కావలసినవి
బియ్యం - 4 కప్పులు
అటుకులు- 1 కప్పు
పుల్లటి పెరుగు - 1/2 కప్పు
కార్న్ గింజలు - 1 కప్పు
పచ్చిమిర్చి - 3
జీలకర్ర - 1/2 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
నూనె - 1/4 కప్పు
ఇలా చేయాలి
ముందుగా బియ్యం కడిగి నీళ్లు
పోసి నాలుగైదు గంటలు
నానబెట్టాలి. అటుకులు కూడా
శుభ్రం చేసుకుని అరగంట నీళ్లలో
నానబెట్టాలి. మిక్సీలో బియ్యం
వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
చివరలో అటుకులు, పెరుగు
కూడా వేసి రుబ్బుకోవాలి. ఈ
పిండి మిశ్రమం మరీ పలుచగా
కాకుండా, మరీ చిక్కగా కాకుండా
ఉండాలి. దీన్ని కనీసం పనె
్నండు గంటలు మూత పెట్టి
పులవడానికి వదిలేయాలి.
తర్వాత తగినంత ఉప్పు వేసి
కలుపుకోవాలి. కార్న్ గింజలను
ఆవిరి మీద ఉడికించి జీలకర్ర,
ఉప్పు, పచ్చిమిర్చి కలిపి బరకగా
గ్రైండ్ చేసుకోవాలి. పొంగనాలు
చేసి ప్లేటుకు నూనె రాసి,
చెంచాడు పిండి పోయాలి.
దానిపైన కొంచెం కార్న్ మిశ్రమం
పెట్టి ఇంకో చెంచాడు పిండి
పోయాలి. ఇలా అన్నీ గుంతలలో
చేసుకుని చుట్టూకొంచెం నూనె
వేసి మూత పెట్టి 4-5 నిమిషాలు
ఉడికించాలి. తర్వాత చాకుతో
వాటిని తిరగేసి రెండోవైపు కూడా
కాల్చుకోవాలి. పొంగనాలను
కొబ్బరి పచ్చడి లేదా సాంబార్‌తో
సర్వ్ చేయాలి. ఈ పొంగనాలు
చేయడానికి ఇడ్లీ పిండి కానీ
దోశపిండి కానీ
ఉపయోగించుకోచ్చు.