హైదరాబాద్, అక్టోబర్ 28: తొమ్మిదో విడత ఇందిరమ్మ బాట మెదక్ జిల్లాలో సోమవారం ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు నిర్వహించే కార్యక్రమంలో సిఎం కిరణ్ వెంట ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఉంటారు. గతంలో నిర్వహించిన బాటల కన్నా మెదక్ జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల మధ్య కొద్దికాలంగా ఉన్న అంతర్గత విభేదాలు ఇటీవల మెదక్ జిల్లాలోని ఒక ఎత్తిపోతల పథకం విషయంలో మరింత ముదిరాయి. దీంతో రాష్ట్ర పార్టీ సీనియర్లు రంగంలోకి దిగి ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించడంతో కథ సుఖాంతమైందని ఇరువర్గాల నేతలు భావిస్తున్నారు. అయితే ఇందిరమ్మ బాట ముగిసేంతవరకు ఎటువంటి వివాదాలు లేకుండా కార్యక్రమం జరిగితే అంతే చాలునని జిల్లాకు చెందిన నేతలతోపాటు ముఖ్యమంత్రి కూడా భావిస్తున్నారు. తొలుత మెదక్ జిల్లా ఇందిరమ్మ బాట కార్యక్రమానికి తయారు చేసిన రోడ్ మ్యాప్‌లో ఉప ముఖ్యమంత్రికి చెందిన సొంత నియోజకవర్గం లేకపోవడం, వారి మధ్య సయోధ్య కుదిరిన తరువాతే రూట్ మ్యాప్‌లో మార్పులు చేసి రాజనర్సింహ అడ్డాలోనూ ఇందిరమ్మ బాట ఉండేలా రూపొందించారు.
సోమవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరే ముఖ్యమంత్రి నేరుగా దుబ్బాక చేరుకుంటారు. అధికార, అనధికారులతో సమావేశమై, తరువాత ఇందిర జలప్రభ లబ్ధిదారులతో భేటీ అవుతారు. అక్కడి నుంచి వరుసగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, వివిధ వర్గాలతో భేటీలతో మూడు రోజులపాటు తన కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.
దుబ్బాకనుంచి ప్రారంభం
english title:
n
Date:
Monday, October 29, 2012