విశాఖపట్నం, నవంబర్ 3: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏఓబి) ప్రాంతాల్లో మావోయిస్టులను అణచివేసేందుకు ‘యాంటీ నక్సల్స్ ఆపరేషన్’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు రాష్ట్ర డిజిపి దినేష్‌రెడ్డి తెలిపారు. విశాఖ పర్యటనలో భాగంగా శనివారం ఉత్తరాంధ్ర జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లతో విశాఖలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ మావోయిస్టుల కార్యకలాపాల నిరోధం కోసం మరో మూడు, కూంబింగ్ కోసం మానవ రహిత విమానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. తొలిదశలో భాగంగా 15 హెలికాప్టర్లు పనిచేస్తాయని, మానవరహిత విమానాలను రాజమండ్రి కేంద్రంగా నిర్వహిస్తామన్నారు. అలాగే యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కార్యక్రమంలో గ్రేహౌండ్స్, సిఆర్‌పిఎఫ్, ఒడిశా దళాలు, పారా మిలటరీ బలగాలు పాల్గొంటాయన్నారు.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏఓబి) ప్రాంతాల్లో మావోయిస్టులను అణచివేసేందుకు
english title:
anti naxal operation
Date:
Sunday, November 4, 2012