విజయనగరం , అక్టోబర్ 26: జిల్లాలో రైతులకు వ్యవసాయ యాంత్రీకరణపై అవగాహన కల్పించేందుకు ఈనెల 29 నుంచి 31వ తేదీవరకు వ్యవసాయ పరికరాల ప్రదర్శన (ఎగ్జిబిషన్) నిర్వహించనున్నట్లు ఆగ్రోస్ రీజనల్‌మేనేజర్ ఎంసి రాజమోహన్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద తోటపాలెంలో ఉన్న ఆగ్రోస్ ప్రాంతీయ కార్యాలయంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. మూడురోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి మండలం నుంచి ఎంపిక చేసిన వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు కేంద్రాలు, ఆధునిక వ్యవసాయ యంత్రాల లబ్ధిదారుల గ్రూపులు, ఆధునిక వ్యవసాయ పనిముట్లు కావాల్సిన రైతులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. రాయితీలను ఉపయోగించుకుని అధిక పంటదిగుబడులను సాధించేందుకు అవసరమైన అవగాహన ఈ ప్రదర్శనలో రైతులకు కల్పిస్తామని రాజమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు వ్యవసాయ, అనుబంధ యంత్రాల కంపెనీలతో గ్రూపులుగా ఏర్పడిన రైతులు నేరుగా తమకు కావాల్సిన యంత్రాలు, పనిముట్లును కొనే వెసులుబాటు కల్పించామన్నారు. రాయితీపై భారీ వ్యవసాయ పరికరాలు కావాల్సిన రైతుల నుంచి అక్కడిక్కడే దరఖాస్తులు స్వీకరించి అర్హతలను పరిశీలించి రాయితీ మంజూరు చేస్తామన్నారు. మినీట్రాక్టర్లు, పవర్‌టిల్లర్లు, నూర్పిడి యంత్రాలు తదితర వాటిని తీసుకునే రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కూడా కల్పించామన్నారు. ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. అందువల్ల జిల్లాలో రైతులు ఈ ప్రదర్శనను వినియోగించుకోవాలని రాజమోహన్ కోరారు.
‘ప్రజాచైతన్యంతోనే ప్రభుత్వ పథకాలు విజయవంతం’
విజయనగరం , అక్టోబర్ 26: ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే ప్రభుత్వపథకాలు విజయవంతమవుతాయని మున్సిపల్ ప్రత్యేక అధికారి, జాయింట్‌కలెక్టర్ పి.ఎ.శోభ అన్నారు. వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 8వ వార్డులో జరిగిన వార్డుసభలో ఆమె మాట్లాడారు. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు గ్రామ, వార్డు సందర్శన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణంలో వార్డు సందర్శన కార్యక్రమాలను నిర్వహించి శుక్రవారంతో 100 వారాలు పూర్తయ్యాయని చెప్పారు. పట్టణంలో రోడ్లు, కాలువలు, కల్వర్టులు తదితర వాటిని నిర్మించేందుకు 80 లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు. పట్టణంలో పారిశుద్ధ్యం, వీధిదీపాల నిర్వహణ, మంచినీటి సరఫరా తదితర వాటిపై ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించామన్నారు. ముఖ్యంగా ప్రభుత్వపథకాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే ప్రభుత్వపథకాలు విజయవంతమవుతాయని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి మాట్లాడుతూ ప్రజల సహకారంతో పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు కె.వి.్భస్కరరావు, పి.వెంకటరావు, ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి రాజరాజేశ్వరి, టౌన్ సర్వేయర్ పి.శ్రీనివాసరావు, 8వ వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఆదుర్తి వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.
‘హితవు కోరేదే సాహిత్యం’
విజయనగరం , అక్టోబర్ 26: హితవు కోరేదే సాహిత్యమని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ యుఎ నరసింహమూర్తి అన్నారు. తోష్నివాలా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 3సాహిత్యం-సేవ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. రామాయణ మహాభారత భాగవతాలతో పాటు రఘువంశ కావ్యం తదితర గొప్ప రచనల్లోని సాహితీ విలువలను ఆయన సోదాహరణంగా వివరించారు. అనంతరం డాక్టర్ నరసింహమూర్తిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్-102కు చెందిన 2012 డైరక్టరీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్‌క్లబ్ పూర్వ అధ్యక్షుడు బుచ్చిబాబు, గవర్నర్ చుక్కా మోహనరావు, కేబినెట్ సెక్రటరీ ఎర్నానాయుడు, తోష్నివాలా క్లబ్ అధ్యక్షుడు డిసివిఎన్ రాజు, కార్యదర్శి శ్రీరామమూర్తి పాల్గొన్నారు.
గాజులరేగలో వైద్య శిబిరం
విజయనగరం, అక్టోబర్ 26: మండలంలోని గాజులరేగలో వైద్య శిబిరం నిర్వహించినట్లు రాకోడు ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ కె రవికుమార్ తెలిపారు. నాలుగు రోజుల నుండి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.న్నారు. గ్రామంలో ఇంటింటి సర్వేను నిర్వహించామని మొత్తంగా 20 మంది మాత్రమే జ్వరాలు ఉన్నారన్నారు. గ్రామంలో పది గ్రూపులు ఏర్పాడి అన్ని వీదుల్లో తిరిగి ఎనిమిది వేల మందికి మందులు అందిచామన్నారు. స్వేన్‌ప్లూ వ్యాధిని నివారించాలనే లక్ష్యంతో గురువారం, శుక్రవారం పంపిణీని కొనసాగించామన్నారు. ఈ వైద్యశిబిరంలో రాకొడు పిహెచ్‌సి వైద్యసిబ్బంది, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.