ధారణంగా అత్తాకోడళ్లు అనగానే వారి మధ్య అపోహలు, అపార్థాలు, పొరపొచ్చాలు వంటివి రావడం సహజమని అందరూ భావిస్తారు. కానీ, అత్తగారంటే ఇలా ఉండాలని ప్రతి కోడలు పిల్ల ఆశించే విధంగా అత్త జగదీశ్వరీదేవి ‘కలవారి కోడళ్లు’లో ప్రతిరోజూ కనిపిస్తుంది.
తల్లిదండ్రులను మరపించే విధంగా తమను కంటిపాపలా లాలించి, పాలించే అత్తమ్మ కోవెలమూడి జగదీశ్వరీ దేవికి వివాహమై పాతికేళ్లు నిండిన సందర్భంగా కోడళ్లు లేఖ, అక్షర కలిసి తమ అత్తామామలకు సిల్వర్ జూబ్లీ వేడుకల్ని కర్నూలులో గత ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా తమ ఆనందాన్ని జీ తెలుగు ప్రేక్షకులతో పంచుకోవాలని కర్నూలు పట్టణానికి బంధుమిత్ర సపరివారంగా తరలి వెళ్లారు.
కొడుకును వంచించి పెళ్లి చేసుకుని ఇంట్లో ప్రవేశించి ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తోన్న రేఖని బయటకు పంపేందుకు కోడళ్లతో కలిసి ఎత్తుకు పైఎత్తులు వేస్తూ చివరకు ఆస్తిని కూడా పూర్తిగా ధారాదత్తం చేసేందుకు సిద్ధపడ్డ జగదీశ్వరీదేవికి కోడళ్లు ఎంత చేసినా తక్కువే! అయినా చంద్రునికో నూలుపోగులా అత్తామామలకు అక్షర, లేఖ చేసిన వేడుకను తిలకించి పులకించి ఉంటారు. జీ తెలుగులో ‘కలవారి కోడళ్లు’ సీరియల్ ద్వారా వీరు చిరపరిచితులే.
ధారణంగా అత్తాకోడళ్లు అనగానే వారి మధ్య అపోహలు, అపార్థాలు, పొరపొచ్చాలు వంటివి రావడం సహజమని అందరూ భావిస్తారు.
english title:
kalavariattaku
Date:
Tuesday, November 6, 2012