం, ఇంటీరియల్ బ్లూ, మెగ్డోల్ విస్కీ 150 రూపాయలకు, 100 రూపాయలు ఉన్న ఎంసీ బ్రాంది 150కు, 145రూపాయలు ఉన్న రాయల్‌స్టాగ్ 180 రూపాయలకు అధిక ధరలకు విక్రయిస్తూ మందుబాబులను నిలువునా దోచుకుంటున్నారు. కేవలం 95రూపాయలు ఎంఆర్పీ ఉన్న స్ట్రాంగ్ బీరు బాటిల్ కావాలంటే 150 రూపాయలు చెల్లించాల్సిందే. ఎంఆర్పీ ధరల కంటే ఈస్థాయిలో అధికంగా చెల్లించి మద్యం కొనుగోలు చేసేందుకు మందుబాబులు లబోదిబోమంటున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. లైసెన్స్‌లు ఉన్న మద్యం దుకాణాల్లో ఎటువంటి డిమాండ్‌లేని మద్యాన్ని ఎంఆర్పీ ధరలకు విక్రయిస్తూ, విపరీతంగా డిమాండ్ కలిగిన ప్రముఖ కంపెనీల మద్యం బాటిళ్ళను మాత్రం అనుమతులు లేని ప్రైవేటు ప్రదేశాల్లో ఉంచి, అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమార్జన చేస్తున్నారు. కావున ఎక్సైజ్‌శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మద్యాన్ని విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు కోరుతున్నారు.

విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి అధ్వాన్నం
నరసరావుపేట, మే 8: డివిజన్‌లో కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నదని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ డివిజన్ కార్యదర్శి వై కోటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. డివిజన్‌లో నాలుగు సబ్‌స్టేషన్‌లకు జనవరి నుండి ఏప్రిల్ వరకు జీతాలు లేవని తెలిపారు. వినుకొండ సబ్‌డివిజన్ మూడు ఎస్‌ఎస్‌లకు ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు జీతాలు లేవన్నారు.చీకటీగలపాలెం, వినుకొండ ఎస్‌ఎస్-2,3 గడ్డిగనుములకు కూడా జీతాలు లేవన్నారు. నరసరావుపేట సబ్‌డివిజన్‌లో ఉప్పలపాడు ఎస్‌ఎస్‌కు, ఎస్‌ఎస్-3 జనవరి నుండి ఏప్రియల్ వరకు జీతాలు ఇవ్వలేదన్నారు. షిఫ్ట్ ఆపరేటర్లు చాలా బాధపడుతున్నారని అన్నారు. వినుకొండ సబ్ డివిజన్‌లో ఎరియర్స్ బిల్లు, తొమ్మిది సబ్ స్టేషన్లకు కాంట్రాక్టర్లు ఇవ్వలేదన్నారు. దీనిపై వెంటనే అధికారులు స్పందించాలని అన్నారు.

పట్టణాభివృద్ధి వైఎస్సార్‌సీపీతోనే సాధ్యం
మాచర్ల, మే 8: పురపాలక సంఘం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే అది వైయస్సార్‌సీపీతోనే సాధ్యమవుతుందని నియోజకవర్గ వైయస్సార్‌సీపీ నాయకులు పినె్నల్లి వెంకట్రామిరెడ్డి అన్నారు. ఈనెల 10వ తేదీన జరగనున్న 21,22వార్డు ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని ఉద్ధృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గడపగడపకు తిరుగుతూ వైయస్సార్‌సీపీ పట్టణాభివృద్ధికి చేసే పనుల గురించి వివరించారు. రాష్ట్రంలో వైయస్సార్‌సీపీ రావటం తథ్యమన్నారు. మున్సిపల్ పరిధిలోని వార్డులు, శివారు కాలనీలు అభివృద్ధి చెందాలంటే వైయస్సార్‌సీపీకి మద్దతు పలకాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో 21, 22వార్డుల అభ్యర్థులు మున్నా శ్రీనివాసరావు, 22వ వార్డు అభ్యర్థి నాగలక్ష్మితో పాటు పార్టీ నాయకులు మారం వాసు, పట్టణ కన్వీనర్ పోలూరి నరసింహారావు, మాజీ మున్సిపల్ చైర్మన్ కామనబోయిన కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

యువ ఓటర్లే గెలుపు నిర్దేశకులు
తెనాలి టౌన్, మే 8: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన క్రమంలో ఎవరికి వారు గెలుపు మాదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికల క్రమంలో అనేక సమస్యలు రాష్ట్రప్రజలను వెంటాడుతున్న నేపధ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది. ముఖ్యంగా తెనాలి నియోజక వర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తాను చేపట్టిన కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రచారం చేసుకుంటూ ఎన్నికల బరిలో ఉన్నా, వ్యక్తిగతంగా కూడా ఆయనకు మైనస్‌లు ఎక్కువగా ఉండటంతో ఓటర్ దేవుళ్ళను ఎంతవరకు ప్రసన్నం చేసుకున్నారు అనేది అంచనాలకు అందని అంశం. ఇక ప్రధాన ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్, టిడిపి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ల మధ్యే పోటీ అనేది సర్వత్రా వ్యక్తమవుతున్నది. నరేంద్రమోది, చంద్రబాబు, పవన్ కల్యాణ్ త్రయం ఎన్నికల ప్రచారం, జాబు రావాలంటే బాబు రావాలి అనే ప్రచారం, ఇంటికో ఉద్యోగం అనే ప్రచారం కేంద్రంలో మోది వస్తారు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడంలో చంద్రబాబు సమర్ధుడనే భావం ప్రజల్లో ఏర్పడిందనే చెప్పాలి. ఈక్రమంలో పోలింగ్ సరళి గమనిస్తే యువ ఓటర్లు తమ వెంటే ఉన్నారనే ధీమాతో తెలుగుదేశం శ్రేణులు గెలుపు తమదేనని తేల్చిచెబుతున్నారు. ఇదిలా ఉంటే నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో వైసిపికి వన్‌సైడ్ ఓటింగ్ జరిగిందని, 90శాతం వరకు పోలింగ్ నమోదైందని, తెనాలి, రూరల్ మండలాల్లో తమ బలం తమకే ఉందని, కొల్లిపర మండలం తమ విజయానికి దోహదపడుతుందని వైసిపి శ్రేణులు లెక్కలు వేస్తున్నాయి. కాగా జై సమైక్యాంధ్ర పార్టీ ద్వారా ఎన్నికల బరిలో నిలిచిన డాక్టర్ జవ్వాజి కోటినాగయ్య నియోజకవర్గంలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో కొంతమేర తమ సంఘీయులు ఓట్లతోపాటు, సమైక్యాంధ్ర ఉద్యమంలో ఓ క్రమశిక్షణ గల సమైక్యవాదిగా చేపట్టిన పలు ఆందోళనలతో పలువురు సమైక్యవాదులు డాక్టర్ కోటినాగయ్య అభిమానులుగా మారి, ఎన్నికల సంగ్రామంలో ఆయనకు వెన్నంటి నిలిచారు. ఇలా డాక్టర్ కోటినాగయ్య తాను గెలవలేక పోయినా, గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నా ప్రధాన ప్రత్యర్థులు గెలుపు, ఓటములను తారుమారు చేయగలడనే భావన రాజకీయ విశే్లషకుల నుండి వినవస్తుంది. నియోజకవర్గంలో 24వేల వరకు పెరిగిన యువ ఓటర్లు మహిళా ఓటర్లు పోలింగ్ వేళ బారులు తీరడం, చాలాచోట్ల క్రాస్ ఓటింగ్ జరిగిందనే ప్రచారం వల్ల ప్రయోజనం ఎవరు పొందనున్నారనే ప్రశ్న ప్రధాన అభ్యర్థులను వేధిస్తుందనే చెప్పాలి. పోలింగ్ సరళి గమనిస్తే అర్బన్ కంటే రూరల్‌లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉన్న క్రమంలో, గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం హవా చాలా గ్రామాల్లో ఉన్నందున ఈదఫా కూడా అదే హవా తెలుగుదేశంకు ఉంటుందనే భావన ఆపార్టీ శ్రేణుల నుండి వ్యక్తమవుతుంది. అయిదే వైసిపి వారు మాత్రం రాజన్న రాజ్యం, జగన్నకే సాధ్యమనే భావన పేద వర్గాల్లో ఉంది. జగన్ ముఖ్యమంత్రి కావాలనే కోణంలో ఫ్యాన్‌కే పేద వర్గాలు అండగా ఉన్నారనే భావన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా నియోజకవర్గంలో ప్రచార పర్వంలో పోటీపడిన విధంగా పోలింగ్ వేళ టిడిపితో వైసిపి పోటీ పడలేకపోయిందనే భావన ఆపార్టీలోని కింది స్థాయి నాయకుల నుండి వ్యక్తమవుతుంది. ధనమే పరమావధిగా కొనసాగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, వైసిపి, టిడిపిలు నగదు పంపిణీలు చేసినా, ఇందులో వైసిపి వైఫల్యం వారి విజయావకాశాలకు గండికొట్టే అంశమనే భావన ఆపార్టీ వర్గాల నుండి వ్యక్తమవుతుంది. మొత్తానికి ఓటర్ నాడి పట్టుకున్న నాయకుడు ఎవరన్నది తెలుసుకునేందుకు 16 వరకు వేచిచూడాల్సిందే...

ఎటియంలో డబ్బులు కరువు
మాచవరం, మే 8: మాచవరం ఇండియన్ బ్యాంకు ఇటీవల ఏర్పాటుచేసిన ఎటియం సర్వీస్ నామమాత్రంగా పనిచేస్తుంది. ఈ ఎటియం సెంటర్‌లో డబ్బులు లేక గురువారం బ్యాంకుకు వెళ్ళిన ఖాతాదారులకు ఎటియం పనిచేయడం లేదు అని బోర్డుపెట్టడంతో దీంతో ఖాతాదారులు నివ్వెరపోయారు. సంబంధిత అధికారులు ఖాతాదారులు అడుగగా ఎటియంలో సమయానికి డబ్బు నింపకపోవడంతో ఆపివేయడం జరిగిందని బ్యాంకు అధికారులు ఖాతాదారులకు చెబుతున్నారు. ఎటియం వల్ల అన్ని వేళల్లో డబ్బులు లభ్యమవుతాయని, ఖాతాదారులు తమ అకౌంటులో డబ్బులు వేసుకుని, రద్దీ సమయంలో ఎటియంలో తీసుకుంటారు. ఎటియం సెంటర్ బ్యాంకులోపలే ఉండడంతో ఉదయం పదిగంటల వరకు సాయంత్రం ఐదుగంటల తర్వాత డబ్బులు డ్రాచేసేవారికి తీవ్ర తలనొప్పిగా మారిందని, ఎటియంకు ప్రత్యేకంగా స్ట్రాంగ్‌రూం ఏర్పాటు చేసి 24గంటలు పనిచేసేలా సౌకర్యం కల్పించాలని ఖాతాదారులు కోరుతున్నారు.

క్రోసిన్ అడ్వాన్స్ ఔషధ బిళ్లల విక్రయాలు నిలిపివేత
తెనాలి , మే 8: జ్వరం వ్యాధి నివారణకు వాడే ఔషధం క్రోసిన్ అడ్వాన్స్(ప్యారాసెట్‌మల్) మందు బిళ్ళలను తెనాలి డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ వీరకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఔషధ దుకాణాలపై దాడులు నిర్వహించి విక్రయాలు నిలిపివేశారు. డిఐ వికె రెడ్డి కథనం ప్రకారం జాతీయ, రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారుల ఆదేశాల మేరకు ఏ కంపెనీకి చెందిన ప్యారాసెట్‌మల్ మందుబిళ్ళ అయినా ఒక్కరూపాయకు మించిన ధరలకు వినియోగదారులకు విక్రయించరాదన్నారు. ఆవిధంగా విక్రయించిన దుకాణాలు, డీలర్లు తుదకు తయారుచేసే కంపెనీలపై కూడా చర్యలు తీసుకునే అధికారం డిసిఓ కమిటీకి ఉందన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఒక కంపెనీ క్రోసిన్ మందుబిళ్ళ పేరుతో ప్యారాసెట్‌మల్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. అప్పడు దాని ధర ఒక్క రూపాయిగానే ఉంది. అయితే ఆ మందుబిళ్ళ విక్రయాలు మార్కెట్‌లో పెరగటంతో అదే కంపెనీ క్రోసిన్ అడ్వాన్స్ పేరుతో 30బిళ్ళలు కలిగిన అట్టను 60రూపాయల ఎమ్మార్పీ ధరలకు విక్రయించే విధంగా మార్పులుచేసి మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీన్ని పసిగట్టిన ప్రాంతీయ డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు రంగంలోకి దిగి తెనాలి డివిజన్ ప్రధాన కేంద్రంలో గురువారం దాడులు నిర్వహించి క్రోసిన్ అడ్వాన్స్ మందుబిళ్ళ ఒక్కటి ధర రెండు రూపాయలుగా నిర్ణయించి మార్కెట్‌లో విడుదలైన ఔషధ బిళ్ళలను వెంటనే సంబంధిత డీలర్, డీలర్లు సంబంధిత కంపెనీలకు తిప్పిపంపాలని ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు 260 కోట్లు ఎన్నికల
english title: 
k

వంద పడకలు...వెయ్యి సమస్యలు...!

$
0
0

భద్రాచలం, మే 8: మూడు రాష్ట్రాల సరిహద్దుల్లోని గిరిజనులకు పెద్ద దిక్కు భద్రాచలం ఏరియా ఆస్పత్రి. ఆస్పత్రిని వంద పడకలుగా తీర్చిదిద్దినప్పటికీ అందులోని సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రభుత్వ వైద్యం ఇక్కడ మృగ్యం. పండంటి బిడ్డను ప్రసవిద్దామని వస్తే ప్రాణాలకు గ్యారంటీ లేదు. ఒకవేళ బిడ్డ పుట్టినా బతికి బట్ట కడతాడనే నమ్మకమూ లేదు. స్థూలంగా ఇది భద్రాచలం ఏరియా ఆస్పత్రి ధీన స్థితి.
వైద్యుల కొరత...
ఏరియా ఆస్పత్రిలో మొత్తం 21 మంది వైద్యులు ఉండాలి. కానీ 11 మంది మాత్రమే పని చేస్తున్నారు. 7 అసిస్టెంటు సివిల్ సర్జన్లు, ఒక సివిల్ సర్జన్, గైనకాలిజిస్టు, ఫిజీషియన్ వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. రాత్రి వేళల్లో ప్రసవానికి వచ్చే వారికి నొప్పులు ఆపేందుకు ఇంజక్షన్లు ఇచ్చి తెల్లవారేకా తీరుబడిగా వైద్యులు చికిత్సలు అందించేందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మనీరు తాగి చిన్నారులు, రక్తస్రావంతో తల్లులు కన్నుమూస్తున్నారు. రాత్రి వేళల్లో వైద్యం అందించేందుకు వైద్యులు నిరాసక్తత చూపుతున్నారు. వాటి ఫలితమే ఓ అజీజున్, మూడు రోజుల శిశువు మరణాలు సజీవ సాక్ష్యాలు. శస్త్ర చికిత్స చేసే వైద్యులు సకాలంలో రోగులకు వైద్యం అందించడం లేదు. ఒకవేళ రోగిని చూసినా ఎటువంటి కారణం లేకుండా ఖమ్మంకు వెళ్లాలని చెప్పి బెంబేలెత్తిస్తున్నారు.
రక్తనిధి కేంద్రం ఉన్నా...
భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోని రక్తనిధి కేంద్రం ఓ నాడు రాష్ట్రంలోనూ అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు ఆదర్శం. పట్టణంలో పలు స్వచ్ఛంద సంస్థలు, యువకులు రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారు. సాక్ష్యాత్తు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ రక్తదానం విషయంలో ఇక్కడి యువతను ప్రశంసించారు. అయితే ప్రస్తుతం ఈ రక్తనిధి కేంద్రంలో రక్తం నిల్వ ఉంచేందుకు సరైన సౌకర్యాలు లేక మూతపడింది. తాజాగా తెరిచినా రక్తం దొరకడం లేదు. రక్త హీనతతో 50 శాతం మంది చిన్నారులు, 31 శాతం మంది మహిళలు మన్యంలో బాధపడుతున్నారు. వారి కోసం ఈ రక్తనిధి కేంద్రంలో నిత్యం రక్తం నిల్వ ఉంచాల్సిన అవసరం ఉంది. కానీ ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో మరణ మృదంగం మోగుతూనే ఉంది.

పెరగని రేట్లతో గిరిజనుల ఆదాయానికి గండి
* తునికాకు సేకరణ లక్ష్యం కష్టమే
ఇల్లెందు, మే 8: ఏజెన్సీ ప్రాంతాల్లో తునికాకు సేకరించే కార్మికులకు ఈ ఏడాది నామమాత్రంగానైనా కూలీ రేట్లు పెరగలేదు దానికి తోడు ఆకు సేకరణ పనులు ఆలస్యంగా ప్రారంభమైనందున ప్రాణాలను పణంగా పెట్టి తునికాకు సేకరించే గిరిజన కుటుంబాలకు ప్రతి ఏటా వచ్చే ఆదాయంలో సగంమేరకైనా ఈ సారి వచ్చే పరిస్థితులు కనిపించడంలేదు. నెల రోజులు ఆలస్యంగా ఏజెన్సీలోని అటవీ ప్రాంతాల్లో తునికాకు సేకరణ పనులు ప్రారంభమయ్యాయని దాని కారణంగా 10 వేలకుపైగా ఆకు సేకరించే ఒక్కో గిరిజనుడు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని గిరిజనులు పేర్కొంటున్నారు. జిల్లాలోని భద్రాచలం సౌత్, నార్త్ జోన్లతోపాటు కొత్తగూడెం, పాల్వంచ, ఖమ్మం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న 50 యూనిట్లలో తునికాకు సేకరణ పనులు జరగాల్సి ఉంది. లక్ష మందికిపైగా గిరిజన కుటుంబాలు వేసవి కాలంలో తునికాకు సేకరణ పనులు నిర్వహిస్తుంటాయి. 45 రోజుల కాలంలో ఆకు సేకరించిన గిరిజనులకు ఒక్కొక్కరికి 20 వేలకు పైగా ఆదాయం లభిస్తుంది. ఈ ఏడాది సకాలంలో టెండర్లు జరగకపోవడం, వరుసగా ఎన్నికలు రావడం వల్ల తునికాకు సేకరణ పనులు మందగించాయి. ముందస్తుగానే అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం గిరిజనుల ఆదాయం గండిపడటానికి మరో కారణమైంది. కాంట్రాక్టర్లకు, ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయాన్ని అందించే జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు, పలు మైదాన ప్రాంతాల్లోని తునికాకు సేకరణ గిరిజన కుటుంబాలకు వేసవి కాలంలో రెండవ పంటగా విరాజిల్లుతోంది. 50 ఆకుల కట్టకు రెండు రూపాయలు చెల్లించాలని గత కొన్ని సంవత్సరాలుగా పలు రాజకీయ పార్టీలు, గిరిజన సంఘాలు తునికాకు సీజన్‌లో ఆందోళనలు నిర్వహించడం వల్ల ప్రతి ఏడాది అరకొరగా కూలీ రేట్లు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆందోళనలు లేకపోవడం వల్ల కూలీ రేట్లు నామమాత్రంగానైనా పెరగలేదు. పలు చోట్ల గతం కన్నా 10 పైసలు పెంచారు. ఇతర ప్రాంతాల్లో ఆకు సేకరణ పనులు సవ్యంగా జరిగే పరిస్థితి లేకపోవడం వల్ల కూలీ రేట్ల పెంపుదలపై ఎలాంటి చర్చలు జరగలేదు. తునికాకు సేకరణ లక్ష్యాన్ని సాధించే దిశలో అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ లక్ష్య సాధన కష్టంగానే ఉందని గిరిజన సంఘాలు పేర్కొంటున్నాయి. అటవీ ప్రాంతాల్లో ఆకు సేకరించి అక్కడి నుండి నేరుగా కాంట్రాక్టర్లు ఇతర ప్రాంతాలకు ఆకులను తరలిస్తుంటారు. దాని కారణగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీలకు భారీగా గండిపడుతోంది. దాని ఫలితంగా ఆకు సేకరణపై వచ్చే ఆదాయంలో గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బోనస్ సైతం శ్రమకు తగినట్టుగా అందడంలేదని గిరిజనులు గగ్గోలు పెడుతున్నారు. ఆకు సేకరణపై వస్తున్న లాభాలను మరింతగా పెంచేందుకు ప్రభుత్వం నిర్థిష్టమైన చర్యలు తీసుకుంటే దాని ఆధారంగా తమకు కూలీ రేట్లు పెరగడంతోపాటు ఆశించిన మేరకు బోనస్ డబ్బులు అందుతాయని గిరిజనులు పేర్కొంటున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి అటవీ ప్రాంతంలో ఆకు సేకరిస్తున్న గిరిజనులకు కనీస రక్షణ కల్పించకపోవడంతోపాటు నామమాత్రంగానైనా సదుపాయాలు, సౌకర్యాలను కల్పించడంలేదని, విధిలేని పరిస్థితుల్లో తునికాకు సేకరిస్తున్నట్లుగా గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అభ్యర్థులు నియమనిబంధనలు పాటించాలి
* ఎన్నికల అధికారులు జి రవి, నారాయణ
కొత్తగూడెం టౌన్, మే 8: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు నిబంధనలు పాటించి కౌంటింగ్ ప్రక్రియకు సహకరించాలని ఎన్నికల అధికారులు జి రవి, నారాయణలు కోరారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అభ్యర్థుల అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అభ్యర్థులు ఎన్నికల లెక్కింపు విధానంపై అవగాహన కలిగిన వారినే ఏజెంట్లుగా నియమించాలని కోరారు. ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పారదర్శంగా ఎలక్ట్రానిక్ మిషన్ల ద్వారా జరుగుతుందని తెలిపారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించి వార్డుల వారీగా ఐదు టేబుళ్లలో లెక్కింపు జరుగుతుందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరిస్తారని చెప్పారు. అభ్యర్థులు, ఏజెంట్లు లెక్కింపు కేంద్రానికి ఉదయం 8 గంటలకే స్థానిక సింగరేణి మహిళా కళాశాలకు హాజరుకావాలని కోరారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఏజెంట్ పాస్‌లు మూడు రోజులు ముందుగానే తీసుకోవాలని, కౌంటింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, ఇంకుపెన్నులు అనుమతించబడవన్నారు. మద్యం సేవించి కౌంటింగ్ హాజరైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. సమావేశంలో డిఎస్పీ రంగరాజు భాస్కర్, మున్సిపల్ డిఇ నాగభూషణం, 1 టౌన్ సిఐ మహేందర్, టిపిఓ భానుచందర్, రామనరసింహ పాల్గొన్నారు.

కినె్నరసాని నీళ్లివ్వరు... సకాలంలో చెత్త ఎత్తరు...
* ఇటు నీటి కోసం అవస్థలు - అటు కంపుతో ఉక్కిరిబిక్కిరి
* ఐదు రోజులుగా నీటి సరఫరాకు బ్రేకులు- కనిపించని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
* మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడుతున్న పట్టణ ప్రజలు
కొత్తగూడెం, మే 8: పట్టణంలో సమస్యలను చూస్తుంటే మున్సిపల్ అధికారుల, సిబ్బంది పని తీరుపై ప్రజల నుండి తీవ్ర స్థాయిలో నిరసనలు వెళ్లువెత్తుతున్న పరిస్థితి నెలకొంది. అసలు మున్సిపల్ పరిపాలన ఉందా..? లేక పడకేసిందా..? అనే అనుమానం కలుగుతోంది. ఆదివారం వచ్చిన కినె్నరసాని జలాలు గత ఐదు రోజులుగా కినె్నరసాని నీటి సరఫరా లేక జనం గగ్గోలు పెడుతున్నారు. అంతేకాకుండా పట్టణంలోని ప్రధాన సెంటర్లలో ఉన్న చెత్తకుండీల్లో చెత్త పేరుకుపోయి రోజులు గడుస్తున్నా ఆ చెత్తను ఎత్తివేయని పరిస్థితి నెలకొంది. దీంతో విస్తరిస్తున్న కంపుతో పాదచారులు, ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ రెండు ప్రధాన సమస్యలను చూస్తుంటే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై వార్డు ప్రజలు మండిపడుతున్నారు. గురువారం సాయంత్రం వరకు కినె్నరసాని జలాలు రాకపోవడంతో నీటి కోసం 33 వార్డుల ప్రజల అవస్థలు చెప్పలేనివిగా ఉన్నాయి. ప్రతి రోజు సమయానికి వచ్చే సింగరేణి నీటి సరఫరా అక్కడక్కడ రాని ఫలితంగా నీటి కోసం దేవాలయాల వద్ద కుళాయిల వద్దకు పరుగులు తీసి నీటిని పట్టుకున్న దృశ్యాలు కనిపించాయి. అదేవిధంగా సింగరేణి కార్మిక సంఘాల పలు యూనియన్ కార్యాలయాలు, వివిధ పార్టీల కార్యాలయాల్లో ఉన్న పంపుల వద్దకు వెళ్లి కొద్ది పాటి నీటిని తెచ్చుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ పరిధిలోని 22 వార్డులో నీటి కోసం మహిళలు మండుటెండలో పడిగాపులు కాస్తూ చివరకు రైటర్‌బస్తీలో ఉన్న శ్రీ త్రిమాతాశక్తి పంచాయతీన క్షేత్రం, పెద్దమ్మతల్లి ఆలయాలకు ఉన్న నీటి కుళాయిలు. అదేవిధంగా సింగరేణి బిపవర్ హౌస్, సబ్ స్టేషన్‌లో ఉన్న పంపులను ఆశ్రయించారు. కినె్నరసాని నీటి సరఫరాకు తరచూ బ్రేకులు పడడం వల్ల కొత్తగూడెం పట్టణంలో నీటి ఎద్దడి రోజు రోజు తీవ్రవౌతోంది. ఇదిలా ఉంటే కనీసం మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అయినా వార్డులకు నీటి సరఫరా చేయకపోవడం పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కినె్నరసాని జలాలను నిరంతరం వార్డులకు సరఫరా చేయాలని ఇటీవల మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన నిర్వహించిన విషయం విధితమే. అయినా కూడా మున్సిపల్ అధికారుల్లో చిత్తశుద్ధి లేనందునే కొత్తగూడెం పట్టణంలో నీటి సమస్య ఏర్పడడం దారుణం. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీసం ప్రత్యామ్నాయాల ద్వారానైనా వార్డులకు తాగు నీటి సరఫరా చేయాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక సిబ్బందిని కూడా కేటాయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అంబసత్రం భూముల్లో అక్రమ ఇటుక బట్టీలు- పట్టించుకోని అధికారులు
* గుంటలుగా మారుతున్న సాగు భూమి * వెట్టిచాకిరీలో వలస కార్మికులు
కొత్తగూడెం రూరల్, మే 8: మండల పరిధిలోని అనిశెట్టిపల్లి గ్రామ పంచాయతీలో గల అంబసత్రం భూముల్లో అక్రమంగా ఇటుక బట్టీల వ్యాపారులు రాజ్యమేలుతున్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండానే కేవలం సాగు చేసుకుంనేందుకు ఉపయోగించే అంబ సత్రం భూముల్లో అక్రమార్కులు ఇటుక బట్టీల వ్యాపారం చేస్తూ లక్షలు గడిస్తున్నారు. అనిశెట్టిపల్లి ప్రాంతంలో ప్రధాన రహదారికి ఇరువైపుల ఇటుక బట్టీలు దర్శనమిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సాగు భూమిని గుంటలుగా చేసి ఇటుకలను తయారు చేసేందుకు మట్టిని తవ్వడం వల్ల సాగు భూమి మొత్తం గుంటలమయంగా మారుతోంది. ఇటుక బట్టీలను కాల్చేందుకు వాడే కలప అక్రమంగా అడవుల నుండి తరలిస్తున్నప్పటికీ ఫారెస్టు అధికారులు కనీసం బట్టీలవైపు చూడకుండా ఉండడం గమనార్హం. ఇటుకలను తయారు చేసే వలస కార్మికులు ఉండే పాకలు, ఇటుకలను తయారుచేసేందుకు అవసరమయ్యే నీటి కోసం విద్యుత్ చౌర్యానికి సైతం వ్యాపారులు పాల్పడుతుండడం విచారకరం. రాష్ట్రాన్ని వదిలి పొట్టకూటి కోసం వచ్చిన వలస కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వకపోవడం, సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల వారి జీవితం దుర్భరంగా మారింది. మండుటెండను సైతం లెక్కచేయకుండా వ్యాపారులకు ఆదాయం చేకూర్చేందుకు అహర్నిశలు కష్టపడుతున్న కార్మికులు అనారోగ్యానికి గురైతే వైద్యం అందించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ వ్యాపారస్థులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

సీమాంధ్రలో కలుస్తున్న రెవెన్యూ గ్రామాల వివరాలపై 11లోగా పూర్తి స్థాయ నివేదికలివ్వాలి
* జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశం
ఖానాపురం హావేలి, మే 8: రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కలుస్తున్న 136 రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన ఫైళ్ళు, స్థిర, చర ఆస్తులు, కట్టడాలు, మానవ వనరులు, కోర్టు కేసులు తదితర అంశాలకు సంభందించిన నివేధికను ఈ నెల 11 లోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా భద్రాచలం డివిజన్‌లోని కూనవరం, చింతూరు, విఆర్‌పురం, భద్రాచలం మండలాలలోని 98 రెవిన్యూ గ్రామాలు, పాల్వంచ డివిజన్‌లోని బూర్గంపాడు, వేలేరుపాడు, కుక్కునూరు మండలంలలోని 38 రెవిన్యూ గ్రామాలు సీమాంధ్రలో కలుస్తున్నందున మిగిలిన గ్రామాలకు సంబంధించిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు. విభజనకు సంబంధించిన గ్రామాల మ్యాపును ఖమ్మం వెబ్‌సైట్‌లో పెట్టాలని, ఆ సిడి హార్డ్ కాపీని అధికారులకు అందజేయాలని సర్వే అండ్ లాండ్ రికార్డు అధికారిని ఆదేశించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రత్యేక విభాగాన్ని కలెక్టరేటులో ఏర్పాటు చేశామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ సమస్య సున్నితమైందని, వీటి రికార్డులు స్కానింగ్ చేసి భద్రపరచాలని సూచించారు. ఈ సమావేశంలో జెసి సురేంద్రమోహన్, ఐటిడిఏపిఒ డి దివ్య, భద్రాచలం, పాల్వంచ, ఖమ్మం, కొత్తగూడెం రెవిన్యూ డివిజన్ల అధికారులు కె వెంకటేశ్వర్లు, ఎన్ సత్యనారాయణ, డి సంజీవరెడ్డి, డి అమయ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.

ప్రాథమిక శిక్షణే అసలైన పునాది
* ఎస్పీ రంగనాథ్
ఖానాపురం హవేలి,మే 8:ప్రజల కోసం పనిచేసే ప్రజా పోలీస్‌గా తీర్చిదిద్దాలంటే ప్రాథమిక శిక్షణ పునాదిలాంటిదని జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ అన్నారు. గురువారం స్థానిక ఎస్‌బి కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన స్ట్ఫైండరీ కానిస్టేబుళ్ళకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ వృత్తి ప్రజల రక్షణకై అంకితమైన ఒక బాధ్యత అని, అలాంటి బాధ్యత కలిగిన పోలీసులపై ప్రజల్లో గౌరవభావం, ఆసక్తి కలగాలంటే వారు హర్షించే పద్ధతిలో పని చేయాలన్నారు. గౌరవంతో కూడిన పోలీస్ ఉద్యోగంలో శాంతిభద్రతలను పకడ్బందీగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి పోలీస్‌పై ఉందన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా పని చేసినప్పుడే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని, అందుకుగాను ప్రతి ఒక్కరు నిజాయితీగా పని చేయాలన్నారు. అదే విధంగా కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు టైపింగ్, న్యూస్ పేపర్ చదవటం చాలా ముఖ్యమన్నారు. శిక్షణకు హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్, సైబరాబాద్‌కు చెందిన 105మంది స్ట్ఫైండరీ కానిస్టేబుళ్ళు హాజరయ్యారు. కార్యక్రమంలో ఓఎస్‌డి వైవి రమణకుమార్, డిఎస్పీలు బాలకిషన్‌రావు, డిటిసి గంగారం, ఎస్‌బిఐ వెంకట్రావు, బుచ్చయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ ఫలితాలకు కౌంట్‌డౌన్
* మరో మూడు రోజుల్లో ఉత్కంఠకు తెర * సింగరేణి మహిళా కళాశాల వద్ద భారీ బందోబస్తు
కొత్తగూడెం,మే 8: మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ నెల 12వ తేదీన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో మరో మూడు రోజులు గడిస్తే ఫలితాల ఉత్కంఠకు తెరపడనుంది. స్థానిక సింగరేణి మహిళా కళాశాలలో ఇవిఎంలు భద్ర పర్చబడి ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఇవిఎంలే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బ్యాక్స్‌లు భద్రంగా ఉన్నాయి. అదేవిధంగా పినపాక, ఇల్లెందు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఇవిఎంలే కాకుండా మహబూబాబాద్ లోక్ సభలకు సంబంధించిన ఇవిఎంలు కూడా సింగరేణి మహిళా కళాశాలలో భద్ర పరిచారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు బాక్స్‌ల భద్రతకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు నిత్యం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మొదట ఈ నెల 12వ తేదీన మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ప్రకటించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల అధికారి, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ గుర్రం రవి నిత్యం పర్యవేక్షణ జరుపుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ను రౌండ్ల వారీగా నిర్వహించడానికి అన్ని చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీలోని వార్డుల సంఖ్య, లెక్కింపు కేంద్రంలో వసతులను బట్టీ రౌండ్ల కేటాయింపును చేయనున్నారు. మున్సిపాలిటీలో 33 వార్డులకు ఎన్నికలు నిర్వహించిన కారణంగా లెక్కింపు ప్రక్రియను ఒక్కొక్క రౌండ్‌లో 5 వార్డులో పూర్తి చేయనున్నారు. మొత్తం లెక్కింపు కోసం ఐదు టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఆరు రౌండ్లలో కనీసం ఒక్కొక్క ఇవిఎంలకు అర్ధగంట వ్యవధిలో లెక్కింపును పూర్తి చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. సింగరేణి మహిళా కళాశాలలోని ఎంబిఎ బ్లాక్ మొదటి అంతస్తులో లెక్కింపు జరగనుంది. ఐదుగురు సూపర్‌వైజర్లు, ఐదుగురు అసిస్టెంట్లతోపాటు మరో నలుగురిని రిజర్వడుగా ఉంచనున్నారు. ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించిన అధికారులే లెక్కింపుపై కూడా పర్యవేక్షణ చేస్తారు. మున్సిపల్ ఓట్ల లెక్కింపులో మొదటగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించనున్నారు. తరువాత వార్డుల వారీగా ఇవిఎంల ద్వారా ఓట్లను లెక్కిస్తారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం 21 మందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఓట్ల లెక్కింపు ముందు రోజు వరకు కూడా పోస్టల్ బ్యాలెట్‌ను పంపించే అవకాశాన్ని కల్పించారు. ఎన్నికల విధుల్లో ఉన్న సహాయక సిబ్బంది, అదనపు సిబ్బందితోపాటు లెక్కింపు కేంద్రంలో పోటీ చేసిన అభ్యర్థి లేకపోతే వారి తరపున ఎవరో ఒక ఏజెంట్ ఉండటానికి అవకాశం కల్పిస్తారు. లెక్కింపు కేంద్రంలో నిబంధనలు తప్పకుండా పాటించాలని ఇప్పటికే ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లెక్కింపు కేంద్రానికి అర్ధగంట ముందే అభ్యర్థులు, ఏజెంట్లు రావాల్సి ఉంటుంది. జారీ చేసిన గుర్తింపు కార్డులు చూపిస్తేనే లోపలికి అనుమతిస్తారు. అదేవిధంగా ఇచ్చే గుర్తింపు కార్డులోనే లెక్కింపు టేబుల్ నెంబర్‌ను కూడా నమోదు చేస్తారు. ఎవరికి కేటాయించిన టేబుల్ నెంబర్ వద్ద వారు మాత్రమే కూర్చోవాల్సి ఉంటుంది. సెల్ ఫోన్లు, సిగరెట్ ప్యాకెట్లు, అగ్గిపెట్టెలు తదితర వాటిని అనుమతించేదిలేదని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభించనున్నారు. భద్రత కోసం సుమారు 300 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. కొత్తగూడెం డిఎస్పీ రంగరాజు భాస్కర్ నేతృత్వంలో సిఐలు మహేందర్, వెంకటస్వామి, భోజరాజులు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. బ్యాలెట్ బాక్స్‌ల భద్రత కోసం 25 మంది సివిల్ పోలీసులు, 30 మంది ఎపిఎస్పీ, 150 మంది సిఆర్‌పిఎఫ్, 26 మంది ఎఆర్ కానిస్టేబుళ్లు, స్పెషల్ పార్టీ పోలీసులు, పెట్రోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు.

అకాల వర్షంతో మార్కెట్‌లో తడిసిన పంటలు
* రైతుల ఆందోళన
ఖమ్మం, మే 8: ఖమ్మంలో గురువారం కురిసిన అకాల వర్షానికి వ్యవసాయ మార్కెట్‌లో రైతులు నిల్వచేసిన పంటలు పూర్తిగా తడిసి పో యాయి. మార్కెట్‌కు తరలించిన మిర్చి, పత్తి బస్తాలు పూర్తిగా తడిసి పోవటంతో వారి పంటలకు మద్దతు ధర లభిస్తుందో లేదోనన్న ఆనుమానంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రైతుల పంటలకు రక్షణ కల్పించటంలో అధికారులు విఫలమవుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో మిర్చి సీజన్ కావటంతో మార్కెట్‌లో పంటలను దిగుమతి చేసుకోవటానికి షెట్టర్లు లేకపోవటంతో రైతులు మార్కెట్ రోడ్లపైనే దిగుమతి చేసుకునే పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. తడిసిన పంటలను కనీసం ఆరబెట్టుకునేందుకు కూడ సరైన వసతులు అధికారులు ఏర్పాటు చేయటం లేదని వెల్లడించారు. మార్కెట్‌లో జెండా పాట ధర ఉన్నప్పటికి రైతుల పంటలకు అనేక సాకులతో తక్కువ ధర చెల్లిస్తున్నారని, అకాల వర్షానికి తడిసిన పంటలకు ఎంత ధర తగ్గుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఇబ్బందులతో పండించిన పంటలను మార్కెట్‌కు తరలిస్తే వ్యాపారులే కాకుండా ప్రకృతి కూడా రైతులకు తీవ్ర నష్టాన్ని ఇస్తుందని ఆరోపించారు. అకాల వర్షాలు ఉన్నాయని వాతావరణశాఖ వెల్లడిస్తున్నప్పటికి మార్కెట్ అధికారులు రైతుల పంటలకు రక్షణ కల్పించటం లేదని, కనీసం పంటలను వర్షల నుండి రక్షణ కల్పించటానికి తగిన షెట్టర్లు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
పోస్టల్ బ్యాలెట్ అందలేదని
ఉపాధ్యాయుల ఆందోళన
మధిర, మే 8: గత నెల 30వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న తమకు ఇంతవరకు పోస్టల్ బ్యాలెట్ అందలేదని పలువురు ఉపాధ్యాయులు గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకుంటే పోస్టు ద్వారా పంపిస్తామని చెప్పడంతో తాము పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకొని ఎన్నికల విధుల్లో పాల్గొనామన్నారు. ఇప్పటికి 15 రోజులు దాటిపోయినప్పటికి ఇంతవరకు తమకు పోస్టల్ బ్యాలెట్లు అందలేదని, తమతో పాటు దరఖాస్తు చేసుకున్న కొంతమందికి పది రోజుల క్రితమే అవి అందాయన్నారు. తమ పోస్టల్ బ్యాలెట్‌లను తపాల శాఖ వారికి అందజేశారో లేదో కూడా చెప్పడం లేదన్నారు. మధిర నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంజీవరెడ్డిని ఫోన్‌లో సంప్రదిస్తే మధిర తహశీల్దార్ కార్యాలయంలో అడగమని చెప్తున్నారని, తహశీల్దార్ కార్యాలయం వద్దకు వస్తే రికార్డులన్ని ఖమ్మంకు తరలించామని చెప్తూ సరైన సమాచారం కూడా ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారు విధులకు హాజరు కాకపోతే జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తామని సందేశాలు పెట్టిన అధికారులు తమకు పోస్టల్ బ్యాలెట్‌లను అందించడంలో విఫలం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. మధిర నియోజకవర్గంలో సుమారు 40 మందికి పోస్టల్ బ్యాలెట్‌లు అందలేదని, పోస్టల్ బ్యా లెట్ అందని ఉపాధ్యాయులు కూడా ఎక్కువ శాతం ఒక ఉపాధ్యాయ సంఘానికి చెందిన వారు కావడం పలు అనుమానాలకు తావిస్తోందని వారు పేర్కొన్నారు. కనీసం పోస్టల్ శాఖకు పంపిణీ చేసిన లిస్ట్‌లో కూడా తమ పేర్లు లేవని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్‌లు అందని ఉపాధ్యాయులు డిప్యూటీ తహశీల్దార్ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. ఇదే విషయాన్ని ల కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తామని అన్నారు.

విజయోత్సవ ర్యాలీలు నిషిద్ధం
ఖమ్మం, మే 8:ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత గెలుపొందిన అభ్యర్థులు ప్రదర్శనలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ బాలకిషన్‌రావు ఒక ప్రకటనలోతెలిపారు. విజయోత్సవ ర్యాలీలు నిషేధిస్తూ ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసిందని, అల్లర్లకు పాల్పడటం, గుంపులు గుంపులుగా తిరగకూడదని హెచ్చరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలో భాగంగా 30పోలీస్ యాక్ట్, 144సెక్షన్ విధించినట్లు తెలిపారు. ఎవరైనా పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలలో సంచరిస్తే కఠినంగ చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ఫలితాల సందర్భంగా ఎటువంటి ఆవేశాలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని డిఎస్పీ కోరారు. వివిధ రాజకీయ పక్షాల వారు పోలీస్ శాఖకు సహకరించి ఎన్నికల ఫలితాల ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించే వ్యక్తుల సమాచారాన్ని సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు గానీ, పోలీస్ ఉన్నతాధికారులకు గానీ, కంట్రోల్ రూంకు డయల్ 100నెంబర్‌కు గానీ ఫోన్ ద్వారా తెలియచేయాలని కోరారు.

ఓట్ల లెక్కింపు సమయంలో
సంయమనం పాటించాలి
వైరా,మే 8: ఈ నెల 13న జరగనున్న జడ్పీటిసి, ఎంపిటీసి అభ్యర్థుల ఓట్ల లెక్కింపుకు బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల నాయకులు సైతం లెక్కింపు సమయంలో సంయమనం పాటించాలని మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి క్రిష్ణమూర్తి కోరారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష పార్టీల నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు స్థానిక ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సముదాయంలో జరగనున్నట్లు తెలిపారు. ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థితో పాటు మరో అభ్యర్థికి లెక్కింపు సమయంలో ఏజెంట్‌గా అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. అట్టి అభ్యర్థులు లెక్కింపు సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, చట్టాన్ని వ్యతిరేకించే కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముందుగా అభ్యర్థులు తమ ఏజెంట్లకోసం వారి ఫొటోలు ఇస్తే తమ సిబ్బంది గుర్తింపు కార్డులు ఇస్తామని గుర్తింపు కార్డులు ఉన్నవారికే లెక్కింపు కేంద్రంలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. ఈసమావేశంలో ఎంపిడీఓ శిరీష, సూపిడెంట్ నాగేశ్వరావు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, జడ్పీటీసి, ఎంపీటీసి బరిలో ఉన్న నాయకులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో ధన ప్రవాహం
ప్రజాస్వామ్యానికే ముప్పు
* సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ
ఖమ్మం, మే 8: ఎన్నికల్లో ధన ప్రవాహం చివరకు ప్రజాస్వామ్యానికే ముప్పు తీసుకురానున్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ అన్నారు. గురువారం స్థానిక గిరిప్రసాద్ భవన్‌లో పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం మండె వీరహన్మంతరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ సైతం ధన ప్రవాహాన్ని అదుపుచేయలేకపోయిందని ఆరోపించారు. ఒక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు అభ్యర్థులు సుమారు 150కోట్లు ఖర్చు చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కోట్ల రూపాయలు వెదజల్లుతూ ఓటర్లను మభ్యపెట్టారని ఆరోపించారు. డబ్బుతో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల వ్యవస్థలో మార్పులు రాకుండా ఈ అక్రమాలను అరికట్టలేమన్నారు. ఇదిలా ఉండగా కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారులను విచారించటానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటాన్ని సిపిఐ స్వాగతిస్తుందన్నారు. ఖమ్మం పార్లమెంట్‌తో పాటు వైరా, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళీని సమీక్షించారు. సమావేశంలో పార్టీ నాయకులు బాగం హేమంతరావు,సిద్ధి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

భద్రాచలంలో భారీ వర్షం
* ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం
భద్రాచలం, మే 8: కేరళలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం భద్రాచలం మన్యంపై తీవ్రంగా పడింది. భద్రాచలం ఏజెన్సీలోని పలు మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. సుమారు మూడు గంటల పాటు ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. రోడ్లపై వర్షపు నీరు పొంగి పొర్లింది. చెత్తా చెదారం రోడ్లపైకి కుప్పలు కుప్పలుగా పేరుకుపోయింది. ఈ వర్షం వల్ల భద్రాచలం మండలంలోని వివిధ గ్రామాల్లోని మామిడి చెట్లకు ఉన్న కాయలన్నీ పూర్తిగా నేలరాలాయి. అలాగే పలుచోట్ల కల్లాల్లో ఆరబోసిన మిర్చి అకస్మాత్తుగా కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యింది. మిర్చిని కాపాడుకునేందుకు రైతులు బరకాలు కప్పుకునే సమయం కూడా లేకపోవడంతో తడుస్తున్న మిర్చిని చూస్తూ మిన్నకుండిపోవడం తప్ప చేసేదేం లేకపోయింది. ఆరుగాలం కష్టించి పండించిన మిర్చి మరికొద్ది రోజుల్లో మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుందామనుకున్న తరుణంలో కురిసిన అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయిన రైతులు కన్నీరు పెడుతున్నారు. మిర్చి తడిసిపోవడంతో నాణ్యతతో పాటు రంగు మారిపోయే ప్రమాదం ఉందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అలాగే కోతకు వచ్చిన మామిడి కాయలు నేలరాలిపగిలిపోయాయి. దీంతో అంతగా ధర పలుకదని మామిడి సాగు రైతులు ఆవేదనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా వర్షం కురిసే సమయంలో వేగంగా వీచిన ఈదురుగాలులకు పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడిపోగా రేకులతో నిర్మించిన షెడ్లు, బోర్డులు, హోర్డింగులు నేలకూలాయి.

* భద్రాచలం ఏరియా ఆస్పత్రి తీరిది
english title: 
h

జిల్లాలో బెట్టింగ్‌ల జోరు

$
0
0

మచిలీపట్నం, మే 8: జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ముగియటంతో అభ్యర్థులు గెలుపు ఓటములపై లె క్కలు కడుతుండగా జూదర్లు కాయ్ రాజా కాయ్.. అంటూ పందాలకు తెర లేపారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ విడత నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాం గ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నా యి. ఆ దిశగా అభ్యర్థులను బరిలో దించారు. అ న్ని విధాలా సమర్థులైన వారికే టిక్కెట్లు కేటాయిం చి ప్రచారాలు నిర్వహించారు. జిల్లాలో రెండు పా ర్లమెంట్ స్థానాలు, 16 అసెంబ్లీ స్థానాలకు బుధవా రం పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. రికా ర్డు స్థాయిలో 78.34 శాతం పోలింగ్ జరిగింది. అభ్యర్థులు గెలుపు, ఓటములపై ఎవరికి వారు ధీమా వ్య క్తం చేస్తున్నారు. అంతర్గతంగా ఓటమి భయం వెం టాడుతున్నా తమదే విజయమంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కూడికలు తీసివేతల్లో మునిగి తేలుతున్నా రు. ప్రాంతాలు, సామాజిక వర్గాల వారీగా పోలైన ఓట్లపై అ రా తీస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా అభ్యర్థుల గెలు పు ఓటములపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉం డగా పందెపురాయుళ్లు బెట్టింగ్‌లకు తెర లేపారు. అభ్యర్థుల గెలుపు ఓటములపై పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఈ విడత పందెగాళ్లు భారీ స్థాయిలో బెట్టింగ్‌లకు కాలు దు వ్వుతున్నారు. చిన్నా చితకా పందాలతో పాటు పెద్ద మొత్తం లో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ప్రధానంగా తెలుగుదే శం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటములపైనే పందాలకు దిగుతున్నారు. జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీ ట్లు వస్తాయి, ఏ అభ్యర్థి ఎంత మెజార్టీతో విజయం సాధిస్తారు, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విషయాలపై పెద్ద ఎత్తున బె ట్టింగ్‌లకు దిగుతున్నట్టు సమాచారం. అలాగే కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర త దితర చిన్నా చితకా పార్టీల అభ్యర్థులు సాధించే ఓట్లపై కూడా పందాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. డబ్బుతో పాటు ఆస్తులను కూడా పందెంలో ఫణంగా పెడుతున్నారు. కొంత మంది రూపాయికి రెండు రూపాయిలు ఇస్తామని కూడా పందాలకు కాలు దువ్వుతున్నట్టు తెలుస్తోంది. బుధవారం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ జరిగింది. నువ్వా..నేనా.. అన్న రీతిలో తలపడటంతో ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే బెట్టింగ్‌ల విషయంలో జిల్లా ఎస్‌పి ప్రభాకరరావు దృష్టి కేంద్రీకరించారు. పందాలకు పాల్పడే వారి సమాచారం తెలిస్తే కఠిన చర్యలు గైకొంటామని హెచ్చరించారు. ఇందు కోసం ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కలిదిండిలో భారీగా బెట్టింగ్‌లు
కలిదిండి : సార్వత్రిక ఎన్నికలు ముగియటంతో అభ్యర్థుల గెలుపు ఓటములపై కలిదిండి మండలంలో పెద్ద ఎత్తున పందాలు జరుగుతున్నాయి. కైకలూరు బిజెపి అభ్యర్థి డా. కామినేని శ్రీనివాస్ గెలుపుపై అధికంగా పందాలు జరుగుతున్నాయి. పలు చోట్ల వైఎస్‌ఆర్ సిపి అభ్యర్థి ఉప్పాల రాంప్రసాద్ గెలుస్తారని మరికొంత మంది పందాలు వేస్తున్నారు. కామినేని విజయంపై కాకుండా మెజార్టీ సీట్లపై కూడా పందాలు జరుగుతున్నాయి. 15వేల మెజార్టీతో కామినేని గెలుస్తారని లక్షలాది రూపాయల్లో పందాలు వేస్తున్నారు. హెచ్చు పందాలు భారీగా ఉన్నాయి. సీమాంధ్రలో తెలుగుదేశం, వైఎస్‌ఆర్ సిపి సీట్లపై పెద్ద మొత్తంలో పందాలు జరుగుతున్నాయి. వైకాపా కంటే తెదేపాకు అధిక సీట్లు వస్తాయని కొంత మంది పందాలు కాస్తుండగా వైకాపాకే మెజార్టీ ఉంటుందని మరికొంత మంది బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు.

ఎంసెట్ పరీక్ష నిర్వహణకు పక్బందీ ఏర్పాట్లు
మచిలీపట్నం , మే 8: ఈనెల 22న జరిగే ఎంసెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని హైదరాబాద్ జెఎన్‌టియు రిజిస్ట్రార్, ఎంసెట్ కన్వీనర్ డా. ఎన్‌వి రమణారావు కోరారు. స్థానిక హిందూ కళాశాల ప్రాంగణంలో గురువారం అవగాహనా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఇంజనీరింగ్ పరీక్ష, మధ్యాహ్నం 2.30ని.లకు సాయంత్రం 5.30ని.ల వరకు మెడిసిన్ పరీక్ష జరుగుతుందన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదన్నారు. పరీక్షా హాలులోకి విద్యార్థులు ఎలక్ట్రానిక్ గేడ్గెట్స్, గాగుల్స్ టైప్ స్పెట్స్ తీసుకురాకూడదన్నారు. హాల్ టిక్కెట్లు, పూర్తి చేసిన ఆన్‌లైన్ దరఖాస్తు, కుల ధృవీకరణ పత్రం జిరాక్స్ తీసుకురావాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో తాగునీటి సౌకర్యంతో పాటు ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ ఉషారాణి, పట్టణంలోని ఆరు పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, పరిశీలకులు పాల్గొన్నారు.

సేవా గుణానికి మించిన ధర్మం మరొకటి లేదు
మచిలీపట్నం, మే 8: సేవా గుణానికి మించిన ధర్మం లేదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి చక్రధరరావు అన్నారు. స్థానిక పరాసుపేట త్రిపుర సుందరి ఫౌండేషన్ ఇండియా కార్యాలయంలో ని ర్వహిస్తున్న ఉచిత మధుమే హ చికిత్సా కేంద్రం 18వ వార్షికోత్సవాన్ని గురువారం ఘనం గా నిర్వహించారు. ముఖ్య అ తిథిగా హాజరైన చక్రధరరావు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్నారు. 18 ఏ ళ్లుగా ఉచిత మధుమేహ చికి త్సా కేంద్రం నిర్వహిస్తున్న వై ద్యులు అభినందనీయులన్నా రు. విజయవాడ నాగార్జున హాస్పటల్స్ వైద్యులు డా. కె జ గన్మోహనరావు మాట్లాడుతూ క్రమం తప్పకుండా మూత్రపరీక్ష, రక్త పరీక్ష చేయించుకుం టూ వైద్యుల పర్యవేక్షణలో ఔ షద సేవతో మధుమేహ వ్యాధి ని నియంత్రించవచ్చన్నారు. బరువును క్రమబద్ధీకరించుకోవడం, కొవ్వు పదార్థాల మోతాదును తగ్గించడం, మద్యానికి దూరంగా ఉండటం వల్ల మధు చీమేహాన్ని నియంత్రించవచ్చన్నారు. ఈ సందర్భంగా డా. అశ్వనీ కుమార్ రచించిన ‘షుగర్ వ్యాధి అందరిలో ఒకటి కాదా’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. వింజమూరి శివరాం కార్యదర్శి నివేదిక సమర్పించారు. సంస్థకు సేవలు అందిస్తున్న పలువురిని సత్కరించారు. డా. కె శివ ప్రసాద్ చికిత్సా కేంద్రం అందిస్తున్న సేవలను వివరించారు. తొలుత భగవాన్ సత్యసాయి బాబా, సంస్థ వ్యవస్థాపకులు ఆచార్య కోట సుందర రామ శర్మ చిత్ర పటాలకు పూల మాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో 1వ తరగతి అదనపు జిల్లా జడ్జి ఎం రామశేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

సీమాంధ్రలో టిడిపి ప్రభుత్వం ఖాయం
నందిగామ, మే 8: సీమాంధ్రలో ప్రజలు సమర్థవంతమైన పాలన, అభివృద్ధి కోరుకుంటున్నారని, అందుకే ఎక్కువ పోలింగ్ శాతం నమోదైందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక సబ్ జైలు రిమాండ్‌లో ఉ న్న తెదేపా నాయకుడు వసంత కృష్ణప్రసాద్‌ను పరామర్శించేందుకు గురువారం ఎంపి అభ్యర్థి కేశినేని నా ని, విజయవాడ అర్బన్ పార్టీ అధ్యక్షుడు బుద్దా వెంకన్నతో కలిసి ఆయన ఇక్కడకు వచ్చారు. అనంతరం ఉమా విలేఖరులతో మాట్లాడుతూ సీమాంధ్రలో తె లుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఇప్పటికే తేలిపోయిందని, అన్ని సర్వేలలోనూ ఈ విషయం వెల్లడవుతోందన్నారు. వైకాపా అధికారంలోకి రాదని తెలిసినప్పటికీ ఆ పార్టీ అధినేత జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. పార్టీ శ్రేణులు చివరి (కౌంటింగ్ ప్రక్రియ) వరకూ నిలబడరేమోనన్న భ యంతో మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు. జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు పార్లమెంట్ స్థానాలు తెదేపా కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ యంత్రాంగంతో కుమ్మక్కై కుట్ర రాజకీయాలతో తప్పుడు కేసులు నమోదు చేయించి పార్టీ నాయకులను ఇబ్బందులకు గురిచేసే పనులు చేశార ని, అయినప్పటికీ పార్టీ శ్రేణులు సంయమనం పా టించారని అన్నారు. నాలుగు దశాబ్దాలుగా నందిగా మ నియోజకవర్గంలో ఎటువంటి సంస్కృతి లేదన్నా రు. తాము ఎప్పుడూ నీచ రాజకీయాలు చేయలేదని, ఓటమి భయంతో వారు పిచ్చి పనులు చేసి చేతులు కాల్చుకున్నారని అన్నారు.

మండుటెండల్లోనూ కార్పొరేట్ తరగతులు
* ఇంటర్ బోర్డు నిబంధనలు బేఖాతర్
విజయవాడ, మే 8: ఎన్నికలతో జిల్లా కలెక్టర్ నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులు అందరూ ఎవరి విధుల్లో వారు బిజీబిజీ అయిపోయారు. ఇక ప్రభుత్వం రాష్ట్ర విభజనలో ఆస్తులు, కార్యాలయాలు, అధికారుల బదిలీల్లో పూర్తిగా నిమగ్నమైంది. అయితే ఇంకేముంది సందట్లో సడేమియా ఇంటర్మీడియెట్ బోర్డు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు తమ కళాశాల్లోనే ఇంటర్ మొదటి సంవత్సరం చదివిన వారికి రెండో సంవత్సరం సిలబస్‌ను ఇప్పటికే ప్రారంభించి రుద్దిస్తున్నారు. పదో తరగతి పాసైన విద్యార్థులకు గాలం వేసి తొలుత అడ్వాన్స్‌లు తీసుకుని అడ్మిషన్‌లు ప్రారంభించటం ఏమిటి ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్‌ను ప్రారంభించారు. నిబంధనల ప్రకారం జూన్ మొదటి వారం వరకు ఎలాంటి తరగతులను ప్రారంభించరాదు. అయితే వీటన్నింటిని అతిక్రమించి దాదాపు అడ్మిషన్‌లు కూడా పూర్తి చేసుకొని తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో పాపం విద్యార్థులెవరూ కూడా ప్రస్తుత వేసవి శెలవుల్లో తోటి విద్యార్థులతో కలిసి కాస్తంత సేపు సరదాగా తిరిగే అవకాశం లేకుండాపోయింది. ఇక పిల్లలకు తరగతులు ప్రారంభం కావటంతో తల్లిదండ్రులు కూడా ఎటూ వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండాల్సి వస్తున్నది. వాస్తవానికి పదో తరగతి పరీక్షలు జరిగే సమయాంలోనే ‘బ్రోకర్లు’ హైస్కూల్స్ చుట్టు తిరిగి ప్రతిభావంతులైన విద్యార్థుల చిరునామాలు సేకరించి వారి వారి తల్లిదండ్రులతో సమాలోచనలు సాగించి ఫలితాలు కూడా వెలువడక ముందే అడ్మిషన్ల రూపంలో వేలకువేలు వసూలు చేసారు. అదేమంటే సీట్లు ఉండకపోవచ్చంటూ భయపెట్టేసారు. ఇదిలా ఉంటే విద్యార్థులు మాత్రం తమ తల్లిదండ్రులకు ఎదురు చెప్పలేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల కారణంగా తొమ్మితో తరగతి పరీక్షలు ముగిసిన వెంటనే గత ఏడాది వేసవి సెలవుల్లోనే పదో తరగతి సిలబస్ కోసం తరగతులకు హాజరై ఏడాది మొత్తం విరామం అంటూ లేకుండా కష్టపడి చదివారు. పోనీ ఈ వేసవిలో అయినా కాస్తంత ఆట విడుపు దొరుకుతుంది కాదా అనుకుంటే కార్పొరేట్ విద్యా సంస్థల వారు ముందుగానే తరగతులు ప్రారంభించారు. అయితేనేమి బోర్డు అధికారులు ఇప్పటి వరకు ఏ ఒక్క సంస్థపై చర్య తీసుకున్న దాఖలాలేదు.

1994 నాటి ఫలితాలు పునరావృతం: దేవినేని
* జగ్గయ్యపేటలో పోలీసుల అండతో అరాచకాలు : కేశినేని నాని
* వెన్నుపోటు పొడిచిన వారిపై కఠిన చర్యలు : బొండా
విజయవాడ, మే 8: ఎన్నికల ఫలితాలపై కేశినేని నాని భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో తెదేపా జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 1994లో ఏ విధంగా టిడిపి వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు ప్రభంజనం సృష్టించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో రెండు దశాబ్దాలు తర్వాత నేడు అదే పరిస్థితి తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పునరావృతమై సీమాంధ్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెదేపా కార్యకర్తలు, నాయకులు ప్రాణాలకు తెగించి తెదేపా గెలుపు కోసం కృషి చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నేడు ప్రజలందరు స్వచ్ఛందంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఈ రాష్ట్రం బాగుపడాలని, మంచి నాయకుడు కావాలని అది తెదేపాతోనే సాధ్యమని నమ్మి సైకిల్ గుర్తుకు ఓటు వేసారంటూ ప్రజలందరికీ ధన్యవాదాలు ఆయన తెలియజేశారు. జగన్ పోలింగ్ జరుగుతుండగా ప్రెస్‌మీట్ పెట్టి 120 సీట్లు వస్తాయని ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రకటనలు చేయడం జగన్ మితిమీరిన విశ్వాసంతో వ్యవహరించిన తీరు సరికాదన్నారు. కౌంటింగ్‌లో ఏజెంట్లలో ఆత్మస్ధైర్యం నిపేందుకు అలా మాట్లాడుతున్నారని అన్నారు. అన్ని సర్వేలు ప్రజలందరూ కూడా తెదేపాకే మెజార్టీ చెప్పారని గత ఐదు సంవత్సరాలుగా ఏమి అభివృద్ధి జరగిందో తామంతా చూసామని స్థానిక ప్రజలు ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారన్నారు. పోలింగ్‌లో జగన్ గూండాలు, ఐపిఎస్ అధికారులు, పోలీసుల మీద బరితెగించి దాడులు చేయడం వారి పిరికితనానికి నిదర్శమని ఎలాగైనా పోలింగ్‌ను నిలిపివేయాలన్న విశ్వ ప్రయత్నాన్ని ఓటర్లు తిప్పికొట్టి తెదేపా విజయానికి కృషి చేసారని ఉమా అన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ (నాని) మాట్లాడుతూ నిన్న జరిగిన ఎన్నికల్లో జగ్గయ్యపేట వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి ఉదయభాను పోలీసుల అందదండలతో అరాచకాలు సృష్టించారని అక్కడి అధికారులు తెదేపా ఏజెంట్‌లు, నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలింగ్ శాతాన్ని అడ్డుకోవాలని చేసిన ప్రయత్నాన్ని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారులతో మాట్లాడి ప్రత్యేక ఫోర్స్‌లను తెప్పించి ఎన్నికలను సజావుగా జరిగేలా కృషి చేయడం జరిగిందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సొంత ఛానల్, సొంత పత్రికతో తెదేపా అధినేత, నాయకులపై మానసికంగా దెబ్బతీయాలని అసత్యవార్తలను, అసత్య ప్రసారాలను చేసి ప్రజలను మభ్యపెట్టాలనే ప్రయత్నం నిన్న పోలైన ఓటింగ్ శాతంతోనే జగన్ మాయమాటలు ప్రజలు నమ్మేస్థితిలో లేరని మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమనే సంకేతాన్ని ఓటర్లు తెలియచేసారన్నారు. సెంట్రల్ ఇతర నియోజకవర్గాల్లో తెదే నేతలు కొందరు తమ వెంట తిరుగుతూ పోలింగ్ రోజున వెన్నుపోటు పొడిచారని అలాంటి వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న ద్వారా చంద్రబాబుకి నివేదిక పంపించనున్నారు. అలాంటి వ్యక్తుల పేర్లు తెలుపడానికి బొండా నిరాకరించారు. ఈ సమావేశంలో తెదేపా జిల్లా పరిశీలకురాలు ఇమ్మని రాజేశ్వరి, విజయవాడ అర్బన్ అధ్యక్షులు బుద్దా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

బిజెపి, టిడిపిలతో రాష్ట్రానికి నష్టం
* మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి
విజయవాడ, మే 8: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు ప్రజలు బిజెపి, టిడిపి కూటమిని మరియు కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొట్టారని విజయవాడ మాజీ శాసన సభ్యులు అడుసుమిల్లి జయప్రకాష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో పై మూడు పార్టీలు చేసిన దొంగ ఆటలకు సరైన గుణపాఠం చెప్పారని ఆయన వివరించారు. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో కూడా ఈ మూడు పార్టీల వైఖరికి మొత్తం తెలుగు ప్రజలు సమష్టిగా కక్ష తీర్చుకున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో మోదీ హవా పని చేయలేదని అడుసుమిల్లి తెలియజేశారు. రాష్ట్ర విభజనకు కారకులైన పార్టీలను ప్రజలు నిర్ధ్వందంగా తిరస్కరించారని తెలిపారు. బిజెపితో పొత్తు వల్ల తెలుగుదేశం, చంద్రబాబు ఓటమి పాలవబోతున్నారని చెప్పారు. ఈ విషయంలో తెలుగు ప్రజలందరికీ అడుసుమిల్లి జయప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు.

సిద్ధార్థ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లోకి చేరిన 16 శాసనసభ స్థానాల ఇవిఎంలు
* పకడ్బందీ బందోబస్తు
విజయవాడ, మే 8: జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు బుధవారం సాయంత్రం 6 గంటలకు ముగియడంతో ఇవిఎంలను ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూంలలో భద్రపరచడం జరిగింది. మచిలీపట్నం, విజయవాడ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలు, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలకు సంబంధించి ఇవిఎంలను తాత్కాలిక స్ట్రాంగ్ రూంల నుండి గురువారం వేకువజాము నుండే కానూరు విఆర్ సిద్ధార్థ, పిబి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీల నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను గట్టి పోలీసు బందోబస్తు మధ్య తరలించడం జరిగింది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, నందిగామ నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్ రూంలను పిబి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ జె మురళి, ఎన్నికల సాధారణ పరిశీలకులు రేణుపంత్, బిశ్వనాథ్ ప్రధాన్, పుష్యపాటి సక్సేనాలు, వివిధ పార్టీల అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలలో భద్రపరచిన ఇవిఎంలను పరిశీలించి స్ట్రాంగ్ రూంలకు వారి సమక్షంలో సీల్ చేయించడం జరిగింది. స్ట్రాంగ్ రూంల వద్ద విజిటర్స్ డైరి అందుబాటులో వుంచవలసిందిగా రేణుపంత్ తెలిపారు. అంతకు ముందు వివిధ రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులతో ఎన్నికల సాధారణ పరిశీలకురాలు రేణుపంత్, జాయింట్ కలెక్టర్ జె మురళి సమావేశం నిర్వహించారు. రేణుపంత్ మాట్లాడుతూ కొన్ని చోట్ల ఇవిఎంలు పని చేయకపోవడంతో వెంటనే వాటి స్థానే వేరొకటి మార్పు చేయడం జరిగిందనీ, మార్పు చేసిన పోలింగ్ స్టేషన్ల వివరాలను సంబంధిత పార్టీల అభ్యర్థులకు తెలిపారు. పోలింగ్ ప్రక్రియపై ఏమైనా సందేహాలు వుంటే పిఓ, డైరీని పరిశీలించవచ్చునని తెలిపారు. విజయవాడ పార్లమెంట్ నియోజకర్గంలోని పోలింగ్ సరళిని పరిశీలించి 90 నుండి 95 శాతం పైబడి సగటుకంటే 15 శాతం తక్కువగా వున్న పోలింగ్ నమోదైన పోలింగ్ స్టేషన్ల పిఓ, డైరీలను ఆమె పరిశీలించారు.

పెనమలూరు నియోజకవర్గ స్ట్రాంగ్ రూంకు సీల్
విజయవాడ, మే 8: పెనమలూరు నియోజకవర్గ ఎన్నికకు సంబంధించిన ఇవిఎంలను బుధవారం పోలింగ్ అనంతరం కానూరు విఆర్ సిద్ధార్థ కాలేజీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్‌కు తరలించడం జరిగింది. పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి రిసెప్షన్ సెంటర్, ఇవిఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూంలు సిద్ధార్థ కాలేజీ నుంచే వుంచటం వలన ఇవిఎంలు భద్రపరిచే ప్రక్రియ వేగవంతంగా ముగిసింది. ఇవిఎంలు భద్రపరిచే ఏర్పాట్లను పెనమలూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, సబ్ కలెక్టర్ డి హరిచందన రాత్రి అంతా అక్కడే ఉండి ఇవిఎంలను భద్రపరిచే ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం ఉదయం 6.30 గంటలకే ఇవిఎంలు భద్రపరిచే ప్రక్రియ పూర్తికావడంతో పెనమలూరు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు రమేష్ మిశ్రా, సబ్ కలెక్టర్ డి హరిచందన, ఎసిపి షకీల భాను, వివిధ రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధుల సమక్షంలో ఉదయం 6.45 గంటలకే స్ట్రాంగ్ రూంలకు సీలు వేయడం జరిగింది.

ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
* టిడిపి సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమా
విజయవాడ , మే 8: దేశ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోను, రాష్ట్రంలోను టిడిపి, బిజెపి కూటమికే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇరవై వేల మెజార్టీతో తాను విజయం సాధిస్తానని సెంట్రల్ టిడిపి అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం సింగ్‌నగర్‌లోని సెంట్రల్ టిడిపి కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఉమా మాట్లాడుతూ ఓటర్లను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమైందన్నారు. వైకాపా ప్రలోభాల్లో భాగంగా ఓటర్ల వద్ద నుంచి ఓటరు స్లిప్‌లను సేకరించిన వైకాపా శ్రేణుల వల్లనే సెంట్రల్ నియోజకవర్గంలో పోలింగ్ శాతం తగ్గిందని విమర్శించారు. నీతికి అవినీతికి జరిగిన ధర్మ యుద్ధంలో తెలుగుదేశం పార్టీ విజయం కోసం శ్రమించిన పార్టీ శ్రేణులతోపాటు మండుటెండలతోపాటు జడివానలో కూడా ఎంతో సహనంతో పోలింగ్ కేంద్రాల్లో నిలుచుని ఓటేసిన ఓటర్లందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఉమా తెలిపారు. ఓటరు ప్రలోభాలకు పాల్పడిన వైకాపాకు చెందిన వంద మందిని పోలీసులే కానీ, ఎన్నికల అధికారులే కానీ పట్టుకున్న వైనం ఆపార్టీ అనైతిక చర్యలకు నిదర్శనమన్నారు. ఓటమి భయంతోనే వైకాపా అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిందని ఎద్దేవా చేసారు. ఇదిలావుండగా టిడిపి మరలా అధికారంలోకి వచ్చి రాష్ట్భ్య్రాన్నతికి దోహదపడాలని కోరుతూ పార్టీ శ్రేణులు విశ్రమం లేకుండా శ్రమిస్తుంటే మరికొంత మంది టిడిపి కి చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీ ఓటమికి పనిచేయడం శోచనీయమని, ఇతర పార్టీ ప్రలోభాలకు తలొగ్గడమే కాకుండా మరికొంత మంది కుల, సామాజిక వర్గాల పేరుతో ఇతర అభ్యర్థులకు అనుకూలంగా పనిచేసిన వైనం పై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని, పార్టీ వ్యతిరేకులపై ఇప్పటికే నివేదికను సిద్ధం చేసామని, ఈ నివేదిక అనుగుణంగా పార్టీ అధిష్టానం వారిపై చర్యలు తీసుకొంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే తనపై లేనిపోని విమర్శలతో వార్తాకధనాలు వెల్లడించిన అంశాలపై తాను మీడియా సమక్షంలో చర్చకు సిద్ధంగా ఉన్నానని, ఇందుకు వారు కూడా సిద్ధంగా ఉండాలని ఆయన సవాల్ చేసారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ గోగుల రమణారావు, అర్బన్ నాయకులు నందేపు జగదీష్, గొట్టుముక్కల రఘు, జివి నరసింహరావు, పిరియా సోమేశ్వరరావు, కనకారావు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు షెడ్యూల్ విడుదల
* మే 12న వివిధ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
విజయవాడ, మే 8: జిల్లా వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 30వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింను మే 12వ తేదీన జరుపనున్నట్టు జిల్లా కలెక్టర్ ఆర్ రఘునందనరావు తెలిపారు. ఇందులో భాగంగా విజయవాడ నగర పాలక సంస్థతోపాటు జిల్లాలోని మచిలీపట్నం, పెడన, గుడివాడ, నూజివీడు, తిరువూరు, ఉయ్యూరు, నందిగామ, జగ్గయ్యపేట తదితర మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు. దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయన్న విషయంపై సుప్రీ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మున్సిపల్ ఫలితాలను వాయిదా వేసిన అధికారులు సార్వత్రిక ఎన్నికలు ముగిసిన ప్రస్తుత నేపధ్యంలో మున్సిపల్ ఫలితాల వెల్లడికి చర్యలు తీసుకొంటున్నారు. ఇందులో భాగంగా ముందుగా ప్రకటించిన విధంగా మే 12వ తేదీన ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్ రఘునందనరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఫలితాల కోసం పోలింగ్ కౌంటింగ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. విజయవాడ నగర పాలక సంస్థకు చెందిన 59 డివిజన్ల ఓట్ల లెక్కింపునకు నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేసారు. అలాగే జిల్లాలోని మిగిలిన మున్సిపాలిటీలైన మచిలీపట్నం మున్సిపాలిటీకి చెందిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని హిందు కళాశాలలోని సి బ్లాక్ రూం నెంబర్ 2 లో ఏర్పాటు చేసారు. పెడన మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని మచిలీపట్నంలోని వరలక్ష్మీ పాలిటెక్నిక్ కళాశాల లెక్చర్‌హాల్ లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసారు. గుడివాడ మున్సిపల్ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని గుడివాడ ఎఎన్‌ఆర్ కళాశాల జిమ్నాజియం హాల్లో, నూజివీడు సారధి ఇంజనీరింగ్ కళాశాల బిల్డింగ్ నెంబర్ -2, 3వ అంతస్థులోని రూమ్ నెంబర్ బి -402లో నూజివీడు మున్సిపల్ ఓట్లు, రూమ్ నెంబర్ 401 లో తిరువూరు మున్సిపల్ ఓట్లు లెక్కింపు, అలాగే రూమ్ నెంబర్ 412 లో ఉయ్యూరు మున్సిపల్ ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసారు. నందిగామ మున్సిపల్ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని విజయవాడ సిద్దార్ధ మసిళా కళాశాల 3వ అంతస్థు లోని రూమ్ నెంబర్ 409 లో, జగ్గయ్యపేట మున్సిపల్ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని రూమ్ నెంబర్ 407 లో ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ రఘునందనరావు పేర్కొన్నారు.

మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో 82.88 శాతం పోలింగ్
* 2009లో 83.04 శాతం మాత్రమే
విజయవాడ, మే 8:మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 13,68,840 మంది ఓటర్లకు గాను 11,34,481 మంది తమ ఓటు హక్కును (82.88 శాతం) వినియోగించుకున్నారు. అయితే 2009 ఎన్నికలకంటే పోలింగ్ శాతం కొంత మేర తగ్గింది. నాడు మొత్తం ఓటర్లు 12,51,053 మందికిగాను 10,38,841 మంది (83.04 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో
నూజివీడులో 87.33 శాతం కైకలూరులో 86.13 శాతం
విజయవాడ, మే 8: ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కృష్ణా జిల్లాలోని నూజివీడులో 2,14,673 మంది ఓటర్లకు గాను 1,87,474 మంది (87.33 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2009 ఎన్నికల్లో 1,91,655 మందికి గాను 1,68,977 మంది (88.17 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కైకలూరులో 1,89,288 మంది ఓటర్లకు గాను 1,63,034 మంది (86.13 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2009 ఎన్నికలలో 1,83,024 మందికి గాను 1,56,579 మంది (85.55 శాతం) తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ముగియటంతో అభ్యర్థులు గెలుపు
english title: 
betting

ఫలితాల కోసం ఎదురుచూపులు

$
0
0

నెల్లూరు, మే 8: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పర్వం పూర్తయింది. అభ్యర్థుల భవితవ్యం ఇవిఎంలలో నిక్షిప్తమై ఉంది. జిల్లా ప్రజలు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెల 16న లోక్‌సభ, శాసనసభ ఎన్నికల కౌంటింగ్ జరగనుండడంతో అందరి చూపులు ఫలితాలపైనే ఉన్నాయి. ఈసారి జిల్లాలో 75.12 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో 2009లో జరిగిన ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఐదుశాతం పోలింగ్ ఎక్కువ నమోదైంది. దీంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే తమ విజయం ఖాయమని ధీమాగా ప్రకటించుకుంటున్నారు. జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాల్లో తాము గెలుపొందడం తధ్యమని వైసిపి నాయకులు తేల్చి చెపుతున్నారు. తెలుగుదేశం పార్టీవారు రెండు పార్లమెంట్, 9 అసెంబ్లీ స్థానాలు మావే అంటున్నారు. ఈ నేపధ్యంలో ప్రజల్లో కూడా ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈసారి జరిగిన ఎన్నికల్లో పట్టణాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదు కాగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఓటింగ్ నమోదైంది. దీంతోగ్రామీణ ఓటర్లు ఏ పార్టీవైపు మొగ్గు చూపుతారో, పట్టణ ఓటర్లు ఏ పార్టీవైపు మొగ్గు చూపుతారో అని ఆందోళనలో చెందుతున్నారు. గ్రామాల్లో 2009 కంటే ఈ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో వైసిపి ఆధిపత్యం కనిపించగా మరికొన్ని చోట్ల తెలుగుదేశం ప్రభావం కనిపించింది. ఇంకొన్ని చోట్ల రెండు పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. పోలింగ్ సరళిని బట్టి రాజకీయ విశే్లషకులు అంచనాలు పార్టీల అంచనాలకు భిన్నంగా మారే అవకాశాలున్నాయి. 2009లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో జిల్లాలో తెలుగుదేశం అభ్యర్థులు ఐదుగురు గెలుపొందారని, ఈ ఎన్నికల్లో కూడా తాము ఎక్కువ స్థానాల్లో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ 70శాతం పైగా నమోదైంది కాబట్టి తమకు జిల్లాలో 9 నియోజకవర్గాల్లో గెలుపు ఖాయమని అంటున్నారు. మహిళలు కూడా ఈసారి టిడిపి వైపే మొగ్గు చూపారని, పంట రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ వంటి పథకాలు అందరినీ ఆకట్టుకున్నాయన్నారు. పట్టణ ప్రాంతాల్లో మోదీ ప్రభావంతో పాటు చంద్రబాబునాయుడు సిఎం అయితే కొత్త రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తాడనే నమ్మకం కలిగిందని, దీంతో పట్టణఓటర్లు కూడా తెలుగుదేశంకు అనుకూలంగా ఓటేశారని చెప్పుకుంటున్నారు. 2014 ఎన్నికలు రాజకీయ సమీకరణలు పూర్తిస్థాయిలో మారిపోయాయి. తెలుగుదేశం, వైసిపి మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. గ్రామీణ ఓటర్లు ఎక్కువగా వైఎస్‌ఆర్‌సిపికి మద్దతు పలకడంతో జిల్లాలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ శాతం పెరగడం వల్ల వైఎస్‌ఆర్‌సిపికి ప్రజలు పట్టం కట్టనున్నారని ఆ పార్టీల నాయకులు భావిస్తున్నారు. గ్రామీణ ఓటర్లు ఎక్కువగా రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తిరిగి అమలు కావాలంటే జగన్ సిఎంగా రావాల్సిన అవసరం ఉందని గుర్తించారని అందుకే ఈసారి గ్రామీణ ఓటర్లు ఎక్కువ మంది వైసిపికి ఓటేశారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో ఉదయగిరి, కోవూరుతోపాటు నెల్లూరు పార్లమెంట్ స్థానాల్లో వైసిపి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారని ఈ సారి ఎన్నికల్లో కూడా జిల్లాలోని 10 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందుతారని ఆ పార్టీ వారు భావిస్తున్నారు. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేని దుస్థితికి చేరింది. పోలింగ్ శాతం పెంచాలని అధికారులు విశ్వప్రయత్నం చేసినా నెల్లూరు సిటీతోపాటు పట్టణ ప్రాంతాల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. గ్రామాల్లో మాత్రం ఓటర్లు తమ సత్తా చాటారు. అయితే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల ఫలితాల కంటే ముందు కార్పొరేషన్, మున్సిపాలిటీ, జడ్పీటిసి, ఎంపిటిసిల ఎన్నికల లెక్కింపు జరుగుతుంది. ఏది ఏమైనా ఇవిఎంలు, బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవిత ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే !

సీమాంధ్రలో టిడిపిదే అధికారం
* టిడిపి నేత సోమిరెడ్డి స్పష్టం
నెల్లూరు, మే 8: లోక్‌సభ, శాసనసభకు బుధవారం జరిగిన ఎన్నికల్లో సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొంది అధికారంలోకి రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సర్వేపల్లి తెలుగుదేశం అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం స్థానిక ఎన్టీఆర్ భవన్‌లోఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో టిడిపికి వంద సీట్లు రావడం ఖాయమని ఆయన ధీమాగా చెప్పారు. నెల్లూరు జిల్లాలో రెండు ఎంపి స్థానాలతోపాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం విజయం సాధించడం తధ్యమన్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ, రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పాలన రావడం ఖాయమన్నారు. బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు సహకారంతో పాటు పలు అంశాలు తనకు కలిసివచ్చాయని సోమిరెడ్డి పేర్కొన్నారు. సర్వేపల్లిలో తాను 15వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ సాధించాలంటే ఒక చంద్రబాబునాయుడు వల్లే సాధ్యమవుతుందని ఓటర్లు నమ్మడం వల్లే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారన్నారు. టిడిపి నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. టిడిపి కార్యకర్తలను ఆదుకుంటామని, టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీ, గూండా రాజకీయాలు చేసేవారిని తరిమికొడతామని చెప్పారు. ఈసందర్భంగా మీడియాపై దాడిచేసిన వైసిపి వైఖరిని ఆయన ఖండించారు.

టిడిపి కార్యకర్తపై వైసిపి కార్యకర్తల దాడి
* పరిస్థితి విషమం
ఓజిలి, మే 8: మండల పరిధిలోని ఇనుగుంట గ్రామంలో టిడిపి కార్యకర్త శ్రీనివాసులుపై బుధవారం రాత్రి పాతకక్షల నేపధ్యంలో అదే గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్తలు మురళి, లక్ష్మణపతి, మణి ఇనుప రాడ్డుతో దాడి చేశారు. ఈ సంఘటనలో శ్రీనివాసులుకు కాలు, చేయి విరిగిపోవడంతో బంధువులు, స్థానికులు హుటాహుటిన గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులు గురువారం ఓజిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై శ్రీనివాసులురెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. అనంతరం మాట్లాడుతూ దాడికి బాధ్యులపై చర్యలు తప్పవన్నారు.

రోగులకు పండ్లు పంపిణీ
సూళ్లూరుపేట, మే 8: రెడ్‌క్రాస్ సొసైటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సూళ్లూరుపేటలో ఆ కమిటీ సభ్యులు గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సూళ్లూరుపేట రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు వెంకటేశ్వర్లు, భగవాన్‌దాస్‌లు వైద్యశాలకు వెళ్లి వైద్యులు ప్రియదర్శిని చేతుల మీదుగా అందజేశారు.

గెలుపుధీమాలో టిడిపి, వైకాపా నేతలు
వెంకటగిరి, మే 8: జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనంటూ టిడిపి, వైకాపా నేతలు కురుగొండ్ల రామకృష్ణ, కొమ్మి లక్ష్మయ్యనాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చివరి రోజు వరకు వెంకటగిరిలో టిడిపి, వైకాపా, కాంగ్రెస్ మధ్య పోటీ జోరుగా నడిచినా చివరిరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటర్లకు నగదు పంపకాలు చేయకపోవడంతో చివరికి టిడిపి, వైకాపా మధ్యనే పోటీ నడిచిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గతంలో తనను ఎమ్మెల్యేగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు గెలిపించారని తమ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా తాను ఐదేళ్ల పాటు ప్రజలతోనే ఉంటూ తన చేతనైన సేవలందించానని, ఈ ఎన్నికల్లో ప్రజలు తననే ఆదరిస్తారని, తప్పక గెలుపు నాదేనని మాజీఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి గాలి వీస్తుందని, వైఎస్‌ఆర్ చేపట్టిన పథకాలు ప్రజలు మరిచిపోలేదని, ఈ ఎన్నికల్లో వెంకటగిరిలో తానే ఎమ్మెల్యేగా గెలుస్తానని వైకాపా అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్యనాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వెంకటగిరి నియోజకవర్గ ప్రజల తీర్పు ప్రతిసారీ భిన్నంగా ఉండటం విశేషం. రాష్ట్రంలో అధికారం ఎవరికి వస్తుందో దానికి వ్యతిరేకంగా వెంకటగిరిలో అభ్యర్థిగా ప్రజలు గెలిపిస్తారు. ఈ ఎన్నికల్లో ఎవరిని ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తారో 16వ తేది వరకు వేచి చూడాల్సిందే.

మంచివారికే వెంకటగిరీయుల ఓట్లు
వెంకటగిరి, మే 8: ప్రజలతో సన్నిహితంగా ఉంటూ ప్రజలకు సేవ చేసేవారికి వెంకటగిరీయులు పట్టం కడతారని టిడిపి పట్టణ అధ్యక్షులు బీరం రాజేశ్వరరావు తెలిపారు. వెంకటగిరిలో ఎన్నడూ లేనివిధంగా వైకాపా అభ్యర్థి రోడ్ల పై బడి నోటికొచ్చినట్లు మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారని. ఇలాంటి వ్యవహారాలు చేయడంతో మధ్యాహ్నం జరిగిన ఓటింగ్‌లో టిడిపికే అధికంగా ఓట్లు పోలయ్యాయని ఆయన అన్నారు. వెంకటగిరిలో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నికలు జరుగుతున్నాయని, ఎన్నికల్లో మాత్రం పోటాపోటీగా ఉంటారని, ఎన్నికల అనంతరం అందరం కలిసిపోతామని అన్నారు. వెంకటగిరి నుంచి మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారని, ఎన్నడూ ఈ విధంగా రాజకీయాలు చేయలేదని తెలిపారు. వెంకటగిరి ప్రజలు ఇలాంటి రాజకీయాలు నచ్చవని ఆయన అన్నారు.

పోలీసు సిబ్బందికి గుంటూరు రేంజ్ ఐజి అభినందనలు
నెల్లూరు, మే 8: బుధవారం జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడుతూ ప్రశాంత వాతారణంలో ఎన్నికలు నిర్వహించి ఓటింగ్ శాతం పెరగటానికి కష్టించి ఎన్నికల విధులను నిర్వర్తించిన పోలీసు అధికారులకు గుంటూరు రేంజ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు పట్టణ ఎస్‌పి గోపినాధ్ జెట్టి, గుంటూరు గ్రామీణ ఎస్‌పి జె సత్యనారాయణ, ప్రకాశం జిల్లా ఎస్‌పి పి ప్రమోద్‌కుమార్, నెల్లూరు ఎస్‌పి నవదీప్ సింగ్ గ్రేవాల్, 8 మంది అదనపు సూపరింటెండెంట్‌లు, 37 మంది డిఎస్‌పిలు, 141 మంది ఇన్‌స్పెక్టర్లు, 436 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, 1716 మంది అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుల్స్, పోలీసు సిబ్బందితో పాటు 180 ప్లటూన్ల బలగాలు, వివిధ శాఖల నుండి వచ్చి విధులు నిర్వర్తించిన సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.

టిడిపి కార్యకర్తలపై వైసిపి కార్యకర్తల దాడి
* ముగ్గురికి తీవ్రగాయాలు
నాయుడుపేట, మే 8: మండల పరిధిలోని బిరదవాడ గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలను అదే గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్తలు దాడి చేయడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. గతంలో వైసిపి కార్యకర్తలుగా ఉన్న దారా వెంకటేశ్వర్లు, మస్తాన్, శ్రీనులు సార్వత్రిక ఎన్నికల్లో టిడిపిలో చేరి ప్రచారంలో పాల్గొన్నారు. కాగా, వెంకటేశ్వర్లు ఎన్నికల ఏజంట్‌గా వ్యవహరించాడు. ఈ విషయమై వైసిపి కార్యకర్తలైన అదే గ్రామానికి చెందిన తీపలపూడి క్రిష్ణయ్య, బాబు, చంద్రమ్మ తదితరుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి చివరకు దారా వెంకటేశ్వర్లు, మస్తాన్, శ్రీనులపై తీపలపూడి క్రిష్ణయ్య, బాబు, చంద్రమ్మ తదితరులు ఇనుప రాడ్డుతో దాడికి దిగారు. తీవ్రగాయాలైన వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

రూరల్ ఎస్‌ఐపై చర్యలు చేపట్టాలి : బీద
కావలి రూరల్, మే 8: ఎన్నికల నేపధ్యంలో వైకాపాకు అనుకూలంగా వ్యవహరించడంతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులపై వీరంగం సృష్టించిన రూరల్ ఎస్‌ఐ రహీమ్‌రెడ్డిపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కావలి టిడిపి అభ్యర్థి బీద మస్తాన్‌రావు డిమాండ్ చేసారు. ఎస్‌ఐ వీరంగం సృష్టించి గాయపరిచిన బాధితులను గురువారం వైద్యశాలలో బీద పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి వుండగా ఒక పార్టీకి అనుకూలంగా ఉంటూ, తెలుగుదేశం పార్టీ వర్గాలను భయభ్రాంతులకు గురిచేసి విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారన్నారు. తనకు లా అండ్ ఆర్డర్ వ్యవస్థ అంటే గౌరవమని చట్టం ప్రకారం న్యాయబద్ధంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని విశ్వసిస్తూ ఐదేళ్ల కాలంలో పోలీసులకు స్వేచ్చ ఇచ్చానని చెప్పారు. ఇలాంటి తరుణంలో ఎన్నికల సందర్భంగా రూరల్ ఎస్‌ఐ ఏకపక్షంగా వ్యవహరించి తమ పార్టీకి చెందిన ముసునూరు, గుమ్మడిమందలలో పలువురు కార్యకర్తలపై చేయి చేసుకొని గాయపరిచారన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టగా అడిషనల్ ఎస్‌సి రెడ్డి గంగాధర్ స్పందించి ఆ ఎస్‌ఐపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కావలి డిఎస్‌పిచే విచారణ చేపట్టి చర్య చేపడుతానని హామీ ఇచ్చారన్నారు. విచారణ చేపట్టి చర్య చేపట్టకపోతే తిరిగి ఆందోళన చేపట్టక తప్పదని హెచ్చరించారు. ఆయన వెంట పార్టీ నాయకులు తటవర్తి వాసు, రమణయ్య, కృష్ణ తదితరులు వున్నారు.

ప్రైవేటు వైద్యశాలలో గాయపడిన బాధితుడిని
పరామర్శిస్తున్న ఎమ్మెల్యే తదితరులు
ఆటోను ఢీకొన్న లారీ
నలుగురుకి గాయాలు
చిల్లకూరు, మే 8: చిల్లకూరు ఐదో నెంబర్ జాతీయ రహదారిపై నెల్లబల్లి రెట్టపల్లి కూడలి వద్ద చెన్నై నుండి నెల్లూరు వైపు వెళుతున్న లారీ ముందుగా వెళుతున్న ఆటోను ఢీకొనటంతో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఓజిలి మండలం బీసీ కాలనీకి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు ఆటోను అద్దెకు మాట్లాడుకొని గూడూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న శ్రీదేవి, అనూష్క, శ్రీనివాసులు, చిన్న శ్రీనివాసులుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఐజెఎం అంబులెన్స్ ద్వారా గూడూరు ఆసుపత్రికి తరలించారు. ఎస్సై దశరధరామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* గెలుపుపై ఎవరి ధీమా వారిదే !
english title: 
p

ఓటర్లలో అదే నిర్లక్ష్యం

$
0
0

ఏలూరు, మే 8: నూతన రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే తొలి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఎన్నికలు. అంతేకాకుండా మంచి పాలకులను ఎన్నుకోవాలని అటు ఎన్నికల సంఘం, ఇటు జిల్లా యంత్రాంగం చెవినిల్లు కట్టుకుని ప్రచారం చేసింది. అయినా నగర, పట్టణ ఓటర్లలో మాత్రం మార్పు రాలేదు. ఎప్పటిలానే ఓటును తేలికగా తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒకింత ఓటింగ్ శాతం పెరిగితే నగర, పట్టణ ప్రాంతాల్లో తక్కువ శాతం నమోదైంది. జిల్లా సగటు 82.74 శాతమైతే అత్యధిక నగర, పట్టణ ప్రాంతం ఉన్న ఏలూరు, భీమవరంలలో అంతకన్నా తక్కువ పోలింగ్ నమోదైంది. ఏలూరులో 70.45శాతం, భీమవరంలో 77.76శాతం పోలింగ్ నమోదు అయింది. ఓటు హక్కు ప్రాధాన్యం, ఓటుహక్కు వినియోగించుకోవాల్సిన అవసరంపై లెక్కకు మిక్కిలి ప్రచార కార్యక్రమాలతో ఊదరగొట్టినా ఓటర్ల తీరులో మార్పు తీసుకురాలేకపోయారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 84.01 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి ఎన్నికల్లో 82.74 శాతం పోలింగ్ నమోదైంది. ఇక పోలింగ్ వివరాలను ఫైనల్ చేసే విషయంలో అధికారులు సర్కస్ ఫీట్లు చేశారనే చెప్పుకోవాలి. బుధవారం పోలింగ్ ముగిసిన తర్వాత ప్రకటించిన పోలింగ్ శాతం వివరాలకు, గురువారం ప్రకటించిన తుది పోలింగ్ శాతాలలో వ్యత్యాసాలు కన్పించాయి. ఎన్నికల సరళిని తెలియజేస్తూ బుధవారం అధికారులు ప్రతి రెండుగంటల కొకసారి వెల్లడించిన పోలింగ్ వివరాలు వాస్తవమైనవి కాదని తేలిపోయింది. లెక్కలు వేయకుండానే ఊహాజనితంగా తమకు తోచిన అంకెలతో ఎన్నికల కమిషన్‌కు సమాచారం ఇచ్చారని స్పష్టమవుతుంది. జిల్లా కేంద్రమైన ఏలూరుతోపాటు దెందులూరు, భీమవరం అసెంబ్లీ సిగ్మెంట్లలలో పోలింగ్ శాతాన్ని గురువారం మధ్యాహ్ననికి అందించటం చూస్తే అధికారుల పనితీరుకు అద్దంపడుతుంది. అధికార యంత్రాంగం తరపున ఓటరు జాబితా పక్కగా రూపొందించలేకపోవటం, ఓటరు స్లిప్‌ల పంపిణిని పూర్తిస్ధాయిలో నిర్వహించలేకపోవటం, పోలింగ్ కేంద్రాల సమాచారం అందించకపోవటం వంటి కారణాల వల్ల జిల్లాలో పోలింగ్ శాతం ఆశించిన స్ధాయిలో పెరగలేదని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఓటరు జాబితాలో పేరు ఉందో, లేదో తెలుసుకోలేకపోవటం, పోలింగ్ కేంద్రాల సమాచారం తెలుసుకోవటం, అక్కడే ఓటరు స్లిప్‌లు పంపిణి జరుగుతుందని తెల్సినా ఆ కొద్ది సమయాన్ని కూడా కేటాయించేందుకు కొంతమంది ఓటర్లు ఆసక్తి కనపర్చకపోవటంతో ఓటింగ్ శాతం పెరగలేదని చెప్పవచ్చు. మొత్తంమీద జిల్లాలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం ఆశించిన స్ధాయిలో పెరగలేదని చెప్పవచ్చు.
జిల్లాలో బుధవారం జరిగిన లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించి అధికారికంగా వెల్లడించిన అంతిమ సమాచారం ప్రకారం వివిధ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తొలుత పేర్కొన్నదానికంటే గణనీయంగా పెరిగింది. గురువారం సాయంత్రం ప్రకటించిన దాన్నిబట్టి పోలింగ్ 82.74శాతానికి చేరింది. జిల్లాలో మొత్తం 2921520 మంది ఓటర్లు ఉండగా వారిలో 2417337 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ను పరిశీలిస్తే కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 84.76శాతం, నిడదవోలులో 85.06శాతం, ఆచంటలో 81.44శాతం, పాలకొల్లులో 82.61శాతం, నర్సాపురంలో 83.36శాతం, భీమవరంలో 77.76శాతం, ఉండిలో 86.12శాతం, తణుకులో 81.28శాతం, తాడేపల్లిగూడెంలో 81.02శాతం, ఉంగుటూరులో 86.16శాతం, దెందులూరులో 86.21శాతం, ఏలూరులో 70.45శాతం, గోపాలపురంలో 86.60శాతం, పోలవరంలో 85.55శాతం, చింతలపూడిలో 83.99శాతం పోలింగ్ నమోదైనట్లు తేల్చారు.

ఏలూరు పార్లమెంటులో 83.62శాతం పోలింగ్
ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 83.62శాతం పోలింగ్ నమోదైంది. ఇది జిల్లా పోలింగ్ శాతం కన్నా ఎక్కువ కావటం విశేషం. ఈ పార్లమెంటు స్ధానం పరిధిలో జిల్లాలోని ఏలూరు, ఉంగుటూరు, దెందులూరు, పోలవరం, చింతలపూడితోపాటు కృష్ణాజిల్లాలోని కైకలూరు, నూజివీడు అసెంబ్లీ సిగ్మెంట్లు ఉండటం వల్ల పోలింగ్ శాతం పెరిగింది. కైకలూరులో 86.13శాతం, నూజివీడులో 87.33శాతం పోలింగ్ నమోదైంది. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మొత్తం 1427300 మంది ఓటర్లు ఉంటే వారిలో 1193449 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

కొంపముంచిన కరెన్సీ
ఏలూరు, మే 8: ధన బలంతోనే విజయం సాధిస్తున్నామన్న కొందరి అభ్యర్ధుల ధీమాను అదే ధనం కొల్లగొట్టడంతో మధనపడుతున్నారు. నియోజకవర్గంలో పరిస్ధితి ఎలా ఉన్నా కరెన్సీ పంపిణితో గెలుపొందటం ఖాయమని బరిలో నిల్చిన చాలామంది అభ్యర్ధులు గట్టి నమ్మకంతో ముందుకు వెళ్లారు. పోలింగ్ అయిన తర్వాత పరిస్దితిని విశే్లషించుకున్న అభ్యర్ధులు ధనమే తమను దెబ్బతీసిందని లబోదిబోమంటున్నారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో సుమారు వంద కోట్ల రూపాయల పైబడి డబ్బు పంపిణి జరిగిన విషయం తెల్సిందే. పోలింగ్ రోజు ముందు రాత్రి, పోలింగ్ రోజున కోట్ల రూపాయల వినియోగం జరగటం చర్చనీయాంశమైన విషయం విదితమే. అయితే కొన్నిచోట్ల అభ్యర్ధులు కరెన్సీ పంపిణిని సరిగా చేపట్టకపోవటంతో వారి విజయావకాశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. కొన్ని ప్రాంతాలలో కొందరికి డబ్బును పంపిణి చేసి కొందరికి ఇవ్వకపోవటంతో పరిస్ధితి ఎదురు తిరిగింది. దీంతో సంబంధిత ప్రాంతాల ఓటర్లు ఆగ్రహంతో ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధికి అనుకూలంగా పనిచేయటం విశేషం. ఏలూరు అసెంబ్లీ సిగ్మెంట్‌ను ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ ఒక పార్టీ అభ్యర్ధి డ్వాక్రా సంఘాలకు నాలుగురోజులు ముందుగానే మూడువేల రూపాయల చొప్పున పంపిణి చేశారు. అయితే ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధి మాత్రం మంగళవారం ఉదయం వరకు పంపిణి చేయలేదు. అయితే ఆ రోజు రాత్రి సమయంలో ఒక్కసారిగా రంగంలోకి దిగిన ఆ అభ్యర్ధి అనుచరులు డ్వాక్రా సంఘానికి నాలుగువేల రూపాయల చొప్పున సంఘం అధ్యక్ష, కార్యదర్శులకు అందజేశారు. అయితే ఈ సొమ్ము పూర్తిస్ధాయిలో పంపిణి జరగలేదని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఒక పార్టీ అభ్యర్ధి వెయ్యి రూపాయల వరకు ఇస్తారని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు తీరా వచ్చేసరికి మూడువందల రూపాయలను మాత్రమే ఓటర్లకు అందజేశారు. దీంతో ఆయనపై నియోజకవర్గంలో పూర్తిస్దాయిలో వ్యతిరేకత వ్యక్తం అయిందనిఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే పరిస్ధితి పలు నియోజకవర్గాల్లో ఎదురైంది. కొంతమంది నాయకులు సిన్సియర్‌గా ఓటర్లకు డబ్బు పంపిణి చేయగా కొందరు మాత్రం పూర్తిస్ధాయిలో కరెన్సీని పంపిణి చేయలేదు. కొన్ని ప్రాంతాలలో అయితే ఓటుకు వంద రూపాయలు ఇచ్చి మిగిలిన వంద జేబులో వేసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని గ్రామాలలో అయితే కొందరు కిందిస్ధాయి నాయకులు ఓటర్లకు డబ్బులు పంపిణి చేయలేదని తెల్సింది. వీటన్నింటి వల్ల సంబంధిత అభ్యర్ధి పోలింగ్ నాడు కొంత వ్యతిరేకతను ఎదుర్కొన్నారని చెపుతున్నారు. మరికొన్నిచోట్ల కూడా కొంతమంది అభ్యర్ధులు కూడా డబ్బు పంపిణిలో సరైన రీతిలో వ్యవహరించకపోవటం వల్ల కొంత వ్యతిరేకతను కొని తెచ్చుకున్నారు. ఇక కొన్ని నియోజకవర్గాల పరిధిలో ఓటర్లకు దొంగనోట్లు పంపిణి చేశారని కూడా ప్రచారం సాగింది. దీంతో అయాచోట్ల అభ్యర్ధులకు పూర్తిస్దాయి వ్యతిరేకత ఎదురైనట్లు తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులు ఆర్ధికంగా వెనుకబడి ఉంటే అటువంటి వారికి పార్టీపరంగా భారీగా నిధులందాయి. అయితే అ నిధులను ఖర్చు పెట్టకుండా కొంతమంది అభ్యర్ధులు దేవుడిపై భారం వేసి మిన్నకుండిపోయారని సమాచారం. ఈవిధంగా డబ్బు వెదజల్లినా గెలుపుపై ధీమా వ్యక్తం కాక కొంతమంది అభ్యర్ధులు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
జంగారెడ్డిగూడెం, మే 8: మండలంలోని ఏలూరు రోడ్డులో ఎర్రకాల్వ వంతెన సమీపంలో పుట్లగట్లగూడెం పంచాయతీ పరిధిలో గురువారం సాయంత్రం రెండు మోటార్ సైకిళ్ళు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంకు చెందిన చల్లారి హనుమంతు(20), ద్వారకాతిరుమల మండలం వెంకటకృష్ణాపురంకు చెందిన బొడ్డు కృష్ణ(50) మృతి చెందారు. కృష్ణ భార్య సరోజిని, ఆమె మేనకోడలు కోడిగూడెంకు చెందిన పంతగాని జ్యోతి, దేవులపల్లికి చెందిన కోరుకొండ కృష్ణలకు గాయాలయ్యాయి. వీరు స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంకటకృష్ణాపురంకు చెందిన బొడ్డు కృష్ణ హీరో స్పెండర్ ఫ్లస్ మోటార్ సైకిల్‌పై భార్య, మేనకోడలిని ఎక్కించుకుని షాపింగ్ చేసేందుకు జంగారెడ్డిగూడెం వచ్చి తిరుగు ప్రయాణమయ్యాడు. శ్రీ మద్ది ఆంజనేయస్వామి గుడి వద్దగల ఎర్రకాల్వ వంతెన దాటేసరికి ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ ఢీకొంది. చల్లారి హనుమంతు లక్కవరం నుండి దేవులపల్లి వచ్చి తన సమీప బంధువు కోరుకొండ కృష్ణను హీరో ప్యాషన్ ప్రో మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని పట్టెన్నపాలెం పచ్చడి మామిడి కాయలు తెచ్చేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవింఆచింది. హనుమంతు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, బొడ్డు కృష్ణను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స ప్రారంభించే సమయానికి ప్రాణాలు విడిచాడు. ఇద్దరి తలలకు బలమైన గాయాలు కావడంతో మృతి చెందారని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.్భస్కరరావు తెలిపారు. కూలిపని చేసుకునే హనుమంతుకు ఇటీవలే వివాహం నిశ్ఛయమైందని అతని సోదరుడు చల్లారి రాము చెప్పారు. సంఘటనా స్థలంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా దెబ్బతిన్న మోటార్ సైకిళ్ళను పోలీసులు లక్కవరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. హనుమంతు మృత దేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. లక్కవరం ఎస్సై పి.అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇరుపార్టీల్లోనూ గెలుపు ధీమా
భీమవరం, మే 8: హోరాహోరీ సార్వత్రిక పోరులో తమదే గెలుపు అంటే.. తమదేనని అభ్యర్థులు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి, పెరిగిన ఓటింగ్ శాతాన్ని బట్టి తమ గెలుపు అవకాశాలను అంచనా వేసుకుంటున్నారు. కుల, వర్గ సమీకరణాలతో ఓట్ల కూడికలు, తీసివేతలతో లెక్కలు వేసుకుంటున్నారు. అయితే అభ్యర్థుల భవితవ్యం ఇవిఎంలలోనే దాగి ఉంది. నరసాపురం పార్లమెంట్ బిజెపి అభ్యర్థి డాక్టర్ గోకరాజు గంగరాజు (గంగ తాతరాజు) పోటీ చేశారు. వైసిపి నుండి వంకా రవీంద్రనాథ్, కాంగ్రెస్ నుండి సిట్టింగ్ ఎంపి కనుమూరి బాపిరాజు పోటీ చేశారు. ప్రధానంగా బిజెపి, వైసిపిల మధ్యే పోరు సాగింది. వీరిలో బిజెపి అభ్యర్థి గంగరాజు, వైసిపి అభ్యర్థి వంకా రవీంద్రనాధ్ ఇద్దరూ కూడా పారిశ్రామికవేత్తలే. ఒకరు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా మరొకరు కాపు సామాజికవర్గానికి చెందిన వారు. ఇరువురికీ కూడా నరసాపురం పార్లమెంట్‌లో సత్సంబంధాలు ఎక్కువగానే ఉన్నాయి. పైగా వీరిద్దరూ కూడా రాజకీయ వారసత్వ నేపథ్యం ఉంది. ఇద్దరు అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఎండను సైతం లెక్కచేయకుండా తెల్లవారగానే తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి అన్ని గ్రామాల్లో పర్యటించారు. ఒక విధంగా చెప్పాలంటే ఎంపి అభ్యర్థులు డాక్టర్ గోకరాజు గంగరాజు, వంకా రవీంద్రనాథ్, కనుమూరి బాపిరాజులు సుడిగాలి పర్యటనలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటువేసే పరిస్థితి ఎక్కడా కానరాలేదు. అక్కడక్కడా మాత్రమే కాంగ్రెస్ అభిమానులు ఉన్నారు. ఇక గ్రామాలలో ప్రజలు మోదీ జపం చేస్తుండడంతో బిజెపికి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక జగన్ ఫేస్‌నే నమ్ముకున్న వైసిపి విజయం తమదేనని భావిస్తోంది.
బావ-మరిది పోరు
కాగా నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఈసారి పోటీచేసిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఇద్దరు స్వయానా బావ, బావమరిది కావడం విశేషం. బిజెపి తరపున బరిలోకి దిగిన గోకరాజు గంగరాజు, కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన సిట్టింగ్ ఎంపి కనుమూరి బాపిరాజుకు స్వయానా బావమరిది. బాపిరాజు సతీమణి అన్నపూర్ణ గంగరాజుకు సోదరి. ఇప్పటివరకు బాపిరాజు పలు ఎన్నికల్లో పోటీచేశారు. ప్రతి ఎన్నికల్లోనూ ఆయన పోటీచేసిన స్థానంలో బలమైన అభ్యర్థిగా ఉండేవారు. చాలాసార్లు విజయం కూడా సాధించారు. అయితే ఈ సారి మాత్రం రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన పోటీలో ఉండటంతో ప్రధాన పోరులో ఉండకపోవచ్చని రాజకీయ పరిశీలకుల అంచనా.
మరో బంధుత్వ బంధం
కాగా ఈసారి నరసాపురం లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సిగ్మెంట్లకు మరో ఇద్దరు బంధువులు పోటీచేశారు. వీరిద్దరూ వరుసకు బావమరుదులు కావడం విశేషం. అయితే వేర్వేరు నియోజకవర్గాల నుండి వేర్వేరు పార్టీల తరపున వీరు పోటీచేశారు. వారే భీమవరం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్, నరసాపురం కాంగ్రెస్ అభ్యర్థి కల్వకొలను తులసీరావు. వీరిరువురు వియ్యంకులు. శ్రీనివాస్ కుమారునికి తులసీరావు కుమార్తెతో కొద్ది కాలం క్రితం వివాహం జరిగింది.

నల్లధనం వరద
ఏలూరు, మే 8: ఎన్నికలు ఇప్పుడు ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి. గతంలో లక్షల్లో మాట్లాడే అభ్యర్ధులు ఇప్పుడు కోట్ల రూపాయల్లోనే వ్యవహారాలు నడిపించేశారు. అ స్దాయిలో ఉంటే తప్ప కనీసం పోటీలో ఉన్న భావన కూడా కలిగే పరిస్ధితి లేకుండా పోయింది. జిల్లాలోనే గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా మారిపోయాయి. ఎన్నికల సందర్భంగా ప్రచారం ఖర్చులే కోటి రూపాయలకు పైగా చేరిపోగా ఇక పంపిణిల విషయానికొస్తే డబ్బుకు విలువ లేనట్లుగానే కన్పిస్తోంది. 200,300 స్ధాయి దాటిపోయి 500, 1000 రూపాయల నోట్లు మాత్రమే ఈసారి చాలాచోట్ల చలామణి అయ్యాయి. వీటికి తోడు ఖరీదైన చీరలు, గ్లాసులు, గినె్నలు వంటివి కూడా భారీగానే జనానికి చేరాయి. మొత్తంమీద ఈసారి నల్లధనానికి ఎన్నికల గండి పడింది. వరదలా నల్లధనం పారి ప్రలోభాల రూపంలో ఓటర్లకు చేరిపోయింది. ఒక అంచనా ప్రకారం జిల్లాలో ఈసారి ఒక్కొ నియోజకవర్గంలోనూ 10 నుంచి 15 కోట్ల రూపాయలు, కొన్నిచోట్ల 20 కోట్ల రూపాయల వరకు కూడా అభ్యర్ధులు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈరకంగా గత 20రోజుల నుంచి జనానికి, ఓటర్లకు ఊపిరిసలపని రీతిలో ప్రచారం సాగగా అభ్యర్ధులు కూడా ఇంత భారీ వ్యయానికి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కొంతమంది పోలింగ్‌కు ముందురోజుల్లో చేతులెత్తేయగా మరికొంతమంది చివరినిముషంలో భారీ రుణాలకు పరుగులు తీశారు. చాలాచోట్ల ఒక పార్టీ అభ్యర్ధులు చివరినిముషంలో చేతులెత్తేయటం సమస్యగా మారింది. టిక్కెట్ తెచ్చుకునేందుకే కోట్లు ఖర్చు పెట్టామని ఇక తమకు ఓపిక లేదంటూ వారు నిస్సహాయత వ్యక్తం చేయటం కొన్ని ఇబ్బందులను సృష్టించింది. అలాగే కొంతమంది అభ్యర్ధులకు క్రాస్ ఓటింగ్ హామీలు సులభంగా అప్పులు లభించే మార్గంగా మారాయి. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఒక ఎంపి అభ్యర్ధి తన పరిధిలోని కొన్ని అసెంబ్లీ సిగ్మెంట్లలలో ప్రత్యర్ధి పార్టీ అసెంబ్లీ అభ్యర్ధులకు చివరినిముషంలో భారీ రుణం అందించి, ఓట్లు మాత్రం తనకు పడేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇదే పరిస్దితి మరికొంతమంది ఎంపి అభ్యర్ధులు కూడా చేశారని ప్రచారం జరుగుతోంది. మొత్తంమీద ఈసారి 3్ధనమూలం మిదం ఎన్నికలు2 అన్న రీతిలో పరిస్దితులు పూర్తిగా మారిపోయాయి.
అభ్యర్ధి ఎవరన్నది ప్రధానం కాకపోగా ఏ అభ్యర్ధి ఎంత ఖర్చు పెట్టగలడన్న విషయానే్న పరిగణనలోకి తీసుకున్నారు. ఓటర్లు కూడా డబ్బు బాగా ఖర్చు పెట్టగల అభ్యర్ధులనే బలమైన అభ్యర్ధులుగా నిర్ణయించారు. నిజంగా ప్రజాసేవలో ఉన్న అభ్యర్ధులను కనీసం ప్రోత్సహించే వారే కరువయ్యారు. కొన్నిచోట్ల డబ్బులివ్వని అభ్యర్ధులు కూడా ఉన్నారు. కొన్నిచోట్ల విజయావకాశాలు మెండుగా ఉన్న అభ్యర్ధులు పోలింగ్ ముందురోజు రాత్రి నాటి పరిస్ధితికి తలకిందులైపోయారు. ప్రజాదరణ, సానుభూతిని మెండుగా సంపాదించుకుని బలమైన అభ్యర్ధిగా తయారైన వారు నోట్లు పంచలేక ఘోరంగా దెబ్బతిన్నారు. కొంతమంది అభ్యర్ధులు ప్రచార సమయంలో విచ్చలవిడిగా డబ్బు వెదజల్లినప్పటికీ తీరా పోలింగ్ దగ్గరపడే కొద్దీ చేతిలో డబ్బు అయిపోవటంతో తాము ముందు అనుకున్న విధంగా డబ్బు పంచలేక నిరాశకు గురయ్యారు. ఎన్నికల కమిషన్ విధించిన ఖర్చుల నిబంధనకు, అభ్యర్ధులు చేసిన ఖర్చుకు పొంతన లేకుండా ఉంది. లోక్‌సభకు 70లక్షలు, శాసనసభకు 28లక్షల రూపాయల ఖర్చును మించకూడదని ఆంక్షలు ఉన్నాయి. కొంతమంది పార్లమెంటు అభ్యర్ధుల ఖర్చు 40నుంచి 50 కోట్ల రూపాయలకు కూడా చేరిపోయింది. ఏరకంగా చూసినా పెద్దల బొక్కసాలు ఖాళీ కాగా జనానికి మాత్రం ఎన్నికల పండుగ మిగిలింది.

దేవరపల్లి ఎంపిటిసి-3 కౌంటింగ్‌పై స్టే తొలగింపు
దేవరపల్లి, మే 8: దేవరపల్లి ఎంపిటిసి-3 స్థానానికి కౌంటింగ్‌పై విధించిన స్టేను గురువారం హైకోర్టు తొలగించింది. గతంలో ఈ స్థానానికి జరగబోయే కౌంటింగ్‌ను నిలుపుదల చేయాలని దేవరపల్లికి చెందిన కైరం వీర వెంకట సత్య ధనలక్ష్మి కోర్టులో సవాల్ చేయగా, హైకోర్టు కౌంటింగ్‌ను నిలుపుదల చేయాలని స్టే ఇచ్చింది. దీనితో దేవరపల్లి మండల టిడిపి నేత, ఎంపిటిసి అభ్యర్థి శ్రీకాకోళ్లపు వెంకట నరసింహారావు యధావిధిగా కౌంటింగ్ కొనసాగించేందుకు ఉత్తర్వులు జారీచేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు జడ్జిలు ఆర్ సుభాష్‌రెడ్డి, ఎం సత్యనారాయణమూర్తిలు స్టేను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వు కాపీలను గురువారం ఎంపిటిసి -3 టిడిపి అభ్యర్థి శ్రీకాకోళ్లపు వెంకట నరసింహారావు స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో టిడిపి మండల శాఖ అధ్యక్షుడు సుంకర దుర్గారావు విలేఖరులకు అందజేశారు. ఈ సందర్భంగా వెంకట నరసింహారావు మాట్లాడుతూ తాను స్థానిక సంస్థల ఎన్నికలలో దేవరపల్లి ఎంపిటిసి - 3 స్థానానికి టిడిపి అభ్యర్థిగా పోటీచేసినట్లు తెలిపారు. తన రాజకీయ ఎదుగుదలను చూడలేని కొంత మంది ప్రత్యర్థులు దుష్ప్రచారం చేశారని అన్నారు. కాగా స్టే ఉత్తర్వులతో గత 20 రోజుల నుండి ఏర్పడిన ఉత్కంఠకు (ఎంపిటిసి-3 స్థానానికి కౌంటింగ్‌కు) హైకోర్టు తెరదించింది. దీంతో ఈ నెల 13న జరగబోయే కౌంటింగ్‌లో 22 ఎంపిటిసి స్థానాలకు యధావిధిగా కౌంటింగ్ నిర్వహించనున్నారు. విలేఖరుల సమావేశంలో గోపాలపురం నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, టిడిపి నేతలు ముళ్లపూడి రఘురామ్, గన్నిమని హరికృష్ణ, జ్యేష్ఠ వెంకటేశ్వరరావు, యాగంటి వెంకటేశ్వరరావు, నారాయణ విశే్వశ్వరరావు, ఎన్ వెంకట్రామరాజు, శ్రీకాకోళ్లపు కాళీకృష్ణ, కొయ్యలమూడి చినబాబు తదితరులు పాల్గొన్నారు.

ఎనిమిది వర్మీ కంపోస్టు యూనిట్లు దగ్ధం
జంగారెడ్డిగూడెం, మే 8: జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ మూలంగా గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉండవల్లి శ్రీనివాసరావు అనే రైతుకు చెందిన ఎనిమిది వర్మీ కంపోస్టు యూనిట్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 60 లక్షల రూపాయల ఆస్థి నష్టం సంభవించింది. రైతు ఉండవల్లి తమ్మారావు, కుమారుడు శ్రీనివాసరావు తమకు గల 5.70 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరి, దానితో కోకో అంతర పంట వేసారు. ఇదే క్షేత్రంలో ఎకరం స్థలంలో ఎనిమిది వర్మీ కంపోస్టు(వానపాముల ఎరువు) యూనిట్లు స్థాపించారు. ఎనిమిది యూనిట్లకు ఎనిమిది పాకలు వేసారు. ఒక్కో పాకలో మూడు తొట్టెలలో వర్మీకంపోస్టు తయారు చేస్తున్నారు. కొబ్బరి తోటలో కోకో చెట్లకు ఆనుకుని వేలాడుతున్న విద్యుత్ తీగలు గాలికి కలసి పోయి నిప్పురవ్వలు రాలిపడటంతో మంటలు ఎగసిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గాలి వీస్తుండటంతో ఒకేసారి ఎనిమిది పాకలకు మంటలు వ్యాపించాయని, నిమిషాల వ్యవధిలో కాలిపోయాయని చెప్పారు. వీటితో పాటు పైకప్పు వేసేందుకు సిద్ధం చేసిన నాలుగు తాటాకు మండెలు, పశువుల పోషణ కోసం ఏర్పాటు చేసిన 20 ఎకరాల రెండు వరిగడ్డి వాములు అగ్నికి ఆహుతయ్యాయి. వీటితో పాటు 40 కొబ్బరి చెట్లు, 40 కోకో చెట్లు, రెండు మామిడి చెట్లు దగ్ధమైపోయాయి. ఎనిమిది పాకలు దగ్ధం కావడంతో 16 లక్షలు, వర్మీ కంపోస్టు(వానపాముల ఎరువు) దగ్ధం కావడంతో 40 లక్షల రూపాయల నష్టం సంభవించినట్టు రైతు శ్రీనివాసరావు చెప్పారు. కాగా, కొబ్బరి, కోకో, మామిడి చెట్ల విలువ, కాలిన కోకో గింజల విలువ మరో నాలుగు లక్షల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. పొలంలో నుండి వెళుతున్న విద్యుత్ లైను తీగలు క్రిందకు వేలాడుతున్నాయని, వీటిని బిగించాలని విద్యుత్ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని రైతు ఉండవల్లి తమ్మారావు ఆరోపించారు. ప్రతి ఏటా భూసారాన్ని పెంపొందించేందుకు ఈ ప్రాంతంలో వానపాముల ఎరువు విరివిగా రైతులు వినియోగిస్తుంటారు. పలువురు రైతులు పశువుల పేడ, ఇతర పదార్థాలతో వానపాముల ఎరువు తయారు చేస్తుంటారు.
స్థానిక అగ్నిమాపక దళం సాయంత్రం వరకు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ ఆఫీసర్ జి.ఆనందరావు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసారు. నష్టపోయిన రైతు తమ్మారావు, శ్రీనివాసరావులను తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మండవ లక్ష్మణరావు, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు షేక్ ముస్త్ఫా, మద్దిపాటి నాగేశ్వరరావు తదితరులు పరామర్శించారు.

నూతన రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే తొలి ప్రభుత్వం
english title: 
v

మహిళా ఓటర్లు ఎవరిని ఆదరించారో?

$
0
0

జిల్లాలో 82.81 శాతం పోలింగ్
అద్దంకిలో అత్యధికంగా 89.60 శాతం
ఏరులై పారిన మద్యం, నగదు
ఒంగోలు, మే 8: జిల్లాలో బుధవారం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యధికంగానే పోలింగ్ నమోదైంది. జిల్లాలో సరాసరిన 82.81 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా అద్దంకి నియోజకవర్గంలో 89.60 శాతం పోలింగ్ కాగా అత్యల్పంగా కనిగిరి నియోజకవర్గంలో 75.90 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో 88.31 శాతం, పర్చూరు నియోజకవర్గంలో 87.89 శాతం, కొండెపి నియోజకవర్గంలో 84.20 శాతం, యర్రగొండపాలెం నియోజకవర్గంలో 83.30 శాతం, సంతనూతలపాడు నియోజకవర్గంలో 83 శాతం, గిద్దలూరు నియోజకవర్గంలో 82.16 శాతం, దర్శి నియోజకవర్గంలో 81.20 శాతం, మార్కాపురం నియోజకవర్గంలో 80.87 శాతం, చీరాల నియోజకవర్గంలో 80.7 శాతం, ఒంగోలు నియోజకవర్గంలో 76.53 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో 2009 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో 76.89 శాతం పోలింగ్ నమోదుకాగా ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా 24 లక్షల 84 వేల 109 మంది ఓటర్లు ఉండగా 20 లక్షల 75వేల 315 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వారిలో అత్యధికంగా మహిళా ఓటర్లే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 లక్షల 32 వేల 841 మంది పురుషులు, మహిళలు 10 లక్షల 42వేల 464 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో మహిళా ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపి ఉంటారో వారినే విజయలక్ష్మి వరించనుంది. ఇదిలావుండగా తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా గ్రూపు రుణాలను రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల వాగ్దానాలు చేశారు. మహిళలను అన్ని రంగాల్లో ఆదుకుంటామని ఆ రెండు పార్టీల అధినేతలు హామీల వర్షం కురిపించారు. దీంతో మహిళలు ఆ రెండు పార్టీల్లో ఎవరిని ఆదరించారో వేచిచూడాల్సి ఉంది. కాగా జిల్లావ్యాప్తంగా మద్యం, నగదు ఏరులై పారింది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వలస ఓటర్లు సైతం భారీగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటుకు వెయ్యి నుండి మూడువేల రూపాయల వరకు పోటీలో అభ్యర్థులు వెచ్చించి కొనుగోలు చేశారు. దీంతో కూడా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరిగిందని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. ఇదిలాఉండగా చిన్న,చిన్న షాపుల నుండి పెద్దపెద్ద పరిశ్రమల వరకు పోలింగ్ సందర్భంగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయా షాపుల యజమానులు సెలవు దినంగా ప్రకటించటంతో కార్మికులందరూ ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో కూడా ఓటింగ్ శాతం పెరిగినట్లైంది. కాగా ఎవరికి వారే గెలుపు ధీమాలో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు.

గెలుపుపై అభ్యర్థుల మల్లగుల్లాలు
చీరాల, మే 8: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసిన నేపధ్యంలో అభ్యర్థులు తమ గెలుపునకు సంబంధించి వార్డుల వారీగా అంచనాల పనిలో నిమగ్నమయ్యారు. చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ప్రధానంగా ముగ్గురి మధ్యే పోటీ వుండటంతో ఆ ముగ్గురు అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు తమతమ ప్రాంతాల్లో ఎవరికి అనుకూలంగా ఓట్లు పడ్డాయో లెక్కలు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇక బిఎస్పీ, జై సమైక్యాంధ్ర, కాంగ్రెస్, లోక్‌సత్తా, ఇతర స్వతంత్ర అభ్యర్థులు ఏమాత్రం ఓట్లు చీల్చారనే విషయంపై చర్చలు సాగుతున్నాయి. ప్రధానంగా వైఎస్‌ఆర్‌సిపి, తెలుగుదేశం, చీరాల పరిరక్షణ సమితి తరపున బరిలో ఉన్న అభ్యర్థులు తమ గెలుపునకు ఏఏ ప్రాంతాల్లో తమకు మెజారిటీ లభిస్తుందనే విషయంపై ఆరా తీస్తున్నారు. అంతేగాకుండా తాము పంపిణీ చేసిన నగదు ఓటర్లను ఎంతమాత్రం ప్రభావితం చేసిందనే విషయంపై సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. ఓటు ఎవరికి వేశారనే విషయంపై ఓటరు గుంభనంగా ఉండటంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఎవరికి వారు తాము కొద్ది మెజారిటీతోనైనా బైటపడతామని గంభీరంగా చెప్పుకుంటున్నారు. సర్వేలు చేయించి గెలుపు తమదేనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అభ్యర్థులు తమ కార్యకర్తలచే ప్రచారం కొనసాగిస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించినా ఎంతవరకు తాము విజయం సాధిస్తామనే ఆందోళన అభ్యర్థులలో నెలకొని ఉంది. ఏదిఏమైనా ఈనెల 16వ తేదీన అభ్యర్థుల భవితవ్యం బైటపడనుంది.

ఇవిఎంలు ఒంగోలుకు తరలింపు
చీరాల, మే 8: చీరాల అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నేపధ్యంలో ఓట్ల లెక్కింపు నిమిత్తం ఇవిఎంలను ఒంగోలు రైజ్ ఇంజనీరింగ్ కళాశాలకు గురువారం ప్రత్యేక వాహనంలో తరలించారు. చీరాల నియోజకవర్గ పరిధిలో బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈనెల 16వ తేదీన లెక్కింపుజరుగనున్న దృష్ట్యా ఈవిఎంలను ఒంగోలుకు తరలించారు. స్థానిక విఆర్‌ఎస్ అండ్ వైఆర్‌ఎన్ కళాశాలలో భద్రపరచిన ఈవిఎంలను లెక్కింపు నిమిత్తం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పద్మజ ఈవిఎంలను అధికారుల ముందు సీలు వేయించి కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రవికుమార్, పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

ఇవిఎంల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం
ఒంగోలు, మే 8: సార్వత్రిక ఎన్నికల బరిలో తలపడ్డ అభ్యర్థుల భవితవ్యం ఇవిఎంల్లో నిక్షిప్తమైంది. జిల్లావ్యాప్తంగా 2,881 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్నికలు జరగ్గా ఆ కేంద్రాల్లోని ఇవిఎంలన్నింటినీ స్ట్రాంగ్‌రూంలకు ఎన్నికల అధికారులు తరలించారు. ఈనెల 16వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగే వరకు ఇవిఎంలకు అదనపు భద్రతను ఎన్నికల అధికారులు కల్పించనున్నారు. జిల్లాలోని సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు వెంగముక్కలపాలెంలోని క్విస్ కాలేజీ మొదటి అంతస్తు, చీరాలలో నియోజకవర్గ ఓట్ల లెక్కింపు వల్లూరులోని రైజ్ గాంధీ ఇంజనీరింగ్ మొదటి అంతస్తు, మార్కాపురం నియోజకవర్గ ఓట్ల లెక్కింపు రైజ్ ప్రకాశం మూడవ అంతస్తు, కందుకూరు, కనిగిరి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు వల్లూరులోని ఫేస్ ఇంజనీరింగ్ కాలేజీ, గిద్దలూరు రైజ్ గాంధీ, కొండపి, ఒంగోలు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు రైజ్ ప్రకాశం, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు క్విస్ ఇంజనీరింగ్ కాలేజి, యర్రగొండపాలెం నియోజకవర్గ ఓట్ల లెక్కింపు పేస్ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతుంది. ఆయా సెంటర్లల్లో అదనపు భద్రతను జిల్లా పోలీస్ యంత్రాంగం కల్పించింది.

జిల్లాలో జోరుగా పొగాకు కొనుగోళ్లు
కేజీ గరిష్ఠ ధర 133 రూపాయలు
ఒంగోలు, మే 8 : జిల్లాలోని పొగాకు బోర్డు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు వేగవంతంగా జరుగుతున్నాయి. నాణ్యత కలిగిన ఒక కేజీ పొగాకుకు గరిష్ఠ ధర 133 రూపాయల వరకు వచ్చింది. వివిధ కంపెనీలకు చెందిన పొగాకు వ్యాపారులు అధిక సంఖ్యలో వేలంలో పాల్గొని పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నారు. అయితే పొగాకు ధరలు మాత్రం రైతులు ఆశించిన స్థాయిలో రావడం లేదు. జిల్లాలో మొత్తం 13 వేలం కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయా వేలం కేంద్రాల్లో ఈ వేలం కేంద్రం ద్వారా కొనుగోళ్ళు జరుగుతుండటంతో పొగాకు కొనుగోళ్ళు వేగవంతంగా జరుగుతున్నాయి. జిల్లాలో ఒంగోలు -1, ఒంగోలు-2, టంగుటూరు -1, టంగుటూరు-2, కొండేపి, కందుకూరు-1, 2, కలిగిరి, డిసి పల్లి, వెల్లంపల్లి-1, 2, పొదిలి -1, 2 వేలం కేంద్రాల్లో కొనుగోళ్ళు జరుగుతున్నాయి. ఆయా వేలం కేంద్రాల్లో సుమారు 45 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేసినట్లు బోర్డు అధికారుల అంచనా. పొగాకు వ్యాపారులు వేలం కేంద్రాల్లో కొనుగోలులో సిండికేట్‌గా మారి ధరలు పెంచని పరిస్థితి నెలకొంది. అయితే పొగాకు ఎగుమతి ఆర్డర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ పొగాకు వ్యాపారులు మాత్రం పొగాకు ఆర్డర్లు తక్కువగా ఉన్నాయంటూ ధరలను తగ్గించి కొనుగోలు చేస్తున్నారనే విమర్శలు రైతుల నుండి వినిపిస్తున్నాయి. ఈ ఏడాది పొగాకు రైతులకు పొగాకు పంట ఉత్పత్తి ఖర్చులు గత ఏడాది కంటే అధికంగా పెరిగాయి. ఒక్కొక్క కేజి పొగాకు ఉత్పత్తికి 80 నుండి వంద రూపాయలకు పైగా ఖర్చు అయినట్లు పొగాకు రైతులు, రైతు సంఘాల నాయకులు తెలుపుతున్నారు. ఈ ఏడాది పొగాకు బోర్డు రాష్ట్రంలో సుమారు 172 మిలియన్ కిలోల పొగాకు పండించాలని లక్ష్యంగా నిర్ణయించగా లక్ష్యం మేరకే పొగాకును పండించినట్లు రైతులు తెలుపుతున్నారు. అయితే పొగాకు వ్యాపారులు మాత్రం ధరలు పెంచడం లేదని రైతులు వాపోతున్నారు. పెరిగిన పొగాకు ఉత్పత్తి ఖర్చుల ప్రకారం పొగాకు రైతులకు ఒక కేజికి 150 రూపాయల వరకు ధర వస్తేనే గిట్టుబాటు అవుతుందని, లేకుంటే రైతులు నష్టపోవాల్సి వస్తుందని పొగాకు రైతులు, రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. పొగాకు బోర్డు చైర్మన్ కూడా వేలం కేంద్రాలను పరిశీలించిన సమయంలో రైతులు అదనంగా పొగాకు సాగు చేయవద్దని, అయితే ఉత్పత్తి అయిన పొగాకును మాత్రం వీలున్నంత వరకు ఆశించిన ధరలను రైతులకు ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బోర్డు చైర్మన్ ఇచ్చిన హామీ మేరకు వ్యాపారులు బయట పొగాకు కొనుగోళ్ళు చేయకుండా కఠినచర్యలు తీసుకోవడం వల్ల కొంతమేరకు రైతులకు ధరలు వస్తున్నాయని, లేకుంటే ఇంకా నష్టపోవాల్సి వచ్చేదని రైతు నాయకులు అంటున్నారు. ఇప్పటికైనా పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చి వ్యాపారులు ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
పొగాకు కొనుగోళ్ల ధరలు
జిల్లాలోని ఒంగోలు పొగాకు బోర్డు రీజియన్‌లోని 9 పొగాకు బోర్డు వేలం కేంద్రాల్లో గురువారం జరిగిన కొనుగోళ్ల ధరలు ఈవిధంగా ఉన్నాయి. ఒంగోలు- 1వ వేలం కేంద్రానికి మొత్తం 924 పొగాకు బేళ్ళు రాగా 850 బేళ్ళను కొనుగోలు చేశారు. ఈ వేలం కేంద్రంలో కేజీకి గరిష్ఠ ధర 128 రూపాయలు పలుకగా కనిష్ఠ ధర 60 రూపాయలు, సగటు ధర 116.86 రూపాయలు పలికింది. ఒంగోలు -2వ వేలం కేంద్రానికి మొత్తం 818 పొగాకు బేళ్ళు రాగా 735 బేళ్ళను కొనుగోలు చేశారు. ఈ వేలం కేంద్రంలో కేజికి గరిష్ఠ ధర 127 ధర రాగా కనిష్ఠ ధర 75 రూపాయలు, సగటు ధర 110 రూపాయలు ధర పలికింది. టంగుటూరు -1 వేలం కేంద్రానికి 591 బేళ్ళు రాగా 558 బేళ్ళను కొనుగోలు చేశారు. ఈవేలం కేంద్రంలో కేజికి గరిష్ఠ ధర 128 రూపాయలు పలుకగా కనిష్ఠ ధర 71, సగటు ధర 107.76 రూపాయలు పలికింది. టంగుటూరు -2వ వేలం కేంద్రానికి మొత్తం 586 పొగాకు బేళ్ళు రాగా 533 బేళ్ళను కొనుగోలు చేశారు. ఈ వేలం కేంద్రంలో కేజికి గరిష్ఠ ధర 126 రూపాయలు రాగా కనిష్ఠ ధర 86 రూపాయలు, సగటు ధర 109.97 రూపాయలు పలికింది. కొండేపి వేలం కేంద్రానికి మొత్తం 666 పొగాకు బేళ్ళు రాగా 606 బేళ్ళను కొనుగోలు చేశారు. ఈ వేలం కేంద్రంలో కేజికి గరిష్ఠ ధర 128 రూపాయలు, కనిష్ఠ ధర 70, సగటు ధర 116 రూపాయలు పలికింది. కందుకూరు -1వ వేలం కేంద్రానికి మొత్తం 556 బేళ్లను కొనుగోలు చేశారు. ఈ వేలం కేంద్రంలో కేజికి గరిష్ఠ ధర 128, కనిష్ఠ ధర 40, సగటు ధర 109.92 రూపాయలు ధర పలికింది. కందుకూరు -2 వేలం కేంద్రానికి మొత్తం 719 బేళ్ళు రాగా 635 బేళ్ళను కొనుగోలు చేశారు. ఈ వేలం కేంద్రంలో కేజికి గరిష్ఠ ధర 130 పలుకగా, కనిష్ఠ ధర 60 రూపాయలు, సగటు ధర 111.38 రూపాయలు ధర వచ్చింది. కలిగిరి వేలం కేంద్రానికి మొత్తం 783 పొగాకు బేళ్ళు రాగా 756 బేళ్ళను కొనుగోలు చేశారు. ఈ వేలం కేంద్రంలో కేజికి గరిష్ఠ ధర 133, కనిష్ఠ ధర 65, సగటు ధర 110.98 రూపాయలు వచ్చింది. డిసి పల్లి వేలం కేంద్రానికి మొత్తం 768 పొగాకు బేళ్ళు రాగా 706 బేళ్లను కొనుగోలు చేశారు. ఈ వేలం కేంద్రంలో కేజికి గరిష్ఠ ధర 128 రూపాయలు, కనిష్ఠ ధర 65, సగటు ధర 110.75 రూపాయలు పలికింది.

టిడిపికే విజయావకాశాలు
ఎంపి అభ్యర్థి రాయపాటి స్పష్టం
మద్దిపాడు, మే 8: సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని నరసరావుపేట టిడిపి ఎంపి అభ్యర్థి రాయపాటి సాంబశివరావు తెలిపారు. రాయపాటి సాంబశివరావు తిరుపతికి వెళుతూ గురువారం మద్దిపాడులో వీరభద్రా హోటల్ యజమాని పప్పు శ్రీనివాసరావు ఇంటి వద్ద కొంతసేపు ఆగి ఎన్నికలపై టిడిపి నాయకులతో చర్చించారు. ఆయన స్థానిక సర్పంచ్ యు నాగేశ్వరరావు, టిడిపి నాయకులు జయంతిబాబు తదితరులతో పోలింగ్, గెలుపు అవకాశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలింగ్ సందర్భంగా గుంటూరు జిల్లాలో టిడిపి కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారన్నారు. తన కారుపై రాళ్ళతో దాడి చేసి కార్యకర్తలను సైతం గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైకాపా కార్యకర్తలు చేసిన గందరగోళాన్ని ప్రజలు ప్రత్యక్షంగా చూశారన్నారు. మొత్తంమీద అధిక సంఖ్యలో టిడిపికి సీట్లు వస్తాయని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే ప్రకాశం జిల్లాలో ఎన్నికల నిర్వహణ, పార్టీ గెలుపు అవకాశాల గురించి టిడిపి నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చి రామ్‌ప్రసాద్, సజీవ్ పిళ్ళే, సుమన్, వెంకట్, పిఎన్ రావు, మండల నాయకులు చిరంజీవి, భాను, యు నాగేశ్వరరావు, జయంతిబాబు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం పప్పు శ్రీను ఆధ్వర్యంలో టిడిపి నాయకులు రాయపాటిని సత్కరించారు.

జిల్లాలో పోలింగ్ సరళి
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, మే 8: జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల వివరాలు ఈవిధంగా ఉన్నాయి. యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఒక లక్షా 88వేల 504 ఓట్లు ఉండగా వాటిలో ఒకలక్షా 57వేల 121ఓట్లు పోలై 83.35 శాతం నమోదైంది. దర్శి నియోజకవర్గంలో ఒకలక్షా 98వేల 875ఓట్లు ఉండగా వాటిలో ఒకలక్షా 80వేల 891ఓట్లు పోలయ్యాయి. పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రెండులక్షల 14వేల 99ఓట్లు ఉండగా వాటిలో ఒకలక్షా 87వేల 682ఓట్లు, అద్దంకి నియోజకవర్గ పరిధిలో రెండులక్షల 20వేల 436 ఓట్లు ఉండగా వాటిలో ఒకలక్షా 97వేల 741 ఓట్లు పోల్ అయ్యాయి. చీరాల నియోజకవర్గంలో ఒకలక్షా 89వేల 685ఓట్లు ఉండగా వాటిలో ఒకలక్షా 53వేల 459ఓట్లు, సంతనూతలపాడు నియోజకవర్గంలో రెండు లక్షల 18వేల 13ఓట్లు ఉండగా వాటిలో ఒకలక్షా 67వేల 116ఓట్లు, ఒంగోలు నియోజకవర్గంలో రెండులక్షల 33వేల 792ఓట్లు ఉండగా వాటిలో ఒకలక్షా 78వేల 743ఓట్లు పోల్ అయ్యాయి. కందుకూరు నియోజకవర్గంలో ఒకలక్షా 94వేల 621ఓట్లు ఉండగా వాటిలో ఒకలక్షా 71వేల 758ఓట్లు, కొండెపి నియోజకవర్గంలో రెండులక్షల 14వేల 809ఓట్లు ఉండగా వాటిలో ఒకలక్షా 82వేల 226ఓట్లు, మార్కాపురం నియోజకవర్గంలో ఒకలక్షా 98వేల 860ఓట్లు పోల్ అయ్యాయి. అదేవిధంగా గిద్దలూరు నియోజకవర్గంలో రెండులక్షల 20వేల 983ఓట్లు ఉండగా వాటిలో ఒకలక్షా 80వేల 224ఓట్లు, కనిగిరి నియోజకవర్గంలో రెండులక్షల ఏడువేల 632ఓట్లు ఉండగా వాటిలో ఒకలక్షా 57వేల 626ఓట్లు పోల్ అయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఆర్‌ఒలు, ఎఆర్‌ఓలను నలుగురిని నియమించారు. 15మంది నోడల్ అధికారులు, మరో 15మంది అసిస్టెంట్ నోడల్ అధికారులు, 56మంది ఎంపిడిఓలు, 314 మంది సెక్టారల్ ఆఫీసర్స్ పర్యవేక్షణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. పోలింగ్ సందర్భంగా 20వేల 41మందిని సిబ్బందిని నియమించారు. 613 మైక్రో అబ్జర్వర్లను,. 9545మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల్లో పాల్గొన్నారు. వారిలో సివిల్ పోలీసు, ఆర్మ్‌డ్, హోంగార్డ్స్, ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు. ఎన్నికల విధుల్లో విఆర్‌ఏ, ఎన్‌ఎస్‌ఎస్, సాక్షరభారత్, మునిసిపల్ వర్కర్స్ పాల్గొన్నారు. కాగా జిల్లావ్యాప్తంగా ఏడు కోట్ల 28 లక్షల 650 రూపాయలను పోలీస్ సిబ్బంది సీజ్ చేయగా, వాటిలో మూడుకోట్ల 58లక్షల 74వేల 650 కోట్లను తిరిగి ఇచ్చారు. మరో మూడుకోట్ల 41లక్షల 23వేల 220 రూపాయలను ఐటి శాఖకు పంపించినట్లు జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ విలేఖర్లకు తెలిపారు. మొత్తంమీద 49 కేసులను నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తంమీద ఎన్నికలు ప్రశాంతంగా జరగటంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

క్షతగాత్రులకు కరణం, ఏలూరి పరామర్శ
యద్దనపూడి, మే 8:మండలంలోని సూరవారిపల్లె గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన వైసిపి, టిడిపి కార్యకర్తల ఘర్షణలో గాయపడిన వారిని రాష్ట్ర తెలుగురైతు సంఘం అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, పర్చూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గురువారం బాధితులను గుంటూరులోని పీపుల్స్ ట్రామా హాస్పిటల్‌లో పరామర్శించారు. బలరామ్ సూరావారిపల్లె గ్రామంలోని ఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి నాయకులు ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతున్నారని, ఘర్షణలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. ఏలూరి సాంబశివరావు గుంటూరు వైద్యశాలలో ఉన్న బాధితులైన ఇంటూరి మురళి, ఎన్ రమేష్, ఇ నాగేశ్వరరావు, ఇంటూరి వీరయ్యలను పరామర్శించారు. ఈ ఘటనలో 25మంది వైసిపి కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గ్రామంలో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. సిఐ కైలాస్‌నాధ్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లా ఉపాధ్యక్షులు పోపూరి శ్రీనివాసరావు, కె జనార్ధన్, సిహెచ్ కృష్ణ, ఎం రవి, కె నాగేశ్వరరావు, గోరంట్ల సాంబయ్య తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.

జిల్లాలో 82.81 శాతం పోలింగ్ అద్దంకిలో అత్యధికంగా 89.60 శాతం ఏరులై పారిన మద్యం, నగదు
english title: 
m

ఎవరి టెన్షన్ వారిది

$
0
0

* గెలుపుపై కన్పించని ధీమా
విశాఖపట్నం, మే 8: పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. గెలుపుపై ఇప్పుడు అభ్యర్ధుల్లో టెన్షన్ మొదలైంది. పోలింగ్ సరళి మేరకు ఎంతవరకూ తమకు విజయావకాశాలు ఉంటాయన్న అంశంపై లెక్కలు వేసుకుంటున్నారు. ఓటరు నాడి ఎటువైపుందో ఊహించేందుకు అభ్యర్థులంతా మేధోమధనం చేస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. ఎన్నడూ లేని విధంగా జిల్లా వ్యాప్తంగా ఒకటి, రెండు సెగ్మెంట్‌లు మినహా మిగిలిన అన్ని చోట్లా ముఖాముఖి పోటీ హోరాహోరీగా సాగింది. విజయావకాశాలపై ఎవరికి వారు పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ లోలోన ఆందోళన చెందుతూనే ఉన్నారు. తాజాగా ప్రధాన రాజకీయ పార్టీలు, బరిలో నిలిచిన అభ్యర్థులు పోలింగ్ ప్రక్రియను నిశింతంగా పరిశీలించే పనిలోపడ్డారు. పోలింగ్ జరిగినతీరు, పోలింగ్ శాతం వంటి అంశాలను ప్రాంతాల వారీగా భేరీజు వేసుకుంటూ విజయావకాశాలపై నిర్ధారణకు వస్తున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా అభ్యర్థులు అంచనాలు వేసుకుంటున్నారు. విశాఖ నగరంలోని విశాఖ తూర్పు, పశ్చిమం, దక్షిణం, ఉత్తరం నియోజకవర్గాలతో పాటు భీమునిపట్నం, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల్లో ఎవరూ ఎవరికి తీసిపోకుండా పోటీపడ్డారు. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు నువ్వానేనా అన్న రీతిలో పోటీపడ్డారు. తెలుగుదేశం పార్టీ సంప్రదాయ ఓట్‌బ్యాంకు తమకే లాభిస్తుందని భావిస్తుండగా, వైఎస్ కుటుంబంపై ఉన్న అభిమానం, విజయమ్మ ఇక్కడ్నుంచి ఎంపిగా పోటీ చేయడం తమకు ఊహించని ఫలితాలు తెచ్చిపెడతాయని వైకాపా అభ్యర్థులు గంపెడాశతో ఉన్నారు. నగరంలో పెద్దగా పోలింగ్ జరగకపోవడం తెలుగుదేశం అభ్యర్థులను కొంతమేర ఆందోళన కల్గిస్తున్నప్పటికీ మధ్యతరగతి, యువత ఓటింగ్‌లో పాల్గొనడం తమకు లాభిస్తుందని నమ్మకంతో ఉన్నారు. ఒక్క విశాఖ దక్షిణం మినహాయిస్తే అన్ని చోట్లా రెండు ప్రధాన పార్టీల మధ్యే పోరు నెలకొనడంతో విజయావకాశాలపై అంచనా చిక్కట్లేదు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు, వైకాపా అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఒకరికొకరు తీసిపోకుండా శ్రమించారు. ప్రాంతాల వారీగా తమ అనుకూల ఓట్ల పోలింగ్‌పై అంచనాలు వేస్తున్నారు. ఇక విశాఖ ఉత్తరంలో వైకాపాకు భారతీయ జనతాపార్టీ నుంచి గట్టిపోటీ ఎదురైంది. ఇక్కడ కూడా ఇద్దరు అభ్యర్థులు నువ్వానేనా అన్నరీతిలో పోటీపడ్డారు. ప్రచారం దగ్గర్నుంచి, పోలింగ్ రోజున ఓటింగ్ తమకు పరిస్థితులు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు. ఇక పశ్చిమంలో తెదేపా తరపున గణబాబు, వైకాపా తరపున రత్నాకర్‌లు గెలుపుపై ధీమాతో ఉన్నారు. స్థానికత అంశం పోలింగ్‌లో కీలకంగా మారిందని, ఇదే అంశం తనకు లాభిస్తుందని గణబాబు ధీమాతో ఉండగా, ఈ ఎన్నికల్లో స్థానికతకు ఓటర్లు ప్రాధాన్యత ఇవ్వలేదని, కేవలం వైఎస్ జగన్ ఛరిష్మా ఒక్కటే తమ గెలుపును సునాయాసం చేస్తుందని నమ్మకంతో ఉన్నారు. గాజువాకలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ సామాజిక వర్గ సమీకరణాల నేపధ్యంలో ఎన్నిక వన్‌సైడ్‌గా ఉంటుందని తొలుత అంచనా వేసినప్పటికీ చివరి నిముషంలో ఇద్దరి మధ్యాపోటీ నువ్వానేనా అన్న తీరుకు వచ్చేసింది. భీమునిపట్నంలో సైతం ఇదే పరిస్థితులు ఉన్నాయి.

ప్రజాస్వామ్య వ్యవస్థను నవ్వుల పాల్జేశారు
* లోక్‌సత్తా నేత భీశెట్టి
విశాఖపట్నం, మే 8: సీమాంధ్రలో బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు అనుసరించిన తీరు ప్రజాస్వామ్య వ్యవస్థను నవ్వుల పాలుచేశాయని లోక్‌సత్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీశెట్టి బాబ్జీ విమర్శించారు. అక్కయ్యపాలెంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగాను, పోలింగ్‌కు ముందు ప్రధాన రాజకీయపార్టీల నేతలు చంద్రబాబు, జగన్మోహన రెడ్డి తదితరులు ధనం, కుల బలం ప్రభావంపై చేసిన వాఖ్యలు తీరా ఎన్నికల నాటికి ఏమయ్యాయని ప్రశ్నించారు. ధన బలం, కండబలం ఉంటే చాలు ఎన్నికల్లో ఏమైనా చెయొచ్చన్న ధీమాతో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యవహరించాయని ఆరోపించారు. ఇక మీడియా సైతం రెండు వర్గాలుగా కథనాలు ప్రచురిస్తూ, ప్రసారం చేస్తూ రాజకీయ పార్టీలకు కొమ్ము కాశాయని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని అభిప్రాయపడ్డారు.
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వాహణలో జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు ఉన్నతాధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించారని కొనియాడారు. ఎన్నికల సందర్భంగా నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసందర్భంగా అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

వుడా ప్లాట్ల వేలానికి గడువు పొడిగింపు
* జూన్ 10 వరకూ దరఖాస్తులకు గడువు
విశాఖపట్నం, మే 8: విశాఖనగరాభివృద్ధి సంస్థ (వుడా) ఆధ్వర్యంలో విశాఖ,విజయనగరం ప్రాంతాల్లో రూపొందించిన లేఅవుట్లలో వేలం ద్వారా ప్లాట్ల కేటాయింపునకు గడువును పొడిగిస్తూ ఉపాధ్యక్షుడు ఎన్.యువరాజ్ ఆదేశాలు జారీ చేశారు. ప్లాట్‌లు కోరుకునే వారు జూన్ 10 వరకూ దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. వుడా రూపొందించిన 13 లేఅవుట్‌లలో 248 ప్లాట్ల కేటాయింపును వేలం ద్వారా చేపట్టేందుకు నిర్ణయించారు. ఈమేరకు ఆసక్తిగల వారు జూన్ 10 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి జూన్ చివరి వారంలో వేలం ప్రక్రియను చేపట్టనున్నట్టు తెలిపారు. శొంఠ్యాం లేఅవుట్‌లో 165 ప్లాట్లు, మధురవాడ సైబర్‌వేలీ సెక్టార్ 1లో 25 ప్లాట్లు, సెక్టార్ 2లో 10 ప్లాట్లు, మధురవాడ ప్రభుత్వ భూముల లేఅవుట్‌లో 14 ప్లాట్లు, భీమిలి సమీపంలోని కుమ్మరిపాలెం లేఅవుట్‌లో 5, కాపులుప్పాడ చిలుకూరి జాయింట్ వెంచర్‌లో 14, ఎంవిపి లేఅవుట్‌లో రెండు, భీమునిపట్నం లేఅవుట్‌లో 2, కూర్మన్నపాలెం లేఅవుట్ ఫేజ్ 5లో ఒకటి, చినముషిడివాడ లేఅవుట్‌లో 2, భీమిలి విశాఖ రోడ్డు ఆదిభట్ల నగర్‌లో 2 ప్లాట్లను వేలం ద్వారా విక్రయించనున్నట్టు తెలిపారు.

హరిత యూనిట్లకు జూన్ 12వరకూ పొడిగింపు
మధురవాడలో నిర్మాణం పూర్తి చేసుకున్న హరిత హౌసింగ్ ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న 50 యూనిట్ల కేటాయింపు నిమిత్తం దరఖాస్తులకు గడువును జూన్ 12 వరకూ పొడిగిస్తున్నట్టు విసి యువరాజ్ తెలిపారు. 20 ఎకరాల విస్తీర్ణంలో 10 బ్లాకుల్లో మొత్తం 710 అపార్ట్‌మెంట్ ప్లాట్‌లతో పూర్తికావస్తున్న హరితలో ఇప్పటికే 660 యూనిట్లు కేటాయింపు పూర్తయిందని తెలిపారు. మిగిలిన 50 యూనిట్లకోసం దరఖాస్తులు కోరినట్టు తెలిపారు. ఎంఐజి కేటగిరీలో 33 ప్లాట్లు, ఎల్‌ఐజి కేటగిరీలో 17 ప్లాట్లు కేటాయింపునకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వీటిని లాటరీ పద్ధతిన కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు.

జోరుగా బెట్టింగ్‌లు
* మెజార్టీపైనా పందాలు
* కోసు పందెం డబుల్ ధమాకా
విశాఖపట్నం, మే 8: పోలింగ్ ముగిసింది. ఇక ఫలితాలు వెలువడటమే తరువాయి. ప్రచారం, పోలింగ్‌తో అలసిన రాజకీయ వర్గాలు ఇప్పుడు విజయాలపై పందాలకు దిగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పందెం రాయుళ్లు ఇప్పుడు గెలుపుపై కోట్ల రూపాయల పందాలకు తెగబడుతున్నారు. గెలుపే కాదు వచ్చే మెజార్టీపై కూడా పందాలకు సిద్ధం అంటున్నారు. దీనికోసం ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ముఠాయే నగరంలో తిష్టవేసిందంటే పరిస్థితి ఎంతతీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. విశాఖనగర పరిధిలోని పార్లమెంట్ స్థానంపై జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఈస్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ పోటీ చేయడంతో ఆసక్తి నెలకొంది. విజయమ్మ గెలుపుపై ఆపార్టీకి చెందిన నేతలు రూ. లక్షలు, కోట్లతో బెట్టింగ్‌లకు తెగబడుతున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు బెట్టింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. విజయమ్మ గెలుపుతో పాటు మెజార్టీపైనా బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. రెండు లక్షల ఓట్ల మెజార్టీతో విజయమ్మ గెలుస్తుందని వైకాపా వర్గాలు రూ కోట్లకు బెట్టింగ్ కడుతున్నారు. దీనిలో కోసు పందెం అంటూ ఒకటికి రెండింతలుగా పందెం సొమ్మును ఎరవేస్తున్నారు.
ఇక విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమం, పెందుర్తి, అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లపై బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. తూర్పులో తెదేపా, వైకాపా అభ్యర్థులు వెలగపూడి, వంశీకృష్ణల మధ్య పోటీ తీవ్రస్థాయిలో జరిగింది. ఇక్కడ గెలుపు కూడా అంచనాలకు చిక్కని విధంగా ఉంది. దీంతో బెట్టింగ్ రాయుళ్లకు అవకాశం చిక్కింది. పెందుర్తి, అనకాపల్లి సెగ్మెంట్లలో సైతం అభ్యర్ధుల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇక్కడ కూడా విజయావకాశాలు ఎవరివన్న అంశంపై స్పష్టత లేదు. ఈసెగ్మెంట్లపై కూడా బెట్టింగ్‌ల జోరుగానే సాగుతున్నాయి. బెట్టింగుల్లో ఆస్తుల పత్రాలను సైతం పందెం రాయుళ్లు అంగీకరించడం గమనార్హం.

శిరామకృష్ణ కమిటీ నేడు రాక
విశాఖపట్నం, మే 8: రాష్ట్ర రాజధాని ఎంపిక విషయమై ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం విశాఖ నగరానికి రానున్నారు. రాజధాని ఏర్పాటుకు అవసరమైన భౌగోళిక అంశాలు ఎలా ఉన్నాయి, సహజ వనరులు పరిస్థితి ఏమిటి? ప్రభుత్వ భూములు ఎంతవరకు ఉన్నాయి తదితర అంశాలపై అధికారులతో కమిటీ సభ్యులు చర్చించనున్నారు. అలాగే ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు నుంచి వినతులు స్వీకరించనున్నారు. నగరంలో చర్చలు పూర్తి చేసిన తరువాత కమిటీ సభ్యులు శనివారం రాజమండ్రి, ఆదివారం విజయవాడలో పర్యటిస్తారు.

అనకాపల్లిలో విజయంపై ఎవరి ధీమా వారిది
పదివేల పైబడి మెజార్టీ వస్తుందంటున్న వైకాపా, దేశం అభ్యర్థులు
ఇరువురిలోను క్రాస్ ఓటింగ్ గుబులు
అనకాపల్లి, మే 8: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఫలితం ఎవరి పరం అవుతుందనే చర్చ రసవత్తరంగా సాగుతుంది. అనకాపల్లి అసెంబ్లీ బరిలో 13మంది పోటీకి దిగినప్పటికీ ప్రధానంగా ముగ్గురి మధ్యే ఇక్కడి ఎన్నికల పోరు సాగింది. వైకాపా అభ్యర్థి కొణతాల రఘునాథ్, దేశం అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ, కాంగ్రెస్ అభ్యర్థి దంతులూరి దిలీప్‌కుమార్ ఈ ముగ్గురి మధ్య పోటీ సాగింది. కాంగ్రెస్ అభ్యర్థి వ్యక్తిగత ప్రాభల్యంతో పార్టీపై వ్యతిరేకత ఉన్నా కొంతమేర ఓట్ల బ్యాంకును కూడగట్టుకోగలిగారు. అయితే దిలీప్ ఓట్లు వైసీపికి చెందాల్సినవి చీల్చారా, దేశం ఓట్ల బ్యాంకుకు గండికొట్టారా అనే విషయమై పరస్పర వాదనలు వినిపిస్తున్నాయి. దేశంపార్టీ స్థానికేతరుడైన పీలా గోవింద్‌కు టిక్కెట్ ఇవ్వడంతో ఇక్కడి దేశం టిక్కెట్‌ను ఆశించిన ఆశావహులు డీలా పడిపోయారు. స్థానికేతరులకు టిక్కెట్ ఇవ్వడంతో ఆ పార్టీశ్రేణుల్లో నైరాశ్యం ఏర్పడి తన విజయం నల్లేరుపై నడక కాగలదని వైకాపా అభ్యర్థి కొణతాల రఘునాథ్ గట్టి ధీమా వ్యక్తం చేసారు. అభ్యర్థిత్వం ముందుగానే ఖరారు కావడం, పార్టీ పట్ల ప్రజల్లో క్రేజీ ఉందని దేశం పార్టీ స్థానికేతరునికి ఇవ్వడంతో ఈ పరిణామాలన్నీ తనకు కలసివస్తాయని వైకాపా అభ్యర్థి రఘునాథ్ భావించారు. కేవలం ఆర్థిక బలమే ప్రధాన అస్త్రంగా బరిలోకి దిగిన దేశం అభ్యర్థి గోవింద్ పోలింగ్‌కు రెండుమూడు రోజుల ముందు బలహీనపడిపోయారనే ప్రచారం సాగింది. అయితే ఓటర్లకు తాయిలాలు అందజేయడంలోను, ప్రలోబాలకు గురిచేయడంలోను వైకాపా అభ్యర్థి రఘునాథ్‌ను అధిగమించారు. వైకాపా అభ్యర్థి కంటే దేశం అభ్యర్థి ఎక్కువగా ప్రలోబాలకు గురిచేసారనే ప్రచారం సాగుతోంది. దీంతో స్థానిక గవరపాలెంలో సైతం పోలింగ్ రోజున దేశం పార్టీకి కొంత సానుకూల పవనాలు వీచాయి. గవరపాలెం ప్రాంతంలో దేశం అభ్యర్థికి ఏజెంట్లు సైతం దొరకని పరిస్థితి ఉంటుందని తొలుత భావించారు. కానీ అక్కడ కూడా దేశం అభ్యర్థికి ఆశించిన దానికంటే ఎక్కువగానే పడ్డాయని ఆ పార్టీ మద్ధతుదార్లు అంటున్నారు. పట్టణంలో వైకాపా మెజార్టీలో ఉంటుందని ఆ పార్టీశ్రేణులు ఆశిస్తున్నారు. అనకాపల్లిలో దేశం అభ్యర్థికి మంచి మెజార్టీ వస్తుందని ఆ పార్టీ వర్గీయులు ప్రకటించే పరిస్థితి లేకపోయినా ఈ నియోజకవర్గ పరిధిలోని అనకాపల్లి, కశింకోట మండలాల్లో దేశం పార్టీకి పూర్వ వైభవం ఏర్పడిందని, వైకాపాకు ప్రతికూలత ఏర్పడిందని దీంతో తన విజయం నల్లేరుపై నడక కాగలదని దేశం అభ్యర్థి గోవింద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ పథకాల వలన లబ్ధిపొందిన వారు తనకే ఓటువేసారని వైకాపా అభ్యర్థి రఘునాథ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు వైకాపా అభ్యర్థి ఇటు దేశం అభ్యర్థి ఇరువురు కూడా పది నుండి 15వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తామని ఎవరికి వారే గట్టి ధీమాతో ఉన్నారు. ఇదిలావుంటే ఎప్పటిమాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా అనకాపల్లి అసెంబ్లీలో క్రాస్ ఓటింగ్ బాగా జరిగిందనే ప్రచారం సాగుతోంది. ఈ విధంగా జరిగిన క్రాస్ ఓటింగ్ దేశం ఎంపీ అభ్యర్థి కంటే వైకాపా ఎంపీ అభ్యర్థికే బాగా లాభసాటిగా ఉందని ప్రచారం సాగుతోంది. దేశం అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్థానికేతరుడు కావడం, వైకాపా అభ్యర్థి అమర్‌నాథ్ తండ్రి దివంగత మాజీమంత్రి గుడివాడ గురునాథరావుకు ఈ ప్రాంతీయులతో ఉన్న సన్నిహిత సంబంధాలను ఇందుకు కారణాలుగా పేర్కొంటున్నారు. అనకాపల్లి అసెంబ్లీలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థికంటే ఎంపీ అభ్యర్థికే అధికంగా ఓట్లు వచ్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే బిజెపితో తెలుగుదేశం పార్టీ పొత్తు నేపధ్యంలో ఎంపీ స్థానానికి దేశం పార్టీకే మేధావులంతా ఓట్లు వేసారనే వాదన కూడా మరోవైపు సాగుతోంది. స్థానిక బిజెపి శ్రేణుల్లో ఎమ్మెల్యే అభ్యర్థి తమను పట్టించుకోలేదనే అసంతృప్తి ఉంది. దీంతో ఎమ్మెల్యే కంటే ఎంపీ స్థానంలోనే దేశం అభ్యర్థికి ఓట్లను కురిపించడంలో బిజెపి నేతలు ఎక్కువ ఆసక్తి కనబర్చారనే ప్రచారం సాగుతోంది. ఆ విధంగా జరిగే క్రాస్ ఓటింగ్ దేశం ఎంపీ అభ్యర్థికి లాభసాటి కాగలదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

పాడేరులో వైకాపా-సి.పి.ఐ. హోరాహోరీ
* మూడో స్థానంతో సరిపెట్టుకోనున్న కాంగ్రెస్
పాడేరు, మే 8: పాడేరు శాసనసభ నియోజకవర్గంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్, సి.పి.ఐ. పార్టీల అభ్యర్థులు ఆదిపత్యాన్ని కనబరిచి విజయం కోసం పోటీ పడుతున్నాయి. పాడేరు నియోజకవర్గం నుంచి పది మంది అభ్యర్థులు బరిలో నిలిచినప్పటికీ పోలింగ్ ముందునాటికి త్రిముఖ పోటీ నెలకొన్నప్పటికీ పోలింగ్‌లో మాత్రం వైకాపా, సి.పి.ఐ.లు విజయం కోసం నువ్వా-నేనా అన్న రీతిలో తలపడ్డాయి. నియోజకవర్గంలోని 242 పోలింగ్ కేంద్రాలలో ఈ రెండు పార్టీల జోరు అధికంగా కనిపించగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ప్రభావం కొన్ని పోలింగ్ కేంద్రాలకే పరిమితం కావడం విశేషం. దీంతో బాలరాజు తృతీయ స్థానంతో సరిపెట్టుకోవలసిన పరిస్థితి కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు విశే్లషిస్తున్నారు. అయితే సామాజిక వర్గమే గీటురాయిగా జరిగే ఎన్నికల్లో ఈ సారి మాత్రం ఇందుకు భిన్నంగా పోలింగ్ సరళి నమోదు కావడం మరో విశేషంగా చెప్పవచ్చు. గిరిజన సామాజిక వర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు చెందిన సామాజిక వర్గం ఓటర్లు అదే సామాజిక వర్గానికి మద్దతు ప్రకటించడం ఇంతవరకు ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఒక సామాజిక వర్గం ఓటర్లు మరో సామాజిక వర్గం అభ్యర్థికి మద్దతు ప్రకటించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో బలమైన సామాజిక వర్గాలకు చెందిన వైకాపా అభ్యర్థి గిడ్డి ఈశ్వరి, సి.పి.ఐ. అభ్యర్థి గొట్టేటి దేముడుల మధ్య వారి వారి సామాజిక వర్గ ఓట్లలో భారీగా చీలిక ఏర్పడిందనే చెప్పాలి. అభ్యర్థుల సామాజిక వర్గాల ఓట్ల చీలికతో వైకాపా, సి.పి.ఐ.లు గట్టిగా తలపడుతున్నప్పటికీ మండలాల వారీగా నమోదైన పోలింగ్‌లో వైకాపా సి.పి.ఐ.కంటే ఆదిక్యత కనబరిచినట్టు తెలుస్తోంది. పాడేరు, గూడెంకొత్తవీధి మండలాల్లో వైకాపా అధిక శాతం ఓట్లు దక్కించుకోగా కొయ్యూరు మండలంలో సి.పి.ఐ. ఆదిపత్యాన్ని ప్రదర్శించింది. జి.మాడుగుల మండలంలో వైకాపా, సి.పి.ఐ.లు హోరాహోరీగా తలపడినప్పటికీ ఎవరికి ఆదిక్యత వచ్చినా స్వల్పంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. చింతపల్లి మండలంలో మాత్రం వైకాపా, సి.పి.ఐ., కాంగ్రెస్, బి.జె.పి.లు ఓట్లు పంచుకున్నట్టు తెలుస్తోంది. దీంతో రెండు మండలాల్లో ఆదిపత్యం ఉన్న వైకాపా, మరో మండలంలో కూడా సి.పి.ఐ.తో తలపడిన ఆశించిన ఓట్లు దక్కించుకునే అవకాశం ఉండడం ఆ పార్టీకి కలిసివచ్చే అంశంగా చెబుతున్నారు. ఇదిలాఉండగా పాడేరు నియోజకవర్గంలో అభ్యర్థుల విజయాన్ని నిర్ణయించేందుకు కీలకంగా మారిన గిరిజనేతర ఓట్లు ఈ సారి రెండుగా చీలిపోయినట్టు చెప్పవచ్చు. గతంలో ఒకే అభ్యర్థికి అత్యధికంగా మద్దతు ప్రకటించే గిరిజనేతరులు ఈ సారి వైకాపా, సి.పి.ఐ.లకు కొమ్ముకాసారు. అయితే గిరిజనేతరుల ఓట్లలో సింహాభాగాన్ని వైకాపా దక్కించుకోగా తరువాత స్థానంలో సి.పి.ఐ. లాభపడింది. కాంగ్రెస్ అభ్యర్థి బాలరాజుకు సైతం గిరిజనేతరులు మద్దతు ఉన్నప్పటికీ ఇది స్వల్పంగానే ఉండవచ్చునని చెప్పవచ్చు. దీనికితోడు పాడేరు నియోజకవర్గంలోని మైనార్టీ ఓట్లు అత్యధికంగా వైకాపా స్వంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. మైనార్టీ ఓట్లను దక్కించుకునేందుకు సి.పి.ఐ., కాంగ్రెస్ ప్రయత్నించినప్పటికీ వీరంతా వైకాపా పక్షాన నిలవడంతో నియోజకవర్గంలో వైకాపాకు ప్లస్ పాయింట్‌గా మారింది. వైకాపా అభ్యర్థి గిడ్డి ఈశ్వరి భగత సామాజిక వర్గానికి చెందినప్పటికీ ఆమె సామాజిక వర్గం ఓట్లు సి.పి.ఐ. అభ్యర్థి దేముడుకు సైతం లభించినప్పటికీ దేముడు సామాజిక వర్గమైన కొండదొర ఓట్లు కూడా ఈశ్వరికి ఆశాజనకంగానే లభించినట్టు తెలుస్తోంది. పాడేరు నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో రెండు లక్షల 13 వేల 327 మంది ఓటర్లు ఉన్నప్పటికీ కేవలం లక్షా 26 వేల 183 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో ఈ సారి అధిక శాతం పోలింగ్ నమోదవుతుందని అందరూ భావించినప్పటికీ దాదాపు 60 శాతం పోలింగ్ మాత్రమే జరగడం కూడా అభ్యర్థుల జాతకాలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల పోలింగ్ కేంద్రాలలో అతి తక్కువ పోలింగ్ నమోదు కావడం వైకాపాకు లాభించిందని అంటున్నారు. ఏదిఎమైనా పాడేరు నియోజకవర్గంలో వైకాపా, సి.పి.ఐ. అభ్యర్థులు హోరాహోరీగా తలపడి తమదే విజయమంటూ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గెలుపుపై ఎవరి ధీమా వారిదే!
అరకులోయ, మే 8: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన పోలింగ్ ముగియడంతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరికి వారు గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నారు. అరకులోయ ఎస్టీ రిజర్వ్‌డ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ నెల 7వ తేదీ బుధవారం జరిగిన సాధారణ ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి అభ్యర్థులు గెలుపుపై అంచనాలు వేస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం గెలుపుపై అంచనాల్లో నిమగ్నమయ్యారు. రాజకీయ విశే్లషకులతో కలిసి లెక్కలు వేసే పనుల్లో పడ్డారు. విజయావకాశాలు మెరుగుపడినట్టు కేడర్ల ద్వారా తెలుసుకుంటున్న పలువురు అభ్యర్థులు ఊపిరిపీల్చుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసినవారంతా విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లు అభ్యర్థులకు విలువ ఇవ్వకుండా కేవలం డబ్బులకే ప్రాథాన్యతనివ్వడంతో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు డబ్బు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. దీంతో అనేక పార్టీల అభ్యర్థులు, స్వతంత్రుల మద్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా సాగింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తే మాత్రం ఈసారి పోటీ ప్రధానంగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థి మద్యే జరిగిందని చెప్పవచ్చు. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బరిలో ఉన్నా తెలుగుదేశం అభ్యర్థి సివేరి సోమ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిడారి సర్వేశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థి కుంభా రవిబాబుల మద్య నువ్వానేనా అన్నట్టుగా పోటీ ఏర్పడింది. నియోజకవర్గం పరిధిలో ఆరు మండలాలు ఉండగా, ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేటలలో స్వతంత్ర అభ్యర్థి గుర్తు టీ కప్పుసాసరు జోరు కనిపించగా, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి మండలాల్లో వైఎస్సార్ సీపీ, టి.డి.పి., స్వతంత్ర అభ్యర్థి చెరిసగం ఓట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా చతికిల పడింది. ఇక బి.ఎస్.పి., ఆమ్‌ఆద్మీ, జై సమైక్యాంధ్ర పార్టీల పరిస్థితి దయనీయంగా మారాయి. దీంతో నియోజకవర్గం పరిధిలో టి.డి.పి., వైకాపా, స్వతంత్ర అభ్యర్థి హవా కొనసాగినట్టు కనిపిస్తోంది. సీపీఎం కూడా కొంత ప్రభావం చూపుతోంది. నియోజకవర్గంలో 58 శాతం పోలింగ్ నమోదు కావడంతో గెలుపు ఎవరిపరమవుతుందో అంచనా వేయలేకపోతున్నారు. ఎవరు గెలిచినా అతి తక్కువ మెజారిటీ ఓట్లతోనే గట్టెక్కె అవకాశాలు ఉన్నాయని విశే్లషకులు భావిస్తున్నారు. అల్పాదాయ వర్గాలు, రోజువారీ కూలీలు ఈసారి పోలింగ్‌లో అధిక శాతం పాల్గొంటారన్న అభ్యర్థుల ఆశలు చివరకు నీరుగారిపోయాయి. వీరంతా ఇందుకోసం భారీగానే ఖర్చు చేసినా ఆయా వర్గాలు హాజరు తక్కువ కావడంతో పలువురి నేతలకు గుబులు పట్టుకుంది. గతానికి విరుద్ధంగా ఈసారి మద్య, ఉన్నత శ్రేణి కుటుంబాలు, విద్యాధికులు, యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొన్నారు. ఎడతెరిపి లేకుండా ఏకధాటిగా కురిసిన భారీ వర్షం కారణంగా అభ్యర్థులు ఓటింగ్‌పై వేసుకున్న అంచనాలు తారుమారయ్యాయి. దీంతో ఓటింగ్ శాతాన్ని బట్టి గెలుపు ఎవరిపరం అవుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

శాంతియుత ఎన్నికలు మావోలకు చెంపపెట్టు
పాడేరు ఎ.ఎస్.పి. ఫకీరప్ప
పాడేరు, మే 8: మన్యంలో సాధారణ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు ఇచ్చిన పిలుపుకు ప్రజల నుంచి స్పందన లభించకపోవడం మావోలకు చెంపపెట్టు వంటిదని పాడేరు ఎ.ఎస్.పి. కె.్ఫకీరప్ప వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఎన్నికలను బహిష్కరించాలని మావోలు పిలుపునివ్వడమే కాకుండా ఎన్నికలను భగ్నం చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అన్నారు. మావోల బహిష్కరణ పిలుపును గిరిజన ప్రాంత ప్రజలు తిరస్కరించి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటింగ్‌లో పాల్గొన్నారని ఆయన చెప్పారు. గత నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ నెల 7న జరిగిన సాధారణ ఎన్నికలు మన్యంలో విజయవంతంగా నిర్వహించగలిగామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలను విఫలం చేసేందుకు మావోయిస్టులు చేసిన ప్రయత్నాలకు ప్రజలు ఓటు ద్వారా గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు. ప్రజల మద్దతును పూర్తిగా కోల్పోయిన మావోయిస్టులు తమ హింసాత్మక పంధాను ఇప్పటికైనా వీడి జన జీవనస్రవంతిలో కలిసిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును మావోలు గౌరవించి తమకు లొంగిపోవాలని ఆయన సూచించారు. జన జీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వచ్చిన మావోయిస్టులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. గిరిజన ప్రాంతంలో ఔట్ పోస్టుల ఏర్పాటుకు ప్రజలు సానుకూలంగా స్పందిస్తుండడంతో ఈ దిశగా తమ శాఖ చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో ముగియడంలో పాలు పంచుకున్న అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, పోలీసులకు, స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న గిరిజన ప్రాంత ప్రజానీకానికి ఫకీరప్ప కృతజ్ఞతలు తెలిపారు.

నేడు వాసవీమాత జయంతోత్సవం
విశాలాక్షినగర్, మే 8: కురుపాం మార్కెట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీవాసవీమాత అమ్మవారి జయంతోత్సవాలు శుక్రవారం నిర్వహించనున్నట్టు ఆలయ సంఘం అధ్యక్షుడు పాలూరి సూర్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 3.30 గంటలకు సుప్రభాత సేవతో ఉత్సవాలు మొదలవుతాయని తెలిపారు. అలాగే ఉదయం 4 గంటలకు అమ్మవారికి క్షీరాభిషేకం, అలంకరణ, 6.30 గంటలు 108 కలశాలతో తిరువీధి మహోత్సవం, 7.30 గంటలకు ఉత్సవ మూర్తికి క్షీరాభిషేకం, 9.30 గంటలకు కుంకుమ పూజ, మధ్యాహ్నం 12 గంటలకు నారాయణ సేవ, సాయంత్రం 6.30 గంటలకు పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు.

స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఈవిఎంలు భద్రం
* కంటి రెప్పలా కాపలా
* 16న ఓట్ల లెక్కింపు...కేంద్రాలు ఖరారు
* పరిశీలించిన కలెక్టర్, పోలీసు కమిషనర్
విశాఖపట్నం, మే 8: సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. ఇక ఫలితాలే తరువాయి. ఓటర్లు తమ తీర్పు చెప్పేశారు. చెప్పిన తీర్పు ఎవరికనేదే తేలాల్సి ఉంది. ఇది తెలియడానికి మరో వారం రోజులు ఓపిక పట్టాల్సిందే. అంటే అభ్యర్ధులకు అంత వరకు టెన్షనే. వీరి భవితవ్యం ఇపుడు స్ట్రాంగ్ రూమ్‌లకు చేరుకుంది. ఇందులో ఉండే ఇవియంల్లోనే భవితవ్యం భద్రంగా ఉంది. ఇది తేలాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. ఈ నెల 16వ తేదీన నిర్వహించే కౌంటింగ్ ద్వారా ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతాయి. అంత వరకు వీటిని కంటికి రెప్పలా కాయాల్సిందే. ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ నూతన భవనంలో పోలింగ్ కేంద్రాల నుండి తీసుకువచ్చిన ఇవియంలను స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపరిచారు. గురువారం ఉదయం అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన పరిశీలకులు అనిల్‌కుమార్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌లు స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపరిచిన ఇవియంలను పరిశీలించారు. అనంతరం ఆయా గదులకు సీల్ వేయించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, పరిశీలకులు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులు, ఏజెంట్లు, పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారుల డైరీ స్క్రూటిని నిర్వహించారు. బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల నుండి తీసుకు వచ్చిన పోలింగ్ మెటీరియల్‌ను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల నుండి ఫారమ్ 17-ఏ, 17-సిలను పరిశీలకులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పరిశీలకులు ఎన్నికల నిర్వహణలో జరిగిన లోటుపాట్లను, సలహాలు, సూచనలను పరిశీలకులకు తెలిపారు. సంబంధిత అంశాలను నోట్ చేసుకుని భారత ఎన్నికల కమిషన్‌కు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సాధారణ పరిశీలకులు ఇ.లాల్‌సాతా, విశాఖ తూర్పు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ నియోజకవర్గాల నుండి జనరల్ అబ్జర్వర్ దిలీప్‌కుమార్ చక్రవర్తి, యస్.కోట, భీమిలి, గాజువాక నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ నరేందర్ శంకర్ పాండేలు పాల్గొన్నారు.
విశాఖ జిల్లాలో 33,46,639 మంది ఓటర్లలో 71శాతానికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బరిలోకి దిగిన అభ్యర్ధులు, వారి తరపున పోరాటం చేసిన వివిధ పార్టీలకు చెందిన ఆశావహులు కౌంటింగ్ జరిగే 16వ తేదీపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. ఓటర్ల అభిష్టం ఇవిఎంల రూపంలో నిర్ధేశించిన స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఉండగా, వీటిని మూడెంచెల భద్రత కింద కాపాలా కాస్తున్న పోలీసు బలగాలు వీటి వద్ద మోహరించాయి. జిల్లాలో మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు, 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 1947 ప్రాంతాల్లో 3,614 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. 33.46లక్షల మంది ఓటర్లలో 16,70,710 పురుషులు, 16,75,688 మంది స్ర్తిలు ఓటు హక్కును కలిగి ఉన్నారు. తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 21శాతం మంది యువ ఓట్లే ఉన్నాయి.
ఇవియంలను ఎక్కువగా ఏయు ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో వివిధ గదుల్లో భద్రపరిచారు. అలాగే జ్ఞానాపురం, సీతమ్మధార, రేసదువానిపాలెం, రుషికొండ తదితర ప్రాంతాల్లో నిర్ధేశిత భవనాల్లో పోలీసు భద్రత నడుమ ఉంచారు. భీమిలి నియోజకవర్గం ఈవిఎంలు ఏయు ఇంజనీరింగ్ కాలేజీ న్యూక్లాస్ కాంప్లెక్స్, 3, 9 గదుల్లో భద్రంగా ఉన్నాయి. ఇదే ప్రదేశంలో తొలి అంతస్తు ఒకటవ నెంబర్ గదిలోను, 11వ నెంబర్ గదిలోను ఓట్ల లెక్కింపు జరుపనున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన ఓట్ల ఈవిఎంలు ఏయు ఇంజనీరింగ్ కళాశాల న్యూక్లాస్ కాంప్లెక్స్ మొదటి అంతస్తు 9, 12 గదుల్లో ఉండగా 8, 10 గదుల్లో లెక్కించనున్నారు. దక్షిణ నియోజకవర్గంలో ఓటర్ల అభీష్టం ఉన్న ఈవీఎంలు పాత జైలురోడ్డులో ప్రభుత్వ మహిళా కళాశాల మొదటి అంతస్తులోని 11, 13 గదుల్లో భద్రంగా ఉండగా, ఇదే అంతస్తులోని 7, 8 గదుల్లోను, గ్రౌండ్ ఫ్లోర్‌లోని సెమినార్ హాల్‌లో లెక్కింపు నిర్వహిస్తారు. ఉత్తర నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను ఏయూ ఇంజనీరింగ్ కళాశాల న్యూక్లాస్ రూమ్ హాల్ కాంప్లెక్స్ మొదటి అంతస్తులో 1, 5నెంబర్ల స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఉంచారు. ఇదే ప్రాంగణంలోని 2, 4 రూముల్లో ఓట్ల లెక్కింపును జరుపుతారు. పశ్చిమ నియోజకవర్గం ఈవీఎంలు జ్ఞానాపురం సోఫియా జూనియర్ కళాశాల రెండో అంతస్తులోని 11, 13 నెంబర్ల గదుల్లో భప్రరిచారు. అదే జూనియన్ కాలేజీ మూడవ అంతస్తులోని 8,9, 16,17,18 గదుల్లో ఓట్ల లెక్కింపు ఉంటుంది. గాజువాక నియోజకవర్గం ఈవీఎంలను బీహెచ్‌పివీ ఎయిడెడ్ టీఎం స్కూల్ 1,2,3,4,5,6 గదుల్లో ఉన్నాయి. ఓట్ల లెక్కింపుని ఇదే పాఠశాల మొదటి అంతస్తులో నిర్వహిస్తారు. పెందుర్తి నియోజకవర్గం ఈవీఎంలు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి అంతస్తులో మెరైన్ ఇంజనీరింగ్, షిప్ డిజైనింగ్ క్లాస్ రూమ్‌ల్లో 2/4 క్లాస్‌ల్లో భద్రపరిచారు. ఇదే ప్రాంగణంలోని మొదటి అంతస్తు డ్రాయింగ్ గది, సెమినార్ హాల్‌లో లెక్కింపు ఉంటుంది. ఇక చోడవరం నియోజకవర్గం ఈవీఎంలను ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మెయిన్ బ్లాక్ రెండవ అంతస్తు 30-6, 307 గదుల స్ట్రాంగ్ రూమ్‌ల్లోను, 302,303 గదుల్లో ఓట్ల లెక్కింపును నిర్వహిస్తారు. మాడుగుల నియోజకవర్గం ఏయు కెమికల్ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి అంతస్తులో లెక్చర్ హాల్ నెంబర్ 4,5ల్లో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపరిచారు. ఇక్కడే ఉన్న 2, 3 గదుల్లో ఓట్ల లెక్కింపు ఉంటుంది. అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి అంతస్తులోని 206, 214 నెంబర్ గదుల స్ట్రాంగ్ రూమ్‌ల్లోను ఏయు ఇంజనీరింగ్ కాలేజీ మెయిన్ క్యాంపస్ 205, 213 గదుల్లో ఓట్ల లెక్కింపును నిర్వహిస్తారు. యలమంచిలి నియోజకవర్గం ఈవీఎంలను ఏయు కెమికల్ ఇంజనీరింగ్ బ్లాక్ లేబరేటరీ గది, ఏడో నెంబర్ లెక్చర్‌హాల్‌లోను ఈవీఎంలను భద్రపరిచి ఇదే బ్లాక్‌లోని తూర్పు ప్రాంత డ్రాయింగ్ హాల్‌లు, పశ్చిమ దశ డ్రాయింగ్ హాల్ ప్రాంగణాల్లో ఓట్ల లెక్కింపు జరుపుతారు. పాయకరావుపేట నియోజకవర్గం సంబంధించి రేసపువానిపలెం వద్ద ఉన్న స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం 12, 17 గదుల్లో ఈవీఎంలను భద్రపరిచి, ఇక్కడే ఉన్న ఉత్తర, దక్షిణ దిశల్లో ప్రాంగణంలోని ఓట్ల లెక్కింపులను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నర్సీపట్నం నియోజకవర్గం ఏయూ, ఇంజనీరింగ్ కాలేజీ మొదటి అంతస్తు 202, 203 గదుల్లో ఈవీఎంలను భద్రపరిచి ఇక్కడే మొదటి అంతస్తులోని 201ఏ, 201బి గదుల్లో ఓట్ల లెక్కింపును నిర్వహిస్తారు. అరకువేలికి సంబంధించి రుషికొండ గాయత్రీ విద్యాపరిషత్ టెక్నికల్ క్యాంపస్‌లెక్చర్ హాల్, 8వ నెంబర్ లెక్చర్ హాల్‌ల్లో ఈవీఎంలను భద్రంగా ఉంచారు. ఈ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ఇదే కళాశాల డ్రాయింగ్ హాల్ 2,సెమినార్ హాల్ 709ల్లో ఉంటుంది. పాడేరు నియోజకవర్గం గాయత్రి విద్యాపరిషత్ క్లాస్ గది-1, రూమ్‌నెంబర్ 307, లెక్చర్ హాల్‌ల్లో ఈవీఎంలను భద్రపరిచి, గాయత్రి విద్యాపరిషత్ డిగ్రీ, పీజి కోర్సుల ప్రాంగణం 309 గదిలోను, టెక్నికల్ క్యాంపస్ సెమినార్ హాల్‌లో ఓట్ల లెక్కింపును జరుపుతారు. ఈవీఎంలను భద్రపరిచిన ప్రాంగణాల్లో కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, పోలీసు కమీషనర్ శివధర్‌రెడ్డి, ఎస్‌పి విక్రమ్‌సింగ్ దుగ్గల్‌ను పరిశీలించి పరిస్థితులను సమీక్షించారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఖరారు
విశాఖపట్నం, మే 8: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ నెల 16వ తేదీన వెలువడనున్నాయి. 16న జరిగే ఓట్ల లెక్కింపు కోసం విశాఖ నగరంలో తొమ్మిది కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీకి పోలైన ఓట్లను వేర్వేరుగా లెక్కిస్తారు. ఈ రెండింటి ఓట్ల లెక్కింపునకు 14 వంతున బల్లలు ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ గురవారం ఉదయం ఎన్నికల ఓట్ల లెక్కింపు అధికారులతో, రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి లెక్కింపు సరళిపై సూచనలు అందించారు. ఇప్పటివరకు జరిగిన పోలింగ్ సరళిపై సమీక్షించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు విశాఖ లోక్‌సభ పరిధిలోకి వచ్చే భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తర నియోజకవర్గ ఓట్ల లెక్కింపుకు ఏయు ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో ఉన్న న్యూ క్లాస్‌లో చేపడతారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఓట్ల లెక్కింపును పాత జైలు రోడ్డులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో చేపట్టనున్నారు. అలాగే విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు జ్ఞానాపురం సోఫియా జూనియర్ కళాశాల ఆవరణలో చేపట్టడానికి కలెక్టర్ నిర్ణయించారు. ఇక గాజువాక నియోజకవర్గం ఓట్ల లెక్కింపును బిహెచ్‌పివి తెలుగు మధ్యమం పాఠశాలలో చేపడతారు. అరకు, పాడేరు నియోజకవర్గ ఓట్ల లెక్కింపును రుషికొండ గాయత్రి విద్యా డిగ్రీ, పీజి కళాశాల భవనాల్లో చేపడతారు. అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చే చోడవరం, నర్సీపట్నం, అనకాపల్లి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును ఏయు ఇంజనీరింగ్ కళాశాల మెయిన్ బ్లాక్‌ల్లో చేపడతారు. మాడుగుల, యలమంచిలి ఓట్ల లెక్కింపు కెమికల్ ఇంజనీరింగ్ బ్లాక్‌లో జరుగుతుంది. పెందుర్తి ఓట్ల లెక్కింపు ఇంజనీరింగ్ బ్లాక్‌లో చేయడానికి కలెక్టర్ ఆదేశించారు. పాయకరావుపేట ఓట్ల లెక్కింపును స్వర్ణ్భారతి ఇండోర్ స్టేడియంలో చేపడతారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన వరకు ఈవిఎం తెరవడం కౌంటింగ్ నిర్వహించే అంశాలపై సాంకేతికంగా నిర్వహించాల్సిన జాగ్రత్తలపై రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఏ విధంగా నిర్వహించాలనే దానిపై సూచనలిచ్చారు. ఈ శిక్షణ సమావేశంలో విశాఖ పార్లమెంట్ సాధారణ పరిశీలకులు ఐఎఎస్ ఆఫీసర్ బికె టెలుక్‌ధర్, పర్‌వాజ్ అహ్మద్ సిద్ధిక్యూ, రామ్‌జెసింగ్, శ్యామ్‌లాల్‌గోయిల్, వీరేంద్రకుమార్, దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మండిపోతున్న ఎండలు
* మళ్ళీ కోతల భయం
* ముగిసిన పరీక్షలు, ఎన్నికలు
* ఆకాశం వైపు చూస్తున్న అధికారులు
విశాఖపట్నం, మే 8: ఎండలు మండుతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎపుడూ సాధారణ ఉష్ణోగ్రతలు చూపే విశాఖలో గత రెండు మాసాలుగా తీవ్రస్థాయిలోనే నమోదవుతున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గురువారం విశాఖలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనా ఎండ తీవ్రతతో మధ్యాహ్నా సమయంలో రోడ్డెక్కేందుకు సైతం నగరవాసులు భయపడుతున్నారు. ఈ సమయంలో రోడ్లున్నీ నిర్మాన్యుష్యంగా మారుతున్నాయి. ఈ నెల 25వ తేదీ నుంచి రోహిణి కర్తెలు, ఆ తరువాత అగ్నికర్తెలు వస్తే పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటుందని తెలుస్తోంది. ఒకవైపు ఎండల తీవ్రత పెరుగుతుండగా ఇక నుంచి మళ్ళీ విద్యుత్ కోతలు పెరిగే అవకాశాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మార్చి నుంచి వరుసగా పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఆ తరువాత ఇంతవరకు సార్వత్రిక ఎన్నికలతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేవు. ఇవన్నీ పూర్తికావడంతో ఇపుడు కోతలు అనివార్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యవసాయానికి ఏడు గంటల ఉచిత విద్యుత్‌ను తప్పనిసరి చేయడం, ఉత్పత్తులకు ఆటంకం కలుగకుండా పరిశ్రమల అవరాలను తీర్చడంతో పట్టణ ప్రాంతాల్లో నాలుగు గంటలు, మండల కేంద్రాల్లో ఆరు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో కనీసం పది గంటలపాటు విద్యుత్‌ను నిలిపివేస్తున్నారు. పరీక్షలు, ఎన్నికల కారణంగా ఈమధ్యకాలంలో కోతల్లేవని, అయితే మళ్ళీ ఇపుడు ఎదుర్కొన తప్పేటట్టు లేదని నగరవాసులు చెబుతున్నారు. కోతల ప్రభావం నీటి సరఫరాపై పడుతోందని, దీనివల్ల దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని మరికొంతమంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కోతల గురించి నగరవాసులు ఆందోళన చెందుతుంటే రోజువారీ డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న నేపధ్యంలో సంస్థ అధికారులు ఇపుడు ఆకాశంవైపు చూస్తున్నారు. ఎపుడు వర్షం పడుతుందా? డిమాండ్ అపుడు తగ్గుతుందని భావిస్తున్నారు.

జూన్ 2 నాటికి 2 రాష్ట్రాలు
* విభజన కమిటీ సభ్యుడు వికె.అగర్వాల్
సింహాచలం, మే 8: ఎపి రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రక్రియ చురుగ్గా సాగుతోందని జూన్ 2వ తేదీ నాటికి 2 రాష్ట్రాలు వేరు చేయడం ఖాయంగా కనిపిస్తోందని రాష్ట్ర విభజన కోసం కేంద్రం నియమించిన సీనియర్ ఐఎఎస్ అధికారుల కమిటీలో సభ్యుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ముఖ్య కార్యదర్శి వికె.అగర్వాల్ చెప్పారు. గురువారం ఆయన శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడారు. విభజనకు సంబంధించి ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క కమిటీ చొప్పున 22 కమిటీలు వేయడం జరిగిందని ఆయన చెప్పారు. కొన్ని మార్గదర్శకాలు ఇంకా పూర్తి కాలేదని కమలాకర్ కమిటీ ఢిల్లీలో సమావేశమై చర్చిస్తోందని ఆయన తెలిపారు. విభజన నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రస్తుత సెక్రటరేట్‌లో ఎ బి సి డి బ్లాక్‌లు తెలంగాణాకు, ఇ, ఎఫ్, జి, హెచ్, ఐ, జె, కె, ఎల్ బ్లాక్‌లు సీమాంధ్ర పరిపాలనకు కేటాయించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. భవనాలు, ఫైల్స్ తదితర విభజన శాఖల వారీగా జరుగుతోందని ఆయన తెలిపారు. దేదాదాయశాఖకు సంబంధించి కూడా మిగిలిన శాఖల తరహాలోనే, విభజన ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. రెండు రాష్ట్రాలకు ఇద్దరు కమిషనర్లు ఉంటారని ఏ ప్రాంతంల ఉన్న దేవాలయాలు ఆ ప్రాంతానికే చెందుతాయని ఆయన అన్నారు. ఉద్యోగుల విభజనపై ఆఫ్షన్స్ ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అంతకు ముందు ఆయన సింహాచలేశుని దర్శనం చేసుకున్నారు. దేవస్థానం ఇఓ రామచంద్రమోహన్ ఈయనకు స్వాగతం పలికారు. అంతరాలయంలో అర్చకులు ఈయన పేరున ప్రత్యేకంగా పూజలు చేశారు. గోదాదేవి సన్నిధిలో హారతులిచ్చి బేడ మండపంలో ఆశీర్వాదం చేశారు. ఇఓ ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రసాదాలు, శేషవస్త్రాలు అందించారు.

అమెరికా వేదికపై కళింగాంధ్ర కథ
* డాక్టర్ చింతకింది కథకు ఆటా ప్రథమ బహుమతి
విశాఖపట్నం, మే 8: కళింగాంధ్ర కథాసౌరభాలను ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్టు డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు అమెరికా వాకిట విరబూయించారు. తెలుగు కథ మరోసారి విశ్వవేదికపై మెరిసేలా చేశారు. ‘మేస్ట్రుబాబు మరినేరు’ పేరిట ఆయన రాసిన కథ యూఎస్ కేంద్రంగా పనిచేసే అమెరికా తెలుగు సంఘం (ఆటా) నిర్వహించిన ప్రతిష్టాత్మక సాహిత్య పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఈ ఏడాది జూలై 4, 5 తేదీల్లో అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగే ఆటా మహాసభల వేదికపై చింతకిందికి ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. ప్రసిద్ధ ఆటా జ్ఞాపిక, నూట పదహారు డాలర్ల నగదు ఆయనకు అందుతాయి. బహుమతి పొందిన కథ తమ సావనీర్‌లో ప్రచురితమవుతుందని ఆటా ప్రతినిధులు గురువారం ప్రకటనోల తెలిపారు. విఖ్యాత కథకునిగా చింతకిందిశ్రీనివాసరావుది అనితర సాధ్యమైన శైలి. ఇప్పటికే చింతకింది శ్రీనివాసరావు దక్కించుకున్న అవార్డులకు రికార్డులకు లెక్కలేదు. ఢిల్లీ తెలుగు అకాడమీ కథాపురస్కారం, యునైటెడ్‌నేషన్స్ మీడి అవార్డు, భరతముని సాహిత్య పురస్కారం సహా ఎన్నో గౌరవాలు ఆయన పొందారు. తాజాగా ఆటా బహుమతి లభించడంతో పదహారణాల దేశీయ రచన విదేశీ గడ్డపై గౌరవాన్ని దక్కించుకున్నట్టుయ్యింది. చింతకింది కీర్తికిరిటంలో కలికితురాయిగా నిలిచింది.

* గెలుపుపై కన్పించని ధీమా
english title: 
tension

కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్!

$
0
0

విజయనగరం, మే 8: కౌంటింగ్‌నకు కౌంట్‌డౌన్ మొదలైంది. మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు కేవలం 72 గంటల వ్యవధి మాత్రమే ఉండగా, పరిషత్ ఓట్ల లెక్కింపునకు 96 గంటల వ్యవధి ఉంది. ఇక సార్వత్రిక ఎన్నికల విషయానికి వస్తే..వారం రోజుల గడువు ఉండటంతో అభ్యర్థులు అంతా సర్వత్రా ఉత్కంఠకు గురవుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులు తమ ఎన్నికల ఫలితాల కోసం కాకిలెక్కలు వేసుకుంటున్నారు. ఎలాగైనా తమదే గెలుపు అంటూ ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఓట్ల లెక్కింపు కూడా రౌండ్ల వారీగా ప్రకటించనున్నారు. జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు 77 మంది అభ్యర్థులు పోటీ చేయగా, విజయనగరం లోక్‌సభకు 9 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అన్ని ప్రధాన నియోజకవర్గాల్లో నువ్వా? నేనా ? అన్న చందంగా పోటీ నెలకొనడంతో అభ్యర్థుల గుండెల్లో దడ మొదలైంది. విజయనగరం, గజపతినగరం, చీపురుపల్లి, బొబ్బిలి, నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరికి వారు ధీమాను వ్యక్తం చేస్తొన్నప్పటికీ లోలోన గుబులు చెందుతున్నారు. చీపురుపల్లిలో పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా అక్కడ గెలుపుపై ఆశ, నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. విజయనగరం అసెంబ్లీ విషయానికి వస్తే .. ఇక్కడ వైకాపా నేత కోలగట్ల వీరభద్రస్వామి తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, టిడిపి అభ్యర్థి మీసాల గీత కూడా అంతే ధీమాతో ఉన్నారు. గజపతినగరంలో తొలుత వైకాపా అభ్యర్థి కడుబండికి గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ, చివరి రోజునాటికి పరిస్థితి తారుమారైంది. కాంగ్రెస్ అభ్యర్థి అప్పలనర్సయ్యకు మొగ్గు కన్పించడంతో మిగిలిన అభ్యర్థులు అక్కడ కంగుతిన్నారు. ఇదిలా ఉండగా టిడిపి అభ్యర్థి కె.ఎ.నాయుడు కూడా తనకు సైలెంట్ ఓటు పడిందని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి అసెంబ్లీకి వైకాపా అభ్యర్థి సుజయ్‌కృష్ణ రంగారావు, టిడిపి అభ్యర్థి తెంటు లక్ష్మునాయుడు మధ్య నువ్వా? నేనా? అన్న చందంగా పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదన్నదీ అంచనాకు అంతుచిక్కడం లేదు. టిడిపి అభ్యర్థికి పట్టు ఉన్న ప్రాంతాలు కావడంతో తెంటు లక్ష్మునాయుడు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎస్.కోటలో టిడిపి అభ్యర్థి కోళ్ల లలితకుమారికి అవకాశాలు బాగున్నాయని విశే్లషకులు చెబుతున్నారు. ఈ విధంగా జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో కాకి లెక్కలతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఇక లోక్‌సభ నియోజకవర్గం విషయానికి వస్తే.. ఇక్కడ టిడిపి ఎంపీ అభ్యర్థి అశోక్‌గజపతిరాజు టిడిపి వేవ్ తనకు కలసి వస్తొందని చెబుతున్నారు. వైకాపా అభ్యర్థి బేబినాయన తనకు క్రాస్ ఓటింగ్ కలసి వస్తొందని ధీమా వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి తాను చేపట్టిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. చివరకు కూడికలు, తీసివేతలు అనంతరం ఫలితం దక్కితేచాలని అభ్యర్థులు చెబుతున్నారు.

సార్వత్రిక ఓట్ల లెక్కింపు కేంద్రాలివే!
విజయనగరం, మే 8: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. విజయనగరం లోక్‌సభ నియోజకవర్గంతోపాటు, తొమ్మిది అసెంబ్లీ స్ధానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవిఎంలను సీళ్లతో భద్రపరిచారు. విజయనగరం అసెంబ్లీకి సంబంధించి జెఎన్‌టియుకె నూతన బ్లాక్ చాంబర్ భవనం రెండో అంతస్తులో ఓట్లను లెక్కిస్తారు. బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపును స్థానిక జెఎన్‌టియు కళాశాల నూతన బ్లాక్ మొదటి అంతస్తులో తూర్పు భాగంలో పార్లమెంట్ నియోజకవర్గ ఓట్లు లెక్కిస్తారు. పశ్చిమ భాగంలో బొబ్బిలి శాసన సభ ఓట్లను లెక్కిస్తారు. గజపతినగరం అసెంబ్లీకి సంబంధించి జెఎన్‌టియుకె నూతన బ్లాక్ సెంటర్ భవనంలోని మొదటి అంతస్తులో లెక్కిస్తారు. నెల్లిమర్లకు సంబంధించి జెఎన్‌టియుకె నూతన బ్లాక్ తూర్పు వైపు రెండో అంతస్తులో లెక్కిస్తారు. పశ్చిమ భాగంలో లోక్‌సభ స్థానం ఓట్లను లెక్కిస్తారు. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ బేసిక్ సైనె్సస్ మొదటి సంవత్సరం బ్లాక్‌లో లెక్కిస్తారు. పార్వతీపురంనకు సంబంధించి అదే కళాశాలలో అకడమిక్ మొదటి అంతస్తు లైబ్రరీ హాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుంది. సాలూరు అసెంబ్లీకి సంబంధించి అకడమిక్ బ్లాక్ మొదటి అంతస్తు పశ్చిమ భాగంలో లోక్‌సభ ఓట్లను లెక్కిస్తారు. అదే కళాశాలలో రెండో అంతస్తులో అసెంబ్లీ నియోజకవర్గ ఓట్లను లెక్కిస్తారు.చీపురుపల్లి అసెంబ్లీకి సంబంధించి డెంకాడ మండలం చింతలవలస గ్రామంలోని ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కళాశాల మొదటి అంతస్తు సెమినార్ హాల్‌లో లెక్కిస్తారు. అక్కడ ఎస్.కోటకు సంబంధించి రెండో అంతస్తులో డ్రాయింగ్ హాల్లో నెం.1లో లోక్‌సభ ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. అదే కళాశాల హాలు నెం.2లో అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ఉంటుంది.
నేటి నుండి వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
పార్వతీపురం, మే 8: ఈనెల 9 నుండి స్థానిక కోవెలవీధిలోని శ్రీవేంకేటేశ్వరస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ఆలయ కార్యనిర్వహణాధికారి నాగార్జున ఏర్పాట్లు చేశారు. ఈమేరకు ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 14వ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయకమిటీ నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ ప్రధానపూజారి జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో ఈ ఉత్సవ ఏర్పాట్లు చేపట్టారు. ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించాలని ఇవో నాగార్జున కోరారు.

ఆర్థిక ఇబ్బందుల్లో
మత్స్యకారుల కుటుంబాలు
విజయనగరం (కలెక్టరేట్), మే 8: ఆంధ్రప్రదేశ్ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం సముద్రంలో చేపల వేట నిషేధం అమలు జరుగుతోంది. అయితే ఆ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. గత నెల 15 నుంచి ఈ నెల 31 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. నిబంధనలు కాదని వేటకు వెళితే సంబంధిత శాఖ అధికారులు కఠన చర్యలు తీసుకుంటారు. చేపలు గుడ్లు పెట్టి అవి పొదిగి పిల్లలుగా మారే సీజన్. ఈ నెలంతా మత్స్యకారులు ఖాళీగా ఉండాల్సీందే. జిల్లాలో పూసపాటిరేగ మండలంలోని 19 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో సమారుగా 25 వేలు కుటుంబాల్లో మత్స్యకార వృత్తిపై ఆధారపడి బతుకుతున్నారు. ప్రతి రోజు వేటుకు వేళ్లి చేపలు పట్టేవారు 11 వేల మంది ఉంటారని అధికారులు అంచనా, వీరందకీ మొత్తం 704 పడవులు పడవులు వున్నాయి. ఫైబర్ బోట్లు 175,530 సంప్రదాయ పడవులు ఉన్నాయి. వేట నిషేధం కారణంగా ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు అమలు చేయాలని ముత్స్యకారులంతా డిమాండ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. వేట నిషేధం సమయంలో ఒక్క మత్స్యకారునికి 30 కిలోల బియ్యం పొదుపు పునరావాస నిధి ద్వారా ఆర్ధికసాయం అందించాల్సి ఉంది. ప్రభుత్వం తరుపున ఆ సహాయం మత్స్యకారులకు సహాయం అందడంలేదని గంగపుత్రులు ఏటా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల్లో మెజార్టీపై నేతల దృష్టి
పాచిపెంట, మే 8: సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఎన్నికల మెజార్టీపై నేతలు దృష్టిసారించారు. మండలంలో టిడిపి, వైసిపి మధ్యే ఎన్నికల పోరు జరిగింది. తమ పార్టీకే మెజార్టీ వస్తుందని ఆయా పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బూత్‌ల వారీగా పోలైన ఓట్లు సరళిని బట్టి మెజార్టీని అంచనా వేస్తున్నారు. మండలంలో 28 పంచాయతీలకు 38 పోలింగ్ కేంద్రాల్లో 30,750 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా 24,583 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. అయితే ఏ ఏ పార్టీలకు ఎన్ని ఓట్లు వస్తాయో పంచాయతీల వారీగా అంచనా వేస్తున్నారు. టిడిపి నాయకులు అసెంబ్లీ, పార్లమెంట్ పోటీలో ఉన్న అభ్యర్థులకు మండలం నుండి 3వేల పైచిలుకు మెజార్టీ వస్తుందని భావించగా ఆ మెజార్టీ తమకే వస్తుందని వైకాపా నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాచిపెంట, విశ్వనాథపురం, కేసలి, పెద్దవలస, మాతుమూరు, గురువునాయుడుపేట, కర్రివలస, తాడూరు, మిర్తివలస పంచాయితీల నుండి అత్యధిక మెజార్టీ వస్తుందని టిడిపి నేతలు భావిస్తున్నారు. మిగతా పంచాయితీలైన కొటికిపెంట, మోదుగ, మోసూరు, పణుకువలస, కోనవలస, పద్మాపురం, కేరంగి, తుమరావిల్లి, నెలియకంచూరు, ఊటకూరు, తంగ్లాం, గరిసిగుడ్డి, కొత్తూరు, రాయిగుడ్డివలస, గుమ్మిడిగూడ పంచాయితీల్లో అత్యధిక మెజార్టీ వైకాపాకు వస్తుందని నేతలు భావిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంత పంచాయతీల్లో వైకాపాకు అత్యధిక మెజార్టీ వస్తుందంటున్నారు. టిడిపి నాయకులు మెజార్టీపై ధీమాను వ్యక్తం చేస్తున్నా మండలంలో అధిక పంచాయితీల నుండి వైకాపాకు మెజార్టీ ఉందని దీంతో అత్యధిక మెజార్టీ తమ పార్టీకే వస్తుందని వైకాపా నాయకులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల వారీగా మెజార్టీలను చూస్తే వైకాపా పార్టీకు స్పష్టమైన మెజార్టీ కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకు మండలంలో డిపాజిట్ కూడా రాదని నేతలు అనుమానిస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికి ఆయా పార్టీలు ఎన్నికల మెజార్టీ అంచనాల భవితవ్యం ఈ నెల 16న తేలనుంది.

‘జిల్లాలో ఆరు స్థానాలు వైకాపావే’
విజయనగరం, మే 8: జిల్లాలో ఆరు స్థానాలు గెల్చుకొని తీరుతామని వైకాపా నేత కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గురువారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నెల్లిమర్ల, విజయనగరం, బొబ్బిలి, సాలూరు, కురుపాం అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపా విజయకేతనం ఎగురవేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

‘జిల్లాలో మరిన్ని రక్తదాన శిబిరాలు’
విజయనగరం (్ఫర్టు), మే 8: జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆ సొసైటీ చైర్మన్ అట్టాడ హేమసుందర్ తెలిపారు. గురువారం ఇక్కడ రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయంలో ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ సొసైటీ పితామహుడు జీన్ హెన్రీ డ్యునాంట్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో హేమసుందర్ మాట్లాడుతూ జిల్లాలో సముద్ర తీర మత్స్యకార గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేశామన్నారు.
జిల్లాలో రక్తనిల్వల కొరత తీర్చడంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కీలకపాత్ర వహిస్తోందన్నారు. జిల్లాలో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధి పి.శ్రీ్ధర్, గాంధీబ్లడ్ డోనర్స్ అధ్యక్షుడు అబ్ధుల్వ్రూఫ్ తదితరులు పాల్గొన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వైద్యాధికారి డాక్టర్ ఎం.కరుణాకర్ అన్నారు. రక్తాన్ని దానం చేయడం ద్వారా మానవత్వాన్ని పెంపొందించుకోవాలన్నారు. గురువారం ఇక్కడ ఎలయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ వేసవిలో రక్తం కొరతగా ఉంటుందని, అందువల్ల స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎలయన్స్‌క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్-105 తరపున డాక్టర్ కరుణాకర్‌కు పతకాన్ని ప్రదానం చేశారు. క్లబ్ మెర్లో చైర్మన్ ఎస్‌విఎన్ గురుప్రసాద్, ఉపాధ్యక్షుడు మేకా కాశీవిశే్వశ్వరుడు, డివి రంగరాజు పాల్గొన్నారు.

ఏజెన్సీలో పెరిగిన పోలింగ్ శాతం
సాలూరు, మే 8: స్థానిక పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గంలో ఏజెన్సీ గ్రామంలో భారీ పోలింగ్ నమోదైంది. 2009 ఎన్నికల్లో 71.6శాతం పోలింగ్ కాగా, ఈ ఎన్నికల్లో 76.7శాతం నమోదైంది. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో 5 శాతం ఎక్కువ పోలింగ్ జరిగింది. ముఖ్యంగా సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల ఏజెన్సీ గ్రామాల్లో భారీ పోలింగ్ నమోదైంది. ఒకవైపు మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చినప్పటికీ ఏజెన్సీలో గిరిజనులు అధిక సంఖ్యలో ఓటును వినియోగించుకున్నారు. ఫ్రధానంగా ఆంధ్ర - ఒడిశా సరిహద్దు వివాదస్పద గ్రామాలకు ఓటర్లు 45.5శాతం మంది ఓటు వేశారు. ఎన్నికల్లో పాల్గొవాలని అధికారులు కొటియా ఓటర్లకు చైతన్యం కల్పించిన 50శాతం పోలింగ్ దాటలేదు. కొటియా, గంజాయిభద్ర పోలింగ్ కేంద్రాలను నేరెళ్లవలస సంతలో ఏర్పాటు చేశారు. కొండలపై నుండి ఓటర్లు దిగి నేరెళ్లవలసలో ఓటు వేశారు. మైదాన ప్రాంత గ్రామాల్లో కూడా పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగింది. కురుకుట్టిలో 87.8శాతం, డి.వెలగవలస 86.2శాతం, దండిగాం 68.8శాతం, తోణాం 74శాతం, మరుపల్లి 81.9శాతం, వెలగవలస 87.1శాతం, కందులపదం 84.3శాతం, పి.సామంతవలస 87.8శాతం, కొట్టుపరువు 80శాతం, జగ్గుదొరవలస 86.9శాతం, తుండ 74.2శాతం పోలింగ్ నమోదైంది. పాచిపెంట మండలంలో అధికంగా 86శాతం నమోదైంది.
మక్కువలో 75.3శాతం, మెంటాడ 78.8శాతం, సాలూరు అర్భన్, రూరల్ కలిపి 74.6శాతం మంది ఓటర్లు ఓటు వేశారు. నియోజకవర్గంలో 1,75,043మంది ఓట్లు ఉండగా 1,34,267మంది ఓట్లు వేశారు. వీరిలో పురుషులు 6 2,185, స్ర్తిలు 63,957మంది ఉన్నారు.

ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
విజయనగరం, మే 8: పోలింగ్ ముగిసింది..అభ్యర్ధులతోపాటు ఓటర్లలో కూడా సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎన్నికలు అభ్యర్థులకు గుదిబండగా మారిపోయాయి. ఈ ఎన్నికల్లో అమాత్యులు సైతం గడ్డుపరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ధన ప్రభావం గట్టిగా కన్పించింది. ప్రజాస్వామ్యంలో ఓటు పవిత్రమైందని పేర్కొన్నప్పటికీ ఓటరు మాత్రం ఆ విధంగా వ్యవహరించలేదనే చెప్పవచ్చు. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు కూడా ఖర్చుకు వెనుకాడని పరిస్థితి. ఓటరును ఎక్కువగా ప్రభావితం చేశారు. లక్షలు కుమ్మరించి ఈ ఎన్నికల బరిలో అభ్యర్థులు పోటీ పడటం సేవకు, సమర్థతకు తిలోదకాలిచ్చి ధనమే ధ్యేయంగా ప్రధాన అర్హతగా ఈ సారి ఎన్నికలు రుజువు చేశాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి పోలింగ్ ముగిసే వరకు పండుగలా సాగింది. మురికి వాడలలో ఉండేవారు, పిల్లాపాపలతో పోటీ చేసే అభ్యర్థులు ఆయా రాజకీయపార్టీల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. రాజకీయ పార్టీల నేతలు కూడా మురికి వాడలలో నివసించే పిల్లలను సమీకరించి వారంతా ఇతర పార్టీల కార్యకర్తలని, ఆ పార్టీల నుంచి తమ పార్టీలో చేరుతున్నారని ప్రచారం చేసుకోవడం విచిత్రమైన పరిస్థితి. అసలు వారంతా రాజకీయ పార్టీలతో సంబంధం లేని వారు. ఈ తరహా ఎన్నికల ప్రచారం జరగడం విశేషం. ఇది ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదు. జిల్లాలో ప్రతి చోట ఈ విధంగా జరిగినా జిల్లా కేంద్రంలో మాత్రం అవధులు దాటి సాగింది. ఇటువంటి జనాలను సమీకరించడంలో మధ్యవర్తులు ప్రధాన పాత్ర పోషించారు. వీరంతా ఆ పక్షం రోజులు ఇదే పనిలో నిమగ్నమైపోయారు. ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఇదొక దినచర్యగా మారిపోయింది. ఎన్నికల కమిషన్ నిబంధనలు అమలు పరచిన ఎన్నికల కోడ్ నిబంధనలు కొంత వరకు ప్రజలకు మేలు చేసిందనే చెప్పవచ్చు. ప్రచార వాహనాలను, మైకులను ఊదరగొట్టే సభలను చాలా వరకు ఎన్నికల కమిషన్ జిల్లా యంత్రాంగం నియంత్రించడాన్ని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సారి ఎన్నికల్లో జిల్లా ఎన్నికల అధికారి కాంతిలాల్ దండే, శాంతిభద్రతలను పర్యవేక్షించే పోలీసులు సమర్థవంతంగా పనిచేయడంతో పోటీ చేసే అభ్యర్థులు కూడా నిబంధనలకు లోబడి పనిచేయడం వల్ల ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. జిల్లాలో గల తొమ్మిది అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు నానా హైరాన పడ్డారని చెప్పవచ్చు. ఎందుకంటే మండు వేసవి ఒకటి కాగా, ఓటర్ల బెట్టుతనం మరొకటిగా చెప్పుకోవచ్చు. అన్నింటికీ మించి గత మూడు, నాలుగు నెలలుగా వరుసగా మున్సిపల్, మండల, జెడ్పీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలు వరుసగా జరగడంతో వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ యంత్రాంగం ఉరుకులు, పరుగులు తీయడం కన్పించింది. దీంతో కొందరు అసహనాన్ని ప్రదర్శించినా అధికార యంత్రాంగం మాత్రం ఎటువంటి రాజకీయ వత్తిళ్లకు, ప్రలోభాలకు లోబడకుండా వరుసగా జరిగే అన్ని ఎన్నికల్లో కూడా నిష్పాక్షికంగా వ్యవహరించడం ప్రజలకు అధికార యంత్రాంగంపై సదభిప్రాయం కలిగింది. ఈ సారి ఎన్నికల్లో ఎన్నికల నిర్వహణలో ఆరితేరిన బొత్స సత్యనారాయణ లాంటి నేతలు కూడా ఉక్కిరిబిక్కిరి అయ్యారంటే ఇటు ప్రభుత్వ యంత్రాంగం, అటు ఓటర్ల ఆలోచన చెప్పకనే చెప్పవచ్చు. తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేసే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎవ్వరూ అంచనా వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. కురుపాం మొదలుకొని ఇటు ఎస్.కోట, అటు నెల్లిమర్ల నియోజకవర్గాల వరకు అంతా ఉత్కంఠభరితంగానే ఉంది. జిల్లా ప్రజలు రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ నేతలు ఎదురుచూస్తున్న చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, నియోజకవర్గాలతోపాటు విజయనగరం పార్లమెంట్ స్థానాల ఫలితాలు ఎలా ఉంటాయోనని ఉత్కంఠభరితంగా చూస్తున్న రాష్ట్ర ప్రజానీకానికి విజయనగరం పార్లమెంట్ స్థానం, నెల్లిమర్ల నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థుల ఫలితాలను పక్కన పెడితే చీపురుపల్లి, గజపతినగరం మాత్రం సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొంది జిల్లా రాజకీయాలను వంటిచేతితో నడిపే బొత్స సత్యనారాయణ వంటి నేతకు తన నియోజకవర్గమైన చీపురుపల్లిలోనే తనకు నిద్ర పట్టని పరిస్థితి ఏర్పడింది. మాజీ పిసిసి అధ్యక్షుని హొదాలో ఆయన సీమాంధ్రలో పర్యటించాల్సి ఉండగా, కనీసం తన నియోజకవర్గం తప్ప, పక్కనున్న నియోజకవర్గంలో పర్యటించి ప్రచారం చేసే సాహసం కూడా ఆయన చేయలేని పరిస్థితి నెలకొందంటే ఈ సారి ఎన్నికలు ఎలా ఉన్నాయో ఇట్టే అర్థమైపోతుంది. మరో కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ కూడా అరకు పార్లమెంట్ స్థానానికి కాంగ్రెసు అభ్యర్థిగా బరిలో దిగి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ విధంగా జిల్లాలో అమాత్యులు సైతం గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నెల 16న వెలువడనున్న ఫలితాలపై ప్రజలు ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.

మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
విజయనగరం, మే 8: గత రెండు మూడు నెలలుగా ఎన్నికల నిర్వహణలో తలమునకలై ఉన్న అధికార యంత్రాంగం ఎన్నికలను ప్రశాంతంగా ముగియడంతో ఓట్ల లెక్కింపుపై దృష్టి సారించారు. మార్చి 30న విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మున్సిపల్ ఎన్నికలు జరిగిన విషయం విదితమే. ఏప్రిల్ 6న పార్వతీపురం డివిజన్ పరిధిలో 15 మండలాల్లోని, 11న విజయనగరం డివిజన్‌లోని 19 మండలాలకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ నెల 7న విజయనగరం లోక్‌సభ నియోజకవర్గంతోపాటు జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలైన కురుపాం, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, విజయనగరం, ఎస్.కోట అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా స్వయం పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం విజయవంతంగా ఎన్నికలు పూర్తి చేసింది. అభ్యర్థులు భవితవ్యం తేలే సమయం ఆసన్నమైంది. ఇవిఎంలు, బ్యాలట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపరిచారు. ఈ నెల 12న మున్సిపల్ ఓట్లను , 13న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్లను, 16న లోక్‌సభ, శాసనసభ ఓట్లను లెక్కించడానికి ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం విదితమే.
మున్సిపల్ ఓట్ల లెక్కింపు కేంద్రాలివే
జిల్లాలో విజయనగరం, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి మున్సిపాల్టీలకు జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వివరాలిలా ఉన్నాయి. విజయనగరం మున్సిపాల్టీకి ఇక్కడ రాజీవ్ క్రీడా మైదానంలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. పార్వతీపురంనకు సంబంధించి పార్వతీపురంలోని మున్సిపల్ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు జరుపుతారు. బొబ్బిలి మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు సంబంధించి బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో ఓట్లను లెక్కిస్తారు. సాలూరు మున్సిపల్ ఓట్లను అక్కడ మున్సిపల్ కార్యాలయంలో లెక్కించనున్నారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాలు
జిల్లాలోని విజయనగరం డివిజన్ పరిధిలోగల 19 మండలాలకు నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు విజయనగరం పట్టణంలోని మూడు కేంద్రాలను, పార్వతీపురం పట్టణంలోని మూడు కేంద్రాలను ఎంపిక చేశారు. అదే విధంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అనుభవం ఉన్న సీనియర్ అధికారులను, కౌంటింగ్ నిర్వహణ పర్యవేక్షించేందుకు అదనపు కౌంటింగ్ పరిశీలకులుగా నియమించారు. ఎస్.కోట, పూసపాటిరేగ, గుర్ల, గరివిడి, కొత్తవలస, జామి మండలాల ఓట్ల లెక్కింపును ఎంఆర్ ఆటానమస్ కళాశాలలోని విజి బ్లాక్‌లో 14 నుంచి 19 బ్లాక్‌లలో లెక్కిస్తారు. ఈ కేంద్రానికి అదనపు జాయింట్ కలెక్టర్ యుసిజి నాగేశ్వరరావు అదనపు కౌంటింగ్ పరిశీలకులుగా వ్యవహరిస్తారు. గంట్యాడ, చీపురుపల్లి, దత్తిరాజేరు మండలాల ఓట్ల లెక్కింపును ఎంఆర్ ఆటానమస్ కళాశాల 11, 12, 13 గదుల్లో లెక్కింపు జరుపుతారు. ఈ కేంద్రానికి ముఖ్య ప్రణాళిక అధికారి అదనపు కౌంటింగ్ పరిశీలకులుగా వ్యవహరిస్తారు. బోగాపురం, గజపతినగరం, మెంటాడ, బొండపల్లి, వేపాడ మండలాల ఓట్ల లెక్కింపును ఎంఆర్ మహిళా కళాశాలలో 1 నుంచి 5 గదుల్లో లెక్కిస్తారు. ఈ కేంద్రానికి ఎస్సీ కార్పొరేషన్ ఇడి అదనపు కౌంటింగ్ పరిశీలకులుగా వ్యవహరిస్తారు. విజయనగరం, నెల్లిమర్ల మండలాల ఓట్ల లెక్కింపును ఎంఆర్ మహిళా కళాశాలలో 6, 7 గదుల్లో లెక్కిస్తారు. ఈ కేంద్రానికి వయోజన విద్య శాఖ ఉపసంచాలకులు అదనపు కౌంటింగ్ పరిశీలకులుగా వ్యవహరిస్తారు. డెంకాడ, ఎల్.కోట, మెరకముడిదాం మండలాల ఓట్ల లెక్కింపును ఎంఆర్ మహిళా కళాశాలలో 8, 9, 10 గదుల్లో లెక్కిస్తారు. ఈ కేంద్రానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన జిల్లా రిజిస్ట్రార్ అదనపు కౌంటింగ్ పరిశీలకులుగా వ్యవహరిస్తారు.
ఇక పార్వతీపురం డివిజన్ పరిధిలో పార్వతీపురం, తెర్లాం, సీతానగరం, రామభద్రాపురం, కొమరాడ మండలాల ఓట్ల లెక్కింపును పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1, 2, 3, 4, 5 గదుల్లో లెక్కిస్తారు. ఈ కేంద్రానికి స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ, డిఐజి అదనపు కౌంటింగ్ పరిశీలకులుగా వ్యవహరిస్తారు. బొబ్బిలి, మక్కువ, పాచిపెంట, సాలూరు, బాడంగి మండలాల ఓట్లను పార్వతీపురం ఆర్‌సిఎం బాలికోన్నత పాఠశాలలో 6 నుంచి 10 గదుల్లో లెక్కిస్తారు. ఈ కేంద్రానికి తోటపల్లి బ్యారేజి ఎస్‌డిసి అదనపు కౌంటింగ్ పరిశీలకులుగా వ్యవహరిస్తారు. మిగిలిన జియ్యమ్మవలస, జిఎల్‌పురం, కురుపాం, బలిజపేట, గరుగుబిల్లి మండలాల ఓట్లను పార్వతీపురం ఎస్‌వి డిగ్రీ ఎయిడెడ్ కళాశాలలో 11 నుంచి 15 గదుల్లో లెక్కిస్తారు. ఈ కేంద్రానికి గిరిజన సంక్షేమ శాఖ ఎస్‌డిసి అదనపు కౌంటింగ్ పరిశీలకులుగా వ్యవహరిస్తారు.

మామిడి ఎగుమతులు ప్రారంభం
విజయనగరం, మే 8: జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు మామిడి ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున కోల్‌కత్తా, ఢిల్లీ రాష్ట్రాలకు ఈ పండ్లను ఎగుమతి చేస్తున్నారు. మామిడి సీజన్ సందర్భంగా జిల్లా నుంచి ఇప్పటి వరకు నాలుగు దఫాలుగా మామిడి పండ్లను ఎగుమతి చేశారు. ప్రతీ ఏటా జిల్లా నుంచి కోట్లాది రూపాయల విలువ చేసే మామిడి పండ్లను ఎగుమతులు చేస్తున్నారు. 2005లో అత్యధికంగా మామిడిని ఎగుమతి చేశారు. తద్వారా రైల్వేకు ఫ్రైయిట్ ఛార్జీల కింద రూ.6 కోట్లు లభించింది. ఈ నెలలో నాలుగు దఫాలుగా మామిడిని ఎగుమతి చేశారు. కాగా, ప్రతీ ఏటా మామిడి ఎగుమతుల ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతున్నప్పటికీ, మామిడి యార్డుకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలం చెందారు. మామిడి రైతులు దళారీల భారిన పడకుండా ఉండేందుకు ఇక్కడ వి.టి. అగ్రహారంలో మామిడి యార్డును ఏర్పాటు చేశారు. అక్కడ రైతులు ఉండేందుకు ఒక భవనం నిర్మించారు. తాగునీటి నివారణకు రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేశారు. రైల్వే లైన్ నిర్మించకపోవడం వల్ల రైతులు అవస్థలు పడుతున్నారు. దాదాపు రైల్వే లైన్ నిర్మించేందుకు నాలుగు కోట్ల రూపాయల మేరకు ఖర్చు కాగలదని అంచనా వేశారు. అంత మొత్తం పెట్టుబడి పెట్టేందుకు మార్కెట్ యార్డుకు ఆర్థిక స్ధోమత లేకపోవడం, రైల్వే శాఖ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇకనైనా మామిడి పండ్లను నిల్వ చేసేందుకు, ఎగుమతులు చేసేందుకు శీతల గిడ్డంగులను ఏర్పాటు చేయాలని మామిడి రైతులు కోరుతున్నారు.

స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఈవిఎంలు భద్రం!
విజయనగరం, మే 8: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇవిఎంలను పరిశీలకులు, పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో వాటిని పరిశీలించి సీళ్లు వేశారు. గురువారం వీటిని స్థానిక జెఎన్‌టియు, ఎంవిజిఆర్ కళాశాలల్లో భద్రపరిచారు. నియోజకవర్గాల వారీగా ఇవిఎంలను స్కూృట్ని చేశారు. స్థానిక జెఎన్‌టియు, ఎంవిజిఆర్ కళాశాలల్లో ఇవిఎంలను పరిశీలించిన మీదట సీళ్లు వేసి స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపరిచారు. పోలింగ్ సమయంలో జరిగిన అవాంతరాలు, ఇవిఎంలు పనిచేయకపోవడం, పోలింగ్‌పై ఫిర్యాదులు అతి తక్కువ లేదా తక్కువ శాతం పోలింగ్ జరగడం, ఎన్నికల కోడ్ ఉల్లంఘన తదితర అంశాలపై ఫారం -17 (ఎ) వివరాలను పొందుపరచి రిటర్నింగ్ అధికారులు అందజేశారు. జెఎన్‌టియులో పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఏడు నియోజకవర్గాలకు చెందిన రిటర్నింగ్ అధికారులు ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారి ధ్రువీకరించారు. హాజరైన రాజకీయ పక్షాల ప్రతినిధులను పరిశీలకులు నేరుగా పోలింగ్ తీరుపైగానీ, ఇవిఎంలపైగానీ ఎలాంటి సందేహాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అన్ని నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులందరు ఎలాంటి సందేహాలు లేవని తెలిపిన మీదట వారి సమ్మతితో ఇవిఎంలకు సీళ్లు వేశారు. అనంతరం ఎంవిజిఆర్ కళాశాలకు వెళ్లి అక్కడ భద్రపరిచిన ఇవిఎంలకు సీళ్లు వేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కాంతిలాల్ దండే, పరిశీలకులు విజయ్‌బహదూర్ సింగ్, అజయ్‌శంకర్ పాండే, పర్వేజ్ అహ్మద్, సిద్ధిక్, దినేష్ కుమార్ సింగ్, వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.

కౌంటింగ్‌నకు కౌంట్‌డౌన్ మొదలైంది. మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు
english title: 
counting

ఎవరి లెక్కలు వారివి!

$
0
0

* కూడికలు తీసివేతల్లో నేతలు
* విశే్లషకులకు అంతుపట్టని ఓటరు నాడి
కర్నూలు, మే 8 : ఎట్టకేలకూ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఆయా పార్టీల అభ్యర్థులు విజయంపై లెక్కలు కడుతున్నారు. ఇం దులో భాగంగా గత 20 రోజుల నుం చి అభ్యర్థులతో కలిసి తిరిగిన నేతలు, కార్యకర్తలు ఆయా నేతల ఇళ్లకు చేరుకుని విశే్లషించుకుంటున్నారు. ఆయా అసెంబ్లీ స్థానాల్లో జరిగిన పోలింగ్ సరళి, ఓట్ల శాతం, ఓటర్ల అభిప్రాయాలు, నాయకుల హామీలు, పార్టీల మేనిఫెస్టోలు తదితర అంశాలను పరిశీలిస్తూ ఏ పార్టీకి అనుకూలంగా పోలిం గ్ జరిగి ఉంటుందో అంచనా వేసే ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఒకింత ఓట్ల శాతం పెరగడంతో ఎవరికి లాభం చేకూరింది, ఎవరిని నష్టపర్చిందో అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి లో చతికిలబడింది. అయితే కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి ఒక్కరే ప్రస్తుతం ఒకటి, రెండు స్థానాల్లో నిలిచే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆయనకు అనుకూలంగా కర్నూలు, ఆదోని, కోడుమూరు నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎపువైపు మొగ్గారో అని చర్చ సాగుతోంది. దీంతో ఆయన విజయంపై పూర్తి స్థాయి ధీమా వ్యక్తం చేయడం లేదు. మరోవైపు టిడిపి అభ్యర్థి బిటి నాయుడు చాప కింద నీరులా దూసుకుపోయారని ఆ పార్టీ నేతలు ఆనందంలో ఉన్నారు. వైకాపా అభ్యర్థి బుట్టా రేణుకమ్మతో పాటు ముగ్గురు అభ్యర్థులు నియోజకవర్గాల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. అయితే క్రాస్ ఓటింగ్ విషయంలో మాత్రం అభ్యర్థులకే కాకుండా విశే్లషకులు కూడా అంతుపట్టని విధంగా పోలింగ్ సరళి సాగింది. మరోవైపు ఆళ్లగడ్డ ఎన్నికలూ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై కోర్టు విచారిస్తుండటంతో ఫలితాన్ని తుది నిర్ణయం వెలువడే వరకు ప్రకటించవద్దని చెప్పడంతో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఆళ్లగడ్డ ఎన్నికపై ఈసి మొదట శోభా నాగిరెడ్డికి వచ్చే ఓట్లను చెల్లనివిగా పరిగణిస్తామని ఆ తర్వాత ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నిక రద్దు చేసి ఉప ఎన్నిక నిర్వహిస్తామని చెప్పడంతో వివాదానికి తెర లేసింది. దీంతో కోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. ప్రస్తుతం ఆళ్లగడ్డలో వైకాపాకు అనుకూల పవనాలు వీశాయి. ఇక నందికొట్కూరు స్థానం విషయంలో కూడా పోలింగ్‌కు ముందు వరకు టిడిపి విజయం సాధిస్తుందని అత్యధికులు అంచనా వేశారు. అయితే కార్యకర్తలకు ఖర్చులు ఇవ్వలేదని, ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయలేదని ఆరోపణలు రావడమే కాకుండా వైకాపాకు లోపాయికారి మద్దతు ఇచ్చారని టిడిపి అభ్యర్థి లబ్బి వెంకట స్వామిపై పుకార్లు షికారు చేశాయి. దీంతో ఆయన విజయావకాశాలు దెబ్బ తిన్నాయని పలువురు భావిస్తున్నారు. అయితే అలాంటిదేమీ లేదని బైరెడ్డి వర్గం సంపూర్ణ మద్దతునిచ్చిందని విజయం ఖాయమన్న ధీమా ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. కర్నూలు, డోన్ నియోజకవర్గాల పరిస్థితి సైతం ఇదే విధంగా ఉండటంతో ఓట్ల లెక్కింపు కంటే ముందే నేతలు, విశే్లషకులు ఫలితాన్ని ఊహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అధికారులు మాత్రం పురపాలక సంఘ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేస్తూ తీరిక లేని సమయాన్ని గడుపుతున్నారు.
74.06 శాతం పోలింగ్ నమోదు
కర్నూలు, మే 8 : జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 74.06 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు గురువారం ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 30,56,867 మంది ఓటర్లు ఉండగా 22,62,977 మంది ఓటుహక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. వీరిలో మహిళలు 11,36,085, పురుషులు 11,26,841, ఇతరులు 41 మంది ఉన్నారు. కర్నూలు లోక్‌సభ పరిధిలో మొత్తం 14,81,190 మందిలో 73.66 శాతం 10,94,550 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 5,52,429 మంది, మహిళలు 5,42,119 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. నంద్యాల లోక్‌సభ పరిధిలో మొత్తం ఓటర్లు 15,75,677 మంది ఉండగా 74.48 శాతం 11,68,427 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 5,83,656, మహిళలు 5,84,732, ఇతరులు 39 మంది ఉన్నారు. నంద్యాల లోక్‌సభ పరిధిలో పురుషుల కన్నా మహిళలు ఎక్కువగా, కర్నూలు లోక్‌సభ పరిధిలో మహిళల కన్నా పురుషులు ఎక్కువ మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కాగా జిల్లావ్యాప్తంగా 2009 సార్వత్రిక ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో 3.79 శాతం మంది ఎక్కువగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ పరిధిలో 73.51 శాతం మంది ఓట్లేయగా ఈసారి 74.48 శాతం నమోదైంది. కర్నూలు లోక్‌సభ పరిధిలో గత ఎన్నికల్లో 67.04 శాతం మంది ఓట్లేయగా ఈ ఎన్నికల్లో 73.66శాతం మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. నంద్యాల లోక్‌సభ పరిధిలో కేవలం 0.97శాతం పెరుగగా కర్నూలులో 6.62శాతం పెరగడం విశేషం. గత ఎన్నికల కన్నా పోలింగ్ శాతం పెరగడంతో తమకు మేలంటే తమకంటూ రాజకీయ పార్టీ నేతలు ఎవరి లెక్కలు వేసుకుంటున్నారు. మహిళలు, రైతులు, చేనేత కార్మికుల రుణ మాఫీ కారణంగా తమ పార్టీకి మద్దతు పలికారని తెలుగుదేశం ఆశాభావంతో ఉండగా దివంగత వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాలు మరింత మెరుగ్గా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి అమలు చేస్తామన్న హామీతో తమకు పెద్ద ఎత్తున ప్రజలు అండగా నిలిచారని వైకాపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటరు మాత్రం వౌనంగా తన తీర్పును వెల్లడించారు. వారి తీర్పు ఏంటన్నది ఈ నెల 16వ తేదీన వెల్లడి కానుంది.
భద్రంగా ఓటరు తీర్పు
* కర్నూలు, నంద్యాలకు చేరిన ఈవిఎంలు
* పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
కర్నూలు, మే 8 : జిల్లావ్యాపంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఈవిఎంలు అత్యంత భద్రత నడుమ గురువారం తెల్లవారుజామున ఓట్ల లెక్కింపు కేంద్రాలకు చేరుకున్నాయి. కర్నూలు పార్లమెంటు పరిధిలోని శాసన సభా నియోజకవర్గాల ఇవిఎంలను నగర శివార్లలో ఉన్న పులయ్య ఇంజినీరింగ్ కళాశాల, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ ఇవిఎంలను పాణ్యం సమీపంలో ఉన్న శాంతిరాం మెడికల్ కళాశాల, రాజీవ్ గాంధీ ఇంజినీరింగ్ కళాశాలలో ఉంచారు. జిల్లావ్యాప్తంగా ఆయా పోలింగ్ కేంద్రాల నుంచి ఈవిఎంలు బుధవారం రాత్రి 9గంటల నుంచి లెక్కింపు కేంద్రాలకు చేరుకోవడం ప్రారంభంకాగా చివరగా సున్నిపెంటలోని పోలింగ్ కేంద్రాల నుంచి గురువారం ఉదయం 10 గంటల సమయంలో నంద్యాలకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలకు మూడంచల భద్రతను కల్పించారు. సాయుధులైన పోలీసు బలగాలు పహారా కాస్తున్నారు. లెక్కింపు కేంద్రాలను కలెక్టర్ సుదర్శన్ రెడ్డి, ఎస్పీ రఘురామ్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు తేదీ వరకు భద్రతా లోపాలు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించి అధికారులకు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. అంతేగాకుండా లెక్కింపు రోజున వచ్చే అభ్యర్థులు, ఏజెంట్లు, అధికారులు, మీడియా సిబ్బంది రావాల్సిన దారులను కూడా పరిశీలించారు. ప్రచార మాధ్యమాల ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన గదిని ఎంపిక చేసి అక్కడ ఇంటర్‌నెట్, ఫ్యాక్స్, టీవీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఓటరు తీర్పు నిక్షిప్తమైన ఈవిఎంలు ఇపుడు భద్రత నడుమ ఉండగా వాటిని ఈనెల 16న తెరిచి అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.

పకడ్బందీగా ఎంసెట్ పరీక్ష
* సమస్యాత్మక కేంద్రాల వద్ద జామర్లు : కో-కన్వీనర్ ఆంజనేయులు
కర్నూలు స్పోర్ట్స్, మే 8 : రాష్టవ్య్రాప్తంగా ఈనెల 22వ తేదీన జరిగే ఎంసెట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎంసెట్ -2014 కో-కన్వీనర్ డా.బి.ఆంజనేయులు తెలిపారు. గురువారం స్థానిక జి పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఎంసెట్ నిర్వాహణపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 3,95,405 మంది విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్ విభాగాల్లో పరీక్ష రాస్తున్నారన్నారు. ఇందులో జిల్లా నుండి 14,186 మంది రాయనున్నట్లు తెలిపారు. ఇంజినీరింగ్‌లో 8,775, మెడిసిన్‌లో 5,411 మంది పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. గతేడాదితో పోల్చుకుంటే ఈఏడాది జిల్లాలో ఇంజినీరింగ్‌లో 150 మంది తగ్గగా, మెడిసిన్‌లో 700 మంది పెరిగినట్లు తెలిపారు. మొత్తం 14 కేంద్రాల్లో జరగనున్న ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, ఆరు కేంద్రాల్లో జరగనున్న మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారాల్లో ఫొటో అంటించి గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకుని, పరీక్ష కేంద్రానికి బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్, అప్లికేషన్ ఫారంతో పాటు హాల్ టికెట్‌తో హాజరుకావాలన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రం నకలు కాపీపై గెజిటెడ్ అధికారితో తప్పక సంతకం చేయించుకుని రావాలన్నారు. విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడకుండా అన్ని చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అనుమానిత వ్యక్తుల వెంట మఫ్టీలో పోలీసు, ఇంటలిజెన్స్ సిబ్బంది నిఘా ఉంటుందన్నారు. జెఎన్‌టియూ ఆధ్వర్యంలో గత 16 ఏళ్ల నుండి ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. మెడిసిన్ పరీక్షకు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు తనిఖీ నిర్వహించి విద్యార్థులకు అనుమతిస్తారన్నారు. సెల్‌ఫొన్లు అనుమతించరాదన్నారు. అలాగే ఇన్విజిలేటర్లు సైతం తమ సెల్‌ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌కు అందజేయాలన్నారు. విద్యార్థులు తమ పేర్లు తప్పు ఉన్న వారు పరీక్ష రాసే రోజు నామినల్ రోల్స్‌లో చూసుకుని సరిదిద్దుకోవాలని సూచించారు. హాల్ టికెట్లు ఎంసెట్ వెబ్‌సైట్‌లో నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. విద్యార్థులు ఓఎంఆర్ పత్రాలు వెబ్‌సైట్‌లో ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఉంచుతామన్నారు. జూన్ 9వ తేది నాటికి ఫలితాలు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో చీఫ్ రీజనల్ కో- ఆర్డినేటర్ ఆచార్య జి.కృష్ణమోహన్ రావు, కర్నూలు రీజనల్ కో- ఆర్డినేటర్ బి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
అర్బన్ ఓటర్లలో పోలింగ్‌పై అనాసక్తి!
* గ్రామీణ ప్రాంతాల ప్రజల హుషారు
* ఓటింగ్ శాతం తగ్గడంపై అభ్యర్థుల్లో గుబులు
నంద్యాల అర్బన్, మే 8: ఎన్నికల కమీషన్, జిల్లా యంత్రాంగం, స్వచ్ఛ ంద సంస్థలు, విద్యాసంస్థలు ఓటింగ్‌పై ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా అర్బన్ ఓటర్లల్లో పోలింగ్‌పై అసక్తి తగ్గింది. దీంతో గెలుపుపై అంచనాలు తారుమారు అయినా అశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నంద్యాల అసెంబ్లీకి బుధవారం నిర్వహించిన పోలింగ్‌లో గోస్పాడు మండలం, నం ద్యాల మండల పరిధిలో పోలింగ్ శా తం 80 దాటినా పట్టణంలో మాత్రం గణననీయంగా తగ్గిపోయి 64 శాతానికి పరిమితం అయింది. నంద్యాల అసెంబ్లీ ఓటర్లకు 2,42,872 మంది ఉండగా మొత్తం మీద 69 శాతం ఓటి ంగ్ జరిగింది. గోస్పాడు మండలంలో 86 శాతం, నంద్యాల మండలంలో 84 శాతం ఓటింగ్ జరగగా, నంద్యాల అర్బన్‌లో కేవలం 64 శాతం పోలింగ్ జరిగిందంటే ఎంతవరకు అర్బన్ ఓటర్లు ఎన్నికలపై అసక్తి కలిగి ఉన్నారన్నది తెలుస్తోంది. ముఖ్యంగా అర్బన్ ఓటర్లలో మహిళలు, యువత ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ధనవంతులు, ఉన్నత కుటుంబాలు, ఉ ద్యోగస్థులు ఓటింగ్‌పై అసక్తి చూపలేదని స్పష్టం అవుతుందని, నంద్యాల పట్టణంలో ఎస్‌బిఐ కాలనీ, ఎన్‌జిఓ కాలనీ, పద్మావతీనగర్, శ్రీనివాసనగర్, సంజీవనగర్, బాలాజీ కాంప్లెక్స్ లాం టి ధనవంతులు నివశించే పోలింగ్ బూత్‌లలో భారీ క్యూలు కనబడకపోవడం, ఓటింగ్ శాతం తగ్గడానికి కారణమైందిన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. పట్టణంలోని మురికివాడలు, పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువ నివశించే ఓల్డ్ టౌన్, శివారు ప్రాంతాలలో ఓటర్లు ఉదయానే్న బారులు తీరి ఓటింగ్‌లో పాల్గొన్నారు. పై ప్రాంతా ల్లో టిడిపి, వైకాపా, కాంగ్రెస్ పార్టీలు భారీగానే ఓట్లకు నోట్లు పంచడం వల్ల ఎక్కువ శాతం మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ధనవంతులు వుండే కాలనీల్లో సహజంగానే ఏ రాజకీయ పార్టీలు కూడా డబ్బుల పంపిణీ చేయరు. దీంతో ఈ ప్రాంతాల్లో నివాసముంటున్న ఓటర్లు క్యూలో నిలబడి ఓటు వేసేందుకు ఆసక్తి చూపకపోవడం, వారికి రాజకీయ పార్టీల నుండి ప్రచారం పెద్దగా జరగకపోవడం, ఓటరు స్లిప్పులు పంచకపోవడం, తమ నివాస గృహాల నుండి దూర ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లు ఉండడం వల్ల కాలినడకన పోలేనివారు కూడా ఓటుపై నిరాసక్తంగా ఉన్నారు. పట్టణంలో పోలింగ్ రోజున ఆటోలను అనుమతించకపోవడం కూడా పోలింగ్ తగ్గేందుకు కారణంగా చూపుతున్నారు. మొత్తం మీద నంద్యాల పట్టణ ప్రాంతంలో పోలింగ్ శాతం బాగ పడిపోవడంతో గెలుపుపై ఆశలు పెట్టుకున్న వారి అంచనాలు తలకిందులయ్యే పరిస్థితి నెలకొంది. పోలింగ్ ముందు భారీ మెజార్టీతో గెలుపు సాధిస్తామనుకున్న పార్టీ పట్టణ ఓటర్ల నిరాసక్తత కారణంగా తమ లెక్కలు తారుమారు కావడంతో అభ్యర్థులు పునరాలోచనలో పడ్డారు. పోలింగ్ పూర్తి అయిన అనంతరం ఆయా పోలింగ్ బూత్‌ల నుండి తమ అనుచరగణం ద్వారా పోలింగ్ శాతాన్ని తెలుసుకుని మెజార్టీపై తర్జనభర్జనలో ఉండారు. పట్టణంలో 68 వేల ఓటు బ్యాంకు కలిగిన ముస్లిం మైనార్టీలు తమ ఓట్లను టిడిపి, వైకాపాలకు చేరిసగం వేసినట్లు సమాచారం. అలాగే బలిజ, ఆర్యవైశ్య కులాల వారి ఓట్లు ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీకి పడ్డాయని భావిస్తున్నారు. గోస్పాడు మండలంలో తెలుగుదేశం పార్టీ తమకు మెజార్టీ వస్తుందని, నంద్యాల మండలంలో వైకాపాకు మెజార్టీ వస్తుందని భావిస్తుండగా నంద్యాల అర్బన్‌లో ఏ పార్టీకి మెజార్టీకి వస్తే ఆ పార్టీ గెలుపుసాధిస్తుందని రాజకీయ విశే్లషకులు అంచనాల వేస్తున్నారు. ఏ పార్టీ అభ్యర్థి అయినా నంద్యాలలో ఐదువేల నుండి పదివేల వరకు మాత్రమే మెజార్టీ సాధిస్తారని ఏవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు టిడిపి శిబిరంలో, ఇటు వైకాపా శిబిరంలో కూడా గెలుపుపై కచ్చితమైన నిర్ణయానికి రాలేకపోతున్నట్లు అనుచరులు గుసగుసలాడుతున్నారు.
బిసి ఓడితే రాజకీయ సన్యాసం
* మాజీ ఎమ్మెల్యే చల్లా
కోవెలకుంట్ల, మే 8 : సార్వత్రిక ఎన్నికల్లో బనగానపల్లె శాసనసభ స్థానానికి పోటీ చేసిన టిడిపి అభ్యర్థి బిసి జనార్ధన్‌రెడ్డి ఓటమిపాలైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కోవెలకుంట్ల మాజీ శాసనసభ్యుడు చల్లా రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కలుగొట్ల, భీమునిపాడు గ్రామాల్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తలతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో బిసి జనార్ధన్‌రెడ్డి గెలుపుకై తనతో పాటు నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేశారన్నారు. అయినా బిసి ఓడితే అందకు తాము బాధ్యత తీసుకుని రాజకీయ సన్యాసం చేస్తానని, గెలిస్తే ఆ ఘనత నియోజకవర్గ ప్రజలదేనన్నారు. ప్రజలు సరైన వ్యక్తికి ఓటు వేసి గెలపిస్తానరన్న నమ్మకం తనకు ఉందన్నారు. అందుకే ఓట్ల లెక్కింపునకు ముందే ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే వైకాపా అభ్యర్థి కాటసాని ఓడితే కాటసాని రాజకీయ సన్యాసం స్వీకరిస్తాడా? అని సవాల్ చేశారు. అవుకు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెజారీటీ వస్తే కుటుంబ సమేతంగా రాష్ట్రం విడుస్తానన్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలోని గ్రామాల్లో ఆయన చేసి పాపకార్యాలే కనిపిస్తాయని, ఆయన వెనుక ఉన్నవారందరూ అక్రమార్కులేన్నారు. మనిషిని మనిషి చంపుకోవడం నీచమైన ప్రవృత్తిఅని ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాతే నియోజకవర్గంలో హత్యలు మొదలయ్యాయన్నారు. ఆయన చేసిన పాపకార్యలకు ప్రజలే ముగింపు తీర్పునిస్తారన్నారు. కార్యక్రమంలో భీమునిపాడు సుంకిరెడ్డి, సురేంర్రనాధరెడ్డి, సురేష్‌రెడ్డి, ప్రతాపరెడ్డి, కలుగొట్ల రామేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
11 నుండి అటవీ శాఖలో
ఉద్యోగాలకు పరీక్షలు
* ఏర్పాట్లు పూర్తి : డిఎఫ్‌వో చక్రపాణి
కర్నూలు స్పోర్ట్స్, మే 8 : జెఎన్‌టియూహెచ్ ఆధ్వర్యంలో అటవీ శాఖ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఈనెల 11వ తేదీ నుండి ఎఫ్‌డిఆర్‌టి-2014 పరీక్ష జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు సోషల్ ఫారెస్ట్రీ డిఎఫ్‌వో చక్రపాణి తెలిపారు. గురువారం స్థానిక జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 11న అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, 12న బంగ్లా వాచర్స్, 13న ధండర్, 14న టెక్నికల్ అసిస్టెంట్, 18న ఫారెస్టు బీట్ ఆఫీసర్, 25న ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లా నుండి 12 కేంద్రాల్లో జరిగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్‌కు 6,775, బంగ్లా వచర్స్‌కు 278, ధండర్‌కు 350, టెక్నికల్ అసిస్టెంట్‌కు 243, ఫారెస్టు బీట్ ఆఫీసర్‌కు 8,766, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్‌కు 1,697 మంది అభ్యర్థులు పరీక్ష రానున్నట్లు తెలిపారు. టెక్నికల్ అసిస్టెంట్‌కు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందన్నారు. మిగితా అన్ని పోస్టులకు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మూడు పేపర్లకు పరీక్ష జరుగుతాయన్నారు. అభ్యర్థులు ఎపిఎఫ్‌డిఆర్‌టి.ఓఆర్‌జి వెబ్‌సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్‌తో పాటు హాల్ టికెట్‌తో హాజరు కావాలన్నారు. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ యంత్రాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి లేదన్నారు. అభ్యర్థులు పరీక్ష రాసిన తర్వాత ప్రశ్న పత్రాల బుక్‌లెట్, ఓఎంఆర్ షీటు, సమాధాన పత్రాలను ఇన్విజిలేటర్‌కు అందజేయాలన్నారు. వేసవి అయినందున అభ్యర్థులు వాటర్ బాటిల్ తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో డిఎఫ్‌వో ఫ్లైయింగ్ స్క్వాడ్ చంద్రశేఖర్, రీజనల్ కో- ఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి, రేంజ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
నగరంలో వాన
* ప్రజలకు ఉపశమనం
* జలమయమైన రోడ్లు
కర్నూలు ఓల్డ్‌సిటి, మే 8 : నగరంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజుల నుండి ఎండ వేడిమికి తట్టుకొలేక ఉక్కపోతకు అల్లాడేవారు. దాదాపు 40 డిగ్రీలకు పైగా ఎండ ఉండేంది. ఈ నేపథ్యంలో గురువారం అల్పపీడన ద్రోణి వల్ల నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో నగర ప్రజలు ఉక్కపోత నుండి ఉపశమనం పొందారు. వాతావరణ శాఖ మరో 48 గంటల పాటు వర్షం జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. గతేడాది కంటే ఈ ఎడాది ఎండవేడిమి ఎక్కువగా ఉండటంతో కొన్ని చోట్ల ప్రజలు వడదెబ్బ తగిలి ప్రాణాలు సైతం పొగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. నగరంలోని పాతబస్టాండ్, రాజవిహార్ సెంటర్, రైల్వేస్టేషన్ రోడ్డు, ఆనంద్ టాకీసు, కొత్తబస్టాండ్, వ్యవసాయ మార్కెట్ యార్డు, అశోక్ నగర్ రైల్వే వంతేన, వెంకటరమణ కాలనీ, కృష్ణానగర్, సి.క్యాంపు, పాతబస్తీలోని వన్‌టౌన్ తదితర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు వర్షం నీటితో జలమయం ఆయ్యాయి. అలాగే వర్షంతోపాటు డ్రైనైజీ నీరు రోడ్లపై ప్రవహించడం వల్ల పాదచారులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇక రోడ్డుకిరువైలా ఉన్న చిన్న వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారుల పచ్చి సరుకు తడిసిపోయింది. దీంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక పాతబస్తీలోని చిత్తారివీధి, కుమ్మరివీధి, జమ్మిచెట్టు, పెద్దపడఖాన, నేతాజీ నగర్, బేకార్‌కట్ట, పూలబజారు, బండిమెట్ట, ఛత్రిబాగ్ తదితర లోతట్టు ప్రాంతాల్లో మురుగు నీరు రోడ్లపై ప్రవహించడం వల్ల పాదాచారులు, వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది.

* కూడికలు తీసివేతల్లో నేతలు * విశే్లషకులకు అంతుపట్టని ఓటరు నాడి
english title: 
v

ఎవరి ఆశలు వారివే..

$
0
0

శ్రీకాకుళం, మే 8: పూర్వకాలంలో మొదట ఎన్నికలు జరిపించి తర్వాత ఫలితాల కోసం ఎదురుచూసేవారు. ఇప్పుడేమో ఒపీనియన్ పోల్స్ ‘మాయాదర్పణం’లో ముందు ఫలితాలు చూసుకుని ఆ తర్వాత పోటీలోకి దిగుతున్నారు. ప్రపంచం ఎంతో ముందుకు పోని పాతరోజుల్లో సార్వత్రిక ఎన్నికలను రెండోమూడో రోజుల్లో నిర్వహించి, వారం తిరక్కుండా ఓట్లు లెక్కపెట్టి ఫలితాలను డిక్లేర్ చేయగలిగేవారు. ఎలక్ట్రానిక్ ఓటింగులూ, హైటెక్ హంగులు తదితర వాటితో అద్భుతంగా అమరిన ఈ అత్యాధునిక కాలంలో మాత్రం పోలింగ్ జరిగిన పది రోజులు కనీస వ్యవధి లేకపోతేగాని ఓట్ల లెక్కింపునకు దిక్కులేదు. నత్తనడకల ఎన్నికల కమిషను వారి ముహూర్తం ప్రకారం పుణ్యకాలం వచ్చేదాకా నరాలు చిట్లే సస్పెన్స్ భరించలేని నేతలకేమో ఎగ్జిట్ పోలయ్యల ‘ముందస్తు’ ఫలితాలు మతులు పోగొడుతున్నాయి. ఎగ్జిట్‌పోల్ అనేది ఓటు వేసి బయటికొస్తున్న ఓ పదిమందిని పోలింగ్ బూతు దగ్గరే పట్టుకుని ఎవరికి ఓటేశావు అని అడిగి, వారి దివ్యదృష్టితో మిగతా నియోజకవర్గాల్లో ఇలాగే ఉంటుందని తీర్మానించి..గుణకారాల కాకిలెక్కలతో రాజకీయ నేతలు రిపోర్టు తెప్పించుకుంటురు. మిగతా జిల్లాల్లో ఏమోకాని శ్రీకాకుళంలో మాత్రం ఇది కుదిరే పనికాదు. ఎందుకంటే - ఆరాలు తీసే పోలయ్యలకంటే ఇక్కడ చైతన్యవంతమైన సగటు ఓటరయ్య ఎక్కువ తెలివిగలవాడు. అతడు ఎటు ఓటేశాడో ముందురోజు అతణ్ని పూటుగా తాగించి, దక్షిణ కూడా ఇచ్చిన రాజకీయ పార్టీలవాళ్లే పోల్చుకోలేక జుట్లు పీక్కుంటారు.
అటువంటి ఎగ్జిట్‌పోల్‌తో బుధవారం జరిగిన జిల్లా ఎన్నికల్లో రాజకీయ ఉద్దండులు కూడా హాడలెత్తిపోతున్నారు. దీనంతటికీ ముందస్తు మైకంలో కొట్టుమిట్టాడమేనంటూ రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు. జిల్లాలో హోరాహోరీగా టిడీపీ - వైకాపా పోటీపడిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలకు పదింట ఎన్ని అసెంబ్లీ స్థానాలు కైవశం చేసుకుంటాయన్న అంచనాలపై ఓటరు ‘సాక్షి’గా ఆరు స్థానాలు వైకాపా ఖాతాలో జమ చేసుకుంటాయన్న పుకార్లు ప్రారంభించారు. అలాగే, టిడీపీ కూడా పోలింగ్ సరళిని అంచనాలు వేసి ఐదు స్థానాలు దక్కుతాయని ముందస్తు ప్రకటన చేస్తుంటే....ఇ.వి.ఎం.లలో నేతల భవితవ్యం మాత్రం భద్రంగా ఉంది. ఈ నెల 16వ తేదీ వరకూ ఊపిరి సలపకుండా నేతలను ఉక్కిరిబిక్కిరి చేసే ఎగ్జిట్‌పోల్ మాత్రం శ్రీకాకుళం జిల్లా వరకూ వర్క్‌అవుట్ ఎప్పుడూ కాలేదు. ముందస్తు ఫలితాలు ముప్పతిప్పలుపెట్టేలా తారుమారయ్యే పరిస్థితులు సిక్కోల్ రాజకీయాల్లో ఎన్నోసార్లు కన్పించాయి. అందుకే - అండర్ కరెంట్ రాజకీయాలు నెరిపిన ఉద్దండులంతా ఫలితాలపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఫ్యాన్ గాలి అనుకుంతగా సిక్కోల్‌లో లేకపోవడం, వ్యవస్థాపక నేతలను జగన్మోహన్‌రెడ్డి క్రమశిక్షణలో పెట్టకపోవడం వల్ల జిల్లాఅంతటా రె‘బెల్స్’ బాగా పనిచేయడంతో వైకాపా అభ్యర్ధులకు నష్టం వాటిల్లింది. అటువంటి నష్టం వాటిల్లిన నియోజకవర్గాలైన ఇచ్చాపురంలో ఎం.వి.కృష్ణారావు, నర్తు నరేంద్రయాదవ్, పలాసలో కణితి విశ్వనాధం, టెక్కలి కోత మురళీధర్, రాజాంలో పి.ఎం.జె.బాబు, శ్రీకాకుళం వరుదు కళ్యాణి, ఆమదాలవలస నియోజకవర్గంలో బొడ్డేపల్లి మాధురి, కిల్లి రామ్మోహన్ వంటి ఓటుబ్యాంకు ఉన్న నేతలను జగన్ బుజ్జగించే పని చేయలేకపోయారు. అటువంటి ఓటుబ్యాంకు పోలింగ్ తర్వాత ఎగ్జిట్‌పోల్‌లో అనుకూలంగా ఉందని చెబుతుంటే రాజకీయ విశే్లషకులు ముక్కునవేలు వేసుకుంటున్నారు. పోలింగ్ సరళిని అంచనాలు వేయడంలో తలమునకైలన అభ్యర్థులు ఎవరికివారే గెలుస్తామన్న ధీమాల్లో ఉన్నప్పటికీ, జిల్లాఅంతటా సైకిల్ స్పీడ్‌గా ఉందన్న వౌత్‌కాన్వసింగ్ మాత్రం టిడీపీ ఇతర పార్టీల అభ్యర్ధులను వణికిస్తుంది. కాని - వైఎస్సార్‌కాంగ్రెస్ ఊపు మాత్రం సైలెంట్‌గా ఉందన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, సమైక్యాంధ్ర పార్టీల ఊసే వినిపించడం లేదు. ఏదిఏమైనప్పటికీ, సర్వేల మైకంలో టిడీపీ - వైకాపా మాత్రం మునిగితేలాడుతున్నాయి!

కాయ్ రాజా.. కాయ్!
* రూ. కోట్లలో పందేలు
* గెలుపు గుర్రాలపై ఆశలు
* ధర్మాన గెలుపుపై బెట్టింగ్‌లు
శ్రీకాకుళం, మే 8: సార్వత్రిక సంగ్రామం ప్రశాంతంగా ముగియడంతో ఇటు అధికారులు, అటు రాజకీయ పార్టీలు ఊపిరిపీల్చుకున్నారు. ఓటర్లు మాత్రం గుంభనంగా వ్యవహరించడంతో విజయావకాశాలపై ఎవరి ధీమాను వారు వ్యక్తంచేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు అనుచరగణాల నుంచి సామాన్య కార్యకర్తల వరకు కూడికలు, తీసివేతల్లో బిజిబిజీగా ఉన్నారు. అలాగే, ఎన్నికల ఖర్చులు ఖాతాలు సైతం లెక్కలు చూసుకుంటున్నారు. కాలం వెళ్లబుచ్చుతున్నారు. కౌంటింగ్‌కు కేవలం ఆరు రోజులే గడువు ఉండటంతో బెట్టింగ్ రాయుళ్లు కూడా కాయ్ రాజా..కాయ్ అంటూ రంగప్రవేశం చేయడం అసెంబ్లీ, పార్లమెంట్ ఫలితాలపై మరింత ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్‌లో పాతబస్తీ మాదిరిగా శివారుగా ఉన్న సిక్కోలుకు కూడా క్రికెట్ బెట్టింగ్..బుకీలు సంస్కృతిలో అపారమైన అనుభవమున్న విషయం తెలిసిందే. ఇదే ఫార్ములాకు కొంతమంది వ్యాపారులు మూలాలుగా మారడంతో బెట్టింగ్ రోజురోజుకూ ఊపందుకుంటుంది. ముఖ్యంగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైకాపా తరపున బరిలో దిగిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విజయావకాశాలపై జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కాయ్ రాజా కాయ్ అంటూ కోటికిపైగా పందాలు సాగుతున్నాయని జోరుగా ప్రచారం ఊపందుకుంది. జిల్లా అంతటా ఆరు కోట్ల రూపాయల వరకూ బెట్టింగ్‌లు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. సైకిల్ హవా ఉందంటూ కొంతమంది పందెంరాయుళ్లు ముందడుగు వేయగా..లేదు..లేదు, ఫ్యానే స్పీడ్‌గా ఉందంటూ గెలుపుగుర్రాలపై మరిన్ని ఆశలు పెంచుకుంటున్నారు. ఇలా జిల్లా కేంద్రం నుంచి రచ్చబండల వరకు పందెంరాయుళ్లు రంగంలో దిగడంతో హాట్..హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికలు కావడంతో అనేక మంది సీనియర్లకు కూడా ఇవి ఆఖరి ఎన్నిలుగా మారుతాయంటూ పందెం రాయుళ్లు బెట్టింగ్‌లకు తెరలేపుతున్నట్లు తెలిసింది. మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, కిమిడి కళావెంకట్రావు, గౌతు శ్యామ్‌సుందర్‌శివాజీ, శత్రుచర్ల విజయరామరాజు, కింజరాపు అచ్చెన్నాయుడు వంటి నియోజకవర్గాల్లో ఉత్కంఠ భరితంగా పోలింగ్ సాగడంతో ఈ స్థానాలపై బెట్టింగ్ ఊపందుకుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిని సొమ్ము చేసుకునేందుకు పాన్‌షాపు వ్యాపారుల నుండి బులియన్ వ్యాపారుల వరకు బుకీల ప్రమేయం లేకుండానే ఎవరికి వారుగా పందెంరాయుళ్లుగా అవతారమెత్తుతున్నారు. అన్నదాతలైతే అమాంతంగా సాగు చేసే భూములు, ఇళ్ల స్థలాలు సైతం బెట్టింగ్‌లకు పణంగా పెడుతున్నట్లు గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణం మరింత వేడెక్కింది. జిల్లాకేంద్రంలో ఉన్న అనేక స్టార్ హోటళ్లలో నిత్యం సందడి చేసే పేకాటరాయుళ్లు కార్డులు పక్కనపెట్టేసి ఎన్నికల ఫలితాలపై కాయ్ రాజ్ కాయ్ అంటూ కరెన్సీ కట్టలు రంగంలో దింపి ఆస్వాదిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీల వీరాభిమానులు మాత్రం వారి వారి అభ్యర్థులు గెలుపోటములపై పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల సరళిని పసిగడుతూ ఫిర్కాలు, ప్రాంతాల్లో ఫ్యాన్ స్పీడ్‌ను, సైకిల్‌జోరుపై అంకెలగారడితో రంకెలేసి బెట్టింగ్ రాయుళ్లకు మరింత ఊతమందిస్తున్నారు.
కట్ చేస్తే...
పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున బరిలో దిగిన కింజరాపు వారసుడు గెలుస్తాడని రైస్‌మిల్లర్లు, పెట్రోల్ బంకు యజమానులు, జీడిపరిశ్రమ అధినేతలు సైతం కాయ్..రాజా కాయ్ అంటూ సవాళ్లు విసురుతున్నట్లు తెలిసింది. కాదు, కాదు వైకాపా అభ్యర్థి రెడ్డి శాంతికే సైలెంట్ ఓటు పనిచేసిందంటూ మరికొంతమంది వ్యాపారులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఆ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపేలా బెట్టింగ్ సవాల్ విసురుతున్నట్లు సమాచారం. దీనికి తోడు అధిక నియోజకవర్గాలు టిడిపి ఖాతాలో జమ అవుతాయంటూ మరికొంతమంది, లేదు..లేదు వైకాపాయే సొంతం చేసుకుంటుందని ఇంకొందరు బెట్టింగ్‌లకు దిగి సొమ్ము చేసుకొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ వాసన పసిగట్టిన పోలీసు బాస్ కూడా మరింత నిఘా పెట్టి జిల్లా అంతటా రాజకీయ బుకీల కదిలకలపై జల్లెడపడుతున్నట్లు ఆ శాఖ సిబ్బందే ప్రైవేట్ సంభాషణలలో అంగీకరిస్తున్నారు.

అల్లాడిస్తున్న భానుడు
శ్రీకాకుళం, మే 8: ఎన్నికల వేడిలో ఎండ తీవ్రతపై జనం పట్టించుకోలేదు. పోలింగ్ ముగియడం, దైనందిక జీవనంలో ప్రజలు రావడంతో సూర్య ప్రతాపానికి వామ్మో అంటూ అల్లాడుతున్నారు. రోజురోజుకూ ఎండలు పెరుగుతుండటంతో రహదారుల పైకి రావడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెల 15వ తేదీ నుండి ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో వ్యాపారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. బుధ, గురువారాల్లో ఎండతీవ్రత మరీ అధికంగా ఉండటంతో జనం అల్లాడి పోయారు. భానుడి భగభగలతో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ముఖ్యంగా ఉక్కపోతను జనం భరించలేకపోతున్నారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు కొబ్బరిబొండాలు, జ్యూస్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. మూడు రోజుల కిందట జిల్లాలో వర్షం కురవడంతో నాగావళి నదిలో నీటిప్రవాహం కనిపించింది. అంతకుముందు పూర్తిగా నాగావళి ఎండిపోయి పట్టణ వాసులు విడిచిపెట్టే మురుగునీరు మాత్రమే ప్రవహించేది. ఇప్పట్నుంచే తాగునీటి ఇబ్బందులు కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఎండల తీవ్రత ఇలానే కొనసాగితే తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తోందని పట్టణ వాసులు పేర్కొంటున్నారు. గత నెలలో 20, 21, 22, 23, 25వ తేదీల్లో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. 39.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. గురువారం కూడా 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడంతో రోడ్లన్నీ నిర్మాణుష్యంగా కనిపించాయి.

ప్రమాదమా..ఆత్మహత్యా!
శ్రీకాకుళం, మే 8: ఎన్నికల విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరే సమయం వచ్చింది...ఇంతలో ఇక్కడ ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో రివాల్వర్‌తో పేల్చుకొని చత్తీస్‌ఘడ్‌కు చెందిన దినేష్‌కుమార్ ధృవ్(28) అనే బిఎస్‌ఎఫ్ జవాన్ మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల బందోబస్తు నిమిత్తం ఇతర రాష్ట్రాలకు చెందిన బిఎస్‌ఎఫ్, ఆర్మ్‌డ్ రిజర్వు దళాలు రెండు రోజుల ముందుగా జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. అందులో బిఎస్‌ఎఫ్ జవాన్లను ఇ.వి.ఎం.ల భద్రతకు కేటాయించగా, ఆర్మ్‌డ్ రిజర్వు దళాలను ఎన్నికల సక్రమ నిర్వహణకు ఉపయోగించిన విషయం విధితమే. అయితే ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఆర్మ్‌డ్ రిజర్వు దళాలు గురువారం సాయంత్రం వారివారి రాష్ట్రాలకు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. ఇదిలా ఉంటే గురువారం మధ్యాహ్నం ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో బస ఏర్పాటు చేసిన చత్తీస్‌ఘడ్‌కు చెందిన ఆర్మ్‌డ్ రిజర్వు దళం నుండి దినేష్ అనే వ్యక్తి రివాల్వర్‌తో పేల్చుకొని మృతిచెందడం చర్చనీయాంశమైంది. కళాశాల భవనంలోని మూడు గదుల్లో మొత్తం 70 మంది జవాన్లకు బస ఏర్పాటు చేశారు. దినేష్ మృతిచెందిన గదిలో 28 మంది జవాన్లు ఉంటున్నారు. ఇద్దరి జవాన్లమధ్య గురువారం మధ్యాహ్నం ఘర్షణ చోటుచేసుకుందని, ఇందులో భాగంగానే దినేష్ మృతిచెందినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. దినేష్ రివాల్వర్‌ను క్లీన్ చేస్తుండగా మిస్‌ఫైర్ అయిందని మరో ప్రచారం కూడా జరుగుతోంది. అయితే పక్కగదిలో తాము ఉండగా, హఠాత్తుగా దినేష్ గదినుండి పెద్ద శభ్దం రావడంతో వెళ్లి చూడగా రక్తపు మడుగులో దినేష్ ఉన్నాడని తోటి జవాన్‌లు చెబుతున్నారు. సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, అంబులెన్సు ద్వారా మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించామంటున్నారు. ఏదేమైనా పూర్తి సమాచారం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల పొరుగు రాష్ట్రాలనుండి, పక్క జిల్లా నుండి వచ్చిన జవాన్లకు తరచూ ప్రమాదాలు సంభవించడం పెద్ద చర్చగా మారింది. ఇటీవల స్థానిక ఎన్నికల నేపథ్యంలో పక్క జిల్లాకు చెందిన హోంగార్డుకు జిల్లా పరిషత్ వద్ద పాము కాటువేయడం తెలిసిందే. అయితే వెంటనే స్పందించిన తోటివారు ఆయనను రిమ్స్‌కు తీసుకువెళ్లడంతో గండం గడిచింది.

టిడిపి గూటికి పిఎంజె బాబు
శ్రీకాకుళం, మే 8: విశ్రాంత ఆర్డీఒ, వైకాపా రెబల్ అభ్యర్థిగా రాజాం నియోజకవర్గం నుండి అసెంబ్లీ బరిలో దిగిన పి.ఎం.జె.బాబు తెలుగుదేశం పార్టీ గూటికి గురువారం చేరారు. జిల్లాలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నుంచి ఆర్డీఒ వరకు పదోన్నతి పొందిన పి.ఎం.జె.బాబు అన్ని ప్రాంతాల్లో సమర్ధవంతంగా విధులు నిర్వహించి అటు అధికారులు, ఇటు ప్రజల్లో మంచిపేరు సంపాదించుకున్నారు. దివంగత వై.ఎస్. ఆహ్వానాన్ని అందుకుని కాంగ్రెస్ పార్టీలో చేరి రాజాం అసెంబ్లీ టిక్కెట్‌ను 2009లో ఆశించినప్పటికీ ఆ స్థానాన్ని మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌కు కేటాయించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అదే నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు సాగిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశారు. ఇంతలో జగన్మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడంతో ఆ పార్టీ వైపు పి.ఎం.జె.బాబు అడుగులు వేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు మరింత కృషి చేసి బి-్ఫరంపై ఆశలు పెంచుకున్నారు. పి.ఎం.జె.బాబు సేవలను గుర్తిస్తూ వైసీపీ అధిష్టానం ఆ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను కూడా అప్పగించింది. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే కంబాళ్ల జోగులు వైకాపా తీర్ధం పుచ్చుకుని రాజాం బి-్ఫరాన్ని దక్కించుకోవడంతో పి.ఎం.జె.బాబు మరోసారి భంగపడాల్సి వచ్చింది. ఈ అవమానాన్ని భరించలేక రెబల్ అభ్యర్థిగా పి.ఎం.జె.బాబు బరిలో దిగి వైకాపా ఓటమే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడకముందే పి.ఎం.జె.బాబు సైకిలెక్కడంపై ప్రతిభా భారతి గెలుపునకు పరోక్షంగా సహాయ సహకారాలు అందించారన్న పుకార్లు వాస్తవరూపం దాల్చాయి.

రైళ్ల ఆలస్యంతో ప్రయాణికుల పాట్లు
జలుమూరు, మే 8: రైళ్ల రాకపోకల్లో ఆలస్యం జరుగడంతో మండలం తిలారు రైల్వేస్టేషన్‌లో ప్రయాణీకులు ఇక్కట్లు పడ్డారు. పలాస నుంచి విశాఖ వెళ్లే డి.ఎం.యు ఉదయం ఆరుగంటలకు రావలసి ఉండగా రెండు గంటలు ఆలస్యమైంది. సికింద్రాబాద్ నుండి భువనేశ్వర్ వెళ్లిన విశాఖ ఎక్స్‌ప్రెస్ రెండుగంటలు ఆలస్యంగా రావడంతో ప్రయాణీకులు అవస్థలు పడాల్సివచ్చింది. పలాస నుంచి శ్రీకాకుళం రోడ్ వరకు రైలుమార్గాన్ని మరమ్మతులు చేపడుతున్నందున రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ కారణంగా హాల్ట్‌లేని ప్రశాంతి, గౌహతి తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లు తిలారు స్టేషన్‌లో కొద్దిసేపు ఆగడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి
*ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీ ఆందోళనకరం
*స్వామి శ్రీనివాసానంద సరస్వతి
శ్రీకాకుళం, మే 8: రాజకీయ పక్షాలు ప్రజాస్వామిక విలువలను కాపాడాలని భారత స్వాభిమాన్ ట్రస్టు అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతీ కోరారు. సిటిజన్ ఫోరం కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు తరలిస్తున్న మద్యం, డబ్బును అధికారులు పట్టుకున్నారని, దేశంలో పట్టుకున్న మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌దే మొదటి స్థానంలో ఉండటం విచారకరమన్నారు. ఆ ఈ విష సంస్కృతిని రానున్న ఎన్నికల్లో చెరిపేయాలని కోరారు. ఎన్నికలు సక్రమంగా నిర్వర్తించినందుకు ఎస్పీ, కలెక్టర్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రిటైర్డ్ జిల్లా జడ్జి పప్పల జగన్నాధరావు మాట్లాడుతూ అధికారుల అప్రమత్తతతోనే ఎన్నికలు విజయవంతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగాయన్నారు. సిటిజన్‌ఫోరం అధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు మాట్లాడుతూ ఓటింగ్ శాతం పెరుగడమే ఓటర్ల చైతన్యానికి నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో టిడిపి నాయకుడు ఎస్.వి.రమణమాదిగ, ఎన్ని ధనుంజయ్‌రావు మాట్లాడారు. బిజెపి పట్టణ అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వరరావు, ఎ.వి.టిఅప్పారావు, యోగాగురు రామారావు, జి.సంజీవ్‌కుమార్, చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.

అందరి చూపు పదహారు వైపే..
నరసన్నపేట, మే 8: ఈ నెల 16వ తేదీన పార్లమెంట్, శాసనసభ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్‌ను నిర్వహిస్తున్న సందర్భంలో అభ్యర్థుల్లో బేజారు నెలకొంది. గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. అత్యధిక మెజారిటీ తమకు ఖాయమంటూ అభ్యర్థులు బాహాటంగానే చెప్పుకోవడం కనిపించింది. ఇక్కడి నియోజకవర్గంలో తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీల మధ్యనే తీవ్రమైన పోటీ నెలకొంది. గెలుపు ఈ రెండు పార్టీలకే సాధ్యమంటూ ఇప్పటికే తేటతెల్లమైంది. అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డోల జగన్, జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిని శిమ్మ ఉషారాణి, బి.ఎస్.పి అభ్యర్థి ఎం.సూర్యం, ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థి పైడి రవికుమార్, స్వతంత్ర అభ్యర్థి త్రివేశ్వరరావులు ఎన్నికల్లో గెలవలేకపోయినా ప్రజల్లో ఆయా పార్టీలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేశామని సర్దుకుపోతున్నారు. అయితే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ 10 నుంచి 15 వేల ఓట్ల మెజారిటీతో తప్పనిసరిగా గెలుపొందడం ఖాయమంటూ జోస్యం చెప్పారు. అలాగే టిడిపి అభ్యర్థి బగ్గు రమణమూర్తి ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు, ఆదరణ పూర్తిస్థాయిలో వచ్చాయని, ఈ ఎన్నికల్లో 20 వేల మెజారిటీతో గెలవడం ఖాయమంటూ ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా వైకాపా, తెదేపా వర్గాల మధ్య జోరుగా పందాలు నడుస్తున్నాయి. ఈ పందాల్లో లక్షల రూపాయలు చలామణి అవుతున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీరు బయటపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పోలీసు సిబ్బంది, అధికారులు గాని కనిపెట్టే పరిస్థితి లేకుండాపోయింది. గడిచిన ఎన్నికల్లో ఇంత ఉత్కంఠ పరిస్థితి ఎనాడూ లేదని, ఈ ఎన్నికల్లో మాత్రం ఎవరు గెలుస్తారన్న దానిపై స్పష్టంగా చెప్పలేమంటూ రాజకీయ విశే్లషకులు చెప్పకనే చెబుతున్నారు.

నేటి నుండి శ్రీవారి కల్యాణమహోత్సవాలు
శ్రీకాకుళం, మే 8: పట్టణంలో గుజరాతీపేట నారాయణ తిరుమల వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం నుంచి శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త జస్టిస్ యతిరాజులు, ఆలయ ఇ.ఒ మాధవరావులు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం ఐదు గంటలకు విశేష కార్యక్రమాలు జరుగుతాయి. శనివారం ఉదయం నాలుగు గంటలకు సహస్త్ర తులసీ దళార్చన, శ్రీవారి వజ్రకవచన దర్శనం ఉంటుందని, సాయంత్రం భూనీళా సమేత వెంకటేశ్వరస్వామి వారి తిరుకల్యాణ ఉత్సవం నిర్వహిస్తారన్నారు. ఈ నెల 11న ఉదయం ఆరాధన మహోత్సవం సాయంత్రం గరుడ వాహనసేవ, తిరువీధి వేడుక జరుగుతుందన్నారు. సోమవారం సాయంత్రం ఊయలసేవ, మంగళవారం సాయంత్రం అమ్మవారి ఆరాధన, బుధవారం చుర్ణోత్సవం, అవబ్బధ స్నానం, సాయంత్రం పుష్పయాగ మహోత్సవం, ద్వాదశార్చన, మహాపూర్ణాహుతి జరుగుతుందన్నారు. వీటితోపాటు ప్రతిరోజు విష్ణు సహస్త్ర నామ స్తోత్ర పారాయణంతో స్వామివారిని ప్రసన్నం చేసుకోవచ్చునన్నారు.

మహిళలే న్యాయనిర్ణేతలు
శ్రీకాకుళం, మే 8: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా రాజకీయ న్యాయనిర్ణేతలుగా మహిళలే నిలిచారు. అత్యధికంగా ఓటింగ్‌లో పాల్గొని తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. మొత్తం 1489087 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఇందులో పురుషులు 722764 మంది, మహిళలు 766323 మంది వినియోగించుకున్నారు. 72.85 శాతం పురుష ఓటర్లు నమోదు కాగా, 77.17 శాతం ఓటుహక్కు వినియోగించుకొని మహిళలు తమ ఆధిక్యాన్ని చాటుకున్నారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో పురుష ఓటర్లు 109593 మంది, మహిళా ఓటర్లు 114558 మంది ఉండగా, మహిళలు 89227 మంది తమ ఓటుహక్కును వినియోగించుకొని 77.89 శాతంతో పురుషులకంటే తామే ఆధిక్యమని నిరూపించుకున్నారు. పలాస నియోజకవర్గంలో పురుషులు, మహిళలు 94060, 96000 మంది ఉండగా 63252 మంది పురుషులు, 73260 మంది స్ర్తిలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. టెక్కలి నియోజకవర్గంలో 102941 మంది పురుషులు, 101573 మంది మహిళలు ఉండగా 80.28 మంది మహిళలు ఓటు వేశారు. పాతపట్నం నియోజకవర్గంలో 96385 మంది పురుషులకు గాను 68866 మంది ఓటుహక్కును వినియోగించుకోగా, 95446 మంది మహిళలకు గాను 71781 మంది మహిళలు ఓటును వినియోగించుకున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో పురుషులు 71.22, మహిళలు 72.48 శాతం మంది ఓటేశారు. ఆమదాలవలస 77.87 శాతం, నరసన్నపేట 80.37 శాతం, ఎచ్చెర్ల నియోజకవర్గం 82.96 శాతం మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాజాం నియోజకవర్గంలో పురుషులు 72.85 శాతం ఓటువేయగా, మహిళలు 75.59 శాతం ఓటేశారు.
కాగా పాలకొండ నియోజకవర్గం నుండి 82722 మంది పురుషులు ఉండగా, 58929 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా, మహిళలు 85394 మందికి 61799 మంది ఓటువేసి 72.37 శాతంతో ముందంజలో ఉన్నారు.

పోలింగ్ విధులకు బస్సులు
ఎచ్చెర్ల, మే 8: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సిబ్బంది, ఇ.వి.ఎం.లతోపాటు సామాగ్రిని తరలించేందుకు అధికారులు ఆర్టీసి బస్సులను కేటాయించడంతో ప్రయాణీకులకు అవస్థలు తప్పలేదు. సుధూర ప్రాంతాల నుండి బందోబస్తు విధులకు వచ్చే బి.ఎస్.ఎఫ్, ఆర్మీ, స్పెషల్ బెటాలియన్ పోలీసు బలగాల కోసం కూడా ఎక్స్‌ప్రెస్ బస్సులను అధికారులు కేటాయించడంతో ఈ విషయం తెలియని ప్రయాణీకులు రోడ్లపైనే నిరీక్షించడం కనిపించింది. విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, కాకినాడతోపాటు జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాలకొండ వంటి ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించేందుకు వీలుగా ఏర్పాటుచేసిన బస్సులు లేకపోవడం ప్రైవేట్ వాహనాలపైనే ఆధారపడాల్సి వచ్చింది. పెళ్లిళ్ల ముహుర్తాలు అధికంగా ఉండటం, పోలింగ్ విధుల్లో ఉన్నబస్సులు రోడ్డెక్కకపోవడంతో జాతీయ రహదారి కూడా వెలవెలబోయింది. కుటుంబాలతో సైతం మండుటెండలో గంటల తరబడి నిరీక్షించినప్పటికీ ఎక్స్‌ప్రెస్ బస్సులు రాకపోవడంతో అధికారుల తీరుపై వారంతా అసహనం వ్యక్తంచేశారు. ఇదే పరిస్థితి మరో రెండురోజులు ఉంటుందని సంబంధిత అధికారులే స్పష్టం చేస్తున్నారు. గ్రామాలకు ఓటు వేసేందుకు వచ్చిన వారికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.

పురివిప్పిన పాతకక్షలు
ఆమదాలవలస, మే 8: మండలంలో కొర్లకోట గ్రామంలో పాతకక్షలు పడగవిప్పాయి. ఈ గ్రామానికి వైఎస్సార్‌సీపీ నేత సువ్వారి అనిల్‌కుమార్‌పై గురువారం మధ్యాహ్నం ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. స్థానికులు అందించిన వివరాల మేరకు పెళ్లి విందుకు వెళ్లి వస్తుండగా కనుగులవలస రైల్వేగేటు వద్ద కోటిపాత్రుని నారాయణరావు, చిగులపల్లి శ్యామలరావులు కారును అడ్డగించి అనిల్‌కుమార్‌ను బయటకు లాగి మారణాయుధాలతో దాడి చేశారు. ఈ గ్రామంలో రెండు వర్గాల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న పాత కక్షలే ఈ దాడికి ప్రధాన కారణమని పోలీసులు అనుమానం వ్యక్తంచేసారు. ఈ సంఘటనను చూసిన స్థానికులు దాడిని అడ్డుకోవడంతో దుండగులు పరారైనట్లు పోలీసులు తెలిపారు. అనిల్ బంధువులు, అభిమానులు సంఘటనాస్థలికి చేరుకుని 108 ద్వారా గాయపడిన అనిల్‌ను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. బాధ్యులైన వారిని అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని బంధువులు పోలీసులను డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైకాపా నేత తమ్మినేని సీతారాం సంఘటనాస్థలికి చేరుకుని బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని సి.ఐ విజయానంద్‌తో వాగ్వివాదం చేశారు.
* హత్య చేసేందుకు కుట్ర: అనిల్
గత కొంతకాలంగా నారాయణరావు, శ్యామలరావులు హత్యచేసేందుకు మార్గమధ్యలో మాటువేసి ఈ దారుణానికి ఒడిగట్టారని బాధితుడు అనిల్ ఆరోపించాడు. వీరిద్దరితోపాటు మరో 20 మంది వ్యక్తుల నుంచి తనకు ప్రాణరక్షణ కల్పించాలని పోలీసుల ను వేడుకున్నారు. తనకు ప్రాణరక్షణ కల్పిస్తానని హామీ ఇస్తే గాని వైద్యం చేయించుకోనని పట్టుబడ్డారు. అనిల్‌కు సి.ఐ హామీ ఇచ్చారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సి.ఐ తెలిపారు.

ఎన్నికల నిర్వహణలో యంత్రాంగం సఫలం
శ్రీకాకుళం, మే 8: జిల్లాలో ఈ నెల 7వ తేదీన నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీల వ్యూహరచన ఫలించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఎదురుకాకుండా సఫలం కావడంతో యంత్రాంగం తీరును శభాష్ అంటూ ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సుమారు 19.85 లక్షల మంది ఓటర్లు కలిగి, సున్నితమైన రాజకీయ మనస్తత్వం కలిగిన జిల్లాగా పేరొందిన సిక్కోలులో ఎన్నికల నిర్వహణ అంతా ఆషామాషీ వ్యవహారం కాదన్నది జగమెరిగిన సత్యం. మావోయిస్టుల సరిహద్దు ప్రాంతం కావడం, స్థానిక ఎన్నికల్లో కొట్లాటలు జరగడంతో అధికారులు ముందస్తు వ్యూహరచన చేసి ఎటువంటి హింసాత్మక సంఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చేశారు. గత రెండు నెలల నుండి వరుస ఎన్నికలున్నప్పటికీ, ఎప్పటికపుడు పరిస్థితులకు అనుగుణంగా తమ ప్రణాళికలను మారుస్తూ అందరిని సమన్వయ పరచుకుంటూ రాజకీయ నేతలతో సమీక్షిస్తూ ఎన్నికల నిర్వహణ పట్ల జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ అనన్యమైందనే చెప్పొచ్చు. కలెక్టర్ అభీష్టానికి అనుగుణంగా ఎప్పటికపుడు సమస్యాత్మక ప్రాంతాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను బేరీజు వేస్తూ ఓటుహక్కు కలిగిన ప్రతి ఓటరూ నిర్భయంగా, నిజాయితీగా ఓటువేసేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసి ఎటువంటి హింసకు తావులేకుండా బరోసా నిచ్చిన జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీలను జిల్లాలోని ప్రతి ఓటరు అభినందిస్తున్నారు.

పూర్వకాలంలో మొదట ఎన్నికలు జరిపించి తర్వాత ఫలితాల కోసం ఎదురుచూసేవారు
english title: 
e

సిక్కోలుతో నేదురుమల్లి బంధం

$
0
0

శ్రీకాకుళం, మే 9: మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డికి శ్రీకాకుళం జిల్లాతో ఎనలేని అనుబంధం ఉంది. ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేసిన ముఖ్యమంత్రుల్లో జనార్దనరెడ్డి కూడా ఒకరు. దీర్ఘకాలిక ప్రణాళికలతో మంచి పాలనాదక్షుడిగా ఆయన పేరు సంపాదించుకున్నారు. శ్రీకాకుళం పట్టణం డే అండ్‌నైట్ కూడలి వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతోపాటు మంజూరు చేసింది కూడా ఆయనే. నైరలో వ్యవసాయ కళాశాలను ప్రారంభించారు. సీనియర్ పార్లమెంటేరియన్‌గా, పిసిసి అధ్యక్షునిగా, ముఖ్యమంత్రిగా వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ఆకస్మిక మరంతో జిల్లా వాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన భౌతికంగా లేకపోయినా జిల్లాతో ఉన్న అనుబంధం మాత్రం చిరస్మరణీయం. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఐదుగురు ముఖ్యమంత్రుల కేబినెట్‌లో పనిచేసినా తొలిసారిగా మంత్రి పదవి ఇచ్చింది జనార్ధనరెడ్డే. 1989లో మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన ధర్మానకు, 1991లో చేనేత జౌళి శాఖా మంత్రిపదవి దక్కిందంటే జనార్దనరెడ్డే కారకుడు. అప్పటికే రాష్ట్రంలో చేనేత కార్మికులంతా ఆకలి చావులతో అల్లాడిపోతున్నారు. అటువంటి సంక్లిష్ఠ పరిస్థితుల్లో మంత్రి పదవి ధర్మానకు అప్పగించినా ఎంతో సమర్ధవంతంగా సవాల్‌ను ఎదుర్కొన్నారు. నేదురుమల్లి పిసీసీ అధ్యక్షునిగా పనిచేసిన కాలంలో ధర్మాన జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసారు. ఈయన ప్రోత్సాహంతోనే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కార్యక్రమాల నిర్వహణ, అధికారంలో ఉన్న పార్టీని ఎదుర్కొనే తీరుతెన్నులు అలవడ్డాయని సీనియర్లు గుర్తుచేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు వచ్చినప్పుడు ఏదో ఒక శాశ్వత పథకాన్ని అందించాలన్న తలంపు ఉన్న జనార్ధనరెడ్డి ఉండేవారు. నాగావళి నదిపై ఉన్న వంతెనకు 125 ఏళ్ల చరిత్ర ఉందని, పాత వంతెన ఉంటూనే కొత్తగా పట్టణంలో మరొక వంతెన ధర్మాన సూచించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జనార్ధనరెడ్డి సి.ఎం హోదాలో జిల్లాకు 1992, ఏప్రిల్ నాలుగున వంతెనకు శంకుస్థాపన చేయడంతోపాటు భారీ ఎత్తున నిధులు మంజూరు చేశారు. అలాగే శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్మన్‌గా అంధవరపు వరహానరసింహంతో కూడా నేదురుమల్లికి విడదీయలేని అనుబంధం ఉంది. ముఖ్యమంత్రి నేదురుమల్లిని పట్టణానికి తీసుకువచ్చి భారీ పౌరసన్మానాన్ని కూడా వరం ఏర్పాటు చేశారు. అదే వేదికపైనుంచి మున్సిపాలిటీలో ఆస్తిపన్నును తగ్గించాలని ముఖ్యమంత్రిని వరం కోరగా దీనిపై స్పందించిన జనార్ధనరెడ్డి రాష్టవ్య్రాప్తంగా మున్సిపాలిటీలో ఆస్తిపన్ను తగ్గిస్తూ అక్కడికక్కడే ఓ జీవోను కూడా విడుదల చేశారు. వరం స్వగృహానికి కూడా నేదురుమల్లి పిసీసీ అధ్యక్షుని హోదాలోను, సి.ఎం హోదాలోను విచ్చేశారు.

హామీలు విస్మరించిన అగ్రికెమ్
* స్వామి శ్రీనివాసానంద
ఎచ్చెర్ల, మే 9: పేలుడు సంభవించిన అనంతరం నాగార్జున అగ్రికెమ్‌ను పునఃప్రారంభించేందుకు పరిసర గ్రామాల ప్రజలకు యాజమాన్యం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని భారత స్వాభిమాన్ జిల్లా ట్రస్టు అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద ధ్వజమెత్తారు. చిలకపాలెం శివాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమీప గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తామన్నారని, అయితే నేటివరకు ఆ ప్లాంట్లు అనేక గ్రామాల్లో నెలకొల్పలేదన్నారు. ఉద్యోగవకాశాల్లో కూడా స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇ.టి.పి ప్లాంట్ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల పరిసర గ్రామాలు కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. దీనివల్ల అనేక వ్యాధులు ప్రబలి పలు కుటుంబాలు అనారోగ్యానికి గురవుతున్నాయని మండిపడ్డారు. సామాజిక సేవా కార్యక్రమాలను కూడా అరకొర నిర్వహిస్తున్నారు తప్ప పూర్తిస్థాయిలో సాగించడం లేదన్నారు. వీటిపై పునఃసమీక్ష నిర్వహించి సంబంధిత గ్రామాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హామీలు విస్మరించినందుకు యాజమాన్యంపై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఈయనతోపాటు ఆమ్‌ఆద్మీ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ధనాలకోటి రమణ తదితరులు ఉన్నారు.

ప్రధాన పార్టీల తీరుతో ఎన్నికలు అపహాస్యం
* లోక్‌సత్తా రాష్ట్ర కార్యదర్శి భీశెట్టి
శ్రీకాకుళం, మే 9: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఎన్నికలను అపహాస్యం పాల్జేశాయని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కార్యదర్శి భీశెట్టి బాబ్జి విమర్శించారు. శుక్రవారం ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ తరుపున పోటీచేసిన అభ్యర్థులతో స్థానిక ఓ అతిధిగృహంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడబోయే నూతన రాష్ట్ర స్థితిగతులను ఏ పార్టీ ప్రస్తావించకపోవడం అన్యాయమన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఉచిత హామీలు, రుణమాఫీలు వంటి మభ్యపెట్టే వాగ్దానాలతో రాష్ట్రాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఓట్లు, సీట్లు కోసం పనిచేసి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడంలో అన్ని పార్టీలు పోటీపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితాలతో నిమిత్తం లేకుండా లోక్‌సత్తా పార్టీ ఎన్నికలను గౌరవిస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసే హామీలను ఇస్తూ నిజాయితీగా ప్రచారం చేసిందన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు నిరంతర ప్రజా పోరాటం చేస్తామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు డి.విష్ణుమూర్తి, కె.వేణుగోపాల్, పార్టీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొత్తకోట పోలినాయుడు, పంచాది రాంబాబు, ఉత్తరాంధ్ర లోక్‌సత్తా పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు.
‘ఓటమి భయంతోనే తమ్మినేని తప్పుడు ఫిర్యాదులు’
ఆమదాలవలస, మే 9: స్థానిక శాసనసభ స్థానానికి ఈ నెల ఏడున జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తమ్మినేని సీతారాం టిడిపి అభ్యర్థి కూన రవి చేతిలో చిత్తుగా ఓడిపోతున్నారన్న భయంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులపై తప్పులు ఫిర్యాదులు చేస్తున్నారని ఆ పార్టీ నేత కోట గోవిందరావు ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం ఇక్కడి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా ఓటమి అంగీకరించాలి తప్ప రౌడీయిజం, గుండాయిజం సృష్టించడం తగదన్నారు. వైకాపా నాయకుడు తమ్మినేని సీతారాంపై కసితో యువత, మహిళలు అధికశాతం టిడిపికే మొగ్గుచూపి ఓట్లు వేశారన్నారు. ఈ సమావేశంలో రమేష్, సనపల ఢిల్లేశ్వరరావు, బోర గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డికి శ్రీకాకుళం
english title: 
nedurumalli
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>