దీపావళి సందర్భంగా వీక్షకులను అన్ని విధాలా అలరించేందుకు ‘స్టార్‌ప్లస్’ ప్రత్యేక కార్యక్రమాలను అందిస్తోంది. సోమవారం ప్రారంభమైన విభిన్న ప్రత్యేక కార్యక్రమాలు ఈ నెల 9వ తేదీ వరకూ కొనసాగుతాయి. ప్రతి రోజూ రాత్రి ఏడున్నర గంటలకు పాటలు, నృత్యాలు, హాస్య ప్రధాన కార్యక్రమాలను అందించేందుకు ‘స్టార్ పరివార్’ అన్ని సన్నాహాలు చేసింది. ‘చెడుపై ఎపుడూ మంచికే విజయం’- అన్న దీపావళి సందేశాన్ని చాటిచెప్పే పురాణ గాథలు వీక్షకులను ఆకట్టుకుంటాయని నిర్వాహకులు భరోసా ఇస్తున్నారు. శ్రీకృష్ణుడు, లక్ష్మీదేవి, గణపతి, శ్రీరాముడు, ఇతర దేవతలకు సంబంధించిన పౌరాణిక ఘట్టాలను ‘దీపావళి’ సంబరాల సందర్భంగా ప్రసారం చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రముఖ టీవీ నటులు ఆనంద్ రషీద్, దీపికా సింగ్, విశాల్ సింగ్ షలీన్ భనోట్ తదితరులు రామ,లక్ష్మణ,సీత, రావణ పాత్రల్లో అలరించనున్నారు. రామరావణ సమరం, రాధాకృష్ణుల ప్రేమ వంటి కథాంశాలతో ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు. చివరి రోజున ‘శుభ దీపావళి’ పేరిట విశేష కార్యక్రమం ఉంటుంది.
దీపావళి సందర్భంగా వీక్షకులను అన్ని విధాలా అలరించేందుకు ‘స్టార్‌ప్లస్’
english title:
star plus
Date:
Tuesday, November 6, 2012