న్యూఢిల్లీ, అక్టోబర్ 28: విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో చేష్టలుడిగిన ప్రధానిగా విమర్శలు ఎదుర్కొంటున్న మన్మోహన్‌సింగ్ ఆదివారం తన మంత్రివర్గంలో భారీ మార్పులు చేపట్టడమే కాకుండా కొత్త టీమ్ రాబోయే సవాళ్లను దీటుగా ఎదుర్కోగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసారు. ‘ఇది యువరక్తం, అనుభవం కలబోసిన టీమ్.
మంత్రులకు అప్పగించిన శాఖలకు వారు అన్నివిధాలా తగినవారు’ అని రాష్టప్రతి భవన్‌లో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో ముచ్చటించిన ప్రధాని వ్యాఖ్యానించారు. పునర్వ్యవస్థీకరణ ద్వారా మీరు ఏం సందేశం ఇవ్వాలనుకున్నారని విలేఖరులు అడిగినప్పుడు ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అధిగమించాల్సిన బాట అనేక సవాళ్లతో కూడుకుని ఉందని, అయితే ఈ బృందం ఆ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలదని ఆశిస్తున్నట్టు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికలకుముందు బహుశా ఇదే చివరి మంత్రివర్గ విస్తరణ కావచ్చని అన్నారు. ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని అంటూ, ఎన్నికలు సకాలంలోనే జరుగుతాయన్నారు. కొంతమందిని కేబినెట్ నుంచి తప్పించడం గురించి ప్రశ్నించినపుడు, పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి అనుభవజ్ఞుల అవసరం ఎంతైనా ఉందని మన్మోహన్ వ్యాఖ్యానించారు. అంబికాసోనీ, ఎస్‌ఎం కృష్ణ, ముకుల్ వాస్నిక్, సుబోధ్ కాంత్ సహాయ్, మహదేవ్ సింగ్ ఖండేలా, వినె్సంట్ పాలాలు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముందే మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో
english title:
deetina
Date:
Monday, October 29, 2012