వీరఘట్టం, అక్టోబర్ 23: దేశ వ్యాప్తంగా 62 జిల్లాల్లో ఇంటి గ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ ( ఐఎపి) అమలు జరుగుతుండగా, మన రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో అమలుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం, అదిలాబాద్ జిల్లాలో ఐఎపి అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గిరిజనులు అధికంగా నిరసిస్తున్న జిల్లాల్లో ఈ పథకం కింద ఏడాదికి 30 కోట్ల రూపాయల నిధులు విడుదల అవుతాయన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో కనీసం 10మంది జనాభా ఉన్న గిరిజన గ్రామాలకు కూడా రహదారి సౌకర్యం కల్పిస్తామన్నారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ విషయంపై చర్చించి అందరి అంగీకారంతో నిర్మాణాలు జరిపిస్తామన్నారు. పిఎంజిఎస్‌వై పథకం ద్వారా ఇప్పటికే 1050 కోట్ల రూపాయలు నిధులు మంజూరు కాగా ఒక్క విశాఖ జిల్లాకు రూ.700 కోట్లు మంజూరైనట్లు చెప్పారు.
- కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ -
english title:
kishor chandra dev
Date:
Wednesday, October 24, 2012