తిరుపతి, నవంబర్ 3: 2013 నూతన సంవత్సరం జనవరి 1వతేది తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 50 రూపాయల దర్శన టిక్కెట్లను ఈ- దర్శన్ కౌంటర్ల ద్వారా నవంబర్ 7 నుండి విక్రయించాలని టిటిడి నిర్ణయించినట్లు పిఆర్‌ఓ తలారి రవి శనివారం తెలిపారు. దూర ప్రాంతం నుండి వచ్చే భక్తుల సౌకర్యాలను దృష్టిలో వుంచుకుని ముందుగానే ఈ దర్శన టిక్కెట్లను విక్రయిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కార్తీక మాసం ఆరంభం నుండే తిలకధారణ అమలు
ఆర్ష సంస్కృతి పరిరక్షణే ధ్యేయంగా సమాజంలో ఆధ్యాత్మిక చింతన పెంపొదించడం ద్వారా శాంతి సమాజ స్థాపనకు దోహదపడేవిధంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఒక ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. శనివారం తిరుపతిలోని టిటిడి ముద్రణాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మానవీయవిలువలు పెంపొందించేందుకు ఆధ్యాత్మిక గ్రంథాలయాలు ఎంతో దోహదపడతాయన్నారు. అందుకే ప్రతి జిల్లాలో ఇలాంటి గ్రంథాయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టిటిడి ముద్రణలతో పాటు ఇతర ముద్రణలను కూడా ఇక్కడ ఉంచనున్నట్లు తెలిపారు. టిటిడి మాజీ ఇఓ, ధార్మిక సలహాదారు పివిఆర్‌కె ప్రసాద్ మాట్లాడుతూ తిలక ధారణ చేయని వారు టిటిడిలో పనిచేసే అర్హత లేదన్నారు. శ్రీనివాసునిపై పద్యంగాని, గద్యంకాని ఏ భాషలో ఉన్నా వాటిని సేకరించి ముద్రించి ఈ గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. ఈ ఆథ్యాత్మిక గ్రంథాలయం ఒక పరిశోధనా కేంద్రంగా అభివృద్ధి పరచాలన్నారు.
2013 నూతన సంవత్సరం జనవరి 1వతేది తిరుమల శ్రీ
english title:
e-darshan
Date:
Sunday, November 4, 2012