నల్లగొండ టౌన్, అక్టోబర్ 30: జిల్లాలో నకిలీ విద్యార్హతల పిజి సర్ట్ఫికెట్లతో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడానికి విద్యాశాఖ సిద్ధమైంది. 2009లో జరిగిన ఉపాధ్యాయ పదోన్నతుల కౌనె్సలింగ్‌లో ఎస్‌జిటి హోదా కలిగిన ఇంగ్లీష్, గణితం, భౌతిక శాస్త్రాలకు చెందిన 63 మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ పిజి సర్ట్ఫికెట్లను సమర్పించి ఏకంగా పదోన్నతులు పొందినట్లు గతంలోనే జిల్లా విద్యాశాఖాధికారులు గుర్తించారు. వీరిలో ఇంగ్లీష్ విభాగంలో 59 మంది ఉపాధ్యాయులు, గణితంలో ముగ్గురు, భౌతిక శాస్త్రంలో ఒకరు ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం పదోన్నతి పక్రియను ఆయా సబ్జెక్టులకు మాత్రం ఆపివేశారు. విద్యాశాఖాధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో పదోన్నతులు ఇవ్వాలని తీర్పు రావడంతో వారికి పదోన్నతి ఉత్తర్వులను అందించారు. పదోన్నతులు పొందిన వారిలో ఇప్పటికే ఒక ఉపాధ్యాయుడు మృతి చెందారు.
తమిళనాడులోని వినాయక మిషన్, వినాయక రీసెర్చ్ ఫౌండేషన్ యూనివర్సిటీలతోపాటు రాజస్థాన్‌లోని జెఆర్‌ఎన్ యూనివర్సిటీలకు చెందిన పిజి నకిలీ సర్ట్ఫికెట్లతో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు సంబంధించిన వివరాలను సేకరించాలని ఇటీవల మళ్లీ లోకాయుక్త తీర్పు ఇవ్వడంతో విద్యాశాఖలో పరుగులు మొదలయ్యాయ. ఆయా యూనివర్సిటీలకు చెందిన సర్ట్ఫికెట్లను, వారు పరీక్షలు రాసిన కాలంనాటి పరీక్షల కాలనిర్ణయ పట్టిక తదితర అంశాలను పరిశీలించి సిబిఐతో దర్యాప్తు చేయించాలని లోకాయుక్త సూచించింది.
* ఉపాధ్యాయులపై చర్యకు విద్యాశాఖ సిద్ధం
english title:
n
Date:
Wednesday, October 31, 2012