తిరుపతి, అక్టోబర్ 23: ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కిన వారి ఆటకట్టించడానికి, నేరాలకు పాల్పడే వారి గుట్టు రట్టు చేసే విధంగా దేశంలోనే తొలిసారిగా వైర్‌లెస్ సిసి కెమెరాలను నగరంలోని పలు కూడళ్లలో ఏర్పాటు చేసినట్లు డిజిపి దినేష్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం తిరుపతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ల్లో ఫార్చూన్ టెక్నాలజీ సంస్థ రూపొందించిన శాటిలైట్ సిసి కెమెరాల సిస్టంను డిజిపి తిరుపతి ప్రజలకు అంకితం చేశారు. అనంతరం సిసి కెమెరాల కంట్రోల్ రూమ్‌ను డిజిపి ప్రారంభించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా వైర్‌సెల్ సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఫార్చూన్ టెక్నాలజి సంస్థ ఎండి ఆర్ రఘు 1.30 కోట్ల రూపాయలను వ్యయం చేసి సుమారు 100 కెమెరాలను నగరంలోని 45 సర్కిళ్లలో ఏర్పాటు చేశారన్నారు. శాటిలైట్ సిస్టంతో ఈ కెమెరాలు పనిచేస్తాయని, నిబంధనలు అతిక్రమించిన వారిని, నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి పోలీసులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఇక విఐపిల రాక సందర్భంగా కూడా ఈ సిసి కెమెరాల నిఘా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వీటి ద్వారా బస్టాండ్‌లో జరిగే చోరీలు, ఇతర నేరాలు గుర్తించవచ్చన్నారు. టిటిడి ఆర్థిక సహాయంతో నిర్మించిన ఈస్టు సబ్‌డివిజన్ పోలీసు భవనాన్ని మంగళవారం డిజిపి దినేష్‌రెడ్డి ప్రారంభించారు.
దేశంలోనే తొలి ప్రయోగం: డిజిపి దినేష్‌రెడ్డి
english title:
cc cameras
Date:
Wednesday, October 24, 2012