Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అవినీతి‘ధార’

$
0
0

విశాఖపట్నం, అక్టోబర్ 26: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన జనరిక్ మందులు రోగులకు చేరడం లేదు. పేదవారిని దృష్టిలో పెట్టుకుని బహిరంగ మార్కెట్‌లో లభించే మందుల ధరకన్నా అతి తక్కువ ధరకు జనరిక్ మందులు అందించేందుకు జీవనధార పేరుతో మందుల షాపులను ఏర్పాటు చేశారు. శ్యామలరావు కలెక్టర్‌గా పనిచేసే సమయంలో ఈ మందుల షాపును కెజిహెచ్‌లో 2010 జనవరి 24వ తేదీన విశాఖలో తొలిసారిగా జీవనధార మందుల షాపును నెలకొల్పారు. కలెక్టర్ శ్యామలరావు, అప్పటి డ్రగ్ కంట్రోల్ అధికారి ఉదయ భాస్కర్ ఈ మందులపై ప్రజల్లో అవగాహన కల్పించారు. డాక్టర్లు కూడా జనరిక్ మందులు రాసేవిధంగా చర్యలు తీసుకున్నారు. అప్పట్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో 12 ఔట్‌లెట్లను ఏర్పాటు చేశారు. కెజిహెచ్‌కు సాధారణంగా పేద రోగులు వస్తుంటారు కాబట్టి, వారికి చాలా చవకగా జనరిక్ మందులు అందించేవారు. విశాఖలో ‘జనరిక్’ విజయవంతం కావడంతో రాష్టమ్రంతా ఈ మందుల విక్రయాన్ని పెంచాలన్న ఉద్దేశంతో 14-3-2011న ప్రభుత్వం జిఓ ఎంఎస్ నెం.54ను జారీ చేసింది. ఈ జనరిక్ మందుల కొనుగోలు, పంపిణీ బాధ్యతను డిఆర్‌డిఎకు అప్పగించింది. డిఆర్‌డిఎ అధికారులు ఫార్మసిస్ట్ నుంచి ఈ మందులను కొనుగోలు చేసి, ఆయా మందుల షాపులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇది విశాఖలో కొంతకాలం సవ్యంగానే నడిచింది.
లవ్ అగర్వాల్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఈ జనరిక్ మందులు, జీవనధార షాపుల గురించి పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మందులు కొనుగోళ్ళు ఇష్టారాజ్యమైపోయింది. ఫార్మసిస్ట్‌ల నుంచి మందులను కాస్తంత ఎక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని మందుల షాపులకు పంపిణీ చేస్తున్నట్టు ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి. మందుల దుకాణాలకు సరఫరా చేసే విషయంలో కొంతమంది అధికారులు తమను లంచం కోసం వేధిస్తున్నారంటూ సాక్షాత్తూ ఓ మందుల షాపు యజమానే అప్పటి కలెక్టర్ అగర్వాల్‌కు ఫిర్యాదు చేసినా, స్పందించకపోవడం గమనార్హం. అప్పట్లో ఆరంభమైన ఈ తీరు ఇంకా కొనసాగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
వినియోగదారుడు జీవనధార మందుల షాపులో మందులను కొనుగోలు చేస్తే, సదరు మందు ధర, బహిరంగ మార్కెట్‌లో దాని విలువ, సదరు ధర వ్యత్యాసాన్ని బిల్‌పై విధిగా పేర్కొనాలి. కానీ కెజిహెచ్‌లో ఇటువంటి బిల్లులు లభ్యం కావడం లేదు. కానీ విశాఖలో నడుస్తున్న జీవనధార మందుల దుకాణాల్లో చాలా వరకూ ఇటువంటి బిల్లులు అంద చేస్తున్నారు.
జనరిక్ మందుల వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించమని డ్రగ్ కంట్రోల్ అధికారులు డిఆర్‌డిఎ అధికారులకు పలుసార్లు సూచించినా ఫలితం లేదు. జనరిక్ మందుల విషయాన్ని డిఆర్‌డిఎ పూర్తిగా వదిలిపెట్టేసినట్టు కనిపిస్తోంది. డిఆర్‌డిఎ ఉన్నతాధికారులు ఈ మందుల కొనుగోళ్లు, పంపిణీ విషయంలో జోక్యం చేసుకోవల్సిన అవసరం కూడా ఉంది.
ఇక కెజిహెచ్‌లో నడుస్తున్న జీవనధార మందుల షాపులో మందులు, ఇతర జీవనధార మందుల దుకాణాల్లో మందుల కన్నా ఎక్కువ ధర పలుకుతున్నట్టు తెలుస్తోంది. ఈ పథకం ప్రారంభమైన కొత్తలో రాష్ట్రంలో అన్ని జీవనధార మందుల షాపులకు విశాఖ కెజిహెచ్ జీవనధార మందుల షాపు నుంచే కొనుగోలు చేయాలని ఆదేశాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం జనరిక్ మందులను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి నుంచి సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదట ఆరంభమైన ఈ మందుల షాపును ఎందుకు పక్కకు తప్పించారన్న విషయాన్ని స్వయంగా జిల్లా కలెక్టర్ శేషాద్రి జోక్యం చేసుకుని ఆరా తీస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మందుల కొనుగోళ్ళలో అవకతవకలు జరుగుతున్నాయా? అన్న విషయమై కలెక్టర్ దర్యాప్తు జరపాల్సి ఉంది.

* కెజిహెచ్ ‘జీవనధార’లో ధరల వ్యత్యాసం * ఇతర ఔట్‌లెట్ల కన్నా ఎక్కువ ధరకు మందుల విక్రయం * మధ్యవర్తుల చేతివాటం?
english title: 
avineethi dhara

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>