ఉంగుటూరు, అక్టోబర్ 30: రాష్ట్రంలో రహదారులు మంగళవారం రక్తసిక్తమయ్యాయ. 11 మందిని బలితీసుకున్నాయ. పలువురు గాయపడ్డారు. పశ్చిమగోదావరిలో నలుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు మృతి చెందారు. ప.గోజిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సైక్లిస్టును ఢీకొన్న ఒక కారు ఆగకుండా వేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. విజయవాడ నుండి రాజమండ్రి వైపు వస్తున్న కారు నారాయణపురం వద్ద రోడ్డు దాటుతున్న సైక్లిస్టును ఢీకొని ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. దూసుకువస్తున్న కారును చూసి లారీ డ్రైవర్ తన వాహనాన్ని నిలిపివేసినా, సైక్లిస్టును గుద్దిన కంగారులో కారును లారీ కిందకు పోనిచ్చాడు.
ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన కారు డ్రైవర్, యజమాని దాసం లీలా దుర్గా నాగేశ్వరరావు (35),జంగం మధు (46), మంగళగిరి గోవర్దనదాసు (35) అక్కడికక్కడే మృతిచెందారు. దాసరి ప్రసాదబాబు (35), బోడేపూడి ఆంజనేయ వరప్రసాద్‌ను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రసాదబాబు మృతిచెందారు. గాయపడిన సైక్లిస్టు మంతెన బాబూరావును కూడా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వీరంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులని తెలిసింది.
అలాగే ప్రకాశం జిల్లా పొదిలి సమీపంలోని కంభాలపాడు గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించగా ఒక బాలిక ప్రాణాలతో బయటపడింది. పొదిలి డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సు పొదిలి నుండి కనిగిరికి వెళుతుండగా మార్గమధ్యంలోని కంభాలపాడు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న సైక్లిస్టును ఢీకొంది. తరువాత అటువైపుగా వస్తున్న ఆటోను కూడా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఆటో బస్సు కిందకు దూరిపోవడంతో ఎంతమంది మరణించారనే ఉత్కంఠ నెలకొంది. గ్రామస్థులు హుటాహుటిన చేరుకుని బస్సు కిందనున్న ఆటోను బయటకు తీశారు. అప్పటికే ఆటోడ్రైవర్ జువాజీ వెంకటేశ్వర్లు (30) మరణించాడు. ఆటోలో తీవ్రంగా గాయపడి ఉన్న కోవెలగుంట నర్సమ్మ (35)తోపాటు ఆమె కుమార్తె బాలమ్మ, సెకిలిస్టు కోవెలగుంట్ల ఎర్రయ్య (35)లను 108 సిబ్బంది పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ నర్సమ్మ చనిపోయింది. సైక్లిస్టు ఎర్రయ్యను మెరుగైన చికిత్సకోసం బంధువులు ఒంగోలు తీసుకెళుతుండగా అతను కూడా మరణించాడు. ప్రమాదంలో గాయపడిన బాలికను చికిత్సకోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అటువైపుగా వెళుతున్న తెలుగుదేశం నాయకులు కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్సీ నన్నపనేని రాజ్‌కుమారి ప్రమాదాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలను ఓదార్చారు. కాగా క్షతగాత్రులకు వైద్య సహాయం అందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యం వహించారంటూ మృతుల బంధువులు ఆసుపత్రి ఎదుట రోడ్డుపై రాస్తారోకో చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కాగా అనంతపురం జిల్లా మడకశిర మండలం ఉప్పరపల్లి గ్రామం వద్ద మంగళవారం సాయంత్రం ట్రాక్టరు బోల్తా పడిన సంఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు వృద్ధులు ఒక బాలుడు ఉన్నారు. మరో పదిహేను మంది గాయపడగా అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలో పరిగి మండలంలోని గణపతిపల్లికి చెందిన 40 మంది కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా గరిణి ఎల్లమ్మ జాతరకు బయలుదేరారు. ట్రాక్టరు ఉప్పరపల్లికి చేరగానే అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో వెంకటరమణ (65), రామక్క (60), నాగమణి (50)తోపాటు అభిషేక్ (10) మృతి చెందారు. 15 మంది గాయపడగా వారిని మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మడకశిర పోలీసులు కేసు దర్యాప్తు
రాష్ట్రంలో రహదారులు మంగళవారం రక్తసిక్తమయ్యాయ
english title:
r
Date:
Wednesday, October 31, 2012