జీ తెలుగులో ప్రతి బుధవారం రాత్రి 9.30లకు ‘తెలుగమ్మాయి’ రియాల్టీ షో ప్రసారవౌతుంది. గతంలో ఇదే ఛానల్‌లో ప్రభాకర్ యాంకర్‌గా ‘థ్రిల్’ షో ప్రసారమైంది. యిప్పుడు ఆ షోకి ఈ షో జిరాక్స్ కాపీలా వుంది. అయితే ఏడుపులు.. పెడబొబ్బలు... గొడవలు.. వాకౌట్లతో జీ తెలుగు తారాగణం పెద్ద హడావిడే చేసింది థ్రిల్ షోలో. ప్రస్తుత షో తెలుగమ్మాయి కావడంతో మేల్ ఆర్టిస్టులకు అవకాశం లేకుండా పోయింది. ఫిమేల్ ఆర్టిస్టులు మాత్రం ఇరగదీస్తున్నారనే చెప్పాలి.
తెలుగమ్మాయి పేరుకే టైటిల్‌లా కనిపిస్తుంది. లుక్ మాత్రం మోడ్రన్ అమ్మాయిలా షో బిగెన్ అవుతుంది. యాంకర్‌గా కౌశిక్ హండ్రెడ్ పర్సెంట్ తెలుగబ్బాయిలా హడావిడి చేసేస్తున్నాడు. ఎపిసోడ్‌కి ముగ్గురమ్మాయిలు మూడు రౌండ్లలో పార్టిసిపేట్ చేసి చివరకు ప్రేక్షకుల చేతుల్లో చిక్కుకుంటారు. ఉదయం నుండి షూటింగ్ వెంటబడి మూడు రౌండ్లు తిలకించే ఓ ఊరి జనం (వచ్చినవారు) ఫైనల్‌గా బ్యాలెట్ పత్రంలో వున్న ముగ్గురమ్మాయిలలో ఒకరికి ఓటేసి బ్యాలెట్ బాక్స్‌లో వేస్తారు. అలా వచ్చిన ఓట్లను లెక్కించి ఆ ఎపిసోడ్ తెలుగమ్మాయి ఎవరో తేల్చేస్తారు. అంతటితో వదిలేయలేదు- టీవీలో షో వీక్షిస్తున్న వీక్షకులకు సైతం ఎస్‌ఎంఎస్ ఛాన్స్ ఫ్రీగా యిచ్చేసారు (షరా మామూలే)
షో ఫార్మేట్‌లో ప్రతి ఎపిసోడ్‌కి ఓ ఊరు (గ్రామం) ఎంచుకోవడంతో పాటు అక్కడ సంస్కృతిని పెంపొందించే నృత్యాలను చూపడం బావుంది. యిక పల్లె జీవనంలో వుండే కష్టాలను పార్టిసిపెంట్స్ పడడం చూపరులకు నవ్వు తెప్పిస్తుంది. మధ్యమధ్యలో ఎడిటింగ్ కామెంట్స్ కూడా అలరిస్తున్నాయి. మొత్తానికి మోడ్రన్ అమ్మాయి కాస్తా ఆఖరి రౌండ్ వచ్చేసరికి తెలుగమ్మాయి కావడం విశేషం!
థ్రిల్ షోలో యాంకరిచ్చే స్కోరుతోపాటు తోటి పార్టిసిపెంట్స్ యిచ్చే స్కోరులు, ప్రేక్షకుల ఎస్‌ఎమ్‌ఎస్‌లు పెద్ద గందరగోళంగా వుండి పార్టిసిపెంట్స్ మధ్య గొడవలు రేపేవి. యిక్కడ ఆ ఛాన్స్ లేదు. పైగా కష్టమైన టాస్క్‌లు కూడా కాదు. అందుకే సరదాగా లాగించేస్తున్నారు. అంతరించిపోతున్న గ్రామీణ సంస్కృతిని గుర్తుచేయడంతోపాటు పార్టిసిపెంట్స్ ఆటలు, పాటలు, డాన్సులు, ఊరి జనాలకు కొత్త అనుభూతినిస్తుంది. తెలుగుగమ్మాయి పార్టిసిపెంట్స్‌కే కాదు ప్రత్యక్ష వీక్షకులకు, పరోక్ష ప్రేక్షకులకు మాంచి రిలీఫ్.
జీ తెలుగులో ప్రతి బుధవారం రాత్రి 9.30లకు ‘తెలుగమ్మాయి’ రియాల్టీ షో ప్రసారవౌతుంది.
english title:
thrill zerox
Date:
Tuesday, November 6, 2012