సంగారెడ్డి, అక్టోబర్ 30: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇస్తున్న హామీలపై ఇందిరమ్మబాటలో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. మెదక్ జిల్లా ఇందిరమ్మబాటలో భాగంగా మంగళవారం నారాయణఖేడ్‌లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు అధికారం కోసం అవాస్తవాలు, అసత్యాలు చెప్పి ప్రజలను నమ్మించాలనే ప్రయత్నాలు చేస్తుండగా, అయితే అలాంటివి మానుకోకపోతే ప్రజలే తగిన విధంగా బుద్ధిచెబుతారని హెచ్చరించారు. అధికార దాహం, పదవి పోయిందనే భయంతో బాబు ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు, మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.50వేల కోట్ల రుణాలు ఇచ్చిందని, మరో రెండేళ్ల కాలంలో రూ.70వేల కోట్ల వరకు వెళ్తుందని, అయితే రూ.70వేల కోట్ల రూపాయలను ఎలా మాఫీ చేస్తామని ? బడ్జెట్ ఎక్కడ ఉందని ? ప్రశ్నించారు. అధికారంలో ఉన్న సమయంలో రైతులు, మహిళలను పట్టించుకోని ఆయన రుణాలను మాఫీ చేస్తానని చెప్పి బ్యాంకింగ్ వ్యవస్థను నాశనం చేసే చర్యలకు ఒడిగడుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రధాని మన్మోహన్‌సింగ్ రూ.72వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. 2009 ఎన్నికల్లో ఆల్‌ఫ్రీ బాబుగా వ్యవహరించి అన్నీ ఉచితంగా ఇస్తానన్నా ప్రజలు నమ్మలేదన్నారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి
మెదక్: పింఛన్లు, బ్యాంకు రుణాలతో ఓట్లు పడతాయంటే పొరపాటేనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో జరిగిన నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రంలో రూపాయికి కిలో బియ్యంతో పాటు వడ్డీ లేని రుణాలు, విద్య కోసం 26 వేల కోట్లు, 27 వేల కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలు భాగస్వాములై ప్రజలకు అందేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 2.85 కోట్ల కుటుంబాలుంటే 8.50 కోట్ల విలువైన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ప్రతి కుటుంబం సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధిపొందుతున్నారని అన్నారు. గతంలో ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్‌లో కాంగ్రెస్ ఓడకూడదన్నారు. ప్రజలు చాలా తెలివైనవారని, సమయం వచ్చినప్పుడు దెబ్బకొడతారని ఆయన హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి డికె అరుణ, జిల్లా మంత్రి సునీతారెడ్డి, గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌లు మేడి మధుసూదన్‌రావు, అమరసేనారెడ్డి, పాల్గొన్నారు.
.....................
చెరకు రైతులకు కిరణ్ భరోసా
జహీరాబాద్: చెరకుకు గిట్టుబాటు ధర ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని ఇందుకు తనవంతు కృషి చేస్తానని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మ పల్లెబాట రెండో రోజు కార్యక్రమంలో భాగంగా సిఎం.మంగళవారం జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. న్యాల్‌కల్ మండలం రేజింతల్ గ్రామంలోని సిద్ధివినాయక దేవస్థానంలో మంత్రి గీతారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. మంత్రి, అధికారులు, చక్కెర కర్మాగారాల యాజమాన్యాలతో చెరకు ధర విషయమై సమీక్షించి గిట్టుబాటు ధర ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని ఆది ప్రభుత్వం బాధ్యతన్నారు. రైతులకు మేలు జరిగేలా కృషి చేస్తామన్నారు. ఈజిఎస్ పథకంతో రైతులకు సాగు ఖర్చులు బాగా పెరిగాయన్నారు. ఇందుకు వారి ఉత్పత్తులకు అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. వరి క్వింటాలుకు మద్దతు ధరగా రూ.1280 ప్రకటించగా రూ.1500 సన్న బియ్యానికి ఇస్తున్నామన్నారు. చెరకు నరికే యంత్రాన్ని రైతు కొనుగోలు చేయడంపై సిఎం హర్షం వ్యక్తంచేశారు. ఇందుకు ప్రభుత్వం రూ.31లక్షలు సబ్సిడి ఇచ్చినట్లు చెప్పారు. కోటిమంది రైతులకు వడ్డీలేకుండా పంట రుణాలు ఇచ్చామన్నారు. దేశం మొత్తంలో తాము మాత్రమే కల్పిస్తున్నామన్నారు. 1.40 మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చామన్నారు.
విద్యుత్ సమస్యను త్వరలోనే అధిగమిస్తాం
సదాశివపేట: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యను కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే అధిగమిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి స్పష్టంచేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో అడుగంటిన జలాలు, గ్యాస్ సరఫరా పూర్తిగా తగ్గిపోవడం వలనే విద్యుత్ కొరత తీవ్రరూపం దాల్చిందన్నారు. ఆర్‌ఎన్‌ఎల్‌జి సరఫరా బుధ లేద గురువారాల్లో ప్రారంభం కానుందని, దీని కోసం ఈ నెల రూ.300 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. అవసరమైతే వచ్చేనెలా మరో రూ.300 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. రోజుకు 400 మెగావాట్ల విద్యుత్ అదనంగా సరఫరా అవుతుందని తెలిపారు. కాగా, రాష్ట్రంలో రైతులకు, వినియోగదారులకు ఇప్పటికే రూ.5,500 కోట్ల విలువైన విద్యుత్‌ను సబ్సిడీగా అందిస్తున్నామన్నారు.
చంద్రబాబు రుణ మాఫీపై ముఖ్యమంత్రి కిరణ్
english title:
a
Date:
Wednesday, October 31, 2012